Thursday, 15 September 2022

హరి ఓం హరి!హరి ఓం హరి!హరి ఓం హరీ!

 పల్లవి:హరి ఓం హరి!హరి ఓం హరి!హరి ఓం హరీ!

01.చరణం:నువ్వు నిజం,నేను నిజం,విశ్వం నిజం,

నిన్న నిజం,నేడు నిజం,రేపు నిజం,

ఆది నిజం,మధ్య నిజం,అంతం నిజం,

ప్రకృతీ నిజం,పురుషుడూ నిజం - హవామహే!

||పల్లవి||

02.చరణం:సృష్టి నిజం,వ్యక్తి నిజం,వ్యష్ఠి నిజం,

కాంక్ష నిజం,వాంఛ నిజం,బాధ నిజం,

కామన నిజం,వాదన నిజం,వేదన నిజం,

వ్యామోహమూ నిజం,వైరాగ్యమూ నిజం - ఋతాయంతే!

||పల్లవి||

03.చరణం:ఏదీ మాయ కాదు,ఏదీ ఉచితం కాదు,

నిన్న లేనిది నేడు రాదు,నేడు లేనిది రేపు రాదు,

ప్రయత్నం నిజం,ఫలితం నిజం,ఐశ్వర్యం నిజం,

కర్తృత్వమూ నిజం,భోక్తవ్యమూ నిజం - విరాజంతే!

||పల్లవి||

04.చరణం:అగ్ని నిజం,హోత నిజం,క్రతువు నిజం,మిత్రుడు నిజం,

కవిత నిజం,భవిత నిజం,మహిత నిజం,వరుణుడు నిజం,

అన్నం నిజం,ప్రాణం నిజం,ఇంద్రియాలు నిజం,మనోబుధ్ధులు నిజం,

వేదమే శివం,శివమే వేదం,శివ మచ్యుతం - బ్రహ్మణస్పతే!

||పల్లవి||

05.చరణం:రాగం నిజం,ద్వేషం నిజం,పక్షపాతం నిజం,

యుధ్ధం నిజం,కవచం నిజం,శస్త్రం నిజం,స్వపక్ష రక్షణ నిజం,

లాభం నిజం,నష్టం నిజం,శత్రువు నిజం,విపక్ష నిధన నిజం,

హింస నిజం,సంధి నిజం,రక్తపాతం నిజం,నిగ్రహం నిజం - సమాయుషే!

||పల్లవి||

06.చరణం:బ్రాహ్మ్యం నిజం,క్షాత్రం నిజం,వైశ్యం నిజం,

శూద్రం నిజం,పంచమం నిజం,తారతమ్యం నిజం,

ఉన్మత్తత నిజం,అధికారం నిజం,చరిత్ర నిజం,

అణచివేతా నిజం,తిరుగుబాటూ నిజం - సంభవామి యుగే యుగే!

||పల్లవి||

No comments:

Post a Comment

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

"వేదాలు చదివిన వారు యజ్ఞయాగాదు లందు పశువులను వధిస్తారు" - ఇది నిజమా?

hari.S.babu: గురువు గారూ ! మహాభారతంలో ధర్మవ్యాధుని కధ వస్తుంది కదా . అక్కడ ధర్మవ్యాధుడు కౌశికుడికి ధర్మబోధ చేస్తూ ఒకచోట ," ...