Monday, 26 April 2021

గౌతమ బుద్ధుడు కూడా కల్పిత పాత్రయేనా?ఎవరు ఎందుకు ఎలా కల్పించారు!

కొన్ని విషయాలు తెలిసినప్పుడు మొదట నమ్మలేం!అసలు అలా జరగడానికి వీల్లేదనిపిస్తుంది,జరిగిందనేది తలలోకి ఎక్కడానికి చాలా సమయం తీసుకుంటుంది.దాంతో, కొంత సమయం గడిచాక వేరే సమస్యలు వచ్చి అవి గనక పరిష్కారం అవుతూ ఉంటే క్రమంలో ఒక్కొక్క విజయం కొంత కొంత ఆనందాన్ని ఇస్తుంటే మళ్ళీ పాత రొంపిని ఎత్తుకుని పరిశోధించడానికి విసుగు పుడుతుంది.అయితే వేరొక సందేహం ఇబ్బంది పెడుతూ ఇతరాల కోసం వెతుకుతుంటే పాత విషయానికి సంబంధించిన కొత్త ఆధారాలు కనిపించి అప్పటివరకు ఆవరించి ఉన్న తమస్సును భళ్ళున బద్దలు కొట్టుకుంటూ సత్యం వేయి రేకల పద్మంలా వికసించినప్పుడు కలిగే ఆనందం వర్ణనాతీతమైనది!

ఇవ్వాళ మాటిమాటికీ "ప్రియం బ్రూయాత్ సత్యం బ్రూయాత్, బ్రూయాత్ సత్యమప్రియం,ప్రియం నానృతం బ్రూయాత్ - ఏష ధర్మః సనాతనః" శ్లోకాన్ని పదే పదే ఉదహరిస్తుండటం కొందరికి చాదస్తం అనిపించవచ్చు.కానీ మంత్రం తెలియని చాలా కాలం ముందునుంచీ, యదార్ధం చెప్పాలంటే చిన్నప్పటినుంచీ అబద్ధాలు చెప్పడాన్ని అసహ్యించుకునేవాణ్ణి.అంతే కాదు ట్రెజర్ హంట్, గోల్డ్ రష్, మెకన్నాస్ గోల్డ్ లాంటి కధల్నీ సినిమాల్నీ చదువుతున్నప్పుడూ చూస్తున్నప్పుడూ "మనచుట్టు పేరుకుపోయిన అబద్ధాల నుంచి నిజాన్ని కనుక్కోవడమే వీటన్నింటికన్న గొప్ప సాహసం! కష్టంతో పోలిస్తే ఇవి చాలా సిల్లీగా ఉంటాయి!" అనిపించేది.

ఏసుక్రీస్తుకీ మహమ్మదుకే గాక గౌతమ బుద్ధుడికి కూడా చారిత్రక పరమైన భౌతిక సాక్ష్యాలు దొరకని పరిస్థితి ఉంది."దేవుడు లేడన్న గౌతమబుధ్ధుడు దేవుడు యెట్లా అయ్యాడు?బౌధ్ధుల దేవుడు విష్ణుదేవుడి అవతారంగా ఎప్పుడు ఇరుక్కున్నాడు!" - అన్న తలకట్టు పెట్టి వ్రాసిన పోష్టు దగ్గిర బౌధ్ధమతం మీద ఎంతో పరిశోధన చేసిన T.W,R Davids కూడా "ఇన్ని శతాబ్దాల పాటు విస్తరించిన బౌధ్ధ మతసాహిత్యపు చరిత్రని తీరగేసినా ఖచ్చితంగా బుధ్ధుని అనుయాయులు కాలంలో ఎక్కడి నుంచి పరంపరని మొదలు పెట్టారనేదానికి సాక్ష్యం చెప్పగలిగిన ఒక్క రికార్డు కూడా కనపడలేదు నాకు" అనేశాడని వ్రాస్తున్నప్పుడు "నిజమా!" అనిపించింది గానీ అప్పటి వెతుకులాటలో కనిపించిన ఇంకెవరూ అలాంటి వాదన చెయ్యలేదు గనక దిశలో ముందుకి వెళ్ళలేదు.అదీగాక, బౌద్ధమతం అవైదిక మతాలలో కొంచెం శాస్త్రీయత ఎక్కువున్న మతం అనిపించడంతో బుద్ధుడు కల్పిత పాత్ర అయినప్పటికీ అందులోని భావాలు మంచివి అయినప్పుడు విమర్శించడం అనవసరమూ దుర్మార్గమూ అనిపించింది.అయితే, యేసు గురించి క్రైస్తవులూ ఇదే మాట చెప్పుకుంటున్నారు.ఒకరి విషయంలో తప్పు అయినది మరొకరి విషయంలో తప్పు ఎందుకు కాదు?

“క్రైస్తవం అయినా బౌద్ధం అయినా మతం యొక్క సారం ముఖ్యం గానీ అందర్నీ ఒక్కలాగే ఉద్వేగ పరుస్తున్న మతాన్ని ఎవరు స్థాపించితే ఏమిటి?అలాగే అన్ని ప్రాంతాలకూ వ్యాపించిన మతాన్ని స్థాపించినవాడు ఎక్కడివాడైతే ఏమిటి?” - ప్రశ్నలు సరళమైనవే గానీ సరళమైన జవాబును చెప్పడం కష్టం."ఒక వ్యక్తి కేంద్రం అయిఉండి అతనికి అద్వితీయతను ఆపాదించి అతని పట్ల విధేయతను బోధించే మతం చాలా సహజమైన పద్ధతిలో తనను అనుసరించేవారిని నియంతలకు దాసులను చేస్తుంది" అనేది చరిత్రలో చాలా సార్లు చాలా చోట్ల నిరూపణ అయిన చారిత్రక సత్యం.

రాజ్యం, మతం అనే రెండూ పైకి వేర్వేరు రూపాలతో ఉంటాయి గానీ వాటి పనితీరును గమనిస్తే మాత్రం అవి కలిసి పనిచేస్తాయనేది తెలుస్తుంది. రెండూ కలిసి పని చేసే సమాజంలోని వాస్తవ ప్రణాళికని కుటుంబ జీవితంలోని పోలికతో చెప్తాను.పిల్లల మీద ప్రేమ ఉండి వాళ్ళ మీద పెత్తనం చెయ్యాలనుకోని తండ్రి అయితే పిల్లలు అడిగినవి తన స్థోమతకు లోబడినవి అయితే కొంటాడు, లేనప్పుడు తను దగ్గరికి తీసుకుని అది తన స్థాయికి ఎక్కువని బుజ్జగించి చెప్తాడు.పిల్లలు కూడా బుద్ధిమంతులు అయితే అప్పటికి చిన్నబుచ్చుకుని తర్వాత తర్వాత తండ్రి తమమీద చూపిస్తున్న ప్రేమను గమనించి సర్దుకు పోతారు.పిల్లల మీద ప్రేమ ఉండి వాళ్ళ మీద పెత్తనం చెయ్యాలనుకోని తల్లి అయితే భర్తకూ పిల్లలకూ మధ్యవర్తిలా నిలబడి సర్ధిచెప్పి తనవంతు సాయం చేస్తుంది.అలాగాక పిల్లల మీద ప్రేమ లేక వాళ్ళ మీద పెత్తనం చెయ్యాలనుకునే తండ్రి అయితే తన స్థాయికి లోబడినది అడిగినప్పుడు సైతం కుదరదని గద్దిస్తాడు.తిరుగుబాటు మనస్తత్వం ఉన్న పిల్లలు నిలదీస్తే దేహశుద్ధి కూడా చేస్తాడు.పిల్లలకు తను చెయ్యాల్సిన వాటినుంచి తప్పుకుని వాళ్ళని నౌకర్లలా వాడుకోవాలనుకునే క్రూరత్వం ఉన్న తండ్రులు మనమధ్యనే చాలామంది ఉన్నారు.కుటుంబ జీవితంలోని తండ్రిని సామాజిక వ్యవస్థలోని రాజ్యం అనుకుంటే మతం తల్లి అవుతుంది. ప్రేమ గల తల్లి భర్తకూ పిల్లలకూ మధ్యవర్తిలా నిలబడి సర్ధిచెప్పి తనవంతు సాయం చేస్తుంది గానీ అది లేని తల్లి వీలును బట్టీ వాలును బట్టీ లెక్కలేసుకుని ఒకసారి భర్తనీ ఒకసారి పిల్లల్నీ వెనకేసుకొచ్చి వాళ్ళ తరపున పోట్లాడి ఇద్దరినుంచీ మంచిపేరు తెచ్చుకోవడం కోసం ప్లానులు వేస్తుంది.

మతసారం శాస్త్రీయమైన పునాదుల మీద కట్టినది గాక అబద్ధాల పునాదుల మీద పుట్టినది అయితే ప్రేమ లేని తల్లిలా అటు రాజ్యాన్నీ ఇటు ప్రజల్నీ మోసం చేస్తూ ఇద్దరి చేతా చప్పట్లు కొట్టించుకునే ప్రమాదం ఉంది కదా!అందువల్లనే ఒక మతాన్ని అనుసరించాలనుకునే ప్రతి వ్యక్తీ ఆయా మత స్థాపకుల చారిత్రక యదార్ధతను గురించి తెలుసుకోవాలి.పూర్వ సామాన్య శకం 4000 సంవత్సరాల నాటి సింధు నాగరికతని గురించీ ఏడు వేల యేళ్ళ వెనకటి ద్వారక గురించీ సరస్వతీ నది అంతర్ధానమైన కాలం గురించీ మెసపొటేమియన్ మాయన్ ఈజిప్షియన్ నాగరికతలను గురించీ అనేకమైన విషయాలు తెలుస్తున్నప్పుడు ఇప్పటికి మూడు వేల యేళ్ళ లోపునే పుట్టారంటున్న ముగ్గురు నలుగురు వ్యక్తుల గురించి ఒక్క సాక్ష్యం కూడా దొరకకపోవటం ఏమిటి?

Doug Smith అనే పరిశోధకుడు 2018 డెసెంబర్ 24 “Did the Buddha really exist? It's a question that concerns some of us today, given the paucity of hard evidence from the early period of the Buddha's lifetime. We'll look at some of the issues involved in reconstructing that early history and finish up by considering whether and to what extent worries about the Buddha's real existence should impact our practice.” అని బల్లగుద్ది చెప్తుంటే జీససు క్రీస్తు యొక్క చారిత్రకతలా మినుకుమినుకుమనే ఆశారేఖను కూడా మిగల్చని యదార్ధం గౌతమబుద్ధుని చారిత్రకతను అసత్యం అని తేల్చి చెప్పడం లేదూ!

విచిత్రం ఏమిటంటే, కొందరు క్రైస్తవులు తమ మతస్థాపకుడి యదార్ధత కూడా అబద్ధమేనని తెలిసో తెలియకో  బుద్ధుడు కేవలం మామూలు మనిషేనూ జీసస్ మాత్రమే దైవపుత్రుడూ అని రెచ్చిపోతున్నారు - ఎవడి మతం వాడికి గొప్ప అనుకుంటే బాగుణ్ణు, మాదే గొప్ప మతం,మా దేవుడే గొప్పవాడు అంటారు!అక్కడ బౌద్ధాన్ని సమర్ధించేవాళ్ళ వాదనలు కూడా విచిత్రమే! వీడియో చానలు పేరు కూడా Doug's Dharma, అంటే అతను బౌద్ధ మతాన్ని అభిమానించే వ్యక్తియే.真理Truth అనే ఒక బౌద్ధ మత సమర్ధకుడు బైబిలు సూక్తుల్ని చూపించీ బుద్ధుడికీ క్రీస్తుకీ పోలికల్ని చూపించీ శాంతంగా వాదిస్తుంటే Christ Revelation అనే క్రైస్తవ మత సమర్ధకుడు ‘So has the Buddha got you out of suffering then? Have you found "eternal truth" through Krishna? Any man can just say words, but how do they hold weight? What is your definition of truth? And how can each "prophet" teach a different "unique" version of "truth" when truth is objective not subjective? You would literally be going against the definition of truth to believe all teach one of the same. The truth can only be ONE thing by definition, and Jesus was IT’ అంటూ రెచ్చిపోతున్నాడు!

కానీ, అదే 真理Truth చూపించిన ఒకేలాంటి బుద్ధుడి-క్రీస్తుడి జీవిత విశేషాలు ఇలా ఉన్నాయి:

1) Jesus similarities with Buddha. Maya to Mary, miracle pregnancy to virgin pregnancy, birth during a journey home to from home, prophesied soon after birth.

2).both had a disciple who betrayed them, walked on water, Gautama left the palace at age 29 and Jesus appeared at 29, Gautama became Buddha at 35 and Jesus died and resurrected at around 35 too,

3).Buddha had a big meal while Jesus had a last supper before they died, after they passed away.

4).500 arahants witnessed compilation of Buddha's teachings and over 500 witnesses to Jesus's resurrection etc. All coincidental?

5).Beside Buddha, Jesus was also found to be copied from other figures. Surely they can't be ALL coincidental.

6) Many of the Bible's mythologies was copied from older pagans, Greek, Egyptian or Hinduism religions(note the names too) E.g. Adam & Eve from Atman and Jiva, in Hinduism, big flood and survivor Noah/3 sons same as Manu/3 sons although cause of flood is different.

7).Even the names of Abraham and wife/sister Sarah close to Brahma and Saraswathi beside having quite similar story. Regardless of which religion copied which.

అసలు భవిష్యత్తులో సన్యాసి అవుతాడని జాతకంలో ఉందని తెలిసి ఒక రాజు తన కొడుకుని కష్టాలు తెలియనివ్వని గృహఖైదు చెయ్యడం ఎంత సీల్లీ - రాజయ్యాక ప్రజల ముందుకి వెళ్ళడా గారాల పట్టి!ప్రజల కష్టాలను తెలుసుకోకుండా ప్రజల ఎదర పడకుండా యుద్ధాలకు సైన్యాన్ని నడిపించకుండా బుజ్జిరాజు ఒక జీవిత కాలం పాటు రాజ్యం చెయ్యడం సాధ్యమా?ఇంత పిచ్చి కధని ఇన్నాళ్ళూ ఎట్లా నమ్మామో అని మనమీద మనకి జాలేస్తుంది, కదూ!ఇదే అనుకుంటే కేవలం ఒక గంటలో ఒక ముసలాణ్ణి చూసి వార్ధక్యం గురించి తెలుసుకున్నాడంట, ఒక శవయాత్రని చూసి చావు గురించి తెలుసుకున్నాడంట - అదీ వేరేవాడు బాణం వేసి కొట్టిన ఒక హంస తనదని వాదించి సొంతం చేసుకున్న పాండిత్యం ఉన్నవాడికి అప్పటివరకు వార్ధక్యం, మృత్యువు అంటే తెలియనట్టు బిల్డప్ ఇవ్వడం చూస్తుంటే నవ్వు రావటం లేదూ!

నిజానికి మాయాదేవి మార్గమధ్యంలో ప్రసవించడం అనేది యదార్ధం కాదు.అది ఒక దేవాలయం, దేవాలయ ప్రాంగణంలో ప్రసవించడం శుభస్కరమని అక్కడ విడిది చేసి సుఖప్రసవం అయిన వెంటనే తిరిగి వచ్చేసి ఉంటుంది - గుడి పుట్టింటికి దగ్గిర కావడం వరకు నిజమే గానీ అది పుట్టింటికి వెళ్ళాలనుకుంటే జరిగిన అకాల ప్రసవం మాత్రం కాదని అనిపిస్తున్నది నాకు.ఎందుకంటే, Robin Coningham అనే చరిత్రకారుడు తన జీవిత కాలపు అవిశ్రాంత పరిశోధన తర్వాత ఇప్పుడు లుంబిని వనం అని చెప్తున్న చోట ఒక అలయాన్ని గుర్తించి ప్రస్తుతం అందరూ ఒప్పుకున్న బుద్ధుడి జన్మ సమయాన్ని 300 యేళ్ళు వెనక్కి జరుపుతున్నాడు!

