Monday, 29 February 2016

రిజర్వేషన్లు ఎవడు గట్టిగా అడిగితే వాడికల్లా ఇచ్చెయ్యటమేనా?కులాన్ని వెనకబడ్డదిగా గుర్తించండని పోట్లాడే బదులు ముందుకెళ్ళటానికి పోట్లాడొచ్చుగా!

          ఒకప్పుడు వీరశైవం ఉదృతంగా ఉన్నకాలంలో గ్రామాలలో ఒక తంతు నడిచేది.వీరశైవంలో అతి ముఖ్యమైనది లింగధారణ చేసిన ప్రతివాడూ శివరూపమే అన్న సూత్రీకరణ,ఇది మొదట్లో ఆ శైవమతం వరకు అందరూ సమానం అనుకోవడానికి పెట్టిన నియమం, మంచిదే పాపం!ఇక జంగమదేవరల్ని అపర మాహేశ్వరులు అని పిలిచేవాళ్ళు. వీళ్ళు భిక్షాటన కోసం గుంపులు గుంపులుగా వూళ్ళమీద పడేవాళ్ళు.మళ్ళీ వూళ్ళలోకి వెళ్ళాక వీధుల్ని కూడా వాళ్ళలో వాళ్ళు తీరుగా పంచుకునేవాళ్ళు.ఖర్మకాలి ఎవరైనా గృహస్థు వీళ్ళకి భిక్ష వెయ్యకపోయినా, లేక ఆలశ్యం చేసినా విపరీతంగా రెచ్చిపోయేవాళ్ళు.ఇంట్లో చొరబడి నానా భీబత్సం చేసేవాళ్ళు, అది చాలదనుకుంటే శంఖధ్వానం - వూళ్ళో ఉన్న అందరు జంగమదేవరలకీ ఆహ్వానం అన్నమాట!ఇంక చూసుకోండి,ఇవ్వాళ్టి మాఫియాలూ ఆకు రౌడీలూ కూడా చెయ్యనంత అల్లరి చేసేవాళ్ళు.వీరముష్టి అనే మాట కూడా వీళ్ళని చూసే పుట్టించారు."సాగినంత కాలం నా అంతవాడు లేడందురు, సాగకపోతే చతికిలబడుదురు" అన్న సుకవివాక్యం ప్రకారం మొదట్లో హవాహవాయి అన్నట్టు నడిచిన యవ్వారమే తర్వాత మొత్తం శైవమే వెనక్కి జరిగి వైష్ణవం ముందుకు రావడానికి కారణమైంది.

          ఇవ్వాళ రిజర్వేషన్ల కోటాలో వాటా కోసం జరుగుతున్న రగడలు చూస్తుంటే నాకు మళ్ళీ అదే వాతావరణం కనిపించి మళ్ళీ అదే పద్ధతిలో మొత్తం రిజర్వేషన్ల తంతు కూడా వీరశైవం మాదిరే అదృశ్యమైపోతుంది కాబోలు ననిపిస్తున్నది!నిన్నటి రోజున ఆంధ్రాలో కాపుల్ని బీసీల లిస్టులోకి ఎక్కించాలని రైలుబోగీలు తగలబెట్టి హింసాకాండ సృష్టించారు.అయిదు రోజులకి ముఖ్యమంత్రి హడావిడి ప్రకటన చెయ్యగానే ఆగిపోయింది.ఆపకపోతే వీళ్ళకిస్తే తమ వాటా తగ్గుతుందని బీసీల సంఘంవాళ్ళు ఆందోళన చెయ్యటానికి రెడీగా ఉన్నారు.ఇప్పుడు జాట్ కులస్థులు మొదలుపెట్టారు.ఎందుకొచ్చిన గోల అనుకుంటున్నారో ఏమో వీళ్ళకీ వాగుదానమో చెరువుదానమో చేసి చల్లబరుస్తారు లెండి!వీళ్ళు చల్లబడ్డాక ఇంకో కులంవాళ్ళు మొదలుపెడతారు - హనుమంతుడి తోకలాగ!రామాయణంలో కధాగమనానికి ఏ ప్రాధాన్యతా లేని ఒక విచిత్రమైన సన్నివేశం ఉంటుంది.ఒక వ్యక్తి స్వర్గారోహణ చేశాక కూడా అప్పుడప్పుడూ భూమి మీదకి వచ్చి తన శరీరాన్ని తనే తినివెళుతూ ఉండే  దివ్యపురుషుడి కధ ఒకటి ఉంది.అప్పుడది నాకు ఎందుకు రాశాడో,దాని ప్రయోజనమేమిటో అర్ధం కాని మిస్టరీ అనిపించింది గానీ ఇప్పుడు కొందరు రాజకీయనాయకులు అడుగంటిపోయిన పాప్యులారిటీని పెంచుకోవటానికి పరిష్కారం లేని/కుదరని సమస్యల్ని జనం మీదకి వదులుతూ కీర్తిభోజనుల మాదిరి బతకడం చూస్తుంటే వాల్మీకి అతని కాలంలోనూ ఇలాంటివాళ్లని చూసి మార్మిక రూపంలో అలా చెప్పిఉంటాడు అనిపిస్తున్నది!

అసలు రిజర్వేషన్లు ఎందుకు ప్రతిపాదించారు?


          అంబేద్కర్ గారు 1956 నాటికే తన సాటి దళిత మేధావుల గురించి పూర్తి నిరాశా నిస్పృహలకి లోనయ్యాడని మీకు తెలుసా?"on 18 March 1956 at Ramlila Ground, Agra he said with a heavy heart that, “The educated people have betrayed me. I was thinking that after education they will serve their society. But I find that a crowd of clerks had gathered around me, who are engaged in filling their belly”. This heart burning is a proof that educated and intellectual class is alienated from the society and is going away from its brotherhood."స్వాతంత్ర్యం వచ్చిన పదేళ్ళ లోపే,అంటే తను ఈ దేశపు విద్యావంతుల విచక్షణా జ్ఞానం మీదా సామాజిక బాధ్యత మీదా ఎన్నో ఆశలు పెట్టుకుని సంతో తెలివిగా పెట్టిన రిజర్వేషన్ల వ్యవస్థ గురించి అంత తొందరగా అంత నిస్పృహకి ఎందుకు గురయ్యాడు?ఎందుకంటే,గాంధీ యొక్క అహింసాయుత పోరాటం అనే వింత సిద్ధాంతం అతడికి తప్ప ఇంకెవరికీ అర్ధం కానట్టు అంబేద్కర్ రిజర్వేషన్ల విధానం ఎందుకు ప్రతిపాదించాడో అటు ప్రభుత్వంలో ఉండి అమలు చెయ్యాల్సిన పెద్దమనుషులకీ ఇటు దాని ఫలితాన్ని అందుకోవలసిన దళిత విద్యావంతులకీ అసలేమాత్రం అర్ధం కాలేదు!

          నిజానికి ఈ ప్రత్యేక రక్షణ(reservation) అనేది ఎవరికీ కవచాలు తొడిగి రక్షించటానికి ఉద్దేశించినది కాదు.అసలు దీని యొక్క ప్రాధమిక లక్ష్యానికి తగిన పదం ప్రత్యేక ప్రాతినిధ్యం!ఇప్పుడు ఎవరైతే ఈ రిజర్వేషన్ సౌకర్యాన్ని కోరుకుంటున్నారో వారు దాని అర్ధాన్నీ పరమార్ధాన్నీ తప్పనిసరిగా తెలుసుకోవాలి.దానికి పరిమితులు కూడా ఉన్నాయనేది గ్రహించాలి.అది ప్లాసిబో లాంటి సర్వరోగనివారిణి ఎన్నటికీ కాదు.అది ఒక వ్యక్తికి కొంత సౌకర్యం ఇస్తున్నా ఆ ఇవ్వడం అతనికి వ్యక్తిగతంగా ఇవ్వడం లేదు,కులపరంగా ఒక వ్యక్తికి మనం ఉద్యోగంలో గానీ శాసనసభ్యత్వంలో గానీ రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పిస్తున్నామంటే ఆ వ్యక్తి తను నిలబడిన సమూహంలో తన కులానికి ఒక గొంతునీ,గుర్తింపునీ సాధించి ఆ కులానికి ప్రతినిధిగా నిలబడే అవకాశం కల్పిస్తున్నాము అని అర్ధం!కానీ ఈ దేశపు దళిత విద్యావంతులు ఆ గురుతరమైన బాధ్యతని నిర్వర్తించటంలో దారుణంగా విఫలమయ్యారు - అదే అంబేద్కర్ బాధకి కారణం!

          మొదటిసారి రిజర్వేషన్ వల్ల లాభం పొందినవాళ్ళు ఆ ప్రాతినిధ్యాన్ని ఇంకా పెంచటానికి,అంటే ఏ వెనుకబాటుతనాన్ని గుర్తించి తనకి అవకాశం కల్పించబడిందో అలాంటి మరిన్ని అవకాశాలను తన కులంలోని మిగిలిన వారికి కూడా దక్కే విధంగా కృషి చెయ్యాలి.కానీ వాస్తవంలో ఏమి చేశారు.తమకి ఉద్యోగం రాగానే తను ఎంత తొందరగా ప్రమోషన్ ఎట్లా కొట్టెయ్యాలి, ఎంత తొందరగా బంగ్లా,కారు,హోదా తెచ్చుకోవాలి అనే రంధిలో పడిపోయారు.అంబేద్కర్ వీళ్ళని చూసి బాధపడిన అప్పటికీ రిజర్వేషన్ ఫలాల్ని అనుభవిస్తూ డెబ్భయ్యేళ్ళు గదిచిన ఇప్పటికీ అదే పరిస్థితి.ఇవ్వాళ ఏ కులపరమయిన వెనుకబాటుతనం వల్ల తాము కొత్తగా సౌకర్యం పొందారో ఆ బుద్ధిమంతులకి తమ కులంలోని మిగిలిన వ్యక్తుల పట్ల సానుభూతి లేదు గానీ నిన్నెప్పుడో అగరకులాల వాళ్ళు మమ్మల్ని అణగదొక్కేశారు మొన్నెప్పుడో బ్రాహ్మణులు మమ్మల్ని చదువుకోనివ్వలేదు అని సొల్లుకబుర్లు చెప్పే డొల్లతనం పెరిగింది!కార్య కారణ సంబంధాన్ని బట్టి రాగద్వేషాల కతీతంగా చెప్పవలసి వస్తే రిజర్వేషన్ వ్యవస్థ అంబేద్కర్ తన అసంతృప్తిని వ్యక్తం చేసినప్పుడే విఫలమైపోయింది.

కమ్యూనల్ అవార్డు నుంచి రిజర్వేషన్ల వరకు!


          1933 ఆగస్టులో బ్రిటిష్ ప్రధాని రామ్సే మెక్డోనాల్డ్ భారతదేశపు పరిపాలనా వ్యవస్థకు సంబంధించిన కమ్యూనల్ అవార్డ్ చట్టానికి రూపకల్పన చేశాడు.ఇందులోని అతి ముఖ్యమైన అంశం ముస్లిములు,శిఖ్ఖులు,భారతీయ క్రైస్తవులు,ఆంగ్లో ఇండియన్లు,యూరోపియన్లు దళితులు - భిన్నవర్గాలకు ప్రత్యేక నియోజకవర్గాల ద్వారా ఎన్నికలు జరిపించటం.అంటే ఒక ప్రాంతంలో ఆయా వర్గాల జనసాంద్రతని బట్టి ఆయా ప్రాంతాలను ఆయా వర్గాలకు కేటాయిస్తారు.అన్ని పార్టీల వారూ ఆయా వర్గాలకి చెందిన వారినే అబ్యర్ధులుగా నిలబెడితే ఆయా వర్ణాల వారు మాత్రమే వోటు చేయాలి.ఈ అవార్డు భారతదేశపు నాయకుల మధ్యన వివాదాస్పదమైంది.అంబేద్కర్ ఎంతో ఉత్సాహంగా సమర్ధించినా మోహనదాసు ముస్లిముల విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చెయ్యలేదు గానీ దళితుల్ని మాత్రం హిందువుల నుంచి వేరు చెయ్యటానికి వీల్లేదని పట్టుబట్టి నిరశన దీక్షకి తెగబడ్డాడు.ఎన్నో వాదోపవాదాల తర్వాత అంబేద్కర్ తనకి లోలోపల ఇష్టం లేకపోయినా గాంధీ వైపునుంచి వచ్చిన దళితుల్ని హిందువులలోనే ఉంచి వారికి కొన్ని సీట్లు దఖలు పరచటం అనే ప్లానుకి ఒప్పుకోవలసి వచ్చింది.దీనినే పూనా ఒప్పందం అంటారు.ఇదే స్వాతంత్ర్యాననతరం మరికొన్ని మార్పులు చేర్పులతో మరింత విస్తృతమై ఇప్పటి మోడల్ అయిన రిజర్వేషన్ వ్యవస్థ రూపు దిద్దుకున్నది.

          కులప్రాతిపదికన రిజర్వేషన్లు ఎందుకు ప్రతిపాదించారో తెలియాలంటే ముందు కులం అంటే ఏమిటో తెలియాలి.మిగతా దేశాల్లో ఎక్కడా ఇంత స్పష్టమైన కులవిభజన లేదు - కొంతమేర పోలికలు కనబడటమే తప్ప.అందువల్లనే ఈ కులవ్యవస్థ ఇక్కడ వివాదం కూడా అయ్యింది.కొందరు దీనిని హిందూధర్మంలో చెప్పబడిన చాతుర్వర్ణం లాంటివాటితో కలిపి బ్రాహ్మణులు చేసిన కుట్ర అంటున్నారు.ఈ హిందూమతంలో బ్రాహ్మణుల కున్న గౌరవాన్ని బట్టి మతానికి సంబంధించిన అన్ని కార్యకలాపాల్లో వారికున్న ప్రాధాన్యతని బట్టి దీనికి "బ్రాహ్మణ మతం" అని పేరు కూడా పెట్టేశారు.కానీ చారిత్రక పరిశోధకులు ఎవరూ వీరు చెప్తున్న బ్రాహ్మణాధిక్యతకి సంబంధించిన పూర్తి ఆధారాల్ని చూపించలేకపోయారు.ప్రపంచంలో ఎక్కడ సంపద పుట్టినా అది భూమినుంచే వస్తుంది.అన్ని కాలాలలోనూ అన్ని అదెశాలలోనూ సంపద భూమినుంచి పుట్టిన వస్తువులను విపణి(మార్కెట్) దగ్గిర అమ్మడం వల్ల పుడుతుంది.

          ప్రపంచంలోని అతి ప్రాచీనమైన మానవ సమూహం అయి ఉండటం వల్ల ఈ సంపదని సృష్టించడం కూడా చాలా ముందుగానే మొదలుపెట్టారు.మొహెంజెదారో కాలం నాటికే ఇక్కడ గొప్ప ప్రణాళికాబద్ధమైన నగర నిర్మాణం జరిగింది.అప్పటికే దూరప్రాంతాలతో వాణిజ్యం ద్వారా విదెశీ మారక ద్రవ్యపు నిల్వల్ని సాధించారు.దానికి సాక్ష్యం ఆ కాలంలోని ఇతర ప్రాంతాల ప్రజలు వాడే నాణెములు,వస్తువులు అక్కడ దొరకటం.వ్యవసాయం కన్నా వీరు వ్యాపారం మీదనే ఎక్కువ ఆధారపడినారని తెలుస్తుంది.అయితే, వీరు చేసిన వ్యాపారానికి మూలమైనవి ఏమిటో తెలుసా - బొమ్మలు!అప్పటి కాలానికి అద్భుతం అనిపించేటంతటి నాణ్యమైన పనితనంతో హస్తకళాకృతులు తయారుచేసి అమ్మేవారు.ఇప్పుడు త్రవ్వకాలలో బయటపడిన వాటి నునుపుదనం చూసి వాటిని పరిశోధిస్తున్న నవీన కాలపు శాస్త్రవేత్తకి కళ్ళు తిరిగినంత పనయ్యింది, నిజంగానే!"కార్బన్ డేటింగ్ మెధడ్ ద్వారా టి కాలం తెలిసింది గాబట్టి నమ్ముతున్నాను గానీ లేకుంటే నమ్మలేను,ఎందుకంటే మా దేశంలో 18వ శతాబ్దిలో తయారయిన వాటిలో కూడా ఇంత నునుపుదనం చూడలేదు" అన్నాడు.ఇప్పుడు మనం ఆధునిక కాలంలో తెలుగునేలపై కనబడుతున్న హస్తకళానిపుణులకు వీరు ఆద్యులు.ఒక కళలో అంతగా ఆరితేరడానికి ఒక వ్యక్తి జీవితకాలం సరిపోదు.కొత్తది కనిపెట్టడం,శిష్యులకి నేర్పడం,గురువు నుంచి నేర్చుకోవడం,కొత్తది చేర్చడం అనే నిరంతర ప్రక్రియ ద్వారానే అది సాధ్యమవుతుంది.అందుకోసం దానిపట్ల ఆసక్తి ఉన్నవారందరూ వీలయినంత ఎక్కువకాలం ఒకచోట గడపాలి.కొన్ని తరాల పాటు జరిగిన అలాంటి సహజీవన పరంపర నుండి కులాలు స్థిరపడినాయి.ఇవ్వాళ తెలుగునాట మనం చూస్తున్న ప్రతి కులమూ ఒక వృత్తికి అనుసంధానించబడి ఉండటం ఆ వృత్తికి కావలసిన నైపుణ్యాన్ని మెరుగుపరచుకోవటానికీ,ఆ వృత్తి మీద వచ్చే ఆదాయం మీద పట్టు సాధించడం కోసమే ఏర్పడింది.వ్యవసాయం కూడా లాభసాటి అయ్యాక వ్యవసాయానికి అనుబంధంగ ఉండే వృత్తులకి సంబంధించిన కులాలు వ్యవసాయదారులకి తమ నైపుణ్యాన్ని వస్తుసేఅవల రూపంలో ఇస్తూ పరస్పరాశ్రితులుగా ఉందే స్వయంపూర్ణ గ్రామ వ్యవస్థ ఒకటి ఉద్భవించింది.ఈ అన్ని సామాజిక దశలలోనూ ఇక్కడ పెరిగిన సంపద విదేశీయులకి ఈర్ష్య కలిగించిందంటేనే ఆ వ్యవస్థ ఎంత విజయవంతంగా నడిచిందో అర్ధమవుతుంది. ఎన్నిసార్లు ఎంతమంది దోచుకుపోయినా మళ్ళీ పుడుతూ ఉందేది అక్షయపాత్ర లాగ!

          ఆ అక్షయపాత్ర భిక్షాపాత్ర అయింది ఇంగ్లీషువాళ్ళ క్రూరమైన పరిపాలన వల్లనే!బాబరు నుంచి ఔరంగజేబు వరకు ఉన్న మొఘల్ ప్రభువులూ,నాదిర్ షా వంటి ఇతరులూ కూడా సంపదని తమ మూలస్థానాలకి తరలించుకుపోకుండా ఇక్కడే రాజ్యం చెయ్యాలనుకున్నారు గాబట్టి మౌలికమైన ఆర్ధిక చట్రాన్ని వారెన్నడూ ధ్వంసం చెయ్యటానికి ప్రయత్నించ లేదు.ఇవ్వాళ గోమాంసం తినటం హిందూమతోన్మాదులను వ్యతిరేకించటం కాబట్టి చేసి తీరతాం అంటున్నవాళ్ళకి ఔరంగజేబు కూడా గోవధ నిషేధ చట్టాలు చేశాడనేది తెలుసా!తన రాజ్యంలో పక్క రాజ్యం కన్నా ఎక్కువ సంపద పోగవ్వాలని కోరుకుంటాడే తప్ప ఏ ప్రభువూ సంపద పెంచే అవకాశాల్ని ధ్వంసం చెయ్యడు.ఇంగ్లీషు వాళ్ళకి ఈ దేశప్రజల పట్ల బాధ్యతా లేదు, ఈ దేశం నష్టపోతే ఏమి చెయ్యాలన్న బాధ కూడా లేదు - జండా ఎత్తేసి మరో చోట పాతుతాడు!

        స్వాతంత్ర్యం వచ్చేనాటికి ఇంగ్లీషువాళ్ళ అడ్డగోలు పరిపాలన వల్ల మొత్తం భారదదేశమంతా వట్టిపోయిన గొడ్డులా తయారయింది.అలాంటి స్థితిలో హఠాత్తుగా స్వేచ్చావాయువులు పీల్చుకున్నప్పుడు ప్రతివాడూ తను బాగుపడటం గురించే ఆలోచిస్తే అప్పటికే ముందున్నవాళ్ళు ఇంకా ముందుకెళ్ళి అప్పటికి వెనకబడి ఉన్నవాళ్ళు ఇంకా వెనక్కి వెళతారు.ఆ సమయంలో రిజర్వేషన్లు పెట్టకుండా సర్వసమాంత్వం ఆశిస్తే సాయుధ పోరాటం ద్వారా వచ్చే విప్లవమే శరణ్యం!ఆ భీబత్సాన్ని నివారించడం కోసమే ఆనాడు అంబేద్కర్ లాంటి దేశభక్తులు రిజర్వేషన్ల వ్యవస్థని ప్రతిపాదించారు. అప్పటికే రిజర్వేషన్లని బలంగా వ్యతిరేకిస్తున్న ప్రతివాదుల నుంచి వస్తున్న ఎన్నో అభ్యంతరాల్ని పూర్వపక్షం చేసి మొండిగా నిలబడటం వల్లనే ఆనాడు రిజర్వేషన్ల వ్యవస్థ అమలులోకి వచ్చింది.అంబేద్కర్ దార్శనికతలో దోషం లేదు,కాకపోతే ఆయన సాటి దళిత మేధావుల యొక్క సమర్ధత గురించి ఎక్కువగా వూహించుకున్నాడు - అమాయకుడు!

