Saturday, 25 January 2020

మూడు రాజధానుల ప్రణాళిక వెనక యేసుక్రీస్తుపార్టీ వేసిన అసలు ప్లాను ఇప్పటికి అర్ధమయ్యింది నాకు!

రాజధాని ఇక్కడే ఉంటుంది.వాళ్ళకి కూడా మార్చాలనే ఉద్దేశం లేదు.మార్చినందువల్ల వాళ్ళకి లాభమూ లేదు.ఇప్పటివరకు మౌఖికంగా నైనా సరే అధికారికమైన ఉత్తర్వు ఏదీ జారీ చెయ్యలేదు, అవునా?రాజ్యాంగం మీద ఏ మాత్రం గౌరవం లేని ఈ ప్రభుత్వాధినేతలు కేవలం మీడియాలో వార్తల్ని సృష్టించడానికే అన్ని వ్యవస్థల్నీ వాడుకుంటున్నారు!
చంద్రబాబు అసలేం కట్టలేదనీ గ్రాఫిక్స్ చూపించి మోసం చేస్తున్నాడని వాగేవాళ్ళకి కళ్ళు పోయాయో మైండు చెడిందో నాకు అర్ధం కావడం లేదు.ఏప్రిల్ 2016 నాటికి చంద్రబాబు అమరావతి పక్కనున్న వెలగపూడి నుంచే పరిపాలన మొదలుపెట్టాడు.మార్చి ఇరవయ్యేడుకల్లా లెజిస్లేచర్ అసెంబ్లీ భవనం పూర్తయ్యింది.అక్టోబరు నాటికి ఉన్నతాధికారులు తమ తమ శాఖలలో కూర్చుని కార్యక్రమాల్ని కొనసాగిస్తున్నారు.కేవలం ఒక్క సంవత్సరంలోనే ముఖ్యమంత్రీ ఇతర మంత్రులూ, నిక్కచ్చిగా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క భౌతికపరమైన శరీరం అనదగ్గ అన్ని మంత్రిత్వ శాఖలూ వెలగపూడిలో కనిపిస్తున్నాయి.అప్పటికే హైకోర్టు నిర్మాణం కూడా పూర్తయ్యింది.అయితే ఇది ప్రపంచస్థాయి రాజధాని కాదు కదా, ఈ తాత్కాలిక నిర్మాణాలని చూపించటం మోసం చెయ్యటమే కదా అనేవాళ్ళకి ఒకటే జవాబు - ఒక మధ్యతరగతి కుటుంబీకుడు రిటైరయ్యాక తన కలల భవంతిని నిర్మించుకోవాలంటే శంఖుస్థాపన చేసిన వెంటనే గృహ ప్రవేశం చెయ్యలేడు కదా, మరి ఆలోపు అతను ఆరుబయట ఉండలేడు కదా, తను కట్టుకోబోయే ఇంటికి దగ్గిర్లో ఒక అద్దె ఇంటిని తీసుకుని సర్దుకుపోవడం లేదా!
పూర్తయిపోయిన రాజధానిని తరలించడం అంటే కొత్త చోట వీటితో సరితూగే భవనాల్ని కట్టడం. అది దండగమారి పని అని వాళ్ళకి మాత్రం తెలియదా ఏమిటి?బొత్సకి రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో పనిచేసిన అనుభవం ఉంది.బుగ్గన తెదెపా నుంచి ఎన్నికల్లో టిక్కెట్టు ఇవ్వలేదనో చాలా కాలం నుంచీ మర్యాదలు తగ్గాయనో తెదెపా నుంచి జంపయి వచ్చినవాడే కదా!స్పీకరు కూడా ఆ బాపతే కదా! అంతకాలం రాజకీయాల్లో తిరిగినవాళ్ళకి ఆమాత్రం తెలియకుండా ఉంటుందా!వీళ్ళ లాంటి వాళ్ళకి అయితే అధికారాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించే దురద ఉంటుంది, లేదంటే మీడియాలో కనపడుతూ మేధావుల ముద్ర వేయించుకోవాలనే దురద ఉంటుంది.
అబద్ధాల్ని కూడా నిజాలని భ్రమింపజెయ్యగలిగిన వీళ్ళని తెలివితక్కువ వాళ్లని ఎవరూ అనలేరు - మేతావులే, ఒప్పుకోవాలి!జగన్నే తీసుకోండి - అతనికి వేరేవాళ్ళు క్లూ ఇచ్చారో లేక సొంత అయిడియానో పదేళ్ళ పాటు తెలంగాణ ఇచ్చి తీరాలని ఉన్నప్పటికీ ఎలా ఇవ్వాలో తెలిసి చావక తన్నుకుంటున్నప్పుడు ఆర్టికిల్ మూడు గురించి చెప్పి విభజనను వేగవంతం చేసింది అతనే కదా!అంత తెలివైన వాళ్ళు అన్ని రోజుల పాటు రైతులు రోడ్ల మీదకి వచ్చి శాపనార్ధాలు పెడుతుంటే “ఇంత వ్యతిరేకతను మూటగట్టు కుంటున్నాం, మళ్ళీ ఎన్నికల్లో ఇక్కడ మనకి వోట్లు రావేమో!” అనే భయం కూడా లేకుండా అంత మొండితనం ఎందుకు చూపిస్తున్నారు?
రాజధాని కోసం భూములిచ్చిన రైతులు 29,881 మంది. ఇచ్చింది 34,322 ఎకరాలు. వీళ్ళలో 1 ఎకరం కన్నా తక్కువ ఉన్న రైతులు 20,490 మంది.1 నుండి 2 ఎకరాలకు మధ్య ఉన్న వారు 5,227 మంది. కేవలం 159 మందికి మాత్రమే 10 ఎకరాలకు మించి భూమి ఉంది. అందులో కూడా కొంతమందివి ఉమ్మడి కుటుంబాలు.అంటే రాజధానికి భూములిచ్చిన రైతుల్లో 25,717 మంది అంటే సుమారు 90 శాతం మంది సన్నకారు రైతులే. ఇవన్నీ మనకే కాదు, ప్రభుత్వంలో ఉన్న బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్ర ప్రసాద్,తమ్మినేని సీతారాం, కొడాలి వెంకటేశ్వర రావు, యడుగూరు సందింటి జగన్మోహాన్ రెడ్డి - అందరికీ తెలుసు!
అనుకోకుండా అప్పుడప్పుడు జరిగినట్టూ అనిపిస్తున్న కొన్ని సంఘటనల్ని ఒక చోట చేర్చి ఈ మణుల మధ్య ఉన్న సూత్రాన్ని పట్టుకుంటే గానీ మొత్తం ప్లాను అర్ధం కాదు.ఎన్నికల ముందునుంచీ రైతులకి భూములు తిరిగి ఇచ్చేస్తాం అని చెప్తూనే ఉన్నారు కదా!సినీనటుడు శివాజీ ఆనాడే మునుముందు ఫలానా సన్నివేశాలు జరుగుతాయని విడమరిచి చెప్పిన గరుడవ్యూహం యధాతధం అమలవటం అందరం చూశాం కదా! సాక్షాత్తూ జగన్మోహన్ రెడ్డి "ఇప్పుడు ఖర్చు పెట్టిన దానికి నాలుగింతలు సంపాదించుకోవచ్చు!" అని ఇచ్చిన భరోసాను చూశారు కదా!అది కల్పితం అనుకుంటే నేను చెయ్యగలిగింది లేదు గానీ అది వాస్తవం అని అనుకుంటే మొత్తం ప్లాను చాలా కాలం క్రితమే పూర్తయిందనీ ఇప్పుడు జరుగుతున్నది దశలవారీ ఇంప్లిమెంటేషన్ మాత్రమేననీ తెలుస్తుంది!
బొత్స స్మశానం అనడమూ స్పీకరు ఎడారి అనడమూ అనుకోకుండా బయటికి వచ్చిన మాటలు కావు. అంతా ముందు వేసుకున్న వాళ్ళ ప్లానులో భాగమే!ఇవన్నీ చంద్రబాబును ఖాళీగా ఉండనివ్వకుండా ఎప్పుడూ ఏదో ఒక ఆందోళనకి గురి చేసి కన్నీళ్ళు పెట్టించి నవ్వుకోవడం కోసం తెరిచిన రెండవ రంగం - వీళ్ళు అసలు దోపిడీ ఎక్కడ ఎప్పుడు ఎలా చెయ్యాలనుకుంటున్నారో పసికట్టలేనంత బిజీగా చంద్రబాబును ఉంచడమే వీటి ప్రయోజనం. చంద్రబాబు చేతులు జోడించి దణ్ణం పెట్టినప్పుడు జగన్ నవ్వుతున్నది కూడా తమ ప్లాను అనుకున్నది అనుకున్నట్టు అమలు జరుగుతూ ఉందనే సంతోషం వల్లనే!
ఒకప్పుడు ఫ్రెంచి విప్లవం కూడా ఇలాగే కొన్ని యేళ్ళ క్రితం పధకం వేసుకుని రప్పించారు IlluminatiCult+RothschildsFamily ఉరఫ్ లండను బ్యాంకర్లు:
1770: Mayer Amschel Rothschild ఇప్పటికి Illuminati సంస్థను ఏర్పాటు చెయ్యడం గురించిన ప్రణాళికలు రచించడం మొదలుపెట్టి Adam Weishaupt అనే Ashkenazi Jewకి ఆ పని అప్పగించాడు.ఇతను పైకి Roman Catholic వేషం కట్టి లోన యూదుమతాన్నే పాటించేవాడు - ఇలాంటివాళ్ళని క్రైస్తవులు Crypto-Jew అంటారు.Illuminati భావజాలం మొత్తం Rabbinical Jews బోధనల సారాంశమైన Talmud గ్రంధం నుంచి తీసుకోవడం జరిగింది.Illuminati అనే పేరు keepers of the light అని అర్ధం వచ్చే Luciferian పారిభాషిక పదం.
1776: మే ఒకటి నాటికి Adam Weishaupt తన పనిని పూర్తి చేశాడు - అంటే, Illuminati అనే సంస్థకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం అయ్యింది.దీని లక్ష్యం goyim అని పేరుతో వాళ్ళు పిలుచుకునే యూదేతర సమూహాలను వారి వారి రాజకీయ ఆర్ధిక సామాజిక ఆధ్యాత్మిక రంగాలలో ఉన్న సున్నితమైన అంశాలను ఉపయోగించుకుని పరస్పర ద్వేషాలను రగిలించటం.అప్పుడు ఇరు పక్షాలకూ ఆయుధాలను సమకూర్చి అవసరమైతే భావోద్వేగాలను రగిల్చే సన్నివేశాలను సృష్టించి ఒకళ్ళతో ఒకళ్ళు మూర్ఖపు కలహాలకి దిగేటట్టూ జాతీయ ప్రభుత్వాల మీద తిరగబడేటట్టూ సామాజిక కట్టుబాట్లను ధిక్కరించేటట్టూ ఆధ్యాత్మిక కేంద్రాలను అవమానించేటట్టూ తయారు చేసి ఒకళ్ళ చేతిలో మరొకళ్ళు చచ్చి అందరూ అంతమైపోయేటట్టు కధ నడిపించాలి.
1784: Adam Weishaupt యుద్ధాలని సృష్టించటానికి వేసిన ట్రయల్ రన్ లాంటిదైన French Revolution తీసుకురావటానికి వేసిన ప్రణాళికతో ఒక పుస్తకం వేసి తన సహాయకుడైన Xavier Zwack చేత ఒక కాపీ తీయించి Frankfurt నగరం నుంచి Paris నగరానికి కొరియర్ చేశాడు.దారిలో పిడుగు దెబ్బకి కొరియర్ ఛిద్రమై పుస్తకం పోలీసుల చేతుల్లోకి వెళ్ళింది. అందులోని విషయం ప్రమాదకరమైనది కావటంతో Bavarian authorities చేతుల్లోకి వెళ్ళింది. అన్ని masonic lodges మీదా అతని సహాయకులని అనుకున్న వారి ఇళ్ళ మీదా దాడులు జరిగాయి.తమ రాజకీయ ప్రయోజనాలను సాధించుకోవటానికి యుద్ధాలనూ విప్లవాలనూ వాడుకునే ఈ రహస్య సంస్థ అతి కొద్ది మంది సభ్యులే ఉన్నప్పటికీ ఎంత ప్రమాదకరమైనదో Bavarian ప్రభుత్వానికి అర్ధమైపోయింది.
1785: Bavarian ప్రభుత్వం Illuminati సంస్థనీ అన్ని masonic lodgesనీ చట్టవ్యతిరేకమైనవని ప్రకటించి వాటి కార్యకలాపాల్ని నిషేధించింది. Mayer Amschel Rothschild తన పాత ఇంటి నుంచి Frankfurtలోనే ఒక అయిదంతస్థుల భవనంలోకి మారి Schiff familyతో కలిసి ఉంటున్నాడు.
1786: Bavarian ప్రభుత్వం Illuminatiల ప్లాను మొత్తాన్ని "The Original Writings of The Order and Sect of The Illuminati." అనే పేరున document తయారు చేయించి యూరోపు లోని అన్ని చర్చిలకీ దేశాలకీ పంపించింది, కానీ ఎవరూ పట్టించుకోలేదు.
1789: Bavarian ప్రభుత్వం చేసిన హెచ్చరికని ఎవరూ పట్టించుకోకపోవడం వల్ల Illuminatiలు వేసిన ప్లాను కార్యరూపం దాల్చి French Revolution మొదలై 1793 వరకు జరిగింది - ఇది ఇల్యూమినాటీ బ్యాంకర్లు సాధించిన తొలి విజయం, బ్యాంకర్ల చిరకాల స్వప్నం నెరవేరింది! Roman Church ప్రజల నుంచి సొంత పన్నులు వేసి ఆదాయం తెచ్చుకోవటాన్ని నిషేధిస్తూనూ  చర్చిలకి ప్రభుత్వం ఇస్తున్న పన్ను మినహాయింపులని రద్దు చేస్తూనూ బ్యాంకర్లకు అనుకూలమైన రాజ్యాంగం రాసి అమలు చెయ్యటం మొదలుపెట్టింది.
నేను పైన చెప్పింది కల్పిత కధ కాదు, ఈ భూమి మీద క్రైస్తవ సామ్రాజ్యవాదం ఎక్కడ బలపడినా ఇప్పుడు ఆంధ్రలో జరుగుతున్న తరహా సన్నివేశాలే నడిచాయి.జగన్ క్రైస్తవుడు గనక నేను "క్రైస్తవ సామ్రాజ్యవాదం" అని పేరు పెట్టలేదు, ఇతర చోట్ల క్రైస్తవులు ఉన్నారు గనక గుర్తు పట్టడం కోసం చెప్పాను గానీ ఇక్కడ బీజేపీలో ఉన్న హిందూత్వయోధులకీ ఈ దోపిడీ సొమ్ములో వాటా ఉంది. ఇలాంటి ప్లాన్లు వేసేవాళ్ళలో ప్రజలకి తమ ప్లాను తెలిసిపోయినా వాళ్ళు తమని ఆపలేరనే ధీమా ఉంటుంది - 1784లో ప్రమాదవశాత్తూ బయటపడినప్పటికీ 1789లో French Revolution మొదలై 1793 వరకు జరిగింది.ఇప్పుడు కూడా అమరావతిని ధ్వంసం చెయ్యడమూ ఆంధ్ర రాష్ట్రాన్ని ఎడారిలా స్మశానంలా మార్చడమూ అంత ధీమాగానే చేస్తున్నారు!
Adam Weishaupt వేసుకున్నట్టే వీళ్ళ ప్లానులో కూడా మూడు దశలు ఉన్నాయి.వీళ్ళు చెయ్యాలనుకుంటున్నది యేమిటంటే అబద్ధాలతో గందరగోళం సృష్టించి మొత్తం రాష్ట్రప్రజలందరినీ ఇక రాజధాని ఇక్కడ ఉండదు అని నమ్మేలా చేస్తారు - ఇది మొదటి దశ.ఈ దశ పూర్తయ్యేసరికి భూములిచ్చిన రైతులు కూడా నీరసించిపోయి చంద్రబాబును నమ్ముకోవడం దండగ అని భావించి మానసికంగా తమ భూముల మీద తాము ఆశించిన లాభం మీద ఆశలు వదిలేసుకుని ప్రభుత్వం ఎలా ఇస్తే అలా తమ భూముల్ని వెనక్కి తీసుకోవడానికి సిద్ధపడతారు.
మరో విధంగా చెప్పాలంటే రైతులు బ్రేక్ అవడం కోసం నెలలు కాదు, సంవత్సరాలు పట్టినా సరే దెబ్బ మీద దెబ్బ కొడుతూ ఉండటానికే సిద్ధపడ్డారు. వాళ్ళు వెనక్కి తగ్గే మనస్తత్వంలో లేరు.దీని వల్ల జరిగేది రాజధాని ప్రాంతంలో ఉన్న భూముల విలువ గరిష్ఠానికి తగ్గిపోతుంది.ఇప్పటికే తగ్గుతూ ఉండటం మీకూ తెలుస్తూనే ఉన్నది కదా! మొదట్లో జనంలోకి చొచ్చుకుపోయి వందెకరాలు చ్చిన రైతు కాళ్ళు కడిగిన బీజేపీ నాయకులు తర్వాత నిశ్శబ్దం అయిపోయి మండలిలో యేసుక్రీస్తుపార్టీకే సహాయం చెయ్యడానికి మూడో దశలో తాము కూడా భూముల్ని కొనే లాభసాటి వ్యవహారం నోరూరించడమే కారణం. బీజేపీ వైపునుంచి చూస్తే జగను కన్న చంద్రబాబు మరింత ప్రమాదకారమైన శత్రువు - అమరావతిని జగన్ ధ్వంసం చెయ్యటాన్ని ఆపిన ఘనత వస్తే తనకి రావాలి లేదంటే తమ తుపాకీ నుండి పేల్తున్న ఆరడుగుల బుల్లెట్టుకి రావాలి తప్ప చంద్రబాబుకి వెళ్ళకూడదనేది వాళ్ళ పంతం.చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి రాకుండా చూడటం కోసం వైకాపా, భాజపా, తెరాసా పార్టీల పెద్దలు ఆంధ్ర రాష్ట్రాన్ని స్మశానం కింద మార్చడానికి కూడా వెనుకాడనంత పట్టుదలగా ఉన్నారనేది వాస్తవం.
రైతులు నీరసపడి దారికి వచ్చే లోపు కౌన్సిలును రద్దు చెయ్యడం, CRDAని నిర్వీర్యం చెయ్యడం లాంటివాటిలో తెర వెనక నుంచి భాజపా సాయం చేస్తుంది.విధి లేని పరిస్థితుల్లో రైతులు వెనక్కి తీసుకున్న భూముల్ని వీళ్ళు కొనడం రెండవ దశ. ఈ దశలో వీళ్ళ క్రూరత్వం ఇంకా ఎక్కువౌతుంది.అమ్మకపోతే ప్రాణాలు కూడా కోల్పోవాల్సినపరిస్థితి.గౌతం సవాంగ్ లాంటి డీఐజీ ఉన్నాడు కాబట్టి జనాన్ని చంపటానికీ భయపెట్టటానికీ కడప నుంచి సొంత సైన్యాన్ని దించాల్సిన ఖర్చు కూడా లేదు. ఇక్కడ జరుగుతున్న దాన్ని తమాషా చూస్తూ కూర్చున్నారు గనక ఈ కబ్జా వ్యవహారం మొత్తం రాష్ట్ర స్థాయికి విస్తరించినా ఆశ్చర్యపడనక్కర లేదు.అభివృద్ధి చెయ్యలేక ఆపలేదు.ఈ ప్లాను మొదటి రెండు దశల్నీ దాటి మూడో దశలోకి వెళ్ళడానికి అభివృద్ధిని ఆపెయ్యదం తప్పనిసరి గనకనే ఆపేశారు. అప్పుడు వాటి ధరలు పెంచడం మొదలుపెడతారు.అది వీళ్ళు తక్కువకి కొన్నాక జరిగింది కాబట్టి వాళ్ళ లెక్క ప్రకారం ఎనికల్లో ఖర్చుపెట్టినదానికి నాలుగింతలు లాభం అవుతుంది.
పృధ్వీ రెడ్డి రైతుల్ని మాంచి జబర్దస్తుగా వున్నారని అనడాన్ని బట్టి ఈ మొత్తం వ్యవహారంలో రైతులు బాగుపడటం సహించలేని శాడిస్టు మనస్తత్వం కూడా రైతుల భూముల్ని వెనక్కి ఇచ్చెయ్యాలని దశలవారీ వ్యూహాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గకుండా ముందుకే వెళ్ళడానికి ఉత్సాహపరుస్తున్నదని నా అనుమానం!నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఏనాడు మొదలుపెట్టారు, ఎప్పటికి పూర్తయింది?ఇప్పటికీ ఆ ప్రాజేక్టుకి భూములిచ్చినవారికి గానీ నిర్వాసితులకి గానీ పూర్తి పరిహారం అందలేదంటే ఆశ్చర్యంగా ఉంటుంది కానీ అది నిజం!అదొక్కటే కాదు, దేశం మొత్తమ్మీద అన్ని ప్రాజెక్టులలోనూ ఇదే పరిస్థితి - సొంతానికి నొక్కెయ్యటానికి మిలియన్ల లెక్కన కొట్టేసినా కరువు తీరదు గానీ దేశం బాగు కోసం అని చెప్పి ప్రజల నుంచి తీసుకున్న భూములకి పరిహారం ఇవ్వడానికి మాత్రం సొంత ముల్లె ఏదో ఇస్తున్నట్టు యేడ్చి చస్తారు.అలాంటిది ఈ అమరావతి ప్రాజెక్టులో ఎకరం భూమి ఇచ్చిన రైతుకి కూడా అన్యాయం జరగలేదు!
ల్యాండ్ పూలింగ్ పధకం ద్వారా సేకరించినవి 33,000 ఎకరాలు,ఎస్సైన్డ్ భూములు 21000 ఎకరాలు కలిపి CRDA పరిధిలో ఉన్నవి 54,000 ఎకరాలు.ఎకరా భూమిని అభివృద్ధి చెయ్యడానికి జగన్ ప్రభుత్వం చెప్పిన లెక్కయే 2 కోట్లు - మొత్తం భూమిని డెవలప్ చెయ్యటానికి 1.08 కోట్లు అవుతుంది.అయితే అమరావతి కోసం ఇప్పటి ప్రభుత్వం చెయ్యాల్సిన ఖర్చు 51,687(అసలు)+3656(వడ్డీ) కలిపి మొత్తం 55, 343 కోట్ల రూపాయలు.రైతులు ఉచితంగా ఇచ్చిన భూమికి  జగన్ ప్రభుత్వమే ఎకరాకు కోటి రూపాయలుగా నిర్ధారించడం వల్ల మొత్తం ఖర్చు 1,1 కోట్ల రూపాయలు అవుతుంది.ఇది మొత్తం అమరావతి అభివృద్ధి అనే ప్రాజెక్టు యొక్క నిర్ధారిత విలువ.ఇందులో నిర్మాణ ఖర్చు 51, 687 కోట్లు మాత్రమే!మొత్తం ఒకేసారి ఖర్చు పెట్టడం అవసరమూ కాదు, కుదిరేదీ కాదు.వచ్చే ఏడేళ్ళలో ప్రభుత్వం కేటాయించాల్సింది 12,600 కోట్లు మాత్రమే.విశాఖకు పదివేల కోట్లు ఖర్చు చెయ్యడానికి సిద్ధపడిన ప్రభుత్వం అమరావతికి ఏడాదికి 1800 కోట్ల చొప్పున ఏడేళ్ళలో 12,000 కోట్లు ఖర్చు చెయ్యడానికి సుముఖత చూపించకపోవడానికి విశాఖలో తాము కొన్న భూములకి విలువ పెంచుకోవడం కాక ప్రజాహితం కారణం అని ఎలా నమ్మాలి?12,600లో గ్రాంట్ల రూపంలో చెల్లించాల్సింది 5,971 కోట్లు అయితే ప్రభుత్వం వాటా 6,629 కోట్లు.అవీ ఇవీ కలిపి ఏడాదికి ఇవ్వాల్సిన నికర మొత్తం 1800 కోట్లు అయితే 2037 నుంచీ అమరావతి(CRDA) అప్పటికి ఆదాయ వనరు అవతారం యెత్తి వడ్డీతో సహా ప్రభుత్వానికే తిరిగి ఇస్తుంది!
అభివృద్ధి చేసి రైతుకి ఇస్తామన్న క్లాజు ప్రకారం ఇచ్చేవి పోను ప్రబుత్వం(ఛృడా) దగ్గిర క్రయవిక్రయాది సర్వహక్కులతోనూ ఉండేది 8,274 ఎకరాలు.ఇందులో 5,020 ఎకరాల భూమిని అముకోవచ్చు.ఈ మొత్తం భూమిలో 3,709 ఎకరాలను 2023 నుంచి 18 ఏళ్ళ పాటు ఏడాదికి కొంత అమ్ముతూ వెళ్తే సుమారు 78,000 కోట్ల ఆదాయం వస్తుంది.మిగిలిన 1,311 ఎకరాలను 2037 నుంచి అమ్ముకుంటే మరో 93,000 కోట్ల ఆదాయం వస్తుంది.ఇది మాత్రమే కాదు, CRDA అధీనంలో ఉన్న మరో 3,254 ఎకరాల భూమిని తెలివిగా ఉపయోగించుకుంటే మరో 14000 కోట్ల ఆదాయం వస్తుంది.అంటే,అమరావతిని కొనసాగిస్తే ప్రభుత్వానికి వచ్చే ఆదాయమూ CRDAను రద్దు చేసి అమరావతిని తరలించితే ప్రభుత్వం కోల్పోయే ఆదాయమూ 1,86,000 కోట్లు.
ఒకసారి అభివృద్ధి చేశాక అవే భూముల్ని రైతులకి తిరిగి ఇవ్వడం చంద్రబాబుకీ సాధ్యపడదు.చంద్రబాబు అన్నదీ CRDA ఒప్పందంలో ఉన్నదీ ఏమిటంటే నవనగరాల అసలైన అమరావతి మొదలు కాబోయే ముందు గానీ పూర్తయ్యాక గానీ రేటు పెరిగి ఉన్న ఖాళీ భూములలో 1000 నుంచి 1200 ఎకరాల భూమిని రైతులకి ఇస్తానని వాగ్దానం చెయ్యడం.లేదంటే అప్పటికే కట్టివున్న కమర్షియల్ కాంప్లెక్సుల్ని రైతుల పేరున బదలాయించడం - నెత్తురుకూడు రుచికరమనుకునే కడపరెడ్లూ బొత్సలాంటి అవినీతిపరులూ బుగ్గన లాంటి కుళ్ళుజోకుల హాస్యగాడూ బూతుల పంపు లాంటి కొడాలి నానీ చిన్నకారు సన్నకారు రైతులకి అయాచితంగా అంతటి అదృష్టమూ వైభవమూ పట్టడాన్ని భరించలేకపోవడం కూడా ఇంటా బయటా కనబడుతున్న వినబడుతున్న ఇంతటి వ్యతిరేకతని లెక్కచెయ్యకుండా ముందుకే వెళ్ళడానికి మరొక కారణం అని నేననుకుంటున్నాను.
మూడు దశలూ పూర్తయి రాష్ట్రం మొత్తం భూమిలోని అత్యంత ఖరీదైన భాగం తమ స్వాధీనంలోకి వచ్చాక విశాఖలో ఈ నిక్షేపరాయుళ్ళు చేస్తున్న కాలక్షేపం పరిపాలన ఆపేసి  ఇక్కడికే వచ్చేస్తారు, పరిపాలన యధావిధి ఇక్కడి అసెంబ్లీ, సెక్రటేరియట్ నుంచే జరుగుతుంది. అమరావతి పేరుని మాత్రం ఎప్పుడూ ఎక్కడా  వినబడనివ్వరు, అంతే! చంద్రబాబు వూహించిన నవనగరాల మణిహారం పట్ల వీళ్ళకి శ్రద్ధ లేదు,శ్రద్ధ ఉన్నప్పటికీ నిర్మించే సమర్ధత లేదు, సమర్ధత ఉన్నప్పటికీ వీళ్ళని ఇక్కడ నిలబెట్టిన మోదీ, కేసీయార్ ద్వయం వీళ్ళని ప్రోత్సహించరు. జగన్ ఇక్కడినుంచి తరిమేస్తున్న కంపెనీలలో అధికశాతం తెలంగాణ వైపుకీ గుజరాత్ వైపుకీ వెళుతూ ఉండటమే ఈ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో కొలువుదీరడానికి వాళ్ళ ఆశీస్సులు ఉన్నాయనేది అర్ధం చేసుకోవవడానికి గట్టి సాక్ష్యం!అసలు అవి ఎక్కడికి వెళ్ళాయనేది మనకి అనవసరం, ఎందుకంటే చంద్రబాబు రమ్మనగానే ఇక్కడికి రావడానికీ ఇప్పుడు జగన్ పొమ్మనగానే ఇక్కడి నుంచి పోవడానికీ ఆ కంపెనీలకి లాభదృష్టి ఉండటమే కారణం - అది మన రాష్ట్రంలోని స్వయంప్రకటిత మేధావులకి అర్ధం కాకపోవటం మన ఖర్మ!
ఈర్ష్యాళువు, జుగుప్సావంతుడు, నిస్సంతోషి, క్రోధనుడు, నిత్యశంకితుడు, పరభాగ్యోపజీవి అనువారారుగురు దుఃఖభాగులని నీతి కోవిదులు చెప్తారు.కామ, క్రోధ, లోభ. మోహ, మద, మాత్సర్యాలు అరిషడ్వర్గాలు – అంటే ఈ ఆరూ శత్రు గణం.అతివృష్టి, అనావృష్టి, మిడుతలు, పందికొక్కులు, చిలుకలు, చేరువరాజులు – ఈ ఆరు ఈతి భాదలు అని అంటారు కాని, చేరువరాజులుకి బదులు రాజకీయ నాయకులు అని ఉంటే బాగుంటుందేమో. ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఇప్పుడు ఇలాంటి ఈతిబాధలనే ఎదుర్కొంటున్నది.ప్రజలు తమ ప్రతినిధుల్ని ఎన్నుకోవడంలో ఒకే ఒక సారి తప్పు చేసినా ఫలితం ఎంత భయానకంగా ఉన్నదో తెల్సుకోండి.మరోసారి ఇలాంటి తప్పు చెయ్యకండి!
మనిషై పుట్టి అన్నం తిని పెరిగిన వాడు ఎవడూ తన సంపదని గానీ ఆస్తిని గానీ భూమిని గానీ పాడు చెయ్యకూడదు, పరాస్తం చెయ్యకూడదు.ఒకవేళ క్రయవిక్రయాల ద్వారా గానీ దానధర్మాల రూపంలో గానీ పరాస్తం చేశాక వెనక్కి తీసుకోకూడదు - కక్కిన కూటికి ఆశపడటం అని వ్యవహరించి సభ్యతాయుతమైన ప్రవర్తన గల సామాజికులకి అటువంటి నీచకార్యం తగదని  అన్నారు పెద్దలు! కక్కిన కూటికి ఆశపడటం మనలాంటివాళ్ళకి తప్పనిపిస్తుంది, కానీ వాళ్ళకి కుక్క చావూ నెత్తురుకూడూ కూడా గొప్పగా ఉంటుంది గాబట్టి ఇతర్లు తిన్నదాన్ని కక్కించి మరీ తినాలనుకోవడానికి కూడా సిగ్గు పడటం లేదు అందుకే మొదట రైతుల భూములకి ధరలు తగ్గించి వెనక్కి ఇచ్చేసి వాటిని తక్కువ ధరకి కొనుక్కుని ఎక్కువ ధరకి అమ్ముకోవాలని తహతహలాడుతున్నారు. అసలైన దరిద్రం యేమిటంటే కక్కిన కూటికి ఆశించే నీచత్వాన్ని ప్రజలకి కూడా అలవాటు చెయ్యాలని చూస్తున్నారు.రైతుల పట్ల ఈర్ష్యతోనూ తమ స్వలాభం కోసమూ ఇంత దారుణం చేస్తున్న వీళ్ళిచ్చే నవరత్నాల కోసం అర్రులు చాచడం అంటే వీళ్ళ పాపాల్ని పంచుకోవడం కాదా!
అమరావతిని రక్షించుకోవడం కోసం జరుగుతున్న ఉద్యమం శాంతియుతంగా ఎంత సుదీర్ఘ కాలం నడిపినప్పటికీ వాళ్ళు వెనక్కి తగ్గరు గాక తగ్గరు.లాభం కోసం ఆశపడి ముందుకు వెళ్తున్న మొండితనం నష్టానికి మాత్రమే వెనక్కి తగ్గి మంచిదారికి వస్తుందనేది కఠిన వాస్తవం. నేరస్తులు ప్రభుత్వంలో ఉన్నప్పుడు నీతివంతులు ఎదిరించి జైళ్ళకి పోవాలి, లేదంటే దూరదేశం పోయి స్థిరపడాలి - మూడోదారిని ఎన్నుకుంటే అది వాళ్ళని కూడా చెడగొడుతుంది!
This is the real story of amaraavati which is forcibly going to become a forgotten desert in a nearer future of few months - just drop an elegy if you are not a living dead!
శాంతి కోసం సమరమే చెయ్యాలి - అశాంతిని సృష్టించే వాళ్ళతో!

Wednesday, 15 January 2020

ఎరొటోస్తినిస్ అనే వ్యక్తి భూమి చుట్టుకొలతను కనుక్కున్న పద్ధతి శాస్త్రీయమైనది కాదు - అది ఆధిక్యత కోసం అల్లిన ఒక పిట్టకధ , అస్సలు నమ్మకండి!

"మనవాళ్ళుత్త వెధవాయలోయ్!" అని గురజాడ అప్పారావు వూరికే అన్లేదండి.అది పచ్చి నిజం!నేను ఇంకొంచెం ముందుకెళ్ళి "మనవాళ్ళుత్త పౌరుషం లేని వాజమ్మలోయ్!" అని కూడా అంటాను.ఎందుకంటే, ప్రపంచంలోని జాతీ తమలోనివాడు తమజాతిని అంత మాటంటే సహించి వూరుకోలేదు - నిలదీశారు, అతను చెప్పింది నిజమేనని అనిపిస్తే తలవూపారు, అతను చెప్పింది నిజం కాదని అనిపిస్తే తలతీశారు.మొత్తానికి పట్టించుకున్నారు. మాట తమకి వర్తించదని రుజువు చేసుకున్నారు.కానీ, మనవాళ్ళు మాత్రం గురజాడ అన్న మాటని పట్టించుకోలేదు.మరీ విచిత్రం, పట్టించుకున్న కొద్దిమంది నిజమేనని వొప్పేసుకుని మళ్ళీ మళ్ళీ వెధవాయల మాదిరే ప్రవర్తిస్తున్నారు తప్పితే మాటని అబద్ధం చేస్తూ తమ వెధవాయిత్వాన్ని వొదిలించుకోవాలని అనుకోవటం లేదు.ఇంకా చెప్పాలంటే వెధవాయిత్వాన్నే మేధావిత్వం అని వాళ్ళు భ్రమపడి మనల్ని కూడా భ్రమింపజేస్తున్నారు.
మోడర్న్ సైన్సు అంత గొప్పది, ఇంత గొప్పది అని లెక్చర్లు దంచేవాళ్ళలో సగం మందికి సైన్సు అంటే ఏమిటో తెలీదు - యంత్రాలు కనుక్కోవటమే సైన్సనీ యంత్రాల్ని వాడటమే మోడర్నిటీ అని భావించటం ఒక మూఢనమ్మకం మాత్రమే, ఇది గుర్తుంచుకోండి!ఈ మూఢనమ్మకంతో పాటు ఇస్లామిక్ సైన్సు అనే ఒక దిక్కుమాలిన సైన్సు ఉందనేది కూడా మీరు తెలుసుకోవాలి.ఖురానులో ఉన్న అశాస్త్రీయమైన విషయాల్ని సశాస్త్రీయం అని సమర్ధించుకోవటానికి ముస్లిం మేధావులు వాళ్ళలో వాళ్ళు కొన్ని విచిత్రమైన వాదనల్ని చేసి వాటికి పెట్టిన పేరది.ఉదాహరణకి ఖురానులో ఏదో ఒక సురాలో "నేను తీపినీటినీ ఉప్పునీటినీ పక్కపక్కనే సృజించి యున్నాను!" అని అల్లా మహమ్మదు చెప్పిన దాన్ని తీసుకొచ్చి "చూశారా!భూమ్మీద ఉన్న నీటిలో తియ్యదనమూ ఉప్పదనమూ తప్ప ఇంకే రుచీ లేదనే సారకాలిక సత్యం మా ఖురానులో ఎప్పుడో చెప్పబడింది!కాబట్టి మా ఖురాను సత్యం." అని జబ్బలు చరుచుకోవటాన్ని ఇస్లామిక్ సైన్సు అంటారు.మనం, హిందువులం గనక తప్పిజారి, "ఓరే నాయనా!మీ ఖురాను పుట్టకముందే మా ఋషులు పంచతన్మాత్రల గురించి చెప్పారు" అని చెప్తే "పంచతన్మాత్రల గురించి చెప్పారు గానీ నీటిలో తియ్యదనమూ ఉప్పదనమూ గురించి చెప్పలేదు కదా!" అని హడావిడి చేస్తారు.వాళ్ళు చిన్నప్పట్నించీ వాళ్ళ మతసాహిత్యమే వింటూ పెరిగారు గాబట్టి అలాంటి అజ్ఞానంలో ఉండటం పెద్ద తప్పు కాదు.కానీ మనవాళ్ళలోనే చాలామందికి మన పూర్వఋషుల గొప్పతనం తెలీకపోవడం ఎంత దౌర్భాగ్యం?
ముస్లిములు చాదస్తపోళ్ళు.కానీ, క్రైస్తవులు అట్లా కాదు అని అనిపిస్తుంది మనకి ఇవ్వాళ క్రైస్తవులు తమకి తాము ఇచ్చుకున్న ఇమేజిని బట్టి. కొంతమంది పాస్టర్లు "బాల్ పెన్ను కనుక్కున్నది మా క్రైస్తవుడు!మోటారు కారును కనుక్కున్నది మా క్రైస్తవుడు!మీహిందువులు ఏం కనుక్కున్నారు?" అని వీరంగాలు ఎయ్యటం కూడా మీరు చూసే ఉంటారు. వాళ్ళు సైన్సును వ్యతిరేకించలేదు, పైన సైన్సును బాగా డెవలప్ చేశారు, ఎన్నెన్నో కొత్త వస్తువుల్ని కనిపెట్టారు,ఇవ్వాళ మనం అనుభవిస్తున్న సౌకర్యాలు చాలామట్టుకు వాళ్ళ పుణ్యమే అనే వాళ్ళు కూడా ఉన్నారు.ఇలాంటివాళ్ళలో గోగినేని బాబు, దేవరాజు మహారాజు, శ్రీనివాస చక్రవర్తి లాంటివాళ్ళు నిష్పక్షపాతపు క్రెడిబిలిటీ కోసం అప్పుడప్పుడు ప్రాచీన భారతీయ ఋషుల కృషిని పొగుడుతారు గానీ వాళ్ళ సాహిత్యజీవితంలో ఎక్కువ శాతం యూరోపియన్లు సృష్టించిన సైన్సును పొగడటానికే పరిమితమై ఉంటుంది. అసలైన కవిహృదయం ఎక్కడ తెలుస్తుందంటే, వాళ్ళు ప్రాచీన ఋషుల గొప్పదనాన్ని పొగిడే సందర్భంలో కూడా అస్పృశ్యతనో మరొకదాన్నో గుర్తుచేస్తూ పుల్లవిరుపు వ్యాఖ్యలు చేస్తారు - మనస్పూర్తిగా పొగడలేని ఇబ్బంది నుంచి పుట్టిన దరిద్రం కాకపోతే అక్కడ కూడా మతద్వేషపు పైత్యప్రకోపం దేనికి చెప్పండి!
సైన్సు అంటే సైన్సు అంతే, ఇస్లామిక్ సైన్సు, క్రిస్టియన్ సైన్సు, హిందూ సైన్సు అని అన్ని సైన్సులు లేవు.అది నాకు తెలుసు.యూరోపియన్లు ఇన్నిన్ని పరిశోధనలు చేసి ఇన్నిన్ని వస్తువులని కనుక్కోవడానికి మూలమైన ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడా ప్రాచీన భారతీయ విజ్ఞానులు ఆనాటి కాలంలోనే ప్రపంచం మొత్తానికి పంచిపెట్టిన వేదశాస్త్రాల నుంచే పుట్టిందనేది సత్యం పట్ల నిబద్ధత గల ప్రతి చరిత్రకారుడూ ఒప్పుకుంటున్న పరమసత్యం!అయితే, వాళ్ళు కనుక్కున్న వస్తువులు మనవాళ్ళు ఎందుకు కనుక్కోలేదనే ప్రశ్న తప్పకుండా వస్తుంది.వీటిని మెచ్చుకుంటున్న వాళ్ళే కాదు, వాడుతున్న వాళ్ళు కూడా ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి - వీటి వాడకంలో సౌకర్యం ఒక్కటే కాదు హాని కూడా ఉంటున్నది.అంతే కాదు, సౌకర్యం మీద ఉన్న వ్యామోహం వల్ల తెలియటం లేదు గానీ వీటి తయారీలోనే సౌకర్యం కన్న ప్రమాదం తెచ్చిపెట్టే లక్షణాలే ఎక్కువ ఉంటున్నాయి!అదే ఈనాటికీ మనం అనుసరిస్తున్న పూర్వఋషుల ఆవిష్కరణలైన ఆయుర్వేదం, యోగశాస్త్రం వంటివాటిలో ప్రయోజనం తప్ప ప్రమాదం ఏమి ఉంది?వాటిని కూడా వెక్కిరించేవాళ్ళకి వాళ్ళు కనుక్కున్న వస్తువులు మనవాళ్ళు ఎందుకు కనుక్కోలేదనే ప్రశ్న అడిగే అధికారం లేదు.
నేను పోష్టులు రాయడానికి పెట్టుకున్న ఒకే ఒక నియమం నాకు వచ్చిన సందేహాల్ని నివృత్తి చేసుకుని దాన్ని ఇతర్లతో పంచుకోవటం.సందేహం ఏ విషయం గురించి వస్తే ఆ విషయం గురించి జవాబుల కోసం శాస్త్రీయమైన పద్ధతిలోనే వెతుకుతున్నాను.నాకు వచ్చిన సందేహం తీరడం నాకు ముఖ్యం గానీ ఎవరినో మెప్పించాల్సిన అవసరం నాకు లేదు!ఈ "ఎరొటోస్తినిస్ అనే వ్యక్తి భూమి చుట్టుకొలతను కనుక్కున్న పద్ధతి" గురించిన సందేహం గురించి చెప్పాలంటే, శ్రీనివాస చక్రవర్తి గారు తన శాస్త్ర విజ్ఞానం బ్లాగులో "ఎరొటోస్తినిస్ కనుక్కున్న భూమి చుట్టుకొలత" పోష్టు వేశారు. దాన్ని చదివి అర్ధం చేసుకున్న శ్యామలీయం October 5, 2019 at 7:50 PM టైమ్ స్టాంపు దగ్గిర వేసిన '"భూమి ఉపరితలం మీదుగా చూస్తే అలెగ్జాండ్రియాకి, సీన్ నగరానికి మధ్య వారడి ఏడు డిగ్రీలు ఉంటుంది. " ఈ విషయం అప్పటికే నిర్ధారణగా తెలుసా? అదెలాగో ముందు వివరించవలసి ఉంది కదా మీరు? ఎందుకంటే ఈ వారడి - డిగ్రీలు అనగానే భూమి గోళత్వం యొక్క వివరాలు అప్పటికే - దాని వ్యాసంతో సహా తెలిస ఉండాలి కదా అన్న అనుమానం కలుగుతున్నది.' అనే కామెంటు చదివాక నాకూ అదే సందేహం వచ్చింది.నేనూ అడిగాను.
నా సందేహానికి శ్రీనివాస చక్రవర్తి గారు October 12, 2019 at 9:23 AM టైమ్ స్టాంపు దగ్గిర "సీన్ నగరానికి, అలెగ్జాండ్రియా కి మధ్య దూరం 800 కిమీలు అన్న విషయం మాత్రమే అతడికి ముందే తెలుసు. ప్రయోగం చేశాక కోణీయ దూరం 7 డిగ్రీలు అని తెలిసింది. 7 డిగ్రీలు = 800 కిమీలు అయితే, 360 డిగ్రీలు = ? 800 * 360/7 = 41,142 కిమీలు. ఇది ఉజ్జాయింపుగా భూమి చుట్టుకొలతతో సరిపోతుంది." అని జవాబు చెప్పారు.అసలు ఏడు డిగ్రీలు అనేదాన్ని కోణీయదూరం అని అనకూడదు.అది కేవలం కోణమే.ఒక నియమిత వ్యాసార్ధం గల వృత్తం పరిధి మీద ఏడు డిగ్రీల కోణం ఎంత పొడుగు ఉంటుందో ఆ కొలతని కోణీయ దూరం అనాలి. అప్పుడు నాకది ముఖ్యం అనిపించలేదు గానీ జవాబు నుంచే మరొక ప్రశ్న పుట్టింది.అదే ఇది.
hari.S.babu Posted on October 12, 2019 at 10:48 AM :
"సీన్ నగరానికి, అలెగ్జాండ్రియా కి మధ్య దూరం 800 కిమీలు అన్న విషయం మాత్రమే అతడికి ముందే తెలుసు. ప్రయోగం చేశాక కోణీయ దూరం 7 డిగ్రీలు అని తెలిసింది."
hari.S.babu
"linar distance" 800 కిమీలు అన్నది మాత్రమే తెలిసి దానినుంచి "angular distance" తెలియాలంటే "radius" కావాలి కదా!7 డిగ్రీలు అనేది "కోణీయ దూరం" అనటంలో పొరపాటు పడ్డారేమో!అది ప్రయోగం చేశాక తెలిసిందని మీరే అంటున్నారు.అది సరి చూసుకోండి.కానీ "linar distance" 800 కిమీలు అన్నది మాత్రమే తెలిసి దానినుంచి "angular distance" తెలియాలంటే "radius" అవసరం కదా!
అయితే, సందేహం అంటూ వస్తే అక్కడే గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోని నా అలవాటు చొప్పున వెతికితే Did Eratosthenesreally measure the size of the earth? అనే బ్లాగు పోస్టు దొరికింది! పోష్టు రాసింది కూడా సైన్సు గురించి తెలిసిన వ్యక్తియే!అక్కడ శ్రీనివాస చక్రవర్తి గారికే గాక మనకు కూడా కళ్ళు తెరిపించే సమాచారం ఉంది.The problem is that everything we know about Eratosthenes is hearsay. None of his alleged many writings have survived. We only have second hand reports of his supposed achievements, most of them centuries after he lived. This raises the question, how reliable are these reports? అని బ్లాగు రచయిత ప్రశ్నిస్తున్నారు - జవాబు ఉందా మన దగ్గిర గానీ శ్రీనివాస చక్రవర్తి గారి దగ్గిర గానీ?
అసలైన చిత్రం యేమిటంటే fourth century BCE నాటికే Aristotle వంటివాళ్ళు empirical evidence చూపించి చెప్పిన Earth is a sphere అనే విషయం పూర్వసామాన్యశకం మూడవ శతాబ్దంలో పుట్టిన Eratosthenes అనే లైబ్రేరియనుకి తెలియదని శ్రీనివాస చక్రవర్తి గారు అనుకుని భూమి గోళాకారం అనే విషయాన్ని కూడా అతనే తొలిసారి కనుక్కున్నట్టు మనకి చెప్తున్నారు. మహా అయితే, Eratosthenes భూమి చుట్టుకొలతని పద్ధతిలో లెక్కించి ఉండొచ్చు!అయినా, తన లైబ్రరీలో Aristotle వంటివాళ్ళ రచనలు ఉంటాయి కదా, వాటిలోనే మన దేశపు విజ్ఞానులు చాలా కాలం క్రితమే కనుక్కున్నట్టు trigonometry ఉపయోగించి భూమి వ్యాసం కనుక్కోవడానికి క్లూలు దొరికేవి కదా! మాట నేనట్లేదండి, వ్యాసరచయితే అంటున్నాడు.
నిజానికి అంత ముఖ్యమైన విషయాన్ని అంత సులువుగా తేల్చెయ్యడం శాస్త్రీయమైన పద్ధతి కాదు.కనీసం రెండు సార్లు అదే ప్రయోగం చేసి వాటిని సరిపోల్చి ఎన్ని సార్లు అదే ప్రయోగం చేసినా అవే విలువలు వస్తున్నాయని నిర్ధారణ అయ్యాకనే వాటినుంచి సూత్రీకరణలను రాబట్టాలి.కానీ, Eratosthenes అలాంటి శ్రమ పడినట్టు ఆధారాలు లేవు.అదీగాక, పైన everything we know about Eratosthenes is hearsay అని తేల్చి చెప్పిన రచయితయే None of Eratosthenes’ writings survive, however, and some have questioned whether he ever found either the circumference of the Earth, or – as is often stated – the obliquity of the ecliptic, on the basis of measurements. అని బల్లగుద్ది చెప్తున్నారు.Greek astronomer Cleomedes తను రాసిన On the Circular Motions of the Celestial Bodies అనే పుస్తకంలో ఉదహరించటం ఒక్కటే కధకు సంబంధించిన ఆధారం.అయితే, అసలు Cleomodes ఎప్పటివాడో ఇప్పటికీ తెలియదు. అన్ని కధల్ని ఒక్కచోట కూర్చి హడావిడి చేస్తున్న Stuart Clark రాసిన వ్యాసం మీదనే రచయిత తన పరిశోధన చేశాడు.ఇంతకీ విషయాలు Stuart Clark గారికి ఎలా తెలిశాయి!I first heard the story when it was told by Carl Sagan in his masterpiece TV series, Cosmos. అని Stuart Clark గారు అంటున్నారు.”In other words Stuart Clark is just repeating verbatim a story, which Carl Sagan, and or his scriptwriters, made up in 1980 without taken the trouble to verify the accuracies or even the truth of what he saw more than thirty years ago!” అనేది వాస్తవం.
ఇది చదివాక లింకును మళ్ళీ శాస్త్ర విజ్ఞానం బ్లాగు దగ్గిర October 12, 2019 at 10:59 AM టైమ్ స్టాంపు దగ్గిర వేశాను.తర్వాత October 12, 2019 at 1:51 PM టైమ్ స్టాంపు దగ్గిర "The idea of a spherical Earth was floated around by Pythagoras around 500 BC and validated by Aristotle a couple centuries later. If the Earth really was a sphere, Eratosthenes could use his observations to estimate the circumference of the entire planet" అనే కామెంటు కూడా వేశాను. దానికి ఆయన "కోణీయ దూరం తెలియడానికి వ్యాసం తెలియనక్కర్లేదు. పైన చిత్రంలో చూడండి. నీడ పొడవు/కట్టెపుడవు తెలిస్తే అది tan(theta) అవుతుంది. theta = కోణీయ దూరం." అని  October 12, 2019 at 7:33 PM టైమ్ స్టాంపు దగ్గిర జవాబు చెప్పారు.మళ్ళీ దూడలు వేస్తున్నారు.tanΘ was mentioned in 1583 by T. Fincke who introduced the word "tangens" in Latin. But this gentleman, Eratosthenes lived in 300 B.C అనే చిన్న నిజం కూడా తెలియదా అంతకాలం నుంచీ సైన్సు వ్యాసాలు రాస్తున్న పెద్దమనిషికి!
ఇక ఆయన్ని ప్రశ్నలు అడిగి లాభం లేదనిపించి October 13, 2019 at 8:03 PM టైమ్ స్టాంపు దగ్గిర “1).Eratosthenes of Cyrene was the chief librarian at the great library of Alexandria in the third century BC. 2).Eratosthenes knew that the Earth’s surface was curved, as did every educated Greek scholar in the third century BCE.3).The first to realise that the Earth was a sphere were the Pythagoreans in the sixth century BCE. Aristotle had summarised the empirical evidence that showed that the Earth is a sphere in the fourth century BCE.4).Eratosthenes, as chief librarian in Alexandria, would have been well acquainted with above details. Put simply, Eratosthenes knew that he could, using trigonometry, calculate the diameter of the Earth’s sphere with the data he had accumulated, because he already knew that it was a sphere.5).Eratosthenes may or may not have calculated the tilt of the Earth’s axis but this is of no real historical significance, as the obliquity of the ecliptic, as it is also known, was, like the spherical shape of the Earth, known well before his times.” అనే కామెంటునూ October 14, 2019 at 1:52 PM టైమ్ స్టాంపు దగ్గిర “I think the story of Eratosthenes calculating the circumference of the earth with the help of two sticks and by a simple cross multiplication is a fiction and not an authentic fact by the above observations.” అనే కామెంటునూ వేశాను.
ఆయన నుంచి మళ్ళీ జవాబు రాలేదు గానీ October 15, 2019 at 12:13 PM టైం స్టాంపు దగ్గిర బ్లాగు కూడా మాలికలో మూసేపియ్యడానికి "..." బుజానేసుకొచ్చిన హరిబాబుకి స్వాగతం.’ అని అనామక వ్యాఖ్యాత మంగళవాక్యం పలికారు - శుభం! అక్కడ శ్రీనివాస చక్రవర్తి గారు తన మిడిమేలపు/ ఇమిటేషను/అనువదింపు శాస్త్రజ్ఞానంతో కొట్టిన పోజుల భాగోతానికి మంగళం పడటం సరే గానీ నేను మాత్రం ఆగిపోలేదు.మీకు www.quora.com గురించి తెలుసా!అక్కడ నేను ఇదివరకు అలెగ్జాండరు-పురుషోత్తముడి యుద్ధం గురించిన ఒక ప్రశ్నకీ గాంధీ భగత్సింగు ఉరిని ఎందుకు ఆపలేదనే ప్రశ్నకీ జవాబులు చెప్పి చాలా upvotings(Likes in FB parlance) తెచ్చుకున్నాను.ఇప్పుడు అక్కడ Why-do-some-intellectuals-claim-that-Eratosthenes-measured-the-size-of-the-Earth-is-a-concoction అని ప్రశ్న వేశాను.
ఒకే ఒకరు జవాబు చెప్పారు. ఈ Eratosthenes చేసిన ఇదే ప్రయోగాన్ని flat earth society వాళ్ళు భూమి బల్లపరుపుగా ఉందనే విషయాన్ని రుజువు చెయ్యటానికి వాడుకుంటున్నారట - ఇక్కడ మనకి ఎక్కువ సంగతులు తెలియక పోవటం వల్ల ఈ flat earth society కమేడియన్ల మాదిరి అనిపిస్తారు గానీ అక్కడ గట్టి పోటీయే ఇస్తున్నారు!నాకు సమాధానం ఇచ్చిన పెద్దమనిషి కేవలం సైన్సు మీద అభిమానం పెంచుకుని వ్యాసాలు రాస్తున్న మామూలు వ్యక్తి కాదు, Carl Ejnar Nielsen అనే ఆ వ్యక్తి University of Copenhagen నుంచి University degree in Biology అందుకున్న మేధావి.జవాబులో ఉన్న ట్రిక్ ఏంటంటే ఆయనకి Eratosthenes చారిత్రకత గురించి తెలియక కాబోలు, ఆ ప్రయోగాన్ని గురించి flat earth sociey వాదనని కూడా ఉదహరించి “In modern times, we can accurately measure the distance between the Sun and Earth, and can therefore see that assumption 1 is the correct one.” అని తేల్చేశారు. అసలు విషయం వరకు చూస్తే నేను అడిగిన దానికి అదే సరైన జవాబు అవుతుంది గానీ విషయం Eratosthenes యొక్క చారిత్రక యదార్ధతతో కూడా ముడిపడివుంది గాబట్టి ‘I have asked this question after reading this web page, in which, the author doubts the validity of the story."Did Eratosthenes really measure the size of the earth?"The author expressed so many doubts which appear very logical to me:’ అని మొదలుపెట్టి ఆ బ్లాగరు సందేహాల్ని పాయింట్ల వారీ ఉదహరించి “P.S:If you read the article thoroughly, you could know sundials were there already at the time of Eratosthenes.Then we can take the measurements of the shadows for the sundial pointer and there is no necessity of two sticks at a different places at the same time.Please clarify me all these points.” అనే కొసమెరుపు ఇస్తూ ఒక కామెంటు వేశాను.మా ఇద్దరి సంభాషణ జరిగింది అక్టోబర్ 24, 2019న - తర్వాత చర్చ ఇక ముందుకు వెళ్ళలేదు.
అయితే అక్కడ ఒకరు When-and-how-did-scientists-measure-the-radius-of-the-earth అని అడిగిన పశ్నకు ఇచ్చిన జవాబులలో “One of most Efficient, easy and ancient method to calculate radius of Earth was discovered by Al-Biruni” జవాబుని ఇతర్లు కూడా మెచ్చుకోవటం జరిగింది.ఇంకొక సంతోషకరమైన విషయం ఏమిటంటే How did Aryabhata calculate the accurate circumferenceof Earth? అనే ప్రశ్నకి Abd Ul-Rahman Lomax గారు తను ఇచ్చిన జవాబులో Eratosthenes చేసినట్టు చెప్తున్న ప్రయోగాన్ని ఉన్న పరిమితుల్నీ లోపాల్నీ మరింత శాస్త్రీయమైన వివరణతో ఎత్తి చూపించారు.అదే సమయంలో ఆ కధనం చెప్పిన విలువలో కూడా ఖచ్చితత్వం లేదనే విషయాన్ని నిరూపించారు.Modern measurements (Earth) have it that the meridional circumference is 40,007.86 km and the equatorial circumference is 40,075.017 km. The precision of those numbers is ridiculously high. I don’t know what “circumference” actually means to that precision.In miles, they would be 24,860 miles and 24,901 miles.” అని తేల్చి చెప్పిన Abd Ul-Rahman Lomax గారే 499CEకి చెందిన భారతీయ ఖగోళ గణిత వేత్త ఆర్యభటుడు చెప్పిన 24,835 miles విలువని కూడా ఉదహరించారు. It is an excellent approximation to the currently accepted value of 24,902 miles అని ప్రశంసించారు.
మన ఆర్యభటుడైతే ఒక్క భూమియే కాదు మన కంటికి కనిపిస్తున్న ముఖ్యమైన గ్రహతారకల యొక్క ఆకార, స్థల, కాల, దూర, భ్రమణాలకు సంబంధించిన ఎన్నో విషయాల్ని చెప్పాడు. అయినా ఒప్పుకోవటానికి ఇష్టం ఉండదు. తప్పిజారి వాటిని చదవటం తప్పులు పట్టటానికే!అక్కడ లేని తప్పుల్ని ఇరికించి మరీ వెక్కిరించే పాపాత్ములు కూడా ఒకప్పుడు ఉన్నారు, ఇప్పటికీ ఉంటున్నారు, ఎప్పటికీ ఉంటారు!
ఇంతకీ శ్రీనివాస చక్రవర్తి గారు Eratosthenesను పొగుడుతూ రాసిన వ్యాసంలో అతను దూరాన్ని కొలిచినట్టు చెప్పిన 5000 stadia అనే కొలత ఇప్పటి ప్రమాణాలలో దేనికి కలుస్తుందో తెలియదు, అది 24,902 miles అనే విలువతో ఎట్లా సమానమౌతుందో కూడా ఎవరూ చెప్పట్లేదు, ఇప్పుడు కొలిచి నిరూపించుదామంటే ఆ బావి ఎక్కడుందో తెలీదు - కావమ్మ మొగుడంటే కామోసనుకున్నట్టు ఎరొటోస్తినిస్ అనే వ్యక్తి భూమి చుట్టుకొలతను కనుక్కున్నాడనంగానే ఒప్పేసుకోవడం తప్ప అస్సలు కామన్ సెన్సుతో వచ్చే అనుమానాలు కూడా రావు, అదేంటో!

"వేదాలు చదివిన వారు యజ్ఞయాగాదు లందు పశువులను వధిస్తారు" - ఇది నిజమా?

hari.S.babu: గురువు గారూ ! మహాభారతంలో ధర్మవ్యాధుని కధ వస్తుంది కదా . అక్కడ ధర్మవ్యాధుడు కౌశికుడికి ధర్మబోధ చేస్తూ ఒకచోట ," ...