బుద్ధుడి జీవితానికీ క్రీస్తు జీవితానికే కాదు వాళ్ళిద్దరి ప్రాభవానికి కూడా పోలిక ఉంది - క్రీస్తు వైభవం చనిపోయిన 300 యేళ్ళ తర్వాత కాన్స్టాంటినోపుల్ క్రైస్తవాన్ని రాజమతం కింద ఆదరించడంతో మొదలైతే బుద్ధుడి యొక్క వైభవం కూడా చనిపోయిన 300 యేళ్ళ తర్వాత అశోకుడు బౌద్ధాన్ని రాజమతం కింద ఆదరించడంతో మొదలైంది.అంతకు ముందరి స్వరూపం ఎలా ఉండేదో ఎవరికీ తెలియదు, అంత కాలం పాటు అవి ఎలా మనగలిగాయో కూడా తెలియదు - మూడు వందల యేళ్ళ పాటు ఒక మతాన్ని అనుసరిస్తున్న వాళ్ళు తమ మత స్థాపకుడి గురించిన చారిత్రక యదార్ధతను గురించి అసలు పట్టించుకోకపోవడం ఎట్లా సాధ్యం?అందులోనూ మతసారం ఏమో ప్రతిదానినీ తర్కించి తెలుసుకోమన్న హేతువాదం చుట్టూ తిరుగుతుంటే అనుయాయులు మాత్రం తమ మత స్థాపకుడి యదార్ధతను గురించి తర్కించలేదు, నమోదు చెయ్యలేదు, అందుకే సాక్ష్యాలు దొరకటం లేదు అనటం కుంటిసాకు కాక మరేమిటి?

జీసస్, మేరీల అనుబంధానికీ బుద్ధుడు, మాయల అనుబంధానికీ కొన్ని దగ్గరి పోలికల్నీ కొన్ని వైరుధ్యాల్నీ చూపించే సన్నివేశాలు బుద్ధుడి జీవిత కధలో చాలా ఉన్నాయి. మనకు తెలిసిన బుద్ధుడి జీవితంలో మాయాదేవి పాత్ర చాలా చిన్నది - తెల్ల యేనుగు కలలోకి వచ్చిన తర్వాత గర్భం దాల్చడం, ప్రసవ సమయానికి పుట్టింటికి వెళ్తున్న దారిలో ప్రసవించడం, శిశువు జన్మించిన కొద్ది రోజులకే మరణించడం, అంతే!

అయితే, మనకు అంతగా పరిచయం లేనిదీ శ్రమణులకూ అర్హతులకూ చిరపరితమైనదీ అయిన బుద్ధుడి జీవిత చరిత్రలో మార్మికతను నింపుకున్న చిత్రమైన సన్నివేశాలు చాలా ఉంటాయి.గౌతమ బుద్ధుడు వాస్తవిక వ్యక్తి అనేది బౌద్ధమతానుయాయులైన చారిత్రక వేత్తలే విఫలమయిన పరిస్థితి నెలకొని ఉండటం వల్ల కల్పనలు ఇంతవరకు మనం ఆ మతంలో ఉందనుకుంటున్న శాస్త్రీయతకే గాక కనీసపు వాస్తవికతకు సైతం దూరమైపోయి అర్ధం కాని అర్ధం లేని పిట్టకధల స్థాయిలో ఉన్నాయి.Wendy Garling అనే మహిళా రచయిత్రి 2017 మే 12న వ్రాసిన Three Forgotten Stories About The Buddha’s Mother అనే వ్యాసం బౌద్ధమతానుయాయుల పురుషాధిక్యతను గురించీ మహిళల పట్ల వారికున్న తిరస్కార భావం గురించీ కుండబద్దలు కొట్టినట్టు చెప్తుంది. “How truly unfortunate that Buddhism got off on the wrong foot telling its own story by embedding passive, voiceless, marginalized depictions of women from the very beginning. In so many ways, the harmful effects continue to flow downstream to where we sit today.” అంటూ ఆమె బౌద్ధమతానుయాయిలా కొనసాగుతూనే ఆ మతాధిపతులకు మహిళల పట్ల ఉన్న చిన్నచూపును ఎత్తి చూపిస్తున్నది.

మనముందు చెప్తున్న కధలు వేరూ వాళ్ళలో వాళ్ళు చెప్పుకునే కధలు వేరూ అని తెలుస్తున్నది ఆమె అసలైన బౌద్ధమత గ్రంధాలలోని మాయాదేవి గురించిన కధల్ని చెప్తుంటే!అలాంటి విషయాలు యాధాలాపం అనుకోవడానికి వీల్లేదు - ఆమెయే "I spent five years researching biographies of the Buddha originally from Pali and Sanskrit sources in search of women’s stories, holding out optimism that I would find some and  that there might be stories supporting a more positive, inclusive view of women during the Buddha’s lifetime." అని అంటున్నది.

అలా వెతికితే ఆమెకు దొరికిన మాయాదేవి గురించి కొంచెం ఎక్కువ చేసి చెప్తున్న కొన్ని సన్నివేశాలు ఇవి:మనకు తెలిసిన కధలో తెల్ల యేనుగు కలలోకి రావడం మాత్రమే ఉంటుంది.కానీ, వాళ్ళలో వాళ్ళు చెప్పుకునే కధ ప్రకారం బుద్ధుడు ఒక తేజోమయశరీరంతో మాయాదేవి గర్భం నుంచి బయటకు వచ్చి నాలుగు వైపులా పరకాయించి చూసి "ఇదియే నా ఆఖరి జన్మ!" అని తనను గురించి తను చెప్పుకున్నాడట!ఏమిటో ఈ లీలావినోదానికి అర్ధం?బహుశః తన పేరున తర్వాత నడిచిన నాలుగు సంప్రదాయాలను అప్పుడే సూచన ఇచ్చాడు కాబోలు!అప్పుడే అన్ని మహత్యాలు చూపించగలిగినవాడు తండ్రి అన్నేళ్ళ పాటు పంజరంలో చిలకలా బంధిస్తే ఆగడం దేనికి?అదే తేజోమయ శరీరంతో అందరికీ కనిపించేసి అప్పుడే ధర్మచక్రప్రవర్తన చేసెయ్యొచ్చు కదా!

పరమ సత్యాన్ని బోధింపజేసుకోవటం కోసం తనను తాను శుష్కింపజేసుకునే కఠోర యోగ సాధన చేస్తున్న కాలంలో ఒకసారి దాదాపు చావు అంచులకు చేరుకున్నాడు - ట!కంగారు పడిన దేవదూతలు స్వర్గాధివాసియైన మాయాదేవికి నివేదించారు - ట!వార్త నిన్న వెంటనే ఆమె నిరంజన నదీ తీరానికి సరగున వెళ్ళి శవప్రాయుడై పడి ఉన్న గౌతమ బుద్ధుణ్ణి చూసింది - ట!కన్నీటి దొంతరల మధ్యన గొంతు సవరించుకుని ‘When I gave birth to you, my son, in the Lumbini Grove,Without support, like a lion, you took seven steps on your own,You gazed in the four directions and said these beautiful words:“This is my last birth.” Those words will now never come to pass. . .To whom can I turn to about my son?To whom shall I cry out in my pain?Who will give life back to my only son,Who is barely alive?’ అంటూ ఒక అనురాగ పూరితమైన వాత్సల్య గీతాన్ని ఆలపించింది - ట!పాట యొక్క శ్రావ్యతకీ ఆమె యొక్క ఆర్ద్రతకీ గౌతమ బుద్ధుడు తేరుకుని ఆమె యెవరని ప్రశ్నించాడు - ట!ఆమె మళ్ళీ ‘It is I your mother, O son, Who for 10 months Carried you in my womb like a diamond. It is I who now cry out in despair.’ అంటూ ఒక పాట పాడింది - ట!అప్పుడు గౌతమ బుద్ధుడు తన వంతు ఓదార్పును ఇచ్చాడు - ట!అతని ఓదార్పుకు ధైర్యం తెచ్చుకున్న మాయాదేవి ముమ్మారు పూలు చల్లి కీర్తిస్తూ గౌతమ బుద్ధుడికి ప్రదక్షిణ చేసి తన లోకాన్ని చేరుకుంది - ట!ఇది లలిత విస్తారం అనే గ్రంధంలోని కధనం.

మరొక సన్నివేశంలో బుద్ధుడే స్వర్గానికి వెళ్ళి ఆమెని కలుస్తాడు - ట!అప్పటికి నలభయ్యేళ్ళ జైత్రయాత్ర పూర్తయి మహాపరినిర్వాణం దగ్గర పడటంతో తన తల్లిని తన ధర్మానికి అనుకూలం చెయ్యాలని బుద్ధుడు అనుకున్నాడు - ట!తండ్రి శుద్ధోధనుడు చనిపోయేముందు బౌద్ధ ధర్మంలోకి ప్రవేశించాడు కదా!తల్లిని తన ధర్మంలోకి రప్పించడం కోసం వెళ్ళిన మూడు నెలల స్వర్గవాసం కధ చాలా గ్రంధాల్లో ఉంటుంది.అది ఇలా ఉంటుంది:ఒకసారి బుద్ధుడు స్వర్గంలో ఒక చెట్టు కింద కూర్చుని శిష్యులకి చాలా సేపు బోధ చేశాక తన పుట్టుక యొక్క ప్రత్యేకతని వివరించి తిరిగి తన తల్లిని చూడాలనే కోరికని బయటపెట్టాడు - ట!వెంఠనే ఒక వార్తాహరుడు పరుగు పరుగున మాయాదేవి ఉన్నచోటుకి వెళ్ళి బుద్ధుడి కోరికని వెల్లడించాడు - ట!కొడుకు మాటలు వినగానే మాయాదేవికి స్తన్యం పొంగుకొని వచ్చింది - ట!దానితో ఉద్రేకం పట్టలేక, "అతడే గనక తన నిజమైన పుత్రుడు అయితే, ఎవరూ అందించకనే ఈ పాలు అతని నోటిని చేరుతాయి!" అని సంకల్పం లాంటి ప్రతిజ్ఞని చేసేసరికి అది అలాగే జరిగింది - ట!ఎంతో కాలం తర్వాత ఆమె తన క్షీరాన్ని అందించినప్పటికీ అప్పుడు జరగాల్సింది బంధాల్ని పెంచుకోవడం కాదనీ తుంచుకోవడం అనీ ఆమెకు వైరాగ్యాన్ని బోధించి మహాపరినిర్వాణం గురించి సూచన ఇచ్చాడు - ట!అలా మాయాదేవి బుద్ధుడి నుంచి దీక్ష తీసుకుని స్వర్గంలో అతి తక్కువ కాలంలోనే ఆరి తేరి పోయి ధర్మ ప్రచారం చేసి బుద్ధుణ్ణి మెప్పించింది - ట!

మహాపరినిర్వాణం అప్పుడు ఆఖర్న బుద్ధుణ్ణి చూసింది మహా కాశ్యపుడనే శిష్యుడు అంటారు గానీ అది నిజం కాదట! ఏడవ శతాబ్దికి చెందిన Xuanzang అనే చైనా యాత్రికుడి కధనం ప్రకారం మాయాదేవి ఆఖరుసారి గౌతమబుద్ధుణ్ణి కలిసిన సన్నివేశానికి ఒక స్థూపాన్ని కూడా స్మారకచిహ్నం కింద నిర్మించారు -ట!తన కొడుకు మరణం స్వర్గంలొ ఉన్న మాయాదేవికి తెలిసింది -ట! తెలిసిన వెంటనే బుద్దుడి చెంతకు వచ్చి దుఃఖం ఆపుకోలేక మూర్చ పోయింది - ట!తేరుకున్న తర్వాత దుఃఖిస్తూనే బుద్ధుడి దేహాన్నీ,వస్త్రాల్నీ, భిక్షాపాత్రనీ పదే పదే స్పృశించ సాగింది - ట!ఒక్కసారి శవపేటిక మూత తెరుచుకుని బుద్ధుడు లేచి కూర్చున్నాడు - ట!ప్రకాశవంతమైన కాంతులు దశదిశలా వ్యాపించాయి - ట!బుద్ధుడు ఒక మహిళగా, మాతృమూర్తిగా ఆమెను పరిపరి విధాల పొగిడి జరుగుతున్నది ధర్మాన్ని వృద్ధి చేసే లీల మాత్రమే అని చెప్పి ఓదార్చాడు - ట!

విచిత్రం ఏమిటంటే,బుద్ధుడికి సంబంధించిన అభూతకల్పనలను తిరస్కరించి పూర్తి వాస్తవికమైన అవగాహన కల్పించే "చారిత్రక బుద్దుడు" అనే గ్రంధంలో కూడా "Few personalities in tlie history of human ihioughi hiave had suchi a wide and lasting influence as Siddhiatiha Gotama, tlie ‘Buddha’ , and none has left his mark more deeply on Asia. I he religion founded by him has nol only brought consolation to innumerable people, but has also provided the basis o f a lofty humanism and a culture of great sensibility. The first sermon preached by the Buddha at Sarnath near Benares in 528 bc was an event whose beneficent effects continue to this day." అని గౌతమ బుద్ధుడి యొక్క మతసిద్ధాంతాన్ని పొగుడుతున్న వ్యక్తియే బుద్ధుడికి సంబంధించి ప్రస్తుతం దొరుకుతున్న వివరాలను యదార్ధం అని తను నమ్మట్లేదని బల్లగుద్ది చెప్తున్నాడు.నిజానికి నన్ను ఇప్పటి పరిశోధనకి పురి కొల్పింది ఈ విచిత్రమైన  విషయమే!

బౌద్ధ మత గ్రంధాల ప్రకారం పూర్వ సామాన్య శకం 6వ శతాబ్ది నాటి మధ్య గంగాతీర మైదానం నాలుగు వ్యవస్థీకృతమైన మహా సామ్రాజ్యాల చేత పరిపాలించబడుతున్నది.ఇవి కాక రాజ వంశీయులు కొందరు కలిసి ఏర్పరచుకున్న ఇప్పటి పార్లమెంటరీ డెమోక్రసీకి మూలరూపం అనదగిన గణతంత్ర వ్యవస్థలు కూడా ఉండేవి.అంతే కాక ఆటవిక తెగలు కూడా స్వయం పాలన పేరుతో వారిని వారే పరిపాలించుకునేవారు.

గంగకు ఉత్తరాన కోసల అనే శక్తివంతమైన సామ్రాజ్యం ఉండేది.దీనికి రాజధాని సవత్తి అని వీళ్ళు పాళీ భాషలో పిలుస్తున్న శ్రావస్తి నగరం.బుద్ధుని జీవిత కాలం అని బౌద్ధ గ్రంధాలు అంటున్న కాలంలో మహాకోసలుడు, ప్రసేనజిత్తు(Pasenadi అనేది పాళీ అపభ్రంశం అనీ ఇది దాని మూలరూపం అనీ నేను అనుకుంటున్నాను),విడూడభుడు అనే రాజులు పరిపాలించారు.ఈ కోసల సామ్రాజ్యంలో రాజధాని కాక సవత్తి కన్న ముందరి రాజధాని యైన సాకేతం(ayojja), ప్రముఖ యాత్రాస్థలం వారణాశి అనేవి ముఖ్యమైన నగరాలు.కోసల రాజు తన రాజ్యం వరకే గాక రెండు గణతంత్ర రాజ్యాలనూ మూడు తెగల రాజ్యాలనూ అదుపు చేస్తూ ఉండేవాడు.

కోసలకు నైఋతి దిశలో గంగకూ యమునకూ మధ్యన Vaccha అని పాళీలో పలుకుతున్న వత్స రాజ్యం ఉండేది.దీనికి రాజధాని కౌశాంబి నగరం.ప్రముఖ యాత్రా స్థలం ప్రయాగ ఈ రాజ్యం లోనిదే!అప్పటి వత్సరాజు Udena అని చెప్తున్నారు.ఇతని తండ్రి పరంతపుడు.

ఇక అవంతి సామ్రాజ్యం వత్స మరియు కోసల రాజ్యాలకు దిగువన గంగకు ఉత్తరాన ఉండేది.Pajjota అని పాళీలో పిలుస్తున్న ప్రద్యోతుడు Ujjeni అని వీళ్ళు పిలుస్తున్న ఉజ్జయిని నగరంలో ఉండేవాడు.అయితే, రాజ్యానికి దక్షిణాదిన Mahissati అని వీళ్ళు పిలిచే మహిష్మతి అనే మరొక రాజధాని కూడా ఉందేది.బుద్ధుడు తిరిగిన ప్రదేశాలు అన్నీ అవంతికి బయటివే - అతని శిష్యుడైన Mahakaccana వల్ల ఆవంతి బౌద్ధాన్ని అనుసరించింది.

