The-Problem-Of-The-Rupee-Its-Origin-And-Its-Solution
అనేది భీంరావ్ రాంజీ మన
దేశంలో రిజర్వ్ బ్యాంకును ఏర్పాటు చెయ్యటానికి కావలసిన పునాదిని సిద్ధం చెయ్యటం
కోసం రాసిన పుస్తకం.చాలామందికి, ముఖ్యంగా ఇప్పటికే
తాము సర్వజ్ఞులమని భావించేవారికీ మునుముందు సర్వజ్ఞులమని చెప్పుకోవాలనుకునేవారికీ
కూడా ఫిజిక్సూ కెమిస్ట్రీ లాంటివాటినే సైన్సుగా గుర్తించడం, పైన ఆర్ధికశాస్త్రం అంటే
చిన్నచూపు ఉండటం విచిత్రం!ఆధునిక విద్యావిధానం అని చెప్పుకునే ఇప్పటి విద్యాబోధనా
శైలి కూడా విచిత్రమే - మనిషి నేర్చుకోదగిన లేదా ఈ విద్యావవస్థని రూపొందించిన వారు
బోధించగలిగిన జ్ఞానం సమస్తం science, arts, technology అనే మూడు శాఖలుగా విభజించారు.దాదాపు ఈ
విద్యావిధానం ప్రకారం నడిచే స్కూళ్ళూ కాలేజీలూ యూనివర్సిటీలూ తమ విద్యార్ధుల ముందు
ఈ శాఖలనే ఉంచుతున్నాయి.ఇవ్వాళ ప్రపంచంలోని ఏ కాలేజీలో బోధించే ఏ సబ్జెక్టును
తీసుకున్నా ఈ మూడింటిలోకి ఒదగాల్సిందే:botany, zoology, physics, chemistry అనేవి science కిందకి వస్తాయి.history, sociology, psychology, economics అనేవి arts కిందకి వస్తాయి.engineering, IIT లాంటివి technology కిందకి వస్తాయి.భాషాశాస్త్రం అనేది పేరులో
శాస్త్రం అనే తోక తగిలించుకున్నప్పటికీ దాన్ని సాహిత్యం అనే ఆర్ట్ కిందకి తోసేసి
శాస్త్రపు హోదా ఉన్న సొంత పునాది ఇవ్వలేదు.అప్పుడప్పుడు historical science అని వాడినప్పటికీ చరిత్ర రచనని కూడా కళ కిందకే తోసేశారు.సైకాలజీ సోషియాలజీ అనేవాటి
పేరులో "లజీ" ఉన్నప్పటికీ వాటిని కూడా కళల కిందనే చెప్తున్నారు.
అన్నింటిలో దిక్కుమాలిన సబ్జెక్టు ఎకనామికు మాత్రమే - ఆ సబ్జెక్టు మీద అభిమానం
ఉన్నవాళ్ళు కూడా Economical Science అని గానీ Science of Economics అని చెప్పుకోవడం లేదు.పోనీ ఇదేమన్నా అంత
పనికిరానిదా అంటే తెల్లారి లేస్తే టూత్ పేష్టు నుంచి డబల్ కాట్ బెడ్డు వరకు అన్నీ
మన దగ్గిర డబ్బు లేందే వాటంతటవి నడిచి మనింట్లోకి రావు, ఆ డబ్బు అంటే ఏమిటో
చెప్పేది ఎకనామిక్సు.మరి, అప్పటికే తాము
సర్వజులమని భావించేవారికీ మున్ముందు సర్వజ్ఞులమని చెప్పుకోవాలనుకునేవారికీ కూడా
ఆర్ధికశాస్త్రం అంటే చిన్నచూపు ఉండటంలోని రహస్యం ఏమిటి?
భౌతిక రూపం ఉండి వాటి యొక్క ధర్మాలను
నిర్వచించి నిర్ధారించి ప్రయోగించి ఉపయోగించుకోగలిగిన అంశాలను గురించి చెప్పేవి
కాబట్టి botany, zoology,
physics, chemistry అనేవాటికి science హోదా ఇచ్చారు.arts కింద చేర్చిన
వాటికి ఈ వెసులుబాటు లేదు - assimilation,
observation, analysis, classification, conclusion తప్ప experiment చేసి evidence చూపించడం దాదాపు అసాధ్యం! అయితే, ఆర్ధికశాస్త్రం తీసుకున్న రూపాయి కంటికి కనపడుతుంది కదా అనే అసందేహం రావచ్చు
మీకు - కానీ, కనిపించని దేవుణ్ణి ఆరాధించడానికి మతపెద్దలు
కనిపెట్టిన అర్చామూర్తుల లాగే మనం వాడుతున్న రూపాయి అనేది ద్రవ్యం/ధనం/డబ్బు అనే
భావానికి దృశ్యరూపం మాత్రమే!చాణక్యుడు రాసిన అర్ధశాస్త్రం ఇప్పుడు మనం అనుసరించడం
లేదు గానీ అది శాస్త్రమే - చాణక్యుడు తన అర్ధశాస్త్రంలో భౌతిక రూపం ఉండి వాటి
యొక్క ధర్మాలను నిర్వచించి నిర్ధారించి ప్రయోగించి ఉపయోగించుకోగలిగిన అంశాలను
గురించే చెప్పాడు.ఇప్పటి ఆర్ధిక చట్రానికి అది పనికిరాకపోవడం కూడా అందుకే!
ఇవ్వాళ మన వాడుతున్న రూపాయి నుంచి దాన్ని
వాడుకోవాల్సిన పద్ధతులు సమస్తమూ ఈస్టిండియా కంపెనీ 1892CE నుంచి దశల వారీ
మనమీద రుద్దిన కొత్త అందమైన రూపం! మన దేశపు ప్రాచీనమైన ధనరూపం శంఖమే - ఇప్పుడు
ఆలయాల్లో కనిపించే శంఖాలు కాదు,
మన చిన్నప్పుడు ఆటల్లో
వాడే గవ్వలు ఒకానొకప్పుడు డబ్బు!
అసలు, డబ్బు లేకుండా బతకడం
కష్టమా?
డబ్బు గురించి B.R లాంటి మేధావులు
ఏం చెప్పారో అవి చాలా గంభీరంగా ఉంటాయి.వాళ్ళు రాసేవి సిద్ధాంత గ్రంధాలు, అంటే వాటిని అర్ధం చేసుకుని ఉపయోగించుకోవాలంటే అప్పటికే మనకు ఎకనామిక్స్ యొక్క
బేసిక్స్ తెలిసి ఉండాలి.వేదం "ధన మూలమిదం జగత్!" అని చెప్పింది.బైబిల్ money is the root of all evil అని చెప్పింది.చైనాలో ఒక పేరూ అమెరికాలో ఒక
పేరూ ఇండియాలో ఒక పేరూ ఉన్నప్పటికీ దీని లక్షణం ఒక్కటే - ఇదొక medium of exchange/మారకద్రవ్యం, అంతే!
నీకు ఇప్పటికిప్పుడు ఆవుపాలు కావాలి, కానీ నీ దగ్గిర గొర్రెలు మాత్రమే ఉన్నాయి.నాకు ఇప్పటికిప్పుడు ఉన్ని కావాలి, కానీ నా దగ్గిర ఆవులు మాత్రమే ఉన్నాయి.ఏం చెయ్యాలి?నా ఆవుల్ని నువ్వూ నీ గొర్రెల్ని నేనూ మార్చుకుంటే ఇద్దరి అవసరాలూ
తీరుతాయి.అయితే ఇలా మార్చుకునే వస్తువులు అప్పటికి విలువలు నిర్ణయించబడినవైతే వాటి
ధరల హెచ్చు తగ్గుల్ని బట్టి ఎవరో ఒకరికి కష్టం/నష్టం విపరీతమయ్యే అవకాశం ఉంది.అలా
జరగకూదదనుకుంటే వాటి విలువల నిష్పత్తిని బట్టి ఒక ఆవు - రెండు గొర్రెలు లేదా ఒక
గొర్రె - రెండు ఆవులు అన్నట్టు మార్చుకుంటే సరిపోతుంది. వస్తువులకు
విలువల నిర్ణయం మార్కెట్ చేస్తుంది,
వాటి మారకం నిష్పత్తి నిర్ణయం రాజ్యం చేస్తుంది.ఆ
నిష్పత్తికి ఒక చిహ్నం ఇస్తే అదే "డబ్బు!" అవుతుంది.దీన్ని నిర్ణయించిన
రాజ్యం సరిహద్దుల లోపల స్వేచ్చగా తిరగాలంటే ఆ రాజ్యం యొక్క డబ్బు నీ దగ్గిర ఉండటం
తప్పనిసరి, కదా!
"కలడు కలండనెడువాడు కలడో లేడో" అనే
సందేహం దేవుడి గురించి రావటం సహజమే!విశ్వంలో ఎంత మేర చూసినా నక్షత్రాలూ సూర్యుడూ
చంద్రుడూ బొంగరాల్లా తిరగడమే కనిపిస్తుంది తప్ప వీటిని తిప్పుతున్న శక్తి కనపడటం
లేదు కదా - అంత మాత్రాన ఎవరూ తిప్పకుండా అలా తిరిగెయ్యడానికి వాటికేం పిచ్చా
వెర్రా!అలాగే మానవ సమూహాన్ని తన చుట్టూ తిప్పుకుంటున్న డబ్బు/ధనం/సంపద కూడా కంటికి
కనిపించడం లేదు - మనం చూస్తున్న రూపాయి, యెన్, డాలర్ అనేవి మనం ఏర్పరచుకున్న రూపాలు మాత్రమే
స్వామీ గుర్తుంచుకోండి!
అవును, డబ్బు లేకుండా బతకడం కష్టమే!
వస్తుమార్పిడి నుంచి పుడుతున్న సమస్యల్ని
చక్కదిద్దడానికి ఆర్ధికవేత్తలు ఇప్పటికీ అలుపెరుగని
పోరాటం చేస్తూనే ఉన్నారు.డబ్బు అనేది ఒక ముసుగు అని తెలిసినవాళ్ళు కూడా అది లేని
ఆర్ధికశాస్త్రం ఎట్లా ఉంటుందో చెప్పలేకపోతున్నారు.తన సరుకుల్ని అవసరం ఉన్న ఇతర్లకి
అమ్ముకుని బతకాలనుకున్న ప్రతివాడికీ డబ్బుతో అవసరం లేకుండా పని గడుస్తుందా?వ్యాపారం సహాయం చెయ్యనప్పుడు వ్యవసాయమూ
ఆగిపోతుంది, వ్యవసాయం లేకుంటే
వ్యాపారానికి పునాది కూడా ఉండదు! కాబట్టి ఈ వ్యాపారం మీద ఆధారపడిన ఆర్ధికచట్రం
అదుపు తప్పిపోకుండా ఉండాలన్నా ఇవ్వటం-పుచ్చుకోవటం అనే సంబంధాలను మితిమీరిపోకుండా
అదుపులో ఉంచాలన్నా ఒక క్రమబద్ధమైన ద్రవ్యవిధానం తప్పనిసరి అని మనం తెలుసుకోవాలి. మొఘల్
సామ్రాజ్య పతనం నాటికి ఎంత తక్కువ చేసి చూపించాలన్నా కుదరనంత వైభవోపేతంగా
బతుకుతున్నది భరతఖండం - వ్యాపారం చాలా ఎక్కువ స్థాయిలో జరుగుతున్నది, పెట్టుబడుల రంగం(financial
system) విస్తృత స్థాయిలో
పనిచేస్తున్నది.( hariSbabu:మొఘల్ సామ్రాజ్యం అనేది ఇప్పుడు మన చదువుకుంటున్న
చరిత్రని బట్టి ఆ కాలానికి సంబంధించిన రాజ్యాలలో ఒకటి. అది తప్ప ఇంకొకటి తెలియకపోవడం
వల్ల ఆ పేరు వాడటమే తప్ప దేశమంతా మొఘలుల అధీనంలో లేదనేది గుర్తుంచుకోవాలి.
ఉదాహరణకి బాబర్, శ్రీకృష్ణదేవరాయలు
సమకాలికులు.పానిపట్ యుద్ధంలో గెల్చిన వూపుతో బాబరు గనక ముందుకు సాగి
కృష్ణదేవరాయల్ని ఢీకొని ఉంటే ఇవ్వాళ మనం మొఘల్ సామ్రాజ్యం గురించి చెప్పుకునే
అవకాశం కూడా ఉండేది కాదు. బాబరు 12,000 మంది సైన్యం లోడీ లక్షమందిని
ఓడించడానికి మన దేశపు ఎర్ర/ఎర్రి చరిత్రకారులు అనేకమైన కారణాలు చెప్పీ అసలు
కారణాన్ని దాచేస్తున్నారు.బాబరు గన్ పౌడర్ వాడటంతో లోడీ సైన్యం పిట్టల్లా రాలిపోయి
గెలుపు బాబరుకు దక్కింది.బాబరుకు భారత భూభాగం మీద అది తొలి యుద్ధం. బాబరు లక్ష్యం
కూడా అప్పుడే సమస్త భారతావనినీ ఆక్రమించడం కాక ఒక చిన్నపాటి భూభాగం తన అధీనంలోకి
వస్తే చాలునని మత్రమే.అలా కాకుండా ఔరంగజేబులా దుడుకుతనం చూపించి కృష్ణదేవరాయల్ని
కెలికి ఉంటే మట్టానికి మునిగిపోయి ఉండేవాడు!)
బ్రిటిష్ వర్తక సమూహం రాక ముందరి కాలానికి
బంగారం, వెండి మారకద్రవ్యాలుగా చెలామణీలో ఉందేవి.హిందూ
ప్రభువులు బంగారం వైపుకు మొగ్గు చూపితే ముస్లిం నవాబులు వెండి వైపుకు మొగ్గు
చూపేవారు. ఒఘల్ సామ్రాజ్యానికి గట్టి పునాదులు వేసిన అక్బర్ కాలం నుంచీ బంగారంతో
చేసిన mohur వెండితో చేసిన rupee 175 గ్రాముల సమానమైన
బరువుతో ఉండేవి.వేరే లోహాలతో కలపకుండా స్వచ్చమైన లోహాన్ని వాడేవాళ్ళు, కానీ విలువ ఒకటేనా అంటే చెప్పడం కష్టమే! సాంకేతికంగా
చూస్తే వీటిని double standard
అనటం కన్న parellel standard అనటమే సరైనది.ఎందుకంటే, ఒకే వస్తువును కొనటానికీ అమ్మటానికీ కొందరు మొహరునీ కొందరు రూపాయినీ
వాడేవాళ్ళు - కొన్నిసార్లు ఈ రెంటిమధ్యన కూడా కొనటం-అమ్మటం అనే వ్యవహారం
నడిచేది.ఖచ్చితమైన మారకపు విలువలు నిర్దేశించని ఈ రకమైన వ్యవస్థ వల్ల ఎక్కడో అక్కడ
ఎంతోకొంత అవాంఛిత నష్టం సంభవించే అవకాశం ఉంది.అయితే, ఒక విచిత్రమైన విశేషం
ఏమిటంటే స్థిర విలువ లేని మొహరూ రూపాయిల మధ్యన ఏర్పడుతున్న ఇంతటి గందరగోళమూ కూడా dam అనే పేరున్న స్థిరవిలువ కలిగిన అధికారికమైన రాగినాణెం
సర్దుబాటు చేస్తూ ఉండేది. అంటే,
ఆర్ధిక ప్రగతి దృఢంగా
ఉండాలంటే స్థిరమైన విలువ కలిగిన మారకద్రవ్యం తప్పనిసరి అని తెలుస్తున్నది కదా!
దీని గురించి Dr.P.Kelly ఏమో ఈ ధరవరల్ని
మార్కెట్ శక్తులు నిర్ణయించేవని అభిప్రాయపడుతుంటే, Sir R.Temple మాత్రం "In anciemt amd medival India the relative
value of the coins of each metal was fixed by the state, and all were legal
tender virtually without any formal limitation" అన్నారు. ఆయనే మరొక చోట, "The earliest Hindu Currency was in
gold with a single standard.The Mohammedans introdced silver, and in later
times up to British rule there was a double standard, gold and silver" అని కూడా అన్నారు. మొఘలులు inter jura majestatis పేరున కఠినమైన చట్టాలను చేసి నాణేల తయారీని తమ
అధీనంలోనే ఉంచుకున్నారు.రాజ్యంలో అనేక చోట్ల టంకశాలల్ని ఏర్పాటు చేసినా ఏ ఒక్క
చోటా నాణ్యతలో రాజీ పడలేదు.Imperial
Gazetteer of India(vol. IV., p 514) ప్రకారం
మొఘల్ సామ్రాజ్యపు తొలినాళ్ళలో ఒకే ఒక్క టంకశాల ఉండేది.
