Monday, 17 September 2018

వాడే వీడు!వీడే వాడు!వీడు కారణజన్ముడు సుమా!

అనగనగా ఒక బాబు!
చిన్న బాబు,హరిబాబు!

మోసం,ద్వేషం లేని విచిత్రసీమ నుంచి!
ప్రేమం,మోదం నిండిన లోకం నుంచి!

ఏదో ఇచటుందని భ్రమిసినాడో!
లేదో,దేవదేవుని లీలావినోదమో!

ఈ భువిమీదకి జారిపడినాడు!
ఆ దివినుంచి వూడిపడినాడు!

ఎటు చూస్తే అటు మాయ!
ఎటు చూస్తే అటు ఛాయ!

నిజమేదో?భ్రమయేదో?
ఆకలేమిటో?ఏడుపేమిటో?
నిదరేమిటో?బెదురేమిటో?
ఇంతేనా?ఇంతేనా?ఇంతేనా?

ఎప్పుడూ పాలిచ్చి లాలించే
అమ్మని మొదటే గుర్తుపట్టాడు!
పక్కనే నుంచుని కులుక్కునే
నాన్నని వెంటనే గుర్తుపట్టాడు!

మెడ నిలిచిన తదాది
నేలమీద ఎప్పుడూ పారాడలేదు -
ఎప్పుడూ ఎవరో ఒకరి చేతుల్లోనే!

ముద్దులు మూటగట్టే చిన్న బాబుకు
అందరు చూడబట్టే బొమ్మను తీయించాలని
కూర్చోబెడితే - కూర్చోడే!
అటు చూస్తాడు!ఇటు చూస్తాడు!
చిటికేస్తే ఒకసారి ఇలా చూసి అలా తల తిప్పేస్తాడు!


బుజ్జిపండు చేతికి చిక్కిందొక చెక్కపండు!
"పండే కదా!" - తెలిసిందే,కొరకాలని అనుకున్నాడు.
"పండు కాదా?" - తెలియందే,చురుకానగ చూశాడు.
కదల్టం ఆపేశాడు,పెదాల్ని బిగించాడు,కన్బొమల్ని ముడేశాడు.
బొమ్మ వచ్చింది!

అప్పుడూ ఇంతే,ఇప్పుడూ ఇంతే,ఎప్పుడూ ఇంతే!
అందరికన్న ఎక్కువ తెలుస్తాడు!
తెలియంది కనిపిస్తే నిలుస్తాడు!
తపిస్తాడు!జ్వలిస్తాడు!శ్రమిస్తాడు!
సాధిస్తాడు!

వాడే వీడు!వీడే వాడు!
వీడు కారణజన్ముడు సుమా!
(18/09/2018)

15 comments:

  1. కారణజన్ములు కానివారేవారున్నారు లోకంలో? అయితే ఆటో, లేకపోతే ఇటో నిల్చోడానికేగా పుట్టిందందరూ!!

    ReplyDelete
  2. ఓ మీపుట్టినరోజా.. యాప్పీ బర్త్ డే!

    ReplyDelete
  3. Thanks to All!
    But my B;day is not now!

    ReplyDelete
  4. Happy birthday to you Hari Babu garu

    ReplyDelete
  5. ఆ కారణం ఏమిటో కూడా చెప్పేస్తే విని తరిస్తాము.

    ReplyDelete
    Replies
    1. అది దేవరహస్యం సుమా!
      పైకి చెప్పరాదు.

      Delete
    2. సరే, ఆ దేవా గాడినే అడుగుతాంలెండి!!

      Delete
  6. వ్యాఖ్యాత మిత్రులకి నమస్కారం!
    నేను ప్రణయ్ అమృతల ప్రేమ వివాహం గురించి ప్రజ దగ్గిర ఒక చర్చని మొదలు పెట్టాను.అయితే,నాకున్న ప్రతికూలత ఏమిటంటే,అక్కడ వేసిన ప్రశ్నకి సంబంధించి మీడియా వార్తలు తప్ప వాస్తవాలు తెలియవు.మిర్యాల్ గూడ వెళ్ళి వాస్తవాలు తెలుసుకునే అవకాశం నాకు.నా విశ్లేషణలో కూడా కొన్ని చోట్ల అవి తప్పేమో అనిపించే అంశాలు ఉన్నాయి.ముఖ్యంగా ప్రణయ్ తలిదండ్రులు విడిపోవటానికి సంబంధించిన కారణాల్లో ప్రణయ్ తల్లికి సంబంధించిన అంశాలు కొంచెం తీవ్రమైనవే!కాబట్టి,అలాంటి వార్తల నిజానిజాలు మీలో ఎవరికయినా తెలిస్తే నిర్ధారించి చెప్పగలరు!

    అయితే ఒకటి, అక్కడ కామెంటులో కావలస్తే మీరు మిర్యాల్ గూడ్ వెళ్ళి తేల్చుకోండి అనటం వల్ల నిజమే అనిపిస్తున్నది గానీ తిరుగులేని ఆధారాలు దొరికితే నయం కదా!అటువంటివి మాత్రమే నాకు కావాలి.

    మళ్ళీ మళ్ళీ ఇలాంటివి పునరావృతం కాకూడదంటే సమస్య మూలాల్లోకి వెళ్ళాలి.అనద్రూ దీన్ని కులహత్యగా చూట్టంవల్ల విషయం తప్పు దారి పడుతున్నదని నా ఆనుమానం.నాకు మాత్రం సంచలనం కన్న సత్యమే ప్రమాణం!

    P.S:దయచేసి మీడియా మాదిరిగానే అవాస్తవాలని ఇవ్వకండి - అవి అబద్ధాలని తేలితే నేనూ మీరూ కూడా అవమానం పాలు కావడం తధ్యం!ప్రతి కామెంటునీ లెక్కలోకి తీసుకుని పబ్లిష్ చేసే అవకాశం లేదు.ముఖ్యమైనవి మాత్రమే పబ్లిష్ చేసే లేదా వాదనలో ఉపయోగించుకునే అవకాశం ఉంది.

    ReplyDelete
    Replies
    1. Nothing justifies a murder. Instead of focusing on the murder and the lack of security for the common man, people are talking about caste discrimination, rights of the young, love of the dad, reasons for the murder etc. The whole issue got digressed because of the vested political interests of various group.

      Delete
  7. https://youtu.be/bbIK0q-ZwG8

    ఈ వీడియో చూస్తే మనకి అసలు విషయం సమస్య మూలాలు తెలిసే అవకాశం ఉంది.

    ReplyDelete
  8. సారంగ లంకె... https://magazine.saarangabooks.com/
    నేను వ్యాఖ్యానించిన కొన్ని వ్యాసాల లంకెలు...
    జమ్మి ఆకులతో కుట్టిన కథ
    https://magazine.saarangabooks.com/%e0%b0%9c%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae%e0%b0%bf-%e0%b0%86%e0%b0%95%e0%b1%81%e0%b0%b2%e0%b0%a4%e0%b1%8b-%e0%b0%95%e0%b1%81%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%95/


    మనుష్యులం కాదు భక్తులం
    https://magazine.saarangabooks.com/%e0%b0%ae%e0%b0%a8%e0%b1%81%e0%b0%b7%e0%b1%81%e0%b0%b2%e0%b0%82-%e0%b0%95%e0%b0%be%e0%b0%a6%e0%b1%81-%e0%b0%ad%e0%b0%95%e0%b1%8d%e0%b0%a4%e0%b1%81%e0%b0%b2%e0%b0%82/

    కాలా రజనీ సినిమాకాదు
    https://magazine.saarangabooks.com/%e0%b0%95%e0%b0%be%e0%b0%b2%e0%b0%be-%e0%b0%b0%e0%b0%9c%e0%b0%a8%e0%b1%80-%e0%b0%b8%e0%b0%bf%e0%b0%a8%e0%b0%bf%e0%b0%ae%e0%b0%be-%e0%b0%95%e0%b0%be%e0%b0%a6%e0%b1%81/

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...