అసలు ఎవరు ఎప్పుడు ఖచ్చితంగా రిజర్వేషన్లని ప్రారంబించారు?


         క్రీ.శ 1882లో హంటర్ కమిషన్ మొదటిసారి ఈ కోణంలో తన పనిని మొదలుపెట్టింది.అప్పట్లోనే జ్యోతిబా పూలే ఉచిత విద్య కోసం,ప్రభుత్వ ఉద్యోగాలలో కనీస ప్రాతినిధ్యం కోసం కృషి చేస్తున్నాడు.క్రీ.శ 1901లో కొల్హాపురి సంస్థాన ప్రభువైన చత్రపతి షాహుజీ మహరాజ్ తన రాజ్యంలో బ్రాహ్మణేతరులకి,వెనుకబడిన తరగతులకి రిజర్వేషన్లని ప్రారంభించాడు.ఈ మంచి మహారాజు ఉచితవిద్యని కులమతాల కతీతంగా అందరికీ అందించే ఉద్దేశంతో విద్యార్ధుల సౌకర్యం కోసమని వసతిగృహాలు కూడా తనే నిర్మించి అన్ని విధాల లోపరహితమైన విద్యావ్యవస్థని తీర్చిదిద్దినట్టు తెలుస్తుంది.విద్య ముగిసిన తర్వాత ఉద్యోగలభ్యత విషయంలో కూడా శ్రద్ధ చూపించినట్టు తెలుస్తున్నది.ఇతను 1902లో అంటరానితనం లేని,కులభేదాలు లేని భారతదేశం గురించి ప్రతిపాదిస్తూ ఒక ప్రసంగం చేశాడు.అధికారికంగా ప్రభుత్వాల తరపు నుంచి రిజర్వేషన్లని ప్రతిపాదిస్తూ వచ్చిన మొదటి ప్రకటన ఇదే.

          భారతదేశంలొని అత్యంత దారుణమైన దురాచారం అంటరాని తనం.దీని ప్రారంభం ఎప్పుడో తెలియదు గానీ ఆనాటి నుంచీ ఈనాటి వరకూ ఎందరో మహానుభావులు ఎంత పోరాడినా ఇంకా వదలకుండా ఒక సమూహం మొత్తాన్ని కేవలం ఆ కులంలో పుట్టినందుకు ఇతర్లు ముట్టుకోవడానికే కూడా ఇబ్బంది పడే భయానకమైన పరిస్థితి కొనసాగుతున్నది.అలాంటి మానసికపరమయిన చొరవలేమిని తొలగించటానికి ప్రతిపాదించిన రిజర్వేషన్ల కోటాలో వాటా కోసం ఆ పరిస్థితి లేని కులాలు కూడా పోటీ పడటం దేనికి?ఇవ్వాళ రిజర్వేషన్ల కోటాలో వాటా పొందటం అనేది బలప్రదర్శన తంతు కింద తయారయిందే తప్ప నిజంగా రిజర్వేషన్ల కోటాలో వాటా వచ్చెయ్యగానే తమకి గట్ట్ మేలు జరుగుతుందనే గ్యారెంటీ ఉండి కాదు!

రిజర్వేషన్లలో ఆర్ధిక ప్రాతిపదిక ఎంతవరకు సబబు?


          పొరపాట్న కూడా రిజర్వేషన్లలో ఆర్ధికపరమైన వెసులుబాటును కల్పించడం గురించి గానీ  ఆర్ధిక స్థితిగతుల్ని బట్టి రిజర్వేషన్లని వర్తింపజెయ్యటం గురించి గానీ ఆలోచించకూడదు.ఎందుకంటే, మొదటి నంచి చెప్తున్నట్టు ఇది ఆర్ధిక స్వావలంబన కోసం ఉద్దేశించిన పధకం కాదు.ఈ మొత్తం రిజర్వేషన్ల వ్యవస్థని అంత గొప్ప దార్సనికత కలిగి ఉండి రూపుదిద్దిన అంబేద్కర్ దీనిని ఎందుకు వదిలేస్తాడు?

          ఒక కమ్మ కులానికి చెందిన వ్యక్తి బీదవాడైనా అతనిలో పుట్టుకకి సంబంధించిన ఆత్మన్యూనత ఉండదు.అట్లాగే మాదిగ కులానికి చెందిన వ్యక్తి అయితే ధనవంతుడైనా పుట్టుకకి సంబంధించిన నిరాదరణని ఎదుర్కొనే పరిస్థితి ఉంది గాబట్టి దానిని గుర్తించి ఆ కులానికి రిజర్వేషన్లు అనే వ్యవస్థని ప్రతిపాదించారు.ఒక వ్యజ్తిని గానీ సమూహాన్ని గానీ ఆర్ధిక స్వావలంబన వైపుకి నడిపించటానికి ఇతర మార్గాలు చాలా ఉన్నాయి - ఒక రకంగా ప్రభుత్వం తప్పనిసరిగా ప్రతి పౌరుడికీ చెయ్యాల్సిన సేవ అది!దానికోసం రిజర్వేషన్లని ఊపయోగించడం కంటే రిజర్వేషన్లని ఎత్తెయ్యడమే మంచిది.

రిజర్వేషన్లు కులాల కుమ్ములాటలను పెంచుతున్నాయనేది నిజమేనా?


          రిజర్వేషన్లని ప్రవేశపెట్టింది కులాల మధ్యన అంతరాల్ని తగ్గించడానికే!రిజర్వేషన్ల గురించి ఈ పాయింటు లాగి రిజర్వేషన్లని డుల్ల్లించటానికి చూసేది ఇప్పటికే ముందుకు పడిపోయిన వారు.ఆ కోటా లేకపోతే తమ కులం వాళ్ళతో సమస్తాన్ని నింపేసి మందబలాన్ని పెంచుకోవాలనుకునేవాళ్ళు.రిజర్వేషన్ల వల్ల ప్రతిభకి అన్యాయం జరుగుతుందనేది మరొక ఆరోపణ.ఇది కూడా దుర్మార్గమైన మాటే.ఎక్కడ రిజర్వేషన్లను ప్రతిపాదించినా మొదట ఆ వ్యక్తి ఆ ఉద్యోగానికి అర్హుడా కాదా అనేది చూస్తారు.బాగా డబ్బులున్న పైకులంవాడు 90% సాధించితే అదంతా అతని స్వయంప్రతిభయేననీ చూచిరాతలు రాసి ప్యాసవలేదనీ గ్యారెంటీ ఉందా?కాపీలు కొట్టటమే కాదు, ట్యూషన్లు పెట్టించుకునే వెసులుబాటును ఉపయోగించుకోవటం ద్వారా కూడా ఎక్కువ మార్కులు సాధించవచ్చును.కానీ సామాజికంగా ఆర్ధికంగా వెనుకబడిన వ్యక్తి 80% సాధించినా దానికి విలువ ఇవ్వకపోవడం అన్యాయమే కదా!

          అయితే పైన చెప్పుకున్నట్టు రిజర్వేషన్లు పొందినవారు వెనక్కి తిరిగి తన కులం గురించి ఆలోచించకుండా అప్పటికే ముందుకు పడ్డవారితో సమస్థాయిని ఆస్వాదిస్తూ కుక్షింభరులుగా మాత్రమే మిగిలిపోతున్నందువల్ల ఈ వాదనకి బలం వచ్చింది.ఇవ్వాళ మాలమహానాడు,మాదిగ దండోరా చేస్తున్నదేమిటి?రిజర్వేఅషన్ల కోటాలో వాటా తగ్గకుండా చూడ్డమో ఇంకా పెంచడమో తప్ప వారి వర్గానికి నిర్మాణాత్మకంగా చేస్తున్నది ఏమీ లేదు!ఆ సంస్థ లోని పైస్థాయిలోని వారు మాత్రం రాజకీయ ప్రాభవాన్నీ ఆర్ధిక స్వావలంబననీ పొందుతున్నారు.

         ఈ రిజర్వేషన్లు అనేవి వ్యక్తులు కేవలం ఆర్ధికంగా పైమెట్టుకు చేరటానికి ఉపయోగపడే నిచ్చెనమెట్లు కావని అర్ధమయితేనే అంబేద్కర్ ఎందుకంత బాధపడ్డాడో తెలుస్తుంది. అంబేద్కర్ బాధపడిన విధంగా కాకుండా దళిత విద్యాధికులు మరికొంత బాధ్యతా యుతంగా ప్రవర్తించి ఉంటే ఈపాటికే అంతరాల నిర్మూలన పూర్తయి అందరి అంగీకారంతో రిజర్వేషన్ల వ్యవస్థని రద్దు చెయ్యటం కూడా జరిగిపోయి ఉండేది.

ఈ రిజర్వేషన్లని ఎంతకాలం వరకు కొనసాగించాలి?


          తొలినాళ్ళలో చట్టసభల్లో ప్రవేశానికి సంబంధించిన రిజర్వేషన్లని 10 సంవత్సరాలు మటుకు ఉంచి తర్వాత మదింపు ద్వారా ఇక అనవసరం అనుకుంటే రద్దు చేసే ప్రతిపాదన ఉంది.అయితే ఎలాగూ వెసులుబాటు ఉంది కదాని మదింపుతో సంబంధం లేకుండానో తూతూ మంత్రపు మదింపుతోనో పొడిగించుకుంటూ వస్తున్నారు.విద్యా ఉద్యోగ విషయాలకి సంబంధించి ఆ సూచన కూడా లేదు.

          మొదట ఒక కులాన్ని కోటాలో చేర్చినపప్పటికి 20 సంవత్సరాల తర్వాత మదింపు చేసి ఆ కులం యొక్క ప్రాతినిధ్యం తగినంతగా ఉన్నదని నిర్ధారించి కోటా నుంచి తొలగించడం న్యాయమే.ఆ స్థానంలో ఆ వెసులుబాటుని కొత్త వర్గాలని ప్రోత్సహించడానికి ఉపయోగించవచ్చును.

          కానీ తమ కులాన్ని లిస్టులో ఉంచుకోవటం,వాటాని పెంచుకోవడం రాజకీయ బలప్రదర్శన స్థాయికి దిగజారిన ఇప్పుడు న్యాయాన్యాయాల గురించి ఆలోచించేదెవరు!


రిజర్వేషన్ల వల్ల ఆయా వర్గాలకి సిద్ధించిన నిజమైన ప్రయోజనం ఎంత?


          రిజర్వేషన్లు అనేవి పూర్తిగా ప్రభుత్వోద్యోగాలలో ప్రవేశించడానికి మాత్రమే ఉద్దేశించినవి.2014లో వేసిన ఒక అంచనా ప్రకారం 14 లక్షలమంది రిజర్వేషన్ల విధానం ద్వారా ఉద్యోగాలు దక్కించుకోగలిగారు.మూదవ,నాల్గవ తరగతి ఉద్యోగులలో కోటాను మించి 16% ఉంది.మొదటి,ఎండవ తరగతి ఉద్యోగులలో వెనుకబడిన తరగతుల వారు 8% నుంచి 12% వరకు ఉన్నారు.రిజర్వేషన్లు అనే మార్గం లేకుంటే వీరెవరూ అక్కడికి చేరుకోవటం దాదాపు అసాధ్యం.ఇంత సుదీర్ఘమైన కాలాన్ని బట్టి చూస్తే మరీ ఇంత తక్కువా అని దీని గురించి నిరాశ పడనక్కర లేదు.

          అసలు సమస్య,స్వాతంత్ర్యం వచ్చి డెబ్భయ్యేళ్ళు గడిచాక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో కీలకమైన స్థానాల్ని రిజర్వేషన్ల ద్వారా పొందినవారిలో ఎంతమంది తమ బుద్ధినీ కాలాన్నీ తమ కులానికి గౌరవమైన స్థానాన్ని కల్పించేటందుకు ఉపయోగించారు అని గనక ప్రశ్నించుకుంటే చాలా దయనీయమైన జవాబు వస్తుంది!దేశంలో ఉన్న సంపదనంతా దోచిపెట్టనక్కర లేదు, ఇప్పటివరకు పై స్థాయిలో తమ సుదీర్ఘమైన ఉద్యోగజీవితకాలంలో తమ కులానికి చెయ్యాల్సిన న్యాయమైన సహాయం చెయ్యడానికి అవసరమైనవన్నీ వారిచెంత ఉన్నాయి,కానీ వారినుండి వారి కులానికి అందినది శూన్యం.అసలైన విషాదం వీరు మెల్లమెల్లగా తమ కులానికి దూరంగా జరుగుతూ "ఉన్నత తరగతి దళితులు" అని పిలవాల్సిన పరిస్థితికి దిగజారిపోయారు.

          వీరి పతనానికి పరాకాష్ఠ ఖెయిర్లంజి కేసులో స్పష్టంగా తెలుస్తుంది.ఒక్కర్ని విడిచి మొత్తం దళిత కుటుంబాన్ని చంపేసిన  కేసులో దళిత ప్రజాసేవకులు,దళిత అధికారులు తమ స్వకులపు సోదర సోదరీల పట్ల కనికరం లేకుండా ప్రవర్తించారు,అధికారంలోకి రాగానే పరిపాలక మనస్తత్వంలోకి వెళ్ళిపోయారు!నిన్నటి రోజున ఏ రకమైన రాజ్యం తమ కులాన్ని వెనకబడేలా చేసిందో ఆ రాజ్యపు ఆదర్శాలని వీరు ఏమాత్రం సంకోచం లేకుండా ఆమోదించేశారు - మరి,గంభీరమైన దళిత భావజాలపుస్పూర్తి ఏమైనట్టు?

దళితులు బ్రాహ్మణుల వల్ల అణచబడి ఇంగ్లీషువాళ్ళ వల్ల పైకొచ్చారనేది నిజమేనా!


          నేను మీ జేబులో చెయ్యి పట్టి మీ పర్సు లాగితే నన్ను దొంగంటారు,నన్ను నడిబజార్లో పెట్టి పరువు తీస్తారు.అదే నేను తెలివిగా మాయకబుర్లు చెప్పి మీ అంతట మీరే మీ పర్సు తీసి నాకిచ్చేటట్టు చేస్తే మీరు నన్ను తిట్టలేరు,పైగా చూసేవాడు ఎవడయినా నేను చేస్తున్న మోసం గ్రహించి నన్ను తిడుతుంటే మీ వెర్రితనం ఎక్కడ బయటపడుతుందో అని నష్టం ఎటూ జరిగిపోయింది గాబట్టి పరువు నిలబెట్టుకోవాలని అనిపిస్తే మీరు నన్ను తిట్టడానికి బదులు నన్ను తిడుతున్న పెద్దమనిషినే "నా అంతట నేనిస్తే ఆయన్నెందుకు తిడతావు,నా నష్టం సంగతి నీకెందుకు?నీ సంగతి నువ్వు చూసుకో!" అని ఝాడించనూ గలరు:-)

          ఎంతమంది ఎన్నిసార్లు ఎంతమొత్తం దోచుకుపోయినా మళ్ళీ కూడదీసుకుని లేచి నిలబడగలిగిన కామధేనువు తొలిసారి ఈచుకుపోయిన గొడ్డులా అయింది ఇంగ్లీషువాళ్ళ వల్ల - గట్టి సాక్ష్యం బెంగాల్ కరువు!ఆ దెబ్బకి అప్పటి వరకు అప్రతిహతంగా సంప్రదాయిక వ్యవసాయం మీద ఆధారపడ్డ స్వయంపూర్ణ గ్రామ వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది.ఏ ఉత్పాతం జరిగినా నిలవలో ఉన్నవాడు తొందరగా సర్దుకుంటాడు గదా. అలాంటి భూస్వాములు తట్టుకోగలిగారు గానీ ఏడాది మొత్తం రైతులకి పనిచేసి సంవత్సరానికి సరిపడే మొత్తాన్ని ఒకేసారి తీసుకుని అది వాడుకుంటూ నిక్షేపరాయుళ్ళ మాదిరి బతకటమే తప్ప నిలవ సొమ్ము లేని కులవృత్తుల వాళ్ళు పూర్తిగా అణగారిపోయారు.

          అలా అణగ్గొట్టిన వాడే ఇవ్వాళ వీళ్ళకి దేవుడయ్యాడు.ఈ పని చేసిన మాయామశ్చీంద్రుడు లార్డు మెకాలే.జనవరి 1835లో ఇతను భారతీయులకి సరికొత్త విద్యని అందించటానికి ఒక ప్రణాళికని సభ ముందుంచాడు.సభ చేత ఒప్పించాడు.అప్పటి వరకు ఇంగ్లీషువాళ్ళు ఇక్కడి రాజుల,జమిందార్ల ద్వారానే పనులు జరిపించుకునేవాళ్ళు సామాన్య ప్రజలతో సంబంధాలు లేకుండా.దీనివల్ల భూఖండం పరతంత్రంలో మగ్గుతున్నా మానవాత్మలు మాత్రం స్వతంత్రంగానే ఉన్నాయి."మొత్తం ఇండియన్,అరబిక్ సాహిత్యాన్నంతా కలిపినా ఒక యూరోపియన్ లైబ్రరీలోని ఒక అరకి తూగదు గదా" అనగలిగిన అజ్ఞానంతో బలిసిన అహంకారి ఈ ఉన్నత తరగతి దళితులకి కారణజన్ముడిలా కనపడుతున్నాడు.

          మరీ అట్లా తీసిపారేస్తే బాగుండదని కాబోలు రూటు మార్చి "ఈ నగరంలోనే స్థానికులలో కందరు ఇంగ్లీషు భాషలో రాజకీయ,ఆర్ధిక,సామాజిక అంశాలను గురించి ధారాళంగా చర్చిస్తూ ప్రసంగించగలిగిన వారు ఉన్నారు. " అని గిల్లి జోల పాడినట్టు  ఓ పొగడ్తను విసిరేశాడు.దానికి సాక్ష్యాలు కూడా ఉండటంతో "నిజానికి కొందరు హిందూ పండితుల ఇంగ్లీషు భాషా ప్రావీణ్యానికి సరితూగగలిగినవాళ్ళు యూరోపియన్ విద్యావంతులలో కూడా లేరు" అని ఒప్పుకున్నాడు.మరి,ఇతను ఈ కొత్త విద్యని ఇంగ్లీషుతో కలిపి అమలుపర్చకముందే కొందరు భారతీయులు అంత పాండిత్యాన్ని ఎట్లా సంపాదించారు?

          ఇంతకీ, ఇతనికి ఇంగ్లీషు భాష మొత్తాన్నీ,అంటే మిల్టను కవిత్వం దగ్గిర్నుంచీ వాళ్ళ జ్ఞానం మొత్తాన్నీ మనకి పరిచయం చేసి మనల్ని తమతో సమస్థాయికి తీసుకెళ్ళీ పక్కన కూర్చోబెట్టుకుని గౌరవించాలనే సదుద్దేశం ఎంతమాత్రం లేదు. చాలా సూటిగా అతని ఉద్దేశం "మనకీ మనం పాలిస్తున్న ప్రజలకీ మధ్యన ఒక దుబాసీ తరగతి:రక్తంలో రంగులో మాత్రమే భారతీయులుగా ఉంటూ అభిప్రాయాలలో,నీతులలో,బుద్ధులలో మనవలెనే ప్రవర్తించగలిగిన ఒక ప్రత్యేక తరగతి"ని సృష్టించటం.ఈ ప్రత్యేకమైన వారధుల ద్వారా స్థానిక భాషలలోనికి ఇంగ్లీషు భాషని ప్రవహింప జేయాలి."Macaulay’s Minute" అనబడే ఈ ప్రణాళికని పరిశీలించిన ప్రపంచ స్థాయిలో నిష్పక్షపాత బుద్ధి గల మేధావులందరూ నిర్ఘాంతపోయారు!పూలచెండులో కత్తిని దాచి చిరునవ్వులతో కానుకగా ఇచ్చినట్టు పరమ దుర్మార్గమైన సామ్రాజ్యవాదాన్ని ఒక జాతిని ఉద్ధరించేందుకు ఉద్దేశించిన సంస్కరణ వలె రూపం మార్చి చూపిస్తున్న ఈ నివేదికని అత్యంత ప్రమాదకరమైన రాజకీయ పత్రాలలో ఒకటిగా వారు గుర్తుపట్టారు - అందుకే ఆ దిగ్ర్భాంతి?!