షేర్ షా మొదటిసారి టంకశాలల సంఖ్యని పెంచితే
తర్వాత వచ్చిన అక్బర్ వంటివారు ఆ సంప్రదాయాన్ని కొనసాగించారు - రెండవ బహదూర్ షా
కాలంలో ఆ సంఖ్య 200కి పెరిగింది.1872-73 నాటి East India Moral and Material Progress
Report చెప్పిన దాని ప్రకారం
ప్రతి టంకశాలలోనూ బంగారం, వెండి, రాగి నేణేల్ని
కలగాపులగం చేసి ముద్రించేవారు కాదనీ కొన్ని టంకశాలలు బంగారు నాణేల్నీ కొన్ని
టంకశాలలు వెండి నాణేల్నీ కొన్ని టంకశాలలు రాగి నాణేల్నీ ముద్రిస్తూ ఉండేవనీ
తెలుస్తున్నది.మొఘల్ సామ్రాజ్యం బలంగా ఉన్నంతకాలం ఒకే ఒక కంద్రీకృతమైన అధికార
పరిధికి లోబడి ఉన్న రాజ్యాంగ వ్యవస్థ నియంత్రణ కింద టంకశాలలు ఉండటంలో ప్రమాదం కన్న
ప్రమోదమే ఎక్కువ అనే సత్యం నిరూపణ అవుతూ వచ్చింది.ఎప్పుడైతే మొగల్ సామ్రాజ్యం
బలహీనపడి ఈ టంకశాలలు ఒకే గొడుగు కిందనుంచి విడివడి స్థానికి ప్రభువుల అధీనంలోకి
వెళ్ళినప్పుడు తమ తమ అధీనంలో ఉన్న నాణేలను బలోపేతం చెయ్యగలగడంలో ఆయా రాజులు
చూపించిన సమర్ధతాసమర్ధతలే ఆయా రాజ్యాల ఉత్ధానపతనాల్ని శాసించాయనడంలో అతిశయోక్తి
ఎంతమాత్రం లేదు.కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్టు ప్రతి పరిపాలకుడూ తన ఆధీనంలోకి
వచ్చిన టంకశాలల్ని అతి వేగంగా పనిచేయించి తన సొంత నాణేల్ని ముద్రించి వదలటంతో
ప్రజలలో వర్తకులలో చెలరేగిన గందరగోళమే ఆనాటి
వ్యాపార సామాజిక ఆధ్యాత్మిక సాహిత్య కళా రంగాలలోనూ ప్రతిఫలిచిందనేది తులనాత్మక దృష్టితో
ఆనాటి చరిత్రను అధ్యయనం చేసిన ప్రతి ఒక్కరికీ బోధపడే వాస్తవం!ఎవరికి వారు తమ
నాణేల్నీ తమ వ్యాపారాల్నీ తమ సైన్యాల్నీ తమ రాజ్యాల్నీ బలోపేతం చేసుకోవాలనే
ఆతురతలో అప్పటివరకు ప్రజలూ వ్యాపారులూ అలవాటు పడిన మొఘల్ సామ్రాజ్యపు కనీసపు
ప్రమాణాల్ని కూడా పట్టించుకోకపోవటం anarchism with debased coinage అనే ప్రమాదాన్ని తెచ్చిపెట్టారు.
దీనివల్ల జరిగే మొదటి అవాంచిత పరిణామం ఒక
రాజ్యపు నాణెం మరొక రాజ్యంలో చెల్లకపోవటం.కొత్త రాజ్యంలో అడుగుపెట్టిన ప్రతిసారీ
తమ రాజ్యపు నాణేనికి కొత్త రాజ్యపు బంగారం విలువతో మారకం చేసి కొత్త రాజ్యపు నాణేల్ని
కొనుక్కోవాల్సి వస్తుంది - అచ్చం ఇప్పుడు మనం విదేశాలకి వెళ్తున్నప్పుడు జరిగే
వ్యవహారమే జరుగుతుంది.అప్పటి వరకు ఒకే సామ్రాజ్యంలోని గనులూ పొలాలూ నదులూ కూడా
విడిపోయి సరుకుల రవాణా సుంకాలు పెరగడంతో వస్తువుల ధరలు పెరగడం కూడా తప్పనిసరి
అవుతుంది. అదీగాక, వ్యాపారస్థులు
ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళలేక తమ నాణేల్ని గుర్తించే దేశాలతో మాత్రమే
వ్యాపారం చెయ్యగలుగుతారు,ఆ కొత్త దేశపు నాణేల్ని తమ సొంత దేశం
గుర్తించకపోతే తిరిగి వచ్చేటప్పుడు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఈ రకమైన వ్యవహారం సుదీర్ఘకాలం నడిస్తే medium of exchange మాయమైపోయి
ఆధునికమైన trade money కుదించుకుపోయి పూర్వకాలపు barter money పెరిగిపోతుంది. అదీ గాక, అనేక రకాల నాణేలు చలామణీలో ఉండటమూ ఒక రాజ్యపు నాణేన్ని మరో రాజ్యం
ఒప్పుకోకపోవడమూ సరుకుల మారకంతో పాటు నాణేల మారకం అనే మరో తలనెప్పిని
తెచ్చిపెడుతుంది.ఇదీ చాలదన్నట్టు రెండు నాణేల మీద ఒక రూపాయి విలువనే
సూచిస్తున్నప్పటికీ లోహాన్ని బట్టి చూస్తే వస్తుగతమైన విలువలు ఒక్కటి కావు.మారకం
వ్యవస్థలో ఉన్న లోపాల్ని సరిచెయ్యాల్సిన నాణేల వ్యవస్థ మొఘల్ సామ్రాజ్య పతనంతో పాత, కొత్త సమస్యల్ని కలిపి కొట్టెయ్యడం మొదలుపెట్టింది.డబ్బు లేకపోవడం ఒక దరిద్రం
అయితే ఉన్న డబ్బు పనికిరానిదయితే కరువులో అధికమాసం అన్నట్టు తయారవుతుంది
పరిస్థితి!మొదటి స్థితి కొంత నయం,
"రానిది రాదు
సురాసురులకునైన పోనిది పోదు భూసురులకునైన!" అని మధ్యతరగంతి మందహాస్యాలతో
సరిపెట్టుకు బతికెయ్యొచ్చు.చెమటోడ్చి సంపాదించిన డబ్బు పప్పుబెల్లాలకి కూడా
సరిపోకపోతే గుక్కపట్టి ఏడవటం తప్ప చెయ్యగలిగింది ఏముంది?
మొఘల్ సామ్రాజ్య విఛ్చిన్నం వల్ల పేరుకుపోయిన
చెత్తడబ్బును మంచిడబ్బు కింద మార్చడం వాళ్ళ తర్వాత వచ్చిన East India Company భుజస్కంధాల మీద పడింది.మొట్టమొదటిసారి 1806,ఏప్రిల్ 25న కంపెనీ
డైరెక్టర్లు అప్పటికి తమ అధీనంలోకి వచ్చిన ప్రాంతాలలో ఆర్ధిక సంస్కరణలు
మొదలుపెట్టారు.
"17.It is an opinion supported by the
best authorities and proved by experience, that coins of gold and silver cannot
circulate as legal tenders of payment at fixed relative values...without loss;
this loss is occasioned by the fluctuating value of the metals of which coins
are formed. A proportion between the gold and silver coins is fixed by law,
according to the value of the metals, and it may be on the justest principles,
but owing to the change of circumstances gold may become of greater value in
relation to silver than at the time the proportion was fixed, so therefore
becomes profitable to exchange silver to gold, so the coin of that metal is
withdrawn from circulation to gold; and if silver should increase in its value
in relation to gold, the same circumstances would tend to reduce the quantity
of silver coin in circulation. As it is impossible to prevent the fluctuation
in the value of the metals, so it is also equally impracticable to prevent the
consequences thereof on the coins made from these metals....To adjust the
relative values of gold and silver coins according to the fluctuations in the
values of the metals would create continual difficulties, and the establishment
of such a principle would of itself tend to perpetuate inconvenience and loss."
పైన చెప్పిన బలమైన కారణాలతో ఈస్ట్ ఇండియా
కంపెనీ వారు పాత బహుళ నాణేల వ్యవస్థను తిరస్కరించి భవిష్యత్ భారతదేశపు ఆర్ధికం
ఏకైక నాణెపు వ్యవస్థ వైపుకు నడిచేటందుకు దారులు వేశారు.( hariSbabu:ఇది గ్రంధకర్త లండన్ కాలేజికి
సమర్పించిన సిద్ధాంతగ్రంధం.ఇక్కడ ఉటంకించినది ఈస్ట్ ఇండియా కంపెనీ వారి
విశ్లేషణ.ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఒక వ్యాపార సంస్థ.తన వ్యాపారం కోసం తనకు
లాభాలు ఎక్కువ రావడం కోసం నాణేల ముద్రణలో ప్రభుత్వం ఎలాంటి పద్ధతి అనుసరిస్తే
బాగుంటుందో ఇస్తున్న సలహా.కానీ, రాజ్యం/ప్రభుత్వం
నాణేల్ని ముద్రించేదీ ముద్రించాల్సిందీ కేవలం వ్యాపారస్తుల కోసం కాదు కదా!పైన
చెప్తున్న బంగారం-వెండి నాణేల సాపేక్ష విలువలను బట్టి ప్రజలు ఒక నాణేన్ని బహిరంగ
చెలామణీ నుంచి తప్పించడం అంటే ఏమిటి?తమ
రోజువారీ అవసరాల కోసం తక్కువ విలువున్న నాణేల్ని వాడుకుంటూ ఎక్కువ విలువున్న
నాణేల్ని దాచుకుంటున్నారు, అవునా?అలా దాచుకున్న డబ్బును కూడా
ప్రజలు అనంతకాలం వరకూ దాచుకోరు, ఎవరో
పిసినార్లు తప్ప - ప్రత్యేకమైన వస్తువుల్ని కొనటానికి ఆ ఎక్కువ విలున్న నాణేల్ని
వాడుకోవటం కోసమే దాచుకుంటారు.ప్రజల దీర్ఘకాలికమైన కొనుగోలు శక్తికి వాళ్ళ దాపరికమే
అసలైన చోదకశక్తి.ఇక వ్యాపారులకి లాభం రావటం అనేది వాళ్ళు అమ్మే సరుకుల నాణ్యతని
బట్టి ఉంటుంది, అలా ఉండటమే న్యాయం.వాళ్ళకి
కావలసింది తమ సరుకుల నాణ్యతకి తగ్గ ధర కదా, దానికోసం ఏ నాణేన్ని వాడినా ఒకటే కదా! తమ లాభం కోసం ప్రజలని సేవింగ్స్
నుంచి దూరం చేస్తే "ప్రజల దీర్ఘకాలిక కొనుగోలు శక్తి నశించితే వ్యాపారస్తులు
అమ్మిన సరుకుల్ని కొనేవాళ్ళు ఎవరు ఉంటారు?" అనే
కామన్ సెన్సు కూడా లేకుండా రాజ్యం/ప్రభుత్వం ముద్రించే ప్రతి నాణెమూ నిరంతరం
తమవద్దకే చేరాలి తప్ప ప్రజల వద్ద నిలవ ఉండకూడదనే భావం ఈ సూత్రీకరణలో దాగి ఉంది.అప్పటికే
ఆర్ధికశాస్త్రంలో అపారమైన జ్ఞానమున్న ఈ గ్రంధకర్త అసలు ఈ విషయాన్ని పట్టించుకోకుండా
దీనిని సంస్కరణ కింద పేర్కొంటున్నాడు.)
వెండి నాణేల్ని ఏకైక మారకంగా ప్రకటించారు,ఇక అన్ని రకాల ఆర్ధిక కార్యకలాపాలు వీటి సాయంతోనే జరుగుతాయి.బరువులోనూ
ముఖవిలువలోనూ ఇది మొఘల్ సామ్రాజ్యపు నాణేనికి భిన్నమైనది.పైసా, అణా, రూపాయి అనే కొలతలు యధావిధి కొనసాగుతాయి. ఈ కొలతల్ని ఇలా నిర్ధారించటం అనేది మొఘల్
సామ్రాజ్య పతనానంతరం పుట్టిన చిల్లర మల్లర నాణేల కొలతలతో రమారమి సారూప్యత కోసం
చేసినది - అక్కడ జరిగినది వెనకటి మొఘల్ వెండి నాణెపు కొలతలని పునరుద్ధరించటమే తప్ప
మరొకటి కాదు, అది పురోగామి
దృక్పధంతో చేసిన తిరోగమనం!(hariSbabu:చదువరులు ఇక్కడొక విచిత్రాన్ని
గమనించాలి.మొఘల్ నాణెం తన వైభవాన్ని కోల్పోవడమూ మొఘల్ సామ్రాజ్య వైభవం అంతరించడమూ
దాదాపు ఒకేసారి జరిగాయి.ఏది ముందు ఏది వెనక అనేదాని గురించి ఇంతకాలం తర్వాత
ఖచ్చితమైన సూత్రీకరణ చెయ్యదం కష్టం గానీ ఆ రెండూ పరస్పరాశ్రితాలు అని మాత్రం
తెలుస్తుంది, కదా!తర్వాత స్వతంత్రించిన సామంత
రాజ్యాల్లో ఏ ప్రభువు తన నాణేన్ని బలోపేతం చేశాడో ఆ ప్రభువు కీర్తిమంతుడు కావటం
కూడా యాదృఛ్చికం కాదు.ఉదాహరణకి గజపతులూ కృష్ణదేవరాయలూ ఆనాటి సమకాలీన చరిత్రలో
అన్ని విషయాల్లోనూ పోటాపోటీగా ఉన్నా ఇవ్వాళ మన కాలానికి కృష్ణదేవరాయలకే ఎక్కువ
పేరు రావడానికి కృష్ణదేవరాయల పేరుమీద లభ్యమౌతున్న ఖండాంతర వాణిజ్యానికి సంబంధించిన
సాక్ష్యాలు గజపతులకి లేకపోవడాన్ని గమనించితే తెలుస్తుంది.అలాగే బలహీన పడి ముక్కలు
చెక్కలైన మొఘల్ నాణేన్ని సంస్కరించి బలోపేతం చేసిన బ్రిటిషర్లకి మొఘలులని మించిన
స్థాయిలో అధికార వైభవాలు దక్కాయి. దీనిని బట్టి ఒక రాజ్యపు
నాణెం యొక్క బలమే ఆ రాజ్యపు వైభవానికి పునాది అని తెలుస్తున్నది కదూ!అసలైన
విచిత్రం యేమిటంటే,
ఆర్ధిక
ప్రాతిపదికన చరిత్రని వ్యాఖ్యానించాల్సిన కమ్యునిష్టు చరిత్రకారులతో సహా భారతదేశపు
విశ్లేషకులు అందరూ అతిముఖ్యమైన ఈ కోణాన్ని విస్మరించి మన పరాధీనతకి మన రాజుల
అనైక్యత మూలకారణం అనీ బ్రిటిషర్ల విభజించి పాలించే కుటిల నీతి అనీ చెప్పి
సరిపెట్టేశారు. మన సంస్కృతిలో రాజనీతికి
నిలువెత్తు రూపమైన చాణక్యుడికి కుటిలుడు అని పేరు వచ్చిందే అతను ఈ కుటిలనీతిని అనుసరించటం
వల్ల అయినప్పుడు
ఇదే కుటిలనీతిని ఇంగ్లీషువాళ్ళు పాటిస్తే తప్పెలా అవుతుంది?అదే చాణక్యుడు రాజు విజిగీషువు
అని చెప్పాడు. అంటే,
ఒక రాజు తన
సమర్ధతని బట్టి గ్రామం, నగరం, జనపదం, కోట, రాజ్యం,సామ్రాజ్యం, ప్రపంచరాజ్యం అంటూ నిరంతరం
రాజ్యాన్ని వ్యాపింపజెయ్యడమే అతని లక్ష్యం కావాలి అని చెప్పినప్పుడు ఆ పనినే
ఇంగ్లీషువాళ్ళు చేస్తే దోషం ఏమిటి? పైన
చెప్పిన సిద్ధాంతాలన్నీ ఈ నాణెపు బలం అనేదాన్ని వదిలేసిన అసమగ్ర సిద్ధాంతాలు, కనకనే అవి శాస్త్రీయమైనవి
కావు.అందువల్లనే మానవాళికి వాటివల్ల కలుగుతుందని వాటిని ప్రవచించినవాళ్ళు చెప్పిన
ప్రయోజనాలు నెరవేరడం లేదు.బహుశా ఇప్పుడు మనం చేస్తున్న ఈ అధ్యయనం పూర్తయితే What is to be done? అనే ప్రశ్నకి This is to be done! అనే జవాబు రావచ్చు, హీనపక్షం మన జ్ఞానం కొంత
పెరగవచ్చు!కాబట్టి ఇక్కడివరకు వచ్చిన మిత్రులు విసుగు అనుకోకుండా నాతోపాటు అధ్యయనం
కొనసాగించితే బాగుంటుంది.) ఈ 180 గ్రాముల లెక్కలోని మరొక అనుకూలత భారతీయ
కొలమానంతో యూరోపియన్ కొలమానాన్ని జోడించటంలో కనపడుతుంది.ఈ రెండు కొలతలూ ఎలా
సరిపోతున్నాయో చూద్దాం - 8 Indian
ruttees = 1 Indian massaa = 15 British troy grs,12 Indian massaas = 1 Indian tola = 180 British troy grs, 80 Indian tolas = 1 Indian seer = 2.5 British troy pounds,40 Indian seers = 1 Indian maund = 100 British troy pounds.
అయితే, Captain Jervis అనే మేధావి
మాత్రం తను రచించిన The
Expediancy and Facility of establishing the Metrological and Monetary Systems
throughout India on a Scientific Basis, grounded on an Analytical Review of the
weights, Measures and coins of India అనే ఉద్గ్రంధం రాసి ఈ రూపాయిని 180 troy grs బరువుతో స్థిరపరచటాన్ని
తీవ్రంగా వ్యతిరేకించాడు. (hariSbabu:ఎందుకు
వ్యతిరేకించాడో తెలుసుకుందామని చూస్తే ఆ గ్రంధం దొరకలేదు. ప్రస్తుతానికి నాకైతే
ఇంగ్లీషువాళ్ళు చేసిన ఈ మొదటి సంస్కరణ అప్పటి పరిస్థితుల్ని బట్టి చూస్తే
బాగానే
ఉంది.సమగ్రమైన సత్యం బోధపడాలంటే దీని తర్వాత అదికూడా చదవాలేమో!)
మిశ్రలోహం ఎంత కలపాలన్నది పెద్ద సమస్య కావడంతో 1803లో British Commitee on
Mints and Coinage ఏర్పాటు చేస్తే
అది 11 వంతుల అసలు లోహం 12వ వంతు మిశ్రలోహం ఉంచితే బాగుంటుందని చెప్పింది.మళ్ళీ అసలు లోహం 1 రూపాయి నాణేనికి 165 grs ఉండాలన్న మాట మాత్రం మర్చిపోకూడదు. ఆనాటి పరిస్థితులను గురించి ఏమీ తెలియని ఇప్పటి
కళ్ళతో అప్పటి monimetallism సంస్కరణలను చూస్తే అయోమయంగానూ హ్రస్వదృష్టితో
తీసుకున్న నిర్ణయంగానూ అనిపించటం సహజమే.కానీ, అప్పటికి అవి
మంచి నిర్ణయాలే!అప్పుడు ఉన్న మూడు ఆంగ్లేయ పాలిత ప్రాంతాలు(Presidencies) కుంఫిణీ దొరతనం కిందకు రాగానే మొదట చేసినది
మొఘలుల కాలం నాటి mohur,
pagoda, ruppeeల మధ్యన ఉన్న double standardకు ఒక చట్టబద్ధమైన నిష్పత్తిని ఏర్పాటు చెయ్యటం
మాత్రమే - ఇది ఏ ఒక్క ప్రెసిడెన్సీలోనూ విజయవంతం కాలేదు.
1766 జూన్ 2న Bengal Government 179.66 grs troyతో 149.92 grs troy స్వచ్చమైన లోహం
ఉండేటట్టు ఒక బంగారు నాణేన్ని విడుదల చేసింది.ఇది మార్కెట్ పాటిస్తున్న 14.81కి 1 అనే నిష్పత్తికి
దూరం అయ్యి రెండు నాణేల మధ్యన ఉండాల్సిన సమతౌల్యం దెబ్బతినడంతో బెంగాల్
వెండినాణెం చైనాకీ మద్రాసుకీ బొంబాయికీ drain అయిపోయింది -
దీన్ని సరిచెయ్యటానికి 1769 మార్చి 20న 190.773 grs troy కొలతతో 190.086 grs troy బంగారం ఉండేటట్టు
బంగారు మొహరును విడుదల చేస్తే అందులోని స్వచ్చమైన బంగారపు విలువ 16 సిక్కా రూపాయలకి సమం అయ్యి 14.81కి 1 అనే అక్కడి
స్థానికమైన legal market ratioతో సరిపోయింది గానీ 14కి 1 అనే ఇండియన్ legal market ratioకీ 14.61కి 1 అనే యూరోపియన్ legal market ratioకీ ఎక్కువ కావటంతో రెండవ సంస్కరణ మొదటి సంస్కరణ
కన్న మెరుగైన ఫలితాన్ని చూపించక బెంగాలు నాణెం పరిస్థితి కొండ నాలిక్కి మందేస్తే
ఉన్న నాలిక వూడినట్టయ్యింది.
అలాంటి ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో
బెంగాలు ప్రభుత్వం1788 డిసెంబర్ 3న బంగారు
నాణేన్ని ఆపేసి monometallism వైపుకి మొగ్గు చూపుతూ 1790 నాటి బంగారు నాణెపు కొలతల్ని పునరుద్ధరించి మొహరునీ రూపాయినీ స్థిరవిలువకు
అనుసంధానించకుండా వదిలేసింది.1793 వరకు మళ్ళీ ఏ సంస్కరణలూ చేపట్టలేదు. అప్పుడు 190.895 grs troyతో మొహరునీ 189.403 grs troyతో బంగారు
నాణేన్నీ విడుదల చేసి వీటిని 16 సిక్కా రూపాయలకి సమానం చేసింది.అయితే ఈ మూడవ
సంస్కరణ కూడా 1766, 1769ల నాటి సంస్కరణల మాదిరిగానే విఫలం అయ్యాయి.
మద్రాసు ప్రెసిడెన్సీ ఆర్ధిక చరిత్ర కూడా బెంగాలు
ప్రెసిడెన్సీ ఆర్ధిక చరిత్ర వలెనే ఉన్నది.బ్రిటిష్ ప్రభుత్వం 1749లో మొదటిసారి bimetallism సంస్కరణలు చేసింది - ఇప్పుడు మార్కెట్ వద్ద 350 Arcot rupees మరియు 100 Star pagodas సమానం
అవుతాయి.దీనివల్ల బంగారు నాణెం కన్న పగోడా విలువ తగ్గి బంగారు నాణెం మాయమైపోయింది. దీనితో ప్రభుత్వం 1750 డిసెంబరు నుంచి రెండంచెల
ప్లాను వేసి అమలు చెయ్యడం మొదలుపెట్టింది.ప్రభుత్వ ఖాతాలోకి బంగారం లోహాన్ని
దిగుమతి చేసుకుని mint ratioనీ market ratioనీ సమానం చేసి
రశీదుల్నీ చెల్లింపుల్నీ పగోడాతో నిర్వహించడం - ఇది వూహించిన మేలుని తగు స్థాయిలో
తీసుకు రాలేదు గానీ సమస్య తీవ్రతని తగ్గించి కొంత వూరట ఇచ్చింది!దురదృష్ట వశాత్తు
ఈ వూరట కూడా ఎక్కువ కాలం సాగలేదు.1756 నుంచి 1771 మధ్య రూపాయీ పగోడాల market ratio చాలా పెద్ద స్థాయిలో మార్పులకి లోనైంది.1756లో
అది 364/100 ఉంటే 1768లో 370/100 అయ్యింది.1768 నాటికి గానీ ఆ రెంటి market ratio చట్టబద్ధమైన legal ratioకి సమానం
కాలేదు.అప్పటినుంచి 1749 వరకు గల 12 సంవత్సరాలు ఇది బాగానే నడిచింది.అయితే, క్రమేణ పెరుగుతూ వస్తున్న వెండి దిగుమతులూ రెండవ మైసూరు యుద్ధానంతర లావాదేవీలూ
కలిసి ఆ నిష్పత్తిని ఛిన్నాభిన్నం చేసి 400 Arcot rupees = 100 Star pagodas అనే స్థితి దాపరించింది.
యుద్ధం తర్వాత మరోసారి మద్రాసు ప్రభుత్వం
బంగారం నిల్వని దిగుమతి చేసుకుని rupee - pagodaల మధ్య సయోధ్య కుదర్చి 1749 నాటికి తీసుకెళ్ళటానికి ప్రయత్నించింది.అయితే, 1790 నాటికి
కూడా సమస్యలు తొలగకపోవటంతో మొదట 365 Arcot rupees = 100 Star pagodas దగ్గిర సుస్థిరం చెయ్యాలని ఆశించింది.ఇప్పుడు
పగోడా విలువ తగ్గిపోవటంతో అనుకున్నదొకటీ అయొనదొకటీ అన్నట్టు వచ్చింది ఫలితం!దాంతో 1797లో దాని విలువని పెంచి మార్కెట్ నిష్పత్తిని చూస్తే 350 Arcot rupees = 100 Star pagodas దగ్గిర నిలపాలని చూస్తే పగోడా చెలామణీ నుంచి
అదృశ్యమైపోయింది - అలా bimetallism
దారుణమైన అపజయాన్ని
మూటగట్టుకుంది.
ఇక బాంబే ప్రెసిడెన్సీ విషయం చూస్తే bimetalllism యొక్క mechanics తెలిసినట్టు కనిపించే ఈ ప్రభుత్వం కూడా క్షేత్ర స్థాయిలో వస్తున్న సమస్యల్ని పరిష్కరించలేక చేతులెత్తేసింది.మొట్టమొదట ఇక్కడ bimetallism పరిచయం చేసినప్పుడు మొహరుకీ రూపాయికీ 15.70/1 నిష్పత్తి
ఉండేది.అయితే ఇది మొహరు విలువను పెద్ద చెయ్యటం అనిపించి ఆగస్టు 1774లో వెండి రూపాయి బరువుని పోలుస్తూ బంగారు మొహర్లని తయారు చెయ్యటం మొదలు పెట్టారు.ఇది నాణేల legal ratioని
14.83/1కి కుదించింది.ఇది market ratio అయిన 15/1తో మమేకం కాలేదు గానీ దాదాపు అతి దగ్గిరకి వచ్చ్గింది.ఇది ఇలాగే కొనసాగి ఉంటే మిగీన రెండు ప్రెసిడెన్సీల కన్న బోంబే ప్రెసిడెన్సీ bimetallism అమలు విషయంలో గొప్ప విజయం సాధించి వుండేది!సూరత్ నవాబు బుర్రలో పురుగు దూరింది - బరువులోనూ విలువలోనూ బోంబే నాణేలతో సమతూకం ఉన్న తన నాణేల్ని 10,12 అంటూ ఇష్టం వచ్చినట్టు మార్చేశాడు.సూరత్ నవాబు తన రూపాయల విలువల్ని తగ్గించుకుంటే మామూలు పరిస్త్జితుల్లో అయితే బాంబే ప్రెసిడెన్సీని దెబ్బ తీసేది కాదు గానీ అప్పటికి ఒక చట్టబద్ధమైన ఒప్పందం చేత అతని నాణేలకి కంపెనీ అధీనంలో ఉన్న అన్ని ప్రాంతాలలాగే బోంబే ప్రెసిడెన్సీలో కూడా native coins కింద చెల్లుబాటు ఉండటం వల్ల బొంబాయి నాణేలు మార్కెట్ నుంచి మాయం అయిపోవటంతో పాటు తక్కువ విలువ గల సూరత్ నాణేలకన్న ఎక్కువ విలువైన బొంబాయి మొహర్లు బంగారంతో మారకానికి అననుకూల ప్రత్యామ్నాయం అయ్యి
bimetallism విజయవంతం అవుతుందని అనుకున్న చోట కూడా పరాజయం పాలైంది.(hariSbabu:అలా
bimetallism విజయవంతం కావల్సిన ఒకే ఒక చోట అపజయం పాలై చరిత్ర అప్పటికి భయంకరం అని తెలియని ఒక విచిత్రమైన మలుపు తీసుకున్నది.నా ఉద్దేశంలో రచయిత చివారాఖరికి రిజర్వ బ్యాంకు అనే ఒక దుర్మారపు వ్యవస్థ తప్ప ఇంకొకటి సరైన ప్రత్యామ్నాయం కాదు అని అందర్నీ నమ్మించడానికే ఈ పుస్తకం రాశాడు గాబట్టి దీన్ని bimetallism యొక్క ఫెయిల్యూర్ అని చెప్తున్నాడని నాకు అనిపిస్తున్నది.ఎందుకంటే, సూరత్ నవాబు ఆ
దుడుకు పని చెయ్యకపోతే పరిస్థితి చక్కబడి ఆనాటి నాణేల పద్ధతి విజయవంతంగా మనగలిగేదని తెలుస్తూనే ఉన్నది కదా!మిగిలిన ప్రెసిడెన్సీలలో కూడా ఇంగ్లీషువాళ్ళు తమ దురాశ కొద్దీ చేసిన యుద్ధాల ప్రభావం కనిపిస్తూనే ఉన్నది కదా!యుద్ధాల వల్లనూ తప్పుడు నిర్ణయాల వల్లనూ కలిగిన దుష్పరిణామాలకి నాణేల వ్యవస్థ ఎట్లా కారణం అవుతుంది?)
బొంబాయి ప్రభుత్వం సూరత్ నాణేల్ని కూడా తన టంకశాలల్లో తయారు చెయ్యడానికి పూనుకున్నప్పుడు మళ్ళీ మొహరుకీ రూపాయికీ bimetallic ratio నిర్ధారించాల్సిన అవసరం పడింది.1774 నాటి ప్రమాణాలను పాటించడం అనేది అసంభవమని తేలిపోయింది.ఇప్పుడు బొంబాయి ప్రభుత్వం ఒక మొహరు 177.38 గ్రామూల
స్వచ్చమైన బంగారంతోనూ 15 సూరత్ రూపాయి నాణేలు 247,110 గ్రాముల
వెండితోనూ తయారు చెయ్యాలని నిర్ణయం తీసుకున్నది.1800 నాటి ప్రమాణమైన 247,110 గ్రాముల
వెండితోనూ తయారుచెయ్యాలని నిర్ణయం తీసుకున్నది - ఇది ఆఖరున మార్కెట్ వద్ద 13.9/1 నిష్పత్తిని చూపించింది.దీనివల్ల మొహరు విలువలో తరుగుదల కనిపిస్తున్నది, దీన్ని సరిచెయ్యటానికి సూరత్ రూపాయి విలువని మార్చి market ratioని 14,9/1 చేద్దామనుకుంటే అది కాస్తా అటు మారి ఇటు మారి market ratioని 15.5/1 చెయ్యటంతో ఆ ప్రయోగం కూడా పూర్తి స్థాయి ఫలితాన్ని ఇవ్వలేదు.
ఆర్ధికం ఇలాంటి విషమ పరిస్థితిలో ఉన్న ఇలాంటి కాలం East India Company యొక్క Court of Directors భవిష్యత్ భారతదేశపు monetory systemకి మూలమయిన monometallic standardను నిర్ధారించేటందుకు ప్రోత్సహించింది. ఈ మారకద్రవ్యనియంత్రణల ముఖ్యమైన ఉద్దేశం అన్ని రకాల నాణేలకూ స్థిరమైన సాపేక్ష విలువను నిర్ధారించటం.ఈ అయోమయాన్నీ గందరగోళాన్నీ తొలగించి ఒక అధికారికమైన నాణేన్ని సుస్థిరం చెయ్యనంతకాలం తాత్కాలికమైన సర్దుబాట్ల వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదు.అందువల్లనే East India Company యొక్క Court of Directors మొదట మారకద్రవ్యాన్ని స్థిరమైన పునాది మీద నిలబెట్టాలని అనుకున్నారు.వారు monometallism వైపుకు మొగ్గు చూపడం అనేది అవివేకమైన చర్య ఎంత మాత్రం
కాదు, ఎందుకంటే Single Standard అనేది Dpuble Standard కన్న ఎక్కువ ప్రయోజనాన్ని ఇస్తుందనేది వాస్తవం - ఆర్ధికాన్ని పరిపుష్టం చెయ్యడంలో మొదటిది spontaeneous అయితే రెండవది intentional అయ్యి పరిస్థితిని అదుపులోకి తీసుకొస్తుంది.
చెలామణీలో ఉన్న అనేకమైన
units of currency/నాణేల్ని తగ్గించడం అనే పని మొదట మద్రాసు రాష్ట్రంలో సాధించారు.(hariSbabu:అందుకే ఇప్పటికీ తమిళనాట ఇంగ్లీషువాళ్ళ పట్ల
ప్రీతి ఉన్నవాళ్ళు ఎక్కువ శాతం ఉన్నారు.దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఇన్ని తరాల తర్వాత కూడా తమిళనాడులోని కొన్ని ప్రాంతాలు కొన్ని వర్గాలు ఇంగ్లీషువాళ్ళ పట్ల ప్రీతిని వదులుకోలేకపోవడానికి కారణం ఇదే.ఇంగ్లీషువాళ్ళ అన్ని సామ్రాజ్యవాదపు ఎత్తుగడలకూ తొలి ప్రయోగాలు ఇక్కడే జరిగాయి, అవి వాళ్ళకి అనుకూల ఫలితాల్ని ఇచ్చాయి.ఆఖరికి దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఇన్ని తరాల తర్వాత కూడా తమిళుల్ని వైదిక సంస్కృతిలో కలిసిపోనివ్వని ద్రవిడ వాదం లాంటివి ఇక్కడే పుట్టడం యాదృఛ్చికం కాదు.ద్రవిడవాదం ఎప్పుడు పుట్టిందో తెలుసా!కాంగ్రెసు అధ్వర్యంలో స్వతంత్రం రావడం ఖాయం అని తెలిసిపోయాక అప్పటి వరకు ఇంగ్లీషువాళ్ళని అంటకాగి తెగబలిసిన భూస్వాములూ వ్యాపారులూ భూమి మీదా సంపద మీదా తమ అధిపత్యం చెదిరిపోకుండా ఉంచుకోవడానికి డబ్బు కోసం సిద్ధాంతాలు/సాహిత్యాలు సృష్టించగలిగిన రచయితలని కొనేసి ద్రవిడవాదాన్ని తయారు చేసి వదిలారు.ఈరోజున తమిళనాడులో కనిపించే తమిళజాత్యహంకారం ఆంగ్లేయజాత్యహంకారానికి నకలు - అంటించుకోవడం తేలిక, వదిలించుకోవడమే కష్టం. ఒకసారి నమ్మితే ఇక మార్జువానా లాంటి ఆ మత్తు వాస్తవాల్ని చూడనివ్వదు - "మరిచిపోతే తాగగలను, మరువనివ్వదు! తాగితే మరిచిపోగలను, తాగనివ్వదు!" అని యేడవాల్సిందే!)1818 జనవరి
7న పాత Arcot Rupeeనీ
Star Pagodaనీ రద్దు చేసి వాటి స్థానంలో 180 గ్రాముల బరువుతో 165 గ్రాముల స్వచ్చతాతో బంగారు, వెండి నాణేల్ని చెలామణిలోకి తీసుకొస్తున్నట్టు ప్రభుత్వం ఒక Proclaimation జారీ చేసింది.సరిగ్గా ఆరు సంవత్సరాల తర్వాత 1824 అక్టోబర్
6న Bombay Pesidencyని కూడా మద్రాసు తరహా Proclaimation ద్వారా కొత్త దారిలోకి నడిపించారు.
బెంగాలు సమస్య వీటికన్న జటిలమైనది.అక్కడ సూరత్ నవాబు పుణ్యాన మూడు రకాల నాణేలు చెలరేగి పోతున్నాయి.అక్కడ
elimination and alteration పద్ధతిని పాటించాలని అనుకున్నారు.(ఇవ్వాళ రాజకీయ విధానాల్లో వాళ్ళు పాటించారని చెప్పుకున్న devide and rule లాంటిదే ఇది కూడా.వాళ్ళకి నాణేలూ మనుషులూ కూడా తమ చెప్పుచేతల్లోకి తెచ్చుకుని పనులు చేయించుకునే బానిసలే!)మొదట 1816లో Benares Rupeeని నిలిపేసి దాని స్థానంలో Farrukabad Rupeeని 180.234 గ్రాముల బరువుతోనూ 165.215 గ్రాముల
స్వచ్చలోహంతోనూ తయారుచేసి వదిలారు.మన తెలివితో ఆలోచిస్తే ఇది గురికి బెత్తెడు ఎడం అనిపిస్తుంది.కానీ, వాళ్ళ ఉద్దేశం Farrukabad Rupeeని మద్రాసు రూపాయికి నకలు చెయ్యడమే.అలా Benares Rupeeని వదిలించుకుని Farrukabad Rupeeని మిగిలిన రెండు ప్రెసిడెన్సీల రూపాయిల నకలులా చెయ్యడం 1833 నాటికి
సాధ్యపడింది.
అలా bimetallic systemని పూర్తిగా తొలగించి శూన్యాన్ని సృష్టించకుండా క్రమేణ monometallismని ప్రజలకీ వ్యాపారులకీ అలవాటు చెయ్యడానికి ఉద్దేశించిన మొదటి సంస్కరణని అమలు చేశారు. 1833 నాడు ఇంగ్లీషువాళ్ళ అధీనంలో ఉన్న ప్రెసిడెన్సీల పరిస్థితిని బట్టి Court of Directors చేసినది అన్ని నాణేలనీ ఒక స్థిరమైన బరువుకీ విలువకీ కుదించటం మాత్రమే.అంతకన్న వాళ్ళు చెయ్యగలిగింది కూడా లేదు గానీ ఆ తక్కువ స్థాయి సంస్కరణయే ఆనాడు
ఒక పెద్ద సంక్షోభాన్ని తీసుకొచ్చింది. మొదటి
వ్యతిరేకత కూడా మొదట ఈ సంస్కరణలని అమలు చెయ్యాల్సిన మద్రాసు ప్రెసిడెన్సీ నుంచే రావడం
ఒక విశేషం - బంగారు నాణేల ముద్రణని కొనసాగించడమే కాక అదివరకటి double legal tender
at a fixed ratio పద్ధతి నుంచి పక్కకి జరగటానికి ఒప్పుకోలేదు,పదే పదే Court of
Directors విజ్ఞప్తులు చేస్తున్నప్పటికీ ఒత్తిడి పెడుతున్నప్పటికీ!బెంగాలు ప్రభుత్వం
కూడా bimetallic system వైపుకే మొగ్గు చూపింది.బంగారు మొహర్లని రద్దు చెయ్యటానికి బదులు
నాణెం బరువుని 189.4037 గ్రాములకీ స్వఛ్చలోహాన్ని 187.651 గ్రాములకీ తగ్గించి 1818
నాటి ప్రమాణాలను పాటించదం మొదలుపెట్టింది.ఆ ప్రభుత్వం bimetallic system పట్ల ఎంతో
పట్టుదలను చూపించింది.1833లో siccaa rupee తూకాలను కూడా నాణెం బరువుని 196 గ్రాములకీ
స్వఛ్చ లోహాన్ని 176 గ్రాములకీ స్థిరపరిచి మొహరుకీ రూపాయికీ market ratio తేడాల వల్ల
వస్తున్న సమస్యల్ని సరిచేసింది.
కానీ అప్పటి భారత జాతీయ ప్రభుత్వం మాత్రం
Court of Directors సూచించిన దారిలోనే ముందుకు వెళ్ళడానికి నిశ్చయించుకున్నది.నిజానికి, Court of Directors వారినుంచి ఆశించినది కూడా నాణేల వ్యవస్థని గందరగోళం నుంచి బయటికి లాగి సిక్కానీ మొహరునీ కొనసాగించడమే.ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి - మొఘలుల నుంచి సంక్రమించిన uniform currency మొగలుల పాలనా కాలంలో సాధించిన విజయాల్ని బట్టి చూస్తే ఎటువంటి అనుమానాలకూ తావు లేకుండా సర్వోత్తమమైనదే. అయితే ఇప్పుడు భారత ప్రభుత్వం కోరుకుంటున్నది తమ అధికార పరిధిలోని భూభాగం అంతటా ఒకే ముఖ వులువ కలిగి వుండి తూనికలూ కొలతలూ విలువలూ సమానమైన ఒకే ఒక నాణెం చెలామణీలో ఉండటం!uniform currency పద్ధతిలో ఒక ప్రెసిడెన్సీ ముద్రించుకున్న నాణెం తన సరిహద్దుల లోపలనే చెల్లుతుంది, సరిహద్దులు దాటితే కొత్త ప్రెసిడెన్సీలో ముద్రణశాల/మారకందారు దగ్గిరకి వెళ్ళి మార్చుకోవాల్సి వుంటుంది.ఈ రకమైన monetary independence మూడు ప్రెసిడెన్సీలకూ finaancial independence ఉండి వాటి మధ్యన fiscal cooperation ఉన్నప్పుడే అన్ని ప్రెసిడెన్సీలకీ లాభకరం అవుతుంది, అది లేనప్పుడు ప్రమాదకరం అవుతుంది.
వాస్తవానికి అప్పటి ప్రతి ప్రెసిడెన్సీ సొంత fiscal system ఏర్పాటు చేసుకున్నప్పటికీ finanace కోసమూ
deficit maintenaance కోసమూ ఇతర ప్రెసిడెన్సీల మీద ఆధారపడుతూ ఉండేది. వాటి మధ్య నిరంతరం "సంపద"
ప్రవాహం నడుస్తూ ఉండేది,ఒక చోట పెరిగిన సంపద మరొక చోటికి finance రూపంలో
వెళ్ళి ఆ చోట పేరుకుపోతున్న deficit తగ్గుతూ
ఉండేది. అయితే, వీటి మధ్య common currency అనేది లేకపోవడం ఈ రకమైన ఆస్తుల/సంపద/వనరుల బదలాయింపులు మందకొడి అవుతూ వుండేది.ప్రతి నాణెమూ ఇతర ప్రెసిడెన్సీల వద్ద legal tender కాకపోవడంతో ప్రతి ప్రాంతమూ స్వయంసమృద్ధత సాధించడానికి కావలసిన పెద్ద మొత్తాల ధనసేకరణలో తడబాట్లు పడుతూ వ్యాపారంలో కూడా ఆశించినంత వేగాన్ని ప్రదర్శించలేకపోయేవి.ఏ ప్రెసిడెన్సీ నుంచి కరెన్సీ వెళ్తుందో ఆ కరెన్సీ ఏ ప్రెసిడెన్సీకి అవసరమో ఆ కరెన్సీలోకి మారిన తర్వాతనే ఉపయోగంలోకి రావటం తప్ప మరో మార్గం లేనప్పుడు ఒకే విలువ గల కరెన్సీని రెండు సార్లు ముద్రించాల్సి రావటం నష్టమే కదా!తీసుకున్న ఋణం నుంచి నాణేల ముద్రణ కోసం కొంత పోవడమే గాక వ్యాపారులకి అసౌకర్యాన్నీ ప్రభుత్వాలకి సంకట స్థితినీ తెచ్చిపెడుతూ వుండేది.
అలా 1833 చివర్ల నాటికి పరిస్థితి ఎలా
ఉందంటే, Court of Directors అప్పటివరకు ఉన్న వ్యవస్థను ఉంచకూడదనే పట్టుదలతో
uniform currency పేరున single standard గల silver coin వైపుకీ Indian Goverments అప్పటివరకు
ఉన్న వ్యవస్థను నిల్పుకోవాలనే పట్టుదలతో commmon currency పేరున bimtallic stadrad
గల gold coin వైపుకీ చేరి tug of war ఆడుకుంటున్నారు.బోర్డు రూముల్లో వీళ్ళ గొడవలు
ఇట్లా ఉంటే మార్కెట్లూ రాజ్యాలూ తమతమ పనులు తమకు నచ్చినట్టు చేసేసుంటున్నారు.అయితే,
ఇదే 1833లో బ్రిటిష్ పార్లమెంటు మూడు Prsidential Goernments మధ్యన ఉండాల్సిన
Admninistrative Relations గురించి ఒక చట్టాన్ని చేసింది - భారతదేశంలోమి తన పాలనలో
ఉన్న అన్ని చోట్ల తను నిర్వహిస్తున్న legislative and executive విధులని కలిపేసి ఒకే
ఒక Imperial System of Administration పేరున centralaize చెయ్యడమే దాని లక్ష్యం.ఈ చట్టం
అమలు కావడానికి ఉన్న ముఖ్యమైన అడ్డంకి అప్పటి bimetallic standard కాబట్టి దాన్ని రద్దు
చేస్తూ ఎన్నెన్నో local coinsకి బదులు ఒకే IMperial Coin ఉండాలనేది ఇందులోని ప్రముఖమైన
తీర్మానం. తమ అధికారం స్థిరపడిన
తర్వాత కూడా మొఘలులకి సామంతుల్లాగ వూడిపోయిన నాగటిదుంపల్లాంటి మొఘలు చక్రవర్తుల్ని
గుర్తుకు తెచ్చే నాణేల్ని ముద్రించుకుంటూ గడపటం వాళ్ళకి నచ్చలేదు, ముసుగు విప్పేసి
తమ నిజమైన సార్వభౌమత్వాన్ని ప్రజలకి చూపించాలనే తహతహ పెరిగింది.
ఆ తహతహ ఉండటం వల్లనే XVII, 1835 Act of the Imperial Government
కన్న ముందే కూసేసిన కోకిల మాదిరి హడావిడి చేసింది - అప్పటి వరకు పాటించిన మర్యాదను కూడా దాటేసి "that no gold coin shall
henceforward be a legal tender of payment in any of the territories of the East
India Company" అని బల్లగుద్ది చెప్పేసింది. అధికారంలో పైస్థాయిలో ఉన్నవాళ్ళకి కిందిస్థాయి నుంచి నివేదికలు తెప్పించుకుని వాటిని బట్టి వాస్తవమైన పరిష్కారాలను కనుక్కోగలిగిన వెసులుబాటు మధ్యస్థాయి వాళ్ళకన్న ఎక్కువ ఉంటుంది గాబట్టి మధ్యస్థాయి నుంచి వచ్చే వ్యతిరేకతని పట్టించుకోకుండా తమ నిర్ణయాల అమలు కోసం ఒత్తిడి చెయ్యటం నియంతృత్వం కాకపోవచ్చు, కానీ అప్పటి వరకు కొనసాగుతున్న bimetallic system రద్దుకు దారితీసిన కారణాలలో స్పష్టత లేదు. నిజానికి, bimetallic systemను రద్దు చెయ్యటానికి జరిగిన వెనుకటి ప్రయత్నాలను గుర్తు చేసుకుంటే వాళ్ళ coinage reforms అప్పుడున్న పరిస్థితిని distaurb చెయ్యకుండా తీసుకున్న జాగ్రత్తల బదులు ఈ చట్టంలో నిర్లక్ష్యం కనిపించడమే అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఏమైతేనేం, XVII 0f Currency act, 1885 పేరున British Imperial Government చూపించిన ఆనాటి volt-face భారతదేశపు చరిత్రలో ఒక గొప్ప మలుపుకు దారి తీసింది.(hariSbabu:ఆర్ధిక విషయాల పట్ల
ఆసక్తి లేని సామాన్యులకి తెలియదు గానీ ఇది నిజానికి చాలా
భయంకరమైన మలుపు!బాబరు నుంచి ఔరంగజేబు వరకు ముస్లిం మతతత్వవాదులే కావచ్చు, ఔరంగజేబు
అయితే ఆలయవిధ్వంసకుడు కూడా కావచ్చు.కానీ వాళ్ళ monetary system మాత్రం చాలా అద్భుతమైనది. నిజానికి ఇది మొఘలులు చేసిన నూతన ఆవిష్కరణ కాదు. వీశె,శేరు వంటివి కొన్ని
తరాల క్రితం వరకు తెలుగునాట వింబడిన కొలతలు షేర్ షా సూరి కాలంలో అతను నిర్ణయించిన ప్రమాణాలు.అయితే,
ఈ తరహా నాణేల వ్యవస్థ హరప్పా నాగరికతలోనూ కనిపిస్తుంది.కాకపోతే మొఘలులు సైనికశక్తితో
ఎక్కువ మేర భూమిని ఆక్రమించి ఎక్కువ కాలం ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడం వల్ల ఆర్ధికరంగం
క్రమబద్ధమైన వృద్ధిని సాధించింది.macro economics ఎలా ఉంటే రాజ్యం సుస్థిరమైన పురోగతిని
సాధిస్తుందనే విషయంలో చాణక్యుడి సూత్రీకరణలే అత్యంత శాస్త్రీయమైనవి.రచయిత తులనాత్మకత
కోసం కొన్ని విమర్శనాతంకమైన విశ్లేషణలు చేసినప్పటికీ ఈ గ్రంధాన్ని రచించిన ఉద్దేశం
బ్రిటిషర్ల సంస్కారణల్ని సమర్ధించడానికే గాబట్టి
"వాళ్ళ coinage reforms అప్పుడున్న పరిస్థితిని distaurb చెయ్యకుండా తీసుకున్న
జాగ్రత్తల బదులు ఈ చట్టంలో నిర్లక్ష్యం కనిపించడమే" ఇతను పట్టించుకుంటూ అసలు పట్టించుకోవాల్సిన
విషయాల్ని మన దృష్టికి రాకుండా చేస్తున్నట్టు నాకు అనిపిస్తున్నది.ఎందుకంటే, Court
of Directors చేస్తున్న సంస్కరణల్ని వ్యతిరేకిస్తున్నది ఇతరు లెవరో కాదు, వాళ్ళ అధీనంలో
ఉన్న ప్రాంతీయ ప్రభుత్వాలే!"వీటి మధ్య common currency అనేది లేకపోవడం ఈ రకమైన
ఆస్తుల/సంపద/వనరుల బదలాయింపులు మందకొడి అవుతూ వుండేది, ఏ ప్రెసిడెన్సీ నుంచి కరెన్సీ
వెళ్తుందో ఆ కరెన్సీ ఏ ప్రెసిడెన్సీకి అవసరమో ఆ కరెన్సీలోకి మారిన తర్వాతనే ఉపయోగంలోకి
రావటం తప్ప మరో మార్గం లేనప్పుడు ఒకే విలువ గల కరెన్సీని రెండు సార్లు ముద్రించాల్సి
రావటం నష్టమే కదా, వ్యాపారులకి అసౌకర్యాన్నీ ప్రభుత్వాలకి సంకట స్థితినీ తెచ్చిపెడుతూ
వుండేది" వంటి వ్యాఖ్యలు రచయిత చేస్తున్నవి.వీటిని ఎదుర్కొంటున్న presidencyలకి వీటిపట్ల సమస్యలు ఉంటే Court of
Directors ప్రతిపాదనల్ని ఎందుకు వ్యతిరేకిస్తారు?లాభాపేక్ష లేని వ్యాపారీ ఉండడు,కీర్తిని
ఆశించని ప్రభువూ ఉండడు.తాము ఎదుర్కొంటున్న సమస్యకి Board of Directors చూపించిన పరిష్కారం
నిజమైనదని నమ్మి కూడా తిరస్కరించే పిచ్చిపుల్లయ్యలు కాదే అక్కడున్నది! "అప్పటి
కాలపు ప్రతి ప్రెసిడెన్సీ సొంత fiscal system ఏర్పాటు చేసుకున్నప్పటికీ finanace కోసమూ
deficit maintenaance కోసమూ ఇతర ప్రెసిడెన్సీల మీద ఆధారపడుతూ ఉండేది.వాటి మధ్య నిరంతరం
సంపద ప్రవాహం నడుస్తూ ఉండేది,ఒక చోట పెరిగిన సంపద మరొక చోటికి finance రూపంలో వెళ్ళి
ఆ చోట పేరుకుపోతున్న deficit తగ్గుతూ ఉండేది." అని రచయిత తప్పులు పట్టటం కోసం
ఉపయోగించుకుంటున్న వ్యవస్థ చాలా గొప్పది - అత్యున్నత సంస్కారం గల వ్యక్తులను సమాజంలో
నిలబెట్టటానికి కులమతప్రాంతభేదాలను అధిగమించిన దార్శనికులు ప్రబోధిస్తున్న sharing
of assets అనే ఆదర్శవంతమైన విధానం ఆయా రాజ్యాల
మధ్యన నడుస్తూ ఉంటే దాన్ని ఏదో మాటవరసకి పొగిడినట్టు ఒక మాట చెప్పేసి సామ్రాజ్యవాదుల
కళ్ళతో చూస్తూ వాటిలోని తప్పుల్ని మాత్రం పదింతలు చేసి చూపిస్తున్నాడు.)
