మొదట నా చరిత్ర చెప్తాను.నేను యవ్వన కాలంలో నాస్తికుణ్ణి, కమ్యూనిష్టు భావజాలం వైపుకి కూడా మొగ్గు చూపాను.అయితే, కొన్ని చిత్రమైన వ్యక్తిగతమైన కారణాలతో ఆస్తికుణ్ణి అయ్యాక కూడా చాలా కాలం పాటు కమ్యూనిష్టు భావజాలం యొక్క ప్రభావంలోనే ఉన్నాను.చిన్నప్పటి నుంచీ ప్రతి రోజూ న్యూస్ పేపరు చదివే అలవాటు ఉండటం వల్ల సంచలనం సృష్టించిన అయోధ్య రామాలయం కేంద్రంగా మొదలైన ఉద్యమాన్ని తొలినాళ్ళ నుంచీ గమనించాను.అప్పుడు ఆ ఉద్యమానికి అనుకూలుడైన మా మామయ్యని "ధర్మ స్వరూపుడైన రాముడు తనకి ఆలయం నిర్మించటానికి హింసని రెచ్చగొట్టమని చెప్పాడా?" అని అడిగి ఆయన తత్తరపడేటట్టు చేశాను.అయితే, మసీదును కూలగొట్టటానికి తొలినాళ్ళలో వ్యతిరేకించిన నేను రూటు మార్చుకుని భాజపా అభిమానిని కావడానికి అప్పుడు కళ్ళముందు కనబడుతున్న అద్వానీ, వాజపేయి లాంటి వారి వ్యక్తిత్వమే ప్రముఖమైన కారణం!నా మెయిల్ ఐడిలో ఉన్న లెనిన్ ఫొటోని గురించి కొందరు వెక్కిరిస్తున్నారు.అతన్ని కూడా అతని వ్యక్తిత్వం వలనే అభిమానించాను తప్పితే కమ్యూనిష్టు సిద్ధాంతం మీద ఉన్న అభిమానం కాదు.ఇంతకీ భారతదేశపు వీరకిశోరం భగత్సింగును ఇదే భాజపా వారూ రాష్ట్రీయ స్వయం సేవక్ కూడా పొగుడుతున్నారు కదా!అతనేమైనా హిందూత్వవాదియా?పక్కా కమ్యూనిష్టు అయిన భగత్సింగ్ ఏనాడూ హిందూమతాన్ని ప్రశంసించలేదు, అయినా భాజపా వారికీ రాష్ట్రీయ స్వయం సేవక్ సభ్యులకూ ఉత్తేజాన్ని కలిగిస్తున్నాడు కదా, మరి నేను అదే లెక్కన లెనిన్ అనే మరో కమ్యూనిష్టుని అభిమానిస్తే తప్పేమిటో!
ఏ పార్టీ అయినా ఏ సిద్ధాంతం అయినా అంకితభావంతో ప్రజలకి మేలు చేసే ఆదర్శవంతమైన అనుచరుల వల్లనూ కార్యకర్తల వల్లనూ మాత్రమే తన విశ్వసనీయతను ప్రదర్శించి ప్రాభవాన్ని సాధించుకోగలుగుతుంది, అవునా?ఒకనాడు ఇందిరాగాంధీ చేతిలో దుర్మార్గమైన అణిచివేతకి గురై కూడా ఎన్నో కేసుల్ని తాన మీద వేసి అరాచక శక్తిగా నిరూపించాలని చూసినా కోర్టుల నుంచి ప్రశంసల్ని అందుకుని నిషేధాన్ని ఎత్తి వేయిచుకుని నిలబడిన ధృఢత్వం రాష్ట్రీయ స్వయం సేవక్ సంస్థది.కేవలం 2 సీట్లతో అపహాస్యానికి గురయిన భాజపా వాజపేయి మహాశయుడు ప్రకటించినట్టు ఇంత గొప్ప స్థితికి చేరుకోవడానికి భాజపా అనే రాజకీయ పార్టీలో ఆనాడు ఉన్నవారి మూలాలు రాష్ట్రీయ స్వయం సేవక్ అనే పవిత్రమైన సంస్థలో ఉండటమే కారణం అనేది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి.మొదటిసారి భాజపా అధికారంలోకి రావడానికి తొలినాళ్ళలో ద్వేషించి మలినాళ్ళలో అభిమానించిన నాలాంటి అనేకానేక సహస్రాధిక అనామక వ్యక్తులే కారణం అనేది కూడా యదార్ధమే, అవునా?