ఆఖరున చెప్పుకుంటున్నప్పటికీ అతి ముఖ్యమైనది మగధ సామ్రాజ్యం!తూర్పు కొసన ఆవంతిని తాకుతూ గంగకు ఉత్తరాన ఉన్న మగధ ఖనిజ సంపద వల్ల అటు వ్యాపారంలోనూ ఇటు సైనికపాటవంలోనూ అన్నింటిలోకి అత్యంత శక్తివంతమైనది.Bhatiya అని మరో పేరున్న హర్యంక వంశానికి చెందిన Bhati యొక్క కుమారుడు బింబిసారుడు.కోసల రాజైన ప్రసేనజిత్తు సోదరిని వివాహం చేసుకున్నాడు బింబిసారుడు.ఇతని కుమారుడు అజాతశత్రుడు రాజధానిని రాజగృహం నుంచి పాటలీపుత్రానికి మార్చాడు.తండ్రిని సంహరించి రాజ్యానికి వచ్చిన అజాతశత్రుణ్ణి అతని కొడుకైన వీళ్ళు Udiiyibhadda అని పిలుస్తున్న ఉదయభద్రుడు సంహరించి రాజయ్యాడు.అదే వరసన అతని కొడుకైన Anuruddhaka అని వీళ్ళు పిలిచే అనిరుద్ధకుడు కూడా తండ్రిని సంహరించి రాజయ్యాడు.

ఈ నాలుగు రాజవంశాలతో పాటు మధ్య ప్రాంతం అనేక గణతంత్ర వ్యవస్థలతో నిండి ఉండేది.ఇవన్నీ కూడా కోసలకు తూర్పున మగధకు ఉత్తరాన ఉన్నాయి.ఇవి ఉన్నత కులానికి చెందిన రాజపురుషుల సమూహాలు అధ్యక్షులుగా ఉండే మధ్యేమార్గమే తప్ప పూర్తి ప్రజాస్వామ్యం వీటిలో లేదు.అధ్యక్షుడు సభలో సలహాదారులతో కూర్చిని చర్చించి చేసిన శాసనాలను దానికి కింది అంతరువులో ఉన్న కార్యనిర్వాహక వ్యవస్థ అమలు చేస్తూ ఉండేది.khattiya అని వీళ్ళు పిలిచే క్షత్రియులు మాత్రమే రాజరికానికి అర్హులు.ఐతే,సభ అనేది ఇప్పటి వలె గాక స్తంభాల మీద నిలబెట్టిన ఒక బహిరంగ మంటపం కాబట్టి ఇతర కులస్థులు సమావేశాలను సందర్శించి అక్కడ జరుగుతున్న చర్చలను చూడవచ్చు.

ఈ గణతంత్ర రాజ్యాలను పాలించే వారి పేర్ల మీదనే పిలిచేవారు.సంఖ్యలకు సంబంధించిన వివరాలు లేనప్పటికీ అతి కొద్ది మంది తమ వంశం గొప్పను చెప్పుకుని అతి ఎక్కువ మందిని పరిపాలించడం సబబే అనిపించిన కాలం అది!

ఇక మన కధానాయకుడైన బుద్ధుడు మొదట కోసల రాజ్యానికి ఈశాన్యపు సరిహద్దున అతుక్కుని ఉండి తర్వాత ఆక్రమణకు గురై కోసల రాజ్యంలోని ఒక భాగమైన కపిలవస్తును రాజధాని చేసుకుని పరిపాలించే Sakiya లేక Sakka అని వీళ్ళు పిలుస్తున్న శాక్య గణానికి చెందిన యువరాజు.ఇప్పుడిది కొంత ఇండియాలోనూ కొంత నేపాల్లోనూ ఉండి ఇండో నేపాల్ సరిహద్దును వేరు చేస్తున్నది.

ఇక విస్తారమైన మల్ల గణతంత్రం ఇద్దరు రాజులతో రెండు రాజధానులతో ఉండేది.ఈ రాజ్యానికి గానీ ఆ నగరాలకి గానీ అప్పటి కాలంలో రాజకీయపరమైన ప్రాముఖ్యత లేదు గానీ మహాపరినిర్వాణం జరగడం వల్ల Kusinara అని వీళ్ళు పిలిచే కుశీనర అనే చిన్న నగరం ఇప్పుడు ఆధ్యాత్మికపరమైన ప్రాముఖ్యతను తెచ్చుకుంది.

ఇక Vesali అని వీళ్ళు పిలిచే వైశాలి నగరాన్ని రాజధాని చేసుకుని పాలిస్తున్న లిఛ్చవి గణం,మిధిలను రాజధాని చేసుకుని పాలిస్తున్న విదేహ గణం ఇలాంటి అనేక గణాలు కలిసి ఏర్పడిన వజ్జి రాజ్యపు పరిషత్ అనే గొడుగు కింద సర్దుకుపోయాయి.

మహా సామ్రాజ్యాలూ గణతంత్రాలతో పాటు కొనసాగుతున్న ఆటవిక తెగల యొక్క పరిపాలన గురించిన వివరాలు ఎక్కువ దొరకటం లేదు.అయితే, ముఖ్యమైన తేడా ఒకటి తెలుస్తున్నది:గణతంత్రం వలె ఎన్నుకోబడటమూ గాక సామ్రాజ్యం వలె వంశాన్ని బట్టి కొనసాగడమూ కాక తెగలోని పెద్దలు కలిసి ఆలోచించుకుని ఒకరిని నియమించేవారు.వీళ్ళ పెద్దలకి గానీ వాళ్ళ రాజులకి గానీ క్షత్రియ కులంతో ఎటువంటి సంబంధమూ లేదు. వీటిలో శాక్య గణతంత్ర రాజ్యానికి ఆగ్నేయ దిశలో ఉన్న Koliyas అనే తెగ చాలా ముఖ్యమైనది.ఇప్పుడు మనం  RowaT అని పిలుస్తున్న అప్పటి RohinT అనే చిన్న నది వాళ్ళనీ వీళ్ళనీ వేరు చేస్తూ ఉండేది.వీళ్ళ రాజధానికి Ramagama అనీ Koliyanagara అనీ రెండు పేర్లు ఉన్నాయి.వీళ్ళకి శాక్యులతో వివాహ సంబంధాలు కూడా ఉన్నాయి.వీళ్ళని ఆనుకుని తూర్పున Pipphalivana అని పాళీలో పిలిచే పిప్పలివనం అనే నగరాన్ని రాజధాని చేసుకుని Moriyas అనే మరొక తెగ ఉండేది.ఆఖర్న చెప్తున్నప్పటికీ అతి ముఖ్యమైన  Kalamas అనే మరొక తెగ గంగ మరియు గాఘ్ర నదుల మధ్యన Kesaputta  అనే నగరాన్ని రాజధాని చేసుకుని పాలిస్తూ ఉండేది.

ఇతరులను గురించి ఇంత విస్తారమైన సమాచారం ఇవ్వగలిగిన బౌద్ధ మత గ్రంధాల రచయితలకి తమ మత స్థాపకుడి వాస్తవికతను నిర్ధారించే ఒక్క సాక్ష్యం కూడా దొరకలేదా!పైన H.W.Schumann లాంటి ప్రముఖ ఇండాలజిస్టులు సైతం ‘The title The Historical Buddha indicates both the subject of the present work and the limits of its scope. It excludes any treatment of the non-historical Buddhas of the past and the future who are frequently mentioned in Buddhist scriptures; it also excludes all legends which developed around the person of the historical Buddlia, except in so far as a historical kernel could be detected in them.’ అని చెప్పుకుని సాధించింది ఏమిటి?వీరు సైతం ఇప్పుడు లభిస్తున్న వివరాలు యదార్ధం కాదని ఒప్పుకుంటూ ‘But that he really saw Brahma so vividly with his own eyes, as the texts declare, is probably the interpretation of later monks.’ అంటూ అభూతకల్పనలను సమర్ధించడం తప్ప వాస్తవాల్ని విప్పి చెప్పటానికి ప్రత్యేకించి చేసింది ఏముంది?బ్రహ్మ బుద్ధుడికి కనిపించడం,బ్రహ్మతో జరిగిన సంవాదంలో బుద్ధుడే నెగ్గటం, బ్రహ్మ మాయాదేవి చేసినట్టు బుద్ధుడికి ప్రదక్షిణలు చేసి నిష్క్రమించడం అనేవి బౌద్ధ మతగ్రంధాల రచయితల యొక్క లేఖనాన్ని ఉటంకించటం అనుకున్నప్పటికీ ‘The gods, too, know' how to behave towards an enlightened one.’ అనే వ్యాఖ్య పరిశోధక రచయిత యొక్క సొంత వాక్యమే కదా!

