Wednesday, 6 January 2016

ఇక్కడ మనవరాలి పెళ్ళికి పిలుస్తా!అక్కడ పఠాన్ కోటలో దాడి చేస్తా! - ఒక లెవెలై పోద్ది?!

"మనవాళ్ళుత్త వెధవాయలోయ్!" అని గురజాడ గిరీశంతో ఎందుకనిపించాడో గానీ మనవాళ్ళు మాత్రం పదే పదే దాన్ని నిజం చేస్తూనే ఉన్నారు.

పాకిస్తానీలు చాలా గొప్పగా వెధవల్ని చేస్తున్నారు ఇండియన్లని:-)

మా మనవరాలి పెళ్ళికి రమ్మని ఆయన పిలిచాడు.ఈయన అగ్గగ్గ లాడుతూ పోయి ఆయన తల్లి కాళ్లకి గూడా మొక్కాడు!

మన దేశంలో తమ సొంత దేశంలో కదుల్తున్నంత ధీమాగా తిరిగి మిలిటరీ శిక్షణ కూడా ఉందన్నంత పకడ్బందీగా భారత వైమానిక స్థావరం మీదనే దాడి చేశారు?

ఇలాంటి దేశపు ప్రభుత్వంలో కొంతకాలం పాటు మంత్రిగా కూడా ఉండి ఇలాంటి పనుల్లో ఆరితేరిపోయినవాడొకడు మన దేశంలో "మా దేశం పావురమంత మంచిది,మీ దేశం డేగలాగ చెడ్దది" అని అర్ధమొచ్చెలా పుస్తకం రాసి పబ్లిష్ చేస్తుంటే మనోళ్ళంతా విశాల మానవతావాదపు ఆనందకన్నీరు కారుస్తూ ఎర్రమొగాలేసుకుని చూశారు.ఈ దేశంలో పుట్టి శతృదేశం వాణ్ణి వెనజేసుకొస్తున్నవాడి మీద మసిపూసిన శివసేన వాళ్ళని అల్లరి చెయ్యాలన్న దురద తప్ప వాడెందుకు ఆ పుస్తకం అంతర్జాతీయ వేదికల మీద ఎన్నో సాక్ష్యాలు చూపించి పాకిస్తానుని ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని ఒత్తిడి చేస్తున్న మనదేశంలోనే పబ్లిష్/మార్కెట్ చేసుకోవాలనుకున్నాడో అర్ధం చేసుకోలేకపోయారు.

పాకిస్తాన్ రాజకీయ చరిత్ర తెలుసా మీకు?ఆ దేశంలోని ఏ రాజకీయ పార్టీకి చెందినవాడినా సరే ఎప్పటికైనా భారత్ మీద సైనికంగా విజయం సాధించాలనే రహస్యవ్యూహంలో మాత్రం ఒక్కతాటి మీద నడుస్తారు - కమ్యునిష్టులతో సహా!

"మెదడు తక్కువ సన్నాసులు, భారతీయులు!" - ఇది మనకన్నా పాకిస్తాను వాళ్ళకి స్పష్టంగా తెలుసు:-)

38 comments:

  1. ఇక్కడొక ప్రాణం పోస్తా
    అక్కడొక ప్రాణం తీస్తా
    ఒక లెవలై పోద్ది
    - ఏ సినిమా లోదబ్బా ఈ డైలాగు?

    ReplyDelete
  2. హరిబాబు గారు ఇంత చిన్న టపాతో రావడమేంటబ్బా?

    ReplyDelete
    Replies

    1. టపా నిడివి చిన్నదవ టానికి కారణం తూటా నిడివి పెద్దది కావట మే !

      జిలేబి

      Delete
    2. ఆ పైన అనామక సోదరుడు వేసిన డౌటు నాకూ వచ్చింది.అక్కడ ఒక పెద్ద నట్టు కొట్టేసి ఇంక ముందు కెళ్ళనని మొరాయించింది.అక్కడె గింజుకుంటూఒ ఉంతే టాపిక్కు ఫేడవుట్ అవుతుందేమో?మరో విధంగా టపా పొడుగు పెంచడం కుదరలేదు:-(

      Delete
  3. హరిబాబు గారు, జిలేబి అనే బ్లాగరు మీరు మగ బ్లాగారని రాశారు అది నిజమా? లేక ఆట పట్టించటానికా?

    ReplyDelete
    Replies
    1. Anonymous
      జిలేబి అనే బ్లాగరు మీరు మగ బ్లాగారని రాశారు అది నిజమా? లేక ఆట పట్టించటానికా?
      haribabu:
      అసలు ఆ జిలేబి అనే బ్లాగరు ఆడో మగో తెలీక జుట్టు పీక్కుంటున్న బట్టతల మగాళ్లలో నేనూ ఒకణ్ణి:-)

      Delete
    2. అటు ఆడో మోగో తెలిక మనం కంఫ్యుస్ కావటం మెందుకులేండి. మాడా భాయ్య అనుకొంటే సరిపోద్ది కదా!

      Delete
  4. మెయిన్ టాపిక్కు గురించి ఒక్క కామెంటూ రాలేదు:=(
    మైండు బ్లాస్టయిపోయేలా ఉంది నిరాశతో____/\____

    ReplyDelete
    Replies
    1. మేము తెలుగు బ్లాగర్స్ మండీ ! చాలా సీరియస్ విషయాల లైనటు వంటి జిలేబి ఆడా మగా గట్రా ల మీద మాత్రమె కామింట్లు వేస్తామండి :) పఠాన్ కోట్, ఇండియా పాక్ వ్యవహారాల లాంటి చిన్ని చిన్ని విషయాల మీద కామెంట మండి ! ఆయ్ తెలుగు బ్లాగర్ల మండి :)

      జేకే !

      జిలేబి

      Delete
    2. ఎవరిని ఎవరు టీ తాగమని పిలిచారు, టీతోబాటు ఎలాంటి బిస్కట్టులు ఇచ్చారు, ఎవరి తల్లికి ఎవరు పాదాభివందనం చేసారు ఇవండీ మన మీడియాకు ముఖ్య ఖబుర్లు!

      ఇక టాపిక్కుకు వస్తే పాకిస్తాన్ వెళ్లి రాగానే భంగపడడం కమలనాదులకు అలవాటు అయ్యింది పాపం. దీని వెనుక అదృశ్య "హస్తం" ఎవరిదో ఏమో? అమెరికా (లేదా రష్యా) ఒత్తిడే కారణం అనుకుందామంటే వారికి లాభం ఏమిటో తోచడం లేదు. పైగా దీనితో ఆయుధ విక్రయం తగ్గే ప్రమాదం కూడా ఉంది కనుక ఆ సాహసం చేయరు. ఏది ఏమయినా ఈ భౌగోళిక రాజకీయ క్రీడలలో మన సైనికుల ప్రాణాలు పణంగా ఉండడం దురదృష్టం.

      PS: can you publish your MBS Prasad interaction on this blog please?

      Delete
    3. PS: can you publish your MBS Prasad interaction on this blog please?

      what?you are following that also!

      Delete
    4. "what?you are following that also!"


      నాను ఆ సైటు ఎక్కువగా చూడను అలాగే ప్రసాద్ గారు ఎవరో నాకు తెలీదు. ఆయన అభిప్రాయం అటుంచి రచనా శైలి నుషిత హాస్యంతో బాగుంటుందని నా మిత్రులు ఒకరు చెప్పారు. మీ శైలి కూడా బాగుంటంది కనుక మీరు ఆయన్ని చేసిన చర్చ/ఇంటర్వ్యూ (refered by UG SriRam below) ఇక్కడ టపాగా వేస్తె చదువాలని కుతూహలం అంతే

      Delete
    5. @Jai,

      http://telugu.greatandhra.com/articles/mbs/mbs-motilal-nehru-tandri-muslimaa-1-68345.html


      http://telugu.greatandhra.com/articles/mbs/mbsmothilal-nehru-thandri-muslimaa-2-68386.html


      Delete
    6. Thanks Mr.UG

      I am trying to touch this in detailed in my recent post via acomments!

      Delete
    7. శ్రీరాం గారూ, చర్చ అంతే వీరిద్దరి మధ్యే ఉందనుకున్నా ఇప్పుడు అర్ధం అయింది థాంక్సండీ

      Delete
    8. Thanks for giving great (article) links !

      Delete
  5. "మెదడు తక్కువ సన్నాసులు, భారతీయులు!"

    ReplyDelete
  6. హరిబాబు గారు, గ్రేట్ ఆంధ్ర లో యం.బి.యస్. ప్రసాద్ గారితో మీ చర్చను చదివాను. ప్రసాద్ గారికి మంచి నాలేడ్జ్ ఉంది. కనుక ఆయనను ప్రశ్నించి విషయాలు నిజమో అబద్దమో తెలుసుకోవాలను కోవటం లో తప్పులేదు. కాని ఆయన రాసే విశ్లేషణలలో, "కొన్ని అభిప్రాయాలు" చదివితే పాత తరానికి చెందిన నెహౄవియన్ సెక్యులర్ మేధావిలా అనిపిస్తాడు. ఆయన బ్రిటిష్ వాడి పాలనలో జరిగిన అభివృద్దిని పొగిడినతీరు చూస్తే చికాకు వేసింది. మీరు మీ అభిప్రాయం స్పష్టంగా బాగా చెప్పారు.

    ReplyDelete
    Replies
    1. I too had the same opinion on MBS!Pity, he still confused me and the response for questioning reveals some sort of ego.

      Delete
    2. ఆయన కాంగ్రెస్ + కమ్యునిస్ట్ భావలకు మద్దతు దారుడు. ఆయన వ్యాసాలను ఎన్నో ఏళ్లుగా చదువుతున్నాను. ఆయన న్యుట్రలిటి లో ప్రో కాంగ్రెస్ స్టాండ్ ఉంట్టుంది. జీవితమంతా దేనినైతే నమ్ముకొని ప్రచారాం చేశారో, ఆ పార్టి లు, భావజాలం రెండు కనుమరుగౌతున్నాయని అర్థమై హిందుత్వ, బి.జె.పి. మద్దతు దారులపై ఒక విధమైన అసహనం ఆయన సమాధానం లో కనిపించింది. ఇంతకు మునుపు కూడా ఒక్క మగాడు సుబ్రమణ్య స్వామి గురించి ఆయన రాసిన అభిప్రాయం విసుగైపించింది. స్వామి అవినితి పై పోరాడాలి గాని రామ మందిర నిర్మాణం/హిందుత్వ అంశాల పై కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడగుడదు,అంత చదువుకొన్నాయన మతపరమైన అంశాలకు మద్దతివ్వటమేమనే ధోరణిలో రాసాడు.

      Delete
  7. Most powerful argument : అయినా యింత అసందర్భంగా ఆయన ఆ ప్రశ్న ఎందుకు అడిగినట్లు? సందేహనివృత్తికి అడుగుతున్నా అంటూ యీ సందేహాన్ని యితరుల మెదళ్లలో నాటడం పుకార్లు వ్యాప్తి చేసే పద్ధతుల్లో ఒకటి.

    ReplyDelete
    Replies
    1. సందేహనివృత్తికి అడగటంలో ఎలాంటి తప్పూ లేదు.ఇప్పటికిప్పుదు నేను కొత్తగా ఎత్తుకున్నదీ కాదు.కొన్ని దశాబ్దాలుగా సోషల్ మీడియాలో నలుగుతున్నదే!

      నేను అడిగిన ప్రశ్న నువ్వు చూడలేదు గాబోలు,చాలా వినయంగా అడిగాను - సిన్సియర్ మైండుతో!ప్రశ్న ముఖ్యమైనది కాకపోతే మెయిన్ టాపిక్ దగ్గిరే తీసెపారెయ్యొచ్చు జవాబు చెప్తూనే అడగటంలో దురుద్దేసం అంటగట్టటం ఏంటి?రీసెర్చి చేసి సమస్యల్ని విశ్లేషించడంలో సీనియర్ కదా అని అడిగితే రెండు భాగాల జవాబు యెత్తుకుని ఆయన పీకింది యేమిటి?అసలు అడిగినదానికి సూటిగా జవాబు చెప్పకుండా నేను అడగని ప్రశ్నని తనకి తనే ప్రస్తావించుకుని మెకాలే గురించి బడబడమని వాగేసి "ఇదియును అట్టిదియే" అని నా వ్యాసంతో సహా దేన్నీ నమ్మొద్దు పొమ్మనాడు:-)

      ఇంతోటిదానికి రెండు భాగాల జవాబు ఎందుకు చెప్పినట్టో!

      Delete
  8. దేశవిభజనకు అంగీకరించడం ముస్లిములను బుజ్జగించడంలో మొదటి మెట్టు అనుకుంటే దేశవిభజనకు అందరి కంటె ముందుగా అంగీకరించిన రాజాజీ, ఆంబేడ్కర్‌ తాతల గురించి కూడా ఆరాలు మొదలుపెట్టాలి. స్వాతంత్య్రానంతరం ముస్లిములను ఓటు బ్యాంకులుగా చూసి వారిని బుజ్జగించారు అనుకుంటే, ఆ పని చేసిన, చేస్తున్న, చేయబోతున్న జాతీయ, ప్రాంతీయ, కుడి, ఎడమ పార్టీల నాయకులందరి తాతల సంగతీ కూపీలు లాగాలి.

    ReplyDelete
    Replies
    1. neehaarika
      దేశవిభజనకు అంగీకరించడం ముస్లిములను బుజ్జగించడంలో మొదటి మెట్టు అనుకుంటే దేశవిభజనకు అందరి కంటె ముందుగా అంగీకరించిన రాజాజీ, ఆంబేడ్కర్‌ తాతల గురించి కూడా ఆరాలు మొదలుపెట్టాలి.

      haribabu:
      దేశవిభజనకీ ముస్లిముల అభిప్రాయాలకీ ఎలాంటి సంబంధమూ లేదు!చరిత్రలో ఆనాడు జరిగింది చెబుతా విను.జిన్నా ద్విజాతి సిద్ధాంతం వీరవిక్రమోపేతంగా ఉందనుకుని ముస్లిములకి ప్రత్యేక నియోజకవర్గాలు కూడా దఖలు పర్చి పెట్టిన ఎన్నికల్లో ద్విజాతి సిద్దనతంతో విభజన కోసం పట్టుబట్టిన జిన్నా దిగ్భ్రాంతికరమైన ఓతమితో ఇక ఈ దేశాన్ని విదగొట్టటం కుదరదని నిరాశపడిపోయి రాజకీయాల నుంచి విరమించుకుంటున్ననని ప్రకటించి ఇంటిపట్టున కూర్చున్నాడు.అప్పటి వరకూ జైల్లో పెట్టిన ఇంగ్లీషోళ్ళు మన దేశపు ఖర్మ కాలి మొహనదాసును జైలు నుంచి వదిలీ వదలగానే పోయి జిన్నాని నీ "సేవ" దేశానికి చాలా అవస్రం తిరిగి రమ్మని పిలిస్తే ఆయన తిరిగి రంగంలోకి దిగి దేశానికి "షేవ్" చేశాడు!అప్పుడే ఎన్నికల్లో జనం ముస్లిములతో సహా ఒక విస్పష్తమైన తీర్పు ఇచ్చాక మెడమీద తలకాయ ఉన్న టీనేజి కుర్రాడు కూడా ప్లెబెసైటు పెడదాం అనడు - ధిక్?ఈయన ప్లెబెసైటు అనగానే "ఠట్!ప్లబెసైటు ఏంటి?దేశాన్ని చీల్చాల్సినదే!" అని చాన్సు దొరకబుచ్చుకుని సరిగ్గా 1946 ఆగస్ట్రు 16న డైరెక్ట్ యాక్షన్ డే ప్రకటిస్తే సంవత్సరం తిరిగే లోగా నెత్తుటి మరకల్తో విడిపోయింది ఈ దేశం!

      కారణం ఏమిటో తెల్సా!దేశం రెండు ముక్కలుగా విడిపోకుండా స్వతంత్రం వస్తే ప్రధాని పదవికి ముగ్గురు పోటీలో ఉన్నారు.మోహనదాసు ప్రియశిష్యుడు,పటేల్,జిన్నా!నాయకత్వ పటిమలో గానీ దూరదృష్టిలో గానీ చివరి ఇద్దరూ మొదటివాడి కన్నా పదిమెట్లు పైన వున్నవాళ్ళు - అప్పటికే నిరూపించుకున్నారు కూడా!మోహనదాసు పతేలుని నెహ్రూని ఇబ్బందిపెట్ట్వద్దని అడిగితే ఆ తుక్కుమనిషి సరేనన్నాడు గానీ జిన్నా మాత్రం వూరుకోదు.ఖచ్చితంగా పోటీ చేస్తాడు.జిన్నాని తప్పించి నెహ్రూని ప్రధానిని చెయ్యడం కోసమే పై స్థాయి లోని హిందూ అగ్రవర్ణ జమీందారీ ప్రభువులంతా కలిసికట్టుగా ఆడిన జగన్నాటకమే ఈ దేసవిభజన.చరిత్ర తెలియకుండా మాట్లాడకు!

      Delete
    2. ముగ్గురే వున్నప్పుడు.. వాల్లలొ ఒకరు ముస్లిం మద్దతుదారు, ఒకరు ఆవేశపరుడు కనుక మిగిలిన వారికి అవకాశం వచింది అని యెందుకు అనుకోరు?

      అయినా అప్పటికే మతవిద్వేషాలు రెచ్చగొట్టబడివుండి, జిన్నా యావత్ భారత దేశానికి యెలా ఆమోదయొగ్యుడు అవుతాడు...

      మీ వాదన తర్కానికి అందటం లేదు...

      Delete
    3. Ajay Kumar
      ముగ్గురే వున్నప్పుడు.. వాల్లలొ ఒకరు ముస్లిం మద్దతుదారు, ఒకరు ఆవేశపరుడు కనుక మిగిలిన వారికి అవకాశం వచింది అని యెందుకు అనుకోరు?

      haribabu
      అప్పటి చరిత్ర గురించి మీకు అంతగా పరిచయం ఉన్నట్టు లేదు!మీకు తోచిన కొన్ని వూహల్ని నా ముందు పెట్టి అలా ఎందుకనుకోకూడదు అంటున్నారు, మొత్తం చరిత్ర నంతా ఇక్కడ విప్పడం కుదరదు..మొత్తం చరిత్ర తెలుసుకోవాలంటే "కాంగ్రెసుని ద్వేషించడం నా జన్మహక్కు" సీరీస్ తిలక్ గురించీ గాంధీ గురించీ రాసింది చదవాలి.

      కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తాను.హిందూ మహాసభ,ముస్లిం లీగ్ దాదాపు ఒకేసారి అంటే 1905లో స్థాపిబంచబడినాయి.కొందరు హిందూ మహాసభకి పోటీగా ముస్లిం లీగ్ పెట్టారని అనుకుంటారు.కానీ తమాషా ఏమిటంటే అప్పట్లో కాంగ్ర్సెఉలో ఉన్నవాళ్ళు దేశమంతటి గురించీ మాట్లాడుతున్నా వాళ్ళని హిందువులుగానే లెక్కేసి ఈ హిందూ డామినేటెడ్ కాంగ్రెస్ మనకి మేలు చెయ్యదు అని కాంగ్రెసులో ఉన్న హిందువుల్ని చూసే వాళ్ళు వేరే కుంపటి పెట్టారు.ఇటువైపు హిందూ మహాసభ కూడా కాంగ్రెసు పంచకూళ కషాయంలా అందర్నీ చెర్చుకుంటున్నది,మన హిందువుల ప్రయేక ప్రయోజనాల కోసం మనం వేరేగా ఉండాలి అని అనుకున్నారు. అంటే కాంగ్రెసు తమ ప్రయోజనాల్ని కాపాడలేదని ఇరువర్గాల వారికీ అనిపించిందన్నమాట!

