Thursday, 28 June 2018

యూరోపియన్లూ అమెరికన్లూ నమ్మే గ్రహాంతారవాసులు నిజంగా ఉన్నారా?మానవులకి సాధ్యం కాదనిపించే ప్రాచీన కట్టడాల్ని గ్రహాంతరవాసులే కట్టారా!

     హేతుబద్ధమైన ఆలోచనలతో బుద్ధిని వికసింపజేసుకుని కనిపించిన ప్రతి దాన్నీ జరుగుతున్న ప్రతి సంఘటననీ తర్కం ద్వారా విశ్లేషించుకుంటూ అందమైన కల్పనలతో సంతృప్తి పడకుండా ప్రయోగాలు చేసి నిర్ధారించుకున్నాకనే నమ్మడం అనేది శాస్త్రీయమైన ఆలోచనా విధానం అని అందరూ ఒప్పుకుంటారు.అయితే ఎంత శాస్త్రీయంగా ఆలోచించినా నమ్మలేని విషయాలని యెట్లా అర్ధం చేసుకోవాలి?తమ జ్ఞానంతో ఒక సంభావ్యతని శాస్త్రీయమైనదని నిర్ధారించలేని దృగ్విషయం ఎదురైనప్పుడు మనుషులు రెండు రకాల ప్రవర్తనల్ని చూపిస్తున్నారు - అహంకారి అయితే తనకి తెలియనిది ఇంకెవరికీ తెలియడానికి వీల్లేదనే ధోరణితో తనకి తోచి తను చెప్పినదాన్ని నమ్మమంటాడు, వినయశీలి అయితే తనకి తెలిసిన దాన్ని మాత్రమే ఇతరులకి చెప్పి తెలియని దాని గురించి తన జ్ఞానాన్ని పెంచుకోవాలని గుర్తించి అందుకోసం కొత్త ప్రయత్నాలు మొదలుపెడతాడు. కేవలం 200 యేళ్ల వయస్సున్న ఆధునిక విజ్ఞానశాస్త్రం మనం రోజువారీ బతుకుల్లో వాడుకుని సుఖపడటానికి కొన్ని వస్తువులని తయారు చెయ్యగలిగింది కానీ మన చుట్టూ ఉన్న విశ్వాన్ని అర్ధం చేసుకోవడంలో ఇంకా తత్తర పడుతూనే ఉన్నది!

     మానవవాదిని అని చెప్పుకునే గోగినేని బాబు దేవుడు లేడు అని బల్ల గుద్ది చెప్తాడు,కానీ ఎలియన్స్ ఉన్నాయి అనో ఉండొచ్చు అనో ఒప్పుకుంటాడు!తను పాటించే మానవవాదాన్ని కనీసం మానవవాతావాదం అని చెప్పుకోవటానికి కూడా తిరస్కరిస్తాడు.తన వాదానికి "తా" అనే ఒక అక్షరం చేర్చినా సహించలేనివాడు ఇతరులకి సహనం లేదని వ్యంగ్యాలు విసురుతాడు!ఈ మధ్యనే ఒక క్రైస్తవమతప్రచారకుడు "ఈ శాస్త్రాల మీద ఎడంకాలు వేసి నుంచున్నాడు క్రైస్తవుడు!" అని గొప్పలు చెప్పుకుంటున్నాడు.బాల్‌పెన్ను కనిపెట్టింది క్రైస్తవుడు,విమానం కనిపెట్టింది క్రైస్తవుడు,గడియారం కనిపెట్టింది క్రైస్తవుడు అని చాంతాడు పొడుగు లిస్టు చెప్పాడు.క్రీస్తు పుట్టినది అని చెప్పి కాలాన్ని దానికి ముందు,దానికి వెనక అని విడగొట్టారు గానీ అసలు ఆ క్రీస్తు చారిత్రకవ్యక్తియేనా లేక మతాధిపతులు ప్రజల్ని ఎవరో ఒకరికి విధేయులుగా ఉంచాల్సిన అవసరం కోసం నిలబెట్టిన కల్పితవ్యక్తియా అనేది ఇంకా నిర్ధారణ కాలేదు - అమ్మతోడు, నిజం!క్రీస్తు పుట్టాడని చెబుతున్న కాలానికి మూడువందల సంవత్సరాలకి గానీ ఆ మతం బహిరంగం కాలేదు.అప్ప్పటినుంచి వెయ్యేళ్ళ కాలాన్ని చీకటియుగం అని వారి చరిత్రకారులే నిర్ధారించారు.సైన్సు సంగతి తర్వాత కామన్ సెన్సుని కూడా వారు సహించలేకపోయారు!

     కోపర్నికస్,గెలీలియో వంటివాళ్ళని కూడా వాళ్లు కేవలం సైంటిస్టులు అయినందుకు చంపలేదు.వాళ్ళు  సైన్సు ద్వారా వస్తువులను కనుక్కుని వ్యాపారం చేసి డబ్బు గడించితే చర్చికీ ఇష్టమైనవాళ్ళే అయ్యేవాళ్ళు.కానీ వాళ్ళు చర్చి అధిపత్యాన్ని తిరస్కరించే ఇల్యూమినాటి,మాసన్రీ వంటి ఉద్యమాలలో పాల్గొన్నారు గనకనే చంపారు,ఖైదు చేశారు,నిషేధించారు.చర్చి అధిపత్యానికి నిజమైన సవాలు ఇస్తూ సమస్త మానవాళికీ ప్రయోజనం కలిగించే గంభీరమైన తాత్విక చింతన క్రీ.శ 11వ శతాబ్దం తర్వాతనే అక్కడ పుట్టింది.అయితే ఇప్పటికీ అబార్షన్ల వల్ల అన్యాయమైపోతున్న ఆడవాళ్ళని సమర్ధించేవారు తమని తాము progressive అని చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతూ "Libertarianist" అనే లేబుల్ మాత్రమే తగిలించుని సరిపెట్టుకుంటున్నారంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు.

     కన్యాశుల్కంలొ గిరీశం కుంచానికి చిల్లుపడితే అడ్డం తిప్పి కొలిస్తే కూసిన్ని గింజలైనా దక్కుతాయి గదా అన్నట్టు తనని ధిక్కరించే నిజమైన సైన్సుని భ్రష్టు పట్టించటానికి చర్చి ప్రోత్సహించిన సూడోసైన్సు యొక్క అనేకానేకమైన యెత్తుగడలలో ఒక భాగమే ఎలియన్సుకి సంబంధించిన గాలివార్తలని ప్రచారం చెయ్యటం!ప్రాచీన కాలంలో కట్టబడిన అద్భుతమైన నిర్మాణాలని అన్నింటినీ ఎలియన్సుకి అంటగట్టెయ్యటం వీళ్ళ నిత్యకృత్యాల్లో ఒక భాగం.వీళ్ళలో చాలామంది అసలు పరిశోధనల్లో పాలు పంచుకున్నవాళ్లు అయి ఉండరు,ఒకవేళ వీళ్ళు కూడా పరిశోధకులు అయిన్నప్పటికీ వైజ్ఞానిక పరిశోధనా ప్రపంచంలో విశ్వసనీయతా గౌరవమూ ఉన్నవాళ్ళు కాదు.క్రైస్తవమతాన్ని ప్రపంచానికి ఏకైక రక్షణ విధానం అని చెప్తున్న వాళ్ళు కాబట్టి క్రైస్తవమతం సోదిలో కూడా లేని కాలంలోనే ఈ భూమి మీద అనేక ప్రాంతాలలోని మానవసమూహాలు అద్భుతమైన సాంకేతికతని సాధించారనే నిజాన్ని జీర్ణించుకోలేకపోవడం వల్ల  ఈ గాలివార్తలని ప్రచారం చెయ్యడానికి తగులుకున్నారు.

     వీళ్ళ వ్యవహారం ఎలా ఉంటుందో పిరమిడ్ల చుట్టూ జరుగుతున్న పరిశోధనల్ని చూస్తే తెలుస్తుంది.చూడగానే పిరమిడ్లు చెల్లా చెదురు నిర్మాణాలు అనిపిస్తాయి.కానీ వాటి మూలల నుంచి ఒక సరళరేఖ గీస్తే అవన్నీ కలిసి నైలు నది  డెల్టాని రెండుగా చీల్చుతున్నట్టు కనుక్కున్నారు.వెంఠనే అలియన్ థియరిస్టులు ""Here is what really happened: A couple of aliens, flying high enough over the Earth to be able to see where the Nile Delta's origin is, easily saw what orientation the pyramid would need to be in order to have its diagonals lie on those two lines."" అంటూ ఎలియన్సు పేరు మీద హడావిడి చేస్తారు.ఒక్క పిరమిడ్సు మాత్రమే కాదు ప్రపంచంలో ఈనాడు ప్రాచీనమైన ఆన్ని నిర్మాణాలనీ పరిశోధించిన వారందరూ చెబుతున్నది ఒకటే మాట - "ఇవేవీ అనాలోచితంగా కట్టిన నిర్మాణాలు కావు,పైగా ఏ నిర్మాణమూ దానికది విడి నిర్మాణం కాదు.అన్ని నిర్మాణాల వెనకా ఒక ఖచ్చితమైన ప్రణాళిక ఉంది.ఏ నిర్మాణం ఏ ప్రాంతంలో ఎంత వైశాల్యంలో ఏ విధమైన ఆకారంతో కట్టాలి అని నిర్ధారించుకుని చేసిన సామూహిక నిర్మాణాలు.ఏ ఒక్కదాన్నీ విడిగాచూస్తే ఎందుకు కట్టారో అర్ధం కాదు.అన్నింటినీ కలిపి అర్ధం చేసుకుంటేనే అసలు కారణం తెలుస్తుంది." అని.నిజమైన జిజ్ఞాసువులు ఈ సూడోసైన్సుగాళ్ళని పట్టించుకోకుండా పరిశోదనలు సాగిస్తున్నారు గనకనే సైన్సులో ఈ కొంచెం పురోగతి కనిపిస్తున్నది.అయితే ఈ మధ్యనే వాళ్ళకీ సూడోసైన్సుగాళ్ళని పట్టించుకోకపోవడం వలన జరుగుతున్న ప్రమాదం తెలుస్తున్నది.కొందరు ఈ సూడోసైన్సును ఖండిస్తూ ముందుకి వస్తున్నారు.

     Eric Cline succinctly explains this in his review, noting "pseudoarchaeologists cannot accept the fact that the mere humans might have come up with great innovations such as the domestication of plants and animals or built great architectural masterpieces such as the Sphinx all on their own; rather, they frequently seek or invoke divine, or even alien, assistance to explain how these came to be." archaeologist Jeb Card points out, as does Feder, that the origins of this idea lay in Victorian mysticism and Theosophy, a movement that "blended hermetic magic, spiritualism, Western curiosity abut Eastern religion, colonial racism, and misconceptions of evolution into a worldview of root races, lost continents, and ascended masters who originated on Venus or other worlds."Andrew Collins' book Göbekli Tepe: Genesis of the Gods, reviewed by archaeologist Eric Cline, deals with the Neolithic site in Turkey that Collins tries to connect to the biblical Garden of Eden by treating the Bible as incontrovertible fact.Unfortunately, tales of ancient aliens and extraordinary humans creating the Pyramids as a communication device are often more fascinating than slow cultural change.  Archaeologists need to find a way to showcase the humanity of the past and get across the idea that ancient humans were intelligent, capable, and innovative -- that those of us alive today are the product of that long history of innovation, and that we are continuing the tradition of our early ancestors by inventing cars, computers, and, yes, even pseudo scientists.

     ఈ సూడోసైంటిస్టుల మరొక దినకృత్యం ఇప్పుడు సైన్సు కనుక్కుంటున్నవన్నీ బైబిలు అబద్ధాలను రుజువు చేస్తున్నా సరే తిరగేసి మరగేసి  బైబిలు యొక్క శాస్త్రీయతను నిలబెట్టటం.వీళ్ళ అండతో క్రైస్తవ మత ప్రచారకులు క్రైస్తవేతర మానవ సమూహాలు పూజించే దేవుళ్ళు తాము చెబుతున్న గ్రహాంతరవాసులు మాత్రమేననీ ఆయా సంస్కృతుల ప్రజలు అజ్ఞానం చేత వాళ్లని పూజిస్తున్నారనీ చెబుతారు.అలా చెప్పటం వవతలివాళ్ళని సిగ్గుపడేలా చేసి తమ మతంలోకి రప్పించుకోవటానికే!అలా చెప్పకపోతే ఆయా సంస్కృతులు తమకన్న గొప్పవి అని ఒప్పుకోవలసి వస్తుంది.అప్పుడు మేము మీకన్న గొప్పవాళ్లం,మాలోకి వస్తే మీరూ గొప్పవాళ్ళు అయిపోవచ్చునని చెప్పటం కుదరదు కదా!

     ఈ క్రైస్తవ మత ప్రచారకుల డాంబికాలు ఎక్కువకాలం నిలబడవు గానీ అసలు ప్రాచీన కాలంలోని ప్రజలు ఆధునికులం అని చెప్పుకుంటున్న మనకి సాధ్యం కాని స్థాయిలో సాంకేతికతని ఉపయోగించి అంతటి బృహన్నిర్మాణాలని ఎట్లా నిర్మించగలిగారు?మానవ సమాజం ఒక తరం కన్న మరొక తరం వృద్ధిని సాధిస్తూ కదులుతుందని అనుకుంటున్న మన నమ్మకాన్ని పటాపంచలు చేస్తూ వెనుకటి కాలం వాళ్లు సాధించినవాటిని చూసి ఆశ్చర్యపోవడమే తప్ప సాధించలేని తక్కువ స్థాయిలో ఉండటాన్ని ఎట్లా అర్ధం చేసుకోవాలి?వాళ్ళ తర్వాత పుట్టినవాళ్ళం వాళ్ళనుంచి నేర్చుకున్నదానికి మనం కొంత కలుపుతూ వాళ్ళకన్న తెలివిగా ఉండటం సహజం కదా అని అమాయకత్వంతోనో అహంకారంతోనో ఆలోచిస్తే కుదరదు - వాళ్లు మనకన్న తెలివైనవాళ్లు అవడమూ నిజమే, మనం వాళ్ళకన్న తెలితక్కువవాళ్ళం అవడమూ నిజమే!

     ఈ ముడిని విప్పటానికి న్యూరాలజిస్టులు ఆర్కియాలజిస్టుల తవ్వకాల ద్వారా బయటపడిన మానవ కంకాళాల మీద చేసిన పరిశోధనలు పనికొస్తాయి.1.8 మిలియన్ల నాటి మానవ దేహాలలోని మెదడు ఇప్పటి మానవ దేహాలలోని మెదడు కన్న రెండింతలు పెద్దది!"The stone tools that have survived in the archaeological record can tell us something about the intelligence of the people who made them. Even our earliest human ancestors were no dummies" అని వాళ్ళే ఒప్పుకున్నారు.మొదట్లో అద్భుతమైన ప్రజ్ఞ కలిగివుండి పోను పోనూ ప్రజ్ఞ తగ్గిపోవడం అనేది ఇప్పటి ఆధునికులు చెప్తున్న జీవపరిణామవాదం ప్రకారం విచిత్రమైన విషయమే గానీ ప్రాచీన భారతీయ విజ్ఞానులు చేసిన యుగవిభజనలో కనిపించేది ఇదే కదా!మొదటిదైన కృత/సత్య యుగంలో దేహపరిమాణంలో గానీ బుద్ధివిశేషంలో గానీ మానవులు సర్వోన్నతులై ఉంటారు, రెండవదైన త్రేతాయుగంలో ఔన్నత్యం కొంత తగ్గుతుంది,ద్వాపరయుగంలో ఔన్నత్యం మరింత తగ్గి కలియుగంలో శైధిల్యం తారాస్థాయికి చేరుకుంటుంది అని చెప్పారు కదా!

     ఈ పరిశోధనలు చేసినవారు మరొక విషయాన్ని కూడా చెబుతున్నారు.మిగిలిన అకడమిక్ న్యూరాలజిస్టులు కూడా ఆ విషయాన్ని నిర్ధారిస్తున్నారు.అదేమిటంటే, ఇప్పటి మానవులు మెదడుకున్న మొత్తం శక్తిలో చాలా తక్కువ శాతాన్ని మాత్రమే ఉపయోగించుకుంటున్నారు.కనీసం 50% వరకు ఉపయోగించుకోగలితే చాలు అన్ని రంగాలలో ఇప్పటికన్న ఎంతో మెరుగైన జీవితాన్ని గడుపుతూ శాస్త్రీయతలో ప్రాచీనులతో పోటీ పడగలిగే అవకాశం ఉంది.ఒక రకంగా చెప్పాలంటే అప్పటివారు అవసరాన్ని బట్టి అవన్నీ నేర్చుకుని సాధించి మనకు వడ్డించిన విస్తరిని అందించారు.వారు మనకు ఇచ్చినదాన్ని కూడా సరైన పద్దతిలో ఉపయోగించుకుని సుఖపడటమే తెలియని స్థితిలో ఉన్న మనకు కొత్త విషయాలని కనుక్కోవడానికి ఉత్సాహం ఎక్కణ్ణుంచి వస్తుంది?వాళ్ళు అన్నీ అమర్చిపెట్టడం వల్ల కొత్తవి కనుక్కోవాల్సిన అవసరమూ లేదు.మిగిలిన ప్రపంచం సంగతి ఎలా ఉన్నా ఒకనాడు ప్రపంచం మొత్తాన్ని కలయదిరిగి ఈరోజు భూమి మీద విభిన్నమైనవిగా కనిపించే అసంఖ్యాకమైన సంస్కృతులని ప్రభావితం చేసిన అఖండ ప్రజ్ఞానిధులు పుట్టిన భారతదేశంలోని ప్రజలలో కనిపించే నిస్తబ్దతకి విద్యార్ధులలో బుద్ధిని వికసింపజేసే విషయాలు లేని బానిసగొట్టు విద్యావ్యవస్థయే ముఖ్యమైన కారణం!

     బ్రిటిషువాళ్ళ వలస దేశాల్లో కొంచెం ముందువెనకలుగా మనతోపాటు స్వతంత్రం తెచ్చుకున్న ఇతర దేశాలలో మొదట చేసినది ఇంగ్లీషువాళ్ళు నాశనం చెయ్యాలని చూసిన తమ జాతీయతని నిలబెట్టుకునే గట్టి ప్రయత్నాలు చెయ్యడం.మన దేశంలో జరిగినది మాత్రం అందుకు పూర్తి వ్యతిరేకం - స్వతంత్రం రాకముందు కన్న వచ్చాక బ్రిటిషువాళ్ళ పట్ల ఆరాధన ఇంగ్లీషు భాష పట్ల బానిసత్వం పెరిగాయి!ఒక ముండలముఠాకోరువెధవ స్వతంత్రభారతప్రప్రధమప్రధాని స్థానంలో ఉండి తన పేరుని దేవానంద ధర్మానంద కౌశాంబి అని చెప్పుకోవడానికి సిగ్గుపడి డి.డి.కౌశాంబి అనీ శ్రీపాద అమృత డాంగే అన్న వినసొంపైన చక్కని పేరుని మడతలు వేసి యస్.ఏ.డాంగే అనీ చెప్పుకున్న ఈదేశంలోఏముందినాబొంద గాళ్ళని విశ్వవిద్యాలయాల్లో పీఠాధిపతులుగా నియమించి వాళ్ళచేత పరమ పాషండాలతో నిండిన అబద్ధాల చరిత్రని రాయించి పిల్లల చేత చదివించాడు!తెల్లగా పుట్టినవాళ్ళంతా ఆర్యులు నల్లగా పుట్టినవాళ్ళంతా ద్రవిడులు, ఆర్యులు ఎక్కడినుంచో వచ్చి ఇక్కడున్న స్థానికులైన ద్రవిడుల్ని అణగదొక్కి తమ సంస్కృతిని రుద్దేశారు అని ప్రజలని చీల్చడానికి రాస్తున్నవి అబద్ధమని తెలియకనే రాశారా రొమిల్లా ధాపర్ లాంటివాళ్ళు?పక్కనుంచి అంబేద్కర్ చెప్తూనే ఉన్నాడు కదా ఇవన్నీ అల్లికలూ కుట్టుపనులూ అని!ప్రపంచమంతటికీ మేమే సంస్కృతిని నేర్పామనటం సాంస్కృతిక దురహంకారం అనే అజ్ఞానులకి అరేబియాలో బయటపడుతున్న ప్రాచీన కాలపు గణేశ విగ్రహాలూ రష్యా శాస్త్రవేత్తలు దక్షా మ్యాప్ అని పేరు పెట్టుకున్న శిలాఫలకాలూ కనపడటం లేదా?విదేశీయులే "ప్రపంచంలోని సమస్త నాగరికతలకూ భారతదేశమే మాతృస్థానం!" అని బల్లగుద్ది చెప్తుంటే మన వెనకటి తరాల వాళ్ళ గొప్పని మనం గుర్తు చేసుకోవడం కూడా సాంస్కృతిక దురహంకారం అంటూ మనవాళ్ళకి గ్రీకులు చెప్పేవరకూ రాశుల గురించి తెలియదు లాంటి చెత్తవాగుడు వాగడం ఏ  రకం తెలివి?

     ప్రాచీన భారతీయ మేధావుల గొప్పదనాన్ని ఒప్పుకోలేని వాళ్ళు ఆయా నాగరికతలు అక్కడి స్థానికుల బుద్ధివిశేషం ఏమీ లేకుండా వారికి నాగరికతని భారతీయులు పరిచయం చెయ్యడం వల్లనే వాళ్ళు అలా ఉన్నారనడం హిందువుల అహంకారం అంటున్నారు గానీ చాలా కాలం నుంచీ ప్రపంచమంతటా జరుగుతున్న పరిశోధనా ఫలితాలు ఈ మధ్యనే స్పష్టమైన రూపం దాలుస్తూ పైకి విభిన్నమైన అనేక నాగరికతలు లోనారసి చూస్తే అన్నింటిలోనూ ఏకాత్మకతను చూపిస్తున్నాయనీ ఇవన్నీ ఒకే మూలం నుంచి రావడం వల్లనే  ఆ పోలికలు సాధ్యపడినాయనీ సూచిస్తున్నాయి.మీదుమిక్కిలి ఈ ఏకాత్మకతను ప్రదర్శించే లక్షణాలు ఆర్య-ద్రవిడ సిద్ధాంతులు పులిమినట్టు బయటినుంచి వచ్చినవారు రుద్దితే రుద్దించుకున్నట్లు గాక అవి ఆయా ప్రాంతాల నాగరికతలో విదేశీయమని ముద్రవేసి లాగిపారెయ్యలేనంత ఆత్మీయమైనవి అయిపోయాయనేది తెలుస్తున్నది
     ప్రపంచంలోని అన్ని ప్రాచీన కాలపు భవనాల నిర్మాణంలో T-Grooves అనే ఇనుప పరికరాలు కనిపిస్తున్నాయి.ఆ కాలపు నిర్మాణ కౌశలం ఎంత గొప్పదంటే సిమెంటు వాడకపోయినా అంత పెద్ద రాళ్ళు లెగో బ్రిక్స్ కన్న కుదురైన పద్ధతిలో అమరిపోయి ఇంత సుదీర్ఘ కాలం తర్వాత కూడా చెక్కు చెదరకుండా నిలబడి ఉన్నాయి.Tiahuanaco, Ollantaytambo, Koricancha, Mesopotamia, Egypt, Cambodia వంటి ప్రాంతాలు కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్నప్పటికీ ఈ సాంకేతికతలో ఎంత దగ్గిర పోలిక ఉందో!అందుకే పరిశోధకులు విస్మితులవుతున్నారు,కానీ భారతదేశపు వాస్తుశిల్పకళలో ఇది సామాన్యమైన విషయం.దాదాపు ప్రాచీన కాలపు అన్ని హిందూ దేవాలయాలలోనూ ఈ పనిముట్టును చాలా విరివిగా వాడారు.మిగిలిన అన్ని ప్రాంతాలలో చెదురు మదురుగా కనబడి భారతదేశంలో విరివిగా కనఫడటంలోని అర్ధమేమిటి?మొదట ఇక్కడివారు ఈ సాంకేతికతని కనిపెట్టి అనుభవం మీద రాటుదేలి ఇతర ప్రాంతాలలో కూడా కొన్ని సమూనాలు నిర్మించి అక్కడివారికి పరిచయం చేశారని కాదా!

     పిరమిడ్లు అనగానే మనకు ఈజిప్టు మాత్రమే గుర్తుకొస్తుంది.కానీ ఇవి చాలా ప్రాంతాలలో ఉన్నాయి.కొన్ని ఖగోళ సంబంధమైన విషయాలను తమ నిర్మాణంలో ఇముడ్చుకుంటే కొన్ని ఆ ప్రాంతం యొక్క భౌమాయస్కాంత శక్తిపాతాన్ని ప్రభావితం చేసే విధంగా నిర్మించబడ్డాయి.భారతదేశంలోనూ ప్రపంచంలోని అన్ని ప్రాచీన నాగరికతలు వెల్లి విరిసిన ప్రాంతాలలోనూ అరచేతి ముద్రల అలంకరణ కనిపిస్తుంది.అరచేతిని రంగులలో ముంచి రాతిమీద అద్దడం నుంచి అరచేతినే రాతిమీద ఉంచి చుట్టూ రంగులను వెదజల్లడం వరకు ఎన్నో రకాలైన పద్ధతులలో ఈ హస్తముద్రలని వాడుకున్నారు.దీని అర్ధం యేమిటో యెవరికీ తెలియడం లేదు గానీ నా వూహ ప్రకారం వాటిని రూపు దిద్దినవారు "కరాగ్రే వసతే లక్ష్మీ" శ్లోకంతో దినచర్యను ప్రారంభించే సనాతన ధార్మిక సంప్రదాయంలో అరచేతికి ఉన్న ప్రాధాన్యతను సూచిస్తున్నారు.

     ఇవి కాలక్షేపానికో  యధాలాపంగానో చేసినవి కావు.అసలు ప్రాచీన కాలంలోని ఏ ఒక్క నిర్మాణమూ అర్ధం లేనిది కాదు,ఇంతమంది పరిశోధకులు ఇంతకాలం పాటు శ్రమించినా ఇది ఇక్కడ అనవసరమని తీసి పక్కన పెట్టలేకపోతున్నారు.స్వస్తిక చిహ్నాన్నే తీసుకోండి - ఇపుడది నాజీ హిట్లర్ వాడడం వల్ల జర్మన్లకి ప్రత్యామ్నాయంగా మారింది.కానీ ప్రాచీన కాలపు యూరోపియన్ సంస్కృతికి సంబంధించిన Etruscan, Greek, Roman, Gaul, Celt నాగరికతకి చెందిన శిధిలాలలో స్వస్తిక చిహ్నం కనబడుతుంది.స్వస్తిక చిహ్నం పుట్టినది హిందూమతంలోనే అనీ పైన చెప్పుకున్న నాగరికతలు హిందూమతం నుంచి ప్రేరణ పొందినవేననీ ప్రత్యేకించి చెప్పనక్కరలేదు కదా!
     ఈజిప్షియన్ పిరమిడ్లలో స్ఫింక్స్ అనే రూపం ఉంది.దీని ప్రత్యేకత నృసింహావతారమూర్తిలోని సింహం తలతో ఉన్న మానవ రూపంలా సింహం దేహానికి మనిషి తలను అతికించినట్టు ఉండటం.మన పౌరాణిక సాహిత్యంలో కామధేనువు రూపచిత్రణ కొంచెం పత్యేకంగా ఉంటుంది.తోక ఆవుతోకలా కాక నెమలి పింఛంలా ఉంటుంది.మిగిలిన దేహం అంతా చూడచక్కని ఆవు - అయితే తల మాత్రం మానవస్త్రీది!ఇక్కడ కామధేనువుకి స్త్రీముఖం ఉంటే అక్కడ స్ఫింక్స్ అనే రూపానికి పురుషుడి ముఖం ఉంటుంది.అంటే ఇవి స్త్రీ పురుష తత్వాలకి సంబంధించిన ద్వంద్వాలు - ఏ సంస్కృతి దేనికి ప్రాధాన్యత ఇస్తుందో అక్కడ  ఆ మూర్తి ప్రముఖంగా ఉంది.ప్రపంచంలోని అన్ని చోట్లా మనం భద్రకాళి అని పిలుచుకున మూర్తి వలె నాలుక బయటికి చాపిన ఉగ్రమూర్తులు కనబడుతున్నాయి.అర్ధం తెలియనివాళ్ళకి ఇది భయోత్పాతాన్ని కలిగించే డెవిల్ వర్షిప్ అనిపిస్తున్నది,కానీ వాటిని అర్ధం చేసుకోవాలంటే భారతీయ సంస్కృతిని అర్ధం చేసుకోవాలి.దుష్టులని భయపెట్టడం వల్లనే శిష్టులని రక్షించగలగడం అనే రహస్యం వాటిలో ఇమిడివుంది గనకనే ప్రపంచమంతటా వాటిని గౌరవిస్తున్నారు,పూజిస్తున్నారు!

     ఇంకా విశేషం యేమిటంటే, ప్రాచీన కాలంలోని పూజారి వ్యవస్థ అన్ని నాగరికతలలోనూ ఒక్కలాగే ఉంది.మొత్తం సామాజిక జీవితంలో అతనికున్న ప్రాధాన్యతా సామాజికుల నుంచి అతనికి లభించే గౌరవాలూ వేషధారణా ప్రవర్తనా అన్నీ ఒక్కలాగే ఉండడమే కాకుండా అవి భారతదేశపు ఆలయ పూజారుల వ్యవస్థను పోలి ఉన్నాయి.ప్రపంచ నాగరికతల మధ్యన ఉన్న అన్ని పోలికలలోనూ ఈ ఒక్కటి చాలు అవన్నీ హిందూమతం అని వాళ్ళు పేరు పెట్టిన సనాతన ధర్మమే అత్యంత ప్రాచీనమైనదే కాక అత్యంత ప్రభావశీలమైనది కూడా అని నిరూపించడానికి!
     అసలైన అద్భుతం యేమిటంటే మిగిలిన ప్రాంతాలలో చెదురుమదురై కనబడుతున్న ఆ కొన్ని నిర్మాణాలలోని విస్మయపరిచే సాంకేతికత భారతదేశంలోని ప్రాచీన కాలపు ఆలయాల నిర్మాణంలొ అతి సామాన్యమై గోచరిస్తున్నది. వెయ్యి స్తంభాల గుడిలో స్తంభాలని ఎప్పుడయినా లెక్కపేట్టారా?ఖచ్చితంగా వెయ్యి స్తంభాలు లెక్కకి రావు! వెయ్యి స్తంభాలు ఉన్నాయి, కానీ మీకు కనపడటం లేదు అంటే నమ్ముతారా!ఇంద్రజాలమో మహేంద్రజాలమో కాదు,అది వారి నిర్మాణ కౌశలం!మీరు గోడల్ని పరిశీలించి చూస్తే ఇటుకలుగా వాడిన రాళ్ళకి మధ్యన గాడులు కనిపించక అది ఏకశిలానిర్మాణమేమో అనిపిస్తుంది.కానీ కాదు.వాళ్ళు రాతి ఇటుకల్ని ఇప్పటి లెగో బ్రిక్స్ కన్న ఎంతో సంక్లిష్టమైన అమరికలతో చెక్కి ఒకదానిలో ఒకటి ఇరికించితే మీరు చూస్తున్న ఏకాండశిలానిర్మాణం అనిపించే ఆలయం తయారైంది!ఇక్కడ ఇంకొక విశేషం యేమిటంటే,అన్ని ఆలయాలలోనూ గోడల మీద దేవతాప్రతిమలతోనో నృత్యభంగిమలతోనో అలంకరించితే ఇక్కడ విచిత్రమైన ఆకారాలతో అలంకరించారు,ఎందుకంటారూ!అవి వాళ్ళు రాళ్ళని తొలచడానికి ఉపయోగించిన పనిముట్లు!ఈ ఆలయంలోనే కాదు దాదాపు ఎలా కట్టారో తెలియడం లేదని అనిపించే ప్రతి ఆలయంలోనూ తాము కట్టిన సాంకేతికతను గురించి క్లూలు ఇస్తూనే ఉన్నారు.ఇంత తెలివైనవాళ్ళూ ఇటువంటి సాంకేతికతని ప్రదర్శించినవాళ్ళూ మానవులే కదా!మిగిలిన చోట్ల కూడా ఆయా నిర్మాణాలని కట్టినవాళ్ళు వీళ్లే కాకూడదా?ఈ కాస్త కోసం ఎలియన్సు రావాలా!
     ప్రతీ ఆలయంలోనూ ఆ అలయానికి మాత్రమే అమరేటట్టు ఒక ప్రత్యేకతను చూపించడం,ఆ ప్రత్యేకతను మరే ఆలయంలోనూ వాడకపోవటం అనే ఇక్కడి వారి ధోరణి వల్లనే ప్రపంచంలోని అన్ని నిర్మాణాలూ కొన్ని పొలికల్నీ కొన్ని తేడాల్నీ చూపిస్తున్నాయి!భూమి మీద విసిరివేయబడినట్లు కనిపించే ప్రాచీ కాలపు కట్టడాలు ఏవీ అనుకోకుండా కట్టినవి కాదనీ వాటన్నిటి వెనకా ఖచ్చితమైన పరస్పరాధారితమైన విషయాలు ఉన్నాయనీ శాత్రవేత్తలు ఒప్పుకుంటున్నారు.ఉదాహరణకి ఈజిప్షియన్ పిరమిడ్లలో పెద్దదైన గిజా పిరమిడ్ బరువు 5,955,000 టన్నులు.దీనిని 10^8తో హెచ్చిస్తే భూమి యొక్క ద్రవ్యరాశి వస్తుంది!దాదాపు ప్రతి నిర్మాణంలోనూ కనబడుతున్నఇలాంటి విశేషాల్ని గమనించిన ఒక శాస్త్రవేత్త "I can’t help to wonder if there is a slight chance that somehow, ancient cultures all over the world were connected, either through a global consciousness, or another global phenomenon that helped point them in a single direction, which resulted in the construction of countless ancient sites that look alike as if it was a construction process on a global scale.Almost as if every single culture on our planet felt the need to place monuments such as the pyramids, the Stonehenge, Teotihuacan and other incredible places in specific locations.What these ancient civilizations did was create a pattern, a pattern that we today are identifying and connecting, forming a massive puzzle, piece by piece." అని భావిస్తున్నాడంటే ఆశ్చర్యంగా లేదూ!ఈ రకమైన పరస్పరాశ్రితమైన సంబంధాల్ని మానవజాతి ప్రభవించిన మొట్టమొదటి రోజుల్లోనే గుర్తించి చాలా ముందుగానే గణితశాస్త్రం, ఖగోళశాస్త్రం, లోహవిజ్ఞానశాస్త్రం వంటివాటిలో జ్ఞానరాశిని పెంచుకుని అందరికీ పంచి వసుధైవకుటుంభభావనని గురించి చెప్తున్న సనాతన ధార్మికులకి కాక వీటిని నిర్మించే మేధస్సు ఇంకెవరికి ఉంటుంది?

     పెరూ లోని నాజ్కా ఎడారిలో భూమి మీద అతి పెద్ద పరిమాణంలో నేలమీద గియ్యబడిన కొన్ని చిత్రాలు సామాన్యప్రజలనే కాక పరిశోధకులని కూడా విస్మయపరుస్తున్నాయి.Salisbury పొలిమేరలో ఉన్న Stonehenge నిర్మాణాన్ని కూడా మిధ్యావాదులు గ్రహాంతరవాసులకి దఖలు పర్చేశారు గానీ పరిశోధకులు అంగీకరించడం లేదు.Erich von Däniken అనే  స్విస్ మేధావి అది సౌరమండలం యొక్క నమూనా కావచ్చునని ప్రతిపాదించాడు.అసలు పరిశోధకులు వాటిలో కనబడుతున్న రేఖాగణిత విషయాలనీ ఖగోళ సంబంధమైన విషయాలనీ గమనించి గభాల్న వాటిని గ్రహాంతరవాసులకి అంటగట్టే సాహసం చెయ్యడం లేదు గానీ మిధ్యావాదులు మాత్రం గ్రహాంతరవాసులకి దఖలు పర్చేశారు.అంతేకానీ అత్యంత ప్రాచీన కాలంలోనే గణితశాస్త్రాన్నీ ఖగోళ శాస్త్రాన్నీ స్వాధీనం చేసుకున్న భారతీయ విజ్ఞానుల ప్రమేయాన్ని ఎవరూ ప్రస్తావించడం లేదు.అయితే ఈ సందేహాన్ని పరిశోధకుల ముందు ఉంచినప్పుడు వారూ కొట్టిపారెయ్యడం లేదు.అసలైన విషాదం ఏమిటంటే ఆ ప్రాంతంలో అధికారం చలాయిస్తున్న ప్రభుత్వాలు ఆ రకమైన ఫలితాలని తొక్కిపెట్టేస్తున్నాయి. 
     మహాభారతంలో యుద్ధకాండకు ముందు వచ్చే భూపర్వంలో ఒకచోట భూమి నిర్జీవమైన రాళ్లూ మట్టీ కలిసిన గోళం కాదనీ అది కూడా ప్రాణియేననీ చెబుతూ దానిని పరమాత్మ స్వరూపంగా గుర్తించితే పాపకర్మలు చెయ్యడం తగ్గుతుందనే సూత్రీకరణ ఒకటి ఉంటుంది - ఈ రోజున స్వార్ధపరులైన కొందరు మానవుల భోగలాలసత కోసం భూమిని కుళ్ళబొడుస్తున్నది అది కేవలం మట్టిదిబ్బ అనే చిన్నచూపు వల్లనే కదా!ఎన్నిసార్లు గడ్డి పెట్టినా తెలుగులో మంత్రాలు చదవలేదని బూతులబుంగ తెలుగులో కుళ్ళిచచ్చే కూష్మాండం గాళ్ళకి వాళ్ళు అలా ప్రవర్తించడం వల్లనే హిందువులు మరింత ధృఢమవుతున్నారని తెలియడం లేదు - అది వాళ్ళ కోడిమెదడు తెలివి.వాళ్ళ యేడుపుని ఆరున్నొక్క రాగం స్థాయికి పెంచేలా ఒక్క భారతదేశంలోనే కాదు ప్రపంచమంతటా హిందూధర్మం బలం పెంచుకుంటున్నది!కేవలం అరగంట వ్యవధిలో 13 మైళ్ళ కైవారంలో నిర్దుష్టమైన అన్ని వివరాలతో సమగ్రమైన రూపంతో కనబడిన ఓరెగాన్  శ్రీచక్రం దైవం హిందువులకి ఇస్తున్న సూచన - "మీరు ఒక్క అడుగు వేస్తే నేను మిమ్మల్ని పది అడుగులు నడిపిస్తాను.తొలి అడుగు వెయ్యడమే మీ వంతు.మిగిలినది నా వంతు!" అని పూరించిన పాంచజన్య శంఖధ్వానం అది. వినబడటం లేదా?


Hinduism is rasing, raising, raising!!!

12 comments:

  1. పవన్ కళ్యాణ్ గారి ముసుగును తొలగించడానికి, ఆయన అభిమానులే ఆత్రపడుతున్నారా?

    పవన్ కళ్యాణ్ గారు తనను వదిలేసి మరో పెళ్లి చేసుకొన్నా
    రేణూ దేశాయ్ చెప్పీ చెప్పకుండా చెప్పుకొనేది ఆవిషయం గురించి మీడియాలో ఇన్నాళ్లూ
    మనుషులకంతా అర్థం అయ్యేది

    కాని ‘దేవుడి’ అభిమానులు కాబట్టి
    వారికి మరోలా అర్థం అయ్యేది

    ఆవిడ తాజాగా పవన్ సంతానం సాక్షిగా
    జరుపుకొన్న పెళ్లి నిశ్చితార్థపు ఫోటోలు పెట్టేసరికి

    దేవుడి అభిమానులు ఆవిడ పాలిట
    రక్కసులుగా మారి
    సోషల్ మీడియాలో చేసిన
    మానసిక హింసకు

    రేణూ దేశాయ్ గారు
    తన ట్విట్టర్ అకౌంట్ ని మూసేసారు

    అయినా శాంతించని శాడిజంతో
    ఆవిడ ఇన్స్టాగ్రాం అకౌంట్లోకి చొరబడి
    ఆవిడను మానసికం గా హింసించేసరికి

    ఆవిడ బయటకు కక్కేశారు

    ఇన్నేళ్లూ పవన్ తో విడాకుల గురించి
    మౌనంగా వున్నందుకు
    పవన్ అభిమానులగా
    జీవితాంతం నాకు మీరు
    రుణపడివుండాలి

    నేను నోరు తెరిచి విడాకుల గురించి
    నిజాలు చెబితే
    మీ మూర్ఖత్వం
    మొరటు అహంకారం
    క్రిందికి దిగి
    మురుగు కాలువలోకి వెళతాయి అని
    హెచ్చరించారు

    చూస్తుంటే పవన్ కళ్యాన్ గారి
    ముసుగును తొలగించేలా అభిమానులే
    ఆత్రపడుతున్నట్టున్నారు

    అప్పుడు గాని మహిళా సంఘాలు కూడా కలిసి
    కథానాయకుడిని కాస్తా ప్రతినాయకుడిగా తెలుసుకొని
    కాండ్రించే వరకు
    కాస్తా కూడా నెమ్మదించేలా లేరు

    పవన్ తన భౌతిక వాంఛలు తీర్చుకోడానికి
    ఇంకో పెళ్లి చేసుకొన్నప్పుడు

    ఆయన విడాకులు ఇచ్చిన
    రేణూ దేశాయ్ గారు మరో పెళ్లి కోసం
    నిశ్చితార్థం చేసుకొంటే
    మధ్యలో ఈ అభిమానుల
    అరాచకాలు
    ఉపదేశాలు ఏందో

    ప్రేక్షకుల ధర్మాన
    కథానాయకుడిగా ఎదిగిన
    పవన్
    అభిమానుల ధర్మాన
    నిజ జీవిత ప్రతినాయకుడిగా
    ప్రజల మధ్య తలదించుకొనే రోజులు
    త్వరలో వస్తున్నట్టే అనిపిస్తోంది. ….చాకిరేవు.

    ReplyDelete
  2. హరిబాబు గారూ, మీరు పల్లెప్రపంచంలో చేసిన వ్యాఖ్యలను నా ఫేస్ బుక్ వాల్ పైన ప్రచురించాను. దానికి సమాధానంగా ఒక వ్యాఖ్యాత ఇలా అన్నారు. మీ స్పందనను కోరుతున్నాను.....శ్రీనివాసుడు.
    ఇది మీ వ్యాఖ్యలోనిి ఒక భాగం..‘‘ప్రతి చలనానికీ సంకల్పంతో కూడిన శక్తి ఉండితీరాలి అన్న భౌతిక నియమాల ప్రకారమే ఈ సృష్టిచలనానికి ఒక కర్త ఉన్నాడని నిర్ధారించవచ్చును.ప్రయోగాల ద్వారానూ సాక్ష్యాల ద్వారానూ నిరూపించలేనివాటికి తర్కం అనేది వాడవచ్చునని యూనివర్సల్ లాజిక్ సిస్టం ఒప్పుకుంటుంది.సృష్టికి కర్త లేదు అంటే థర్మోడైనమిక్స్ అబద్ధం కావాలి.దీనిని కూడా తిరస్కరిస్తే సృష్టిలోని చలనానికి కారణం యేమిటో పదార్ధాలు చలించడానికీ చలనం ద్వారా జరిగే పనులకీ నిర్దిష్టమైన నియమాలు ఎలా అవ్చ్చాయో చెప్పాల్సిన burden of proof దైవం ఉనికిని తిరస్కరించే వారి మీదే ఉంటుంది!‘‘
    ఇది వ్యాఖ్యాత స్పందన... ‘‘Sreedhara Sarma Peddibhotla చాలా ఆలోచించాల్సిన విషయం! బాహ్య శక్తి వెనుక ఒకరి సంకల్పం ఉన్నదనటం! అయితే అంతర్గత శక్తి వెనుక ఆసంకల్పం లేదా? మరి దైవ సంకల్పం అనే క్వాంటం కణం ఉందంటారా? లేక ఏ కణానికైనా దైవత్వం అనే క్వాంటం స్థితి ఉందంటారా? విశ్వం యొక్క ఎంట్రొపీ నిరంతరం పెరుగుతోందని చదివాను! కొన్నీ శాస్త్రీయ సమాచారం కూడ ప్రచురించటం చూశాను! ఒక గెలాక్సీ ఇంకో గెలాక్సీని గుద్దుకో వటం, లేక ఇంకో కృష్ణ బిలంలోకి ఆకర్షించ బడటం లాంటి వార్తలు! మరి మీరేమో విశ్వం జడత్వంలోకి వెళ్ళుతోంది అంటున్నారు! జడత్వం అంటే ఎంట్రొపి శూన్యం అవటం! అంటే క్రమ రహిత స్థితి నుండి క్రమ స్థితికి చేరటం! విశ్వం అంటేనే వ్యాపించటం అంటే డిసార్డర్ (ఎంట్రొపి) పెరగటం! కాబట్టి మీ వ్యాసంలో విరుద్ధ భావాలున్నాయి!‘‘
    నా ఫేస్ బుక్ పోస్ట్ లంకె... https://www.facebook.com/Sreenivasudu/posts/2092226564399486?comment_id=2092332567722219&notif_id=1530504050869853&notif_t=feed_comment

    ReplyDelete
    Replies
    1. అక్కడ నేను జవాబు ఇవ్వడం కుదరడం లేదు.ఎందుకో తెలియదు.
      --------------------------------------
      అందులో వైరుధ్యం ఏమీ లేదు.నేను స్పష్టత కోసం బాహ్యమైన శక్తి అని వాడాను.మన దేహంలోని చలనానికి అవసరమైన సంకల్పం లేపలే ఉన్నది గదా! సంకల్పానికి బాహ్యం,అంతరం వంటివి ఉండవు.చలనం అనేది ఒక మనకి అనుభవంలోకి రావాలంటే సంకల్పం అవసరం.ప్రతి చలనానికీ ఒక సంకల్పం కారణం అవుతున్నది - ఇది తిరుగులేని నిజం!

      నేను జడత్వం శూన్యంలోకి వెళుతుందని అనలేదు.మనకి చలనం కనిపించని జడం కూడా పూర్తి జడత్వాన్ని ప్రదర్శించడం లేదు..సైంటిస్టులు కూడా ప్రతి వస్తువులోనూ ఒక వ్యవస్థ ఉంటుందని చెబుతారు కదా!మనం ప్రాణం అనేదాన్ని బయాలజిస్టులు life system అంటారు.

      చలనం అన్నదాన్ని మీరు భౌతికపరమైన చలనం వరకే పరిమితం చేసి అర్ధం చేసుకున్నారు.కదలకుండా పడివున్న రాయిలోనూ అణువుల స్థాయిలో చలనం జరిగే ఒక వ్యవస్థ ఉన్నది.అది నిత్యం విచ్చిన్నం అవుతూనే ఉన్నది.

      మీ కామెంటులోని "జడత్వం అంటే ఎంట్రొపి శూన్యం అవటం! అంటే క్రమ రహిత స్థితి నుండి క్రమ స్థితికి చేరటం!" అని చేస్తున్న సూత్రీకరణ గందరగోళాన్ని కలిగిస్తున్నది.ఎందుకంటే మనం జడత్వం అనేదానికీ క్రమరహితస్థితి -/క్రమసహితస్థితి అనేవాటికీ సంబంధం లేదు.జడత్వం ఒక వస్తువును మనం బయటనుంచి చూస్తున్నప్పటి భౌతిక చలనానికి సంబంధించిన వర్ణన.ఇక ఆ వస్తువు యొక్క స్థిరత్వం ఆ వస్తువు యొక్క వ్యవస్థని క్రమసహితస్థితిలో ఉంచడానికి ఎంత శక్తి అవసరం అవుతుంది అన్నదాన్ని బట్టి ఉంటుంది!ఇది చాలామటుకు రసాయనిక శాస్త్రం పరిధిలోకి వస్తుంది. equilibrium thermodynamics అర్ధం అయితే గానీ ఈ పాయింటు అర్ధం కాదు.simplify చేసి చెప్పాలంటే ఇనుముకి తుప్పు పట్టడం దగ్గిర్నుంచి రేడియో ఆక్టివిటీ వరకు అన్నింటిలోనూ వ్యవస్థలు క్రమసహితస్థితి నుంచి క్రమరహితస్థితికి వెళ్తూ ఉండటం చూడవచ్చును.ఒకసారి దేవుడనేవాడున్నాడా అని మనిషికి కలిగెను సందేహం!మానవుడనేవాడున్నాడా అని దేవుడి కొచ్చెను అనుమానం! పోష్టు చూస్తే బాగుంటుంది.విశ్వంలో నడుస్తున్న steady state thermodynamics గురించి చెప్పిన విశ్వసృష్టిరహస్యం మేడీజీ - ఫ్రం వేదవ్యాస టు హరిబాబు! పోష్టును కూడా చూస్తే మరింత అర్ధం కావచ్చును.
      -------------------------
      ఈ జవాబును మీరు అక్కడ ఇవ్వండి.

      Delete
    2. Those two topics are here

      https://harikaalam.blogspot.com/2017/07/blog-post_7.html

      https://harikaalam.blogspot.com/2017/01/blog-post_7.html

      Convey his response!

      Delete
    3. మీ స్పందనని వారికి తెలియజేసాను. నా ఫేస్ బుక్ పోస్టులో ఫ్రెండ్స్ లిస్ట్ లో లేకపోతే కామెంట్ చేయలేరు. గనక నాకు ప్రెండ్ రిక్వెస్ట్ పంపించండి. యాక్సెప్ట్ చేస్తాను. ఇక మీరు కామెంట్లు చేయవచ్చు. ఆయన స్పందన యిస్తే మీకు తెలియజేస్తాను.

      Delete
  3. మొన్న బిగ్ బాస్ 2 చూశాను.ఎందుకో కుర్ర N.T.R ఉన్నప్పుడు అస్లు చూడాలనే అనిపించలేదు.కానీ నాని అదరగొడుతున్నాడు!చాలా బాగుంది.
    అయితే మానవవాది గోగినేని బాబు ప్రవర్తనే వింతగా ఉంది.ఇచ్చిన టాస్కుల్ని మోసం చేసి గెలుస్తున్నాడట!నాని ప్రత్యేకంగా ప్రస్తావించినా ఒప్పుకోకుండా మొండిగా వాదించడం ఆశ్చర్యమనించింది.అతను పార్టిసిపేట్ చేసిన భాగాలు చూడలేదు గానీ నాని ప్రస్తావించిన దాన్ని బట్టీ అతని సమాధానాన్ని బట్టీ మోసం చేసి గెలుస్తున్నట్టు తెలుస్తున్నది,అది తప్పు కాదా?

    ReplyDelete
    Replies
    1. నేనిప్పటి వరకు బిగ్ బాస్1 &2 చూడలేదు. ఏ ఛానల్ లో వస్తుంది? ఎన్ని గంటలకు వస్తుంది? అందులో ఏమి చూపిస్తారు?

      Delete
  4. భవిష్యపురాణం
    ---------
    రాజ వంశ వర్ణన

    పురాణ లక్షణాలలో వంశవర్ణన మొకటి.కాబట్టి అన్ని పురాణాల్లోనూ ఈ శీర్షిక వుంటుంది.అయినప్పటికీ భవిష్యపురాణంలో చేయబడిన నాలుగు యుగాల రాజవంశ వర్ణన కొంత ప్రత్యేకతని సంతరించుకుంది.మిగతా పురాణాలు సూర్య,చంద్ర వంశరాజులకే పరిమితమైపోగా భవిష్యపురాణం అన్యదేశీయ,అన్యధర్మావలంబక రాజుల జీవితాలను కూడా వర్ణించింది.మ్లేఛ్చులైన హజరత్‌నూహ్ లేదా న్యూహ్, ఆడం,హవ్వలు కూడా విష్ణుభక్తులుగానే వర్ణింపబడ్డారు.ఆత్మధ్యాన పరాయణు డొకరు ఇంద్రియదమనము చేసి "ఆదాము" కాగా అతని భార్య హవ్యవతి హవ్వ లేదా అవ్వ అయిందని ఈ పురాణంలో చెప్పబడింది.ప్రధాన నగరము అదన లేక ఇడెన్.ఈ నగర పూర్వభాగంలోని మహావనంలోనే అతడామెను కలుసుకున్నాడు.అది నాలుగు క్రోసుల విస్తీర్ణంలో ఆవరించుకొనియున్న ఉద్యానవనము.అక్కడే కలిపురుషుడు సర్పరూపంలో వేచివుండి విష్ణుమార్గం నుండి ఆదాము హవ్వలను మార్గభ్రష్టులను చేయుటకై వారిచేత లోకమార్గప్రదమను పండు తినిపించాడు.

    ఈ రకంగా సాగే భవిష్యపురాణకధపై కొందరు కన్నులెఱ్ఱ చేస్తారు. కానీ ప్రపంచానికి మూలం భారతదేశమేనని, అన్ని సంస్కారాలకూ ఆది ఇదేనని తెలిసినవారు ఆశ్చర్యపోరు.

    ReplyDelete
  5. మీ వ్యాఖ్య చదివిన వారి స్పందన...
    Sreedhara Sarma Peddibhotla హరిబాబు గారు వివరణ ఇచ్చినందుకు హరిబాబుగారూ, ధన్యవాదాలు! చరాల గతికి సంకల్పం అవసరమే కాని అచరాల గతికి కూడ సంకల్పం యొక్క అవసరాన్ని అర్థం చేసికోలేను! అణువులో ఎలెక్ట్రాన్లు భ్రమణంలో ఉండటానికి దాని అంతర్గత సంకల్పం ఉందంటారు! ఏమైనా నేను అంత నిష్ణాతుడను కాను థర్మోడైనమిక్సులో! ఇక తెలిసికొనే జిజ్ఞాస కూడలేదు! ఏమైన నా జ్ఞానం మీకు పనికి వస్తుందేమో నా టైమ్ లైన్ చూడండి!Sreedhara Sarma Peddibhotla

    https://www.facebook.com/sreedharasarma.peddibhotla?fref=ufi

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
    2. @Sreedhara Sarma Peddibhotl
      చరాల గతికి సంకల్పం అవసరమే కాని అచరాల గతికి కూడ సంకల్పం యొక్క అవసరాన్ని అర్థం చేసికోలేను!

      hari.S.babu
      చరాలకీ అచరాలకీ తేడా యేమిటి?జీవం అంటే తను ఏ దేహంలో పనిచేస్తున్నదో దానిని నియంత్రించే ఒక వ్యవస్థయే కదా!అచరం అంటే చెట్లూ కావచ్చును,రాళ్ళూ కావచ్చును.డిసింటిగ్రేషన్ కూడా చలనమే,కాదని అనుకున్నప్పుడే గందరగోళం వస్తుంది.చలనసూత్రాలను చెప్పిన సైంటిస్టులే చలనానికి సంకల్పంతో కూడిన సక్తి అవసరం అని చెబుతుంటే నేను ఒప్పుకోలేను అంతే యేమిటి అర్ధం?మీరు గందరగోళంలో ఉండి ఒప్పుకోలేనివి చెబితే నాకు వైరుధ్యాలు అంటగట్టటం దేనికి? ఉన్నది చెప్పడమే తప్ప మీరు ఒప్పుకునేలా చెప్పడం నాకే కాదు సైన్సుకి కూడా సాధ్యపడదు లెండి!

      Delete
  6. హరిబాబు గారు..
    బాగున్నారా? ఇప్పటికీ మీరు బ్లాగులు భలే రాయగలుగుతున్నారు.
    భారతీయ సంస్కృతీ గొప్పదనం గురించి ఇదివరకే మీరు చాలా సార్లు వివరించారు.
    ఆయిఅన సరే మీ ప్రతి పోస్టు నుండి కొత్త విషయం తెలుసుకోగలుగుతున్నాను.
    ప్రతి దేశానికి తనదైన సంస్కృతీ ఉంటుంది. అది ఆ దేశానికి మాత్రమె ప్రత్యేకమై ఉంటుంది. ఆ రకంగా మనం భారతీయ సంస్కృతీ గురించి దాని గొప్పతనం గురించి మాట్లాడదం అనుకుంటే వారు అనే మొదటి మాట అదుగో మీరు హిందు సంస్కృతీ గొప్పది అని చెప్పడానికి ఇవన్ని చెపుతున్నారు అంటున్నారు.
    ఏమనాలి అండి వీళ్ళను.

    rajiv raghav

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...