‘There are these two extremes, monks, which one who has left the world should not pursue. Which two? (On the one hand) giving oneself up to indulgence in sensual pleasure; this is base, common, vulgar, unholy, unprofitable. (On the other hand) giving oneself up to self-torment; this is painful, unholy (and also) unprofitable.Boih these extremes, monks, the Perfected One has avoided,having found that it is the Middle Way which causes one to see and to know, and which leads to peace, to (higher) knowledge, to enlightenment and Nibbana.' అని ఇతరులకు పాఠం చెప్పిన వ్యక్తి మాయాదేవి స్వర్గం నుంచి వచ్చి జాలిపాట పాడినప్పుడు ఆ  స్థితిలో ఉండడానికి కారణం శరీరాన్ని శుష్కింపజేసుకోవడమే కదా - ఏమి స్వోత్కర్ష అండీ!తను గెలిచాడని చెప్పటానికి చూపిస్తున్న వాదనలు ఏవీ నిజ జీవితంలో జరిగినవి కావు.తమ మతస్థాపకుడు మహాపండితుడు అని పాళీ మాత్రమే తెల్సినవాళ్ళకి చెప్పుకోవడం కోసం కల్పించిన కట్టుకధలు.బౌద్ధులు కూడా అతి తక్కువగానే చెప్పారంటున్న బ్రహ్మ-గౌతమ సంవాదం మహమ్మదు జీవితంలోని ఒక సన్నివేశాన్ని గుర్తు చేస్తున్నది.Apparently the Buddha, in order lo make his inner conflict understandable, made use of this well known god-ligure to present the counter-arguments when he hesitated to teach. That he. like the majority of his contemporaries, believed in the existence of gods (who, too, were mortal and subject to the law of rebirth), is undoubted.But that he really saw Brahma so vividly with his own eyes, as the texts declare, is probably the interpretation of later monks.అనే సమర్ధన ఇచ్చి పరిశోధక రచయిత ఉదహరించిన భాగం ఇలా ఉంది:The buddha 'This world delights in the pleasures of the senses, but my leaching Dhamma) aims at the renunciation of all attachments and the destruction of craving. If I were to teach this doctrine, which goes against the stream, and people did nol understand me, that would be a weariness and a trouble to me.’Brahma ‘The world will perish if the Fully Enlightened One does not decide to teach his doctrine. May the Exalted One therefore teach it! There are some beings with little dust on their eyes. If they do not hear the Dhamma they will be lost. But if they hear the Dhamma they will attain [to liberation]!’

ఇక్కడ బుద్ధుడు బ్రహ్మతో వ్యక్తపరిచిన భయాన్నే తన జతొజడల సాక్ష్యం అయ్యాక ఖదీజా ఒక కళ్ళు లేని కబోది దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ మహమ్మదు కూడా వ్యక్తం చేస్తాడు.వీళ్ళు బౌద్ధ మత గ్రంధాల్ని పాళీ భాషలో వ్రాయడం జనసామాన్యానికి దగ్గర చెయ్యడం కోసం కాదు.బ్రహ్మ బుద్ధుణ్ణి తన కన్న గొప్పవాడని గుర్తించిన సన్నివేశం ఇక్కడ ఉందని వైదిక పండితులకి తెలిస్తే అప్పుడే ఈ మోసకారి మతానికి మంగళగీతం పాడేవాళ్ళు, కాదా?

వైదిక ధర్మ విరుద్ధమైన విషయాల్ని వైదిక ధర్మానుయాయులకి ఆకర్షణీయమైన పద్ధతిలో చెప్పి వైదిక ధర్మాన్ని బలహీనం చేసి ఆ పునాదుల మీద సామ్రాజ్యవాదం,నియంతృత్వం,విశృంఖలత్వం,నైతికభ్రష్టత్వం వంటివాటితో సమాజాన్ని కలుషితం చెయ్యటం తప్ప జైనం,బౌద్ధం,క్రైస్తవం,మహమ్మదీయం అనే నాలుగు ప్రధాన మతాలకూ వాటి శాఖలైన ఉప మతాలకూ మరొక లక్ష్యం లేదు.

బహుశః తమ మతస్థాపకుడి యొక్క ఉనికికి చారిత్రక యదార్ధత లేదనీ తమ మతసారం శాస్త్రీయమైన పునాదుల మీద ఏర్పడినది కాదనీ వారికే తెలిసిన అపరాధ భావం వల్ల కాబోలు బౌద్ధ మత ప్రచారకులు కూడా మాయాదేవి గురించిన చనుబాల కధలనూ బ్రహ్మ-బుద్ధ సంవాదపు కధలనూ బయటి వ్యక్తులకు చెప్పడం లేదు.

తులనాత్మక పరిశీలన చేసి చూసినట్లయితే మహమ్మదు జీవితం ఏసు జీవితానికి అనుసరణ అనిపిస్తుంది.ఏసుక్రీస్తు జీవితాన్ని తులనాత్మక పరిశీలన చేసి చూసినట్లయితే గౌతమ బుద్ధుడి జీవితానికి అనుసరణ అనిపిస్తుంది.అంతే కాదు, గౌతమ బుద్ధుడి జీవితాన్ని తులనాత్మక పరిశీలన చేసి చూసినట్లయితే జైన తీర్ధంకరుడైన మహావీరుడి జీవితానికి అనుసరణ అనిపిస్తుంది.

ప్రపంచ స్థాయిలోని అత్యంత ప్రజాదరణ కలిగిన పది మతాలలో చేరిన నలుగు మతాల యొక్క వ్యవస్థాపకులకి వారు కాలం వారని ప్రాంతం వారని వారి మతగ్రంధాలు చెప్తున్నాయో కాలపు ప్రాంతపు వాస్తవ ప్రపంచంలో వారు జీవించి ఉన్నారనడానికి తిరుగు లేని సాక్ష్యం ఒక్కటి కూడా లేదు!మరీ విచిత్రం ఏమిటంటే, చరిత్రలో వారి తొలి ప్రస్తావన వారు జీవించారని చెప్తున్న కాలానికి సుమారు రెండు లేక మూడు వందల సంవత్సరాల తర్వాత "అప్పట్లో ఒక మహావ్యక్తి ఉండేవాడు,అతడే ఈ మతాన్ని స్థాపించాడు!" అని వారి మతానుయాయులు చెప్పుకున్న కధలే తప్ప ఆయా కాలాలకు చెందిన ఇతర రచయితల యొక్క సాహిత్య రూపాలలో మతస్థాపకుల ప్రస్తావనలు కనిపించటం లేదు.

దానికి ఆయా మాతాభిమానులు చెప్తున్న కారణం కూడా ఒక్కలాగే ఉంటుంది - ఆయా మహాపురుషులు అప్పటి సామాజిక వ్యవస్థలలో చెలరేగుతున్న దురన్యాయాల మీద పోరాడుతూ మతాలను స్థాపించారు గాబట్టి వీటిని ఇతరులు అణిచివెయ్యాలని చూడటం వల్ల శత్రువులు తమవైపునుంచి వీరి ప్రస్తావనలను నాశనం చేశారనీ అనుయాయులు రహస్య సంచార జీవనం చేస్తూ వివరాలను నమోదు చెయ్యలేదనీ చెబుతున్నారు.

