Wednesday, 12 September 2018

భీమా-కొరెగావ్ అల్లర్ల నుంచ్బి అర్బన్ నక్సల్స్ అరెస్టుల వరకు జరిగిన జగన్నాటకం వెనక ఉన్న చిదంబర రహస్యం ఏమిటి?

"కత్తి గొప్పదా?కలం గొప్పదా?" అనే చర్చ ఇప్పటికీ స్కూళ్ళలో నడుస్తూనే ఉన్నదనుకుంటాను!కొన్ని మూర్ఖపు వాదనలు అంతే - ఎప్పటికీ తెగవు.ప్రతి కుర్రవెధవా కత్తినో కలాన్నో గొప్పదని నిరూపిస్తూ కొత్తపాయింటు పడతాడు.ఇదివరకు ఒక కుర్రాడు కత్తి గొప్పదని వాదించి ప్రైజు తెచ్చుకుంటే మళ్ళీ కత్తి గొప్పదని వాదించితే ప్రైజు రాదు - కలం గొప్పదని వాదించే కుర్రాడు కత్తి గొప్పదని వాదించిన కుర్రాడి పాయింటుకు మించిన గొప్ప పాయింటును పట్టాలి!కమ్యునిష్టు మేధావుల్లో చాలామందికి ఈ తరహా క్రియేటివిటీ చాలా ఎక్కువ స్థాయిలో ఉంటుంది.ఏ కమ్యునిష్టు పార్టీ సభ్యుడు/మానవహక్కుల సమర్ధకుడు/మావోయిస్టు కార్యకర్త యొక్క బయోడేటాని చూసినా విద్యార్ధి దశనుంచీ ఇలాంటి ప్రజ్ఞలో ఆరితేరినవాళ్ళుగా కనబడతారు.

ఒక సంస్థ బిర్వహణలో గానీ సమాజగమనంలో గానీ సమస్యలు వచ్చినప్పుడు సరైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు ఇటువంటి ప్రజ్ఞ చాలా అవసరం.కానీ దీనినే బతుకుతెరువుగానో జీవనవిధానంగానో మార్చుకుని అది సాగడం కోసం లేని సమస్యల్ని సృష్టించడం గానీ ఉన్న సమస్యల్ని ఇతరులు పరిష్కరించుతుంటే అడ్డుపడటం గానీ చిన్న సమస్యల్ని పెద్ద సమస్యలుగా వర్ణించి భయపెడుతున్నప్పుడు గానీ పెద్ద సమస్యల్ని చిన్న సమస్యల పేరున కొట్టిపారేస్తున్నప్పుడు గానీ ఇలాంటి వాళ్ళ ప్రజ్ఞ ప్రజలకి ఉపయోగపడుతున్నప్పుడు ఎంత గొప్పగా పొగుడుతామో అంత గటిగానూ విమర్శించాల్సిందే!

అరవయ్యేళ్ళ క్రితం ఖమ్మం జిల్లాలో ఆదివాసీలు పోడు వ్యవసాయం అనే ప్రాచీనమైన పద్ధతిని పాటించుతున్నప్పుడు ప్రభుత్వం కానీ ఇతరులు కానీ వారిని నాగరికత వైపుకు తీసుకురావాలని ప్రయత్నిస్తుంటే "అగ్రవర్ణాల అధిపత్యపు సంస్కృతిని రుద్దడం!" అని అల్లరల్లరి చేసి సాగనివ్వని వాళ్ళు నిన్న గాక మొన్న ఆంధ్రజ్యోతి దినపత్రికలో అనాగరికమైన పోడు వ్యవసాయాన్ని ఆపివేసి దండకారణ్యాన్ని సతతహరితం చేశామని గొప్పలు చెప్పుకున్నారు - మావోయిస్టు సానుభూతిపరులు లేక సిద్ధాంతకర్తలు. యాభై అరవయ్యేళ్ళ ముందు ఇతరులు చెయ్యబొతే తప్పు అయినది ఇవ్వాళ వాళ్ళు చెయ్యడం వల్ల ఒప్పు అయింది!ఇది యాభయ్యేళ్ళ ముందు జరిగి ఉంటే బాగుండేది కదా అనిపించదు, తమ మూలంగానే జరగాలి అన్న స్వార్ధం - అందుకే ఆదివాసీల్ని అన్నేళ్ళ పాటు అనాగరికంగా ఉంచగలిగారు!

ఇవ్వాళ భీమా కొరెగావ్ అల్లర్ల కేసులో పట్టుబడిన వాళ్ళు కూడా ఇలాంటివాళ్ళే - చూట్టానికి చాలా మంచివాళ్ళలా కనబడతారు,అణగారిన ప్రజల కోసం పోరాడుతున్నట్టు హడావిడి చేస్తారు,దానివల్ల ఎన్ని నష్టాలు ఎదురైనా సహిస్తారు,దరిద్రాన్ని భరిస్తారు, జైళ్ళకి వెళతారు - కానీ ఆన్నింటి వెనకా స్వానురాగంతో కూడిన కీర్తికాంక్ష అనేది కొట్టొచ్చినట్టు కనబడుతుంది, తమ ఉద్రేకపూరితమైన ప్రసంగాల్ని విని తమలాగే చావడానికీ జైళ్ళకి వెళ్ళడానికీ ముందుకురికే కుర్రాళ్ళని చూసినప్పుడు వాళ్ళ కళ్ళెలా మెరుస్తాయో చూడండి!

వెనకటి కాలంలో ప్రజాస్వామ్యం అనే మాట అసలు వూహకే రానప్పుడు రాజులు మంచివాళ్ళయితే సంతోషించడం,రాజులు పీడించితే కష్టాలు పడటం జరిగింది,నిజమే!అలాంటప్పుడు కొన్నిచోట్ల ప్రజలు తిరగబడిన సందర్భాలూ ఉన్నాయి,కొన్నిచోట్ల రాజు అసమర్ధతని అవకాశంగా తీసుకుని మంత్రి గానీ సేనాధిపతి గానీ రాజును చంపేసి రాజ్యాన్ని హస్తగతం చేసుకోవడం లాంటివి కూడా జరిగాయి!కానీ ఇవ్వాళ ప్రజల అనుమతితో అధికారంలోకి వెళ్తున్నవాళ్ళని కూడా వాళ్ళకి నచ్చే మార్క్సిస్టు కబుర్లు చెప్పటం లేదు గాబట్టి ప్రజాద్రోహుల కింద తీర్మానించడం మూర్ఖత్వం కాదా!ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి వాళ్ళకన్న మేము మీకు న్యాయమైన పరిపాలన అందించగలం అని చెప్పి అధికారంలోకి రాగలిగిన పద్ధతిని వదిలేసి రహస్యకుట్రల ద్వారా అధికారంలోకి రావాలనుకోవడం అనాగరికం కాదా?

వరవరరావు

ఇతన్ని గురించి ఒక్క మాటలో చెప్పలేం - కవి, జర్నలిస్టు, సాహిత్య విమర్శకుడు, ప్రతిభావంతుడైన వక్త, మావోయిస్టు సిద్ధాంతకర్త!గతంలో చాలాసార్లు జైలుకి వెళ్ళొచ్చాడు - సా.శ 1980లో భారతప్రభుత్వం మీద యుద్ధం చేస్తున్నాడన్న నేరం రుజువై రెండేళ్ళ జైలు శిక్షని అనుభవించాడు.ఈ కేసులో అరెస్టు చేసి తీసుకువెళ్తుంటే "విప్లవం వర్ధిల్లాలి!" అని నినాదాలు చేశాడే తప్ప వీసమెత్తు ఆందోళన కూడా పడలేదు,అలవాటైపోయింది కదా!తనకీ ఈ కేసుకీ సంబంధం ఉన్నట్టు ఆధారాలు లేకపోవడంతో తర్వాత వదిలేశారు.

సా.శ 2014లో “Raging war against India: Deconstructing the notion of India” ననే టాపిక్ మీద నిర్వహించిన చర్చలో పాల్గొనడానికి ముంబై వచ్చి Tata Institute of Social Sciences (TISS) వేదిక మీద చేసిన ప్రసంగంలోనూ Countercurrents.org పత్రిక వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ new democracy కోసం తాము చేసే మావోయిస్టు కార్యకలాపాలు ఎప్పటికీ అగిపోవని చాలా నమ్మకంగా చెప్పాడు - ప్రజల్లో ఉన్న అజ్ఞానమూ దరిద్రమూ వీరికి ఉద్రేకాన్ని ఇస్తున్నంతకాలమూ నవతరం వారసులకి కొదవ ఏముంది?