మరి వ్యతిరేకులను కూడా మెప్పించి తనవైపుకు తిప్పుకోగలిగిన సచ్చీలత బదులు ఇవ్వాళ వ్యతిరేకత నుంచి సానుకూలత వైపుకి వచ్చిన నాలాంటి అనేకానేక సహస్రాధిక అనామక వ్యక్తుల నుంచి ఎదురౌతున్న ఛీత్కారాలను కూడా లక్ష్యపెట్టని నీచత్వానికి కారణం ఏమిటి?ఈ ప్రశ్నకి సరైన జవాబు తెలియాలంటే వాజపేయి ప్రభుత్వం కూలిపోయిన నాటికీ మోదీ తొలిసారి అధికారంలోకి రావడానికీ మధ్యన అటువైపు భాజపా మరియు రాస్వసే అనే జమిలి సంస్థల సంస్కృతిలోనూ ఇటువైపు హిందూ సమాజంలోనూ అంతకుముందు ఎవరూ వూహించని కొన్ని భీబత్సమైన మార్పులని పసికట్టాలి.
హైందవేతర సమూహాలు అంటే, కమ్యూనిష్టులూ వారిని వెనకేసుకొచ్చిన కాంగ్రెసు పార్టీ హిందూమతం మీద తమ దాడిని పెంచాయి. వారు దీనికి చెప్పుకున్న సమర్ధన భాజపా అయోధ్య ఉద్యమాన్ని రాజకీయ ప్రయోజనాల కోసమే చేపట్టినదనేది సమర్ధించదగిన కారణమే గానీ ఆ పేరున వారు చేసిన చేష్టలు మాత్రం చాలా నీచ స్థాయిలో ఉండి అప్పటి వరకు తటస్థులుగా ఉన్న సహనశీలురైన హిందువుల్ని కూడా రెచ్చగొట్టి విధి లేక తమ రక్షణ కోసం భాజపాను తమ ప్రతినిధిగా ఎన్నుకోవలసి వచ్చింది. అయితే, ఈ వూపును భాజపా మరియు రాస్వసే నిర్మాణాత్మకమైన దృక్పధంతో ఉపయోగించుకుని ఉంటే ఆ రెండు సంస్థలకీ ఇవ్వాళ్టి దుస్థితి ప్రాప్తించి ఉండేది కాదు.కానీ భాజపా నాయకులు అప్పటివరకు తమకి కీర్తి ప్రతిష్టల్ని తెచ్చిపెట్టిన నైతిక విలువల్ని గాలికి వదిలేసి అధికారంలో ఉంటే చాలును అనే ధోరణిలో పడిపోయి కాంగ్రెసును అనుకరించటం మొదలుపెట్టారు.భాజపా ఒక రాజకీయ పార్టీ కాబట్టి ఈ నైతిక పతనానికి సిగ్గుపడే ధోరణిలో లేదు.దానికి తార్కాణమే నేడు రామ్మాధవ్ లాంటివాళ్ళ సిగ్గులేని ప్రకటనలు!వాజపేయి లాంటివాళ్ళ సచ్చీలతకి తోడు ఆనాడు చంద్రబాబు సెక్యులర్ స్టాండు నుంచి యూ-టర్న్ తీసుకుని ప్రోత్సహించడం వల్లనే మతతత్వ పార్టీ ముద్ర నుండి బయటపడగలిగిందనేది నాలాగే ప్రతి రోజూ దినపత్రికలు చదువుతూ జరుగుతున్న రాజకీయ పరిణామాలను గమనించిన సహస్రాధికమైన అనామక వ్యక్తులకు తెలుసు.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంస్థకు అసలైన హాని భాజపాకు తోకలా మారడం వల్ల జరిగింది.భాజపాకి తొలినాళ్ళలో ప్రాభవం తెచ్చిపెట్టిన ప్రముఖుల మూలాలు తమ సంస్థలో ఉండటం వల్ల మోహానికి గురయిన రాస్వసే పెద్దలు సామాజిక సేవా కార్యక్రమాలనూ క్షెత్ర స్థాయి ధర్మ ప్రచారాన్నీ పక్కన పెట్టి భాజపా రాజకీయ నిర్ణయాలను శాసించడం ప్రధాన కార్యక్రమం కింద పెట్టుకున్నారు.ఏ రాష్ట్రంలో రాస్వసె బలంగా ఉంటే ఆ రాష్ట్ర భాజపా శాఖకి ఎవరు నేత కావాలో కూడా ఆ రాష్టపు రాస్వసే అధ్యక్షుడే నిర్ణయించటం లాంటి తమాషాలు మొదలయ్యాయి.ఇప్పటికీ అవి కొనసాగుతూనే ఉన్నాయి కానీ భాజపా యొక్క రాజకీయపరమైన నైతిక భ్రష్టత్వాన్ని మాత్రం నిట్టూర్పులు విడవటం అసంతృప్తిని వ్యక్తం చెయ్యడం తప్ప అది తప్పని చెప్పి నియంత్రించలేకపోతున్నది.దీనికి బదులు బీజేపీ సంస్థాగత నిర్ణయాల్లో కల్పించుకోకుండా ఇదివరకు చేస్తున్న సేవ అకార్యక్రమాలను మరింత ముమ్మరం చేసి ఉంటే భాజపాకు బలమైన వోటుబ్యాంకు స్థిరపడి ఉండేది.ఇప్పటికీ కాంగ్రెసు, తెలుగుదేశం వంటి పార్టీలకి ఉన్న వోటుబ్యాంకును బద్దలు కొట్టలేకనే పార్టీల మార్పిడిని ప్రోత్సహించే దిక్కుమాలిన పద్ధతిలో అధికారంలోకి రావాల్సిన దుస్థితిలో భాజపా ఉన్నదనేది వాస్తవం!
ఒకనాడు ఏ చంద్రబాబు సహాయం వల్ల మతతత్వ పార్టీముద్రని వదిలించుకుని ప్రజల ఆమోదం పొందిందో ఆ చంద్రబాబుని అంతం చెయ్య్యాలని నిస్సిగ్గుగా ప్రయత్నించడం మానవ సహజమైన సంస్కారం ఉన్నవాడెవ్వడూ చెయ్యగూడని పని - కృతజ్ఞతను మించిన పుణ్యం కృతఘ్నతను మించిన పాపం మరొకటి లేదు!ఎన్నికలు నిన్ననే అయిపోయి ఆంధ్రలో తమ నిజమైన బలం తేటతెల్లమయ్యాక, ఇప్పుడప్పుడే ఎన్నికలు రావని తెలిసి కూడా ఆంధ్రలో ప్రధాన ప్రతిపక్షం మేమే అని ప్రకటించడంలోని నైతికత ఏమిటి?వేరే పార్టీ కార్యకర్తల ప్రచారంతో వోటర్లు తమకి చచ్చినా వెయ్యకూడదని తీర్మానించుకుని ఇతర్లకి వేస్తే గెలిచినవాళ్ళని లాక్కుని సభలో సంఖ్యని పెంచుకోవడం అంటే తమ పార్టీలో తమ పార్టీకి వోట్లు వేయించుకోగలిగి సభలోకి రాగలిగిన సమర్ధులైన నాయకులు లేరని ఒప్పుకోవడమే కదా!ఈ వాస్తవం అధికార మదంతో కళ్ళు పొరలు గమ్మిన భాజపా నాయకులకి ఎప్పటికీ అర్ధం కాదు, కానీ ఆ పార్టీని భుజాల మీద మోస్తున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సభ్యులూ నాయకులూ ఎంతవరకు అర్ధం చేసుకున్నారు?
రాష్ట్రీయ స్వయం సేవక్ సభ్యులూ కార్యకర్తలూ క్షేత్ర స్థాయిలో ఇప్పటికీ సేవా తత్పరతనీ నైతిక ధృఢత్వాన్నీ కలిగి ఉన్నారా లేక వారు కూడా బద్ధకస్తులైపోయి భాజపా ద్వారా లాభపడాలని సర్దుకుపోతున్నారా?వృద్ధాప్యంలో శక్తులు ఉడిగిపోయినప్పుడు రాజీ పడటం సహజమే - కానీ రాస్వసేలో కుర్రవాళ్ళు ఎవరూ లేరా?అందరూ ముసలివాళ్ళైపోయారా?రాష్ట్రీయ స్వయం సేవక్ సంస్థలో నిర్ణయాత్మక స్థానంలో ఉన్నవారికి ఇప్పుడు రెండే రెండు దారులు ఉన్నాయి.హిందూమతానికి మూలమైనది సత్యము, నైతికత కాబట్టి ఆ విలువల కోసం పట్టుబట్టి భాజపాని మంచి దారికి తీసుకు రావటం ఒక దారి.కొంచెం విచక్షణతో ఆలోచిస్తే భాజపా ఇప్పుడు చేస్తున్న లత్తుకోరు పనులు చెయ్యడం వలనే కాంగ్రెసు ఇవ్వాళ ఉన్న స్థితిని అనుభవిస్తున్నదనేది తెలుస్తుంది.ఇవ్వాళ చీప్ ట్రిక్కులు ప్లే చేసి ఒకటి రెండు ఎన్నికల్లో గెల్చినా నిరంతరం గెలవాలంటే తమ కార్యకర్తల ప్రచారంతో ప్రజలు తమను మెచ్చి వేసిన వోట్లతో అధికారంలోకి రావడమే గౌరవప్రదమయినదనేదీ అదే సుదీర్ఘ కాలం పాటు తమని నిలబెడుతుందనేదీ రాస్వసే నాయకులు భాజపా నాయకులకి తెలియజెప్తేనే ఈ రెండు సంస్థలూ చిరకాలం మన్నుతాయి.
భాజపాతో సంబంధం తెంచుకుని ఇప్పటివరకు తమకు హిందూ సమాజంలో గౌరవాన్ని తెచ్చిపెట్టిన సేవా కార్యక్రమాలకీ ధర్మ ప్రచారానికీ పూర్తి సమయం కేటాయించటం రెండవ దారి.ఇందులో అలసత్వం చూపిస్తే నేను చెప్పినట్టు త్వరలోనే కనుమరుగు అయిపోవడం ఖాయం!హిందూ సమాజం రాస్వసే భాజపాతో తెగదెంపులు చేసుకోగానే మళ్ళీ నెత్తిన పెట్టుకుంటుందన్న గ్యారెంటీ కూడా లేదు.రాస్వసే భాజపా మీద పెత్తనం చెయ్యడంలో మునిగిపోయిన కాలంలో కొత్త సంస్థలు కొన్ని ఆవిర్భవించాయి.తెలుగు రాష్ట్రాల్లో శివశక్తి సంస్థ చాలా ప్రముఖమైనది.రాస్వసే కేవలం ధర్మ ప్రచారానికి మాత్రమే పరిమితం కావడం వల్ల రాజకీయ రంగంలో భాజపాను తనకు మారుగా ఉపయోగించుకుంటున్నది. ఈ బలహీనత శివశక్తికి లేదు.కరుణాకర్ సుగ్గున ఈ మధ్యనే ఉత్తరాదికి కూడా విస్తరించాలని ప్రయత్నాలు చేస్తున్నాడు.భవిష్యత్తులో రాజకీయ పార్టీని కూడా స్థాపించే ఉద్దేశం ఉన్నట్టు అతని మాటల వల్ల తెలుస్తున్నది.అదే గనక కార్యరూపం దాలిస్తే తెలివి తక్కువా ఆకలి యెక్కువా అన్నట్టు సుస్థిరమైన వోటుబ్యాంకును ఏర్పాటు చేసుకోలేని భాజపాకు తప్పనిసరిగా నష్టం జరుగుతుంది.ఇప్పటివలెనే భాజపా మీద అధారపడి విస్తరించే బద్ధకపు ధోరణిలో ఉంటే రాష్ట్రీయ స్వయం సేవక్ కూడా నష్టపోతుంది.అయ్యవారు వచ్చేదాక అమావాస్య ఆగుతుందా?హిందువులు అనంతకాలం వరకు మిమ్మల్నే నమ్ముకుని కూర్చుంటారా?
ఈ జమిలి సంస్థలలోని వారు గానీ మిగిలిన హిందువులు గానీ గమనించని కొన్ని ప్రమాదాలను మీకు తెలియజెప్పాలి.ఇల్యూమినాటి, ఫ్రీమాసన్రీ లాంటి రహస్య సంస్థలు ఇప్పటికే ప్రపంచాన్ని బ్యాంకింగ్ సిస్టం ద్వార తమ గుప్పిట్లో పెట్టుకుని న్యూ వరల్డ్ ఆర్డర్ అనే ప్రణాళికలో మొదటి దశని విజయవంతంగా ముగించాయి.1947 ఆగస్టు 15 నుంచి మన దేశం సర్వ సత్తాక సార్వభౌమాధికారం గలిగిన స్వతంత్రమైన గణతంత్ర దేశంగా ఆవిర్భవించిందనేది కేవలం భ్రమ!ఇంగ్లీషువాళ్ళు వాళ్ళ జల్సాల కోసం యుద్ధాల కోసం చేసిన అప్పుని కూడా మనమే చేసినంత నిజాయితీగా స్వీకరించి దాన్ని అణాపైసలతో సహా తీర్చడానికి ఎప్పుడు ఒప్పుకున్నామో అప్పుడే అదివరకటికన్న భయంకరమైన దాస్యంలోకి వెళ్ళిపోయాము - ఆ ప్రణాళిక మొత్తం ఆ రహస్య సంస్థల రచనయే!నాకొక అనుమానం ఏమిటంటే భాజపా నాయకులు ఇవ్వాళ చేస్తున్న ఈ వికృతమైన రాజకీయ క్రీడ కూడా లండను నుంచి చక్రం తిప్పుతున్న వాళ్ళ పనియే అని!మన దేశానికి స్వతంత్రం ఇవ్వడంలో వాళ్ళ ఉద్దేశం కూడా దేశంలో ఎక్కడా సుస్థిరమైన ప్రభుత్వం ఉండనివ్వకపోవటమే - సుస్థిరమైన ప్రభుత్వం ఉండి అభివృద్ధిని సాధిస్తే వాళ్ళ అప్పుని తీర్చేసి స్వతంత్రం అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఇక్కడే కాదు, ప్రపంచంలోని అని దేశాల్లోనూ ఏ ఒక్క ప్రాంత ప్రజలు గానీ సుస్థిరమైన ప్రభుత్వాన్ని నెలకొల్పుకుంటే సహించలేరు వాళ్ళు!వాళ్ళ మొదటి దెబ్బగా రాజకీయ నాయకుల్ని నయాన కానీ భయాన కానీ లోబరుచుకుని వాళ్ళను నైతికంగా దిగజార్చి ఆ తర్వాత క్షేత్ర స్థాయిలో ప్రజల్ని నైతికంగా భ్రష్టు పట్టిస్తారు.
