Saturday, 19 October 2019

సేవ్ నల్లమల అని తెలంగాణలో పెడుతున్న 23వ అటామిక్ ప్లాంటుని ఆపెయ్యడం ఎంతవరకు సబబు?

ఇప్పటికి 22 అటామిక్ ప్లాంట్లు ఉంటే తెలంగాణలో పెడుతున్న కొత్త ప్లాంటుకే ఎందుకు వివాదాలు చుట్టుకుంటున్నాయి?
2016 నాటికి దేశంలో 22 atomic reactors పని చేస్తున్నాయి.30,292.91 GWh విద్యుత్తు ఈ అన్ని రియాక్టర్స్ నుంచీ పుడుతున్నది.ప్రపంచ స్థాయిలో చూస్తే సుమారు 400 పైచిలుకు అటామిక్ ప్లాంట్స్ ఏ విధమైన సమస్యలూ లేకుండా నడుస్తున్నాయి.ఒక్క చైనాలోనే 40కి పైన అటామిక్ పాంట్స్ ఉన్నాయి, ఇంకా కొత్త వాటిని స్థాపించటానికి తహతహలాడుతున్నది.చెర్నోబిల్ ప్రమాదం గురించి నేను చదివిన అధికారిక సమాచారం ప్రకారం అక్కడ పని చేస్తున్న వాళ్ళ బయంకరమైన నిర్లక్ష్యం వల్ల సంభవించినదే తప్ప అటామిక్ ప్లాంట్ అంటేనే భయపడాల్సిన  ప్రమాదం కాదు!అక్కడ చెప్పీ చెప్పనట్టు ఉదహరించిన అదనపు వివరాల ప్రకారం బయటివాళ్ళు చేసిన కుట్ర కూడా కావచ్చు.

మన దేశంలో యురేనియం నిల్వలను వెతకడం, తగినంత యురేనియం ఉందనుకున్న చోట ప్లాంట్లను పెట్టడానికి ప్రభుత్వాలకి రికమెండ్ చెయ్యడం,ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాక ప్లాంట్లను నెలకొల్పి నడపటం అన్నీ Department of Atomic Energy అధ్వర్యంలోనే నడుస్తున్నాయి.ఇంతవరకు ఎలాంటి bad reports రాలేదు ఆ సంస్థ పని తీరు మీద.ప్లాంట్లలో పని చేసేవాళ్ళు అందరూ సైంటిస్టులే, కనీసం సైన్సులో బేసిక్స్ కూడా తెలియని వాళ్ళని అలాంటి సంస్థల్లోకి తీసుకోకూడదు కూడా!ప్లాంటు లోపల పని చేస్తూ నిత్యం ఆ యురేనియం శుద్ధిలోనూ న్యూట్రాన్ కొల్లిజనులోనూ పాలు పంచ్గుకుంటున్నవాళ్ళకి రాని రోగాలు ప్లాంటుకు బయట ఉన్నవాళ్ళకి ఎందుకు వస్తున్నాయో నాకయితే అర్ధం కావడం లేదు!అధికారికమైన నివేదికల ప్రకారమే ప్రపంచ స్థాయిలో ధెర్మల్ పవర్ ప్లాంట్లతోనూ అటామిక్ పవర్ ప్లాంట్లతోనూ ఇతరేతర ఎనర్జీ కన్జర్వేషన్ రంగాలతోనూ కలిపి లెక్కిస్తే అటామి పవర్ ప్లాంట్ల నుంచి విడుదలయ్యే ఉద్గారాల శాతం 1% మాత్రమే ఉంటున్నది.

Maharashtra లోని Tarapur Atomic Power Station నుంచి 1,400 MW,  Gujarat లోని Kakrapar Atomic Power నుంచి 440 MW, Tamil Nadu లోని Kudankulam Nuclear Power Plant నుంచి 2,000 MW, Karnataka లోని Kaiga Nuclear Power Plant నుంచి 880 MW, Tamil Nadu లోని Madras Atomic Power Station నుంచి 440 MW, Rajasthan లోని Rajasthan Atomic Power Station నుంచి 1,180 MW, Uttar Pradesh లోని Narora Atomic Power Station నుంచి 440 MW ఉత్పత్తి అవుతుంటే రాని సమస్యలు తెలంగాణలోనూ ఆంధ్రలోనూ ఎందుకు వస్తాయి!

బొగ్గును ఇంధనం కింద వాడితే దానికి అడివిని నరకాలా అక్కర్లేదా?పెట్రోలును తియ్యాలంటే దాన్ని భూమిలోపలినుంచి పైకి తెచ్చి ప్రోసెస్ చెయ్యాలా అక్కర్లేదా?నిజానికి సంప్రదాయకమైన వ్యవసాయం చెయ్యటానికి ఇంధనం అవసరం లేదు.కానీ, ఇవ్వాళ నీటి పారుదల కోసం కరెంటును వాడుతున్నారు.ఈ వ్యవసాయం దానంతటది డబ్బుని సృష్టిస్తుందా?వ్యవసాయం వల్ల తయారైన ప్రతి ఉత్పత్తీ మార్కెట్ దగ్గిర అమ్ముడు పోయాకనే గదా రైతుకు డబ్బు వచ్గ్చేది!డబ్బు అనేది చేతికి రావాలంటే వ్యాపారం వల్లనే సాధ్యం అనే కామన్ సెన్సు కూడా లేకుండా వ్యవసాయం ముద్దు వ్యాపారం వొద్దు అని  పంచ్ డయలాగులు విసిరితే ఎట్లా?ఇప్పుడు వ్యవసాయంలోనూ యంత్రాల్ని వాడుతున్నప్పుడు, ఆ యంత్రాలను నడపటానికి ఇంధనం వాడుతున్నప్పుడు మిగతా అన్నిటిలోనూ లేని ప్రమాదం అటామిక్ ఎనర్జీలో ఎట్లా ఉంటుంది?ఇదివరకు కార్తెల్ని బట్టి పంటలు వేస్తూ ఏడాదికి ఒకే రైతు ఒకే నేలలో మూడు నాలుగు పంటలు వేసి అప్పటికప్పుడు మార్కెట్ చేసుకునే పరిస్థితి ఉండేది.ఇప్పుడు ఒక వ్యవసాయ ఉత్పత్తి చేతికి రావడానికి పట్టే సమయం కన్న సబ్బులూ షేవింగ్ సెట్లూ టూత్ పేస్టులూ తయారై మార్కెట్ ముందు నిలబడి అమ్ముడు పోవడానికి అతి తక్కువ సమయం సరిపోతున్నది.ఇలాంటివి నడవాలంటే కరెంటు కావాలి. కరెంటు కోసం దేశంలో తయారవుతున్న ధెర్మల్, హైడెల్, సోలార్ ఎనర్జీ సరిపోనప్పుడు అటామిక్ ఎనర్జీని కూడా ఉపయోగించుకోవడం తప్పెట్లా అవుతుంది?

