Saturday, 13 March 2021

భాజపాకి ఎన్నికల నిధుల కోసమా మోదీగారు వంద ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్ముతున్నది?

అమ్మకానికి పెట్టిన విశాఖ స్టీల్ ప్లాంట్ ఆస్తుల విలువ 32 వేల 22 కోట్లట.32 thousand 22.32 crores అని కేంద్రప్రభుత్వం అంకె కూడా చెప్పింది.మార్కెట్ ఆధారిత న్యాయమైన నిక్కచ్చి లెక్కలు వేస్తే రెండు లక్షల కోట్ల విలువైన ఒక ప్రభుత్వ రంగ సంస్థ యొక్క ఆస్తులని కేంద్రమే ముప్పయి రెండు వేల ఇరవై రెండు కోట్లకి అమ్మేస్తున్నది!ఇంత గొడవ జరక్కపోతే అయిదు వేల కోట్లకే అమ్మేసి ఉండేవాళ్ళని ప్రొఫెసర్ నాగేశ్వర రావు గారు అంటున్నారు!అసలు ఎవరూ పట్టించుకుని ఉండకపోతే వుచితంగా కూడా ఇచ్చేవాళ్ళని అనిపిస్తున్నది నాకు.ఇంత నష్టానికి తేగనమ్మి పారెయ్యటం న్యాయమేనని సమర్ధించుకోవడానికి రూపాయికో భజంత్రీ కామెంటూ అయిదు రూపాయలకో ఎగస్పార్టీల్ని తిట్టే పోష్టూ పెట్టే పేటీయం బ్యాచ్చిని సోషల్ మీడియాలోకి అచ్చోసిన ఆంబోతుల్లా వదిలారు.

ఒకడు ప్రభుత్వోద్యోగులు పనిచెయ్యడం లేదు గాబట్టి నష్టాలు వస్తున్నాయి,ప్రైవేట్ బాసులకి అప్పజెప్తే వాళ్ళు గుద్ద మూసుకుని పని చేస్తారంటాడు.ఒకడు ఇంకోదారి లేకనే అమ్ముతున్నారు, అమ్మితే తప్పేంటి అంటాడు. ఒకడు ఫ్యాక్టరీ అక్కడే ఉంటుందిగా,ఆదాయంలో పెరుగుదల ఉంటుందిగా, పన్నుల ద్వారా వచ్చే ఆదాయం దేశం లోపలే ఉంటుందిగా అంటాడు.ఒకడు అన్యాయంగా ఉద్యోగాల్ని పీకేస్తే అప్పుడే పోట్లాడొచ్చుగా అంటాడు.ఒకడు బీజేపీ గనక అమ్మొతే మేం వచ్చాక వెనక్కి తీసుకొస్తాం అనే పార్టీ ఉందా అని చాలెంజి చేస్తాడు.

7.7 మిలియన్ మెట్రిక్ టనుల ఉత్పాదకతా సామర్ధ్యం స్టీల్ ప్లాంట్ కార్మికులు పని చేస్తేనే కదా వచ్చిందిసెక్రటేరియట్లోనూ రిజిస్ట్రేషన్ ఆఫీసులోనూ ఉద్యోగులు బల్లకింద చేతులు పెట్టి ఎగస్ట్రాలు సంపాదించుకుంటున్నారు, నిజమే!.అక్కడ జరిగే అవినీతిని తీసుకెళ్ళి లంచాలు తీసుకోవడం గానీ ఇతరమైన అవినీతులు చెయ్యడం గానీ కుదరని కష్టపడి పనిచేసి ఉత్పాదకతని చూపిస్తున్న స్టీల్ ప్లాంట్ వర్కర్లకి అంటగట్టి వెకిలి వాదనలు చేసేవాళ్ళకి బుద్ధీ జ్ఞానమే కాదు సిగ్గూ శరమూ ఉన్నాయా?