ఆంధ్రప్రదేశ్ విషయంలో భాజపా నాయకుల వ్యూహాన్ని గమనించండి - ఇక్కడ నువ్వా నేనా అన్నట్టు ప్రజల్లో పలుకుబడి ఉన్న చంద్రబాబు జగన్ అనే ఇద్దర్నీ ఒకడి తర్వాత ఒకణ్ణి అసమర్ధుల కింద చూపించి ప్రజలకి ఇక భాజపా తప్ప దిక్కు లేదని నిరూపించాక సుజనా లాంటి గజ్జికుక్కని తమ పార్టీ తరపున గద్దె ఎక్క్కించడం అనేది ఆది నుంచీ భాజపా నాయకుల ప్రకటనల వల్ల తెలుస్తూనే ఉన్నది గదా - అస్థిరత్వం, అస్థిరత్వం, సదా అస్థిరత్వమే వాళ్ళ లక్ష్యం!భాజపా యొక్క స్వఛ్చత మీద భ్రమలు ఉన్నవాళ్ళు మరొక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి - తన పేరుని చంద్రబాబు మంత్రిమండలికి పంపించినప్పుడు అసహ్యించుకున్న పార్టీ తనమీద అవినీతి కేసుల్ని ఎర చూపించి భయపెట్టి ఐటీ దాడులతో హింసించి తన పక్కలోకి లాక్కుందని మనం భ్రమపడుతున్న ఇన్నాళ్ళ తర్వాత సుజనా చౌదరి చిద్విలాసంగా అసలు నామీద కేసులే లేవంటున్నాడు - అంటే, భాజపా వాళ్ళూ సుజనా ముందే కూడబలుక్కుని ఈ భూప్రపంచం మీద ఉన్న ఏ కోర్టులోనూ అతని మీద కేసు లేకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుని కేవలం "అయ్యో పాపం!భాజపా అంత భయంకరమైన దాడి చేస్తే తప్పనిసరై వెళ్ళాడు పాపం!" అని కండువా మార్పిడికి కరతాళధ్వనులతో ప్రోత్సహించే అస్మదీయ చీర్ లీడర్ల ఆమోదం కోసం మ్మీడియాకి రోజుకోసారి వార్తలు వదిలి హైప్ క్రియేట్ చేసిన ఉత్తుత్తి యవ్వారం అన్నమాట - మరీ ఇంత నీచత్వమా!అసలు నేను పదే పదే నొక్కి చెప్తున్నట్టు తమకు ప్రజల్లో మంచిపేరును తెచ్చుకుని తమ పార్టీ కార్యకర్తల ప్రచారం ద్వారా బలం పెంచుకుని తమ పార్టీలోనే సమర్ధుడైన ఒక ముఖ్యమంత్రిని ప్రోత్సహించుకోవడం అనే చక్కని రాజమర్గం వదిలి ఈ సందుగొందుల తుఛ్చమైన దొడ్డిదారినే ఎందుకు నడుస్తున్నారు?వాళ్ళ వయస్సూ వివేకమూ అనుభవమూ అంతేనా, నిజంగా వాళ్ళు తాము కేతిగాళ్ళలా ప్రవర్తిస్తున్నామని తెలుసుకోలేనంత అమాయకులా - ఆలోచించండి!ఇవ్వాళ హిందూత్వం పేరుతో జరుగుతున్నది గాబట్టి వాళ్ళు అస్మదీయులైపోయారు, కానీ ఇదే వ్యూహాన్ని క్రైస్తవ అనుకూల వర్గం వాళ్ళు పన్నితే సుజనా చౌదరి వాళ్ళ వైపుకి వెళ్ళడని గ్యారెంటీ ఉందా?సుజనాయే కాదు అమిత్ షా కూడా వ్యాపారియే కదా - ఇదే ఎత్తుగడ లండన్ బ్యాంకర్లు అమిత్ షా మీద ఇప్పటికే ప్రయోగించారని నా అనుమానం, ప్రయోగించలేదని గ్యారంటీ ఇవ్వగలరా?
ఈ జమిలి సంస్థల నాయకులూ కార్యకర్తలూ మిగిలిన హిందువులూ తేల్చుకోవలసిన విషయం ఒకటే - భాజపా ఇస్తుందో లేదో తెలియని రక్షణ కోసం భాజపా ఎంత నీచానికి ఒడిగట్టినా సహించటమా లేక సనాతన ధర్మం ఏ పునాదుల మీద నిలబడిందో ఆ సత్యం పునాదుల మీద నిలబడి భాజపాని ఒళ్ళు దగ్గిర పెట్టుకుని నడుచుకునేలా నిగ్రహించటమా?
అసతో మా సద్గమయ!
తమసో మా జ్యోతిర్గమయ!
మృత్యోర్మా అమృతం గమయ!!
ఓం శాంతి శాంతి శాంతి!!!