Tuesday, 6 November 2018

వేదాలు అపౌరుషేయం అనడం హేతుబద్ధమేనా?వేదాన్ని హిందూఋషులకి చెప్పినట్టే బైబిలుని కిరస్తానీయులకీ ఖురానును మహమ్మదీయులకీ ఇచ్చి ఉండవచ్చు కదా - అవి కూడా దైవగ్రంధాలే అనుకోకూడదా!

          హిందువుల పవిత్రగ్రంధమైన వేదాన్ని అపౌరుషేయం అంటారు.అపౌరుషేయం అంటే మనుషులు సృష్టించినది కాదు అని అర్ధం. - దాదాపు ప్రపంచంలోని అన్ని మతాలూ తమ మతానికి ఆధారమైన మూలగ్రంధాన్ని దేవుడు తమకు ఇచ్చిన పవిత్రగ్రంధం అంటున్నాయి - మరి,వేదం ప్రత్యేకత ఏమిటి?

          మొదట ఇతర గ్రంధాల చరిత్రని చూసి తర్వాత వేదం గురించి తెలుసుకుంటే వేదం యొక్క ప్రత్యేకత అర్ధం అవుతుంది. ప్రస్తుతం హిందూమతం కాక ప్రపంచంలో ఎక్కువమందికి తెలిసినవి - జుదాయిజం, క్రైస్తవం, ఇస్లాం, బౌద్ధం.వీటిలో ఆ మతం యొక్క మొత్తం అనుష్ఠానం ఆ మతాన్ని స్థాపించిన ఒకే ఒక వ్యక్తి ముఖతః వచ్చినవి.బుద్ధుడు ఆ మతాన్ని స్థాపించకముందు వైదిక ధార్మిక సాహిత్యంలో మంచి పాండిత్యం ఉన్నవాడు. దేవుణ్ణి గురించి చెప్పకుండా పూర్తి లౌకిక మరియు భౌతిక విషయాల ప్రాతిపదికన ధర్మచక్రప్రవర్తన పేరుతో ఒక భిక్షు సంఘాన్ని నిర్మించాడు గనక బౌద్ధులకి దేవుడు ఇచ్చిన గ్రంధం అంటూ ఏదీ లేదు.జుదాయిజం మూలపురుషుడైన అబ్రహాం తోరాని నిర్మించబోయేనాటికి చక్కని సంస్కారం ఉన్న నాగరికుడి వలెనూ ఆధ్యాత్మిక విషయాల్లో పండితుడి వలెనూ కనబడతాడు - తాను జిజ్ఞాస కొద్దీ దేవుణ్ణి కొన్ని ప్రశ్నలు అడిగి జవాబులు రాబట్టుకున్నానని ప్రకటించాడు, తోరా నిర్మాణం కూడా ఒక శిష్యుడికీ అతని గురువుకీ మధ్యన జరిగిన ప్రశ్నోత్తరావళి మాదిరి ఉంటుంది.

          క్రైస్తవుల పాత నిబంధన అబ్రహాము యొక్క తోరాకు అసలుకీ నకిలీకి మధ్య తేడా తెలియనివ్వని రూపమార్పిడితో అలరారుతూ ఉంటుంది!ఇక సారం తెలిసినవారు మహమ్మదీయుల ఖురానును అరబిక్ భాషలోకి తర్జుమా చెయ్యబడిన తోరాకు జిహాదిక్ హింసని కలిపిన పొడిగింపు అని అంటారు.ఆ జిహాదిక్ హింసని ప్రేరేపించే కొత్త చేర్పిడి భాగాల్ని తీసెయ్యడానికి మహమ్మదీయులు పొరపాటున కూడా ఒప్పుకోరు - అది తీసేస్తే తమ మతం జుదాయిస్టు మతానికి నకలు అయిపోతుందని వారికీ తెలుసు.పోనీ జుదాయిజమునే అనుసరించవచ్చు గదా అంటే ఇప్పుడు తమకు దఖలు పడుతున్న ద్రవ్యాకర్షణ తగ్గుతుందని భయం!

