Sunday, 21 April 2024

శ్రమ దోపిడీ గురించి ముప్పాళ రంగనాయకమ్మ గారి లోతైన పరిశీలన బెత్తెడు లోతు కూడా లేదేంటీ!

ఎలక్టొరల్ బాండ్స్ గురించి మార్చి 31 "సుప్రీం కోర్టు తీర్పు సంస్కరణేనా?" అని లోక్ సత్తా జయప్రకాశ్ ఒక వ్యాసం వ్రాస్తే దాన్ని విశ్లేషిస్తూ నిన్నటి ఏప్రిల్ 20 మార్క్సిస్ట్ మేధావి ముప్పాళ రంగనాయకమ్మ గారు ఒక వ్యాసం వ్రాశారు.అసలు జయప్రకాశ్ వ్యాసం చదవని వాళ్ళకి కూడా  లోటు తెలియకుండా పధ్ధతి ప్రకారం ఆయాన్ చెప్పిన ఒక్కో పాయింటునీ చెప్పి అందులో ఉన్న తప్పుల్ని ఎత్తి చూపించటం పిచ్చ, వీరపిచ్చ, మహాపిచ్చ లెవెల్లో నచ్చేసింది నాకు.విషవృక్షం కూడా ఇంత నిజాయితీతో వాల్మీకి ఏం వ్రాశాడో దాన్ని అక్షరం పొల్లుపోకుండా ఎత్తి రాసి అందులో ఉన్న తప్పులేమిటో విప్పి చెప్తే ఎంత బాగుండేది?కదా!

అయితేఅయిదో పాయింటుని తీసుకుని చేసిన విశ్లేషణ దగ్గిర దొరికిపోయింది నాకు.దొరికిపోవడంలో కూడా అలా ఇలా కాదు మొత్తం మార్క్సిస్టు సిధ్ధాంతాన్ని దూదేకినట్టు ఏకి పారెయ్యటానికి పనికొచ్చే బలమైన పాయింట్లని ఆమె అందించారు నాకు.మొదట జయప్రకాశ్ వ్యాసంలోని ఆమె ఎత్తి చూపిన తప్పుల్ని సమర్ధిస్తూ అన్ని పాయింట్లనీ ఎత్తి పోసిన తర్వాత  అయిదో పాయింటుకి వస్తాను.

ఆమె పట్టిన మొదటి పాయింటు:సుప్రీం తీర్పు ఏమిటి?"కార్పొరేట్లు(పెద్ద పెద్ద కంపెనీలు) రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాల గురుంచి ఏయే పార్టీలకు ఎంతెంత ఇచ్చారనే వివరాలన్నీ చెప్పాలి" అని కదా.దీన్ని "సంస్కరణేనా?" అనడంలో ఆయన అర్ధం ఏమిటో స్పష్టత లేదు.

హరిబాబు మాట:నిజమే కదా!నిజానికి ఎలక్టొరల్ బాండ్లు అనేవి సీక్రెట్ ట్రాన్సాక్షన్లు కావు.ఒక బ్యాంకులో ఎక్కవుంటు ఉన్న ప్రతి వ్యక్తికీ చెక్ బుక్ కూడా ఇస్తుంది బ్యాంకు. చెక్కులో మనం మూడే మూడు వివరాలు ఇవ్వాలి.అందుకోసం Towards అని చూపిస్తూ ఒక ఖాళీ స్థలం,Aamount అని చూపిస్తూ ఒక బాక్సు,సంతకం చెయ్యటానికి ఒక ఖాళీ ఉంటాయి.అప్పుడప్పుడు సినిమాల్లో కొన్ని తింగరి క్యారెక్టర్లు గొప్ప కోసం బ్లాంక్ చెక్ ఇస్తాను అంటుండం చూస్తాం కదా.అంటే,  వ్యక్తి తన చెక్కు మీద Towards కాలమ్ పూర్తి చేసి Amount రాయడు, సంతకం మాత్రం చేసి ఇస్తాడు.అయితే, తీసుకున్న వ్యక్తి ఎమౌంటు వేశాకనే  చెక్కు బ్యాంకు దగ్గిర చెల్లుతుంది.చెక్కు ఇచ్చే వ్యక్తి తీసుకునే వ్యక్తికి గాక అతను  చెక్కుని  వేరేవాళ్ళకి ఇచ్చేటట్టు చెయ్యాలనుకున్నప్పుడు సంతకం మాత్రం తను చేసి ఎమౌంటు కూడా వేసి Towards కాలమ్ ఖాళీగా ఉంచి ఇస్తే చెల్లుతుందా?తీసుకున్న వ్యక్తి Towards పూర్తి చేశాకనే బ్యాంకు  చెక్కుని తీసుకుంటుంది కాబట్టి, చెల్లుతుంది - ఎలక్టొరల్ బాండ్స్ కూడా అట్లాంటివే!

