Tuesday, 12 June 2018

మా చావు పుట్టుక లెల్ల నీ ఆట గదరా చిదంబరేశ!మా నవ్వు ఏడ్పు లెల్ల పాట గదరా నీకు గోవిందరాజ!

చిదంబరం అద్భుత శక్తి క్షేత్రం. దీనికి అయస్కాంతశక్తి ఉందనీ భూమధ్యరేఖలోని బిందువు, ఈ నటరాజ విగ్రహంలోని కాలిబొటనవేలుని సూచిస్తుందనీ చెబుతారు. ఆకాశలింగం(చిదంబరం), వాయులింగం (కాళహస్తి), భూలింగం(కాంచీపురం), అగ్నిలింగం(తిరువణైక్కవల్‌), జలలింగం (తిరువణ్ణామలై) అనే పంచభూతలింగాల్లో 1, 2, 3 దేవాలయాలను ఒకే సరళరేఖలో 79 డిగ్రీల 41నిమిషాల తూర్పు అక్షాంశంమీద నిర్మించారు. అందుకే దీన్ని ఓ ఖగోళ, భౌగోళిక అద్భుతంగా చెబుతారు.

ఈ దేవాలయానికి 9 ద్వారాలు ఉన్నాయి. ఈ తొమ్మిదిలో 4 పెద్ద గాలి గోపురాలు ( తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ దిక్కులలో). ఈ నాలుగు గాలి గోపురాలు చాల పురాతనమైనవి. తూర్పు గాలి గోపురము మీద 108 ముద్రలతో భరత నాట్యం చేస్తున్న శిల్పాలు చెక్కబడ్డాయి. ఆలయ సముదాయం 40 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ ఆలయ సముదాయములోనే ఒక పెద్ద తటాకము (శివ గంగ) మరియు చిన్న ఇళ్ళు ఉన్నాయి. ఇవి కాక ఐదు సభలు లేదా వేదికలు ఉన్నాయి. అవి - గర్భగుడిగా వెలుగొందుతున్న చిత్సబై, చిత్సబైకి ఎదురుగానే ఉన్న నిత్యపూజలు జరిగే కనకసబై, గర్భగుడికి ఎదురుగానే శివుడు 'కాళి' తో నాట్యమాడినట్లుగా చెప్పబడుతున్న నృత్యసబై లేదా నాట్యసబై - ఇది శక్తి స్వరూపం, భగవంతుడి ఆధిపత్యాన్ని చాటి చెప్పిన ప్రాంతం, రాజ్యసబై లేదా 1000 స్తంభాల మంటపం (నిజానికి ఉన్నది 999 స్తంభాలే, భగవంతుడు దర్శనమిచ్చినప్పుడు ఆయనే 1000వ స్తంభం) మరియు పంచమూర్తులు కొలువైన దేవసబై (పంచ - ఐదు, మూర్తులు - భగవంతుడి విగ్రహాలు. ఆ ఐదు ఏవంటే గణేశుడు - విఘ్నాలు తొలగించే స్వామి, తన భార్య 'శివానందనాయకి'తో కూడి కూర్చున్న భంగిమలో దర్శనమిచ్చే సోమస్కందర్ స్వామి, మురుగా స్వామి మరియు భక్తముఖ్యుడు, ప్రధాన భక్తుడు ఐన చండికేశ్వరర్).

ఇవి కాక పతంజలి, వ్యాఘ్రపాదర్ పూజించిన తిరుమూలతనేశ్వరర్ మరియు ఆయన దేవేరి ఉమయ్య పార్వతి ఆలయం, 63 ప్రధాన భక్తులు లేదా అరుబత్తుమూవర్ ల ఆలయాలు, 'జ్ఞాన శక్తి'కి నిలయమైన శివగామి ఆలయం, విఘ్నాలు పోగొట్టే గణేశాలయం, మూడు విధాలైన శక్తులు - ఇచ్ఛై లేదా కోరిక అవతారమైన భార్య వల్లి, క్రియకు ప్రతిరూపమైన భార్య దేవయాని, అజ్ఞానాన్ని నాశనం చేసేందుకు స్వామి వాడే జ్ఞానానికి ప్రతిరూపమైన బల్లెం - వీటిని కలిగిన మురుగా లేక పాండియనాయకం ఆలయం కూడా ఉన్నాయి.

ఆలయ ప్రాంగణంలో గోవిందరాజ పెరుమాళ్, ఆయన దేవేరి పుండరీగవల్లి తాయర్ దేవాలయం కూడా ఉంది. ఈ దేవాలయాన్ని తిల్లై తిరుచిత్రకూడమ్ అంటారు. ఇది 108 వైష్ణవ దివ్యదేశాలులో ఒకటి. దివ్యదేశాలంటే ప్రముఖ భక్తులైన ఆళ్వార్లు మంత్రాలు (నాలయిర దివ్యప్రబంధం) చదివి శుద్ధి (మంగళాశాసనం) చేసిన విష్ణ్వాలయాలు.

పురాణాల ప్రకారం శివుడు తన దివ్యమైన 'ఆనంద తాండ'వాన్ని నటరాజు రూపంలో ఇద్దరు సాధువులకు తమిళుల 'తాయ్' (జనవరి-ఫిబ్రవరి) నెలలో పూసమ్ నక్షత్రపు తేదీన చూపాడు. ఇతిహాసం ప్రకారం పరమశివుడు ఒకనాడు తిల్లాయ్ వనవిహారానికి వెళ్ళాడు.ఈ వనంలో ఉన్న ఋషులు తమ మంత్రాలతో దేవతలను ఆవాహనం చేయగల్గినవారు. శివుడు ఆ ఋషులు పఠిస్తున్న మంత్రాలతో లొంగి పీతాంబరధారి అయి ఉసిరి కాయలు తింటున్నాడు. శివుని భార్య పార్వతి కూడా శివుని వెంబడించింది.ఋషులు, ఋషి పత్నులు ఆ పీతాంబర వాసిని అనేక రకాలుగా స్తోత్రాలు చేశారు. తమ భార్యలూ, ఇతర స్త్రీజనం మోహితులై ఉండటం చూసిన మునులు కోపోద్రిక్తులై తమ మంత్ర ప్రభావంతో ఎన్నో పాములను ఆవాహన చేశారు. భిక్షువు రూపంలో ఉన్న భగవంతుడు ఆ పాములను ఎత్తి జడలు కట్టిన జుత్తు చుట్టూ, మెడలో మరి నడుము చుట్టూ ఆభరణాల్లా వేసుకున్నాడు. ఆవేశం పట్టలేని ఋషులు ఒక భయంకరమైన పులిని ఆవాహన చేశారు. భగవంతుడు దాని చర్మం వలిచి నడుముకి బట్టగా కట్టుకున్నాడు. పూర్తిగా విసుగెత్తిన ఋషులు వారి ఆధ్యాత్మిక శక్తిని మొత్తం ఉపయోగించి 'ముయలకన్' అనే శక్తిమంతమైన మరియు అహంభావియైన రాక్షసిని ఆవాహన చేశారు. చిరు మందహాసం చిందిస్తూ భగవంతుడు ఆ రక్కసి వీపుపై కాలు మోపి దాన్ని నిశ్చలనం చేసి దివ్యమైన ఆనంద తాండవం చేసి తన అసలు రూపాన్ని చూపాడు. ఋషులు భగవంతుడిని గుర్తెరిగి, తమ మంత్ర తంత్రాలు పని చేయవని తెలుసుకొని ఆయనకు దాసోహమన్నారు.

