Tuesday, 9 February 2016

రాష్ట్రం వచ్చెననీ జీహెచ్చెంసీ పీఠం దక్కెననీ సంబరపడగానే సరిపొలేదోయ్!చెప్పినవన్నీ చేసి చూపించి అప్పుడు కాలరెగరెయ్యవోయ్!

          గొప్పగా పరిపాలించి ప్రజల్ని మెప్పించటం ఎన్నికల్లో గెలవటం ఒకటి కాదు.ఎన్నికల్లో గెలవటానికి సంబంధించి సెఫాలజీ అని ఒక సైన్సే ఉంది.దాని ప్రకారం ప్రతి ఎన్నికకీ ఒక స్వింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది.అది 4% ఏ అభ్యర్ధి వైపుకి మొగ్గినా వూహించని ఫలితం వస్తుంది.అన్ని పార్టీలూ మైనారిటీలని బుజ్జగించడం దగ్గిర్నుంచీ తెరాసా బృందమంతా సెటిలర్లని బుజ్జగించడం కోసం పడరాని పాట్లు పడేది ఆ ఉయ్యాల తమవైపుకి వూగి తమని అందలం ఎక్కించే వూపు రావడం కోసమే!అన్ని ఎన్నికల్లోనూ ఇప్పటిలాగా సెటిలర్ల మాదిరి స్వింగ్ స్పష్టంగా ఉండదు,ఒక్కోసారి అప్పటివరకూ స్వింగ్ ఫ్యాక్టర్ అనుకున్నది కాక మరొకటి స్వింగ్ ఫ్యాక్టర్ స్థానంలోకి రావచ్చు,ఎన్నికలకి ఒక్కరోజు ముందు ఈ స్వింగ్ ఫ్యాక్టర్ ఎదురుతన్నినా చాలు అద్భుతమైన తెలివితేటలు చూపించి ఆరునెల్లు ముందునుంచీ ప్లానులేసి చేసిన ప్రయత్నాలన్నీ మట్టిపాలే,రిజల్టు ఢాం తుస్సు మనాల్సిందే:-)


          అందుకే నేను కేటీఆర్ సైలంటుగా పనిచేసి గెలుపు ఖాయం అనిపించుకుంటే కేసీఆర్ వైలెంటుగా పోయి స్వింగుని రివర్స్ చేస్తున్నాడేమోనని కంగారు పడ్డాను.కానీ జనం తెలివి జనం చూపించారు.వాళ్లముందు ఉన్నది ఒకే ఒక ఆప్షన్,తెరాసాని సమర్ధించడం - కేసీఆర్ దాన్నే బలంగా నొక్కి చెప్పాడు!ఒకవేళ పంతానికి పోయి వేరే పార్టీని గెలిపించినా మనోడు గెల్చినవాళ్ళని ఆ పార్టీలో ఉండనివ్వడు గదా:-)గెల్చినోడికల్లా గులాబీ కండువా కప్పేస్తుంటే జనం మళ్ళీ వేరే పార్టీకి వోటెయ్యడం దేనికి:-(కాబట్టి కేసీఆర్ గారికి ఖర్చూ రిస్కూ తగ్గించారు సెటిలర్లు!ఇక ఈ సెటిలర్లు ఆ ముద్ర చెరిపేసుకుని తెలంగాణలో మనస్పూర్తిగా లీనమైపోయి బతకడం బెస్టు!పొరుగు రాష్ట్రపు ముఖ్యమంత్రి ఎంతకాలం హైదరాబాదులో ఉంటాడు వీళ్లని కాపలా కాయడం కోసం - అందుకే చంద్రబాబు నాయుడు ప్రచారం కూడా నీరసంగా ఉంది. ఓటుకు నోటు కేసుకి ముందు తేలంగాన అంతా పరవళ్ళు తిరిగినప్పటి ధీమా లేకపోవడం తెలుస్తూనే ఉంది.అయితే రెరాసాతో సహా గుర్తుంచుకోవలసిన విషయం ఈ స్వింగు మహా ప్రమాదకారి.కాబట్టి తెలంగాన సెంటిమెంటు ఎప్పటికీ స్వింఫులా ఉండకపోవచ్చు.తేలంగాణా తెలుగుదేశం కూడా మరీ నీరసించి పోవాల్సిన పని లేదు.కలం గడిచే కొద్దీ ప్రభుత్వ పనితీరు లోని లోపాలు అధికార్ అపక్షానికి ప్రతికూఅల స్వింగుని తయారు చహెస్తాయి - దాని పట్టుకోవటానికి సిద్ధంగా ఉండాలి.కాకపోతే ప్రతీదానికీ బాబు మీదా చినబాబు మీదా ఆధారపదకుండా సొంతంగా నిలబడాలి.నాయకులు ఫ్యాక్తరీలో పుట్టుకురారు గానీ అవస్రమేఅ న్నిట్నీ నేర్పిస్తుంది.తెలంగాణ భాజపా కూడా తెలుగుదేశంతో అంటకాగడం మానేసి సొంత బలాన్ని పెంచుకోవాలి.మిత్రపక్షంగా ఉన్నందువల్ల కేసీఆర్ 667678 పత్ల ఖచ్చితంగా ఉదారంగా ఉంటాడు.ISIS బ్రాంచీలనే తెరిచిన దుస్థితిని ఎదుర్కోవాలంటే భాజపా బలం పెంచుకోక తప్పదు!ప్రస్తుతానికి ఆంధ్రాలో మిత్రపక్షంగా కొనసాగుతున్నందువల్ల ఇక్కడ ఒకరినొకరు విమర్శించుకుంటే ఇద్దరూ లోకవ అయ్యే ప్రమాదం ఉంది గనక మరీ తిట్టుకుని తన్నుకుని విడిపోయే ప్రేయసీప్రియుల మాదిరి ఓవరాక్షన్ చెయ్యకుండా హుందాగా విడిపోయి ఎవరి బలాన్ని వారు పెంచుకుంటే ఇద్దరికీ మంచిది!


          ఇప్పటి వరకూ రాజదానిలో పాగా వెయ్యలేని బెంగ తీరింది గనక తెలంగాణ ముఖ్యమంత్రి ప్రశాంతంగా పని చేసుకోవచ్చు.ఎన్నికల సమయలో తాము వస్తే తెలంగాణకి చేస్తామని చెప్పిన అప్పటి భవిష్యత్ ప్రణాళికల నుంచీ అధికారంలోకి వచ్చాక కూడా తప్పనిసరిగా చేస్తాం అంటూ చాలా ఆశల్ని జనంలో మొలకెత్తించారు.అయిదేళ్ల పాలనాకాలంలో మూడేళ్ళు గడిచిపోయినాయి.ఏ రాజకీయ పార్టీ నాయకుడూ చెప్పని విధంగా నాలుగేళ్ళు తిరిగేసరికి మేము చెప్పినవన్నీ చేసి చూపిస్తాం,అలా చెయ్యలేకపోతే మిమ్మల్ని వోట్లు అడగం అన్నారు.ఆ మాటని జనం చెక్ చేసుకోవటానికి ఇంకొక్క సంవత్సరమే ఉంది.మామూలు రొడ్డకొట్టుడు వాగ్దానాలని జనం తేలిగ్గానే మర్చిపోయి ఉండేవాళ్ళేమో గానీ ఇది మీరు ప్రత్యేకంగా నొక్కి చెప్తున్నది గాబట్టి ప్రజలు కూడా గట్టిగానే గుర్తుంచుకుంటారు,ఒకవేళ ప్రజలు మర్చిపోయినా ప్రతిపక్ష పార్టీలు గుర్తు చేస్తాయి.కొన్ని పనులు మొదలుపెట్టి చాలామటుకు పూర్తి చేశారని వింటున్నాం గానీ మరి కొన్ని అనేకరకాల అడ్దంకుల వల్ల మొదలవుతాయో లేదో తెలియని పరిస్థితి ఉంది - ఈ ఒక్క సంవత్సరంలో ఎన్నింటిని పూర్తి చెయ్యగలరు?

          తెలంగాణ ముఖ్యమంత్రి ఆర్భాటంగా మొదలుపెట్టి అర్ధాంతరంగా ఆపేసిన చాలా కార్యక్రమాల్లో వాహనాల రీరిజిస్ట్రేషన్ మరియూ కల్తీకల్లు-గుడుంబా లాంటివి అసలు ప్రతిపాదన లోనే ఒక రకమైన తెలివితక్కువతనం ఉండటం వల్ల అభాసుపాలు అయినాయి,కొంచెం లౌక్యం చూపించి ఇతరేతర సాంకేతిక కారణాలు ఏవైనా చెప్పకుండా వాస్తు ప్రస్తావన తీసుకు రావడంతో సెక్రటేరియట్ మార్పు లాంటివి అవహేళనకి గురయ్యాయి,హుస్సేన్ సాగర్ ప్రక్షాళన లాంటివి కోర్టులు అడ్డుపడడం వల్ల ఆగిపోయినాయి.అదొక్కటే కాకుండా చాలా నిర్ణయాలు కోర్టుల వల్లనే ఆగిపోవడంతో ఆంధ్రా హైకోర్టు అనే పల్లవి ఎత్తుకున్నారు.ఇప్పటికే ఈ ఆంధ్ర-తెలంగాణ గొడవల్ని ఉద్యోగవర్గాలకి పాకించి చాలా తప్పు చేశారు.ఈ పాలిటిక్స్ వల్ల తెలంగాణ ఉద్యోగుల పంతీరు ఏమీ మెరుగుపలేదు సరికదా వారూ కొత్తగా నేర్చిన  రాజకీయపు తెలివితో తెలంగాణ ప్రబుత్వానికి కూడా సమస్యగా మారినట్టు కనిపిస్తున్నది.ఇంక ఈ ఆంధ్ర-తెలంగాణ గొడవల్ని న్యాయవ్యవస్థకి కూడా పాకిస్తే తెలంగాణేతరులు న్యాయం కోసం కోర్టులకి వెళ్ళడానికి కూడా భయపడాల్సిన అరిస్థితి దాపురిస్తుంది.ఒకవేళ తెలంగాణ న్యాయ్మూర్తులు అయినప్పటికీ లొసుగులతో ఉన్న చట్టాన్ని "రాష్త్రం మనదే తోసెయ్" అనే లెక్కన ప్రభుత్వానికి అనుకూలంగా ఫిరాయించితే అది ఆ న్యాయమూర్తి వృత్తి జీవితానికి కళంకం కాదా!ఒక రాజకీయ వేత్త తనమీద లక్ష కోట్ల కుంభకోణం తన మీద ఆరోపించబడినా తన పార్టీ మీద పట్టు ఉన్నంతకాలం అతడికి ఏ హానీ జరగదు.ఆ నాయకుడు ఎన్నికల్లో గెలిచి ప్రజాభిమానం ద్వారా తన కళంకాన్ని పోగొట్టుకునే అవ్కాశం ఉంటుంది.న్యాయవ్యవస్థలోని ప్రతి ఒక్కరూ ఇండియన్ బార్ కన్సిల్ అనేదానికి జవాబుదారీగా ఉండాలి.ఒక న్యాయమూర్తి పైన స్వచ్చమైన ప్రాంతీయాభిమానంతోనే అయినా ఒక తప్పులతడక చట్టాన్ని క్షుణ్ణంగా పరిశీలించకుండా వొదిలెయ్యటానికి సంబంధించి మచ్చ పడితే ఆ న్యాయమూర్తి తన మరకని కడుక్కోగలిగిన అవకాశం ఉందా?లేదు, కనుక తెలంగాణ ముఖ్యమంత్రి మరియూ మంత్రివర్గం కాస్త నిదానించి న్యాయవ్యవస్థని కూడా మితిమీరిన ప్రాంతీయాభిమానంతో భ్రష్టు పట్టించకుండా ఉంటే బాగుంటుంది!చట్టాలు చేసే సమయంలోనే లోపాలు లేకుండా జాగ్రతపడితే కోర్టులు ఎందుకు కొట్టేస్తాయి?ఒకసారి న్యాయవ్యవస్థ మీద ప్రజలకి విశ్వాసం పోతే మళ్ళీ పునరుద్ధరించటం చాలా కష్టం - అది రాజకీయ వ్యవస్థ లాంటి మొండి బంద వ్యవహారం కాదు!అసలు ప్రజలకి న్యాయవ్యవస్థ మీదే విశ్వాసం పోయిన తర్వాత ప్రభుత్వం ఉండి కూడా లేనట్టే!ఎవడు ఏ రకమైన దొంగల దోపిడీ నుంచి అరాచకత్వం వరకు ఏమి చేసినా చెడిపోయిన న్యాయవ్య్వస్థని అడ్డు చేసుకుంటే చాలు ప్రభుత్వం వాడి కాలిగోరుని కూడా పెకలించలేదు - గోటితో పోయేదానికి గొడ్దలి వాని వివేకం తెలంగాణ ప్రభుత్వాని కుండాలి.

          ఈ లోపాలు సవరించుకోకుండా సమర్ధవంతమైన పరిపాలనను ప్రజలకు అందించడం అసంభవం.కాబట్టి ప్రభుత్వపక్షం ఎక్కువకాలం గాలిలో తేలిపోకుండా తొందరగా నేలమీదకి రావాలి.సెటిలర్లు బుట్టలో పడిపోయి వోటు వెయడం వరకు బాగానే ఉంది,కానీ ఉద్యమ కాలంలో మీరేమి చెప్పారో గుర్తుందా?మన ఉద్యోగాలు ఆంధ్రోళ్ళు లాక్కున్నారు,వాళ్ళని వెళ్లగొట్టేస్తే చాలు ఆఉద్యోగాలన్నీ మీకు వస్తాయి అన్నారు - అనలేదంటే చెయ్యగలిగింది లేదు.మరి ఇప్పుడు వీళ్లందర్నీ ఆంధ్రాకి వెళ్లగొట్టకుండా తెలంగాణ ప్రజలకి ఉద్యోగాలు చూపించాలి.ఉపాధి కల్పనా రంగాన్ని వీళ్ళందరికీ అవకాశాల్ని కల్పించేటంతగా విస్తరించాలి,లేని పక్షంలో గంప లాభం చిల్లి తీసినట్టు తెలంగాణ జనం మీకు పెద్ద బొక్క చూపిస్తారు.

తెలంగాణ ప్రాధమికంగా ఓక భౌగోళిక నామం,అంతిమంగా ఒక సాంస్కృతిక రాజకీయ వారసత్వం

9 comments:

  1. హరిబాబు గారూ, వార్డుల వారీ పార్టీలకు పడిన వోట్ల సంఖ్య ఇంకా అధికారికంగా రాలేదు. అదొచ్చాక అనలైజ్ చేద్దామనుకుంటున్నాను ఈ లోపల మీరు టపా వేసేసారు!

    2014 సాధారణ ఎన్నికలలో హైదరాబాదులో వివిధ పార్టీల పెర్ఫార్మెన్స్ ఇలా ఉండింది:

    ఎన్డీయే కూటమి: 35.4%
    తెరాస: 19.6%
    మజ్లిస్: 16.3%
    కాంగ్రెస్: 15.2%

    మీరు అనుకున్న 4% స్వింగ్ పెద్దగా ఎఫెక్ట్ చూపేది కాదు. ఎన్డీయే 35.4% కాస్తా 31% అయ్యి 19.6% వచ్చిన తెరాసకు 24% వచ్చినా కూడా ఎన్డీయే కూటమి బ్రహ్మాండంగా గెలిచేది.

    ఈ స్థాయి గెలుపు రావాలంటే తెరాసకు కనీసం 15%+ స్వింగ్ రావాలి. అంతటి స్వింగ్ రావడం అనేది (ఎంత స్వింగో ఇంకా తెలీదు కానీ) అసాధారణమయిన మలుపే. ఏదో ఒక్క వర్గం వల్ల మాత్రమె ఇది జరుగదు.

    ReplyDelete
    Replies
    1. హరిబాబు గారూ ఇప్పుడే అధికారిక ఫలితాలు చూసాను. పూర్తిగా లోటు విశ్లేషణ కొంచం సమయం పడుతుంది కానీ పైపై చూపులతో తేలిన స్వింగ్:

      తెరాస: +24.2%
      మజ్లిస్: -0.4%
      కాంగ్రెస్: -4.8%
      ఇతరులు: -6.9%
      ఎన్డీయే కూటమి: -11.9%

      Delete
    2. Jai
      thanks
      I welcome clera cut analysis and interested in statistics also.
      I am not purely depending on ideology or sentimental waves.I encourage practical perspective.thanks again

      Delete
    3. Thanks!

      I plan to publish a blog post after completing the analysis. I will inform you once it is done.

      Delete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. Over one million people Converted to Christianity at single event in India: Feeding Poison to Indians

    http://hinduismnow.org/blog/2016/02/06/over-one-million-people-accept-christ-at-single-event-in-india/



    http://www.theelijahchallenge.org/over-one-million-people-accept-christ-at-single-event-in-india/

    ReplyDelete
  4. This comment has been removed by the author.

    ReplyDelete
  5. ఎవడు ఏ రకమైన దొంగల దోపిడీ నుంచి అరాచకత్వం వరకు ఏమి చేసినా చెడిపోయిన న్యాయవ్య్వస్థని అడ్డు చహెసుకుంతే చాలు ప్రభుత్వం వాడి కాలిగోరుని కొదా పెకలించలేదు.

    The most powerful swing factor for politicians.

    ఏ అభ్యర్ధి వైపుకి మొగ్గినా వూహించని ఫలితం వస్తుంది

    ReplyDelete
  6. శ్రీకాంత్ చారి గోదావరి జిల్లాల వాళ్లకి "అండి" వాక్యానికి బరువు తీసెయ్యండి అని ఉబోస ఇచ్చి "రి" దగ్గిర కొచ్చేసరికి అబ్బో అది చాలా ప్రశస్తమైన పదం అని గంతులేస్తాడు!ఫణీంద్ర ఏమో మేము వాడే "చెప్పాలె" గ్రాంధికానికి దగ్గిరగా ఉంది వాళ్ళ "చెప్పాలి" లోని "లి" వాడకానికి అసలెక్కడా ప్రామాణికత లేదంటాడు?

    ఫైన "ఇన్నాళ్ళు … తప్పుడు ప్రయోగాలు ఒప్పులుగా చలామణియై , ఒప్పులు అవహేళనలకు గురి కావడం నిజంగా తెలుగు భాషకు పట్టిన దౌర్భాగ్యం" అంటూ ఆగ్రహం కూడా వెళ్ళగక్కాడు.ప్రజలు ఇష్టం కొద్దీ మాట్లాడుకునే వ్యావహారిక భాషలో తప్పుడు ప్రయోగాలు ఉంటాయా?గ్రాంధికానికీ చందస్సుకీ పండితులు ఒకచోటా కలిసినప్పుడు అందరికీ తెలియదం కోసం కొన్ని కఠిన నియమాలిఉ పెట్టుకుంటారు గానీ వ్యావహారికానికి అంత కఠినంగా నియమాలు పెడితే ఎవరు పాటిస్తారు?అయినా ఇన్నాళ్ళూ మా యాసని గేలి చేశారు అని అన్న తెలంగాణ వాళ్ళు ఇప్పుడు ఆంధ్ర ప్రాంతపు యాసని తప్పుడు ప్రయోగాలు అనడమేంటి?

    ఎవరికి వాళ్ళ ప్రాంతం యాసని అందరి మీదా రుద్దాలనే దురద ఉన్నట్టు?!

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...