Countercurrents.org పత్రిక వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని కీలకమైన ప్రశ్నలకి అతను ఇచ్చిన జవాబులు ఇవి:
AC: Where do you see the Dalit movement in Telangana state? KCR has already back-tracked from his promise of a Dalit CM.
VR: Making a Dalit CM is a token thing. He has installed a Dalit as the deputy CM but openly humiliated him in Warangal. Dr Thatikonda Rajaiah, who is from the Madiga community and along with deputy CM also the health minister, had promised of a health university in Warangal. KCR openly contested him saying how could you make such baseless promises and outrightly rejected his promise. KCR can make many promises and the deputy CM, who is a Dalit, can’t make. This negation shows KCR’s feudal attitude towards Dalits. Those who know him never expected he will make a Dalit as CM.
AC: How do you see the progress of the Maoist movement in the new state?
VR: The only future is the Maoist movement as it is the only alternative politics. People are vexed with parliamentary democracy, particularly after coming of Modi sarkaar. Media made Modi the PM and despite his rhetoric of “acche din”, he has hiked the petrol prices and rail charges. People are getting disillusioned with the Centre and all state governments, including Telangana government. A hall meeting against Operation Greenhunt was cancelled in Tirupati, AP. Leaders of mass organizations have been arrested in several places. In this situation I feel Maoist movement will gather strength in Telangana and newer states. 
AC: It has been alleged by many women underage cadres that they were sexually abused by the adult male Maoists…
VR: This is a falsehood created by the media. Many of the cadres who left the armed struggle and surrendered due to health or other reasons were forced to tell these lies to malign the movement. 
AC: So you deny there have been no cases of sexual abuse?
VR: No, there is always an exception. People who have indulged in sexual abuse have been punished severely and many of them have left the movement.
AC: If ban on CPI (Maoist) is lifted, will it join parliamentary politics?
VR: No! certainly not. There will be a big upsurge in the country if the ban is lifted. There will be mass activities. 
AC: What are your views on other Marxist parties like CPM and CPI (ML)?
VR: They are not Marxist parties at all. They have joined the parliamentary line. One can see the example of Left Front government in West Bengal, where it brought globalization policies in Nandigram, Singur. Only thing is when it comes to secular, democratic issues, particularly fighting against Moditva, we may work in mass organizations along with them. But, as long as they adhere to the imperialistic globalization, one can’t call them communist parties. 
AC: Maoist movement has sharply declined in West Bengal since coming of Trinamool government…
VR: It is slowly regaining strength again. There was a major setback after the so-called encounter of Kishenji, but the Maoist forces are becoming strong again. 
AC: What are your views on Muslim fundamentalism?
VR: As put by friend Gudiva Thiango, International monetary fundamentalism is more dangerous than religious fundamentalism. 
AC: Do you believe in democracy?
VR: Yes, I believe in democracy but in the name of democracy bourgeois dictatorship is being practiced in India. So, we are for “New democracy”. 
AC: It has been alleged that G.N. Saibaba, despite being a disabled, was given an Indian toilet deliberately. That is a violation of human rights. But, what about the rights of the government staffers and officials who are being kidnapped and killed just because they are government staffers?
VR: In any war, it’s not the fault of the soldiers, but what is important is which side they are taking. We can’t help it. We are sorry for the foot soldiers but that is the price one has to pay in a war. They are on the wrong side and we are on the side of the people. Right from the days of Kurukshetra to Second World War, this happened. 
అంటే,పార్లమెంటరీ డెమోక్రసీని తిరస్కరించడంలోనూ తాము చంపుతున్నవాళ్ళ పట్ల నిర్దయతో వ్యవహరించడంలోనూ ఆరితేరిన ఘటమేనని తెలుస్తున్నది కదా!

గౌతమ్ నవ్లఖ

ఇతను మానవ హక్కుల కార్యకర్త, ప్రముఖ పాత్రికేయుడు.People’s Union for Democratic Rights (PUDR)లో చాలాకాలం పాటు క్రియాశీలక సభ్యత్వం కలిగిఉన్నాడు.ఆర్ధికశాస్త్ర పరిజ్ఞానం కూడా ఎక్కువే - నక్సలైట్ల హింసాయుత కార్యకలాపాల్ని సమర్ధించడంలో అఖండప్రజ్ఞానిధి!సా.శ 3011లో ఇతను కాశ్మీర్ వెళ్ళాలనుకున్నప్పుడు ఇతని వల్ల అక్కడ పర్శానతతకి భగ్నం కలిగే అవకాశం ఉన్నదని చెప్పి ప్రభుత్వం అనుమతి నిరాకరించింది.

ఇతను సభ్యుడైన  PUDR గతంలోనూ ప్రస్తుతమూ జార్ఖండ్ రాష్ట్రంలో హిందూ మహిళల్ని బెదిరించి,భయపెట్టి,బ్రెయిన్ వాష్ చేసి మతాంతరీకార్ణకి పాల్పడుతున్నదని ఆరోపణలు ఎదుర్కొంటున్న PFI సంస్త మీద ప్రభుత్వం నిషేధం విధించడాన్ని వ్యతిరేకిస్తున్నది - సాకల్ మానవాళికె స్మానత్వం కోసం ఉద్యమించే వీరు అన్ని మతాలనూ సమానంగా చూడాల్సింది పోయి బలవంతపు మతమార్పిడులు చేస్తున్నవాళ్ళని సమర్ధించడం దేనికి?

వరవరరావు మాదిరిగానే ఇతను కూడా నక్సలైట్లు మందుపాతరలు పేల్చి అమాయకుల్ని చంపడాన్ని ఎంతో ప్రతిభావంతమైన విశ్లేషణతో సమర్ధించగలిగిన అఖండప్రజ్ఞానిధి:
---------------------------------------
Posted Apr 23, 2014 by Gautam Navlakha
Places: India
“Maoists target teachers, ambulance” — that was the top headline all across the front page of a national daily, but one has got accustomed to mendacity, couched in righteous indignation. But before passing instant judgment, should we not examine what happened and why?

On 12 April the Maoists detonated two improvised explosive devices (IEDs) in southern Chhattisgarh, one near Ketulnar in Bijapur district, which ripped apart a minibus carrying nine polling staff, including five teachers, returning from duty, the other, which blew up an ambulance carrying five Central Reserve Police Force (CRPF) personnel who had hitched a ride at Darba, apart from a technician and the driver.  A spokesperson of the Dandakaranya Special Zonal Committee of the Communist Party of India (Maoist) has profusely apologized, admitting that the teachers and other employees “died due to our carelessness”.  Maoist cadre apparently targeted the minibus in haste when they “mistook those travelling in [it] . . . for security forces”.  It’s true that security forces, fearing for their lives, often prefer to travel in civilian vehicles alongside civilians, and they even keep changing vehicles to ensure their safety, never bothering about the security of the civilian co-travellers, whose lives they put on the line as a result of such panic.  Indeed, the five paramilitary personnel killed in the ambulance had forcibly hitched a ride on it.

The point we are making is that in a war the rules of engagement are different.  According to the Geneva Convention, combatants should not occupy a school, hospital etc for these sites can then become legitimate military targets of attack.  Thus, destruction of a building which was once a school is not the issue.  What needs to be looked at is whether the school was turned into an armed forces camp or not.  If it was, then by no stretch of imagination are combatants wrong in aiming their guns at such structures.  Answers sought under the Right to Information show that, from July 2000 to July 2012, the Maoists damaged three health centres and impaired 114 schools, of which 92 were battered during 2006-08.   Such statistics need to be put in the proper perspective.

Moreover, the state forces together with what are called “irregulars” or private vigilante outfits have been particularly vicious in perpetrating atrocities on unarmed tribal persons, marked by heinousness of a kind reserved for those deemed to be supporters of the Maoists.  What the paramilitary and state-funded, private vigilante groups and SPOs did in the Chintalnar area of Dantewada district in southern Chhattisgarh between 11 and 16 March 2011 comes to mind.  Or what happened on 28 June 2012 — the CRPF and its CoBRA commandoes fired indiscriminately, killing 19 ordinary villagers of Sarkeguda, Kothaguda and Rajpenta, and put to death with axes those who didn’t die from their bullet wounds.
---------------------------------------

తొలి యవ్వనం నాటినుంచి మొదలుపెట్టి ఇన్ని దశాబ్దాల  పాటు వర్గశత్రునిర్మూలన కోసం అకుంఠిత దీక్షతో పోరాడుతున్న అవిశ్రాంత యోధుడి నుంచి శత్రుస్థానంలో నిలబడినవాళ్ళ మీద కరుణ కోసం ఆశించడం వల్ల ప్రయోజనం ఏమిటి?

సుధా భరద్వాజ్

ఈమె కార్మికోద్యమ నేత,మానవహక్కుల కార్యకర్త - చత్తీస్ గడ్ రాష్ట్రం చేసిన భూసేకరణ విధానం వల్ల నష్టపోతున్న వారి తరపున చాలాకాలం నుంచీ పోరాడుతున్న లాయర్. PUDR యొక్క అనుబంధ సంస్థ అయిన People’s Union for Civil Liberties (PUCL)కి చత్తీస్ గడ్ శాఖలో General Secretary కూడా.

తన అధికారికమైన వెబ్‌సైట్ పేజి మీద, PUCL అఫ్జల్ గురు ఉరితీతను వ్యతిరేకిస్తూ నిరసన ప్రకటించింది - వేముల రోహిత్ ఇంటికొక అఫ్జల్ గురు వంటి తీవ్రవాదిని పుట్టించమనడానికి అఫ్జల్ గురు పట్ల వీరిలాంటివారు కురిపించిన ప్రశంసలే కారణం కావచ్చు! 

Republic TV సుధా భరద్వాజ్ ప్రకాష్ అనే మరొక ఉద్యమకారుడికి రాసిన ఒక ఉత్తరం తమకు దొరికిందనీ దాని ప్రకారం నక్సలైట్లకీ కాశ్మీర్ తీవ్రవాదులకీ కనెక్షన్ ఉన్నట్టు తెలుస్తున్నదనీ ఆరోపించింది.కానీ దానికి అవతలివాళ్ళు కూడా ఒప్పుకునేటంత బలమైన ఆధారాలను చూపించలేకపోవటంతో ఈమె వాటిని కొట్టి పారేశారు.


మనకి నచ్చకపోయినా వాళ్ళొక సిద్ధాంతాన్ని నముతున్నారు,కొన్ని మంచిపనులు చేస్తున్నారు,కొంత హింసని ప్రేరేపిస్తున్నారు,ఆ మంచిపన్లు చేస్తున్నందుకే ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు తమని ఆపడానికి ప్రయత్నిస్తున్నారు గనకనే హింసకి పాల్పడుతున్నామని అంటున్నారు - అలాంటప్పుడు నిరాధారమయిన ఆరోపణలు చేస్తే వాళ్ళ వాదనకి మరింత బలం చేకూరుతుందనే ఇంగితజ్ఞానం ఆర్నాద్ గోస్వామి లాంటివాళ్ళకి లేదు.సిద్ధాంత ప్రాతిపదికన ఎదుర్కోలేక వ్యక్తిగత దాడులకి దిగితే సానుభూతి వాళ్ళకే బలం పెంచుతుంది - అది ఇవతలివాళ్ళకి తెలియకపోవటం వాళ్ళ అదృష్టం!

వెర్నన్ గొంజాల్విస్

ఇతను Communist Party of India (Maoist) సభ్యత్వం ఉన్నవాడు,సా.శ 2007లో Nagpur sessions court ఇతనిని Arms Act, Explosives Act and Unlawful Activities (Prevention) Act (UAPA) కింద నేరం చేశాడని నిర్ధారించి శిక్ష విధించింది.

ఈ కేసుకు సంబంధించిన ప్రాసిక్యూషన్ పార్కారం 9 డిటనేటర్లూ 20 జిలటిన్ స్టిక్కులూ ఒక వాకీ టాకీ ఒక కంప్యూటరూ నక్సల్ సాహిత్యమూ ఇతన్ని అరెస్టు చేసిన స్థలంలో దొరికాయి - అన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు.

నిఘా వర్గాల నివేదిక ప్రకారం ఇతను Maharashtra రేంజిలో మావోయిస్టు పార్టీకి మాజీ సెక్రెటరీ,జాతీయ స్థాయి కేంద్ర కమిటీలో సభ్యత్వం ఉండేది - ఇతని మీద దాఖలైన మొత్తం 20 కేసుల్లో 17 కేసులు బలమైన సాక్ష్యాలు లేకపోవటంతో వీగిపోయాయి.


ఇంతటి మేధావుల్నీ ఒక జీవీత్ కాలంపాటు దరిద్రానికీ శిక్షలకీ ప్రాణభయాలకీ వెరవకుండా తమ లక్ష్యం కోసం పోరాడుతున్న గౌరవనీయులైన వ్యక్తుల్ని వ్యక్తిగతమైన రాగద్వేషాలతో అవమానించడం తప్పు!వీళ్ళలో చాలామంది ప్రభుత్వోద్యోగాలు చేస్తూనో మరేదైనా చిన్నసైజు వ్యాపారం చేస్తూనో కుటుంబాల్ని లేమికి దూరంగా ఉంచినప్పటికీ ఇదే తెలివితేటల్ని స్వార్ధానికి ఉపయోగించుకోదలిస్తే కోట్లకి పదగలెత్తి ఉండేవాళ్ళు. ఏ చెట్టూ లేనిచోట ఆముదపు చెట్లే మహావృక్షాలన్నట్టు చెలరేగిపోతున్న మోదీలూ కేసీయార్లూ చందబాబులూ ఎన్నికల రంగంలోకి దిగి ఎదురు నిలబడితే వీళ్ళ రణనీతి ముందూ వ్యూహనిర్మాణచాతుర్యం ముందూ నిలబడగలరా?ప్రస్తుతానికి అతి తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ ప్రబుత్వంలో ఉన్నవాళ్ళని ఈ స్థాయిలో చికాకు పెట్టగలుగుతున్నారంటే అది వారు సాధిస్తున్న విజయం కిందనే లెఖ్ఖ!

అరుణ్ ఫెర్రీరా

జైలు జీవితం ఇతనికి కొత్త కాదు.ఒకసారి బెయిలబుల్ వారంటుతో అరెస్టయ్యి Maharashtraలోని District and Sessions court of Gadchiroli బెయిల్ ఇచ్చేలోపు నాలుగున్నరేళ్ళు జైల్లో ఉన్నాడు - ఆఖరికి 2014లో అన్ని కేసుల్నీ  కొట్టేసింది కోర్టు.


ఇప్పటి కేసులో Unlawful Activities Prevention Act (UAPA)  కింద అరెస్టయ్యాడు.మీడియాకి ఇతను హాట్ ఫేవరేట్ - దుర్మార్గమైన రాజ్యం యొక్క క్రూరహింసకి బలైపోయిన ఇమేజి ఇచ్చేసింది!

ఫాదర్ స్టాన్ స్వామి

ఇతను Vistapan Virodhi Janvikash Andolan (VVJA) అనే సంస్థను స్థాపించి అణగారిన ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడుతున్నాడు. Jesuit priest  అయ్యుండి కూడా లెక్క లేకుండా ఇలాంటి కేసుల్లో ఇరుక్కుంటూ ఉండటం విశేషమే! ఈ యేడాది మొదట్లోనే Pathalgadi movement సందర్భంలో గొడవల్ని రెచ్చగొడుతున్నాడని ఇతనిమీద FIR దాఖలయ్యింది.


ఒక సీనియర్ పోలీస్ అధికారి ఇతను Elgar Parishad అనే సంస్థతో సంబంధాలు పెట్టుకుని దళితుల్ని హింసాపూరిత కార్యకలాపాల వైపుకి నడిపిస్తున్నట్టు అనుమానాలు వ్యక్తం చేస్తూ తగిన సాక్ష్యాధారాలే దొరకడం లేదనీ చెప్తున్నాశు. ఇతను కూడా PUCL సభ్యుడేనని తెలుస్తున్నది.

ఆనంద్ తెల్తుంబ్డె

ఇతను సకల కళా వల్లభుడు - management professional, writer, civil rights activist, ఇంకా political analyst! మీడియాకి ఇతను వ్యాసాల ద్వార చర్చాల్ ద్వారా చిర పరిచితుడే. Goa Institute of Management దగ్గిర పాఠాలు చెప్పే ఫాకల్టీ మెంబర్ కూడాను. తమ మీద వేసిన కేసు గురించి “None of the people arrested last time and today had the remotest connection with Bhima-Koregaon. As for me, I had publicly written critically about observing the Bhima-Koregaon anniversary, incurring the wrath of Dalits,” అని బల్లగుద్ది చెప్పాడు.

ఒక జీవితకాలం పాటు తమ లక్ష్యం కోసం నిజాయితీగా ఆత్మవిశ్వాసంతో శ్రమించే వీళ్ళకీ అధికారాన్ని చేజిక్కించుకోవడానికీ వచ్చిన అధికారాన్ని కనీసం అయిదేళ్ళ పాటు నిలబెట్టుకోవడానికీ నానా గడ్డీ కరిచే రాజకీయ నాయకులకీ పోలిక ఉందా!వీళ్ళలో ప్రతి ఒక్కరికీ తాము ఎవరికోసం పనిచేస్తున్నారో వాళ్ళనుంచి పూర్తి స్థాయి అభిమానాన్ని పొందుతున్నారు.వీళ్ళలోనే ప్రతిభావంతులైన న్యాయవాదులు ఉన్నప్పుడు వీళ్ళని వ్యతిరేకించేవాళ్ళు వూహిస్తున్న అద్భుతాలు ఏమీ జరగవు.గతంలో రొమిల్లా ధాపర్ బృందం ఆర్య-ద్రవిడ సిద్ధాంతం పేరున అబద్ధాలు చెప్పడం దగ్గిర్నుంచి తమవల్ల చనిపోతున్న అమాయకులను గురించి నిర్దయతో సమర్ధించుకోవడం వరకు తెలిసి చేస్తున్న పనులే కాబట్టి మనం వీరినుంచి పశ్చాత్తాపాలూ మారుమనస్సులూ ప్రాణరక్షణ కోసం వేడికోళ్ళూ ఆశించడం వృఢా!అప్పుడప్పుడు ఒక నలుగురైదుగురు అరెస్టయినా,జైలుకెళ్ళినా,చచ్చిపోయినా అజ్ఞానం,దారిద్య్రం,అంతరువులు సమాజంలో ఉన్నంతకాలం  అజ్ఞానాన్న్నీ దరిద్రాన్నీ అంతరువుల్నీ ధ్వంసం చెయ్యడం అనే జీవితలక్ష్యం ఉన్నవాళ్ళకోసం ఈ చారుమార్గం మూసుకుపోదు!

వీళ్ళని అరెస్టు చెయ్యటానికి కారణమైన సంఘటన మరొక రకమైన దృశ్యాన్ని చూపిస్తున్నది.వీళ్ళలో కొందరి ఇండైరెక్ట్ యాక్టివిటీ ఉండటం వరకు నిజమే గానీ వీళ్ళు మాత్రమే మొత్తం కారణం కాదు - కేంద్రంలో అధికారం చలాయిస్తున్న పార్టీ యొక్క దుడుకుతనం కూడా కీలకమైనదే!

భారతదేశపు గతం కానీ వర్తమానం కానీ భవిష్యత్తు కానీ ఒకవైపునుంచి చూస్తే గొప్పగానూ మరొకవైపునుంచి చూస్తే చెత్తగానూ ఉంటుంది!వ్యతిరేకులు కూడా ఒప్పుకు తీరాల్సిన సత్యం ఏమిటంటే ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన వైదిక సాహిత్యం మానవాళి ఆర్జించిన అన్ని వైజ్ఞానిక శాస్త్రాలకీ మాతృకయైన గణితశాస్త్రాన్ని అందించింది.దీని ప్రాచీనతని నిర్ధారించడానికి కావలసిన సాంకేతిక పరిజ్ఞానం ఇప్పటికీ లేదు.కొన్ని వందల వేల సంవత్సరాల పాటు గురుశిష్యపరంపరలో సాధించిన జ్ఞానాన్ని ఒక పతిమితమైన కాలానికి కుదించడం అసాధ్యం.వ్యతిరేకులు కూడా ఒప్పుకు తీరాల్సిన సత్యం ఏమిటంటే ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన వైదిక సాహిత్యం మానవాళి ఆర్జించిన అన్ని వైజ్ఞానిక శాస్త్రాలకీ మాతృకయైన గణితశాస్త్రాన్ని అందించింది.దీని ప్రాచీనతని నిర్ధారించడానికి కావలసిన సాంకేతిక పరిజ్ఞానం ఇప్పటికీ లేదు.కొన్ని వందల వేల సంవత్సరాల పాటు గురుశిష్యపరంపరలో సాధించిన జ్ఞానాన్ని ఒక పతిమితమైన కాలానికి కుదించడం అసాధ్యం.

చాలామంది వేదం అనగానే దేవుడు,మతం,కర్మకాండ,పరలోకం,పునర్జన్మ,పాపం,పుణ్యం అనేవాటికి పరిమితమైనదని అనుకుంటారు.కానీ మొత్తం వైదిక సాహిత్యంలో ఆ విషయాలకి ప్రాధాన్యత చాలా తక్కువ - ఎక్కువ శాతం ఇహలోకంలో మానవులు సుఖశాంతులతో జీవించడానికి ఆధారభూతమైన విషయాలే ఉన్నాయి!చాలాకాలం క్రితమే శ్రీమత్పరమహంస స్వామి జి.యస్.బి.సరస్వతి గారిచే ప్రచురించబడిన వేదార్ద ప్రకాశిక నుంచి కొన్నింటిని ఎత్తి చూపిస్తున్నాను ఇక్కడ.
ఋగ్వేద సంహిత యందలి ముఖ్యసారం
-------------------------------------------
మండలం - సూక్తం - ఋక్కు/మంత్రం -> విషయం
-------------------------------------------
2-3-6->బట్టలు నేయు విద్య
3-53-16->బండ్లు మరియు రధములు చేయుట
53-6-5->లోహపు పనుల విధానము
1-140-10->స్వర్ణకార విద్య అను బంగారపు పని
2-39-8->యుద్ధవీరులకు కవచములు నిర్మించుట,
8-53-2->మరియు వీనిని ధరించు పద్ధతులు
4-34-6->భుజకవచములు తయారుచేయుట
2-34-3->బంగారమును త్రవ్వి యెత్తెడి విధానము
6-46-11->సేనావ్యూహముల విభాగములతో కూడిన సంగ్రామ విధానము
4-47-1,8->కృషివిద్య
10-101-3,7->బావులను త్రవ్వుట,నాగలి చేయుట,విత్తనములు చల్లుట
10-25-4->నూతులు త్రవ్వెడి విధానము
10-93-13->బావుల నుండి నీటిని తోడి పైరులకు పారించు విధానము
1-27-2->సముద్రముపై నావలు నడుపు విధానము
4-55-6->పరదేశములకు సముద్రయానము చేసి ధనమార్జించు విధానము
1-7-16->ఆయుర్వేదం,ఔషధ విధానము
1-117-13->శల్యవిద్య,విరిగిన అవయవముల చికిత్సా విధానము
10-15-13->నక్షత్ర విద్య,చంద్రగతి,ఋతువుల యొక్క
1-164-148->పరివర్తనమునకు కారణము సూర్యుడని నిర్ధారించుట

యజుర్వేద సంహిత యందలి ముఖ్యసారం:
"సహస్ర శీర్షః పురుష" అనే మంత్రం నుంచి "శ్రీశ్చ తే లక్ష్మీచ" అనే మంత్రం వరకు 22 మంత్రములు
అ.30 మం.1.22 సృష్టి విద్య అయం గౌ
అ.9  మం.6  పృధివ్యాది లోకభ్రమణం
అ 18 మం. 24 ఏకాచ మే తిస్రశ్చమే అని ప్రారంభించి ముఖ్యమైన గణితసూత్ర విశ్లేషణము
అ 10:క్షత్రస్య యోనిరసీ మొదలుకొని "త్రాతారమింద్ర మవితారమింద్రం" వరకు రాజప్రజాధర్మ విషయము
అ. 25 మం.1 "పూషణం వశిష్ఠువా" మొదలు "ఇంద్రస్య క్రోతోదిత్యే పాజస్యం" వరకు గల 7 మంత్రములు శరీర ధర్మశాస్త్రం

సామవేద సంహిత యందలి ముఖ్యసారం:
ఇందులో ఎక్కువ ఈశ్వర భక్తి,స్తుతులు ఉంటాయి.అంతే కాదు, నిగూఢమైన బ్రహ్మవిద్యను గురించిన సాంకేతిక విషయం ఉంటుంది.

అధర్వవేద సంహిత యందలి ముఖ్యసారం:
మహద్యక్షం భువనయ్స -> ప్రశ్న,అనువాకం
"ద్వితీయో న తృతీయశ్చ","నమిదం నిగతం","సర్వే అస్మిక్ దేవాః" మంత్రములు బ్రహ్మవిద్యను గురించి
యత్పరమ మనమం దేవాపితరో మనుష్యాః మంత్రములు సృష్టివిద్యను గురించి
సాయంసాయం గృహపతి అంటూ ప్రతి మానవుడు ఆచరించవలసిన పంచయజ్ఞ విధి,గృహస్థ జీవన ధర్మ విధి

బ్రహ్మవిద్య అనేది కూడా మనస్సుని అదుపులో ఉంచుకోవడానికి పనికొచ్చే యోగం,ధ్యానం లాంటి సాంకేతికాంశాలను గురించిన గంభీరమైన తాత్విక చింతనయే - మూఢనమ్మకాల పేరుతో కొట్టిపారవేయడం కష్టం!అసలు ఇతర ప్రాంతాలలో విద్య అనేది ఉందని తెలియని కాలంలోనే ఇక్కడ ఆయిదు ప్రపంచ ప్రసిద్ధి గాంచిన విశ్వవిద్యాలయాలు ఏర్పడినాయి.ఇవన్నీ బౌద్ధమతం పెరిగిన తర్వాత వారు ఏర్పరచినవి.కానీ అంతకుముందు ఎక్కడికక్కడ గురుకుల సంప్రదాయం నడుస్తూ ఉండేది.నలందలో కేవలం బౌద్ధులే ఆచార్యులుగా లేరు, అంతకు ముందు నుంచి తాము సముపార్జించిన జ్ఞానాన్ని హిందూ పండితులు కూడా నిక్షేపించారు.హిందువులు బౌద్ధులు కొట్టుకు చచ్చారనేది హిందూమతద్వేషులు కల్పించిన కట్టుకధ.అది దలైలామా వంటి వారికి తెలుసు.

నలందకు చేరిన అపారమైన జ్ఞానసంపద భక్తియార్ ఖిల్జీ మూలాన ధ్వంసమయితే మిగిలినవి నిరాదరణకు గురయినప్పుడు అక్కడి సాహిత్యమూ నాశనమైపోయింది.అశ్రద్ధ వల్ల కొంత భోగలాలస నుంచి పుట్టిన నిర్లక్ష్యం వల్ల కొంత పోయింది.తొలినాటి వారు సంకలించి గ్రంధస్తం చేసిన దానిలో నేటికి మిగిలినది చాలా తక్కువ.

సనాతనధర్మం తన ప్రాభవాన్ని కోల్పోవడానికి కూడా కర్ణుడి చావులాగే ఆనేక కారణాలు ఉన్నాయి.వాటిలో  బలమైనది మాత్రం రాజకీయాధికారం చేజారిపోవడమే అని నేను భావిస్తున్నాను.రాజనీతికి సంబంధించి ప్రాచీన వైదిక సమాజం ఎట్లా ఉండేది అని ఆలోచిస్తే అంతా అగమ్యగోచరం!పూ.సా.శ 4500 నాటిదని చెప్తున్న వైదిక యుగానికి చెందిన హరప్పా సంస్కృతికి సంబంధించిన వివరాలూ వైదిక సాహిత్యంలో జనమేజయుడి గురించిన ప్రస్తావనలూ "ఆర్య","దాస" వంటి అపార్ధానికి గురయిన కొన్ని పదాలూ బ్రాహ్మణ,వైశ్య,క్షత్రియ,శూద్ర అనే సామాజిక విభజనలూ తెలియడం తప్పించి పూర్తి రూపం కనబడటం లేదు.ఇప్పుడు మిగిలిన అన్ని విషయాలూ మనకి అనవసరం రాజకీయ సుస్థిరతకు సంబంధించిన విషయాలు మాత్రం చూడాలి.అట్లా చూస్తే తొలినాటి మాతృస్వామిక గణరాజ్యం రక్తసంబంధం గాఢాత్ మీద ఆధారపడి ఐకమత్యాన్ని ప్రదర్శించేదని అనుకోవచ్చు.

స్వసమూహలైంగికసంబంధాన్ని నిషేధించిన తర్వాత పురుషస్వామ్యం బలపడి సోదర గణాల ఐకమత్యం క్రమేణ విస్తరించి జనపదాలు అయిన కాలం నుంచి చారిత్రక విశేషాలు ఎక్కువ తెలుస్తున్నాయి.ఆనాటి షోడశ మహాజనపదాలు పరస్పర కలహాల నుంచి పుట్టిన బలమైన సామ్రాజ్య దశలోనికి నడిచాయి.ఈ రాజులు తమ రాజకీయాధికారాన్ని విస్తృతం చేసుకోవడానికి యుద్ధాలు చేసినా పరిపాలనకు పాటించిన సంప్రదాయాలు ఒకటే గనుక ఒక ప్రాంతం ఎంతమంది రాజుల మధ్య మధ్య చేతులు మారినా ప్రజలకి తేడా తెలిసేది కాదు.ఎక్కడో ఒకరిద్దరు తప్ప ఏ రాజూ నిరంతరం యుద్ధాల్లో మునిగి తేలిన దాఖలాలు లేవు.వ్యవసాయం,వ్యాపారం,పరిశ్రమల వంటి వాటిలో ఉత్పాదకతనీ నాణ్యతనీ పెంచడంలో అందరు రాజులూ పోటీ పడటం వల్లనే ప్రపంచం నలుమూలలా హిందూ సంస్కృతికి సంబంధించిన అవశేషాలు అన్ని చోట్లా బయటపడుతున్నాయి.అబ్రహామిక్ మతాలు పిట్టకమునుపు అసలు మతం అంటే ఏమిటో ఎవరికీ తెలియదు, ప్రపంచ మానవాళి సనాతన ధర్మాన్నే పాటించింది!

సా.శ 10వ శతాబ్దం నుండి చెదురుమదురు దాడులతో మొదలైన ఇస్లామిక్ యోధుల ప్రభంజనం బాబర్ ఢిల్లీ కోటని పట్టడంతో ఈ దేశచరిత్రలో సుస్థిరమైన ప్రభావాన్ని చూపించేటంత స్పష్టమైన రూపం దాల్చింది.ఇతను ఓడించినది కూడా ముస్లిం పాలకుణ్ణే గానీ అతను ఇంత ప్రభావశీలి  అయిఉండేవాడు కాదేమో!చాలామంది హిందూ రాజులలో ఐకమత్యం లేకపోవడం వల్లనే ఇవన్నీ సంభవించాయని అనుకుంటారు.కానీ అది పూర్తిగా తప్పు.అప్పటి ఢిల్లీ నవాబు ఎందుకో తుపాకిమందు వంటి ఆధునికతని సాధించుకోలేదు.వీళ్ళకి సమకాలికుడైన దక్షిణాదికి చెందిన శ్రీకృష్ణదేవరాయలు అప్పటికే అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఒక మహాసైన్యాన్ని నిర్మించుకుని ఉన్నాడు - బాబరు గనక తొందరపడి దక్షిణాదికి వెళ్ళి ఉంటే అతని చేతిలో మట్టికరిచి ఉండేవాడు!

ఉత్తరాదిలో ముస్లిముల పాలన మొదలైన చాలాకాలం వరకు దక్షిణాదిలో వాళ్ళ అలికిడి లేదు.అయితే,ఔరంగజేబు,బహమనీ,ఆదిల్షాహీ,నిజాం షాహీ వంటివాళ్ళ వల్ల దక్షిణాదిన కూడా ప్రవేశించింది,వ్యాపించింది,హిందూమతం ఇష్టమైన పాలకులు హిందూమతాన్నీ జైనమతం ఇష్టమైన పాలకుడు జైనమతాన్నీ బౌద్ధమతం ఇష్టమైన పాలకులు బౌద్ధమతాన్నీ ప్రోత్సహించినట్లుగానే ముస్లిం పాలకులు ఇస్లామునూ ప్రోత్సహించారు.ఈ పాలకులు ముస్లిములే గానీ ఇస్లామిక్ రాజ్యం అనేదాని ముఖ్యలక్షణమైన ఖలీఫాకి నిర్నిబంధమయిన విధేయతని ప్రకటించినట్టు ఆధారాలు లేకపోవటం వల్ల ఇది పూర్తి స్థాయి ఇస్లామిక్ రాజ్యం కాకపోవచ్చు. కొన్ని శతాబ్దాలు గడిచాక పారిశ్రామిక విప్లవం ఇచ్చిన హుషారుతో అన్ని దేశాలనూ ఆక్రమించిన బ్రిటిషర్లు భారతదేశాన్ని కూడా వశం చేసుకుని వలసరాజ్యం స్థాపించారు.


శ్రీకృష్ణదేవరాయల కాలంలోనే ఇక్కడ విడిది చేసిన విదేశీయుల సౌకర్యం కోసం చర్చిలు కట్టిన ఆధారాలు ఉన్నాయి గానీ ఇంగ్లీషువాళ్ళ అధికారం స్థిరపడిన తర్వాతనే క్రైస్తవం ఎక్కువ వ్యాపించిందని తెలుస్తుంది.అంతకుముందు పరిచయం లేని ఒక కొత్త సంస్కృతి తమ తలుపు తడుతున్నప్పుడు "పురాణ మిత్యేవ న సాధు సర్వం!" అని కొత్త సంస్కృతిని ఆహ్వానించేవాళ్ళూ ఉంటారు,"నవీన మిత్యేవ న సాధు సర్వం!" అని తిరస్కరించేవాళ్ళూ ఉంటారు.సంస్కృతులకు సంబంధించి స్వపర భేదం ఉంటుంది కానీ ప్రజల్ని పరిపాలించే రాజకీయాధికారానికి స్వపర భేదం ఉండదు.హిందూ ముస్లిం క్రైస్తవ పాలకులు అందరూ పరిపాలనకి సంబంధించి ఒకే సంస్కృతిని ప్రదర్శించారు.అయితే ముస్లిం పాలకులు ఇక్కడి ఆదాయాన్ని ఖలీఫాకి పంపించలేదు గానీ ఈస్టిండియా కంపెనీ రద్దయి దేశం రాణి అధీనంలోకి వెళ్ళడం వల్ల నిధులూ ఆదాయమూ కూడా లండనుకి తరలించబడినాయి - వలసరాజ్యపు లక్షణమే అది కదా!

ఈ విభిన్నతయే ముస్లిములు కలిసిపోయినంత స్థాయిలో క్రైస్తవులు హిందువులతో కలిసిపోలేక ఎడంగా ఉండిపోవటానికి ఒక కారణం కావచ్చు -క్రైస్తవ మతప్రచారకుల మతమార్పిడులు అగ్నికి ఆజ్యం పోశాయి.ప్రధమ బారత స్వాతంత్య్ర పోరాటం అని పిలుచుకునే సిపాయి కలహం నాడు హిందువులూ ముస్లిములూ కలిసే పోరాడిన చరిత్ర కళ్ళముందు కనబడుతుంది. పాకిస్తాన్ ఏర్పాటును సుగమం చేసుకోవడం కోసం నాయకులు విడగొట్టేవరకు స్వాతంత్య్రోద్యమంలో హిందువులూ ముస్లిములూ కలిసి నడిచారు. కానీ క్రైస్తవులు అంత ఎక్కువ సంఖ్యలో కలిసి రాలేదు.ఉద్యమం నడుస్తున్న కాలంలో అది పెద్ద విషయమని కూడా ఎవరూ అనుకోలేదు - పోనివ్వండి!

ప్రధమ స్వాతంత్య్ర సంగ్రామం నాడు హిందువులతో కలిసి పోరాడిన ముస్లిములు ద్వితీయ స్వాతంత్య్ర సంగ్రామం నాటికి హిందువులతో కలిసిఉండలేమని భీష్మించటానికి కారణమైన వ్యక్తి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్.ఇతని పూర్వీకులు మొఘల్ పరిపాలనా కాలంలో పై స్థాయి ప్రభుత్వానికీ కింది స్థాయి ప్రజానీకానికీ మధ్య శ్రేణి ఉద్యోగులుగా పని చేశారు.అదే వరసలో ఇతని కాలానికి ఆంగ్లేయులు పై స్థాయి వారయ్యారు.అన్ని కాలాల లోనూ అన్ని ప్రాంతాల లోనూ అన్ని రాజ్యాల లోనూ ఈ మధ్యశ్రేణియే చాలా కీలకమైనది.వీళ్ళు మంచివాళ్ళయితే రాజు చెడ్డవాడైనా మంచిపేరు తెచ్చుకుంటాడు. వీళ్ళు చెడ్డవాళ్ళయితే రాజు మంచివాడైనా చెడ్డపేరు తెచ్చుకుంటాడు.యూరోపియన్ ప్రభువులకి ఒక అలవాటు ఉంది.తాము బతిఉండగానే సమాధి మీద తమ గురించి కవితాత్మకమైన పొగడ్తల్ని రాయించి చూసుకుని మురిసిపోయేవాళ్ళు.అదే వరసలో ఒక కవి ఒక రాజు గురించి "ఒక్క చెడ్డ మాట మాట్లాడలేదు!ఒక్క మంచిపని చెయ్యలేదు!" అని రాసి తెచ్చాడు.నిజానికి అందులో కాలగూడని చోట సురసిర కాల్చేటంత భయంకరమైన వ్యంగ్యం ఉంది:-)రాజుందుర్మార్గుడయితే రాసినవాడి తల ఎగిరిపోవటం ఖాయం!రాజుగారు మంచివాడు కాబట్టి "మాట్లాడటం నేను చెయ్యగలిగిన పని కాబట్టి నన్ను నేను కంట్రోల్ చేసుకోగలను!పనులు చెయ్యాల్సింది అధికారులు కాబట్టి వాళ్ళని నేను కంట్రోల్ చెయ్యలేను!" అనేసి వూరుకున్నాడు.

అంత ముఖ్యమైన స్థానంలో ఉన్న ఈ సయ్యదు గారు కూడా మొదట్లో కులీనదర్పపు ఔదార్యం ఒలకబోస్తూ హిందువులకీ ముస్లిములకీ ఇంగ్లీషు చదువుకుని ప్రభుత్వోద్యోగాలు సంపాదించుకుని బాగుపడమని ఉబోస లిస్తూ ఉండేవాడు.ఆయన అహానికి మొదటి దెబ్బ సిపాయి కలహంతో పడింది.ముస్లిములని కాళ్ళావేళ్ళా పడినా వాళ్ళు ఇతని మాట విన్లేదు.తిక్కరేగి ఇంగ్లీషువాళ్ళ మీదనే తిట్లపురాణం ఎత్తుకున్నాడు. మీరే ఈ తిరుగుబాటుకి కారణం అని చాలా హడావిడి చేశాడు.ఆఖరికి ఇంగ్లీషువాళ్ళు లందను రమ్మని కనురంపి సంజాయిషీ అడిగేటప్పటికి తెలివి తెచ్చుకుని ఇంగ్లీషు వాళ్ళకి తిరుగుబాటు వల్ల కలిగిన ఇబ్బందికి మనస్తాపం చెంది అలా విమర్శించానని చెప్పుకుని మర్యాదని కాపాడుకున్నాడు.ఈ ముచ్చట గడిచి మూడ్ మార్చుకునే లోగానే హిందీ - ఉర్దూ కలహంలో ఇతను సమర్ధించిన ఉర్దూకి బదులు హిందీకి సపోర్టు పెరగడంతో ఖాజీ సాయిబు తురకల్లో గల్సినట్టు మరింత రెచ్చిపోయాడు.అప్పటినుంచి హిందువులకి తూ చ్చి చెప్పేసి ముస్లిముల కోసం మాత్రమే పనిచేస్తూ స్కూళ్ళూ,కాలెజిలూ,ఆలీఘర్ ముస్లిం యూనివర్సిటీ లాంటివాటిని స్థాపించి పోషించి సా.శ 1930ల కల్లా స్వతంత్రం వస్తే ప్రధాని పదవికి పోటీ పడే స్థాయిలో ముస్లిం నాయకుల్ని తయారు చేశాడు!

ఏమైతేనేం, సా.శ 1947లో బ్రిటిష్ ఇండియా అనే పేరుతో ఉన్న దేశం అప్పటికి గుర్తింపు పొందిన ప్రపంచంలోని అన్ని దేశాలూ ఒప్పుకున్న ఖచ్చితమైన సరిహద్దులతో ఆధునికమైన పార్లమెంటరీ డెమోక్రసీని పాటించే ఇండియన్ రిపబ్లిక్ అవతరించింది!

