Saturday, 21 October 2023

నేనెవరిని?

 నేనెవరిని?

చాలా పుస్తకాలు చదివాను.చాలామంది జీవితాల్ని చూశాను.నాలోకి నేను చూసుకున్నాను.నాకూ వారికీ సామాన్యమైన అనుభవాల్ని శాస్త్రీయమైన తర్కాన్ని ఉపయోగించి విశ్లేషించుకుని చూశాక తెలిసింది - మనం నమ్మిన అబధ్ధాలే మన అపజయాలకీ దుఃఖాలకీ మూల కారణం,మనం తెలుసుకుని నమ్మిన సత్యాలే మన విజయాలకీ ఆనందానికీ ముఖ్య కారణం అని.
నలభయ్యేళ్ళ క్రితం కాంచనద్వీపం చదువుతున్నప్పుడు మొదటిసారి తెలుసుకున్న "మన చుట్టు పేరుకుపోయిన అబధ్ధాల చాటునుంచి నిజాన్ని బయటికి తియ్యడమే కష్టమైన ట్రెజర్ హంట్ - లాభమూ ఎక్కువే!" అన్న నిజం ఇప్పటికీ ప్రతి సన్నివేశంలోనూ మన లాభం కోసమే మనం నిజం చెప్పాలి నిజాన్ని నమ్మాలి అని రుజువు చేస్తూనే ఉంది.ఇది మనసుకి తట్టిన వెంటనే గొప్ప గర్వం అనిపించింది.ఎందుకంటే,అది నాకన్న వయస్సులో పెద్దవాళ్ళకి కూడా తెలియని నిజం.మరి నాకెలా తెలిసింది?నేను వాళ్ళకన్న తెలివైన వాణ్ణి గనక!
దాదాపు అదే సమయంలో వైదిక ఋషులకి సూక్తాలు గోచరించినట్టు మరొక అద్భుతమైన నిజం/సత్యం గోచరించింది.ఇప్పటికీ మహాజ్ఞానులం అనుకున్న వాళ్ళకి కూడా జవాబు సాధించడం కష్టం అవుతున్న "ఎలా బతకాలి?" అన్న ప్రశ్న వేసుకుని కొన్ని క్షణాల లోపున జవాబుని సాధించాను - "ఏడుస్తూ ఏదీ ఇవ్వకూడదు.ఏడుస్తూ ఇచ్చింది తీసుకోకూడదు" అని.నలభయ్యేళ్ళ తర్వాత ఇప్పుడు సింహావలోకనం చేసి చూస్తే రెండే రెండు సార్లు తప్ప ప్రతి సన్నివేశంలోనూ ప్రతి వ్యక్తితోనూ ఇచ్చేటప్పుడూ తీసుకునేటప్పుడూ నవ్వుతూనే బతికాను.ఇకముందు కూడా నవ్వుతూనే ఉంటాను.
ఇవన్నీ తెలుస్తున్నప్పుడు వేదం చదవలేదు నేను.ఇప్పుడు వేదం చదువుతున్నాను.కాంచనద్వీపం చదువుతున్నప్పుడు తెలిసిన నిజమూ నేను పెట్టుకున్న లక్ష్యమూ వేదం చెప్పిన ఆణిముత్యాలే.పూర్వకృతం సహజయోగిని చేసింది నన్ను.

జై శ్రీ రామ్!

No comments:

Post a Comment

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

"వేదాలు చదివిన వారు యజ్ఞయాగాదు లందు పశువులను వధిస్తారు" - ఇది నిజమా?

hari.S.babu: గురువు గారూ ! మహాభారతంలో ధర్మవ్యాధుని కధ వస్తుంది కదా . అక్కడ ధర్మవ్యాధుడు కౌశికుడికి ధర్మబోధ చేస్తూ ఒకచోట ," ...