      అప్పటి నుంచీ ఈ గ్రూపులు అన్నీ ఒకసారి సహకరించుకుంటూ ఒకసారి పోట్లాడుకుంటూ ఉన్నా మతకలహాలు జరిగేటంత తీవ్రస్థాయిలో మొత్తం దేశప్రజలు ఎప్పుడూఒ విడిపోలేదు.అన్ని దశాబ్దాల పాటూ ముస్లిం లీగ్ ఉనికిలో ఉండి ద్విజాతి సిద్ధాంతం ప్రచారంలోకి తీసుకొచ్చిన తర్వాత కూడా ముస్లిములకి ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేసినప్పటికీ పాకిస్తాన్ కోసం పట్టుబడుతున్న ముస్లిం లీగ్ ఎన్నికల్లో ఎవరూ వూహించనంత దయనీయంగా ఓడిపోయింది - దాని అర్ధమేమిటి? అప్పుడు కూడా జిన్నా నిరాశపడిపోయి రాజకీయాల్ నుంచి విరమించుకోవటమే జరిగింది తప్ప భీబత్సాలు జరగలేదు. సిపాయిల తిరుగుబాటు తర్వాత మళ్ళీ అంతటి ప్రముఖమైన నావికా తిరుగుబాటులో హిందువులూ ముస్లిములూ ఐక్యంగానే పాల్గొన్నారు - మన నాయకులు దాని ప్రాముఖ్యతని తెలిసి నిర్లక్ష్యం చహెశారో తెలియక వొదిలేశారో నాకైతే అర్ధం కవదం లేదు,మీరు అర్ధం చేసుకుని చెప్తే తెలుసుకుంటాను!

      మోహనదాసు జైలు నుంచి వచ్చి జిన్నాని కలిసి అప్పుడే ఎన్నీలు జరిగి ఫలితం తేలాక కూడా ప్లెబెసైటు కోసం కూశాక జిన్నా మళ్ళీ చురుకు తెచ్చుకుని " డైరెక్ట్ యాక్షన్ డే " ప్రకటించాడు.చరిత్రలో జరిగిన తొలి భాయానక స్థాయిలో మతకలహాలు అప్పడే జరిగాయి!అది ఎప్పుడు జరిగిందో తెలుసా!స్వతంత్రం 1947 ఆహస్టు 15అన్ ప్రకటిస్తే జిన్నా "డైరెక్ట్ యాక్షన్ డే" ప్రకటిమంచింది 1946 ఆగస్టు 14న.

      జిన్నా గురించి మీకు తెలిసింది చాలా తక్కువ అనుకుంటాను.అతని రాజకీయ జీవితం తొలిదశలో హిందూ ముస్లిం ఐక్యత కోసం చాలా చాలా అచాలా ఎకువగా ప్రయత్నించాడు,నిజంగా అతని ప్రయత్నాలకి మిగతావాళ్ళు సానుకూలంగా స్పందించి ఉంటే అసలు దేశం విడిపోవాల్సిన అవసరం ఉండేది కాదు.

      నిజంగా హిందూ ముస్లిం ఐక్యత కోసం కాంగ్రెసులో ఉన్న గొప్ప దేశభక్తులంతా అంకితమై ఉంటే జిన్నాకే కాంగ్రెసు నాయకత్వం అప్పగించి ఉండేవాళ్ళు,హిందూ ముస్లిం ఐక్యత కోసం అతను చెయ్యదల్చుకున్న ప్రయత్నాలకి సహకరించి ఉండేవాళ్ళు! జిన్నా ప్రయత్నాల్ని వీగిపోయేటట్టు చేసి అతన్ని సైడ్ లైన్ చేసి ఇక కాంగ్రెసులో ఉండటం హిందూ ముస్లిం ఐక్యత కోసం పాటుపడటం జరగని పని అని స్పష్తంగా తెలిశాకే జిన్నా పూర్తిగా ముస్లిం లీగ్ వైపుకి జరిగాడు.

      గాలి పోగేసి నేనేదీ చెప్పను.మీరు సొంతంగా చరిత్ర చదివి అప్పుడు నా వాదనలోని తర్కం తప్పో వొప్పో నిర్ణయించండి.వూహాగానాలతో వాస్తవాల్ని కొట్టిపారెయ్యకండి!

      Delete
  9. మోతీలాల్‌కు జవహర్‌లాల్‌కు గల సిద్ధాంతవైరుధ్యాలేమిటి? ప్రజాస్వామ్యం పట్ల నెహ్రూకు వున్న కమిట్‌మెంట్‌ ఇందిరకు వుందా లేదా? వంటి ప్రశ్నలు రావటం లేదు.

    ReplyDelete
  10. వికీపీడియాలో ఎవరు కావాలంటే వాళ్లు ఏది కావాలంటే అది రాసేయవచ్చు, యింకోళ్లు వచ్చి మార్చేయవచ్చు. తెలంగాణ ఉద్యమం నడిచే రోజుల్లో వికీపీడియాలో ఒక వ్యాసంలో బ్రహ్మానంద రెడ్డి 1969 తెలంగాణ ఉద్యమం అణచి వేసినందుకే నక్సలైట్‌ ఉద్యమం వచ్చిందని రాసేశారు. ఎవరో దాన్ని కోట్‌ చేస్తూ నాతో వాదనకు దిగారు. నక్సలైట్‌ ఉద్యమం రాష్ట్రంలో ఎప్పుడు ప్రారంభమైందో వేరే ఎక్కడైనా చదువుకుని అప్పుడు మాట్లాడమని చెప్పాను.

    ReplyDelete
    Replies
    1. గతంలో నేను వికీపాఈడియా గురించి చాలా దుర్మారగమైఅన భిప్రాయం చెప్పాను.ఇప్పటికీ అదే అభిప్రాయం.నేను నిజమని నమ్మినవేవీ వికీపీడియా సైటు నుంచి తీసుకోలేదు.హిందూఅ నౌకూల సైటుల నుంచీ కాదు.పాదె అపదే విమర్శలు వస్తున్నప్పుడు వాటిని అబద్ధం అని కాంగ్రెసు వాళ్ళు ఆధారాలు చూపించి నోరు మూయించవచ్చు,ఎందుకు చెయ్యటం లేదు?

      Delete
  11. ఈనాటి సాంకేతిక యుగంలో వేరేవారి పేర మనం మంచికాని, చెడుకాని రాయడం ఎంత సులభమో యిలాటి ఉదాహరణలు చెప్తాయి.

    ReplyDelete
  12. మనం గొప్పవాళ్లం అనుకోవడం మనకు బాగుంటుంది కాబట్టి దానికి అనుగుణంగా ఏం చెప్పినా అనుమానించకుండా నమ్మేస్తాం. కానీ మన జాతి మొదటి నుంచి బోధిస్తూ వచ్చిన సిద్ధాంతం - సత్యాన్వేషణ. మన జాతీయ నినాదం కూడా 'సత్యమేవ జయతే'. సత్యం చెప్పకపోగా అసత్యాన్ని పనిగట్టుకుని ప్రచారం చేయడానికి కొందరు కంకణబద్ధులై వున్నారని మనం గ్రహించి జాగరూకులమై వుండాలి. మన జాతి ఔన్నత్యాన్ని చెప్పడానికి అసత్యాన్ని ఆసరాగా తీసుకోవడం దుర్మార్గం. ప్రస్తుతకాలంలో డిస్‌-యిన్‌ఫర్మేషన్‌ రాజ్యమేలుతోంది. అందువలన మనం మరింత మెలకువగా సత్యాన్ని తెలుసుకోవడానికి సర్వవిధాలా కృషి చేయాలి. గుడ్డిగా దేన్నీ నమ్మవద్దు - యీ వ్యాసంతో సహా, దేన్నీ! -

    రాజకీయపరమైన నిర్ణయాలు కాని, పాలనాపరమైన విధానాలు గాని వారి అక్రమసంబంధాల కారణంగా ప్రభావితమైనప్పుడే మనం వాటిని సీరియస్‌గా పట్టించుకోవాలి.

    ReplyDelete
    Replies
    1. neehaarika:
      రాజకీయపరమైన నిర్ణయాలు కాని, పాలనాపరమైన విధానాలు గాని వారి అక్రమసంబంధాల కారణంగా ప్రభావితమైనప్పుడే మనం వాటిని సీరియస్‌గా పట్టించుకోవాలి.

      haribabu:నెహ్రూఒ కాశ్మీరు సమస్యని అంతర్జాతీయ అవెదికల మీద ఎందుకు పెట్టాడు?అప్టేల్ ఒక్కా రోజు ఆగమన్నా ఆగకుండా అంత హడావిడిగా ఎందుకు మధ్యవర్తులకి అప్పజెప్పి అననతకాలపు కుంపటిని దేసం నెత్తి మీద పెట్టాడు?

      ప్రఓంచంలో భారతదేశపు చరిత్రని గురించి ఎవరూ చదవడం లేదనుకుంటూన్నావా నువ్వు?అంతర్జాతీయ విశ్లేషకులు విభజన నాడు జరిగిన దయనీయమైన వలసలతో పాటు అన్నిటి గురించీ మాటాడుతూనే ఉన్నారు.వాళ్ళు,ముఖ్యంగా బ్రిటిష్ దేశంలో ఎడ్వినా- నెహ్రూ స్నేహం తెలిసిన ప్రతివాడూ నెహ్రూ హడావిడి వెనుక ఎడ్వినా ప్రోద్బలం ఉండే ఆకాశం ఉందనే అంటున్నారు - ఆఖరికి ఎడ్వినా కూతురుతో సహా!

      రాజు/రాణి అనైతికంగా ఉంటే శత్రువుల ప్రలోభాలకి లొంగే అవకాశం 90% ఉంటుంది.కాశ్మీరు కుంపటి ఇట్లా తగలబడటం వెనక ఎడ్వినా ప్రమేయం ఉంది అంటే ఈ అదెశానికి తలగొట్టేసినట్టు క్దా!

      అబద్ధాలతో నిండిన చరిత్ర దేనికి చదవాలి?అవును,అందరి తాతల చరిత్రలూ తవ్వి తియ్యాల్సిందే - బస్తీమే సవాల్!నీ దమ్ము నువు చూపించి వరి తాతల చరిత్రలు తవ్వగలవో చెప్పు,శ్రీమాన్ యంబీయస్ నామీద విసుక్క్కున్నాడని యెగిరెగీరి పడకు.హద్దులు దాటుతున్నావు,నిదానించు!

      Delete
    2. neehaariak
      కానీ మన జాతి మొదటి నుంచి బోధిస్తూ వచ్చిన సిద్ధాంతం - సత్యాన్వేషణ.

      haribaabu
      కరెక్ట్!బుద్ధుదు చెప్పినది ఏమిటి?"దాపరికం మోసానికి చిహ్నం!" అని కదా.నేను కూడా నెహ్రూ తత ముస్లిము అయినందువల్ల నెహ్రూ కుటుంబాన్ని రాజకీయాల నుంచి వెలివేద్దాం అనటం లేదు కదా!