ఇక్కడ తిల్లైవనంలో పరమశివుడు చేస్తున్న తాండవాన్ని చూస్తూ కరణోదకసాగరంలో సేదదీరుతున్న శ్రీమహావిష్ణువు  మైమరచిపోయి చిరునవ్వు నవ్వుతుంటే ఆదిశేషుడు ఎన్నడూ ఎరగని ఈ ప్రత్యేకమైన చిరునవ్వుకు కారణం అడిగాడట.అప్పుడు అవ్యక్తంలో నిరంతరం మారుమోగుతున్న తన ఢమరు నినాదంతో సృష్టిస్థితిలయాలని శాసిస్తున్న ఆదినర్తననాయకమణి సాకారుడై తిల్లైవనంలో చేస్తున్న లీలావినోదాన్ని గమనించి సంతోషం పట్టలేక నవ్వుతున్నట్లు చెప్పాడట. ద్వంద్వాతీతుదైన శ్రీమహావిష్ణువునే మోహింపజేసిన ఆ నృత్యాన్ని చూసే భాగ్యం తనకు కూడా ప్రసాదించమని అడిగిన ఆదిశేషునికి భూమిపైన పతంజలిగా అవతరించి నటరాజు చేసే ఆనంద తాండవాన్ని చూసి తరించమని ఆశీర్వదించాడట.పతంజలి వ్యాఘ్రపాదర్ / పులికాల్ముని (వ్యాఘ్ర / పులి, పాదర్ - పాదములు కలవాడు - ఈయన తేనెటీగలు రాకమునుపే పూవులు కోయటానికి చెట్లెక్కేందుకు వీలుగా పులి కాళ్ళు, చూపు కోరి సంపాదించుకున్నాడు) తో కలిసి తిల్లాయ్ అడవిలోనికి వెళ్ళి భగవంతుణ్ణి శివలింగ రూపంలో పూజించారు. ఆ దేవుణ్ణి ఈ నాటికీ 'తిరుమూలతనేశ్వర్' (తిరు - శ్రీ, మూలతనం - మూలమైన, ఈశ్వరర్ - ఈశ్వరుడు)గా పూజిస్తున్నారు.

చిదంబరం ఆలయపు అసలు మూలాలు తెలియవు. పురాణాల (ముందు మౌఖికంగా, తర్వాతి కాలంలో వ్రాతపూర్వకంగా అందించబడిన చరిత్ర) ప్రకారం పులికాల్మునివర్ స్వామి సిమ్మవర్మన్ ద్వారా పవిత్రమైన ఆలయ పనుల్లో సింహ భాగాన్ని జరిపించినట్లు తెలుస్తోంది.పల్లవ రాజుల్లో సిమ్మవర్మన్ పేరుగల రాజూలు ముగ్గురున్నారు. భక్త కవి ఐన తిరునావుక్కరసర్ (ఈయన జీవన కాలం కాస్త అటు ఇటుగా సరిగ్గానే లెక్కించబడింది) సమయానికే ఆలయం ప్రశస్తి పొందినందువల్ల సిమ్మవర్మన్ దాదాపు క్రీ.శ. 430-458 మధ్య కాలంలో జీవించి ఉండాలి. కొట్రావన్ కుడి లోని 'పట్టాయం' లేదా రాగిరేకులతో చేసిన శాసనం ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తుంది. కానీ తండన్ తొట్ట పట్టాయం ఇంకా ఇతర పల్లవ కాలపు పట్టాయాలలో ఈయన ప్రసక్తి లేదు. అందువల్ల ఆయన తన హక్కులను త్యజించి చిదంబరానికి వచ్చి జీవించి ఉండవచ్చని నమ్మకం. పులికాల్మునివర్, సిమ్మవర్మన్ సమకాలికులని తెలుస్తుండడం వల్ల ఆలయం ఆ సమయంలో ఉనికిని పొందిందని భావిస్తారు. కానీ భక్త కవి మాణిక్కవసాగర్ భక్త కవి తిరునావుక్కరసర్ కన్నా ఎంతో ముందే చిదంబరంలో జీవించి ముక్తిని పొందినట్లు తెలుస్తుండడం వల్ల, అంతే కాక నటరాజ స్వామి విగ్రహం, దాని భంగిమ, దాని స్వరూపం అదే కాలపు ఇతర పల్లవ శిల్పరీతులతో సరిపోలనందువల్ల ఈ ఆలయం సిమ్మవర్మన్ కన్నా చాలాకాలం ముందు నుంచే ఉనికిలో ఉండేదని విశ్వసిస్తున్నారు.

బంగారు పలకలతో తాపడం చేయబడిన చిత్సబై పైకప్పు చోళ రాజు పరంథక I చేయించినట్లు చెప్పబడుతోంది. పరంథక II, రాజరాజ చోళ I, కులోత్తుంగ చోళ I కూడా ఆలయానికి విలువైన దానాలు ఇచ్చినట్లు చెప్పబడుతోంది. రాజరాజ చోళుని కుమార్తె కుందవై సైతం బంగారు ఇతర ఆస్తులు ఇచ్చినట్లు చెప్పబడుతోంది. ఆ తరువాతి కాలపు చోళ రాజు విక్రమ చోళ (క్రీ.శ 1117-1136) కూడా నిత్య పూజలకు గాను నివేదనలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఆలయానికి పుదుకొట్టై మహారాజా, శ్రీ సేతుపతి (పచ్చరాయి ఆభరణం నేటికీ స్వామిని అలంకరిస్తోంది), పరి రాజు, టిప్పు సుల్తాను వంటి అనేకమంది రాజులు, పాలకులు, దాతలు బంగారునూ, ఆభరణాలను ఇచ్చారు. దీక్షితార్లు ఆలయంపై టిప్పు సుల్తాను దాడి చేసి దోచుకుంటాడని భయపడినట్లు కొన్ని ప్రస్తావనలు ఉన్నాయి (ఇవి దీక్షితార్లలో ఒక తరం నుంచి మరొక తరానికి మౌఖికంగా వచ్చినవి). ఎందరో దీక్షితార్లు తమ పవిత్రమైన, ప్రీతిపాత్రమైన దేవాలయం టిప్పు చేతుల్లో నాశనమవడం చూడటం కన్నా మృత్యువే మేలని ఎత్తైన పగోడాల పై నుంచి దూకి ప్రాణత్యాగం చేశారంటారు. ఇంకొందరు దీక్షితార్లు ఆలయానికి తాళం వేసి విగ్రహాలను ఎంతో భద్రంగా కేరళ లోని అళపుజకు తీసుకు వెళ్ళారంటారు. ఆక్రమణ భయం తగ్గిన తర్వాతనే వారు తిరిగి వచ్చారట.

ఈ దేవాలయపు భక్తుల్లో మొదటివారుగా పరిగణింపబడుతున్నవారు ఆలయ నిర్వహణ చూసే తిల్లై వాళ్ అంధనార్ (తిల్లైలో ఉండే పూజారులు అని అర్థం) అని పిలవబడే పూజారులు. నలుగురు భక్త కవులు ఈ దేవాలయాన్ని ఈ స్వామిని అజరామరం చేశారు. వాళ్ళెవరంటే తిరుజ్ఞాన సంబంథర్, తిరునావుక్కరసర్, సుందరమూర్తి నయనార్ మరియు మాణిక్కవసాగర్ . మొదటి ముగ్గురి రచనలు దేవరములుగా ఖ్యాతి పొందాయి. తిరుజ్ఞాన సంబంథర్ చిదంబరం స్వామి పైన రెండు దేవరములు, తిరునావుక్కరసర్ నటరాజ స్వామి పైన ఎనిమిది దేవరములు మరియు సుందరమూర్తి నయనార్ నటరాజ స్వామి పైన ఒక్క దేవరము రచించి స్వరపరిచారు. మాణిక్కవసాగర్ రెండు రచనలు చేశారు. మొదటిది చిదంబరంలో ఎక్కువగా పాడబడే తిరువాసకం (పవిత్ర వచనాలు) మరియు రెండవది పూర్తిగా చిదంబరంలోనే పాడబడే తిరుచిత్రాంబలక్కోవైయార్ (లేదా తిరుకోవైయార్). మాణిక్కవసాగర్ చిదంబరంలోనే ఆధ్యాత్మిక ఆనందం, ముక్తి పొందారని చెప్పబడుతుంది.

ఆలయ నిర్వహణ బాధ్యతలను ఆనువంశికంగా వైదిక బ్రాహ్మణుల్లో ఒక శాఖ ఐన చిదంబరం దీక్షితార్లు చూసుకుంటున్నారు. పురాణాల ప్రకారం వీరిని కైలాస పర్వతాల నుంచి పతంజలి ఋషి ప్రధానంగా దైనందిన పూజాదికాలు జరపడానికీ, చిదంబరం ఆలయ నిర్వహణకూ తీసుకు వచ్చారు. దీక్షితార్లను శివుడిని నటరాజుగా కొలవటానికి నియోగించిన పతంజలి ఆలయ పూజా విధానాలను వేదాల నుంచి సేకరించి ఏర్పరిచారు.

అలా తిల్లై మూవాయిరమర్ అని పిలవబడే 3000 మంది దీక్షితార్లు (2999 మరియు భగవంతుడు) వచ్చారని ప్రతీతి. ఇప్పుడు మొత్తంగా దాదాపు 360 మంది ఉన్నారు. వీళ్ళు శివపూజకు ఆగమ పద్ధతులు పాటించే శివాచారియర్లు లేదా ఆదిశైవర్ల వలె కాక వైదిక పద్ధతులు పాటిస్తారు.

సాధారణంగా వంతుల వారీ ప్రధాన పూజారి పదవి, ఆలయ ఆదాయంలో వంతు ప్రతీ వివాహితుడైన దీక్షితారుకూ లభిస్తుంది. ఆలయాన్ని ఎంతో మంది పాలకులు సేవించుకున్నందువల్ల సుక్షేత్రమైన 5000 ఎకరాల మాన్యం ఉన్నట్టు తెలుస్తున్నా వర్తమానంలో ఇది పూర్తిగా ప్రైవేటు విరాళాలతోనే నడుస్తోంది.

అవాళ్టి ప్రధాన పూజారి తనను తాను శుద్ధి చేసుకునే మంత్రాదికాలు పూర్తి చేసి శివోహంభవ రూపు దాల్చడంతో దినచర్య ప్రారంభమౌతుంది. పిమ్మట పూజారి ఆలయ ప్రవేశం చేస్తారు. స్వామివారి పాదుకలను ఉదయం 7 గంటల వేళ పాలియారై లేదా పవళింపు గది నుంచి గర్భగుడికి భక్తుల మేళ తాళాలు, డమరుక ధ్వనుల మధ్య పల్లకీలో తీసుకురావడంతో పూజాదికాలు ఆరంభమౌతాయి. పూజారి అప్పుడు భగవంతుణ్ణి అడ్డంకులను తొలగించమని వేడుకుంటూ నైవేద్యం పెట్టి ఒక ఆవు, దూడ జంటను పూజిస్తారు.

పూజ రోజుకు 6 సార్లు జరుగుతుంది. పూజ చెయ్యడానికి ముందు ప్రతిసారీ స్వామి అసంపూర్ణ రూపమైన స్ఫటిక లింగానికి నెయ్యి, పాలు, పెరుగు, అన్నం, చందనం, విబూదితో లేపనం చేస్తారు. పిమ్మట స్వామికి అప్పుడే తయారు చేసిన తిండి పదార్థాలు, తీపి నైవేద్యం పెట్టి సంస్కృతంలో వేదాలు, పంచపురాణం (పన్నీరు తిరుమురై అని పిలువబడే 12 తమిళ రచనల నుండి ఎన్నిక చేసుకున్న 5 కవితలు) చదువుతూ అందంగా, వివిధ రకాలుగా అలంకరించిన దీపాలతో దీపారాధన చేస్తారు. పూజారి గర్భగుడి తెరను తొలగించి చిదంబర రహస్యాన్ని చూపడంతో పూజ ముగుస్తుంది.

రెండవ సారి పూజకు ముందు మామూలుగా స్ఫటిక లింగానికి చేసే సేవలతో పాటు ఒక రత్న నటరాజు విగ్రహం (రత్న సభాపతి) కూడా సేవలందుకుంటుంది. మూడవ పూజ మధ్యాహ్నం 12:00 గంటల సమయంలో జరుగుతుంది. తర్వాత ఆలయం మూసివేసి మళ్ళీ సాయంత్రం 4:30 గంటలకు తెరుస్తారు. నాల్గవ పూజ సాయంత్రం 6:00 గంటలకు, ఐదవది రాత్రి 8:00 గంటలకు, చివరి పూజ రాత్రి పది గంటలకు జరుగుతాయి. దీని తర్వాత స్వామివారి పాదుకలను ఆయన విశ్రమించడానికి వీలుగా ఊరేగింపుగా తీసుకువెళ్తారు. ఐదవ పూజకు ముందు పూజారి చిదంబర రహస్యానికి ప్రత్యేక పూజలు చేసి యంత్రానికి సుగంధ ద్రవ్యాలతో లేపనం చేస్తారు.

అర్ధజాము పూజ అని పిలువబడే చివరి పూజను చిదంబరంలో ప్రత్యేకమైన ఉత్సాహంతో చేస్తారు. స్వామివారు రాత్రి విశ్రమించేటప్పుడు విశ్వంలోని దైవిక శక్తి అంతా ఆయనలో విశ్రమిస్తుందని భక్త జనుల నమ్మకం.మానవుల ఒక్క సంవత్సరం దేవుళ్ళకు ఒక్క రోజని ప్రతీతి. రోజుకు ఆరు సార్లు పూజలు చేసినట్లే ప్రధాన దైవమైన నటరాజ స్వామికి సంవత్సరంలో ఆరు ప్రత్యేక పూజలు చేస్తారు. అవి - మొదటి పూజను సూచించే మార్ఘాళి తిరువాధిరై (డిసెంబరు - జనవరి), రెండవ పూజకు సూచనగా మాసి (ఫిబ్రవరి-మార్చి) నెలలో పౌర్ణిమ తర్వాత వచ్చే 14 వ రోజు (చతుర్దశి), మూడవ పూజ లేదా ఉచ్చి కాలం సూచించే చిత్తిరై తిరువోణం (ఏప్రిల్ - మే), సాయంత్రాన్ని లేదా నాల్గవ పూజను సూచించే ఆణి ఉత్తరం (జూన్ - జూలై) లేదా ఆణి తిరుమంజనం, ఐదవ పూజను సూచించే ఆవణి (ఆగస్టు - సెప్టెంబరు) చతుర్దశి మరియు ఆరవ పూజ లేదా అర్ధజాము పూజను సూచించే పురతసి (అక్టోబరు - నవంబరు) చతుర్దశి.