అయితే, “There were occasional differences of opinion between the kingdoms,republics and tribes - mainly over irrigation and pasturerights - but the general attitude was of peaceful co-existence. Anyone could freely cross the borders between the different types of state. This was the geographic, climatic and political environment into which Siddhattha Gotama, the future Buddha, was born in 563 BC.” అని చారిత్రక బుద్దుడి గురించి చెప్తున్న పరిశోధక రచయిత చెప్పిన దాన్ని సత్యం అని ఒప్పుకుంటే ఒక రాజకుమారుడు రాజ్యం వదిలేసి సన్యాసి కావడం అనే సంచలనాన్ని నమోదు చెయ్యటం అనేది జరిగి తీరాలి!కాబట్టి బౌద్ధమతం శుద్ధోధనుడూ బింబిసారుడూ పరిపాలించే కాలంలో గాక అశోకుడి కాలంలో అతని ప్రమేయంతో పుట్టిన మతం అనిపిస్తున్నది నాకు.అయితే, ఒక అవైదిక మతాన్ని వైదిక మతానికి శాఖలా తీర్చి దిద్దటంలో నాగసేనుడి వంటి బ్రాహణోత్తముల సహకారం ఉందనేది కూడా సత్యమే!ఎప్పుడో 1978 నాడు రామారావు పెట్టిన ఒక బిల్లు వల్ల ఉపాధి కోల్పోయిన కొద్ది మంది బ్రాహ్మల కోసం తప్ప ఇతర కులాల వారి  కోసం ఆలోచించని కులపిచ్చి బ్యామ్మర్లు ఐవీయార్ కృష్ణారావులూ తన పొట్టకూటి కోసం లేని పింక్ డైమండ్ ఉందని అబద్ధం చెప్పిన పొట్టకూటి బ్యామ్మర్లు రమణ దీక్షితులూ  అప్పుడూ ఉన్నారు, ఇప్పుడూ ఉన్నారు, ఎప్పుడూ ఉంటారు.

అత్యంత ప్రాచీన కాలానికి సంబంధించిన ఎన్నో చిక్కుముడులు విడుతున్నప్పటికీ బృహత్తరమైన సుదీర్ఘకాలపు పరిశోధనల తర్వాత సైతం కేవలం నలుగురి వివరాలు తెలియకపోవడం ఒక్కటి చాలు ఇవన్నీ వారి మత స్థాపకుల యొక్క చారిత్రక యాదార్ధతను నిరూపించలేని తమ అశక్తతకు వేసుకున్న ముసుగులు తప్ప నమ్మదగిన కారణాలు కావనీ ఇప్పటి వలె సమాచార వ్యవస్థ గానీ నిజానిజాలను తేల్చగలిగిన సాంకేతిక పరిజ్ఞానం గానీ లేని ఆనాటి కాలాలలో కొందరు పండితులు ఒకచోట సమావేశమై ఒకే మూసను వాడి తయారు చేసిన వ్యాపార ప్రయోజనాలను చేకూర్చే అమ్మకపు సరుకులు ఇవనీ తెలుసుకోవడానికి!

ఓరి దేవుడోయ్ - హిందువుల బుద్ధుణ్ణి కాపీ కొట్టి బౌద్ధమతాన్ని సృష్టిస్తే దాన్ని కాపీ కొట్టి యేసుని సృష్టించారు,మళ్ళీ దాన్ని కాపీ కొట్టి మహమ్మదుని సృష్టించారు, ఇప్పుడు వీటన్నిటి చాటున లూసిఫర్ మతంగాళ్ళు దాక్కున్నారు!హిందువులు చూస్తే యెర్రిపప్పల మాదిరి, మా గురువే గొప్పోడంటే మా గురువే గొప్పోడనీ తన్నుకు ఛస్తున్నారు, గురువులు చూస్తే మా పీఠం గొప్పదంటే మా పీఠం గొప్పదనీ వాళ్లలో వాళ్ళు కొట్టుకు ఛస్తున్నారు - సిగ్గు లేని మంద. 

11 comments:

  1. సీత భూమిలో దొరికిందాన్ని, మోషే నీల్లలో దొరికాడని కాపీ కొట్టలేదా? ఐనా భూమిలో శవాలుంటాయిగానీ, చిన్నపిల్లలుంటారా? ఎధవ స్టొరీలూ, ఎధవ కాపీలు.

    ReplyDelete
  2. రాముడూ, కృష్ణుడు జీవించి వున్నట్టు సాక్షాలున్నాయా గురూగారూ?

    ReplyDelete
    Replies
    1. లేదు సార్!

      రెండోసారి సీతను వదిలెయ్యడం అనే కధ ప్రామాణికమైనది కాదు.ఉత్తరే రామ చరిత్రే భవభూతిర్విశిష్యతి అంటారు.వాల్మీకి రామాయణం వనవాసం పూర్తయ్యాక జరిగిన పట్టాభిషేకంతో ముగుస్తుంది.అది పూర్తి కధ అనే అర్ధంతోనే సంపూర్ణ రామాయణం అంటారు.అయితే, వాల్మీకి సొంత కధ కాదు, ఆనెక పురాణాలలో అక్కడక్కడ చెప్పిన వివరాల్ని ఒక చోటకి చేర్చి తన కవిత్వ ప్రతిభని కలిపి రాశాడు.పురాణాల ప్రకారం అవతార పరిసమాప్తి సన్నివేశం సీతా పరిత్యాగం, లవకుశుల యజ్ఞాశ్వబంధనం లాంటి ప్రస్తావనలు లేకుండా నిరాడంబరంగా ఉంటుంది.శ్రీరాముడు, సీత , లక్షణ భరత శతృఘులు ప్రజల అనుమతి పొంది సరయూ ప్రవేశం చేసి వైకుంఠవాసం చేరుతారు.

      ఇప్పుడు మనం చదువుతూ అధికారికం అనుకుంటున్న రామాయణ కావ్య రచయితే సుమారు సామాన్య శకం 4వ శతాబ్దికి చెందిన వాడని రాహుల్ సాంకృత్యాయన్ లాంటి చరిత్రకారుల వాదన.భౌతిక సాక్ష్యాలతో జరిగిన నిర్ధారణ కాదు గానీ రాహుల్ సాంకృత్యయన్ పాండిత్యం చాలా గొప్పది, వాస్తవాల పట్ల నిజాయితీ ఉంది.

      ఇక చరిత్రలో సాపేక్షంగా చూస్తే ఇటీవలి వాడైన రచయితకే గట్టి సాక్ష్యం లేదు, ఇంక రాముడు చారిత్రక వ్యక్తి అనడానికి సాక్ష్యం ఎలా దొరుకుతుంది?P.N.Oak లాంటివాళ్ళు జన్మతిధిని బట్టి 7,000 ఏళ్ళ క్రితం వాడంటున్నారు గానీ నేను నమ్మను.అదే జన్మతిధ్హి కొన్ని వేల యేళ్ళ కొకసారి అనేక సార్లు వచ్చే అవకాశం ఉంది.

      నేను మొదటినుంచీ రామాయణ భారత భాగవతాది కధలు కల్పితాలే అంటున్నాను.చరిత్ర అని ఎవరన్నా అంటే భౌతికపరమైన సాక్ష్యాలు చూపించమని మీరు వాళ్ళని అడగండి!

      సందేహం తీరిందా?

      Delete
    2. ధన్యవాదాలు గురూగారు.

      Delete
    3. గురూ గారూ! మాఇంట్లో వున్న రాముడూ, క్రుష్ణుడు, బుద్దుడు పటాలు, బొమ్మలన్నీ చెత్తలో పడేశాను. ఎంత టైం వేష్టు చేశానో ఆలోచిస్తుంటే గుండెలు మండుతున్నాయి.

      Delete
    4. శుభం!
      విగ్రహాల్నీ పటాల్నీ పూజించడం ఖచ్చితంగా రోగ లక్షణమే - వేదం చదవండి.
      స్వస్తి!

      Delete
  3. రాముడు, కృష్ణుడు వట్టిదే అంటున్న మీరు.. జై శ్రీరాం అనడంలో ఏమైనా ఆంతర్యముందా?

    ReplyDelete
    Replies
    1. మొదట మీరు నేను రామాయణ మహాభారతాలను గురించి చెప్తున్న మాటను సరైన తీరున అర్ధం చేసుకోలేదు.

      శ్రీరాముడి చారిత్రకతను నిర్ధారించడం కోసం కొందరు రామాయణంలో చెప్పిన జన్మనక్షత్రాల వివరాల్ని బట్టి సుమారు ఏడు వేల యేళ్ళ వెనక ఉన్నాడని చెప్పటాన్ని వ్యతిరేకించాను.కానీ, రాముడు అనే వ్యక్తి అసలు ఈ భూమి మీద ఏనాడూ పుట్టలేదని నేనెక్కడా చెప్పలేదు.రామాయణంలోనూ ఇతర పురాణాలలోనూ రాముడు అనే పురుషుడు పుట్టాడని చెప్తున్న ప్రస్తావనలు ఉన్నాయి.వాటన్నిటిలోని కధనాల్లోనూ కొన్ని స్వల్పమైన తేడాలు ఉన్నప్పటికీ ముఖ్యమైన వివరాలలో ఏకసూత్రత ఉంది.ఉదాహరణకి రాముడు ఎప్పటివాడు అనేదానికి మనం పుట్టి జీవిస్తున్న ఇదే కల్పంలో ఒక కలి,ద్వాపర,త్రేతా, కృత యుగాలు కలిసిన మహాయుగాలు మూడింటి వెనకాల పుట్టినవాడు అని చెప్తున్నారు.ఈ లెక్కల్ని బట్టి చూస్తే ఓక్ లాంటివాళ్ళు చెప్పినట్టు ఏడు వేల యేళ్ళ క్రితం గాక రెండు కోట్ల సంవత్సరాల వెనక శ్రీరాముడు అనే వ్యక్తి ఉండే అవకాశం ఉంది.కాకపోతే ఆధునిక విజ్ఞనశాస్త్రం కాలాన్ని కొలవటానికి ఉపయోగించే కార్బన్ డేటింగ్ మెధడ్ కూడా అంత వెనకటి కాలానికి చెందిన భౌతిక సాక్ష్యాలను నిరూపించలేదు గాబట్టి రాముడి చారిత్రకతకు భౌతిక సాక్ష్యాలు లేవు.

      కానీ, వైదిక శాస్త్రాల్లో ఒకటైన తర్కం ఒకటి సత్యమా అసత్యమా అనేది తేల్చుకోవడానికి ప్రత్యక్ష ప్రమాణంతో పాటు అనుమాన ప్రమాణం, శబ్ద ప్రమాణం, గ్రంధ ప్రమాణం వంటివాటిని కూడా చెప్పింది.అయితే, భయ్త్క సాక్ష్యాలు ఒక్కటే ప్రమాణం అనుకోవడం తప్పు కాదు, ఆధునిక విజ్ఞాన్ శాస్త్రం యొక్క మౌలిక సూత్రం అదే!శాస్త్రజ్ఞులు అందరూ నాస్తికులు కారు, దైవభక్తులు కూడా ఉన్నారు - కానీ దైవం ఉన్నాడని నిరూపించడానికి ఒక గణీతసూత్రం, ఒక సాక్ష్యం, ప్రయోగ శీలమైన నిరూపణ లేవు గాబట్టి ఆధునిక విజ్ఞాన శాస్తర్పు పరిభాషలో దైవం ప్రసక్తి ఉండటం లేదు.శ్రీరాముడి చారిత్రకతకు కూడా అదే వాదన సరిపోతుంది.

      అదీ గాక, బలహీనమైనది అయినప్పటికీ ఒక సాక్ష్యం ఉంది.కుతుబ్ మీనార్ గురించిన పోష్టులో అక్కడ ఉన్న శాసనం ఆ ఆలయాన్ని శ్రీరాముడు నిర్మించిన సూచన ఇస్తుందని వ్రాశాను.ఇక నేను జై శ్రీ రాం అని అంటున్నది వాల్మీకి వర్ణించిన రాముడి గురించి.చారితర్క సాక్ష్యం లేదు గాబట్టి అసలు రాముడు ఇలాగే ఉంటాడని నేనూ నమ్మడం లేదు.రేపు చారిత్రక సాక్ష్యాలు దొరికి అసలు ఆ రాముడు లేడని తెలిసినా ఆ రాముడు ఈ రాముడిలా లేకపోయినా వాల్మీకి చూపించిన సకల సద్బుణ స్వరూపుడైన వాల్మీకి రాముడి గొప్పదనం తగ్గదు కదా!

      ఒక ఆదర్శం నచ్చి దాన్ని ఒక లక్ష్యం అనుకుని పాటించడానికి ఒక చిహ్నం అవసరమైనప్పుడు ఆ చిహ్నానికి వాస్తవికత ఉండాల్సిన అవసరం లేదు.రాముడు గొప్పవాడు అయినది వైదిక ధర్మాన్ని అనుసరించి చూపించడం వల్ల మాత్రమే,రాముడు పాటించడం వల్లనే అది ధర్మం అయిపోలేదు.ఆ ఒక్క మనిషి వల్లనే ఆ మనిషి ప్రతిపాదించినది మాత్రమే ఇతరులు పాటించదగిన ధర్మం అన్నప్పుడు మాత్రం ఆ వ్యక్తి యొక్క చారిత్రక వాస్తవికతను తేల్చుకోవటం అవసరమే.

      జై శ్రీ రాం!

      Delete
    2. రాముడు వైదిక ధర్మాన్ని ఎక్కడ, ఎప్పుడూ అనుసరించాడు? అస్సలు వైధిక ధర్మమేంటో మీరొక పోష్టు పెట్టండి సార్. వైదిక ధర్మమంటే ఆది ఇదీ అనీ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నరు గానీ ఎవ్వడూ అదెక్కడ వుందో చెప్పట్లేదు.

      Delete
    3. "రాముడు వైదిక ధర్మాన్ని ఎక్కడ, ఎప్పుడూ అనుసరించాడు?" అనేది నిలదీస్తున్నట్టు ఉందే తప్ప తెలియక అడుగుతున్నట్టు లేదు. కాబట్టి మీకు రాముడు వైదిక ధర్మాన్ని అనుసరించలేదని ఎందుకు అనిపించిందో చెప్పండి!

      ఇవ్వాళ నేను వైదిక ధర్మం గురించి కొత్త పోష్టు పెడితే తప్ప తెలుసుకోలేనంత అజ్ఞానంలో ఉన్న మీకు ఈ విచికిత్స అవసరమా?

      "వైదిక ధర్మమంటే ఆది ఇదీ అనీ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నరు గానీ ఎవ్వడూ అదెక్కడ వుందో చెప్పట్లేదు." అనే వెటకారపు వాగుడు ఒక కొవ్వు పట్టిన హిందూమతద్వేషి మాత్రమే వాగగలడు.మీవి అమాయకపు మొహం వేసుకుని చేసే వెక్కిరింతలు అని మీ మొదటి కామెంటులోనే గుర్తు పట్టాను.అయినప్పటికీ ఎందుకు ఇంతసేపు మర్యాద చూపించానో తెలుసా - నన్ను మోసం చెయ్యగలిగాననే బులపాటం తీర్చటానికి కొంచెం ఛాన్సిచ్చాను.మీ అల్పాచమానం పాండిత్యానికీ అనామకపు మొహానికీ ఇప్పటివరకు పెట్టిన గడ్డి చాలు, పొండి సార్.

      జై శ్రీ రాం!

      Delete
    4. ఎటకారం చేసేంత సీను నాకు లేదండి. నాదంతా సినిమా నాలెడ్జే. ఎవ్వడూ వేదధర్మం గురించి విడమరిచి చెప్పినవాడు లేడు. నాటు మందు నుంచి మొదలుపెడితె, ఎవర్ని ఏమన్నా.. మన పూర్వీకుల వేద ధర్మాన్ని విమర్శిస్తున్నావ్ అని అంటారేగానీ, ఆ ధర్మమేదో చెప్పట్లేదు. మీరు మాట్లాడేదాన్ని బట్టి, మీకు దాని మీద కామాండ్ వుందేమో దాని గురించి ఒక పోష్టు పెట్టమని అడిగాను. మీక్కూడా తెలియదు అంటే వొదిలెయ్యండి.

      Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...