          అక్కడ మెకాలే మహనీయుడు తన మేధోశక్తి నుపయోగించి ఒక ప్లాను వెయ్యగానే అప్పటి వరకు అజ్ఞానాంధకారంలో ఉన్న భారతీయులు ఈ కొత్తచదువును అమాంతం తలకెత్తుకోలేదు.ఆయన చేసిన ప్రసంగంలో ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావించాడు - "అప్పటికే ఇంగ్లీషును ఇంగ్లీషువాళ్ళ కన్నా గొప్పగా మాట్లాదగలిగిన వాళ్ళు ఉన్నారు" అన్నాడు.వాళ్లు గాలిలోనుంచి పుట్టుకు రాలేదు కదా!

         అప్పటికి మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్న గంజాం కలెక్టరేట్ పరిధిలో 255 స్కూళ్ళు ఉన్నాయి.వాటిలో బ్రాహ్మణులు 808 మంది,వైశ్యులు 243 మంది,శూద్రులు 1003 మంది,ఇతర కులాల వారు 896 మంది,ముస్లిములు 27 మంది చదువుకుంటున్నారు.నెల్లూరు కలెక్టరేట్ పరిధిలో 804 స్కూళ్ళు ఉన్నాయి.వాటిలో బ్రాహ్మణులు 2466 మంది,వైశ్యులు 1641 మంది,శూద్రులు 2462 మంది,ఇతర కులాల వారు 432 మంది,ముస్లిములు 620 మంది చదువుకుంటున్నారు.సేలం కలెక్టరేట్ పరిధిలో 388 స్కూళ్ళు ఉన్నాయి.వాటిలో బ్రాహ్మణులు 783 మంది,వైశ్యులు 324 మంది,శూద్రులు 1674 మంది,ఇతర కులాల వారు 1410 మంది,ముస్లిములు 459 మంది చదువుకుంటున్నారు.మద్రాసు కలెక్టరేట్ పరిధిలో 844 స్కూళ్ళు ఉన్నాయి.వాటిలో బ్రాహ్మణులు 1186 మంది,వైశ్యులు 1119 మంది,శూద్రులు 7312 మంది,ఇతర కులాల వారు 3017 మంది,ముస్లిములు 1147 మంది చదువుకుంటున్నారు. సరాసరి చూస్తే శూద్రులు 45%,బ్రాహ్మణులు 23% చదువుకుంటున్నారు.

          క్రీ.శ 1800కు ముందు బెంగాలులో పరిస్థితిని గురించి ఆడం రిపోర్టు ప్రకారం దాదాపు ప్రతి పల్లెలో ఒక స్కూలు ఉంది.దాదాపు ప్రతి జిల్లాలోనూ 100 వరకు ఉన్నత విద్యని అందించే కళాశాలలు ఉన్నాయి.వీటినుంచి 10,8800 మంది ఉత్తీర్ణులై వస్తున్నారని చెప్పాడు.బెంగాలులో చెప్పుకోదగిన సంఖ్యలో మంచి కౌశలం గలిగిన వైద్యప్రవీణులు కూడా ఉన్నారు. క్రీ.శ 1811లో  మొత్తం ఇంగ్లాండు జనాభా 95,43,610 మందిలో సుమారు 75,000 స్కూళ్ళకి వెళ్తున్నారు. క్రీ.శ 1823లో మద్రాసు ప్రెసిడెన్సీ మొత్తం జనాభా 1,28,50,941లో 1,57,195 మంది స్కూళ్ళకి వెళ్తున్నారు.

          ఇంగ్లాడులో క్రీ.17వ శతాబ్దం వరకు చదువు అంటే బైబిల్ చదవటం తప్ప మరొకటి లేదు.క్రీ.శ 1802 ప్రాంతంలో Joseph Lancaster,Andrew Bellలు కొత్తరకం విద్యావిధానాన్ని అమలులోకి తీసుకొచ్చారు. Alexander Walker తన గ్రంధం Note on Indian Educationలో అప్పటికి భారతదేశంలో Bramans చెప్తున్న చదువు గురించి "The children were instructed without violence and by a process peculiarly simple" అని అంటున్నాడు.

          అంతకు ముందు ఉన్న భారతీయుల స్కూళ్ళని నయాన,భయాన బలవంతంగా మూయించివేసిన తర్వాత ఇక మిగిలింది ఏమిటి?ఇవ్వాళ పరోపకారి పాపన్న కంటె ఎక్కువగా వీళ్ళు కీర్తిస్తున్న మెకాలె స్కూళ్ళు!ప్రపంచ స్థాయిలో అనేక విషయాలను గురించి నిష్పాక్షికమైన అభిప్రాయాల్ని చెప్పి సకలజనవంద్యుడైన Mark Twain చదువు - విద్య గురించి "I do not allow my schooling to interfere with my education" అన్నాడు.భారతీయ విద్యావ్యవ్స్థలో ఇంగ్లీషువాళ్ల మూలంగా జరిగిన మార్పు Indian Education System పోయి Macaulay Schooling System రావటం.

       భారతీయ దేహంలో ఆంగ్లేయాత్మని ప్రవేశపెట్టాలనుకున్న దార్శనికుడు మెకాలే కల ఎంతవరకు నెరవెరిందో తెలుసుకోవడానికి 2006,అక్టోబర్ 25వ తేదీన ఈ దేశపు రాజధానిలో జరిగిన ఒక ప్రత్యేకమైన పుట్టినరోజు పండుగ చాలు.

       అది కొత్తగా పుట్టగొడుల్లా పుట్టుకొస్తున్న డిల్లీ నగరపు సబర్బన్(శివారు) టవున్సులో ఒక టవునులో చిన్న అపార్టుమెంటు.ఇంటి యజమాని పేరు చందర్ భాను ప్రసాద్,పొట్టిగా,నవ్వుతూ నవ్విస్తూ ఉండే దళితకులానికి చెందిన సామాజిక కార్యకర్త, అతిధులు కూడా ఇతని లాంటి ప్రతిభాశాలురే - దళిత మేధావులు,విద్యావేత్తలు,విదేశీ పాత్రికేయులు.వారిప్పుడు ఒక అపూర్వ వ్యక్త్తి, ధామస్ బాబింగ్టన్,లార్డ్ మెకాలే, గొప్పదైన ఆంగ్లభాషను మొదట భారతదేశానికీ,తదుపరి ప్రపంచానికీ పరిచయం చేసి ఎందరి జీవితాలలోనో వెలుగులు నింపిన కారణజన్ముని పుట్టినరోజును జరుపుకుంటున్నారు.అయితే జరుగుతున్న పద్ధతి మాత్రం ఆ మహనీయుడు పరిచయం చేసిన పశ్చిమదేసపు ఆదర్శాల ప్రకారం కాకుండా భారతీయుల మూర్ఖపు సంప్రదాయాలనే అనుసరించింది.కలిపి కొట్టరా కావేటి రంగ అన్నట్టు విదేశీ స్కాచ్ విస్కీతో నంజుకోవటానికి స్వదేశీ పకోడీ ఉంది.ఈ పండుగలోని పతాక సన్నివేశం నూతనంగా చిత్రీకరించబడిన "ఆంగ్ల భాషా దేవత" యొక్క ఆవిష్కరణ మహెత్సవం!


          ఒక దళిత కవి బ్రహ్మణాధిక్యత వల్ల తమకు సంక్రమించబోయే అజ్ఞానాంధకారమును దరిచేరనివ్వక గొప్ప తెలివితేటలను,మంచి ఉద్యోగమును,తీరైన నడవడికను,సకల సంపదలను దయతో ప్రసాదించి జన్మాంతరమున English mokshaను కూడ ప్రసాదించగలుగు అత్యంత శక్తివంతమైన ఈ కొత్త దేవత మీద తను రచించిన కృతిని చదివి/పాడి వినిపించాడు.

 Oh Devi Ma, please let us learn English!
Even the dogs understand English.

         అప్పుడు చందర్ భాను ప్రసాద్ తన ప్రసంగాన్ని ప్రారంభించాడు "ఆంగ్లదేవత చేత ఆశీర్వదించబడిన వారై, దళితులిక ఈ సరికొత్త గ్లోబలైజేషన్ యుగంలో తమ న్యాయమైన స్థానాన్ని పొందెదరు గాక!మనం భారతీయ విద్యని చదివి ఉంటే ఎక్కడ ఉండేవాళ్ళమో ఒక్కసారి ఆలోచించండి.ఆఫ్ఘనిస్థాన్ లాగో ఇవ్వాల్టి నేపాల్ లాగో ఉండేవాళ్ళం." కనుకొసల నుంచి కొంటెతనం మెరిపిస్తూ "ఇకనుంచి,పుట్టబోయే దళిత శిశువు లందరు తమ తల్లిదండ్రుల నుంచి మొదట వినాల్సిన మాటలు - ఏబీసీడీ. కాబట్టి,బిడ్డ పుట్టగానే తల్లిదండ్రులు బిడ్డ చెవిలో ఏబీసీడీ లని వినిపించాలి" అని చక్కిలిగింతలు పెట్టినట్టు నవ్వించాడు.

          మనల్ని కట్టుబానిసల్ని చేసుకోవటానికి తను చేసిన దుర్మార్గమైన పనికి -  మీ వెర్రితనం బయటపడుతుందని నన్ను తిట్టకుండా పొగుడుతున్న ఇందాకటి కధలోని మీలాగ - వీళ్ళు తనకి చేస్తున్న వీరపూజకి సమాధిలో ఉన్న మెకాలే ఆత్మ సంతృప్తిగా తలాడిస్తూ హాయిగా నవ్వుకుంటూ ఉండవచ్చు గానీ భారతమాత స్థానంలో ఈ విదేశీవనితని చూసి దేశభక్తి కొంచెం ఎక్కువగా ఉన్న మనలాంటి పిచ్చివాళ్ళకి మాత్రం మనస్సు చివుక్కు మంటుంది!వాళ్ళిప్పుడు మెకాలే తయారు చేసిన భారతీయ దేహంలో ఉన్న ఆంగ్లేయాత్మలు గనక మన బాధ వాళ్లకి హాయి, ఎక్కువగా ఏడ్చినా వాళ్లకి లోకువ కావడం తప్ప వాళ్ళలో మార్పు మాత్రం రాదు.అంబేద్కర్ ఏడ్చినా పట్టించుకోనివాళ్ళు ముందుగానే హిందూ మతతత్వ వాదులు అని ముద్ర కొట్టేసుకున్న మన మాట అస్సలు వినరు,  ఎందుకొచ్చిన గోల!

          ఇవ్వాళ చాలామంది గొప్పగొప్పవాళ్ళకి కూడా దేశభక్తి అంటే ఏమిటో,జాతీయత ఎలా ఉంటుందో తెలియడం లేదు పాపం!అంబేద్కర్ విద్యార్ధి సంఘంలో సభ్యులై ఉండి ఆయన ప్రవచించిన రాజ్యాంగం ప్రకారం నడుస్తున్న ప్రభుత్వం కొలువుదీరుతున్న భవనాన్ని నేలమట్టం చెయ్యాలని సంకల్పించి విఫలమైనవాణ్ణి మహావీరుడి కింద పరిగణించేవాళ్ళకి ఆ సందేహం రావడంలో ఆశ్చర్యం లేదు.ఈ దేశపు ప్రజల్ని 300 మందిని చంపిన యాకూబ్ మెమన్ లాంటి వాళ్లని ఇంటికొకణ్ణి పుట్టించి వాళ్ళ చేతుల్లో మళ్ళీ మళ్ళీ చస్తూ తరించమని ఈ దేశపు ప్రజలకే విజ్ఞప్తులు చెయ్యగలిగిన గాడిదకీ. ఆ గాడిదని సింహమని పొగుడుతున్నవాళ్ళకీ ఎంత విడమరిచి చెప్పినా అర్ధం కాకపోవడం విచిత్రం కాదు.

          అయినా మానవ ప్రయత్నంగా ఒక కధ చెబుతాను.అనగనగా ఒక మీర్ జాఫర్.ఇతని తాత అప్పటి వరకు అందరి మద్దత్తు ఉన్న తనని కాదని సిరాజ్ ఉద్దౌలాని బెంగాలుకి నవాబుని చేశాడు.అతని ఏడుపులోనూ కొంత న్యాయముంది లెండి!ఈ సిరాజ్ ఉద్దౌలా అప్పటి వరకు స్త్రీలోలుడని ముద్ర వేసుకుని స్వేచ్చావిహారిగా ఉండేవాడు.దానితో అందరూ తాత మీర్ ఖాశిం వైపుకే మొగు చూపుతాడని అనుకున్నారు.కానీ సిరాజ్ ఉద్దౌలా మనస్తత్వంలో ఒక రహస్యం ఉంది - రాజ్యం మీద ఆసక్తి లేక యవ్వనపు సరదా వల్ల అలా తిరిగినా ఒక బాధ్యతని తీసుకుంటే క్షణమాత్రపు సంకల్పంతో అన్ని రకాల ప్రలోభాల్నీ అణుచుకోగలిగిన నిగ్రహమూ ఉంది,అప్పగించిన బాధ్యతని సక్రమంగా నిర్వర్తించడం కోసం ఎంతటి త్యాగానికనా సిద్ధపడే మహత్వమూ ఉంది!ఇతరులు గుర్తించకపోయినా తాత అది గుర్తించాడు.అందుకే అందరూ వ్యతిరేకిస్తున్నా సిరాజునే సార్వభౌముణ్ణీ చేశాడు. అధికారాన్ని ఆశించిన మీర్ జాఫర్ తనకి అన్యాయం జరిగిందనుకున్నాడు.సరిగ్గా ఇటువంటి సన్నివేశంలోనే దుర్యోధనుడికి శకుని కూటనీతిని బోధించి మయాద్యూతాన్ని ప్రయోగించి దుర్యోధనుణ్ణి సంతోష పెట్టాడు. మీర్ జాఫర్ ఆ కూటనీతినే పాటించి ఆంగ్లేయులతో చేతులు కలిపాడు.సోదరుడి తల తెగి కోట గుమ్మానికి వేళ్ళాడుతుండగానే తన తన మీదకి కిరీటం వచ్చింది. అధికారంలోని కొత్తదనం పోయాక మెల్లమెల్లగా పరిస్థితి బోధపడింది - తన రాజ్యాన్ని తను పరిపాలించుకునే స్వేచ్చ తనకి లేదనీ, తను ఇంగ్లీషువాళ్ళకి అలుసైపోయాననీ తెలిశాక మొదట్లో విసుక్కున్నాడు,తర్వాత గునిశాడు,తర్వాత పోట్లాడాడు - ఆఖరికి మరీ సిగ్గులేని బతుకు కష్టమనిపించి తిరగబడ్డాడు.దొరలకి చిరాకు పుట్టి అతన్ని వూడబెరికి అతని మేనల్లుడు మీర్ ఖాసిం అనేవాణ్ణి కుర్చీ మీద కూర్చోబెట్టారు.

          అక్కడ ఉన్న సిరాజ్ ఉద్దౌలా,మీర్ జాఫర్ అనే ఇద్దరిలో మొదటివాడిని కుల మత ప్రాంతాల కతీతంగా భారతీయుడన్న ప్రతివాడూ పొగుడుతున్నాడు.రెండవ వాడిని  కుల మత ప్రాంతాల కతీతంగా భారతీయుడన్న ప్రతివాడూ తెగుడుతున్నాడు.మొదటివాణ్ణి ఎందుకు పొగుడుతున్నారో తెలిస్తే అది దేశభక్తి.రెండవవాణ్ణి ఎందుకు తెగుడుతున్నారో తెలిస్తే అది దేశద్రోహం.ఇద్దరిదీ ఒకటే మతం,ఇద్దరూ ఒకే కుటుంబం లోనివాళ్ళు - అయినా వాళ్ళని సమర్ధించేవాళ్ళూ విమర్శించేవాళ్ళూ ఈ పోలికల్ని పట్టించుకోవడం లేదు,అవునా!మీర్ జాఫర్ కూడా వ్యక్తిగతంగా మంచివాడే అయ్యుందవచ్చు,తిన్నగా రాజ్యం చెయ్యనిస్తే ధర్మప్రభువే అయి ఉండేవాడేమో - కానీ ఒక చారిత్రక సంధ్యలో వీరెక్కడ నిలబడ్డారో దాన్ని బట్టి ప్రజలు నిండుమనస్సుతో ఇచ్చిన తీర్పు కదా అది! ఇప్పుడు నేను ఈ పెద్దమనుషులకి ఈ దేశప్రజల తరపున ఒకే ఒక ప్రశ్న వేస్తున్నాను - మా దేశపు సరిహద్దుల్ని దొంగచాటుగా దాతి వచ్చి మమ్మల్ని చంపుతున్నవాళ్లని పొగుడుతున్న మిమ్మల్ని ఎందుకు గౌరవించాలి? మావి 300 ప్రాణాలు పోయినందుకు ఏడవకుండా మమ్మల్ని చంపిన ఒక పొరుగుదేశపు ఉగ్రవాది కోసం మీరు ఏడుస్తున్నప్పుడు మిమ్మల్నెవడో తంతున్నాడని మేమెందుకు మీకోసం ఏడవాలి?

అంబేద్కర్ సాటి దళిత మేధావుల్ని ఎందుకంత క్రూరంగా విమర్శించాడు?


          ఈనాడు మేము అణిచివేతకి గురయ్యామని వీరు పదేపదే నొక్కి వక్కాణించ నవసరం లేదు,అంబేద్కర్ కూడా అణిచివేతకి గురయిన వాడే!

Dr.AMBEDKAR (1891-1956)
B.A., M.A., M.Sc., D.Sc., Ph.D., L.L.D., D.Litt., Barrister-at-Law. 

Above single line and his lifetime struggle,reveals THE GREATNESS... .. . 

B.A.(Bombay University) Bachelor of Arts,
MA.(Columbia university) Master Of Arts,
M.Sc.( London School of Economics) Master Of Science, 
Ph.D. (Columbia University) Doctor of philosophy ,
D.Sc.( London School of Economics) Doctor of Science ,
L.L.D.(Columbia University) Doctor of Laws ,
D.Litt.( Osmania University) Doctor of Literature,
Barrister-at-Law (Gray's Inn, London) law qualification for a lawyer in royal court of England.

ALL THIS EDUCATION ACHIEVED BEFORE 1954 !!! HOW REMARKABLE!!! !! !

HE WON THE AWARD OF GREATEST INDIA !!! !! !
THE PERSON WHO SAT OUTSIDE THE CLASS,TO WHOM DRINKING WATER WAS DENIED ... .. . THE SAME PERSON HAS BECOME ... .. .
""" $$$ THE GREATEST INDIAN $$$ """

MOST EDUCATED INDIAN SCHOLAR !!! !! !

       అయినా ఆయన ఏనాడూ వీళ్ళ మాదిరి ఇంత అసహనం వెళ్ళగక్క లేదు. దేశాన్ని ద్వేషించ లేదు, బ్రాహ్మణాధిపత్యం గురించి సొల్లుకబుర్లు చెప్పలేదు.హిందూమతం తనకి అన్యాయం చేసిందనుకున్నప్పుడు హుందాగా బౌద్ధాన్ని స్వీకరించాడు.నిన్నటి రోజున నా తాతల్ని వీళ్ళ తాతలు అణిచివేశారు గాబట్టి ఈరోజు నేను వీళ్ళని ఓ పట్టు పడతాను అనుకోలేదు.తన వరకు తను ఉదారంగా ఆలోచించి నవభారత నిర్మాణంలో అన్ని వర్గాలూ తమ న్యాయమైన ప్రాతినిధ్యాన్ని అందుకోగలిగిన ఒక సామాజిక చట్రాన్ని నిర్మించి ఇచ్చాడు.ప్రతిరోజూ అంబేద్కర్ బోధనల్ని అధ్యయనం చేసే అంబేద్కర్ విద్యార్ధి సంఘం సభ్యులకి అంబేద్కర్ ప్రవచించిన రాజ్యాంగ వ్యవస్థని అవమానించే విధంగా పొరుగుదేశం నుంచి దొంగచాటుగా సరిహద్దుల్ని దాటివచ్చి ఇక్కడి అమాయకుల్ని చంపుతున్నవాళ్లని కీర్తించడం తప్పని తెలియదా?

          అంబేద్కర్ దళిత విద్యావంతుల నుంచి ఆశించింది చాలా తక్కువ. అప్పటికే జనాభా గణాంకాలు అన్నీ వివరంగా దొరికాయి గాబట్టి ఎంత విమర్శనాత్మకంగా చూసినా ఏ ఒక్క వర్గానికీ ఇబ్బంది లేనంత ప్రణాళికాబద్ధంగా చేసిన దాని ముఖ్య ఉద్దేశం - "నూటికి 10 మంది డాక్టర్లు,20 మంది ఇంజనీర్లు.30 మంది లాయర్లు ఉన్న కులం మీద దాడి చెయ్యటానికి గానీ ఆ కులం మీద పెత్తనం చెయ్యటానికి గానీ ఎవడూ ధైర్యం చెయడు"  అని!ఎంత రిజర్వేషన్లు అనే సపోర్టు ఉన్నా తాము ఇక్కడి వరకూ వచ్చింది తమ సొంత కష్టంతోనే, అయినా తమ సాటి కులస్తులకి తమ అధికార పదవుల నుపయోగించి చెయ్యదగిన న్యాయమైన సహాయం చెయ్యమని.