అప్పటివరకు కొన్ని శతాబ్దాల పాటు ఏ ఒడిదుడుకులూ
లేకుండా కొనసాగిన బహుళమారకవిధానం కనుమరుగై 180 gr troy తూకమూ 165 gr fine metal నిష్పత్తీ
ఉన్న వెండినాణెం ఒక్కటే common currency అయ్యింది.మొత్తం భారతదేశంలోని ఆంగ్లేయ ప్రభుత్వ
శాసనాలలోనే ఈ Act XVII 1835 తెచ్చుకున్న వ్యతిరేకత మరే శాసనానికీ రాలేదు. సాంకేతికపరమైన విషయాల్ని పట్టించుకోని
పాతకజనానికి అర్ధమైంది ఏమిటంటే ఇంగ్లీషువాళ్ళు బంగారు నాణేన్ని రద్దు చేసి వెండి నాణేన్ని
ప్రోత్సహిస్తున్నారని.పంధొమిదవ శతాబ్దపు మధ్యకాలంలో ఆస్ట్రేలియాలోనూ కాలిఫోర్నియాలోనూ
బంగారం బయటపడిన తర్వాత బహుళ నాణేల వ్యవస్థని కొనసాగించి ఉంటే భారతదేశం యొక్క ఆర్ధిక
పురోగమనం ఎలా వుండేది?వెండి నాణెం వెనకబడి చెలామణి నుంచి తప్పుకోవడం వల్ల United
States తన వెండి నాణెపు కొలతలలో మార్పులు చేస్తూ 1853లో ప్రత్యేకంగా చట్టం చేస్తే గానీ
రెండింటినీ కొనసాగించలేకపోయింది.ఇదే bimetallic model పద్ధతిలో తయారవుతున్న uniform currency విధానాన్ని అనుసరిస్తున్న
France, Belgium, Switzerland, Italy దేశాలు కూడా ఇదే సమస్యని ఎదుర్కొన్నాయి.ఆఖరికి
Latin Union అనే పేరుతో కలిసి ఉన్న ఈ దేశాలు 2 franc, 1 franc, 50 centime, 20
centime నాణేల్ని 900/1000 అనే net weight/fine metal weght నిష్పత్తి నుంచి
835/1000 అనే net weight/fine metal weghtకి తగ్గించుకుంటూ 1865 నవంబర్ 20న ఒక ఒప్పందాన్ని
చేసుకున్నాయి.భారత దేశం కూడా బంగారు వెండి నాణేల సాపేక్ష విలువల వల్ల సమస్యల్ని ఎదుర్కొన్నది
కానీ కారణం మాత్రం భిన్నమైనది - తను చేసుకున్న ఒక తెలివితక్కువ చట్టం వల్ల భారత్ కష్టాలు
పడింది!
బహుశా నాణేల అమ్మకం వల్ల వచ్చే ఆదాయాన్ని వదులుకోవటానికి ఇష్టం లేక కాబోలు,1835 నాటి కరెన్సీ చట్టం బంగారు నాణేల్ని తయారు చేసే టంకశాలల్ని మూసెయ్యలేదు.అయితే, బంగారు నాణెం
legal tender కాకపోవటంతో ముద్రణ కోసం బంగారమూ రాలేదు, నాణెల్ని కొనుక్కున్న వాళ్ళూ లేరు - ఫలితం seignerage{ఇప్పటి
పేపర్ కరెన్సీ వాడకందార్లకి తెలియదు గాబట్టి అప్పటి నాణేల చెలామణీ ఎలా ఉండేదో
టూకీగా చెప్తాను.టంకశాలలు ప్రభుత్వం అనుమతి ఇచ్చి నియమాలు పెట్టి ఏర్పాటు
చేసినవైనా అవి నడిచే పద్ధతి మాత్రం ఇప్పటి ప్రైవేట్ సెక్టార్ మాదిరిగానే ఉండేది.ప్రభుత్వం గానీ వ్యాపారులు గానీ నాణేల కోసం దరఖాస్తు చేసుకోవాలి.ప్రభుత్వం తనకోసం నాణేల తయారీకి అవసరమైన లోహాన్ని తనే గనుల నుంచి తీసి టంకశాలలకు అందిస్తుంది.అత్యవసరం అయినప్పుడు వర్తకులు తమ బంగారం తామే తెచ్చుకుని దానిని టంకశాలకు ఇచ్చి నాణేల కింద మార్చుకుని తీసుకుంటారు. ఈ seignerageని టంకశాల నాణేలు తయారు చెయ్యడానికి తీసుకునే మజూరీ అనుకోవచ్చు.టంకశాల యజమానికి ఇదే ఆదాయం.} ఆదాయం కూడా తగ్గిపోయింది!దీంతో గవర్నమెంటు బంగారు నాణేన్ని ప్రోత్సహించటానికి 1837లో seignerageని 2 శాతం నుంచి 1 శాతం వరకు తగ్గించింది. అయినప్పటికీ టంకశాలలకు బంగారు నాణేల కోసం ఆర్డర్లు రావటం లేదు, మజూరీ ఆదాయం పెరగడం లేదు.ప్రభుత్వం ఇంకో అడుగు ముందుకేసి 1841 జనవరి
13న అన్ని పబ్లిక్ ట్రెజరీలకి 15 వెండి నాణేలకి బదులు 1 బంగారు నాణేన్ని తీసుకునేలా ఆజ్ఞలు జారీ చేసింది.అయినా కొంతకాలం వరకు బంగారం టంకశాలలకు రాలేదు.కానీ ఆస్ట్రేలియాలోనూ కాలిఫోర్నియాలోనూ బంగారం బయటపడటంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది - 15 వెండి
నాణేలకి బదులు 1 బంగారు నాణేన్ని తీసుకోవాల్సిన దుస్థితికి బదులు బంగారు నాణేలు కుప్పలు తెప్పలై పోయాయి.ఏ నాణేన్ని legal tender కాదని అన్నారో ఆ నాణెం లిక్విడేషన్ కోసం దాని విలువని పెంచారో ఆ పనికిరాని
నాణేన్ని దాని విలువ కన్న ఎక్కువ పెట్టి కొనాల్సి రావడం దండగమారి వ్యవహారం అయిపోయింది.
పరిస్థితి తీవ్రతనీ తన తప్పుల్నీ అర్ధం చేసుకున్న ప్రభుత్వం 1841 నాటి చట్టాన్ని వెనక్కి తీసుకుంటూ 1852 డిసెంబర్
25న ఒక శాసనం చేసింది - అదే బహుళ నాణేల మారక వ్యవస్థని రద్దు చెయ్యటం!దీనివల్ల వెండి నాణేన్ని కాపాడుకోవటం కోసం ఇతర దేశాలు పడిన కష్టాలూ నష్టాలూ ఇక్కడ తప్పాయి.(hariSbabu:ఈ సంస్కరణకి ముందు జరిగిన సంస్కరణ, 1848 నాటి అమెరికన్ గోల్డ్ రష్,
ఈ సంస్కరణ - ఈ మూడింటి వెనక చాలా పెద్ద కధే ఉంది.కానీ రచయిత “Wherther it would
not have been better to have escaped the embarassment by making gold general
legal tender than depriving it of its partial legal tender power is another
matter.” అని చెప్పి దాటవెయ్యడం రచయిత ఆంగ్లేయులతో మమేకమైపోయి వారి వైపు నుంచి ఆలోచిస్తున్నాడనటానికి
మరొక బలమైన సాక్ష్యం!బంగారం అనేది మొట్టమొదట నాణేల తయారీలో ఉపయోగించినది ఆ లోహం యొక్క
ప్రత్యేకతని బట్టి.ఇప్పటికీ జాతులూ మతాలూ కులాలూ వేరైనప్పటికీ స్త్రీల అలంకరణలో బంగారం
ఒక భాగమైపోయింది.అది ఇతర్లు రుద్దినదీ కాదు, అనుకోకుండా జరిగిపోయిందీ కాదు.ఆ లోహానికి
ఆ ప్రత్యేకత ఉంది.అది పుష్కలమైన భారతదేశంలోని హిందూ ప్రభువులు నాణేల తయారీకి బంగారం
వాడారు.అది దొరకని చోట మాత్రమే వెండి, రాగి నాణేల తయారీలో ఉపయోగించారు.బంగారు నాణేన్ని
నిషేధించిన 1835 నాటి కరెన్సీ చట్టం టంకశాలల్ని మూసెయ్యకపోవడానికి కారణం ఏమిటి?1835
నుంచి 1841 వరకు బంగారాన్ని టంకశాలల దగ్గిరకి రప్పించుకోవాలని ఆరాటపడటానికి కేవలం మజూరీ
మీద ఆశ ఒక్కటే కాదు - ఇంకేదో బలమైన కారణం ఉండి ఉండాలి!1841లో అక్కడెక్కడో బంగారం నిల్వలు
బయటపడితే ఇక్కడ బంగారం కోసం టంకశాలల దగ్గిర ఆరాటం తగ్గించుకుని అసలు బంగారు నాణేన్ని రద్దు చేసెయ్యడం ఏమిటి?ఇవన్నీ
కీలకమైన విషయాలే - అయినా ఒక్క వాక్యంతో దాట వేసేశాడు. నా వూహ ప్రకారం బంగారు నాణేన్ని
చెలామణినుంచి తీసేస్తూ చట్టం చేసి కూడా బంగారు నాణేల టంకశాలల్ని తెరిచి ఉంచి ట్రెజరీల్ని
బంగారు నాణేల్ని తీసుకునేలా ప్రోత్సహించడం వెనక ఇక్కడ ఉన్న బంగారాన్ని లండనుకు తరలించడానికి
వేసిన కుట్ర, అది కాక ఆ మొత్తం వ్యవహారానికి మరొక హేతుబద్ధమైన కారణం ఉండటానికి వీల్లేదు.)
అలా 1835 నాటి చట్టంతో భారతదేశంలోని ఆంగ్ల ప్రభుత్వం బహుళనాణేలవ్యవస్థని రద్దు చెయ్యటాన్ని మనం తప్పుపట్ట రాదు.అలాగని బహుళనాణేలవ్యవస్థని ఖండించినంతటనే ఏకైకరజతనాణెపువ్యవస్థని ముక్కస్యముక్క సమర్ధించేసినట్లూ కాదు.నిజానికి ఎవరి సూత్రీకరణల్ని Court of Directors భారతదేశంలో అనుసరించాలని అనుకున్నదో ఆ Lord Liverpool అనే ఎకైకనాణెపుమారకవ్యవస్థ సమర్ధకుడు ఇంగ్లాండులోని ఇటువంటి సమస్యలకి ఏకైకస్వర్ణనాణెపువ్యవస్థని సమర్ధంచడాన్ని గుర్తు చేసుకుంటే Court of Directors వెండి నాణేన్ని సమర్ధించడం పెద్ద వింత అనిపించదు.Court of Directors యొక్క ఈ కప్పగంతు సహజంగానే విమర్శలకి దారి తీసింది. కానీ ఇలాంటివాటికి నిగూఢమైన కుట్రపూరిత ఉద్దేశాలను అంటగట్టటం అనవసరం - Lord Liverpool గారు ఏమీ gold bug కాదు,Court
of Directors అందరూ silver men కూడా కాదు.ఆనాటి దేశకాలమానస్థితిగతుల్ని బట్టి చూస్తే Court of Directors యొక్క ఎన్నిక Lord Liverpool యొక్క ఎన్నిక కన్న మంచి నిర్ణయమే!కేవలం సిద్ధాంతకర్తలు మాత్రమే గాక Locke, Harris, Petty వంటి అనుభవజ్ఞులు కూడా ఏకైకరజతనాణెపువ్యవస్థని సమర్ధిస్తున్నారు, మీదుమిక్కిలి ప్రపంచం మొత్తం దానినే అనుసరిస్తున్నది.ఇంగ్లాండ్ 1816 నాటి చట్టంతో తనని తను బంగారం వైపుకి జరుపుకుంది, కానీ అదే చట్టం మూసివేసిన వెండి నాణేల టంకశాలల్ని Royal proclamation వల్ల తెరిచే ఉంచాల్సి వచ్చింది.అధికారికమైన ఉత్తర్వు మాదిరి జారీ చెయ్యకపోయినప్పటికీ Royal proclamation వల్ల వివాదం సమసిపోయినట్టు అందరూ భావించారు.
అయితే, 1825 నాటికి ఇంగ్లాండుకు బంగారు నాణేల వ్యవస్థ ఒక బలహీనత కింద మారిపోయి
సమస్యల్ని తెచ్చిపెట్టింది.అప్పటి
పరిశీలకుల విశ్లేషణ ప్రకారం మిగిలిన ప్రపంచం మొత్తం వెండి నాణేల్ని ఉపయోగిస్తుంటే తనుమాత్రం బంగారు నాణేల్ని ఉపయోగించడం వల్ల వూరందరిదీ ఒక దారి ఉలిపికట్టెది ఇంకొక దారి అన్నట్టు ప్రపంచవాణిజ్యసముద్రంలో ఒక ద్వీపకల్పంలా
వేరుపడిపోయి తన commercial superiority వల్ల తనకి రావలసిన prosperity రావడం
లేదు. 1826 నాటికే Huskisson ప్రభుత్వానికి silver certificates జారీ చేసి వాటిని full legal tender చెయ్యమని నివేదించాడు.1844 నాటికి
Peel ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో ఏ ఒక్క దాన్నీ పూర్తి బాధ్యతతో సామ్ర్ధించకుండా gold standard నుంచి silver standrad వైపుకి వెళ్ళడం గానీ bimetallic standrad పాటించటం గానీ చెయ్యమని సలహా ఇచ్చాడు.ఒకేసారి అంత భారీ మార్పులు చేస్తే తాత్కాలికమైన fiscal isolation ప్రమాదం ఉంటుంది కాబట్టి 1844 నాటి
Bank Charter Act రూపొందించే సమయంలో Peel విడుదల
చేస్తున్న కరెన్సీలో నాల్గవ వంతు Huskisson సూచించిన
silver certificates అనదగిన paper money ఉండేలా చర్యలు తీసుకున్నాడు.నిజానికి, ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ వెండి నాణెం వైపుకి మొగ్గు చూపుతున్నది - అది 1847లో Holland ఏకైకస్వర్ణనాణెపువ్యవస్థ నుంచి తను మారటమే కాక "It had proved disastrous to the
commercial and industrial interests of Holland to have monetary system
identical with that of England, whose financial revulsions, after its adoption
of the gold standard, had been more frequent and more severe than in any other
country, and whose injurious effects were felt in Holland scarcely less than in
England.They maintained that the adoption of the silver standard would prevent
England from disturbing the internal trade of Holland by draining its money
during such revulsions, and would secure immunity from evils which did not
originate in and for which Holland was not responsible" అని ఒక ఉచితబోడిసలహా కూడా ఇచ్చిందని
తెలుసుకుంటే అర్ధమవుతుంది!
ఇక్కడ Court of Directors కానీ అక్కడ Lord Liverpool కానీ నాణెం యొక్క స్థిరత్వాన్ని ప్రమాణం చేసుకోలేదు,అలా అయితే ఇద్దరూ వెండినే ఎన్నుకునేవారు.ఈ రెండు వర్గాలు తీసుకున్న నిర్ణయాల మధ్య వచ్చిన వైవిధ్యం వెనక రహస్యకుట్రలు ఏమీ లేవు,వాళ్ళిద్దరూ ఒప్పుకున్న ప్రాధమికమైన ప్రాతిపదిక స్థిరత్వం కాక ప్రజాబాహుళ్యపు అనుకూలత.వారు తీసుకున్న వేరు దారులకి మూలం ఈ రకమైన ఏకాభిప్రాయం.Composition of currencyని బట్టి విశ్లేషించి చూస్తే ఇంగ్లండ్ ఎక్కువ బంగారు నాణెం వాడకంలో ఉంది, భారతదేశంలో వెండినాణెం వాడకంలో ఉంది.(hariSbabu:ఇక్కడ ఈ
భాగం చదవగానే నాకు వెంటనే చాలా అనుమానాలు వచ్చేశాయి - అంత మేధావి ఇంత తెలివి తక్కువ వాదన ఎలా చెయ్యగలిగాడు,ముఖ్యంగా ఈ వాడకాన్ని బట్టి నాణేన్ని
ఎంచుకోవటం మంచిదేనన్న సూత్రీకరణని గ్రంధ రచయిత ఎట్లా చెయ్యగలిగాడు?పైన
యేమో ఇంగ్లాండ్ పాటిస్తున్న బంగారం అనుకూల విధానాన్ని హోలాండ్ వెక్కిరించిందని చెప్తున్న పెద్దమనిషే Lord Liverpool ఇంగ్లాండుకి బంగారునాణేన్ని ప్రజాబాహుళ్యపు అనుకూలతని బట్టి ఎన్నుకోవడాన్ని సమర్ధిస్తూ మాట్లాడుతున్నాడు.అసలు నాణేలకి కావలసిందే స్థిరత్వం,అలాంటిది ఆయా మేధావులూ సంస్థలూ దాన్ని పట్టించుకోకపోయినా రచయిత అదేం పెద్ద తప్పు కాదు,అందులో రహస్యకుట్ర ఏమీ లేదు అంటున్నాడేమిటి?వాడకందార్లు ప్రభుత్వం ఏ నాణేన్ని వాడుకోమంటే దాన్ని వాడుకుంటారు తప్పిస్తే వాళ్ళ ఇష్టాయిష్టాల్ని బట్టి ఆర్ధికవేత్తలు నాణేల్ని ఖరారు చెయ్యడం ఏమిటి?ఆయనే ఉంటే మంగలెందుకన్నట్టు ఆ ప్రజాబాహుళ్యపు అనుకూల నిర్ణయాల వల్ల సమస్యలు వస్తున్నాయనే కదా సంస్కరణల కోసం ఈ మేధావులు మల్లాగుల్లాలు పడుతున్నది!)ఈ రకమైన సారూప్యతలను గణించుకుంటే Lord libverpool బంగారు నాణేన్ని ఇంగ్లాండుకు ఎందుకు ఎంధుకున్నాడో Board of Directors వెండి నాణేన్ని మన దేశం కోసం ఎందుకు ఎంచుకున్నారో తేలిగ్గా అర్ధం చేసుకోవచ్చును.అయితే, ఇంగ్లాండులో Lord Liverpool నిర్ణ్యాన్ని David Ricardo అనే ప్రముఖ ఆర్ధికవేత్త తను రాసిన High Price of Bullion అన్న గ్రంధంలో "For many reasons given by Lord
Liverpool, it appears proved beyond dispute that gold coin has been near a
century the principal measure of value;but ths is I think, to be attributed to
the inaccurate determination of the mint proportions.Gold has been valued too
high; no silver can therefore remain in circulation which is of its standard
weight.If a new regulation were to take place, and silver be valued too high....gold
would then disappear, and silver become the standard money" అని తప్పు పట్టాడు.
ఏమైతేనేం,ప్రతిపాదన సమయంలో ఆనాటి పరిస్థితులను బేరీజు వేసుకుని తమ కొత్త ఏకైకరజతనాణెపువ్యవస్థని సమర్ధించుకున్నప్పటికీ పోను పోను దేశపు అవసరాలను అది సరిపోలేదని రుజువైంది.అందుకు కారణాలు అనేకం.అప్పుడప్పుడే క్షేత్రస్థాయిలోని ప్రజల ఆర్ధిక నిర్వహణలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకోవడం మొదలైంది.బ్రిటిష్ ప్రభుత్వం పన్నుల విధానంలోనూ పెట్టుబడుల సేకరణలోనూ తీసుకొచ్చిన మార్పు ప్రజల సమస్తమైన సంబంధాల్నీ kind econmy నుంచి cash economy వైపుకి మళ్ళేటట్లు చేసింది!స్థానిక ప్రభువులు ఉద్యోగుల జీతాల దగ్గిర్నుంచి కవులకీ కళాకారులకీ ఇచ్చే కానుకల వరకు గల అన్ని చెల్లింపుల్నీ భూదాన గోదాన ధన కనక వస్తు వాహన సేవల రూపంలో ఇచ్చేవాళ్ళు.భూస్వాములు ధాన్యాన్ని కొల్చి ఇవ్వటం,కొన్ని ఆస్తుల మీద పాక్షిక యాజమాన్యం ఇవ్వటం వంటివాటితో తమ కింది అంతరువుల వాళ్ళని సంతృప్త్రి పరిచేవాళ్ళు.సైనికులూ రక్షకభటులూ వంటి కీలకమైన ఉద్యోగాల విరమణ అప్పుడు వంశపారంపర్య హక్కులతో భూమిని దఖలు పరిచేవాళ్ళు.దీనినే kind economy అంటారు.ఎక్కడికక్కడ ఆదాయాన్ని సర్దుబాటు చెయ్యడం వల్ల రాజ్యాలకి పన్నుల రూపంలో ఖజానాను చేరే ఆదాయం చాలా తక్కువగానే ఉండేది.ఒక్కొక్క ప్రాంతం తమ వశం కావడం మొదలయ్యాక East India Company/British Government చేసిన మొదటి పని ఇతరుల కన్న తమ సైన్యాలు ఎక్కువ చురుకుగా కరుకుగా ఉండటానికి ఉపయోగపడుతుందనే తెలివితో సైనికుల జీతాల్ని డబ్బు రూపంలో ఇవ్వడం మొదలుపెట్టారు.అప్పటివరకు ఇతరులకి ఇస్తూనూ తమకి కూడా ఇచ్చుకుంటూనూ kind econmyకి అలవాటు పడిన civil employeeల స్థానంలో cash రూపంలో
మాత్రమే పన్నులను సేకరించే revenue collecter, అన్ని రకాల kind economy వివాదాల్ని cash economyతో పరిష్కరించే magistrate ఉద్యోగాల్ని స్టృష్టించి అందరికీ డబ్బు రూపంలోనే జీతాల చెల్లింపుల్ని ఖరారు చేసేసింది.వీటితో పాటు అప్పటి స్థానిక ప్రభువులు కలలో కూడా వూహంచని "Home Charges","Interest
on Public Debt" అనే కొత్త రకం చెల్లింపుల్ని కూడా చేర్చింది.ఇందుమూలముగా సమస్తజనులకూ ప్రభుత్వం నుంచి రావలసినదీ ప్రభుత్వానికి ఇవ్వాల్సినదీ డబ్బు రూపంలోనే వస్తుందీ వెళ్తుంది - వద్దంటే ఏదీ ఉండదు!
మరోవైపునుంచి భారత ఉపఖండపు విదేశీ వ్యాపారం క్రమేణ విస్తృతం కావడం మొదలైంది. బ్రిటిష్ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలు కొంతకాలం స్తబ్దతను తీసుకొచ్చినప్పటికీ దీనికి అలవాటు పడిన వెంటనే ఇక్కడి వ్యాపారులు ఈ కొత్తదనాన్ని తమ వ్యాపార విస్తృతికి ఉపయోగించుకోవాలని అనుకున్నారు. అయితే, ఇంగ్లాండ్ ఇక్కడి తమ అధికారం నడుస్తున్న ప్రెసిడెన్సీల నుంచి పత్తినీ ఇతరమైన ముడిసరుకుల్నీ 2.5 శాతం తక్కువ రవాణా పన్నులతో కొనుక్కుని తమతో పోటీ పడే ఇతరులకి అధిక శాతం రవాణా పన్నులు వేసేది - అది 50 నుంచి 500 శాతం(50 % అంతే వస్తువు వెలలో సగం,500% అంటే వస్తువు వెలకి అయిదు రెట్లు) ఉండేది.అయితే, ఈ వివక్ష ఒక్క మనపట్లనే కాదు, తన వలసల అన్నింటికీ వలపక్షం లేకుండా చూపించేది.దీని గురించి ఎంతో గొడవ ఎన్నో తర్జనభర్జనలు జరిగాక Sir Robert Peel మహాశయుడు 1842లో సరిచేసి భారతీయ వ్యాపారులకి కొంత వెసులుబాటు ఇచ్చాడు.నౌకాయానపు నిషేధాలను తొలగించడం దీనికి మరింత ప్రోత్సాహం ఇచ్చింది.1854 నాటి క్రిమియన్ యుద్ధం వల్ల రష్యా వస్తువుల సప్లై తగ్గి మన సరుకులకి డిమాండ్ పెరిగింది.(hariSbabu:ఈ
రెండు మార్పుల వల్ల భారతదేశంలోని సైనిక, ఉద్యోగ, వ్యాపార రంగాలలో ఆరి తేరిన వారు cash economy అందించే సౌకర్యాలను అనుభవిస్తూ రాజభోజరవితేజులయ్యారు.ఆంగ్లేయులతో మమేకం అయిపోయి పాత చింతకాయ పచ్చడికి దూరమయ్యారు.ఈ అవకాశం లేని భూస్వాములూ వ్యవసాయదారులూ వృత్తిపనులవారూ cash economyకి మళ్ళలేక పాత చింతకాయ పచ్చడితో సరిపెట్టుకునే దరిద్రదామోదరులయ్యారు.స్వాతంత్య్రం వచ్చాక కూడా పావులు మారినా ఆటస్థలమూ నియమాలూ అవే కాబట్టి ఈ రెండు వర్గాలూ అలాగే ఉండిపోయాయి. పునాది ఆర్ధిక చట్రాన్ని మార్చకపోతే ఇకముందు కూడా అలాగే ఉంటాయి - చలం భాషలో చెప్పాలంటే పగటిపూట తిట్టుకుంటో కొట్టుకుంటో రాత్రిపూట ముద్దెట్టుకుంటో చెంపల్ని నాక్కుంటో!)వీటన్నింటితో cash స్థానంలో ఉండాల్సిన నాణేలకి డిమాండు పెరిగింది. అటు East India Company తనే ముద్రిస్తున్నది గాబట్టి అవి దానికి
ఉచితం అవుతాయి గానీ భారతీయ వ్యాపారులు దేశం దాటి వ్యాపారం చెయ్యాలంటే ఆ దేశంలో చెలామణీ అయ్యే నాణేలు కొనుక్కోవాలి కదా!యూరోపు దేశాలలో అప్పటికే విస్తారమైన లోహాలని ఎగుమతి చెయ్యడం మీద నిషేధాలు ఉండటం చేత
కొత్త నాణేల్ని ముద్రించుకోవటానికి ఉన్న దారుల్ని మూసేసింది.యూరోపు నుంచి మనం
లోహాలని దిగుమతి చేసుకునే అవసరం
ఏనాడూ లేదు, నిషేధాలు ఎత్తేసినప్పుడు కూడా అటువైపునుంచి ఇటువైపుకి వచ్చిన లోహపు రాశి చాలా తక్కువ.
1799 నవంబరు నాడు Madras Commitee of Reform ముందు Mr.Petrie తను ఇచ్చిన ప్రసంగంలో యూరోపియన్లు ఆక్రమించుకోవటానికి ముందు ఆయా ప్రాంతాలలో జరుగుతూ ఉన్న ఈ నాణెపు లోహాల ఎగుమతి దిగుమతుల గురించి "…purchased the manufactures of
India with the metals of Europe:but they were henceforward to make these
purchases with gold and silver of India, the revenues supplied the place of
foreign bullion and paid the native the price of his industry with his own
money. At first this revolution in the princgiples of commerce was but little
felt, but when opulent and extensive dominions were acquired by the English,
when the success of war and commercial rival-ship had given them so decided a
superiority over the other European nations as to engross the whole commerce of
the East, when a revenue amounting millions per annum was to be remitted to
Europe in the manufacturers of the East,then were the effects of this revolution
severely felt in every part of India.Deprived of so copious a stream, the river
rapidly retired from its banks and ceased to fertilize the adjacent fields with
its overflowing water." అని వివరించాడు. (hariSbabu:ఇక్కడే మనం ఇవ్వాళ సమాజంలో చూస్తున్న ధనిక, బీద అనే విభజనలూ వాటితో పిచ్చెక్కిపోయి ఒకళ్ళనొకళ్ళు ద్వేషించే మనస్తత్వానికీ పునాదులు పడ్డాయి.రచయిత ఎంత దాచిపెట్టి సమర్ధిస్తూ వస్తున్నప్పటికీ అనుకోకుండా బయటపడుతున్నాయి ఇలాంటి కఠిన వాస్తవాలు. మొదట్లో మనవాళ్ళని తొక్కెయ్యడానికే నౌకాయానం మీద నిషేధాలు పెట్టారు.మొదట్లో మనవాళ్ళని తొక్కెయ్యడానికే రవాణాఖర్చుల మీద ఇబ్బదిముబ్బడి పన్నుల బరువు పెట్టారు.మనం చేసిన గొడవ ఉన్నప్పటికీ వాటిని సడలించింది మాత్రం గతి లేకనే!ఏమాత్రం ఇతరమైన వెసులుబాటు ఉన్నప్పటికీ ఆ సడలింపు ఆనాడు జరిగేది కాదు.ఆ కాస్త సడలింపులూ చెయ్యగానే మనవాళ్ళు తమ చురుకుదనం చూపించారు,వాళ్ళని దాటిపోయారు - అదీ ఇక్కడి కవితాత్మకమైన వర్ణన వెనక ఉన్న ఏడుపు. అలా kind economy నుంచి cash economy వైపు వెళ్ళగలిగినవాళ్ళు ఇంగ్లీషువాళ్ళకి అనుకూలమై వాళ్ళ సంస్కృతిలో కలిసిపోతే మిగిలినవాళ్ళు మనదైన kind econimy నుంచి పుట్టిన సంస్కృతిలోనే ఉండిపోయారు.)
Peel ఇచ్చిన వెసులుబాటును ఉపయోగించుకున్న భారతీయ వర్తకుల వల్ల వ్యాపారం పెరిగి దేశం ఒక్కసారి తన కష్టానికి తగిన నిజమైన ప్రతిఫలాన్ని పొందింది - అది దేశపు నాణేల కొరతని తీర్చింది, మొదటిసారి!అయితే ఈ ఉత్సాహం కొద్ది కాలం లోనే ఆవిరైపోయింది.1850 తర్వాత
వచ్చిన కష్టాలు నాణెపు లోహాలను సంపాదించటం మీద విధించిన నిషేధాల వల్ల కాదు.దానికి విరుద్ధంగా, నాణెపు లోహాల ఎగుమతి దిగుమతులు దాదాపు ఉచితం అయ్యాయి,వాటి సేకరణ కూడా గొప్పగానే ఉంది.భారతదేశం యొక్క కొత్త కష్టాలకి మూలం ఒక రకమైన స్వయంకృతం, నాణేల తయారీకి రాశిలోనూ వాసిలోనూ తేలిగ్గ్గా వేగంగా సమకూడే లోహం మీద ఆధారపడకపోవటం.1835 నాటి చట్టం ఏకైకరజతనాణెపువ్యవస్థని తప్పనిసరి చేసినప్పటికీ 1850ల తర్వాత మిగిలిన లోహాల వెలికితీత పెరిగింది గానీ వెండి వెలికితీత మాత్రం అవసరమైన మేరకు జరగలేదు.ప్రపంచం మొత్తం వెండి నాణెం ఉపయోగిస్తున్నప్పుడు మన దేశం వెండి నాణేల కొరతని ఎదుర్కోవడం వల్ల అంతర్జాతీయ వ్యాపారం మందగించింది.
విహంగదృష్టితో చూస్తే అసలు సమస్య ఉన్నట్టే అనిపించదు.వెండి దిగుమతులు అధికంగానే వున్నాయి,నాణేల తాయారీ కూడా అంతే.మరి, సమస్య ఎక్కద నుంచి వచ్చింది?అయితే, దీనికి జవాబు కనుక్కోవటం కూడా పెద్ద కష్టం కాదు.ఎక్కువ శాతం వెండిని నాణేల కోసం ఉపయోగించి వాట్ని చెలామణిలోకి తీసుకు రాగలిగితే సమస్య వచ్చి వుండేది కాదు.Mr.Cassels ఉదహరించిన
"its silver coinage has not only had to satisfy the requirements of
commerce as the medium of exchange, but it has to supply a sufficiency of
material to silversmith and the jeweler. The Mint has been pitted against the
smelting-pot, and the coin produced by so much patience and skill by the one
has been rapidly reduced into bangles by the other(hariSbabu:ఎంత
వెండి దిగుమతి అయింది, ఎంత నాణేల తయారీ కోసం వెళ్ళింది,ఎంత ఆభరణాల తయారీ కోసం వెళ్ళింది అనేది పట్టికలు కూడా చూపించాడు రచయిత.కానీ, ప్రభుత్వంలో ఉన్నవాళ్ళూ బాధ్యత గల స్థానాల్లో ఉన్నవాళ్ళూ ప్రాధమ్యాలను గురించి చెప్పి నాణేల తయారీ యొక్క ప్రాముఖ్యతని పెంచి వెండి నగల తయారీని తగ్గించితే ఎవరు కాదంటారు?వాళ్ళు చెయ్యాలనుకున్న యెదవపని కోసం మనవాళ్ళని నగల పిచ్చోళ్ళ కింద ముద్ర వేస్తున్నారని నాకు అనిపిస్తున్నది.రచయిత మాత్రం అసలు ఏమాత్రం అనుమానం లేకుండా ఇంగ్లీషువాళ్ళని సంస్కర్తల కింద పొగిడేస్తున్నాడు.)
పోనీ వెండి దిగుమతుల్ని పెంచి నాణేల తయారీని వేగవతం చెయ్యడానికి చూస్తే వెండి దిగుమతులు అప్పటికే తారా స్థాయిని చేరుకున్నాయి.ఋణ సౌకర్యం ఉంటే కొరత తీరేది,కానీ అప్పటికి ఆ వెసులుబాటు లేదు.అక్కడికీ ప్రభుత్వం అతి తక్కువ స్థాయిలో interest-bearing treausry notes విడుదల చేసింది,కానీ "firstly, to the condition that they
would not be received in payment for twelve months;secondly, they would be paid
off or received only where issued, so that as the issues were confined to their
respective presidencies Calcutta, Madras and Bombay;thirdly and lastly,because
their amounts were too large and their period of running at interest is too
short." అనే బలహీనతల వల్ల ఆశించిన రీతిలో సఫలీకృతం కాలేదు.అప్పటికి బ్యాంకింగ్ వ్యవస్థ కూడా అభివృద్ధి కాలేదు.తను కూడా వ్యాపార సంస్థయే కావటంతో Court of East India Company కోరి పోటీదారును రంగంలోకి తెచ్చుకోవడ ఇష్టం లేక బ్యాంకుల ఏర్పాటును వ్యతిరేకించింది.ఈ రకమైన సాంప్రదాయికతా వ్యామోహం, ఆధునికతా వైముఖ్యం వల్ల వ్యాపరం యొక్క విస్తృతికి తగ్గట్టు పెట్టుబడులను సమకూర్చే యంత్రాగం సమకూర లేదు,1856 నాటికి
దేశంలో ఉన్న బ్యాంకులను వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు.
ఈ మొత్తం గందరగోళం రానురాను మరింత ముదిరి ప్రజలూ వ్యాపారులూ మేధావులూ 1835 నాటి సంస్కరణల్ని చాలా తీవ్రంగా వ్యతిరేకించడం మొదలుపెట్టారు.అసలీ bimetallism నుంచి monimetallismకి,gold monometallism నుంచి silver monomrtallismకి దూకిన కప్పగంతుల్ని ఏకిపారేసి gold monometallismని అందరూ సమర్ధించడం కూడా జరిగిపోయింది.అయితే, ఈ gold monometallismని ఎట్లా అమలు చెయ్యాలన్న దాని దగ్గిర పేచీ వచ్చింది.ప్రభుత్వం ఎటూ బంగారు, వెండి నాణేలకి వేర్వేరు
విలువల్ని నిర్దేశించి వాటిని బ్యాలెన్స్ చెయ్యడం విషయంలో చేతులెత్తేసింది కాబట్టి gold bimetallismని మళ్ళీ ప్రారంభించే ఆశ లేదు.ఇక ప్రభుత్వం ముందున్న అనేకమైన దారులలో ముఖ్యమైనవి ఇలా ఉన్నాయి - "1.to introduce the
"sovereign" or some other gold coin and to let it circulate at its
market price from day to day as measured in silver;2.to issue a new gold coin,
bearing the exact value of a given number of rupees, and make it a legal tender
for a limited period, when it might be readjusted and again valued,when it
might be readjusted and again valued, and made a legal tender for a similar
period at the new rate;3.to introduce the English sovereign as a legal tender
for Rs.10, but limited in legal tender to the amount of Rs.20 or two
sovereigns; or 4.to substitute a gold standard for the silver standrad."వీటిలో మొదటి మూడూ అసలు ఆచరణ సాధ్యం కానివి, అప్పటి సంక్లిష్టతను బట్టి వాటిని గురించి కూడా ఆలోచించారు గానీ అంత క్షేమం కాకపోవటమే వాటి వైపుకి మొగ్గు చూపకపోవటానికి ముఖ్యమైన కారణం.
ఆర్ధిక రంగానికి స్థిరమైన నాణెం ఎంత అవసరమో ఆ నాణేనికి స్థిరమైన విలువని నిర్ధారించడం కూడా అంతే అవసరం.మార్కెట్ హెచ్చుతగ్గుల్ని బట్టి రోజురోజుకీ మారిపోతూ ఉనే నాణెం కేవలం ఒక లోహపుముద్ద మాత్రమే అవుతుంది.కాబట్టి ప్రభుత్వం మొదటి సూచనని తిరస్కరించడం సమంజసమే!రెండవ సూచన కూడా మొదటి సూచన కన్న గొప్పది కాదు.దీన్ని గనక పాటిస్తే బంగారం మార్కెట్ విలువ తక్కువ ఉన్నప్పుడు బంగారు నాణేలు చెలామణిలోకి వస్తాయి, ఆర్ధిక సంవత్సరం ముగిశాక నాణెం ముఖవిలువని బంగారం ధరకు అనుగుణం చెయ్యటం కోసం తగ్గిస్తే బంగారు నాణెలు కూడా చెలామణి నుంచి పోతాయి.(hariSbabu: పదే పదే రచయిత చేస్తున్న ఈ విశ్లేషణ నాకు విసుగు తెప్పిస్తున్నది.ఈరోజున వాళ్ళు తప్పనిసరి చెయ్యడం వల్ల సామాన్యులు కూడా డబ్బుతో అనుబంధం పెంచుకున్నారు.డబ్బు లేనిదో రోజు గడవని స్థితి ఉంది కాబట్టి ఆ డబ్బు కోసం కక్కుర్తి పడుతున్నారు.కానీ రచయిత ఇప్పుడు మనల్ని నిలబెట్టిన 1800వ సంవత్సరం నుంచి 1893వ సంవత్సరం మధ్యన నాణేల్ని ఎవరు వాడుతున్నారు?kind economy అని రచయితయే వర్ణించిన సామాజిక జీవితంలో ఒక్క రూపాయిని కూడా తమ జీవితకాలంలో ఒక్కసారి కూడా చూడకుండా గడిపేవాళ్ళు వేలూ లక్షలూ కోట్లలో ఉన్ననాడు తమ వ్యాపారం కోసం వైభవం కోసమూ నాణేల్ని వాడుతున్నవాళ్ళలో ఆ నాణేల్ని కరిగించి నగలు చేయించుకోవాలనే కక్కుర్తి సాధ్యమా?మరి అలాంటప్పుడు రచయిత నాణేల వ్యవస్థ యొక్క లోపాలకి వాటిని నగల కోసం వాడే లోహాలతో తయారు చెయ్యటమే అన్నట్లు ఎందుకు వాదిస్తున్నాడు? ఇతనొక్కడే కాదు, ఈ తరహా వాదనలు చేస్తున్నవాళ్ళు మనకి చెవుల్లో పువ్వులు పెట్టడానికి ప్రయత్నిస్తున్నట్టు అనిపించడం లేదూ!నాణేల వ్యవస్థ ఏర్పడిన నాటినుంచి ఇప్పటికి ఎంత కాలం గడిచి ఉంటుంది? అప్పటివరకు డబ్బు ముఖం చూడని సామాన్యులకి సైతం నాణెమో నగయో దొరికితే అది ఎందుకు పనికొస్తుందో తెలుసుకున్నాకనే వాడుకోగలరు కదా!"డబ్బు లేనివాడు దుబ్బుకి కొరగాడు" అనేది ఏనాటి మాట, అలాంటిది, ప్రజల్ని నాణేలకీ నగలకీ తేడా తెలియని పిచ్చి మొహాల కింద ముద్ర కొట్టెయ్యడం ఏమిటి?) ఇక మిగిలిన ఒకే ఒక బహుమంచి పరిష్కారం మొదట gold standardని నిర్ణయించుకుని దానికి సరితూగే silver cyrrencyని చెలామణిలోకి తీసుకురావటం.కానీ, ప్రభుత్వం "in a country where all obligations
have been contracted to be paid in silver, to make a law by which they could
forcibly paid in anything else would simply be to defraud the creditor for the
advantage of the debtor, and to break public faith" అన్న వాదనతో తిరక్కొట్టేసింది.
వాదన ఎంత బలమైనదైనప్పటికీ ప్రభుత్వానికి gold currency పట్ల బలమైన వ్యతిరేకత ఉన్నదని చెప్పటం కష్టమే.దీనికన్న చక్కని పరిష్కారం వాళ్ళకి తోచడమే ప్రభుత్వం యొక్క మొండితనం వెనక ఉన్న చిదంబర రహస్యం - వాళ్ళు అనుకున్నది సజావుగా జరిగితే ఇక ప్రభుత్వం మీద ఏ విమర్శలూ ఉండవు.బంగారు నాణెం అనేది లాభకారి కాదు, సౌకర్యవంతమైనది కూడా కాదు.అదే వెండి పునాది మీద కాగితాన్ని వాడితే లాభం ఎక్కువ, సౌకర్యంగానూ వుంటుంది - చెలామణి మరింత వేగవంతమూ విస్తృతమూ అవుతుంది!
అయితే, అటు వైపున ఉన్న ప్రజల్లో బంగారు నాణెం పట్ల వ్యామోహం కూడా ఎక్కువగానే ఉంది, అత్యవసరం అని ప్రభుత్వం ఎంత నమ్మబలికినప్పటికీ దానికి ప్రత్యామ్నాయాలను స్వీకరించే మనస్తత్వంలో వారు లేరు. paper currencyని Mr.Wilson మొదట ప్రతిపాదించినదే బంగారు నాణెం ఉద్ధృతిని తగ్గించడానికి.ఆయన మరణానంతరం ఆ వాదనని కొనసాగించిన Mr.Laing భారతదేశపు
మారకవ్యవస్థ నుంచి బంగారునాణేన్ని తొలగించడం చాలా క్రూరమైనదని ఒప్పుకుంటూనే Mr.Wilson మొదట ప్రతిపాదించిన మూలప్రతిలో కొన్ని సవరణలు చేశాడు.ఆయన చేసిన మొదటి పని అతి చిన్న ప్రామాణిక విలువని 5 Rs నుంచి
20 Rsకి పెంచటం.రెండవది "to authorize the Governer-general
in council from time to time to direct by order to be published in the gazettes
of Calcutta, Madras and Bombay, that notes to an extent not exceeding one-fourth
of the total amount of issues represented by coins and bullion...be issued in
exchange for gold bullion...or bullion computed at rates to be fixed by such
order..." అని ఎల్లరకూ హెచ్చరికల వంటి నిర్దేశక మార్గసూత్రాలు జారీ చెయ్యటం. ఈ రెండవ సూత్రీకరణని మక్కీకిమక్కీ పాటిస్తూ అతి చిన్న ప్రామాణిక విలువని 10 Rs చేస్తూ
ఒక చట్టం చేసేశారు.దీని వెనక ఉన్న లోపాయకారీ ఉద్దేశం స్పష్టంగానే ఉన్నప్పటికీ అధికారిక పత్రాలలో అంత సపష్టమైన వివరణలు ఇవ్వలేదు. సెలెక్ట్
కమిటీ "that on special occasions and in particular transactions it might
be a great advantage to the marcantile community to know that gold could be
made available as money at a fixed rate. If, on the other hand, at the rate
fixed gold did not enter into circulation it would prove that silver, with a
secure and convertible paper currency, gave perfect confidence and answered all
the wants of the trade and of the community, and the enactment would remain a
dead letter and be perfectly harmless." అని పొగిడేస్తూ ఇలా కనక జరక్కపోతే పరిస్థితి
ప్రమాదకరం అవుతుందని ముక్తాయించింది.
అయితే, వ్యాపార వర్గాల సౌకర్యం అవుతుందనీ స్వర్ణమారకద్రవ్యానికి ప్రత్యామ్నాయం అవుతుందనీ అనుకున్న ఈ సూత్రీకరణ అమలు కాలేదు.Secratary of State దీనికి సంబంధించిన ఏ చర్యనూ ప్రోత్సహించలేదు.ఇంకోవైపునుంచి paper currency ఆశించిన సత్ఫలితాన్ని ఇవ్వలేదు.ఆర్ధిక రంగపు కదలికల మీద దాని ప్రభావం చాలా తక్కువగా ఉంది.మూడేళ్ళ తర్వాత కూడా paper currency యొక్క చెలామణి 6 శాతం మాత్రమేనని Mr.Cassels ఎత్తి
చూపించాడు. మరోవైపునుంచి Civil War వల్ల
Americon Cotton దిగుమతులు తగ్గి Indian Cotton యొక్క అవసరం ఎక్కువ కావటంతో భారతదేశం పంట పండింది.దాంతో ఇక్కడ paper currency వాదకం పెరగకపోవటంతో silver coins మీద ఒత్తిడి పెరిగింది.వెండి ఉత్పత్తీ దిగుమతీ పెరగకపోవటం వల్ల పెరిగిన బంగారం దిగుమతుల్ని ఉపయోగించుకుని నాణేల తయారీ మొదలు పెట్టారు - కానీ, బంగారం legal teder కాదు!
ఇక Bombay Chamber of Commerce "that there is an increasing tendency
to the creation of a gold ingot currency, by the natives of this country, as a
rude remedy for the defects of the existing silver one," మరియు "that gold bars, stamped with the mark of Bombay Banks,are for
this purpose circulated in several parts of the country." అని పేర్కొంటూ భారత ప్రభుత్వానికి ఒక వినతి పత్రం సమర్పించింది.నిజానికి ఇది ఒక్క Bombay Chamber of Commerce యొక్క ఆశ కాదు,మిగిలిన రెండు ప్రెసిడెన్సీఅల్ డిమాండు కూడా ఇదే - కాకపోతే Local Govrnment of Bombay వీళ్ళతో కలిశాకనే ఆ డిమాండుకు బలం పెరిగింది.దీనికి సంబంధించి Sir William Mansfield యొక్క ప్రసంగం ఎంతో ప్రభావశీలమైనది.
స్థానిక ప్రభుత్వాల నుంచి వచ్చిన వ్యతిరేకత వల్ల ఈసారి కేంద్రప్రభుత్వం సమస్యను పరిష్కరించడానికి Sir Charles Trevlayan సహాయం తీసుకుంది. అతను అప్పుడు అనుసరిస్తున్న మొత్తం వ్యవహారంలో ఒక బలహీనతను కనిపెట్టాడు.పేపర్ కరెన్సీ అప్పటి వెండి రూపాయికి అనుబంధమై ఉండటానికి బదులు కొంత శాతం బంగారం విలువను బట్టి వాడకంలో మార్పులు వస్తూ ఉండటమే రాజకీయపరమైన అపనమ్మకానికీ వ్యాపరుల అసహనానికీ కారణం అని నిర్ధారించాడు.దానితో "all nations must pass through a
transition stage of a double standard before they arrive at a single
standard." అన్న సూత్రీకరణ చేసి 1).10 రూపాయల
విలువకు సమానమైన బ్రిటిష్ మరియు ఆస్ట్రేలియన్ sovereign కరెన్సీని
భారతదేశంలో చెలామణి చెయ్యాలి,2). ప్రభుత్వం విడుదల చేసిన కరెన్సీ నోట్లని ఇతర కరెన్సీతో చెల్లుబాటు చెయ్యాలి తప్ప bullian excgangeకి వాడకూడదు. ప్రభుత్వం ఆ సలహాలను ఆమోదించి అధికారికమైన అనుమతి కోసం Secretary of State సముఖానికి పంపించింది.
కానీ Secretary of State మాత్రం monmetallism నుంచి ఏ కొంచెం పక్కకి జరిగినా సహించేది లేదని భీష్మించుకుని ఈ ప్రతిపాదనల్ని పక్కన పెట్టేశాడు!సంధి కాలపు bimetallism సైతం ఆయన్ని భయపెట్టడంతో మొత్తం ప్రక్రియనే వ్యతిరేకించాడు.ఆయన బంగారు నాణేన్ని legal tender చెయ్యకుండా గవర్నమెంటు విలువని నిర్ధారించిన బంగారు నాణేల్ని ప్రభుత్వ ఖజానాలు స్వీకరించేటట్లు చేస్తే చాలునని ఒకే ఒక వెసులుబాటు ఇచ్చాడు.సమస్య అతి తీవ్రమైనది కావటంతో ప్రభుత్వం ఆయన సలహాల్ని కూడా ఒప్పుకుని 1864 నవంబరు
మాసంలో "sovereigns and half-sovereigns
coined at any authorized Royal Mint in England or Australia of current weight,
shall until further notice be received in all Treasuries of British India and
its dependencies in payment of sums due to Government, as the equivalent of 10
Rs. and 5 Rs. respectively; and that such sovereigns and half-sovereigns shall,
whenever available at any Government Treasury, be paid at the same rates to any
person willing to receive them in payment of claims against the
Government" అని Notification ఇచ్చింది.
పోపుల పెట్టె మొత్తం గాలించి ఎన్ని తాలింపులు వేసినప్పటికీ కూర మాడి కూచుంది తప్ప ఘుమఘుమలు రాలేదేవిషో అన్నట్టు కరెన్సీ కొరత అలాగే ఉండటంతో గతి లేక Government of India మళ్ళీ 1866లో Bombay Chamber of Commers వార్ని బతిమిలాడుకుంది బంగారం చెలామణిని సరైన తీరున నడపమని.ఈసారి సదరహీ చాంబరు వారు ప్రభుత్వం మీద కాస్త కనికరించి "as to the expediency of introducing
gold into the monetary system of India" అని పేరు పెట్టి ఒక కమిషన్ని వేశారు.కానీ గవర్నమెంటు మాత్రం "Instaead of a gold a paper currency
has been introduced, in the expectation that it would prove a more convenient
and acceptable circulating medium than either of the precious metals." అనియున్నూ "it must be shown
that paper has not proved and it is not likely to prove a circulating medium
adequate to the wants and suitable to the habits of the country before an
endeavour is made to introduce gold in supersession of, or in addition to,
paper." అనియున్నూ నొక్కి వక్కాణించుతూ "operation of the existing
currency arrangements which were established under act XIX of 1861" అనెడి పవిత్రమైన
సంకల్పముతో ఒక కమిటీని వేసియున్నూ తనివి తీరక "what may be the advantage, as
based on expediency, of the introduction of the legal tender of gold into
India, in addition to that of silver" అని పృఛ్ఛించుతూ ఒక రిపోర్టును ఇవ్వమని
కోరింది.
వారునున్నూ కడుంగడు కృతనిశ్చయులై దేశపు ద్రవ్య చెలామణి పద్ధతులను జల్లెడ పట్టి తూర్పారబట్టి గిలకొట్టి తేల్చినది ఏమన , "అనేకానేకమైన కారణముల చేత paper currency ఫలవంతము కానందుననూ ప్రజల పరస్పరాశ్రిత వ్యవహారములందు బంగారమే వాంఛనీయముగ నున్నది గనుకనూ స్వర్ణమునే మారక ప్రమాణమును చేయుట ఉభయ తారకము" అని!నిజానికి, తను అంత నిజాయితీగా వేసిన సంఘం ఇచ్చిన నివేదికను పాటించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉండాలి.కానీ, ప్రభుత్వం 1868 అక్టోబరు
28న ఆ sovereign విలువని
10 నుంచి 8కి తగ్గించి గమ్మున కూర్చుంది - అసలే ఏకపక్ష నిర్ణయం, అతి చేస్తే గతి చెడుతుందని భయం వేసి అదనం ఏమీ చెయ్యలేదంతే!వారి అదృష్టం బాగుండి దీనివల్ల జరగాల్సిన ముప్పు ఏదీ జరగలేదు.కరెన్సీ సమస్యలు కూడా తగ్గుముఖం పట్టాయి.అలా ప్రకృతి కలగజేసుకుని సరిదిద్దినట్టు సహజమైన ఆర్ధిక ప్రగతి సాంసయల్ని దాటవేసింది గానీ తదనంతర పరిణామాలు మాత్రం gold standard మాత్రమే భారతదేశానికి అనుకూలం అని రుజువు చేశాయి.బంగారం యొక్క అతిలభ్యత వల్ల అధికధరలతో కుములుతున్న యూరోపీయ దృక్కోణం నుంచి చూసినప్పటికీ అది మేల్భళా నిర్ణయం అయి వుండేది.
ఆనాటి చారిత్రకవిభావరిలో ఒక దృఢమైన నిర్ణయం తీసుకుని ద్రవ్యమారకపు విధానం వెండి నుంచి బంగారానికి మళ్ళివుంటే తేలికగానూ జరిగేది, అన్ని సమస్యలూ దూదిపింజల్లా ఎగిరిపోయేవి.అత్యంత జాగరూకత చూపించాల్సిన సమయంలోనే అత్యంత నిర్లక్షం చూపించటం అనే భయానకమైన మనస్తత్వం మానవుల చేత అత్యంత దురదృష్టకరమైన నిర్ణయాలను తీసుకునేటట్టు చేస్తుంది!అలాంటి నిర్లక్ష పూరిత మనస్తత్వంతో కరెన్సీ సమతౌల్యం అఫ్భుతమైన స్థితిలో ఉందని భావించిన ఆ 1870ల నాడు 1835ల నాటి silver standardను పునరుద్ధరిస్తూ Mint Lawని కొన్ని మార్పులు చేసి చక్కా కూచున్నారు.దానితో ""ఓ తండ్రీ!వీరేమి చేయుచున్నారో వీరెరుగరు!" స్థాయిలో
భారతదేశపు భావి ఆర్ధిక చరిత్ర వూహించని మలుపు తీసుకుంది.
(hariSbabu:ప్రాచీన మధ్య యుగాల నాటి భారత దేశపు
చరిత్రను కమ్యూనిష్టు చరిత్రకారులూ కాంగ్రెసు మేధావులూ కలిసి వండివార్చిన గ్రంధాలను బట్టి చూసినప్పటికీ ఆ రెండు యుగాల నాడు జీవించిన మానవ సమూహం యొక్క సంస్కృతిలోనూ ఈనాడు జీవిస్తున్న మానవ సమూహం యొక్క సంస్కృతిలోనూ పూర్తి తేడా కనిపిస్తుంది.చాలా వెనక్కి వెళ్ళనక్కరలేదు, CE1960ల్లో పుట్టిన మా తరానికి మా పెద్దలు ఒకప్పుడు బాధతోనూ ఒకప్పుడు నవ్వుతూనూ చెప్పుకున్న తమ చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకోగలగడం ఎట్లా సాధ్యపడిందో తెలుసా - ఆనాడు జీవించిన మానవ సమూహం యొక్క సంస్కృతిలోనూ ఈనాడు జీవిస్తున్న మానవ సమూహం యొక్క సంస్కృతిలోనూ పూర్తి తేడా కనిపించడం ఇటీవలనే జరిగిన ఒక కుట్ర ఫలితం గనక!
మొదటి
అధ్యాయంలో రచయిత చెప్పిన కధలో ఇంగ్లీషువాళ్ళు తీసుకున్న అన్ని నిర్ణయలూ 1835 చుట్టూ
తిర్గడం మీరు గమనించే ఉంటారు.ఈ పుస్తకం రచయిత లండను ప్రీవీ కాలేజిలో చదువుతున్నప్పుడు
రాసిన సిద్ధాంత గ్రంధం.సరిగ్గా 1935ల నాడు ఇదే రచయిత మన దేశపు చట్టసభలో RBIని ప్రవేశపెట్టాడు.అప్పుడు
Hilton Young Commission సభ్యులు గ్యాలరీలో కూర్చుని చూస్తున్నారు.వాళ్ళ చేతుల్లో ఈ
గ్రంధమే ఉంది!
నాణెపు
వ్యవస్థను తీసేసి పేపర్ కరెన్సీకి జనాన్ని అలవాటు చెయ్యడం వల్లనే మన దేశంలోని సాంస్కృతిక
పరమైన విధ్వంసం జరిగందనేది నేను బల్లగుద్ది చెప్పగలను!ఎందుకంటే, చరిత్ర కందని పూర్వ
కాలం నుంచీ వీళ్ళు ధ్వంసం చెయ్యక ముందు వరకు ప్రజల శ్రమకు నాణెం ఒక భౌతికరూపం.అది ఎలాగంటే,
ఒక రాజు ఒక నాణెం ముద్రించలంటే అంతకు ముందర పన్నుల రూపంలో ఖజానాకు చేరిన లోహం నుంచే
తీసుకునేవాడు.ఒకవేళ వ్యాపారస్థులు తమ వ్యాపారం కోసం అదనపు నాణేలు కావాలంటే లోహాన్ని
తనే టంకశాలకు ఇచ్చి తయారు చేయించుకునే వాళ్ళు.చాలా సహజంగా నాణేనికి వాడే లోహం అన్నిటికంటే
విలువైనది కాబట్టి ఇతర వస్తువుల దరల్ని నిర్ణయించడం కూడా ఎంతో సరళంగా వుండేది.భూమినుంచి
పుట్టే ప్రతి వస్తువుకీ ధరను నిర్ణయించాల్సిన అవసరం కూడా వుండేది కాదు.అవసరం,లభ్యత,
లాభం వంటి అంశాలని బట్టి వస్తువులకి ధరలను నిర్ణయిస్తే సరిపోయేది.ఉదహరణకి అప్పట్లో
అన్నాన్ని అమ్మడం శిరఛ్చేదం విధించదగిన భయంకరమైన నేరం,ఇవ్వాళ హోటల్ లేని నగరాలే కాదు,
పల్లెటూళ్ళు కూడా లేవు!
మన
దేశపు ఆర్ధిక వ్యవస్థకు అతి కీలకమైన Reserve Bank of India(RBI) ఒక సర్వస్వతంత్రమైన
సంస్థ - 1. Issue of Bank Notes, 2. Banker to Government, 3. Custodian of Cash
Reserves of Commercial Banks, 4. Custodian of Country’s Foreign Currency
Reserves, 5. Lender of Last Resort, 6. Central Clearance and Accounts
Settlement, 7. Controller of Credit అనే అతి ముఖ్యమైన విధుల్ని నెరవేరుస్తున్నది కాబట్టి
ఆర్ధికశాస్త్రంలో పట్టు లేని వ్యక్తులు దాన్ని ఉపయోగించుకుని సత్ఫలితాలు పొందాలే తప్ప
దర్పాన్ని ప్రదర్శించితే శృంగభంగం తప్పదు - అటువైపున ఉన్న రిజర్వ్ బ్యాంక్ గవర్నరు
కూడా అహంకారి అయితే తన మీద ప్రభుత్వం చేస్తున్న పెత్తనానికి కినిసి తప్పుడు సలహాలు
ఇస్తే ప్రధాని పరువూ పోతుంది ప్రజలూ కల్లోలానికి గురవుతారు!
రిజర్వ్
బ్యాంకు నోట్లని ముద్రించటానికి ఉన్న సాంకేతికపరమైన మార్గదర్శకాలు చాలా తక్కువ.ఇందుకోసం
1956లో Minimum Reserve System అనే ఏర్పాటు చేసుకుంది.దీని ప్రకారం రిజర్వ్ బ్యాంకు
సర్వకాల సర్వావస్థల్లోనూ తన అధీనంలో 200 కోట్ల రూపాయలను బంగారం నిల్వల రూపంలోనూ విదేశీమారకద్రవ్యం
రూపంలోనూ ఉండేటట్టు జాగ్రత్తలు తీసుకుంటుంది.నోట్ల తయారీలో గానీ ఇతర విధుల విషయంలో
గానీ ఇది ఎలాంటి ప్రభావాన్నీ చూపించకపోయినా ఒక కంపెనీ ప్రభుత్వానికి చూపించాల్సిన మూలధనంలా
ఉంటుంది.
ఇక
ప్రతి సంవత్సరం కొత్త నోట్లని ముద్రించడానికి స్థూల జాతీయోత్పత్తిని కాక growth
rate అనే దాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది.కరెన్సీ అనేది చేతులు మారేది అమ్మకం, కొనుగొళ్ళు
అనేవి జరిగే చోటనే కదా - మరి ఇన్ని కొత్త ట్రాన్సాక్షన్లు జరుగుతాయని రిజర్వ్ బ్యాంకు
ఎలా వూహిస్తుంది?వూహలతోనూ స్వప్నాలతోనూ ఆర్ధికాన్ని నడిపిస్తే హార్దికం ఫెడేల్ మంటుంది
- గ్రోత్ రేట్ 9% ఉంటే 9 x 2 + 4 = 22% అని లెక్క ఉంది.అంటే రాబోయే సంవత్సరంలో సాధించగలమని
అంచనా కట్టిన గ్రోత్ రేటుకి రెండింతల స్థాయిలో కరెన్సీ కావాలి.4 శాతం అనేది నిరంతరం
ఎదుగుతున్న ఆర్ధిక వ్యవస్థలో ఉండే మినిమం ఇన్‌ఫ్లేషన్ యొక్క శాతం.ఈ 4% ద్రవ్యోల్బణం
వాంఛనీయమే!
కొత్త
కరెన్సీ అవసరం అనుకుంటే ప్రభుత్వం ట్రెజరీ శాఖని లెక్కలు చూసి చెప్పమని అడుగుతుంది.ఆ
లెక్కలు తేలాక ప్రభుత్వం బాండ్లను తయారు చేస్తుంది - ఇవి కమర్షియల్/ప్రైవేట్ బ్యాంకులో
అక్కవుంట్ ఉన్న వ్యక్తి రాసే విత్డ్రాయల్ స్లిప్ లంటిది. ప్రభుత్వం ఒకోసారి వీటిని
ప్రజలకి కూడా ఇస్తుంది.ప్రజలు తమంతట తాము గానీ ప్రభుత్వం అధికారుల ద్వారా గానీ రిజర్వ్
బ్యాంకుకు అప్పగిస్తే రిజర్వ్ బ్యాంక్ ఆ మొత్తానికి చెక్కు ఇస్తుంది.అది ప్రజలు కానీ
ప్రభుత్వం కానీ క్యాష్ చేసుకోవడం ఎలాగో మీకూ తెలిసిందే కదా.కానీ, రిజర్వ బ్యాంక్ చెక్కు
రాసే ముందు తన అక్కవుంటులో అంత డబ్బును ఉంచుకోవాల్సిన అవసరం లేదు.అదే పని, మన ఎక్కవుంటులో
ఉన్నదానికన్న ఎక్కువ డబ్బుకు చెక్ ఇస్తే ఫ్రాడ్ అవుతుంది - ఇదెక్కడి న్యాయం, చెప్పండి!
RBI
అనే ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ అదే రాజ్యాంగబద్ధమైన ఎన్నికల ప్రక్రియ ద్వారా ఏర్పడిన
కేంద్రప్రభుత్వం అధీనంలో ఉండకపోవడమూ ప్రజాప్రభుత్వాలనే శాసించడమూ ఎంత దుర్మార్గం!ఆ
దుర్మార్గం ఇక్కడ మొదలైంది - పేపర్ కరెన్సీకీ రిజర్వ్ బ్యాంకుకీ అవినాభావ సంబంధం ఉంది.Currency
Issuer అనే తన విధిలో భాగమైన Issues, exchanges or destroys currency and not fit
for circulation లాంటి వ్యవహారాల్ని అది ఎలా చేస్తుందో తెలుసుకుంటే మన ఆర్ధిక వ్యవస్థలోని
డొల్లతనం బయటపడుతుంది.కొత్త కరెన్సీ నోటల ముద్రణ అనేది పాతకాలపు నాణెపు ముద్రణలా ఖజానాలో
అప్పటికే పోగుపడిన సంపదని బట్టి చెయ్యదు రిజర్వ్ బ్యాంక్.అసలు ఇప్పుదు మనకి ఖజానా అనేది
లేనూ లేదు, మనం నిలవలోనూ లేము.2017 నాటి మన external debt 513.4 billion, 1019 నాటికి
US$ 557.4 billion - మార్చి 2019 నాటికన్న US$ 14.1 billion ఎక్కువ!దీనికి సాలుసరి
వడ్డీని లెక్కగట్టి మన దేశపు వార్షికాదాయంతో పోల్చి చూడండి - మీ గుండె గుభేలుమనటం ఖాయం!)
No comments:
Post a Comment
సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు