Saturday, 7 March 2020

పరశురాముడు 21 సార్లు సమస్త భూమండలాన్ని చుట్టి నిక్షత్రం చెయ్యడం నిజమేనా?

ఇదివరకు టూకీగా కొంత చెప్పాను.కానీ, ఈసారి అన్ని వైపుల నుంచీ పరిశోధించి నిజనిర్ధారణ చేస్తున్నాను.ప్రతిపాదన మొదటే చేస్తున్నాను - కొంచెం కంగారు పడాల్సిన విషయమే, కధలోని విషయం ప్రాచీన కాలపు పౌరాణికుల నుంచి వచ్చింది కాదు, మధ్యనే అంటే సామాన్య శకం 18 శతాబ్దపు తొలినాళ్ళలో పురాణ వైర గ్రంధమాలలో విశ్వనాధ సత్యనారాయణ ప్రతిపాదించిన భగవంతుడు లేక సనాతన వైదిక ధర్మం మీద పగతో రగిలిపోతున్న జయధ్రధుడి వారసులు మన సంస్కృతికి విరుద్ధమైన అంశాలని మన సాహిత్యంలో ఇరికించి మనల్ని అవమానించడం కోసం చేసిన కుట్ర.
కుట్రకి సంబంధించిన చారిత్రక సాక్ష్యాలను తర్వాత చెప్తాను.మొదట అసలు కధలోని అంశాలనూ వాటి అంతరార్ధాలనూ సహజతర్కం(common sense)తోనే విశ్లేషిస్తాను.ఇవ్వాళ మనకు లభ్యమవుతున్న పురాణాల్ని ఆపోశన పట్టామనుకునేవాళ్ళూ వాటిని సామాన్య ప్రజలకి చెప్పేటప్పుడు అవి ఎలాగూ కల్పితాలే కదా అని తమ సొంత పైత్యం కూడా కలిపి హడావిడి చేసే పౌరాణికులూ వాటిని చదువుతున్నప్పుడూ అర్ధం చేసుకుంటున్నప్పుడూ కనీసపు తర్కం కూడా ఉపయోగించకపోవటం వల్లనే హైందవేతరుల కుట్ర విజయవతం అయ్యింది.సాక్ష్యాలు వెదకటానికిముందు నేను చేసింది కేవలం కధ వేద ప్రతిపాదితమైన సత్యాన్ని నిరూపిస్తున్నదా వేదం ప్రస్తుతించిన ధర్మాన్నే చెప్తున్నదా అని తరచి చూడటమే.
మొదటి అభ్యంతరం:శివుడికీ విష్ణువుకీ అవతారాలు ఉన్నాయి.అయితే ఇద్దరిలో ఒక్కరు భూమి మీద అవతరించారని చెప్తున్న ప్రతి కధలోనూ భూలోక నివాసులు నిర్జించలేని రాక్షస శక్తి ని సంహరించడానికే వారిద్దరూ అవతారం ధరించారు. త్రిపురాసుర వధ చేసిన శివతత్వం అవతారం కాదు, కైలాసవాసి తన సహజ రూపం వదలకుండానే ఆ ఘనకార్యం చేశాడు.
విష్ణువు సృష్టి ప్రారంభంలోనే ధరించిన మత్య, కూర్మ, వరాహ, మోహినీ రూపాలు కూడా అవతారం అని చెప్పడం సబబు కాదు, కొన్ని విశేష ప్రయోజనాల కోసం తనను తాను మార్చుకున్న రూపు రేఖా విలాసాలు మాత్రమే.సాంకేతిక నిర్వచనం ప్రకారం అన్నింటినీ అవతారం అనవచ్చును కానీ ప్రస్తుత కధతో పోల్చడానికి మనం ఇక్కడ భూమి పైన కొంతకాలం మానవ రూపంలో ఉన్నవాటిని మాత్రమే తీసుకుంటే చాలు.మిగిలిన అన్ని అవతార మూర్తులూ కేవలం దుష్టులను మాత్రమే సంహరించారు, కానీ కధలోని పరశురాముడు మాత్రం ఒక్క కార్తవీర్యుడు చేసిన తప్పుకి మొత్తం రాజకులాన్ని వధించాడు.ఇది పూర్వఋషులూ వైదిక సాహిత్యమూ వర్ణించిన సృష్టికర్త స్వభావానికీ అవతార ప్రయోజనానికీ విరుద్ధం. రాముడు సామాన్య మానవుడిలా రాగద్వేషాలకు లోనయ్యాడు,కృష్ణుడు ఒక సామాన్యుడు తన బుద్ధి విశేషంతో చెయ్యగలిగిన మంత్రాంగమే నడిపించాడు,వామనుడు ఒక వటువు ఉపయోగించగలిగిన చమత్కారంతో బలిని రెచ్చగొట్టి అహం మీద దెబ్బ కొట్టి పాతాళానికి తొక్కేశాడు, బుద్ధుడు పన్నెండేళ్ళ బాలుడి కుండే తన బుద్ధి విశేషంతో జిన ప్రభువునీ అతని అనుచరుల్నీ మోహానికి గురి చేసి అహింసని సాధించాడు - అయినప్పటికీ వారిలో ఎవరూ కధలోని పరశురాముడిలా తప్పు చెయ్యని వారిని శిక్షించే స్థాయిలో ఉద్వేగానికి లోను కాలేదు.
రెండవ అభ్యంతరం: కధలోని క్రూరుడైన కార్తవీర్యార్జునుడు మిగిలిన అన్ని కధల్లోనూ సాధు సజ్జనులను రక్షించే ధర్మాత్ముడైన భాగవతోత్తముడిలా కనబడతాడు. రాజు గురించి నాకు మధ్యనే తెలిసిందీ మన పెద్దలు చాలా కాలం నుంచీ చెబుతున్నదీ అయిన ఒక విశేషం ఉంది - పోయిన వస్తువులు దొరకాలంటే కార్తవీర్యుడి పేరు మీద ఉన్న ఒక మంత్రం చదువుకోమంటారు. అటువంటి ధర్మాత్ముడు జమదగ్ని పట్ల అంత క్రూరమైన పనులు ఎందుకు చేస్తాడు?
మూడవ అభ్యంతరం: అసలు పరశురాముడి స్వభావం కూడా కధలో తప్ప మిగిలిన అన్ని కధల్లోనూ  పరమ శాంతమూర్తియై విధమైన ఉద్రేకాలూ లేని ఆలోచనా శీలిలా కనపడతాడు. అనేక పుణ్యక్షేత్రాల నిర్మాణం ఈయన చేతుల మీద జరిగినట్టు ఆయా ఆలయాల స్థల పురాణాలు చెబుతాయి.మిగిలిన అన్ని కధల్లోనూ అతి ముఖ్యమైనది రేణుకా దేవి ఛిన్న మస్తా దేవి రూపం ధరించడానికి సంబంధించిన దేవీ భాగవత పురాణంలోనిదే, అక్కడ కూడా ఇతని పాత్ర చిత్రణలో ఉగ్రత్వం లేదు! ఇక్కడ పరశురాముడు చేసిన దురాగ్రహ పూరితమైన విచక్షణా రహిత భీబత్సం క్రైస్తవుల పాత నిబంధన కధల్లోని యహోవా పురికొల్పిన యుద్ధాల తరహాలో ఉంది కదూ - మీవాళ్ళూ తక్కువేం కాదు అని మనల్ని దెప్పి పొడవడానికి ఈ కధని ఇరికించింది కూడా వాళ్ళే కదా!
ప్రతి హిందువూ గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే వేదం మాత్రమే భగవంతుడు ఆయా వేదర్షుల తపస్సుకు మెచ్చి ద్యోతకం చేసిన శాస్త్రీయమైన సత్యం - వేదం యొక్క ప్రామాణ్యాన్ని ఒప్పుకుని వేదాన్ని గౌరవించిన వాడే హిందువు అవుతాడు. ఇక పురాణ సాహిత్యం మొత్తం తమకు అర్ధమైన వైదిక ధర్మాన్ని ప్రతి ఒక్కరికీ అర్ధం అయ్యేటట్లు ఋషులూ పండితులూ రచించినవి, కాబట్టి వీటిని ప్రమాణం కింద తీసుకోకపోయినందువల్ల ప్రమాదం ఏమీ లేదు.ఇప్పుడు మనం తరచి చూసిన పరశురాముడి కధలో నేను చూపించిన మూడు అభ్యంతరాలూ బలమైనవే కదా!కాబట్టి కధను వీలైనంత త్వరలో పౌరాణిక సాహిత్యం నుంచి తొలగించడం ఉత్తమమని నా అభిప్రాయం. ఒకవేళ తొలగించడానికి మొహమాటం అడ్డొస్తే మర్చిపోవడం మంచిది!
ఇప్పుడు కధ ప్రాచీనులు రాయలేదనీ అర్వాచీనుల గూడుపుఠానీ అనడానికి నాకు దొరికిన సాక్ష్యాలను చూపిస్తాను.సాక్ష్యాలు లేకుండా సమస్త హిందువులూ దశావతార మూర్తి అని భావించే పురాణ పురుషుడి పట్ల ఇంత దారుణమైన ప్రతిపాదనలు చెయ్యడం దైవద్రోహం అని నాకూ తెలుసు. హిందూధర్మానికి పునర్వైభవం కాంక్షించే నేను అంత సాహసం చెయ్యనని మీకూ తెలుసు.అయినా సరే అట్లా చెప్పి వొదిలేస్తే దబాయింపు కాదూ!
