Monday, 3 July 2023

ఉమ్మడి పౌర స్మృతి(Uniform Civil Code) అనేది ఆచరణ సాధ్యం కాని ఒక తెలివితక్కువ ప్రతిపాదన!

అసలు ఉమ్మడి పౌర స్మృతి యొక్క స్వరూపం ఎలా ఉంటుందో రేఖామాత్రమైన పరిచయం కూదా చెయ్యని స్థితిలో జనాభిప్రాయసేకరణ ఎలా చేస్తారు?అంటే, ఉమ్మడి పౌర స్మృతిని చట్టం చెయ్యాలా వద్దా అనే ఏకవాక్య ప్రశ్నకి జవాబులు రాబట్టడం అయి ఉంటుంది,అంతేనా!

అంత మాత్రమే అయితే దానికి అది సరైన పధ్ధతి కాదు.బీజేపీ నాయకులు సభలో బిల్లు రూపంలో ప్రవేశ పెట్టినప్పుడు ఎలానూ చర్చ జరుగుతుంది.బిల్లుని సబహ్లో ప్రవేశపెట్టినప్పుడు సభ్యులు ఎవరి వాదనల్ని వారు వినిపిస్తారు.మెజారిటీ సభ్యులు అనుకూలం అయితే బిల్లు వీగిపోతుంది.మెజారిటీ సభ్యులు ప్రతికూలం అయితే బిల్లు చట్టం అవుతుంది.మరి,సభలో పెట్టే బిల్లు ఎలా ఉంటుందో తెలియని ప్రజలు చర్చ ఎలా చేస్తారు?కాబట్టి,ప్రజాభిప్రాయ సేకరణకి కూడా ఉమ్మడి పౌర స్మృతి యొక్క స్వరూపం ప్రజలకి తెలియాలి.

సమాజంలోకి వ్యక్తి యొక్క సాధికారికమైన ప్రవేశమూ రాజ్యాంగ వ్యవస్థతో వ్యక్తి యొక్క ప్రతక్ష సంబంధమూ పెళ్ళితోనే మొదలవుతుంది.ఫలానా సుబ్బారావు అనే పురుషుడు సుబ్బాయమ్మ అనే మహిళని పెళ్ళి చేసుకుని సొంత ఇంటికి తరలి వెళ్ళే సన్నివేశం వరకు అతను ఫలాన రంగారావు గారి కుమారుడు అనే గుర్తింపుతోనే ఉంటాడు. సుబ్బాయమ్మ అనే మహిళ కూడా ఫలానా కృష్ణారావు గారి కూతురు అనే గుర్తింపుతోనే ఉంటుంది.కానీ, పెళ్ళి అనేది మాత్రం వారి వారి మతాచారాల ప్రకారమే జరుగుతుంది.

ఎవర్ని పెళ్ళి చేసుకోవాలి,ఎవర్ని పెళ్ళి చేసుకోకూడదు అనే నిబంధనలతో పాటు కుటుంబ సభ్యుల మధ్యన ఆస్తుల పంపకాలు ఎలా జరగాలి,వారసత్వాలు ఎవరికి సంక్రమించాలి అనే నియమాల్ని కూడా మతసాహిత్యమే నిర్దేశిస్తున్నది.అలాంటప్పుడు వివాహ చట్టాల్ని మతరహితం చెయ్యనిదే ఉమ్మడి పౌర స్మృతిని నిర్మించడమే కుదరదు.వివాహ చట్టాల్ని మతరహితం చెయ్యడం లౌకికత్వాన్ని పాటించే ప్రభుత్వాలు చెయ్యకూడదు.ఎందుకంటే,లౌకిక రాజ్యాంగ వ్యవస్థలో ప్రభుత్వం ప్రజలతో పన్నుల వ్యవస్థ ద్వారా మాత్రమే అనుసంధానమై ఉండి డబ్బుతో ముడిపడిన వ్యవహారాలలో పరిమిత స్థాయిలో తన ఆధికారాన్ని ప్రదర్శుంచాలి తప్ప ఇతర వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు.వివాహ చట్టాల్ని మతరహితం చెయ్యడానికి హిందువుకు కూడా ఒప్పుకోరు కదా - మరి,బీజేపీ నాయకులు ధైర్యంతో ఉమ్మడి పౌర స్మృతిని అమలు చెయ్యగలమని అనుకుంటున్నారు?

జాతీయ స్థాయిలోనూ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీ తప్ప అన్ని పార్టీలూ వచ్చే ఎన్నికలలో గెలిచి అధికారంలోకి రావటానికి సర్వసక్తులూ ఒడ్డి పోరాడుతున్నాయి.ఎన్నికలు చాలా దగ్గరికి వచ్చేసి బీజేపీని ఇరుకున పెట్టటానికి చిన్న అవకాశం దొరికినా వదలకుండా ఉపయోగించుకుంటూ కాంగ్రెసు నానాటికీ బలపడుతున్న సమయంలో తనకే క్లారిటీ లేని ఉమ్మడి పౌరస్మృతిని గురించి బీజేపీ ఎందుకు పట్టుబడుతున్నది?తెలంగాణ ఇస్తే నష్టపోతామని తెలిసి కూడా ఇచ్చి పదేళ్ళ పాటు నష్టపోయిన కాంగ్రెసును ఇమిటేట్ చేస్తూ తప్పుడు వ్యూహలను అమలు చెయ్యడం అవసరమా - అధ్యక్షా!

నిన్నటి వరకు అధికారం ఖాయం అన్న నమ్మకాన్ని కలిగించిన తెలంగాణలో కుమ్ములాటలూ నాయకత్వ మార్పు గాలి కబుర్లూ మొదలయ్యాయి.ఆంధ్రలో ఇప్పుడున్న లేకి వీర్రాజుని మార్చి బేకి సోమరాజుని తెస్తారనే గాలికబుర్లు మొదలయ్యాయి - దొంగ జగ్గడి బంటుని అప్రూవర్ కింద మార్చి కేసీయారుతోనూ దొంగ జగ్గడితోనూ రాజీ పడిపోయారన్న అప్రదిష్ట నుంచి ఎలా బయటపడగలరో తెలియడం లేదు.తొక్కి నార తీసేందుకు ఉన్న అన్ని అవకాశాల్నీ చేతులార జారవిడిచేసి కూసిన్ని రాజ్యసభ సీట్లకోసం అని అభిమానులకి చెవుల్లో పువ్వులు పెడుతూ అవినీతిపరులతో దోస్తీ చెయ్యడం ఏంటో అభిమానుల్లో కాస్తో కూస్తో కామన్ సెన్సు ఉన్న వాడెవడికీ అర్ధమే కావడం లేదు.

ఇన్ని తలనెప్పుల్ని కోరి తెచ్చుకుని కూడా ఇంకా మేము చాణక్యుడి అంతటివాళ్ళం,మా వ్యూహాలు మాకుంటాయి అంటూ కొత్త తలనెప్పుల్ని నెత్తికి తెచ్చుకుంటుంటే - కొండవలసలా "అయితే ఓకే!" అనేసి వాళ్ళ ఖర్మకి వాళ్లని వదిలెయ్యడం తప్ప మనబోటివాళ్ళం చెయ్యగలిగింది లేదు.ఆంధ్రా పిచ్చమంద ఆల్రెడీ కూస్తూనే ఉన్నారు కదా - "మాకిప్పుడప్పుడే అధికారంలోకి రావాలన్లేదు,కొన్నాళ్ళు పోయాక మాకు రావాలనిపిస్తేనే వస్తాం" అని.మనం కూడా ఇప్పుడప్పుడే వాళ్ళకి వోటు వెయ్యకుండా వేరే పార్టీలకి ఓటేస్తే సరిపోతుంది,ఏమంటారు?

వాళ్ళు మళ్ళీ గెలవాలనుకుంటున్నారో లేదో ఎన్నికల్లో గెలుపు కోసం ఏ వ్యూహాలు పాటిస్తారో ఇప్పుడు అనవసరం గానీ ఉమ్మడి పౌర స్మృతిని గురించి ప్రజాభిప్రాయసేకరణ అనేది ఉమ్మడి పౌర స్మృతి యొక్క స్థూలరూపం ఎలా ఉంటుందో చెప్పాక జరిగితే సత్ఫలితం వస్తుంది గానీ ఫలానా చట్టం యొక్క రూపు రేఖలు ఎలా ఉంటాయో తెలియని దద్దమ్మల్ని "ఫలానా చట్టం చెయ్యనా వద్దా" అని అడగటం దద్దమ్మలు తప్ప మేధావులు చెయ్యరు.

జై శ్రీ రాం! 

No comments:

Post a Comment

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...