2024 జనవరి 03న ఈనాడు దినపత్రికలో "కాంతితో క్యాన్సర్ ఖతం" అని ఒక వార్త పబ్లిష్ అయ్యింది.ఆ వార్తని యధాతధం ఇక్కడ ఇస్తున్నాను,చదవండి:"క్యాన్సర్ కణాలను అంతం చెయ్యడానికి డాక్టర్లు ఇటీవల ఒక వినూత్న ప్రక్రియను వాడుకున్నారు.ఇది ప్రయోగ సాలలో 99% వరకూ క్యాన్సరును నిర్మూలించదం విశేషం.ఇంతకీ ఇందుకు ఉపయోగపడిన సాధనం ఏమిటో తెలుసా?నియర్-ఇంఫ్రారెడ్ కాంతి!ఈరకం కాంతి శరీరం లోపలికి చొచ్చుకెళ్ళగలదు మరి.
ఇంతకీ క్యాన్సర్ కణాల్ను ఇదెలా చంపుతుంది?కంపింపజెయ్యటం ద్వారా!క్యాన్సర్ కణాల పైపొరలు ఛిద్రమయ్యేవరకు కంపింపజేస్తూ క్యాన్సర్ కణాలను చంపుతుంది.ఎముకల్లో,అవయవాల్లో తలెత్తే క్యాన్సర్లకు శస్త్రచికిత్సరహిత చికిత్సల దిశగా ఇది ద్వారాలను తెరుస్తుందని భావిస్తున్నారు."
అయితే, 2023 ప్రారంభం నుంచీ చాగంటి వెంకట్ గారు వేదాస్ వరల్డ్ సంస్థ తరపున అప్పటికే వేదసాస్త్రాల పరిచయం ఉన్న యువకులైన వేదవిద్యార్ధులతో చేసిన కొన్ని చర్చల్ని తన చానల్లో వీడియోల రూపంలో పబ్లిష్ చేశారు.సుమారు మే జూన్ల మధ్యన పూషా కిరణాలను గురించి చర్చిస్తూ చేసిన వీడియోలలో కొన్న్ని ఋగ్వేదమంత్రాలను విశ్లేషించారు.ఋగ్వేదం 01.42.03 - అంటే ఒకటవ మండలం 42వ సూక్తం మూడ్వ మంత్రం అని అర్ధం చేసుకోవాలి.
"పూష కిరణములు (అజ)మూడు రకములైన - 1.శరీరము లోపల(హురశ్చిత్, deceiver), 2.బయటినుండి(ముషీవాన్, ప్రత్యక్షంగా), 3.సంక్రమించే వ్యాధులు(పరిపంధి, hindering) అనేవాటిని దూరం చేస్తాయని విద్వాంసుడైన వైద్యుడు తెలుసుకుని ఆచరించునట్లు విద్వాంసుడైన రాజు మూడు రకములైన - 1.రాజద్రోజు(హురశ్చిత్, deceiver), 2.దొంగలు(ముషీవాన్,ప్రత్యక్షంగా నేరాలు చేసేవారు), 3.మోసగాళ్ళను(పరిపంధి, hindering) అనేవాళ్ళను కనిపెట్టి శిక్షంచవలెను/ప్రజాజీవితం నుండి తప్పించవలెను(స్రుతేః)" అనేది మంత్రం యొక్క భావం.పరిపాలనకీ వైద్యానికీ పోలిక చెప్తూ వ్యక్తుల శరీరాలకి పూషా కిరణాలు చేస్తున్న మేలునే రాజు ప్రజలకి చెయ్యాలి అనే సలహా ఇస్తున్నాడు సృష్టికర్త ఇక్కడ.
అయితే, ఈనాడు చెప్తున్నది ఒక ఆధునిక శాస్త్రజ్ఞుల పరిశోధన గురించి చెప్తుంటే అది వేదవిజయం ఎలా అవుతుంది?నిజమే కదా!మొదట ఆధునిక శాస్త్రజ్ఞుల పరిశోధన గురించి చెప్తాను.Molcular Jackhammers "good vibrations" eradicate cancer cella అన్న తలకట్టు పెట్టి RICE UNIVERSITY వారు ఒక రీసెర్చి పేపరును సైంటిఫిక్ జర్నల్సులో పబ్లిష్ చేశారు.{"news.rice.edu/news/2023/molecular-jackhammers-good-vibrations-eradicate-cancer-cells"} దగ్గిర పూర్తి పాఠం దొరుకుతుంది,చూడండి.ప్రయోగానంతరం light-induced whole-molecule vibration can rupture melanoma cells' membrane అని వాళ్ళు ధృవీకరించారు.అది ఈనాడు వార్తలోని విషయాన్ని ధృవీకరిస్తుంది.ప్రయోగం చేసిన స్కాలర్ పేరు Silvea Cernea Clark.ఆర్టికిల్ పబ్లిష్ అయినది - 2023 డిసెంబర్ 18న.
వేదాస్ వరల్డ్ సంస్థ వారి చర్చలో ఆ విషయం ప్రస్తావనకు వచ్చినది 2023 మే జూన్ల మధ్యన,అవునా!కేవలం వీడియోలు చేసి సరిపెట్టుకునే కల్లగురువు కాదు చాగంటి వెంకట్ గారు.ఈయన కూడా Vedic Medhodolgy That Highlights the Benefits of Sunlight Between Twilight and Sunrise/Sunset అన్న తలకట్టు పెట్టి University of Applied Vedic Sciences తరపున ఒక రీసెర్చి పేపర్ పబ్లిష్ చేశారు -{"rajournals.com/index.php/raj/article/view/402/140"} దగ్గిర పూర్తి పాఠం దొరుకుతుంది,చూడండి.ప్రయోగం చేసిన స్కాలర్ పేరు Murali Cheruvu.ఆర్టికిల్ పబ్లిష్ అయినది - 2023 ఆగస్టు 01న.
అవాక్కయ్యారా!
No comments:
Post a Comment
సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు