Thursday, 11 February 2016

ఏది ప్రణయ మేది ప్రళయం - ఏది సాధుజీవనవైభవం?

ప్రణయం అంటే మనసుల్ని కలిపేది - హాయి నిస్తుంది,అవునా?
ప్రళయం అంటే తనువుల్ని నలిపేది - చావు తెస్తుంది,అవునా?

ఒకరికి ఒకరై ఒద్దికగా కలిసుంటేనే అది దాంపత్యం,అవునా?
ఎవరికి వారై దారులు వేరైతే బలవంతపు తద్దినం,అవునా?

"జనం కోరింది మనం శాయడమా?మనం చేసింది జనం చూడడమా?" అని పింగళి డింగరి శిస్యుణ్ణి అడిగాడు!
"కోరికల వెంట అడ్డదిడ్డాన పరిగెత్తడమా?కోర్కెలకి కళ్ళెమేసి రహదారిన పోవడమా?"  -  చిచ్చరపిడుగు ప్రశ్న?

శృంగారం రుచిచూపించి బాలచంద్రుణ్ణి తన కడకొంగున కట్టెయ్యడమా?
రసభంగం చేసి తన పతిదేవుణ్ణి హంవీర చూడామణిగా నిలబెట్టడమా?
మగువ మాంచాలకి కలిగిన సందేహానికి కన్నతల్లి చెప్పిన ధర్మసూక్ష్మం -
ఒకటి నీ సౌభాగ్యాన్ని నిలబెడుతుంది, ఒకటి నీ భర్త శౌర్యాన్ని నిలబెడుతుంది,
అయితే ఇట్లాంటివి పరులు నీమీద రుద్దరానివి గనక నీకు నువ్వే తేల్చుకో అని!
మాంచాల రెండవది కోరుకున్నది గనకనే దంపతు లిద్దరూ ధన్యజీవు లయ్యారు,లేకుంటే?!

భర్త సానిని మరిగాడని తనూ తప్పుదారిన నడిస్తే మాంచాలని ఇప్పుడెవరు తలిచేవారు?
మాల కొంపల్లోనూ మహా పతివ్రత లుంటారు రాచ కుటుంబాల్లోనూ రంకులాడు లుంటారు!
సతీత్వం పుట్టుకతో రాదు - ఋణమూలం,నదిమూలం,స్త్రీమూలం ఎప్పుడూ అడగకూడదు.

మనసునూ తనువునూ కలిపి మగనికి అంకితమిచ్చిన మగువ పతివ్రత గాని
మనసును చంపి తనువును పదిమందికి పంచిన మగపోడుముల పడతి కాదు.

మనసు నొకనారికే అంకితమిచ్చి ఆలిని రాణిని చేసినవాడల్లా రాముడు గాని
కులకాంతను కాలదన్ని సానుల కోసం పోయేవాడు అసలు పురుషుడే కాడు.

స్వాధీన మనస్కులు కానివారు కోరికల పద్మవ్యూహంలోకి దూకి క్షేమంగా బయటపడే దెట్లాగ?
హరోంహర యని నైతికపతనపు అగ్గిలో దూకినాక చివరకు మిగిలేది గాలికెగిరే బూదియే కదా!

వస్తువాహనాల్లో వైభవాల్ని లెక్కిస్తే అవి పగిలిపోయినప్పుదు దుఃఖం కలుగుతుంది.
మనుషుల్ని దబ్బుని బట్టికాక దమ్ముని బట్టి తూచినప్పుడు దుఃఖం తొలగుతుంది.
మనసున పుండై పరులకు పండై జలపాతంలా కాక సెలయేరులా బతికేది సాధుజీవనవైభవం!

9 comments:

  1. ఏందన్నా! ఉన్నట్టుండి తవిక ఇసిరినావు. మైండ్ బ్లాకయిందన్నట్టు.

    ReplyDelete
    Replies
    1. Katherine Frank పుణ్యమాని ప్రణయవైరాగ్యం పట్టుకుంది?!

      Delete
  2. "కోరికల వెంట అడ్డదిడ్డాన పరిగెత్తడమా?కోర్కెలకి కళ్ళెమేసి రహదారిన పోవడమా?" - చిచ్చరపిడుగు ప్రశ్న?

    జ : కోరికల వెంట రహదారిన పోవడమే !

    సతీత్వం పుట్టుకతో రాదు - ఋణమూలం,నదిమూలం,స్త్రీమూలం ఎప్పుడూ అడగకూడదు.
    ఎందుకని ? వివరించగలరా ?

    మనసున పుండై......ఈ పదం అంతగా నచ్చలేదు మనుసున మెండై అని అంటే ఎలా ఉంటుంది ?
    పండు పుండు రైమింగ్ కోసం పెట్టారు కానీ అతకలేదు.

    Katherine Frank పుణ్యమాని ప్రణయవైరాగ్యం పట్టుకుంది?!

    ఈవిడ వ్రాసిన ఇందిర పుస్తకం చదవలేదు గానీ ఆ పుస్తకం గురించి కొంత పరిచయం చదివాను.నాకు నచ్చలేదు కాబట్టి పుస్తకం చదవక్కరలేదు గానీ ఈవిడ గురించి ఇంకేదైనా తెలుసుకోవలసింది (శ్రంగార రచయిత్రి???) గట్రా నేనేమైనా మిస్సయ్యానా ? కొద్దిగా తెలుసుకోవాలని అడుగుతున్నాను.ఇష్టం లేకుంటే వదిలెయ్యండి !

    ReplyDelete
    Replies
    1. neehaaarika
      మనసున పుండై......ఈ పదం అంతగా నచ్చలేదు మనుసున మెండై అని అంటే ఎలా ఉంటుంది ?
      పండు పుండు రైమింగ్ కోసం పెట్టారు కానీ అతకలేదు.
      haribabu
      కవిత్వం అంటే కొంత లయ అవసరమే గానీ రైం కోసం పెట్టింది కాదు,అసలు అర్ధం లేని పదం కాదు.ధర్మానికి కట్టుబడేవాళ్ళు పూర్తిగా విరాగులు కానక్కర లేదు.విరాగులు సమాజంలో ఉందరు!సమాజంలో ఉంటూ కోరికలు మోహాన్ని పుట్టిస్తున్నా వాటిని కట్టేసుకోగలిగినవారే జనానికి ఉపయోగపడగలరు!అందులో బాధ ఉంటుంది,కోరికల వెంట పరిగెడితే ఆ కోరికలు ఇతర్లని దోచుకున్నా తప్పులేదని రెచ్చగొడతాయి.కోర్రికల్ని అణుచుకోవడంలో బాధ ఉండదా!బాధని భరించే మనసులో సలుపుతున్న పుండు ఉన్నట్టు కాదా?ఆ బాధని భరిస్తేనే సజ్జనులు అవుతారు - ఇతర్లకి మంచి చేస్తారు - అదీ దాని అర్ధం!

      Delete
  3. అందరు వల్లించేదిదె ,
    ఎందరు పాటించిరన్నదే ప్రశ్న? సరే!
    కొందరి నాదర్శముగా
    ఎందరు గైకొనిరి ? మంది కేదిష్టమ్మో?

    ReplyDelete
    Replies

    1. లక్కాకుల వారు :)

      మీకు పదాల పొందిక అట్లా ఎట్లా వస్తుందో అని నాకు ఎల్లప్పుడూ హాశ్చర్యమే !

      మామూలు గా కనిపించే వాక్యాలనే కందం గా అందం గా రాయగలగడం వాహ్ రియల్లీ సూపెర్బ్ :)

      చీర్స్
      జిలేబి

      Delete
    2. మీ పద్యాలు జనాల పల్కుబడితో , మింపైన గ్రామ్యాలతో
      దీపించున్ , మరి సాంప్రదాయ ఘన గ్రాంధీకాలు మాబ్లాగు లీ
      పాపంబించుక కూడ మోయవని సంభావించినా రార్యు లి
      ట్లోపంగల్గిన వారు మీరొకరె , మేలొక్కింత సంతోషముల్ .

      Delete

  4. హరిబాబు గారు :)

    రూటే మార్చేసారు :)

    యేవి నిరుడు కురిసిన "కిక్" టపాలు :)

    జేకే !

    బాగుంది మీ డబల్ లైనెర్స్ :)

    చీర్స్
    జిలేబి

    ReplyDelete
    Replies
    1. thanks

      మరీ ఎప్పుడూ ఒక్కలాగే రాసతే ఎట్టా,ఎరైటీ గావాల!
      కలాపోసనల ఎరైటీ ఉండాల,ఒకే తీర్న రాస్తె మడిసికీ గొడ్డుకీ తేడా ఏటుంటాది:-)

      Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

"వేదాలు చదివిన వారు యజ్ఞయాగాదు లందు పశువులను వధిస్తారు" - ఇది నిజమా?

hari.S.babu: గురువు గారూ ! మహాభారతంలో ధర్మవ్యాధుని కధ వస్తుంది కదా . అక్కడ ధర్మవ్యాధుడు కౌశికుడికి ధర్మబోధ చేస్తూ ఒకచోట ," ...