          అది 1956 జులై 31,మంగళవారం.సమయం సాయంకాలం 05 గంతల 50 నిముషాలు. డాక్టర్ అంబేద్కర్ న్యూఢిల్లీ అలిపుర్ 26,తన స్వగృహంలో ఉన్నాడు.తన పర్సనల్ సెక్రటరీ నానక్ చంద్ కట్టూ గారితో ఇలా అంటున్నాడు:"నానక్ చంద్,నా ప్రజలకి చెప్పు.ఏది నన్ను కష్తపెడుతున్నదో దేనివల్ల నేను విచారంగా ఉన్నానో మీకు తెలియదు.మొట్టమొదట నా మనస్సులో తోస్తున్న విషాదం నా లక్ష్యాన్ని చహెరుకోవదంలో నేను విఫల మయ్యాననై.నేను నా జీవితకాలంలో నావాళ్ళు అధికారం చెలాయించే వర్గంగా చూడాలనుకున్నాను,ఇతర కులాలతో రాజకీయాధికారాన్ని పంచుకుంటూ ఉంటారని బలంగా ఆశించాను.నేనిప్పుడు వృద్ధాప్యంతోనూ అనారోగ్యంతోనూ శిధిలమై ఉన్నాను. నేనేమి చేయగలిగానో దాని ఫలితాన్ని కొద్దిమంది విద్యావంతులు, తమలోని మోసపూరితమైన ప్రవర్తన ద్వారా పనికిమాలినవాళ్ళుగా నిరూపించుకున్న వాళ్ళు, తమ సాటివారు పడుతున్న బాధల పట్ల సహానుభూతి లేనివారు అనుభవిస్తున్నారు.వారు నా వూహాదృశ్యాన్ని చూసి కూడా తల తిప్పేసుకుని ముందుకెళ్ళి పోయారు;వారు కేవలం తమకోసం మాత్రమే జీవిస్తున్నారు.వారిలో ఒక్కరు కూడా సామాజిక సేవ చెయ్యటం లేదు.వారొక భ్రష్తమార్గంలో నడుస్తున్నారు.నేనిక వీళ్ళని మర్చిపోయి నా ధ్యాసని పల్లెల్లో ఉండి అవిద్యతో మగ్గిపోతూ ఆర్ధికస్తితిలో ఏ మార్పూ రాకుండా బతుకీడుస్తున్న నిర్భాగ్యుల మీదకి మళ్ళిస్తాను.కానీ ఆయుష్షు తక్కువ....నా సైన్యాధిపతులు,ఎవరినైతే ఉద్యమాన్ని పరుగులు పెట్టిస్తారని నమ్మానో వారంతా వాళ్ళలో వాళ్ళు నాయకత్వం కోసం,అధికారం కోసం కుమ్ములాడుకుంటున్నారు,తమ మీద ఎంత బరువైన బాధ్యత ఉందో తెలుసుకోకుండా...ఏమైతేనేం,అన్ని వైపుల నుంచి వచ్చిపడిన ఎన్నో తిట్లని భరించి నేను చేసింది ఎక్కువే, చచ్చేవరకు చేస్తూనే ఉంటాను. "

          ఇప్పుడు నానక్ చంద్ అంటున్నాడు "ఇలా మాట్లాడి,కన్నీరు చెమపల మీదకి కారుతుండగా,ఆయన నావైపు చూశారు,నేను కూడా ఏం చెయ్యాలో తెలియక కళ్ళనీళ్ళ పర్యంతమై ఆయన వైపు చూశాను."కొంచెం సంబాళించుకుని ముఖం మీద ఇంకా బాధ కదలాడుతూనే ఉన్నా తనకి తను చెప్పుకుంటున్నట్టు "హైర్యం తెచ్చుకో,నిరాశ పడకు,జీవితం ఒకరిఎజు కాకపోతే మరొకరోజు అంతం కావల్సిందే" అని గొణిగారు.కొంచెం సేపాగి,కన్నీళ్ళు తుడుచుకుని,చేతిని వెలుగు నింపుకున్న తన కల్లకు పైకెత్తి ఇలా న్నారు:"నా ప్రజలకి చెప్పు నానక్ చంద్!నేనేమి చేసినా,భయంకరమైన కష్టాల మధ్యన జీవితమంతా ప్రతికక్షులతో పోట్లాడుతూనే చెయ్యగలిగాను.అతి కష్టం మీద,ఈ భోగయాత్రని ఇప్పుడున్నచోటకి తీసుకు రాగలిగాను.ఈ భోగయాత్రని దారిలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆపకుండా ముందుకు పోనివ్వండి.ఒకవేళ నా ప్రజలు,నా దళపతులు,ఈ భోగయాత్రని ముందుకు తీసుకు వెళ్లలేకపోతే దాని నక్కడే వదిలేయండి.కానీ ఎట్టి పరిస్థ్తిలోనూ ఈ భోగయాత్రని వెనక్కి తిప్పకండి"

          సందేహం లేదు, అంతపనీ చేసేశారు - బండి ఎప్పుడో వెనక్కి తిరిగింది!ప్రతి కులానికీ మన కులం మీద వెనకబడ్డ కులం అనే ముద్ర పడితే గానీ ముందుకెళ్ళం అని రూఢిగా తెలిసిపోయినంత ముందుకెళ్ళింది ఈ దేశం.మొన్న కాపు సోదరుల ఉద్యమంలో జరిగిన విధ్వంసం ఖరీదు నాలుగు రత్నాచల్ బోగీలు,రెండు పోలీస్ స్టేషన్లు.నిన్న జాట్ సోదరులు తమని తాము వెనుకబడ్డ కులంగా దేశంలో అందరికీ తెలిసేలా చెయ్యటానికి జరిపిన విధ్వంసం ఖరీదు అక్షరాల 34 వేల కోట్లు!రేపు అడిగేవాడు రేంజి పెంచాలనుకుంటే 50 వేల కోట్ల వరకు పెంచినా పెంచొచ్చు.అమంగళం ప్రతిహత మగుగాక, అలాంటి సన్నివేశం జరగకూడదనే కోరుకుంటున్నాను, కానీ ఇవ్వాళ్టి రాజకీయ వాతావరణం చూస్తుంటే అలాంటివి జరగటానికే ఎక్కువ ఆస్కార ముంది.

          ఒకవేళ అలాంటిది గానీ జరిగితే అప్పుడు ప్రభుత్వంలో ఉన్నవారికి ఈ దేశప్రజలందరి తరపున నేనొక విజ్ఞప్తి చేస్తున్నాను:"అయ్యా, ఇక మీరు మమ్మల్ని పరిపాలించవలసిన కష్టాతికష్టం మీకిక ఎంతమాత్రం లేదు.మామీద దయదల్చి మీరు గనక తప్పుకుంటే శ్రీమాన్ అఫ్జల్ గురు లాంటి సమర్ధులని ప్రభువులుగా చేసుకుని క్షేమంగా బతకదల్చుకుంటున్నాం.వారు మీకన్నా ఎంతో సమర్ధులు.సరిహద్దు భద్రతా విభాగం కళ్ళుగప్పి టెర్రరిస్టులని దేశం నడిమధ్యకి రప్పించగలిగారు.వెంట్రుకవాసిలో ప్లాను ఫెయిలైంది గానీ, లేకుంటేనా - ప్రపంచం కళ్ళింతలు జేసుకుని ఆయన్ని కీర్తించేది!సాక్షాత్తూ పార్లమెంటు భవనాన్ని పేల్చటం అనే ఘనకార్యం చేసి ప్రపంచంలోని వీరాధివీరుల్లో ఒకడిగా ప్రఖ్యాతిని పొందేవాడు?!చూడండి, ఏ మాత్రమూ పశ్చాత్తాపపడకుండా తన సహాయం కోరివచ్చిన ఎవరికయినా విధ్వంసం సృష్టించడంలో ఇప్పుడు చేసిన సహాయం అప్పుడూ చేస్తూనే ఉంటానని నిర్భయంగా చెప్తున్నాడు.అసమర్ధుడికి బార్యగా ఉండే కన్నా సమర్ధుడికి ఉంపుడుగెత్తెగా ఉంటే నన్నా ఎక్కువ సుఖపడ వచ్చనే కామన్ సెన్స్ ప్రకారం మీలాంటి వాళ్ళ పరిపాలనలో కన్నా అలాంటివాళ్ళ పరిపాలనలోనే మరింత క్షేమంగా ఉంటామని నేను బలంగా నమ్ముతున్నాను, కాబట్టి మీరు దిగిపోయి వారికి దారివ్వండి." - ఒక్క అక్షరంలో కూడా నేను వ్యంగ్యాన్ని జోడించ లేదు.

          చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు కాకుండా ముందు జాగ్రత్త పడదల్చుకుంటే తక్షణం రిజర్వేషన్ల వ్యవస్థని రద్దు చెయ్యండి!ఉండి ఉద్ధరించింది ఏమీ లేదని అంబేద్కర్ మాటల సాక్షిగా డెబ్భయ్యేళ్ళ పాటు ఆ సౌకర్యం అనుభవించిన వారు నిర్ద్వంద్వంగా నిరూపించాక కూడా ఇంకా మొహమాటం దేనికి?దానికి బదులు మీరు చెయ్యాల్సినది చాలా చాలా చిన్న పని. కుల,మత,ప్రాంత,వర్గ భేదాలు లేకుండా ప్రతి పౌరుడీకీ న్యాయం చెయ్యగలిగిన సమర్ధవంతమైన పరిపాలన అందిస్తే చాలు - ఒక రకంగా ప్రభుత్వం తప్పనిసరిగా ప్రతి పౌరుడికీ చెయ్యాల్సిన సేవ నిక్కచ్చిగా చెయ్యండి చాలు

          ఒక్క రిజర్వేషన్లే కాదు, మొత్తం వ్యవస్థలన్నింటితో సహా అసలు స్వాతంత్ర్యమే విఫలమైనట్టు నాకు అనుమానంగా ఉంది.డెబ్బయ్యేళ్ళ తర్వాత ఇవ్వాళ మనం సాధించిన ఘనకార్యం మెకాలే కలలుగన్న భారతాన్ని ఆవిష్కరించటం.భూఖండానికి మాత్రమే స్వతంత్రం వచ్చింది, కానీ మానవాత్మలు మాత్రం పరతంత్రంలోకి వెళ్ళిపోయాయి..రాజమార్గంలో ఈ దేశం మీద శౌర్యం చూపించి యుద్ధం చేసి గెలిచిన న్యాయవిజేతని పొగిడినా కొంత నయం.అమాయకంగా ఈ దేశంలో పొట్టపోసుకుని బతకడానికి వచ్చిన వాణ్ణి చంపితే అన్యాయం అని ఆక్రోశించినా నయమే - కానీ ఇదేమిటి?ఈ దేశప్రధాని నామీద కుట్ర జరుగుతున్నదంటే ఒక్కడూ జాలిపడ లేదు,ఒక ఉగ్రవాది మీద ఎంతమంది అభిమానం చూపిస్తున్నారు!ఒక ఉగ్రవాదికి ఉన్న ఫాలోయింగులో సగం కూడా లేనివాడు ఈ దేశ ప్రధాని పదవికి అనర్హుడు!కాబట్టి, నేనిందాక పెట్టిన కండిషన్, మళ్ళీ రిజర్వేషన్ల అగ్గి ఏదీ రగలకపోయినా ఇప్పటికిప్పుడే ప్రధానమంత్రి తన ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని శ్రీమాన్ అఫ్జల్ గురు గారి అభిమానులకి అధికారం అప్పగించి వారు విశ్రాంతి తీసుకోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను - ఇక్కడ సైతం ఒక్క అక్షరంలో కూడా నేను వ్యంగ్యాన్ని జోడించ లేదు.

          ఎందుకు పనిచెయ్యాలో అర్ధం కాకపోవడం వల్ల పనిచెయ్యనివాళ్ళు బద్ధకస్తులు,ఎందుకు పనిచెయ్యాలో తెలియకపోయినా పక్కవాడు చెప్పాడని పనిచేసేవాళ్ళు పిచ్చిపుల్లయ్యలు - అనగా పీడితులు,ఒకపని ఎట్లా చేస్తే అందరికీ మేలు జరుగుతుందో తెలిసి కూడా అట్లా చెయ్యకుండా తమ లాభంకోసమే పనిచేసేవాళ్ళు ఖచ్చితంగా దుర్మార్గులే!ఈ రిజర్వేషన్ల వల్ల పైకొచ్చినవాళ్ళంతా అట్లాంటివాళ్ళే నన్నది జగమెరిగిన సత్యం.యేది సత్యమో అదే శివమైనదీ అవుతుంది!యేది శివమో అదే సుందరమూ అవుతుంది!!

సత్యం శివం సుందరం!!!

Monday, 22 February 2016

నా జీవనపయనం లోకి మలయమారుతంలా వచ్చి ప్రళయాన్ని సృష్టించిన - ఆమె ఎవరు?

          ఆమెది క్లియోపాట్రా యొక్క ముక్కు, ఆమెవి పాలిన్ బోనపార్టే యొక్క కళ్ళు - ఆమెవి సౌందర్యరసాధిదేవత వీనస్ యొక్క వక్షోజాలు!శారీరకంగా చూసినా మానసికంగా చూసినా ఆమెలో స్త్రీత్వం కన్నా పురుషత్వమే ఎక్కువ. నేను ఆమెని మగతనం గల ఆడది అని పిలుస్తాను.

          నేను ఆమెని మొదటిసారి 1945 శీతాకాలంలో ఆమె పూర్వీకుల భవంతిలో కలిశాను.అప్పటికి ఆమె అప్పుడప్పుడే పాకడం నేర్చుకుంటున్న తొలిచూలు బిడ్డకి తల్లి - ఆ బిడ్డ పెద్ద ఏడుపుగొట్టు!చూసీ చూడగానే ముఖం మీద తెలియరాని సంతోషలేమి నీడలు పరుచుకుని ఉన్నప్పటికీ ఆమె చాల గుంభనైన అమ్మాయి అనిపించింది.ఆమె రెండో కొడుకు 1946 డిసెంబరులో పుట్టాడు - అతడొక అవాంచిత శిశువు?ఆ పిల్లాడికి ఒక దోషానికి పరిహారంగా సుంతీ చేయించాల్సి వచ్చింది.1947 కల్లా ఆమె సంతోషలేమి పాత్ర పూర్తిగా నిండిపోయి ఆ అదృష్టం ముఖం మీదకి కూడా ఎగదన్నుకొచ్చి ప్రకాశించసాగింది.

          ఆమె తండ్రి 1946 వేసవిలో ఒక చిన్న ఆస్టిన్ కారు ఇచ్చాడు.ఆమె నన్ను డ్రైవింగ్ నేర్పమని అడిగింది.మొదట్లో ఆమెని డ్రైవింగ్ పాఠాల కోసం పోలో గ్రౌండ్ వరకు తీసుకెళ్ళేవాణ్ణి.ఆమె నేర్చుకోవడంలో చాలా చురుకైనది.కానీ గర్భం ముదిరి ప్రసవపు రోజులు దగ్గిర పడటంతో డ్రైవ్వింగ్ ఆపేశాను.ఈ దశలో రోడ్డు మీదకి వెళ్ళడం కష్టం కాబట్టి ఆ రిస్కు నేను తీసుకోదల్చలేదని చెప్పేశాను.1946 డిసెంబర్ మధ్యలో రెండో కొడుకు పుట్టాడు.1947 ఫిబ్రవరి మధ్యకల్లా మళ్ళీ డ్రైవింగ్ నేర్చుకోవటానికి సిద్ధమైపోయింది.ఈసారి రోడ్లమీదనే కన్నాట్ సర్కస్ వరకు వెళ్ళాం.ఆమెకి నేను ఒకటే చెప్పాను "నీ గురించి నువ్వు నీ కంతా తెలిసినట్టు వూహించుకో,కాన్సెంట్రేషన్ ముఖ్యం,నీకు ఆపోజిట్ దైరెక్షన్లో వస్తున్న కారు డ్రైవరుకి ఏమీ తెలియదని అనుకో,ధైర్యంగా నడుపు కారుని,కన్నాట్ సర్కస్ చుట్టూ ఒక రవుండ్ వేసిరా".సరిగ్గా అదే చేసి విజయవంతంగా తిరిగొచ్చింది.అంతటితో డ్రైవింగ్ లెస్సన్లు పూర్తయిపోయాయి.

          1947 జూన్ నెలకి ముందనుకుంటాను సినిమాకి తీసుకెళ్ళమని అడిగింది.అప్పటినుంచి నేను ఫ్ర్రీగా ఉన్నప్పుదల్లా సినిమాలకి వెళ్తుండేవాళ్ళం - కాకపోతే నేను ఫ్రీగా ఉండేది తక్కువ.

          రిడ్జి మీదుగా కీకారణ్యం లాంతి ట్రాఫిక్ మధయనుంచి నేను డ్రవ్ చేస్తుంటే చూస్తూ ఉందేది.ఆమెకి చిన్నగా ఉందే కార్లంతే చిరాకు,అందుకని నా పెద ప్లిమత్ కారులోనే వెళ్ళేవాళ్ళం.అడవులు,శిధిలగృహాలు ఎక్కడ ఉంటే అకక్డికి వెళ్ళడం ఆమె కిష్టం.కుతుబ్ మీనార్ దాటిన తర్వాత దూరంగ ఉండే చోట్లకి వెళ్ళడమంటే ఎక్కువ మక్కువ..ఒకరోజు,అలాంటి బేఫర్వా డ్రైవ్ మధ్యలో "నువ్వు నన్ను ప్రేమించటం లేదు" అనేసింది గబుక్కున బ్లేం చేస్తున్నట్టు.నే నన్నాను "నాకు తెలీదు, నేను దాని గురించి ఆలోచించ లేదు".1947 శీతాకాలం వచ్చేసరికి నావైపు నుంచి నేను చొరవ చెయ్యకపోయినా ఆమే నా గురించిన ప్రేమలో తలబంటిగా మునిగిపోయిందని నా కర్ధమైంది.నన్ను చూడగానే ముఖం వెలిగిపోతుండేది.ఆమె తన సొంత విషయాలు కూడా నాతో మాట్లాడుతూ ఉండేది.పెళ్ళయిన కొద్దికాలానికే తన భర్త తనని మోసం చెయ్యడం స్పష్టంగా తెలిసిందని చెప్పింది.తన కుటుంబం లోని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించినా అంత గట్టిగా నిలబడి అతన్ని పెళ్ళి చేసుకుంటే అతను చేసిన ద్రోహంతో నిజంగా ఆమె చాలా షాకయ్యింది.మొదట్లో తన చీరలు,బ్లౌజులు,హ్యాండ్ బ్యాగులు మాయమైపోతుండేవి. నౌకర్ల పనేమో అనుకుందట, ఒక పార్టీలో అవి ఇద్దరాడవాళ్ళ వొంటిమీద చూసేవరకు.ఈ ఇద్దరూ తన భర్తతో చాలా స్నేహంగా తిరిగేవాళ్ళు.తన బుక్ షెల్ఫ్ నుంచి పుస్తకాలు కొట్టేసి తన భర్త ఏ ఆడవాళ్ళ కిచ్చాడో వాళ్ళు కూడా తనకు తెలుసునని చెప్పింది.

          వీటన్నింటితో ఆమె నామీద ఆమెకున్న అభిప్రాయం ఏమిటో, నానుంచి ఆమె ఏమి కోరుకుంటున్నదో చెప్పేసినట్తయింది.నెను నాకున్న రెండు ఇబ్బందుల్నీ ఆమెకి చెప్పాను:(1)పెళ్ళయిన ఆడవాళ్లతో వెధవ్వేషాలేసి గొడవల్లో ఇరుక్కోలేను(2)ఆమె తండ్రి పట్ల నాకున్న విశ్వాసం అడ్డం వస్తున్నది.నెం 1 అబ్జెక్షనుకి వెంఠనే జవాబు చెప్పేసింది.కొంతకాలం ముందునుంచే ఆమె భర్తకి దూరంగా ఉన్నానని చెప్పింది.ఇంకా ఇలా అనింది "అతను నన్ను ముట్టుకునే వూహని కూడా భరించలేకుండా ఉన్నాను".ఇంకో రహస్యం కూడా చెప్పింది "అదృష్టవశాత్తు అతను నపుంసకుడైపోయాడు,ఆదపిచ్చి మాత్రం మిగిలింది".నెం 2 అబ్జెక్షను గురించి కోపం కూడా తెచ్చుకుని "దీంతో మానాన్న కేమిటి సంబంధం?నేను మైనర్నా!" అని అడిగింది.

          అప్పట్నుంచీ తను నాదగ్గిరే ఎక్కువగా గడిపేది - తనకి సంబంధించిన విషయంలో నేను తన తండ్రి గురించి ఆలోచించటాన్ని వెక్కిరిస్తూ ఉండేది.అయినా నేను మృదువుగా తిరస్కరిస్తూ వచ్చాను, మానసికంగా నేను సిద్ధపడకపోవటం వల్లనో లేక నాలో అంత వూపు రాకపోవడం వల్లనో నాకే తెలియదు.

          1947 నవంబర్ 18న నన్ను తన రూముకి తీసుకెళ్ళి పెదాల మీద ముద్దుపెట్టి "నేను నీతో పడుక్కోవాలనుకుంటున్నాను.రేపు సాయంకాలం నన్ను అడవుల్లోకి తీసుకెళ్ళు" అని చెప్పింది.నేను నాకు ఆడవాళ్ళ విషయంలో అంత అనుభవం లేదని చెప్పాను."ఇంకా మంచిది" అనేసింది.అలా ఆ 19న,అంటే తన పుట్టిన రోజున,కారుని నగరానికి దూరంగా కారడవి వైపుకి పోనిచ్చి ఒక ఏకాంత ప్రదేశాన్ని చూసుకుని సెటిలయ్యాం.తిరిగి వచ్చేటప్పుదు నాకు ఇబ్బందిగా అనిపించిన తన రొమ్మ్ముల్లో ఉన్న పాల(పిల్లాడికి పాలివ్వటం ఎప్పుడో మానేసింది) గురించి చెప్పాను.తర్వాత తను దాని గురించి ఏదో చెయ్యటంతో ఆ సమస్య తీరింది.నాకు సెక్స్ గురించి ఏమీ తెలియదని కనిపెట్టేసింది, రెండు పుస్తకాలు ఇచ్చింది, వాటిల్లో ఒకటి డా.అబ్రహం స్టోన్ సెక్స్ గురించి రాసింది.రెండూ చదివినాక కొంచెం బాగుంది.

          ఆమె మరీ మదనపీడితస్వైరిణి కాదు,తరచుగా శృంగారం కూడా కోరుకోదు.కానీ శృంగార సమయంలో మాత్రం ఫ్రెంచ్ స్త్రీ కేరళనాయర్ స్త్రీ కలగలిసిపోతే ఎంత కళాత్మకంగా ఉంటుందో అంత కళాత్మకంగా ఉంటుంది.ఆమె పదే పదే ఒకే రకంగా తీగలు సాగుతున్నట్టు పెట్టుకునే ముద్దుల్ని ఇష్టపడుతుంది.శృంగారంలో తనకి కావలసినదాన్ని మాత్రమే తీసుకుంటూ ఇతరులకి కావలసినది ఇవ్వకుండా తప్పించుకోవటంలో మంచి నేర్పుని సాధించి ఉంది.అమె అసదృశ నారి.అది తన స్త్రీత్వాన్ని నిరూపించుకుని ఆత్మరక్షణ చేసుకోవటానికి ఒక ఆయుధం మాత్రమే.ఆమె పడక మీద ఉన్నంతసేపూ రసోద్రేకంతో చెలరేగుతూ అరుదైన నేర్పుతో మెలికలు తిరిగే నాగిని లాంటి భామిని.మేము ప్రేమికులుగా ఉన్న పన్నెండేళ్ళలో ఆమెతో అనుభవం నాకెప్పుడూ తనివి తీరనిదే.

          పోనుపోనూ అప్పుడప్పుడు నాతో ఉండే లావాటి చుట్టాలామె అంటే ద్వేషం పెంచుకునింది.ఎప్పుడు ఆ లావాటి చుట్టాలామె వచ్చేతప్పుడు నన్ను స్నేహంగా కావిలించుకున్నా,చెంప మీద ముద్దుపెట్టినా ఆ లావాటి చుట్టాలామె మీద ఈర్ష్యాసూయలతో దహించుకు పోతుండేది.అప్పుడప్పుడు ఆ చుట్టాలమ్మ్మాయి తననీ నా "ఆమె"నీ సినిమాకి తీసుకెళ్ళమని అడిగేది.అప్పుడు నా "ఆమె" తెలివిగా నేను ఆ లావాటి చుట్టాలమ్మాయి పక్కన కూర్చోకుండా ఉండాలని తను మధ్యలో కూర్చునేది.

          ఒకసారి ఆ చుట్టాలమ్మాయి రేపు వస్తుందనగా "ఆమె" నన్ను చీకటి పడ్డాక వనవిహారానికి తీసుకెళ్ళమనింది.కారులో "ఏమిటీ హడావిడి?నాకు చాలా పనుంది" అనడిగాను.ఆమె "ఆ రుబ్బురోలు ఇక్కడున్నంతకాలం నేను నీకు దూరంగా ఉంటాను.తను నిన్ను ముట్టుకున్నాక నువ్వు నన్ను ముట్టుకోవటం నాకు కంపరంగా ఉంది" అనింది.అప్పుడు నేను లావాటి అమ్మాయి మీద నాకు ఎలాంటి మోహమూ లేదని ఆమెకి చెప్పాను.తర్వాత తర్వాత 'ఆమె' లావాటి చుట్టాలమ్మాయి చేష్టలకి అలవాటు పడింది.

          అప్పుడప్పుడు ఆమె ఎలాగోలా తన భర్త ఉన్నప్పుడు నేను తన రూముకెళ్ళి వాళ్ళిద్దరితో మాట్లాడేలాగ చెయ్యాలని చూసేది.నేను నా కలాంటి దాగుడుమూతల మీద ఆసక్తి లేదని చెప్పాను.దాంతో ఆమె తన భర్తనే అప్పుడప్పుడు నా స్టడీ రూముకి తీసుకొస్తూ ఉండేది.

          ఆమె తన పిల్లల్ని వాళ్ళ తండ్రికి దూరంగా ఉంచటానికి ఎన్ని రకాల పద్ధతులు వీలయితే అన్నీ ప్రయత్నించేది.ఆమె నాతో వాళ్ళ మీద తండ్రి ప్రభావాన్ని ఏమాత్రం ఉంచగూడదనుకున్నట్టు చెప్పింది,ఎందుకంటే అది పిల్లల్ని పాడు చేస్తుందని ఆమె నమ్ముతున్నది.ఆమె నిర్ధారణగా చెప్పింది "నేను నా పిల్లలు అబద్ధాలకోర్లుగా పెరగాలని అనుకోవట్లేదు" అని.ఆమె భర్త మరో గదిలోకి మారడానికి ఇది కూడా ఒక కారణం.

          ఒకసారి తన భర్త నాకు చెప్పిన ఒక విషయం గురించి ఆమె దగ్గిర ప్రస్తావించినప్పుడు ఆమె "తను చెప్పినదాంట్లో ఒక్క మాట కూడా నమ్మొద్దు.నేను ఎంతో నష్టపోవాల్సొచ్చింది అది తెల్సుకోవడానికి" అనింది.

          అతనితో విడాకులు తీసుకోవటం గురించి తన తలిదండ్రుల కిద్దరికీ స్నేహితుడూ తనకి కూడా తన శ్రేయొభిలాషి అనిపించిన ఏ.సి.యన్.నంబియార్ అభిప్రాయం కోసం ఆయనకి ఒక ఉత్తరం రాసింది.ఆయన కొన్ని పరిస్థితుల్లో వూహాస్వర్గపు ఆదర్శాల నుంచి బయటపడి వాస్తవంతో రాజీ పడటం మంచిదని జవాబు చెప్పాడు.ఈ విషయంలో నేనూ ఆమెని ప్రోత్సహించలేదు,ఆమె తండ్రికి ఇబ్బంది గనక.

          ఒకరోజు, తనొక హిందువుని పెళ్ళి చేసుకున్నాననే వూహనే భరించలేకపోతున్నానని చెప్పింది.దానికి నేను "యుగాల తరబడి హిందూమతం సృజించిన పురుషశ్రేష్ఠుల కందరికీ ఇది గొప్ప కాంప్లిమెంటు" అన్నాను.

          నేను ఎప్పుడూ ఆమేని నా బెడ్రూముకి రప్పించుకోవాలని ప్రయత్నించలేదు,ఆహ్వానించలేదు.ఒకే ఒకసారి వచ్చింది.అప్పుడు అర్ధరాత్రి దాటింది.మంచి నిద్దర్లో ఉన్నాను,అర్ధరాత్రి వరకూ పని చేసున్నాను;పక్కన కూర్చుని ముందుకు వంగి మెత్తని ముద్దుతో నిద్ర లేపింది."ఏమిటి సంగతి?" అనడిగాను,ఆమె:"రావాల్సొచ్చింది!" అనింది. మనసులో ఆమె పడుతున్న ఆందోళన ఏమిటో నాకు తెలీదు.నేను చెప్పాను:"సరే,నిశ్శబ్దంగా పడుకుందాం - అనవసరంగా ఏమీ చెయ్యకు".ఆమె అలాగే ఉదయం 4 వరకు ప్రశాంతంగా గడిపింది,తర్వాత లేచి మేద మీదకి వెళ్ళిపోయింది.వెళ్ళే ముందర "నీకు ఇదివరకెప్పుడూ చెప్పలేదు గానీ ఒకసారి నేను  ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను.ఇకముందు మాత్రం అలాంటి ఆలోచనలు రావు.నువ్వు నాకు పోయిన సంతోషాన్ని తిరిగిచ్చావు" అనింది.

          ఒకసారి,మా ప్రేమజీవితపు తొలినాళ్ళలో,ఆమె "నిన్నుకూడేవరకు నాకు నిజమైన శృంగారం అంటే ఏమిటో తెలియదు" అనింది.పడక మీద రసోద్రేకపు తారాస్థాయిలో,ఆమె నన్ను గట్టిగా తనకేసి అదుముకుంటూ "ఓహ్, భూపట్, ఐ లవ్ యూ!" అనేది.ముద్దుపేర్లతో పిలవడం పిలిపించుకోవడం ఆమెకి ఇష్టం.ఆమె నాకు బందిపోటు భూపట్ పేరుని తగిలిస్తే నేను ఆమేకి అతని ప్రియురాలు పుత్లి అపేరు తగిలించాను.మేము ఒక్కళ్ళమే ఉన్నప్పుడు ఒకళ్ళనొకళ్ళం ఆ పేర్లతోనే పిలుచుకునేవాళ్ళం.ఆమె ప్రేమాతిరేకపు పరవశంలోని పలవరింతల గురించి ఒకసారి రెండు కవితలు చహ్దివాను,బైరన్ రాసిన డాన్ జువాన్ నుంచి:

          ?Man's love is a man's life, a thing apart, It is a woman's whole existence. In her first passion woman loves her lover; In all others all she loves is love".

          ఆమె దానికి,"సరే,ఎన్నిసార్లు చెప్పాలనిపిస్తే అన్నిసార్లు,పక్క మీద కాదు,నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పాలి" అనీంది. నేను నా శక్తివంచన లేకుండా ఆమె ముచ్చట తీర్చాను.నిజానికి,అందులో పెద్ద్ద కష్టమేమీ లేదు,నేనప్పటికే ఆమెతో ప్రేమలో పీకలోతు కూరుకుపోయాను.

          ఒక సాయంకాలం,ఆమె మరీ వికలంగా కనబడింది.ఆమె నన్ను చూడగానే ఏడ్చెయ్యటం మొదలెట్టింది.నేను ఏం జరిగిందని అడిగాను.ఆమె తన డ్రెస్సింగ్ రూము నుంచి బయటికొచ్చి రోజూలాగే పాలు తాగబోయినప్పుడు,అందులో పొడి చేసిన గాజుముక్కలు కనిపించాయి.ఆ గాజుపొడి నురగ మీద తేలుతూ కనిపించింది.వెంటనే నోట్లోనే ఉన్న పాలని వూసేస్సింది.ఆమె తన భర్త దొంగలా తన బెడ్రూము వైపుకి తొంగి చూస్తూ పిల్లిలా జారుకోవడం గురించి చెప్ప్పింది.ఆఖరికి దుఃఖం తగ్గించుకుని, ఆమె తన చెతులతో నన్ను చుట్టుకుని గట్టిగా కావిలించుకుని "ఓహ్,మ్యాకీ,ఐ లవ్ యూ;నాకిప్పుడు నువ్వున్నావు - అదే సంతోషం" అనింది.

          మా మొట్టమొదటి విదేశయాత్రలో ఆమె మోంటె బ్లాంక్ కనుచూపు మేరలో ఉండగానే చాలా ఎగ్జైట్ అయింది.ఆమె మెత్తగా నాతో ,"క్వీన్ బీ అంటే నాకు చాలా ఇష్టం,గాలిలో తేలిపోతూ రొమాన్స్ చెయ్యాలనుంది" అనింది.నేను ఆమె నడిగాను,"నువ్వెప్పుడైనా డేగలా వినువీధి కెగిరి అక్కణ్ణించి ఈ ప్రపంచాన్ని చూస్తున్నట్టు కలగన్నావా>ఒకరోజు అలాంటి ఒక కలనుంచి మేల్కొన్నాక చూస్తే నేలమీద పడి ఉన్నాను,మంచం మీద నుంచి పడి ఎముకలు విరగ్గొట్టుకోకుండా".ఆమెకి తెలుసు నేను తన గాలి తీసేస్తున్నానని.లండన్ చెరాక,మొట్టమొదటి ఫ్రీ లంచ్ టైం దొరగ్గానే ఆమె కోరుకున్న ఒక చిన్న రెస్టారెంటుకి వెళ్ళాం. నేను తననే ఆర్దర్ చెయ్యమన్నాను.చేశాక,నేను కూడా అదే తీసుకుంటానాని చెప్పాను,అదనంగా ఒక ఆరు ఆయిస్టర్స్ చేర్చి.ఆమె తను కూడా అవి తీసుకునింది.ఆమె ఆర్డర్ చేసిన మెయిన్ డిష్ వీల్ చేప.ఆమె "ఇక్కడి కొచ్చిన దగ్గర్నుంచి,వీల్ తినడానికి నాలిక పీక్కుంటున్నాను" అనింది.నేను ఆమెని వాత్స్యాయన కామసూత్రాలు చదివావా అనడిగాను.ఆమె :లేదు,ఏం>: అని అడిగింది.నేను ఆమెకి వాత్స్యాయ్నుడు పెళ్ళికి ఆరునెల్లల ముందునుంచ్గి కొత్తజంతకి వీల్ వడ్డించమన్నాదని చెప్పాను.ఆమె రామాయణ మహాభారతాలు కూడా చదవలేదు.ఆమెకి రామాయణంలో తెలిసిందల్లా వాళ్ళ అమ్మమం చిన్నప్పుడు చెప్పిందే.ఎన్ని విధాల చూసినా,ఆమె ఈ దేశపు సంస్కృతికి సంబంధించిన మనిషి కాదు.

          ఆమెకి కృత్రిమగర్భనిరోధకసాధనాలు వాడటం ఇష్టముండదు.ఒకసారి యాభైల మొదట్లో నావల్ల ఆమె గర్భవతయ్యింది.ఆమె అబార్షన్ చేయించుకోవడానికి నిశ్చయించుకుంది.ఆమె తనకి తెలిసిన బ్రిటిష్ హై కమిషన్ డాక్టర్ దగ్గిరకి వెళ్ళింది:కాని అతను ఒప్పుకోలేదు.దాంతో ఆమె తబ పుట్టింటికి వెళ్ళి అక్కడ ఒక నమ్మకస్తురాలైన లేడీ డాక్తరును ఏర్పాటు చేసుకుంది.ఈ ప్రయాణంలో ఆమె రెండో కొడుకును కూడా తీసుకెళ్ళింది.ఒక పదిహేను రోజుల తర్వాత తల్లీకొడుకులు ఆ పిల్లవాడికి చిన్నప్పటి నుంచీ ఉన్న మాట్లాడ్డానికి సంబంధించిన సమస్య ఒకటి పోయిందన్న శుభవార్తతో తిరిగొచ్చారు.ఇదివర్లో ఆ పిల్లాదు "R" పలకలేకపోయేవాడు,తల్లి విపరీతంగా ఆందోళన పడుతూ ఉండేది;తల్లి స్పీచ్ కరెక్షన్ ఎక్స్పర్ట్ కోసం చలా హడావిడి పడింది.తిరిగొచ్చిన రోజు కలవగానే,మందులూ పాడూ అక్కర్లేకుండానే పనైపోయిందని చెప్పింది.

          ఆమె తండ్రికి మా ఇద్దరి అనుబంధం గురించి తెలుసా?తెలుసనే చెప్పాలి.ఎప్పుడు ఆమెతో కలిసి డిన్నరుకు వెళ్ళాలన్నా,ఆమె ఎక్కడ ఉంటుందో తనకి తెలుసు.బయలుదేరటానికి సరిగ్గా పదిహేనునిమిషాలకి ముందు,ఆమె తయారై నా రూము కొచ్చి కూర్చుంటుంది.సరిగ్గా టైముకి ఆయన నా గదిముందు నుంచి వెళ్తూ ఆమెని పిలిచేవాడు.

          1958 శీతాకాలంలో అనుకోకుండా ఒక దృశ్యాన్ని చూడాల్సొచ్చింది.లంచ్ చేసిన్ వెంటనే,ఒక ముఖ్యమైన విషయం చెప్పటానికి వెళ్ళాను.ఆమె అప్పటికే తలుపు మూసేసుకుని ఉంది,నేను తలుపు తట్టాను;ఒక అయిదు నిమిషాల తర్వాత తలుపు సగం తెరిచి సందులోంచి తొంగిచూసింది.కర్టెన్లు కిందకి దించి ఉన్నాయి,పొడుగాటి అందమైన యువకుడు,గడ్డం ఉన్న - ఒక బ్రహ్మచారి - రూములో ఉన్నట్టు కనిపించింది.నేను "నేను నీకో విషయం చెప్పాలి;సరే,తర్వాత చెప్తాన్లే" అంటూ తిరిగొచ్చేశాను.దాంతో మా ఇద్దరి బంధం తెగిపోయింది.ఆమె అది కేవలం "యోగా" అనీ "ఆధ్యాత్మికం" మాత్రమే ననీ నమ్మించడానికి చాలాసార్లు ప్రయత్నించింది.నేను తన సమర్ధనలన్నీ అనవసరం అన్నట్టు ఉండిపోయాను.నెమ్మదిగా ఆమె నామీద కోపం పెంచుకోవడం మొదలుపెట్టింది.నిజం చెప్పాలంటే,చివరాఖరికి బద్ధశత్రువుగా మారింది - నాకెప్పుడూ విలియం కాంగ్రేవ్ కవిత  గుర్తుకొస్తూ ఉండేది.

"Heaven has no rage like love to hatred turned; 
nor hell a fury like a woman scorned."

          ఆ సన్నివేశం జరిగిన పదిహేను రోజుల కల్లా అమే నాకు ఇష్టంగా రాసిన ప్రేమలేఖల్ని వెతికి ఆమెకి తిరిగిచ్చేశాను.ఒక సంవత్సరం తర్వాత పాత అకాగితాల్లో కొన్ని దొరికినాయి.వాతిని కూడా తిరిగిచ్చేశాను ఆమెకి.

          ఆమె భర్త చనిపోయేముందు రెండేళ్ళలో ఆమె భర్తా ఆమే కొంత దగ్గిరయ్యారని కొందరిలో ఒక అపోహ ఉన్నది.ఎవరేమి అనుకున్నా,వాళ్ళ మధ్యన రగిలింది హృదయాలు తిరిగి కలవననతటి కలహాగ్ని.అతను జబ్బు పడినప్పుడు దయగా ఉండటం సేవలు చెయ్యటం నిజమే.ఈ కాలంలో జరిగిన కొన్ని సన్నివేశాలు - అతన్ని సమాధి చేసినప్పుడు,భర్త అస్థికల్ని తీసుకోవటం అన్నీ ఒక ప్రచారవ్యూహంలోని భాగాలు.అవన్నీ ప్రజల్ని నమ్మించడం కోసమే,ఎందుకంటే అప్పటికే తను పూర్తి స్థాయి రాజకీయ జంతువుగా మారిపోయింది.

నేను ఎవరు?
23rd June, 1977

Saturday, 20 February 2016

గతమెంతొ ఘనకీర్తి గలవోడ!చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడ!!