సోలార్ ఎనర్జీని వాడి 2000MW పవర్ పుట్టించాలంటే 600 km2 చోటు కావాలి ఆ ప్యానల్స్ పెట్టడానికి.అదీ 24 గంటలూ ఫెళ్ళున కాచే ఎండ ఉంటేనే దాని పెర్ఫార్మెన్స్ బావుంటుంది.ధెర్మల్, హైడెల్ ప్రాజెక్టుల గురించి మీకు తెలియనిది ఏముంది?కాళేశ్వరం గురించి ఎంతోమంది ఎన్నో విధాల విమర్శించారు, కానీ అన్ని ప్రాజెక్టుల్నీ బహుళార్ధకం చెయ్యలేనప్పుడు పవర్ కోసం ఆమాత్రం ఖర్చు చెయ్యక తప్పదు కదా అనిపిస్తుంది.ప్రపంచం మొత్తం మీద ఉన్న అటామిక్ రియాక్టర్లలో కూడా అన్నీ పూర్తిస్థాయిలో పని చేయడం లేదు.పెట్టుబడికీ లాభానికీ మంచి నిష్పత్తి ఉన్నా కూడా atomic energy sector బాలారిష్టాలు దాటని స్థితిలోనే ఉంది.మీరు గుర్తు చేసుకుంటే మానవ మనస్తత్వం కొత్తను చూసి భయపడిన గతకాలపు ఉదంతాల నుంచి ఇప్పటి అణు ఇంధనం గురించిన భయాలకు మూలం దొరుకుతుంది.ఎలెక్ట్రిక్ బల్బు కనిపెట్టినప్పుడూ రేడియో కనిపెట్టినప్పుడూ ఇలాంటి భయాలే ఎదురయ్యాయి, ఇవ్వాళ వెనక్కి తిరిగి చూస్తే అప్పటివాళ్ళు ఎంత పిచ్చివాళ్ళో అనిపిస్తుంది.రైళ్ళు నడిచిన మొదటి రోజుల్లో వాటిల్లో ఏదో దెయ్యం ఉండి నడిపిస్తున్నదని భయపడిన సంఘటనలు చరిత్రలో రికార్డ్ అయివున్నాయి!

ఒక్క అటామిక్ పవర్ ప్లాంటు పెడితే మొత్తం నల్లమల అడవే నాశనమైపోతుందా?

అటామిక్ పవర్ ప్లాంట్ పెట్టడానికీ నడపటానికీ కొన్ని విధి విధానాలు ఉన్నాయి.యురేనియం అనేది మనం వాడుకోకుండా వదిలేస్తే దానంతటది disintigrate అయ్యి సీసం కింద మారిపోతుంది.ప్లాంటులో కొన్ని చోట్ల  వ్యర్ధాలను పారబొయ్యడానికి బావులు తవ్వుతారు. అందులోకి వెళ్ళే యురేనియం చాలా తక్కువ మొత్తంలో ఉంటుంది - అంటే తడిబట్టను మెలిపెట్టి పిండేటప్పుడు ఇంకా పిండితే బట్ట చిరగడం ఖాయం అని వొదిలేస్తే బట్టకి ఉండే తడి అంత!ప్రజలకి నష్టమో కాదో తేల్చుకోవడానికి ఇంత సమాచారం ఉండగా వీటి గురించిన ప్రస్తావనే లేకండా "సేవ్ నల్లమల!" అంటే చాలు వాళ్ళలో మానవత్వం పరిఢవిల్లిపోతున్నాట్టా?

Fukushima nuclear disater in Japan: ఈ మధ్యనే జపానులో ఒక ప్రమాదం జరిగింది.అయితే, On 5 July 2012, the National Diet of Japan Fukushima Nuclear Accident Independent Investigation Commission (NAIIC) found that the causes of the accident had been foreseeable, and that the plant operator, Tokyo Electric Power Company (TEPCO), had failed to meet basic safety requirements such as risk assessment, preparing for containing collateral damage, and developing evacuation plans. అని తేలడాన్ని బట్టి మనుషుల నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని అర్ధం చేసుకోవాలి.అదే నిర్లక్ష్యం ధెర్మల్, హైడెల్ పవర్ ప్లాంట్లలోనూ కనిపిస్తున్నది కదా!

అటామిక్ ఎనర్జీకి సంబంధించిన భారీతనం కట్టేటప్పుడు మాత్రమే కనిపిస్తుంది.ఒకసారి కట్టి అన్ని ఏర్పాట్లూ పూర్తయిపోయి తయారీ మొదలయ్యాక దాని పని తీరు మిగిలిన అన్ని రకాల ఉత్పత్తుల కన్న మెరుగైన ఫలితాన్ని ఇస్తుంది.ఉత్పత్తి పెరిగే కొద్దీ ధరను తగ్గించవచ్చు.మరిన్ని పరిశోధనల అనంతరం ఇప్పుడు హానికరం అవుతున్న వ్యర్ధాలని  రీప్రాసెస్ చెయ్యగలిగితే 95% వరకు ప్రమాదాన్ని నివారించవచ్చునని నిపుణులు అంటున్నారు.

ప్రస్తుతం భారతదేశంలో తప్ప ఇంకెక్కడా అటామిక్ ఎనర్జీని భూతద్దంలో పెట్టి చూపించి రేడియేషన్ బూచిని చూపించి హడలగొట్టే ఉద్యమాలు నడవటం లేదు!ఇక్కడ ఆ ఉద్యమాలు చేస్తున్నవాళ్ళలో మూడోవంతుమంది మావోయిస్టు ప్రభావం ఉన్నవాళ్ళు, మరో మూడోవంతుమంది అమెరికా తదితర దేశాల తరపున పనిచేసేవాళ్ళు అయితే మిగిలిన మూడోవంతుమంది దేన్ని గురించైనా పూర్వాపరాలు తెలుసుకుని మాట్లాడే ఓపిక లేక "సేవ్!" అని కనబడితే చాలు అదేదో సమాజసేవాకార్యక్రమం అనుకుని వాళ్ళ పక్కన చేరి ఓ సెల్ఫీ తీసుకుని "నేను సైతం, నేను సైతం" అని కారు చవక మంచిపని చేసినట్టు మురిసిపోయే పాప్యులారిటీ ఫోకస్ రింగు పిచ్చోళ్ళు.

యురేనియం నిజంగా అంత హానికరమైనదా!

ధెర్మల్ ఎనర్జీ ప్లాంటుకీ అటామిక్ ప్లాంటుకీ ఉన్న తేడా అల్లా బొగ్గుని మండించి శక్తిని పుట్టించే చోట యురేనియం వాడటం - అయితే 5 టన్నుల బొగ్గుని మండించితే ఎంత శక్తి వస్తుందో, 900 dm3 పెట్రోలియం ఆధారిత ఇంధనాన్ని వాడితే ఎంత శక్తి వస్తుందో, 1100 m3  మీధేన్ తరహా వాయు ఇంధనాన్ని వాడితే ఎంత శక్తి పుడుతుందో కేవలం 10 గ్రాముల యురేనియాన్ని వాడితే అంత శక్తి పుడుతుంది!అన్ని రకాల ఇంధన రూపాల మాదిరే ప్రకృతిలో యురేనియం దాని స్వచ్చ రూపంలో ఉండదు.Pitchblend రూపంలో ఉన్న ఇప్పటి స్థితిలోనే చుట్టూ మొక్కలు మొలిచాయి, అవి మహావృక్షాలయ్యి నల్లమల అడివి తయారై ఉంది.ఎక్కడ ఎంతమేర యురేనియం నిక్షేపాలు వున్నాయో గుర్తించి అక్కడ ఒక ప్లాంటుపెడితే మొత్తం నల్లమల అడివి ధ్వంసం అవుతుందని అంటున్నారంటే వింతగా లేదూ!

నిజానికి ఇప్పటి సాంకేతిక పరిజ్ఞానం లోపభూయిష్టమైనది కావడం కూడా ప్రమాదాలకి ఒక కారణం, డిజైన్లు మార్చటం, పనితీరును మెరుగు పర్చటం, వ్యర్ధాలను తగ్గించటం మీద పరిశోధనలు జరుగుతున్నాయి.అసలు ప్రపంచంలో తొలి అటామిక్ రియాక్టరు మొదలైందే 1957లో, Meghnad Saha లాంటివాళ్ళు1939 నుంచీ దీనిమీద పని చేస్తూ 1957లోనే మనల్ని కూడా అణు ఇంధన దేశంగా మార్చారు.ఇంత సుదీర్ఘమైన కాలం తర్వాత లోటుపాట్లని సవరించుకుని సాంకేతికతని పెంచుకుని ముందుకెళ్ళాలి గానీ "అది నాక్కర్లేదు!ఇది నాకక్కర్లేదు!మొన్న ఎట్లా ఉన్నానో నిన్న ఎట్లా ఉన్నానో ఇవ్వాళా అట్లాగే ఉంటాను రేపూ అట్లాగే ఉంటాను!" అనడం తెలివితక్కువ తనం అవుతుందని బల్లగుద్ది మరీ చెప్తున్నాను యువరానర్!

మీకొకటి తెలుసా!మీరు టీవీ చూస్తున్నప్పుడు ఆ దృశ్యాల్ని రిలే చేసిన ట్రాన్స్మిటింగ్ టవరు నుంచి వెలువడిన తరంగాలు అక్కడి నుంచి మీ ఇంటి వరకు ఉన్న సమస్తాన్నీ ఢీకొంటూ వస్తే గానీ మీరు టీవీ చూడలేరు - అంతే కాదు, టీవీ చూస్తున్న మిమ్మల్ని కూడా అవి ఢీ కొడుతున్నాయి!అంతెందుకు, మనకి అత్యంత అవసరమైన సూర్యకాంతిలోనే పరారుణ, నీలలోహిత కిరణాలు ఉన్నాయి కదా!కొన్ని లక్షల సంవత్సరాల నుంచీ భూమిని తాకుతున్న సూర్యకాంతిలోని పరారుణ నీలలోహిత కిరణాలు చెయ్యలేని చెరుపు ఒక చోట అతి తక్కువ ప్రాంతంలో వెలువడుతున్న అటామిక్ రియాక్టర్లు వాడిపారేసిన పిప్పి చేస్తుందా?అదీ గాక, ఆ రియాక్టర్లలో పని చేసే  వాళ్ళు కూడా మనుషులే, ప్రాణాల మీద తీపి ఉన్నవాళ్ళే కదా!

తెలంగాణలో జరుగుతున్న హడావిడి ఆంధ్రలో జరగడం లేదు కాబట్టో యేమో ఆంధ్రలోని 6,000 MW ఉత్పత్తి కోసం కొవ్వూరు ప్లాంటు నిర్మాణ కార్యక్రమం మాత్రం శరవేగాన దూసుకుపోతున్నది!ఆంధ్రలో కూడా వీచాల్సిన విప్లవ పవనాలు తెలంగాణలో మాత్రమే వీచడాన్ని బట్టి సేవ్ నల్లమల రాజకీయ ప్రేరితమే అని అనుకోవాలి, కదూ!అక్కడ ఎక్కువ హడావిడి చేస్తున్నవాళ్ళు మావోఇస్టులే అని నాకు చూచాయగా అర్ధం అవుతున్నది.ఆంధ్రావాళ్ళు తెలివిగా ఉండి కొవ్వూరు ప్లాంటును రాజకీయం చెయ్యకుండా ఉంటారని ఆశిస్తాను.అది నడిచేది కేంద్ర ప్రభుత్వ సంస్థ అధ్వర్యంలో కాబట్టి లోకల్ పాలిటిక్సుని అందులోకి యెక్కించి మన రాష్ట్రానికి మనమే హాని చేసుకోవడం దేనికి?ఇప్పటికి నడుస్తున్న గత్తర చాలదా!

ప్రజలూ మేధావులూ నిజాయితీ పరులైన అభివృద్ధి కాముకులూ అవ్వా కావాలి బువ్వా కావాలి అన్నట్టు ఆలోచించకూడదు.ఇంధన రంగం మొత్తాన్నీ సంప్రదాయకమైన బొగ్గూ, నీరూ, వేడీ అనే మూడింటి మీదనే ఆధార పడేటట్టు చేస్తే అవసరాలు పెరిగే కొద్దీ వాటిమీద ఒత్తిడి పెరగడం తప్ప ఏమి ప్రయోజనం?అణు ఇంధనంలో ప్రమాదం ఉన్న మాట నిజమే, కానీ దాన్ని తగ్గించే ఉపాయాలు కూడా ఉన్నాయి.ఇవ్వాళ పిచ్చిబ్లెండులా కనబడుతున్న యురేనియం వాడుకోకపోతే ఎలాగూ disintigrate అయ్యి ఉత్త సీసం మిగులుతుంది.అప్పుడు యేడ్చి యేమి లాభం?


సర్వే జనాః సుఖినో భవంతు!

No comments:

Post a Comment

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు