1950ల మొదలు 1960ల వరకు రామారావు నటించిన పౌరాణిక చిత్రాలలో ప్రదర్శించిన నటన ప్రజలకు అతన్ని పౌరాణిక పాత్రలలో నటించిన ఇతర నటుల కన్న ఎక్కువ అభిమానించేలా చేసింది.అయితే, ఇతర దర్శకులు తనను ప్రజలకు ఆరాధ్యదైవం అయ్యేలా చేసిన పురాణ పురుషులను 1970ల మొదలు 1980ల వరకు రామారావు దర్శకత్వం వహించిన పౌరాణిక చిత్రాలలో ఆయా మూలకధలలోని సహజ స్వభావానికి విరుధ్ధమైన రీతిలో రూపకల్పన చేసి వాల్మీక్యాది ఋషిపరంపరను అవహేళన చేశాడు.
క్రమసంఖ్య | సంవత్సరం | చలనచిత్రం | పాత్ర | దర్శకుడు | రచయిత |
01 | 1950 | మాయారంభ | నలకూబరుడు | టి. పి. సుందరం | బలిజేపల్లి లక్ష్మీకాంతం |
02 | 1956 | సొంత వూరు | మాధవ్/కృష్ణుడు | ఇ. యస్. యన్. మూర్తి | రావూరు(story / dialogues) |
03 | 1956 | శ్రీ గౌరీ మహత్యం | బలవీరుడు | డి. యోగానంద్ | మల్లాది రామకృష్ణ శాస్త్రి |
04 | 1957 | మాయాబజార్ | శ్రీ కృష్ణుడు | కదిరి వెంకట రెడ్డి | పింగళి నాగేంద్ర రావు |
05 | 1957 | వినాయక చవితి | శ్రీ కృష్ణుడు | సముద్రాల వెంకట రాఘవాచార్యులు | సముద్రాల వెంకట రాఘవాచార్యులు (dialogues) |
06 | 1957 | సతీ అనసూయ | కౌశికుడు | కడారు నాగభూషణం | సముద్రాల వెంకట రామానుజాచార్యులు (dialogues) |
07 | 1957 | పాండురంగ మహత్యం | పుండరీకుడు | కమలాకర కామేశ్వర రావు | సముద్రాల వెంకట రామానుజాచార్యులు |
08 | 1958 | భూకైలాస్ | రావణుడు | కణ్ణన్ శంకర్ | సముద్రాల వెంకట రాఘవాచార్యులు (dialogues) |
09 | 1958 | కార్తవరాయని కథ | కార్తవరాయుడు | టి.ఆర్.రామన్న | మద్దిపట్ల సూరి |
10 | 1958 | సంపూర్ణ రామాయణం(tamil) | శ్రీ రాముడు | కె. సోము | ఎ.పి.నాగరాజన్ |
11 | 1959 | దైవబలం | చంద్రసేనుడు | పొన్నలూరు వసంతకుమార్ రెడ్డి | పరశురాం (dialogues) |
12 | 1960 | శ్రీ వెంకటేశ్వర మహత్యం | శ్రీమహావిష్ణువు,శ్రీనివాసుడు | పోలుదాసు పుల్లయ్య | కిళాంబి వెంకట నరసింహాచార్యులు |
13 | 1960 | దీపావళి | శ్రీ కృష్ణుడు | యస్.రజనీకాంత్ | సముద్రాల వెంకట రాఘవాచార్యులు (dialogues) |
14 | 1960 | భక్త రఘునాధ్ | శ్రీ కృష్ణుడు | సముద్రాల వెంకట రాఘవాచార్యులు | సముద్రాల వెంకట రాఘవాచార్యులు(story),సముద్రాల వెంకట రామానుజాచార్యులు (dialogues) |
15 | 1961 | సీతారామ కల్యాణం | రావణుడు | స్వీయ దర్శకత్వం | సముద్రాల వెంకట రాఘవాచార్యులు (dialogues) |
16 | 1961 | ఇంద్రజిత్(సతీ సులోచన) | ఇంద్రజిత్ | యస్.రజనీకాంత్ | సముద్రాల వెంకట రాఘవాచార్యులు (dialogues) |
17 | 1962 | భీష్మ | భీష్ముడు | బుగత వెంకట సుబ్బారావు | బుగత వెంకట సుబ్బారావు |
18 | 1962 | దక్షయజ్ఞం | పరమశివుడు | కడారు నాగభూషణం | భాగవతుల సదాశివశంకర శాస్త్రి (dialogues) |
19 | 1963 | శ్రీ కృష్ణార్జున యుధ్ధం | శ్రీ కృష్ణుడు | కదిరి వెంకట రెడ్డి | పింగళి నాగేంద్ర రావు (dialogues) |
20 | 1963 | వాల్మీకి | ఆదికవి వాల్మీకి | చిత్తజల్లు శ్రీనివాసరావు | సముద్రాల వెంకట రామానుజాచార్యులు(story),సముద్రాల వెంకట రాఘవాచార్యులు (dialogues) |
21 | 1963 | లవకుశ | శ్రీ రాముడు | చిత్తజల్లు పుల్లయ్య, చిత్తజల్లు శ్రీనివాసరావు | సదాశివబ్రహ్మం (dialogues) |
22 | 1963 | శ్రీ తిరుపతమ్మ కధ | గోపయ్య | బిజ్జా సత్యనారాయణ | బొల్లిముంత శివరామకృష్ణ |
23 | 1963 | నర్తనశాల | అర్జునుడు, బృహన్నల | కమలాకర కామేశ్వర రావు | సముద్రాల వెంకట రాఘవాచార్యులు |
24 | 1964 | శ్రీ సత్యనారాయణ మహత్యం | శ్రీ మహావిష్ణువు, సత్యదాసు | యస్.రజనీకాంత్ | సముద్రాల వెంకట రామానుజాచార్యులు(dialogues) |
25 | 1964 | బభ్రువాహన | అర్జునుడు | సముద్రాల వెంకట రాఘవాచార్యులు | సముద్రాల వెంకట రాఘవాచార్యులు |
26 | 1964 | రామదాసు | శ్రీ రాముడు | వుప్పలదడియం నాగయ్య శర్మ | యడవల్లి లక్ష్మీనారాయణ(story), మల్లాది సత్యనారాయణ(dialogues) |
27 | 1965 | పాండవ వనవాసం | భీమసేనుడు | కమలాకర కామేశ్వర రావు | సముద్రాల వెంకట రాఘవాచార్యులు |
28 | 1965 | ప్రమీలార్జునీయం | అర్జునుడు | ఎం.మల్లికార్జునరావు | పింగళి నాగేంద్ర రావు(story) |
29 | 1965 | వీరాభిమన్యు | శ్రీ కృష్ణుడు | వీరమాచనేని మధుసూధన రావు | సముద్రాల వెంకట రాఘవాచార్యులు (dialogues) |
30 | 1966 | శ్రీకృష్ణ పాండవీయం | దుర్యోధనుడు, శ్రీ కృష్ణుడు | స్వీయ దర్శకత్వం | సముద్రాల వెంకట రాఘవాచార్యులు (story and dialogue) |
31 | 1966 | శకుంతల | దుష్యంతుడు | కమలాకర కామేశ్వర రావు | సముద్రాల వెంకట రాఘవాచార్యులు (dialogues) |
32 | 1966 | శ్రీకృష్ణ తులాభారం | శ్రీ కృష్ణుడు | కమలాకర కామేశ్వర రావు | సముద్రాల వెంకట రాఘవాచార్యులు (dialogues) |
33 | 1967 | శ్రీ కృష్ణావతారం | శ్రీ మహావిష్ణువు, శ్రీ కృష్ణుడు | కమలాకర కామేశ్వర రావు | సముద్రాల వెంకట రాఘవాచార్యులు (dialogues) |
34 | 1968 | ఉమాచండీగౌరీశంకరుల కధ(ఉప్మాచట్నీగారీచక్కెర్ల కధ) | పరమశివుడు, శంకర్ | కదిరి వెంకట రెడ్డి | పింగళి నాగేంద్ర రావు(dialogues) |
35 | 1971 | శ్రీకృష్ణ విజయము | శ్రీ కృష్ణుడు | కమలాకర కామేశ్వర రావు | పింగళి నాగేంద్ర రావు (dialogues) |
36 | 1972 | శ్రీకృష్ణ సత్య | శ్రీ మహావిష్ణువు, శ్రీ రాముడు, శ్రీ కృష్ణుడు | కదిరి వెంకట రెడ్డి | పింగళి నాగేంద్ర రావు(story) |
37 | 1972 | శ్రీ కృష్ణాంజనేయ యుధ్ధం | శ్రీ కృష్ణుడు | చిత్తజల్లు శ్రీనివాసరావు | సముద్రాల వెంకట రామానుజాచార్యులు (dialogues) |
38 | 1975 | శ్రీ రామాంజనేయ యుధ్ధం | శ్రీ రాముడు | సత్తిరాజు లక్ష్మీనారాయణ | గబ్బిట వెంకట రావు(story / dialogues) |
39 | 1975 | మాయా మశ్చీంద్ర | శ్రీమహావిష్ణువు, మశ్చీంద్రనాధుడు | బాబూ భాయ్ మిస్త్రీ | గబ్బిట వెంకట రావు(story / dialogues) |
40 | 1977 | దాన వీర శూర కర్ణ | శ్రీకృష్ణుడు, కర్ణుడు, దుర్యోధనుడు | స్వీయ దర్శకత్వం | స్వీయరచన(story), కొండవీటి వెంకటకవి (dialogues) |
41 | 1978 | సతీ సావిత్రి | యమధర్మరాజు | బుగత వెంకట సుబ్బారావు | కిళాంబి వెంకట నరసింహాచార్యులు |
42 | 1978 | శ్రీరామ పట్టాభిషేకం | శ్రీరాముడు, రావణుడు | స్వీయ దర్శకత్వం | సముద్రాల వెంకట రామానుజాచార్యులు |
43 | 1979 | శ్రీమద్విరాట పర్వం | శ్రీకృష్ణుడు, అర్జునుడు, బృహన్నల, కీచకుడు, దుర్యోధనుడు | స్వీయ దర్శకత్వం | కొండవీటి వెంకటకవి (dialogues) |
44 | 1979 | శ్రీ తిరుపతి వేంకటేశ్వర కల్యాణం | శ్రీమహావిష్ణువు, శ్రీనివాసుడు, శ్రీ వేంకటేశ్వర స్వామి | స్వీయ దర్శకత్వం | దాట్ల వెంకట నరసరాజు (dialogues) |
45 | 1991 | బ్రహ్మర్షి విశ్వామిత్ర | విశ్వామిత్రుడు, రావణుడు | స్వీయ దర్శకత్వం | నాగభైరవ కోటేశ్వర రావు(dialogues) |
ప్రతి సినిమానీ ప్రస్తావించడం అనవసరం కాబట్టి ఇక్కడ నేను మాయారంభ(1950), సొంత వూరు(1956), మాయాబజార్(1957), భూకైలాస్(1958), సీతారామ కల్యాణం(1961), ఇంద్రజిత్(1961), దక్షయజ్ఞం(1962), వాల్మీకి(1963), లవకుశ(1963), నర్తనశాల(1963), పాండవ వనవాసం(1965), శ్రీకృష్ణ పాండవీయం(1966), దాన వీర శూర కర్ణ(1977), శ్రీరామ పట్టాభిషేకం(1978), శ్రీమద్విరాట పర్వం(1979) అనే వాటిని మాత్రమే ప్రస్తావిస్తున్నాను.
సొంత వూరు అనే సాంఘిక చిత్రంలో అతను కృష్ణుడిగా కనిపించినప్పుడు విమర్శలే ఎక్కువ వచ్చిన పేలవమైన నటన ప్రదర్శించినప్పటికీ కేవీ రెడ్డి గారి దర్శకత్వంలో నిర్మితమై ఆ మరుసటి సంవత్సరమే విడుదలైన మాయాబజార్ ఆ తర్వాత ఎవరు కృష్ణుడి వేషం వేసినా అదే వేషధారణని కొనసాగించక తప్పనిసరి పరిస్థితిని కల్పించింది అతనికీ సాంకేతిక నిపుణులకీ ప్రేక్షకులకీ.మాయాబజార్ తర్వాత రామారావు కృష్ణుడిగా నటించిన పదహారు సినిమాలలోనూ అదే రూపాన్ని,అదే ఆహార్యాన్ని,అదే వాచికాన్ని,అదే ఆంగికాన్ని కొనసాగించి ప్రేక్షకులు కృష్ణుడు ఇలానే ఉంటాడు అని నమ్మేలా భ్రమింపజేశాడు.
01.మాయాబజార్(1957) - కదిరి వెంకట రెడ్డి
ప్రేక్షకులకి మాయాబజార్ అంత ప్రత్యేకమైన అనుభూతిని ఇవ్వడానికి పింగళి నాగేందర్రావు గారు ఆయా పాత్రల్తో మాట్లాడించిన భాష ఒక కారణం.అంతకు ముందూ ఆ తర్వాత అవి పౌరాణిక పాత్రలు కాబట్టి దాదాపు ఆయా సినిమాలకు సంభాసహణలు వ్రాసిన రచయితలు అందరూ ఎక్కడో అక్కడ గ్రాంధికం వాడి కృతకత్వానికి పెద్ద పీట వేశారు.కానీ, మాయాబజార్ సినిమా మొత్తంలో ఒక్క చోట కూడా గ్రాంధికపు వాసన కూడా లేదు.అయినా ఆయా పాత్రల స్వభావాలు గానీ ప్రవృత్తులు గానీ సన్నివేశాల యొక్క నాటకీయత గానీ అద్భుతమైన స్థాయిలో ఉంటాయి.
రామారావు సొంతవూరులో కృష్ణుడి వేషం వెయ్యకముందే 1950లో కళాపూర్ణోదయం నుంచి బయటికి లాగిన "మాయారంభ" సినిమాలో నలకూబరుడి వేషం వేశాడు. "మాయారంభ" సినిమాలో గంధర్వ జాతికి సంబంధించిన దైవత్వాన్ని ఇముడ్చుకున్న నలకూబరుడి పాత్రకి ప్రశంసలు అందుకున్న రామారావు సొంతవూరులోని కృష్ణుడి వేషంలో ఎందుకు విమర్శల పాలయ్యాడో మరి.
* మాయాబజార్ completed
02.భూకైలాస్(1958) - కణ్ణన్ శంకర్
నటన పట్ల అతనికి ఉన్న అంకిత భావంతో మాయాబజారులో కృష్ణుడి వేషం వేసి దైవసముడైన అదే 1958ల నాడు భూకైలాస్ సినిమాలో రాక్షస రాజు రావణాసురుడి పాత్రని ధరించి ప్రేక్షకులు రావణుడు ఇలానే ఉంటాడు అని నమ్మేలా భ్రమింపజేశాడు.భూకైలాస్ కధ కర్నాటక లోని గోకర్ణ క్షేత్రం యొక్క స్థలపురాణం కావదంతో దక్షిణాది భాషలు అన్నింటిలో ఈ కధతో నాలుగు సినిమాలు వచ్చాయి.మొదటిసారి 1938లో భక్త రావణ పేరుతో తమిళంలో తీశారు.ఇదే కధని 1940లో సుబ్బయ్య నాయుడు రావణుడి గానూ ఆర్ నాగేందర్ రావు నారదుడిగానూ లక్ష్మీబాయి మండోదరిగానూ భూకైలాస్ పేరుతో తెలుగులో తీశారు.రామారావు రావణుడిగా అక్కినేని నాగేశ్వర రావు నారదుడిగా జమున మండోదరిగా మనల్ని అలరించిన భూకైలాస్ 1958లో విడుదల అయ్యింది.దాదాపు అన్ని దక్షిణాది భాషలలోనూ కలిపి 80 పై చిలుకు సినిమాలని డైరెక్ట్ చేసిన K.Shankar గారు డైరెక్ట్ చేశారు.మెయ్యప్పన్ గారు ఒకేసారి మూడు భాషల్లో తీశారు - కన్నడ వెర్షన్లో రాజ్ కుమార్ గారు రావణ పాత్ర ధరించారు.మండోదరిగా జమున గారే నటించారు.నారదుడిగా నటించిన కల్యాణ్ కుమార్ గురించి ఎక్కువ తెలియదు - నటనలో అక్కినేనిని ఇమిటేట్ చేసినట్టు అనిపించింది నాకు.అయితే, రావణ పాత్రలో నటించిన విశ్వవిఖ్యాత నట సార్వభౌముణ్ణీ కన్నడ కంఠీరవాన్నీ పోల్చి చూసిన తర్వాత మార్కెట్ అవసరాల కోసం రామారావుని తెలుగువాళ్ళు మరీ ఎక్కువ మోసేశారు అనిపిస్తుంది నాకు.
ఈ కధలోకి అక్కినేని నాగేశ్వర రావు నారదుడిగా రావటానికి ముందు ఏవీయం వారి సినిమాకి అడ్వాన్స్ తీసుకుని షూటింగ్ మొదలయ్యాక తన పాత్ర తనకి సరిపడనిదని తెలిసి అడ్వాన్స్ తిరిగి ఇవ్వటానికి వెళ్ళాడు.అయితే దర్శక నిర్మాతలు ఆ నిజాయితీకి ముచ్చటపడి తిరిగివ్వటం దేనికి లెండి మరో సినిమా చేద్దాం అని సర్ది చెప్పారు.ఆ అడ్వాన్సుకి ఒప్పుకున్నది ఈ సినిమా.ఇందులో ANR, NTR ఒకరి నొకరు "తాతా!","మనవడా!" అని తెర మీద పిలుచుకుంటుంటే చూస్తున్న మనకి చక్కిలిగింతలు పుడతాయి.అందులోనూ మండోదరికి ఎలా లైనెయ్యాలో ఆజన్మ బ్రహ్మచారి అయిన నారదమహర్షి నవయవ్వనుడైన రావణుడికి ప్రేమపాఠాలు చెప్తున్న సన్నివేశాలు ఇంకే సినిమాలోనూ ఇంకే నటద్వయంతోనూ రిపీట్ చెయ్యడానికి కూడా భయపడేటంత వెరైటీ.
భూకైలాస్ సంభాషణలు అన్నీ రచయిత యొక్క పౌరాణిక పరిజ్ఞనాన్ని చూపిస్తూనే ఆయా పాత్రల వ్యక్తిత్వాల యొక్క సహజతత్వం చెడనివ్వని రీతిలో హాస్యానికి పెద్ద పీట వేస్తాయి.మండోదరిని పార్వతి అని భ్రమించిన రావణుడు తల్లికి పార్వతిని నీ కోడలిని చేశాను అన్న తర్వాత అత్తా కోడళ్ళ పాత్రలలో ఉన్న ఋశ్యేంద్రమణి గారూ జమున గారూ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ ఒకరి పాదాలకి ఒకరు మోకరిల్లడం పక్కనుంచి చూస్తున్న రావణుడి పాత్రలోని అయోమయాన్నీ గందరగోళాన్నీ చిరాకునీ చూపిస్తున్న రామారావు అభినయం అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ నవ్వు తెప్పిస్తూనే ఉంటుంది.
* భూకైలాస్ completed
03.సీతారామ కల్యాణం(1961) - స్వీయ దర్శకత్వం
అప్పటి వరకు ఇతరుల దర్శకత్వంలో నటించిన రామారావు 1961ల నాడు తన స్వీయ దర్శకత్వంలో మరోసారి రావణ పాత్రను ధరించాడు.దీనికి నిర్మాత National Art Theatres పేరున ఒక నిర్మాణ సంస్థను స్థాపించిన అతని తమ్ముడు నందమూరి త్రివిక్రమ రావు.సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది.రావణుడు సీతా స్వయంవరానికి రావటం లాంటి మూలకధలో లేని విషయాల్ని దూర్చే అలవాటు మొదలయ్యింది ఇక్కడి నుంచే!
భూకైలాస్ సినిమాలో రావణుడు కేవలం శివభక్తి తత్పరుడు.అసలు కధలో రావణుడు చేసిన దుర్మార్గాలు అదే సమయంలో జరిగినప్పటికీ సినిమా కధని రావణుడి లోని శివభక్తిని మాత్రమే చూపించడం వల్ల వాల్మీకి సృజన అయిన రావణ పాత్ర యొక్క ఔచిత్యం దెబ్బతినలేదు గానీ ఇక్కడ రావణుడు చేసిన అకృత్యాలను చూపించిన తర్వాత సైతం దృక్కోణం అనే పేరున రావణుడికి ప్రతినాయకుడు అనే పేరును వాడి వాల్మీకి సృజన అయిన రావణుడికి విరుధ్ధమైన రావణ పాత్రని మొదటి సారి ప్రేక్షకులకి పరిచయం చేశాడు.
మనం ఇప్పటి సినిమాల్లో చూసే మెలోడ్రామాని ప్రాచీన నాటక లక్షణాల ప్రకారం సంవిధానం అంటారు.ఎటూ ఇది నాటకాలలో ఎక్కువ కనపడుతుంది కాబట్టి నాటకీయత అని కూడా అంటారు.అలాంటి నాటకీయతని ప్రదర్శించే అద్భుతమైన సన్నివేశాలు రెండు ఉన్నాయి.అసలు వాల్మీకి చెప్పిన మూలకధలో రెండే రెండు సన్నివేశాలతో కధని మలుపు తిప్పి ఆ తర్వాత ఏమైందో తెలియని శూర్పణఖ ఇక్కడ చాలా సన్నివేశాలలో కనిపించే ప్రధాన పాత్ర అయ్యింది.ఒకసారి నారదుడు రావణుడితో ఏదో మాట్లాడుకుంటూంటే చెవులు గోడకి ఆనించి వింటున్న శూర్పణఖని నారదుడు "చాటు వినికిళ్ళు చెవులకి ప్రమాదం" అని హెచ్చరిస్తాడు - మీకు లక్షణుడు ముక్కూ చెవులూ కొయ్యటం గుర్తు కొచ్చింది కదూ!
కేవలం హాస్యానికి వాడుకోవటానికి కాదు శూర్పణఖని ప్రధాన పాత్రని చేసింది.అప్పుడు నారదుడు వర్ణిస్తున్నది అప్పటికి లేత యవ్వన దశలో ఉన్న శ్రీరాముడి సౌందర్యాన్ని.అంటే, దండకారణ్యంలో చూడక మునుపే శూర్పణఖ శ్రీరాముడి సౌందర్యానికి పిచ్చెక్కి పోయింది అనే కల్పన కూడా క్యామిడీ కోసం చేసింది కాదు, ఈ సినిమాలో ఒక ప్రయోజనం ఉంది.
శివ ధనుర్భంగం అయ్యాక పెళ్ళికి ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో రావణుడికి ఒక దుర్బుధ్ధి పుట్టింది - రాముడి వేషంలో వెళ్ళి సీతతో శృంగారం చెయ్యాలని.వెళ్తాడు.ఒక డ్యూయెట్టు కూడా పూర్తవుతుంది,తన కౌగిట్లో ఇమిడిపోయిన సీత ముఖాన్ని చూసి ఒక్కసారి ఉలిక్కి పడతాడు,ఛీకొట్టి వెళ్ళిపోతాడు.రావణుడి కౌగిలిలోకి వచ్చింది శూర్పణఖ.ఇటువైపున అన్నకి పుట్టిన దుర్బుధ్ధే చెల్లికి పుట్టింది - సీత రూపంలో వెళ్ళి రాముడితో శృంగారం చెయ్యాలని.
రామారావుకీ రచయితలకీ లైటు వెలిగిందో లేదో గానీ 1950ల నాటి మాయారంభ లోని రామారావు ధరించిన నలకూబరుడు, జీ వరలక్ష్మి నటించిన రంభ,కే రఘురామయ్య నటించిన విద్యాధరుడు,అంజలీ దేవి నటించిన కళావతి అనే రెండు జంటలకీ మధ్యన నడిచిన సంవిధానమే ఇక్కడ హరనాధ్ నటించిన రాముడు,గీతాంజలి నటించిన సీత,రామారావు నటించిన రావణుడు,స్వర్ణ నటించిన శూర్పణఖ అనే రెండు జంటల మధ్యన నడిచింది!
ఇంత కధ గడిచాక రావణుడికి పరశురాముణ్ణి వినియోగించి కల్యాణ భంగం చేయించమని సలహా ఇస్తూ నారదుడు "ఆ పైన సీతంటావా, ఎక్కడికి పోతుంది?వస్తుంది!" అనటం మరో అద్భుతమైన సంవిధానం.సీనియర్ సముద్రాల రచనలో సహకారం అందించినప్పటికీ సీతారామకల్యాణం లోని రావణ పాత్రని అలా తీర్చి దిద్దడం రామారావు యొక్క పట్టుదల మేరకే జరిగింది.ఎంతవరకు నిజమో తెలియదు గానీ,కొందరు విమర్శకులు భూకైలాస్ సినిమాలోని రావణుడి పాత్రపోషణకి సంబంధించి ఆంధ్రుల ఆరాధ్యదైవం రామారావు కన్నడిగుల కంఠీరవం రాజ్ కుమార్ అనే ఇద్దరు నటుల మధ్యన పోలికలు వచ్చినప్పుడు త్రాసు రాజ్ కుమార్ వైపుకి తూగిందనీ దాన్ని పట్టించుకున్న రామారావు మరోసారి రావణ పాత్రని తను స్వయాన రూపకల్పన చేసి త్రాసుని తన వైపుకి లాక్కోవాలన్న కసితో సీతారామకల్యాణం తీశాడని అంటున్నారు.
నటన అనేది దర్శకుడు చెప్పినది అర్ధం చేసుకుని తన వైపు నుంచి కొంత కలిపి చేస్తే సరిపోతుంది.కానీ,దర్శకత్వం అలా కాదు.అన్ని పాత్రలనీ అర్ధం చేసుకోవాలి.కధలో ఏ పాత్ర ఎలా ప్రవర్తిస్తే నాతకీయత పండుతుందో అంత మేర మాత్రమే ఉండాలి తప్ప తనో తనకి ఇష్టమైన వాళ్ళో నటించే పాత్రల్ని పరిధికి మించి పెంచకూడదు.కొన్ని చోట్ల తను తప్ప ఇంక్రెవరు దర్శకత్వం వహించినా ఆ అసన్నివేశాన్ని అంత గొప్పగా తియ్యలేరు అనే మెరుపులు మెరిపించాలి.ఇన్నింటి కన్న పైన తను చెప్పాలనుకున్న విషయాన్ని ప్రేక్షకులకి విసుగు తెప్పించని కధనశైలి ఉండాలి.ఆశ్చర్యం ఏమిటంటే,అనుభవజ్ఞులైన కమలాకర కామేశ్వర రావు,పింగళి నాగేంద్ర రావు వంటి ఉద్దండుల్ని మించిపోయి ఇవన్నీ సాధించాడు రామారావు సీతారామకల్యాణం అనే దృశ్యకావ్యంలో.
నిజానికి క్లైమాక్సుకు ముందర వచ్చే సీతా రాముల రూపధారణ చేసి సాగించిన రావణ శూర్పణఖల శృంగార గీతం చుట్టూ పెనవేసుకున్న విశేషాలు చాలా ఉన్నాయి. సీతా రాములు భార్యాభర్తలే గానీ హిందువులకి, మరీ ముఖ్యం తెలుగువాళ్ళకి వాళ్ళతో రామయ్య తండ్రి,సీతమ్మ తల్లి అని పిల్చుకునే ఆత్మీయత ఉండటం వల్ల ఈ సినిమాకి ముందు గానీ ఈ సినిమాకి తర్వాత గానీ ఏ డైరెక్టరూ ఇలా వాళ్ళతో డ్యాన్సులు చేయించలేదు - పిల్లలకి తలిదండ్రుల శృంగారాన్ని చూపించటం సభ్యత కాదు,కదా!
ఇక్కడ దర్శకుడు చూపించాడు,కానీ ప్రేక్షకులు అసభ్యం అనుకోలేదు.ఎందుకంటే, వాళ్ళు సీతా రాముల రూపధారణ చేసిన రావణ శూర్పణఖలనే విషయాన్ని ముందే మనకి హింట్ ఇచ్చాడు డైరెక్టర్.ఆంతే కాదు చారిత్రక పరిజ్ఞానం ఏ కొంచెం ఉన్నప్పటికీ మధయ్యుగాల యూరోపియన్ రాజవంశాల incest(సోదర సోదరీ అనియత శ్రంగారం) పోకడలు పరస్త్రీ వ్యామోహం ఉన్న అన్న రావణుడికీ పరపురుష వ్యామోహం ఉన్న చెల్లి శూర్పణఖకీ మధ్యన నడిచినట్టు చూపించటం వాళ్ళిద్దరూ భావి రామ కధలో చూపించే కామాతుర సహజమైన నలజ్జా నభయ చేష్టల్ని సూచిస్తున్నది, కదా!
శూర్పణఖా రావణుల మాయాజాలం వాళ్ళిద్దరూ ఒకరి కౌగిలిలోకి ఒకరు వచ్చిన మరుక్షణమే విడిపోయినట్టు ఎందుకు చూపించారు?కధ ముగింపుకి రావాల్సిన అవసరం ఉండటం వల్ల ఎవరికీ అనుమానం రాలేదు గానీ వైదిక శాస్త్ర పరిచయం ఉండటం వల్ల కొంత ఎక్కువ చెప్పగలను నేను.వాళ్ళిద్దరూ తమ భౌతిక శరీరాలను మార్చుకోలేదు.ఎదటివాళ్ళకి తాము ఎలా కనిపించాలని అనుకున్నారో అలా ఎదటివాళ్ళకి కనిపించేలా వశీకరణ విద్యని ఉపయోగించుకున్నారు.తాంత్రిక ఉపాసన అనేది మనస్సు మీద ఆధారపడి నడుస్తుంది.సాధకుడు తన మనస్సుతో ఇతరుల మనస్సుని శాసిస్తాడు.అన్ని రకాల తాంత్రిక ఉపాసనలకూ "శాంతి, వశీకరణ, స్తంభన, విద్వేష, ఉఛ్చాటన, మారణ" అనే ఆరు లక్ష్యాలు ఉంటాయి.వీటిలో వశీకరణని ఉపయోగించారు.దీని ప్రభావం చాలా తక్కువ సేపు ఉంటుంది.అంటే, ఎదటి మనిషి మీద ఒకసారి వశీకరణని ప్రయోగిస్తే ఇక ఆజీవపర్యంతం అతను వశంవర్తి అయిపోడు.
ఇప్పుడు,సన్నివేశాన్ని గుర్తుకు తెచ్చుకోండి - వాళ్ళిద్దరూ ఒకరి కౌగిలిలోకి ఒకరు వచ్చిన మరుక్షణం రావణుడి వశీకరణ సమయావధి ముగిసిపోయింది.రావణుడి చీత్కారంతో శూర్పణఖ తృళ్ళిపడటంతో తన వశీకరణ సమయావధి కూడా ముగిసిపోయింది.తన కౌగిలులో సీతకి బదులు శూర్పణఖని చూసి ఛీకొట్టిన తర్వాత రావణుడి కళ్ళలో నిరాశ కనిపిస్తుంది,గమనించారా!వశీకరణని ప్రయోగించటం చాలా కష్టం కాబట్టి ఉసూరుమంటూ లంకకి పోయాడు గానీ లేకుంటే రావణుడి కున్న పట్టుదలకి అక్కడే ఉండి మళ్ళీ మళ్ళీ ప్రయత్నించేవాడు,కదూ!
* సీతారామకల్యాణం completed
04.ఇంద్రజిత్(1961) - యస్.రజనీకాంత్
సీతారామ కల్యాణం కొన్ని అవాల్మీకాల్ని చూపించినప్పటికీ ఔచిత్యం హద్దులు దాటలేదు.కానీ సతీ సులోచన అనే పేరు కూడా ఉన్న ఇంద్రజిత్ సినిమాలో వక్రీకరణలు మోతాదును మించిపోయాయి.రావణుడు,ఇంద్రజిత్తు అనే తండ్రీ కొడుకులు ఇద్దరూ తమ రాజ్యాన్ని సుభిక్షం చేసుకుని పరిపాలిస్తున్న మంచివాళ్ళు గానూ దేవేంద్రుడూ ఇతర దిక్పాలకులూ పిల్లల్ని ఎత్తుకెళ్ళే దొంగలు గానూ లంకారాజ్యాన్ని నాశనం చెయ్యడానికి ఎంతటి నీచానికైనా పాల్పడే కుట్రదారులుగానూ కనిపిస్తారు.ఇంద్రజిత్తుకు భయపడి పారిపోయే పిరికివాడు ఇంద్రుడు.కనీసపు ఆలోచన కూడా లేక నారదుణ్ణి అపాయం తప్పే ఉపాయం చెప్పమని అడిగే తెలివి తక్కువ వాడు ఇంద్రుడు.సులోచనని చూడగానే అతిధి మర్యాదల్ని కూడా అతిక్రమించి బలాత్కరించాలని ప్రయత్నించిన కాముకుడు ఇంద్రుడైతే సులోచన మర్యాదని కాపాడిన సంస్కారవంతుడు ఇంద్రజిత్తు.
* ఇంద్రజిత్ completed
05.దక్షయజ్ఞం(1962) - కడారు నాగభూషణం
ఇక రామారావు కనిపించిన అన్ని విష్ణు రూపాల మధ్యన చేసిన ఒకే ఒక పరమ శివుడి పాత్ర దక్షయజ్ఞంలో కనిపిస్తుంది.ఇతర సినిమాల్లో ఎప్పుడూ పార్వతితో కలిసి డ్యాన్సులు చెయ్యటం,రాక్షసులకి పిచ్చి వరాలిచ్చే భోళాతనం,మూడో కన్ను తెరిచి అందర్నీ కాల్చి బూడిద చేసే కోపం లాంటివి చూపిస్తే ఈ ఒక్క సినిమాలోనే రామారావు పాత్ర పోషణ నిజమైన శివతత్వాన్ని చూపిస్తుంది.
నిజానికి పోతనామాత్యుల వారు భాగవతం ఒకటే కాదు - శ్రీ వీరభద్ర విజయము,నారాయణ శతకము, భోగినీ దండకము కూడా వ్రాశారు.నాలుగు ఆశ్వాసాల వీరభద్ర విజయం కావ్యం ప్రకారం సతీ దేవి దక్షయజ్ఞం దగ్గర సినిమాలో చూపించినట్టు యోగాగ్నిలో కాలిపోయి తన శరీరాన్ని మాత్రం మాడ్చివేసుకుని సూక్ష్మదేహంతో హిమవంతుడికి పార్వతి పేరున కూతురవుతుంది.బ్రహ్మాదులు అప్పటికి భయపడి మంత్రపఠనం మధ్యలో ఆపేసి వెళ్ళిపోయారు.అప్పటికి యాగం ఆగిపోయింది.
శివుడు కూడా “భూమిపై రాజ్యాన్ని కోల్పోయి దుఃఖాన్ని పొంది ఏడుస్తావు. మూఢుడైన నీవు మందబుద్ధులైన రాజులను అంతంచేసేవాడైన ఇంద్రునికి భూమిపై జన్మించి కోపిష్టివై వైవస్వతమన్వంతరములో సంతోషంగా రాజ్యమును పాలించునపుడు నేను నిన్ను చంపుతాను.” అని దక్షుడికి శాపం మాత్రం ఇచ్చి వూరుకుంటాడు.తారకాసురుడు చెలరేగిపోవటం,మన్మధుడు శివుడి మీద బాణాలు వేసి తపస్సు చెడగొట్టటం,పార్వతీ కల్యాణం,క్షీరసాగరం నాడు నీలకంఠుడు కావటం వంటి కధలన్నీ జరిగాక దక్షుడి శివద్వేషాన్ని సహించలేక అక్కడినుంచి వెళ్ళిపోయిన దధీచి మహర్షి గుర్తు చేసినప్పుడు దక్షాధ్వర ధ్వంసం జరుగుతుంది.
బహుశ, సినిమా ఒక పాయింటు మీద నడిస్తే ప్రేక్షకుల ధ్యాస ఇక్కడే ఉంటుందనే సూత్రాన్ని బట్టి మధ్యలో కధల్ని దాటించేసి ఉంటారు దర్శకనిర్మాతలు.కధా కధనమూ పాత్రలూ సన్నివేశాలూ ఉప కధలూ అన్నీ పురాణోక్తమైన వర్ణనలకు అనుగుణంగానే ఉన్నాయి.సతీ దేవి దగ్ధం అయిన వెంటనే శివుడు చేసిన వీరభద్రుని పుట్టుకకు కారణమైన శివతాండవం నభూతోనభవిష్యతి!
* దక్షయజ్ఞం completed
06.వాల్మీకి(1963) - చిత్తజల్లు శ్రీనివాసరావు
వాల్మీకి కధ అలా ఎలా ప్రచారంలోకి వచ్చిందో తెలియదు గానీ ఒక దొంగ కానీ హంతకుడు గానీ మారుమనస్సు పొంది మహనీయుడు కావటం బైబ్లికల్ కాపీ పేష్టు లిటరేచరులో సాధ్యం అవుతుంది తప్ప వైదిక ధర్మానుయాయులైన మహర్షులకు ఇటువంటి చెత్తను జీవిత చరిత్ర పేరున చేర్చకూడదు.విశ్వామిత్రుడనే బ్రహ్మర్షి జీవిత చరిత్ర అంటూ ఇలాంటి చెత్తనే చెప్పారు.
వాల్మీకి జీవిత చరిత్ర పేరున చెప్తున్న తర్కానికి లొంగని కధల్ని నిజం అని మనం నమ్మకూడదు.అజరామరమైన కవిత్వం చెప్పాలంటే ఛందస్సు మీద మంచి పట్టు ఉండాలి.వ్రాస్తున్నది వైదిక ధర్మానుయాయుడైన నాయకుడి గురించి అయినప్పుడు అతను పాటించినది ధర్మం ఎలా అయ్యిందో నిరూపించే పాండిత్యం రచయితకి ఉండాలి.అందులోనూ వాల్మీకి కధాకధనశైలి చిన్నప్పుడు మనం రేడియోలో విన్న క్రికెట్ కామెంటరీని పోలినట్టు ఉంటుంది - కధ కళ్ళముందు జరుగుతుంటే చూసి చెప్తున్నట్టు ఉంటుంది.ముఖ్యమైన ప్రతి సన్నివేశంలోనూ అప్పటి గ్రస్థితులను ఖగోళ గణితం ప్రకారం వర్ణిస్తాడు.ఇంత శాస్త్ర పరిచయం ఉన్న మహాకవి గురించి కవి కాకముందు అతను హత్యలూ దోపిడీలూ చేసినట్టు చెప్పడం అతనికి "రామ" అని పలకడం చేత కానట్టూ ఋషులు అతని ఇబ్బందిని చూసి "మరా" అనమని చెప్పినట్టు మరమరాల కపిత్వం చూపించడం అలాంటిలాంటి తప్పు కాదు, తప్పున్నరతప్పు.
పాఠకుడు ఒక కధలో లీనం కావడానికి రచయిత గురించి తెలియనక్కర లేదు గాబట్టి రామకధని వ్రాసిన వాల్మీకి పూర్వాశ్రమంలో ఒక దొంగ అని తెలిసినప్పటికీ ప్రమాదం జరగలేదు.అలాగే గాయత్రీ మంత్రం యొక్క శక్తిని తెలుసుకోవడానికి అనుష్ఠించడం ఒకటే మార్గం కాబట్టి ఆ మత్రద్రష్ట పూర్వాశ్రమంలో ఒక అసూయాపరుడూ పశ్చాత్తాపం లేని శిశుహంతా అని తెలిసినప్పటికీ ఆ మంత్రం మీద గౌరవం తగ్గలేదు.కానీ, మనకు అంత గొప్ప సాహిత్యాన్ని అందించిన మహర్షుల గురించి అలాంటి ప్రామాణికత లేని నిరాధారమైన చెత్తకధల్ని ప్రచారం చెయ్యడం తప్పు కదా!
ఇక నటన విషయంలో చూస్తే అప్పటికే స్థూలకాయం పెరిగిపోయి కన్నడ కంఠీరవం ముందు తేలిపోయాడు రామారావు.రాజ్ కుమార్ మొత్తం క్యారెక్టరుని ఒకే రకమైన రీతిలో నటించి దొంగగా కనిపించే సన్నివేశాల్లో కూడా కొంత సాత్వికతని చూపించి చెడు నడత నుంచి మంచి నడతకు మారడాన్ని జస్టిఫై చేశాడు.అవే సన్నివేశాల్లో రామారావు ఔధ్ధత్యం చూపించడం వల్ల పాత్రలోని క్రమానుగతమైన మార్పుకు సంబంధించిఅక్కడ వచ్చిన ఎఫెక్టు ఇక్కడ రాలేదు.
* వాల్మీకి completed
07.లవకుశ(1963) - చిత్తజల్లు పుల్లయ్య
లవకుశ విషయంలోనూ వాల్మీకి వంటి పొరపాటు జరిగింది.తెర మీద రామారావూ అంజలీదేవి ఏడిచినట్టు మూడు మహాయుగాల వెనకటి త్రేతాయుగపు రాముడూ సీతా ఏడవ లేదు.అసలు ధర్మం అనే పదానికి అర్ధం తెలిసి అనుష్ఠించేవాడు ఎవడూ ధర్మరక్షణ కోసం నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఏడవడు. ఏడుస్తూ చేసేది ధర్మపాలన కాదు.వాల్మీకి ఉత్తరకాండలో చూపించిన రాముడూ సీతా చాలా హుందాగా జరుగుతున్న కధలో తామెలా ప్రవర్తిస్తే ధర్మం నిలబడుతుందో తెలుసుకుని ప్రవర్తించారు.
వాళ్ళలోని ఔన్నత్యాన్ని చూపించి ప్రేక్షకుల్ని ధర్మపాలన వైపుకు నడిపించటానికి బదులు మనకున్నఆస్తుల పట్లా వైభవాల పట్లా మనకున్న వ్యామోహాల్ని బట్టి మానవజాతికి ఆదర్శప్రాయమైన ఆదిదంపతుల మీద ప్రేక్షకులు "అయ్యో పాపం!ఎన్ని కష్టాలు పడ్డారో - మనమైతే తట్టుకోగలమా?" అని జాలిపడేలా చేస్తూ చాకలి కులస్థుల్ని అవమానించేలా చాకలి తిప్పడి పాత్ర చేత రామనింద చేయించడం అనేవి క్షమించకూడని నేరాలు.రామారావూ వెండితెర ఆరాధ్యదైవమూ కరుణరస ప్రభావమూ ప్రేక్షకుల్లో ఉన్న పండితుల్ని కూడా పిచ్చోళ్ళని చేశాయి.
* లవకుశ completed
08.నర్తనశాల(1963) - కమలాకర కామేశ్వర రావు
మాయా బజార్ తర్వాత రామారావు నటించిన వాటిలోనే గాక తెలుగులో తీసిన పౌరాణికాలు అన్నింటిలోనూ అగ్రస్థాయిలో నిలబెట్టదగిన సినిమా నర్తనశాల.మాయాబజార్ గురించి అందరూ గుర్తుపట్టి నవ్వుకున్న విశేషం పాండవుల్లో ఏ ఒక్కరూ తెరమీద కనపడకపోవటం అయితే నర్తనశాలకి సంబంధించి నేను కనుక్కున ఒక విశేషం ఉంది.బృహన్నల వేషం వల్ల ఫోకస్ రామారావు మీద పడుతుంది గానీ కధకి అసలు హీరో ధర్మరాజు వేషం వేసిన మిక్కిలినేని.
ఎందుకంటే,నర్తనశాల అని పేరు పెట్టిన పాండవుల కధలోని విరాటపర్వానికి రాముడి కధలోని సుందరకాండకు ఉన్న అతి ముఖ్యమైన పోలిక కధానాయకుల గుణగణాల్ని మైక్రోస్కోపులో పెట్టి చూపించినట్టు నిరూపించి చెప్పటం.పుంసాం మోహన రూపుడైన రాముడికీ జగత్సుందరియైన సీతకీ ఆనందాన్ని కలిగించిన కపిసుందరుడు హనుమ ఆ ఒక్క కాండలో తన విశ్వరూపం చూపించి ఆ ఒక్క కాండకీ నాయక స్థానంలో నిలబడ్డాడు.విరాటపర్వం చదివితే వర్షాలు పడతాయని చెప్పటం మూఢనమ్మకం కాదు,అర్ధ తాత్పర్యాలతో చదివితే యుధిష్ఠిరుడు అని పెద్దలు పెట్టిన పేరుని అందరూ మర్చిపోయి ధర్మరాజు అన్న పేరు పాండవాగ్రజుడికి ఎలా సార్ధకం అయ్యిందో తెలుస్తుంది.కమలాకర కామేశ్వర రావు గారు మూలకధని చెడగొట్టని చిన్న చిన్న మార్పులతో విరాటపర్వం యొక్క స్పూర్తిని యధాతధం చూపించిన నర్తనశాల తెలుగు వాళ్ళు తీసిన పౌరాణిక చిత్రాలు అన్నిటిలోకీ గొప్పది.
సుందరకాండలో సీత యొక్క గొప్పదనాన్ని తెలియజెప్పే హనుమంతుడికి నాయక స్థానం ఇచ్చినట్లే ధర్మరాజు పట్ల వినయాన్ని ప్రదర్శిస్తూ అన్నగారి గొప్పదనాన్ని తెలియజెప్పిన బృహన్నలని నర్తనశాలలో ముందు నిలబెట్టటం మూలకధకు భిన్నమైనప్పటికీ తేడా తెలియనివ్వనంత చక్కగా అమిరింది.ఇక,రామారావు పోషించిన బృహన్నల పాత్ర అంతకు ముందు ఎవరూ ధరించనిది కాదు.వీరాభిమన్యు సినిమాలో కాంతారావు చేసిన పాత్రనే కొద్ది మార్పులతో రామారావు కూడా చేశాడు.శిరోజాలంకరణ మొదలు వస్త్రధారణ వరకు ఆపాదమస్తకం ఒక్కలానే ఉంటుంది.కాంతారావు,శోభన్ బాబు,రామారావులకి వీరాభిమన్యులో కాంబినేషన్ సీన్లు కూడా ఉన్నాయి.కాకపోతే రామారావు నటనలో వైవిధ్యం కోసం నడకలోనూ పలుకులోనూ వయ్యారం డోసు పెంచాడు.
బృహన్నలనీ రామారావునీ కలిపేసి నభూతో నభవిష్యతి అని మోసెయ్యడం వల్ల కాంతారావుకి అన్యాయం జరిగింది.నటుడిగా వ్యక్తిగా రామారావులో అలాంటి దుర్మార్గం లేదు గానీ మొత్తం పరిశ్రమకు బాధ్యత వహించాల్సిన విమర్శకులు కొందరి మార్కెట్ అవసరాల కోసం వందిమాగధులై రామారావు చుట్టూ ఒక కీర్తితోరణాన్ని నిర్మించాలనుకుని చాలామంది గొప్ప నటుల్ని రామారావు ముందు మరుగుజ్జుల్ని చేసి నిలబెట్టారు.
* నర్తనశాల completed
09.శ్రీకృష్ణ పాండవీయం(1966) - స్వీయ దర్శకత్వం
పాండవ వనవాసం సినిమాని తిరగేసి తీస్తే శ్రీ కృష్ణ పాండవీయం అవుతుంది.శ్రీ కృష్ణ పాండవీయం సినిమాని తడిబట్టను పిండినట్టు మెలిదిప్పి తీస్తే దాన వీర శూర కర్ణ అవుతుంది.ఈ సినిమా పేరులోనే శ్రీకృష్ణుడికీ పాండవులకీ ప్రాధాన్యత ఉంటుంది.తెర మీద మాత్రం పాండవులూ శ్రీకృష్ణుడూ అప్పుడప్పుడూ కనిపించి వెళ్ళిపోతారు.గాంధారికీ మేకపోతుకీ పెళ్ళి చేసి అది చచ్చాక ధృతరాష్టుడికి ఇచ్చి పెళ్ళి చెయ్యటం లాంటి చెత్త కధలతో దుర్యోధనుడి సొంత డబ్బా డైలాగులతో నిండిపోయి చిరాకు తెప్పించింది నాకు.అయితే, మధ్యే మధ్యే ఆచమనం సమర్పయామి అన్నట్టు "మత్తు వదలరా" లాంటి చమక్కులు ఉండటం వల్ల చూడగలిగాను.అవి లేని శ్రీ కృష్ణ పాండవీయం పరమ చెత్త.
పాండవ వనవాసంలో తను భీముడి వేషంలో "కురువృధ్ధుల్.." తరహా పద్యాలను మహా భీకరమైన రౌద్రం చూపించి ఆ క్షణానికి మట్టుకు శాభాష్ష్ అనిపించుకున్నాడు గానీ మరుక్షణం దుర్యోధనుడి వేషంలో ఉన్న రంగారావు చిన్న చిన్న డైలాగుల్ని మనం గిరీశం మార్కు బొట్లేరింగ్లీషును మాట్లాడినంత స్పీడుగా నేచురల్గా "ధిక్,అసందర్భ ప్రలాపి!బానిసలు,బానిసల కింత అహంభావమా!" అనేసి సీను మొత్తాన్ని తను మింగేశాడు.బహుశ అందువల్లనే,శ్రీ కృష్ణ పాండవీయంలో రామారావు రంగారావు శైలికి విరుధ్ధం అయిన సుదీర్ఘ సంభాషణల్ని దుర్యోధనుడికి వాడి ఉండవచ్చు - అలా పాండవ వనవాసం సినిమాని తిరగేసి తీస్తే శ్రీ కృష్ణ పాండవీయం అయ్యింది.శ్రీ కృష్ణ పాండవీయంలో దుర్యోధనుడు ప్రధానం అయి కర్ణుడు సహాయ పాత్ర అయితే దానవీరశూరకన్ణలో కర్ణుడు ప్రధానం అయి దుర్యోధనుడు సహాయ పాత్ర అయ్యాడు - అలా శ్రీ కృష్ణ పాండవీయం సినిమాని మెలిదిప్పి తీస్తే దాన వీర శూర కర్ణ అయ్యింది.
రామారావు దుర్యోధనుణ్ణి కొత్త కోణంలో చూపించాలన్న సినిమాటిక్ వెరైటీ కోసం భూకైలాస్, సీతారామకల్యాణం నాటి నిగ్రహాన్ని వదిలేసి తనను ప్రజలకు ఆరాధ్యదైవం అయ్యేలా చేసిన పురాణ పురుషులను ఆయా మూలకధలలోని సహజ స్వభావానికి విరుధ్ధమైన రీతిలో రూపకల్పన చేసి ఋషిద్రోహం, ధర్మద్రోహం, సత్యద్రోహం చేస్తూ గత రెండు తరాల యువతీయువకుల్ని నైతికభ్రష్టుల్ని చేశాడు.నిశితదృష్టితో గమనిస్తే హిందూధర్మ ద్వేషులు విమర్శించడానికి తీసుకున్న వాటిలో నూటికి తొంభై శాతం రామారావు సినిమాల నుంచే ఎత్తి పోస్తున్నారనేది తెలుస్తుంది.
రామారావు చేసిన దుర్మార్గం తెలియాలంటే మూలకధలోని ధర్మసూక్షాలు తెలియాలి.అన్నీ ఇక్కడ చెప్పడం కుదరదు గనక ముఖ్యమైనవి కొన్ని చెబుతాను.పాండు రాజూ మాద్రీ చచ్చిపోయాక పిల్లలతో కుంతీదేవి అడివిలోనే ఉండిపోయింది.భీష్ముడు వాళ్ళని రాజధానికి రప్పించిందే ధృతరాష్ట్రుడి తర్వాత ధర్మరాజే రాజు కావాలి కాబట్టి అతనికి రాజోచితమైన విద్యలు నేర్పడానికి.అలా వాళ్ళు వస్తున్నప్పుడు ప్రజలు కూడా ధర్మరాజుని తమ యువరాజులానే గౌరవించి మర్యాదలు చేశారు.జ్యేష్ఠుడైనా సరే అంధులూ అంగవైకల్యం ఉన్నవాళ్ళూ రాజు కాకూడదనే నిషేధం ఉండటం వల్ల ధృతరాష్ట్రుడు రాజయ్యే అవకాశం లేదు.అన్నగారు చిన్నబుచ్చుకుంటాడని పాండురాజు జాలిపడి కుర్చీ మీద కూర్చోబెట్టినందుకు ఆ తండ్రీ కొడుకులు తమది కానిదాన్ని తమకి ఫిరాయించుకోవాలనే దురాశతో నూటెనిమిది పర్వాల జయేతిహాసం కధ నడిచింది.
అసలైన విచిత్రం ఏమిటంటే, ప్రవచన కర్తలు కూడా శ్రీ కృష్ణుడి సహయం వల్లనే పాండవులు కురుక్షేత్రంలో గెలిచినట్టు చెప్తున్నారు గానీ ఆదిపర్వంలో సాక్షాత్తూ శకునియే దుర్యోధనుడికి "పాండవులతో వైరం నిప్పుతో చెలగాటం.భీమార్జునుల్ని విడివిడిగానే మానవమాత్రులే కాదు దేవతలు కూడా గెలవలేరు.ధర్మరాజుతో వైరం కన్న మిత్రత్వమే నీకు లాభం" అని కుండబద్దలు కొట్టి చెప్పాడు.కానీ, తనకి మేలు చేస్తున్న మంచి మాటల్ని చెప్తున్నప్పుడు తుమ్మల్లో పొద్దు గూకిన యేడుపుగొట్టు మొహం పెట్టుకుని విన్న దుర్యోధనుడు అల్లుడి బిక్క మొహం చూసి జాలి పడి రూటు మార్చి "రాజులకి రాజనీతితో పాటు కూటనీతి కూడా పనికొస్తుంది" అని ప్లేటు తిప్పి మాయాద్యూతం ప్లాను చెప్పగానే లటక్కన పట్టేసుకున్నాడు పెట్రోమాక్సు లైటులా వెలిగిపోతున్న మొహంతో.మూలకధలోని దుర్యోధనుడు తన మంచీ చెడూ తనకి తెలియని పిచ్చిముండాకొడుకు అయితే రామారావు దృష్టికి మహామేధావిలా సంఘసంస్కర్తలా స్వాభిమాన ధనుడిలా - అబ్బో,కొన్ని చోట్ల శ్రీకృష్ణుడితో సమానం అయిన అవతారపురుషుడిలా కూడా కనిపించాడు.
ఇక, మాయాద్యూతంలో పాండవులు ఓడిపోయిన తర్వాత కర్ణుడు ద్రౌపదిని అవమానించిన పధ్ధతి మూలకధని చదివి తెలుసుకుంటే రామారావు ఇప్పుడు బతికుంటే ఒక్క కర్ణుడి లాంటి నీచపాత్రని ఉన్నతం చేసినందుకే నరికి పోగులు పెడతారు,కనీసం రామారావు ముఖాన వూస్తారు.దుర్యోధనుడికి ధర్మరాజు మీద అసూయ తప్ప ఇతరమైన దుర్గుణాలు ఏమీ లేవు.అదీ, ద్రౌపదీ వస్త్రాపహరణం సన్నివేశంలో నడిచినట్టు కులస్త్రీలను అవమానించే నీచత్వం లేదు.మాయాద్యూతంలో పాండవులు ఓడిపోయిన తర్వాత జరిగిన ప్రతి చిన్న విషయంలోనూ కర్ణుడి ప్రమేయమే ఉంది.మొదట పాండవులను వస్త్రాలు విప్పి నగ్నంగా నిలబడమన్నది కర్ణుడు.ద్రౌపదిని కూడా వివస్త్రను చేసి నిలబెట్టమన్నదీ కర్ణుడే.ద్రౌపది పాతివ్రత్యానికి భయపడి ఇతరులు సందేహిస్తుంటే ఒక్క భర్తకి భార్య అయితేనే పతివ్రత,అయిదుగురు భర్తలకు భార్య అయిన ఆడది పతివ్రత కాదు బంధకి అని తప్పుడు కూతలు కూసిన నీచత్వం కర్ణుడిది.సభకి రాకుండా తప్పించుకోవడానికి ద్రౌపది అడిగిన "నేను ధర్మవిజితనా అధర్మవిజితనా" ప్రశ్నకి చిన్న కుర్రాడు యుయుత్సుడు చక్కటి జవాబు చెప్పి ద్రౌపదిని సభకి రప్పించనక్కర లేదని వాదించినప్పుడు "నీకేం తెలుసు నిమ్మకాయ పులుసు!" అని కొట్టిపారేసి అధికారపు అంతరువులలో తనకన్న పై స్థాయిలో ఉన్న దుశ్శాసనుడికి ద్రౌపదిని ఈడ్చుకు రమ్మని ఆజ్ఞాపించిన నికృష్టుడు రామారావుకి సజ్జనుడిలా ఎలా కనపడ్డాడు?
దాదాపు అందరూ ప్రవచన కర్తలూ ఒప్పేసుకుని ప్రచారం చేస్తున్నట్టు శ్రీకృష్ణుడు మాయావస్త్రదానం చెయ్యలేదు.విశ్వనాధ సత్యనారాయణ గారు మూలకావ్యంలోని పద్యాలను విశ్లేషించి చెప్పిన దాని ప్రకారం దుశ్శాసనుడు లాగుతున్న పైటకొంగుని ద్రౌపది తన వైపుకు బలం కొద్దీ లాగితే దుశ్శాసనుడు ముందుకు తూలి వూహించని స్థాయిలో పనిచేసిన ద్రౌపది బలానికి తడబడి నేలను కరుచుకుని సిగ్గుపడి పక్కకి తొలిగి నిలబడ్డాడు.
ఫైటింగులూ సాంగులూ పెట్టొచ్చుననే వెసులుబాటు కోసం భీముడిలోనూ అర్జునుడిలోనూ మాత్రమే హీరో మెటీరియల్ కనబడింది గానీ ధర్మరాజులో ఉన్న హీరో మెటీరియల్ కనబడలేదు రామారావుకి.మొత్తం మహాభారత కధకి గుండెకాయ లాంటి సన్నివేశం మాయాద్యూతమూ కాదు,ద్రౌపదీ వస్త్రాపహరణమూ కాదు,ఆఖరికి శ్రీకృష్ణుడి రాయబారం కూడా కాదు - సంజయుడి రాయబారం!ధృతరాష్ట్రుడు ధర్మరాజుకి "మేం రాజ్యం ఇవ్వం.నువ్వే సర్దుకుపో.ఎటూ పధ్నాలుగేళ్ళు అడుక్కు తినటం అలవాటైంది కదా,అలాగే బతుకు.యుధ్ధానికి మాత్రం రాకు" అని చెప్పి ఒప్పించమని సంజయుణ్ణి పంపించాడు.ఆ రెండు ముక్కలూ కట్టె కొట్టె తెచ్చె అన్నట్టు చెప్తే భీముడు ఎత్తి కుదేస్తాడని తెలుసు గనక సంజయుడు చాలా తియ్యని మాటలతో గుట్టు విప్పీ విప్పనట్టు గానూ మాట చెప్పకుండానే చెప్పినట్టుగానూ చాలా వెధవ్వేషాలు వేశాడు గానీ ధర్మరాజు అదే అమాయకత్వంతో "సంజయా!మాటిమాటికీ యుధ్ధానికి రాకండని అంటున్నావు.యుధ్ధం గురించి మేమెక్కడ మాట్లాడుతున్నాం?మా రాజ్యం మాకివ్వమని అడుగుతున్నాం - అంతే కదా!" అన్నాడు.మూలకధలో మాంఛి పద్యం ఉంటుంది.ప్రతి పదంలోనూ పదానికో కొరడా దెబ్బ లాంటి వ్యంగ్యం ఉంటుంది.
శ్రీ కృష్ణ పాండవీయంలో చూపించినట్టు అగ్నిప్రమాదం గురించిన హెచ్చరిక కృష్ణుడు భీముడికి చెయ్యలేదు.మూలకధ ప్రకారం ఆ సూచన విదురుడు ఇస్తాడు.మిగిలిన వాళ్ళకి కొంత అర్ధం అయ్యి కొంత అర్ధం కాక ధర్మరాజుని అడిగితే విదురుడు కవిత్వంలో ఉపయోగించిన ధ్వనిని విశ్లేషించి చెప్పి తప్పించుకోవటానికి వెయ్యాల్సిన ప్రణాళిక కూడా తనే చెప్పాడు, భీముడు ఇంప్లిమెంట్ చేశాడు,అంతే!యక్షప్రశ్నలకి దర్మరాజు చెప్పిన జవాబులు ఎంత గొప్పవో మీకు తెలుసా - వేదం మొదలు ఉపనిషత్తుల వరకు సకల శాస్త్ర పరిజ్ఞానం ఉన్నవాడికి తప్ప ఇతరులకి వాటిలో ఒక్క ప్రశ్నకి కూడా జవాబు చెప్పటం సాధ్యం కాదు.అటువంటి ధర్మరాజుని ఎట్లా చూపించాడు రామారావు?
* శ్రీకృష్ణ పాండవీయం completed
10.దాన వీర శూర కర్ణ(1977) - స్వీయ దర్శకత్వం
"పాంచాలీ,పంచభర్తృకా" అంటూ శ్రీ కృష్ణ పాండవీయంలో ప్రేక్షకులకి అలవాటు చేసిన ద్రౌపతి సతీత్వాన్ని దూషించటం దానవీరశూరకర్ణలో తారా స్థాయికి తీసుకెళ్ళాడు వ్యక్తిగత ప్రవర్తనలో కూడా దుర్యోధనుడితో మమేకం అయిపోయిన రామారావు.మయసభలో తడబడుతున్న దుర్యోధనుణ్ణి చూసి ద్రౌపది నవ్వటం మూలకధలో లేదు.మాయాద్యూతం తర్వాత ద్రౌపదిని అవమానించడాన్ని జస్టిఫై చెయ్యటానికి అప్పటికే ప్రబలమైన హిందూ ధర్మ ద్వేషులు కల్పించిన పిట్టకధ అది.ద్రౌపదీ స్వయంవరంలో కర్ణుడు మత్స్యయంత్రాన్ని కొట్టడానికి లేచినప్పుడు ద్రౌపది సూతపుత్రుణ్ణి పెళ్ళాడనని అనటం కూడా హిందూ ధర్మ ద్వేషులు కల్పించిన పిట్టకధయే.
దుర్యోధనుడి చేత రామారావు పాండవులను గురించి "ఆటపాటలందు మమ్మలమట బెట్టిన పాండవులు" అనిపించటం వరకు సమంజసమే గానీ "లక్కయింటను గాల్చినారన్న నిందను మాపైన బెట్టిన పాండవులు" అనిపించటం ఎంతవరకు న్యాయం?దుర్యోధనుడు అలా అనుకున్నాడు అనుకోవటానికి కూడా వీల్లేని దుర్యోధనుడి అభిమాన సంఘానికి అధ్యక్షుడై వ్యక్తిగత ప్రవర్తనలో కూడా దుర్యోధనుడితో మమేకం అయిపోయిన రామారావు యొక్క స్వకపోల కల్పిత సమర్ధనయే తప్ప అసలు దుర్యోధనుడికి తెలుసు ధృతరాష్టుణ్ణి ఒప్పించి లక్కయింటిని నిర్మించి ధర్మరాజుని రప్పించి చేర్సిన దుర్మార్గం.ఇక్కడ కూడా అయిదుగురు మగాళ్ళు ఒక్క ఆడదాన్ని పెళ్ళి చేసుకోవటాని ఎత్తుకున్ని ద్రౌపదీ అవమానించాలన్న కక్కుర్తి దేనికి చూపించాడు?
ఇక కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం నాడు అంగరాజ్యం ధారపోసి అర్ధ సింహాసనం ఇచ్చిన దుర్యోధనుడికి కర్ణుడి వల్ల జరిగిన మేలు ఏమిటి?తమ వైభవాన్ని చూపించటమే గాక వీలైతే మట్టుపెట్టటానికి కూడా పధకం వేసి ఘోషయాత్రకి పురి కొల్పింది కర్ణుడు.త్రాగుడు మైకలంలో వీళ్ళు పోయి గంధర్వులతో కలహం పెట్టుకుని వాళ్ళ చేతులో ఓడిపోయి దుర్యోధనుణ్ణి గంధర్వుల కొదిలేసి తన ప్రాణం కోసం పారిపోయిన కర్ణుడు స్నేహానికి ప్రతిరూపమా!అర్జునుడూ భీముడూ దుర్యోధనుణ్ణి విడిపించే సమయానికి కర్ణుడు ఎక్కడ ఉన్నాడో తెలుసా - హస్తినాపురంలో.బ్రహ్మాస్త్రం సాధిస్తానని దుర్యోధనుడికి చెప్పి పరశూరాముడి శిష్యరికానికి వెళ్ళినవాడు ఒక రధాన్ని మట్టుకు తీసుకుని తిరిగి వచ్చి దుర్యోధనుడితో మాత్రం అనుకున్నది సాధించాననని అబధ్ధం చెప్పిన కర్ణుడు స్నేహానికి ప్రతిరూపమా!
కుంతి కర్ణుడి పరాక్రమానికి భయపడి కొంగు చాపి పుత్రబిక్ష పెట్టమని అడగలేదు.కౌరవ పక్షం నుంచి పాండవ పక్షానికి వచ్చి యుధ్ధం నివారించమని అడిగింది.అది కూడా యుధ్ధం అంటూ వస్తే దుర్యోధనుడితో పాటు భీష్మద్రోణాదులని కూడా సంహరించాల్సిన ఇబ్బందిని తప్పించుకోవడానికే.కర్ణుడే తన తెలివి తక్కువ అతి వాగుడుతో అర్జునుణ్ణి తప్ప మిగిలిన వాళ్లని చేతికి చిక్కినా చంపకుండా వదిలేస్తానని కుంతి అడగని వరం ఇచ్చాడు.ఈ సంగతి మనకు తెలుసు గానీ దుర్యోధనుడికి చివరి వరకు తెలియదు - చెప్పాల్సిన బాధ్యత ఉన్న కర్ణుడు చెప్పలేదు!
కృష్ణుడు తనని పక్కకి తీసుకెళ్ళి పాండవ పక్షానికి వచ్చి యుధ్ధాన్ని నివారించమని అన్నప్పుడు "నేను తనకు అన్ననని తెలిస్తే ధర్మరాజు రాజ్యాన్ని నాకు ఇస్తాడు.నేను తీసుకుపోయి దుర్యోధనుడికే ఇస్తాను.దుష్టుడైన దుర్యోధనుడు రాజవటం ఇష్టం లేదు.ధర్మాత్ముడైన ధర్మరాజు రాజవటమే మంచిది.మేమందరం ఎలాగూ చచ్చిపోయేవాళ్ళమే కదా!" అంటూ తలా తోకా లేని పిచ్చ కబుర్లు చెప్పాడు.ఆ నిజాన్ని కూడా కర్ణుడు దుర్యోధనుడికి చెప్పలేదు.
శల్యుడు సారధ్యం చేసేటప్పుడు తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతానని దుర్యోధనుడికి తెగేసి చెప్పాడు.కానీ, దుర్యోధనుడు “నువ్వు శల్యుణ్ణి సారధిగా తీసుకు తెమ్మన్నావు,తెచ్చాను - ఇక నీ ప్రతాపం చూపించు.నన్ను గెలిపించు” అన్నాడే తప్ప శల్యుడు నిన్ను చావుతిట్లు తిడతాడు,భరించాలి అని మాత్రం చెప్పలేదు.అలాంటి వీళ్ళిద్దర్నీ ప్రపంచం మొత్తం మీద యుగయుగాలకీ ఉదాహరణ అవదగిన ప్రాణస్నేహితులని రామారావు చూపించాడు.సినిమాలు చూడటం తప్ప ఐతిహాసాల్ని సొంతంగా చదవని వెర్రిజనం నిజమని నమ్మారు.నిజానిజాల్ని చెప్పాల్సిన ప్రవచన కర్తలు కూడా ఆంధ్రుల ఆరాధ్య దైవం పేరున ఆకాశాని కెత్తేసి రామారావు చూపించిన తప్పుడు కధల్నే గోల్మాల్ గుమాయించేశారు తప్ప మూలకధల్ని ఎత్తి తీసి చూపించి రామారావు చేసిన తప్పుల్ని ఖండించలేదు - వినోదం ముసుగులో ఎంత ధర్మ ద్రోహం జరిగింది!
మాయాద్యూతంలో ఓడిపోయాక కుంతి ఏడుపు తర్వాత శ్రీ కృష్ణుడు పాండవులను కలిసినప్పుడు జరిగిందని దర్శకుడు చూపించిన సన్నివేశంలో ఆత్మపరీక్ష అనే తొక్కలో సీను ఇరికించి ద్రౌపది కర్ణుణ్ణి ఆరవ భర్తగా పొందాలనే రహస్యమైన కోరికతో రగిలి పోతున్నట్టు ఎందుకు చూపించాడు రామారావు?అయిదుగురు మగాళ్ళు చాలక ఆరో మగాడు కర్ణుడితో కూడా సెక్సాటలు ఆడాలనే కక్కుర్తి ద్రౌపదికి ఉన్నట్టు చూపించి "వంతు వంతున మాసమున కొక్క మగాడి చొప్పున పచ్చి పచ్చి భోగాల తేలియాడు మదపిశాచి" అని తను ద్రౌపదికి వేసిన ముద్రకి న్యాయం చెయ్యడానికా!
సినీ రంగపు సక్సెస్ కళ్ళకి పొరలు కమ్మించితే ఒంటికి కొవ్వు పట్టించుకుని "నేను,నాకు" అని చెప్పుకోవాల్సిన చోట "మేము,మాకు" అని చెప్పుకుంటూ పంచ మహాపతివ్రతలలో శక్తి స్వరూపిణి అయిన కాళిక అంశతో అయోనిజలా జన్మించిన ద్రౌపదిని పదే పదే నీచభాషను వాడి అవమానించిన దుర్యోధనరావుకి ఆఖరి దశలో ఒక నీచమహిళను చేరదీసి ఉన్నతస్థానం ఇచ్చిన తదనంతరం జరిగిన నైతిక పతనం,పట్టిన దుర్దశ,కుటుంబ సభ్యులే రోడ్డున పడవేసిన దైన్యం,కట్టి కుడిపిన అలనాటి పాపంలా వచ్చిన దిక్కు లేని చావు - అన్నీ ధర్మదేవత ప్రతిరూపం అయిన కలిపురుషుడు అతడికి వేసిన శిక్షలు.
తనకు యువరాజ్య పదవి ఖాయం అయ్యాకే గుడ్డిముండాకొడుకు హస్తినాపురాన్ని దుర్యోధనుడికి వదిలేసి మయాసురుడి కబ్జాలో ఉన్న ఎందుకూ పనికిరాని ఖాండవప్రస్థానికి పొమ్మంటే సంతోషంగా వెళ్ళిన ధర్మరాజుకి, శాంతి కోసం అయిదూళ్ళిస్తే చాలునన్న త్యాగశీలికి "సర్వ సర్వం సహా చక్రవర్తిగా నేనొక్కణ్ణే ఈ మేదినీ వలయాన్ని ఏలాలి!" అన్న నీచత్వం ఉన్నట్టు చూపించడం ఎంత ధర్మ ద్రోహం?
రాయబారానికి వెళ్ళే ముందు అందరి సందేశాలూ అడుగుతున్నప్పుడు తండ్రీ కొడుకులు బావమరుదులై పద్యాలు పాడుతూ తలల్ని తాళానికి తగ్గట్టు ముందుకీ వెనక్కీ వూప్తుంటే పొట్ట చెక్కలయ్యేంత నవ్వొచ్చింది నాకు.ఇక, కర్ణుడి జన్మ వృత్తాంతాన్ని కృష్ణుడు చెప్తుంటే కనబడుతున్న దృశ్యాలలో వూరపందిలా బలిసిన ముసలి వరలక్ష్మినే బాల్యం దాటి అప్పుడే కన్య అయిన కుంతిలా చూపించినప్పుడు కూడా పొట్ట చెక్కలయ్యేంత నవ్వొచ్చింది నాకు.
దుర్యోధనుడి వేషంలో "ఏమంటివి ఏమంటివీ" తర్వాత పట్టిపట్టి నొక్కిపట్టి తొక్కిపట్టి"శతధా సహస్రధా, సహస్రధా లక్షధా, లక్షధా కోటిధా" అంటూ కష్టపడి కష్టపడి చెప్పిన దంతాఘట్టిత కష్ట నికృష్ట సంఘటిత దుర్వార దుష్ట సమాస భూయిష్టమైన పదాల రామారావు ఉఛ్చారణ కన్న ఇక్కడ శల్యుడి వేషంలో అర్జునుణ్ణి పొగుడుతూ చెప్పిన డైలాగుల్లో ముక్కామల ఉఛ్చారణ చాలా బాగుంది.
శల్యుడు తనని సూటిపోటి మాటలతో బాధిస్తుంటే కర్ణుడి నోటినుంచి వచ్చిన "కృతఘ్నతను మించిన పుణ్యం కృతఘ్నతను మించిన పాపం లేదు" అన్న ఆణిముత్యం లాంటి నీతివాక్యం మొదటిసారి విన్నప్పుడు అదిరి పడ్డాను నేను!అప్పటికి టీనేజీలోనే ఉన్నప్పటికీ భాషాజ్ఞానం అఘోరించింది గద - "కృతఘ్నతే పుణ్యమూ కృతఘ్నతే పాపమూ ఎట్లా అవుతుంది?అసలు కృతఘ్నత పుణ్యం ఎట్లా అవుతుంది!" అని చాలా ప్రశ్నలు వచ్చాయి.చాలా కాలం తరవాత తెలిసింది అయ్యగారికి "జ్ఞ" లపకదని.ఆ లోపం ఉన్నప్పుడు డైలాగుని "చేసిన మేలును ఎరగటం,చేసిన మేలును మరవటం" అనేటట్టు మార్చి తగలడొచ్చు కదా - అప్పటికే "హెహెహే,ప్రేక్షకులు మేము ఏమి చేసినా మెచ్చుతారు,ఏమి తీసినా చూస్తారు.మాకు హెదురేమున్నది.హెహెహే" అనే అహం బలిసి పోయి ఉంటుంది.
* దాన వీర శూర కర్ణ completed
11.శ్రీరామ పట్టాభిషేకం(1978) - స్వీయ దర్శకత్వం
పేరుకే ఇది శ్రీరామ పట్టాభిషేకం, తీరు మొత్తం రావణ సంకీర్తనం.చూపరుల మనస్సులో రాముడి కన్న రావణుడు చాలా చాలా చాలా మంచివాడిగా కనిపించి ఇంటికెళ్ళాక రాముడి పటాల్ని కుప్పతొట్టిలో పారేసి అయ్యగారు ఇక్కడ చూపించిన రావణుడి బొమ్మని పూజగదిలో పెట్టుకుని పూజలు చెయ్యాలనే ఆవేశం వొచ్చేటట్టు తీశాడు రావణరావు ఈ సినిమాని.
మండోదరి పాడినట్టు చూపిస్తూ "ఆలపించనా.." కీర్తన మనకు వినిపించడంలో దర్శకుడి లక్ష్యం ఏమిటి?ఓడిపోతున్నామని తెలిసిన నాటి యుధ్ధం మధ్యలో రామలక్షణుల తలల్ని తెచ్చి “రాముడు చచ్చిపోయాడు,నన్ను వరించటానికి అభ్యంతరం లేదు కదా” అని సీత పొందు కోసం అలమటించినఉఛ్చనీచాలు తెలియని కామాతురుడు లక్ష్మణుణ్ణి ఉచిత మర్యాదలతో ప్రవేశపెట్టమని మర్యాదలు చెయ్యటమా,తనముందు ఎక్కడ నుంచోవాలో లక్ష్మణుడికి రావణుడు బోధించటమా - ఏమి కల్పనా చాతుర్యమూ ఏమి కల్పనా చాతుర్యమూ!సకల శాస్త్ర కోవిదుడైన రావణుని వద్ద రాజనీతిని నేర్చుకు రమ్మని లక్ష్మణుణ్ణి రావణుడి వద్దకు పంపించినట్టు చూపించటం విగ్రహవాన్ ధర్ముడైన శ్రీరాముడి మీద కనీసపు గౌరవం ఉన్నవాడు కూడా చెయ్యడే!కానీ, అదే సినిమాలో రాముడి వేషం కూడా వేసి ఆ సినిమాకి దర్శకత్వం వెలగబెట్టిన రామారావు ఎట్లా చెయ్యగలిగాడు?
ఇక రావణదేవ భక్తాగ్రేసరుడైన నందమూరి తారక రామారావు ఈ సినిమాలో చూపించిన రావణ నిర్యాణ ఘట్టం,కాదు కాదు శ్రీ రావణ స్వామి యొక్క అవతార పరిసమాప్తి దృశ్యం చూసిన వాళ్ళలో ఎంతమంది సినిమా చూడక ముందరి స్థాయిలో తమ రామభక్తిని కొనసాగించారు?నాకైతే అక్కడ తెరమీద కనిపిస్తున్న రాముడి మీద జాలేసింది - రామణబ్రహ్మ(నేను చెప్పిన రామకధని తిరిగి చెప్తూ అప్పుడప్పుడే మాటలొస్తున్న రోజుల్లో మా అమ్మాయి "రామనాసుర్డు" అనేది) గారు "రామా!శ్రీరామా!" అని పొలికేకలు పెడుతూ వచ్చి సప్తతాళప్రమాణంలో విశ్వరూపం చూపించి "ఊ!ధనుస్సు ఎక్కుపెట్టు!శస్త్రం సంధించు!నన్ను వధించు!" అని గద్దిస్తుంటే మహోన్నతుడైన రావణుని ముందు మరుగుజ్జులా కనిపిస్తూ స్కూలు పిల్లాడిలా "నిన్నెలా చంపనూ!" అని డౌట్లు అడుతుంటే "ఫర్లెదులే,చంపెయ్!(సీన్లు పొడిగిస్తే రీళ్ళు ఎక్కువై నాకు డబ్బులు బొక్క)" అని గ్యారెంటీ ఇచ్చాక గానీ రాముడు బాణం వెయ్యలేకపోయాడంట!చావుకి సిధ్ధపడి వొచ్చి బాణం వెయ్యగానే చస్తానని అంత గ్యారెంటీ ఇచ్చినవాడు మళ్ళీ రాముడి బాణానికి ఎగిరిపోయిన తలని మొలిపించుకుని "అహ్హహ్హహ్హహ్హా" అని పగలబడి నవ్వడం దేనికో అర్ధం కాలేదు నాకు:-)ఈ రావణుడి బొడ్డులో అమృతభాండం ఉందనే దిక్కుమాలిన కధని ఎవడు పుట్టించాడో, నాగ్గాని కనబడితే వాణ్ణి నేతిగిన్నెలాంటి ముసలి రమ్యనాభికృష్ణ బొడ్డులో గానీ వూటబావిలాంటి పడుచు సమంతా బొడ్డులో గానీ ముంచి ఛంపేస్తాను.
ఏ ధర్మాత్ముల వేషాల్ని ఇతర దర్శకులు తన చేత వేయించి ప్రజలు తనని దైవసమానుడనీ దైవస్వరూపుడనీ కీర్తించేలా చేశారో ఆ ధర్మస్వరూపుల్ని వాళ్ళ శత్రువులైన దురాత్ముల కన్న తక్కువ వాళ్ళని చేసి చూపించటం ఎంత నీచమైన పని!రామారావు చేసినప్పుడు రాని కోపం పాస్టర్లూ కమ్యూనిస్టులూ అంబేద్కరూ చేస్తే ఎందుకు వస్తున్నది హిందువులకి?
* శ్రీరామ పట్టాభిషేకం completed
12.శ్రీమద్విరాటపర్వం(1979) - స్వీయ దర్శకత్వం
మీరు మరీ ఓవర్ అనుకున్నా సరే "మద్దిరాటపర్ర" అని తప్ప పూర్తి పేరుని యధాతధం పలకడానికే అసహ్యం వేస్తుంది నాకు.అసలీ సినిమా రామారావు 1979ల నాడు ఏ ధోరణిలో ఉండి ఏమి వూహించుకుని అంత డబ్బు ఖర్చుపెట్టి తీశాడో 20223ల నాటి ఇప్పటికీ అర్ధం కావడం లేదు నాకు.
"సలలిత రాగ సుధారస సారం, జయగణనాయక" లాంటి చక్కని సాహిత్యానికి బాలమురళీకృష్ణ గాత్రం తోడైతే పక్కన విజయలక్ష్మి లాంటి గొప్ప నర్తకి ఉన్నప్పుడు కూడా ఫోకస్ తన మీదకే రప్పించుకున్న లాలిత్య ప్రదర్శనని మెచ్చిన ప్రేక్షలులు గాగ్రా చోళీలా కనిపిస్తున్న చెత్త డ్రస్సు వేసి కృష్ణుడి వేషంలో తనకి తనే కన్ను కొట్టుకుని బృహన్నల వేషంలో మూతి మూడొంకర్లు తిప్పుతున్న వెకిలితనాన్ని ఎలా మెచ్చుకుంటారని అనుకున్నాడు?
ఆ ఒక్క సీనుకే వాంతి వొచ్చినంత పనయ్యింది.ఎలాగూ టిక్కెట్టు తీసుకుని వొచ్చి కూర్చున్నాం గదా,బోరు కొడితే నిదర పోదాం అని సరిపెట్టుకుని కంటిన్యూ అయ్యాను.కధలోకి ద్రౌపది వొచ్చింది కదా - మళ్ళీ వాడేసుకున్నాడు.పాండవీయంలో వస్త్రాపహరణాన్ని జస్టిఫై చెయ్యటానికి మయసభలో ద్రౌపది దురోధనుణ్ణి నవ్వినట్టు చూపించి సరిపెట్టేశాడు.వీర సొరకాయ కర్ణలో ద్రౌపది కర్ణుణ్ణి ఆరవ భర్తగా పొందాలనే రహస్యమైన కోరికతో రగిలి పోతున్నట్టు చూపించి ఆపేశాడు గానీ ఇక్కడ ఏకంగా వ్యాంపులా మార్చేశాడు.
"గుడివాడ ఎల్లాను,గుంటూరు పొయ్యాను" తరహా పాటలకి జయమాలిని ఎన్ని లంజవేషాలు వేస్తుందో అన్నీ వాణిశ్రీలా కనిపిస్తున్న ద్రౌపదితో వేయించాడు, మహామేధావి యైన సింహబలుడిని మోసం చెయ్యడం అంత వీజీ కాదు,"రాత్రికి నర్తనశాలకిరా,అక్కడ నీ కోరిక తీరుస్తాను" అని చెబితే చాలదు,పాట పాడుతూ వ్యాంపులా డ్యాన్సు చేస్తూ చెప్తేనే నమ్ముతాడు అనే కాన్సెప్టుతో.మూలకధని చదివాడా అసలు?సతీత్వం అంటే “పరపురుషుడు తనని వాంచిస్తున్నాడనే ఆలోచనకే అవమానంతో దుఃఖంతో మనస్సు భగ్గున మండిపోవటం!" అన్న చిన్న విషయం కూడా తెలియదా!
తన పెళ్ళామూ తన కూతుళ్ళూ తప్ప వేరే ఆడవాళ్ళు అసలు కులస్త్రీల లానే కనపడరా రామారావుకి?దాదాపు సినిమా ఫీల్డులో ఉన్నవాళ్ళు అందరికీ ఆడవాళ్ళంటే చులకన భావం ఉంటుంది గానీ "నేను,నాకు" అని చెప్పుకోవాల్సిన చోట "మేము,మాకు" అని చెప్పుకునే రామారావుకి ప్రాచీన కాలపు రాజవంశీయులకి ఉండే స్థాయిలో పురుషాహంకారం బలిసిపోయిందని అనుకుంటున్నాను నేను.ఎందుకంటే - దానవీరశూరకర్ణలో తన ఫస్ట్ ఎంట్రీ పాటకి డ్యాన్సింగ్ కాస్ట్యూమ్సులో తన కూతుళ్ళ చేత వెల్కం చెప్పించుకోవటం,దుర్యోధనుడికి కూడా డ్యూయెట్టు పెట్టి అక్కడ కూడా ఒక ఆడమనిషి తనని చూస్తే చాలు మైమరచి పోయినట్టు చూపించటం,శల్యుడికి ఆతిధ్యం ఇచ్చి లొంగదీసుకున్నాడు అనేది చూపించటానికి హీనపక్షం ముప్పయిమంది ఆడవాళ్ళు డ్యాన్సింగ్ కాస్ట్యూమ్సులో ముక్కామల పడుకున్న మంచం చుట్టూ తిరుగుతూ ముక్కామలతో రొమాన్సు చేస్తున్నట్టు చూపించటం అన్నీ కూడా ఆడవాళ్ళు మగాళ్ళకి రొమాంటిక్ వూహలు పుట్టించటానికీ మగాళ్ళతో రతిక్రీడలు చెయ్యటానికీ మగాళ్ళకి పిల్లల్ని కనివ్వటానికీ తప్ప ఇంకెందుకూ పనికిరారు అనే ధోరణి ఉన్నవాడు తప్ప ఉన్నతమైన సంస్కారం ఉన్నవాడు ఎవ్వడూ ఎంజాయ్ చెయ్యలేడు.
చూసిన వాళ్ళూ చూసి పులకించి అతన్ని ఆంధ్రుల ఆరాధ్యదైవం హోదా ఇచ్చిన వాళ్ళు కూడా ఆ పురుషాధిక్య సంస్కృతికి చెందినవాళ్ళే కాబట్టి ఇంతవరకు చెల్లిపోయింది గానీ ఇకముందు రామారావుని తనకు అర్హత లేని ఉన్నత స్థానం నుంచి లాగిపారేసి తనకు న్యాయమైన స్థానంలో కూర్చోబెట్టాల్సిన సమయం వచ్చింది."జాతుల్ సెప్పుట, సేవసేయుట, మృషల్ సంధించు, టన్యాయవిఖ్యాతిం బొందుట, కొండెకాఁడవుట, హింసారంభకుండౌట, మిధ్యాతాత్పర్యములాడు - టన్నియుఁ బరద్రవ్యంబునాశించి, యీ శ్రీ తా నెన్నియుగంబు లుండఁగలదో శ్రీ కాళహస్తీశ్వరా!" అనే పద్యంలో భక్తి లేదు.మహాకవి ధూర్జటి యొక్క లోకజ్ఞానం ఉంది.ఎప్పుడు చెప్పాడో గానీ ఇప్పుడు కనపడుతున్న అవినీతిపరుల్ని సైతం గుర్తు పట్టటానికి అవసరమైన క్లూల్ని ఇస్తున్నాడు.మహాకవి ధూర్జటి యొక్క పరిశీలన ఎంత గొప్పదో తెలుసా - ప్రపంచ స్థాయిలో అన్ని సమాజాల్లోని అవినీతి పరుల్నీ ఒక భూతద్దం తీసుకుని వ్యక్తి స్థాయి వరకు ఎన్లార్జి చేసి చూస్తే వాడు ఈ ఏడు పనుల్లో ఏదో ఒకటి చేస్తూ ఉంటాడుతప్ప ఎనిమిదో రకం వాడు కనపడడు.ప్రస్తుతం మనం ముచ్చటించుకుంటున్న ప్రతినాయకుడూ అతని కుటుంబ సభ్యులూ అనుభవిస్తున్నది నాలుగవదైన అన్యాయ విఖ్యాతి.
అది 1981వ సంవత్సరం.పెద్ద NTR పార్టీ పెట్టాలని హదావిడి పడుతున్నాడు.అప్పటి తన అకౌంటెంట్ డబ్బుల విషయంలో మోసం చేయడంతో ఎవరైనా మంచి అమ్మాయికి బాధ్యత అప్పగిస్తే బాగుంటుందని షాలిని అనే ఆమెకు అకవుంటెంట్ జాబ్ ఇచ్చారు.అప్పటి నుంచి షాలిని గారు తెలుగుదేశం పార్టీ అక్కవుంట్సే గాక రామకృస్ణా స్టూడియో అక్కవుంట్సు కూడా చూస్తున్నారు.అంతే గాక పెద్దాయన అవసరాలను కనిపెట్టి చూసేవారు.1982లో పార్టీ పెట్టిన మొదటి రోజునుంచి పెద్ద కొడుకైన హరికృష్ణ పెద్ద NTR చైతన్యరధం అని పేరు పెట్టుకున్న పర్సనల్ వ్యాన్ డ్రైవర్ అయ్యాడు.
అలా జరిగిన పరిచయం పెరిగి హరికృష్ణ షాలిని మీద మనసు పారేసుకున్నాడు.కానీ, 1973లోనే లక్ష్మి అనే కులస్త్రీతో పెళ్ళైపోయింది.అప్పటికే నందమూరి జానకి రామ్,నందమూరి కల్యాణ్ రామ్, నందమూరి సుహాసిని కూడా పుట్టేశారు.అయితే, మనసులో పుట్టే వలపుకు వయసుతో పనేంటి?మనసులో పుట్టిన వలపుల మొలకలు పెరిగిన తర్వాత తనువులు కలవక తప్పదు కద - ఆకు చాటు పిందె తడిసింది,కోక చాటు పువ్వు తడిసింది,ఆకాశ గంగొచ్చింది,అందాల్ని ముంచెత్తింది,గోదారి పొంగొచ్చింది,కొంగుల్ని మాత్రం ముడిపెట్టలేదు.షాలిని గారు నెల తప్పారని తెలిసిన పెద్ద NTR ఎన్నికల ఫలితాలు వచ్చాక ఆమెని ప్యాస్ చేద్దామని నిర్ణయించుకున్నాడు.ఇప్పుడంత టైము లేదని జస్టిస్ చౌదరి తీర్పును వాయిదా వెయ్యడంతో హరికృష్ణ షాలిని గార్ని ఒక అద్దె ఇంటిలో ఉంచాడు.83 జనవరి కల్లా 293 సీట్లు గెల్చి పెద్ద NTR ఆంధ్రాకి CM అయ్యాడు.1983 మేలో కుర్ర NTR పుట్టాడు.
అప్పటికి గానీ కుటుంబంలో ఇతర్లకి తెలియలేదు హరికృష్ణ రసికత్వం.ఇక రగులుకుంది కులగర్వం.పెళ్ళయ్యి పిల్లలున్నారని తెలిసి కూడా హరికృష్ణతో వ్యవహారం నడిపినందుకు "నమ్మకద్రోహి" బిరుదుతో షాలిని గార్ని సత్కరించారు.పెద్ద NTR కాషాయం కట్టి కుటుంబ సభ్యులకి దూరం అయ్యి ముఖ్యమంత్రి వేషాన్ని "రాసుకున్న ప్రసంగంలో చెమటోడ్చి అనే పదం వస్తే చాలు,బొటనవేలితో నుదుటి మీద గీత గీసి అక్కడ లేని చెమట చుక్కని ఉన్నట్టు చూపిస్తూ" రక్తి కట్టిస్తున్నాడు.దుష్యంతుడు శకుంతలని మర్చిపోయినట్టు పెద్ద NTR షాలిని గార్ని మర్చిపోయాడు.అలనాటి శకుంతలా ఇలనాటి షాలినీ బలగం లేని నిరుపేదలు గనకనే నునులేత పువ్వులై విరిసి నమ్మి చేరిన కలవారి సెక్సాటలో ఓడిపోయి వలపంత ధూళిలో కలిసి బతుకును వెతల పాలు చేసుకుని కలగా మెదిలే కన్నీటి కథలై మిగిలిపోయారు.