వీటిలో మార్ఘాళి తిరువాధిరై (డిసెంబరు - జనవరి), ఆణి తిరుమంజనం (జూన్ - జూలై) అత్యంత ప్రధానమైనవి. ఈ పండుగల సందర్భంగా ప్రధాన దైవాన్ని గర్భగుడి బయటకు ఊరేగింపుగా తెచ్చి, రథోత్సవం జరిపి పెద్ద ప్రత్యేక పూజ చేస్తారు. కొన్ని లక్షల మంది జనం ఈ ప్రత్యేక పూజనూ, గర్భగుడిలోనికి తిరిగి వెళ్ళిపోయేటప్పుడు జరిగే స్వామివారి ఆచారపూర్వకమైన నృత్యాన్నీ చూడటానికి బారులు తీరుతారు.

ఆలయపు రూపకల్పనలోనూ, స్థాపత్యంలోనూ (స్థాపత్యం - ఆర్కిటెక్చర్) వేదాంతార్థాలు కోకొల్లలు. చిదంబరం ఆలయానికి మన శరీరంలోని నవ రంధ్రాల మాదిరిగానే 9 ద్వారాలు ఉన్నాయి. ఈ దేవాలయంలోని ఓ గోపురాన్ని 21,600 బంగారు రేకులతో కప్పారు. ఇది ఒకరోజుకి మనిషి శ్వాసలోని ఉచ్ఛ్వాస, నిశ్వాసాల సంఖ్యతో సమానం. ఆ రేకుల్ని తాపడం చేయడానికి ఉపయోగించిన బంగారు మేకుల సంఖ్య 72 వేలు. యోగశాస్త్ర ప్రకారం మనిషి శరీరంలోని నాడుల సంఖ్యా అంతే. మన శరీరంలో ఎడమవైపు గుండె ఉండే ప్రదేశంలానే ఇక్కడ అమ్మవారి విగ్రహం ఎడమచేతి వైపునకు తిరిగి ఉంటుంది. దీనికి పక్కనే ఉన్న నాలుగు స్తంభాల మండపం నాలుగు వేదాలకూ ప్రతీక. శివపూజలో జరిగే 28 కైంకర్యాలని సూచిస్తూ శివకామసుందరి అమ్మవారి ప్రాంగణంలో 28 స్తంభాలు ఉంటాయి. వీటిమీద 64 కళలకూ గుర్తుగా 64 బీములు ఉంటాయి. బంగారు తాపడం కలిగిన గోపురంమీద ఉన్న నవ కలశాలూ నవశక్తులకి సంకేతాలు. అర్ధమండపానికి ఆనుకుని ఉన్న మండపంలోని 18 స్తంభాలు అష్టాదశ పురాణాలకు ప్రతీక.అంతేకాదు అడ్డు దూలాలు రక్తప్రసరణ నాళాలు. 9 కలశాలు 9 రకాల శక్తికి ప్రతీకలు. అర్ధ మంటపంలోని 6 స్తంభాలూ 6 శాస్త్రాలకు ప్రతీకలు. ప‌క్కన ఉన్న మంటపంలోని 18 స్తంభాలూ 18 పురాణాలకి ప్రతీకలు.

పరమశివుడు ఆనంద తాండవం చేసిన స్థలంలో - 'తిరుమూలతనేశ్వర్' ఆలయానికి దక్షిణంగా - ఇప్పుడు శివుడు నృత్య భంగిమలో కనిపించే పొన్నాంబళం/పోర్ సబై ('పొన్'అంటే బంగారం 'సబై' అంటే సభ లేదా వేదిక) ఉంది. ఇక్కడి దేవుణ్ణి 'సభానాయకర్' - అంటే వేదికపై కొలువైన దేవుడు - అని కూడా పిలుస్తారు.ఈ బంగారు తాపడం చేసిన వేదిక చిదంబరం ఆలయపు గర్భగుడి. ఇందులో స్వామి క్రింద తెలిపిన మూడు రూపాల్లో దర్శనమిస్తారు:

1) సంపూర్ణ రూపం - నటరాజు రూపంలోని స్వామి 2) అసంపూర్ణ రూపం - స్ఫటిక రూపంలోని చంద్ర మౌళీశ్వరర్ 3) నిరాకారం - పంచ భూతాల్లో ఒకటైన ఆకాశానికి ప్రతీకగా గర్భ గుడిలోని ఖాళీ స్థలం.

చిదంబర రహస్యం! 
ఈ ఆలయంలో స్వామి నటరాజ రూపం, ఇదీ అని చెప్పలేని చంద్రమౌళీశ్వర స్ఫటికలింగ రూపం, ఏ రూపమూలేని దైవసాన్నిధ్యం అనే మూడు స్వరూపాల్లో దర్శనమిస్తాడు. మూడో రూపమే చిదంబర రహస్యం.. గర్భాలయంలోని వెనకగోడమీద ఓ చక్రం గీసి ఉంటుందట. దానిముందు బంగారు బిల్వ ఆకులు వేలాడుతుంటాయి. అవేమీ కనిపించకుండా తెర కట్టి ఉంటుంది. అర్చకులు ఆ తెరను నామమాత్రంగా తొలగించి చూపిస్తారు. ఆ ప్రదేశాన్నే శివోహంభవ అంటారు. అక్కడ మనకు ఏమి కనిపించితే అదే శివతత్వం - మనకి ఏమి కనిపించిందో ఇతరులకి చెప్పకూడదు,ఇతరుల్ని మీకేమి కనిపించిందని అడగకూడదు! శివ అంటే దైవం, అహం అంటే మనం. భవ అంటే మనసు ఆ దైవంలో మనసు ఐక్యం అయ్యే ప్రదేశం. అంటే అక్కడ ఏ రూపం లేకుండానే అజ్ఞానాన్ని తొలగించుకుంటూ ఆ దైవ సాన్నిథ్యాన్ని అనుభూతించడమే ఈ క్షేత్ర ప్రాశస్త్యం - అదే చిదంబర రహస్యం.ఈ ఆలయం'విరాట్ హృదయ పద్మ స్థలం' అంటే కమలం వంటి విశ్వపు గుండెలో ఉన్నదని ప్రతీతి.

పరమశివుడు నృత్యం చేసినట్లుగా చెప్పబడే ఐదు స్థలాల్లో చిదంబరం కూడా ఒకటి. ఈ స్థలాలు అన్నింటిలోనూ వేదిక/సభైలు కనిపించడం విశేషం. చిదంబరం కాక మిగిలిన ప్రాంతాలు తిరువాలంగడు లోని రత్తినసబై (రత్తినం - రత్నం), కౌర్తాళ్ళం లోని చిత్రసబై (చిత్ర - చిత్రకళకు ప్రతీక), మదురై లోని మీనాక్షి దేవాలయంలోని రజతసబై (రజత - వెండి) మరియు తిరునెల్వేలి లోని నెల్లైఅప్పర్ దేవాలయంలోని తామిరసబై (తామిరం - రాగి).

