శ్రీరామనవమి పేరు ఎత్తగానే ప్రతివారి మనసు పులకించి పోతుంది. కానీ భద్రాచలంలో జరుగుతున్న కళ్యాణం లోని నామ , గోత్ర , ప్రవరలు వింటుంటే మనసు ఎంతో బాధకు గురి అవుతున్నది . పేరుకు భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవాలయం , శుభలేఖ మీద ఉండే పేర్లు సీతా , రాములు . కళ్యాణంలో మహా సంకల్పం రామనారాయణుడు , సీతామహాలక్ష్మి పేర్ల మీద చదువుతున్నారు . వారి తండ్రులైన దశరధ , జనక మహారాజుల బదులుగా విభవ వాసుదేవ శర్మ , క్షీరార్ణవ శర్మలని చెప్పడం బాధకు గురి చేస్తున్నది. ఎవడీ విభవ వాసుదేవ శర్మ?ఎవడీ క్షీరార్ణవ శర్మ?
భద్రుని కోరిక మీద శ్రీరామ చంద్రుడు నాలుగు చేతులతో శంఖు చక్రాలతో సీతా లక్ష్మణులతో కలసి దర్శనమిచ్చాడు. ఆయన తాను శ్రీ రామచంద్రుడిని అని మనకు తెలిసే విధంగా తన కుడిచేతిలో శంఖం (భరతుడు ) ఎడమచేతిలో చక్రం ( శతృఘ్నుడు ) ఉండే విధంగా దర్శనమిచ్చాడు . అంతేగాక సీతామాత , లక్ష్మణుడు కూడా ఎడమవైపు ఉన్నారు . చేతిలో కోదండం ధరించి కోదండపాణి గా దర్శనమిచ్చారు . రామ పట్టాభిషేకంలో కూడా కోదండం ధరించి కుడి వైపున భరతుడు, ఎడమవైపున సీతమ్మ తల్లి , లక్ష్మణ , శత్రుఘ్నులు ఉండటం మనం గమనింపవచ్చు.
వచ్చినది నారాయణ రూపములో అయితే శంఖం , చక్రం సవ్యంగా ఉండేవి , నారాయణమూర్తి వాడే ధనసు పేరు శ్యారంగం , అందుకే ఆయనను సారంగ పాణి అని పిలుస్తారు . భద్రాచలంలో సారంగపాణి అనే పేరు ఎక్కడా వాడలేదు .భద్రాచలాన్ని దర్శించిన శంకరాచార్యులవారు ‘ వామాంకస్ధిత జానకి , పరిలసత్ కోదండ దండం కరే , చక్రం చోర్భ కరేన బాహుయుగళే , శంఖం శరం దక్షిణే , విబ్రాణం జల జాత పత్ర నయనం , భద్రాద్రి మూర్తి స్ధితమ్ , కేయూరాది విభూషితం రఘుపతిం , సౌమిత్రి యుక్తం భజే ‘ ।। అని రాశారు.
గుడి కట్టించిన రామదాసు గారు దాశరధీ అంటూ రాముడిని పిలుస్తూ దాశరధీ శతకం రాశారు . నీకు ఈ నగలు నీ తండ్రి దశరధుడు చేయించాడా లేక నీమామ చేయించాడా అని రాశారు . అలాగే పలుకే బంగారమాయనా కోదండపాణీ అంటూ రాశారు . ఇక్ష్వాక కుల తిలకుడిగా భావించి , కలికి తురాయి చేయించారు . చింతాకు పతకము చేయిస్తి నీకు సీతమ్మ తల్లి అంటూ రాశారు.
భద్రాచలంలో నవమి నాడు కళ్యాణం జరగటానికి కారణం ఆరోజున శ్రీరాముడు జన్మించడమే. కానీ రామనారాయణుడు జన్మించిన సమయం ఎవ్వరికీ తెలియదు . భద్రాచలం లోకళ్యాణం జరిగే మంటపానికి పైన ఉన్న శిల్పంలో చతుర్భుజుడైన శ్రీరామ కళ్యాణాన్ని దశరధ , జనకులు చూస్తున్నట్లుగా చెక్కించారు.
కళ్యాణానికి వాడే మంగళ సూత్రం లో 3 మంగళ సూత్రాలుంటాయని వాటిని దశరధుని తరుఫున ఒకటి , జనకుని తరుఫున ఒకటి , రామదాసు గారి తరఫున ఒకటి చేయించారని గతం లో శుభలేఖలో రాసేవారు. వ్యాఖ్యాతలు కూడా ఇంతకు ముందు చెప్పటం జరిగేది . ఇప్పటి శుభలేఖలో కేవలం 3 మంగళ సూత్రాలున్నాయని రాసి దశరధ , జనకుల పేర్లు చెప్పకుండా పుట్టినింటి వారిదొకటి , మెట్టినింటి వారి దొకటి అని చెప్పి దాటవేస్తున్నారు . దశరధ , జనకులు చేసిన తప్పేమిటో వారినెందుకు మహాసంకల్పంలో నుంచి తప్పించారో అర్దం కావటం లేదు.
రాముడు కేవలం అర్చామూర్తి మాత్రమే , దశరధ తనయుడు కాదు , సీతమ్మ తల్లి లాగా అయోనిజుడు , ఆయనకు తండ్రి ఆయనే , సీతమ్మ కు తల్లి సీతమ్మే అని చెప్పటం ఎంతో శోచనీయం . ఆయన దశరధ తనయుడు కాకుంటే చైత్ర శుద్ధ నవమి నాడు కళ్యాణమెందుకు చేస్తున్నారు? ప్రతి సాయంత్రం దర్బారు సేవ ఎందుకు చేస్తున్నారు? కళ్యాణం మరునాడు పట్టాభిషేకమెందుకు చేస్తున్నారు?కళ్యాణానికి రామనారాయణుడు , పట్టాభిషేకానికి రామచంద్రుడా?
అసలు రెండు పంచ లోహ విగ్రహాల్ని రోజూ చింతపండేసి తోమితే చాలు మోక్షం వచ్చేస్తుందని చెప్తున్న రామానుజ మతమే వేద విరుధ్ధమైనది.కాబట్టి ఈ సాతాను జియ్యరుతో బాటు రామానుజ మతాన్ని కూడా తన్ని తగలేస్తే డబల్ బెనెఫిట్.
జై శ్రీ రామ్!
No comments:
Post a Comment
సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు