క్రీస్తు జననం
గురించి గాబ్రియేలు మేరీకి సందేశం ఇచ్చే సన్నివేశం ఇది:
In the sixth
month the angel Gabriel was sent from God to a city of Galilee named Nazareth,
to a virgin betrothed to a man whose name was Joseph, of the house of David;
and the virgin's name was Mary.
And he came to
her and said, "Hail, O favored one, the Lord is with you!" But she
was greatly troubled at the saying, and considered in her mind what sort of
greeting this might be. And the angel said to her, "Do not be afraid,
Mary, for you have found favor with God. And behold, you will conceive in your womb
and bear a son, and you shall call his name Jesus. He will be great, and will
be called the Son of the Most High; and the Lord God will give to him the
throne of his father David, and he will reign over the house of Jacob forever;
and of his kingdom there will be no end."
And Mary said
to the angel, "How shall this be, since I have no husband?" And the
angel said to her, "The Holy Spirit will come upon you, and the power of
the Most High will overshadow you; therefore the child to be born will be called
holy, the Son of God. And behold, your kinswoman Elizabeth in her old age has
also conceived a son; and this is the sixth month with her who was called
barren. For with God nothing will be impossible."
ఈ మొత్తం సన్నివేశాన్ని అర్ధం చేసుకోవాలంటే
ఇందులోని కొన్ని భాగాల్ని విడిగా తీసి ఒక్కొక్క పాయింటునీ అర్ధం చేసుకుంటే అన్నీ
కలిసినప్పుడు ఒక అవగాహన వస్తుంది.మొదట "a virgin betrothed to a
man" అనే పాయింటును
చూద్దాం.అంటే,మేరీకి ఆరవ మాసం
నడుస్తున్నప్పుడు గాబ్రియేలు దర్శనం ఇచ్చేటప్పటికి కూడా జోసెఫ్ అనే డేవిడ్ వంశీయుడితో
పెళ్ళి కాలేదు.Betrothel అంటే మనలో
తాంబూలాలు పుచ్చుకోవటంతో సమానమైన వివాహ పూర్వ దశ నడుస్తున్నది.ఇంతవరకు దృశ్యం
సాఫీగానే ఉన్నది.అయితే చదువుతున్నప్పుడు గానీ వింటున్నప్పుడు గానీ మనకు రావలసిన
మొదటి ప్రశ్న "అప్పటికే 6 నెలల గర్భవతి
అయిన మేరీని కన్య అని సంబోధించడం ఎట్లా కుదురుతుంది?" అని.గాబ్రియేలు చెప్పిన తర్వాతనే గద మేరీకి
కూడా అది దేవుని వీర్యం వల్ల వచ్చిన గర్భం అని తెలిసింది,అంతకుముందు అందరి దృష్టిలోనూ అది ఏ పురుషుడి
వల్ల వచ్చిందో తెలియని అక్రమగర్భమే కదా!Betrothel గర్భంతో ఉన్నదని తెలిశాక జరిగితే జోసెఫ్
అభ్యంతరం వ్యక్తం చెయ్యలేదా?Betrothel జరిగిన తర్వాతనే మేరీకి గర్భం వచ్చిందని తెలిసినా జోసెఫ్ వైపు నుంచి కనీసం
ప్రశ్నించే స్థాయి అభ్యంతరం కూడా వ్యక్తం కాలేదా?ఇవేవీ జరగలేదంటే అప్పటి Nazareth సమాజంలో అటువంటి విశృంఖలత సహజమేనా?
అంతే అనుకోవాలి - జోసెఫ్ యొక్క వంశ
మూలపురుషుడైన డేవిడ్ ఒక రోజున వేళ కాని వేళలో నిదరనుంచి మేల్కొని కిటికీలో నుంచి
చూస్తే ఆరుబయట స్నానఘట్టంలో సరిగంగ స్నానాలు చేస్తున్న సిగ్గెరగని ఒక మదవతి కనబడి
పిచ్చెక్కిపోయాడు.ఆరా తీస్తే ఆమె తన సైన్యంలో ఒక మధ్యశ్రేణికి చెందిన వీరుడు.ఈ
రాజుగారు వేళాపాళా లేకుండా నిద్రపోతూ లేస్తూ ఉన్న సమయంలో అ మదవతి భర్త ఆ రాజుగారి
తరపున దేశం కోసం జరుగుతున్న యుద్ధంలో వీరోచితంగా పోరాడుతున్నాడు!మతిపోయిన రాజుగారు
కబురు పెట్టడమూ మదవతి కులుక్కుంటూ రావడమూ పిచ్చ రొమాంటిగ్గా జరిగిపోయింది -
ప్రికాషన్స్ తీసుకోకుండా రొమాన్స్ చేస్తే ప్రగ్నెన్సీ రాకుండా ఉంటుందా, వచ్చింది.మదవతి కడుపులో బిడ్డ పడినట్టే దావీదు
గారి గొంతులో పచ్చి వెలక్కాయ పడింది - ఎంత మోతుబరులయినా గుట్టు చప్పుడు కాకుండా
పని కానిచ్చేస్తే సమాజం ఏమీ చెయ్యలేదు గానీ దొరికిపొతే మాత్రం పంబ
రేగ్గొడుతుంది!రంకు బయటపడ్డాక రాజే అయినప్పటికిన్నీ రాణీ అయినప్పటికిన్నీ తలొంచుకు
నిలబడి కన్నీళ్ళు పెట్టుకుని క్షమించమంటే ఏమో గానీ పొగరు చూపిసే మాత్రం సహించదు
గాక సహించదు!అప్పుడు దావీదూ మదవతీ నిలబడిన సన్నివేశం ఎట్లాంటిది?భర్త యుద్ధానికి వెళ్ళిన రోజు యెటూ తెలుస్తుంది
గాబట్టి గర్భం వచ్చిన రోజు అ తర్వాతనే అనీ
తెలుస్తుంది కాబట్టి ఆడదాని రాళ్ళతో కొట్టి చంపెయ్యాలి.శిక్ష వెయ్యాల్సింది
రాజుగారే - ఆక్రోశం పట్టలేక ఆమె బూతులు తిట్టినా రాజుగారు పడి తీరాలి!
విధి లేక సైన్యంలో ఒకడికి కబురుపెట్టాడు దావీదు
ప్రభువు - ఆమె మొగుణ్ణి శత్రువుల మధ్యలోకి పోనిచ్చి మీరు వెనక్కొచ్చెయ్యండని
దుర్మార్గపు సనదెసం పంపాడు.అదే జరిగింది.కడుపొచ్చిందని తెలిసేలోపు భర్త
చచ్చిపోయాడని చెప్పి తను పెళ్ళి చేసేసుకున్నాడు.ఏసు లాగే దావీదును కూడా దేవుని చేత
ఆశీర్వదించబడినవాడు అని చెబుతారు - అంతటి ఘనుదే నదురూ బెదురూ లేకుండా పాపం చేసి
సుఖపడ్డాడు,తర్వాత ఘోరంగా
దుఃఖ్ఖించేసి శిక్షనుంచి తప్పించుకున్నానని అనుకున్నాడు!ఒకనాడు ఒక పండితుడు కధ
చెబుతూ కధలోని ఒక పెద్దమనిషి ఇంటికి వచ్చిన అతిధికి తన పెంపుడు జంతువుల్ని
దాచుకుని పొరుగింటివాడు ప్రేమగా పెంచుకుంటున్న వాట్ని చంపి భోజనం పెట్టాడని
చెబుతుంటే ఒళ్ళు మరిచిపోయి "ఎంత దుర్మార్గుడు?వాణ్ణి ఏం చేసినా పాపం లేదు!" అని
ఆవేశపడిపోయి ఆ పండితుడు తననే వేలెత్తి చూపిస్తూ "అది నువ్వే మహారాజా!అది
తప్పయితే అతనికి నువ్వు వెయ్యబోయే శిక్షని నువ్వూ అనుభవించాల్సిందే!" అని
ముఖం మీదనే చెప్పేసరికి బిత్తరపోయాడు - పాపం!
మొదట నిగ్రహం కోల్పోయి తప్పు చెయ్యటం,తర్వాత దుఃఖ్ఖించి పాపక్షమాపణ పొందడం అనే
విచిత్రమైన క్రైస్తవ ధర్మానుష్ఠానానికి ఆద్యుడు దావీదు మహారాజే!నిజానికి
అమాయకత్వంతోనో అజ్ఞానంతోనో చేసిన తప్పులని పక్కన పెడితే తెలిసి చేసిన ఏ పాపానికైనా
పరిహారం చెల్లించకుండా కేవలం పశ్చాత్తాపం పేరుతో ఎంత క్షోభ పడినా శిక్ష నుంచి
తప్పించుకోలేరు - దావీదు పాపం చెయ్యడానికి వాడిన కత్తి అతని కుటుంబాన్ని సర్వనాశనం
చసి కానీ వదల్లేదు - ప్రపంచంలోని పాపులందరి తరపునా యేసు శిలువ యెక్కడం వల్లనూ
జరిగిపోయిన పాపాలకి ప్రతి ఆదివారమూ పొర్లిగింతలు పెట్టి యేడ్చే తమ దుఃఖంతోనూ
పాపాలు కడిగివేయబడుతున్నాయని క్రైస్తవులు నమ్మడం కేవలం అజ్ఞానం నుంచి పుట్టిన భ్రమ
మాత్రమే!
తమ నలుపు తెలుసుకోకుండా హిందువుల మతగ్రంధాలను
గురించి అబద్ధాలు చెప్తున్న క్రైస్తవ మత ప్రచారకుల నుంచి వాళ్ళు చెప్తున్న
అబద్ధాలను తెలుసుకోకుండా ఆ అబద్ధాలను విప్పి చెప్తున్న హిందువుల మీద ఎగిరెగిరి
పడుతున్న క్రైస్తవ మతానుయాయుల వరకు తమ పాపాలకు పడాల్సిన శిక్షల నుంచి ఎవరూ
తప్పించుకోలేరు - ఖబడ్దార్!
ఇక్కడే అందరి దృష్టినీ ఆకర్షించకుండా
తప్పించుకుంటున్న ఒక విశేషం ఉంది.దాదాపు క్రైస్తవ మత ప్రచారకుల్లో ప్రతి ఒక్కరూ
తరచుగా క్రీస్తుని ఒక సామాన్యుడైన గొర్రెల కాపరి అని చెప్తారు.కానీ అతను డేవిడ్,
సాల్మన్, లోతు, వంటి రాజుల వంశంలోని వాడు.ఎదర ఉన్న ప్రేక్షకులని బట్టి గానీ తమ
భక్త్యావేశాన్ని బట్టి గానీ ప్రచారకుల భాషలో ఒకసారి గొర్రెల కాపరిగానూ ఒకసారి
రాజాధిరాజుగానూ రూపం యెత్తుతాడు!డేవిడ్ పొరుగువాడి భార్యని కామించడాన్ని అంత
పట్టించుకోవాల్సినపని లేదు లోతు గారి కూతుళ్ళు చేసిన పని తెలిస్తే - ఘనుదైన
తండ్రిగారి వీర్యం కోసం అతనికి ద్రాక్షరసం ఇచ్చి మత్తులో ముంచి సంభోగించారు!
పాపం,యోసేపు గారికి కడుపు రగీపోయి అదేమని అడిగితే మేరీ తరపువాళ్ళు దావీశూ కర్ణలో
ఎంటీవోడి మాదిరి "మీ తాతల ముత్తాతల బామ్మల రంకుతో మీ వంశము ఏనాడో
కుళ్ళిపోయినది!అతి జుగుప్సాకరమైన వంశమున బుట్టి మా పరిశుద్ధ కన్యనే అవమానింతువా?"
అని నిలదీస్తే ఏమని జవాబు
చెప్పగలడు?కాబట్టి దైవపుత్రుడనే పులుముడు లేకపోయినా యేసేపు గారు
మరియని అనుమానించక భరించి ఉండాలి - గాబ్రియేలు గారి ప్రకటనతో హాయిగా వూపిరి
పీల్చుకుని ఉండాలి.
పైపైన తడిమిన నాకే తెలిసిన నిజాలు బైబిలు
పఠనంలో మునిగితేల్తున్న మత ప్రచారకులకి తెలియదా యేమిటి?"Of course,
not every woman in Jesus' lineage is so clean. There was Bathsheba the
adulteress and Tamar who seduced her father-in-law. These things can be
forgiven, as many of you have discovered. But don't overlook the importance of
Mary. When God chose a mother for his Son, he chose a virgin. Virginity before
marriage is important because the recipient of God's best gifts ought to be
pure."అని
సమర్ధించేసుకుంటున్నారు లెండి!
కంగారు పడుతున్న మేరీకి ధైర్యం చెప్పటానికి
గాబ్రియేలు ఉదహరించిన Elizabeth కుమారుడు John
the Baptist క్రీస్తుకి తొలిసారి దీక్ష ఇచ్చిన
ప్రముఖుడు!బైటివాళ్ళం గనక మనకి తెలియదు గానీ క్రైస్తవంలోని శాఖల మధ్యన వివాదాలకి
కారణమవుతున్న అంశాల్లో ఇది కూడా ఒకటి!విచిత్రం యేమిటంటే, హేతువుకి కట్టుబడి క్రైస్తవ మత సాహిత్యపు
యదార్ధత మీద పరిశోధనలు చేస్తున్నవారిలో చాలామంది నీళ్ళ మీద నడవటం,పునరుద్ధానం వంటివాటిని కట్టుకధలుగానే
ఒప్పుకుంటూ యదార్ధం కావచ్చునని చెబుతున్న రెండే రెండు సన్నివేశాలు క్రీస్తు జాన్
దగ్గిర బాప్తిజం దీక్ష తీసుకోవటం,రెందు సంవత్సరాల
తర్వాత శిలువ మీద మరణించడం మాత్రమే!"how does Luke help Theophilus
(and us) in Luke 1–2 know the securely locked-down, unchangeable nature of the
reality of what he’s been taught? He does it by weaving together the stories of
Jesus and John the Baptist — the announcement of their births, the way they
were both conceived, the way they were both born, the songs that their parents
sang over them, and even an encounter between them while they were still in the
wombs of their mothers.And in telling these stories of John and Jesus, Luke
makes clear and solid the most important realities in the universe: God,
Christ, salvation, and faith." అంటున్న ఒక
క్రైస్తవ పండితుడి విశ్లేషనలో He does it by weaving together the stories
of Jesus and John the Baptist అనే వాక్యం నాకు
అంతకుముందు ఇతర్లకి తోచని పోలికలు అతడి అల్లిక తర్వాతనే గోచరం అయ్యాయని అనుమానం
వచ్చేలా చేస్తున్నది.అయితే జీసస్ చారిత్రకతని నిర్ధారించే అంత ముఖ్యమైన సన్నివేశం
అయినప్పటికీ దైవపుత్రుడికి దీక్ష ఇవ్వడం ద్వారా జాన్ జీసస్ కన్న అధికుడని
అనుకోవడానికి కొందరి మనోభావాలు దెబ్బతింటున్నాయి - పాపం!
John P. Meier అనే యూదు జాతికి చెందిన
క్రీస్తుచారిత్రకతానిర్ధారణాపరిశోధకుడు "the crucifixion of Jesus as
historical fact and states that based on the criterion of embarrassment
Christians would not have invented the painful death of their leader." అని విశ్లేషించదంలో painful death of
their leaderని the criterion
of embarrassment ఉండటం వల్ల Christians
would not have invented అన్నది అనకి ఎలా
అర్ధం అవుతుంది?అది కూడా వాస్తవం
కాకపోవచ్చుననే అల్లసాని వారి అల్లిక కావచ్చుననీ అనిపించడం లేదా! అట్లాగే "The
criterion of embarrassment is also used to argue in favor of the historicity of
the baptism of Jesus by John the Baptist as it is a story which the early
Christian Church would have never wanted to invent." కూడా వాస్తవం కాకపోవచ్చుననే అల్లసాని వారి
అల్లిక కావచ్చుననీ అనిపించడం లేదా!
అసలు క్రైస్తవమతసాహిత్యాన్ని రూపకల్పన చేసిన
పండితులు జీసస్ క్రీస్తుకి దేవుని వీర్యంతో కన్యాగర్భమున జన్మించడం వల్లనే
గొప్పదనం వచ్చిందనే విషయాన్ని ప్రస్తుతించడంలో అంత పట్టుదలగా ఎందుకు
శ్రమిస్తున్నారు?నాకు తోచిన కారణం
యేమిటంటే క్రీస్తు యొక్క గొప్పదనం అతని పాండిత్యం వల్ల వచ్చిందని చెబితే అదే
పాండిత్యాన్ని సాధిస్తే ఎవరయినా క్రీస్తుతో సమానుడు కావచ్చు.కానీ
క్రైస్తవమతసాహిత్యాన్ని రూపకల్పన చేసినవారి ఉద్దేశం ఆ మతాన్ని అనుసరించేవారిని
క్రీస్తుతో సమానుల్ని చెయ్యడం కాదు,క్రీస్తులో లీనం
చెయ్యడమూ కాదు - మహా కోపిష్టి అయిన యెహోవ దేవుణ్ణి గురించి వర్ణించి బయపెట్టి అతని
కోపానికి గురి కాకుండా ఉండాలంటే ఒక రక్షకుణ్ణి చూపించి ఇతన్ని మీరు రక్షకుడిగా
ఒప్పుకుంటే యెహోవా కోపం నుంచి తప్పించుకోవచ్చుననే ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసి
ధైర్యం చెప్పటం! ఇందులోని వెసులుబాటు యేమిటంటే పాపాలు చెయ్యడం ద్వారా వచ్చే
సుఖభోగాలను తనివితీరా అనుభవించేసి అప్పుడు పశ్చాత్తాపం పేరుతో దుఃఖించి యేసును
శరణు వేడి యెహోవ కోపం నుంచి తప్పించుకోవచ్చును- ఆశ్చర్యంగా ఉందా?
నేను హిందువుని కాబట్టి క్రైస్తవం గురించి
పాపాన్ని సమర్ధిస్తున్నదనే నేరారోపణ చేస్తున్నానని అనుమానంగా ఉందా?అయితే ఈ మధ్యనే సెయింట్ అయిన మదర్ ధెరీసా జీవనసాఫల్యతాకార్యక్రమం ఏమిటి?కలకత్తాని కార్యక్షేత్రం చేసుకుని అనాధల్నీ
అసహాయుల్నీ చేరదీసి సాకిందని అందరికీ తెలుసు.అయితే, కొందరు ఆమె సంస్థలో పని చేసినవారే బయటకొచ్చి
చెబుతున్న దాని ప్రకారం అదంతా మతమార్పిడి కోసమేనని తెలుస్తున్నది.కొందరు వైద్యం
చేయించితే బతికే స్థితిలో ఉన్నవాళ్ళకి కూడా వైద్యం చేయించేది కాదట - ఆమె వాళ్ళని
తీసుకొచ్చింది రోడ్డు మీద చావకుండా వీళ్ళ మధ్యన చావడానికేనట!అదీగాక చావబోయేముందు
మతం మారడానికి ఒప్పుకోని వాళ్ళకి తెలియకుండా వెనకనుంచి తల తుడుస్తూనో మరో పని
చేస్తూనో బాప్తిజం తతంగాన్ని నడిపించేసి వాళ్ళని క్రైస్తవులుగా మార్చడం అక్కడ
మామూలు వ్యవహారం. ఆవిడ కొందరు ప్రభుత్వాధినేతల్నీ ధనవంతులైన వ్యాపారుల్నీ కూడా
కలిసేది - వాళ్ళు పాపాలు చేస్తున్నారని తెలిసినా పాపాలు చెయ్యకండని చెప్పినట్టు
నేనెక్కడా వినలేదు.ఆవిడ అడిగేదల్లా తమ కార్యక్రమాలకి డబ్బు ఇమ్మని, దానికి బదులు ఆమె వీళ్ళు చేసిన పాపాలకి వీళ్ళ
తరపున ప్రార్ధిస్తుంది - అంటే, నువ్వు ఎంతటి
పాపాత్ముడివైనా సరే ఆమె నువ్వు పాపం చెయ్యకుండా నిరోధించదు, నువ్వు ఆమె మతమార్పిడికి డబ్బు సహాయం చేస్తే
చాలు నీ పాపాలకి నీకు శిక్ష పడకుండా కాపాడుతుంది!
ఈ సంక్లిష్టమైన అమరిక తెలియని అమాయకులకి తమ
పక్కనే కొందరు పాపాత్ములు చర్చి ఇచ్చిన గ్యారెంటీతో తమని రాచి రంపాన పెడుతున్నా
సహించి వూరుకునే విధేయతని అలవాటు చెయ్యాలి.ప్రశ్నించడానికే వీల్లేని స్థాయిలో
రక్షకుడి పట్ల విధేయత పుట్టాలంటే ఆ రక్షకుడు తమకు చేరరాని ఎత్తులో ఉండాలి.ఎంత
కష్టపడి అల్లినప్పటికీ అబద్ధాలు గనక తర్కానికి దిగితే వాటి డొల్లతనం తెలిసిపోతూనే
ఉంటుంది.అందుకే, క్రైస్తవమతప్రచారకుల
ప్రసంగాలు పదాలలో ఆడంబరమూ ఆంగికానికి సంబంధించిన హడావిడితో నిండి వుంటాయి."If
you took all the greatest thinkers of every country and every century of the
world and put them in a room with Jesus, they would shut their mouths and
listen to the greatness of his wisdom. All the greatest generals would listen
to his strategy. All the greatest musicians would listen to his music theory
and his performance on every instrument. There is nothing that Jesus cannot do
a thousand times better than the person you admire most in any area of human
endeavor under the sun. Words fail to fill the greatness of Jesus." అని వీళ్ళు చెప్పుకుంటున్న ప్రశంసలోని
పాండిత్యమే అతనికి ఉంటే ఆనాటి తన ప్రతికక్షులని పాండిత్యంతో మెప్పించి
సన్మానించబడేవాడు గానీ నిస్సహాయుడై తల దించుకుని నిలబడిపోయి శిక్షకి గురై దయనీయమైన
చావుని కొని తెచ్చుకునేవాడు కాదు గదా!
ప్రపంచంలో గతంలోనీ ప్రస్తుతంలోనీ
భవిష్యత్తులోనీ అందరి పాపుల కోసమూ యేసు ఒక్కడే ఒక్కసారి మాత్రమే శిలువ యెక్కడం
వెనక ఉన్న హేతుబద్ధత యేమిటో నాకు యెంత తన్నుకున్నా అర్ధం అయ్యి చావడం లేదు!కొందరు
అమాయకులైన క్రైస్తవులు తమ ఫాదర్లు చెప్పగా నమ్మి మనకి "ఆనాడు యేసు శిలువ మీద
అనుభవించిన బాధని మనమూ అనుభవిస్తే మనస్సు పరిశుద్ధమై పాపాలు చేయకుండా
ఉంటా"మని చెబుతారు కానీ క్రైస్తవులలోని పాపాత్ములకి మాత్రం ఈ బాధలు పడాల్సిన
ఖర్మ లేదు - వారికోసం మదర్ ధెరీసా లాంటివాళ్ళు ఉన్నారు కదా!
జీసస్ పుట్టుకని గురించే క్రైస్తవమతసాహిత్యం
నొక్కి చెప్తూ వుండటం వల్ల ఈ బైబిలు వాక్యం చుట్టూ ఇంత విశ్లేషణ చెయ్యాల్సి
వచ్చింది - అసలు జీసస్ ఒక యదార్ధ వ్యక్తి అని నిర్ధారించి చెప్పాలంటే అతనికి
"దేవుని వీర్యం వలన కన్య గర్భము నందు జన్మించుట" అనే మహత్వాన్ని కూడా
తిరస్కరించాల్సి వస్తుందని అతని చారిత్రక యదార్ధతని నిరూపించాలని ఉత్సాహపడుతున్న
క్రైస్తవులకి తెలియటం లేదు!చారిత్రక యదార్ధతను గురించి పరిశోధిస్తున్న క్రైస్తవ
పరిశోధకులు కూడా నీటిమీద నడవతం లాంటి వాటిని కట్టుకధలని ఒప్పుకుంటున్నప్పుడు
దీన్ని కూడా కట్టుకధ అని ఒప్పుకోవాలి కదా!
అలాంటప్పుడు క్రీస్తు కూడా పెరుమాళ్ మురుగన్ తన
నవల్లో చెప్పినట్టు సంతానలేమితో బాధపడుతున్న ఆదవాళ్ళు తీర్ధయాత్ర పేరుతో
పరపురుషులతో గర్భం దాల్చి దేవుడి ప్రసాదం అని చెప్పుకున్న అనేకమంది శిశువుల
వంటివాడే అవుతాడు - కాబట్టి జీసస్ క్రీస్తు యదార్ధ వ్యక్తి అని చెప్పుకోవటం అంటే
అతడు అక్రమసంతానం అని ఒప్పుకోవటమే అవుతుంది - అవునా కాదా?ఎందుకంటే,చరిత్రలో క్రీస్తు జననకాలంగా చెప్పబడుతున్న
సమయానికి మానవజాతిలో ఒక శిశువు పుట్టాలంటే మానవజాతికి సంబధించిన పురుషుడి వీర్యం
మానవజాతికి సంబంధించిన స్త్రీ అండాన్ని కలవడం ద్వారా తప్ప మరొకలా జరగడం అసంభవం!ఈ
మెలిక అర్ధం కాని అమాయక క్రైస్తవులు అవకాశం కోసం ఎదురు చూస్తున్న తెలివైన యూదుల
కుట్రకు లోనై ఈ చర్చలో పాల్గొని జీసస్ క్రీస్తు చారిత్రక వ్యక్తియేనని నిర్ధారించి
శత్రువుల నోళ్ళు మూయించాలని వీరావేశంతో విజృంభిస్తున్నారు!
క్రైస్తవమతాభిమానులు కూడా ఒప్పుకుంటున్న "All
extant sources that mention Jesus were written after his death. The Christian
Testament represents sources that have become canonical for Christianity, and
there are many apocryphal texts that are examples of the wide variety of
writings in the first centuries AD that are related to Jesus.Many scholars have
questioned the authenticity and reliability of these sources, and few events
mentioned in the gospels are universally accepted." అనే విశ్లేషణ ప్రకారం ఈనాడు మనం చూస్తున్న సాహిత్యం మొత్తం జీసస్ చనిపోయిన తర్వాత కూర్చబడినదని తెలుస్తున్నది.అదీ
గాక వాటిని బట్టి జీసస్ చారిత్రక వ్యక్తీ అని నిర్ధారించడానికి క్రైస్తవ పండితులే
సందేహిస్తున్నారంటే అవన్నీ విశ్వసించదగినవి కావని కూడా తెలుస్తున్నది!
బైబిలు మీద సవివరమైన పరిశోధనలు చేసినవారు
"The historical reliability of the gospels refers to the
reliability and historic character of the four New Testament gospels as
historical documents. Little in the four canonical gospels is considered to be
historically reliable.The Synoptic Gospels are the primary sources of
historical information about Jesus and of the religious movement he founded.
These religious gospels–the Gospel of Matthew, the Gospel of Mark, and the
Gospel of Luke–recount the life, ministry, crucifixion and resurrection of a
Jew named Jesus who spoke Aramaic. There are different hypotheses regarding the
origin of the texts because the gospels of the New Testament were written in
Greek for Greek-speaking communities, and were later translated into Syriac,
Latin, and Coptic. The fourth gospel, the Gospel of John, differs greatly from
the Synoptic Gospels." అనీ "Since
there are more textual variants in the New Testament (200–400 thousand) than it
has letters (c. 140 thousand), scholars use textual criticism to determine
which gospel variants could theoretically be taken as 'original'. To answer
this question, scholars have to ask who wrote the gospels, when they wrote
them, what was their objective in writing them, what sources the authors used,
how reliable these sources were, and how far removed in time the sources were
from the stories they narrate, or if they were altered later. Scholars may also
look into the internal evidence of the documents, to see if, for example, a
document has misquoted texts from the Hebrew Tanakh, has made incorrect claims
about geography, if the author appears to have hidden information, or if the
author has fabricated a prophecy. Finally, scholars turn to external sources,
including the testimony of early church leaders, to writers outside the church,
primarily Jewish and Greco-Roman historians, who would have been more likely to
have criticized the church, and to archaeological evidence." అనీ చెబుతుండటాన్ని బట్టి క్రైస్తవులు మాది ఒకే
పుస్తకం, ఒకే సత్యం,ఒకే మార్గం అని పొగుడుకోవటం కూడా అబద్ధమేనని
తెలుస్తున్నది కదా!
వాళ్ళు గాస్పెల్స్ అని పిలిచే వాటిలోనే అనేక
వెర్షన్లు ఉండటం వల్ల ఒకదానికొకటి పొంతన లేని అసమన్వయ సుత్తి పరుచుకుని ఉన్నదనేది నిష్ఠిర
సత్యం!అన్నింటిలోనూ కనిపిస్తున్న సామాన్యమైన కధనాలు రెండే రెండు - ఒకటి జీసస్ జాన్
నుండి బాప్తిజం దీక్ష తీసుకుని పరిశుద్ధుడు కావటమూ, అది జరిగిన రెండు లేక మూడు సంవత్సరాల లోనే
పిలాతు హయాములో శిలువ మీద మరణించడమూ మాత్రమే.ఈ రెండింటికీ అప్పటి రోమన్ ప్రభుత్వ
దైనిక ఉల్లేఖనలలో రెండూ యూదుల మత చారిత్రాక ఉటంకింపులలో రెండూ సాక్ష్యాలు
కనబడుతున్నాయి.ఈ నాలుగూ తప్ప క్రీస్తు గురించి సాక్షాత్తూ క్రైస్తవులే నియోగించిన
ఒక అధికారికమైన పరిశోధనా బృందం కొన్ని దశాబ్దాల పాటు కృషి చేసినా మరొక
సాక్ష్యాన్ని బైటికి తియ్యలేకపోయింది!
ఈ నాలుగూ మాత్రం క్రీస్తు చారిత్రకంగా
ఒకనాడు రక్తమాంసాలతో నడయాడిన చారిత్రక
వ్యక్తియే అని నిర్ధారించడానికి తిరుగులేని సాక్షాలే నన్నది యదార్ధం!అయితే
నాస్తికులు దాదాపు 200 యేళ్ళ క్రితమే
లేవదీస్తే యూదులు అందిపుచ్చుకుని మొదలుపెట్టిన ఈ వివాదంలోకి వీరావేశంతో దిగిన క్రైస్తవులు ఇంత కష్టపడి క్రీస్తు యొక్క
చారిత్రక రూపాన్ని తెలుసుకుని యేమి సాధించారో అర్ధమైన బుర్రలో పాదరసం లాంటి
చురుకైన సరుకున్న నాలాంటివాళ్ళకి పగలబడి
నవ్వాలనిపిస్తుంది:-)కొంచెం క్రైస్తవం పట్ల స్నేహశీలత ఉన్నవాళ్ళకి జాలితో హృదయం
ద్రవించిపోతుంది:-(
పరిశోధకులు "The Roman historian
Tacitus, in his Annals (written ca. AD 115), book 15, chapter 44,[45] describes
Nero's scapegoating of the Christians following the Fire of Rome." అని కనుక్కున్నదాన్ని బట్టి నీరో ఫిడేలు
వాయిస్తూ రోముని తగలబెట్టాడని ఇప్పుడు మనం వింటున్న కధకి ముక్తాయింపుగా నీరో
అప్పటి అగ్నిప్రమాదాన్ని క్రీస్తుజనుల మీదకి తోసేసి వాళ్ళ్లఓ కొంతమందిని
చంపించాడనే వివరంలో ఒక సాక్ష్యం దొరుకుతుంది. ఒంకా ముందుకెళ్తే, "He
writes that founder of the sect was named Christus (the Christian title for
Jesus); that he was executed under Pontius Pilate; and that the movement,
initially checked, broke out again in Judea and even in Rome itself." అని పేర్కొనటాని బట్టి
తర్వాత జీసస్ క్రీస్తుకు వేసిన శిక్షను అమలు
చేసిన రోమన్ ప్రభుత్వాధికారి తనచేత నిర్వర్తించడిన కర్తవ్యాన్ని నెరవేర్చినట్టు
నమోదు చేసిన వివరం కూడా బలమైన సాక్ష్యమే!మళ్ళీ అంతలోనే "Some scholars
question the historical value of the passage on various grounds." అన్న సూత్రీకరణ కనబడి ఈ రోమన్ రికాఎడుకు కూడా
అంత బలమైన సాక్ష్యం కాదేమోనని అనిపిస్తుంది.అయితే, యూదుల మతసాహిత్యంలో కనిపించే రెండు సాక్ష్యాలలో
ఒకటి చాలా సుదీర్ఘమై వుంటుంది, కానీ
క్రైస్తవమతాభిమానులైన పండితులు కూడా తిరస్కరిస్తున్నారు.ఎందుకంటే, క్రీస్తు పట్ల వ్యతిరేకతని ప్రదర్శించే యూదుల
వైఖరికి విరుద్ధంగా క్రీస్తు పట్ల ప్రశంసలు కురిపించే ధోరణిలో ఉన్నాయి - అక్కడ
క్రైస్తవుల దిద్దుబాటు తప్పులతడక పాండిత్యం కొట్టొచ్చినట్టు కనబడుతుండటంతో ఎల్లరూ
దాన్ని తిరస్కరించేశారు.ఇంక రెండవది చాలా క్లుప్తంగా ఉంటుంది,అదీ గాక క్రీస్తుని పరోక్షంగా మాత్రమే
ప్రస్తావిస్తుంది. అయితేనేం, సాక్ష్యం
బలమైనదే!
మరి ఇంత స్పష్టంగా సాక్ష్యాలు చూపించి
క్రైస్తవులు పండగ చేసుకోవాల్సిన విషయాన్ని చెప్తూ మళ్ళీ నేను క్రైస్తవుల మీద
ఎందుకు జాలిపడుతున్నానో తెలియాలంటే "Jesus was a Galilean Jew.His
activities were confined to Galilee and Judea." అని క్రైస్తవులే ఒప్పుకుంటున్న వాస్తవాల
ప్రకారం యూదులు తమ జాతిలో పుట్టి తమకు
ఖ్యాతిని తీసుకురావాలని చూస్తున్న జీసస్ క్రీస్తుని ఎందుకు ద్వేషించారనే అనుమానం
రావాలి, వచ్చిందా?ఇంతవరకు ఆ కోణంలో ఆలోచించని క్రైస్తవ పండితులు
ఇకముందు ఈ పీటముడిని కూడా విప్పాల్సి ఉంటుంది.కొండని తవ్వి యెలకని పట్టినట్టు
దైవపుత్రుడనే అందమైన కల్పనను తొలగించుకుని అక్రమసంతానం అని ఒప్పుకోవాలి.
ఆనాటి జీసస్ క్రీస్తు అంటే, చిల్లర మల్లర కనికట్లు చేస్తూ స్వజనం చేతనే
దూషించబడుతూ యవ్వనం వచ్చాక జాన్ వల్ల తన జన్మసంబంధమైన అపరిశుద్ధతను తొలగించే
దీక్షను పుచ్చుకుని ,అది జరిగిన రెండు
మూడేళ్ళకే రాజద్రోహ నేరం ఆపాదించబడి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే పాండిత్యం
లేక రోమన్ పండితుల ప్రశ్నలకు జవాబు చెప్పలేక శిక్షకు గురై శిలువ మీద మీద
నిస్సహాయుడిగా మరణించిన గలిలీ,జుడియాలు దాటితే
ఎవరికీ తెలియని ఒక అనామకుడనే వాస్తవాన్ని గుండె చిక్కబట్టుకుని ఒప్పుకుని
తట్టుకోవాలి.
Dale Allison,
Bart Ehrman, Amy-Jill Levine and Geza Vermes లాంటి భక్తశిఖామణులైన చరిత్రకారులు కూడా "Christ Myth
Theory"ని తమ శాయశక్తులూ
ఉపయోగించి కొట్టిపారెయ్యగలిగినప్పటికీ "the historical Jesus as a
Jewish preacher who never claimed to be God nor had any intention to found a
religion" అనే సూత్రీకరణ
చెయ్యక తప్పలేదంటే సామాన్య క్రైస్తవులు జీసస్ క్రీస్తు యొక్క చారిత్రక యదార్ధ
రూపాన్ని చూసి గర్వించడానికి ఏమి ఉంది?
ఇవ్వాళ క్రైస్తవులు జీసస్ యొక్క చారిత్రక
యదార్ధతను గురించి పట్టుబడితే కన్యగర్భమున జన్మించడం దగిర్నుంచి పునరుత్ధానం వరకు
గల సమస్తమైన మహిమల్నీ పిట్టకధల కింద తేల్చిపారేసి వాటిని నమ్మడం మానెయ్యాలి,ఆ మహిమలే ముఖ్యం అంకుంటే అతడు కల్పితవ్యక్తి
అని ఒప్పుకోవాలి - ఇప్పుడేం దారి దేవుడా!
ముందూ వెనకా చూసుకోకుండా జీసస్ క్రీస్తు యొక్క
చారిత్రక యదార్ధతని నిరూపించటానికి ఇంత దూరం వచ్చేసిన క్రైస్తవులు వెనక్కీ
వెళ్ళలేని ముందుకీ వెళ్ళలేని ఇరకాటంలో అడకత్తెరలో పోకచెక్కలా ఇరుక్కుపోయారు.
ఆమెన్, హల్లెలూయా, కుయ్యోమొర్రో!