2006లో యమదొంగ సినిమాతో తాతకు తగ్గ మనవడు కాదు,అప్పుడెప్పుడో పెద్ద NTR అన్నట్టు తాతను మించిన మనవడు అనిపించుకున్నాడు కుర్ర NTR.ఆ క్రేజుని పార్టీకి వాడుకుందామని బాబాయీ మేనమామా వచ్చి అడిగితే కుర్ర NTR ఒప్పుకున్నాడు - ఇలా అయినా తల్లికి న్యాయం జరుగుతుందని.అలా 2009 మార్చిలో ప్రచారం చేసి హైదరాబాదుకి వస్తున్నప్పుడు యాక్సిడెంట్ అయ్యింది.చాలా పెద్ద దెబ్బలే తగిలాయి.తల్లి వద్దనడంతో ఇక తర్వాత ప్రచారానికి వెళ్ళలేదు.కుర్ర NTR సమీరా రెడ్డిని ఇష్టపడుతుంటే కొడాలి నాని నుంచి విషయం తెలుసుకున్న హరికృష్ణ సమీరా రెడ్డిని కొట్టీ బెదిరించీ హైదరాబాదు నుంచి తరిమేశాడు.తండ్రి కొడుక్కి "నువ్వు నందమూరి కుటుంబంలో ఒకడివి కావాలంటే నేను చెప్పిన అమ్మాయినే పెళ్ళి చేసుకోవాలి" అని సెంటిమెంటు పండించి 2013లో తమ కులం అమ్మాయితో పెళ్ళి చేసేశాడు.
2018లో హరికృష్ణ చచ్చిపోయాడు, ఇక షాలిని గారికి పెద్ద NTR కుటుంబంలో గౌరవ స్థానం కోసం ఇచ్చే తలుపులు అన్నీ మూసుకుపోయాయి.నిన్న గాక మొన్న చంద్రబాబు భార్యని కొడాలి నాని ఒక అలవోక మాట అన్నందుకు కుళ్ళి కుళ్ళి యేడ్చిన వాళ్ళు 1981 నుంచి 2023 వరకు,అంటే 42 యేళ్ళ పాటు శాలిని అనే కులస్త్రీని ఉంపుడుగత్తె స్థానంలో ఎందుకు నిలబెట్టారు?షాలిని గారి కొడుకు తాతకి తగ్గ మనవణ్ణి అని తన వారసత్వాన్ని ప్రకటించుకుంటే హరికృష్ణ విత్తనం వేశాడు గాబట్టి ఒప్పుకున్నారు గానీ ఆ కుర్రాడి తల్లిని మాత్రం నందమూరి కుటుంబానికి చెందినదని ఒప్పుకోవడం లేదు.
కొన్ని తీవ్రమైన తప్పులు అవి తప్పులని తెలియక చేసినప్పటికీ పశ్చాత్తాపాలకీ క్షమాపణలకీ సైతం లొంగక శిక్షిస్తాయి.శిక్షకి తలవంచి సర్దుకుపోవాలి తప్ప తెలియక చేసిన తప్పుకి శిక్షించి అన్యాయం చేశావని దేవుణ్ణి నిందించ కూడదు.కొన్ని చిన్న చిన్న తప్పులు చేశాక పరిహారం చెల్లిస్తే తప్పుకు పోతాయి.అప్పుడు కూడా వినయంతో సంతృప్తి పడిపోవాలి తప్ప అహంకరించ కూడదు.అయితే తెర జీవితంలో ద్రౌపది,నిజ జీవితంలో షాలిని అనే ఇద్దరు కులస్త్రీలని కొన్ని దశాబ్దాల పటు నీచభాషతో అవమానించడం క్షమాపణలకీ పరిహారాలకీ లొంగదు.ఆ పాపం వీడని నీడలా వెంటాడి కొన్నేళ్ళ క్రితం లక్ష్మీ పార్వతి రూపంలో రామారావుని మొదటి దెబ్బ కొట్టింది.ఆ పాపమే వీడని నీడలా వెంటాడి ఇవ్వేళ చంద్రబాబుని రెండవ దెబ్బ కొట్టింది.ఆ పాపమే వీడని నీడలా వెంటాడి లోకేశుని మూడవ దెబ్బ కొట్టబోతున్నది.
రామాయణ భారతాది ఇతిహాసాల నాయకుల్ని విశ్లేషిస్తున్నప్పుడు కొన్ని తప్పులు కనబడితే విప్పి చెప్పడం కూడా దోషం కాదు గానీ వాల్మీకి వంటి తపస్వాధ్యాయ నిరతుడూ వ్యాసుడి వంటి సకల శాస్త్ర కోవిదుడూ శతవిధాల నిరూపణలు చేసి వీళ్ళు క్షమార్హులు కారు అని తీర్పు ఇచ్చేసిన తర్వాత వాళ్ళకి ప్రతినాయకులనే పేరు పెట్టి తను అభిమానించి ఇతరులకి వాళ్ళని అభిమాన పాత్రుల్ని చెయ్యటం మాత్రం పంచ మహాపాపాల్ని మించిన అతి పెద్ద పాపం - అలాంటి పనిని కొన్ని దశాబ్దాల పాటు చేశాడు రామారావు.అందువల్ల కలిపురుషుడు తెలుగువాళ్ళ రాజకీయ సామాజిక సాంస్కృతిక రంగాల నుంచి రామారావునీ రామారావు కుటుంబాన్నీ బహిష్కరించాలని నిశ్చయించుకున్నాడు.వచ్చే ఎన్నికల తర్వాత ఆంధ్రలో హిందువుల ప్రభుత్వం ఏర్పడుతుంది.
సత్యమేవ జయతే!ధర్మమేవ జయతే!న్యాయమేవ జయతే!
హిందూ ప్రభుత్వమా, అంటే భా.జ.పా నా, పూర్తి కాని పోలవరం, అమలుకాని అభివ్రుద్ది ప్రణాలికలు, వూసే లేని రాజధాని, కుల బలుపు, దోపిడీ, బలహీనులమీద దౌర్జన్యాలు ఇవేవి పట్టని కేంద్ర ప్రభుత్వం, ఇవేవీ టి.డి.పి గెలవడానికి అర్హతలుకాదన్న మాట, అప్పుడెప్పుడో రామారావు తీసిన, మేము పేర్లు వినడమేకానీ ఎప్పుడూ చూడని సినిమాలు, వాటి పోస్ట్ మార్టం , జూ.ఎన్.టీ.ఆర్ తల్లి కారణం గా భ.జ.పా రావాలన్న మాట, మెదడు వాపు వ్యాది ఏమైనా వచ్చిందా హరిబాబు గారూ మీకు లేకపోతే బట్టతలకి మోకాలికీ ముడి పెట్టి మాట్లాడడం
ReplyDeleteమీరు చూడనివి జరగలేదా!
Deleteజరిగినవీ తప్పులని తెలిసినవీ రాస్తే మేము చూదలేదు గాబట్టి రామారావు మంచోడు అనడం రైటా రాంగా!ఖచ్చితంగా రాంగే,కదా!
జూ.ఎన్.టీ.ఆర్ తల్లిది వేరే కులం కాబట్టే కదా ఆమెని బయట ఉంచింది - అది కులబలుపు కాదా?
రామారావు కుటుంబ ఆస్తిలోనూ రాజకీయ వారసత్వంలోనూ అల్లుడికీ అల్లుడి కొడుక్కీ ఇప్పుడు దక్కుతున్న పొజిషన్ తేడా అవుతుందనే కదా కుర్ర యంటీయార్ని అధికారికమైన గుర్తింపు ఇవ్వనిది.
ఇవ్వాళ చూడండి,తెలుగుదేశం పార్టీ అద్గ్యక్షుడు జైల్లో ఉంటే భార్యని స్టేజి ఎక్కించి సెంటిమెంటు డ్రామాలు ఆడించకపోతే అచ్చెన్నాయుడూ బుచ్చెన్నాయుడూ పట్టాభి లాంటివాళ్ళు మాట్లాడొచ్చు కదా - వాళ్ళొస్తే లోకేశం వెనకపడతాడని భయం కాబోలు!
కొడెల శివప్రసాద్ ఎందుకు సూయీసైడ్ చేసుకుని చచ్చిపోయాడు?పార్టీ తనకి సపోర్టు రానందుకే కదా, ఇలా ఒక కుటుంబానికి వారాసత్వం దఖలు పరిచేసి ఆ ఒక్క కుటుంబానికి ఆపదొస్తే కొమప్లు మునుగుతాయన్నట్టు హదావిడి చెయ్యటం రైటా,రాంగా!
"పూర్తి కాని పోలవరం, అమలుకాని అభివ్రుద్ది ప్రణాలికలు, వూసే లేని రాజధాని" అన్నిటికీ చంద్రబాబు అసమర్ధత తప్ప మరో కారణం ఉందా?
తెలుగుదేశం పార్టీ అద్గ్యక్షుడు జైల్లో ఉంటే భార్యని స్టేజి ఎక్కించి సెంటిమెంటు డ్రామాలు ఆడించకపోతే అచ్చెన్నాయుడూ బుచ్చెన్నాయుడూ పట్టాభి లాంటివాళ్ళు మాట్లాడొచ్చు కదా?
DeleteI object your honour...ఆడవాళ్ళు మాట్లాడకూడదా?
Welcome బెక బెక..
objection overruled!
Deleteఆడవాళ్ళు మాట్లాడొచ్చు.కానీ మగవాళ్ళు కూడా మాట్లాదాలి కదా!నో జంట్సూ ఓన్లీ లేడీస్ టాకూ,వై జంట్స్ సైలెంటూ వై లేడీస్ వైలెంటూ అనేది పాయింటు ఇక్కడ.
Welcome బెక బెక..
జై శ్రీ రామ్!
ఏమిటిది?
Delete"‘బిజెపి వల్లనే ఓడిపోయాం. ఇక జీవితంలో ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదు’ ఇది 2004లో చంద్రబాబు చేసిన ప్రకటన. ‘అమాయక మైనారిటీల హత్యకు కారణమైన నరేంద్ర మోదీని హైదరాబాద్‌లో అడుగు పెట్టనిచ్చేది లేదు’ ఇది అధికారంలో ఉన్నప్పుడు బాబు చేసిన ప్రకటన. ‘నరేంద్ర మోదీని వెంటనే అధికారం నుంచి తొలగించాలి’ -మోదీ గుజరాత్ సిఎంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ సిఎంగా చంద్రబాబు బిజెపికి ఇచ్చిన అల్టిమేటం ఇది. కాలచక్రం గిర్రున తిరిగి పదేళ్లు గడిచిన పోయిన తరువాత అదే నరేంద్ర మోదీని ప్రసన్నం చేసుకోవడానికి బాబు చేయని ప్రయత్నం లేదు. ‘మోదీ, మహాత్మాగాంధీ ఇద్దరూ గుజరాత్‌లోనే జన్మించారు’ పొత్తు కోసం ప్రయత్నిస్తున్న సమయంలో బాబు చెప్పిన మాట ఇది. చంద్రబాబు ప్రయత్నాలు వృధా కాలేదు. పొత్తు కుదిరింది. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, దేశంలో బిజెపి అధికారంలోకి వచ్చింది." - వూసరవెల్లి గుర్తుకు రావడం లేదూ!
మీకు హిందూ రాజ్యం, తెలుగు రాజ్యం తప్ప
Deleteకాబోయే సి ఎం పవనాలు కనబడటం లేదు సుమా !
ఒక ఎనలిస్టు హోదాలో నేనెప్పుడూ ఏ ఒక్క నాయ్కుడికీ భజన చెయ్యలేదు.అప్పుడు జరిగిన ఒక సన్నివేశంలో ఎవరు చేసింది తప్పు,ఎవరు చేసింది ఒప్పు అని తీర్పు చెప్పడం తప్ప ఒక వ్యక్తిని గానీ ఒక నాయ్కుణ్ణీ గానీ నూటికి నూరు శాతం ఒక వైపుకి జరిపలేదు.ఆయా నాయకుల అభిమానులు అంకున్నారు,ముఖం మీదనే అనేశారు - "మోదీని మాత్రమే తిడుతూ చందర్బాబుని తిట్టటం లేదు గాబట్టి మీరు పచ్చ ఫ్యాన్" అని బీజేపీ వాళ్ళూ అన్నారు,అవన్నీ వింటున్నప్పటికీ మనసుకి ఎక్కించుకోలేదు.
Deleteఅదే వరసలో మీరు కూడా "మెదడు వాపు వ్యాది ఏమైనా వచ్చిందా హరిబాబు గారూ" అనటంలో నేను ప్రోటీడెపీ ఆనుకుని ఇప్పుడు కొత్త పాట ఎత్తుకున్నట్టు భావిస్తున్నారని తెలుసుస్తున్నది.నిజానికి,చందరాబు అంటే నాకు అసహ్యమే!
చంద్రబాబు యొక్క మొదటి,ఆఖరి అవలక్షణం పౌరుషం లేకపోవటం.కేసీయారు నుంచి కొడాలి నాని దాక ఎవడు ఎన్ని తిట్టినా పూర్తి నిర్మొహమాటపు మోటుభాషలో చెప్పాలంటే ముఖాన ఖాండించి వుమ్మేసినా తుడుచుకు పోతాడే తప్ప నోరు మెదపడు,అన్నీ భరిస్తాడు,అందర్నీ చమించేస్తాడు,ఎందుకు?
దేనికి అలా భరిస్తాడో చెప్పగలరా మీరు?కేసీయార్ తనని దొంగబాబు అన్నప్పుడు చంద్రబాబు హోదా ఏమిటి?ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబుని తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేసీయార్ "వాడు,వీడు,దొంగ" అంటుంటే మనం ఎందుకు భరించాలి?మన వోట్లు తీసుకుని మన పౌరుషాన్ని నిలబెట్టాల్సిన తను ఎందుకు వూరుకున్నాడు?
అది చాలదన్నట్టు తిట్టించుకుని హైదరాబాదు నుంచి పారిపోయి వచ్చాడు,ఛీ!"ఎవడ్రా దొంగ?నువ్వు తోపువా - పాస్పోర్టులు అమ్ముకున్న కేసులో నువ్వు నిర్దోషివని తీర్పు తెచ్చుకో" అని ఎందుకు నిలదియ్యలేకపోయాడు.
అలాంటి పౌరుషహీనుడు ఆంధ్రకి ముఖ్యమంత్రి కావడం ఇష్టం లేదు నాకు.తిడితే తిట్టించుకోవదం,తంతే తన్నించుకోవడం,జైల్లో పెడితే వూచలు లెక్కెడుదూ దోమల్ని తోలుకుంటూ కూర్చోవడం సమర్ధ నాయకత్వం కాదు.
పౌరుషం తమకి లేదు గాబట్టి ప్రజలకి కూడా ఉండకూడదన్నట్టు ఉంటుంది తెలుగుదేశం వాళ్ళ ధోరణి.ముందు మీ నాయకుడికి కాస్త పౌరుషం,నిర్భయత్వం అలవాటు చెయ్యండి.
జై శ్రీ రామ్!
Your knowledge about any topic is like encyclopaedia amazing Hari Babu garu.
ReplyDeleteఎంత ఓపికండీ బాబు మీకు !!!!
ReplyDeleteరీసెర్చి పేపరుల కన్నా మరీయెక్కువే!
థీసీస్ ఏమన్నా సబ్మిట్ చేస్తున్నారా ?
నిజమే జిలేబీ,
Deleteభలే అయిడియా ఇచ్చావు."అది 1981..." నుంచి ఉన్న పొలిటికల్ ఆర్గ్యుమెంట్స్ తీసేసి ఏదన్నా యూనివర్సిటీకి సినిమాటోగ్రఫీ సబ్జక్టు కింద నోటిఫై చేస్తే డాక్టరేట్ గ్యారెంటీ.చూస్తాను.ఈసారి వైజాగ్ వెళ్ళినప్పుడు మా ఆంధ్రా యూనివర్సిటీ కుర్రాళ్ళని పట్టుకుని అక్కడ వేస్తాను.
జై శ్రీ రామ్!
ReplyDeleteరామారావు సినీ ఫీల్డ్ లో చెయ్యని కుతంత్రం, అకృత్యం లేదని లోపాయికారీ వ్యాఖ్యలు గతంలో చాలాసార్లు వినబడేవి. ఆశ్చర్యంగా ఇప్పటికీ ఒక్కరు కూడా ఆ దారుణాలేవీ బయట పెట్టడానికి సాహసించరేమిటో!? తన కమ్యూనిటీ చేతుల్లో చిత్ర పరిశ్రమ బందీ ఐపోవడమే ఆతని అదృష్టం. మధ్యలో ఎమ్మెస్ రెడ్డి గారనే అయన ఈయన గారి కానిపనులపై ఏదో పుస్తకం వ్రాసినా సినీ పెద్దలన్తా కలిసి దాన్ని అదృశ్యం చేయించారన్నది కూడా వినబడుతూ ఉంటుంది. ఏమైనా ప్రజలు మూర్ఖులుగా ఉన్నంత కాలం ఇలా ఎన్టీఆర్ లు, బాలకృష్ణలు, సల్మాన్ ఖాన్ లు, షారుఖ్ ఖాన్ లు ఆరాధ్య దైవాలుగా పూజలందుకుంటూనే ఉంటారు. ప్రజలన్న వారు ఎప్పటికీ మూర్ఖులుగానే వర్ధిల్లాలన్నది దైవ, సృష్టి సంకల్పం. అది మారదు.
అన్నట్లు మీరు ఎన్టీఆర్ చిట్టాలో మరొక్క విషయాన్ని జత చెయ్యడం మర్చి పోయారు. రామారావు రాక పూర్వం ఓ మాదిరి నీతి చక్రంలో తిరుగుతున్న రాజకీయాల్ని, బూతు చట్రమ్లోకి మార్చిన ఘనుడు కూడా ఈయనేనన్నది.
ఆత్మాపరాధ వృక్షస్య
ReplyDeleteఫలాన్యేతాని దేహినామ్
దారిద్ర్యరోగదుఃఖాని
బంధన వ్యసనాని చ
(ఆచార్య చాణక్య)
దరిద్రం, రోగం, దుఃఖం, చెఱపడటం మఱియు ఇతర వ్యసనాలు స్వయంకృతాపరాధ వృక్షానికి కాసే ఫలాలు.
ఆత్మాపరాధం అంటే స్వయంకృతాపరాధం అంటే తెలిసి తెలిసి చేసే తప్పు. ఇదొక వృక్షమనుకుంటే దానికి కాచే ఫలాలెలా ఉంటాయి?
మొదటిది దరిద్రం, ఎక్కువగా ఇది తెలిసిచేసే తప్పుల ఫలితమే, ఈ దరిద్రం ఏదేని కావచ్చు, భావదారిద్ర్యం కూడా అందులోదే!
రోగమెందుకొస్తుంది? వ్యసనంతో రోగమొస్తుంది. వ్యసనం తెలిసి చేసే తప్పుకదా!
దుఃఖం, తెలిసితెలిసి నిప్పులో చేయిపెడితే కాలకమానుతుందా? కలిగేది దుఃఖమే
చెఱపడటం ఎందుకు కలుగుతుంది? చేయకూడని పని చేయడం మూలంగా కదా!
ఇతరవ్యసనాలు వాక్పారుష్యం కూడా సప్తవ్యసనాల్లో ఒకటి కదా!
ఇవన్నీ తెలిసి చేసే తప్పులుకదా!!!
మనం నిత్య వ్యవహారంలో ఈ నీతిని పాటించం, ఇది ఎవరికో చెప్పిన మాటనుకుంటాం, మనకి సంబంధం లేదనుకుంటాం. అదీ విచిత్రం..
LAZY
అవును!
Deleteచాణక్యుడు రాజులకే కాదు,సామాన్య గృహస్థులకి పనికొచ్చే మంచి విషయాలు కూడా చెప్పాడు.పిల్లల్ని మొదటి అయిదేళ్ళూ రాజులా పెంచి తర్వాత పదేళ్ళూ బానిసల్లా పెంచి పదహారవ ఏటినుంచి స్నేహితుల్లా చూడమని చెప్పింది చాణక్యుడే!"విద్వాన్ సర్వత్ర పూజ్యతే" అని కుండబద్దలు కొట్టి చెప్పింది కూడా చాణక్యుదే.పనికొచ్చేవి వదిలేసి పనికిరాని చెత్తని నెత్తికి పోసుకున్నాం.దాని ఫలితమే ఈ దరిద్రం.
స్వస్తి.
నీహారిక గారూ, "కాబోయే సి ఎం పవనాలు" అంటున్నారు. గాలి మారిందనో మారుతోందనో మీరు కూడాభ్రమపడుతున్నారా? ఆంధ్రప్రజానీకం ఆలోచించి వేటువేసే రకం అని భ్రమలు అక్కరలేదు. నాకైతే మార్పు అనివార్యం అన్న పరిస్థితులు ఉన్నాయని అక్కడి జనం అనుకుంటున్న దాఖలాలు కనిపించటం లేదు. రాజకీయులు కొద్దోగొప్పో హడావుడి చేయటమే గాని జనం చంద్రబాబు గారికేదో అన్యాయం జరిగిపోతోందనో జరిగిపోయిందనో గగ్గోలు పెడుతున్నట్లు కనిపించటం లేదు. నా అంచనా తప్పో ఒప్పో తెలియదు కాని జనం చేత నయానో భయానో అధికారపార్టీ మళ్ళా ఓట్లు వేయించుకోగలదనే అనిపిస్తోంది.
ReplyDeleteఇకపోతే చచ్చి స్వర్గాన ఉన్న రామారావు తప్పులు చేసాడు కాబట్టి చంద్రబాబు శిక్షార్హుడైపోయాడన్న లాజిక్ అంతగా నప్పదనే అనిపిస్తున్నది.
ఒకరి తప్పుకి ఒకర్ని శిక్షించమని నేనెప్పుడూ అనను."నిన్న గాక మొన్న చంద్రబాబు భార్యని కొడాలి నాని ఒక అలవోక మాట అన్నందుకు కుళ్ళి కుళ్ళి యేడ్చిన వాళ్ళు 1981 నుంచి 2023 వరకు,అంటే 42 యేళ్ళ పాటు శాలిని అనే కులస్త్రీని ఉంపుడుగత్తె స్థానంలో ఎందుకు నిలబెట్టారు?" అని అడిగింది చచ్చిపోయిన రామారావుని కాదు,బతికున్న చంద్రబాబునీ తెలుగుదేశం నాయకుల్నే.
Deleteమీ బ్లాగ్ background చూస్తే మీ మెదడు ఎన్ని రకాలుగా ఆలోచిస్తుంది అనేది అర్థం అవుతుంది. శాలిని గారిని దూరం పెడితే చంద్రబాబు గారి బంధువు కూతురినే జూ.ఎన్టీఆర్ కి ఇచ్చి ఎందుకు పెళ్లి చేస్తారు ? అన్ని అనుమానపు ఊహలే... కీడెంచి మెలెంచమన్నారు కదా అని ఇన్ని అభాండాలా?
Delete"చంద్రబాబు గారి బంధువు కూతురినే జూ.ఎన్టీఆర్ కి ఇచ్చి ఎందుకు పెళ్లి చేస్తారు ?" అన్న ప్రశ్నకి {కుర్ర NTR సమీరా రెడ్డిని ఇష్టపడుతుంటే కొడాలి నాని నుంచి విషయం తెలుసుకున్న హరికృష్ణ సమీరా రెడ్డిని కొట్టీ బెదిరించీ హైదరాబాదు నుంచి తరిమేశాడు.తండ్రి కొడుక్కి "నువ్వు నందమూరి కుటుంబంలో ఒకడివి కావాలంటే నేను చెప్పిన అమ్మాయినే పెళ్ళి చేసుకోవాలి" అని సెంటిమెంటు పండించి 2013లో తమ కులం అమ్మాయితో పెళ్ళి చేసేశాడు.} అన్న జవాబు ఆల్రెడీ చెప్పేశాను కదా!
Deleteఆమెకి అధికారికమైన స్థానం ఇచ్చిన మరుక్షణం అల్లుడి కొడుకు హోదాలో ఉన్న లోకేశ్ కన్న హరికృష్ణ కొడుకు హోదాలో ఉన్న కుర్ర NTR మూడో తరపు నిజమైన రాజకీయ వారసుడు అవుతాడు.తండ్రి అంత సెంటిమెంటు పండించి కొడుక్కి స్వకులం అమ్మాయిని ఇచ్చి పెళ్ళి చెయ్యడం వల్ల శాలిని గారికి న్యాయం జరిగిందా?ఇక్కడ విషయం ఎంత సంక్లిష్టం అయ్యిందో అర్ధం కావడం లేదు మీకుకుర్ర NTR తెరమీద "తాతకి తగ్గ మనవణ్ణి!" అంటే ఒప్పేసుకున్నారు.కానీ, శాలిని గారికి మాత్రం పెద్ద హరికృష్ణ యొక్క రెండవ భార్య స్థానం ఇవ్వడం లేదు.శాలిని గారు కమ్మకులం కాదు గాబట్టే ఆ లోపాయికారీ బహిష్కరణ ఇప్పటికీ అమలు జరుగుతున్నది.
నా బ్లాగ్ బాక్గ్రౌండుకీ నా మెదడు పనిచేసే తీరుకీ లింకులు వెతకడం మాని మీ మెదడుకి కాస్త లోకజ్ఞానం అనే మేత వెయ్యండి.ఆ ఎంపిక నా మెదడును ఉపయోగించి చేశాను గాబట్టి నా బ్లాగ్ బాక్గ్రౌండుకీ నా మెదడు పనిచేసే తీరుకీ లింకు ఉండటం సహజమే - అతి తెలివి కాదు,సత్యం బయటికి రావాలంటే సరైన తర్కం పనికొస్తుంది.
జై శ్రీ రామ్!
ఉన్నట్టుండి బాబు వ్యతిరేకి గా మారిపోయారు ఎందుకు. మార్పు మంచిదే. పచ్చమీడియా అసహ్యకరమైన జర్నలిజం గురించి అలాగే రామోజీ వ్యవహారాల గురించి రీసెర్చి అర్టికిల్స్ వ్రాయండి.
Deleteతెలుగుదేశం పుట్టిందే వారసత్వ రాజకీయాల్ని తుదముట్టించడం కోసం అందుకే ఎన్టీఆర్ వారసులెవరూ ముఖ్యమంత్రి పదవి కోసం పోటిపడమని బాలకృష్ణ #unstoppable# లో చెప్పారు.యూట్యూబ్ లో మీ లాంటివాళ్ళు wrong thumbnails పెట్టి కధలు చెపుతుంటారు. మీ కథలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఒకవైపు లక్ష్మి పార్వతి నన్ను రెండవ భార్యగా గౌరవం చూపించడం లేదు అని ఏడుస్తుంటే మీరు శాలిని గారిని గుర్తించమని అంటున్నారు.ఎంత మందిని రెండవ భార్యలుగా గుర్తించాలి ? ఆవిడ గుర్తింపు కోరుకునే మనిషి కూడా కాదు.
Delete"తెలుగుదేశం పుట్టిందే వారసత్వ రాజకీయాల్ని తుదముట్టించడం కోసం అందుకే ఎన్టీఆర్ వారసులెవరూ ముఖ్యమంత్రి పదవి కోసం పోటిపడమని బాలకృష్ణ #unstoppable# లో చెప్పారు."
Deleteఅది మీరు నమ్మారు,ఇహిహి!
"ఒకవైపు లక్ష్మి పార్వతి నన్ను రెండవ భార్యగా గౌరవం చూపించడం లేదు అని ఏడుస్తుంటే మీరు శాలిని గారిని గుర్తించమని అంటున్నారు.ఎంత మందిని రెండవ భార్యలుగా గుర్తించాలి?"
Deleteఎంతమంది ఉంటే అంతమందినీ గుర్తించాల్సిందే - ఒక్కళ్ళని కూడా వొదలా!
@నీహారిక:"ఆవిడ గుర్తింపు కోరుకునే మనిషి కూడా కాదు."
Delete@చిచ్చరపిడుగు:సమస్య అసలు మనిషి గుర్తింపు కోరుకోవటం కోరుకోకపోవటం అయితే "షాలిని గారు నెల తప్పారని తెలిసిన పెద్ద NTR ఎన్నికల ఫలితాలు వచ్చాక ఆమెని ప్యాస్ చేద్దామని నిర్ణయించుకున్నాడు.83 జనవరి కల్లా 293 సీట్లు గెల్చి పెద్ద NTR ఆంధ్రాకి ఛం అయ్యాడు.పెద్ద NTR కాషాయం కట్టి కుటుంబ సభ్యులకి దూరం అయ్యి ముఖ్యమంత్రి వేషాన్ని "రాసుకున్న ప్రసంగంలో చెమటోడ్చి అనే పదం వస్తే చాలు,బొటనవేలితో నుదుటి మీద గీత గీసి అక్కడ లేని చెమట చుక్కని ఉన్నట్టు చూపిస్తూ" రక్తి కట్టిస్తున్నాడు.దుష్యంతుడు శకుంతలని మర్చిపోయినట్టు పెద్ద ణ్టృ షాలిని గార్ని మర్చిపోయాడు." అనేది ఏం చెప్తున్నది మేడం?
అలనాటి శకుంతలా ఇలనాటి షాలినీ బలగం లేని నిరుపేదలు గనకనే నునులేత పువ్వులై విరిసి నమ్మి చేరిన కలవారి సెక్సాటలో ఓడిపోయి వలపంత ధూళిలో కలిసి బతుకును వెతల పాలు చేసుకుని కలగా మెదిలే కన్నీటి కథలై మిగిలిపోయారు.
మీరు "ఇంతేలే నిరుపేదల బతుకులు" పాట పాడితే నేను "రగిలిందీ విప్లవాగ్ని ఈరోజు" పాట పాడతాను.
welcome బెకబెక.
మీకు పాటలు కాపీ/పేస్జ్టు చేయ్యదమే వచ్చు,నేనైతే కవిత్వం కూడా చెప్పగలను.
Deleteఇక్కడ చూడండి - "పరిచయం పెరిగి హరికృష్ణ షాలిని మీద మనసు ఆరేసుకోబోయి పారేసుకున్నాడు.కానీ, 1973లోనే లక్ష్మి అనే కులస్త్రీతో పెళ్ళైపోయింది.అప్పటికే నందమూరి జానకి రామ్,నందమూరి కల్యాణ్ రామ్, నందమూరి సుహాసిని కూడా పుట్టేశారు.అయితే, మనసులో పుట్టే వలపుకు వయసుతో పనేంటి?మనసులో పుట్టిన వలపుల మొలకలు పెరిగిన తర్వాత తనువులు కలవక తప్పదు కద - ఆకు చాటు పిందె తడిసింది,కోక చాటు పువ్వు తడిసింది,ఆకాశ గంగొచ్చింది,అందాల్ని ముంచెత్తింది,గోదారి పొంగొచ్చింది,కొంగుల్ని మాత్రం ముడిపెట్టలేదు." అంటూ ఎంత మంచి కవిత్వం చెప్పానో!
అయినా ఆడవాళ్ళైన మీరు కరగలేదు.ఏం చేస్తాం - ఈ తెలివేవిటో, ఈ వాలకమేంటో..కొన్ని జనమలలా అటూ ఇటూ గాకండా మయ్యాన సెటిలైపొతాయి గావాల్న!
ఎన్టీఆర్ కు చేసిన అన్యాయం, గోదావరి పుష్కరాల సంఘటన ఇత్యాది కర్మల ఫలితం కనిపిస్తుంది.
ReplyDeleteజగన్ అనేవాడి అసమర్థత , చేతగాని తనం, క్రూరత్వం అనే వాటిని వ్యతిరేకించడం చాలా కష్టం ,అతని పెంపుడు కుక్కల్ని, కుల కుక్కల్ని, కమ్మ కుల వ్యతిరేకులు గా అతని సమర్థుకులయిన వాళ్ళనీ తట్టుకోవాలి, భాజపా కి చెంచాగిరి చేయడం వల్ల తప్పని సరిగా అతన్ని సమర్థించాలన్నది మరో కారణం, అందువల్లా అంత కష్టం పడడం ఎందుకులే , సింపుల్ గా చంద్ర బాబు ని వ్యతిరేకించేద్దాం, అంతేగా, మన
ReplyDeleteవాళ్ళు పొరపాటున ఎవడో రౌడీ వెధవతో పోట్లాట పెట్టుకుని దెబ్బలు తిని ఇంటికి వచ్చాడనుకో, ఆ రౌడీ గాడి మీదికెల్లే సాహసం ధైర్యం మనకు లేవు బుద్దుందా నీకు, నువ్వు నీ దారిలో పోక వాడి జోలికెందుకెల్లావు,అని మన వాన్ని తప్పు పట్టడం , తిట్టడం సులభం, ఈ వెధవ ఎప్పుడూ ఇంతే అని మన అసమర్థత ని వాడి మీద నెట్టడం, వాడు చిన్నప్పుడు కూడా అంతే అని గత చెరిత్ర తవ్వడం , అంతే గా , వీలయితే వీడి తండ్రొ , మామ నో అంటూ వాళ్ళచరిత్ర కూడా తవ్వడం, వాల్లు అలాంటివాళ్లు కాబట్టి వీడు దెబ్బలు తిన్నాడు అని తీర్మానించి, వీడు ఇంకా ఎక్కువ తన్నులు తినాలి అని కోరుకోవడం, అంతే గా , హరిబాబు గారో
చంద్రబాబు NTRని దింపేసి తను రావడం వెనక లక్ష్మీపార్వతి అనే దుష్టశక్తి కన్న లిక్కర్ లాబీ ప్రమేయం ఎక్కువ.అది బాబు అధికారంలోకి వచ్చిన మొదటి వారం నుంచే ఎమ్మెల్యేలూ మంత్రులూ పబ్లిక్ స్టేట్మెంట్లు ఇస్తూ "పురజనుల కోరిక మేరకు,మద్యనిషేధాన్ని ఎత్తెయ్యడం" అనే దొంగనాటకాన్ని అతను నడిపించిన పధ్ధతే రుజువు.
Deleteఒక పెద్ద కాంట్రాక్టు వచ్చి లక్షాలు లేక కోట్ల స్థాయిలో లాభం వస్తే మందు పార్టీ ఇచ్చుకునే కార్పొరేట్ లేక హైబ్రో సొసైటీ తాగుడు వల్ల నష్టపోరు గానీ లోయర్ క్లాస్ మాస్ అనేవాళ్ళు తమ అతి తక్కువ ఆదాయాల్లోనే ఒళ్ళు గుల్ల చేసుకుంటున్నారు.అదీ గాక,చాలామంది మేధావులు సైతం వాళ్ళు "తమ కష్టాన్ని మర్చిపోవటానికి తాగుతున్నారు!" అనే తప్పుడు అవగాహనలో ఉంటున్నారు.తమ కష్టానికి తగ్గ ఫలితం రావడం లేదనీ తమకి అన్యాయం జరుగుతుందనీ తెల్సి, కీలకం స్పష్టంగా తెలియక పోవడం వల్ల ఎలా న్యాయం జరిపించుకోవాలో తెలియని అసహనం వాళ్ళని కల్లుపాకల వైపుకి పంపిస్తున్నది.ప్రభుత్వంలో ఉన్న వాళ్ళేమో మద్యనిషేధం విధిస్తే అబ్కారీ ఆదాయం తగ్గుతుందని ఏడుపుగొట్టు జవాబు చెప్తూ ప్రజల్ని అజ్ఞానంలోనే ఉంచేస్తున్నారు.
మద్యనిషేధం అప్పటికప్పుడు ఆదాయాన్ని తగ్గించితే దాన్ని వేరే విధాల పూడ్చుకుంటూ కొంతకలం ఓపిక పట్టి తాగుబోతుల్ని రీహాబిటేట్ చేస్తూ ఉంటే ఫైనల్ రిజల్ట్ బాగుంటుంది.మనోడికి ఆ చిత్తశుధ్ధి లేకనే కదా లిక్కర్ లాబీతో క్విడ్ ప్రోకో ఒప్పందం కుదుర్చుకుని NTR మీద తిరుగుబాటు చేసి అధికారం నుంచి లాగి పారేసింది!
NTR,LKP జంట వల్ల పార్టీలో ఏర్పడిన సమస్యని పార్టీలోనే మరింత సూటైన పధ్ధతిలో పరిషకరించుకునే వీలున్నప్పటికీ దాన్ని ప్రజల్ సమస్య కింద భూతద్దంలో పెట్టి చూపించి చేసిన హడావిడి సమస్తం తను అధికారంలోకి వచ్చి మద్యనిషేధం ఎత్తేసి లిక్కర్ లాబీకి లాభాలు ఆర్జించి పెట్టడానికే జరిగిందనేది సీనియర్ జర్నలిష్టుల్లో ప్రతి ఒక్కడికీ తెలుసు.
ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో జరుగుతున్నాయని అంటున్న కలప స్మగ్లింగ్,ఇసక స్మగ్లింగ్,రియల్టర్ కబ్జాలు బాబు హయాంలో జరగలేదని మీరు గ్యారెంటీ ఇవ్వగలరా!"అసమర్థత , చేతగాని తనం, క్రూరత్వం" జగన్ ఒక్కడిలోనే కాదు,చంద్రబాబులో కూడా ఉన్నప్పుడు గుడ్డిలో మెల్ల అనుకోవడం దేనికి?ఇద్దరూ దొంగలే అయినప్పుడు ఇద్దర్నీ వ్యతిరేకించాలి గానీ వాళ్ళిద్దరిలోనే ఒకణ్ణి కొంచెం బెటర్ అనుకుని సర్దుకుపోవడం నచ్చదు నాకు.
నేను హిందూత్వ వాదిని.రాష్ట్రంలో కూడా హిందూ అనుకూల ప్రభుత్వం రావాలి అని ఎప్పటించో అనుకుంటున్నాను,చెప్తున్నాను.నిన్నటి వరకు ఎనలిస్టునే కానీ ఇప్పుడు యాక్టివిస్ట్ అయ్యాను.ఎన్నికలు వచ్చేనాటికి బీజేపీ తరపున CM క్యాండిడేట్ అవుతాను.కుదిరితే బీజేపీని అధికారంలోకి తేవదం,లేదంటే ప్రధాన ప్రతిపక్షం స్థాయిలో నిలబెట్టదమే నా లక్ష్యం.
జగన్ కన్న ముందు పదవిలో ఉన్న బాబు కూడా అప్పులు చేసే బడ్జెట్లు వేశాడు కదా!జగన్ కన్న ముందు పదవిలో ఉన్న బాబు కూడా పోలవరానికీ అమరావతికీ సొంత మనుషులనే కాంట్రాక్టర్లని చేశాడు కదా!మీడియాలో బాకారాయుళ్ళని పెట్టుకుని అభివృధ్ధికి ప్యాంటూ షర్టూ అని పొగిడించుకుంటే సమర్ధుడు అయిపోతాడా మీ పిచ్చి గానీ.ఆపాటి బాకాలు మేం వూదించుకోలేమా?
బీజేపీ తరపున సిఎం అభ్యర్థి అవుతారా ? మరి కే ఏ పాల్ గారు ఏమైపోవాలి?
Deleteఏకే ల్యాప్ అని పేరు మార్చుకోవాలి.
Delete>>ఎన్నికలు వచ్చేనాటికి బీజేపీ తరపున CM క్యాండిడేట్ అవుతాను.
Deleteఏ దేశానికి?
టెల్గూడేషానికి:-)
Deleteబిజెపి కి ఓటేస్తే 3 నెలలు మొబైల్ రీచార్జ్ చేస్తామని చెప్పారు...ధర్మ ప్రభువులు 🙏
Deleteమీకు ఓటేస్తే మీ రీసెర్చ్ పోస్టులు పంచుతారా ?
3 నెలలేం ఖర్మ సెల్ ఫోన్ రీచార్జి ఒక్కటే గాక ఇంట్లో వాడుకునే ఎలక్ట్రికల్ అపలయన్సస్ అన్నిటికీ పవర్ లైఫ్ లాంగ్ ఫ్రీగా ఇవ్వొచ్చు.అసలు ఆరోగ్యం,విద్య కోసం ఒక్క నయాపైసా ఖర్చు చెయ్యక్కర లేదు.
Deleteఎందుకంటే, బాబుగారి తరహా అభివృధ్ధికి ప్యాంటూ షర్టూ మోడల్ కాదు నేను ఫాలో అయ్యేది.కామన్ ట్రెజరీకి పన్నుల రూపంలో డబ్బు దండిగా చేరాలంటే ప్రజల్ని ఆరోగ్యవంతులుగా ఉంచడమూ డబ్బుని సృష్టించే క్రియేటివ్ చదువులు నేరపడమూ ఆ సౌకర్యాలు అందుకునే ప్రజల కన్న ప్రభుత్వానికే ఎక్కువ అవసరం గనక.
వేదిక్ ఎకనామిక్స్ అంటారు దాన్ని.
జై శ్రీ రామ్!
That's what Jagan is doing
Delete@Anonymous
DeleteThat's what Jagan is doing
hari.S.babu
No!he is doing what once tughlaq did.My concept differs and complete reverse of modern economics.
@Anonymous31 October 2023 at 21:02
DeleteThat's what Jagan is doing
hari.S.babu
If you understand carefully how money is flowing from RBI to ourselves, You will be shocked to the fact you would know that we need not pay a single rupee as tax returns.
The currency you are putting in your pocket and using it to buy what you want is fiat currency which is nothing but the cloth/leather currency released by Tughlaq and for which he is being mocked at.
The Capital required is Rs 100 crores even to open a small finance bank. But the Bank can give loan an unlimited amount to any number of clients for any number of years.
Why going at random, If you are the banker who started with just Rs 100 crores and you financed a client Rs 1000 crores - from where that 900 crores came from?
Is it a fraud to claim the assets not belong to you as your own assets or not? But RBI itself gave you permission to do fraud. If a customer of a bank gave cheque of Rs 100 when he had only Rs 90 in his account, He will be punished.But,If a banker did it is not a crime but a service.
My concept of giving free food,health and education comes from correcting the evils of current economic system with the help of vedic economcs.
You Got it?
But the tax system is maintained by BJP, so called great great Sriram party.
Delete@Anonymous1 November 2023 at 04:19
DeleteBut the tax system is maintained by BJP, so called great great Sriram party.
hari.S.babu
BJP didn't Created this tax system.THe System was the handi work of the First Finance Minister.It is the part of Constitution.BJP is just continuing the System.
Why you mention BJP and great Sriram party, Even University professors also doesn't feel the evils of this Debt-Based-Economy.They knew,as they are studying, mastering, teaching and implimenting as adviseries of Central and state Govts. and the Chairmen of RBI.But,they are just passing it on as it is not causing any visual damage - Chalnae doe Baalkishan!
These subjects like economics were tampered by new age universities like Columbia,Oxford etc and were Given to them to study,pass and get a job.
If You ask them these questions I asked you here,They also will be shocked and agree with my conclusions.
You Got it?
ఆంధ్రలో నేమో బీజీపీ తో కలిసి పోటీ చేయాలంట. తెలంగాణాలో నేమో కాంగ్రెస్ కు ఓటు వేయాలని అస్మదీయులకు చెబుతారు. తెలంగాణా లో బీజేపీ వద్దంట.
ReplyDeleteఎక్కడ ఉన్నా ఇదే నీచ రాజకీయం. విశ్వసనీయత నమ్మకం అనుక్షణం పోగొట్టుకుంటారు.
ReplyDeleteటీడీపి తెలంగాణాలో ఎందుకు జండా పీకేసినట్టు? కాంగ్రెస్ కోసమా?
కేసీయార్ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ దెబ్బకి జడిసి ఉండొచ్చు.TDPని తెలంగాణలో ఖాళీ చేయించాలని అనుకోవడమే కేసీయార్ కొంప కొల్లేరయ్యేలా చేసింది.ఆంధ్ర దోపిడీ, చంద్రదోపిదీ అన్న జంటపదాలతో మొదలైన కేసీయార్ వైభవం తను బాబుకి రిటర్న్ గిఫ్ట్ తర్వాత "ఆంధ్ర దోపిడీ,చంద్ర దోపిడీ" అనే జంటపదాల్లో ఏ ఒక్కదాన్నీ వాడటానికి వీల్లేని పరిస్థితి దాపరించింది.
Deleteకేసీయార్ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ దెబ్బకి జడిసి కాక అసలు రంగం నుంచి తప్పుకోవటమే చంద్రబాబు ఇస్తున్న రిటర్న్ గిఫ్ట్ అయ్యే అవకాసం కూడా ఉంది.తన వేలితో తన కన్ను పొడుచుకునే చెత్త ఎత్తుగదని వేసి అది తను వేసిన గొప్ప ఎత్తు వేశానని పొంగిపోతున్న కేసీయార్ని రావణ దుర్యోధనాది శత పిచ్చిమ్యండాకొడుకుల్లో ఎవరితో పోల్చాలో అర్ధం కావదం లేదు నాకు:-)
బాబు గారి మీద పడి ఎందుకు ఏడుస్తూ ఉన్నరో తెలిసింది. బీజేపీ తీర్ధం పుచ్చుకొనుట కారణం అన్నమాట!
ReplyDeleteజాగ్రత్త బాబు, స్నేహ బ్లాక్ ఖాళీ అయింది.
ReplyDeleteజాగ్రత్త హరి బాబు గారూ, బి.జె.పి కి బయట వున్నన్నాల్లు కనీసం హిందువు గానైనా మిగుల్తారు, లోపలికి వెల్లారంటే ఇక మోదీ, షా, గుజ్జు గాల్లకి బానిస గా మిగుల్తారు, వాల్లని సమర్థించలేక సొంత ఆలోచన పోగొట్టుకొని వాట్సప్ యూనివర్సిటీని ఫాలో అవుతూ, ఫేక్ ఏమోషన్స్ తో, గుజ్జు గాల్లకి సాగిలపడుతూ, ఏంటోఆ బ్రతుకు, వెన్నెముక వున్న వాల్లు ఎవరూ భా జ పా లో బ్రతక లేరు , దేశం కోసం ధర్మం కోసం, హాహ్హా హ్హా
ReplyDeleteAnonymous1 November 2023 at 23:05
Deleteజాగ్రత్త హరి బాబు గారూ....లోపలికి వెల్లారంటే ఇక మోదీ, షా, గుజ్జు గాల్లకి బానిస గా మిగుల్తారు.
hari.S.babu
మీకా భయం అక్కర్లేదు.ఎవరికీ బానిసనయ్యే ప్రసక్తి లేదు.నేనసలు "విశ్వతోభద్ర" అని సొంత పార్టీ పెట్టే ఆలోచనలో ఉండి ఫైనాన్స్ కూడా రెడీ చేసుకుని కూర్చుంటే "కొండబద్దలు" చానలూ TOM చానలూ జగన్ ముందస్తు వూపులో ఉన్నాడని వూదర గొట్టేశారు.అంత తక్కువ టైములో ఒక కొత్త పార్టీని ఎన్నికలకి రెడీ చెయ్యడం కష్టమని వెనక్కి తగ్గాల్సి వచ్చింది.తీరా చూస్తే అది "అలా జరిగితే బావుణ్ణు!" అనే వాళ్ళ ఫాంటసీకి "జరిగేస్తుంది!" అన్న రేంజిలో బిల్డప్ ఇచ్చారని అర్ధం అయ్యింది.
దాంతో ఖాళీగా ఉండటం దేనికి,బీజేపీని యాక్టివ్ చేద్దాం అని స్ట్రాటజీని మార్చాను.బీజేపీ వాళ్ళు ఎంత గింజుకున్నా దేశం బయట పోటీ చెయ్యలేరు.కానీ, విశ్వతోభద్ర ప్రపంచంలో ఎక్కడయినా పోటీ చెయ్యగలదు.కెనడాని బీజేపీ కంట్రోల్ చెయ్యగలగడానికి అక్కడి ఇండియన్లకి ఉన్న పొలిటికల్ మైలేజియే కారణం కదా!
ఇప్పటికిప్పుడు కుదిరితే బీజేపీని 110 సీట్లకి లాగటం,లేదంటే తక్కువలో తక్కువ 50 సీట్ల దగ్గిర గానీ 30 సీట్ల దగ్గిర గానీ నిలబెట్టి ప్రధాన ప్రతిపక్షం హోదాలో ఉంచడమే టార్గెట్!
TDP వాళ్ళు వాళ్ళకి వస్తాయనుకున్న 150కి అమరావతి, విశాఖపట్నం లాంటి ముఖ్యమైన ప్రాంతాల్లో అయినా గట్టి దెబ్బ తియ్యగలిగితే చాలు హరిబాబు అనే ఒక హిందూ వోర్టెక్స్ అందరికీ కనపడుతుంది.
జై శ్రీ రామ్!
హ హ. కె ఏ పాల్ కామెడీ లెవెల్లో ఉంది మీ కాన్ఫిడెన్స్. బీజేపీ కి ఒక్క సీటు అయినా వస్తే మీకు సన్మానం చేయవచ్చు.
Deleteఏంటీ కేనడాను బీజీపీ కంట్రోల్ చేస్తుందా. చా.
Anonymous2 November 2023 at 09:25
Deleteఏంటీ కేనడాను బీజీపీ కంట్రోల్ చేస్తుందా. చా.
hari.S.babu
"మా దేశపు సరిహద్దుల్లో తీవరాదాన్ని రెచ్చగొడుతున్నది భారత్!" అని అంత భీకరమైన ఉద్రేకం చూపించిన కెనడా తర్వాత ఎందుకు చల్లబడింది మాస్టారూ!
అక్కడ ఆ సిక్కు తీవ్రవాదాన్ని కెనడియన్ గవర్నమెంటు ప్రోత్సహించడమూ నిజమే.ఆ సిఖ్ఝు తీవ్రవాదిని అంతం చేసింది ఇండియానే అని కూడా అందరికీ తెలుసు.
కంట్రోల్ చెయ్యడం జరిగిపోయిన ఆర్నెల్లకి మీరు "కంట్రోల్ చేస్తుందా. చా." అంటున్నారు.హ హ. కె ఏ పాల్ కామెడీ లెవెల్లో ఉంది మీ ఇగ్నోరెన్స్.గత నాలుగేళ్ళలో లోకల్ బీజేపీలో దూరిన కొందరు జగన్ ఏజెంట్లు పార్టీని నిర్వీర్యం చేశారు.నేను వాళ్ళని ఎక్స్పోజ్ చేశాను,కీలక స్థానాల్లో ఉన్నవాళ్ళు రియలైజ్ అయ్యారు.జగన్ పాలనలోని మొదటి యేడాది లోపు జరిగిన ఆలయాల మీద దాడి బీజేపీకి చాలా వూపు ఇచ్చింది.కానీ,జీవీయల్,"మన మెయిన్ ఎనిమీ జగన్ కాదు,బాబు.జగన్ చేత బాబుని చంపించాలి,ఆ తర్వాతే జగన్ పని పట్టాలి" అన్న పిచ్చ లాజిక్కు చెప్పి జగన్ తరపున పనిచేస్తూ తాము జగన్ని తిట్టకూదదు గనక జగన్ని తిట్టీనట్టు కవరప్ ఇవ్వడానికి అద్దె మైకులా పనికొస్తాదని పవన్ని లాక్కొచ్చి చెత్త చెత్త చేశారు.
ఇప్పుడు ఆ బలహీనతలు లేవు.ఎన్నికల్లో గెలవటానికి కావలసింది పాజిటివ్ స్వింగ్ - అది 4% అయినా వూహించని మ్యాజిక్ చేస్తుంది.ప్రశాంత్ కిశోర్ చేసింది జగన్ దగ్గిర తీసుకున్న డ్వాన్సుతో జగనుకి వుయ్యాల కట్టడమే.బీజేపీకి కావలసింది హిందూత్వ స్వింగ్.అది ఎలా క్రియేట్ చెయ్యాలో నాకు తెలుసు.
జై శ్రీ రామ్!
Excellent fake propaganda
ReplyDeletePlease expand your logic. Why simply tatata and ada ada?Be specific on your statement.
Deleteగోల
ReplyDelete------------
మొలిచిన
విత్తనాలు
పెరిగి చెట్లయి
మట్టిలో కలిశాయి
కట్టిన
కోటలు
నిలిచి రాజ్యాలయి
చరిత్రలో కలిశాయి
లక్షల తరాలు గడిచాయి
అవి
సాక్ష్యాలయి
మట్టిపొరలయి
మన కాళ్ళ క్రింద
కూరుకు పోయాయి
శాశ్వతమైనదేదీ లేదు
మార్చలేని మన గతం తప్ప!
కాలం క్రమేణా మనందరినీ
మట్టిపొరల్లోకి
తొక్కిపారేస్తుందని
తెలిసినా..
ఎందుకో
తోటి జీవిని
తొక్కేసి
'తోపు' అనిపించు కోవాలనే
పిచ్చి 'తపన '
ఖగోళం లోని
చంద్ర గోళం లాంటి
గోళాల
గోల మనకు
ముఖ్యమైపోయింది
బాగుంది కానీ...
పని బంటుల
కూలీ గోల
కట్టుకున్న ఆలి
కన్నీళ్ళ గోల
పుట్టించు కున్న
కన్న ముసిలోళ్ళ గోల
పట్టించు కోవటం
మరవటం ఏల?
జ్ఞానం
విజ్ఞానం
అలా
ఆలోచించదు
అది ఏలా?
నరజాతికి
ఇది మేలా?
డాక్టర్ గాదిరాజు
మధుసూదన రాజు
ఎన్టీఆర్ పౌరాణిక పాత్రలపై లోతైన విశ్లేషణ చక్కగా చేశారు. పురాణ పాత్రలు వక్రీకరించడం, తాను ధరించిన దుష్ట పాత్రలను మహోన్నతులుగా చూపడం గొప్ప వారిని చులకనగా చూడటం, కించపరచడం ఇవన్నీ అతని అనేక సినిమాలలో జరిగాయి. It showed his arrogance and scant regard for epics. Being a good actor he should not have done such things. In the name of creative liberty one should not misrepresent facts.
ReplyDelete