Monday 15 July 2019

రాష్ట్రీయ స్వయం సేవక్ సంస్థ బీజేపీకి తోకలా మారి త్వరలోనే తన ప్రాభవాన్ని కోల్పోయి అంతరించి పోనున్నదా?

మొదట నా చరిత్ర చెప్తాను.నేను యవ్వన కాలంలో నాస్తికుణ్ణి, కమ్యూనిష్టు భావజాలం వైపుకి కూడా మొగ్గు చూపాను.అయితే, కొన్ని చిత్రమైన వ్యక్తిగతమైన కారణాలతో ఆస్తికుణ్ణి అయ్యాక కూడా చాలా కాలం పాటు కమ్యూనిష్టు భావజాలం యొక్క ప్రభావంలోనే ఉన్నాను.చిన్నప్పటి నుంచీ ప్రతి రోజూ న్యూస్ పేపరు చదివే అలవాటు ఉండటం వల్ల సంచలనం సృష్టించిన అయోధ్య రామాలయం కేంద్రంగా మొదలైన ఉద్యమాన్ని తొలినాళ్ళ నుంచీ గమనించాను.అప్పుడు ఆ ఉద్యమానికి అనుకూలుడైన మా మామయ్యని "ధర్మ స్వరూపుడైన రాముడు తనకి ఆలయం నిర్మించటానికి హింసని రెచ్చగొట్టమని చెప్పాడా?" అని అడిగి ఆయన తత్తరపడేటట్టు చేశాను.అయితే, మసీదును కూలగొట్టటానికి తొలినాళ్ళలో వ్యతిరేకించిన నేను రూటు మార్చుకుని భాజపా అభిమానిని కావడానికి అప్పుడు కళ్ళముందు కనబడుతున్న అద్వానీ, వాజపేయి లాంటి వారి వ్యక్తిత్వమే ప్రముఖమైన కారణం!నా మెయిల్ ఐడిలో ఉన్న లెనిన్ ఫొటోని గురించి కొందరు వెక్కిరిస్తున్నారు.అతన్ని కూడా అతని వ్యక్తిత్వం వలనే అభిమానించాను తప్పితే కమ్యూనిష్టు సిద్ధాంతం మీద ఉన్న అభిమానం కాదు.ఇంతకీ భారతదేశపు వీరకిశోరం భగత్సింగును ఇదే భాజపా వారూ రాష్ట్రీయ స్వయం సేవక్ కూడా పొగుడుతున్నారు కదా!అతనేమైనా హిందూత్వవాదియా?పక్కా కమ్యూనిష్టు అయిన భగత్సింగ్ ఏనాడూ హిందూమతాన్ని ప్రశంసించలేదు, అయినా భాజపా వారికీ రాష్ట్రీయ స్వయం సేవక్ సభ్యులకూ ఉత్తేజాన్ని కలిగిస్తున్నాడు కదా, మరి నేను అదే లెక్కన లెనిన్ అనే మరో కమ్యూనిష్టుని అభిమానిస్తే తప్పేమిటో!

ఏ పార్టీ అయినా ఏ సిద్ధాంతం అయినా అంకితభావంతో ప్రజలకి మేలు చేసే ఆదర్శవంతమైన అనుచరుల వల్లనూ కార్యకర్తల వల్లనూ మాత్రమే తన విశ్వసనీయతను ప్రదర్శించి ప్రాభవాన్ని సాధించుకోగలుగుతుంది, అవునా?ఒకనాడు ఇందిరాగాంధీ చేతిలో దుర్మార్గమైన అణిచివేతకి గురై కూడా ఎన్నో కేసుల్ని తాన మీద వేసి అరాచక శక్తిగా నిరూపించాలని చూసినా కోర్టుల నుంచి ప్రశంసల్ని అందుకుని నిషేధాన్ని ఎత్తి వేయిచుకుని నిలబడిన ధృఢత్వం రాష్ట్రీయ స్వయం సేవక్ సంస్థది.కేవలం 2 సీట్లతో అపహాస్యానికి గురయిన భాజపా వాజపేయి మహాశయుడు ప్రకటించినట్టు ఇంత గొప్ప స్థితికి చేరుకోవడానికి భాజపా అనే రాజకీయ పార్టీలో ఆనాడు ఉన్నవారి మూలాలు రాష్ట్రీయ స్వయం సేవక్ అనే పవిత్రమైన సంస్థలో ఉండటమే కారణం అనేది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి.మొదటిసారి భాజపా అధికారంలోకి రావడానికి తొలినాళ్ళలో ద్వేషించి మలినాళ్ళలో అభిమానించిన నాలాంటి అనేకానేక సహస్రాధిక అనామక వ్యక్తులే కారణం అనేది కూడా యదార్ధమే, అవునా?

మరి వ్యతిరేకులను కూడా మెప్పించి తనవైపుకు తిప్పుకోగలిగిన సచ్చీలత బదులు ఇవ్వాళ వ్యతిరేకత నుంచి సానుకూలత వైపుకి వచ్చిన నాలాంటి అనేకానేక సహస్రాధిక అనామక వ్యక్తుల నుంచి ఎదురౌతున్న ఛీత్కారాలను కూడా లక్ష్యపెట్టని నీచత్వానికి కారణం ఏమిటి?ఈ ప్రశ్నకి సరైన జవాబు తెలియాలంటే వాజపేయి ప్రభుత్వం కూలిపోయిన నాటికీ మోదీ తొలిసారి అధికారంలోకి రావడానికీ మధ్యన అటువైపు భాజపా మరియు రాస్వసే అనే జమిలి సంస్థల సంస్కృతిలోనూ ఇటువైపు హిందూ సమాజంలోనూ అంతకుముందు ఎవరూ వూహించని కొన్ని భీబత్సమైన మార్పులని పసికట్టాలి.

హైందవేతర సమూహాలు అంటే, కమ్యూనిష్టులూ వారిని వెనకేసుకొచ్చిన కాంగ్రెసు పార్టీ హిందూమతం మీద తమ దాడిని పెంచాయి. వారు దీనికి చెప్పుకున్న సమర్ధన భాజపా అయోధ్య ఉద్యమాన్ని రాజకీయ ప్రయోజనాల కోసమే చేపట్టినదనేది సమర్ధించదగిన కారణమే గానీ ఆ పేరున వారు చేసిన చేష్టలు మాత్రం చాలా నీచ స్థాయిలో ఉండి అప్పటి వరకు తటస్థులుగా ఉన్న సహనశీలురైన హిందువుల్ని కూడా రెచ్చగొట్టి విధి లేక తమ రక్షణ కోసం భాజపాను తమ ప్రతినిధిగా ఎన్నుకోవలసి వచ్చింది. అయితే, ఈ వూపును భాజపా మరియు రాస్వసే నిర్మాణాత్మకమైన దృక్పధంతో ఉపయోగించుకుని ఉంటే ఆ రెండు సంస్థలకీ ఇవ్వాళ్టి దుస్థితి ప్రాప్తించి ఉండేది కాదు.కానీ భాజపా నాయకులు అప్పటివరకు తమకి కీర్తి ప్రతిష్టల్ని తెచ్చిపెట్టిన నైతిక విలువల్ని గాలికి వదిలేసి అధికారంలో ఉంటే చాలును అనే ధోరణిలో పడిపోయి కాంగ్రెసును అనుకరించటం మొదలుపెట్టారు.భాజపా ఒక రాజకీయ పార్టీ కాబట్టి ఈ నైతిక పతనానికి సిగ్గుపడే ధోరణిలో లేదు.దానికి తార్కాణమే నేడు రామ్మాధవ్ లాంటివాళ్ళ సిగ్గులేని ప్రకటనలు!వాజపేయి లాంటివాళ్ళ సచ్చీలతకి తోడు ఆనాడు చంద్రబాబు సెక్యులర్ స్టాండు నుంచి యూ-టర్న్ తీసుకుని ప్రోత్సహించడం వల్లనే మతతత్వ పార్టీ ముద్ర నుండి బయటపడగలిగిందనేది నాలాగే ప్రతి రోజూ దినపత్రికలు చదువుతూ జరుగుతున్న రాజకీయ పరిణామాలను గమనించిన సహస్రాధికమైన అనామక వ్యక్తులకు తెలుసు.

రాష్ట్రీయ స్వయం సేవక్ సంస్థకు అసలైన హాని భాజపాకు తోకలా మారడం వల్ల జరిగింది.భాజపాకి తొలినాళ్ళలో ప్రాభవం తెచ్చిపెట్టిన ప్రముఖుల మూలాలు తమ సంస్థలో ఉండటం వల్ల మోహానికి గురయిన రాస్వసే పెద్దలు సామాజిక సేవా కార్యక్రమాలనూ క్షెత్ర స్థాయి ధర్మ ప్రచారాన్నీ పక్కన పెట్టి భాజపా రాజకీయ నిర్ణయాలను శాసించడం ప్రధాన కార్యక్రమం కింద పెట్టుకున్నారు.ఏ రాష్ట్రంలో రాస్వసె బలంగా ఉంటే ఆ రాష్ట్ర భాజపా శాఖకి ఎవరు నేత కావాలో కూడా ఆ రాష్టపు రాస్వసే అధ్యక్షుడే నిర్ణయించటం లాంటి తమాషాలు మొదలయ్యాయి.ఇప్పటికీ అవి కొనసాగుతూనే ఉన్నాయి కానీ భాజపా యొక్క రాజకీయపరమైన నైతిక భ్రష్టత్వాన్ని మాత్రం నిట్టూర్పులు విడవటం అసంతృప్తిని వ్యక్తం చెయ్యడం తప్ప అది తప్పని చెప్పి నియంత్రించలేకపోతున్నది.దీనికి బదులు బీజేపీ సంస్థాగత నిర్ణయాల్లో కల్పించుకోకుండా ఇదివరకు చేస్తున్న సేవ అకార్యక్రమాలను మరింత ముమ్మరం చేసి ఉంటే భాజపాకు బలమైన వోటుబ్యాంకు స్థిరపడి ఉండేది.ఇప్పటికీ కాంగ్రెసు, తెలుగుదేశం వంటి పార్టీలకి ఉన్న వోటుబ్యాంకును బద్దలు కొట్టలేకనే పార్టీల మార్పిడిని ప్రోత్సహించే దిక్కుమాలిన పద్ధతిలో అధికారంలోకి రావాల్సిన దుస్థితిలో భాజపా ఉన్నదనేది వాస్తవం!

ఒకనాడు ఏ చంద్రబాబు సహాయం వల్ల మతతత్వ పార్టీముద్రని వదిలించుకుని ప్రజల ఆమోదం పొందిందో ఆ చంద్రబాబుని అంతం చెయ్య్యాలని నిస్సిగ్గుగా ప్రయత్నించడం మానవ సహజమైన సంస్కారం ఉన్నవాడెవ్వడూ చెయ్యగూడని పని - కృతజ్ఞతను మించిన పుణ్యం కృతఘ్నతను మించిన పాపం మరొకటి లేదు!ఎన్నికలు నిన్ననే అయిపోయి ఆంధ్రలో తమ నిజమైన బలం తేటతెల్లమయ్యాక, ఇప్పుడప్పుడే ఎన్నికలు రావని తెలిసి కూడా ఆంధ్రలో ప్రధాన ప్రతిపక్షం మేమే అని ప్రకటించడంలోని నైతికత ఏమిటి?వేరే పార్టీ కార్యకర్తల ప్రచారంతో వోటర్లు తమకి చచ్చినా వెయ్యకూడదని తీర్మానించుకుని ఇతర్లకి వేస్తే గెలిచినవాళ్ళని లాక్కుని సభలో సంఖ్యని పెంచుకోవడం అంటే తమ పార్టీలో తమ పార్టీకి వోట్లు వేయించుకోగలిగి సభలోకి రాగలిగిన సమర్ధులైన నాయకులు లేరని ఒప్పుకోవడమే కదా!ఈ వాస్తవం అధికార మదంతో కళ్ళు పొరలు గమ్మిన భాజపా నాయకులకి ఎప్పటికీ అర్ధం కాదు, కానీ ఆ పార్టీని భుజాల మీద మోస్తున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సభ్యులూ నాయకులూ ఎంతవరకు అర్ధం చేసుకున్నారు?

రాష్ట్రీయ స్వయం సేవక్ సభ్యులూ కార్యకర్తలూ క్షేత్ర స్థాయిలో ఇప్పటికీ సేవా తత్పరతనీ నైతిక ధృఢత్వాన్నీ కలిగి ఉన్నారా లేక వారు కూడా బద్ధకస్తులైపోయి భాజపా ద్వారా లాభపడాలని సర్దుకుపోతున్నారా?వృద్ధాప్యంలో శక్తులు ఉడిగిపోయినప్పుడు రాజీ పడటం సహజమే - కానీ రాస్వసేలో కుర్రవాళ్ళు ఎవరూ లేరా?అందరూ ముసలివాళ్ళైపోయారా?రాష్ట్రీయ స్వయం సేవక్ సంస్థలో నిర్ణయాత్మక స్థానంలో ఉన్నవారికి ఇప్పుడు రెండే రెండు దారులు ఉన్నాయి.హిందూమతానికి మూలమైనది సత్యము, నైతికత కాబట్టి ఆ విలువల కోసం పట్టుబట్టి భాజపాని మంచి దారికి తీసుకు రావటం ఒక దారి.కొంచెం విచక్షణతో ఆలోచిస్తే భాజపా ఇప్పుడు చేస్తున్న లత్తుకోరు పనులు చెయ్యడం వలనే కాంగ్రెసు ఇవ్వాళ ఉన్న స్థితిని అనుభవిస్తున్నదనేది తెలుస్తుంది.ఇవ్వాళ చీప్ ట్రిక్కులు ప్లే చేసి ఒకటి రెండు ఎన్నికల్లో గెల్చినా నిరంతరం గెలవాలంటే తమ కార్యకర్తల ప్రచారంతో ప్రజలు తమను మెచ్చి వేసిన వోట్లతో అధికారంలోకి రావడమే గౌరవప్రదమయినదనేదీ అదే సుదీర్ఘ కాలం పాటు తమని నిలబెడుతుందనేదీ రాస్వసే నాయకులు భాజపా నాయకులకి తెలియజెప్తేనే ఈ రెండు సంస్థలూ చిరకాలం మన్నుతాయి.

భాజపాతో సంబంధం తెంచుకుని ఇప్పటివరకు తమకు హిందూ సమాజంలో గౌరవాన్ని తెచ్చిపెట్టిన సేవా కార్యక్రమాలకీ ధర్మ ప్రచారానికీ పూర్తి సమయం కేటాయించటం రెండవ దారి.ఇందులో అలసత్వం చూపిస్తే నేను చెప్పినట్టు త్వరలోనే కనుమరుగు అయిపోవడం ఖాయం!హిందూ సమాజం రాస్వసే భాజపాతో తెగదెంపులు చేసుకోగానే మళ్ళీ నెత్తిన పెట్టుకుంటుందన్న గ్యారెంటీ కూడా లేదు.రాస్వసే భాజపా మీద పెత్తనం చెయ్యడంలో మునిగిపోయిన కాలంలో కొత్త సంస్థలు కొన్ని ఆవిర్భవించాయి.తెలుగు రాష్ట్రాల్లో శివశక్తి సంస్థ చాలా ప్రముఖమైనది.రాస్వసే కేవలం ధర్మ ప్రచారానికి మాత్రమే పరిమితం కావడం వల్ల రాజకీయ రంగంలో భాజపాను తనకు మారుగా ఉపయోగించుకుంటున్నది. ఈ బలహీనత శివశక్తికి లేదు.కరుణాకర్ సుగ్గున ఈ మధ్యనే ఉత్తరాదికి కూడా విస్తరించాలని ప్రయత్నాలు చేస్తున్నాడు.భవిష్యత్తులో రాజకీయ పార్టీని కూడా స్థాపించే ఉద్దేశం ఉన్నట్టు అతని మాటల వల్ల తెలుస్తున్నది.అదే గనక కార్యరూపం దాలిస్తే తెలివి తక్కువా ఆకలి యెక్కువా అన్నట్టు సుస్థిరమైన వోటుబ్యాంకును ఏర్పాటు చేసుకోలేని భాజపాకు తప్పనిసరిగా నష్టం జరుగుతుంది.ఇప్పటివలెనే భాజపా మీద అధారపడి విస్తరించే బద్ధకపు ధోరణిలో ఉంటే రాష్ట్రీయ స్వయం సేవక్ కూడా నష్టపోతుంది.అయ్యవారు వచ్చేదాక అమావాస్య ఆగుతుందా?హిందువులు అనంతకాలం వరకు మిమ్మల్నే నమ్ముకుని కూర్చుంటారా? 

ఈ జమిలి సంస్థలలోని వారు గానీ మిగిలిన హిందువులు గానీ గమనించని కొన్ని ప్రమాదాలను మీకు తెలియజెప్పాలి.ఇల్యూమినాటి, ఫ్రీమాసన్రీ లాంటి రహస్య సంస్థలు ఇప్పటికే ప్రపంచాన్ని బ్యాంకింగ్ సిస్టం ద్వార తమ గుప్పిట్లో పెట్టుకుని న్యూ వరల్డ్ ఆర్డర్ అనే ప్రణాళికలో మొదటి దశని విజయవంతంగా ముగించాయి.1947 ఆగస్టు 15 నుంచి మన దేశం సర్వ సత్తాక సార్వభౌమాధికారం గలిగిన స్వతంత్రమైన గణతంత్ర దేశంగా ఆవిర్భవించిందనేది కేవలం భ్రమ!ఇంగ్లీషువాళ్ళు వాళ్ళ జల్సాల కోసం యుద్ధాల కోసం చేసిన అప్పుని కూడా మనమే చేసినంత నిజాయితీగా స్వీకరించి దాన్ని అణాపైసలతో సహా తీర్చడానికి ఎప్పుడు ఒప్పుకున్నామో అప్పుడే అదివరకటికన్న భయంకరమైన దాస్యంలోకి వెళ్ళిపోయాము - ఆ ప్రణాళిక మొత్తం ఆ రహస్య సంస్థల రచనయే!నాకొక అనుమానం ఏమిటంటే భాజపా నాయకులు ఇవ్వాళ చేస్తున్న ఈ వికృతమైన రాజకీయ క్రీడ కూడా లండను నుంచి చక్రం తిప్పుతున్న వాళ్ళ పనియే అని!మన దేశానికి స్వతంత్రం ఇవ్వడంలో వాళ్ళ ఉద్దేశం కూడా దేశంలో ఎక్కడా సుస్థిరమైన ప్రభుత్వం ఉండనివ్వకపోవటమే - సుస్థిరమైన ప్రభుత్వం ఉండి అభివృద్ధిని సాధిస్తే వాళ్ళ అప్పుని తీర్చేసి స్వతంత్రం అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఇక్కడే కాదు, ప్రపంచంలోని అని దేశాల్లోనూ ఏ ఒక్క ప్రాంత ప్రజలు గానీ సుస్థిరమైన ప్రభుత్వాన్ని నెలకొల్పుకుంటే సహించలేరు వాళ్ళు!వాళ్ళ మొదటి దెబ్బగా రాజకీయ నాయకుల్ని నయాన కానీ భయాన కానీ లోబరుచుకుని వాళ్ళను నైతికంగా దిగజార్చి ఆ తర్వాత క్షేత్ర స్థాయిలో ప్రజల్ని నైతికంగా భ్రష్టు పట్టిస్తారు.

ఆంధ్రప్రదేశ్ విషయంలో భాజపా నాయకుల వ్యూహాన్ని గమనించండి - ఇక్కడ నువ్వా నేనా అన్నట్టు ప్రజల్లో పలుకుబడి ఉన్న చంద్రబాబు జగన్ అనే ఇద్దర్నీ ఒకడి తర్వాత ఒకణ్ణి అసమర్ధుల కింద చూపించి ప్రజలకి ఇక భాజపా తప్ప దిక్కు లేదని నిరూపించాక సుజనా లాంటి గజ్జికుక్కని తమ పార్టీ తరపున గద్దె ఎక్క్కించడం అనేది ఆది నుంచీ భాజపా నాయకుల ప్రకటనల వల్ల తెలుస్తూనే ఉన్నది గదా - అస్థిరత్వం, అస్థిరత్వం, సదా అస్థిరత్వమే వాళ్ళ లక్ష్యం!భాజపా యొక్క స్వఛ్చత మీద భ్రమలు ఉన్నవాళ్ళు మరొక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి - తన పేరుని చంద్రబాబు మంత్రిమండలికి పంపించినప్పుడు అసహ్యించుకున్న పార్టీ తనమీద అవినీతి కేసుల్ని ఎర చూపించి భయపెట్టి ఐటీ దాడులతో హింసించి తన పక్కలోకి లాక్కుందని మనం భ్రమపడుతున్న ఇన్నాళ్ళ తర్వాత సుజనా చౌదరి చిద్విలాసంగా అసలు నామీద కేసులే లేవంటున్నాడు - అంటే, భాజపా వాళ్ళూ సుజనా ముందే కూడబలుక్కుని ఈ భూప్రపంచం మీద ఉన్న ఏ కోర్టులోనూ అతని మీద కేసు లేకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుని కేవలం "అయ్యో పాపం!భాజపా అంత భయంకరమైన దాడి చేస్తే తప్పనిసరై వెళ్ళాడు పాపం!" అని కండువా మార్పిడికి కరతాళధ్వనులతో ప్రోత్సహించే అస్మదీయ చీర్ లీడర్ల ఆమోదం కోసం మ్మీడియాకి రోజుకోసారి వార్తలు వదిలి హైప్ క్రియేట్ చేసిన ఉత్తుత్తి యవ్వారం అన్నమాట - మరీ ఇంత నీచత్వమా!అసలు నేను పదే పదే నొక్కి చెప్తున్నట్టు తమకు ప్రజల్లో మంచిపేరును తెచ్చుకుని తమ పార్టీ కార్యకర్తల ప్రచారం ద్వారా బలం పెంచుకుని తమ పార్టీలోనే సమర్ధుడైన ఒక ముఖ్యమంత్రిని ప్రోత్సహించుకోవడం అనే చక్కని రాజమర్గం వదిలి ఈ సందుగొందుల తుఛ్చమైన దొడ్డిదారినే ఎందుకు నడుస్తున్నారు?వాళ్ళ వయస్సూ వివేకమూ అనుభవమూ అంతేనా, నిజంగా వాళ్ళు తాము కేతిగాళ్ళలా ప్రవర్తిస్తున్నామని తెలుసుకోలేనంత అమాయకులా - ఆలోచించండి!ఇవ్వాళ హిందూత్వం పేరుతో జరుగుతున్నది గాబట్టి వాళ్ళు అస్మదీయులైపోయారు, కానీ ఇదే వ్యూహాన్ని క్రైస్తవ అనుకూల వర్గం వాళ్ళు పన్నితే సుజనా చౌదరి వాళ్ళ వైపుకి వెళ్ళడని గ్యారెంటీ ఉందా?సుజనాయే కాదు అమిత్ షా కూడా వ్యాపారియే కదా - ఇదే ఎత్తుగడ లండన్ బ్యాంకర్లు అమిత్ షా మీద ఇప్పటికే ప్రయోగించారని నా అనుమానం, ప్రయోగించలేదని గ్యారంటీ ఇవ్వగలరా?

ఈ జమిలి సంస్థల నాయకులూ కార్యకర్తలూ మిగిలిన హిందువులూ తేల్చుకోవలసిన విషయం ఒకటే - భాజపా ఇస్తుందో లేదో తెలియని రక్షణ కోసం భాజపా ఎంత నీచానికి ఒడిగట్టినా సహించటమా లేక సనాతన ధర్మం ఏ పునాదుల మీద నిలబడిందో ఆ సత్యం పునాదుల మీద నిలబడి భాజపాని ఒళ్ళు దగ్గిర పెట్టుకుని నడుచుకునేలా నిగ్రహించటమా?

అసతో మా సద్గమయ!
తమసో మా జ్యోతిర్గమయ!
మృత్యోర్మా అమృతం గమయ!!
ఓం శాంతి శాంతి శాంతి!!!

27 comments:

  1. మీలో కమ్మీ స్లీపిం సెల్ గా వున్నాడు. రా.స్వ.సం పట్ల మీది అకారణ ద్వేషమే!
    వ్యక్తి నీతికి రాజనీతికి తేడా వుంది.
    రాజకీయాల్లో పెర్మనెన్ట్ మిత్రులు శత్రువులు ఉండరు. ఆరోజు అవసరాన్ని బట్టి చంనాయుడు భాజపాతో అలైన్ అయ్యాడు, పవర్లోకొచ్చాడు.మొన్న తప్పు ఎస్టిమేట్ చేశాడు అనుభవించాడు. రా.స్వ.సం ఎప్పుఇడూ ఒకలాగానే వుంది,వుంటుంది. దేశీయ భావం కలవారెవరూ దానికి శత్రువులు కారు. కనపడని శత్రువుతో పోరాడుతున్నారు.

    ReplyDelete
    Replies
    1. 1815: అయిదుగురు Rothschild అన్నదమ్ములూ ఒక్కొక్కరు ఒక్కొక్క మహానగరంలో పాతుకుపోయి చాలా కాలం అయ్యాక Englandలో ఉన్న Nathan అక్కడున్న Wellington కొమ్ము కాస్తూ Franceలో ఉన్న Jacob అక్కడున్న Napoleon కొమ్ము కాస్తూ ఒక యుద్ధంలో ఇరు పక్షాలకీ యుద్ధరుణాలు ఇచ్చి ప్రోత్సహించే భీబత్సమైన వ్యవహారం నడుస్తూ ఉంది. Rothschildsకి యుద్ధాలంటే లడ్డూ మిఠాయి కింద లెక్క - ఎంతిష్టమో!ఎందుకంటే ఏం చెప్పాలి?ఒకటి కాదు రెండు కాదు, అన్నీ మంచి శకునములే, వడ్డీ లాభ సూచనలే!ఎంత అప్పు ఇస్తామన్నా వద్దనరు, ఎంత వడ్డీ అయినా కిమ్మనరు, ఎగ్గొడతారన్న అనుమానమే ఉండదు, వోడిపోయిన వాడికి ఇచ్చిన అప్పుని కూడా గెల్చిన వాడి దగ్గిర నుంచి పిండుకోవచ్చు, వోడిపోయిన వాడికి మళ్ళీ యుద్ధం వచ్చే లోపు కాస్త బాగుపడటానికి కొత్త అప్పులు కూడా రుద్దొచ్చు - ఇంతెందుకండి, వెయ్యి చిన్న చిన్న వ్యాపారాలు ఒక వందేళ్ళ పాటు చెయ్యటం కన్న ఒక బుల్లి యుద్ధం పదేళ్ళ పాటూ నడిస్తే చాలు!

      అప్పటిది రాచరికం కాబట్టి రాజుని ఒక్కణ్ణీ పట్ట్టుకోవడం తేలిక గానీ ఇప్పటి ప్రభుత్వాల్ని అలా పట్టుకోవడం కష్టం అనుకుంటున్నారు కదూ!2014 తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగస్థలం పైన నడుస్తున్న నాటకాలని గమనించండి!ఎన్నికలు జరగటానికి కొద్ది రోజుల ముందు తల్లిని చంపి పిల్లని పుట్టించారని శోకాలు పెట్టిన పెద్దమనిషే ఎన్నికల ఫలితాలు వచ్చిన కొద్ది రోజులకే ఆ తల్లి గృహప్రవేశానికి పిలిస్తే కుండెడు మట్టీ చెంబుడు నీళ్ళూ ఇచ్చాడు తప్ప నికరమైన వాగ్దానం చెయ్యలేదు!ఇచ్చి తీరాల్సిన ప్రత్యేక హోదాని ఇవ్వకుండా తప్పుకోవటానికి 14వ ఆర్ధిక సంఘం ఇవ్వవద్దని చెప్పిందనే పచ్చి అబద్ధం కూడా తడుముకోకుండా చెప్పేశాడు!ఒకవైపున తన ప్రభుత్వమే ఆంధ్రప్రదేశ్ పనితీరుకు మెచ్చి 600+ అవార్దులు ఇస్తుంటే పని తీరు బాగా లేదని ఇచ్చిన నిధులు వెనక్కి తీసేసుకున్నాడు!తనకన్న వయసులో చిన్నవాడు రామ్మోహన్ నాయుడు "దేశమంటే మట్టి కాదోయ్!" అని అనువదించి చెప్పి కమ్చీదెబ్బలు కొట్టిన తర్వాత కూడా ఉలుకూ పలుకూ లేకుండా కూర్చున్నవాడు నిజమైన ప్రజాసేవకుడేనా?కానే కాదు - Rothschilds ఏజెంట్ల ప్రవర్తన అలాగే ఉంటుంది.ప్రజాస్వామ్యం ఆదర్శాల దృష్టితో చూస్తే అత్యున్నతమైనదే అయినప్పటికీ ఆచరణకు వచ్చేసరికి ప్రజలు వివేకవంతులు కానప్పుడు రాజస్వామ్యం కన్న భయానకం అవుతుంది.పై స్థాయిలో ఉన్న కీలకమైన వ్యక్తులు దురాశాపరులు అయితే చాలు Rothschilds/Illuminati తన పని తను చేసుకుపోతుంది.

      I KNOW BJP IS WORKING FOR THE DEVIL!

      Delete
    2. @Anonymous18 July 2019 at 06:03
      రాజకీయాల్లో పెర్మనెన్ట్ మిత్రులు శత్రువులు ఉండరు. ఆరోజు అవసరాన్ని బట్టి చంనాయుడు భాజపాతో అలైన్ అయ్యాడు, పవర్లోకొచ్చాడు.మొన్న తప్పు ఎస్టిమేట్ చేశాడు అనుభవించాడు..
      hari.S.babu
      పరమనెంట్ మిత్రులూ శత్రువులూ ఉండని రాజకీయమూ మానవ అషజమైన ధర్మం, అధర్మం, కృతజ్ఞత, కృఅత్జత వంటివాటితో నడిచేది రాజనీతీ వేరు వేరు - అది నాకూ తెలుసు!అంటే, మేము రెండు సీట్ల నుంచి 200 సీట్లకు ఎదిగినప్పటి ఔన్నత్యాన్ని ఆనాడే వదిలిపారేశాం, మళ్ళీ దాన్ని నెత్తికెత్తుకోవటం కుదరదు, ఇవ్వాళ్టి నీచత్వం అనాలోచితంగా ప్రదర్శిస్తున్నది కాదు, అది మా భవిష్యత్ కార్యాచరణ విధానం అని చెప్తున్నారని అర్ధం అవుతున్నది.ఇలా ముసుగులు విప్పేస్తే మీ గురించి మాకు గందరగోళం ఉండదు.

      నేను మీరనుకుంటూన్నట్టు రాస్వసే పట్ల ద్వేషంతో లేను - అది నా పోష్టు మరోసారి ఓపిగ్గా చదివితే తెలుస్తుంది.మిమ్మల్ని ఏ ఒక్క పాయింటు మీద వ్యతిరేకించినా అది మిమ్మల్ని మొత్తంగా ద్వేషించటం వల్ల చేస్తున్నట్టు భావించే ధోరణిలో మీరు ఉండటం వల్ల మీకలా అనిపిస్తున్నది.

      విలువలు కానీ వలువలు కానీ వాటంతతవి వూడిపోవు - మనం అక్కర్లేదనుకుని వొదిలేస్తే తప్ప!మీరు అక్కర్లేదనుకుని పర్మనెంటు మిత్రులూ శత్రువులూ ఉండని రాజకీయం నడుపుతున్నారు, కానీ మాలాంటివాళ్ళకి విలువలతో కూడిన రాజనీతియే కావాలి."మొన్న తప్పు ఎస్టిమేట్ చేశాడు అనుభవించాడు." అని అంటున్నది దేని గురించో వివరిస్తారా?అసలు విభజన అనతరం జరిగిన మొదటి ఎన్నికల్లోనే అంతే మోదీ అత్ల్లిని చంపి పిల్;లని పుట్టించారు అని ఆక్రోశిస్తున్నప్పుడే ఆంధ్రాలో తనకి ఇచ్చిన సీట్లలో భాజపా కావాలని వోడిపోయే క్యాండిడేట్లని నిలబెట్టడం అనే ముచ్చట జరిగింది, మీకు తెలుసా!అప్పట్లో దాన్ని ప్రత్యేకించి ఎత్తి చూపిస్తూ ఒక పోష్టు వెయ్యడం వల్ల నాకు గుర్తుంది.అది తెలివి తక్కువ ఎత్తుగడ ఆదు.అప్పటికీ ఒక మోస్తరు మెజారిటీ వస్తుందని తెలిసి చంద్రబాబుకి సంఖ్యని తగ్గించడానికే ఆ పని చేశారు - అంత ముందు చూపుతో ఉన్నవాళ్ళు కాబట్టే అన్ని సిగ్గు లేని పనులు చెయ్యగలిగారు!విచిత్రం ఏమిటంటే, మన రాష్ట్రానికి హక్కుగా రావలసినవి అడుగుతుంటే "అడగమంటే, సైన్యం నిధుల్లో వాటా కూడా అడిగేటట్టు ఉన్నారు!" అని అన్నారు. ఎవరు?గల్లీ స్థాయి నాయ్కుడు కాదు, కేంద్ర మంత్రి - పైన తెదెపా అప్పటికి మిత్రపక్షమే!

      ఇనతటి నీచమైన రాజకీయం "రాజకీయాల్లో పెర్మనెన్ట్ మిత్రులు శత్రువులు ఉండరు" క్యాటగిరీలోకి రాదండీ!

      Delete
  2. sir you are true cbn fan

    ReplyDelete
  3. There is no argument in your answer supporting your post. How RSS is responsible for any thing that it was told by you?
    TDP failed sell the same which was told in the post. Why TDP continued to support the BJP for four and a half years.
    You are fighting with invisible.

    ReplyDelete
    Replies
    1. Hello Mr.Anonymous24 July 2019 at 05:56,
      your text is not clear and full of ambiguous statements.
      can you eloberate these points:
      1).There is no argument in your answer supporting your post.
      2).TDP failed sell the same which was told in the post.
      I have explained so many times BJP forced TDP to come out with it's irresponsible and imbecile behavior and still you are asking "Why TDP continued to support the BJP for four and a half years." - how anybody could make you to accept the fact that babu tried his best to stick to BJP.

      If BJP give minimam support to andhra state/chandra babu, Do you think he is an idiot to come out, after having so long a career which had not a single wrong decision!

      People like me crying here why BJP behaved like a moron towards AP and you are not even considering it as a fact,I am helpless to continue on this point until then you accept BJP willfully butchered the state with only one condition - "We won't help AP until they give mandate to us!"

      P.S: can you give your answer in telugu?

      Delete
    2. ప్రపంచంలో ఎక్కడ నికరమైన అభివృద్ధి జరిగి ఒక ప్రజా సమూహం తన దగ్గిర తీసుకున్న అప్పుని తీర్చివేసి పూర్తి స్వతంత్రతను సాధిస్తుందని అనుమానం వస్తుందో అక్కడ అస్థిరతని సృష్టిస్తుంది - అదే ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబుమి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగనివ్వకుండా మోదీ, కేసీయార్, జగన్ ముప్పేట దాడిని అంత తీవ్ర స్థాయిలో ప్రజాల్ నుంచి వస్తున్న వ్యతిరేకతని కూడా పట్టించుకోకుండా కొనసాగించడానికి ముఖ్యమైన కారణం!కేసీయార్ గానీ మోదీ గానీ చంద్రబాబుతో పోటీపడి అభివృద్ధిని సాధించలేని అసమర్ధులు కారు - అది వాళ్ళ లక్ష్యం కాదు, అంతే!

      కంద్రంలోని ప్రభుత్వాధికారులే ఎన్నోసార్లు చంద్రబాబు పరిపాలన మీద ప్రశంసలు కురిపించడం రహద్యమేమీ కాదు కదా!మీకెందుకు అది మాత్రం కనబడటం లేదు?

      Delete
    3. చాలామంది భాజపా సమర్ధకులు మోదీ అధికారంలోకి రావటం వల్లనే హైందవేతరులు వెనక్కి తగ్గారు అనే అపోహలో ఉన్నారు - అసలు జరిగినది హిందువులు రాజకీయ చైతన్యాన్ని పెంచుకోవటం వల్లనే మోదీ అధికారంలోకి వచ్చాడు.మొదట జరిగినదాన్ని మర్చిపోయి వెనకదాన్ని ముందుకు తీసుకురావటం వల్ల ఏమాత్రం ప్రయోజనం ఉండదు.మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం రాకుండా దీన్ని బాగా గుర్తు పెట్టుకోండి!

      అసలు భాజపా రాష్ట్ర శాఖ అద్యక్షుడుగా ఎవరుండాలో ఎవరుండకూడదో రాస్వసేకి దేనికి?ఒకవేళ రాజకీయాల్ని ప్రభావితం చెయ్యడం అవసరం అనుకుంటే తనే రాజకీయ పార్టీ అయ్యి ఉద్ధరించవచ్చును కదా!రాస్వసే తనకి తను నిర్ణయించుకున్న కార్యక్రమం ఏమిటి?రాస్వసే ఒక సేవాసంస్థ లేదా సామాజిక సంస్థ అదీ కాకపోతే హిందూమత ప్రచార సంస్థ - అవునా?ఇవ్వాళ భాజపా అధికారంలోకి రాగలగడానికి ఆ సంస్థ నిరపేక్షమైన కార్యక్రమాలే కదా మూల కారణం - అంటే, భాజపా రాస్వసే మీద ఆధారపడటంలో అర్ధం ఉంది గానీ రాస్వసే భాజపా మీద ఆధారపడాల్సిన అవసరం లేదు - అవునా?

      ఇంతకీ రాస్వసే కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ప్రజల మధ్యన తిరిగేటప్పుడు గతంలో ఏమి చెప్పారు?ఇప్పుడు ఏమి చెప్తున్నారు?ఇకముందు ఏమి చెప్తారు?అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ చెప్పాల్సిన మొదటి మాట హిందూమతం ప్రమాదంలో పడింది, హిందువులు ఐక్యం కావాలి, లేఅదంటే హిందూమతం అంతరించి పోతుంది అనే కదా!అయితే రెండో మాటగా ఐక్యం కావడానికి వారు గతంలో చెప్పిన పునాది ఏమిటి?ఇప్పుడు చెప్తున్న పునాది ఏమిటి?ఇకముందు చెప్పబోయే పునాది ఏమిటి?

      నాకు తెలిసినది హిందూమతం వేదం పునాదుల మీద నిలబడాలి, వేదం ప్రతి మనిషినీ తను మాట్లాడే ప్రతి మాటనీ సత్యం పునాదుల మీద నిలబడి మాట్లాడమని చెప్తుంది.గతంలో హైందవేతరులు హిందూమతగ్రంధాలను వక్రీకరించి చెప్తున్న అబద్ధాలను తిప్పికొడుతూ నిజాలు తెలియజెప్పబట్టే హిందువులలో చైతన్యం పెరిగి అది ఒక స్పష్టమైన రూపం తీసుకుని భాజపాను అధికారంలోకి తీసుకొచ్చారు - అక్కడ మోదీ ఉండటం యాదృచ్చికం అయితే అందరూ మోదీ ఒక్కడికే ఆ గొప్పదనాన్ని ఆపాదిస్తున్నారు!హైందవేతరులు బయటివాళ్ళు కాబట్టి హిందూ సమూహం లోపల జరిగినది దగ్గరినుంచి చూడలేదంటే అర్ధం ఉంది, కానీ మనలో జరుగుతున్నది మనకే అర్ధం కాకపోతే ఎట్లా?

