తను పుట్టిన సంస్కృతిలో తన కన్న ముందు పుట్టి పెరిగి జీవించిన వ్యక్తులలో తను చేరాలనుకున్న లక్ష్యాన్ని చేరుకున్న గౌరవనీయులతో అనుబంధాన్ని పేంచుకోవడమే భక్తి అవుతుంది.ఎవరి పట్ల భక్తిని ప్రదర్శించాలి అనేది బయటి వ్యక్తులు చెప్పకూడదు.తన లక్ష్యం మీద శ్రధ్ధ పెరగడం కోసం ఎవరి పట్ల భక్తిని ప్రదర్శించాలో ఎవరికి వారు తమ స్వంత బుధ్ధితో నిర్ణయించుకోవాలి. కంటికి కనిపిస్తున్న వారిలో అతి దగ్గరి వ్యక్తులు తల్లి, తండ్రి, గురువు, అన్న వంటి వారి పట్ల భక్తిని ప్రదర్శించడం అత్యుత్తమమైనది, అత్యంత సులభమైనది కూడా.
నవవిధ భక్తులు
--------------------
01.శ్రవణం(వారు మాట్లాడుతున్నప్పుడు అడ్డు ప్రశ్నలు వెయ్యక చెప్పినది చెప్పినట్టు విని జ్ఞాపకం ఉంచుకోగలగడం)
02.కీర్తనం
03.స్మరణం
04.పాదసేవనం
05.అర్చనం(మ్రుగ్గు,సుగంధము,అక్షతలు,పుష్పము,ధూపము,దీపము,ఉపహారము,తాంబూలము అన్న ఎనిమిది విధాల సేవలతో విగ్రహాన్ని గానీ వ్యక్తిని గానీ పవిత్రమైన వస్తువును గానీ పూజించటం)
06.వందనం(పాదౌ స్పృష్ట్వా గోత్రనామపూర్వక నమస్కారం,అభివాదం,వందనం,స్తుతి)
07.దాస్యం(సేవ,పని)
08.సఖ్యం(స్నేహం)
09.ఆత్మనివేదనం(ఆవేదనం లేక విజ్ఞాపనం,సమర్పణం)
ఈ నవవిధ భక్తి మార్గాలలో సత్యం పలకటం అనే లక్ష్యం లేదు.భక్తిని ప్రదర్శించేది సత్యవర్తనుల మీద అయినప్పుడు మాత్రమే అది దోష రహితమైన సద్భక్తి అవుతుంది.అయితే,సత్యాసత్యాలను బట్టి గాక ఇతరులు చెప్పడం వల్ల ప్రదర్శించే భక్తిలో దోషం ఉండే అవకాశం ఉంది.కాబట్టి సాధకుడు ఎవరి పట్ల ఎంత మేర భక్తిని ప్రదర్శించాలి అనే ఎంపిక విషయంలో ముందే జాగ్రత్త పడాలి.
అష్టాంగ యోగం యొక్క ఎనిమిది అవయవాలు
----------------------------------
01. యమ (సూత్రాలు లేదా నైతిక నియమావళి)
a. అహింస(దుష్కర్మలను చేసేవాళ్ళని శిక్షించడం కూడా అహింసయే అవుతుంది)
b. సత్యవాదిత్వం - సత్యం యొక్క సూత్రం(సర్వహితమైన అసత్యం కూడా సత్యమే అవుతుంది)
c. అస్తేయ - దొంగతనం చేయని సూత్రం
d. బ్రహ్మచర్యం - నిర్బంధం / బ్రహ్మచర్యం
e. అపరిగ్రహ - నిల్వ చేయని లేదా స్వాధీనత లేని సూత్రం
02.నియమా (వ్యక్తిగత విభాగాలు)
a. శౌచ - స్వచ్ఛత(బాహ్యాంతరం)
b. సంతోషం - సంతృప్తి(ద్వంద్వాతీతమైన సదాసంతృప్తత)
c. తపస్సు - ఓర్పు(యమ నియమాలను అనుసరించడంలో తపన పొందాలి)
d. స్వాధ్యాయ - స్వీయ అధ్యయనం(తనకు మేలును కలిగించే మంచి విషయాల్ని తెలుసుకోవటం)
e. ఈశ్వర సాన్నిధ్యం - అంకితం(మన లోపాల్ని తొలగించుకుంటూ ఈశ్వరుని సుగుణాలను మనలోనికి ఆహ్వానిస్తూ ఈశ్వరునితో అనుబంధాన్ని ఏర్పరచుకోవటం)
03. ఆసనం (యోగ స్థానాలు లేదా యోగ భంగిమలు)
మానసిక సమతుల్యతను సాధించడంలో సహాయపడే స్థిరమైన మరియు సౌకర్యవంతమైన భంగిమలను ప్రయత్నించి అనుభవం సంపాదించడం.
04. ప్రాణాయామం (యోగ శ్వాస)
పొడిగింపు మరియు శ్వాస నియంత్రణ.
05. ప్రత్యాహార (ఇంద్రియాల ఉపసంహరణ)
మనస్సు యొక్క శక్తిని పెంచడానికి ఒక మానసిక సంసిధ్ధత.
06. ధారణ (వస్తువుపై ఏకాగ్రత)
ఒక వస్తువు మరియు దాని క్షేత్రంపై మనస్సు యొక్క ఏకాగ్రత.
07. ధ్యానం
అన్ని బాహ్య వస్తువుల నుండి మనస్సును మళ్ళించి దానిని ఒక లక్ష్యం మీద కేంద్రీకరించడం.
08. సమాధి (మోక్షం)
జీవాత్మ మరియు పరమాత్మ మధ్య ఐక్యత. సహస్రార చక్రంలో (తల పైభాగం) శివుడు మరియు శక్తి కలయిక.భగవంతుని సాక్షాత్కారాన్ని గ్రహించడం అనేది మానవ జన్మ యొక్క అంతిమ సాధన.సమాధి స్థితిని అందుకోవడం అంటే జీవన క్రియలను అతి తక్కువ స్థాయికి తగ్గించి కూడా ఏమాత్రం బాధను అనుభవించని స్థితిలోకి మనస్సు ప్రవేశించడం.సన్యాసం అంతే తనకు ఆసక్తి లేనిదానిని స్వీకరించకపోవడం అన్న నియమం ప్రకారం బాధ లేని చావు కోసం సమాధి స్థితిని చేరుకోవడం అత్యనత ముఖ్యమైనది.అయితే, సమాధి స్థితిలో ప్రాణోత్క్రమణ చెయ్యగలగడాన్ని సాధించిన వెంటనే సీమోల్లంఘనం చెయ్యాలని నియమం లేదు.
పూర్వం ఖట్వాంగు డనే రాజు భూమండలంలోని సప్తద్వీపాలనూ పరిపాలిస్తూ ఉండేవాడు. ఇంద్రాదిదేవతలు యుద్ధంలో భీకరులైన రాక్షసుల చేతుల్లో ఓడిపోయి, ఆయన దగ్గరకు వచ్చి తమకు సాయపడమని ప్రార్థించారు. ఆయన భూలోకం నుంచి స్వర్గలోకానికి వెళ్లి దానవరాజుల నందరినీ సంహరించాడు. అప్పుడు దేవతలు సంతోషించి ఖట్వాంగుణ్ణి వరం కోరుకోమన్నారు. “నేనెంత కాలం బ్రతుకుతానో చెప్పండి. ఇదే నేను కోరే వరం, మరో వరం నా కక్కరలే” దన్నాడు ఆ మహానుభావుడు. “నీకు ఆయువు ఇక ఒక ముహూర్తకాలమే ఉంది.” అని వేల్పు లన్నారు. వెంటనే ఆ భూపాలుడు విమాన మెక్కి భూలోకానికి వచ్చాడు.
అలా వచ్చిన ఖట్వాంగ మహారాజు ప్రగాఢమైన వైరాగ్యంతో పర్వతాలవంటి ఏనుగులను, గుఱ్ఱాలను, ప్రాణప్రియాలైన సుందరాంగులను, సన్నిహితులను, హితులను, పండితశ్రేష్ఠులను పరిత్యజించాడు.ముక్తసంగుడైన ఖట్వాంగుడు, పూర్వం, గోవిందనామ సంకీర్తనం చేసి భయరహితుడై రెండు గడియల్లోనే చక్కగా మోక్షం పొందాడు.ఖట్వాంగ మహారాజు యవ్వన కాలంలోనే సమాధి స్థితిలో ప్రాణోత్క్రమణ చెయ్యగలగడాన్ని సాధించి ఉన్నాడు గనకనే అంత తక్కువ సమయంలో బాధ లేని చావును పొందగలిగాడు.నవవిధ భక్తులలో ఇలాంటి ప్రయత్నం ఏదీ లేదు గనక భక్తిమార్గం కన్న యోగమార్గమే ఉన్నతమైనది.
జై శ్రీ రాం!
No comments:
Post a Comment
సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు