Friday, 9 August 2019

ఆంధ్రాలో భాజపాని ఉద్ధరించడానికి ఈ కమ్మకులద్రోహి సుజన తప్ప ఇంకెవడూ దొరకలేదా?

కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ఇక ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలకి సుజనా చౌదరిని ఇంచార్జిగా నియమించినట్టున్నారు. జగన్ నవయుగ కాంట్రాక్టును రద్దు చెయ్యడం గురించి పార్లమెంటు బయట ఎక్కువ మాట్లాడింది అతనే కావడం దాన్ని ధృవపరుస్తున్నది. పార్టీ కండువా మార్చిన వెంటనే అధిస్టానం తరపున వచ్చిన మొదటి కామెంటు ఇక ఆంధ్రాలో పార్టీని అధికారం వైపుకి నడిపించే బాధ్యత అతనికే అప్పగిస్తున్నారనే వూహలకి తావిచ్చింది.

పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే బాధ్యతను అప్పజెప్పినప్పుడు అధికారంలోకి వస్తే అతనికే ముఖ్యమంత్రి పీఠం దక్కుతుందనే అనుకోవాలి కదా!మరి, చాలా కాలం నుంచీ పార్టీలో ఉన్న శీలా వీర్రాజు, రామ్మాధవ్ లాంటి వాళ్ళ పరిస్థితి యేంటి?వాళ్ళ కన్న ఇతనికి ఉన్న సానుకూలత యేమిటి అని ఆలోచిస్తే చౌదరి అనే పేరు వల్ల కమ్మకులస్థుడు అవటం తప్పించి ఇంకే రకమైన అర్హతలూ లేవు అతనికి.

మొదట చంద్రబాబుకు అత్యంత ప్రేమాస్పదుడై అతని పేరును మంత్రివర్గంలోకి తీసుకోవడానికి సూచించినప్పుడు భాజపా జాతీయస్థాయి నాయకులు అందరూ అతని పేరును తిరస్కరించి ఇంకొకరిని పంపించమని సూచించటం వాస్తవమే కదా!అంత స్థాయి వ్యతిరేకత ఇంత స్థాయి సానుకూలత కింద మారటానికి మధ్యలో అతను వూడబొడిచిన ఘనకార్యాలు ఏమి వున్నాయి?ఏమీ లేవనేది వాస్తవం!

భాజపా పెద్దలు కమ్మ కులస్థుడైన బాబుకి మరో కమ్మ కులస్థుడైన సుజన సరైన ప్రత్యామ్నాయం అని భావించారనేది స్పష్టం!కానీ వాళ్ళ ఈక్వేషన్ సరైన ఫలితాన్ని ఇస్తుందా?ఇవ్వదని నా ప్రగాఢమైన విశ్వాసం.ఎందుకంటే, వాళ్ళు చూస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ వోటర్లు బాబుని కులాన్ని బట్టి ముఖ్యమంత్రిని చెయ్యలేదు.ఇది పూర్తిగా అర్ధం కావాలంటే, అతని రాజకీయ ఉత్ధాన పతనాల్ని చూడాలి.రామారావు అనూహ్యమైన విజయాన్ని సాధించిన వెంటనే బాబు తెలుగుదేశంలోకి జంప్ అయినప్పటికీ మొదట్లో వెనకాలే ఉండిపోయాడు. అతను మొదటిసారి పదిమందికీ తెలిసింది నాదెండ్ల భాస్కర్రావు రామారావుని వెన్నుపోటు పొడిచినప్పుడు. చంద్రబాబు అప్పట్లో పార్టీ ఎమ్మెల్యేల్ని వేరేచోటికి తరలించి దాచేసి ఉండకపోతే రామారావు ఆందోళనా తిరుగుడూ కంఠశోషా ఎందుకూ పనికిరాకుండా పోయి తెలుగుదేశం అంతరించిపోయి ఉండేది!ఆనాడు బాబు చేసిన పనినే ఇప్పటికీ పార్టీలలో తిరుగుబాట్ల సమయంలో మిగిలిన రాజకీయ పార్టీలు అనుసరిస్తున్నాయంటే అతను చేసింది ఎంత కరెక్టో తెలుసుకోవచ్చును.

అలా సమర్ధత రుజువయ్యాక క్రమేణ ముందుకొచ్చి పార్టీని అధికారం పోయాక రామారావు సినిమాలు తీసుకుంటూ కాలక్షేపం చేస్తున్నా పార్టీని ఫిరాయింపులకి లొంగకుండా ఉంచాడు. పార్టీలో అతను ముందుచూపుతో ప్రవేశపెట్టిన పద్ధతులే ఇప్పటికీ తెదెపాకి బలమైన అంకితభావం కలిగిన క్యాడరుని ఏర్పాటు చెయ్యగలిగాయి!ఈ టైములోనే కేసీయార్ తెదెపావాళ్ళకి పొలిటికల్ క్లాసులు పీకినట్టు గుర్తు - అలా తను పెంచిన పార్టీనే తుంచిన కృతఘ్నత కేసీయారుది, మంత్రి పదవి ఇవ్వలేదని అలిగి ఇంత చేసిన ఈ బూతుల బుంగన్న కూడా బాబుని వెన్నుపోటు దారు అనటం, వాహవ్వా వారెవ్వా ఓరమ్మో ఓరయ్యో!

రామారావులో ప్రజల పట్ల నిజాయితీ ఉందనేది ఎంత నిజమో వ్యక్తిగత ప్రవర్తనలో స్ప్లిట్ పర్సనాలిటీ ఉందనేది కూడా అంతే వాస్తవం!ఆ స్ప్లిట్ పర్సనాలిటీయే మళ్ళీ అధికారం సాధించే ప్రయత్నాలు చెయ్యకుండా సినిమాలు తీస్తూ కాలక్షేపం చెయ్యడంలో కనిపిస్తుంది, ఆ స్ప్లిట్ పర్సనాలిటీయే ఆ వయస్సులో లక్ష్మీ పార్వతితో రెండో పెళ్ళికి అంగలార్చడంలోనూ కనిపిస్తుంది.నిన్న మొన్నటి వరకు నేను కూడా రామారావుని పదవీచ్యుతుణ్ణి చేసినందుకు చంద్రబాబుని ద్వేషించినవాణ్ణే - వీరగంధం ఇచ్చిన ఇంటర్వ్యూ చూశాకనే అసలు విషయం తెలుసుకోగలిగాను.నాదెండ్ల చేసింది వెన్నుపోటు అవుతుంది గానీ చంద్రబాబు చేసింది ఎట్టి పరిస్థితుల్లోనూ వెన్నుపోటు కాదు.పార్టీ వ్యవస్థాపకుడు అయినంత మాత్రాన తన పాటికి తను సినిమాలు తీసుకుంటూ ఆత్మకధ రాయించుకుంటూ కాలక్షేపం చేస్తుంటే క్షేత్ర స్థాయిలో పార్టీని నిలబెట్టి సభలో రాజశేఖర రెడ్డి లాంటి రౌడీకి నదురూ బెదురూ లేకుండా ఎదురు నిలబడి కృషి చేసిన బాబు కన్న కేవలం భార్య స్థానం తప్ప ఇంకే అర్హతా లేని లక్ష్మీపార్వతికి ముఖ్యమంత్రిణి హోదా ఇవ్వాలని ప్రయత్నిస్తుంటే చూస్తూ వూరుకోవాలా?పైన, తన తర్వాత తన కడుపున పుట్టిన బిడ్డనే వారసుణ్ణి చెయ్యాలని ఆ వయస్సులో రామారావు చేత మందులు మింగించి శృంగారానికి కూడా తహతహలాడి తను రెండు అబార్షన్లకి సరిపడ్డ సుఖాన్ని కూడా అనుభవించినట్టు వొప్పుకున్న నెరజాణకి నాయకత్వం అప్పగించడం అంటే పార్టీకి ఎంత అప్రతిష్ఠ!అలాంటి సమయంలో చంద్రబాబు స్థానంలో నేను ఉన్నా మీరు ఉన్నా అదేపనిని అదే పద్ధతిలో చేసి తీరాలి!

ఆనాటి రామారావు, లపా(కీ)ల దగ్గిర్నుంచి ఈనాటి కేసీయారు, (క)మోదీల వరకు తనని వ్యక్తిగతంగా ఎన్ని తిట్లు తిట్టినా అన్నిటినీ భరించడమే తప్ప టిట్ ఫర్ టాట్ అనే ప్రతిదాడిగా అయినా ఏ ఒక్కరినీ వ్యక్తిగత దూషణ చెయ్యలేదు చంద్రబాబు, హుద్ హుద్ తుఫాను అనే వూహించని సమస్య విరుచుకు పడినప్పుడు కన్ను మూసి తెరిచే లోపు సమస్యని ఎట్లా పరిష్కరించాలో తెలుసుకుని తను సిద్ధమై ఇతరుల్ని సిద్ధం చేశాడు చంద్రబాబు, మోదీ తన బ్రెయిన్ చెయిల్డ్ అని చెప్పుకుంటూ చేసిన పెద్ద నోట్ల రద్దుని మోదీ కన్న గొప్పగా చేసి చూపించాడు చంద్రబాబు  - అలాంటివి జన్మగత సంస్కారం వల్ల రావాలే తప్ప నేర్చుకుంటే రాలేని గొప్ప లక్షణాలు, కేసీయారుకీ మోదీకీ జగనుకీ చచ్చి ముతమారినా పట్టుబడవు!

ఇవ్వాళ "భాజపాతో కటీఫ్ వొద్దని నేను చెప్పాను,బాబు విన్లేదు, కలిసి పోటీ చేసుంటే గెలిచేవాడు" అని నీతులు చెప్తున్న సుజనుడికి పొమ్మనకుండా పొగ పెట్టింది భాజపా వాళ్ళేననీ బాబుని ఫెయిల్ చెయ్యడంకోసమే ప్రత్యేక హోదా ఇవ్వలేదనీ తెలియదా - తను ఎక్కడో దూరాన ఆజ్ఞాతంలో లేడే, సాక్షాత్తూ కేంద్రమంత్రివర్గంలోనే ఉన్నాడు కదా!14వ ఆర్ధికసంఘం ఇవ్వొద్దందనీ త్వరలోనే అందరికీ ఎత్తేస్తున్నామనీ ఎన్ని అబద్ధాలు చెప్పారు?అడగమంటే సైన్యం కేటాయింపుల్లో కూడా వాటా అడిగేలా వున్నారే అని ఎన్ని అవహేళనలు చేశారు? ప్రత్యేక హోదా ఇవ్వం అని చెప్పాక చంద్రబాబే ప్యాకేజీకి కావలసిన కసరత్తు అంతా చేసి చచ్చినట్టు ఇవ్వాల్సి వచ్చేట్టు చేశాడని వాళ్ళు యేడ్చి చావడం,ఇచ్చే ప్రతి పైసకీ లెక్కలడుగుతూ తను తినని మనని తిననివ్వని గడ్డివామి దగ్గిర కుక్కలా ప్రవర్తించారే తప్ప ఆంధ్రప్రజలకి మేలు చేసి ఓట్లడిగే పాటి వివేకం కూడా చూపించలేదే? ఇచ్చిన నిధుల్ని కూడా వెనక్కి తీసుకోవడం ఎంత నీచమైన పని?చిన్నపిల్లలకి చాక్లెట్టిస్తానని ఆశపెట్టి ఇవ్వకపోతేనే ఆ మనిషిని పురుగుని చూసినట్టు చూస్తామే! ఏ సమయంలో చంద్రబాబు పనితీరు బాగా లేదని కూశారో ఆ సమయంలో కేంద్రప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వానికి అనేక అంశాలలో అవార్డులు ఇస్తున్నది కేంద్రమంత్రిగా తనకి తెలియదా!పెట్టిన ఖర్చుకి లెక్కలడిగిన వాళ్ళు కట్టిన పన్నులకి లెక్కలడిగితే ముడ్డీ నోరూ మూసుకున్నారేం?ఆంధ్ర ప్రజలు కట్టిన పన్నుల నుంచి ఆంధ్ర ప్రజలకి రాజ్యాంగం ఇచ్చ్గిన హామీని బట్టి హక్కుగా ఇవ్వాల్సినవి ఇవ్వటానికి తమ  జేబుల్లోనుంచి సొంత ముల్లె తీసి ఇస్తున్నట్టు యేడ్చి చచ్చిన వాళ్ళకి ఆంధ్ర ప్రజలు వోట్లు వెయ్యాలా?

వాళ్ళు చేసిన అవమానాలూ అవహేళనలూ చంద్రబాబుకేనా తగిలేది?ఈ రాష్ట్రప్రజల్ని ముష్టి జనం కింద చూడటం కాదూ అదంతా!సుజన చౌదరి అనే ఈ ఒక్క గొట్టాంగాడికి రోషం లేదని రాష్ట్రంలో అందరూ అలాగే ఉన్నారని అనుకుంటున్నాడా?తనకే గనక మినిమం పౌరుషం ఉండి ఉంటే, భాజపా తన పేరుని తిరక్కొట్టేసిందని తెలిసినప్పుడే "ఛ!నన్ను అవమానించిన వాళ్ళ మధ్యకు నేను పోవడం ఏంటి?" అని తనే మంత్రి పదవిని తిరస్కరించి ఉండేవాడు - నీతి లేనివాడికి పౌరుషం కూడా ఉండదని అప్పుడే నిరూపించుకున్నాడు!భాజపాని అధికారానికి సరిపడిన స్థానాల్లో గెలిపించడం అటుంచి అసలు ఈ సత్రకాయ తను నిలబడిన స్థానంలో గెలుస్తాడని గ్యారెంటీ ఉందా?ఒక పార్టీ కార్యకర్తల ప్రచారంతో గెలిచి పార్టీ కండువా మార్చినవాళ్ళలో ఎంతమంది తర్వాత ఎనికల్లో గెల్చారని గట్టిగా లెక్కలు తీస్తే అయ్యవారి భవిష్యత్తు తెలుస్తుంది.ఇంతకీ, అంత కాలం నుంచి పార్టీలో గిలిగిచ్చకాయల్లా తిరిగితే ఇప్పుడు అధిష్ఠానం నిన్న గాక మొన్న కండువా మార్చిన వాణ్ణి పార్టీని అధికారంలోకి తీసుకు రాగలిగిన సమర్ధుడని గారాబం చేస్తుంటే తతిమ్మా ఆంధ్ర భాజపా నాయకులకి చీమకుట్టినంత బాధ కూడా లేదా?వాళ్ళకి చీమూ నెత్తురూ లేవా?

లేవనే అనుకోవాలి!ప్రత్యేక హోదా ఇవ్వకుండా బాబుని ఫెయిల్ చేసేస్తే బాబుకి వోట్లు పడవు, మోదీని ఒక రవుండు తిప్పేస్తే చాలు "అవి మనకే, ఇహ మనకే!" అనే ఎదవ ప్లాను వేసింది వీళ్ళేనేమో!ఇది బెడిసి కొట్టిందనే చిరాకుతో అధిష్ఠానం వీళ్ళ నోట్లో సున్నం కొట్టి సుజనా నోట్లో బెల్లం కొట్టి ఉండవచ్చు!ఈ డొంక తిరుగుడు ఎత్తిపోతల పధకానికి బదులు చక్కగా తామే తమ అధిష్ఠానం దగ్గిర నుంచి ప్రత్యేకహోదాని తెచ్చి బాబుకి ఇచ్చి మేము సాయం చెయ్యబట్టే బాబు ఇవన్నీ చెయ్యగలిగాడు అని చెప్పుకుని ఉంటే ఎలా ఉండేది?

ఇప్పుడేమైంది?చిరిగి చేటైంది!మోదీ వచ్చి ప్రచారం చేసినా బాబు వ్యతిరేక వోటు జగను వైపుకి వెళ్ళింది గానీ భాజపా వైపుకు రాలేదు.ఎందుకు రాలేదో తెలియకపోవడానికి వీళ్ళేం చిన్నపిల్లలా?ఇవ్వాళ సోషల్ మీడియాలో ఎవర్ని కదిపినా "ఇప్పుడు ఆంధ్రా ఉన్న దీనమైన పరిస్థితికి నూటికి నూరు శాతం బీజేపీయే కారణం!" అని గబ్బు రేపుతుంటే చూడటం లేదా?చూసి కూడా చూడనట్టు నటిస్తున్నారా!ఇవ్వాళే ఒక భాజపా అభిమాని తెదెపా వాళ్ళని లాక్కోకపోతే ట్రిపుల్ తల్లాఖ్ బిల్లు పాస్ కావటమూ ఆర్టికిల్ 370 రద్దు కావటమూ ఈజీగా జరిగేవి కావని చెబుతున్నాడు, అపర చాణక్యుడు బిరుదుని బాబుకి బదులు మోదీకి ఇవ్వాలని మురిసిపోతున్నాడు - ఏమి తెలివి?నీ ముక్కేదిరా అంటే వెనకటికో వెర్రి వెంగళప్ప కుడి చేతిని తల చుట్టూ తిప్పి ఎడం వైపుకి తెచ్చి చూపించినట్టు ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఏడిపిస్తూ మిత్రుడిగా ఉన్న బాబుని పొమ్మనకుండా పొగబెట్టి తన్ని తగలేసి శత్రువుని చేసుకుని ఎన్నికల్లో వోడించి మళ్ళీ వాళ్లని లేని కేసుల్ని బనాయించినట్టు చెత్త నాటకాలు ఆడి లాక్కునే ఖరమ దేనికిరా బడుద్ధాయలూ - బాబుకి చెయ్యాల్సిన సాయం ఏదో చేసి తగలడితే మీకు 5గుర్నేం ఖర్మ 20 మందిని సాయం పంపించడా!వీళ్ళు పిచ్చోళ్ళా!వెర్రోళ్ళా!తిక్కోళ్ళా!వెర్రి పుచ్చకాయలో పిచ్చి దోసకాయలో తిన్నారా!

చంద్రబాబుని వోడించినవాళ్ళు అప్పుడూ ఇప్పుడూ తిమ్మిని బమ్మిని చేసి కుట్రలతో గెలవడమే తప్ప తమ నిజమైన ఛరిష్మాతో గెలవలేదు, ప్రజలు రెండు పరిపాలనలకీ తేడాని చూసి దడుచుకుని మళ్ళీ చంద్రబాబుకే పట్టం కట్టారనేది చరిత్ర చెప్తున్న వాస్తవం - రేపు 2022లో కూడా అదే జరుగుతుంది, చూస్తూ వుండండి!

అధర్మరతులు అహంకారులై ఒక్కసారి గెల్చినందుకే మదం కళ్ళకి పొరలు గమ్మి పగలబడి వెకిలినవ్వులు నవ్వుతున్నప్పుడు కూడా ధర్మిష్ఠులు గెలుపోటములతో సంబంధం లేకుండా ఒదిగి ఉంటూ  చిరునవ్వులనే వెలయిస్తారనేది సత్యధర్మన్యాయప్రతిష్ఠితమైన వ్యాసపరాశరాదిసత్యసాయినాధపర్యంతం ఉన్న గురుపరంపర పాదాల మీద ప్రమాణం చేసి మూడు కాలాలను ముడివేసి చూడగలిగిన నేను చెప్తున్న నిష్ఠురసత్యం!ఏది సత్యమైనదో అదే శివమైనదీ అవుతుంది!ఏది శివమైనదో అదే సుందరమైనదీ అవుతుంది!
సత్యం శివం సుందరం!!!

No comments:

Post a Comment

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...