చిదంబరంలో ఉన్న నటరాజ విగ్రహం కాలి బొటన వేలు, భూమి అయస్కాంత క్షేత్రానికి మధ్య బిందువు అని 8 సంవత్సరాల పరిశోధన అనంతరం శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. ఈ విషయాన్ని తన గ్రంధం "తిరుమందిరం"లో ప్రసిద్ధ తమిళ స్కాలర్ తిరుమూలర్ వివ‌రించారు. నటరాజు నృత్యాన్ని పాశ్చాత్య సైంటిస్టులు కాస్మిక్ డాన్సు అని వర్ణించారు. 

Gary A David
“I am the Author of “The Orion Zone” and four more books on Archaeo-Astronomy, concentrating on the southwestern area of the United States. I have also have been featured on international radio interviews and on U.S. television programs.

Since 1997, I have studied Orion and various man-made structures and Rock Art that represent this Constellation. All over the globe, Orion- pattern in the sky is frequently reproduced by certain megalithic constructions on the ground. (Mega- means “large” and lithic means “stone.”) In essence, the earth structures mirror the pattern in the sky.

In addition, the rising and setting of Orion- stars are sometimes lined up with certain astronomical markers. Various cultural sites in Peru, Mesoamerica, North America, Great Britain, Ireland, Europe, Africa, and Egypt, along with other locations across the world, concentrate on this particular constellation with an archetypal intensity.

Now we have a solid proof of the “Orion archetype” found in the pictographs (rock paintings) of Narthamalai, Tamil Nadu, dated to 1500 BC or earlier. Painted in white, a human figure is seen with the typical upraised right arm as well as the left arm holding either a shield or club or spear. Associated with this figure is a representation of two triangles with their apexes touching.

This type of figure is also found in Rock Art of the Americas and Africa. In North America it signifies warfare between Native American tribes. For the Igbo tribe of Nigeria it signifies the Great Mother Goddess called Mbari. In India this double-triangle may represent the Female- Male complex. It may also represent the ‘hurglass drum’or ‘dumroo’,a two-headedsacred drum of Lord Shiva.

ఒక చేతిలో సమస్తాన్నీ దహించివేసే అగ్నినీ ఒక చేతిలో సమస్తాన్నీ కంపింపజేసే ఢమరువునీ ధరించి విశృంఖలుడైన దైత్యుని అణిచివేస్తూ చేసే ఈ ఆనంద తాండవం మన దేహానికి బయట విశ్వంలోనే కాదు మన అంతరంగంలో కూడా నిరంతరం జరుగుతూనే ఉన్నది - మనం అనుభవించే  ఆనంద విషాదాలు ఆ చిరుమువ్వల మరుసవ్వడులే!  ప్రాచ్యదేశాలలో ఎక్కువమంది పాటిస్తున్న Judaeo-Christian-Islamic మతసాహిత్యానికి భిన్నమైన సనాతన ధార్మిక సాహిత్యం ఈనాడు ద్రవ్యం-శక్తి అనే ద్వంద్వాల గురించి కనుగొనబడుతున్న ఆధునిక భౌతికశాస్త్రవిషయాలని ఏనాడో అర్ధం చేసుకుని అర్చామూర్తులలో నిక్షేపించి పాటించేవారికి విశ్వంతోనూ దైవంతొనూ ఎట్లాంటి అనుబంధాన్ని పెంచుకుని నిజమైన ఆనందాన్ని పొందాలో అత్యంత సులువుగా దాన్ని పొందడానికి వీలుగా సూచించగలగడం ఎంత అద్భుతం!

ఈ నటరాజ భంగిమను శాస్త్రవేత్తలు పరిశీలించి క్రీ.శ 1054లో జరిగిన Crab super Nova Explosion ఫలితమైన orion constellation యొక్క రూపచిత్రణమే ఇక్కడి నటరాజ మూర్తిలో నిక్షిప్తమై ఉన్నదని తేల్చి చెప్పారు!ప్రస్తుతం orion constellation యొక్క రూపచిత్రణ ఒక వేటగాడు ముందుకు సాచిన చేతితో బల్లెం(shield) పట్టుకుని రెండవ చేతితో ఒక ఖడ్గాన్ని పైకి ఎత్తి పట్టుకున్న మానవమూర్తిని పోలి ఉన్నదని భావించి The Hunter అని పిలుస్తున్నారు.శివుణ్ణి కిరాత నామధేయంతో కూడా పిలుస్తారనేది ప్రతి హిందువుకీ తెలిసిన విషయమే కదా!దీనికి దగ్గరలోనే ఉన్న Canis Minor అనే వేటకుక్కను బోలిన మరొక నక్షత్ర సమూహం శివుడి మరొక రూపమైన భైరవమూర్తిని సూచిస్తున్నది.ప్రపంచంలోని అన్ని ప్రముఖమైన ప్రాచీన నాగరికతలలోనూ ఏదో ఒక రూపంలో శివతత్వం ఆరాధనీయమై కనబడుతున్నది.
Main Stars in the Orion Constellation

Ø  Betelgeuse
A red supergiant star around 640 light years from Earth, Betelgeuse, also known as Alpha Orionis, has a radius 1,000 times larger than the sun and is expected to explode as a supernova in the next million years.

Ø  Meissa
A blue giant star with surface temperatures around 5 times hotter than our sun, Meissa is actually a pair of binary stars, its companion is similar in size and mass to the sun.

Ø  Bellatrix
A blue giant star around 250 light years from Earth, Bellatrix is 6 times larger than our sun and 8 times more massive, the star is also known as Gamma Orionis.

Ø  Alnitak
Alnitak is a triple star system around 736 light years from Earth, the primary star is a blue supergiant star with a radius around 20 times larger than the sun, Alnitak is also known as Zeta Orionis.

Ø  Alnilam
A blue supergiant star around 1,400 light years from Earth, Alnilam is 24 times larger than the sun and more than 250,000 times as luminous, the star is also known as Epsilon Orionis.

Ø  Mintaka
Also known as Delta Orionis, Mintaka is actually a pair of blue giant stars with the largest having 16 times the radius of the sun, both stars are around 100,000 times more luminous than the sun.

Ø  Saiph
A blue supergiant star around 650 light years from Earth, Saiph is 16 times more massive and around 22 times larger in diameter than the sun.

Ø  Rigel
Also known as Beta Orionis, Rigel is around 800 light years from Earth and is the brightest star in the constellation, once again like most of the others it is a blue supergiant around 75 times larger in diameter than the sun and around 40,000 times brighter.
Ø  M42

Perhaps the most interesting component of the Orion constellation, M42 is not a star but is in fact the Orion nebula, a vast star forming region some 1,500 light years from Earth, the nebula makes up the sword of Orion along with two other stars. The Orion nebula has an apparent magnitude of 4.0, making it easily visible with the naked eye apart from those living in an around the center of large cities.