          2001 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో 79 మిలియన్లు!ప్రపంచం మొత్తం మీద ఫ్రెంచ్ మాతృభాష అయినవాళు 75 మిలియన్లు.ఆంధ్రప్రదేశ్.తెలంగాణ రాష్ట్ర్రాలు రెండింటిలో కలిపి  61 మిలియన్లు,తమిళనాడులో 3 మిలియన్లు,కర్నాటకా చత్తీస్ గడ్ మహారాష్ట్రల్లో ఒక్కో మిలియన్ చొప్ప్పున వ్యాపించి ఉన్నారు.లక్షద్వీప్ నుంచి ఒరిస్సా వరకూ తెలుగువాళ్ళు అసలు లేని చోటంటూ లేదు.ఈ మధ్యన తెలుగువాణి తరపున స.వెం.రమేష్ గారు ప్రపంచమంతటా చుడుతున్నారు తెలుగువాళ్ళ జాడలు కనిపెట్టటానికి.ఇప్పటికి శ్రీలంక, బంగ్లాదేశ్, బెంగాల్ లాంటి చోట్ల ఉన్న తెలుగువాళ్ల వివరాలు చదువుతుంటే చదువుతున్న ప్రతిసారీ అశ్చర్యం, ఆనందం, విషాదం అన్నీఒకేసారి ముప్పిరిగొంటున్నాయి నన్ను. ఆశ్చర్యం దేనికంటే, ఇన్నాళ్ళూ తెలుగువాళ్ళు అంటే ఒక్క రాష్త్రంలో ఉన్నవాళ్ళ గురించే వూహించుకుంటూ గడిపేశాం గానీ ఎక్కడెక్కడికి వ్యాపించిపోయారు మనవాళ్ళు అని. ఆనందం దేనికంటే ఇక్కడున్న తెలుగువాళ్ళలా "అండి","రి" గురించీ "చెప్పాలె","చెప్పాలి"ల గురించీ కొట్టుకు చావకుండా భాషని నిజంగా ప్రేమిస్తూ దాన్ని వొదులుకోకుండా ఉంటున్నందుకు. విషాదం దేనికంటే పాపం వీళ్ళంతా పొట్ట చేతపట్టుకుని పోయి ఇప్పటికీ దిక్కు లేనివాళ్లలా బతుకున్నందుకు. వాళ్ళు తమ మూల రాష్ట్రాల నుంచి అండ అవసరమైన కడుబీదవాళ్ళు - కానీ ఇప్పుడిక్కడ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో ఇద్దరికిద్దరూ తెలుగుదనం మీద ప్రీతి లేని బందిపోట్లు!

          పక్కనున్న తమిళనాడులో అక్కడి ప్రభుత్వం దుర్మార్గంగా వేధిస్తుంటే కోర్టులు కలగజేసుకుని ఆపినాయే తప్ప చీమ కుట్టినంతగా కూడా చలించని వాళ్ళు ఎక్కడెక్కడో ఉన్నవాళ్ళ గురించి ఆలోచిస్తారా?అదీగాక వాళ్ళు వమెరికాల్లోనూ సింగప్పూరుల్లోనూ ఉండి రెండు చేతులా సంపాదిస్తూ బలిసిన వాళ్ళు కూడా కాదాయె - బుక్కా పకీరు వెధవలు, ఎందుకు పనికొస్తారు వీళ్ళు?కులము గల్గువాడు, గోత్రంబు గల్గువాడు, విద్యచేత విర్రవీగువాడు పసిడి గల్గువాని బానిస కొడుకులు అన్నాడు కదూ వేమన్న ఎప్పుడో! కులగోత్రాలను అడ్డుపెట్టుకుని గొప్పవాళ్ళవ్వాలని అనుకునేవాళ్ళూ, చదువుకున్నవాళ్ళం అని గొప్పగా చెప్పుకునేవాళ్ళూ పోయి పోయి డబ్బున్నవాళ్ళ చంకలు నాకడానికి ఎట్లా పోటీలు పడుతున్నారో ఇప్పుడు కూడా చూస్తూనే ఉన్నాం గదా!అలా డబ్బు కోసం ఆత్మలని అమ్ముకునే వాళ్ళు ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో ఆ సంస్కృతిని మర్చిపోవడంలో ఆశ్చర్య మేముంది?చక్కని భాష  కానివ్వండి,మంచితనం కానివ్వండి, తరాల తరబడి కొనసాగించుకుంటూ రావలసిన జీవనవిధానం కానివ్వండి - ఈ దబ్బుపిచ్చి లేనివాళ్ల దగ్గిరే సజీవంగా ఉంటున్నాయి!

          మియన్మార్ దేశంలో ఎన్నో తెలుగు సమూహాలు ఉన్నాయి.1960ల వరకు స్కూళ్ళలో తెలుగు సబ్జెక్ట్ ఉండేది.మౌల్మీన్ నగరంలో ఒక వీధికి "మల్లెపూల దిబ్బ" అని పేరు పేట్టుకున్నారు, ఎంత బావుంది!.తూర్పు మియన్మార్ ప్రాంతంలో తైలంగ్ సమూహం ఉంది - బహుశా చోళుల కాలంలో ఇక్కడి నుండి వెళ్ళిన వారు కావచ్చు!వారి నోట వినపడే ఒక జోలపాటలో దూరాన ఉన్న తెలంగాణ అనే ప్రాంతం గురించి గుర్తు తెచ్చుకంటున్నట్టు ఉంటుంది. "తెలుగదేల యన్న దేశంబు తెలుగు" అన్న శ్రీకృష్ణదేవరాయలు మరొక మాట కూడా అన్నాడు,"తెలుగు తలచిన దేశంబు తెలంగాణ్యము" అని కూడా అన్నాడు.అయితే ఆ తెలంగాణ 2014లో ఏర్పడిన పదిజిల్లాల తెలంగాణ కాదు, మొత్తం తేలుగు మాట్లాడే అన్ని ప్రాంతాలనీ భాషాపరంగా కలిపేసి తెలంగాణ ఆని పిలిచేవాళ్ళు అప్పట్లో!

          ఇవ్వాళ ప్రాచీన భాష హోదా కోసం గోదాలో దిగి పోటీలు పడుతున్నభాషలలో ఏ ఒక్క భాషని గురించి కూడా ఎప్పుడు పుట్టిందో నిర్ధారణగా ఎవరూ చెప్పలేరు.నిర్ధారణగా చెప్పాలంటే ఆధారాలు కావాలి, అదీ లిఖిత పూర్వకమైనవి కావాలి.కానీ అసలు తొలి మానవుడు గొంతు పెకలించి కేకలూ,అరుపులూ,గర్జనలూ,ధ్వనుల నుంచి ఒక లయను సృష్టించుకుంటున్నప్పుడు అతను వెంటనే దాన్ని వ్రాసి చూసుకోవాలని అనుకోలేదు - కొత్తగా పుట్టిన నాలుగైదు మాటల్ని తేలికగానే గుర్తుంచుకోవచ్చు కదా!మెల్లమెల్లగా పదాల వాడకం పెరిగి భాష విస్తృతమైనాకనే లిపి అవసరమైంది. ఒక విచిత్రం చూడండి - ఒక భాష చాలా ముందుగానే పుట్టినా చాలా కాలం వరకూ లిపి ఏర్పారుచుకోకుండా ఉండిపోయి,మరొక భాష దాని తర్వాత పుట్టినా ముందు లిపిని ఏర్పాటు చేసుకుంటే రెండవది ముందు పుట్టిందని తీర్మానించితే మొదటి భాషకి అన్యాయం జరిగినట్టే కదా!కానీ ప్రస్తుతానికి భాషల ప్రాచీనతని కొలవడానికి అంతకన్నా శాస్త్రీయమైన పద్ధతి కూడా లేదు గాబట్టి ప్రాచీనతకి లిపినే తీసుకుంటున్నారు.అలా చూస్తే తెలుగుభాష వయస్సు 2,400 సంవత్సరాలు. 

          క్రీ.పూ 525 నాటి చోళ రాజుల శాసనాలలో మరాఠీ ప్రాకృతంలో కలిసిపోయిన కొన్ని తెఉగు పదాల ఆనవాళ్ళు కనబడుతున్నాయి.క్రీ.పూ 200 నుండి క్రీ.శ 200 మధ్యలో రచించబడినదని భావిస్తున్న గాధాసప్తశతి మహారాష్త్ర ప్రాకృత భాషలో ఉన్నదే అయినా అక్కడక్కడా కొన్ని తెలుగు పదాలు కూడా కనబడుతున్నాయి.గాధ అంటే ఇప్పటి అర్ధంలో మనం చెప్పుకంటున్న కధ అని కాదు.ప్రేమ,హాస్యం,వేదాంతం మొదలైన అన్నింటినీ స్పృశిస్తూ హుషారును పుట్టించే పులిసిన ఫ్రెంఛి మద్యం లాంటి తొలి వచన కవితా రూపం!ఇప్పటి హైకూల మాదిరి చిన్నవిగా ఉంటాయి.కానీ చెళ్ళున తగిలే చెణుకులోనూ భావంలోని విరుపులోనూ ఇప్పటి హైకూలు అప్పటి గాధల ముందు దిగదుడుపే!

          తెలుగు భాష మొదట్లో ద్రవిడ మూలం నుంచి ఎదిగినా మిగిలిన అన్ని ద్రవిడ భాషల కన్నా ఎక్కువగా సంస్కృతంతోనూ కలిసిపోయి దానికి దీటుగా నిలబడగలిగింది. ప్రపంచంలోని ఏ భాషకైనా రెండు రూపాలు ఉంటాయి - గద్యం, పద్యం.అయితే ప్రపంచంలోని భాష లన్నిటిలోనూ దేనివలన సంస్కృతం ప్రత్యేకంగా నిలబడుతున్నదో ఆ చందస్సుని ఒక్క తెలుగు మాత్రమే సమర్ధవంతంగా ఇముడ్చుకుని కావ్యరచనలో సంస్కృత సాహిత్యానికి దీటుగా నిలబడింది.నన్నయ్యకు పూర్వమే తెలుగులో చందోబద్ధమైన కవితారచన గొప్పగానే జరిగింది.కానీ కావ్యరచనయే జరగలేదు. ఆ లోటును పూరించడానికే నన్నయ భారతాంధ్రీకరణ మొదలుపెట్టాడు. దానికన్నా తెలుగుభాషకి నన్నయ చేసిన మహోపకారం ఒకటి ఉంది. తెలుగుకి ఒక శుద్ధమైన వ్యాకరణం వ్రాయటం - అందుకే ఆయనని వాగనుశాసనుడు అన్నారు!ముందుగా తరతరాలకూ తరగని వెలుగై నిలవాలంటే భాష ఎట్లా ఉండాలో తీర్చిదిద్ది ఆ తర్వాత దానిని ఇట్లా ఉపయోగించుకోవాలి అని మహాభారత కావ్యరచన ద్వారా కొత్తదారి చూపించాడు.తర్వాతి కవులందరూ ఆయన చూపిన దారినే నడిచారు.అందువల్లనే ఆయనని ఆదికవి అంటున్నది. అప్పటి కాలంలోనే మనవాళ్ళు వ్రాసిన ఒక పాలిండ్రోం చూదండి:

కాళిదాసళిదాయోమా చంద్రంతేరిపురంజకమ్ |
కంజరంపురితేంద్రంచ మాయోదాళిసదాళికా|

          కర్ణాటక సంగీతం మొత్తం దక్షిణ భారతదేశ మంతటా వ్యాపించినా వాగ్గేయకారులు ఏ ప్రాంతం వారైనా తమ కృతుల రచనకి సంస్కృతం తర్వాత తెలుగునే ఎన్నుకోవటానికి కారణం దీని అజంత మాధుర్యమే!వినడానికి ఇంత తియ్యగా ఉన్నప్పటికీ దీన్ని నేర్చుకోవడం మాత్రం చాలా కష్టం,ఎందుకంటే, ఇది అల్లాటప్పా భాష కాదు, దీని వ్యాకరణం విభక్తులు,ప్రత్యయాలు,సంధులు,సమాసాలు వంటివాటితో కూడి ఉండి అచ్చు కుందేళ్ళ వంటి చిన్న చిన్న సాధుజంతువుల నుంచి సింహశార్దూలమత్తేభాల వంటి పెద్ద పెద్ద క్రూరజంతువులతో నిండి ఉన్న గహనాటవిని తలపిస్తుంది మరి!సంస్కృతం తర్వాత అంత సుసంపన్నమైనదీ,సంక్లిష్తమైనదీ అయిన తెలుగుభాష మీద గట్టిపట్టును సాధించటం మట్టిబుర్రలకి ఒక పట్టాన సాధ్యం కాదు!

          తెలుగుభాష కున్న అసలైన స్పెషాల్టీ ఒత్తులండోయ్!రెండు మూడు రకాల ధ్వనుల్ని పలికే అక్షరాల్ని కూడా ఒక్కటిగా కలిపి మాట్లాడెయ్యొచ్చు, దాదాపు అన్ని భాషల్లోనూ సంయుక్తాక్షరాలు ఉన్నాయి గానీ తెలుగుకి ఈ ప్రత్యేకత లిపిలో కూడా ఉండటం మరింత అపురూపం!దీనివల్ల మనం వింటున్న ప్రతి ధ్వనినీ పలకగలం, రాయగలం, చదవగలం!తెలుగుభాషని దాని ఒత్తులూ గుణింతాలూ దీర్ఘాలతో సహా స్వచ్చంగా పలకగలిగితే ప్రపంచంలోని ఏ భాషనయినా దాని సొంత ఉచ్చారణతో చాలా తేలిగ్గా మాట్లాడవచ్చు.దీని మీదనే ఒక తెలుగు  పండితుడు మంచి పద్యం కూడా రాసేశాడు!

క్రమముగ "శ్రీమ త్సకల గుణ సంపన్న"
యని యున్న జదివెడు నఱవవాడు

కడగి "చిరిమదు చగల కుణ చంపన్న"
యని,కన్నడము వాడు యొనసి

"సిరిమతు సగల గోణ" యని తోడనే
"శంపణ్ణ" యని,మహారాష్ట్రుండు పని వడివడి

జెలగుచు "శ్రీమతూ సెకల గుణానె
సంపన్నాసె" యని,యోఢ్రభాషణుండు

వెలయు "శ్రీమొతో సొకొలొ గుణ సొంపన్నో"
యని,యికెన్ని వేల యన్య భాష
లాంధ్రు డున్నయట్లెయలరు బఠించు
నంచు హాస్యవేది యాడు నాడు....
                                                                                           - శ్రీ కొక్కొండ వేంకతరత్నం పంతులు గారు


          చూశారుగా, తెలుగుభాష వేళాకోళానికి పనికివచ్చినంతగా మరే భాషా పనికిరాదు:-)తెలుగు కున్న మరో స్పెషాళ్టీ సామేత లండోయ్!ప్రోవెర్బులనీ అవనీ ఇవనీ అన్ని భాషల్లోనూ ఉన్నాయి గానీ తెలుగు సామేతల కున్న ప్రత్యేకఫ భావాన్ని బట్టి పదాల ఎంపిక విపరీతమైన తేడా వచ్చేస్తుంది.హాస్యం చిలికే సామెతల్లో వచ్చే పదాలు గుర్తుకొస్తే చాలు చక్కిలిగింతలు పెట్టినట్టు ఉంటుంది.అదే తాత్వికమైన సామెతలు గుర్తుకొస్తే మనస్సు గంభీరంగా మారిపోతుంది!ఈ వైవిధ్యం తెలుగుకి మాత్రమే సొంతం.

          తెలుగుభాష కున్న మరో ప్రత్యేకత కొత్త పదాల్ని పుట్టించుకోగలగటం, ఇతర భాషల పదాల్ని ఇముడ్చుకోగలగటం.ఏ భాషలోని ఎలాంటి పదానికైనా సరే చివర్న ప్రధమా విభక్తి ప్రత్యయాల్ని అతికించేస్తే చాలు అసలది ముందునుంచీ తెలుగు పదమేనేమో అనిపించేటట్టు తెలుగు పదమై కూర్చుంటుంది!కొత్తపదాల్ని పుట్టించటానికి ఉదాహారణ చెప్పాల్సి వస్తే స్వర్ణయుగపు తెలుగు సినిమా మాటల రచయిత పింగళి నాగేంద్రరావు గారినే చెప్పాలి. తన ప్రతి సినిమాలోనూ పాత్రల పేర్లలో గానీ పాటల్లో గానీ పాత్రధారుల సంభాషణల్లో గానీ ఎన్నో కొత్త మాటల్ని పరిచయం చేశారు.

          వడ్డెర, చెంచు భాషలు తెలుగుకి కొంచెం దగ్గిరగా ఉంటాయి.తెలుగు భాష లోని కొన్ని ప్రముఖమైన యాసలు దొమ్మర,దాసరి,సాలెవారి,తెలంగాణి,వరంగల్,పాలమూరు,గద్వాల,నారాయణపేట,శ్రీకాకుళం,విశాఖపట్నం,తూర్పుగోదావరి,పశ్చిమగోదావరి,నెల్లూరు,ప్రకాశం,గుంటూరు,తిరుపతి.సాధారణంగా ప్రపంచంలోని ప్రతి భాషలోనూ మంచి సాహిత్యం తన జన్మస్థానంలోనే పుడుతుంది. కానీ తెలుగు జన్మభూమి,కర్మభూమి అనే భేదం లేకుండా ఎక్కడున్నా చిలవలు పలవలుగా సాహితీ నిర్మాణం జరిగిపోతుంది.దీనికి కారణం అతి తేలిక్గా మౌఖిక సాహిత్యాన్ని పుట్టించగలిగే వెసులుబాటు ఉండటం - తన వేదనకి సాంత్వన కోసం గొంతెత్తి పాడుకోవటానికి అనువైన భాషలో సాహిత్యం పుట్టటానికి నిరుపహతి స్థలములూ,రమణీ ప్రీయదూతిక తెచ్చి ఇచ్చు కప్పుర విడెములూ,ఇంకెవరో తొడిగే గండపెండేరములూ అక్కర్లేదు కదా!

          తెలుగు మౌఖిక సాహిత్యం కుల పురాణాలు,కొలువులు-గేయ కధలు,సామేతలు అనే మూడు విభాగాల్లోనూ ఎంతో అద్భుతమైన స్థాయిని అందుకున్నది. తెలుగునాట ఉన్న 196 కుల్లాల్లో ప్రతి కులానికీ అనుబంధంగా వారి కులపురాణం ఉంది.గౌడ కులస్తులకు గౌడ పురాణం, చాకలి కులస్తులకు రజక పురాణం - ఈ కుల పురాణం ప్రతి కులం వారికీ తమ తమ సంప్రదాయిక విధుల్ని శాస్త్రోక్తంగా నెరవేర్చుకోవటానికి చాలా అవసరం.ఎవరో ఒకరు నిష్ణాతుడైన వ్యక్తి గానం చేసే పద్ధతిలో 3 గంటల నుంచి 14 రాత్రుల పాటు గానం చెయ్యగలిగిన విస్తృత స్థాయిలో ఈ కులపురాణసాహిత్యం ఉన్నది.దీనిని బట్టి ప్రస్తుతం మనం నమ్ముతున్నట్టు ప్రతి కులం వారూ తమ కులం మిగతా కులాల కన్నా తక్కువస్థాయిది అని అనుకోకుండా తమ కుల వారసత్వం పట్ల ఒక రకమైన గర్వాన్ని కలిగి ఉండేవారని అర్ధమవుతుంది!కొలువులు అంటే దేవతలకి జరిగే జాతరల వంటి ఉత్సవాలలో ప్రత్యేకించి ఆ దేవతని కొలుస్తూ పాడే పాటలూ, చెయ్యాల్సిన పూజల సంగతులూ ఉంటాయి.ఇక్కడ దేవత,సన్నివేశం,సాహిత్యం - ఈ మూడింటిలో దేన్నీ విడదియ్యలేనంత చిక్కురొక్కురుగా అల్లేసిన సాహిత్య రూపం కొలువు దరువు!ఈ మౌఖిక సాహిత్య సృష్టికర్తలలో ఉన్న ముఖ్యవిశేషం ఆవసరమైన చోట గీర్వాణ భాషనీ,గ్రాంధిక  రూపాల్నీ కూడా ఏమాత్రం నదురూ బెదురూ లేకుండా వాడుకోగలగటం!బుర్రకధలు,హరికధలు చెప్పేవారిలో కొందరు పౌరాణిక కధల్ని సంప్రదాయిక పండితుల కన్నా గొప్పగా వ్యాఖ్యానిస్తూ చెప్పగలగటం మనకు తెలిసిందే కదా!నిజానికి ఒక చందోబద్ధమైన కావ్యరచన కన్నా ఒక మౌఖిక సాహిత్య రూపాన్ని సృజించటానికే ఎక్కువ ప్రతిభ కావాలి.

          తెలుగుభాషకీ నేటి కాలపు తెలుగు,కన్నడ ప్రాంతాలను పరిపాలించిన ఆంధ్రశాతవాహనులకీ అవినాభావ సంబంధం ఉంది.మౌర్యులకు సామంతులైన వీరు మౌర్యుల మాదిరిగానే బ్రాహ్మీ లిపిని ఉపయోగించారు.దాదాపు చాలా ద్రవిడ భాషలు బ్రాహ్మీ లిపి నుంచే తమ భాషలకు లిపిని తీర్చి దిద్దుకున్నాయి.వాటిలో తెలుగుభాష ఒక్కటే తన లిపిని సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దుకోగలిగింది - ఈ అక్షరాల్ని చూస్తుంటేనే వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లల వలె ఎంతో ముద్దొస్తూ ఉంటాయి!



          ప్రతి అక్షరానికీ తిక్క లేని ఒక లెక్క ఉంది - అచ్చులు,హల్లులు అని రెండు ముఖ్యమైన వర్గాలు ఉన్నాయి. వీటిలో మళ్ళీ ఉచ్చారణలో నాలుక దేన్ని తగులుతుందనే దాన్ని బట్టి చేసిన దంత్యములు, తాలవ్యములు, ఓష్ఠ్యములు అనే మరొక విభజన కూడా ఉంది.సున్నా,అరసున్నా,విసర్గలు కూడా భావవ్యక్తీకరణలో ఎంతో ప్రాముఖ్యతని సంతరించుకుని ఉండేవి.అరసున్నాని ఇప్పుడెవరూ వాడటం లేదు గానీ ఒకప్పుడు దీనినీ విరివిగానే వాడేవాళ్ళు.పండితులు సభదీర్చి తీర్మానం చేసి దీనిని తొలగించదల్చినప్పుడు ఒక పండితుడు ఎలిజీ రాసి మరీ దుఃఖించాడు!

          జంతుశాస్త్రం చెప్తున్న దాని ప్రకారం ఇండియన్ అయినా,అమెరికన్ అయినా,రష్యన్ అయినా,చైనీస్ అయినా,జపనీస్ అయినా అందరూ ఒకే జాతి - మానవ జాతి.కానీ ఈ మానవ జాతిలో ఇవ్వాళ ప్రత్యేకించి విడదీసి జాతులుగా చూస్తున్న మానవ సమూహాల్లో ప్రతి జాతికీ ఒక మాతృభాష ఉంటుంది!రాజకీయంగా,సామాజికంగా ఎలాంటి స్థితిలో ఉన్నా ఈ భాషకి సంబంధించిన అస్తిత్వాన్ని కోల్పోవడం రెండు విధాలుగా మాత్రమే జరుగుతుంది - ఒకటి ఆ జాతి పూర్తిగా నశించిపోవడం,రెండు ఆ జాతి మరొక జాతి అధిపత్యంలోకి వెళ్ళడం!ప్రపంచంలో ఒకప్పుడు ఉండి ఇప్పుడు లేని సంస్కృతుల చరిత్రలలో ఎక్కువగా ఇదే జరిగింది.తెలుగుభాషకీ తెలుగుజాతికీ ఈ రెండింటిలో ఒకటి గానీ మూడవది గానీ అయిన దుర్గతి పట్టగూడదని కోరుకుంటున్నాను.దానికి మనం చెయ్యవలసింది స.వెం.రమేస్ లాంటివారికి మరింత ప్రోత్సాహాన్ని ఇవ్వడం.ఆంధ్ర - తెలంగాణ రాష్ట్రాల లోని ప్రజలు రాజకీయ నాయకుల విద్వేష ప్రసంగాలకి ఉద్రేకపూరితులు కాకుండా ఈ రెండు రాష్ట్రాల లోనే కాదు ప్రపంచంలోని అన్నిచోట్లా ఉన్న ప్రతి తెలుగు సమూహం గురించీ ఆలోచించాలి. వారిలో కొందరు మనకన్నా ఎంతో అధ్వాన్న స్థితిలో ఉన్నారు. మన ప్రభుత్వాల నుంచి సహాయాన్ని కోరుకుంటున్నారు.అంతటి అధ్వాన్న స్థితిలో ఉండి కూడా వారు తమని పలకరించటానికి వచ్చిన సాటి తెలుగువాళ్ళని ఆప్యాయంగా పలకరిస్తుంటే వారికన్నా ఎంతో కొంత మెరుగైన స్థితిలో ఉన్న మనం ఇక్కడ చిన్న చిన్న విషయాలకే ఒకరినొకరు తిట్టుకుంటూ కొట్టుకుంటూ సతమతమైపోతున్నాం!

          రాష్ట్రాన్ని విడదీసిన వాళ్ళు మీలాంటి నాలాంటి ప్రజల గురించి ఆలోచించి విడదియ్యలేదు - పై స్థాయిలో చేతులు మారే వేల కోట్ల విలువ చేసే కాంట్రాక్టులను ఎవరు దక్కించుకోవాలన్న లెక్కలతో కొందరూ,ఒక రాష్ట్రం రెండయితే అదనంగా సృష్టించబడే రాజకీయ పదవుల కోసం కొందరూ - తిలా పాపం తలా పిడికెడు అన్నట్టు చేశారు. అందుకే మనల్ని రెచ్చగొట్టి విద్వేషాలు పెంచిన అన్ని పార్టీల వాళ్ళూ ఇప్పుడు పదవుల్ని పంచుకోవడం కోసం వాళ్ళలో వాళ్ళు అంత ఐకమత్యంగా కలిసిపోగలుగుతున్నారు - కళ్ళు తెరుచుకుని చూదండి!ఈ మేకమెడచంటిపాల కోసం ఎంత ఆశపడినా లాభం లేదని త్వరలోనే తేటతెల్ల మవుతుంది ఎల్లరకూ!ఏ మనిషి ఏ దేశంలో ఏ కాలంలో వృద్ధిలోకి వచ్చినా అతని నైపుణ్యమే కారణం. మీలోని నైపుణ్యాన్ని పెంచుకోండి,అది ఆర్జనని పెంచుతుంది,అది ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది - అప్పుడు ఈ విభేదాలూ ద్వేషాలూ వాతంతటవే మాయమై పోతాయి.ఆ రోజున వెనక్కి తిరిగి చూసుకుంటే అనవసరంగా ఆవేశపడ్డామని పశ్చాత్తాపపడకుండా ఉండటానికయినా ఈరోజున కొంచెం విచక్షణతో ప్రవర్తించండి!

మనుషుల్ని కలపటానికి పుట్టిన భాషని మనుషుల్ని విడదియ్యటానికి వాడటం పైశాచికత్వం!

Friday, 19 February 2016

ఇలాంటి బుద్ధిమట్టం వాగుడుకే గదా తెలంగాణలో తెదెపా ఖాళీ ఐపోయింది!ఇంకా పునర్వైభవానికి కార్యకర్తల్ని పిలుస్తాడేంటి?

          చంద్రబాబుకి మీడియా కనిపిస్తే చాలు పిచ్చిదో ఎచ్చిదో ఏదో ఒక మాట అనకుండా ఉండలేని నరాల బలీనత ఉంది.దాని మూలంగా ఇదివరకు లేనిపోని తద్దినాలు కొన్నింటిని నెత్తిమీదకి కూడా తెచ్చుకున్నాడు,అయినా బుద్ధి తెచ్చుకోవటం లేదు!అమరావతి శంకుస్థాపన జరుగుతుంది."ఆహా అమరావతి ఓహో అమరావతి" అని ఎన్నైనా పొగుడుకోవచ్చు కదా,మధ్యలో పుసుక్కున "హైదరాబాదును తీసేస్తే తెలంగాణలో ఏముంది? అనేశాడు!వినగానే నాకు తెగ నవ్వొచ్చింది,తెలంగాణలో తెదెపా భూస్థాపితం అవడం మంచిదే అనిపించింది.లేకపోతే ఏంటి, రాష్త్రం విడిపోవటానికి తెలంగాణ వాళ్ళు చెప్తున్నదీ ఆంధ్ర ప్రాంతపు నాయకులు హైదరాబాదును తప్ప తెలంగాణలో దేన్నీ డెవలప్ చెయ్యలేదనే గదా!తెలంగాణలో హైదరాబాదు తప్ప ఏదీ కనబడకపోవటానికి తన బాధ్యత ఏమీ లేదా?

          కేసీఆర్ వాహనాల రీరిజిస్ట్రేషన్,గుడుంబాను తగ్గించటానికి కల్తీకల్లు పరిష్కారం లాంటి ఎన్ని పిచ్చిపనులు చేసినా మాట్లాడే మాటల్లో మాత్రం ఎక్కడా తప్పు పట్టటానికి వీల్లేకుండా మాట్లాడతాడు.హుస్సేన్ సాగర్ చుట్టూ 69 అంతస్థుల భవనాలు అన్నా, ఫలానా భవనం వాస్తు బాలేదు కూల్చి కొత్తది కడదాం అన్నా అవన్నీ కనీసం అతను ఇప్పుడున్న దాన్ని బాగు చేద్దామ నై కలగంటున్నాడు అన్నట్టు ఎలుస్తుంది - అవి నిజం చెయ్యగలడా,డాబుసరి కబుర్లా అనేది రేపటిరోజున గానీ తెలియదు.కానీ ఇవ్వాళ వింటున్నవాళ్ళకి వాటిలో తప్పు కనబదదు,క్రూరమైన కేసీఆర్ ద్వేషులకి తప్ప.ఎక్కదయిన అదొరుకుతాడు గానీ కరణం రాతలో ఒరకడన్ననత నిక్కచ్చిగా మాట్లాదతాడు కేసీఆర్!

          నేను విభజన తర్వాతి ఎన్నికల విశ్లేషనలోనే చెప్పాను తెలంగాణని కేసీఆర్ కొదిలేసి బాబు ఆంధ్రాకి పరిమితమవటం ఈ రెందు రాష్ట్రాలకీ మంచింది అని.కేసీఆర్ వోటుకు నోటు లాంటి వ్యూహం వేస్తాదని నేను అప్పడే వూహించాను.ఆగండాగండి,భవైష్యత్ దర్శనం లాంటి సక్తుల్ని గురించి సొంత దబ్బా కొట్టుకుంటునానై అనుకోకండి.బాబు కేసీఆర్ ప్రజ్ఞని తక్కువ అంచనా వేశాడు గానీ నాకు మాత్రం కేసీయార్ గురించి ఎలాంటి తక్కువ స్థాయి అభిప్రాయమూ లేదు.తెదెపాని ఖాళీ చేయించకపోతే కేసీయార్ ఖాళీ అయిపోతాడు!

          తెదెపాని ఖాళీ చేయించటం కేసీయార్ యొక్క ప్రధమావసరం గనక ఖచ్చితంగా ఇప్పుడు  కనబడుతున్న వోటుకు నోటు కేసు లాంటిదాన్ని సినిమా కధలాగా నేను వూహించ లేదు గానీ అలాంటి వ్యూహం ఒకటి తప్పకుండా వేస్తాడు అని అనుకుంటూనే ఉన్నాను, వేశాడు!ఆంధ్రావాడిగా కేసీయార్ దాడిని వ్యతిరేకించినా అది బాబు స్వయంకృతం అని మీకూ నాకే కాదు బాబుకి కూడా తెలుసు.కేవలం తెలంగాణని విడగొట్టి వదిలెయ్యకుండా అభివృద్ధి లోకి తీసుకు రావడం కోసం ఇప్పుడు మొత్తం తెలంగాణలో కేసీయార్ కన్న సమర్ధుడు మరొకడు లేడు.కాబట్టి అతనికి ఇబ్బందులు కలిగించకుండా ఉంటమే ఉత్తమం.అందుకోసం అన్ని పార్టీల లోని పనికొచ్చే వాళ్ళని ఆకర్షించినా తప్పు లేదు.మరి ఇంతకాలం హెందుకయ్యా హరిబాబూ నిప్పులు చెరిగావు కేసీయార్ మీద అంటారా - విషయాని బట్టి తప్ప ఏ మనిషినీ నేను దుర్మార్గుడు,సన్మార్గుడు అని గీత గియ్యను!నేను నిలబడిన ఒక సన్నివేశంలో నా ఎదుట నిలబడిన మనిషి తప్పు చేస్తే వ్యతిరేకిస్తాను,అదే మనిషి మరో సన్నివేశంలో ఒప్పు చేస్తే మెచ్చుకుంటాను - అదీ నా పద్ధతి.

          ఇకనుంచయినా బాబు "రెండు కళ్ళు","తెలుగువాళ్ళని కలపటం" మర్చిపోతే బాగుంటుందని నా కోరిక.ఆ మాటలు విన్నప్పుడల్లా నాకు చీమలూ జెర్రులూ పకౌతున్నట్టు ఉండేవి.విడిపోయిన మూడేళ్ళ తర్వాత కూడా ఎప్పుడో మమ్మల్ని వెక్కిరించారనీ "చెప్పాలె" అనుకోనివ్వలేదనీ ఏడ్చేవాళ్ళతో ఎవడు కలవగలడు?పాపం ఇప్పుడు బాబుకీ అనిపిస్తుంటుందేమో లెండి రెండు కళ్ళు గుర్తొచ్చినప్పుడల్లా గుడ్డికన్ను మూస్తే ఎంత తెరిస్తే ఎంత అని:-(

పెరుగు పెరుగే,మజ్జిగ మజ్జిగే!ఆంధ్రా ఆంధ్రాయే,తెలంగాణ తెలంగాణయే

Thursday, 11 February 2016

ఏందిరా ఫణీంద్రా!పక్కోని యాసని తప్పుడు బాసంటుండావు,నీ కతేంది?

          మంచి గొడ్డుకో దెబ్బ,మంచి మనిషిలో మాట!మాటంటే మాటలు గాదురా బోసడికే!?అసలెందుకు మాట్టాడాలె మనిషి?మాట ఎందుకు పుట్టింది!సమస్త జంతుజాలం నుంచీ మనిషనే జంతువు ఎట్టా విడిపడిందో తెలుసునా?మొదట తిన్నంగ నిలబడుడు నేర్చుకునె,దాని మూలంగ గరిమనాభి సెంటరు కొచ్చి మోతబరువు తగ్గి దూరాభారం పోవుడులో యాష్త తగ్గిండ్లా!అందును జేసి బుర్ర కొంచెం పెరిగిండ్లా?రెండోటిది బొటనేలు, మనిషికి దగ్గిర చుట్టమైన కోతుల్లో గూడ బొటనేలు అన్నింటి తీర్న ఒక పక్కకే ఉండంగ మనిషి కొక్కనికే సుట్టుదిరిగి ఎదురుబొదురు కొచ్చినాది!పనిముట్లని వాడనీకి పట్టు దొరికి మనిషి పూనుకుని పనులు జేసెడి సౌకర్యం అమిరిపాయె!అన్ని జంతువులూ దొరికింది తింటుండంగ మనిషి మాత్రం వండుకుని తినుడు నేర్చిండు!ఉపాయం తోని పనిముట్లు వాడుకుంటు నాగరీకం నేర్చిండు.తొలి పనిముట్టు చక్రం,ఇప్పుడు గూద వాచీల కాడి నుంచి అన్ని మెషీన్లల తిరిగేటి చక్రమొకటి ఉంటాది,యెర్కనా?!

          ఒక్కడు జేసేటి పనికి సాయమక్కర్లె, మాటలూ అక్కర్లె - తలొంచుకుని తనపని తను జేస్కొనుడు జాలు!మరి తోటి మనిషి సాయం లేంది పని జరగనప్పుడు ఏం జెయ్యాలె?పక్కోనికి నీకేం గావాలో సమజయ్యే తీర్న చెప్పాలె,వాని సాయం అడిగి పుచ్చుకోవాలె.అందుకోసరం పుట్టినాయిరా సమస్త భాషలూ ఇడియట్టాఫిండియా!అచ్చరాలే గాదు బొమ్మలూ గీతలూ గూడ భాషలోని భాగమే!గీతల్నె కంటికింపుగ వొంపులు దిప్పితె అచ్చరాలుగ మారబట్టె!నీ సాటోడు గుండు మధుసూదన కవిగారు ఏ జెప్పిండో ఇనలే - తీర్ల తీర్ల సక్కంగ జెప్పుండె!తెలుగు భాష నాలుగు రూపాల్లో ఉంటది.శుద్ధ గ్రాంధికం:నువ్వూ నేనూ గూడా దాన్ని గురుముఖతా నేర్వంది పట్టుబడనిది - తెలియనోనికి ఇనుప గుగ్గిళ్ళు నమిలినట్టే ఉంటాది.సరళ గ్రాంధికం,విశ్వనాధ సత్యనారాయణ రాసిండు - సోషల్ నవల్సు గూడ అందులోనె జమాయించిండు!గిది కొంచెం పర్వాలె, కూడదీసుకుని సద్వంగ అర్ధమయితది!ఇంగ సరళ వ్యావహారికం,ఇక్కడినుంచే నీ ప్రాంతానికీ నా ప్రాంతానికీ తేడా ఉంటది.ఇందుల గూడ గబుక్కున కొత్తమాట వినబడితె కష్టముంటది గాని సరళ గ్రాంధికమల్లె సోంచాయిస్తె  అర్ధమయితది!శుద్ధ గ్రామ్యం,ఇంగ జూస్కో నాస్సామిరంగా - ఇందుల గానీ నువు రెచ్చిపోయి నీ జిల్లా యాస మాట్టాడ్తివా ఆంధ్రోడు గాదు నీ తెలంగాణలో నీ పొరుగు జిల్లావోడే దిమ్మదిరిగి గింజుకుంటడు - కొంచెం ట్రై జేసి చూస్తవా బిడ్డా!

          నీ ప్రాంతంల నీకు నచ్చి నువ్వు వాడే "చెప్పాలె" వాడిక ప్రశస్తం అంటవు,మేము మా ప్రాంతంల మా ఇష్టం కొద్ద్ వాడే "చెప్పాలి" వాడిక దౌర్భాగ్యం అంటవు తెలుగు భాష నీ యబ్బ సొత్తా - 23 జిల్లాల తెలుగోళ్ళందరి ఉమ్మడి సొత్తురా బటాచోర్!తాతల నాడు ఎవడు ఎవణ్ణి ఏమన్నడో గా చరిత్రల సొడ్డు గిప్పుడేల!చెప్పాలె అనొద్దని యేబదేండ్లుగ మెడమీద కత్తిపెట్టి ఎవడైన ఆపిండా నిన్ను?అన్నా,ఒకటి జెప్త ఇను!నీ లెక్కనే రైటనుకుంటె మావోడు మీవోణ్ణి అన్నడని ఒపుకుంటె పడ్డవాడు చెడ్డవాడు గాడనీ అన్నవాదే చెడ్డవాడనీ నేనొప్పుకుంట,మరి గీ దినాన "చెప్పాలి" ప్రామాణికం గాదని మా యాసను గేలి చేస్తుండవ్, నువ్వు మంచోని వెట్లయితవ్?యెన్ని తరాల ముందరి నుండి మీ ప్రాంతమోళ్ళు "చెప్పాలె"నీ మా ప్రాంతమోళ్ళు "చెప్పాలి"నీ వాడుతున్నరో నీకు దెల్వకుంటె అది మావైపు వాడికెలో లేనే లేనట్టు "లి"లోని ఇకారం ఎరిక పరమాత్ముడు జెప్పాలని గూడ కూసినావు దేముడు నీ ఇంటి కుక్కా?నీ యాసని దేముడు పుట్టించిండా,  మా యాసని దెయ్యాలు పుట్టించినయ్యా!

          మాట్లాడే భాషకి రాసేటి భాషల సాక్ష్యమడుగుతవు, గ్రాంధికంల ఉన్న "చెప్పవలె"కి నువ్వు వాడే "చెప్పాలె" దగ్గిరా మేము వాడే "చెప్పాలి" దూరమూ అంటవు - అయితే ఏంది నీ గొప్ప?నీ లెక్క జూసినా అచ్చ తెలుగు మాది అద్దె తెలుగు నీదీ అయితది లెక్క జూసుకో!ముఖే ముఖే సరస్వతి అన్నది సర్వభాషలకీ వర్తించే లెక్క!రాసెడి భాషలో లేనివి గూడ వాడుక భాషలో ఉంటవి,కన్యాశుల్కంల గురజాడ లంజన్నడు,ముండన్నడు - మరి కవులందరు వాదరేంది?చనువుంటే బామ్మర్దినీ బావనీ గూడ బూతుమాటతోని పలకరిస్తవు - అయ్యన్ని పుస్తకాల కెక్కవు!గాన నువ్వు "చెప్పాలి"కి ప్రామాణిక సాక్ష్యం గ్రాంధికంల జూసుడు తప్ప!అందరి తెలుగుల మా చెప్పాలె గొప్పది మీ చెప్పాలి చెత్తది అంటున్న నువ్వు మంచోనివా మా చెప్పాలి గొప్పదే మీ చెప్పాలె గొప్పదే అంటున్న నేను మంచోడినా -  తమ్ముడు తనవాదైనా తగువులో ధర్మం జెప్పాలనే బుద్ధిమంతుడు నీ గడ్డ మీద ఉండినట్లయితే అడిగి తేల్చుకో!

          నీ పేరుల ఉన్న ఆచార్యత్వం నీ తీరుల యేది?ఆచార్యత్వ మనంగనె సమదృష్టి ఉండాలె!సమదృష్టి ఉంటె "చెప్పాలె"నీ "చెప్పాలి"నీ ఒక్క తీర్న జూసెటోనివి - సమదృష్టి లేని నీకు ఆచార్యత్వ మేల దాన్ని తీసిపారెయ్!విడిపోయి రెండేండ్లాయె,విడిపోయి కలిసుందమన్న గాడ్దెలు గమ్మునైన ఉండక రోజుకో గాడిద గత్తరేంది?నిన్న గాక మొన్న శ్రీకాంత చారి గోదావరోళ్ళ "అండి" మీద బడి వాక్యంల బరువని ఏడుస్తడు మోసేది గోదావరోడు గద వానికేంది నెప్పి,నువ్వీ దినాన "చెప్పాలి" మీద యాడికెల్లి వచ్చిందో తెల్వదని ఏడుస్తవు - ఏందిర మీ యేడుపు?!నీ యాస నీది నా యాస నీది - యేల రంధి?నా కృష్ణ యాస ఇసుమంత గూడ నాకెర్క లేదు,అందుకు నేను యేద్వను గూడ లేదు!దేని కేడ్వాల నేను?నా మాట అందరికి మంచి చెప్పెడిది గాన అందరికి బోధపర్చనీకి యాస లేని భాషల జెప్తున్న!నీకు నీ ప్రాంతపు యాస ఒక్కటే ప్రీతి గాన నా ప్రాంతపు యాసను జూసి ఏదుస్తున్నవు,నాకు అన్ని యాసలూ ప్రీతి గాన నీ ప్రాంతపు యాసను జూసి యేడుస్తలేదు - గిదే ఫైనల్,మర్ల మా యాసను తప్పుడు దనకు!

          యేందిరా బొంకుల దిబ్బ పౌరాణిక పాండిత్యంతోని విశ్వామిత్రుడి శాపం మాకొక్కనికే తగుల్తదని వాగుతున్నవు?నిన్నటి దంక మేమే అసలైన ఆంధ్రుల మంటివి,నా బ్లాగు తలకట్టున ఆంధ్ర రసజ్ఞ అని ఉంచితి నంటివి -  మరి నీవెప్పుడు ఆంధ్రత్వం నుండి జారిపోతివి?మొన్ననా  అటు మొన్ననా లేక గిరీశం లెక్కన ట్వంటీ ఫోరవర్సు ముంగల ట్రూ రెపెంటెన్సు అధాట్న నిన్ను ఆంధ్రత్వం నుండి లాగేసినట్టు ఈ బుర్రతిరుగుడు మాటలేంది?నీ చెత్త మాటల్ని గూడ నెత్తిన బెట్టుకున్నోడే తెలంగాణనీ ఇష్టపడినట్టు దీర్ఘాలు తియ్యకు.తెలంగాణ అంటే నువ్వొక్కనివే గాదు.మర్యాద తెలిసిన తెలంగాణ గడ్డ మీద బుట్టిన యే పెద్దమనిషి గాని నన్ను తప్పు బట్టడు!నువ్వు నా యాస మీద కచ్చి బట్టి చేస్తున్న దాడిని తిప్పికొడుతున్న నాలోని శౌర్యాన్ని చూస్తడు!మర్ల మర్ల చెప్పలేదనకు, నేను శ్యామలీయం వోలె శాంతమూర్తిని గాదు - నేను సర్వశక్తులూ క్రోడీకరించుకుని పూర్తి బలంతో కొడితే తట్టుకోగలిగినోడు ఈ సమస్త భూ మంలం మీదనే లేడు - ఇది మైక్ టెస్టింగు లాంటి రెహార్సల్ మాత్రమే!


మీ ఇంటికి మా ఐల్లెంత దూరమొ మా ఐంటికి మీ ఇల్లంతె దూరము - బుద్ధి గలిగి ఉండు, లొల్లి బెట్టకు!

ఏది ప్రణయ మేది ప్రళయం - ఏది సాధుజీవనవైభవం?

ప్రణయం అంటే మనసుల్ని కలిపేది - హాయి నిస్తుంది,అవునా?
ప్రళయం అంటే తనువుల్ని నలిపేది - చావు తెస్తుంది,అవునా?

ఒకరికి ఒకరై ఒద్దికగా కలిసుంటేనే అది దాంపత్యం,అవునా?
ఎవరికి వారై దారులు వేరైతే బలవంతపు తద్దినం,అవునా?

"జనం కోరింది మనం శాయడమా?మనం చేసింది జనం చూడడమా?" అని పింగళి డింగరి శిస్యుణ్ణి అడిగాడు!
"కోరికల వెంట అడ్డదిడ్డాన పరిగెత్తడమా?కోర్కెలకి కళ్ళెమేసి రహదారిన పోవడమా?"  -  చిచ్చరపిడుగు ప్రశ్న?

శృంగారం రుచిచూపించి బాలచంద్రుణ్ణి తన కడకొంగున కట్టెయ్యడమా?
రసభంగం చేసి తన పతిదేవుణ్ణి హంవీర చూడామణిగా నిలబెట్టడమా?
మగువ మాంచాలకి కలిగిన సందేహానికి కన్నతల్లి చెప్పిన ధర్మసూక్ష్మం -
ఒకటి నీ సౌభాగ్యాన్ని నిలబెడుతుంది, ఒకటి నీ భర్త శౌర్యాన్ని నిలబెడుతుంది,
అయితే ఇట్లాంటివి పరులు నీమీద రుద్దరానివి గనక నీకు నువ్వే తేల్చుకో అని!
మాంచాల రెండవది కోరుకున్నది గనకనే దంపతు లిద్దరూ ధన్యజీవు లయ్యారు,లేకుంటే?!

భర్త సానిని మరిగాడని తనూ తప్పుదారిన నడిస్తే మాంచాలని ఇప్పుడెవరు తలిచేవారు?
మాల కొంపల్లోనూ మహా పతివ్రత లుంటారు రాచ కుటుంబాల్లోనూ రంకులాడు లుంటారు!
సతీత్వం పుట్టుకతో రాదు - ఋణమూలం,నదిమూలం,స్త్రీమూలం ఎప్పుడూ అడగకూడదు.

మనసునూ తనువునూ కలిపి మగనికి అంకితమిచ్చిన మగువ పతివ్రత గాని
మనసును చంపి తనువును పదిమందికి పంచిన మగపోడుముల పడతి కాదు.

మనసు నొకనారికే అంకితమిచ్చి ఆలిని రాణిని చేసినవాడల్లా రాముడు గాని
కులకాంతను కాలదన్ని సానుల కోసం పోయేవాడు అసలు పురుషుడే కాడు.

స్వాధీన మనస్కులు కానివారు కోరికల పద్మవ్యూహంలోకి దూకి క్షేమంగా బయటపడే దెట్లాగ?
హరోంహర యని నైతికపతనపు అగ్గిలో దూకినాక చివరకు మిగిలేది గాలికెగిరే బూదియే కదా!

వస్తువాహనాల్లో వైభవాల్ని లెక్కిస్తే అవి పగిలిపోయినప్పుదు దుఃఖం కలుగుతుంది.
మనుషుల్ని దబ్బుని బట్టికాక దమ్ముని బట్టి తూచినప్పుడు దుఃఖం తొలగుతుంది.
మనసున పుండై పరులకు పండై జలపాతంలా కాక సెలయేరులా బతికేది సాధుజీవనవైభవం!

Tuesday, 9 February 2016

రాష్ట్రం వచ్చెననీ జీహెచ్చెంసీ పీఠం దక్కెననీ సంబరపడగానే సరిపొలేదోయ్!చెప్పినవన్నీ చేసి చూపించి అప్పుడు కాలరెగరెయ్యవోయ్!

          గొప్పగా పరిపాలించి ప్రజల్ని మెప్పించటం ఎన్నికల్లో గెలవటం ఒకటి కాదు.ఎన్నికల్లో గెలవటానికి సంబంధించి సెఫాలజీ అని ఒక సైన్సే ఉంది.దాని ప్రకారం ప్రతి ఎన్నికకీ ఒక స్వింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది.అది 4% ఏ అభ్యర్ధి వైపుకి మొగ్గినా వూహించని ఫలితం వస్తుంది.అన్ని పార్టీలూ మైనారిటీలని బుజ్జగించడం దగ్గిర్నుంచీ తెరాసా బృందమంతా సెటిలర్లని బుజ్జగించడం కోసం పడరాని పాట్లు పడేది ఆ ఉయ్యాల తమవైపుకి వూగి తమని అందలం ఎక్కించే వూపు రావడం కోసమే!అన్ని ఎన్నికల్లోనూ ఇప్పటిలాగా సెటిలర్ల మాదిరి స్వింగ్ స్పష్టంగా ఉండదు,ఒక్కోసారి అప్పటివరకూ స్వింగ్ ఫ్యాక్టర్ అనుకున్నది కాక మరొకటి స్వింగ్ ఫ్యాక్టర్ స్థానంలోకి రావచ్చు,ఎన్నికలకి ఒక్కరోజు ముందు ఈ స్వింగ్ ఫ్యాక్టర్ ఎదురుతన్నినా చాలు అద్భుతమైన తెలివితేటలు చూపించి ఆరునెల్లు ముందునుంచీ ప్లానులేసి చేసిన ప్రయత్నాలన్నీ మట్టిపాలే,రిజల్టు ఢాం తుస్సు మనాల్సిందే:-)


          అందుకే నేను కేటీఆర్ సైలంటుగా పనిచేసి గెలుపు ఖాయం అనిపించుకుంటే కేసీఆర్ వైలెంటుగా పోయి స్వింగుని రివర్స్ చేస్తున్నాడేమోనని కంగారు పడ్డాను.కానీ జనం తెలివి జనం చూపించారు.వాళ్లముందు ఉన్నది ఒకే ఒక ఆప్షన్,తెరాసాని సమర్ధించడం - కేసీఆర్ దాన్నే బలంగా నొక్కి చెప్పాడు!ఒకవేళ పంతానికి పోయి వేరే పార్టీని గెలిపించినా మనోడు గెల్చినవాళ్ళని ఆ పార్టీలో ఉండనివ్వడు గదా:-)గెల్చినోడికల్లా గులాబీ కండువా కప్పేస్తుంటే జనం మళ్ళీ వేరే పార్టీకి వోటెయ్యడం దేనికి:-(కాబట్టి కేసీఆర్ గారికి ఖర్చూ రిస్కూ తగ్గించారు సెటిలర్లు!ఇక ఈ సెటిలర్లు ఆ ముద్ర చెరిపేసుకుని తెలంగాణలో మనస్పూర్తిగా లీనమైపోయి బతకడం బెస్టు!పొరుగు రాష్ట్రపు ముఖ్యమంత్రి ఎంతకాలం హైదరాబాదులో ఉంటాడు వీళ్లని కాపలా కాయడం కోసం - అందుకే చంద్రబాబు నాయుడు ప్రచారం కూడా నీరసంగా ఉంది. ఓటుకు నోటు కేసుకి ముందు తేలంగాన అంతా పరవళ్ళు తిరిగినప్పటి ధీమా లేకపోవడం తెలుస్తూనే ఉంది.అయితే రెరాసాతో సహా గుర్తుంచుకోవలసిన విషయం ఈ స్వింగు మహా ప్రమాదకారి.కాబట్టి తెలంగాన సెంటిమెంటు ఎప్పటికీ స్వింఫులా ఉండకపోవచ్చు.తేలంగాణా తెలుగుదేశం కూడా మరీ నీరసించి పోవాల్సిన పని లేదు.కలం గడిచే కొద్దీ ప్రభుత్వ పనితీరు లోని లోపాలు అధికార్ అపక్షానికి ప్రతికూఅల స్వింగుని తయారు చహెస్తాయి - దాని పట్టుకోవటానికి సిద్ధంగా ఉండాలి.కాకపోతే ప్రతీదానికీ బాబు మీదా చినబాబు మీదా ఆధారపదకుండా సొంతంగా నిలబడాలి.నాయకులు ఫ్యాక్తరీలో పుట్టుకురారు గానీ అవస్రమేఅ న్నిట్నీ నేర్పిస్తుంది.తెలంగాణ భాజపా కూడా తెలుగుదేశంతో అంటకాగడం మానేసి సొంత బలాన్ని పెంచుకోవాలి.మిత్రపక్షంగా ఉన్నందువల్ల కేసీఆర్ 667678 పత్ల ఖచ్చితంగా ఉదారంగా ఉంటాడు.ISIS బ్రాంచీలనే తెరిచిన దుస్థితిని ఎదుర్కోవాలంటే భాజపా బలం పెంచుకోక తప్పదు!ప్రస్తుతానికి ఆంధ్రాలో మిత్రపక్షంగా కొనసాగుతున్నందువల్ల ఇక్కడ ఒకరినొకరు విమర్శించుకుంటే ఇద్దరూ లోకవ అయ్యే ప్రమాదం ఉంది గనక మరీ తిట్టుకుని తన్నుకుని విడిపోయే ప్రేయసీప్రియుల మాదిరి ఓవరాక్షన్ చెయ్యకుండా హుందాగా విడిపోయి ఎవరి బలాన్ని వారు పెంచుకుంటే ఇద్దరికీ మంచిది!


          ఇప్పటి వరకూ రాజదానిలో పాగా వెయ్యలేని బెంగ తీరింది గనక తెలంగాణ ముఖ్యమంత్రి ప్రశాంతంగా పని చేసుకోవచ్చు.ఎన్నికల సమయలో తాము వస్తే తెలంగాణకి చేస్తామని చెప్పిన అప్పటి భవిష్యత్ ప్రణాళికల నుంచీ అధికారంలోకి వచ్చాక కూడా తప్పనిసరిగా చేస్తాం అంటూ చాలా ఆశల్ని జనంలో మొలకెత్తించారు.అయిదేళ్ల పాలనాకాలంలో మూడేళ్ళు గడిచిపోయినాయి.ఏ రాజకీయ పార్టీ నాయకుడూ చెప్పని విధంగా నాలుగేళ్ళు తిరిగేసరికి మేము చెప్పినవన్నీ చేసి చూపిస్తాం,అలా చెయ్యలేకపోతే మిమ్మల్ని వోట్లు అడగం అన్నారు.ఆ మాటని జనం చెక్ చేసుకోవటానికి ఇంకొక్క సంవత్సరమే ఉంది.మామూలు రొడ్డకొట్టుడు వాగ్దానాలని జనం తేలిగ్గానే మర్చిపోయి ఉండేవాళ్ళేమో గానీ ఇది మీరు ప్రత్యేకంగా నొక్కి చెప్తున్నది గాబట్టి ప్రజలు కూడా గట్టిగానే గుర్తుంచుకుంటారు,ఒకవేళ ప్రజలు మర్చిపోయినా ప్రతిపక్ష పార్టీలు గుర్తు చేస్తాయి.కొన్ని పనులు మొదలుపెట్టి చాలామటుకు పూర్తి చేశారని వింటున్నాం గానీ మరి కొన్ని అనేకరకాల అడ్దంకుల వల్ల మొదలవుతాయో లేదో తెలియని పరిస్థితి ఉంది - ఈ ఒక్క సంవత్సరంలో ఎన్నింటిని పూర్తి చెయ్యగలరు?

          తెలంగాణ ముఖ్యమంత్రి ఆర్భాటంగా మొదలుపెట్టి అర్ధాంతరంగా ఆపేసిన చాలా కార్యక్రమాల్లో వాహనాల రీరిజిస్ట్రేషన్ మరియూ కల్తీకల్లు-గుడుంబా లాంటివి అసలు ప్రతిపాదన లోనే ఒక రకమైన తెలివితక్కువతనం ఉండటం వల్ల అభాసుపాలు అయినాయి,కొంచెం లౌక్యం చూపించి ఇతరేతర సాంకేతిక కారణాలు ఏవైనా చెప్పకుండా వాస్తు ప్రస్తావన తీసుకు రావడంతో సెక్రటేరియట్ మార్పు లాంటివి అవహేళనకి గురయ్యాయి,హుస్సేన్ సాగర్ ప్రక్షాళన లాంటివి కోర్టులు అడ్డుపడడం వల్ల ఆగిపోయినాయి.అదొక్కటే కాకుండా చాలా నిర్ణయాలు కోర్టుల వల్లనే ఆగిపోవడంతో ఆంధ్రా హైకోర్టు అనే పల్లవి ఎత్తుకున్నారు.ఇప్పటికే ఈ ఆంధ్ర-తెలంగాణ గొడవల్ని ఉద్యోగవర్గాలకి పాకించి చాలా తప్పు చేశారు.ఈ పాలిటిక్స్ వల్ల తెలంగాణ ఉద్యోగుల పంతీరు ఏమీ మెరుగుపలేదు సరికదా వారూ కొత్తగా నేర్చిన  రాజకీయపు తెలివితో తెలంగాణ ప్రబుత్వానికి కూడా సమస్యగా మారినట్టు కనిపిస్తున్నది.ఇంక ఈ ఆంధ్ర-తెలంగాణ గొడవల్ని న్యాయవ్యవస్థకి కూడా పాకిస్తే తెలంగాణేతరులు న్యాయం కోసం కోర్టులకి వెళ్ళడానికి కూడా భయపడాల్సిన అరిస్థితి దాపురిస్తుంది.ఒకవేళ తెలంగాణ న్యాయ్మూర్తులు అయినప్పటికీ లొసుగులతో ఉన్న చట్టాన్ని "రాష్త్రం మనదే తోసెయ్" అనే లెక్కన ప్రభుత్వానికి అనుకూలంగా ఫిరాయించితే అది ఆ న్యాయమూర్తి వృత్తి జీవితానికి కళంకం కాదా!ఒక రాజకీయ వేత్త తనమీద లక్ష కోట్ల కుంభకోణం తన మీద ఆరోపించబడినా తన పార్టీ మీద పట్టు ఉన్నంతకాలం అతడికి ఏ హానీ జరగదు.ఆ నాయకుడు ఎన్నికల్లో గెలిచి ప్రజాభిమానం ద్వారా తన కళంకాన్ని పోగొట్టుకునే అవ్కాశం ఉంటుంది.న్యాయవ్యవస్థలోని ప్రతి ఒక్కరూ ఇండియన్ బార్ కన్సిల్ అనేదానికి జవాబుదారీగా ఉండాలి.ఒక న్యాయమూర్తి పైన స్వచ్చమైన ప్రాంతీయాభిమానంతోనే అయినా ఒక తప్పులతడక చట్టాన్ని క్షుణ్ణంగా పరిశీలించకుండా వొదిలెయ్యటానికి సంబంధించి మచ్చ పడితే ఆ న్యాయమూర్తి తన మరకని కడుక్కోగలిగిన అవకాశం ఉందా?లేదు, కనుక తెలంగాణ ముఖ్యమంత్రి మరియూ మంత్రివర్గం కాస్త నిదానించి న్యాయవ్యవస్థని కూడా మితిమీరిన ప్రాంతీయాభిమానంతో భ్రష్టు పట్టించకుండా ఉంటే బాగుంటుంది!చట్టాలు చేసే సమయంలోనే లోపాలు లేకుండా జాగ్రతపడితే కోర్టులు ఎందుకు కొట్టేస్తాయి?ఒకసారి న్యాయవ్యవస్థ మీద ప్రజలకి విశ్వాసం పోతే మళ్ళీ పునరుద్ధరించటం చాలా కష్టం - అది రాజకీయ వ్యవస్థ లాంటి మొండి బంద వ్యవహారం కాదు!అసలు ప్రజలకి న్యాయవ్యవస్థ మీదే విశ్వాసం పోయిన తర్వాత ప్రభుత్వం ఉండి కూడా లేనట్టే!ఎవడు ఏ రకమైన దొంగల దోపిడీ నుంచి అరాచకత్వం వరకు ఏమి చేసినా చెడిపోయిన న్యాయవ్య్వస్థని అడ్డు చేసుకుంటే చాలు ప్రభుత్వం వాడి కాలిగోరుని కూడా పెకలించలేదు - గోటితో పోయేదానికి గొడ్దలి వాని వివేకం తెలంగాణ ప్రభుత్వాని కుండాలి.

          ఈ లోపాలు సవరించుకోకుండా సమర్ధవంతమైన పరిపాలనను ప్రజలకు అందించడం అసంభవం.కాబట్టి ప్రభుత్వపక్షం ఎక్కువకాలం గాలిలో తేలిపోకుండా తొందరగా నేలమీదకి రావాలి.సెటిలర్లు బుట్టలో పడిపోయి వోటు వెయడం వరకు బాగానే ఉంది,కానీ ఉద్యమ కాలంలో మీరేమి చెప్పారో గుర్తుందా?మన ఉద్యోగాలు ఆంధ్రోళ్ళు లాక్కున్నారు,వాళ్ళని వెళ్లగొట్టేస్తే చాలు ఆఉద్యోగాలన్నీ మీకు వస్తాయి అన్నారు - అనలేదంటే చెయ్యగలిగింది లేదు.మరి ఇప్పుడు వీళ్లందర్నీ ఆంధ్రాకి వెళ్లగొట్టకుండా తెలంగాణ ప్రజలకి ఉద్యోగాలు చూపించాలి.ఉపాధి కల్పనా రంగాన్ని వీళ్ళందరికీ అవకాశాల్ని కల్పించేటంతగా విస్తరించాలి,లేని పక్షంలో గంప లాభం చిల్లి తీసినట్టు తెలంగాణ జనం మీకు పెద్ద బొక్క చూపిస్తారు.

తెలంగాణ ప్రాధమికంగా ఓక భౌగోళిక నామం,అంతిమంగా ఒక సాంస్కృతిక రాజకీయ వారసత్వం

"వేదాలు చదివిన వారు యజ్ఞయాగాదు లందు పశువులను వధిస్తారు" - ఇది నిజమా?

hari.S.babu: గురువు గారూ ! మహాభారతంలో ధర్మవ్యాధుని కధ వస్తుంది కదా . అక్కడ ధర్మవ్యాధుడు కౌశికుడికి ధర్మబోధ చేస్తూ ఒకచోట ," ...