      ఈ గందరగోళం వల్లనే అందరితో పాటు రాస్వసే నాయకులు కూడా భాజపాని అధికారంలో ఉంచడమే హిందువులకి భద్రత ఇస్తుందని నమ్ముతున్నారు, లేని పక్షంలో భాజపా సంస్థాగత రాజకీయాల్లో కల్పించుకోవటం అనేది జరగటానికి ఆస్కారమే లేదు.ఒకవేళ భాజపా తను హిందూత్వానికి అనుకూలం అని చెప్పిందే అనుకుందాం, అంత మాత్రాన ఇంత అధికార దాహం ప్రదర్శిస్తూ ఇన్ని అబద్ధాలు చెప్తున్న ఆ ఒక్క పార్టీకే హిందూత్వాన్ని రక్షించే బాధ్యతని అప్పజెప్పటం ఎంతవరకు సమంజసం?

      మీరు ఒకటి గమనించండి, గుత్తాధిపత్యం అనేది ఇల్యూమినాటీల క్యాచ్ వర్డ్, దానికోసమే ఇన్ని యుద్ధాల్నీ ఇన్ని భీబత్సాల్నీ సృష్టిస్తున్నది.మీరు నన్ను కనపడని శత్రువుతో పోరాడే అమాయకుణ్ణని అన్నారు.నేను భాజపా "కమలమే సకలం కావాలి!" అని తన ప్రణాళికను ప్రకటించినప్పటినుంచే ఇది ఇల్యూమినాటీల దారి అని గుర్తిపట్టి వ్యతిరేకించడం మొదలుపెట్టాను.ఒకసారి నా పోష్టులలో ఆ అంశాన్ని తరచిన పోష్టుకి ముందు నేనూ భాజపా అధికారంలో ఉండటం అవసరమే అని చెప్పాననేది తెలుస్తుంది.

      ఆంధ్రాలోనూ ఇతర చోట్లా వేరే పార్టీలని కూలగొట్టే విధానం మనం సమర్ధించకూడనిది - ఎక్కడ ఎవరు ఈ తరహా పనులు చేసినా అది Rothschilds/Illuminati ప్రణాళికయే అయి ఉండాలి లేదా Rothschilds/Illuminatiకి లాభం తెచ్చి పెడతాయి అని నా నమ్మ్మకం.Rothschilds/Illuminati గురించి నేను చదివినంత ఎక్కువ మీరు చదవలేదు కాబ్ట్టే మీరు కాబట్టే భాజపా Illuminati ఏజెంటులా పనిచేస్తున్నదనే నా వాదనని ఒప్పుకోలేకపోతున్నారు. కానీ నేను అయోమయంలోనో గందరగోళంలోనో లేను - నాకు Rothschilds/Illuminati గురించి చాలా తెలుసు.అందుకే, ఇప్పుడు భాజపాయే మన దేశంలోని Rothschilds/Illuminati ఏజెంటు అని ఇంత ధాటిగా చెప్పగలుగుతున్నాను.


      చంద్రబాబు కూడా ఒక రాజకీయ నాయకుడే - నేనెక్కడా ఒళ్ళు మరిచిపోయి అతన్ని పొగిడిన దాఖలాలు లేవు.కానీ అతని ఎకనమిక్ ఎడ్మినిస్ట్రేషను ప్రజల్ని ఇప్పుడు Rothschilds/Illuminatiనిలబెట్టిన debt based economy నుంచి బయటికి తీసుకొచ్చేలా ఉంటుంది.గుడ్డి కన్న మెల్ల నయం అని సమర్ధించటం తప్ప నేను అతని అభిమానినీ కాదు, అతను అంతమైపోతే జాలి పదటం మినహా భోరున ఏడ్చెయ్యటం లాంటి పిచ్చిపనులు చెయ్యను!

      ఇప్పుడు మీకు అర్దమై ఉండాలి రాస్వాసే నాయ్కులకూ నిజమైన హిందూత్వ పరిరక్షకులకూ నేను చెప్తున్నది "హిందువులకి ఇంత సుదీర్ఘ కాలపు మనుగడని ఇచ్చిందీ అబ్రహామిక్ మతాలకు భిన్నమైన నడవడిని ఇచ్చిందీ వారు సత్యం పునాదుల మీద నిలబడి బహుళత్వాన్ని పాటించడమే కాబట్టి ఒక్క భాజపాకే అతుక్కుపోయి ఆ పార్టీని Rothschilds/Illuminati భావజాలాన్ని అనుకరిస్తూ వాళ్ళ టెక్నిక్కుల్ని ఫాలో అవుతూ మనల్ని మోసగించడం అనే డొంకదారి నుంచి 2 నుంచి 200 సీట్లకి ఎదిగినప్పటి రహదారికి మళ్ళేటట్టు నిగ్రహించాలి" అని.

      Delete
    4. చంద్రబాబు నాయుడే అసలు సిసలు ప్రపంచ బాంకు తొత్తు. పొద్దున్న లేస్తే దావోస్ సింగపూర్ అమెరికా అంటూ పరుగు తీస్తాడు.

      Delete
    5. Mr. Anonymous24 July 2019 at 23:35,
      మళ్ళీ మొదటి కొచ్చావు - చిన్నపిల్లాడికి చాక్లెట్టిచ్చి వెనక్కి తీసుకున్నవాణ్ణి కూడా హత్య చేసినవాడి కన్న హీనంగా చూస్తారే!అలాంటిది ఇచ్చిన నిధుల్ని వెనక్కి తీసుకున్నవాడి కన్న మొత్తం ప్రపంచంలోని 150+ దేశాల్లో నాలుగైదు మినహాయించి దేశాలకి దేశాలు వరల్డ్ బ్యాంకు దగ్గిర అప్పు తీసుకుంటుంటే తనూ తీసుకున్న చంద్రబాబు దుర్మార్గుడా?

      You are hating chandrababu and you never accept the reality!So, what we can conclude?Let the psycho rule this bloody Andhra, which is filled with educated fools - Is it OK for you?

      We lost Chennai - no regrets!We lost Hyderabad - no regrets!We lost Amaravathi - no regrets!Because, we had our own paradise somewhere else - We will get it anyway after another KCR kicked us from here also, we are great.

      Delete
    6. Modi also taken world bank loan when he is gujarath CM but never fell at their feet why bcos he is true desh bhakt. CBN sold AP to USA, Dubai and Singapur

      Delete
    7. Mr.Anonymous25 July 2019 at 04:30,

      How ridiculous your argument is!

      Modi taken loan from world bank. CBN taken loan from world bank.why both of them took loan?Because taking loan is neccessory!But You are branding modi as desh bhakt and CBN as desh drohi for doing the same thing - think yourself how biased your mind is!

      The center itself recently accepted All the accounts submitted by CBN regarding polavaram, amaravati and electricity PPAs are correct and no scrupulous things were happened in CBN's term, then why modi did that shameless thing of taking back the funds?It was the most heinous part for a human being to do against AP!Still you are calling modi desh bhakt, that means you are suggesting that AP is not a part of INDIA - am I right?

      Delete
    8. Why Modi not gotten US visa when he is CM? It is bcos he is not dancing to world bank tune like your friend cbn.

      Modi taking back the funds bcos cbn not giving uc. Why CBN not gives uc is bcos he is daiverts money for his self dabba things. Yellow media supporting cbn only bcos of kula gajji.

      What cbn did 4 d Hindus? Nothing. He only insulted Ramana Deekshitulu garu

      Delete
    9. Mr. Anonymous25 July 2019 at 23:26,
      shame on your part to reason that passport was rejected for that reason!Do you want say he developed Guajrat without taking loans from WB?How silly arguments you are getting for support a rouge PM?

      what uc CBN need to give to MD?DiD that MD gave as gujarat CM?
      Goverments are not personal Dabbawala shops to ask ucs!From where that money which given by modi is coming from - Modi's personal earnings?

      You are that much rotten in modi dabba!You tell me what modi did for hindus Except enjoying the power and giving fake securitt that there was a pro-hindu govt?

      The first promise which catapulted then is ram temole construction - what happened to that?While churches and masjids are free from Govt pressure hindu temples are running by christinas who were appointed by govt and hindus are fighting from long - Could you ask modi and get it done?

      Check yourself, Except a show of pro hindu dialogs nothing was done by modi to hindus!

      I do not concern any other thing but answer me why he told all those lies deliberately about special status to andhra?

      He told 14th planning commission told not to give but the text of 14th planning commission shows that it is suggesting to give - how could you support a man who deliberately debunked a respectable PM position and a responsible constitutional body as desgbhakt?

      Delete
    10. Ramana dikshitulu garu insult for no fault is only one example. Hundreds of cases are there.

      Babu broken many temples in vja also did midnight kshudrapuja in ammavaru temple. Foregt minister post sngle Brahmin not got mla ticket also.

      Delete
    11. Mr. Anonymous26 July 2019 at 04:42,
      Ramana dikshitulu garu insult for no fault is only one example. Hundreds of cases are there.

      hari.S.babu
      I have alraedy responded about ramana deekshitulu affair immediately.It is an old and forgotten issue.

      Why can't You force BJP to build Ram temple in ayodhya as you are worrying about the temples broken by CBN?

      There was money enough to install patel statue and now for huge ram statue, but they are unable to build raam temple, why?

      Do you know there was one and only solution to build raam temple.The Judgement of allahabad court which is very crucial splits the land in three pieces and on epiece is in the rightful authority of muslim vakf board.

      It is as legal as heritable land property from father to son,and if you try to use force it is an offical kabja by government!Do you support that illeal venture to build a temple for raam, who is aan embodiment of dharma?The right way is buying it from vakf board - very simple solution and most of the vakf board members also ready for negotiations.

      But those fellows who can fulfil the desire of devotees are not thinking in the right way.I think you are also not willing to buy the land - the argument goes like this, "Once upon a time it was destructed by muslims and we are just trying to make it straight." That is not an easy solution, because muslim vote bank is very strong - That's why modi was keen on triple talak bill!Please see the clear picture, hindus are not yet united.

      మీరు వ్యాసం పూర్తిగా చదివినట్టు లేదు.చదివితే నేను రాష్ట్రీయ స్వయం సేవక్ పట్ల ద్వేషంతో ఉన్నానని అనేవారు కాదు.బీజేపీ అనే పార్టీ అధికారంలో ఉండటం అవసరమే అని నేను కూడా ఒప్పుకుంటున్నాను.కానీ, ఆ పనిని ప్రజల మద్దతుతో చెయ్యమంటున్నాను.మీరేమో రాజకీయాల్లో పర్మనెంట్ మిత్రుడూ పర్మానెంట్ శత్రువూ అని ఏదేదో చెప్తున్నారు.

      మొదట మీరు ఆరోజున బాబు అవసరం కొద్దీ కలిశాడు అంటున్నప్పుడు బీజేపీ ఏ స్థితిలో ఉంది?నేనెక్కడా బాబు ముద్ర కొట్టడం వలనే బీజేపీ లాభపడిందని అనలేదే!బాబు అంతకుముందు గుజరాత్ అల్లర్ల నాడు విమర్శలు గుప్పించిన తర్వాత బీజేపీ వైపుకి ఎందుకు జరిగాడు?దానికి కారణం నా ఉదాహరణ చెప్పాను.రధయాత్ర నాడు ద్వేషించిన నేను భాజపాకి అనుకూలం అయ్యింది దేనివల్ల?అక్కడ ఉన్న నాయకుల సత్ప్రవర్తన, నిజాయితీ - అన్నింటికన్న నైతికపరమైన విశ్వసనీయత, అవునా కాదా? ప్రజలో వాళ్ళకి ఉన్న ఆ గుడ్విల్ చూసే దాన్ని క్యాష్ చేసుకోవటానికి బాబు వాళ్ళకి దగ్గిరయ్యాడు.ఆనాడు జరిగింది ఉభయతారకమైన వ్యవహారమే తప్ప బాబుకి లాభం తెచ్చిపెట్టిన ఏకపక్షపు వ్యాపారం కాదు. ఇది మీకు అర్ధం కావడం లేదు - అది నా ఖర్మ!

      Delete
    12. Mr. Anonymous26 July 2019 at 04:42,
      నేను చెప్తున్న అతి ముఖ్యమైన పాయింటు ఒకే ఒకటి - భాజపా అధికారంలో లేకపోతే కొంపలు అంటుకుంటాయన్న భయంతో భాజపా అవినీతిని సహించడం దేనికి?మనకి ఇష్టమైన పార్టీ అవినీతి చేసినా ఫర్వాలేదు అంటే, అది భాజపా ఒక్కదానికే వర్తించదు కదా, అన్ని పార్టీలకీ ఆ హక్కు ఉంటుంది. కాంగ్రెసు పార్టీ నుంచి తృణమూల్ పార్టీ వరకూ అన్ని పార్టీలూ ఈ అవినీతిలో పోటీ పడితే ఎట్లా ఇఉంటుంది మీకు?చెప్పండి!

      మీరూ ఆరెస్సెస్సూ ప్రాధమ్యాలని పునరాలోచించుకోవాలని అంటున్నాను.అధికారంలో ఉండటం కోసం అవినీతి చెయ్యడం కరెక్టని మీరంటే ఆ అప్ని భాజపా ఒక్కటే కాదు
      ఏ పార్టీ చేసినా శేభాషని ఒప్పుకోవాలి, ఒప్పుకుంటారా?

      P.S:సూటిగా ఒక విషయం చెప్తాను.మొన్నటి ఎన్నికల్లో స్వయంగా మొదీ ప్రధాని హోదాలో వచ్చి ప్రచారం చేసినా బీజేపీకి ఏమి లాభం జరిగింది?బాబు వ్యతిరేక వోట్లు జాగ్ను వైపుకీ వేరే వైపుకీ వెళ్ళాయి తప్ప బీజేపీ వైపుకి రాలేదు,ఎందుకని?మీకు నచ్చినా నచ్చకపోయినా విభజన వల్ల ఆంధ్రకి జరిగిన అన్యాయంలో సగం పాత్ర బీజేపీకి కూడా ఉన్నదని ప్రతి ఒక్కడికీ తెలుసు, అది మూసేస్తే మూసుకుపోయే విషయం కాదు.ప్రత్యేక హోదా ఇవ్వనిది బాబుని ఫెయిల్ చెయ్యటానికే అని నాకు స్పష్టంగా తెలుసు.దానికోసం వాళ్ళు చెప్పినవన్నీ అబద్ధాలు అని కూడా నాకు తెలుసు. ఆ విషయంలో మీరు ఎంత సమర్ధించాలని ప్రయత్నిస్తే అంత అభాసు పాలవటం తప్ప మీకు ఒరిగేది ఉండదు.

      నా అంచనా ప్రకారం ఆంధ్రాలో బీజేపీ సొంతంగా అధికారంలోకి రావడం అనేది జరిగే పని కాదు.బాబుని ఫెయిల్ చేసి జగన్ని తీసుకొచ్చి జగన్ని ఫెయిల్ చేసి మనం వద్దామనే డొంక తిరుగుడు ప్లాను బదులు ప్రత్యేక హోదా ఇచ్చి "మేము ప్రత్యేక హోదా ఇచ్చాము కాబట్టే బాబు సక్సెస్ అయ్యాడు!" అని చెప్పుకుని ఉంటే మొన్నటి ఎన్నికల్లోనే ఒక్కసారిగా అధికారంలోకి రాకపోయినా వూహించని స్థాయిలో బలం పెరిగి ఉండేది!కానీ అక్కడున్నది "కమలమే సకలం కావాలి!" అనుకునే దురాశాపరులు కాబట్టి నా కోడీ నా కుంపటీ ఉండతం వల్లనే పొద్దు పొడుస్తున్నదని అనుకున్న ముసలమ్మలా బాబుని బలహీనం చేసేసి మోదీని ఒక రౌండు తిప్పేస్తే చాలు పవర్లోకి వచ్చేస్తాం అనే తరహాలో ఆలోచించారు, ఇప్పటికీ "ఆషాఢం తర్వాత శ్రావణం" అనే దుర్బుద్ధి తప్ప జనంలో తిరిగి కష్టపడి మన పార్టీకి మంచిపేరు తెచ్చుకుని సొంత బలం పెంచుకుందామనే సద్బుద్ధి లేదు!

      ఇవ్వన్నీ మీకు అర్ధం కావడం లేదనుకుంటాను.అర్ధం అయినా ఒప్పుకునే స్థితిలో లేరు.మీరనుకుంటున్నట్టు నేను రాజకీయాల్ని పట్టించుకోనివాణ్ణీ కాదు, మిత్రులూ - శత్రువులూ ఈక్వేషన్ తెలియని వాణ్ణీ కాదు.

      ఇప్పటి వరకు వేసిన వ్యూహాలు అన్నీ "కోడి పోయి కత్తి వచ్చె డండండం" అన్నట్టు బాబుని దింపేసి జగన్ను ఎక్కించి సంబరపడటానికి తప్ప భాజపాకి ఎందుకూ పనికి రాలేదు - అదైనా ఒప్పుకుంటారా?మరోసారి కూడా మోదీ వచ్చి ప్రచార్మ్ చేసినా ఇదే రిజల్టు వస్తే మాత్రం నాలాంటివాళ్ళు ముఖం మీదనే "హ్హహ్హహ్హ!హ్హిహ్హిహ్హి!" అనాల్సి వస్తుంది.

      Delete
    13. Where is corruption in Modiji? Not even single case is there on him. Rafale is italiy pappu nonsense, no one believing it. Why you are telling "భాజపా అవినీతిని సహించడం" without proving?

      In Tripura also BJp not having even 1% votebank but gotten 2/3rd majority there also. Same will happen also Andhra just wait and watch ok.

      West fellow Babu is nothing in front of NaMo. Unnecessarily Modiji did alliance with yellow party in 2014 bcos of caste lobby.

      Tamilnadu mark anti-Hindu anti-brahmana politics time is over in Andhra. Even Christian like Jagan giving deputy speaker post but CBN don't give even one MLA ticket also why bcos his anti feelings.

      Delete
    14. Mr.Anonymous27 July 2019 at 02:28
      Where is corruption in Modiji? Not even single case is there on him. Rafale is italiy pappu nonsense, no one believing it. Why you are telling "భాజపా అవినీతిని సహించడం" without proving?

      hari.S.babu
      I am talking about "political" corruption, which is 99%more dangerous than economic corruption!

      If you took economics for comparing BJP is not different to Congress, irresponsible taxation, populist schemes, deficit handling,selective distribution of resources among states depending on the party - everything is carbon copy!

      Delete
    15. https://www.facebook.com/100036027712557/posts/133284791215777/

      What is so great in yaddi? You asked ME "Where is corruption in Modiji?" - do you think yaddi is pure!

      Delete
    16. yaddy 100 times better than cbn who is sold off anshra to singapur boss

      what u r saying about political corruption? even small children will tell that Modiji is beating pakis at balakot but cbn is supporting Imran khan.

      I asking u 2 times about babu not giving even 1 mla ticket to bramhin but u r not talking on this issue why?

      Delete
    17. Anonymous30 July 2019 at 04:30
      yaddy 100 times better than cbn who is sold off anshra to singapur boss

      hari.S.babu
      ఆర్ధికంగా చాలా కాలం క్రితమే కుదేలయిపోయిన పాకిస్తానుని ఏదో చేసినందుకు గర్వపడటం అంటే ఆర్నెల్లు సాము నేర్చుకుని మూలనున్న ముసలమ్మని కొట్టి మీసాలు మెలేసినట్టు ఉంటుంది!

      మళ్ళీ అదే పాట - ప్రపంచబ్యాంకు దగ్గిర బాబు అప్పు తెస్తే లొంగిపోయాడని అంటున్నారే, మరి మోదీ ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తేకుండా తన సొంత సంపాదనతో దేశాన్ని అభివృద్ధి చేస్తున్నాడా అంటే జవాబు చెప్పడం లేదు, ఎందుకని?

      ఒకే పని ఇద్దరు చేస్తే ఒకణ్ణి తప్పు పట్టి ఇంకోణ్ణి వెనకేసుకురావడం దేనికి?

      యడ్డీ బాబు కన్న ఏ విధంగా మెరుగు?బాబు ఇప్పుడు యడ్డీ చేసిన ఎదవపని చెయ్యలేదు గనకనా?ఏజి గురించి అద్వానీని గెంటెయ్యడానికి పనికొచ్చిన రూలు యడ్డీకి ఎందుకు పనికిరాలేదో చెప్పగలరా!యడ్డీ చేసిన పొలిటికల్ కరప్షన్ చూసి కూడా చూడనట్టు ఉండటం అంటే దాన్ని సమర్ధించినట్టు కాదా?"దొంగతనం నేను చెయ్యలేదు, మా తమ్ముడు చేశాదు - నేను చెయ్యమనలేదు,వాడికి ఇండివిడ్యువాలిటీ ఎక్కువ - ఆపమంటే వాడు వినడు కాబట్టి ఆగమని చెప్పలేదు!వాడికీ నాకూ మాటల్లేవు!" లాంటి సుతి కబుర్లు చెప్తే సరిపోతుందా?

      బ్రాహ్మలకి సీట్లిస్తే హిందూమతాన్ని ఉద్ధరించినట్టు అవుతుందా?ఎవరు బ్రాహ్మలు?పిలకలూ జంధ్యాలూ వేసుకుని దొమ్మరి పనులు చేసేవాళ్ళు కూడా బ్రాహ్మలేనా?హందూమతానికి పునాది వేదం!వేదం సత్యం పునాది మీద నిలబడమంటుంది - మరి 14వ ఆర్ధిక సంఘం ఆంధ్రాకి ఇవ్వమని చెప్తుంటే మీడియా ముందు నిలబడి ఏమాత్రం సిగ్గు లేకుండా ఇవ్వవద్దని చెప్తుందనే పచ్చి అబద్ధం చెప్పినవాడు అసలు హిందువువే కాదు, ఇంక హిందూత్వాన్ని ఏమి రక్షిస్తాడు?

      ముందుగానే మోదీ తప్పు చేసినా సరే నెత్తిన పెట్టుకోవాలని ఫిక్సయిపోయారని తెలుస్తూనే ఉంది గానీ ఇంక నోరు మూసుకుని కూర్చోండి!

      Delete
  4. 1.It was not established in the post that RSS is behaving like tail of BJP.
    2. Is RSS responsible for all the deeds of BJP. Had it ever declared like that?
    3.Are you responsible for the deeds of your grown up son?
    4. You say those who oppose you are psychos. You may have affinity towards congress,TDP or BJP or commie. It is your botheration.
    5.Simply to say, visiting your blog is a waste of time

    ReplyDelete
    Replies
    1. It was established that RSS is interested only in checking who is state level party chief of BJP and not considering what standards BJP is follow=wing!


      That too, I am not thinking RSS in negative way - That's why I only suggested to Both RSS and BJPO supporters alike that when you are interested in keeping BJP in power, you also have responsibility for the moral decadence of BJP!

      Delete
    2. Mr.Anonymous25 July 2019 at 09:05
      4. You say those who oppose you are psychos. You may have affinity towards congress,TDP or BJP or commie. It is your botheration.
      5.Simply to say, visiting your blog is a waste of time

      hari.S.babu
      Oh!I witnessed these openions just now, Y=Thanks for the decision. I also do not want chamchaas of BJP here!

      JUST SHUT UP!

      Delete
  5. aricle 370 surgical strike. next coming ucc and ram temple.

    all this happening only bcos of real deshabhakta modi.

    ReplyDelete
    Replies
    1. తొక్కలో దేశభక్తి!ఆర్ధికం చంకనాకిపోతుంటే ఉద్యోగకల్పన నేలచూపులు చూస్తుంటే యుద్ధాల గొప్పలు ఎవడిక్కావాలి?

      Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

శ్రమ దోపిడీ గురించి ముప్పాళ రంగనాయకమ్మ గారి లోతైన పరిశీలన బెత్తెడు లోతు కూడా లేదేంటీ!

ఎలక్టొరల్   బాండ్స్   గురించి   మార్చి  31 న  " సుప్రీం   కోర్టు   తీర్పు   సంస్కరణేనా ?" అని   లోక్   సత్తా   జయప్రకాశ్   ఒక   వ్...