వీటినే అవి కలిసి ఏర్పరుస్తున్న సరళరేఖల్ని గీసుకుని దిశల్ని సూచించే బాణం గుర్తులతో సూచిస్తే మరికొంత విశేషమైన రూపం కనిపిస్తుంది.అప్పుడు నర్తిస్తున్న నటరాజు యొక్క ఉదరమూ నడుమూ పిరుదులూ గోచరిస్తూ ఇప్పటి నటరాజమూర్తి రేఖామాత్రమై కనబడుతుంది. 
Orion Constellation నుంచి చిదంబరం నటరాజ మూర్తిని దర్శించదంలో ఇది మొదటి మలుపు.దీని తర్వాత జరిగిన పరిశ్రమ అర్ధం కావాలంటే ప్రాచీన భారతీయ ఖగోళ శాస్త్రవిజ్ఞానం రేఖామాత్రంగానైనా తెలియాలి.భూమి తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరగడం గురించి తెలిసినప్పటికీ గ్రహతారకాదుల మధ్య దూరాల యొక్క సాపేక్షమైన స్థిరత్వాన్ని గమనించి గణితశాస్త్రం యొక్క పరిధిని దృష్టిలో ఉంచుకుని భూమిని స్థిరంగా విశ్వానికి కేంద్రంగా ఉంచి మనకు భూమిపైనుంచి కనిపిస్తున్న ఆకాశాన్ని 360 డిగ్రీల వృత్తం కింద తీసుకుని దాన్ని 27 భాగాలు చేశారు.ఒక్కొక్క భాగం 13.30 డిగ్రీల కోణం ఉంటుంది.ఈ పళ్ళెం విధాత తనమీద గీసిన నక్షత్రరాశుల రంగవల్లికలను మోసుకుని భూమి నడిమధ్యనుంచి వెళ్తున్న విశ్వం యొక్క నిలువు అక్షం చుట్టూ తిరుగుతున్నది.ఈ తిరుగుడు కొండాట్టంలో పౌర్ణమినాడు చంద్రునికి దగ్గిరగా ఏ నక్షత్రం వస్తుందో చూసి ఆ నక్షత్రం పేరున ఆ పౌర్ణమికి ముందువెనకల కాలాన్ని అమావాస్య వరకు కలిపి మాసాన్ని నిర్దేశించారు - చిత్రా నక్షత్రం పేరున చైత్ర మాసం అవుతుంది,విశాఖ నక్షత్రం పేరున వైశాఖం అవుతుంది.చంద్రగమనాన్ని ఆధారం చేసుకుని మాసావధిని నిర్ణయించడం పండితుల ప్రజ్ఞయే గానీ ఋతువులు మాత్రం వారు నిర్దేశించినవి కావు.ఋతువులు,ఆయనాలు,సంవత్సరం సూర్యగమనం వల్ల ఏర్పడినాయి. అయితే,ఈ మొత్తం చిక్కురొక్కురు విషయాలని అర్ధం చేసుకుని సరైన పద్ధతిలో లెక్కలు కట్టడం వల్ల ఈ అనంత కాలగమనంలో ఏ రోజున ఏ అమరిక ఖగోళంలో కనబడుతుందో మన ఖగోళ శాస్త్రజ్ఞులు చెప్పగలుగుతున్నారు!

ఈ రకమైన లెక్కలతో ప్రోగ్రాములు రాఇ తయారు చేసిన astronomical software ఉపయోగించి Dr. Raghavan అనే మేధావి క్రీ.శ 1054 జులై 11న చంద్రుడు ఉత్తరా నక్షత్రంలో ప్రవేశిస్తాడని నిర్ధారించారు.ఇది చైనీయులు crab supernova explosion జరిగినదని కనుక్కున్న జులై 4వ తేదీకి చాలా దగ్గిరగా ఉన్నది కదా! ఇది సంక్లిష్టమైన ఖగోళ సంబంధ విషయాల్ని తాము అర్ధం చేసుకుని సరిపెట్టుకోకుందా ఇతరులకు అర్ధమయ్యే రీతిలో చెప్పగలిగిన మనవారి ప్రజ్ఞకు ఒక చిన్న ఉదాహరణ.


రాజ దీక్షితార్ అనే ఒక పండితుడు రచించిన తమిళగ్రంధంలో orion constellation యొక్క నక్షత్రాల అమరికలో నటరాజమూర్తి ఎలా కనిపిస్తుందో సూచించే ఒక చిత్రపటం ఉన్నది.దానితో ఉత్సాహం తెచ్చుకున్న Dr. Raghavan వంటి మేధావులు archaeometallurgical fingerprinting ప్రక్రియని ఉపయోగించి ప్రాచీనతను నిర్ధారించుకున్న తొలినాటి నటరాజ ప్రతిమను సేకరించి దానికి transparent print తీసి ఇటువైపునుంచి 1054 july 11నాటి నక్షత్రమండలపు అమరికని కూడా transparent print తీసుకుని ఒకదానిపైన మరొకదాన్ని ఉంచి సరిపోల్చారు - Kankoduvanitham నుంచి సేకరించిన 11వ శతాబ్ది నాటి నటరాజ మూర్తి యొక్క భంగిమ క్రీ.శ 1054 జులై 11వ తేదీనాటి నభోమండలపు orion contellation మధ్యన ఇమిడిపోయింది!ఆనాటి crab supernova explosion చంద్రమౌళీశ్వరుని శిరస్సు పైని నెలవంకకు సమీపంలో జరిగి 23 రోజుల పాటు కనబడిందని చైనీయులు చెబుతున్నారు.
రేఖాగణితంలో త్రికోణానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు.అందుకే నిగూఢమైన తాంత్రిక పూజలలో కూడా త్రికోణం ఎక్కువ కనిపిస్తుంది.ముఖ్యంగా యంత్రాలన్నింటిలో ఉన్నతస్థానం సాధించుకున్నశ్రీచక్రం ఒక బిందువు చుట్టూ పరచిన త్రికోణాల సమాహారం - లోపలి వరుసలో ఉన్న రెండు త్రికోణాలూ శివ శక్తుల ప్రతిరూపాలు.నటరాజ భంగిమ కూడా ఈ షట్కోణ మండలంలోనే ఉంటుంది!

నటరాజు చుట్టూ వలయాకారంలో ఉన్న అగ్నిశిఖల వలయం విశ్వంలోని అనేకానేకమైన గ్రహతారకల నుంచి పీపీలికాదుల వరకు గల సమస్తమైన జీవ నిర్జీవ భూతజాలంలోనూ కనిపించే పునరపి జననం పునరపి మరణం అనే నిరంతరాయతకు చిహ్నం! ఈ అగ్నివలయం అపస్మారపురుషభూతానికి అటుపక్కనా ఇటుపక్కనా కనిపించీ కనిపించకుండా ఉన్న ఒక మకరం నోటినుంచి వస్తూ మరొక మకరం నోటిలోకి వెళ్తున్నట్టు ఉంటుంది.అగ్ని సూర్యుడికి ప్రతీక అయితే మకరం చంద్రుడికి ప్రతీక.జీవం నిలవాలంటే అగ్ని,జలం రెండూ అవసరమే అన్న అంతరార్ధం కూడా ఇందులో ఉంది.

నృత్యభంగిమలో వంచిన రెండు పాదాలూ చలనానికీ వేగానికీ సంకేతం.తల వెనక విసనకర్ర వలె పరుచుకున్న జటలు నృత్యంలోని వేగానికీ సంలీనతకీ సంకేతం.కుడివైపున జటలలో ఇరుక్కుని కనబడుతున్న గంగారూపం ఉత్తుంగతరంగాలతో భయపెట్టే నదులను అడ్డుకట్టలు వేసి ప్రశాంతమైన పరీవాహకతను సాధించడం వల్లనే జీవులకి రక్షణ దొరికి వృద్ధి సాధ్యమనే విషయానికి సంకేతం.

పైవైపు కుడిచేతిలో ఢమరుకం ఉంటుంది.నాట్యశాస్త్రంలో కూడా ఈ విధమైన హస్తముద్రని ఢమరుముద్ర అని పిలుస్తారు,ఇది జీవితంలో మనం సాధించాల్సిన లయను సూచిస్తుంది.పుస్తకపఠనం, సంగీతశ్రవణం, సౌందర్యదర్శనం - మానవులు ఆనందం కోసం ఏ సాధన చేసినప్పటికీ అందులోని లయ మాత్రమే ఆనందకారకం కదా! 

పైవైపు ఎడమచేతిలో అగ్ని వెలుగుతూ ఉంటుంది.ఇది సృష్టిలో కలిసిపోయి ఉన్న ద్వంద్వాలని వేరు చేసి చూడమని సూచిస్తుంది.జననం - మరణం,విజయం - అపజయం,సౌందర్యం - వికారం,సృష్టి - అంతం అనేవి కొన్ని మాత్రమే గానీ ప్రతిచోటా ఈ ద్వంద్వాలు కనబడుతూనే ఉంటాయి.జన్మ మాత్రమే ఉన్నది అనుకోవదం అవ్ల్లనే మృత్యువుకు భయపడుతున్నాం.విజయం మాత్రమే ఉన్నది అనుకోవడం వల్లనే అపజయానికి కుంగిపోతున్నాం - కానీ రెండూ ఉంటాయని తెలిస్తే అంత బాధ కలగదు.నటరాజ బంగిమలో ఈ జ్వాల కొట్టొచ్చినట్టు కనబడటంలో మన పూర్వాచార్యులకి బోధనలో ఉండాల్సిన సాంకేతికపరమైన విషయాల ప్రాధాన్యతాక్రమాన్ని సూచించడం పట్ల నిష్ఠని సూచిస్తుంది!

కిందివైపు కుడి చేతి మణికట్టునుండి ఒక సర్పం వేలాడుతున్నట్టు కనిపిస్తుంది,కానీ హస్తం మాత్రం అభయముద్రలో ఉంటుంది.అంటే నీ ధర్మాన్ని నువ్వు నెరవేరుస్తూ స్వామిని ఆశ్రయించుకుని ఉంటే ప్రమాదం,దుర్మార్గం,విద్రోహం అజ్ఞానం వంటివాటికి భయపడాల్సిన పనిలేదనే సూచన ఉంది.


కిందివైపు ఎడమచేయి పైకెత్తిన తన పాదాన్ని చూపిస్తూ ఉంటుంది. భక్తులనీ ఆశ్రితులనీ జీవన నృత్యాన్ని ఆపకుండా చివరివరకు కొనసాగించమని సూచించడమే దీని ముఖ్యమైన ఉద్దేశం.చిన్న చిన్న కష్టాలకే కుంగి కొందరు ఆత్మహత్యలు చేసుకుని జీవితాల్ని ముగించేసుకుంటుంటే పెద్ద పెద్ద కష్టాలని కూడా చిరునవ్వుతో భరించగలిగినవాళ్లు విజయాలని సాధిస్తున్నారు - నటరాజు కటాక్షం సహనశీలురకే ప్రాప్తిస్తుంది సుమా!

రెండు విచ్చుకున్నవీ ఒకటి నుదిటి మీద ఉండి విచ్చుకోనిదీ అయిన మూడు నేత్రాలు చూసినదాన్ని చూసినట్టు మాత్రమే కాకుండా లోనారసి చూడగలిగిన జ్ఞానం యొక్క అవసరాన్ని సూచిస్తున్నాయి.ఇంకా ఇవి సత్వరజస్తమస్సులనే త్రిగుణాలని కూడా సూచిస్తాయి.ఈ మూడంటిలోనూ సత్వగుణాన్ని సాధించడం చాలా కష్టం - అది ఇంకా తెరుచుకోని మూడవకన్ను అవుతుంది!

కింద అణిచివేయబడుతున్న భూతాన్ని తమిళంలో ముయలకన్ అనీ సంస్కృతంలో అపస్మార భూతం అంటారు.అజ్ఞానం,అహంకారం,తామసం అనే నకారాత్మక భావాలకి సంకేతం.వీటిని అణిచివెయ్యటానికే ఈ తాండవం మొదలైంది,అది పూర్తయ్యేవరకు నర్తన జరుగుతూ ఉంటుంది విశ్వంలో, జరుగుతూనే ఉండాలి హృదయంలో!

పెదాలు విడివడీ విడివడకుందా ఉన్న ముఖంలోని లాస్యం ఎంత కోలాహల నృత్యకేళిలోనూ ఉద్విగ్నతకి లోనుకాని స్థితప్రజ్ఞత వల్ల వచ్చే ప్రశాంతచిత్తతని సూచిస్తుంది.అంతటి గహనమైన నృత్యాన్ని చేస్తూ కూడా పరమశివుడు ఏమాత్రం ఉద్విగ్నతకి లోనుకాకుండా ఉంటే చిన్న చిన్న విజయాలకి మనం పొంగిపోవదం దేనికి?

ఎంతోమంది పండితులు దర్శించి,పరవశించి,శోధించి తెలుసుకున్న నటరాజ భంగిమ యొక్క అంతరార్ధం ఇది.అర్ధం తెలియకపోయినా చూడగానే పరవశింపజేసే ఆ సౌందర్యం గురించి ఎంత తెలుసుకున్నా తనివి తీరదు.అయినా తెలియక ముందుకన్న తెలిశాక మరింత ఆనందం కలుగుతుంది కదా!

French sculptor August Rodin brought global attention to a Chola Nataraja bronze from Government Museum, Chennai, with 'La Danse de Siva' (1913), describing it as 'une chose divinement reglée' (a divinely ordered thing). The geologist-turned-art historian Ananda Coomaraswamy, wrote of Nataraja as representing 'poetry, but nonetheless science' in The Dance of Siva (1924). Interestingly, they almost poetically echo the lover-beloved sentiment of the devotional Tamil Bhakti hymns: Rodin compares the grace of Nataraja to the Medici Venus, Coomaraswamy to the 'dancing Eros Protogonos of Lucian.

ప్రాచీన భారతీయ విజ్ఞానశాస్త్రం యొక్క విస్తృతిని దశదిశలకు వ్యాపింపజేసిన ఈ ఆలయానికి ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే నటరాజస్వామిని దర్శించి బయటకు వచ్చి వెనుతిరిగిచూస్తే ఆలయ గోపురం మన వెనుకనే అనుసరించి వస్తున్న అనుభూతి కలుగుతుంది.

శివోహం భవ శివోహం!!

5 comments:

  1. I have commented at an English blog which talks about legality of abortion.It is very interesting that even people who call themselves progressive are not really progressive!

    ReplyDelete
  2. @K.S.Chowdary
    18 జూన్, 2018 5:57 AM
    నీవు నాజోలికి రావడం మానేసిన దగ్గరనుండి నేనసులు నిన్ను పట్టించుకోవడమే మానేసాను. కాని నీవు అక్కడక్కడా నన్ను కించపరిచే ప్రయత్నం చేస్తూనే ఉన్నావు. ఆ పధ్ధతి మార్చుకో బాగుంటుంది.
    లేదంటే నీకు పగలడం అంటే ఏమిటో రుచి చూపిస్తా! ఖబడ్దార్!!

    hari.S.babu
    సాక్ష్యం మ్యాగజైను మూతపడిందని అనలేదే నేను?నేను అనకుండానే అన్నట్టు నీకు ఎలా అర్ధమైంది!నువ్వూ అభిలాషూ ఒకరేనా వేరేనా అన్నదానితో సంబంధం లేకుండా అక్కడి కంటెంటు గురించి అక్కడే చాలెంజి చేశాను, గుర్తు లేదా?"ఇస్లాము మంచిది అని చెప్పుకోవడానికి హిందూమతం చెత్త అని చెప్పకండి!నేనూ అదే ఇస్లాముకు చేస్తే మీకు పగుల్తుంది - ఖబడ్దార్!" అని చాలెంజి చేశాను.ఆ తర్వాత ఇస్లాము గురించి 18 పోష్టులు వేశాను.అప్పుడూ మరోసారి చాలెంజి చేశాను - "వీటిల్లో అబద్ధం ఉంటే నిరూపించాలి, లేదంటే మీ బ్లాగులో హిందూమతం గురించిన పొష్టుల్ని తీసెయ్యాలి" అని అన్నీ ఐపొయాక మరోసారి చాలెంజి చేశాను.ఆ కామెంట్లు పబ్లిష్ చేసి కూడా చాలెంజిని ఎందుకు టేకప్ చెయ్యలేదు?చాలెంజి టేకప్ చేసే దమ్ము లేక కాదా,వూరికినే నోరు మూసుకున్నావంటే నేను నమ్ముతానా?"నీవు నాజోలికి రావడం మానేసిన దగ్గరనుండి నేనసులు నిన్ను పట్టించుకోవడమే మానేసాను." అనీ "ఆరోజే చెప్పాను.. నేను సీరియస్ గా తీసుకుంటే నిన్ను చెన్నాయ్ నుండి ఆంధ్రాకి రప్పించి బొక్క పగలగోడ్తానని,అయినా నీకు బుద్ధి రాలేదు.నీకసలు అదుంటేనే గదా?" అనీ కబుర్లు చెప్తున్నావు గదా ఇపుడు టేకప్ చేస్తావా?

    చెప్పు!నువ్వు రెడీ అన్న మరుక్షణం మళ్ళీ 18 పోష్టులూ బయటికి తీసుకొస్తాను.ఎవరో,ఎంతో మర్యాదగా "తను ఇప్పుడు హందూమతం గురించి పిచ్చిరాతలు రాయడం లేదు కదా,ఇవి మాలాంటి మంచి ముస్లిములని బాధిస్తున్నాయి.తీసెయ్యరాదూ!" అని అడిగితే అన్ పబ్లిష్ చేసి ఉంచాను.నీకు నా బొక్కలు విరగ్గొట్టే దమ్ముందనిపిస్తే చాలెంజికి ఒప్పుకో!అయినా అప్పటి కండిషన్లో సగమే చేశావు నువ్వు.కొత్త పోష్టులు వెయ్యలేదు గానీ పాత పోష్టులు అలాగే ఉన్నాయి.ఈసారి పందేనికి వస్తే అవి కూడా తీసెయ్యాల్సిందే.ఎందుకులే అని సగంలో వదిలేస్తే రెచ్చిపోతున్నావు.మళ్ళీ 18 పోష్టులు వెయ్యనా?

    బస్తీ మే సవాల్!

    ReplyDelete
  3. ఇక కొండల రావు నన్ను పిచ్చికుక్క అనటం గురించి:
    నిన్ననే మా కొలీగ్ ఒకతను డయటింగ్ చేస్తున్నానన్నాడు లంచిటైములో పక్కన కూర్చున్నప్పుడు ఏదో ఆఫర్ చెయ్యబోతే!కుర్రాడు, సంబంధాలు చూస్తున్నారు, అమ్మాయిల వైపునుంచి లావు అనే మాట వచ్చిందట!నేను వీరమాచనేని డయట్ ప్లాను try చెయ్యొచ్చు గదా అంటే "చీ!యాక్,ధూ!" అన్నాడు.రోజుకి నాలుగు లీటర్ల నిమ్మరసం తాగాలంట, నేను limca నాలుగు గుక్కలు తాగేసరికే వికారం పుడుతుంది.అదయితే యెట్టాగో తాగొచ్చు.మరీ కొబ్బర్నూనె కూడా తాగాలంటున్నాడు అని విసుక్కున్నాడు.తెలిసినవాళ్ళలో ఒకతను ట్రై చేశాడు,రిజల్టు కనపడింది గానీ నేను మాత్రం ఫాలో అవను అనేశాడు.ఇంటి దగ్గిరయితే సాగుతుందేమో గానీ సిటీలో ఎట్లా కుదురుతుందన్నాడు.అందరికీ రిజల్టు రావదం లేదు అని కూడ చెప్పేశాడు.తనూ వాడాలనుకుని తెలుసుకుని ఇవన్నీ తెలిసి వెనక్కి తగ్గానని చెప్పాడు.

    అదీ నన్ను పిచ్చికుక్క అన్నాడంటున్న మీ ఫ్రెండు మేధావిత్వం!అసలు అల్లోపతి మీద అన్ని విసుర్లు విసిరి అటు వెళ్తే పెరిగిపోయే కర్సు గురించి భీకరమైన డయలాగులు చెప్పిన పెద్దమనిషి ఇవన్నీ వూరికే పంచి పెడుతున్నాడా?రోజుకి నాలుగు లీటర్ల నిమ్మరసానికి కావలసిన నిమ్మకాయలు వూరికే రావు!కొబ్బరి నూనె ఈ కాలంలో కావాలంటే పారాషూట్ డబ్బాలు కొనాలి!డాక్టరు దగ్గిరకి వెళ్తే విజిలెన్స్ ఫీజు 500కి మించదు.తినే తిండిలోనే మార్పులు చెబుతాడు గదా!ఈ వీరాచనేని ప్లాను కేసీయారు గుడుంబా వాడకాన్ని తగ్గించడానికి కల్తీకల్లును వాడినట్టు లేదూ!

    ఒక పిచ్చివాడు నన్ను పిచ్చివాడంటే కించపడతానా పొంగిపోతాను గానీ:-)

    ReplyDelete
    Replies
    1. ఆయన బ్లాగ్ లోనే ఒక పోష్టులోనో , వ్యాఖ్యానం లోనో గానీ వాళ్ళావిడే ఆ విధానాన్ని యాక్ థూ అన్నట్టుగా వ్రాసాడు. ఇంట్లో ఇల్లాలినే ఒప్పించలేనోడు ఊళ్ళోవాళ్ళనేం ఉద్ధరిస్తాడు...

      Delete
    2. ఇంట్లో ఇల్లాలినే ఒప్పించలేనోడు ఊళ్ళోవాళ్ళనేం ఉద్ధరిస్తాడు..>>>>>>
      ఎవరికైనా భాగస్వామిని ఒప్పించడం కష్టం కదండీ ....ఊళ్ళో వాళ్ళని ఉద్ధరించనక్కరలేదు. ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకుంటే చాలు. ఉద్ధరేదాత్మ..

      Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...