Wednesday, 12 December 2018

అంచె పడవల మీద జంపె దరువుల తోడ హంసలదీవికి వెళదామా, ఓ హంసనడల వయ్యారీ!

పల్లవి:అంచె పడవల మీద జంపె దరువుల తోడ
          హంసలదీవికి వెళదామా, ఓ హంసనడల వయ్యారీ!

చరణం:వూట చెలమలు మనవే!
             రామ చిలకలు మనవే!
             మాట కులుకులు మనవే!
             ప్రేమ మొలకలు మనవే!
||పల్లవి||
చరణం:ఆట ఉరుకుళ్ళు మనవే!
             మట్టి పిచిగూళ్ళు మనవే!
             చూపు కొడవళ్ళు మనవే!
             జామ కొరుకుళ్ళు మనవే!
||పల్లవి||
చరణం:బండ జారుళ్ళు మనవే!
             జంట ఎత్తుళ్ళు మనవే!
             బిగి కౌగిళ్ళు మనవే!
             మరు లోగిళ్ళు మనవే!
||పల్లవి||
చరణం:కేరు కేరింతలు మనవే!
             పొర్లు పొర్లింతలు మనవే!
             సౌరు సోకంతయు మనదే!
             మేలు మేల్బంతులు మనమే!
||పల్లవి||
చరణం:పొర పొచ్చెములు లేని జంట మనదే!
             మని కగ్గములు లేని జంట మనదే!
             వయ సెచ్చుటలు లేని జంట మనదే!
||పల్లవి||

10 comments:

  1. తెరాస గెలిచిన తరువాత ఇలా పద్యాల్లోకి వచ్చేసారే. మీరేమైనా రాస్తారేమో అని ఎదురుచూస్తున్నాం.

    ReplyDelete
    Replies
    1. ప్రత్యేకించి రాయటం దేనికి?

      కుళ్ళిన కొడిగుడ్డుకి శతమానం అని దీవించెయ్యటమే!

      కేసీయార్ జన్మలో విభజన బిల్లుని ప్పూర్తి స్థాయిలో అమలు చెయ్యనివ్వడు - నాది గ్యారెంటీ!మరి,సభలో ఒక బిల్లు పూర్తి స్థాయిలో ఆమోదం పొందకపోయినా ఆమోదం పొంది ఇంత సుదీర్ఘ కాలం పాటు ఆంలుకి నోచుకోకపోయినా ఆ బిల్లుని ఏమంటారో నాకూ మీకూ జైకీ కేసీయారుకీ అందరికీ తెలుసు - బిల్లు మురిగిపోయిందని అర్ధం.

      విభజన బిల్లు పూర్తి స్థాయిలో అమలు కానంతవరకు తెలంగాణ పూర్తి స్థాయిలో ఏర్పడనట్టే!అది ఎప్పటికీ నవజాత శిశువే.దాని అలా వుంచడమే మనకి,అనగా ఆంధ్రావాళ్ళకి శ్రేయస్కరం!

      ప్రస్తుతం సోమనాధ విధ్వంసం గురించి ఒక పోష్టు రాస్తున్నాను.పబ్లిష్ చేశాక మీకెలా ఉంటుందో తెలియదు గానీ నావైపునుంచి మేగ్నం ఓపస్ అని మీచేత అనిపించుకోవాలని ప్రయత్నిస్తున్నాను.

      ప్రస్తుతానికి అదొకటే ధ్యాసగా పని చేస్తున్నాను!

      Delete
  2. చంద్రబాబు తెలంగాణ ఎన్నికల్లో నిలబడి పెద్ద తప్పు చేశాడు.కేసీయార్ పబ్లిక్ డయాస్ మీద దొంగబాబు అంటే తుడిచేసుకుని అమరావతికి వచ్చిపడి తనని అంత మాటన్నవాణి పిల్చి మరీ రాష్ట్రావతరణ శిలా ఫలకం మీద పేరు చెక్కించిన క్షాత్రహీనుడు "నాకు తెలంగాణలో తిరుగు లేదు!" అంటే ఎవడు నమ్ముతాడనుకున్నాడు?

    తను ఆచి తూచి ఎన్నుకున్న 13 సీటలోనూ 2 మాత్రమే గెలవడం అంటే నిజంగా ఇదివరకు అభిమానించినవాళ్ళు కూడా చీ కొట్టడం కిందనే లెక్ఖ!రేవంత్ పార్టీ మారాల్సిన పరిస్థితి వచ్చినా చూస్తూ కూర్చుని ఇన్నేళ్ళు కనీసం కార్యకర్తలకి ధైర్యం చెప్పేపాటి ప్రయత్నం కూడా చెయ్యకుండా ఎలచ్చన్ల ముందు వచ్చి ఏం పీకుదామనుకున్నాడో!

    తన మీద కేసు పెట్టి పబ్లిక్ డయాస్ మీద దొంగ అని పిలిస్తే ఏ మాత్రం రోషమున్నవాడెవడైనా అన్నవాడితో సారీ చెప్పించుకునేవరకు నిద్రపోడు!తనేం చేశాడు?ఎదురు కేసు పెట్టి పరువు దక్కించుకుని పారిపోయి వచ్చాడు.రేపటి ఎన్నికల్లో కేసీయార్ స్వంతంగా పోటీ చేసినా చెయ్యకపోయినా జగన్ తరపున ప్రచారానికైనా రావడం ఖాయం!వాగ్ధాటిలో కేసీయార్ ముందు ఈ బొంగురుగొంతు పెద్దమనిషి నిలబడటం చాలా కష్టం.

    కేసీయార్ 108 అన్నప్పుడు చాలామందికి అంబులెన్స్ గుర్తుకొస్తే నాకు జపమాల గుర్తుకొచ్చింది - జియ్యర్ స్వామి గారి శిష్యుడు కదా,తెలిసే ఆ మంత్రం వొదిలి ఉంటాడు.ఇలాంటి క్రియేటివ్ అయిడియాలు కేసీయార్ దగ్గిర చాలా ఉన్నాయి.ఆంధ్రాలో ఈసారి కూడా చంద్రబాబు బొటాబొటి మెజారిటీ తెచ్చుకుని పరువు దక్కించుకోవడానికే చాలా కష్టపడాల్సి రావచ్చు!

    remidial actions తీసుకోవటమూ అవి పని చెయ్యటమూ కూడా బాబు అదృష్టం మీదనే ఆద్గారపడి ఉన్నాయి - కత్తి మీద సాము తప్పదు!

    ReplyDelete
  3. This comment has been removed by the author.

    ReplyDelete
  4. ఇ జెనరేషన్ పెద్దవాళ్ళు ఒంటరిగా ఉంటూ కాలక్షేపం సొల్లు కబుర్లు చెపుతూ ఉంటే వినేవాళ్ళూ ఆదరించేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మీకు నచ్చినా నచ్చకపోయినా వాళ్ళ వ్రాతలు మొదటి పది స్థానం లో ఉన్నాయి. వాడు ఎంత చెత్తగా బూతులు వ్రాసినా శర్మగారూ మీరు చరిత్రలో నిలిచిపోతారు అంటూ వారి వర్గంలోనివారే కితాబులు కూడా ఇచ్చుకుంటారు. ఒకవైపు బూతులు వ్రాస్తూనే రావణుడి గురించీ దుర్యోధనుడి గురించీ నీతులు చెపుతుంటాడు కూడా ... అయినా చిన్నవాళ్ళకే నీతులు చెప్పాలి కానీ పెద్దవాళ్ళకి నీతులు చెపుతారా ఎవరైనా ?




    ReplyDelete
    Replies
    1. ఒకసారి మీరు అభ్యంతరం వ్యక్తం చేసి నిలదీసినప్పుడు ఆయన క్షమాపణ చెప్పినట్టు గుర్తు - తర్వాత ఎప్పుడూ బూతులు రాసినట్టు నేను చూడలేదు.

      అప్పుడు కూడా పల్లెల్లో మాట్లాడే పలుకుబడిని చూపించినట్టు గుర్తు.ఈ మధ్యనే నేను సారంగలో చదివిన ఒక కధలో మనకి అలవాటు లేని పదాలు రచయిత్రి చాలా ఈజీగా చెప్పేశారు.

      ఒకసారి ఇక్కడే పాత గొడవలో నేను కొంచెం ఓవర్ చేశానని అన్నారు.మరి,మళ్ళీ ఇప్పుడు ఈ కామెంటుకి అర్ధం ఏమిటి?ఆయన కొత్తగా బూతులేమైనా రాశారా?

      Delete
    2. ఇక్కడ వ్రాయవలసిన కమెంట్ మీ బ్లాగులో వ్రాసాను.

      http://myfeelings-rishi.blogspot.com/2018/12/blog-post.html?m=0

      ఆయనెపుడు క్షమార్పణ అడిగాడు ?

      Delete
    3. ప్రత్యేకించి మీకు క్షమాపణ చెప్పలేదేమో గానీ ఆ పోష్టులో ఆ మాటలు వాడటం పొరపాటేనని ఆయన చెప్పిన వివరణ నేను చదివాను. మీరు చదవలేదా?

      ఒక బ్లాగరుగా నేను యాగ్రిగేటర్లను శాసించలేను.కానీ మీరు నన్ను అడిగినప్పుడు ధర్మం మీవైపునే ఉందని చెప్పాను.యాగ్రిగేటర్ల వారు మిమ్మల్ని యాగ్రిగేటర్ల నుంచి తీసెయ్యడం అన్యాయమనే చెప్పాను.

      మరి, బూతులు వాడటం పట్ల అంత వ్యతిరేకత ఉన్న మీరు చిరంజీవి వై నన్ను బూతులు తిడుతూ నాకే బూతుబాబు అని పేరుపెట్టి రెచ్చిపోతున్న అంత సుదీర్ఘమయిన సమయంలో మీరు ఎందుకు కలగజేసుకోలేదు?అతను అలా మాట్లాడుతున్నపుడు కూడా నేను "చిరంజీవి గారూ!"అని సంబోధించి అతనికి మర్యాద ఇస్తున్నా కూడా అతను మొగుణ్ణి కొట్టి మొగసాల కెక్కిన నాపసానిలా ప్రవర్తిస్తున్నప్పుడు మీరు ఏమైపోయారు,ఎక్కడి కెళ్ళారు?

      మీ యుద్ధం బ్రాహ్మణుల మీదా హిందువుల మీదా తప్ప ఇతరుల మీద చెయ్యరా?వారు మీ స్వజనం కావడం వల్లనా!

      శత్రుపక్షంలో ఉన్నానని తెలిసి కూడా మీరు నన్ను న్యాయం అడగటానికి కారణం నేను రాగద్వేషాలకు లోనై తప్పుడు తీర్పులు చెప్పనని మీకున్న నమ్మకం కాదా?మరి,అలా మీరెందుకు ఉండలేకపోతున్నారు?

      P.S:శర్మ గారు కొత్తగా బూతులు రాయనప్పుడు పాత విషయాల్ని పదే పదే కెలకటం భావ్యం కాదని నా అభిప్రాయం.నేను జ్ఞానానికి స్త్రీపురుషభేదం చూడను.శత్రుపక్షంలో ఉన్నా చాలామంది మగాళ్ళ కన్న మీరు తెలివైనవారు. ఒక చిన్న క్లూ ఇచ్చినా అర్ధం చేసుకోగలగడంలో ఒక్కోసారి మీరు నన్ను కూడా మించిపోతారు కాబట్టి ఈ సలహా ఇస్తున్నాను.

      చీరంజీవి వై విషయంలో మీరు నా ప్రశ్నలకి అర్ధం చెప్పాల్సిన అవసరం లేదు.మీరు నేనున్నంత నిష్పక్షపాతంగా ఉండలేకపోతున్నారు అని చెప్పడమే నా ఉద్దేశం.ఇక నా విషయాని కొస్తే తాజ్ మహల్ - తేజో మహాలయ అంశం మీద నా బ్లాగులోనే చెప్పాను.రాముడు సీతని ఎందుకు వదిలేశాడు అనేదానికి చెప్పిన చిత్రమైన కారణం పట్ల నేను అభ్యంతరం వ్యక్తం చేశాక ఆ కామెంటు ఆ బ్లాగులో ఇప్పుడు కనబడటం లేదు.నేనూ నా కామెంటును తీసేశాను.ఇవన్నీ నేను ఎవరినో మెప్పించటానికి చేస్తున్న పనులు కాదు - నా సహజ స్వభావమే అంత!

      మీరూ కేయస్సీ,చీరంజీవి వై కూడా నా అంత నిష్పక్షపాతం ప్రదర్శించగలిగితే అసలు గొడవలే ఉండవు, ఏమంటారు?

      Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

"వేదాలు చదివిన వారు యజ్ఞయాగాదు లందు పశువులను వధిస్తారు" - ఇది నిజమా?

hari.S.babu: గురువు గారూ ! మహాభారతంలో ధర్మవ్యాధుని కధ వస్తుంది కదా . అక్కడ ధర్మవ్యాధుడు కౌశికుడికి ధర్మబోధ చేస్తూ ఒకచోట ," ...