అయితే, పోరాటంలో పాల్గొని స్వతంత్రం తీసుకొచ్చిన కొద్దిమంది నాయకులు అయినంత స్థాయిలో ప్రజానీకం ఎడ్యుకేట్ కాలేదు - నిన్నటి మొన్నటి పాలకుల వల్ల అలవాటయిన ఫ్యూడల్ మనస్తత్వం నుంచి బైటికి రాలేదు.తమ స్వైరకల్పనలలో తాము మునిగి తేల్తున్న స్వాతంత్య్రానంతర ప్రభుత్వాధినేతలు ఈ వైరుధ్యాన్ని పట్టించుకోలేదు - అన్నింటినీ "గిసే గిసే గిర్ జాయేంగే..." అని కొట్టి పారెయ్యటం ఆనవాయితీ అయిపోయింది అందరికీ.తమ పాటికి తాము న్యాయంగా పరిపాలిస్తూ అభివృద్ధిని నమోదు చేస్తూ ఉంటే చాలు సమస్యలు వాటంతటవే పరిష్కారం అయిపోతాయని అనుకున్నారు.కానీ అలా జరగలేదు.వారి కృషి వల్ల ఎంతో కొంత అభివృద్ధి జరిగిన మాట వాస్తవమే గానీ సామాజికుల మనస్తత్వాలు నిరంతరాయమైన అభివృద్ధిని సాధిస్తూ అభివృద్ధి ఫలాల్ని అందరూ పంచుకునే విధంగా ఉండటానికి బదులు ఒకరితో ఒకరు పోట్లాడుకుంటూ అభివృద్ధిని కుంటుపరుస్తూ మళ్ళీ పరాధీనత తప్పదేమోనని భయపడే విధంగా తయారయ్యాయి.

ప్రతి సంవత్సరం జనవరి ఒకటిన దేశం మొత్తం ఒక రకమైన వాతావరణలో ఉంటే భీమా-కోరేగావ్ ప్రాంతంలో మరో రకమైన వాతావరణం కనబడుతుంది.సా.శ 1818 జనవరి 1న ఇగ్లీషు సైన్యంలో ఉన్న కొద్ది మంది మెహర్ సైనికులు రెండవ బాజీరావు అధ్వర్యంలో నడిచిన పెద్ద సైన్యాన్ని వోడించారు.ఇంగ్లీషువాళ్ళు దానికి గుర్తుగా అక్కడొక విజయస్తంభం నిర్మించి మెహర్ వీరుల పేర్లని చెక్కించారు.ఇంగ్లీషువాళ్ళ పాలనలో ఏమి జరిగిందో గానీ స్వతంత్రం వచ్చాక అంబేద్కరీయులు దీనిని సామ్రాజ్యవాదం-జాతీయవాదం కోణం నుంచి గాక బ్రాహ్మణాధిపత్యం-దళితోద్యమం అనే కోణం నుంచి తాము చూసి ఇతర్లకి చూపించడం మొదలుపెట్టారు.

తమ కులంలోనో మతంలోనో గొప్ప వీరులు గానీ గొప్ప నేతలు గానీ ఉంటే వారిని స్మరించుకోవడంలో ఎటువంటి తప్పూ లేదు.మహాత్మా గాంధీ ఇంగ్లీషువాళ్ళు మనకి అన్యాయం చేస్తున్నారని దితీయ స్వాతంత్య్ర సంగ్రామం పేరుతో వారిని ఈ దేశం నుంచి వెళ్ళగొట్టాలని పోరాడుతున్న సమయంలోనే రెండవ ప్రపంచ యుద్ధం ముంచుకొస్తే భారతీయుల్ని ఇంగ్లీషువాళ్ళ తరపున యుద్ధానికి వెళ్ళమని పిలుపు ఇచ్చాడు.ఇంగ్లీషువాళ్ళు అడిగారో లేదో తెలియదు - తమ మీద పోరాడుతున్నవాళ్లని తమ తరపున యుద్ధానికి వాళ్ళు ఎట్ల పిలుస్తారు?వాళ్ళు ఒప్పుకున్నారో లేదో తెలియదు గానీ యుద్ధంలో సహాయం చేస్తే యుద్ధం పూర్తయ్యాక ఇంగ్లీషువాళ్ళు స్వతంత్రం ఇస్తామన్నారని అనుకున్నారు.యుద్ధం అయ్యాక ఇంగ్లీషువాళ్ళు స్వతంత్రం ఇవ్వలేదు.అయినా గాంధీ గారి పిలుపుకి స్పందించి ఆ యుద్ధంలో పాల్గొన్నవాళ్ళు నిజాయితీగానే పోరాడారు.కొందరు అమరు లయ్యారు,కొందరు క్షేమంగా తిరిగొచ్చారు.వారిని స్మరిస్తే పాప్యులారిటీ రాదు కాబట్టి వారు అనామకులుగానే మిగిలిపోయారు!

ఎవరూ లాభం లేకుండా ఏ పని చెయ్యనప్పుడు అంబేద్కరీయులు తమ లాభం కోసం ఆ మెహర్ సైనికుల్ని వాడుకుంటే తప్పేమిటి?చూసీ చూడనట్టు పోవచ్చుగా!ఇన్ని వందల యేళ్ళ పాటు ఆ కార్యక్రమం చిన్న చిన్న సంఘటనలు తప్పించి పెద్ద సంచలనం రేకెత్తించకుండా జరిగిపోయి ఈ సంవత్సరం మాత్రమే ఎందుకు ఇంత భీబత్సాన్ని రగిలిస్తున్నది?ఇన్నేళ్ళు మామూలుగా జరిగినప్పుడు ఇవ్వాళ జరిగినది కాకతాళీయమైన ఒక సంఘటనకి అనుకోకుండా చెలరేగిన విధ్వంసమా!

నేను ఇదివరకే చాలాసార్లు చెప్పాను - స్వతంత్రం వచ్చిన దగ్గిర్నుంచీ జరిగిన ఏ ఒక మతకలహమూ ఏ ఒక  సామాజిక విధ్వంసమూ అనుకోకుండా జరిగినది కాదని - ఇక్కడ కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన కొందరు వ్యక్తులు పధకం ప్రజారం నడిపించిన దుష్ట రాజకీయం ఇది!

సా.శ 2018వ సంవత్సరం అసలు "బ్రాహ్మణ పీష్వాల మీద మెహర్ సైనికులు విజయం సాధించిన యుద్ధం" జరిగి 200 యేళ్ళు అవుతుంది.దానితో ఈసారి జనసమీకరణ పెద్ద స్థాయిలో జరుగుతుందనీ ప్రసంగాలలో తీక్ష్ణత పెరుగుతుందనీ దానిమీద ఆసక్తి ఉన్నవారు ముందునుంచీ వూహిస్తున్నదే!వూహించిన విధంగానే,దళిత బహుజన మేధావులు ఆనాటి పీష్వాల స్వస్థానం అయిన Shaniwar Wada అనే చోట "Elgar Parishad" పేరుతో బహిరంగ సభ జరిపారు.ప్రసంగాల లోని విషయం మోదీ ప్రధానిత్వంలో నడుస్తున్న భాజపా హిందూత్వ రాజకీయాల్ని "నయా పీష్వా వాదం" అని యుద్ధానికి పిలుపు ఇవ్వడమే!

మోదీ ముఖ్యమంత్రిత్వంలో జరిగిన గుజరాత్ అల్లర్ల సమయం నుంచీ ఈ మాట వినబడుతూనే ఉన్నప్పటికీ ఈసారి బలంగా వినపడటంతో భాజపా శ్రేణూలకి తగలరాని చోట మూలాలు కదిలిపోయేటంత దెబ్బ తగిలింది.పైకి ఎంత హిందూత్వం కబుర్లు చెప్పినా ఒక బలమైన వోటు బ్యాంకు తమకి దూరం అయితే గెలుపు కష్టమే కదా,అసలు ఏ రాముణ్ణి నిచ్చెనమెట్టుగా వాడుకుని అధికారంలోకి వచ్చారో ఆ రాముణ్ణే కూరలో కరివేపాకుని తీసేసినట్టు మర్చిపోయింది కూడా అందుకే కదా!

ఆ పరిస్థితి కాంగ్రెసుకి గనక వస్తే వెంఠనే దేబిరింపుల సెక్షన్ ఓపెన్ చెస్తుంది,"మేం మీకేం అపకారం చేశామండీ!మా పొట్ట కొట్టకండీ!మీకేం కావాలో చెప్పండీ!ఏది కావాలన్నాఇస్తామండీ!అధికారం మాత్రం లాక్కోవద్దు,లాక్కోవొద్దు,లాక్కోవొద్దు!" అని ఘొల్లున యేడుస్తూ కాళ్ళ బేరాని కొచ్చేస్తుంది.కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు అలాంటివాళ్ళు కాదు,బతిమిలాడుకుని పని సాధించుకోవటం కన్న బెదిరించి పని జరిపించుకుని గర్వించడంలో ఉన్న మజా యేమిటో తెలిసినవాళ్ళు - వెరైటీ కోసం రూటు మార్చారు.గొడవలు జరిగాయి.సంచలనం మొదలైంది.దళిత నేతలకీ కావలసింది అదే కద - ఇరు వర్గాలూ సంచలనం నుంచి ఎవరి లాభం వాళ్ళు పిండుకునే ప్రయత్నాలు చేశారు.

ఇది అనుకోకుండా ఒక నిప్పురవ్వ  లాంటి చిన్న సంఘటన జరిగి అది పెద్దది కావడం కాదు.పోలీసుల పరిశోధన తర్వాత తేలిన విషయం యేమిటంటే,కేంద్రంలో ఇప్పుడు అప్రతిహతమయిన అధికారం అనుభవిస్తున్న పార్టీకి చెందిన స్థానిక నాయకులు పధకం ప్రకారం చేసిన పనుల వల్లనే గొడవలు జరిగాయి!డిసెంబర్ 29న Bhima Koregaonకి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న Vadhu Budruk గ్రామంలో Govind Gopal Mahar సమాధి దగ్గిర ఒక సైన్ బోర్డు వెలిసింది.ఈ మహర్ కులస్థుడు చత్రపతి శంభాజీ మహరాజుకి అంత్యక్రియలు జరిపించాడట - అదీ ఔరంగజేబు ఆజ్ఞని ధిక్కరించి!అయితే,స్థానిక మరాఠాలలోని ఒక కుటుంబం తమ పూర్వీకులే అంత్యక్రియలు జరిపించారని నమ్ముతారు - అంటే,"ముల్లును ముల్లుతోనే థీయవలె!వజ్రాన్ని వజ్రంతోనే ఖోయవలె" అన్నట్టు మెహర్లని మహర్లతో కొట్టడానికి అల్లుతున్న కొత్తకధ అని తెలియడం లేదూ!మరాఠాలు దీన్ని తప్పుడు చరిత్ర అంటూ గొడవ మొదలుపెట్టారు.అదే రోజు సాయంకాలం దళితులు ఆ బోర్డును ధ్వంసం చేసినందుకు మరాఠాల మీద SC/ST Prevention of Atrocities Act కింద కేసు ఫైల్ చేశారు.పోలీసులూ స్థానిక నాయకులూ ఇరుపక్షాల్నీ కూర్చోబెట్టి బతిమిలాడుకోవటంతో అప్పటికి సద్దుమణిగిన ఉద్రేకాలు మళ్ళీ  పొంగుకొచ్చి ఏడుగురికి గాయాలయ్యాయి,ఒకరు ప్రాణాలు కోల్పోయారు.

పోలీసులు స్థానికుల అభిప్రాయాల్ని సేకరించి జరిపిన విచారణలో radical Hindutva leader  అయిన Milind Ekbote మరియు Sambhaji Bhide ‘Guruji’. అనుచరుల ప్రమేయం ఉందని తేలింది.Ekbote తరచు  సమాధిని సందర్శిసూ ఉండటం,దాన్ని పరిరక్షించడం కోసం ఒక కమిటీని ఏర్పాటు చెయ్యటం అందరికీ తెలిసిన విషయమే!ఈ రకమైన విషయాలు బయట పడటం వల్ల అధికారంలో ఉన్న హిందూత్వ పార్టీకి లాభం గూబల్లోకి వచ్చి బోల్డు ఖోపం వొచ్చేసింది.తమ బొక్కని కప్పుకోవటానికీ అమాయక ప్రజల్ని కొంతకాలం దృష్టిని ఈ గొడవ నుంచి మళ్ళించటానికీ "అర్బన్ నక్సల్స్ ఏరివేత" నాటకం మొదలు పెట్టారు!అయితే, వాళ్ళలోనే మంచి లాయర్లు ఉండి,జైలుశిక్షలకి కూడా వెరవ్ని మొండితనం ఉండి,వీళ్ళ కన్న పదిరెట్లు పోరాటపటిమ ఉన్న నక్సలైట్లని వీళ్ళు ఏమీ చెయ్యలేరు, అది వీళ్ళకీ తెలుసు!భీమా-కొరెగావ్ అల్లర్లలో తమ ప్రమేయం ఉందనే విషయం మరుగున పడిపోతే చాలు ఈ అధికార బధిరాంధక శవాలకి!

దళిత నాయకులు ఆంగ్లసైన్యం తరపున పోరాడిన వీరుల్ని వారి శౌర్యాన్ని మెచ్చుకోవడం వరకు చేస్తే ఎలాంటి అభ్యంతరమూ లేదు.కానీ ఆ మహత్కార్యాన్ని తీసుకొచ్చి ఇవ్వాళ్టి మనుగడ కోసం నడుపుకుంటున్న రాజకీయాలకి వాడుకోవటం నీచత్వాలలోకల్లా పరమ నికృష్టమైనది!ఒక సైన్యం ఇంకో సైన్యాన్ని గెలవడానికి అనేకమైన కారణాలు ఉంటాయి.ఆంగ్లేయుల తరపున పోరాడిన  మెహర్లకి ఆంగ్లేయులు ఇచ్చిన శిక్షణ పీష్వాలు తమ సైనికులకి ఇచ్చిన శిక్షణ కన్న అధునాతనం అయినా మెహర్లు పీష్వాలని ఓడించటం సాధ్యమే.సైన్యాన్ని నడిపించే యుద్ధవ్యూహాలు పటిష్టమైనవి అయినా కూడా సైనికుల సంఖ్యతో సంబంధం లేకుండా గెలుపు సాధ్యమే.ఒకోసారి రెండు సైన్యాలూ తలపడిన యుద్ధభూమి కూడా క్రికెట్ మ్యాచిల్లో పిచ్ మాదిరి ఓడిపోతుందనుకున్న సైన్యానికి గెలుపుని సాధించి పెడుతుంది.ఇవ్వాళ్టి దళిత నాయకుల్లో అమాయకులు ఎవరూ లేరు,వారూ విద్యావంతులే,నిజాలు వారికీ తెలుసు. లాభం కోసం ఇలా "సగం నిజం-సగం అబద్ధం->పూర్తి నిజం!" అనే పద్ధతిని ఫాలో అవుతూ ఉంటారు.

ఈ మధ్యనే తూర్పుగోదావరి జిల్లా శ౦ఖవర౦లో ఒక ఇన్సిడె౦ట్ జరిగింది.ఒక కాలనీలో పెళ్ళి వేడుక జరుగుతుంది. ఆ వేడుకకి అటె౦డ్ ఆయిన వాళ్ళలో కొ౦దరికి మాటా మాటా వచ్చి కొట్లాటకి దారితీసి ఇద్దరిని సజీవ దహనం చేసి చ౦పేశారు. మర్నాడు న్యూస్ లో ఒక ఐటమ్ గా ప్రచురితమై రెండవ రోజుకి మరుగునపడిపోయి౦ది. మూడవ రోజున మర్చిపోయారు.ఇదే గొడవ వేరే సామాజిక వర్గానికి, వీళ్లకు వచ్చి పై ఇన్సిడె౦ట్ జరిగియు౦టే ఈ వార్త రెండు రోజులకు మరుగున పడి ఉండేదా?

దళిత నాయకులు మినిమ౦ ఓ నెల రోజులు గలీజ్ చేయకుండా ఉండడం జరుగుతుందా? ధర్నాలు చేయకుండా ఉ౦టాయా? కమిటీలు వేయకుండా ఉ౦టాయా? సి.ఎమ్ రాజీనామా కోరకు౦డా ఉ౦టాయా?అ౦టే ప్రాణం ఎలా పోయింది అన్నది కాదన్న మాట ముఖ్య౦. ఎవడి చేతిలో పోయి౦దనేది ముఖ్య౦ అన్న మాట!

లాభానికీ ప్రయోజనానికీ ఇంత గట్టిగా అంకితమైనవాళ్ళ దగ్గిరకెళ్ళి "మనస్సాక్షి,పాపభీతి" అనే సొల్లుకబుర్లు చెప్పి వాళ్ళని దారికి తెచ్చుకోగలమన్న భ్రమ నాకైతే లేదు.అప్పటి బ్రాహ్మణులు మా పూర్వీకుల్ని పుట్టుకని బట్టి అవమానించారు అని అంటూనే ఇప్పటి బ్రాహ్మణుల్ని పుట్టుకని బట్టి దూషించడం అంటే నీ అశుద్ధాన్ని నువ్వే తినడం అని వాళ్ళకి అర్ధం కావాలి,ఎప్పటికి అర్ధం అవుతుంది?


మనం చిన్నప్పుడు చదువుకున్న చరిత్ర పుస్తకాల్లోని యుద్ధాలని చూసినా చాలు ఏ యుద్ధమూ "అణిచివేతకి గురయిన మెహర్లు బ్రాహ్మణుల మీద గెలిచి తీరాలనే ఆవేశంతో యుద్ధం చెయ్యడం" లాంటి ఒకే ఒక కారణం గెలుపుని తెచ్చిపెట్టదని తెలుస్తుంది.అధికారంలో ఉన్న వెసులుబాటును ఉపయోగించుకుని ఇవన్నీ ప్రజలకి క్షీత్రస్థాయిలో చెబితే క్రమంగా ఈ "మెహర్ల విజయం దళిత విజయం" అనే వాదన బలహీన అపడుతుంది.కానీ ఇలాంటి పనులు వాళ్ళు జనవరి 1న హడావిడి చేస్తారు గాబట్టి మనం డిసెంబరులోనే హడావిడి మొదలు పెడదాం అనే మనస్తత్వంలో ఇన్నవాళ్ళు చెయ్యలేరు.కేరళ వరదలకి దేశంలోని ప్రతివాడూ అయ్యో అంటుంటే ఒక కుయ్యా "వాళ్లు గోమాంసం తింటున్నారు,అందుకే వరదలు వచ్చాయి,వాళ్ళకి సాయం చెయ్యకండి!" అని అంటున్నవాళ్ళని మనం మళ్ళీ మళ్ళీ గెలిపిస్తూ ఉంటే  మళ్ళీ మళ్ళీ ఇలాంటి భీబత్సాలు జరుగుతూనే ఉంటాయి.

ప్రపంచం మొత్తాన్నీ వర్గరహితసమాజం అనే అద్భుత వ్యవస్థలోకి నడిపించగలమనే కమ్యూనిష్టులూ దళితుల కోసం అహరహం శ్రమిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ఆయా సంస్థల చైర్మన్లూ అరచేతిలో స్వర్గాలు చూపించే మ్యానిఫెస్టోలని ప్రకటిస్తున్న రాజకీయ నాయకులూ నిజాయితీగా ప్రజల కోసం కాకుండా అస్మదీయులకు సంపదల్ని దోచిపెట్టడానికే పరిశ్రమిస్తున్నారు.అన్నింటిలోనూ భాజపా వ్యూహమే మరింత ప్రమాదకరమైనది!ఇటు హిందువుల వోట్లతో అధికారానికి వచ్చి హిందువుల కోసం ఏమీ చెయ్యకుండా వీళ్ళని మోసం చేస్తూనే మైనార్టీల వోట్ల కోసం వాళ్ళనీ చీల్చుతూ దేశాన్ని అంతర్యుద్ధం వైపుకి నడిపిస్తున్నది - కాబట్టి ఈసారి బలాన్ని తగించి పొగరును దించాలి.వోడించి ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా తప్పు లేదు.

వ్యాసపరాశరాదిషిర్డీసాయినాధపర్యంతం ఉన్న నా గురుపరంపర పాదాల సాక్షిగా నేను చెబుతునది ఓకటే - తను తప్ప దేశానికి దిక్కు లేదనుకునే పార్టీ అత్యంత భయానకమైనదని రాజనీతిజ్ఞులు ఘోషిస్తున్నది పరమ సత్యం!ఏది సత్యమైనదో అదే శివమైనదీ అవుతుంది!ఏది శివమైనదో అదే సుందరమైనదీ అవుతుంది!


సత్యం శివం సుందరం!!! 

6 comments:

  1. అబద్దాలతో దళితులు, క్రైస్తవులపై హరిబాబు విషం
    http://harikaalam.blogspot.com/2018/09/blog-post_12.html

    నిజమేమిటంటే

    https://www.sakshi.com/news/national/supreme-court-hear-petition-bhima-koregaon-1116555


    24 గంటల్లో హరిబాబు క్షమాపణ చెప్పకపోతే ఈపోస్టు దేశంలోని ప్రతిదళిత సంఘానికి ఫార్వార్డ్ చెయ్యబడుతుంది

    ReplyDelete
    Replies
    1. నేను చెపిన అబద్ధాలు ఏమున్నాయి?

      ఆ కధనం కూడా నేను రాసినట్టుగానే ఉంది కదా!ఎఖ్టోటే హిందూత్వ వాది!అది భాజపా వెనకుండి నడిపించిన నాటకం అని నేనూ చెప్పాను.వాస్తవాలని నేనేమీ వక్రీకరించి చెప్పలేదే!ఎలా అర్ధం చేసుకోవాలి అనేది మీకు నచ్చినట్టు ఉండకపోతే అబద్ధాలు చెప్పినట్టా?

      ఒకరు మెహర్లని వాడుకుని రాజకీయం చేస్తే ఒకరు మహర్లని వాడుకుందామ్నుకుంటున్నారు.మీకు నచ్చినవాళ్ళని మంచోళ్ళని అంటేనే నిజం అవుతుందా?ఇలాంటివి చెప్పకండి!ఈ పోష్టులో నేను చెప్పిన అబద్ధాలేమిటో మీరు సాక్ష్యాలతో నిరూపించితే క్షమాపణ చెప్పడం కాదు పోష్టునే తీసేస్తాను - నిరూపించగలరా?

      వాళ్ళకి పంపిస్తాను,వీళ్ళకి పంపిస్తాను అనే బెదిరింపులు వద్దు - నా పోష్టులన్నీ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తూనే ఉన్నాను కదా!

      నిజం నిరూపించడానికి మందబలం దేనికి?

      Delete
    2. దళిత నాయకులు మినిమ౦ ఓ నెల రోజులు గలీజ్ చేయకుండా ఉండడం జరుగుతుందా?

      అప్పటి బ్రాహ్మణులు మా పూర్వీకుల్ని పుట్టుకని బట్టి అవమానించారు అని అంటూనే ఇప్పటి బ్రాహ్మణుల్ని పుట్టుకని బట్టి దూషించడం అంటే నీ అశుద్ధాన్ని నువ్వే తినడం అని వాళ్ళకి అర్ధం కావాలి,ఎప్పటికి అర్ధం అవుతుంది?

      ఆన్నింటి వెనకా స్వానురాగంతో కూడిన కీర్తికాంక్ష అనేది కొట్టొచ్చినట్టు కనబడుతుంది, తమ ఉద్రేకపూరితమైన ప్రసంగాల్ని విని తమలాగే చావడానికీ జైళ్ళకి వెళ్ళడానికీ ముందుకురికే కుర్రాళ్ళని చూసినప్పుడు వాళ్ళ కళ్ళెలా మెరుస్తాయో చూడండి!

      Delete
    3. ఉటంకింపులు మాత్రమే చేశారు!

      అవి అబద్ధాలని మీరు ఎట్లా చెప్పగలరు?ఆయా సన్నివేశాలకి సంబంధంచిన వార్తలు కనబడుతూనే ఉన్నాయిగా!

      మీ పాయింట్లకి అదే వరసలో జవాబిస్తాను.
      1.అసలు రిజర్వేషన్ అనేది ఆర్ధికంగా వెనకబడటానికి అంబంధించినది కాదు మెహర్,మహర్,మాల,మాదిగ వలె అస్పృశ్యతకి గురి కావడానికీ ఇతరేతర జాతిపరమైన వెనుకబాటుకు అని ఆంధ్రా దళిత నాయకులకి తెలుసా?అయినప్పుడు కాపులు వాళ్ళకి కూడా రిజర్వేషన్ కావాలని అడగటం మొదలుపెట్టి కాపు కార్పొరేషన్ సాధించుకునే వరకు ఎందుకు మౌనంగా ఉండిపోయారెందుకు?అసలు ఆ ప్రస్తావన రాగానే వ్యతిరేకించి అది పెద్దదవుతున్నప్పుడు తామూ అదే స్థాయిలో కౌంటర్ ఉద్యమం చేసి తమ హక్కుల కోసం గట్టిగా నిలబడాల్సిన బాధ్యత ఆంధ్రా దళిత నాయకులకి లేదా?మీరు పిలిస్తే వచ్చిన దళిత నాయకుల్ని నేనూ ఇలాంటి ప్రశ్నలు అడగటానికి కాచుకుని కూర్చున్నాను - Please Call them immediately!

      2.కదిరి కృష్ణకి హిందువుల పెళ్ళిమంత్రాల గురించి అంత నీచంగా మాట్లాడాల్సిన అవసరం ఏమిటి?చాగంటి కోటేశ్వరరావుని వెధవ అనలేదా?తిరిగి తనని ఏమన్నా అంటే కేసు పెట్టడానికి "SC/ST Prevention of Atrocities Act" ఉంది అనే ధైర్యమే కదా!ఇతరులు దళితుల్ని కులాన్ని బట్టి తిడితే తప్పు అని కదా వాళ్ళకోసం ఏర్పాటు చేసింది,మరి అది తప్పు అయినప్పుడు తను చాగంటిని వెధవ అన్నది సందర్భం ప్రకారం చాగంటి బ్రాహ్మణుడు కావటం వలనే కదా!దేశంలో పెళ్ళిళ్ళు చహెసుకునే హిందువ్య్లకి తనపాటి సంస్కృతం రాదనే అనుకున్నాడా?నాయనా, నా వైపునుంచి సాక్ష్యాలూ రిఫరెన్సులూ లేకుండా ఒక్క మాట కూడా రాయను.

      3.ఇంక నక్సలైట్లకి సంబంధించి కూడా - కొందరికి డబ్బు మీద ఆశ,కొందరికి సెక్సు మీద కక్కుర్తి,కొందరికి చప్పట్లు కొట్టించుకోవాలనే వెర్రి అయితే కొందరికి వీరత్వం మీద మోజు!ఎడ్యుకేట్ చెయ్యటం బదులు అరాచకత్వం దేనికని అడగలేదా?ఆ పాయింటుకీ దీనికీ పెద్ద తేడా లేదు.వాళ్ళలో ఎవరూ వ్యక్తిగత అవినీతికి పాల్పడటం లేదు. But Gowri Lankesh was murder reveals she had property disputes!,లక్ష్యం కోసం చావుకైనా తెగిస్తున్నారు,నిజమే!కానీ,వాళ్ళు ఏ సిద్ధాంతం ప్రేరణతో ఈ పనులు చేస్తున్నారో ఆ సిద్ధాంతం శాస్త్రీయమనది కాదని నేనంటున్నాను.ఎదురు పడితే వాళ్ళతోనే కమ్యూనిజం అశాస్త్రీయమని ఒప్పించగలను.నిజానికి ఇక్కడ బ్లాగుల్లో ఉన్న కొందరు కమ్యునిష్టు సానుభూతిపరులు సిద్ధాంతం గురించి ఎంతో కొంత తెలుసుకోకుండా ఉంటారా, అయినా నేను అన్నిసార్లు చాలెంజి చేసినా ముందుకు రాలేదంటే కారణం ఏమిటి?

      చాలునా?

      Delete
    4. నేను పోష్టులు తమాషాగా రాస్తున్నానని అనుకుంటారేమో!ప్రతి పోష్టుకీ నా కంప్యూటరులో ఒక ఫొల్డర్ ఓపెన్ చేస్తాను.జనం అబద్దాలు అనే అవకాశం ఉన్న ప్రతి విషయానికీ ఋజువులూ సాక్ష్యాలూ ఆధారాలూ సేకరించి ఆ ఫోల్డరులో ఉంచుతాను.నాకు సత్యమే ప్రమాణం.దళిత నాయకుల గురించి తెలుసుకోవాలంటే నేను హిందూ రేసిస్టులు రాసినవి సేకరిస్తే అవి అబద్ధాలని తేలినప్పుడు నవ్వుల పాలయ్యే ప్రమాదం లేదా?

      నాకు నేనే బెండు కొట్టుకోను లెండి!,ప్రతికక్షులు కూడా కాదనలేని సాక్ష్యాల్నే సేకరిస్తాను.

      నిజానికి జనవరి 1న దళిత నాయకుల సభకీ ఈ గొడవలకీ సంబంధం లేదు.దళిత నాయకుల్ని నేను తప్పు పట్టడం లేదు,కానీ వాళ్ళకి తెలియకుండానే అమాయక యువకుల్ని నక్సలైట్లకి దగ్గిర చేస్తున్నారు.



      నేను బహుశా లాభం అనే మాట వాడటం వల్ల అది వ్యంగ్యంగా అనిపించి ఉండవచ్చు,కానీ ఆ మాటని ప్రయోజనం అని రీప్లేస్ చేసుకుంటే అంత వ్యంగ్యం ధ్వనించకపోవచ్చు.నాకు సెంటిమెంట్లు తక్కువ.ప్రతిదాన్నీ ప్రాక్టికల్ ధోరణిలో ఎనలైజ్ చేస్తాను.అది కూడా కొంచెం తిట్టినట్టు అనిపిస్తుంది.కానీ సమస్యలు పరిష్కారం కావాలంటే ఎప్పటికయినా ప్రాక్టికాలిటీయే సరైన పరిష్కారాన్ని చూపిస్తుంది.

      Delete
    5. దళిత సంఘానికి ఫార్వార్డ్ చేస్తే వాళ్ళేం చేస్తారు?కొంచెం డిటైల్ గా చెప్పండి.హరిబాబు గారికి అర్థం అవ్వాలిగా?

      Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...