Thursday 4 July 2019

అసలు కేసీయార్ మనిషా, పశువా, దెయ్యమా లేక రెండు తెలుగు రాష్ట్రాలనీ ముంచటానికి పుట్టిన బ్రహ్మరాక్షసుడా?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోని ముఖ్యమంత్రి కాక మిగిలిన 150 మంది అధికారపక్షపు శాసనసభ్యులకి కనీసపు తెలివితేటలు కూడా లేవా!నెల రోజుల్నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పాత ప్రభుత్వం కట్టిన బిల్డింగుల్ని కూల్చటం, అల్లరి చెయ్యకుండా ఉంటే చాక్లెట్టులిస్తానని చిన్నపిల్లలకి చెప్పినట్టు పాత ప్రభుత్వం మొదలుపెట్టిన పనుల్ని ఆపేసి వాటిలో బొక్కలు పడితే ప్రైజులిస్తానని అధికార్లకి లంచాలు ఎర వెయ్యటం తప్ప రాష్ట్ర ప్రజలకి మేలు జరిపించే పని ఒక్కటన్నా చేశాడా?ఇప్పటికీ పరిపాలన మొదలుపెట్టటానికే తీరిక లేదు చిన్నబాబుకి,  ఢిల్లీ వైజాగూ హైదరాబాదుల చుట్టూ తిరగడమే సరిపోతంది.

తన చేతులో ఉన్న పని గాబట్టి ఠడామనీ ప్రజావేదికని కూల్చేశాడు, మరి మొత్తం అన్నింటినీ కూల్చేస్తాను,ఏ ఒక్కదాన్నీ వదిలేది లేదని రంకెలు వేసినవాడు ఒక్క ఇంటికే నోటీసులు పంపించడం కనపడుతూనే ఇంది కదా!బుజ్జాయిగారి గర్జనని చంబానా తప్ప అందరూ మెచ్చుకున్నారని ఉర్రూతలొగుతున్న జఫాలకి మేధావుల ప్రతిస్పందనలోని ముఖ్యమైన పాయింటు అర్ధం కావడంలేదా?"అక్రమ నిర్మాణాల్ని కూల్చడం మంచిపనే, కానీ కక్ష సాధింపులా చంద్రబాబు నివాసం ఒక్కదాన్నే టార్గెట్ చెయ్యకుండా లెక్కపెట్టి 21 నిర్మాణాల్నీ కూల్చాలి!" అని పట్టుబడుతున్నాక కూడా నన్నెవరూ చూడట్లేదని అనుకుంటున్న పాలు తాగే పిల్లిలా ఆ ఒక్క ఇంటికే నోటీసు అంటించి వచ్చారేం!బీజేపీ వాళ్ళ ఇళ్ళని ముట్టుకోవడానికి ధైర్యం చాలడం లేదా?

ప్రభుత్వం నోటీసులు జారీ చేయడానికో పధ్ధతి ఉంది.మొదటగా నోటీసును అది ఎవరికైతే ఉద్దేశించ బడిందో వారికి గానీ, వారు ఆథరైజ్ చేసిన వ్యక్తులకు గానీ బై హేండ్ సర్వీస్ చేసి, అది ముట్టినట్లుగా వారి సంతకం, అది ఒక సంస్థ గనక అయినట్టైతే, సంతకం కింద తత్సంబంధిత స్టాంప్; ముట్టిన తేదీ వేయించాలి. ఇది ఫస్ట్ మోడ్ ఆఫ్ సర్వీస్. ఇది సాధ్యం కాకపోతే రెండవ మోడ్ ఆఫ్ సర్వీస్ కి వెళ్ళాలి. అది సర్వీస్ బై పోస్ట్ అండర్ అక్నాలెజ్ మెంట్ డ్యూ. అంటే సదరు వ్యక్తికి వ్యక్తిగతంగా సర్వ్ చేయలేని పక్షంలో పోస్ట్ ద్వారా పంపించాలి. దాన్లో కూడా సంతకం, స్టాంప్, ముట్టిన తేదీ తప్పని సరిగా ఉండాలి. ఇలా రిసీవ్ చేసుకోకుండా అవాయిడ్ చేస్తే (ఎందుకంటే అందులో అది ఎక్కడ నుంచి వచ్చిందో తెలుస్తుంది కాబట్టి, అది రిసీవ్ చేసుకోవడం అవాయిడ్ చేస్తారు) అది పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్లు రిటర్న్ చేస్తారు, అడ్రెసీ నాట్ ఫౌండ్ ఎట్ ద అడ్రెస్; అడ్రెసీ డినైడ్ టు రిసీవ్ ద పోస్ట్ అనే ఎండార్స్ మెంట్ ఇచ్చి. అలా మూడు నాలుగు సార్లైనా రిటర్న్ అయిన తర్వాత, అప్పుడు మూడో మోడ్ ఆఫ్ సర్వీస్ కి వెళ్ళాలి. అదేమంటే, సర్వీస్ బై అఫ్ఫిక్చర్. ఇదే లాస్ట్ మోడ్ ఆఫ్ సర్వీస్. ఇదెలా అంటే, లాస్ట్ నోన్ అడ్రెస్ యొక్క మెయిన్ డోర్/కాన్ స్పిక్యుయస్ ప్లేస్ లో సదరు వ్యక్తి/సంస్థ కి ఉద్దేశించబడిన నోటీసును, ఇద్దరు వ్యక్తుల విట్ నెస్ సంతకాలతో (ఆ నోటీసు మీద) వాళ్ల సమక్షంలో అతుక బెట్టాలి. ఇదీ ప్రభుత్వ నోటీసులు సర్వ్ చేసే విధానం. ఇది ఏ మాత్రం లోప భూయిష్టంగా ఉన్నా, కోర్ట్ లో కేవలం "ఇం ప్రోపర్ సర్వీస్" అనే గ్రౌండ్ మీద వీగిపోతుంది. మెరిట్స్ లోకి వెళ్ళరు. టీవీలల్లో విజువల్స్ చూస్తుంటే, మొదటి రెండు మోడ్స్ ఆఫ్ సర్వీస్ వదిలేసి డైరెట్టుగా మూడో సర్వీసుకి వెళ్ళినట్లుగా తోస్తోంది. పైగా విట్ నెస్ సంతకాలు కూడా తీసుకున్నట్లు అనిపించడం లేదు. చంద్రబాబుగారు తన నివాసంలోనే ఉండగా నోటీసును గోడకతికించడం అంటే దొంగతనానికి పోయినవాడు తన పని తను చూసుకోకుండా దురద కొద్దీ తేలుతో కుట్టించుకున్న దొంగ కిక్కురుమాంకుండా బాధను భరిస్తూ తప్పుకు పారిపోయేటప్పటి అవస్థలా లేదూ!చంబానాను మాత్రమే టార్గెట్ చేసి తమని వదిలేస్తాడనుకున్నప్పుడు చంకలు గుద్దుకుంటూ జగన్ని పొగిడిన భాజపా వాళ్ళకి ఇన్ని రోజుల తర్వాత జగన్ తుగ్లక్ మాదిరి కనిపిస్తున్నాడు- మరి, ఈ సామంతరాజు ఆ చక్రవర్తిని  ఢీ కొట్టగలడా?

"జగన్ బలహీనతలను అర్థం చేసుకున్న కేసీఆర్ ఏపీ భవిష్యత్తుతో ఆడుకుంటున్నాడు. వాస్తవానికి తెలంగాణలో పారే గోదావరికి మహారాష్ట్ర దయతలిస్తే తప్ప నీరు చేరదు. తెలంగాణలో గోదావరిలో కలిసే ఉపనదులు కేవలం వర్షాకాలంలో స్వల్పంగా నీటి తెస్తాయి. కాబట్టి వచ్చిన ప్రతినీటిబొట్టును దాచినా తెలంగాణ గోదావరికి చేరే నీటి వల్ల తెలంగాణలో తడిసే గొంతులు, పొలాలు తక్కువే. అయితే, ఆంధ్రాలో గోదావరి పరిస్థితి అలా లేదు. అవసరానికి మించి నీరు లభ్యం అవుతోంది. దీనికి కారణం చత్తీస్ ఘడ్, ఒడిసా అడవుల నుంచి భారీ ఎత్తున వరద నీరు అనేక చిన్న నదుల ద్వారా వచ్చి గోదావరిలో కలుస్తుంది. దీంతో భద్రాచలం తర్వాత గోదావరిలో పుష్కలంగా నీరు ఉంటుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న కేసీఆర్ పోలవరం ప్రయోజనాలు తెలంగాణకు తీసుకెళ్లాలని కుట్ర పన్నుతున్నారు. అది కూడా మన డబ్బుతో కట్టిన ప్రాజెక్టులతో. మరి జగన్ ఒప్పుకున్నా ప్రజలు ఒప్పుకోరు కదా అని మీరు ప్రశ్నించవచ్చు. ఈ విషయానికి ఒక చక్కటి సాకును కేసీఆర్ రెడీ చేశారు. అదే రాయలసీమ ప్రయోజనాలు.