          ఇంతకీ ఇవి పుట్టిన తేదీలు ఇటీవలివి గనక ఎప్పుడు పుట్టిందో తెలియని సనాతన ధర్మాన్ని పాటించే మన ముందు నిలబడి తమ మతాన్ని సృష్టించినవారు మనం పూజిస్తున్న రాముడూ కృష్ణుడూ వంటి ఉన్నారో లేరో తెలియని కల్పితవ్యక్తులు కాక వాస్తవ వ్యక్తులు గాబట్టిన్నీ తమ మతగ్రంధాలు వారి అనుభవసారం గాబట్టిన్నీ వాటిలో రక్తమాంసాలు గల వ్యక్తులకు పనికొచ్చే ఆదర్శప్రాయమైన సంగతులు వున్నాయని గొప్పలు చెప్పుకునే ఆ రెండు మతాల ప్రచారకుల గొంతులో పచ్చి వెలక్కాయ పడేటట్టు విశ్వసనీయమైన ఆధారాలను వెదికి చూస్తే జీసస్సూ మహమ్మదూ అనే ఈ  ఇద్దరూ కల్పితవ్యక్తులు అనిపిస్తారు.జీసస్ గురించి ఇటీవలి పోష్టుల్లో చెప్పాను కదా,మహమ్మద్ విషయం కూడా అంతే!ఈ ప్రవక్తల చారిత్రకతని చూడాలంటే వారి మతగ్రంధాలకి బయట ఇతరుల సాహితీరూపాల్లోనూ తిరుగు లేని ఆధారాలైన శిలాశాసనాల్లోనూ చూడాలి.అలా చూస్తే మహమ్మద్ యొక్క చారిత్రకతని రుజువు చేసే సాక్ష్యాలు కూడా చాలా తక్కువ!అయితే జీసస్ కన్న ఇతను అదృష్టవంతుడు - బలహీనమైన సాక్ష్యాలే అయినా సంఖ్యలో కొంచెం ఎక్కువ ఉన్నాయి.వాటిలో కూడా ఎక్కువ భారతీయుల పుణ్యమే!సింధ్ ప్రాంతానికి చెందిన ఒక హిందూ రాజు మహమ్మదుకి వూరగాయల జాడీని కానుకగా పంపించడం ఒకటి చెప్పుకోదగిన సాక్ష్యం,సరిగ్గా మహమ్మదు కూలగొట్టేనాటికి మక్కా తీర్ధయాత్రకి బయల్దేరిన ఒక కేరళ ప్రాంతపు హిందూ రాజు విషయమే కూలగొట్టక మునుపు అది శివాలయం అనడానికి సాక్ష్యం.ఇలాంటి బలహీనమైన సాక్ష్యాలు తప్ప అతను ఎక్కడ పుట్టాడని చెబుతున్నారో ఆ ప్రాంతపు చరిత్రలో అతని ఉనికిని నిర్ధారించే సాక్ష్యాలు లేవు.అదీ గాక తమది కాపీ మతం కాబట్టి కాపీ కొట్టిన ఆనవాళ్లు తెలియకుండా ఉందేటందుకు వాళ్ళే పూనుకుని ధ్వంసం చేసిన చరిత్రలో వీరి ప్రవక్తకి సంబంధించిన ఆధారాలు కూడా నాశనమై వుంటాయి.అసలు భౌతిక అస్తిత్వమే తెలియని పరిస్థితిలో వాళ్లు ఏమి చదువుకుని ఎంత పాండిత్యం సంపాదించి ఇంత గంభీరమైన జ్ఞానసంపద వెల్లివిరిసే పుస్తకాల్ని రచించగలిగారో ఎట్లా తెలుస్తుంది!

          పేరుకి గొప్ప కుటుంబం, డబ్బున్న సాములని తప్పిస్తే ఇద్దర్లో ఎవరికీ చదువు లేదు, పాండిత్యం  లేదు, గురుశుశ్రూష చేసి జ్ఞానం ఆర్జించిన దాఖలాలు లేవు.అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి తను చెప్పదల్చుకునది ప్రజలకి  చెప్పటానికి ఈ అనామక గొర్రెల కాపరీ ఈ నిశానీ బానిసల వ్యాపారీ తప్ప ఇంకెవరూ దొరకలేదా ఆయా మానవ సమూహాల్లో?అసలు దయనీయమైన విషయం, దేవుడు తమ ప్రవక్తలకి చెప్పిన పరమ సత్యాలతో కూడిన దైవగ్రంధాలు అని చెప్పబడుతున్న బైబిలు,ఖురాను ఎంత అసభ్యకరమైన విషయాలతో నిండి వున్నాయంటే కొన్ని దేశాలలో ముఖ్యంగా టూరిస్టుల ఎద్దడి ఉండే నగరాలలో వీటిని బహిరంగ వేదికల మీద చదవటాన్ని నిషేధిస్తున్నారు - మరి,ఇంత అసభ్యతని తీసుకెళ్ళి దేవుడికి అంటగడుతున్నట్టు లేదూ వారి నిర్వాకం!

          అయితే, హిందువులకు పరమ ప్రమాణమైన వేదం ద్యోతకం కాబోయే ముందు వైదిక ఋషులు వీళ్ళ ప్రవక్తల వలె నిశానీలు కాదు,అప్పటికే గురుశుశ్రూష ద్వారా తగినంత జ్ఞానం సంపాదించి తమకు అర్ధం కాని ఒక విషయం గురించి తపస్సు చేస్తున్నవాళ్ళు!"For every meditation there must be a target" అనేది ఇవ్వాళ రోజువారీ ప్రశాంతత కోసం చేసే మామూలు మెడిటేషన్ ప్రక్రియకి ముఖ్యమైన సూత్రం - అట్లాంటిది ఏ లక్ష్యమూ లేకుండా తపస్సు మొదలుపెట్టరు కదా!మరి, అంత శ్రమపడి కనుక్కున్న దాన్ని కూడా "ఇది నా గొప్పే!ఇది నా గొప్పే!నాకు తప్ప ఇంకెవరికీ తెలిసేది కాదోచ్!" అని గొప్పలు చెప్పుకోకుండా "అయ్యా!ఇది నా గొప్ప ఎంత మాత్రం కాదు,ఆ దేవుడే నాకు చెప్పాడు.నేను నిమిత్తమాత్రుణ్ణి" అని ఎందుకు వినయం చూపించారు?

          ఆ సత్యం ద్యోతకం కాబోయే ఒక నిముషం ముందు కూడా మరు నిముషం తమకు ఆ సత్యం ద్యోతకం కాబోతున్నదని  వారికే తెలియని విషయం ఆ పద్ధతిలో సత్యాల్ని దర్శించిన వైదిక ఋషులందరికీ అనుభవైకవేద్యమే గనుక అలా గొప్పలు చెప్పుకుంటే పరిహాసపాత్రులు కావడం తప్ప ప్రయోజనం ఉండదు!"ఆ మతాల ప్రవక్తలకి సాధ్యం కానిది ఈ వైదిక ఋషులకి ఎట్లా సాధ్యపడింది?తమ శ్రమతో సాధించిన దాన్ని కూడా ఉన్నాడో లేడో తెలియని దేవుడికి అంటగట్టటం అబద్ధం చెప్పడం కాదా?కొందరికి మాత్రమే ఇట్లాంటివి సాధ్యం కావడం మనుషుల్లో అసమానతలని పెంపొందిస్తుంది కదా!వీటిలో హేతుబద్ధత లేదు.ఇవన్నీ సుర అనగా కల్లు తాగి వాగిన లొల్లాయి పాటలు మాత్రమే." అనేవాళ్ళకి ఒక నమస్కారం పెట్టి వూరుకోవడం తప్ప మనం వాళ్ళ చేత వేదాలు గొప్పవి అని ఒప్పించడం అసాధ్యం!

          వాస్తవం చెప్పాలంటే ప్రస్తుతం అన్నింటినీ పరిశోధించడానికీ సర్టిఫికెట్లు ఇవ్వడానికీ పనికొచ్చే ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడా వైదిక ఋషులకి సత్యం ద్యోతకమైన పద్ధతిలోనే ఎదిగింది, ఎదుగుతున్నది, ఎదుగుతుంది కూడాను.చిన్న చిన్న ఉదాహరణలు చెప్తే సంశయాస్పదులకి ఎక్కదు గనక కొంచెం పెద్ద సంగతినే చెబుతాను.మన ఆలోచనలూ జ్ఞానమూ కంటికి కనబడవని అంటారు - అది కొంతవరకే నిజం,ఆలోచనలూ జ్ఞానమూ జ్ఞాపకాలూ మెదడులో కొన్ని రసాయనిక చర్యల వల్ల ఉత్పన్నమయే మాలిక్యూల్స్ రూపంలో భద్రపరచబడి ఉంటాయి.ఈ విషయాలని Neuro Physiology స్టడీ చెస్తుంది.ఈ సైన్సు యొక్క ఎదుగుదలలో Otto Loewi చేసిన రెండు కప్పల ప్రయోగం నిరూపించిన సత్యం అత్యంత ముఖ్యమైనది.

          ఇతను చేసిన ప్రయోగం చాలా సంక్లిష్టమైనది - "The experiment consists of a preparation of two frog hearts. The hearts are kept alive and beating in separate beakers containing Ringer’s solution. One of the hearts has the intact vagus nerve connected, which when stimulated is known to slow down the heart. Loewi electrically activated the vagus nerve which slowed down the corresponding heart. He then took some liquid bathing this heart and transferred to the second beaker which contained another heart. The second heart immediately slowed down. The only reasonable explanation to this effect is as follows. When the vagus nerve was activated it released a substance which dissolved in the surrounding liquid. It was this substance that slowed down the first heart. When this liquid was transferred to the second beaker, it slowed the second heart too. Thus the (vagus) nerve acted on the heart not by direct electrical action but by a chemical means."ఇంతకు  ముందు మన చెయ్యి కాలి చుర్రుమనగానే దాన్ని గ్రహించిన మొదటి నాడీ కణం దాని వెనకాల ఉన్న రెండవ నాడీ కణానికి దాన్ని ఎలా అందిస్తుందో తెలిసేది కాదు - ఎందుకంటే, నాడీకణాల మధ్యన ద్రవంతో నిండిన ఖాళీ స్థలం ఉంటుంది!ఇతని ప్రయోగం మొదటి నాడీ కణం ఒక పదార్ధాన్ని ఈ ద్రవంలోకి వదిల్తే  రెండవ నాడీ కణం ఆ ద్రవంలో వ్యాపించిన ఈ పదార్ధం తనకి తగిలినప్పుడు దానికి తగ్గట్టు స్పందిస్తుంఫనే విషయాన్ని రుజువు చేసింది.అయితే అతను ఈ ప్రయోగాన్ని రూపొందించిన విధానం చాలా చిత్రమైనది - తనకు కలలో కనిపించిన దృశ్యాన్ని నిద్ర లేవగానే మొదట ఒక కాగితం మీద రాసుకుని దాన్ని యధాతధం చేసేశాడు!

          మొత్తం కధనం అతని మాటల్లోనే తెలుసుకుంటే మరొక చిత్రమైన విషయం బోధపడుతుంది - "The night before Easter Sunday of [1920] I awoke, turned on the light and jotted down a few notes on a tiny slip of thin paper. Then I fell asleep again. It occurred to me at 6.00 o’clock in the morning that during the night I had written down something important, but I was unable to decipher the scrawl. The next night, at 3.00 o’clock, the idea returned. It was the design of an experiment to determine whether or not the hypothesis of chemical transmission that I had uttered 17 years ago was correct. I got up immediately, went to the laboratory, and performed a simple experiment on a frog heart according to the nocturnal design."చూశారా!Chance indeed favored the prepared mind, with Luck playing her mystical part.జాగ్రదవస్థకీ సుషుప్తికీ తేడా తెలియకుండా అతను శ్రమిస్తున్నాడనేది వాస్తవం,అయినా అతనికి సత్యం గోచరించింది మాత్రం సుషుప్తిలోనే - ఆ ప్రాచీన కాలపు వైదిక ఋషీ ఈ ఆధునిక కాలపు విజ్ఞానీ సత్యాన్ని ఒకలాగే దర్శించారు.అందుకే చాలా ఆధునిక విజ్ఞాన శాస్త్ర పరిశోధనలు వైదిక ఋషుల ఆవిష్కరణల్ని యదార్ధం అని నిరూపిస్తున్నాయి.

          నాలుగు వేల సంవత్సరాల వెనకటిదిగా చెబుతున్న అగస్త్య సంహిత అనే వైదిక విజ్ఞాన గ్రంధంలో విద్యుచ్చక్తిని ఉపయోగించి యంత్రాలను నడిపే విధానం ఉన్నది.ప్రస్తుతం వోల్టా తయారు చేసిన బ్యాటరీ వర్ణనని మర్చిపోయి అగస్త్య సంహితను అనుసరించి మట్టి పాత్రలతో ఘటమాలను ఏర్పరచి విద్యుద్దీపాలను వెలిగించగలిగారు, యంత్రాలను నడిపించ గలిగారు!మన ప్రాచీనులు కట్టిన ఆలయాలు అంత ఎక్కువ శిల్పకళతో కూడి ఉన్నప్పటికీ అంత తక్కువ కాలంలో ఎలా కట్టారో అని చరిత్రకారులూ పరిశోధకులూ వారు ఆశ్చర్యపడి మనల్ని కూడా ఆశ్చర్యపరచటానికి  కారణం మన ప్రాచీనులు విద్యుచ్చక్తిని ఉపయోగించి రాత్రులలో కూడా పని చేశారనీ యంత్రాలను ఉపయోగించారనీ వూహించలేకపోవటమూ నమ్మలేకపోవటమే!ఒకే మహాశిలని నిలువుగా తొలుచుకుంటూ పోయిన కైలాసనాధ దేవాలయ నిర్మాణంలో ఒక విచిత్రం ఉంది.సూర్యకాంతిని అద్దాల ద్వారా గానీ మరే విధంగా గానీ ఉపయోగించుకోలేని చోట్ల కూడా అత్యంత సూక్ష్మమైన వివరాలను ఎట్లా చెక్కగలిగారు?అంత స్థాయిలో పని చెయ్యడానికి అవసరమైన వెలుతురు కోసం కాగడాల్ని వాడితే ఏదో ఒక స్థాయిలో పైకప్పు మసితో పొగచూరిపోవడం ఖాయం - మసితో గోడలూ పైకప్పూ పొగచూరని వెలుతురు విద్యుద్దీపాలు లేకుండా అసాధ్యం!

          అగస్త్యుడనే ఒక వ్యక్తి తను ఆర్జించిన విజ్ఞానంతో తయారు చేసిన దాన్ని వేదానికి ఎట్లా అంటగట్టాలి అనే ప్రశ్న అర్ధం లేనిది - అసలు వేదమే మతగ్రంధం కాదు, విజ్ఞాన శాస్త్రం!మానవుడు భౌతిక ప్రపంచంలో సుఖజీవనం సాగించడానికి అవసరమైన విషయాలే వేదం అంటే ఎవరూ నమ్మలేరు, కానీ అదే నిజం!ఈ లెక్కన హిందువులకి మతగ్రంధం అనేది లేనే లేదు,ఇంక మతం అంటే గ్రంధం ఉండి తీరాల్సిందే అంటున్న వారితో దీన్ని మతం అని ఒప్పించడమే కష్టం, వాళ్ళ మతం కన్న గొప్ప మతం అని ఒప్పించడం మరీ కష్టం!

          అయితే హిందువులు అందుకు ఎంతమాత్రం సిగ్గుపడాల్సిన పని లేదు.యూరుల తోరా యూదుల్ని మాత్రమే తరింపజేస్తుంది,క్రైస్తవుల బైబిల్ క్రైస్తవుల్ని మాత్రమే తరింపజేస్తుంది,ముస్లిముల ఖురాన్ ముస్లిముల్ని మాత్రమే తరింపజేస్తుంది - కానీ వేదం సకల మానవాళినీ తరంపజేస్తుందనేది వ్యాసపరాశరాదిషిర్డీసాయినాధపర్యంతం ఉన్న నా గురుపరంపర పాదాల మీద ప్రమాణం చేసి చెబుతున్న గంభీరమైన సత్యం!ఏది సత్యమైనదో అదే శివమైనదీ అవుతుంది!ఏది శివమైనదో అదే సుందరమైనదీ అవుతుంది!


సత్యం శివం సుందరం!!!

8 comments:

  1. మిత్రులకు దీపావ:ఇ శుభాకాంక్షలు!

    ReplyDelete
  2. baagundi mee vivarana ...... agasthya samhita meeda chEsina parishodhana taalooka vivaraalu ivvagalaraa ?

    ReplyDelete
    Replies
    1. ఆ వీడియో చేసిన ప్రవీణ్ మోహన్ స్వయంగా అగస్త్య సంహిత నుంచే సమకూర్చుకున్నానని చెప్తున్నాడు కదా. అతన్ని అడిగి చూడండి!

      Delete
  3. మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు. అగస్త్య సంహిత గురించి వీడియో బాగుంది.

    ReplyDelete
  4. చిరంజీవి భ్రమ పడుతున్నట్టు అతను నా బట్టలూడదీస్తే సిగ్గుపడి పారిపోలేదు.నేను బ్లాగుల్లోకి తిరిగి రావటమే కాదు, ప్రజ దగ్గిర జరిగే చర్చల్లో కీలకపాత్ర పోషించడానికి కూడా సిద్ధపడి వచ్చాను.

    మొదట నా ప్రతిపాదనల్ని అన్నింటినీ "ప్రజ యొక్క ఉద్దేశం ఏమిటి?అక్కడ జరిగే చర్చలు ఎలా వుండాలి?" అనే ప్రశ్ననీ దానికి సంబంధిన ప్రణాళికనీ ప్రజకే పంపించి మొదలుపెడతాను.కొంత క్లుప్తమైన సమాచారం ఇక్కద ఇస్తాను.కొండల రావు గారు పల్లె ప్రపంచం అనే ఒక సంస్థను నడుపుతున్నారు, కొన్ని కార్యక్రమాల్ని కూడా చేస్తున్నారు,అవేవీ ఎవరో డబ్బు యిస్తే చెయ్యటం లేదు - తన సొంత చిలుమునే వొదిలించుకుంటున్నట్టు అర్ధం అవుతుంది.మంచిపనులు చేసి పేరు తెచ్చుకోవడం తప్పు కాదు,పిచ్చిపనులు చేసి పేరు తెచ్చుకోవడం కూడా తప్పు కాదు - సంస్కృతంలో "ఘటం ఛిద్వా పటం చిద్వా..." అని ఒక శ్లోకం ఉంది.ఇప్పటిది కూడా కాదు,చాలా పాతది.దాని అర్ధం యేమిటంటే కుండల్ని పగలగొట్టయినా సరే బట్టల్ని చింపుకునైనా సరే ఎలాగోలా పదిమంది కళ్ళలో పడాలి అనో అలా పడటం నేరమో ఘోరమో కాదనో అనేటట్లు ఉంటుంది దాని అర్ధం.ఇవ్వాళ గిన్నిసు బుక్కులో ఎక్కడం కోసం కొందరు చేస్తున్న వింతపనులు కూడా అలాంటివే కదా!అలాంటివి వినోదం పరిధిని మించి ఎవరికన్నా హాని చేసేలా ఉంటే మాత్రం సమర్ధించకూడదు.ఉదాహరణకి కుండల్ని పగలగొట్టినప్పుడు ఆ పెంకులు ఎవరికీ గాయాలు చెయ్యకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.ఫోకస్ కోరుకున్నది తను కాబట్టి తన బట్టలు చింపుకుంటే తప్పు లేదు గానీ ఎదటివాడి బట్టల్ని చింపుతానంటే ఎట్లా!

    ప్రవీణూ చిరంజీవి చేస్తున్నది ఇలాంటి ఫోకస్ దురద తప్పిస్తే ఆ కామెంట్లలో ఎలాంటి పాండిత్యమూ హుందాతనమూ లేదు.

    నా వ్యాసంలో నేను 1.ఒక వ్యక్తి ప్రశ్న వెయ్యడానికి ఉండాల్సిన ఉద్దేశం/అర్హత2.ఆ కంటెంట్ విషయంలో ప్రశ్నలు వెయ్యడానికీ జవాబులు చెప్పడానికీ ఇతరులు/వ్యాఖ్యాతలు పాటంచాల్సిన నియమాలు, నిషేధాజ్ఞలు 3.చర్చని ఎవరు ఎప్పుడు ఆపాలి అనేదాని గురంచిన నిబంధనలు.4.చర్చ మధ్యలో గానీ చర్చ పూర్తయ్యాక గానీ ఎవరి వాదన చక్కగా ఉంది ఎవరి వాదన చెత్తగా ఉంది అనే రిపోర్టు ఇవ్వడం గురించి కొన్ని నిబంధనలు పెడతాను.ఏ ఒక్కటీ నేను పెట్టాను. మీరు పాటించాలి అనేలా ఉండవు. ప్రతి నియమానికీ నిషేధానికీ హేతుబద్ధత ఉంటుంది.అది కూడా ఒక టాపిక్ కాబట్టి కొండల రావు గారూ చిరంజీవీ ప్రవీణుతో సహా అందరూ మీ అభ్యంతరాల్నీ సమర్ధనల్నీ చెప్పవచ్చు.నేను టచ్ చెయ్యనివి చెప్పగలిగితే అందరి ఆమోదంతో నా ప్రతిపాదనల్లో కూడా తీసెయ్యాల్సినవి తీసేసి అవి కూడా చేరుస్తాను,ఇంకేం కావాలి?

    ఒకసారి నేను ప్రశ్న వేసి నా ఉద్దేశాల్ని చెప్పి కొండల రావు గారు అనుమతి ఇచ్చాక ఇలాంటి వాళ్ళ ఆటలు సాగవు!కొండల రావు గారు ప్రచురుంచి ఇతరులు ప్రశ్నిస్తుంటే మీకు వ్యక్తిగతంగా జవాబు చెప్తాను అని ఏ కామెంటు గురించి అన్నారో ఆ కామెంటు వెయ్యటానికి ముందే ప్లాను మొత్తం సిద్ధం చేసుకుని ఆ కామెంటు వేశాను.ఆ కామెంటు వెయ్యడమే కాదు చిరంజీవి వై పేరుని టచ్ చెయ్యడం కూడా నా వ్యూహనిర్మాణచాణక్యంతోనే చేశాను!

    P.S:కొండల రావు గారూ!ప్రజలకి ఉపయోగపడాలని మీరు ప్రవేశపెట్టిన చర్చావేదికని నేను ఎన్నటికీ హైజాక్ చెయ్యను.నా సొంత గొప్పని చాటుకోవడానికి మీ బ్లాగుని వాడుకోవటం లాంటి పనులు కూడా ఇక్కద నేను చెయ్యను.ప్రపంచ స్థాయిలో జరిగిన చర్చల్ని పరిశీలించి మీరు నడుపుతున్న చర్చా వేదికని కూడా ఆకర్షణీయంగా ఉంచడానికే నేను ఈ చొరవ తీసుకుంటున్నాను.చర్చల ఏ దశలో అయినా నేను ఒక అభిప్రాయం చెప్పటం,మీకు విజ్ఞప్తి చెయ్యటం మాత్రమే చెయ్యగలను - సాంకేతికంగా నాకు ఇష్టం లేదని ఏ ప్రశ్ననీ ఏ కామెంటునీ తొలగించే అధికారం నాకు లేదు - అవునా?కేవలం ఒక చర్చావేదికని ఎలా నడపాలి అనేది తెలియజెప్పడం కోసమే నేను ఈ చొరవ తీసుకుంటున్నాను.అదికూడా కొన్ని టాపిక్కులకు సంబంధించి మాత్రమే,కొంత కాలం మాత్రమే.

    మరి నాకు ప్రోత్సాహం ఇస్తారా!

    ReplyDelete
  5. నా ప్రతిపాదనల పద్ధతి ఎట్లా ఉంటుందో ఒక ఉదాహరణ చూపిస్తాను: దేవుడు లేదు అని వాదించేవారు గతంలో "లేనిదానికి సాక్ష్యం చూపించటం కుదరదు కాబట్టి బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ మాకు ఉండదు,ఉన్నాడని అంటున్నవాళ్ళే ఉండటానికి సాక్ష్యం చూపించాలి!" అని వాళ్ళే సొంత లాజిక్కు చెప్పేసుకున్నారు.ఐన్స్టీన్ కేవలం ప్రయోగశాలకి పరిమితమైన సైంటిస్టు కాదు.మతం, విద్యావిధానం వంటి విషయాల్లో ప్రసంగాలు చేశాడు,ఎవరైనా ప్రశ్నలు అడిగితే జవాబులు చెప్పాడు.ఐన్స్టీన్ చేశాడు గదా అని అందరు సైంటిస్టుల్నీ ఆ ప్రశ్నలు అడగుతారా! లేబరేటరీలకి మాత్రమే పరిమితమైన వాళ్ళు కూడా ఉన్నారు కదా?మార్క్ ట్వెయిన్ కూడా అంతే.ఇలాంటివి చెయ్యడానికి ఒక పద్ధతి ఉంది.తర్కం అనేది ఇక్కడ ఉంటే లాజిక్ అనేది అక్కడ ఉంది.దాని ప్రకారం దేవుడు లేడు/దైవం లేదు అని ప్రతిపాదిస్తున్న వ్యక్తికి ఇతర్లు అడిగితే ఆధారాలు చూపించాల్సిన బాధ్యత ఉంటుంది!

    ReplyDelete
  6. దేవుడనేవాడు ఉన్నాడా అనే నా పోష్టులో నేను రెండు విషయాల్ని టచ్ చేశాను,అది ఈ చిరంజీవి కూడా చదివాడు.నమ్మకాలతో పని లేకుండా వస్తుగతమైన సాక్ష్యాలతో దేవుడి ఉనికిని తేల్చి చెప్పడమూ మానవజాతిలో దేవుడు ఉన్నాడనే నమ్మకం దశలవారీ ఎదుగుదలని విమర్శించడమూ వేరు వేరు అంశాలు.దేవుడు ఉన్నాడు అని నమ్మినవాళ్ళు కూడా ఆ ఒక్క వాక్యంతో సరిపెట్టుకోలేదు,తరానికి కొంచెం సాహిత్యాన్ని పెంచారు అని ఆ చరిత్ర మొత్తం చెప్పాక కూడా "పాత రాతియుగంలో లేని దేవుడు కొత్త రాతియుగంలో పుట్టడం,ఆ దేముడికి బట్టలు తొడగటం!" అని వాగుతున్నాడంటే ఇతనెంత తెడ్డుగాడో వేరే చెప్పాలా?తెడ్డుని పానకంలో తిప్పాక నాకితే తియ్యగా ఉంటుంది,వూరగాయ జాడీలో తిప్పాక నాకితే కారంగా ఉంటుంది,ఇతనూ అంతే!ఇతను లబలబలు మొదలు పెట్టిన పోష్టు దగ్గిర నుంచి నేను చెబుతున్నది ఒక్కటే - "నా పోష్టు తెలుగులోనే ఉన్నది కదా కొంచెం నెమ్మదిగా చదివి అర్ధం చేసుకో,అర్ధం కాకపోతే ఆడిగి క్లారిటీ తెచ్చుకో!" అని మాత్రమే.జీసస్ పుట్టుక గురించిన మొదటి పోష్టు దగ్గిరే ఈ పోష్టులో ఉన్న సీక్రెట్ ప్లాన్ నీకు అర్ధం కావటం లేదు.ఓవర్ చెయ్యకు అని ఎన్నోసార్లు చెప్పాను.చెప్పిన కొద్దీ "నన్ను ఇన్సల్ట్ చెస్తున్నావు!" అని రె"చ్చిపోవడమే తప్ప కొంచెమన్నా అర్ధం చేసుకున్నాడా?రెండో పోష్టులో తను నాలుగు చోట్ల నాలుగు విధాల మొత్తుకుని తను పీకిన గోంగూర కట్ట యేంటో క్రైస్తవులకి చేసిన మహోపకారం ఏంటో పేజీలు విడదీసి యెడం చేసి చూపించాక మొహం చెల్లకనే గదా ఇన్నాళ్ళు సైలెంట్ అయిపోయింది!అది ఈ తెడ్డుశ్రీకి ఇప్పటికీ అర్ధం కాలేదు గాబట్టే బట్టల సత్తి లెక్కన క్యామెడీ కామెంట్లు వేస్తున్నాడు.చూడబోతే యన్,టి.రామారావు దుర్యోధనుడి గెటప్పుకీ రావణుడి గెటప్పుకీ భుజం మీద అతికించున్న గదలాగా ఇతనికి బట్టలకి అతుక్కుపోయిన ఫెటిషిష్టు రోగం ఉన్నట్టుంది!

    ReplyDelete
  7. నీహారిక కూడా ఇక్కడ చర్చల్లో పాల్గొంటున్నది,తను చాలా కాలం క్రితమే తనతో తేడాగామాట్లాడినవాళని "బూతులు వాడకుండానే మీకు వాతలు పెట్టగలను!" అని చెప్పి దాన్ని చేతల్లో చూపించింది అది చిరంజీవికి ఎందుకు సాధ్యడలేదు - అతనికి ఆ ఉద్దేశంగానీ లక్ష్యం గానీ ఆ సంస్కారం గానీ లేవు గనక!

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...