కేసేఅర్ ప్రచారపర్వం లోకి దిగక ముందు ఎంతో ప్రశాంతంగా నడుస్తున గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం ఆయన రావడం తొనే భూకంపం వచ్చిననత సంచహ్లనాన్ని కలిగించింది.రావ్డం రావడమే ఓటుకు నోటు వ్యవహారం బయటపడినప్పటి విశ్వరూపాన్ని మళ్ళీ చూపించాడు.ఆనాడు ఆయనగారి విజృంభణలో రాలిన ఆణిముత్యాలలో ఒకటి "చంద్రబాబుని ఇక బ్రహ్మదేవుడు కూడా రక్షించ లేడు!" మరి అంత గట్టిగా ఘీంకరించి కూడా అడ్డంగా దొరికిపోయిన నేరస్తుణ్ణి ఇప్పటి వరకూ ఎందుకు అరెస్టు చెయ్యలెదు?అదే మనిషి అమరావతి శంకుస్థాపనకి పిలిస్తే కులుక్కుంటూ వెళ్ళావెందుకు?అదే మనిషిని నువ్వు ఆయుత చండీ యాగానికి పిలవటం దేనికి?ఈ ప్రశ్నలు ఎవరయినా అడిగారో ఈయనే అడిగారనుకుని చెప్పారో గానీ జనానికి తప్పనిసరిగా వచ్చే అనుమానాలకి తనదైన శైలిలో కొంచెం అబద్ధం కొంచెం ప్రగల్భం కలిపి జవాబు చెప్పారు.
ఎవరూ అడక్కండానే ఆ జవాబులు చెప్పి ఉంటే తాము చేసిన తప్పుల్ని నిలదీసినా ముఖం చాటేస్తున్న రాజకీయ నాయకులు పుష్కలంగా ఉన్న ఈ రోజుల్లో నిజంగా అపురూపమే!కానీ ముఖ్యమంత్రి పదవిలో ఉండి అబద్ధాలు చెప్పడమే ఆయన పట్ల సానుభూతిని పుట్టిస్తున్నది.మొదటి అబద్ధం "నేను ఆంధ్రాకి సహాయ్మ్ చేద్దామనుకున్నాను,కానీ మోదీ బాబుకి మట్టీ నీళ్ళూ ఇచ్చాడు,ఇప్పుడు నేనిస్తే పుందు మీద కారం జల్లినట్టు కుళ్ళి చస్తాడని ఇవ్వలేదు" అన్నది - ఎంత బరితెగిస్తే ఇంత అబద్ధం చెబుతాడు!అక్కడ అమరావతి వేదిక మీద మొదట ప్రసంగించినది ఈయనే,ఈయనగారు మాట్లాడ్డం అయిపోయి కూర్చున్నాక మోదీ గారు మాట్లాడ్డం మొదలు పెట్టేవరకు మోదీగారు యేమిస్తున్నాడో ఎవరికీ తెలీదు,మరి మోదీ మట్టీ నీళ్ళూ ఇచ్చాక నేను ఇస్తే ఏడుస్తాడని ఇవ్వలేదు అనటం పచ్చి అబద్ధం!రెండవ అబద్ధం భువనేశ్వరి మా పార్టీకే వోటు వేస్తానన్నది అనేది మరీ ఘోరం.ఆవిడ వెంటనే కంగారుపడిపోయి కౌంటర్ ప్రకటన చేసింది.కేసీఆర్ ధైర్యం ఏమిటంటే తన ఫ్యాన్లు తను అబద్ధం చెప్పినా అదే నిజమని నమ్ముతారని.కానీ ఇక్కడ ఆయన సెటిలర్ల వోట్లు కొల్లగొట్టాలని అనుకున్నప్పుడు ఈయన మాట్లాడాల్సింది ఇలాగేనా?ఇలాంటి ధోరణితో సెటిలర్లని ఆకట్టుకోగలనని ఈయన ఎట్లా భావిస్తున్నాడో నాకర్ధం కావట్లేదు!
నిన్ననో మొన్ననో తండ్రిగారు ప్రచారం మొదలు పెట్టకముందు తనయుడు కేటీఆర్ ముఖాముఖి చూశాను.మధ్యలో నాగార్జున వచ్చి కొంచెం మెచ్చుకున్నాదు,కుర్రాడు చక్కగా హైదరాబాదుకి తను ఏమి చెయ్యాలనుకుంటున్నాడో లెక్కలతో సహా చెప్పడం చూసి ధోరణి బాగానే ఉంది ప్రాక్టికాలిటీ ఉంది కుర్రాడిలో అనిపించింది.అలా పూర్తిగా కేటీఆర్ మీద వొదిలేసినా బాగుండేది - టీ.ఆర్.యస్ అభిమానులు ఏమనుకుంటున్నారో తెలియదు గానీ ఇది ఖచ్చితంగా కేటీఆర్ ఇప్పటివరకూ చేసినదాన్ని ఉల్టాపుల్టా చెయ్యడమే!సెటిలర్లలో.ముఖ్యంగా ఇప్పటికే కేసీఆర్ ఏదో ఒకరోజున తమని తన్ని తగలేస్తాడేమో అని భయపడుతున్నవాళ్లలో ఇప్పుడు కలిగే ప్రభావం చాలా తీవ్రంగా ఉండొచ్చు!నేను చంద్రబాబుని కదా తిట్టింది అని సమర్ధించుకోవచ్చు గానీ ప్రజలకి మాత్రం కేసీఆర్ ధోరణి మారలేదని నిశ్చయంగా తెలిసిపోయింది.ఈ 18 నెలల్లో ఒక్కసారయినా సీమాంధ్రుల మీద దాడులు జరిగాయా అని అడిగి జరగలేదని చెప్పి తమని తాము సమర్ధించుకుంటున్నవాళ్ళు ఒక విషయం - తెలంగాణ భారతదేశం లోని ఒక రాష్ట్రం అని మర్చిపోతున్నారు!ఈ దేశపౌరులుగా రాజ్యాంగం వారికి దఖలు పర్చిన హక్కు వల్ల ఇక్కడ ఉన్నారు తప్ప వీరి దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి వారిక్కడ ఉండటం లేదు.ఇవ్వాళ వీరు దాడులు చేస్తే జరిగే హాని వీరికి గనకనే వీరు దాడి చెయ్యటం లేదు, అవునా!
నిజంగా తనలోని ఆంధ్రద్వేషాన్ని తగ్గించుకుని వాస్తవదృష్తితో ఆలోచిస్తున్నాడు అని అనుకోవటానికి ఆధారభూతమైన పనులు కేసీఆర్ ఏమీ చేయలేదు - కేవలం తన పనుల్లో తను తీరిక లేకుండా ఉందటం వల్ల నోరు విప్పలేదు - అంతే!ఇంకా స్పష్టంగా చెప్పాలంటే నీటిలో చేపలా తన ఎజెండాని అమలు చెయ్యడం కోసమే విఫలప్రయత్నాలు చేశాడు,చేస్తున్నాడు,చేస్తాడు.
వాహనాల రీరిజిస్ట్రేషన్ ప్రతిపాదన వెనక ఉన్న మర్మమేమిటి?ఆంధ్రా రిజిస్ట్రేషన్ ఉన్న వాహనాలు తెలంగాణలో తిరగకూడదని కాదా!సకలజనులసర్వే ఫలితాలు ఏమైనాయి?మాంచి హుషారుగా దూర దూరాల నుంచి కాలి నడకనా సైకిళ్ళ మీదా వచ్చి నమోదు చేయించుకున్నారే ఎక్కడెక్కడి తెలంగాణ ప్రజానీకం!ఎందుకు బుట్ట దాఖలా చేశారు?స్థానికతకి 1956 కొలబద్దగా పెట్టడం వెనక ఉన్న అసలు కధేంటి?అప్పుడు కొందరు తెలంగాణ వాదులు కూడా దాన్ని వ్యతిరేకించారు, అది దుర్మార్గం అని ఒప్పుకున్నారు.ఆధార్ లింక్ పేరుతో హైదరాబాద్ లోని ఆంధ్ర వోటర్లని తొలగించి గందరగోళం సృష్టించి వారికి జీతాలు రాని పరిస్థితిని కల్పించాడు.చివరికి వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది.తెలంగాణా గడ్డమీద ఉన్న ఆంధ్రులకి కాలిలో ముల్లు గుచ్చుకుంటే నా పంటితో తీస్తానని చెప్తూనే ఆంధ్ర మూలాలు ఉన్నవారికి నష్తం కలిగిస్తుందని తెలిసి కూడా ముల్కీ రూల్స్ పునరుద్ధరణ కోసం ప్రయత్నించాడు.
అమాయకులు కొందరు వూహాగానలు చేశారు గానీ కేసీఆర్ ఎప్పుడు మారాడు?మారితే ఏం జరుగుతుందో తెలుసా!ఈ రెండు రాష్ట్రాల్లోని తెలుగువాళ్ళూ ఆప్యాయంగా కలిసిపోయి అనవసరంగా విడిపోయామని తెలుసుకుని రెందు రాష్ట్రాల్ని కలిపేస్తారు - అన్ని సాహసాలు చేసింది అందుకా?!ఇవ్వాళ వోటు వెయ్యకపోతే రేపు తంతాదేమోననే భయం ఉంటే తప్ప ఈ సెటిలర్లు అనబడే ఆంధ్రమూలాలు ఉన్న తెలుగువాళ్ళు కేసీఆర్ మారిపోయాడని నమ్మి వోటు వెయ్యడం మూర్ఖత్వం.
ఆంధ్రద్వేషం నుంచి పుట్టిన తెలంగాణ నుంచి ఆంధ్రద్వేషం పోతే తెలంగాణ అదృశ్యమై పోతుంది!
ఆంధ్రద్వేషం నుంచి పుట్టిన తెలంగాణ నుంచి ఆంధ్రద్వేషం పోతే తెలంగాణ అదృశ్యమై పోతుంది!
ReplyDeleteThis is 100% correct.
పూర్తిగా కేటీఆర్ మీద వొదిలేసినా బాగుండేది - టీ.ఆర్.యస్ అభిమానులు ఏమనుకుంటున్నారో తెలియదు గానీ ఇది ఖచ్చితంగా కేటీఆర్ ఇప్పటివరకూ చేసినదాన్ని ఉల్టాపుల్టా చెయ్యడమే!
ReplyDeleteఆంధ్రద్వేషం నుంచి పుట్టిన తెలంగాణ నుంచి ఆంధ్రద్వేషం పోతే తెలంగాణ అదృశ్యమై పోతుంది!
Yes,well said !
ఇలాంటి అత్యాశలు పెట్టుకోకండి.. నాయకులు, అవతల వాడి మీద యేడ్చే అసూయపరులు, ఒక ఆలోచన ఫిక్స్ చేసుకోని, అది చచ్చినా మార్చుకోని ఎదవ ప్రజలు.. తగలబెట్టి, చంపాలనే శాడిస్టిక్ మన్స్తత్వాన్ని బయటపెట్టూకోవడాని మాత్రమే సభలు ర్యాలీలకి వొచ్చే ప్రజలు(ఇది భారతదేశం మీద అసహననం కాదు.. నాకు పాకిస్తానుకి విసా ఇప్పిచ్చే ప్రొగ్రాం పెట్టుకోకండి. ఆల్ రడీ పద్మలు ప్రకటించేసారు) వున్నంత కాలం.. ఇలాంటి అద్భుతాలు జరగవు
ReplyDeleteప్రజల మనస్తత్వం గురించి మీరు చెప్పింది వాస్తవం. ఈ రెండు రాష్ట్రాలు కలవడం అన్నది మన కోరిక కావచ్చు కానీ అది మన జీవితకాలంలో జరగదు.
Deleteదీన్ని బట్టి మీకు ఏమి అర్ధమైంది?. ఇద్దరు చంద్రులూ ఒక్కటేనని. ఇద్దరూ కూడబలుక్కునే ఆంధ్రప్రదేశ్‌ను నిట్టనిలువుగా చీల్చారని. ఆంధ్ర విభజనకు బాబు లోపాయికారిగా kcr ను పురమాయించాడని అర్ధం కావడంలేదూ?. అందుకే kcr బాబుని ఎన్ని తిట్టినా ఒక వెర్రినవ్వు నవ్వి వూరుకుంటాడు తప్ప ఏమీ పీకడు
ReplyDeleteనాకు అధికారం మీకు రాష్ట్రం వచ్చేవరకు వాళ్ళను తిడుతూనే ఉందాం. అధికారం రాష్ట్రం రెండూ వచ్చాయి. వాళ్ళు ఇప్పుడు మనవాళ్ళే లేకపోతే పెట్టుబడులెవరు పెడతార్రాభై.. సమజైందా ..ఉత్తరాదివాల్లను నమ్మకండి. మన పక్క రాష్ట్రం వాళ్ళే బెటరు. ఉమ్మేసినా తుడుచుకొని పోతారు మొన్న అమరావతి శంకు స్థాపన రోజు చూల్లేదా నాకు బానర్లు, నన్ను చూడంగానే విజిల్లు. కాకపోతే వాళ్ళను చూస్తే కాస్త జాలేస్తుంది ఎందుకంటే వాళ్ళిప్పుడు గుండు కింద నుండి బండ కింద పడ్డరు.
ReplyDelete