మొదటి సాక్ష్యం:రాజుల కాలంలో కావ్య నిర్మాణం చేసిన ప్రతి కవీ తన కావ్యాన్ని ఎవరో ఒక రాజుకి అంకితం ఇస్తూ కృతిభర్త నామ రూప యశో వంశ ప్రశస్తి చేశాడు.11 శతాబ్ది నాటి కవిత్రయంలోని ప్రధముడు నన్నయ్య రాజరాజ నరేంద్రుడి వంశనామావళిని వర్ణించేటప్పుడు పరశురాముడి వల్ల వంశంలో ఎవరూ చనిపోయినట్టు చెప్పలేదు.ఒక్క నన్నయ్యే కాదు, అసలు 17 శతాబ్దానికి ముందు రచించబడినట్టు రూఢి అయిన ఆంధ్ర, సంస్కృత కధా కావ్యాలలో గానీ ఇతర సాహిత్య రూపాలలో గానీ ఎవరూ రాజవంశ నిర్మూలన కధ వాళ్ళకి తెలుసునన్న ప్రస్తావనలు చెయ్యలేదు.
రెండవ సాక్ష్యం:పరశురాముడి కధ యొక్క ఫలశ్రుతిని భారతదేశ చరిత్రలో ఎక్కడ ఎప్పుడు ప్రవేశ పెట్టారో కధలోనే ఉన్న కొన్ని అంశాలను చూస్తుంటే ఇంతకాలం ఈకధని చదువుతున్న పండితులూ బ్రాహ్మణోత్తములూ కనీసపు అనుమానాలు కూడా ఎందుకు వ్యక్తం చెయ్యలేదో నాకు అర్ధం కావడం లేదు! కధలో పరశురాముడు 21 సార్లు నిక్షత్రం చేసిన తర్వాత బ్రాహ్మణులని రాజుల్ని చేసినట్టు ఉంటుంది - మనం కూడా బ్రాహ్మణుల మీద గౌరవంతో అనుమానించటం లేదు గానీ అక్కడ జరిగింది చాలా వికృతమైన వ్యవహారం.అక్కడ పరశురాముడు రాజరికం కట్టబెట్టింది ప్రాచీన కాలం నుంచీ కొనసాగుతున్న సనాతన ధర్మాన్ని పాటించే బ్రాహ్మణ శ్రేష్ఠులకు కాదు, సగం కాలిన 14 శవాలకి ప్రాణం పోసి కొత్త బ్రాహ్మణ వంశాల్ని పుట్టించి వాళ్ళకి ధార పోశాడు సమస్త భూమండలాన్నీ!
నాసిక్ చిత్పవన్ బ్రాహ్మణ సంఘం వారి అధికారికమైన చిహ్నంతో కనబడుతున్న www.nasikchitpavan.org అనే బ్లాగులో history-of-chitpavans తలకట్టుతో ఉన్న వ్యాసంలో "The legends from the later versions of Sahayadrikhanda mention that Parshuram, defiled by the slaughter of Kshatriyas, needed Brahmins who could perform Vedic ceremonies for him. So, he recovered a narrow strip of land from sea (now called Konkan). He resuscitated Brahmins from the fourteen corpses washed ashore the Sahayadri foothills after shipwreck. The corpses were purified on a funeral pyre before being restored to life, due to which the Brahmins received the name Chitapavan ("pure from pyre"). The above legend probably suggests that the ancestors of Chitapavan Brahmins came to Konkan by the sea.] The Chitpavan are classified among the Pancha Dravida Brahmins. It is said that the fourteen Deshastha Brahmins of different gotras accompanied Parshuram to Konkan and settled at Chitpolan (modern Chiplun). Their descendants came to be known as Chitpols or Chitpavans." అని చెప్పుకుంటున్నారు.ఇందులో ఉన్న ప్రతి వాక్యంలోనూ నాకు ఒక్కో సందేహం వస్తున్నది.
మీకు నేను చెప్తున్నది అర్ధమవుతుందా!అసలు తప్పు చేసింది కార్తవీర్యుడు ఒక్కడే అయితే మిగతా వాళ్ళని చంపటమే తప్పు.పోనీలే రాజులంతా దుర్మారులే అని తీర్మానించుకుని నిక్షత్రం చేశాను గదాని సంతృప్తి కూడా లేదట! అదీ 21 సార్లు భూమి మొత్తం తిరిగి తిరిగి వెతికి వెతికి చంపాక అప్పుడు defilation వచ్చిందట!సరేనయ్యా, పరిహారం చేసుకుందామనుకున్నాడు - ఆపాటి పరిహార క్రతువులు జరిపించడానికి సగం కాలిన శవాలకి ప్రాణం పోసి వాళ్ళకి తనే వేదం చెప్పి బ్రాహ్మణత్వం ఇచ్చి వాళ్ళచేత పరిహారాలు జరిపించుకోవడం ఏంటి?అప్పుడున్న వైదిక శ్రేష్ఠులు ఏమయ్యారు - కన్నూ మిన్నూ కానని కోపంలో వాళ్ళని కూడా ఏస్సేశాడా, లేకపోతే అదుర్స్ సినిమాలో బ్రహ్మానందం తల్లిని పెళ్ళి చేసుకుని ఉద్ధరిస్తాడనుకుని వెంటవచ్చి పిల్లని పెళ్ళి చేసుకుందామని అనుకుంటున్నాడని తెలిసి "చిఛ్చీ!" అని వెళ్ళిపోయినట్టు పరిహార పూజలు చెయ్యటానికి నిరాకరించారా, వ్యతిరేకించారా!
ఇక్కడ సముద్రతీరంలో తగలబడుతున్న శవాలని బతికించినట్టు ఉన్నది, కానీ మరొకచోట సముద్రపు అలల మీద తేలుతూ వస్తున్న శవాలను బతికించినట్టు ఉంది.కొంకణ తీరం శాఖ యొక్క అధికారికమైన ప్రాదుర్భావ స్థానం అని వారే చెప్పుకుంటున్నారు.ఒక చోట సముద్రపు అలల మీద కొట్టుకు రావటం,ఒకచోట చితుల మీద సగం చావు నుంచి బతికి లేవటం  - వీటిని పురాణ కధల్లో కనిపించే సాధారణ కల్పనల కింద తీసి పారెయ్యకుండా కధల్ని కల్పించినవాళ్ళు తమ మూలాలను గురించి భౌతికపరమైన సాక్ష్యాల్ని నిక్షిప్తం చేశారా!
సరే, కావ్య మీమాంసలూ అంతరార్ధ విశ్లేషణలూ చివరికి తోసేసి వాస్తవ చరిత్రలో చిత్పవన్ బ్రాహ్మణుల ప్రస్తావన గురించి తెల్సుకుందాం.ఇంకెక్కడో వెతకడం దేనికి, "The historical origins of the Chitpavan community are explained in Hindu scriptures by referring to the tale of Lord Parshuram in the Sahyadrikhanda of the Skanda Purana. However, the recorded history of the Chitpavans begins in the 18th century. The Chitpavans gained prominence in the Marathi-speaking region when Shivaji's grandson Shahu appointed a Chitpavan Brahmin Balaji Vishwanath Bhat as the fifth Peshwa (prime minister). During the reign of the successive Peshwas, some of whom enjoyed status as de facto head of the Maratha confederacy, the Chitpavans settled in various provinces under the Peshwa rule. The Chitpavans established themselves firmly in the social hierarchy of the Marathi-speaking region, and played a prominent role in the political history of India. The community remains concentrated in Maharashtra but also has populations all over India and the rest of the world including the USA and UK." అనేది కూడా నాసిక్ చిత్పవన్ బ్రాహ్మణ సంఘం వారి అధికారికమైన చిహ్నంతో కనబడుతున్న www.nasikchitpavan.org అనే బ్లాగులో history-of-chitpavans తలకట్టుతో ఉన్న వ్యాసంలోనే ఉంది.
పీష్వాలు రోజున మరాఠీ చరిత్రలో విడదీయలేని భాగం అయ్యారు,నయా హిందూత్వ వాదులకి పీష్వా బాజీ రావు ఒక ఉద్విగ్నభరితమైన వ్యక్తిత్వంతో అలరారుతున్న మహానాయకుడు.చెల్లా చెదరైన మరాఠీల్ని ఒక్క తాటిమీద నడిపించి ముస్లింప్లాకులకి సింహస్వప్నమై నిలిచిన ఆదర్శ హిందూ ప్రభువు!కానీ, అధికారికమైన చరిత్ర ప్రకారం అప్పటికి మొఘల్ సింహాసనం చాలా బలహీన స్థితిలో ఉంది.దక్షిణాది ముస్లిం రాజ్యాలు కూడా బలమైనవి కావు.మరాఠాలను ఏకం చేసింది కూడా సాటి హిందూ రాజుని యుద్ధాల్లో ఓడించి వాళ్ళ రాజ్యాల్ని ఆక్రమించడం ద్వారానే తప్ప హైందవేతర సమూహాలతో పోరాడటానికి ఒప్పించిన స్నేహ సంబంధాలతో కాదు. మొఘల్ సామ్రాజ్యానికి పునర్వైభవం కల్పించడం కోసం అటువైపునుంచి ప్రతిపాదన వస్తే ఒప్పుకున్నాడు, బేరసారాల్లో తేడా వచ్చి ప్రతిపాదన వీగిపోయింది గానీ బేరం కుదిరితే రోజున మొఘల్ పునర్వైభవానికి సహకరించిన (అప)ఖ్యాతి దక్కి ఉండేది పీష్వా బాజీ రావుకి!మొదటి బాజీ రావు నుంచి మొదలుకుని పీష్వాల ప్రాభవం నిరంతర యుద్ధాలతో మహా సామ్రాజ్యాల స్థాపనతో నిండి ఉంటుంది తప్ప core hindu values వాళ్ళలో కనపడటం లేదు నాకు.కేవలం నాలుగు శతాబ్దాల వెనకనే వీరు దేశపు చరిత్రలోకి ప్రవేశించించారు కాబట్టి సహజంగానే దేశపు సంస్కృతీ నిర్మాణంలో చిత్పవన్ బ్రాహ్మణుల ప్రమేయం చాలా తక్కువ. కానీ రాజకీయ రంగంలో మాత్రం చాలా ఎక్కువ.పీష్వాల కాలం నుంచీ చిత్పవన్ బ్రాహ్మణులు రాజరికానికీ ప్రభుత్వాలకీ అతి చేరువలో ఉండి చరిత్రను మలుపు తిప్పే ముఖ్యమైన నిర్ణయాలలో తమ ప్రభావాన్ని చూపిస్తూ వస్తున్నారు.
ఆధునిక భారతదేశపు చరిత్రలో దిగ్గజ సములైన బాల గంగాధర తిలక్, గోపాల కృష్ణ గోఖలే అనే ఇద్దరూ చిత్పవన్ బ్రాహ్మణులు. అంతే కాదు, అనేకమైన హిందూ సంస్కరణోద్యమాల్లో పాల్గొన్న Dhondo Keshav Karve, Mahadev Govind Ranade, Vinayak Damodar Savarkar, Gopal Ganesh Agarkar, Vinoba Bhave వంటివారు కూడా చిత్పవన్ బ్రాహ్మణులే.గాంధీని చంపిన Nathuram Godse కూడా చిత్పవన్ బ్రాహ్మణుడే.ఇదంతా చూస్తుంటే దేశానికి స్వతంత్రం కావాలనేది బ్రిటిషు వాళ్ళ వ్యాపన కాలంలో కోల్పోయిన పీష్వాల నాటి ప్రాభవాన్ని తిరిగి పొందడానికి చిత్పవన్ బ్రాహ్మణుల్లో పుట్టిన ఆలోచన అనిపిస్తున్నది నాకు.వీళ్ళు పీష్వాల నాటి ప్రాభవాన్ని ఆశించి రెచ్చిపోతే వీళ్ళతో పాటు మాకూ ఉంది గదాని సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ లాంటి ముస్లిం నాయకులు ఔరంగజేబును తల్చుకుని రెచ్చిపోయారు - వాళ్ళ సొంత వైభవాల కోసం వాళ్ళూ వీళ్ళూ చెప్పిన మాయకబుర్లు నమ్మి సామాన్య ప్రజలు పిచ్చెక్కిపోయి వాళ్ళ వెంట నడిచి నలిగి చచ్చారు.స్వతంత్రం వచ్చాక కూడా అదే కుట్ర, అదే మాయ కబుర్లు, అదే హింస, అదే దోపిడీ!
రెండవ స్వాతంత్య్ర సమరం అని చెప్పబడుతున్న కాలం నాటి ప్రముఖుల్లో గోపాల కృష్ణ గోఖలే గురించి మనకి తెలిసింది చాలా తక్కువ.తెలిసిన కొంచెం ఇలా ఉంటుంది.ఈయన కాంగ్రెసులోని మితవాద  భావజాలం ఉన్న వాళ్ళకి పెద్ద దిక్కు.మితవాదం అంటే ఇంగ్లీషువాళ్ళు చాలా మంచివాళ్ళనీ వాళ్ళతో పోట్లాడకూడదనీ అనేవాళ్ళు - ఒక్కోసారి ఇంగ్లీషువాళ్ళని గురించి ఇతర్లు కొంచెం దురుసుగా మాట్లాడినా సహించేవాళ్ళు కాదు.లాల్ బాల్ పాల్ త్రయం దీనికి వ్యతిరేకం.వీళ్ళ ప్రసంగాల వల్ల కుర్రాళ్ళు చాలా ఆవేశపడిపోయేవాళ్ళు - కొన్ని చెదురు మదురు బాంబు ప్రేలుళ్ళ తర్వాత గోపాల కృష్ణ గోఖలే గొప్ప వ్యూహనిర్మాణ చాతుర్యం చూపించి మోహన్ దాస్ కరంచంద్ గాంధీ అనే అహింసావాద ప్రవక్తని దించడంతో భారతీయులు అందులోనూ హందువులు అప్పటి వరకు ప్రదర్శిస్తున్న ధార్మిక క్షాత్రం వదులుకుని భావదాస్యం నేర్చుకున్నారు.మోహన దాసును రంగంలోకి దించుతున్నప్పుడు జరిగిన నాటకీయ సన్నివేశాలు అప్పటికే ఆనేక దేశాల చరిత్రలో జరిగి అవి కుట్రలని బయటపడ్డాయని తెలినప్పటికీ నమ్మలేనివాళ్ళు మనమధ్యనే ఉన్నారు, ఇప్పటికీ!
1917లో కొందరు యూదులు కాందిశీకుల మాదిరి నటిస్తూ రష్యా భూభాగంలో అడుగు పెట్టారు.తీరా చూస్తే కొద్ది కాలం తర్వాత బోల్షివిక్ విప్లవానంతరం అధికారం చేపట్టినవారిలో 85% మంది ఆ యూదులే ఉన్నారు - కార్ల్ మార్క్స్, ఎంగెల్స్, లెనిన్, స్టాలిన్, ట్రాట్స్కీ - అందరూ ROTHSCHILD తమ మీద నమ్మకంతో పెట్టిన ఖర్చుతో విప్లవం అనే ఒక ఆకర్షణీయమైన దోపిడీ వ్యవహారాన్ని ప్రజల మహోన్నతమైన ఆదర్శం కింద చవులూరించి మరులు గొల్పి  ఎంత దోచుకున్నా నోరెత్తనివ్వని స్థాయిలో శ్రామికవర్గనియంతృత్వాన్ని తెచ్చి పెట్టారు.తాతల నాడు రష్యా ఆర్ధిక వ్యవస్థ మీద పెత్తనం అడిగితే ఇవ్వనందుకు అప్పటి జార్ ప్రభువుని అపకీర్తి పాలు చేసి చంపేశారు.అంతకుముందే ఫ్రాన్సు భూభాగం మీద కూడా అక్కడి మీడియా చేత "THE QUEEN SAID--IF YOU DONT HAVE BREAD , EAT CAKE " అనే ప్రచారం చేయించి రాజరికాన్ని కూల్చిన పద్ధతినే రష్యాలోనూ రాణికీ రాస్పుటినుకీ రంకు అంటగట్టి కుటుంబం మొత్తాన్ని దెయ్యాలూ భూతాలూ పిశాచాలు కూడా దడుచుకు చచ్చేలా లేపేశారు. చైనాలో చైర్మన్ మావో కూడా వీళ్ళ తయారీనే - SUN YAT SEN,CHIANG KAI SHEK అయితే ఏకంగా ఫ్రీమాసన్రీ సభ్యులు.అసలు కమ్యూనిష్టు సిద్ధాంతం యొక్క అంతిమలక్ష్యం అని చెప్తున్న వర్గరహితసమాజం 2050 తర్వాత Rothschilds+Illuminati ద్వయం భూమి మీద స్థాపించాలని కలలు గంటున్న New World Order అనే వికృత వ్యవస్థకి సంబంధంచిన ground plan, నమ్మాలనిపించడం లేదు కదూ!
ప్రస్తుతం మన దేశంలో కమ్యూనిజం అనేది ఆద్ర్శవంతమైన సమాజాన్ని ఏర్పరచటానికి ఉద్దేశించినది అనుకునేవాళ్ళు పిచ్చివాళ్ళు - దాని అసలైన అర్ధం rothschilds_illuminatti కుటుంబాలకీ వాళ్ళ పెంపుడు కుక్కలకీ పోటీ లేని నూటికి నూరు శాతం లాభసాటి వ్యాపారం చేసుకునే హక్కులు కల్పించటం మాత్రమే!Communism requires that all means of production be controlled by the Jewish BIG BROTHER remote controlled state.  In other words, no one can own his or her own business or produce his or her own goods because the state owns everything. - మీకు నేను చెప్పేది అర్ధమవుతోందా!
తాము లోబరచుకోవాలని అనుకున్న ప్రతి దేశంలోనూ అన్ని కీలకమైన వ్యవస్థలలోనూ తమ నమ్మకస్తులైన వాళ్ళని పాతుకుపోయేలా చేసి దేశపు చరిత్రని తమకు అనుకూలమైన దిశలో నడిపించుకోవటం అనేది ఫ్రాన్సులోనూ, జర్మనీలోనూ, రష్యాలోనూ, అమెరికాలోనూ జరిగింది - అదే వ్యూహంతో వాళ్ళు భారత భూభాగం మీద దించినవాళ్ళే చిత్పవన్ బ్రాహ్మణులు!వాళ్ళ పుట్టుకకు వర్ణించిన కధల్లో ఉన్న రెండు వర్ణనల్లో 1.సముద్రం మీద కొట్టుకు రావటం నావలో ఇక్కడి రేవులో దిగటాన్ని సూచిస్తే, 2.చితి మీద చచ్చిపోయి సగం కాలిన స్థితినుంచి బతికి లేవటం అంటే పాత యూదు విదేశీయతకి పాక్షిక విస్మృతి కల్పించి కొత్త బ్రాహ్మణ స్వదేశీయతను సంతరించుకోవడాన్ని సూచిస్తుంది. ఇది "మేము మీరు పంపిన వాళ్ళమే, కధ మావల్లనే కల్పించబడింది" అని తమను పంపిన వాళ్ళకి తెలిసేటట్టు రాసిన మిలిటరీ కోడ్ తరహా రహస్య సందేశంలా కూడా ఉంది కదూ!ఒక పని పూర్తయ్యేలోపు రహస్యం, గోప్యత పాటించడం గానీ పూర్తయిన తర్వాత వాళ్ళే ఘనకార్యంలా చెప్పుకోవడం గానీ ఇతరులు కనిపెట్టి నిలదీస్తే ఒప్పుకోవడం గానీ Rothcshilds_Illuminatti ద్వయం చాలా కాలం నుంచీ  చేస్తూనే ఉన్నారు.వాళ్ళు వ్యూహాలు పన్నేది వాళ్ళ వ్యూహాలకు బలయ్యేవాళ్ళలో ఉన్న వ్యామోహాలూ బలహీనతల మీద కాబట్టి గతంలో చేసిన దుర్మార్గాల వివరాలు ప్రజలకు తెలిసినప్పటికీ ఇప్పుడు నడిపిస్తున్న నాటకాలు ఆగవనీ మునుముందు చెయ్యబోయే దుర్మార్గాలని కూడా జరిపించుకోవచ్చుననేది వాళ్ళ ధైర్యం!
ఇవన్నీ వినగానే నమ్మాలని అనిపించదు, మొదటిసారి చదివినప్పుడు నాకూ నమ్మాలనిపించలేదు.కానీ ఇవన్నీ నిజం కాదని చెప్పటానికి ఆధారాల కోసం వెతికి వెతికి దొరక్క విసుగు పుట్టాకనే నమ్మడం మొదలు పెట్టాను.పరశురాముడు బ్రాహ్మణులకి రాజ్యదానం చెయ్యడం అనే ప్రస్తావన అమాయకంగానే ఉంటుంది - అక్కద మన సంస్కృతిని సూటిగా దెబ్బకొట్టే అంశాలు ఏమీ లేవు గాబట్టి.కానీ మనుస్మృతిలో బ్రాహ్మణులు ఇతర కులాల్ని కించపరుస్తూ రాశారని చెప్పి ఇరికించిన లేఖనాల్ని ఒకసారి గుర్తు చేసుకోండి. ఒక బ్రాహ్మణుడు ఎంత  స్వార్ధం,నీచత్వం,అహంకారం ఉన్నప్పటికీ తనను గౌరవిస్తున్న ఇతర కులాల పట్ల అంత విషం కక్కుతూ గ్రంధాలను రాస్తాడా?రాయటమే కాకుండా రాజసభల్లో చదివినప్పుడూ ప్రచారం చేసినప్పుడూ ఆనాటి సమాజం మెచ్చి మేకతోలు కప్పి ఉంటుందా!చిన్నపిల్లలే గద్దించి మాట్లాడితే తిరగబడతారు, అట్లాంటిది తమను అంత అవమానిస్తున్న బ్రాహ్మణుల్ని నెత్తి మీద పెట్టుకుని మోస్తారా ఇతర కులస్థులు - అదీ కులాని కా కులానికి కులవృత్తి స్థిరపడి పోయి మంచి ఆదాయాన్ని ఇస్తూ బ్రాహ్మణులనే వీళ్ళు పోషిస్తున్న కాలంలో అది సాధ్యమేనా? IF YOU WANT TO CONTROL FUTURE OF A NATION/STATE/RACE FIRST CONTROL ITS HISTORY అన్న లెక్క ప్రకారమే మన దేశ చరిత్రనీ సంస్కృతినీ భ్రష్టు పట్టించారని అర్ధం చేసుకోవాలి.ఇవ్వాళ కంచె ఐలయ్య దగ్గిర్నుంచి కదిరి కృష్ణ వరకు ఎత్తి చూపిస్తున్న ఈ పిచ్చి రాతల్ని వీళ్ళే అవి యే కాలంలో రాశారని దబాయించి చెప్తున్నారో కాలంలోని బ్రాహ్మణులు ఇలాంటివి రాస్తే ఇతర కులస్తులు తన్నకుండా ఉంటారా! దేశపు ప్రాచీన వారసత్వంతో ఎలాంటి సంబంధమూ లేని విదేశీ  మూలాలను తమ యొక్క ప్రాదుర్భావపు కధల్లోనే ఇముడ్చుకున్న చిత్పవన్ బ్రాహ్మణులకు మాత్రమే రకమైన సాహితీ వంచన చేసే అవకాశం ఉంది. వాళ్ళు ఈ దేశపు చరిత్రలోకి వచ్చిన కాలపు ముందు తరాల వాళ్ళకి ఇలాంటి సాహిత్యాన్ని సృజించాల్సిన అవసరం లేదు.పౌరాణికులూ ప్రవచన కర్తలూ అమాయకత్వంతో పిట్టకధల్లా చెప్పుకుపోవటంతో సరిపెట్టుకోకూడదు, వేదం చెప్పిన సత్యం ప్రకారం సరిచూసి నిగ్గు తేల్చి పౌరాణిక ఐతిహాసిక సాహిత్యాన్ని శుభ్రం చెయ్యాలి.తెలివీ చొరవా ఉన్న ప్రతి హిందువూ నిజమైన చరిత్రని మాత్రమే నమ్మాలి.
చరిత్రను భ్రష్టు పట్టించడం వల్ల అంటుకున్న ఆత్మన్యూనతల్ని తొలగించుకోవాలంటే చరిత్రని శుభ్రం చెయ్యడం కన్న ఉత్తమమైన మార్గం లేదనేది వ్యాసపరాసరాదిశంకరపర్యంతం ఉన్న సత్యధర్మన్యాయప్రతిష్ఠితమైన ఆచార్య పరంపర దయతో నాకు అందించిన మూడు కాలాలనూ ముడివేసి చూడగలిగిన జ్ఞానదృష్టితో పరిశోధించి రాగద్వేషాలు లేని నిండుమనస్సుతో ప్రకటిస్తున్న అక్షరసత్యం!ఏది సత్యమైనదో అదే శివమైనదీ అవుతుంది!ఏది శివమైనదో అదే సుందరమైనదీ అవుతుంది!
సత్యం శివం సుందరం!!!

3 comments:

  1. ఎవరు న్యూతన ప్రపంచ శాసనం కోరుచున్నారు.?
    చిత్పవన్ బ్రాహ్మణలు ఈ పేరు తొలిసారిగా మీద్వార తెలుసుకున్న.

    ReplyDelete
    Replies
    1. Please read my old posts

      1.https://harikaalam.blogspot.com/2019/01/blog-post_10.html
      దేశం చాలా కిష్ట పరిస్తితుల్లో ఉందిప్పుడు - దేవుడా, రక్షించు నా దేశాన్ని!

      2.https://harikaalam.blogspot.com/2019/05/blog-post_8.html
      అందరూ యూదుల్ని ఎందుకు ద్వేషిస్తున్నారు?యూదుల వైపు నుంచి దోషం ఏమీ లేదా!

      3.https://harikaalam.blogspot.com/2019/08/blog-post.html
      హిందువులు ఇంకా అమాయకత్వం వీడకపోతే సర్వనాశనం తప్పదు - తమకూ ఒక పవిత్రభూమిని సాధించుకోవాల్సిందే!

      you have to read slowly and steadily!

      Delete
    2. There is kailasam already started by our beloved nityananda for all our Hindus. Soon we will have our own land

      Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

"వేదాలు చదివిన వారు యజ్ఞయాగాదు లందు పశువులను వధిస్తారు" - ఇది నిజమా?

hari.S.babu: గురువు గారూ ! మహాభారతంలో ధర్మవ్యాధుని కధ వస్తుంది కదా . అక్కడ ధర్మవ్యాధుడు కౌశికుడికి ధర్మబోధ చేస్తూ ఒకచోట ," ...