Monday 9 October 2023

కణాద మహర్షిని కాపీ కొట్టి గొప్పోడైన ఐజాక్ న్యూటన్ దొంగ బతుకు చూడండి!

ఐసాక్ న్యూటన్ (1643-1727 CE) గురుత్వాకర్షణను మూడు చలన నియమాలతో పాటు నమోదు చేసినట్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు తమ సైన్స్ పాఠ్య పుస్తకాలలో చదువుతున్నారు.కానీ కణా మహర్షి (600 BCE) మొట్టమొదట దానిని తన గణిత శాస్త్ర గ్రంథం వైశేషిక దర్శనంలో తెలివితక్కువ న్యూటన్ కంటే ఎక్కువ స్పష్టతతో డాక్యుమెంట్ చేశారు.

కణాద మహర్షి కానీ ఐజాక్ న్యూటన్ కానీ  నియమాలను రూపొందించి పాటించమని విశ్వానికి ఇవ్వలేదు.ప్రకృతిని పరిశీలించి పరిశోధించి తెలుసుకుని మనకి చెప్పటమే తప్ప ఎవరూ ప్రాకృతిక నియమాలను తయారు చెయ్యలేరు.అయితే,తను చెప్పినది చెప్పినట్టు నమ్మి పారెయ్యమని అనకూడదు.తను చెప్పినది సత్యం అని ఇతరులు ఒప్పుకోవటానికి తగిన సాక్ష్యాలను చూపించి ఒప్పుకోవలసిన వాళ్ళు పరీక్షించి చూసుకోవటానికి అవసరమైన ప్రయోగం చెయ్యడం గానీ విశ్లేషణ చెయ్యడం గానీ తప్పనిసరి.

న్యూటన్ విశ్లేషించి చెప్పిన "గురుత్వాకర్షణ" అనేది అంతకు ముందర ఎవరికీ తెలియని కొత్త విషయం కాదు. పదాన్ని గానీ  సిధ్ధాంతాన్ని పూర్తి రూపంలో గానీ ప్రస్తావించిన వ్యక్తుల కాలావధులు ఇలా ఉన్నాయి - మహర్షి కణాదుడు(600 BCE),అరిస్టాటిల్(300 BCE),వరాహ మిహిరుడు(600 CE),బ్రహ్మగుప్తుడు(600 CE),అల్ బెరుని(1000 CE,)గెలీలియో(1600 CE),జొహాన్స్ కెప్లర్(1600 CE),న్యూటన్(1700 CE).అయితే, 2,200 వెనకటి కణాద మహర్షి కన్న సూత్రీకరణలను సాధించడంలో గానీ వాటిని విశ్లేషించి చెప్పడంలో గానీ శాస్త్రీయమైన తర్కాన్ని ఉపయోగించి గణిత శాస్త్ర సంబంధమైన ప్రమాణాలను  ఇవ్వడంలో గానీ అధికమైన ప్రజ్ఞ చూపించాల్సిన ఐజాక్ న్యూటన్ శాస్త్రీయత లేని సొల్లు కబుర్లు చెప్పాడు.

వైదిక శాస్త్రాలలోని "అవ్యక్తం" అనేదాన్ని "ఈధర్(aether)" పేరున గోల్ మాల్ గుమాయించాలని చూసి ప్రశ్నలు ఎక్కువయ్యేసరికి జవాబులు చెప్పలేక "ఈధర్ లేదూ గీధర్ లేదు  - అదో ఉత్తుత్తి సుత్తి,తెలీదు,గుర్తులేదు.మర్చిపోయా!" అనేసి పరువు దక్కించుకున్నాడు.ఇక laws of motion పేరున చెప్పిన మూడు సూత్రాలనీ మహర్షి కణాదుడు అవే సూత్రాలను గురించి చెప్పిన సూత్రాలనీ ఒకచోటకి చేర్చి చూస్తే కణాదుడు సంస్కృతంలో చెప్పిన సూత్రాల్ని ఇంగ్లీషులోకి అనువదించటం తప్ప న్యూటన్ ఇంకేమీ చెయ్యలేదని తెలుస్తుంది.

 

మహర్షి కణాదుల వారు తన వైశేషిక దర్శనంలో  విశ్వంలోని అంశీభూతమైన అస్తిత్వాలలో ప్రతి ఒక్కదానిని నిర్వచించారు:

प्र्धिव्यापस्तेजो वायुराकाशम्

गिगात्मा मान् इति द्रव्याणि - २।२।५(2/2/5)

కనాద మహర్షి చెప్పిన దాని ప్రకారం సకల చరాచర సృష్టి యొక్క నిర్మాణం Aatma(స్వయం),Manas(మనస్సు), kaala(సమయం), dik(అంతరిక్షం), pridhvi(భూమి), apas(నీరు), tejas(అగ్ని), vaayu(గాలి), Aaakaasha(డార్క్ మేటర్) అనే తొమ్మిది మూలకాలతో రూపొందించబడింది.పదవ మూలకం Intellect(బుద్ధి)  అంశాలన్నింటినీ నియంత్రిస్తుంది.

 

అసలు చలన నియమాలను ప్రతిపాదించటానికి ముందే చలనం ఎన్ని రకాల నడుస్తుందో చెప్పారు.

उत्क्शेपन मवक्शेपणमाक्र्च्छनम् पर्सारणम्

गमन मिति कर्माणि - २।२।७(2/2/7)

उत्क्षेपनं(Utkshepanam) = Upward Movement

अवक्षेपनं (Avakshepanam) = Downward Movement

आकुञ्चनं (Aaakunchanam) = Contraction

प्रसारणं (PrasaaraNam) = Expansion

गमनं (Gamanam) = Horizontal Movement

ప్రకృతిలో ఒక నియమం ఉంది, ప్రకృతి  నియమ ప్రకారం నడుస్తున్నది అని చెప్పడానికి ముందే  అవగాహన తనకు ఎలా కలిగింది అని చెప్పే పూర్వరంగం గురించి చెప్పాలి.ఒక విశేషం ఏమిటంటే ఆధునిక కాలంలోని భౌతిక శాస్త్రవేత్తలు సైతం ఆరవ రకపు చలనాన్ని గురించి చెప్పలేదు.

 

ఇప్పుడు మహర్షి కణాదుల వారు ఆలు విషయంలోకి వెళ్తున్నారు.

सम्योग विभाग वेगानाम् कर्म समानम् - २।२।२०(2/2/20)

If two bodies are collide or move away, the cause is common which is Karma(Force).

రెండు వస్తువులు ఒకదానినొకట్టి ఢీ కొట్టినప్పుడు గానీ ఒకదానినుంచి మరోక్టి దూరం జరిగినప్పుడు గానీ రెండింటికీ ఒకే రకమైన మూలకారణం కర్మప్రసారణం అవుతుంది.

 द्रव्याणाम् कर्म - २।२।२२(2/2/22)

The Karma(Force) cannot come from the bodies,it has to be external.

కర్మ వస్తువుల యొక్క సహజ స్వభావం కాదు,అది వస్తువుకు బయట నుంచి వస్తువును కదిలిస్తుంది.

ఇప్పుడు కణాదుల వారు మరొక సత్యాన్ని ప్రతిపాదిస్తున్నారు.

गुरुत्व प्रयत्न सम्योगानाम् उत्क्शेपणम् - २।२।२६(2/2/26)

गुरुत्व (Gurutva) = Gravitational Force

प्रयत्न (prayatna) = External Upward Force

सम्योगानाम् (Samyogaanaam) = with the Combination of

उत्क्शेपणम् (Utkshepanam) = Upward Movement( will occur)

According to Maharshi Kanaada Upward Movement is the result of two forces.

 

న్యూటన్ ప్రకారం అయితే, గురుత్వాకర్షణ అనేది పెద్ద వస్తువు తనకన్న చిన్న వస్తువును తనవైపుకు లాక్కునే pull అయితే మహర్షి కణాదుల వారి ప్రకారం వస్తువుల చలనాలకి కారణమైన బాహ్యశక్తి చిన్న వస్తువును తనకన్న పెద్ద వస్తువు వైపుకు తోస్తున్న push అవుతుంది.

ఇడియట్ ఐసాక్ న్యూటన్ తన 1 చలన నియమాన్ని ఎక్కడ నుండి కాపీ చేసాడో చెప్పలేదు గాబట్టి "An object at rest will stay at rest,and an object in motion will stay in motion unless acted on by a net external force(నిశ్చలంగా ఉన్న వస్తువు విశ్రాంతిగా ఉంటుంది, మరియు చలనంలో ఉన్న వస్తువు నికర బాహ్య శక్తితో పని చేస్తే తప్ప చలనంలో ఉంటుంది)" అనేది "सम्योग विभाग वेगानाम् कर्म समानम्" అని కణాదుల వారు చెప్పిన దానికి ముతక అనువాదం అని ఇప్పటి వరకు తెలియలేదు ఎవరికీ.ముతక అనువాదమే, నిజానికి external force అనేది దానంతటది పని చెయ్యదు.ఎవరో ఒకరు సంకల్పించి ప్రయత్నించితే తప్ప చలనం సాధ్యపడేది కాదు.conscious external force అనే పదం వాడితే  నియమానికి ఖచ్చితత్వం వచ్చేది.కణాదుల వారు force అని న్యూటన్ వర్ణించిన అస్తిత్వానికి कर्म అని వాడి  దోషాన్ని తొలగించారు.ప్రతి కర్మకూ ఒక కర్త ఉండి తీరాలనేది అనుకోకుండానే స్ఫురిస్తుంది.

 

ఇప్పుడు మహర్షి కణాదుల వారు కొలతలూ లేక పరిమాణాలను గురించిన సూత్రాన్ని చెప్తున్నారు.

प्रयत्न विषेशान्नोदन विशेष: - //(4/2/6)

According to Maahrshi Kanaada "Particular effort result in particular Impulse"

మహర్షి కణాదుల వారి ప్రకారం "ప్రత్యేకమైన కృషికి ప్రత్యేక ప్రేరణ వస్తుంది." అంటే, ఎంత శక్తికి అంత కర్మ జరుగుతుంది అని అర్ధం.

 

ఇప్పుడు, ఆధునిక శాస్త్రీయ గ్రంథాలలో  భావన ఎట్లా ఉన్నదో చూడండి..ఇడియట్ ఐసాక్ న్యూటన్ తాను 2 చలన నియమాన్ని ఎక్కడ నుండి కాపీ చేసాడో చెప్పలేదు గాబట్టి "The rate of chnage of momentum of a body is directly proportional to the force applied(వస్తువు యొక్క ద్రవయవేగం లోని మార్పు వస్తువు పైన ప్రయోగించిన శక్తికి నేరుగా అనులోమానుపాతంలో ఉంటుంది)" అనేది "प्रयत्न विषेशान्नोदन विशेष:" అని కణాదుల వారు చెప్పిన దానికి ముతక అనువాదం అని ఇప్పటి వరకు తెలియలేదు ఎవరికీ.

ఇప్పుడు మహర్షి కణాదుల వారు ఇప్పటికీ ఆధునిక బహుతిక శాస్త్రవేత్తలను గందరగోళానికి గురి చేస్తున్న మరొక సత్యాన్ని ఎటువంటి గందరగోళమూ లేని సరళమైన రీతిలో కుండబద్దలు కొట్టి చెప్పేస్తున్నారు.

 

कार्य विरोधि कर्म - //२४(2/2/24)

According to Maharshi Kanaada,The effect(Kaarya) always opposes the Action(Karma).

మహర్షి కణాదుల వారి ప్రకారం ప్రభావం/ఫలితం (కార్య) ఎల్లప్పుడూ చర్యను (కర్మ) వ్యతిరేకిస్తుంది.చలనం సంకల్పం వల్ల జరుగుతుంది కాబట్టి తనకు అవసరమైన ఫలితం వచ్చాక ఇక శక్తిని ప్రయోగించదు కాబట్టి కర్మ లేక చలనం రద్దయిపోతుంది.ఎంత స్పష్టత ఉంది ఇక్కడ!

ఇప్పుడు, ఆధునిక శాస్త్రీయ గ్రంథాలలో  భావన ఎట్లా ఉన్నదో చూడండి..ఇడియట్ ఐసాక్ న్యూటన్ తాను 3వ చలన నియమాన్ని ఎక్కడ నుండి కాపీ చేసాడో చెప్పలేదు గాబట్టి "Every action has equal and opposite reaction(ప్రతి చర్యకు సమానమైన మరియు వ్యతిరేక ప్రతిచర్య ఉంటుంది)" అనేది कार्य विरोधि कर्म అని కణాదుల వారు చెప్పిన దానికి ముతక అనువాదం అని ఇప్పటి వరకు తెలియలేదు ఎవరికీ. "చర్య" అనేది ప్రకృతిలో ఉనికి లేనిది.ఉనికిలో లేనిదాన్ని ఉంటుందని చెప్పటమే తప్పు,పైన లేని పిండితో తినలేని పూరీలి చేసినట్టు దానికి "ప్రతిచర్య" అనేదాన్ని కలిపి సాక్ష్యం దొరకని రెండు అస్తిత్వాల్ని పట్టుకుని  ఉన్నాయని బల్ల గుద్ది చెప్పాడు ఎంత రౌడీ తనం?

ఇతను మొదటి సూత్రాన్ని సమర్ధించటానికి అతికించిన "జడత్వం" కూడా అతని సొంత మాట కాదు.15 శతాబ్దం నాటి గెలీలియో గెలీలి చెప్పిన సొల్లునే తిరిగి చెప్పటం తప్ప సొంత విశ్లేషణ చెయ్యలేదు.జడత్వం పేరున వస్తువులకి ఇతను అంటగట్టిన "బాహ్యశక్తిని వ్యతిరేకించి శక్తి ప్రసరణకి ముందరి స్థితిలో కొనసాగటం" అనే లక్షణాన్ని ప్రదర్శించటం స్వస్వరూపజ్ఞానం లేని నిర్జీవులకి సాధ్యమా?

బాహ్యశక్తిని వ్యతిరేకించాలంటే మొదట తన మీద బాహ్యశక్తి పని చేస్తున్నదని  వస్తువుకి తెలియాలి.బాహ్యశక్తి తనమీద పని చెయ్యటానికి ముందర తను ఉన్న స్థితి జ్ఞాపకం ఉండాలి.పూర్వ స్థితిని చేరుకోవాలంటే  దిశలో ఎంత స్థాయిలో అంతరశక్తిని తను ప్రయోగించాలి అన్న లెక్కలు తెలియాలి.

 

ఎంత గందరగోళం ఉంది ఇక్కడ!

No comments:

Post a Comment

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

శ్రమ దోపిడీ గురించి ముప్పాళ రంగనాయకమ్మ గారి లోతైన పరిశీలన బెత్తెడు లోతు కూడా లేదేంటీ!

ఎలక్టొరల్   బాండ్స్   గురించి   మార్చి  31 న  " సుప్రీం   కోర్టు   తీర్పు   సంస్కరణేనా ?" అని   లోక్   సత్తా   జయప్రకాశ్   ఒక   వ్...