రాయలసీమ సాగునీటి, తాగునీటి ప్రయోజనాలు నెరవేరాలంటే గోదావరి నుంచి నీళ్లు తెచ్చి శ్రీశైలంలో కలపాలని కేసీఆర్ చెబుతున్నారు. ఇది శుద్ధ అబద్ధం. దీనికి ఇప్పటికే గత ప్రభుత్వాలు ఏర్పాట్లు చేశాయి. పోలవరం, పట్టిసీమ కట్టింది ఇందుకోసమే. కృష్ణా నది నీటిని అత్యధికంగా వాడుకునేది ప్రకాశం బ్యారేజీ ఆయకట్టు. నాగార్జున సాగర్ మీదుగా ప్రకాశం బ్యారేజీకి వెళ్లే నీరు ఎంత ఎక్కువంటే… అది రాయలసీమ, నెల్లూరు జిల్లాల అవసరాలకు సరిపోతాయి. వాటిని శ్రీశైలంలోనే ఆపేస్తారు. ప్రకాశం బ్యారేజీకి పోలవరం నుంచి నీటిని తరలిస్తారు. ఈ నీళ్లు తూర్పుగోదావరి నుంచి ప్రకాశం జిల్లా వరకు అందుతాయి.

తన స్వార్థం తప్ప మరేదీ పట్టించుకోని కేసీఆర్ రాయలసీమ పేరు చెప్పి ఏపికి రావల్సిన నీటిని దోచుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది కేవలం నీటి దోపిడీతో ఆగిపోవడం లేదు. ఎత్తిపోతల పథకాలు అత్యంత ఖర్చుతో కూడుకున్నవి. ఎంత లేదన్నా ఎకరానికి రూ. 3 వేలు అంతకంటే ఎక్కువ విద్యుత్తుకే ఖర్చు అవుతుంది. ఇపుడు పోలవరం నుంచి శ్రీశైలానికి నీళ్లు తీసుకెళ్లాలంటే చాలా ఎత్తుకు నీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. దీనికయ్యే ఖర్చు చాలా అధికం. ఒకరకంగా కాళేశ్వరం అంత ఖర్చ అవుతుంది. అంటే తెలంగాణ ప్రయోజనాల కోసం నీటిని తీసుకెళ్లడానికి ఏపీ సగం ఖర్చు భరించాల్సి వస్తుందన్నమాట. ఇదే కేసీఆర్ కుట్ర. మన వేలుతో మనకంటినే పొడవడం. ఏపీ మీద అనవసర ఖర్చు మోపడం." - జగనన్న ఏం చెసినా "ఒహోం!ఒహోం!" అంటూ పల్లకీ మొయ్యడం తప్ప మాకేం తెల్దు అంటే మళ్ళీ ఎన్నికల్లో వోట్లు పడతాయా!కేసీయారు కంటే సొంత తెలివి ఉంది, మీ జగనన్నకేం ఉంది?హైదరాబాదులో ఆస్తులున్న తెదెపా వాళ్ళని బెదిరించి తన పార్టీలోకి తెచ్చిపెట్టిన కేసీయారు చుట్టూ తోకూపుకుంటూ తిరగటం తప్ప ఇంతవరకు సొంత తెలివిని చూపించి రాణించిన సన్నివేశం ఒక్కటి కూడా లేదు, ముందు ముందు చూస్తామని నాకు నమ్మకం లేదు!మీ సంగతి చెప్పండి, మీ నాయకుణ్ణి వాజెమ్మని చేసి కేసీయారు దోచుకుపోతున్న రాష్ట్రపు సంపదలో మీకు వాటా లేదా?

మీరు జగనుకీ జగను కేసీయారుకీ బాకాలు వూదుకుంటూ అయిదేళ్ళు గడిపేత్తే సాల్లెమ్మని అనుకుంటున్నారేమో, మోదీ ఒకే దేశం ఒకే ఎన్నిక అంటూ మూడేళ్ళకే మళ్ళీ మిమ్మల్ని జనం ముందు నిలబెట్టబోతున్నాడు, అప్పటికి కూసిన్ని కూడా మంచిపనులు చెయ్యరా?ఈ దిక్కుమాలిన ఎత్తిపోతల పథకం అవసరం లేకుండానే పోలవరం పూర్తయితే ఏపీలోని 13 జిల్లాల సాగునీటి, తాగునీటి ప్రయోజనాలు నెరవేరుతాయి. పోలవరం, శ్రీశైలం అనుసంధానం శుద్ధ తప్పుడు ప్రాజెక్టు. కేవలం తెలంగాణ కోసం ఏపీ మోయాల్సిన బర్డన్. మేలుకుని దీనిని అడ్డుకోకపోతే భవిష్యత్తు అంధకారం అవుతుంది. లేండి, మేలుకోండి!

80వేల కోట్లతో మొదలుపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు చరిత్రలోనే అతిపెద్ద ఎత్తిపోతలుగా రికార్డులకు ఎక్కింది గాని అది అస్సలు ఫలవంతమైన ప్రాజెక్టు కాదని స్పష్టంగా అర్థమవుతోంది. ఆ ప్రాజెక్టులో కేసీయారు స్వప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు లేవని పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. దాని పెట్టుబడి, నిర్వహణ ఖర్చు రాష్ట్రానికి తెల్ల ఏనుగు అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు అన్నది కేవలం ఒక‌ప్రదేశంలో ఉన్న ప్రాజెక్టు కాదు. ఇది కొన్ని బ్యారేజీలు, పంపు హౌజులు, కాలువ‌లు, సొరంగాల‌ స‌మాహారం. గోదావ‌రి నీటిని వీలైనంత ఎక్కువ‌గా వినియోగించుకోవడానికి వీలుగా ఈ ప్రాజెక్టును రూపొందించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు అసలు పేరు “డాక్టర్ బీ. ఆర్. అంబేడ్కర్ ప్రాణహిత – చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్ట్”. 2007-2009 మధ్యకాలంలో “డాక్టర్. వైఎస్ రాజశేఖరరెడ్డి” ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలోనే ఒప్పందాలు పూర్తైపోయాయి. పాత ప్రాజెక్టుపై 2008 నుంచి 2014 వ‌ర‌కు రూ.7 వేల కోట్లు ఖ‌ర్చు అయింది. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి ప్లాన్ ప్రకారం ఆదిలాబాద్ జిల్లా “తుమ్మెడిహట్టి” దగ్గర గోదావరి నది మీద బ్యారేజీ నిర్మించి 160 టీఎంసీల నీటిని తోడుకొని తెలంగాణాలోని 7 జిల్లాలు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, వరంగల్, నల్గొండ మరియు రంగారెడ్డి జిల్లాల పరిధిలోని 16 లక్షలా 40 వేలఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందిస్తూ, దారిలో ఉన్న గ్రామాలకు తాగునీటికి గాను 10 టీఎంసీలు, హైదరాబాద్-సికింద్రాబాద్ జంటనగరాలకు తాగునీటికోసం 30 టీఎంసీలు, పారిశ్రామిక అవసరాలకోసం 16 టీఎంసీల నీటిని వాడుకోవాలని నిర్ణయించారు.

అయితే 2014 లో రాష్ట్రవిభజన తరవాత తెలంగాణా ఏర్పాటయ్యాక, కొత్త ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ ను రీడిజైన్ చేసింది. దానికి వివిధ కారణాలు ఉన్నా, ప్రధానమైన కారణాలు మాత్రం, 

1. ముంపు ప్రాంతాలపై మహారాష్ట్ర లేవనెత్తిన అభ్యంతరాలు – పరిష్కారమార్గాల్లో సమస్యలు ఇతరత్రా
2. తుమ్మెడిహట్టి వద్ద నీటిలభ్యత తక్కువగా ఉండడం

ఈ మొత్తం ప‌నిని లింకులుగా, తిరిగి ఆ లింకుల‌ను ప్యాకేజీలుగా విభ‌జించారు. మొత్తం ఈ ప్రాజెక్టులో 7 లింకులు 28 ప్యాకేజీలు ఉన్నాయి. ప్రస్తుతం లింక్ 1, లింక్ 2 ప‌నులు వేగంగా పూర్తి చేయాల‌ని ప్రయత్నిస్తున్నారు. 21వ తేదీన వీటినే పాక్షికంగా ప్రారంభించే ఏర్పాట్లు చేస్తున్నారు. లింక్ 1, లింక్ 2 ల‌లో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, వాటికి అనుబంధంగా ఉండే పంపుహౌజులు ఉన్నాయి.

=> నీటి సరఫరా మొత్తం మార్గం: 1832 కి.మీ
=> మామూలు కాలువల‌ పొడవు: 1531 కి.మీ
=> సొరంగాలు (భూగ‌ర్భ కాలువ‌లు) పొడ‌వు: 203 కి.మీ
=> పైపులైన్ పొడ‌వు: 98 కి.మీ
=> మొత్తం లిఫ్టులు: 20
=> పంపు హౌజ్‌లు: 19
=> అవసరమయ్యే విద్యుత్తు: 4627.24 మెగావాట్లు
=> మొత్తం విద్యుత్ సబ్ స్టేషన్లు: 17
=> అతి పెద్ద పంపుల సామ‌ర్థ్యం: 139 మెగావాట్ల‌వి 7 పంపులు 
=> పాత జలాశయాలు: 5 
=> కొత్తగా నిర్మిస్తున్న జలాశయాలు: 20
=> మొత్తం జలాశయాల నిల్వ సామర్థ్యం: 141 టీఎంసీలు
=> 13 జిల్లాల్లో వ‌చ్చే కొత్త ఆయ‌క‌ట్టు: 18,25,700 ఎక‌రాలు
=> శ్రీరాంసాగ‌ర్, నిజాం సాగ‌ర్, సింగూరుల పాత ఆయ‌క‌ట్టు స్థిరీక‌ర‌ణ: 18,82,970
=> కొత్త ఆయకట్టుకు సాగునీరు: 134.5 టీఎంసీలు
=> హైదరాబాద్ నగరానికి నీటి సరఫరా: 30 టీఎంసీలు
=> దారిపొడవునా ఉండే గ్రామాలకు తాగునీరు: 10 టీఎంసీలు
=> పారిశ్రామిక అవసరాలకు: 16 టీఎంసీలు
=> ప్రాజెక్టుకు అవసరమయ్యే మొత్తం భూమి విస్తీర్ణం: 70,326 ఎకరాలు
=> ఇప్పటిదాకా సేకరించిన భూమి: 36,624 ఎకరాలు
=> సేకరించవలసిన భూమి: 33,702 ఎకరాలు
=> మొత్తం అంచ‌నా ఖ‌ర్చు: 80 వేల 500 కోట్లు
=> బ్యాంకులు ఇస్తోన్న లోన్లు: 18 వేల 800 కోట్లు

తెలంగాణలో గోదావ‌రి నీటిని వినియోగించుకోవాలంటే 100 మీట‌ర్ల నుంచి 623 మీట‌ర్ల వ‌ర‌కూ నీటిని ఎత్తిపోయ‌డం త‌ప్ప వేరే గత్యంత‌రం లేదు. గోదావ‌రి నీటిని కాలువల్లో త‌ర‌లించ‌డానికి ఉన్న పెద్ద ఇబ్బంది భూమి ఎత్తు. న‌ది నుంచి నీటిని కాలువ‌ల్లోకి పంపాలంటే వీటి ప్రవాహాన్ని ఆపడానికి బ్యారేజీలు కట్టి, మోటార్ల ద్వారా తోడి కాలువ‌లో పోయాలి. దీన్ని లిఫ్ట్ ఇరిగేష‌న్(ఎత్తిపోత‌లు) అంటారు. న‌ది నుంచి నీరు కాలువ‌లోకి రావ‌డం, అక్కడ నుంచి సొరంగం ద్వారా ప్రయాణించడం. అక్కడ భూమిలోప‌ల ఉన్న పంపుల‌ నుంచి తిరిగి పైకి రావడం. అక్కడి నుంచి కాలువలు, రిజర్వాయర్ల ద్వారా మళ్లీ నీటిని అందించడం. ఇదీ ఇక్కడ జ‌రిగే ప్రక్రియ.

నీటిని లిఫ్ట్ చేయడానికి వాడే అతి పెద్ద పంపుల సామ‌ర్థ్యం 139 మెగావాట్లు. ఇలాంటివి మొత్తం 7 పంపులు బిగిస్తున్నారు. ఈ పంపుల‌కు క‌రెంటు సరఫరా చేయడానికి 400/11 కేవీ స‌బ్ స్టేష‌న్ నిర్మిస్తున్నారు. రోజుకు 2 టీఎంసీల నీటిని తోడుకోవేవిధంగా ఈ ప్రాజెక్టును ప్లాన్ చేస్తున్నారు. 2 టీఎంసీల నీటిని తోడడానికి సుమారు 5 వేల మెగావాట్ల విద్యుత్ అవసరం.

కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం 7 లింకులుగా విభజించారు. ఒక్కొక్క లింకు ద్వారా ఒక్కొక్క ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి నీటిని ఆయా జలాశయాలకు(రిజర్వాయర్లు) తరలిస్తూ అక్కడినుండి కాలువల ద్వారా ఆయకట్టుకు నీటిని తరలించడం చేస్తారు. ఈ 7 లింకుల ద్వారా నీటి తరలింపు ఇలా ఉంటుంది.

[లింక్-1 : మేడిగడ్డ బ్యారేజి నుండి ఎల్లంపల్లి రిజర్వాయర్ వరకు]
లింక్-1 ద్వారా, మొత్తం మూడు బ్యారేజీలనుండి (మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల) మూడు లిఫ్టుల్లో భారీ పంపుల సహాయంతో మొత్తం 33 టీఎంసీలకు పైగా నీటిని తోడుకొని ఎల్లంపల్లి రిజర్వాయర్ కు పంపుతారు.

గోదావరి నది ప్రవాహంలో అన్నిటికంటే ముందు(ఎగువ భాగాన) ఎల్లంపల్లి రిజర్వాయర్ – తరవాత సుందిళ్ల బ్యారేజు – దాని తరవాత – అన్నారం బ్యారేజు – చివరగా మేడిగడ్డ బ్యారేజులు (అన్నిటికంటే దిగువన) ఉంటాయి. అంటే నదీప్రవాహంనుండి భారీ పంపుల ద్వారా తోడుకొన్న ఈ నీటిని గోదావరి నది ప్రవాహానికి వ్యతిరేకదిశలో దిగువభాగం నుండి ఎగువకు పంపిస్తారు.

మేడిగడ్డ బ్యారేజు నుండి పంపులద్వారా తోడిన నీరు సుమారు 15 కిలోమీటర్లు గ్రావిటీ కెనాల్ ద్వారా ప్రయాణించి ఎగువనున్న అన్నారం బ్యారేజీలోనికి చేరుతుంది. ఆ నీటిని అన్నారం నుండి పంపులతో తోడి, వాటిని మళ్ళీ ఇంకొంచెం ఎగువభాగాన ఉన్న సుందిళ్ల బ్యారేజీలోని పంపుతారు. సుందిళ్ల బ్యారేజీలో నిలువచేసిన నీటిని అక్కడి పంపులద్వారా తోడి, వాటిని చివరగా మరింత ఎగువనున్న ఎల్లంపల్లి రిజర్వాయర్ లోకి నింపుతారు.

అంటే, మేడిగడ్డ నుండి – అన్నారం – సుందిళ్ల – బ్యారేజీలద్వారా నదీప్రవాహానికి వ్యతిరేకదిశలో పంపులతో తోడుకొంటూ చివరికి ఎగువనున్న ఎల్లంపల్లి రిజర్వాయర్లోకి నీటిని నింపుతారు – ఇదీ స్థూలంగా లింక్-1 లో జరిగే పని. దీనిద్వారా సుమారు 30 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుంది.

[లింక్-2 : ఎల్లంపల్లి రిజర్వాయర్ నుండి మిడ్-మానేరు రిజర్వాయర్ వరకు]
లింక్-2 ద్వారా ఎటువంటి ఆయకట్టుకూ నీరు అందదు. అయితే ఎల్లంపల్లి రిజర్వాయర్ నుండి మిడ్-మానేరు రిజర్వాయర్ వరకూ నీటిని తరలిస్తారు. మధ్యలో మేడారం రిజర్వాయర్లో సుమారు 0.78టీఎంసీల నీటిని నింపుకొంటూ ప్రవాహం ముందుకు వెళుతుంది. ఈ లింక్-2 లో నీటిని తరలించడానికి రెండుచోట్ల భారీ నీటి పంపులను వినియోగిస్తారు.

[లింక్-3 : మిడ్-మానేరు రిజర్వాయర్ నుండి అప్పర్ మానేరు రిజర్వాయర్ వరకు]
లింక్-3 ద్వారా మిడ్-మానేరు రిజర్వాయర్ నుండి అప్పర్ మానేరు రిజర్యాయర్ వరకూ నీటిని తరలిస్తారు. మధ్యలో మలక్ పేట రిజర్వాయర్లో సుమారు 3 టీఎంసీల నీటిని నింపుకొంటూ ప్రవాహం ముందుకు వెళుతుంది. ఈ లింక్-3 లో నీటిని తరలించడానికి రెండుచోట్ల భారీ నీటి పంపులను వినియోగిస్తారు. దీనిద్వారా సుమారు 86 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుంది. 

[లింక్-4 : మిడ్-మానేరు రిజర్వాయర్ నుండి కొండపోచమ్మ రిజర్వాయర్ వరకు]
లింక్-4 ద్వారా మిడ్-మానేరు రిజర్వాయర్ నుండి కొండపోచమ్మ రిజర్వాయర్ వరకూ నీటిని తరలిస్తారు. మధ్యలో అనంతగిరి, మల్లన్నసాగర్, రంగనాయక సాగర్ రిజర్వాయర్లను నింపుకొంటూ ప్రవాహం ముందుకుపోతుంది. ఈ లింక్-4 లో నీటిని తరలించడానికి నాలుగు చోట్ల భారీ నీటి పంపులను వినియోగిస్తారు. దీనిద్వారా సుమారు 5 లక్షల 89 వేల 280 ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుంది. 

[లింక్-5 : మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుండి చిట్యాల వరకు]
లింక్-5 ద్వారా మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుండి ములకలపల్లి(చిట్యాల మండలం) వరకూ నీటిని తరలిస్తారు. మధ్యలో గంధమల్ల, బస్వాపూర్ రిజర్వాయర్లను నింపుకొంటూ ప్రవాహం ముందుకుపోతుంది. ఈ లింక్-5 లో నీటిని తరలించడానికి ఎటువంటి పంపులూ వాడరు. నీళ్లన్నీ గ్రావిటీ కెనాల్ ద్వారానే క్రిందికి ప్రవహిస్తాయి. దీనిద్వారా సుమారు 2 లక్షల 51 వేల 800 ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుంది.

[లింక్-6 : మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుండి సింగూరు వరకు]
లింక్-6 ద్వారా మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుండి సింగూరు రిజర్వాయర్ వరకూ సుమారు 625 కిలోమీటర్లమేర 3 లక్షల 30వేల ఆయకట్టుకు నీరు అందుతుంది. నీటిని తరలించడానికి ఎటువంటి పంపులూ వాడడంలేదు. పూర్తిగా గ్రావిటీ ద్వారానే నీటిని తరలిస్తారు. 

[లింక్-7 : శ్రీరామ్ సాగర్ నుండి మూడు డిస్ట్రిబ్యూషన్లు ]
లింక్-7 ద్వారా శ్రీరామ్ సాగర్ రిజర్వాయర్ నుండి మూడువైపులకు నీటిని సరఫరా చేస్తూ నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్ జిల్లాల్లోని సుమారు 5 లక్షల 39 వేల 428 ఎకరాల ఆయకట్టుకు నీరందిస్తుంది. మొత్తం 30 టీఎంసీల నీటిని 9 రిజర్వాయర్లద్వారా తరలించడానికి 7 పంపుహౌజులను ఏర్పాటుచేశారు. ఇదీ స్థూలంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని సరఫరా చేసే విధానం.

ప్రాజెక్టులోని లింక్ 1, లింక్ 2 తెలంగాణ ప్రభుత్వం బ్యాంకుల‌కు గ్యారెంటీగా ఉండి కాళేశ్వరం ప్రాజెక్టుకు లోన్లు ఇప్పించింది. లింక్ 1 పనులకు ఆంధ్రా బ్యాంక్ క‌న్సార్టియం రూ.7,400 కోట్లు ఇవ్వడానికి ఒప్పుకుంది. లింక్ 2 కోసం పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకు క‌న్సార్టియం రూ.11,400 కోట్లు ఇవ్వడానికి ఒప్పుకుంది.

ఈ వివరాలన్నీ తెలంగాణా ప్రభుత్వ నీటిపారుదలశాఖ వారివి. అయితే, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పనుల ప్రోగ్రెస్ తెలిపే వివరాలు నీటిపారుదలశాఖ వెబ్సైట్లో ఎక్కడా పొందుపరచలేదు. కేవలం ముఖ్యమంత్రో, లేక మంత్రులో చెప్పే వివరాలనుబట్టి మాత్రమే మనకు ప్రస్తుతం పనులు ఎంతవరకూ వచ్చాయి అన్నది తెలుసుకొనే అవకాశం ఉంది. లేకపోతే ఈ ప్రాజెక్టు ప్రాంతాలన్నీ వ్యక్తిగతంగా వెళ్లి చూసి తెలుసుకోవాల్సిందే. దాదాపు లక్షకోట్ల అంచనాతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు పనుల ప్రోగ్రెస్ ను ప్రజలకు తెలియజేసే ఆన్లైన్ వ్యవస్థ లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

ప్రారంభం అని పేరు పెట్టి చేస్తున్న హడావిడి చూసి కొంతమంది అమాయకులు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిందనే భ్రమల్లో వున్నారు.కానీ, పూర్తయింది 15 శాతమే. ప్రస్తుతం లింక్ 1, లింక్ 2 ప‌నులు వేగంగా పూర్తి చేయాల‌ని తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కడితే ఇలాంటి కాంట్రాక్టర్లని బాగు చేస్తూ ప్రజల నడ్డి విరగ్గొట్టే తెల్ల ఏనుగుల్ని కట్టడమూ, అమాసకీ పున్నమికీ వెర్రెక్కి నోటికొచ్చింది వాగుతూ పిచ్చిపనులు చెయ్యటమూ, తన అధ్వర్యంలో నడిచిన ఉద్యమం వల్ల గాక అసెంబ్లీ భవనపు వాస్తుదోషం వల్ల ఒకనాటి సమైక్య రాష్ట్రం విడిపోయిందనే మూఢనమ్మకంతో ప్రగతి భవన్ నుంచే పరిపాలిస్తూ శుభ్రంగా ఉన్న అసెంబ్లీ భవనాల్ని కూల్చటమూ - ఇదేనా బంగారు తెలంగాణని సాకారం చేసే అద్భుతమైన పరిపాలన?నాలుగేళ్ళ తర్వాత కూడా తన పిచ్చ పనులకి కోర్టులతో చివాట్లు తినే దుర్దశ తప్పడం లేదు.

తెలంగాణని బొందలో పెట్టింది చాలక ఆంధ్రని కూడా తుంగలో తొక్కడానికి తగులుకున్నాడు.సిగ్గెగ్గులు వదిలేసి హైదరాబాదులో ఆస్తులు ఉన్న బలమైన తెదెపా క్యాండిడేట్లని బెదిరించి వైకాపాలోకి లాగేసి జగన్ను తన పెంపుడు కుక్కని చేసుకుని ఆంధ్రా పోర్టుల్నీ నీళ్ళనీ వనరుల్నీ ఇష్టారాజ్యం వాడేసుకుందామని అనుకుంటున్నాడు. ఇప్పుడు పోలవరాన్ని పొగుడుతూ ఎత్తేస్తానంటున్న అప్పుడు పెట్టిన కేసుల్ని అసలు ఎందుకు వేశాడు - జగనుకీ వైకాపా గొర్రెలకీ బుర్రలేదని ఆంధ్రాలో ఎవడికీ తెలివి లేదా?

30 రోజుల్లో కేసీయారుకు అనుకూలమైన నిర్ణయాలు చేసి సొంత రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న జగన్:01. కేంద్రం మెడలు వంచుతా అని మోడీ కాళ్లు పట్టుకున్నాడు, 02. కాలేశ్వరం వల్ల ఆంధ్రకు నష్టం, 03. ప్రత్యేక హోదా ప్లీజ్ ప్లీజ్, 04. హైదరాబాదులో ఏపీకి చెందిన భవనాలు అప్పగింత, 05. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం నిలిపివేత, 06. నిరుద్యోగులకు యువ నేస్తం నిలిపివేత, 07. మూడు వేల రూపాయలు పింఛన్లలో కోత, 08. పెన్షన్ వయసు 45 ఏళ్లు అని చెప్పి 60 ఏళ్లు చేశాడు, 09. రాజధాని పనులన్నీ ఆపివేశాడు, 10. కాపులకు రిజర్వేషన్లు ఆపేశాడు, 11. ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతికి అమ్మ ఒడి లేదు, 12. రైతులకు విత్తనాలు లేవు, 13. ఎడాపెడా కరెంటు కోతలు, 14. పోలవరం పనులు ఆపేశాడు, 15. వంశధార నాగావళి అనుసంధానం ఆపేశాడు, 16. విజయవాడ సింగపూర్ అంతర్జాతీయ విమాన సర్వీసులు ఆపేశాడు, 17. ఇబ్రహీంపట్నం అమరావతి ఐకానిక్ బ్రిడ్జి పనులు ఆపేశాడు, 18. వైకుంఠపురం బ్యారేజ్ పనుల ఆపేశాడు, 19. అన్ని జిల్లాలలో ఇంటింటికి నీళ్లు పనులు ఆపేశాడు, 20. మచిలీపట్నం పోర్టు తెలంగాణకు ఇచ్చేశాడు, 21. పోలవరం నుంచి నీళ్లు తెలంగాణకే, 22. ఢిల్లీలో ఆంధ్ర భవన్ తెలంగాణకి ఇచ్చేశాడు, 23. తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు వదులుకున్నాడు, 24. తెలంగాణలో పనిచేసే ఉద్యోగులకు జీతాలు ఇస్తాడంట, 25. ఆంధ్రప్రదేశ్ లో ఉండే తెలంగాణ ఉద్యోగులను పంపించడంట, 26. ఉద్యోగులకు పెంచిన IR 27% జూలై నుంచి, 27. కడప ఉక్కు ఫ్యాక్టరీ ఊసేలేదు, 28. రామాయపట్నం పోర్టు లేదు, 29. హంద్రీనీవా గాలేరు-నగరి పనులు ఆపేశాడు, 30. పారదర్శకత పేరుతో ఒక నెలలో 30 రహస్య జీవోలు విడుదల చేశాడు.

Big Breaking News: తెలంగాణకి మచిలీపట్నం పోర్ట్..! రహస్య జీవో జారీ చేసిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం …??

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి శుక్రవారం హైదరాబాద్లో భేటి ఆయన విషయం తెలిసిందే, ఈ సమావేశం సుమారు అరు గంటల పాటు జరిగింది. ఇదే భేటిలో మచిలీపట్నం పోర్టు అంశం గురుంచి చర్చకు వచ్చినట్లు సమాచారం, మచిలీపట్నం పోర్ట్ తెలంగాణకి అప్పజప్పాలని సీఎం కేసీఆర్ ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రిని కోరినట్లు దానికి సీఎం జగన్మోహన్ రెడ్డి అంగీకరించినట్లు తెలుస్తోంది.

ఈ సమావేశములో మచిలీపట్నం ఎమ్మెల్యే ప్రస్తుత మంత్రి పేర్ని వెంకట్రామయ్య పాల్గొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నిన్న తెలంగాణకు మచిలీపట్నం పోర్ట్ కేటాయిస్తూ రహస్య జివో RT-62 28/06/2019 రిలీజ్ చేసినట్ల సమాచారం. ఈ రహస్య జివోలో మచిలీపట్నం పోర్ట్ పూర్తి హక్కులు, సుమారు 8000 ఎకరాల భూమి కేటాయిస్తూ తెలంగాణకి చెందేటట్లు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇంతదానికి అసలు విడిపోవటం దేనికి?నువ్వే ముఖ్యమంత్రివై తెలంగాణకి అన్యాయం జరక్కుండా పరిపాలించి చూపించమని సమైక్యవాదులు ఆఫర్ లాంటి చాలెంజి చేశారే!ఆంధ్రోళ్ళని తిట్టి తెలంగాణ సాధించుకోవాలని ప్లానేసి "అట్లెట్ల వస్తది తెలంగాణ?" అన్నవాళ్ళకి "ఇట్లనె వస్తది తెలంగాణ!" అని వూదరగొట్టి పన్నెండేళ్ళు అందరికీ పిచ్చెత్తించి ఆఖరికి కేసీయార్ ఆంధ్రా వనరులు లేంది ఆంధ్రా సాయం లేంది తెలంగాణ బతకలేదని తెలుసుకున్నాడా?ఉద్యమకాలంలో ఆనాటి ప్రభుత్వాలు తెలంగాణకి మంచి చేసే ఏ పని మొదలుపెట్టినా అది పూర్తయితే ఉద్యమం బలహీన పడుతుందని ప్రాణాచారాలు పడి ఆపాడు, ఆనాడు పొరుగు రాష్ట్రం ఆల్మటి డ్యాం ఎత్తు పెంచుతుంటే అప్పటి ఆంధ్రా దొంగోళ్ళ ప్రభుత్వం అది తెలంగాణ సమస్య కాబట్టి పట్టించుకోలేదని విమర్శించాడు, అధికారంలోకి వచ్చాక అదే పొరుగు  రాష్ట్రపు ముఖ్యమంత్రిని కలిసి ఆప్యాయంగా కావిలించుకుని "మీ ప్రాజెక్టు, మీ ఇష్టం" అని భరోసా ఇచ్చాడు, ఇదివరకు పరిపాలించినవాళ్ళు అంత మంచివాళ్ళ మీద అనవసరమైన గొడవలు చేస్తే తను వెళ్ళి ఫ్రండ్షిప్ బ్యాండ్ కట్టేసి సామరస్యంగా సమస్యని పరిష్కరించానని గొప్పలు చెప్పుకున్నాడు - ఏమిటి ఈ రాజకీయం?

ప్రాణహిత రూపంలో ఉన్నప్పుడు మంచి నీటిపారుదల ప్రాజెక్టులకు ఏ లక్షణాలు ఉండాలో తెలిసిన నిపుణుల దృష్టిలో అత్యుత్తమమైనది అయినప్పటికీ ఇదే కేసీయార్ జాతీయ హోదా కోసం ఎంత ప్రయత్నించినా అనుమతులూ ప్రోత్సాహమూ లభించలేదు, కానీ కాళేశ్వరం రూపంలోకి మారిన తర్వాత దాదాపు ప్రతి ఒక్క ప్రజాహితైషికీ తెల్ల యేనుగు లక్షణాలు స్పష్టంగా కనపడుతున్నప్పటికీ ప్రజల్నీ మేధావుల్నీ ఇది అత్యుత్తమమైనదనే భ్రమలకి గురి చేస్తున్నది - కీలకం ఏమిటి?నాకు తెలిసిన మేరకు జాతీయ స్థాయిలో గానీ ప్రాంతీయ స్థాయిలో గానీ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాన్ని ఇవ్వడం కోసం కాక ప్రజల నెత్తిన వీలైనంత ఎక్కువ అప్పుని ఉంచడానికే అహరహం శ్రమిస్తున్నారు. ప్రజలేమో గొర్రె కసాయివాణ్ణి నమ్మినంత చక్కగా వీళ్ళని నమ్ముతున్నారు. ప్రజాస్వామ్యాన్ని నిర్వచిస్తున్న మహానుభావుల ఉద్గ్రంధాలు కానీ భారతదేశపు రాజ్యాంగం కానీ సర్వోన్నతమైనవే, కానీ వాటిని ఆచరణలోకి తీసుకురావలసిన వాళ్ళు తద్భిన్నమైన సంస్కృతికి చెందినవాళ్ళు అయినప్పుడు వాటి ప్రకారం నడుచుకోవడం వాళ్ళకి సాధ్యమా!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 ఎన్నికలలొ మొత్తం 175 నియోజకవర్గాలలో 29 రిజర్వుడు నియోజకవర్గాలు పోను మిగిలిన 146 నియోజకవర్గాలలో  గెలిచిన రెడ్లు 51 మంది. అంటే, మూడోవంతు మంది ఒకే కులానికి, అనగా రెడ్డి కులానికి చెందినవాళ్ళు. 1. వైఎస్.జగన్మోహన్ రెడ్డి. 2. మేడా మల్లికార్జున రెడ్డి. 3.గడికోట శ్రీకాంత రెడ్డి. 4. పి రవీంద్రనాథ్ రెడ్డి. 5. ఎం సుధీర్ రెడ్డి. 6.రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. 7. శెట్టిపల్లి రఘురామి రెడ్డి. 8.పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి. 9. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. 10.చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. 11.చింతల రామచంద్రరెడ్డి. 12.భూమనకరుణాకర్ రెడ్డి. 13. ఆర్. కే. రోజా రెడ్డి. 14. బి. మధుసూదన రెడ్డి. 15. కాపు రామచంద్ర రెడ్డి. 16.వై.వెంకట్రామిరెడ్డి. 17.కె.పెద్దారెడ్డి. 18.అనంత వెంకట్రామిరెడ్డి. 19.టి.ప్రకాశ్ రెడ్డి. 20. డి.శ్రీధర్ రెడ్డి. 21.కే.వెంకట్రామిరెడ్డి. 22.పివి. సిద్ధా రెడ్డి. 23. జి బిజేంద్రనాధ్ రెడ్డి. 24. శిల్పా మోహన్ రెడ్డి. 25. శిల్పా రవి చంద్ర రెడ్డి. 26.కాటసాని రాం భూపాల్ రెడ్డి. 27.కాటసాని రామి రెడ్డి. 28. బుగ్గన రాజేంద్రనాధ రెడ్డి. 29. కె.శ్రీదేవీ రెడ్డి. 30. కె. చెన్నకేశవ రెడ్డి. 31. వై. బాలనాగి రెడ్డి. 32 వై.సాయి ప్రసాద్ రెడ్డి. 33. ఆర్.ప్రతాప్ కుమార్ రెడ్డి. 34. మేకపా గౌతం రెడ్డి. 35.మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. 36. ఎన్.ప్రసన్న కుమార్ రెడ్డి. 37.కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. 38. కాకాని గోవర్ధన రెడ్డి. 39. ఆనం రామనారాయణరెడ్డి. 40. బాలినేని శ్రీనివాసులు రెడ్డి. 41. మాగుంట మహిధర్ రెడ్డి. 42. కేపి నాగార్జున రెడ్డి. 43. ఆళ్ళ రామకృష్ణ రెడ్డి. 44. జీ.శ్రీనివాస రెడ్డి. 45. కాసు మహేష్ రెడ్డి. 46. పి.రామకృష్ణా రెడ్డి. 47. తిప్పల నాగిరెడ్డి. 48.  అదీప్ రాజ్ అన్నం రెడ్డి. 49. సత్తి సూర్యనారాయణ రెడ్డి. 50. ద్వారాంపూడి చంద్రశేఖర్ రెడ్డి. 51.  చిర్ల జగ్గి రెడ్డి.

వీళ్ళల్లో దరిదాపు  90 శాతం మంది మీద తీవ్ర అభియోగాలు, క్రిమినల్ కేసులు, క్రిమినల్ చరిత్ర ఉన్నవాళ్లే ! వీళ్ళే కాకుండా పాలకపక్షం నుండీ ఇతర సామాజిక వర్గాల నుండీ ఎన్నికైనవారిలో కూడా అత్యధిక శాతం మంది బలమైన క్రిమినల్ చరిత్రలు ఉన్నవాళ్లే. వీళ్ళ అనుచరవర్గాలు పూర్తిగా రౌడీలు గూండాలు ఆరాచకవర్గాలు  లంపెన్ శక్తులు.వీళ్ళూ వీళ్ళ పత్రికా నిన్నటి రోజున మొత్తం 30+ పోలీసు నియామకాల్లో ఉన్న 2 కమ్మ పేర్లనీ 40 కింద మార్చేసి తెదెపాకి కులపిచ్చి పార్టీ ం ఉద్ర వేసి ఎంత హడావిడి చేశారు?వీళ్ళూ వీళ్ళ పత్రికా నిన్నటి రోజున మొత్తం 30+ పోలీసు నియామకాల్లో ఉన్న 2 కమ్మ పేర్లనీ 40 కింద మార్చేసి తెదెపాకి కులపిచ్చి పార్టీ ముద్ర వేసి ఎంత హడావిడి చేశారు?అధికారం చేతికి రాగానే ఒక సీనియర్ జర్నలిష్టుని "నడిరోడ్డు మీద నరికేస్తా!" అని బెదిరించిన abc రెడ్డికీ తమని చిన్న మాట అన్నాడని ఒక అసహాయుడైన ఒంటరి మనిషిని బూటుకాళ్ళతో తంతూ అదేదో ఘనకార్యం అయినట్టు వీడియో తీసి ప్రచారం చేసుకున్న xyz రెడ్డికీ ఉన్నది ఏమిటి?

ఇప్పటి ముఖ్యమంత్రి నిన్నటి రోజున అప్పటి ముఖ్యమంత్రిని నడిరోడ్డు మీద కాల్చి చంపమని ప్రజలకి పిలుపు ఇచ్చాడు, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రికి సెక్యూరిటీని ఎత్తేశాడు - అంటే, అప్పటి తన మాటల్ని నిజం చేసే అవకాశాన్ని తన అభిమానులకి ఇస్తున్నాడు.ఇది చంద్రబాబు స్వయంకృతం అనే చెప్పాలి."లంకలో పుట్టినోళ్ళంతా రాక్షసులే!ఆంధర్లో పుట్టినోళ్ళంతా దుర్మార్గులే!" అని ప్రగల్భించి ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి కారుకూతలు కుయ్యటమే కాకుండా తన మీద కేసు పెట్టి బహిరంగ ఏదిక మీద "దొంగ బాబు!" అని అవమానించి హైదరాబాదు నుంచి తరిమికొట్టినవాణ్ణి స్వర్ణాంధ్రప్రదేశ్ అవతరణకి ఆహ్వానించి శిలాఫలం మీద పేరు కూడా చెక్కించిన క్షాత్రలేమి అతనిలో ఉన్నంతకాలం అతను శత్రువులకి లోకువ కాక తప్పదు!

కాళేశ్వరం ప్రాజెక్టును సమర్ధిస్తున్నవాళ్ళు అందరూ భావోద్వేగాలతో మాట్లాడటం తప్ప నికరమైన లెక్కలని చెప్పటం లేదు, దాని ప్రతిపాదిస్తున్నవాళ్ళే కాదు, సమర్ధిస్తున్నవాళ్ళు కూడా ప్రపంచంలోనే అతి పేద్ద ప్రాజెక్టూ, నీళ్ళు కావాలంటే ఖర్చు పెట్టకుండా ఉంటామా, అవసరమై ఖర్చు చేసినా తప్పులు పడతారా అని దీర్ఘాలు తియ్యడమే తప్ప వాస్తవాలని చెప్పటం లేదు.ఇప్పుడు వేసిన అంచనా 80 వేల కోట్లూ ఒక్కసారే ఖర్చు చెయ్యటం లేదు,సంవత్సరాల తరబడి జరిగే పనులకి కొన్నేళ్ళ తర్వాత అప్పటి రూపాయి విలువని బట్టీ ధరలు పెరగడం లాంటి వాటివల్లనూ వ్యయం పెరిగి పెరిగి మొత్తం పూర్తయ్యేసరికి లక్ష కోట్లు దాటినా ఆశ్చర్యం లేదు!దశల వారీగా పూర్తయిన వాటిని వాడుతున్నప్పుడు మెయింటెనెన్స్ కూడా లెక్కెయ్యాలి. అదీగాక, అసలైనదీ అత్యంత ముఖ్యమైనదీ ఋణభారం - పెడుతున్న ఖర్చులో తీసుకున్న అప్పుకి వడ్డీని ఎలా మర్చిపోవాలి!అసలుని మాత్రం ఎట్లా తీర్చాలి?మిగులులో వచ్చిన తెలంగాణని అప్పులోకి నెట్టిన ఘనుడు రుద్దుతున్న ఇన్నేసి కొత్త అప్పుల్ని తీర్చాల్సింది ఎవరు?తెలంగాణని ఇంత దరిద్రంగా పరిపాలిస్తున్న ఇతని దర్శకత్వంలో నడుచుకుంటున్న జగన్ అన్ని అభివృద్ధి పనుల్నీ ఆపేసి వ్యక్తిగత కక్షల్ని తీర్చుకుంటూ ఆంధ్రని కూడా తెలంగాణ దారిలోనే నడిపిస్తున్నాడు.

ఇన్నేళ్ళుగా తెలుగుజాతి నిర్మించుకున్న పరువుప్రతిష్ఠలు ఇవ్వాళ అక్కడా ఇక్కడా కొలువుదీరీన సుందోపసుందుల వల్ల అవహేళనకు గురవుతున్నాయి.ఇకమీదట సంస్కారమూ ఆత్మగౌరవమూ కలిగిన తెలుగువాళ్లు బయట రాష్ట్రాలకు దేశాలకు వెళ్ళినప్పుడు ఎవరైనా మీరు ఎక్కడ నుండి వచ్చారు అని అడిగితే మేము ఆంధ్రప్రదేశ్ నుండీ, మేము తెలంగాణా నుండీ వచ్చాము అని చెప్పుకోవటానికి సిగ్గుపడే రోజులు సమీపంలోనే ఉన్నాయి!

తెలుగువాళ్ళు మొదట గర్వపడాల్సింది భాష గురించి!అగస్త్యుడు తమిళ వ్యాకరణం రాశాడని చెప్పుకుంటూనే మా నాన్నకి కూడా నేనే నాన్నని అన్నట్టు సంస్కృతం కూడా తమిళం నుంచే పుట్టిందని చెప్పుకునే మూర్ఖత్వం మనకి అక్కరలేదు.జనని సంస్కృతమ్ము సకల భాషలకు అన్న మాట ప్రకారం తెలుగు కూడా సంస్కృతం నుంచే పుట్టిందని ఒప్పుకోవచ్చు.కానీ, కొన్ని విషయాల్లో తెలుగు సంస్కృతాన్ని మించిపోయింది - సంస్కృత వర్ణమాలలో "ఎద్దు"లో ఉన్న పొట్టి ఏత్వం లేదు. అయితే, "ఎ" ఉండటం అనేది తెలుగుభాష యొక్క ప్రత్యేకతయే గానీ అది లేకపోవటం వల్ల సంస్కృతభాషకి వచ్చిన లోపం ఏదీ లేదు కాబట్టి ఇలాంటి ప్రత్యేకతలను గురించి అతి చెయ్యనక్కరలేదు గానీ కొత్త పదాల్ని పుట్టించడంలో సంస్కృతంతో సరితూగగలిగిన భాష తెలుగు తప్ప మరొకటి లేదు - పింగళి నాగేంద్ర రావు గారు మనకి అన్ని కొత్త పదాల్ని పరిచయం చెయ్యగలగటానికి తెలుగుభాష యొక్క నిర్మితి సంస్కృతభాష యొక్క నిర్మితికి చాలా దగ్గిరగా ఉండటమే కారణం!ఇంకొకటి, ప్రపంచంలో మానవుడు ఉచ్చరించగలిగిన ప్రతి ధ్వనికీ సంజ్ఞను ఏర్పరచుకున్న ఒకే ఒక భాష తెలుగు భాష - దానికి "ఌ, ౡ, ౘ , ౙ, ఱ"లే సాక్ష్యం!మూలాల్ని మర్చిపోయిన ఈరోజున మనం వాడకపోవచ్చు గానీ వాటిని వాడిన వెనకటివాళ్ళు లెక్క ప్రకారమే అవసరమై సృష్టించుకుని వాడారు. అలాంటిది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమిస్తున్న కాలంలో ఉద్యమనాయకుడి స్థానంలో ఉన్న కేసీయారు "ఎవడికి తల్లి?" అని రెచ్చిపోతే అతని వాలగాత్రులు తెలుగుభాషకి ఇన్ని అక్షరాలెందుకు అనేవరకు వెళ్ళారు, అన్యాయం చేసింది మనుషులైతే భాషని తిట్టడం దేనికో నాకిప్పటికీ అర్ధం కావడం లేదు!

ఈరోజున తన బానిసను ఆంధ్రలో సామంతరాజును చేసుకుని తెలంగాణని నాకేసినట్టు ఆంధ్రని కూడా నాకటానికి తయారై సుద్దపూసలా సామరస్యం గురించి సుభాషితాలు చెప్తున్న కేసీయారు నిన్నటి రోజున ఈ ప్రాంతం గురించి కక్కిన విషాన్ని ఎట్లా మర్చిపోవాలి?ఇప్పుడు మాత్రం ఇక్కడ 150+ సీట్లతో నెగ్గి కూడా బహుశా తన గెలుపు ఆంధ్రప్రజల వల్ల కాక కేసీయారు దయ వల్ల వచ్చిందని తన అంతరాత్మకు తెలియడం వల్లనో యేమో జగన్ తను గీసిన గీతని దాటడనే ధైర్యంతో తనకి రావలసిన హైదరాబాదులోని భవనాల్ని తీసుకుని ఆంధ్రకి ఇవ్వాల్సిన కరెంటు బకాయిల్ని చెల్లించకపోవడం ఎంత నీచత్వం?

ప్రజాస్వామ్యం అనేది పుట్టిన తర్వాత ఈ ప్రక్రియ ద్వారా ప్రభుత్వాధినేతలైన వాళ్ళ మధ్యన ప్రపంచ స్థాయిలో ఇంతకన్న అధముడు ఎవడూ లేడు!ఎంత అధమాధముడు కాకపోతే పోడు వ్యవసాయం కోసం తను పట్టాలు ఇచ్చి ప్రోత్సహించాల్సిన అమాయక ప్రజలని అకణ్ణుంచి వెళ్ళగొట్టి హరితహారం పేరుతో కబ్జా నాటకం నడిపించటానికి ప్రభుత్వాధికారులని పంపిస్తాడు - అమాయక ప్రజలకి ప్రభుత్వం అన్యాయం చేస్తున్నదని ఆవెశపడిన కోనేరు సోదరుల్ని విలన్లని చేసి పెంపుడు మీడియాని ఉసిగొల్పి చోద్యం చూస్తున్న ముక్కుమంత్రికి తను ప్రభుత్వాధికారుల్ని పంపించినది ఎక్కడికో అక్కడ జరిగిన నాటకీయమైన సంఘటనలో అసలు దోషి యెవరో తెలియకుండా ఉంటుందా?బలహీనులైన ప్రజలని బలవంతుల దోపిడీ నుంచి రక్షించాల్సిన ప్రభుత్వం తనే అత్యంత క్రూరమైన దోపిడీకి అభివృద్ధి పేరున అధికార ముద్ర వేసి భక్షించడం తెలంగాణలో తప్ప ఈ సమస్త భూమండలం మీద ఇంకెక్కడైనా గతంలో జరిగిందా,  వర్తమానంలో జరుగుతున్నదా,  భవిష్యత్తులో జరుగుతుందా!

మొదటి నాలుగున్నరేళ్ళ పాలనలో తను చేసిన నిర్వాకం చూసి కూడా గతి లేనట్టు మళ్ళీ నెత్తిన పెట్టుకున్న తెలంగాణ వోటర్లు ఎంత పిచ్చివాళ్ళు?మళ్ళీ గెలిచిన కేసీయారు కొట్టిన దెబ్బకి ఎంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చినట్టు ఆంధ్ర వోటర్లు కూడా పిచ్చోళ్ళైపోయారు. ఒక పక్క "కేంద్రం ఆదుకోకపోతే రాష్త్రం దివాలా తీస్తుంద"ని తన పార్టీ ఎంపీయే ఆందోళన వ్యక్తం చేస్తుంటే, ఇంకో పక్క తన ప్రభుత్వంలోని ఆర్ధిక మంత్రి రాష్ట్ర ఆర్ధిక పరిస్థి గురించి భయాన్ని వ్యక్తం చేసుంటే నవరత్నాలని ప్రజల కివ్వటం కోసమైనా అబ్జివృద్ధిని పరుగులు పెట్టించాలనే ఇంగితజ్ఞానం లేకుండా చంద్రబాబుని జైల్లో పెట్టించటం కోసం బొక్కలు వెదకటమే తక్షణ కర్తవ్యం అన్నట్టు ప్రవర్తిస్తున్న సైకో రాష్ట్రాన్ని అప్పుల వూబిలో ఇంకొంచెం లోతుకి ముంచటం ఖాయం - వాళ్ళ తిప్పల్ని చూసి వీళ్ళూ వీళ్ళ తిప్పల్ని చూసి వాళ్ళూ ఏడవటమే తెలంగాణ మేధావులు కేసీయారు వెంట నడిచి మొత్తం తెలుగు జాతికి తెచ్చిపెట్టిన సౌభాగ్యం!

రాజధానికి సంబంధించి చంద్రబాబు ప్రభుత్వానికీ సింగపూరు ప్రభుత్వానికీ మధ్య కుదిరిన ఒప్పందం గురించి విజయసాయిరెడ్డి తనకి తెలిసిన వాళ్ళని ఆరా తీస్తుంటే వాళ్ళు "రెండూ ప్రభుత్వాలే - ఏ ప్రభుత్వమైనా మరో ప్రభుత్వానికి లంచమిస్తుందా?అది సాధ్యమా!" అని చివాట్లు పెట్టాక కూడా ముడ్డీ నోరూ మూసుకుని ప్రభుత్వంలో ఉన్నందుకు చెయ్యాల్సిన మంచిపనులు చేస్తే గౌరవం పెరుగుతుంది కానీ నిర్దుష్టమైన సమాచారం లేదని తెలిసి కూడా "చంద్రబాబుని జైల్లో పెట్టేయ్యాలి!బొక్కలు వెతికి ముందే చెప్తే మీకు ప్రైజులిస్తా!మీరు చెప్పకుండా నాకు దొరికితే మీకు తాట తీస్తా!" అనే పిచ్చపుల్లయ్య కబుర్లు చెప్తే విన్నవాళ్ళు పక్కకి వెళ్ళి నవ్వుకుంటారు. ప్రస్తుతం తిరిగి దెబ్బ కొట్టలేని స్థితిలో ఉన్నాడని చంద్రబాబు మీద చూపిస్తున్న ప్రతాపం "రాష్ట్రంలో YCP అరాచకాలు పెరిగిపోయాయి!పరిణామాలు తీవ్రంగా ఉంటాయి!" అని వార్నింగు లిస్తున్న కన్నా లక్ష్మీనారాయణ మీద చూపించగలరా జఫాలు?రేపటి రోజున అదే గతి మీకు పట్టినపుడు వాళ్ళు నవ్వుతుంటే ఎట్లా ఉంటుందో ఒకసారి వూహించుకింటే కళ్ళు కిందకి దిగి నేల కనబడుతుంది.

అయినా, మత్తు వదిలి తెలివి తెచ్చుకోవడానికి సరిపడిన సమయం ఎక్కువ లేనట్టుంది, అనేకమంది వైకాపా నాయకులు మా పార్టీ వైపు చూస్తున్నారు అని మాధవ్ ప్రకటించటాన్ని బట్టి. మొట్టమొదట తనకోసం కేసీయారు మొదలుపెట్టి అత్యంత చాకచక్యంగా నడిపించిన పార్టీ మార్పిడి వ్యూహాన్నే అక్కడ కేసీయారు మీదా ఇక్కడ జగను మీద ప్రయోగించి ఒకే దేశం ఒకే ఎన్నిక పేరున తెచ్చిపెట్టే జమిలి ఎన్నికలకి ముందే ఈ రెండు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాల్ని ఏర్పాటు చెయ్యాలనే కృతనిశ్చయంతో భాజపా ఉన్నట్టు నాకు అర్ధం అవుతున్నది - ఔరా, ఏమి చాణక్యం?ఒకేసారి ఇద్దర్నీ లేపేస్తారా ఒకోసారి ఒకడి చొప్పున రెండు తూర్ల లేపేస్తారా అనేది వాళ్ళ వెసులుబాటుని బట్టి ఉంటుంది గానీ జమిలి ఎన్నికల లోపు ఈ రెండు రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తే తప్ప దక్షిణాదిలోని మిగిలిన రాష్ట్రాల్లో విస్తరించడం కష్టం కాబట్టి లేపెయ్యడం మాత్రం తప్పదు. ఎవరు తవ్విన గొయ్యి వారికే నుయ్యి అయినట్టు డెభ్భయ్ వేల పుస్తకాలు చదివిన కామక్రోధమదమాత్సర్యలోభసహితదంభపూరితగర్వంతో గొప్ప మేధావి లెక్కన మొదలుపెట్టిన కొత్త రకం పార్టీ ఫిరాయింపుల చెత్త నాటకం అటు తిరిగి ఇటు తిరిగి తననే బలి తీసుకునే కృత్యాభూతమై పెరిగి పెరిగి కచరాసుర సంహారం అనే భీబత్సరసపూరితమైన విషాదాంత జగన్నాటకం ఎప్పుడు పూర్తవుతుందో అప్పుడు తెలుగుజాతి కొంత కాలం ఇతని వల్ల పోగొట్టుకున్న ప్రశాంతతనీ చేజార్చుకున్న ఐకమత్యాన్నీ తిరిగి సాధించుకుని కొంతమేరకు సాంత్వన పొందగలదు - అయినప్పటికీ నిశితమైన దృష్టితో భావిని పరికించి చూస్తే "గత కాలమె మేలు వచ్చు కాలము కంటె!" అన్నట్టుగానే ఉంది.

"యధా యధాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత, ధర్మ సంస్థాపనార్ధాయ - తదాత్మానం సృజామ్యహం" అని భగవానుడు వాగ్దానం చేసినట్టు రావలసిన వాడు రావలసిన చోటికి రావలసిన విధంగా వస్తే తప్ప తెలుగుజాతి పూర్వ వైభవాన్ని సాధించుకోలేదనేది వ్యాసపరాశరషిర్డీసాయినాధపర్యంతం ఉన్న సత్యధర్మన్యాయప్రతిష్టితమైన గురుపరంపర పాదాల మీద ప్రమాణం చేసి నేను చెబుతున్న నిష్ఠుర సత్యం!ఏది సత్యమైనదో అదే శివమైనదీ అవుతుంది!ఏది శివమైనదో అదే సుందరమైనదీ అవుతుంది!


సత్యం శివం సుందరం!!!

4 comments:

  1. హరిబాబు గారూ, వ్యాఖ్యలు వ్రాయటం మానుకున్నా కేవలం అతికొద్ది (తప్పనిసరి అనిపించిన) పరిస్థితుల్లో మాత్రం ఒకటీ అరా వ్రాస్తున్నాను. అటు కేసీఆర్ ఇటు జగన్ ఎవరైనా జనం ఎన్నుకున్న నేతలే. అందుచేత ఆయారాష్ట్రాల ప్రజలను తమతమ ప్రియతమ నేతల పరిపాలనలను అనుభవించనివ్వండి. తప్పులెందుకు వెదకటం? ప్రయోజనం లేదు. People got the governments they deserved. Let them enjoy. పైగా ఇప్పుడు బ్లాగులోకం అంతా ప్రభుత్వాలకు జైకొట్టే వారితో దాదాపుగా నిండిపోయిందని తోస్తున్నది. మీరు చెప్పేది తప్పుబట్టటం తప్ప మరేమీ జరగదిక్కడ. మీ ఆవేశం అస్థానపతితం అని గ్రహించ ప్రార్థన.

    ReplyDelete
    Replies
    1. meeru CBN ki jai kottinappudu okna shyamaliyam saar

      Delete
  2. జమిలి ఎన్నికల వ్యూహం నేను కూడా కొద్ది కాలం గా అనుకుంటున్నదే. కర్ణాటక మాదిరిగా ఆంధ్ర తెలంగాణాలను మింగేయడం సాధ్యమంటారా? మహా అయితే ఓ పాతిక ముప్పై మంది ని ఆకర్షించ గలరేమో?

    ReplyDelete
    Replies
    1. సాధ్యమే!

      బీజేపీ గరుడ వ్యూహంలో జమిలి ఎనికలు ఒక భాగం మాత్రమే.అలాగే ఎమ్మెయ్యేల కొనుగోళ్ళు కూడా ఒక భాగమే.ఇప్పుడు మైహోం అధినేత మీద దాడులు మీడియా మీద పట్టు కోసం జరుగుతున్నాయి.జమిలి ఎన్నికలకు మునుపే అధికారంలోకి వస్తే ముందే వశపరుచుకున్న మీడియాని ఇష్టం వచ్చినట్టు వాడుకుని ప్రచారపు ఖర్చు తగ్గించుకోవచ్చు.అదీ గాక ప్రభుత్వంలో ఉంటే ఎలెక్షన్ కమిషన్ కూడా జేబులోకి వస్తుంది.

      గరుడ వ్యూహం గురించి చెప్పినప్పుడు శివాజీని అందరూ వెక్కిరించారు, నిన్నటి అవకు నమ్మలేదు కూడాను. ఇప్పుడు అరెస్టు కాగానే అతనికేదో అయిపోతుందని అతని వ్యతిరేకులు సంబరపడుతున్నారు.కానీ ఇప్పటి అవర్కు జరిగినదీ ఇప్పుడు జరుగుతున్నదీ అంతా అతను చెప్పినట్టే ఉంది అక్దా!అతన్ని నేరస్తుడుగా పట్టుకున్నట్టు లేదు, విచార్ణ కోసం కేవలం అదుపులోకి తీసుకున్నట్టు ఉంది - బహుశా అతనికి తెలిసిన అదనపు సమాచారం బైటికి చెప్పి తమని ఇబ్బంది పెట్టకుండా ఉండటానికో వాళ్ళు తెలుసుకుని ఉపయోగించుకోవడానికో అతన్ని పట్టుకున్నట్టు నా అనుమానం!

      అంత కాలం క్రితమే శివాజీ బయటపెట్టినా కూడా "అరెరె!మన ప్లాను బయటపడిపోయింది, జనం ఛీ కొడతారేమో!ఇప్పుడెట్లా?" అనే తొట్రుపాటు ఏమాత్రం లేకుండా ముందుకే కదలడాన్ని బట్టి బీజేపీ ఇప్పుడు కూడా వెనకడుగు వేసే ప్రసక్తి లేదు.మొదట కేసీయార్ తర్వాత జగన్ బీజేపీకి చోటిస్తూ పక్కకి తప్పుకుపోవాల్సిందే.మంచిగా తప్పుకుంటే మర్యాద దక్కుతుంది, లేదంటే చిప్పకూడు తినిపిస్తారు!

      Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

శ్రమ దోపిడీ గురించి ముప్పాళ రంగనాయకమ్మ గారి లోతైన పరిశీలన బెత్తెడు లోతు కూడా లేదేంటీ!

ఎలక్టొరల్   బాండ్స్   గురించి   మార్చి  31 న  " సుప్రీం   కోర్టు   తీర్పు   సంస్కరణేనా ?" అని   లోక్   సత్తా   జయప్రకాశ్   ఒక   వ్...