      అయితే ప్రమాదో ధీమతా మపి అన్నట్టు అంబేద్కర్ గారు రాముడు అక్రమసంతానం అనే అర్ధంలో వాదించారు తన "రిడిల్స్ ఆఫ్ రామ" గ్రంధంలో,దాని భావం ఏమిటి?అక్రమ సంతానంగా పుట్టినవాడు గాబట్టి గౌరవించకూడదు అని ఆయన అంటున్నట్టా?పుట్టుకను బట్టి తనకూ తన కులం వారికీ అవమానం జరిగినదంటున్న వ్యక్తియే మోహానికి గురై రాముడి గునగణాలకు సంబంధం లేనిదైన పుటుకలోని అక్రమత్వాన్ని ఎందుకు హైలైట్ చెయ్యాలని పరయత్నించినట్టు!

      ఒకవేళ కాంగ్రెసు వారు సత్యశోధనకి అనుమతించి నిజంగానే వారి తాత ఘియాజుద్దీన్ ఖాజి అని నిరూపణ అయినప్పటికీ "తాత ముల్సిం అయితే ఏంటి?మనుమడు దేసబహ్క్తుడీన భారతీయుడే కదా!" అని నిగ్గదియ్యటానికి ఎందుకు వెనుకాడుతున్నారు?అలా చేస్తే మళ్ళీ ఎవడూ వేలెత్తి చూపడు గదా!హిందూ పురాణాల లోనే హిరణ్యకశిపుడికి పర్హ్లాదుడు పుట్టిన కధ ఉంది,రావణాసురుడి తమ్ముళ్ళే వాణ్ణి తప్పు పట్టిన ఉదాహరణా కనబడుతూనే ఉంది.

      ఇక్కడ అనేను పట్టుబడుతున్నది దాచేస్తే దాగని నిజాల గురించే తప్ప పుట్టుకని బట్టి బుద్ధుల్ని నిర్ణయించి చేయని తప్పుల్ని రుద్దాలని కాదు - అర్ధమయ్యిందా?

      Delete
    3. అబ్బా... బాగానే వేశావోయ్ పిల్లిమొగ్గలు...

      భారతీయ సంస్కృతిమొత్తం జన్మలోనే ఉంది. అది పట్టుకొనే 'జన్మసంస్కారం' లాంటి పదాలు పుట్టాయ్?

      హిరణ్యకశిపుడు-ప్రహ్లాదుల చరిత్ర ఎరిగిన సంస్కారము కలవాడివి మరి "హిరణ్యకశిపుడి తాత ముస్లిమా?" అంటూ వదరుబోతుతనాన్నెందుకు ప్రదర్శించావ్? ఓకడు దుష్టుడవ్వాలంటే వాడు ముస్లిమే అవ్వాలా? ఇతరుల స్త్రీలను (కొన్నిసార్లు పెళ్ళాలను) అపహరించుకుపోయ్తిన విష్ణువు (పోనీ కృష్ణుడు) సజ్జనుడా?

      You just had happened to hate congress -and yet manage to love BJP- that that's why you are prattling like this.

      Delete
    4. Anonymous15 January 2016 at 04:19
      You just had happened to hate congress -and yet manage to love BJP

      haribabu
      yes I am hating congress - It is ana open fact - I am proud enough to hate congress!

      but I ama not related to BJP or RSS.Being a hindu is not meant supporting BJP.in fact I gave modi a poor marks when compared to CBN and KCR.on the issue of delaying special stataus also I commented rudely on BJP.After all BJP is apoliticala party.It also behavese just like congress if raayalaseema felllows imitates telnagana fellows can cretae the same situation and it also do the same which congress did!I am not even a fan of mod1.

      If you think and believe haribabu supports BJp that is your aptitude- I cant stop you.

      Delete
  13. @Hari babu,

    Pls watch putin video and read this article

    Vladimir Putin accuses Lenin of placing a 'time bomb' under Russia
    http://www.theguardian.com/world/2016/jan/25/vladmir-putin-accuses-lenin-of-placing-a-time-bomb-under-russia

    Vladimir Putin has denounced Lenin and his Bolshevik government for their brutal repressions and accused him of having placed a “time bomb” under the state.
    Putin said he sincerely believed in Communist ideology when he served in the KGB, adding that while its promises of a fair and just society “resembled the Bible quite a lot”, the reality was different. “Our country didn’t look like the City of the Sun” envisaged by socialist utopians, he said.

    ReplyDelete
  14. Anonymous15 January 2016 at 04:19

    Haribabu
    Q1. అబ్బా... బాగానే వేశావోయ్ పిల్లిమొగ్గలు...
    Ans1: ఇలా తలాతొకా లేకుండా మాట్లాడి యేమి పీఎకాల్ని వచ్చావు నువ్వు?పిల్లిమొగ్గలు అనే మాట నాకు వాడినప్పుదు కొంచెం సాక్ష్యం చూపిస్తే బాగుంతుంది కదా?నువ్వు పిల్లిమొగ్గలౌ అన్నది దేనిగురించో నేను బుర్ర్ర బద్దలు కొట్టూకోవాలా?ఎదవగోల!

    Q2: సంస్కృతిమొత్తం జన్మలోనే ఉంది. అది పట్టుకొనే 'జన్మసంస్కారం' లాంటి పదాలు పుట్టాయ్?
    Ans2: ఏంటి నీ అర్ధం పర్ధం లేని వాగుడు?ఎక్కడో ఎవడో వాగిందల్ల ఇక్కడ రుద్దితే ఏం చెప్పాలి?జన్మసంస్కారం అంటే జాతి సంస్కారం ఎట్టా అవ్వుద్ది?నువు పీక్కుంటే నీ పేరులో కూడా బూతు అర్ధం వొస్తుంద్.నీ పైత్యాన్ని ఇక్కడ రుద్దమాకు - ఖబడ్దార్!

    Q3: హిరణ్యకశిపుడు-ప్రహ్లాదుల చరిత్ర ఎరిగిన సంస్కారము కలవాడివి మరి "హిరణ్యకశిపుడి తాత ముస్లిమా?" అంటూ వదరుబోతుతనాన్నెందుకు ప్రదర్శించావ్?

    Ans3: నీకేం మెంటలా!పురాణాలు వేరు చరిత్ర వేరు అని చిన్నపిళ్ళాణ్ణి అడిగినా చెప్తాడు,నీ వయసెంతో మరి?నువ్వు అంటున్న వదరుబోతుతనంతో కూడిన ప్రశ్న నేను వేసిందేనా?నాకెక్కడా గుర్తు లేదు మరి!ఎక్కడో ఎవడో వాగినవన్నీ నాకు అంటగట్టకు - తాట తీస్తా!

    " హిరణ్యకశిపుడి తాత ముస్లిమా?" - ఈ రకమైన భాష నాది కాదు.నేనెన్నడూ అనామకంగా ఎక్కడా కామెంట్లు వెయ్యలేదు.సాక్ష్యం ఉంటే అప్పుడు నేనే నీకు సారీ చెప్తా.అయినా ఐలాంటి సీరియస్ విషయాలతో కెలకాలనుకుంటే అసలు ఐదీతో రా!కయ్యానికైనా వియ్యానికైనా సమౌజ్జీ ఉండలి.నువు ముసుగులో ఉండి తలకో సారి నానా చెత్త వాగితే నువ్వు ఒక్కడివేనా లేక యెవడు బడితే వాడు చాన్సు దొరికిందని వాగుతున్నాడా అనేది నాకెలా తెలుస్తుంది?

    ఈ విషయంలో వాదన కంటిన్యూ చెయ్యాలనుకుంటే ఐడీ తప్పనిసరి.అతిగా తోక ఝాడిస్తే కామెంట్లు ఎగిరిపోతాయ్!

    Q4: ఓకడు దుష్టుడవ్వాలంటే వాడు ముస్లిమే అవ్వాలా? ఇతరుల స్త్రీలను (కొన్నిసార్లు పెళ్ళాలను) అపహరించుకుపోయ్తిన విష్ణువు (పోనీ కృష్ణుడు) సజ్జనుడా?
    Ans4: ఈ రకం రెటమటం వాగుడు తప్ప నీ దగ్గిర సరుకు లేకపోతే మళ్ళీ నా బ్లాగువైపుకు రాకు.నీ పనులన్నీ మానుకుని చదవమని నిన్నెవరూ పిలల్వలేదు!నేను ముస్లిములందర్నీ దుష్టులు అని నేను అంటే గదా నువ్వు " ఓకడు దుష్టుడవ్వాలంటే వాడు ముస్లిమే అవ్వాలా?" ప్రశ్న నాకు వెయ్యాల్సింది?నాకలాంతి తప్పుడు అభిప్రాయం లేనప్పుడు నీ ప్రశ్న అసలు నాకు వర్తించదు.నీకు అర్ధమయ్యే లెవెల్లో నేను చెప్పగలిగే జవాబు కూడా ఉండదు."కుంతిని భీమూడూ చెరబట్టినట్టు" అని శకారుడు వాగే స్థాయి అజ్ఞానంతో నువ్వు పురాణాల్ని తడమకు - ఒకవేళ నువ్వు లక్షసార్లు నీ తీత తీర్చుకుంటూ వాగినా పట్టించుకునే గొట్టాంగాడెవడూ లేదికడ - ఫో! ఫో!!

    ReplyDelete
  15. Hari baabu please read this also.

    Marx 'did not invent anything', says Pope Francis

    VATICAN CITY - Pope Francis has accused communism of stealing its ideas from Christianity, and said its founding thinker Karl Marx "did not invent anything."

    Commenting on suggestions in the media that his world view is not dissimilar to communist ideology, the pope responded that it was the church that got there first.

    "The communists have stolen our flag. The flag of the poor is Christian. The poor are at the heart of the Gospel," he said in an interview published on Sunday.

    http://www.news.com.au/world/marx-did-not-invent-anything-says-pope-francis/news-story/a2355b76be7bd2925a290e4d8143f06e

    https://www.enca.com/marxism-influenced-christianity-pope-francis

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...