తను స్వయాన ప్రభుత్వోద్యోగం చేసి రాజకీయ నాయకుల అవినీతిని అసహ్యించుకుని రాజకీయాల్లోకి వచ్చిన జయప్రకాశ్ నారాయణ్ గారు కూడా గోడమీద పిల్లిలా మాట్లాడుతున్నారు.నాయకుల్లో నిజాయితీ లేకపోవడం వల్లనే సమస్యలు వస్తున్నాయి అంటూనే ప్రైవేటీకరణను నేను సమర్ధిస్తున్నాను అని కర్రా విరగని పామూ చావని వింత వాదన చేస్తున్నారు.మేము చేస్తున్నది ప్రైవేటీకరణ అని వాళ్ళు చెప్తున్నారు, కానీ చేస్తున్నది వంద రూపాయల విలువ చేసే ప్రభుత్వ ఆస్తుల్ని పదిహేను రూపాయలకి ప్రైవేటు వ్యక్తులకి అమ్మి పారెయ్యటం.అలాంటిది నాయకుల్లో నిజాయితీ లేదు అన్న పాయింటు మీద నిలబడి స్పష్టమైన వాదన చెయ్యాల్సింది పోయి మద్దెలకి అటో దెబ్బా ఇటో దెబ్బా వేసినట్టు మాట్లాడితే ఎట్లా?

ఇవ్వాళ భవన నిర్మాణం అనేది ఉక్కు,సిమెంటు అనే రెండింటితో ముడిపడి ఉంది.మధ్య తరగతి గృహస్థులు కట్టే ఇళ్ళకి పైకప్పును గానీ పిల్లర్సును గానీ ఇనప తీగలు ఎందుకు వాడుతున్నారు?స్థిరత్వం కోసం! మధ్య తరగతి వాళ్ళు కట్టేవి చిన్న ఇళ్ళు కాబట్టి చవకైన ఇనుమును వాడుతున్నారు.కానీ భారీ కట్టడం అయితే ఉక్కు వాడకం తప్పనిసరి.ఇప్పుడు అది ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి నష్టాల్లో నడుస్తున్నప్పటికీ రేటు పెరగడం లేదు.ప్రైవేట్ వాడు ఎంత దయార్ద్ర హృదయుడు అయినప్పటికీ నష్టాలను భరించడు.రేటు పెంచి తీరుతాడు.అది రోడ్లు భవనాల శాఖ అనే మరొక ప్రభుత్వ రంగ సంస్థ నుంచి ప్రైవేట్ రియల్టర్ల వరకు అందనికీ భారం అవుతుంది.టన్నుకి ఒక రూపాయి పెంచినా చాలు, కొనేవాళ్ళకి ఉన్న వేల లక్షల మెట్రిక్ టన్నుల అవసరాన్ని బట్టి బరువు ఎంత ఉంటుందో వూహించుకోరండి!పెట్రోలు రేటు రవాణాతో సంబంధం ఉన్న అన్ని సరుకుల రేట్లనీ పెంచడం చూస్తూనే ఉన్నారు కదా, మరి స్టీల్ ప్లాంట్ అమ్మకానికి సంబంధించి ప్రజలకి నెప్పి ఎందుకు తెలియడం లేదు?

ఇవ్వాళ్టి తమ వెనుకబాటు తనానికి మూడు వేల యేళ్ళ నుంచి తమని తొక్కేస్తున్న బ్రాహ్మణులే కారణం అని యేడ్చి పోతున్న జై భీం దళిత చిరుతలకి స్టీల్ ప్లాంట్ అమ్మకం పూర్తయ్యాక ఎక్కువ నష్టపోయేది SC,ST, BC వర్గాలే అని తెలియడం లేదా?ఉద్యోగాలు ఇవ్వడంలోనూ ప్రమోషన్ల సమయంలోనూ ప్రభుత్వ రంగ సంస్థ ఇచ్చే రిజర్వేషన్లు ప్రైవేట్ యజమాని ఇవ్వడనే కఠిన సత్యం ఎందుకు అర్ధం కావడం లేదు?ఇవ్వాళ సమర్ధించడానికి సరైన కారణం లేక ప్రభుత్వం వ్యాపారం చెయ్యకూడదనే వికృత వాదనలనీ ప్రభుత్వ రంగ ఉద్యోగుల అవినీతి అనే తలా తోకా లేని కారణాల్ని భుజాన మోస్తున్న భాజపా అభిమానులలోనూ ఇతర పార్టీ నాయకులలోనూ అగ్రకులాలకి చెందినవాళ్ళే ఎక్కువమంది ఉండటం చూశాక కూడా  చలనం తెచ్చుకోవడం లేదు, ఎందుకని?బ్రాహ్మల్ని తిట్టుకునే జిహ్వచాపల్యం తప్ప తమ శత్రువు ఎవరో తమ యుద్ధరంగం ఎక్కడుందో తమ ఆయుధాలకి పదును ఎలా పెట్టుకోవాలో తెలిసి కార్యక్షేత్రంలో చూపించాల్సిన పోరాట తత్వం లేదా?

ప్రస్తుతం రాష్టరంలో అధికారం వెలగబెడుతున్న పార్టీ నాయకులు అమ్మకానికి పెట్టిన మరుక్షణం బీనామీల చేతనో ఇలాకాల చేతనో కొనిపించేసుకుందామనే కక్కుర్తితో అమ్మకానికి పెడితే బిడ్లు వేస్తాం అనే తరహాలో జనాలకి చెవిలో పూలు పెడుతున్నారు. అందర్నీ ప్రశ్నించేసి హడలగొట్టేస్తానని రాజకీయ ప్రయాణం మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్ తను ప్రశ్నించాల్సిన భాజపా చంకలోనే కూర్చుని చంటిపిల్లాడిలా నోట్లో వేలేసుకుని చూస్తున్నాడు.మిగిలినది ఇక తెలుగుదేశం పార్తీ మాత్రమే. పార్టీ కూడా మీడియా ముందు అధికార పార్టీని దోషి కింద చూపించి వచ్చే ఎన్నికల్లో తనకు గుడ్విల్ పెంచుకోవడానికే చూస్తున్నది గానీ ఒక అడుగు ముందుకేసి తమ పార్టీని స్టీల్ ప్లాంట్ కార్మికుల పక్కన నిలబేట్టటానికి సందేహిస్తున్నది.

బహుశః ఇప్పుడు అమ్మకాన్ని ఆపితే తాము అధికారంలోకి వచ్చాక లాభాల వైపుకి నడిపించలేమనీ అది తమకు అపకీర్తిని తెచ్చిపెడుతుందని భయపడుతున్నారా?అదే నిజమైతే అసలు మీడియా ముందు వ్యతిరేకించడం కూడా అనవసరమే.చంద్రబాబు నాయుడుకి నష్టాల్లో ఉన్న రాష్ట్రప్రభుత్వ మరియు ప్రభుత్వ రంగ సంస్థలను లాభాల బాట పట్టించిన చరిత్ర ఉంది. కాబట్టి చంద్రబాబు ఇప్పటి సమస్యను తనకు అనుకూలతను తెచ్చుకోవడం కోసం ఉపయోగించుకుంటే మంచి ఫలితం వస్తుంది.అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు ప్రజలకు అన్యాయం చేస్తున్నప్పుడు ప్రతిపక్ష పార్టీలు వాటిమీద పోరాడుతున్న ప్రజలకు ప్రత్యక్ష సహాయం చెయ్యనిదే ప్రజలు కూడా ఎన్నికల్లో వారికి వోటు వెయ్యరు.కాటా సుబ్బారావు గారిలాంటి కొందరు విశ్లేషకులు ప్రజలని ఆందోళనలోకి రమ్మని అంటున్నారు.కానీ, గత రెండేళ్ళ పాటు కరోనా లాక్ డౌన్ వల్ల సేవింగ్స్ మొత్తం ఖర్చు చేసుకుని ప్రజలు ఆర్ధికపరమైన సమస్యల్ని ఎదుర్కొంటున్నారు,ప్రస్తుతం వాళ్ళ చూపు మొత్తం వ్యాక్సిను వేయించుకుని పనుల్లోకి వెళ్ళి ఇదివరకటి స్థాయిలో మళ్ళీ నిలవలోకి వెళ్ళడం మీదనే ఉంది. మరోసారి లాక్ డౌన్ పెట్టాల్సి వచ్చేలా ఉందని వార్తలు వస్తున్నాయి.కాబట్టి సామాన్య ప్రజల్ని వీధుల్లోకి రమ్మని అడగటం కన్న ప్రతిపక్ష పార్టీల్ని ఉద్యమ కార్యాచరణ వైపుకి నడిపించడం మంచింది.

కొద్ది రోజుల లేక నెలల వ్యవధిలో 150 ఆలయాల మీద దాడులు జరుగుతూ ఉంటే ఇతర రాజకీయ పక్షాలు ఎన్ని డ్రామాలు చేసినా ఆగనివి ఒకే ఒకసారి చంద్రబాబు తన లౌకిక చాదస్తాన్ని వదిలించుకుని ముఖ్యమంత్రి యొక్క మతాన్ని ప్రస్తావించి ప్రకటన చేసి అద్భుతమైన సానుకూల స్పందన తెచ్చుకోవడమూ వెంటనే మంత్రం వేసినట్టు దాడులు ఆగిపోవటమూ ఎలా సాధ్యం అయ్యింది?అవి మూర్ఖ హిందూ గొర్రెల్ని రెచ్చగొట్టడానికి కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఉన్న తోడుదొంగలు చేసిన క్విడ్ ప్రోకో తరహా దాడులు అయితే మైలేజి చంద్రబాబుకు వెళ్ళడం చూసి తేలు కుట్టిన దొంగల మాదిరి గప్ చుప్ అయిపోవడం వల్ల కాదూ!చంద్రబాబు విశాఖ ఉక్కు కార్మికులకూ నిర్వాసితులకూ ప్రత్యక్ష సహాయం చేస్తూ మైలేజిని సాధిస్తే తిరిగి అదేలాంటి దృశ్యం రిపీట్ అవుతుందని అనుకుంటున్నాను నేను.

ప్రొఫెసర్ నాగేశ్వర రావు గారు రెండు లక్షల కోట్ల విలువైన ఆస్తుల్ని ముప్పయి రెండు కోట్లకి కొన్నవాడికి ఉక్కు ఉత్పత్తి చెయ్యడం కన్న మరొకడికి రెండు లక్షల కోట్లకి అమ్ముకుంటే వచ్చిపడే తక్షణ లాభాల గురించీ అయిదు వేల కోట్లో పది వేల కోట్లో భాజపాకి పార్టీ ఫండ్ ఇవ్వడం గురించీ పట్టిన పాయింట్లు బలమైనవే అనిపిస్తుంది గానీ ఇంకొచెం ప్రాక్టికాలిటీ చూపిస్తే మరింత భయానకమైన దృశ్యం కనబడుతున్నది నాకు.

కేంద్రప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంటు అమ్మకం నుంచి 32 వేల కోట్లు రాబడతామని చెప్తున్నది.నాగేశ్వర రావు గారు వేసిన రెండు లక్షల కోట్లు అనేది స్టీల్ ప్లాంట్ యొక్క న్యాయమైన విలువ.సరాసరి కట్టి శాతం కనుక్కుంటే 100 రూపాయల స్టీల్ ప్లాంట్ ఆస్తుల్ని 16 రూపాయలకి అమ్ముతున్నారు!అయితే, వందకి ఎనభై నాలుగు పైసల్ని వదులుకోవటానికి వాళ్ళు పిచ్చోళ్ళు కాదు.ఆస్తుల విలువ కట్టటం తెలియని దేవయ్యలూ కాదు అక్కడున్నది!నాగేశ్వర రావు గారు అనుకుంటున్నట్టు అమ్మకం/కొనుగోలు వ్యవహారం జరిగేది 32 వేల కోట్లకు కాదు, కొనుగోలు దారు రెండు లక్షల కోట్లు కడతాడు.ప్రతి వంద రూపాయలకీ 16 రూపాయల వైటుని ప్రభుత్వ రికార్డులకి ఎక్కిస్తారు, 84 రూపాయల బ్లాకుని భాజపా వాళ్ళు పార్టీ ఫండ్ కింద నొక్కేస్తారు!

ఒక్క విశాఖ స్టీల్ ప్లాంటు అమ్మకం వల్ల నూట అరవై ఎనిమిది వేల కోట్ల ప్రజాధనం భారతీయ జనతా పార్టీకి బ్లాక్ మనీ కింద మారుతున్నది.ఇలాంటివి ఇంకా 99 కంపెనీలు ఉన్నాయి.రామభక్తులకి దరిద్రం అంటేే చాలా ఇష్టం కదా - అన్నీ అమ్మడం పూర్తయ్యాక "సీతమ్మకు జేయిస్తీ చింతాకు పతాకామూఊ" అని రామదాసు కీర్తనలు పాడుకుంటూ అయోధ్యకి వెళ్ళి మోదీ గారి చేత చెవిలో పువ్వులు పెట్టించుకుని పరవశించితే చాలు - జన్మ ధన్యం అయిపోతుంది.

జై శ్రీ రాం!

1 comment:

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...