కంపెనీ ఓనర్లకి  ఎలక్టొరల్ బాండ్స్ ఇచ్చేది రిజర్వ్ బ్యాంక్,బాండ్స్ ఇచ్చేటప్పుడు Towards ఖాళీగా ఉంచి ఇచ్చినా అది వెళ్ళేది బ్యాంకుకే, వెళ్ళినప్పుడు అక్కడ Towards కాలమ్ నింపుతారు కదా -  బాండ్లని తీసుకున్న బ్యాంకు పొలిటికల్ పార్టీల ఎక్కవుంటులో వేస్తున్న ట్రాన్సాక్షన్ని నమోదు చేస్తున్నప్పుడు ఇచ్చిన కంపెనీ పేరూ తీసుకుంటున్న పార్టీ పేరూ  బ్యాంకుకి తెలుస్తుంటే ఇందులో బీజేపీ చేస్తున్న ఫ్రాడ్ ఏముంది?సభలో ఒక బిల్లుని పెట్టి ప్రతిఓక్ష సభులతో సహా అందరూ చర్చలో పాల్గొని అది మనీ రిలేటెడ్ బిల్లు కాబట్టి రాజ్యసభలో కూడా ఆమోదం పొంది చేసిన ఒక చట్టాన్ని ఫ్రాడ్ అనటం రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్నవాళ్ళు చెయ్యాల్సిన పనేనా?సుప్రీం కోర్టు జడ్జిలకి కూడా  చిన్న పాయింటు తట్టలేదు గనకనే తీర్పు అలా వచ్చి చచ్చింది.నిజానికి,సుప్రీం కోర్టు జడ్జిలు మొదలు జయప్రకాశ్ అనే మేధావి వరకు గల సమస్త ప్రజానీకానికీ ప్రజాస్వామ్యం అనేది ఎలా ఉండాలో అర్ధం కాలేదు,అంతే.

ఆమె పట్టిన రెండవ పాయింటు:"భారత్ రాజకీయాల్లో డబ్బు ప్రాబల్యాన్నీ అర్ధం చేసుకోవాలంటే మరింత లోతైన పరిశీలన అవసరం" అన్నారు కానీ ఆయన లోతైన పరిశీలన కంపెనీలకు పన్నుల మినహాయింపు ఉండాలని చెప్తున్నట్టు ఉంది.

హరిబాబు మాట:నిజమే కదా!ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలు పొలిటికల్ పార్టీలకి బ్లాక్ మనీ ఇచ్చి పోషిస్తున్నది  పార్టీలు అధికారంలోకి వచ్చాక పన్నుల్లో మినహాయింపులు ఇచ్చి తమకు లాభాలను పెంచుకోవాలని కదా - దొంగ చేతికే తాళాలు ఇచ్చి ఇప్పుడు జరుగుతున్న రహస్య లాలూచీని బాహాటంగా చేసి దోపిడీని చట్టబధ్ధం చెయ్యమంటున్నాడు లోక్ సత్తా మేతావి.

ఆమె పట్టిన మూడవ పాయింటు:"ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యం" అనీ "లోపభూయిష్ట ప్రజాస్వామ్యం" అనీ "పరిణతి చెందిన ప్రజాస్వామ్యం" అనీ వ్యాసకర్త ప్రజాస్వామ్యానికి వేరు వేరు లక్సహ్నాలు చెప్పారు.కానీ, సమజం పేద-ధనిక భేదాలతో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం ధనిక వర్గాలకే అనుకూలం అవుతుంది.

హరిబాబు మాట:నిజమే కదా!అయితే, అసలు మురమ్నా గారికి కూడా తెలియని విషయం ఒకటుంది - ప్రజాస్వామ్యం అనే వ్యవస్థని డిజైన్ చేసినవాళ్ళు ఆర్ధిక అంతరాలను పెంచటానికే  రూపాన్ని ఇచ్చారు.

ప్రజాస్వామ్యం ఇప్పుడు అమెరికాలోనూ ఇండియాలోనూ ఉన్నట్టు ఎంత కాలం కొనసాగితే అంత కాలమూ ఆర్ధిక అసమానతలు కూడా కొనసాగుతూనే ఉంటాయి."ఈనాటి ప్రజాస్వామిక సూత్రాలన్నీ దోపిడీ పధ్ధతుల్లో పరిణతి చెందినవే!" అన్న ముప్పాళ రంగనాయకమ్మ గారి వాక్యం నూటికి నూరు శాతం నిజం."ఎన్నికల్లో ఓటు వేసి ప్రజలు తమని ఎవరు పరిపాలించాలో తామే నిర్ణయించుకునే అద్భుతమైన అవకాశం ఉన్న అత్యున్నతమైన నైతికత వెల్లి విరిసే ఆదర్సాలని పుణికి పుచ్చుకున్న ప్రజాస్వామ్యం!" అనేది బ్రిటిష్ సామ్రాజ్యవాదుల సృష్టి అని ఎంతమందికి తెలుసు?ప్రపంచం మొత్తాన్ని తమ వలస రాజ్యాల కింద తొక్కి పట్టి ప్రపంచ ప్రజల కష్టార్జితాన్ని తమ బ్యాంక్ ఎకవుంట్లకి వన్ సైడ్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకున్న సామ్రాజ్యవాదులు తాము తొక్కి పట్టాలనుకుంటున్న ప్రపంచ ప్రజల్లోని ప్రతి వాడికీ తన వోటుతో తనకు నచ్చిన ప్రభుత్వాన్ని ఏర్పరచుకునే స్వేచ్చనీ అవకాశాన్ని అధికారాన్నీ ఎందుకు ఇస్తారు?

"ఈనాటి ప్రజాస్వామిక సూత్రాలన్నీ దోపిడీ పధ్ధతుల్లో పరిణతి చెందినవే!" అని మార్క్సిస్టు మేధావులకే కాక మనకి కూడా అనిపించేలా ప్రజాస్వామ్యం నడుస్తున్నప్పుడు దీన్ని సామ్రాజ్యవాదులు కాక ప్రజాసామ్యవాదులు నిర్మించారని ఎలా నమ్మాలి!

ఆమె పట్టిన నాల్గవ పాయింటు:జయప్రకాష్ గారు అనుకుంటున్నట్టు డబ్బు ప్రాబల్యం లోపభూయిష్ట ప్రజాస్వామ్యం అయిన భారత్ రాజకీయాల్లోనే కాదు ఆయాన్ చెప్పే "పరిణతి చెందిన పర్జాస్వామ్యాలాలో" కూడా డబ్బు ప్రాబల్యం ఎంతో ఉంది.

హరిబాబు మాట:నిజమే కదా!ఆవిడ చదివిన పుస్తకం ఇది:Democracy for the Few(కొద్ది మంది కోసమే ప్రజాస్వామ్యం) - Michael Parenti.చాలా మంచి పుస్తకం - దీన్ని సామ్రాజ్యవాదులు కాక ప్రజాసామ్యవాదులు నిర్మించారని ఇప్పటికీ నమ్మేవాళ్ళ చేత  పుస్తకం చదివిస్తే చాలు,జై హింద్!

ఆమె పట్టిన ఐదవ పాయింటు:రాజకీయ పార్టీలకి కార్పొరేట్ సంస్థలు ఇచ్చే విరాళాలపై పన్ను మినహాయింపు ఇవ్వాలని కదా జయప్రకాశ్ గారు సూచిస్తున్న సంస్కర్ణ.కానీ, "అసలు లాభం అంటే ఏంటి?లాభాల్ని పెద్ద పెద్ద కంపెనీల అధిపతులూ వేలాది వాటాదార్లూ ఎలా ఎక్కడినుంచి పొందుతారు?" అనే ప్రశ్నలు వేసుకుని సమాధానాలు రాబడితే అది లోతైన విశ్లేషణ అవుతుంది.

హరిబాబు మాట:నిజమే కదా!మొదట చెప్పాను కదా "మొత్తం మార్క్సిస్టు సిధ్ధాంతాన్ని దూదేకినట్టు ఏకి పారెయ్యటానికి పనికొచ్చే బలమైన పాయింట్లని ఆమె అందించారు" అని,ఆమె చేసిన లోతైన విశ్లేషణకి ఆమె ఇచ్చిన ఉదాహరణ ఆమె పునాదుల్నే కాక మార్కిస్టు సిధ్ధాంతం యొక్క పునాదుల్ని కూడా కూల్చేసింది.

ఆమె పట్టిన ఆరవ పాయింటు:కార్పొరేట్లు బహిరంగంగా విరాళాలు ఇవ్వాలంటే ఆర్ధిక కార్యకలాపాలలో పక్షపాతాలూ అనూహ్య నిర్ణయాలూ ఉందరాదన్నది జయప్రకాశ్ గారి మరొక ప్రతిపాదన.అయితే, అధికారంలో ఉన్న పార్టీకి  కంపెనీ అయితే ఎక్కువ దబ్బు ఇస్తుందో  కంపెనీకి అనుకూలం అయ్యేతట్టు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు నిర్ణయాలు తీసుకోవదంలో అనూహ్యం ఏముంది?వీదెశాలతో ఒప్పందాలు చహెసుకునే సమయంలో ప్రధానమంత్రే తాం పార్టీకి ఎక్కువ విరాళాలు ఇచ్చిన పెట్టుబడిదారుణ్ణి తాన్ వెంటబెట్టుకు పోగలడు.ఈయన చెప్తున్న పరినతి చెందిన ప్రజాస్వామ్యం అయిన అమెరికా రక్షణ శాఖనుంచి వందల కోట్ల విలువ కలిగిన కాంట్రాక్టుల్ని మిలిటరీ అధికారులు కొన్ని కంపెనీలకి మాత్రమే ఇప్పించి వాటినుంచి అపారమైన ప్రతిఫలాన్ని అనేక రూపాలలో పొందుతున్నారని మైకేల్ పరంటీ సాక్ష్యాలు చూపించి చెప్తున్నాడు.

హరిబాబు మాట:నిజమే కదా!

ఆమె పట్టిన ఏడవ పాయింటు:"పరిణతి చెందిన ప్రజాస్వామ్యాలలో తమ రాజకీయ ప్రాధాన్యతలను కార్పొరేట్లు బాహాటంగా చెబుతారు" అని అదేదో గొప్ప విషయం అన్నట్టు చెప్తున్నారు జయప్రకాశ్ నారాయణ్ గారు. భారత ప్రజాస్వామ్యంలోనూ కార్మికవర్గ వ్యతిరేక ఆర్ధిక సంస్కరణలను వేగవంతం చెయ్యమని భారత పారిశ్రామిక సంఘాలు బాహాటంగా డిమాండు చెయ్యదం లేదా?

హరిబాబు మాట:నిజమే కదా!

ఆమె పట్టిన ఎనిమిదవ పాయింటు:"ప్రతీకార చర్యలుంటాయనే భయం లేకుండా పార్టీలకూ అబ్యర్ధులకూ కార్పొరేట్లు విరాళాలు ఇచ్చే చట్టబధ్ధ పరిపాలన భారత దేశానికి చాలా అవసరం" అని ఇంకో సంస్కరణని సూచించారు జయప్రకాశ్ గారు.అంటే, కార్పొరేట్ కంపెనీల్ని ఇబ్బంది పెట్టడం గురించి మాత్రమే జయప్రకాశ్ గారు ఇబ్బంది పడుతున్నారు."కార్మికుల శ్రమదోపిడీ!" అన్న ఒక్క మాట ఎత్తని ఎంత లోతైన పరిశీలన ఇది?

హరిబాబు మాట:నిజమే కదా!అంటే, అధికారంలో ఉన్న పార్టీలు తమ వైరి పక్షాలకి దబ్బులిచ్చి తమను అధికారం నుంచి దించాలనుకున్న కార్పొరేట్ కంపెనీల్ని ఇబ్బంది పెట్టడం గురించి మాత్రమే జయప్రకాశ్ గారు ఇబ్బంది పడుతున్నారు.

విమర్శ అనే పదానికి ఇవ్వాళ తిట్టడం అనే అర్ధం వచ్చేసింది గానీ పూర్వఋషులు  పదాన్ని ప్రతిపాదించినది ఒక విషయం గురించి గుణదోష నిర్ణయం అనే అర్ధంతో.పదవ్యుత్పత్తి, మూలధాతుశోధన, తాత్పర్యం, విశ్లేషణ, వ్యాఖ్యానం, వివరణ, భాష్యరచన,విమర్శ,పరామర్శ - ఇవన్నీ సత్యాన్ని నిర్ధారించి చెప్పటానికి వేదంలోని తర్కశాస్త్రం ప్రతిపాదించిన పధ్ధతులు. పధ్ధతి ప్రకారం మొదట రంగనాయకమ్మ గారు జయప్రకాశ వ్యాసంలోని తప్పుల్ని నేను కూడా తప్పులేనని ఒప్పుకున్నాను.ఆయా విషయాలకు సంబంధించి రనగనాయకమ్మ గారు చేసిన సూత్రీకరణలు శాస్త్రీయమైన సత్యాలే అని నిర్ధారిస్తున్నాను కూడా.

ఇప్పుడు నేను విభేదిస్తున్న అంశం ఏమిటో ఇక్కడ ఇస్తున్నాను.మార్చి చెప్పి ఏమార్చిన చెడ్డపేరు రాకూడదు గనక ఆమె వ్రాసిన దాన్ని యధాతధం ఇస్తున్నాను:

{"అసలు లాభం అంటే ఏంటి?లాభాల్ని పెద్ద పెద్ద కంపెనీల అధిపతులూ వేలాది వాటాదార్లూ ఎలా ఎక్కడినుంచి పొందుతారు?" అనే ప్రశ్నలు వేసుకుని సమాధానాలు రాబడితే అది లోతైన విశ్లేషణ అవుతుంది.

నిత్యం తూర్పున సూర్యోదయం జరగడం అనేది ప్రకృతి సత్యం అయినట్టుగా 'లాభం రావడం' అనేది కూడా అంత సహజమైనదని సంస్కర్తలు భావిస్తారు.ఒక మందుల కంపెనీ ఉందనుకుందాం.అది, కొన్ని మందుల ఉత్పత్తికి కావలసిన సాధనాల కోసం 80 కోట్లు పెట్టింది అనుకుందాం.సాధనాల్ని ఉపయోగిస్తూ పని చేయడానికి శ్రామికులు కావాలి.వారిలో వేరు వేరు స్థాయిల వారు ఉంటారు.వారి జీతాల కోసం 20 కోట్లు అనుకుందాం.అలా సాధనాల 80 + శ్రామికుల 20 = 100 కోట్ల ఖర్చుతో తయారైన మందుల్ని 120 కోట్లకి  కంపెనీ అమ్మిందనుకుందాం.అదనంగా వచ్చిన  20 కోట్ల విలువ ఎవరి వల్ల వచ్చింది?

సాధనాల వల్ల అయితే కాదు. అదనపు కోట్ల విలువా,శ్రమలన్నీ చేసిన శ్రామికుల వల్ల వచ్చిందే!అది శ్రామికుల అదనపు శ్రమ విలువ.అదే అదనపు విలువ.కానీ, కంపెనీ యజమానులు ఏమంటారంటే, 'అది మా పెట్టుబడి తెచ్చే లాభం' అంటారు.ఎందుకంటే,శ్రమ దోపిడీ అనేది పరిణతి చెందిన ప్రజాస్వామ్యాల రాజ్యాంగాలలో చట్టబధ్దమే కాబట్టి!ఇంకో విచిత్రం ఏమిటంటే,కంపెనీలు ప్రభుత్వానికి పన్నులు కడితే అవి ఎక్కడివి?శ్రామికుల నించీ దొంగిలించిన అదనపు విలువ లోనివే!}

హరిబాబు విశ్లేషణ:లాభం కోసం పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసిన వాడికి లాభం రావడమే అసహజం అంటూ మళ్ళీ అది పెట్టుబడి పెట్టని శ్రామికుల న్యాయమైన వాటా అంటే ఎలా?అన్ని శాస్త్రీయమైన సూతీకరణలు చేసిన మేధావి ఇంత తెలివి తక్కువ వాదన చెయ్యటం ఎలా సాధ్యం?

ఇప్పుడు ఆమెకి మొదటి ప్రశ్న:'లాభం రావడం' కోసమే లాభం వస్తుందన్న నమ్మకంతో పెట్టుబడి పెడుతున్నప్పుడు లాభం రావడం అసహజం అని ఎందుకు అనిపిస్తున్నది?

ఇప్పుడు ఆమెకి రెండవ ప్రశ్న:"సాధనాల 80 + శ్రామికుల 20 = 100 కోట్ల ఖర్చుతో తయారైన మందుల్ని 120 కోట్లకి  కంపెనీ అమ్మిందనుకుందాం.అదనంగా వచ్చిన  20 కోట్ల విలువ ఎవరి వల్ల వచ్చింది?" అన్న ప్రశ్నకి "సాధనాల వల్ల అయితే కాదు" అని ఎలా తీర్మానించారు?మా ఇంట్లో పని కుర్రాడు ఉన్నాడు.వాడికి ఆడవాళ్ళు తమ బట్టల మీద చేసుకునే అలంకారం అయిన కుట్లూ అల్లికలలో బ్రహ్మాండమైన కౌశలం అబ్బింది.దాంతో వాడు కొంత డబ్బు కూడా సంపాదిస్తున్నాడు.దీనికి వాడుతున్న సూదీ దారం వాడు తయారు చేసుకోవటం లేదు.అవి షాపులో కొనుక్కున్న సాధనాలు -  రెంటికీ కల్పి 50 రూపాయలు ఖర్చు చేస్తే అది పెట్టుబడి అవుతుందా అవదా?

కుట్లూ అల్లికలూ అనే హస్తకళావ్యాపారవ్యవస్థ కోసం 50 రూపాయలు పెట్టుబడి పెట్టి సూదీ దారం అనే సాధనాల్ని కొనుక్కున్న వాడు ఒక్కొక్కరి నుంచి 10 రూపాయల ప్రతిఫలం తీసుకుంటే అతను 100 రూపాయలు ఆర్జించడం "సాధనాల వల్ల అయితే కాదు" అని బల్లగుద్ది చెప్పడం ఏంటి?ఎంత తెలివి తక్కువ వాదన ఇది!

ఇప్పుడు ఆమెకి మూడవ ప్రశ్న:"సాధనాల 80 + శ్రామికుల 20 = 100 కోట్ల ఖర్చుతో తయారైన మందుల్ని 120 కోట్లకి  కంపెనీ అమ్మిందనుకుందాం.అదనంగా వచ్చిన  20 కోట్ల విలువ ఎవరి వల్ల వచ్చింది?" అన్న ప్రశ్నకి మరి," అదనపు కోట్ల విలువా,శ్రమలన్నీ చేసిన శ్రామికుల వల్ల వచ్చిందే" అని ఎలా తీర్మానించారు?"సాధనాల వల్ల అయితే కాదు" అని చేసిన తీర్మానం శ్రామికులకి వర్తించదా!

ఆమె కధనం ప్రకారమే శ్రామికులు ఉనికిలోకి ఎప్పుడు వస్తున్నారు - "సాధనాల్ని ఉపయోగిస్తూ పని చేయడానికి శ్రామికులు కావాలి". అంటే, సాధనాలు కొన్న తర్వాతనే కదా శ్రామికులు ఉనికిలోకి వచ్చేది.పోనీ శ్రామికులు వచ్చి వస్తువుల్ని ఉత్పత్తి చెయ్యడం వల్లనే,శ్రామికులు చేసిన శ్రమకి అనుకూల నిష్పత్తిలోనే లాభాలు వస్తాయి అని ముప్పాళ రంగనాయకమ్మ గారి సూత్రీకరణయా?కుట్లూ అల్లికలూ చేసి డబ్బులు సంపాదిస్తున్న మా పనికుర్రాడు ఒక్కొక్కరి నుంచి 10 రూపాయలే ఎందుకు తీసుకుంటున్నాడు, ఒక్కొక్కరి నుంచి 1000 రూపాయలు అడిగితే దృశ్యం ఎలా ఉంటుంది?

ఆమెకి తెలిసే మనల్ని మోసం చెయ్యడానికి చెప్పడం లేదో అసలు తెలియదో గానీ డబ్బుని సృష్టించడానికి వ్యాపారం అనే ప్రక్రియ మొదలైన అనాది కాలం నుంచీ వ్యాపారికి లాభం వచ్చేది కొనుగోలు దారులు తను అమ్మిన వస్తువు పట్ల సంతృప్తిని వ్యక్తం చేసినప్పుడే!కుట్లూ అల్లికలూ చేసి దబ్బులు సంపాదిస్తున్న మా పనికుర్రాడు ఒక్కొక్కరి నుంచి 10 రూపాయలే తీసుకుంటున్నాడు గానీ షట్టర్ స్టాక్ వంటి ఆన్లైన్ ఇమేజి ప్రొవైడర్లు కొన్ని బొమ్మలకి ఒక్కొక్కరి నుంచి 1000 రూపాయలు అడుగుతూనే ఉన్నారు కదా!

"లాభం కోసం పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసిన వాడికి లాభం రావడమే అసహజం అంటూ మళ్ళీ అది పెట్టుబడి పెట్టని శ్రామికుల న్యాయమైన వాటా అంటే ఎలా?" అనే చిన్న ప్రశ్న కూడా బుర్రకి తట్టని అజ్ఞానంలో ముప్పాళ రంగనాయకమ్మ గారు ఉన్నారు గాబట్టి ఆమెకి తెలియడం లేదు గానీ అమ్మకందారు,వస్తువు,ధర,కొనుగోలుదారు,లాభం - ఇవి మాత్రమే క్లాసికల్ ఎకనమిక్సులో స్వతంత్రమైన అస్తిత్వం ఉన్న అయిదు అంశాలు.శ్రామికులు కూడా సాధనాల లాగే ఉత్పత్తి దారుడికి సహాయ కారులైన ఉపాంగాలే తప్ప శ్రామికులకి స్వతంత్ర అస్తిత్వం లేదు.

మార్క్సు మొదలు ముప్పాళ రంగనాయకమ్మ గారి వరకు చేస్తున్న "ఉత్పత్తి శక్తులు(శ్రామికవర్గం శ్రామికవర్గం మరియు శ్రామిక అనుకూల వ్యవస్థలు) ఆర్ధిక పురోగతినీ చరిత్ర గమనాన్ని శాసిస్తాయి" అనేది తప్పుడు సూత్రీకరణ - "కొనుగోలుదార్లు వ్యాపార విస్తృతినీ చరిత్ర గమనాన్నీ శాసిస్తారు" అనేది శాస్త్రీయమైనది.అయితే, ఇప్పుడు జరుగుతున్నదీ, దోపిడీ అని మార్క్సిస్టు మేర్ధావులు నిర్వచిస్తున్నదీ అయిన అదనపు విలువ ఉనికిలోకి రావటమూ శ్రామికులు శ్రమదోపిడీకి గురవటమూ ఉత్పత్తి శక్తులు అయిన పెట్టుబడిదారులు ప్రభుత్వాధినేతల్ని కొనేసి వాళ్ళతో తమకు అనుకూలమైన చట్టాలను చేయించుకుని కొనుగోలుదారుల్ని తమ కట్టుబానిసల్ని చేసుకోవడం వల్ల జరుగుతున్నది.ఇక్కడ కూడా కొనుగోలు దారుల వల్లనే పెట్టుబడిదారులకి లాభాలు వస్తున్నాయి గానీ అజ్ఞానం వల్ల కొనుగోలుదార్లు తమకు అవసరం లేని తమకు నిజమైన సంతృప్తిని ఇవ్వని వస్తువుల్ని కొనుగోలు చెయ్యడం వల్ల నష్టపోతున్నారు.

కొనుగోలు దారుల్ని తమ అవసరాల పట్ల స్పష్టత వచ్చే స్థాయిలో ఎడ్యుకేట్ చేస్తే అంతమైపోయే దోపిడీకి నక్సలైట్లు అడవుల్లో చలిమంటలు వేసుకుని జజ్జనకరె పాటలు పాడితూ గంతులు వేస్తే ఏమొస్తుంది?గోంగూర కట్ట!దోపిడీ మార్కెట్ దగ్గిర జరుగుతుంటే సాయుధ పోరాటం దేనికి పనికొస్తుంది,వర్గరహితసమాజం దేనికి పనికొస్తుంది,శ్రామికవర్గనియంతృత్వం దేనికి పనికొస్తుంది?

కుట్లూ అల్లికలూ అనే హస్తకళావ్యాపారవ్యవస్థ కోసం ఒకసారి 50 రూపాయలు పెట్టుబడి పెట్టి సూదీ దారం అనే సాధనాల్ని కొనుక్కున్న మా పనికుర్రాడు ఒక్కొక్కరి నుంచి 10 రూపాయల ప్రతిఫలం తీసుకుంటూ నెలకి 100 రూపాయలు సంపాదిస్తున్నప్పుడు మార్క్సు గానీ ఈమె గానీ వెళ్ళి " అదనపు కోట్ల విలువా,శ్రమలన్నీ చేసిన శ్రామికుల వల్ల వచ్చిందే!అది శ్రామికుల అదనపు శ్రమ విలువ.అదే అదనపు విలువ"అని పొగిడితే శ్రామికుడూ వాడే గాబట్టి సంతోషిస్తాడు గానీ "'లాభం రావడం' కోసమే లాభం వస్తుందన్న నమ్మకంతో పెట్టుబడి పెడుతున్నప్పుడు లాభం రావడం అసహజం","50 రూపాయలు పెట్టుబడి పెట్టి సూదీ దారం అనే సాధనాల్ని కొనుక్కున్న వాడు ఒక్కొక్కరి నుంచి 10 రూపాయల ప్రతిఫలం తీసుకుంటూ అయిదుగురితో వ్యాపారాన్ని ఆపెయ్యాలి, నెలకి 100 రూపాయలు సంపాదించటం దోపిడీ అవుతుంది." లాంటి సూత్రీకరణలు చేస్తే మాత్రం మూతిపళ్ళు రాలగొడతాడు.

జై శ్రీ రామ్!

No comments:

Post a Comment

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...