Tuesday, 8 October 2019

తగునా ఇది నీకు?పాపులకు పదవులా?పుణ్యులకు అడవులా?మరీ ఇంత ఘోరమా!

పల్లవి:
ఏమయా ఇంత ధూర్తత నీకు?
ఏలయా ఇంత దీనత మాకు!

చరణం:
కల్ల మాట లాడితిమా?కట్టు తప్పి పోయితిమా?
నువ్వివ్వని దడిగి మంకుతనము చూపితిమా?
నువ్విచ్చినది చాలదని నిను దూరితిమా?
అన్నీ మాకే దోచి ఇమ్మని అడిగితిమా? ||ప||

చరణం:
సిరులిమ్మని మొక్కినవారికి పడిపడి ఇచ్చితివే!
పదవులిమ్మని అడిగినదే చాలు,
శునకముల నైన కనకపు గద్దెల పైన
కూర్చుండ బెట్టితివే! ||ప||

చరణం:
దుష్టులకు విభవము లిచ్చుట ధర్మమా?
శిష్టులకు దరిద్రము నిచ్చుట న్యాయమా?
ఐనవారికి ఆకులా?కానివారికి కంచాలా?
అందరి వాడవా?కొందరి వాడవా?
అడగనిదే పెట్టని అమ్మవా నువ్వు?
అడిగే వారెవరూ లేరనా? ||ప||

చరణం:
మణు లడితిమా?మాన్యా లడిగితిమా?
చింతాకంతైనను శాంతిని దయచేయ గదే?
చాలు చాలు - మరుజన్మంబిక వలదయా! ||ప||

No comments:

Post a Comment

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...