Thursday, 28 June 2018

యూరోపియన్లూ అమెరికన్లూ నమ్మే గ్రహాంతారవాసులు నిజంగా ఉన్నారా?మానవులకి సాధ్యం కాదనిపించే ప్రాచీన కట్టడాల్ని గ్రహాంతరవాసులే కట్టారా!

     హేతుబద్ధమైన ఆలోచనలతో బుద్ధిని వికసింపజేసుకుని కనిపించిన ప్రతి దాన్నీ జరుగుతున్న ప్రతి సంఘటననీ తర్కం ద్వారా విశ్లేషించుకుంటూ అందమైన కల్పనలతో సంతృప్తి పడకుండా ప్రయోగాలు చేసి నిర్ధారించుకున్నాకనే నమ్మడం అనేది శాస్త్రీయమైన ఆలోచనా విధానం అని అందరూ ఒప్పుకుంటారు.అయితే ఎంత శాస్త్రీయంగా ఆలోచించినా నమ్మలేని విషయాలని యెట్లా అర్ధం చేసుకోవాలి?తమ జ్ఞానంతో ఒక సంభావ్యతని శాస్త్రీయమైనదని నిర్ధారించలేని దృగ్విషయం ఎదురైనప్పుడు మనుషులు రెండు రకాల ప్రవర్తనల్ని చూపిస్తున్నారు - అహంకారి అయితే తనకి తెలియనిది ఇంకెవరికీ తెలియడానికి వీల్లేదనే ధోరణితో తనకి తోచి తను చెప్పినదాన్ని నమ్మమంటాడు, వినయశీలి అయితే తనకి తెలిసిన దాన్ని మాత్రమే ఇతరులకి చెప్పి తెలియని దాని గురించి తన జ్ఞానాన్ని పెంచుకోవాలని గుర్తించి అందుకోసం కొత్త ప్రయత్నాలు మొదలుపెడతాడు. కేవలం 200 యేళ్ల వయస్సున్న ఆధునిక విజ్ఞానశాస్త్రం మనం రోజువారీ బతుకుల్లో వాడుకుని సుఖపడటానికి కొన్ని వస్తువులని తయారు చెయ్యగలిగింది కానీ మన చుట్టూ ఉన్న విశ్వాన్ని అర్ధం చేసుకోవడంలో ఇంకా తత్తర పడుతూనే ఉన్నది!

     మానవవాదిని అని చెప్పుకునే గోగినేని బాబు దేవుడు లేడు అని బల్ల గుద్ది చెప్తాడు,కానీ ఎలియన్స్ ఉన్నాయి అనో ఉండొచ్చు అనో ఒప్పుకుంటాడు!తను పాటించే మానవవాదాన్ని కనీసం మానవవాతావాదం అని చెప్పుకోవటానికి కూడా తిరస్కరిస్తాడు.తన వాదానికి "తా" అనే ఒక అక్షరం చేర్చినా సహించలేనివాడు ఇతరులకి సహనం లేదని వ్యంగ్యాలు విసురుతాడు!ఈ మధ్యనే ఒక క్రైస్తవమతప్రచారకుడు "ఈ శాస్త్రాల మీద ఎడంకాలు వేసి నుంచున్నాడు క్రైస్తవుడు!" అని గొప్పలు చెప్పుకుంటున్నాడు.బాల్‌పెన్ను కనిపెట్టింది క్రైస్తవుడు,విమానం కనిపెట్టింది క్రైస్తవుడు,గడియారం కనిపెట్టింది క్రైస్తవుడు అని చాంతాడు పొడుగు లిస్టు చెప్పాడు.క్రీస్తు పుట్టినది అని చెప్పి కాలాన్ని దానికి ముందు,దానికి వెనక అని విడగొట్టారు గానీ అసలు ఆ క్రీస్తు చారిత్రకవ్యక్తియేనా లేక మతాధిపతులు ప్రజల్ని ఎవరో ఒకరికి విధేయులుగా ఉంచాల్సిన అవసరం కోసం నిలబెట్టిన కల్పితవ్యక్తియా అనేది ఇంకా నిర్ధారణ కాలేదు - అమ్మతోడు, నిజం!క్రీస్తు పుట్టాడని చెబుతున్న కాలానికి మూడువందల సంవత్సరాలకి గానీ ఆ మతం బహిరంగం కాలేదు.అప్ప్పటినుంచి వెయ్యేళ్ళ కాలాన్ని చీకటియుగం అని వారి చరిత్రకారులే నిర్ధారించారు.సైన్సు సంగతి తర్వాత కామన్ సెన్సుని కూడా వారు సహించలేకపోయారు!

     కోపర్నికస్,గెలీలియో వంటివాళ్ళని కూడా వాళ్లు కేవలం సైంటిస్టులు అయినందుకు చంపలేదు.వాళ్ళు  సైన్సు ద్వారా వస్తువులను కనుక్కుని వ్యాపారం చేసి డబ్బు గడించితే చర్చికీ ఇష్టమైనవాళ్ళే అయ్యేవాళ్ళు.కానీ వాళ్ళు చర్చి అధిపత్యాన్ని తిరస్కరించే ఇల్యూమినాటి,మాసన్రీ వంటి ఉద్యమాలలో పాల్గొన్నారు గనకనే చంపారు,ఖైదు చేశారు,నిషేధించారు.చర్చి అధిపత్యానికి నిజమైన సవాలు ఇస్తూ సమస్త మానవాళికీ ప్రయోజనం కలిగించే గంభీరమైన తాత్విక చింతన క్రీ.శ 11వ శతాబ్దం తర్వాతనే అక్కడ పుట్టింది.అయితే ఇప్పటికీ అబార్షన్ల వల్ల అన్యాయమైపోతున్న ఆడవాళ్ళని సమర్ధించేవారు తమని తాము progressive అని చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతూ "Libertarianist" అనే లేబుల్ మాత్రమే తగిలించుని సరిపెట్టుకుంటున్నారంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు.

     కన్యాశుల్కంలొ గిరీశం కుంచానికి చిల్లుపడితే అడ్డం తిప్పి కొలిస్తే కూసిన్ని గింజలైనా దక్కుతాయి గదా అన్నట్టు తనని ధిక్కరించే నిజమైన సైన్సుని భ్రష్టు పట్టించటానికి చర్చి ప్రోత్సహించిన సూడోసైన్సు యొక్క అనేకానేకమైన యెత్తుగడలలో ఒక భాగమే ఎలియన్సుకి సంబంధించిన గాలివార్తలని ప్రచారం చెయ్యటం!ప్రాచీన కాలంలో కట్టబడిన అద్భుతమైన నిర్మాణాలని అన్నింటినీ ఎలియన్సుకి అంటగట్టెయ్యటం వీళ్ళ నిత్యకృత్యాల్లో ఒక భాగం.వీళ్ళలో చాలామంది అసలు పరిశోధనల్లో పాలు పంచుకున్నవాళ్లు అయి ఉండరు,ఒకవేళ వీళ్ళు కూడా పరిశోధకులు అయిన్నప్పటికీ వైజ్ఞానిక పరిశోధనా ప్రపంచంలో విశ్వసనీయతా గౌరవమూ ఉన్నవాళ్ళు కాదు.క్రైస్తవమతాన్ని ప్రపంచానికి ఏకైక రక్షణ విధానం అని చెప్తున్న వాళ్ళు కాబట్టి క్రైస్తవమతం సోదిలో కూడా లేని కాలంలోనే ఈ భూమి మీద అనేక ప్రాంతాలలోని మానవసమూహాలు అద్భుతమైన సాంకేతికతని సాధించారనే నిజాన్ని జీర్ణించుకోలేకపోవడం వల్ల  ఈ గాలివార్తలని ప్రచారం చెయ్యడానికి తగులుకున్నారు.

     వీళ్ళ వ్యవహారం ఎలా ఉంటుందో పిరమిడ్ల చుట్టూ జరుగుతున్న పరిశోధనల్ని చూస్తే తెలుస్తుంది.చూడగానే పిరమిడ్లు చెల్లా చెదురు నిర్మాణాలు అనిపిస్తాయి.కానీ వాటి మూలల నుంచి ఒక సరళరేఖ గీస్తే అవన్నీ కలిసి నైలు నది  డెల్టాని రెండుగా చీల్చుతున్నట్టు కనుక్కున్నారు.వెంఠనే అలియన్ థియరిస్టులు ""Here is what really happened: A couple of aliens, flying high enough over the Earth to be able to see where the Nile Delta's origin is, easily saw what orientation the pyramid would need to be in order to have its diagonals lie on those two lines."" అంటూ ఎలియన్సు పేరు మీద హడావిడి చేస్తారు.ఒక్క పిరమిడ్సు మాత్రమే కాదు ప్రపంచంలో ఈనాడు ప్రాచీనమైన ఆన్ని నిర్మాణాలనీ పరిశోధించిన వారందరూ చెబుతున్నది ఒకటే మాట - "ఇవేవీ అనాలోచితంగా కట్టిన నిర్మాణాలు కావు,పైగా ఏ నిర్మాణమూ దానికది విడి నిర్మాణం కాదు.అన్ని నిర్మాణాల వెనకా ఒక ఖచ్చితమైన ప్రణాళిక ఉంది.ఏ నిర్మాణం ఏ ప్రాంతంలో ఎంత వైశాల్యంలో ఏ విధమైన ఆకారంతో కట్టాలి అని నిర్ధారించుకుని చేసిన సామూహిక నిర్మాణాలు.ఏ ఒక్కదాన్నీ విడిగాచూస్తే ఎందుకు కట్టారో అర్ధం కాదు.అన్నింటినీ కలిపి అర్ధం చేసుకుంటేనే అసలు కారణం తెలుస్తుంది." అని.నిజమైన జిజ్ఞాసువులు ఈ సూడోసైన్సుగాళ్ళని పట్టించుకోకుండా పరిశోదనలు సాగిస్తున్నారు గనకనే సైన్సులో ఈ కొంచెం పురోగతి కనిపిస్తున్నది.అయితే ఈ మధ్యనే వాళ్ళకీ సూడోసైన్సుగాళ్ళని పట్టించుకోకపోవడం వలన జరుగుతున్న ప్రమాదం తెలుస్తున్నది.కొందరు ఈ సూడోసైన్సును ఖండిస్తూ ముందుకి వస్తున్నారు.

     Eric Cline succinctly explains this in his review, noting "pseudoarchaeologists cannot accept the fact that the mere humans might have come up with great innovations such as the domestication of plants and animals or built great architectural masterpieces such as the Sphinx all on their own; rather, they frequently seek or invoke divine, or even alien, assistance to explain how these came to be." archaeologist Jeb Card points out, as does Feder, that the origins of this idea lay in Victorian mysticism and Theosophy, a movement that "blended hermetic magic, spiritualism, Western curiosity abut Eastern religion, colonial racism, and misconceptions of evolution into a worldview of root races, lost continents, and ascended masters who originated on Venus or other worlds."Andrew Collins' book Göbekli Tepe: Genesis of the Gods, reviewed by archaeologist Eric Cline, deals with the Neolithic site in Turkey that Collins tries to connect to the biblical Garden of Eden by treating the Bible as incontrovertible fact.Unfortunately, tales of ancient aliens and extraordinary humans creating the Pyramids as a communication device are often more fascinating than slow cultural change.  Archaeologists need to find a way to showcase the humanity of the past and get across the idea that ancient humans were intelligent, capable, and innovative -- that those of us alive today are the product of that long history of innovation, and that we are continuing the tradition of our early ancestors by inventing cars, computers, and, yes, even pseudo scientists.

     ఈ సూడోసైంటిస్టుల మరొక దినకృత్యం ఇప్పుడు సైన్సు కనుక్కుంటున్నవన్నీ బైబిలు అబద్ధాలను రుజువు చేస్తున్నా సరే తిరగేసి మరగేసి  బైబిలు యొక్క శాస్త్రీయతను నిలబెట్టటం.వీళ్ళ అండతో క్రైస్తవ మత ప్రచారకులు క్రైస్తవేతర మానవ సమూహాలు పూజించే దేవుళ్ళు తాము చెబుతున్న గ్రహాంతరవాసులు మాత్రమేననీ ఆయా సంస్కృతుల ప్రజలు అజ్ఞానం చేత వాళ్లని పూజిస్తున్నారనీ చెబుతారు.అలా చెప్పటం వవతలివాళ్ళని సిగ్గుపడేలా చేసి తమ మతంలోకి రప్పించుకోవటానికే!అలా చెప్పకపోతే ఆయా సంస్కృతులు తమకన్న గొప్పవి అని ఒప్పుకోవలసి వస్తుంది.అప్పుడు మేము మీకన్న గొప్పవాళ్లం,మాలోకి వస్తే మీరూ గొప్పవాళ్ళు అయిపోవచ్చునని చెప్పటం కుదరదు కదా!

     ఈ క్రైస్తవ మత ప్రచారకుల డాంబికాలు ఎక్కువకాలం నిలబడవు గానీ అసలు ప్రాచీన కాలంలోని ప్రజలు ఆధునికులం అని చెప్పుకుంటున్న మనకి సాధ్యం కాని స్థాయిలో సాంకేతికతని ఉపయోగించి అంతటి బృహన్నిర్మాణాలని ఎట్లా నిర్మించగలిగారు?మానవ సమాజం ఒక తరం కన్న మరొక తరం వృద్ధిని సాధిస్తూ కదులుతుందని అనుకుంటున్న మన నమ్మకాన్ని పటాపంచలు చేస్తూ వెనుకటి కాలం వాళ్లు సాధించినవాటిని చూసి ఆశ్చర్యపోవడమే తప్ప సాధించలేని తక్కువ స్థాయిలో ఉండటాన్ని ఎట్లా అర్ధం చేసుకోవాలి?వాళ్ళ తర్వాత పుట్టినవాళ్ళం వాళ్ళనుంచి నేర్చుకున్నదానికి మనం కొంత కలుపుతూ వాళ్ళకన్న తెలివిగా ఉండటం సహజం కదా అని అమాయకత్వంతోనో అహంకారంతోనో ఆలోచిస్తే కుదరదు - వాళ్లు మనకన్న తెలివైనవాళ్లు అవడమూ నిజమే, మనం వాళ్ళకన్న తెలితక్కువవాళ్ళం అవడమూ నిజమే!

     ఈ ముడిని విప్పటానికి న్యూరాలజిస్టులు ఆర్కియాలజిస్టుల తవ్వకాల ద్వారా బయటపడిన మానవ కంకాళాల మీద చేసిన పరిశోధనలు పనికొస్తాయి.1.8 మిలియన్ల నాటి మానవ దేహాలలోని మెదడు ఇప్పటి మానవ దేహాలలోని మెదడు కన్న రెండింతలు పెద్దది!"The stone tools that have survived in the archaeological record can tell us something about the intelligence of the people who made them. Even our earliest human ancestors were no dummies" అని వాళ్ళే ఒప్పుకున్నారు.మొదట్లో అద్భుతమైన ప్రజ్ఞ కలిగివుండి పోను పోనూ ప్రజ్ఞ తగ్గిపోవడం అనేది ఇప్పటి ఆధునికులు చెప్తున్న జీవపరిణామవాదం ప్రకారం విచిత్రమైన విషయమే గానీ ప్రాచీన భారతీయ విజ్ఞానులు చేసిన యుగవిభజనలో కనిపించేది ఇదే కదా!మొదటిదైన కృత/సత్య యుగంలో దేహపరిమాణంలో గానీ బుద్ధివిశేషంలో గానీ మానవులు సర్వోన్నతులై ఉంటారు, రెండవదైన త్రేతాయుగంలో ఔన్నత్యం కొంత తగ్గుతుంది,ద్వాపరయుగంలో ఔన్నత్యం మరింత తగ్గి కలియుగంలో శైధిల్యం తారాస్థాయికి చేరుకుంటుంది అని చెప్పారు కదా!

     ఈ పరిశోధనలు చేసినవారు మరొక విషయాన్ని కూడా చెబుతున్నారు.మిగిలిన అకడమిక్ న్యూరాలజిస్టులు కూడా ఆ విషయాన్ని నిర్ధారిస్తున్నారు.అదేమిటంటే, ఇప్పటి మానవులు మెదడుకున్న మొత్తం శక్తిలో చాలా తక్కువ శాతాన్ని మాత్రమే ఉపయోగించుకుంటున్నారు.కనీసం 50% వరకు ఉపయోగించుకోగలితే చాలు అన్ని రంగాలలో ఇప్పటికన్న ఎంతో మెరుగైన జీవితాన్ని గడుపుతూ శాస్త్రీయతలో ప్రాచీనులతో పోటీ పడగలిగే అవకాశం ఉంది.ఒక రకంగా చెప్పాలంటే అప్పటివారు అవసరాన్ని బట్టి అవన్నీ నేర్చుకుని సాధించి మనకు వడ్డించిన విస్తరిని అందించారు.వారు మనకు ఇచ్చినదాన్ని కూడా సరైన పద్దతిలో ఉపయోగించుకుని సుఖపడటమే తెలియని స్థితిలో ఉన్న మనకు కొత్త విషయాలని కనుక్కోవడానికి ఉత్సాహం ఎక్కణ్ణుంచి వస్తుంది?వాళ్ళు అన్నీ అమర్చిపెట్టడం వల్ల కొత్తవి కనుక్కోవాల్సిన అవసరమూ లేదు.మిగిలిన ప్రపంచం సంగతి ఎలా ఉన్నా ఒకనాడు ప్రపంచం మొత్తాన్ని కలయదిరిగి ఈరోజు భూమి మీద విభిన్నమైనవిగా కనిపించే అసంఖ్యాకమైన సంస్కృతులని ప్రభావితం చేసిన అఖండ ప్రజ్ఞానిధులు పుట్టిన భారతదేశంలోని ప్రజలలో కనిపించే నిస్తబ్దతకి విద్యార్ధులలో బుద్ధిని వికసింపజేసే విషయాలు లేని బానిసగొట్టు విద్యావ్యవస్థయే ముఖ్యమైన కారణం!

     బ్రిటిషువాళ్ళ వలస దేశాల్లో కొంచెం ముందువెనకలుగా మనతోపాటు స్వతంత్రం తెచ్చుకున్న ఇతర దేశాలలో మొదట చేసినది ఇంగ్లీషువాళ్ళు నాశనం చెయ్యాలని చూసిన తమ జాతీయతని నిలబెట్టుకునే గట్టి ప్రయత్నాలు చెయ్యడం.మన దేశంలో జరిగినది మాత్రం అందుకు పూర్తి వ్యతిరేకం - స్వతంత్రం రాకముందు కన్న వచ్చాక బ్రిటిషువాళ్ళ పట్ల ఆరాధన ఇంగ్లీషు భాష పట్ల బానిసత్వం పెరిగాయి!ఒక ముండలముఠాకోరువెధవ స్వతంత్రభారతప్రప్రధమప్రధాని స్థానంలో ఉండి తన పేరుని దేవానంద ధర్మానంద కౌశాంబి అని చెప్పుకోవడానికి సిగ్గుపడి డి.డి.కౌశాంబి అనీ శ్రీపాద అమృత డాంగే అన్న వినసొంపైన చక్కని పేరుని మడతలు వేసి యస్.ఏ.డాంగే అనీ చెప్పుకున్న ఈదేశంలోఏముందినాబొంద గాళ్ళని విశ్వవిద్యాలయాల్లో పీఠాధిపతులుగా నియమించి వాళ్ళచేత పరమ పాషండాలతో నిండిన అబద్ధాల చరిత్రని రాయించి పిల్లల చేత చదివించాడు!తెల్లగా పుట్టినవాళ్ళంతా ఆర్యులు నల్లగా పుట్టినవాళ్ళంతా ద్రవిడులు, ఆర్యులు ఎక్కడినుంచో వచ్చి ఇక్కడున్న స్థానికులైన ద్రవిడుల్ని అణగదొక్కి తమ సంస్కృతిని రుద్దేశారు అని ప్రజలని చీల్చడానికి రాస్తున్నవి అబద్ధమని తెలియకనే రాశారా రొమిల్లా ధాపర్ లాంటివాళ్ళు?పక్కనుంచి అంబేద్కర్ చెప్తూనే ఉన్నాడు కదా ఇవన్నీ అల్లికలూ కుట్టుపనులూ అని!ప్రపంచమంతటికీ మేమే సంస్కృతిని నేర్పామనటం సాంస్కృతిక దురహంకారం అనే అజ్ఞానులకి అరేబియాలో బయటపడుతున్న ప్రాచీన కాలపు గణేశ విగ్రహాలూ రష్యా శాస్త్రవేత్తలు దక్షా మ్యాప్ అని పేరు పెట్టుకున్న శిలాఫలకాలూ కనపడటం లేదా?విదేశీయులే "ప్రపంచంలోని సమస్త నాగరికతలకూ భారతదేశమే మాతృస్థానం!" అని బల్లగుద్ది చెప్తుంటే మన వెనకటి తరాల వాళ్ళ గొప్పని మనం గుర్తు చేసుకోవడం కూడా సాంస్కృతిక దురహంకారం అంటూ మనవాళ్ళకి గ్రీకులు చెప్పేవరకూ రాశుల గురించి తెలియదు లాంటి చెత్తవాగుడు వాగడం ఏ  రకం తెలివి?

     ప్రాచీన భారతీయ మేధావుల గొప్పదనాన్ని ఒప్పుకోలేని వాళ్ళు ఆయా నాగరికతలు అక్కడి స్థానికుల బుద్ధివిశేషం ఏమీ లేకుండా వారికి నాగరికతని భారతీయులు పరిచయం చెయ్యడం వల్లనే వాళ్ళు అలా ఉన్నారనడం హిందువుల అహంకారం అంటున్నారు గానీ చాలా కాలం నుంచీ ప్రపంచమంతటా జరుగుతున్న పరిశోధనా ఫలితాలు ఈ మధ్యనే స్పష్టమైన రూపం దాలుస్తూ పైకి విభిన్నమైన అనేక నాగరికతలు లోనారసి చూస్తే అన్నింటిలోనూ ఏకాత్మకతను చూపిస్తున్నాయనీ ఇవన్నీ ఒకే మూలం నుంచి రావడం వల్లనే  ఆ పోలికలు సాధ్యపడినాయనీ సూచిస్తున్నాయి.మీదుమిక్కిలి ఈ ఏకాత్మకతను ప్రదర్శించే లక్షణాలు ఆర్య-ద్రవిడ సిద్ధాంతులు పులిమినట్టు బయటినుంచి వచ్చినవారు రుద్దితే రుద్దించుకున్నట్లు గాక అవి ఆయా ప్రాంతాల నాగరికతలో విదేశీయమని ముద్రవేసి లాగిపారెయ్యలేనంత ఆత్మీయమైనవి అయిపోయాయనేది తెలుస్తున్నది
     ప్రపంచంలోని అన్ని ప్రాచీన కాలపు భవనాల నిర్మాణంలో T-Grooves అనే ఇనుప పరికరాలు కనిపిస్తున్నాయి.ఆ కాలపు నిర్మాణ కౌశలం ఎంత గొప్పదంటే సిమెంటు వాడకపోయినా అంత పెద్ద రాళ్ళు లెగో బ్రిక్స్ కన్న కుదురైన పద్ధతిలో అమరిపోయి ఇంత సుదీర్ఘ కాలం తర్వాత కూడా చెక్కు చెదరకుండా నిలబడి ఉన్నాయి.Tiahuanaco, Ollantaytambo, Koricancha, Mesopotamia, Egypt, Cambodia వంటి ప్రాంతాలు కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్నప్పటికీ ఈ సాంకేతికతలో ఎంత దగ్గిర పోలిక ఉందో!అందుకే పరిశోధకులు విస్మితులవుతున్నారు,కానీ భారతదేశపు వాస్తుశిల్పకళలో ఇది సామాన్యమైన విషయం.దాదాపు ప్రాచీన కాలపు అన్ని హిందూ దేవాలయాలలోనూ ఈ పనిముట్టును చాలా విరివిగా వాడారు.మిగిలిన అన్ని ప్రాంతాలలో చెదురు మదురుగా కనబడి భారతదేశంలో విరివిగా కనఫడటంలోని అర్ధమేమిటి?మొదట ఇక్కడివారు ఈ సాంకేతికతని కనిపెట్టి అనుభవం మీద రాటుదేలి ఇతర ప్రాంతాలలో కూడా కొన్ని సమూనాలు నిర్మించి అక్కడివారికి పరిచయం చేశారని కాదా!

     పిరమిడ్లు అనగానే మనకు ఈజిప్టు మాత్రమే గుర్తుకొస్తుంది.కానీ ఇవి చాలా ప్రాంతాలలో ఉన్నాయి.కొన్ని ఖగోళ సంబంధమైన విషయాలను తమ నిర్మాణంలో ఇముడ్చుకుంటే కొన్ని ఆ ప్రాంతం యొక్క భౌమాయస్కాంత శక్తిపాతాన్ని ప్రభావితం చేసే విధంగా నిర్మించబడ్డాయి.భారతదేశంలోనూ ప్రపంచంలోని అన్ని ప్రాచీన నాగరికతలు వెల్లి విరిసిన ప్రాంతాలలోనూ అరచేతి ముద్రల అలంకరణ కనిపిస్తుంది.అరచేతిని రంగులలో ముంచి రాతిమీద అద్దడం నుంచి అరచేతినే రాతిమీద ఉంచి చుట్టూ రంగులను వెదజల్లడం వరకు ఎన్నో రకాలైన పద్ధతులలో ఈ హస్తముద్రలని వాడుకున్నారు.దీని అర్ధం యేమిటో యెవరికీ తెలియడం లేదు గానీ నా వూహ ప్రకారం వాటిని రూపు దిద్దినవారు "కరాగ్రే వసతే లక్ష్మీ" శ్లోకంతో దినచర్యను ప్రారంభించే సనాతన ధార్మిక సంప్రదాయంలో అరచేతికి ఉన్న ప్రాధాన్యతను సూచిస్తున్నారు.

     ఇవి కాలక్షేపానికో  యధాలాపంగానో చేసినవి కావు.అసలు ప్రాచీన కాలంలోని ఏ ఒక్క నిర్మాణమూ అర్ధం లేనిది కాదు,ఇంతమంది పరిశోధకులు ఇంతకాలం పాటు శ్రమించినా ఇది ఇక్కడ అనవసరమని తీసి పక్కన పెట్టలేకపోతున్నారు.స్వస్తిక చిహ్నాన్నే తీసుకోండి - ఇపుడది నాజీ హిట్లర్ వాడడం వల్ల జర్మన్లకి ప్రత్యామ్నాయంగా మారింది.కానీ ప్రాచీన కాలపు యూరోపియన్ సంస్కృతికి సంబంధించిన Etruscan, Greek, Roman, Gaul, Celt నాగరికతకి చెందిన శిధిలాలలో స్వస్తిక చిహ్నం కనబడుతుంది.స్వస్తిక చిహ్నం పుట్టినది హిందూమతంలోనే అనీ పైన చెప్పుకున్న నాగరికతలు హిందూమతం నుంచి ప్రేరణ పొందినవేననీ ప్రత్యేకించి చెప్పనక్కరలేదు కదా!
     ఈజిప్షియన్ పిరమిడ్లలో స్ఫింక్స్ అనే రూపం ఉంది.దీని ప్రత్యేకత నృసింహావతారమూర్తిలోని సింహం తలతో ఉన్న మానవ రూపంలా సింహం దేహానికి మనిషి తలను అతికించినట్టు ఉండటం.మన పౌరాణిక సాహిత్యంలో కామధేనువు రూపచిత్రణ కొంచెం పత్యేకంగా ఉంటుంది.తోక ఆవుతోకలా కాక నెమలి పింఛంలా ఉంటుంది.మిగిలిన దేహం అంతా చూడచక్కని ఆవు - అయితే తల మాత్రం మానవస్త్రీది!ఇక్కడ కామధేనువుకి స్త్రీముఖం ఉంటే అక్కడ స్ఫింక్స్ అనే రూపానికి పురుషుడి ముఖం ఉంటుంది.అంటే ఇవి స్త్రీ పురుష తత్వాలకి సంబంధించిన ద్వంద్వాలు - ఏ సంస్కృతి దేనికి ప్రాధాన్యత ఇస్తుందో అక్కడ  ఆ మూర్తి ప్రముఖంగా ఉంది.ప్రపంచంలోని అన్ని చోట్లా మనం భద్రకాళి అని పిలుచుకున మూర్తి వలె నాలుక బయటికి చాపిన ఉగ్రమూర్తులు కనబడుతున్నాయి.అర్ధం తెలియనివాళ్ళకి ఇది భయోత్పాతాన్ని కలిగించే డెవిల్ వర్షిప్ అనిపిస్తున్నది,కానీ వాటిని అర్ధం చేసుకోవాలంటే భారతీయ సంస్కృతిని అర్ధం చేసుకోవాలి.దుష్టులని భయపెట్టడం వల్లనే శిష్టులని రక్షించగలగడం అనే రహస్యం వాటిలో ఇమిడివుంది గనకనే ప్రపంచమంతటా వాటిని గౌరవిస్తున్నారు,పూజిస్తున్నారు!

     ఇంకా విశేషం యేమిటంటే, ప్రాచీన కాలంలోని పూజారి వ్యవస్థ అన్ని నాగరికతలలోనూ ఒక్కలాగే ఉంది.మొత్తం సామాజిక జీవితంలో అతనికున్న ప్రాధాన్యతా సామాజికుల నుంచి అతనికి లభించే గౌరవాలూ వేషధారణా ప్రవర్తనా అన్నీ ఒక్కలాగే ఉండడమే కాకుండా అవి భారతదేశపు ఆలయ పూజారుల వ్యవస్థను పోలి ఉన్నాయి.ప్రపంచ నాగరికతల మధ్యన ఉన్న అన్ని పోలికలలోనూ ఈ ఒక్కటి చాలు అవన్నీ హిందూమతం అని వాళ్ళు పేరు పెట్టిన సనాతన ధర్మమే అత్యంత ప్రాచీనమైనదే కాక అత్యంత ప్రభావశీలమైనది కూడా అని నిరూపించడానికి!
     అసలైన అద్భుతం యేమిటంటే మిగిలిన ప్రాంతాలలో చెదురుమదురై కనబడుతున్న ఆ కొన్ని నిర్మాణాలలోని విస్మయపరిచే సాంకేతికత భారతదేశంలోని ప్రాచీన కాలపు ఆలయాల నిర్మాణంలొ అతి సామాన్యమై గోచరిస్తున్నది. వెయ్యి స్తంభాల గుడిలో స్తంభాలని ఎప్పుడయినా లెక్కపేట్టారా?ఖచ్చితంగా వెయ్యి స్తంభాలు లెక్కకి రావు! వెయ్యి స్తంభాలు ఉన్నాయి, కానీ మీకు కనపడటం లేదు అంటే నమ్ముతారా!ఇంద్రజాలమో మహేంద్రజాలమో కాదు,అది వారి నిర్మాణ కౌశలం!మీరు గోడల్ని పరిశీలించి చూస్తే ఇటుకలుగా వాడిన రాళ్ళకి మధ్యన గాడులు కనిపించక అది ఏకశిలానిర్మాణమేమో అనిపిస్తుంది.కానీ కాదు.వాళ్ళు రాతి ఇటుకల్ని ఇప్పటి లెగో బ్రిక్స్ కన్న ఎంతో సంక్లిష్టమైన అమరికలతో చెక్కి ఒకదానిలో ఒకటి ఇరికించితే మీరు చూస్తున్న ఏకాండశిలానిర్మాణం అనిపించే ఆలయం తయారైంది!ఇక్కడ ఇంకొక విశేషం యేమిటంటే,అన్ని ఆలయాలలోనూ గోడల మీద దేవతాప్రతిమలతోనో నృత్యభంగిమలతోనో అలంకరించితే ఇక్కడ విచిత్రమైన ఆకారాలతో అలంకరించారు,ఎందుకంటారూ!అవి వాళ్ళు రాళ్ళని తొలచడానికి ఉపయోగించిన పనిముట్లు!ఈ ఆలయంలోనే కాదు దాదాపు ఎలా కట్టారో తెలియడం లేదని అనిపించే ప్రతి ఆలయంలోనూ తాము కట్టిన సాంకేతికతను గురించి క్లూలు ఇస్తూనే ఉన్నారు.ఇంత తెలివైనవాళ్ళూ ఇటువంటి సాంకేతికతని ప్రదర్శించినవాళ్ళూ మానవులే కదా!మిగిలిన చోట్ల కూడా ఆయా నిర్మాణాలని కట్టినవాళ్ళు వీళ్లే కాకూడదా?ఈ కాస్త కోసం ఎలియన్సు రావాలా!
     ప్రతీ ఆలయంలోనూ ఆ అలయానికి మాత్రమే అమరేటట్టు ఒక ప్రత్యేకతను చూపించడం,ఆ ప్రత్యేకతను మరే ఆలయంలోనూ వాడకపోవటం అనే ఇక్కడి వారి ధోరణి వల్లనే ప్రపంచంలోని అన్ని నిర్మాణాలూ కొన్ని పొలికల్నీ కొన్ని తేడాల్నీ చూపిస్తున్నాయి!భూమి మీద విసిరివేయబడినట్లు కనిపించే ప్రాచీ కాలపు కట్టడాలు ఏవీ అనుకోకుండా కట్టినవి కాదనీ వాటన్నిటి వెనకా ఖచ్చితమైన పరస్పరాధారితమైన విషయాలు ఉన్నాయనీ శాత్రవేత్తలు ఒప్పుకుంటున్నారు.ఉదాహరణకి ఈజిప్షియన్ పిరమిడ్లలో పెద్దదైన గిజా పిరమిడ్ బరువు 5,955,000 టన్నులు.దీనిని 10^8తో హెచ్చిస్తే భూమి యొక్క ద్రవ్యరాశి వస్తుంది!దాదాపు ప్రతి నిర్మాణంలోనూ కనబడుతున్నఇలాంటి విశేషాల్ని గమనించిన ఒక శాస్త్రవేత్త "I can’t help to wonder if there is a slight chance that somehow, ancient cultures all over the world were connected, either through a global consciousness, or another global phenomenon that helped point them in a single direction, which resulted in the construction of countless ancient sites that look alike as if it was a construction process on a global scale.Almost as if every single culture on our planet felt the need to place monuments such as the pyramids, the Stonehenge, Teotihuacan and other incredible places in specific locations.What these ancient civilizations did was create a pattern, a pattern that we today are identifying and connecting, forming a massive puzzle, piece by piece." అని భావిస్తున్నాడంటే ఆశ్చర్యంగా లేదూ!ఈ రకమైన పరస్పరాశ్రితమైన సంబంధాల్ని మానవజాతి ప్రభవించిన మొట్టమొదటి రోజుల్లోనే గుర్తించి చాలా ముందుగానే గణితశాస్త్రం, ఖగోళశాస్త్రం, లోహవిజ్ఞానశాస్త్రం వంటివాటిలో జ్ఞానరాశిని పెంచుకుని అందరికీ పంచి వసుధైవకుటుంభభావనని గురించి చెప్తున్న సనాతన ధార్మికులకి కాక వీటిని నిర్మించే మేధస్సు ఇంకెవరికి ఉంటుంది?

     పెరూ లోని నాజ్కా ఎడారిలో భూమి మీద అతి పెద్ద పరిమాణంలో నేలమీద గియ్యబడిన కొన్ని చిత్రాలు సామాన్యప్రజలనే కాక పరిశోధకులని కూడా విస్మయపరుస్తున్నాయి.Salisbury పొలిమేరలో ఉన్న Stonehenge నిర్మాణాన్ని కూడా మిధ్యావాదులు గ్రహాంతరవాసులకి దఖలు పర్చేశారు గానీ పరిశోధకులు అంగీకరించడం లేదు.Erich von Däniken అనే  స్విస్ మేధావి అది సౌరమండలం యొక్క నమూనా కావచ్చునని ప్రతిపాదించాడు.అసలు పరిశోధకులు వాటిలో కనబడుతున్న రేఖాగణిత విషయాలనీ ఖగోళ సంబంధమైన విషయాలనీ గమనించి గభాల్న వాటిని గ్రహాంతరవాసులకి అంటగట్టే సాహసం చెయ్యడం లేదు గానీ మిధ్యావాదులు మాత్రం గ్రహాంతరవాసులకి దఖలు పర్చేశారు.అంతేకానీ అత్యంత ప్రాచీన కాలంలోనే గణితశాస్త్రాన్నీ ఖగోళ శాస్త్రాన్నీ స్వాధీనం చేసుకున్న భారతీయ విజ్ఞానుల ప్రమేయాన్ని ఎవరూ ప్రస్తావించడం లేదు.అయితే ఈ సందేహాన్ని పరిశోధకుల ముందు ఉంచినప్పుడు వారూ కొట్టిపారెయ్యడం లేదు.అసలైన విషాదం ఏమిటంటే ఆ ప్రాంతంలో అధికారం చలాయిస్తున్న ప్రభుత్వాలు ఆ రకమైన ఫలితాలని తొక్కిపెట్టేస్తున్నాయి. 
     మహాభారతంలో యుద్ధకాండకు ముందు వచ్చే భూపర్వంలో ఒకచోట భూమి నిర్జీవమైన రాళ్లూ మట్టీ కలిసిన గోళం కాదనీ అది కూడా ప్రాణియేననీ చెబుతూ దానిని పరమాత్మ స్వరూపంగా గుర్తించితే పాపకర్మలు చెయ్యడం తగ్గుతుందనే సూత్రీకరణ ఒకటి ఉంటుంది - ఈ రోజున స్వార్ధపరులైన కొందరు మానవుల భోగలాలసత కోసం భూమిని కుళ్ళబొడుస్తున్నది అది కేవలం మట్టిదిబ్బ అనే చిన్నచూపు వల్లనే కదా!ఎన్నిసార్లు గడ్డి పెట్టినా తెలుగులో మంత్రాలు చదవలేదని బూతులబుంగ తెలుగులో కుళ్ళిచచ్చే కూష్మాండం గాళ్ళకి వాళ్ళు అలా ప్రవర్తించడం వల్లనే హిందువులు మరింత ధృఢమవుతున్నారని తెలియడం లేదు - అది వాళ్ళ కోడిమెదడు తెలివి.వాళ్ళ యేడుపుని ఆరున్నొక్క రాగం స్థాయికి పెంచేలా ఒక్క భారతదేశంలోనే కాదు ప్రపంచమంతటా హిందూధర్మం బలం పెంచుకుంటున్నది!కేవలం అరగంట వ్యవధిలో 13 మైళ్ళ కైవారంలో నిర్దుష్టమైన అన్ని వివరాలతో సమగ్రమైన రూపంతో కనబడిన ఓరెగాన్  శ్రీచక్రం దైవం హిందువులకి ఇస్తున్న సూచన - "మీరు ఒక్క అడుగు వేస్తే నేను మిమ్మల్ని పది అడుగులు నడిపిస్తాను.తొలి అడుగు వెయ్యడమే మీ వంతు.మిగిలినది నా వంతు!" అని పూరించిన పాంచజన్య శంఖధ్వానం అది. వినబడటం లేదా?


Hinduism is rasing, raising, raising!!!

Thursday, 21 June 2018

ప్రేమ కోసమై బజ్జీలు తినెనే పాపం హరిబాబు - ఎంత పిచ్చి ప్రేమయో!

     నేను లయోలా కాలేజిలో చేరేనాటికి కాలం పసిడిరెక్కలు దాల్చి యెగిరిన మలి బాల్యం దాటిపోయి తొలి యవ్వనంలోకి అడుగు పెట్టాను - నామిని సినబ్బ యాసలో చెప్పాలంటే గెలల్లోకి నీళ్ళు వచ్చేసినాయి!

     మొదటి సంవత్సరం జాయినయ్యేటప్పుడు హాస్టల్ కోసం టిక్ పెట్టటం తెలియక డేస్కాలర్ లైఫ్ గడిపాను.గుణదల పంచాయితీ ఆఫీసు దగ్గిర రూము తీసుకున్నాను.నేను ఉన్న ఇంటిలో ముసలాళ్ళు ఇద్దరూ ఒక మనవరాల్ని పెంచుతున్నారు.పిల్లలు అందరూ ఫారిన్లో సెటిలయ్యారు.నేనూ రాజేంద్ర ప్రసాద్  వాళ్ళ ఇంటి లోపలి గదిలో ఉండేవాళ్ళం - ఇతనూ నేనూ క్లాస్‌మేట్స్‌మి కూడా.మా వెనక వైపు గదిలో కూడా కొందరు ఉండేవాళ్ళు - వాళ్ళు వేరే కాలేజి, ఎప్పుడో ఎదురుపడినప్పుడు నవ్వటం తప్ప పరిచయాలు కూడా లేవు.అవి గాక ఆవరణ లోపలే ఒక వరసలో నాలుగైదు రూములు ఉన్నాయి.స్నానాలకీ వాటికీ మేము కూడా అక్కడికే వెళ్ళాలి.గుణదలలో ఆ చుట్టుపక్కల దాదాపు సిటీలోని అన్ని కాలేజిల కుర్రాళ్ళూ ఉండేవాళ్ళు.పొద్దున్నే అక్కణ్ణించి లయోలా కాలేజికి నడుచుకుంటూ వెళ్ళటం కోలాహలంగా ఉండేది.మాకయితే చాలాసార్లు తిరగాల్సొచ్చేది - ట్యూషను మాస్టారి ఇల్లు ఈ దారికి మధ్యలో ఉండేది మరి!ట్యూషనుకి వెళ్ళటం,రూముకి రావటం,కాలేజికి వెళ్ళటం,లంచికి రావటం,లంచి తర్వాత వెళ్ళటం,మళ్ళీ రూముకి రావటం,స్నానాలయ్యాక మెస్సుకి వెళ్ళటం,మళ్ళీ రూముకి రావటం - చచ్చేవాళ్ళం!

     ఆ ఫస్టియరు మాకు రోజూ కనబడే అమ్మాయిలు ముగ్గురే ముగ్గురు మా ఇయస్సెన్ మూర్తి గారి ట్యూషనుకి వచ్చే స్టెల్లా కాలేజి అమ్మాయిలు!అయితే,మా మూర్తిగారు తన వశిష్ఠ విశ్వామిత్ర శౌనకాది మునులకి కూడా సాధ్యం కాని బ్రహ్మాండమైన  మేధస్సుతో వాళ్ళూ మేమూ అస్సలు కలవడానికి వీల్లేని బ్రహ్మభేద్యమైన ఏర్పాటు చేశారు - తల్చుకుంటే ఇప్పటికీ ఆ తెలివితేటలకి ఆశ్చర్యం వేస్తుంది!మేము వెళ్ళేటప్పటికే వాళ్ళు వచ్చి కూర్చునే లాగ మాకూ వాళ్ళకీ టైం స్టాంపులు ఏర్పాటు చేశారు - లేటుగా వెళ్ళినా క్షమించేవాడు గానీ ముందు వెళ్తే మాత్రం అగ్గిరాముడైపోయి వెనక్కి తరిమేసేవాడు!చెప్పాల్సిన అసలు సోది అయిపోయాక "మీరు వెళ్ళండమ్మా!" అని వాళ్ళని పంపించేసి మాకు కొసరు సుత్తి వేసేవాడు - ఆ ముగ్గురూ తర్వాత మేము బయటకొచ్చాక కూడా మాకు కనపడనంత దూరం వెళ్ళగలిగేటంత వరకు!చూసీ చూసీ నేనే ఆయన మీద గొప్ప జోకు వేశాను "సబ్జెక్టు యెటూ ఆయన చదువుకునే రోజుల్నించీ బుర్రలోనే ఉంటుంది గాబట్టి ప్రిపేరవనక్కరలేదు గానీ ప్రతి రోజూ మీరు వెళ్ళండమ్మా తర్వాత మనకి వెయ్యాల్సిన సుత్తి గురించే ఎక్కువ ప్రిపేరవుతున్నాడేమో!మనమిచ్చే డబ్బులో మూడొంతులు ఆ క్రియేటివిటీకే ఇవ్వొచ్చు!" అని - మావాళ్ళంతా నవ్వలేక చచ్చారు:-)

     ఒకసారి ట్యూషను వదిలాక అందరం నడుచుకుంటూ వస్తుంటే ప్రసాదు హఠాత్తుగా నావైపు తిరిగి "ఇవ్వాళ నీ మూలాన నాకు పెద్ద ఇన్సల్టు జరిగిపోయింది మాస్టారి చేతుల్లో!" అన్నాడు.మొదట నాకు అర్ధం కాలేదు,తర్వాత అతని నవ్వుమొహం చూసి రిలీఫ్ ఫీలయ్యి నేనూ నవ్వుమొహం పెట్టాను.ఎటూ జోకెయ్యాలని మొదలుపెట్టాడు గదా,తనే చెప్తాడ్లే అని గుచ్చి గుచ్చి అడగలేదు.అతను చెప్పిన విషయం ఏమిటంటే మమ్మల్ని ప్రశ్నలు అడగటంలో సారు ఒక పద్ధతి ఫాలో అవుతున్నాడు.వరసగా ఇద్దరు ముగ్గురు జవాబు చెప్పలేక తెల్లమొహాలు వేస్తుంటే విసుగు పుట్టి నన్ను అడుగుతున్నాడు.అదే మొదట నన్ను అడిగి నేను చెప్పలేకపోతే మాత్రం ఇంకెవ్వర్నీ అడగటం లేదు - "హరిబాబే చెప్పలేకపోయాడు, వీళ్ళేం చెబుతారులే?" అనో యేమో తనే జవాబు చెప్పేస్తున్నాడు!అప్పటివరకు నేనూ పట్టించుకోలేదు గానీ తను చెప్పాక నాకూ కొన్ని సీన్లు గుర్తొచ్చి నిజమే అనిపించింది.ఇంతకీ అతనికి జరిగిన అవమానం యేంటంటే ఆ రోజు నేను తెలియదన్నది తనని అడిగితే చెబుదామని యమా వుషారుగా యెదురు చూస్తుంటే సారు అలవాటు చొప్పున తనే జవాబు చెప్పేశాడు!

     సారు నాకిచ్చిన ఈ స్పెషల్ ట్రీట్మెంటుని వాళ్ళూ అబ్సర్వ్ చేసినట్టున్నారు, అమ్మాయిలు ఆఖర్లో ఒక స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చారు.డిగ్రీ మూడేళ్ళూ అయిపోయాక కాలేజినుంచి కూడా బైటకి వచ్చేసే ముందు మూర్తిగారు అందరికీ ఫేర్వెల్ పార్టీ ఇచ్చారు.వెంకటేష్ సంతకాల పుస్తకం ఇవ్వడానికి సిగ్గు పడుతుంటే నేను తీసుకుని ఇచ్చాను.వాళ్లు అది నాదే అనుకుని Dear haribabu అని రాశారు.వేణు ఎవరెవరికి యేమేమి రాశారో చూడాలనే దురద కొద్దీ అందరివీ లాక్కుని చూసి "అందరికీ మామూలుగా రాసి హరిబాబుకి మాత్రం డియర్ హరిబాబు అని రాశారు!ఏంటి సంగతి?" అని సగం ఈర్ష్యా సగం మెప్పూ కలిపేసి అడుగుతుంటే నేను నవ్వి వూరుకున్నాను, చిన్నప్పట్నంచీ ఆడసిరి ఎక్కువే నాకు!

     అలా మొదటి సంవత్సరం డే స్కాలర్ లైఫ్ గడిపాక ముందుగానే జాగ్రత్తపడి వెళ్ళటంతో రెండవ్ సంవత్సరంలో హాస్టలర్ని అయిపోయాను.మా హాస్టలు అసలు పేరు రాఘవేంద్ర అనుకుంటాను,కానీ కొత్తది కావటంతో న్యూ హాస్టల్ అనేవాళ్ళుమెయిన్ కాలేజి బిల్డింగుకి ఎడంవైపున మూడోది,పక్కనే ఉన్న రెండో దానిపేరు గోగినేని హాస్టల్ అనేది గుర్తుంది గానీ మొదటి దానిపేరు గుర్తు లేదు - అసలు ఈమాత్రం గుర్తుండటమే గొప్ప!కట్టిన తీరూ వార్డెన్లు వాటిని నడిపిన తీరూ సెల్యులర్ జైలుని గుర్తు చేస్తూ ఉండేవి.గుణదల వైపునుంచి వస్తుంటే చర్చికి దగ్గిర ఒక హాస్టల్ ఉండేది.అదొక్కటీ మామూలు పద్ధతిలో స్కేలుబద్దలానే కట్టారు - ఇటువైపున ఉన్న ఈ మూడింటినే గుండ్రంగా ఎందుకు కట్టారో!

     వార్డెను జాన్ ఫాదరు సెంటర్లో ఉన్న ఫౌంటీన్ దగ్గిర నిలబడి ఆరు బేట్రీల టార్చిలైటు వెలిగించి ఎటు తిప్పితే అటు మూడో అంతస్థులోకి కూడా  ఫోకస్ సర్కిల్ కనపడేది - వాటినలా కట్టింది కూడా అందుకే కాబోలు!ఎంట్రీ దగ్గిర ఒకవైపున వార్డెన్ కూర్చునే రూమూ మరొకవైపున  ఆఫీస్ రూమూ ఉంటాయి.లీవులు కావల్సినవాళ్ళు పొద్దున్న 7:00 గంటల లోపే ఇవ్వాలి.వాటిని అటెండెన్స్ నోట్ చేసే కాలెజి స్టాఫ్ దగ్గిరకి చేర్చేవాళ్ళు.మళ్ళీ రాత్రికి అటెండెన్సు వార్డెనుకి పంపించేవాళ్ళు,లీవ్ తీసుకోకుండా ఆబ్సెంట్ మార్క్ పడితే వార్డెను పిలిచి రీజన్ అడిగే వ్యవహారం కూడా నడిచేది.మా రవివర్మ గాడు పూల లుంగీని మోకాళ్ళ దగ్గిర ఒక చేత్తో ఎత్తి పట్టుకుని మరో చేత్తో లీవ్ లెటర్ పట్టుకుని చిరునవ్వులు చిందిస్తూ వెళ్ళినా ఒక్కసారీ లీవ్ తెచ్చుకోవటంలో ఫెయిల్ కాలేదు!మొహం వేళ్ళాడేసుకుని వెళ్ళినా నిజమైన నీరసాలకి కూడా నేను చాలాసార్లు లీవ్ తెచ్చుకోవడంలో ఫెయిలయ్యాను - ఏం ట్రిక్కు ప్లే చేస్తున్నావురా అంటే చెప్పనే లేదు వెధవ!పైగా వాదేమన్నా దూరపు స్నేహితుడు కూడ అకాదు.హాస్టలో చేరిన వారం రోహుల్లోనే నేనూ అజయ్,శ్రీనుగాడూ వీడూ కలిసి మా పేర్ల మొదటి అక్షరాల్ని కలిపి RASH అని పెట్టుకుని ఎక్కద వెతికినా మా నలుగుర్లో ఏ ఒక్కణ్ణీ విడిగా చూడటం కష్టం అన్నంతగా కలిసి తిరిగేవాళ్ళం!

     ఎడారిలో ఒయాసిస్సులా శంకరాభరణం సినిమాలో ఆండాళ్ళు జోకులా లంచి టైము మాత్రం చాలా సరదాగా ఉండేది.ఆఫీసు రూములో ఉన్న మ్యూజిక్ సిస్టం ఒక్క దీనికోసమే - మంచి మంచి రికార్డులు ఉండేవి.అప్పుడప్పుడు మా సీనియర్  ఒకతను అమితాబ్ పాడిన పాటలు పాదేవాడు - హెయిర్ స్టైల్ కూడా అలాగే ఉండేది,కాకపోతే మీసం తియ్యలేదు!నేనూ అప్పట్లో కొంతకాలం అమితాబ్ హెయిర్ స్టయిల్ మెయింటెయిన్ చేశాను గానీ శ్రీనుగాడు వేసిన "హరిగాడు ముందునుంచికన్న వెనకనుంచి చూస్తేనే అమితాబ్ అనిపిస్తున్నాడు!" అనే డ్యామెజింగ్ కామెంటుకి కాలగూడని చోట సురసుర కాలిపోయి తెల్లారెసరికల్లా పక్కపాపిడికి తిరిగిపోయాను!ఈ సంగీతఝరిలో ఒక చిన్న బిట్టు మాత్రం తేడాగా ఉండి ఇప్పటికీ నవు తెప్పిస్తుంది - ఒక ఇంగ్లీషు ఆల్బం, పేరు siron అనుకుంటాను, సాహిత్యం ఏమీ లేకుండా అమ్మాయి మూలుగులూ కేకలూ ఏడుపూ కలిసిన DRUM BEAT అది!ఏసుపాదం అని అక్కద వాచ్‌మెన్/గేట్‌కీపర్/ప్యూన్ పనిచేసే అతను దానికి "దెబ్బ మ్యూజిక్" అని పేరు పెట్టాడు.అతను ఆ పేరు పెట్టకముందునుంచీ వింటున్నప్పుడల్లా మాకూ అలాగే అనిపించి తెగ నవ్వొస్తూ ఉండేది.

     రాత్రి భోజనం తర్వాత వెంఠనే పదకెయ్యడానికి వీల్లేదు - స్టడీ అవర్ ఉంటుంది.ఈ టైములో కాపలాకి ఏకంగా ఒక లెక్చరర్నే బుక్ చేశారు - పేరు గుర్తు లేదు గానీ శుభోదయం సినిమాలో చంద్రమోహనికి ట్రైనింగు ఇచ్చే సీనియర్ సన్యాసి వేషం వేసినాయన. అన్ని బ్లాకులకీ ఒకరేనో లేదా బ్లాకుకి ఒకర్ని తీసుకున్నారో తెలియదు గానీ మాకు మాత్రం ఈయనే కనపడేవారు.ఒకసారి వెంకటేష్ నా రూముకొచ్చి డవుట్లు అడిగితే చెబుతున్నాను.రెండు నిమిషాలు గడిచాయో లేదో ఆయన గుమ్మం దగిర ప్రత్యక్షమయ్యాడు.అప్పటికే డౌట్లు తీరడంతో వాడూ వెనక్కి తిరిగాడు,మేమూ అదే చెప్పాము,ఓకే అనేసి వెళిపోయారు.

     ఈ వెంకటేషు బాగానే చదువుతాడు గానీ టెన్షన్ చాలా ఎక్కువ - ఎగ్జాంస్ టైములో అయితే నా రూముకి వచ్చేసి"హరిబాబూ!తల మెడనుంచి వూడొచ్చేసేలా ఉంది!" అని తలని నా చేతుల్లో పెట్టేవాడు, మెడనుంచి తీసి కాదులెండి!నేను కూడా ఆ తలని చేతుల్తో కొబ్బరికాయలా పట్టుకుని "నీ తలకొచ్చిన ముప్ప్పేమీ లేదు!కంగారు పడకు,నువ్వు బాగానే చదువుతున్నావు.ఎగ్జాం బాగానే రాస్తావు." అని హిప్నటిక్ సెషన్ పెట్టేవాణ్ణి.దాంతో తనకి టెన్షన్ తగ్గి "హమ్మయ్య!ఇప్పుడు కొంచెం తలనెప్పి తగ్గింది,ధాంక్స్ హరిబాబూ!" అని హుషారు తెచ్చుకుని తన రూముకి పోయేవాడు.

     అలా అమ్మాయిలు లేకపోవటం తప్పించి అన్ని రకాల సరదాలూ ఉండేవి.సాయంకాలం కాలేజి వదలగానే ట్రిమ్ముగా తయారై బెంజి కంపెనీ రోడ్డులో అలా అలా స్టెల్లా కాలేజి వరకూ వెళ్ళి వెనక్కి వచ్చేవాళ్ళం,ఒకోసారి బెంజి కంపెనీ రింగురోడ్డు వరకూ వెళ్ళేవాళ్ళం - అప్పుడు కనపడిన అమ్మాయిలే మాకు గిట్టుబాటు!ఆదివారం మాకు సినిమా వారం.మ్యాట్నీకి తప్ప ఇంకే సినిమాకీ వెళ్ళే వీలు లేదు.అందుకని ముందుగా అమితాబ్ సినిమాలు ఏవన్నా ఉంటే వెళ్ళేవాళ్ళం.ఒకసారి చాలా రోజుల పాటు అమితాబ్ సినిమాలు ఏవీ దొరక్క ది గ్రేట్ గాంబ్లర్ కూడా చూశాం - అది అట్టర్ ఫ్లాపయిందనీ పరమ బోరనీ తెలిసి కూడా!

     విధి బలీయం!అనుల్లంఘనీయం!మా మిత్ర చతుష్తయం విడిపోయింది!మొదట అజయ్ సరదాగా బీసెంటు రోడ్డుకు వెళ్ళి పాత ప్రేయసి చంకలో పిల్లాణ్ణి ఎత్తుకుని కనబడేసరికి బిక్కమొహం వేసుకుని తిరిగొచ్చాడు.వాలకం కనిపెట్టి అడిగితే ఏడుపుకి పిసరంత తక్కువ ధోరణిలో మొత్తం ప్రేమచరిత్ర చెప్పాడు.మనోడు ఇంటరులోనే భీబత్సమైన ప్రేమకధ సృష్టించేశాడు!రంగు చూస్తే బాబూ మోహన్ దిగదుడుపే!కానీ మాంచి చలాకీ గుర్రం - కళ్ళు చాలా బ్రైట్!దానికి తోడు ట్యూషను మాస్టారు ఏదన్నా పనుంటే వీణ్ణి క్లాసు తీసుకోమని చెప్పి వెళ్ళేటంత తెలివైనవాడు.ఈ హీరోయిజానికి తోడు ఆ అమ్మాయి వైట్ డ్రస్ వేసినప్పుడల్లా "టినోపాల్!" అని ఏడిపించే వాడు.మెల్లగా ఆ అమ్మాయి కూడా "బొగ్గుమసి!" అని పగ తీర్చుకునే వరసలో ఇద్దరికీ పూలబాణాలు గుచ్చుకున్నాయి.మామూలు తిరుగుళ్ళ ఎంజాయిమెంటు అయ్యాక ఒకరోజు బస్సెక్కేశారు - సినిమాకి అనుకునేరు, లేచిపోవడానికి!ట్రాజెడీ ఏంటంటే, వాళ్ళ అన్నయ్య కూడా అదే బస్సులో ఎక్కి వీళ్ళ వాలకం కనిపెట్టి చెల్లెల్ని ఇంటికి తీసుకుపోయాడు!తాడూ బొంగరం లేని ఏజిలో అంతమాత్రమే పెద్ద సాహసం అనుకుంటే వీడు తెల్లారాక సరాసరి వాళ్ళింటికే వెళ్ళాట్ట - అయితే వాళ్ళ నాన్న ఇంటిబయటీరుగు మీదే కూర్చోబెట్టి గొంతు పెంచి అరిచి తిట్టలేదు గానీ "నీ వయసెంత?నీ ఉద్యోగం ఏంటి?ఏం పెట్టి బతికించుదామని బయల్దేరావు?మీవాళ్లకి చెప్పావా?ఎక్కడికి తీసుకెళ్దామనుకున్నావు?" లాంటి వీడు జవాబు చెప్పలేని ప్రశ్నలతో భయపెట్టి వెనక్కి తిరగ్గొట్టేశాడు.ఆ అమ్మాయి ఇప్పుడు చంకలో పిల్లాణ్ణి యెత్తుకుని కనపడేసరికి తట్టుకోలేకపోయాడు,  పాపం!

     అక్కడికీ నేను చెప్పాల్సినదంతా చెప్పాను గానీ వాడు అప్పటికే కృతనిశ్చయుడై ఉండటంతో నా వాదనలనన్నిట్నీ కొట్టిపారేశాడు,ఇదంతా ఎవరికీ చెప్పొద్దని ప్రామిస్ తీసుకుని నాకు పెద్ద చిక్కు తెచ్చిపెట్టాడు - రవిగాడూ శీనుగాడూ నన్ను గుచ్చి గుచ్చి అడగటం, మాట తప్పలేని బలహీఅంత వల్ల నాకు తెలియదనటం, వాళ్లు నమ్మక నన్ను అనుమానంగా చూట్టం అన్నీ ఒక నాలుగు రోజుల్లో అయిపోయాయి. రవిగాడి విషయం మరీ విచిత్రం!SFI,AISF రాజకీయాల అల్లరికి విసిగిపోయి అల్లరి బ్యాచ్చిని తన్న్ తగిలేసే లిస్టులో ఆ పార్టీలలో లేకపోయినా రవిగాడి పేరు కూడా ఎక్కింది!"బుద్ధి చెప్పుతారా?టీసీ తీసుకుంటారా?" అని ఫాదర్లు అడిగిన ప్రశ్నకి పోలీసు డిపార్ట్‌మెంటులో పై స్థాయివాళ్ళకి సహజమైన ఎగోతో టీసీతో సహా రవిగాణ్ణి వాళ్ళ వూరుకి తీసుకుపోయారు!బృందంలో కొందరు పోతే మిగిలినవాళ్ళు ఇంకా దగ్గిరవుతారన్న మామూలు విషయం,కానీ శీనుగాడు నాకు దూరమై కొత్త స్నేహితుల్ని సంపాయించేసుకున్నాడు!నేనూ చేసేది లేక కొత్త పరిచయాలు చేసుకున్నాను.అందరూ కలిసి పెద్ద బృందమే తయారైంది.

    ఇప్పటికీ RASH అనే మాట ఎక్కడ కనపడ్డా మనసు బాధగా మూలుగుతుంది గానీ అప్పట్లో అంత బాధ అనిపించలేదు - కొత్త పరిచయాలు,కొత్త సినిమాలు,కొత్త జోకులు కలవటంతో మళ్ళీ హుషారెక్కిపోయాను!వార్డెన్ పర్మిషన్ తీసుకుని ఒక రాత్రిపూట కొండపల్లికి పాదయాత్ర కూడా చేశాం - మా సీనియర్ అమితాబ్ పాటలు పాడటం,"కామ నామము కామ నామము కమ్మనైనది కామనామము" దగ్గిర్నుంచి మొదలుపెట్టి ఎవడికి తోచిన లొల్లాయి పాటలు వాడు పాడటం లాంటి హుషారుతో కొండపల్లి వరకు నడిచినా కాళ్ళు నెప్పులనిపించలేదు!వెళ్ళేటప్పటికే తెల్లారిపోవడం వల్లనో ఏమో వచ్చేటప్పుడు మాత్రం వాహనాలు పట్టుకుని వచ్చినట్టు గుర్తు.

     ఈ మధ్యలోనే హాస్టలు నుంచి కాలేజి బిల్డింగుకి వెళ్ళేటప్పుడూ రాత్రి భోజనం అయ్యాక స్టడీ అవరుకి  టైము ఉంటే సిమెంటు బెంచీల మీద కూర్చున్నప్పుడూ మాధవికీ నాకూ మధ్యన జరిగిన చిన్నప్పటి రొమాన్సు కధలు కధలుగా చెప్పి బులపాటం తీర్చుకున్నాను.ఒకసారి ఆవేశం వొచ్చి "పెద్దయ్యాక తనకి నేనంటే ఇష్టం లేకపోతే వొదిలేస్తాను గానీ లేదంటే భూమ్యాకాశాలు తలకిందులయినా తననే పెళ్ళీ చేసుకుని తీరతాను!" అని శపధం కూడా చేసేశాను.అయితే, కొద్ది రోజుల్లోనే మాధవి కన్న అందమైన ఆడపిల్ల ఉండటానికి వీల్లేదనే నా మూఢనమ్మకాన్ని బద్దలు చేస్తూ ఒక మెరుపుతీగ కనపడనే కనపడింది! నిర్మలా కాన్వెంటులో స్టెల్లా కాలేజి అమ్మాయిలు ఫ్యాన్సీ ఫీట్ పెట్టారని తెలియడంతో ఎడారిలో ఒయాసిస్సు తగిలినంత హుషారు వచ్చింది జనాలకి!

          ఆదివారం అనుకుంటాను,టిఫిన్ అవగానే ట్రిమ్ముగా తయారై అందరూ నిర్మలా కాన్వెంటు దారి పట్తారు బ్యాచ్చిలు బ్యాచ్చిలుగా!మా బ్యాచ్చిలో అయిదుగురం ఉన్నాం.ఎలాగూ అంకె కలిసింది గదా అని పంచ పాండవుల పేర్లు కూడా మాకు తగిలించేసుకున్నాం.గగారిన్ అమ్మాయిల విషయంలో కొంచెం సంసారపక్షం గనక ధర్మరాజు పొజిషన్ ఇచ్చేశాం.బాలసుబ్రమణ్యం పొYYఇగా లావుగా ఉంటాడు గనక భీముడి పొజిషన్ ఇచ్చేశాం, మాట తీరు కూడా దురుసుగానే ఉంటుంది లెండి! నేను సరే పాండవమధ్యముడు అర్జునుణ్ణి అని ఖాయం చేసేశారు!శ్రీనుగాడు పొడుగ్గా సన్నగా గొడుగూచలా ఉన్నా ముఖం బాగానే ఉంటుంది గనక నకులుడి ప్లేసు దక్కింది వాడికి. సహదేవుడి క్యారెక్టరు ఎవరికిచ్చామో తెలియదు,బహుశా నా పక్క రూమతను అయ్యుంటాడు. దారిలోనే లయోలా కాలేజి-స్టెల్లా కాలేజి-నిర్మలా కాన్వెంటు త్రయం మీద ఒక జోకేశాను - "ఫాదర్ల ముందుచూపుని మెచ్చుకోవాల్రా!లయోలా కాలేజిలో చదివిన అబ్బాయీ స్టెల్లా కాలేజిలో చదివిన అమ్మాయీ పెళ్ళి చేసుకుంటే వాళ్ళ పిల్లల్ని నిర్మలా కాన్వెంటులో చదివించుకోవచ్చు!ఫ్యామిలీలూ జనరేషన్లూ వీళ్ళ గ్రిప్పులోనుంచి బయటికి పోకుండా భలే ఏర్పాటు చేసుకున్నారు" అని.ఇప్పుడు మీకు నవ్వొచ్చిందో లేదో తెలియదు గానీ అప్పుడు మాత్రం  బాంబులాగే పేలింది - మా ముందు వెళ్తున్న బ్యాచ్చి వెనక్కి తిరిగి చూసి నవ్వడమే సాక్ష్యం!

     లోపలికి వెళ్ళీ వెళ్ళగానే అప్రకటిత కర్ఫ్యూ నిబంధనల మాదిరి విషయం తెలిసిపోయింది - బజ్జీల స్టాలు దగ్గిర ఒక అద్బుత సౌందర్యరాశి ఉందని!అలాగని అందరూ ఒకేసారి అక్కడ గుమిగూడితే పెద్దలు విషయం గ్రహించి కలగజేసుకుని అందర్నీ తరిమికొడతారనే లోకజ్ఞానమూ ఫోకస్ తెచ్చుకోవడం కోసం  చెయ్యగూడని వెధవపనులు చేస్తే పోటీదారుల నుంచే వ్యతిరేకత రావొచ్చుననే పొలిటికల్ పరిజ్ఞానమూ ఉంది కాబట్టి ఎవరి జాగర్తలో వాళ్లు ఉండి ఒక నాలుగైదు స్టాల్సుకి వెళ్ళడం,బోరు కొట్టినప్పుడు వెంఠనే ఇక్కడికి రావడం,ఓ నాలుగు బజ్జీలు తినడం,ఆ కాసేపూ తనని చూసుకోవడం,మళ్ళీ ఇంకో నాలుగు స్టాళ్ళకి వెళ్ళడం అనే వ్యూహాత్మక ప్రణాళికాబద్ధమైన పద్ధతిని ఎంచుకున్నారు.

     మొదట్లో నేను అంత హుషారు చూపించలేదు.దానికి కారణాలు నేను అప్పటికే మాధవికి అంకితమైపోవడమూ గుమిగూడిన జనం దడి కట్టేసి తను సరిగ్గా కనపడకపోవడమూ అమ్మాయిలకి లైనెయ్యడం కూడా మన గొప్ప తెలిసేలా స్టైలుగా ఉండాలి గానీ సొల్లు కార్చుకున్నట్టు ఉండకూడదనే నిర్లక్ష్యమూ లాంటి మామూలువే!మొదటి రెండు విజిట్లలోనూ నేను బజ్జీలు ముట్టుకోలేదు.ఇప్పుడు జేబుల్లో చేతులు పెట్టుకోవడం అలవాటైంది గానీ అప్పట్లో కొంచెం చిరాగ్గానూ కొంచెం కేర్‌లెస్ గానూ ఉన్నప్పుడు వివేకానందుడి పోజులో చేతులు కట్టుకు నిలబడేవాణ్ణి. వాళ్ళు బజ్జీలు తింటుంటే నేను చేతులు కట్టుకు నిలబడ్డం తేడాగా ఉంటుందనిపించి మూడోసారి నేనూ తినడానికి నిశ్చయించుకున్నాను.అప్పటి నా బజ్జీల భయానికి చాలా సాహసోపేతమైన నిర్ణయమే అది - బజ్జీలు కాదు కారప్పూస కూడా ఇష్టపడని నేను బజ్జీలు తినడమా!అయితే, వాళ్ళు వాటిని కోసి ఆ చీలికలో ఉల్లిపాయలు వేసి నిమ్మరసం పిండడంతో నేను భయపడినంత ప్రమాదం ఏమీ జరగలేదు.ఒకసారి అలవాటు పడ్డాక అవేవీ లేకుండా కూడా తినగలుగుతున్నాను ఇప్పుడు.ఈ పునరపి విహారపు సరదాల్లో ఒకసారి బజ్జీలు తినడం అయిపోయాక నా అలవాటు చొప్పున చేతులు కట్టుకుని నిలబడినప్పుడు తనే నాకు అతి దగ్గిరగా వొచ్చి నా ముఖంలో ముఖం పెట్టి నవ్వే అద్భుతమైన సన్నివేశాన్ని మహత్తరమైన సంవిధానంతో నడిపించుకోగలిగాను!

     అక్కడున్న బోర్డు మీద vegetables అనే మాటని ఎవడో చిలిపి కుర్రాడు మొదటి నాలుగు అక్షరాల్ని చెరిపి tables చేశాడు.దాంతో ఇక్కడ tables మాత్రమే ఉన్నాయి అనే అర్ధం వస్తున్నది.మామూలుగా అయితే బోర్డు మా వైపుకి ఉండి వాళ్ళు వెనకవైపున ఉన్నారు గాబట్టి చూసే అవకాశం లేదు.ఎవరో దాని గురించి చెప్పి జోకులేస్తుంటే సరి చెయ్యడానికి వచ్చింది.అప్పుడు జనం తక్కువగానే ఉన్నారు.వాళ్ళు వంటకోసం ఏర్పాటు చేసుకున్న బల్లలకి మధ్యన ఉన్న ఖాళీ నుంచి బైటికొచ్చి చాక్‌పీస్ పట్టుకుని ఇటువైపుకి రావడంలోని ఉద్దేశం తెలుస్తూనే ఉంది.ఆ నడక చాలా హుందాగా ఉంది.బెరుకుతనం,కరుకుతనం,ముదురుతనం,చురుకుతనం,బిడియం,అణకువ లాంటివి చిన్నప్పట్నుంచీ పెరిగిన వాతావరణం వల్ల అలవాటయ్యేవి గాబట్టి నడకలో తెలుస్తాయి.తను ఆ కొన్ని అడుగులు వేస్తూ ఉండగానే నాకు లైటు  వెలిగింది - "That word itself is very strange!If you remove "v" from it,still it is a meaningful word - "eg(g->implied)etables!";if you remove "e", still it will be "getables!";if you remove "g",still it is a meaningful word - "e(a)tables!";if you remove "e",still it will become "tables!";if you remove "t" from it,still it gives you "ables!";if you remove "a" from it,it will "bles(s)!" you;if you further take "b" from it,It will be "les(s)!";if you take "l",It will be "(y)es" and if you take "e" out,still  it will be a long "(his)s!"" అనే పంచ్ డైలాగుని నట్లు కొట్టకుండా తడబడకుండా సాగదియ్యకుండా గుక్క తిప్పుకోకుండా తనని ఇంప్రెస్ చెయ్యగలనో లేదో అని టెన్షన్ పడకుండా ప్రధమ పరిచయంలో ఇనకులతిలకుడైన శ్రీరాముడితో వాగ్విదాంవరుడైన మారుతి మాట్లాడినంత నిగ్రహంతో వొదిలాను!దాని ఫలితమే తను ముఖంలోకి కాదు కళ్లలోకే చూసి నవ్వడం. నేనూ నవ్వాను, దరహాసానికి దరహాసమే సమాధానపు సుమహారం కదా!

     అప్పుడు అంతకు మించి ఏమీ జరగలేదు.ఎందుకంటే, ఇటు చూస్తూ అటు రాయలేదు గాబట్టి రాయాల్సిన మాట రాసేసి ఎట్లా వచ్చిందో అట్లా వెళ్ళిపోయింది.ఆ డ్రస్సులోనూ ఆ ముఖంలోనూ తను బాబీ సినిమాలో "మై శాయర్ తో నహీ" పాట వచ్చేటప్పటి డింపుల్ కపాడియా కనపడింది నాకు.ఆ పేరునే ఖాయం చేసేశాను,మావాళ్ళకి వార్ డిక్లరేషన్ ఇచ్చేశాను - అప్పటివరకు నేను వాళ్లకోసం బజ్జీల స్టాలుకి వెళ్తే ఇప్పటినుంచి వాళ్లు నాకోసం వస్తున్నారు.మొదట్లోనే ఈ సీను పడితే బాగుందేది, తొందర్లోనే లంచ్‌టైమ్ తోసుకొచ్చేసింది.మైండు ఎంత హుషారుగా ఉన్నా తిండి లేకుండా ఉండలేం గదా.అదీగాక అన్నప్రాశన నాడే ఆవకాయ పెట్టినట్టు బజ్జీల్ని వాయలు వాయలుగా లాగించలేదు నేను, నాకూ ఆకలిగానే ఉంది.తీరా లంచి చేసి వచ్చేసరికి సీను మొత్తం మారిపోయింది.ఎటువాళ్ళు అటు వెళ్ళిపోయి వాళ్ళు కూడా అన్నీ క్లోజు చేసి ఖాళీగా కూర్చుని కనిపించారు.ఇపుడు పోయి బజ్జీలు అడగటం వెధవ్వేషాల కిందకే వస్తుంది!నీరసమొచ్చి కొంచం దూరంలో ఉన్న బల్లల మీద కూర్చుని లాంగ్‌షాట్ జూమ్‌లెన్స్ వాడుతున్నాను.మాకు ఎదురు బల్ల మీద అమితాబ్ పాటలు పాడే  మా సీనియర్ కనపడ్డాడు.మాకు అర్ధమైపోయి అడగలేదు గానీ తను అడిగేశాడు "మీలో ఆ అమ్మాయికి లైనేస్తున్నది ఎవరు?" అని.మావాళ్ళు నన్ను చూపించారు. "ఐతే నేను ఆశ వదిలేసుకోవడం బెటర్!" అని కొంచెం ఆగి "నేను పెద్దవాణ్ణి!అన్న భార్య వదినవుతుందనుకుని వదిలెయ్యరాదూ!" అన్నాడు.ఇటువైపునుంచి "తమ్ముడి భార్య కూతురనుకుని మీరే వదిలెయ్యరాదూ!" అనే రిటార్టు వెళ్ళడంతో ఇక మాట్లాడలేదు. కానీ మనం అటుకేసి చూసినప్పుడల్లా పక్కన ఇంకోడు మన్ని చూసి కుళ్ళుకుంటున్నాడనే ఫీలింగుతో వాతావరణం ఇబ్బందిగా మారింది.విసుగు పుట్టి వచ్చేశాం.

     ఒక కుర్రాడు ఒక చోటికి వెళ్లాడు,ఒక అమ్మాయి కనపడింది,ఒక జోకేశాడు,అమ్మాయి ఇంప్రెస్ అయ్యింది,వివరాలు తెలుసుకోకుండా వచ్చేశాడు,పేరు కూడా తెలియదు గాబట్టి మళ్ళీ కలవడం అసంభవం అనేటట్టు జరిగిన ఈ కధ ఇక్కడితో ఆగిపోవాల్సిందే!కానీ ఫ్రాన్సిస్ కిషోర్ ద్వారా ఆ అమ్మాయి పేరు "నమ్రతా బాబ్జీ!" అని తెలియడంతో ముందుకు ఎళ్ళడానికి హుషారు పుట్టింది.   

     ఫ్రాన్సిస్ కిషోరు చెల్లెలు స్టెల్లా కాలేజి హాస్టల్లో ఉంది చదువుకుంటున్నది.వీడు అప్పుడప్పుడూ వెళ్ళి చూడటమూ మాకు తెలుసు.ఎక్కువ వివరాలు తెలియలేదు.హాస్టల్లోనే ఉంటున్నదనీ తెలుగమ్మాయి కాదనీ చెప్పినట్టు గుర్తు.అప్పట్లో ఈ వివరాల మీద దృష్టి పెట్టలేదు,తెలుగమ్మాయి కాకపోతేనేం అంతర్జాతీయ భాష ఇంగ్లీషు ఉందిగా - ఎలా మరోసారి చూడాలన్నదే సమస్య!అసలంటూ మరోసారి ఎదురుపడినప్పుదు తన రెస్పాన్సు బాగుంటే ముందుకెళ్ళేటప్పుడు ఎన్ని వివరాలు తెలుసుంటే అంత మంచిది కానీ అసలు తనకి ఇంట్రెస్టు లేదని తెలిస్తే ఆ వివరాలన్నీ ఎందుకు పనికొస్తాయి?అప్పటికి నేను టీనేజిలోనే ఉన్నాను గానీ ఒక చిన్న జోకుకే మురిసి ముక్కలై అమ్మాయిలు వచ్చి ఒళ్ళో వాలతారనే ఎడాలిసెంట్ ఫాంటసీలు నాకు లేవు. ఈ మితిమీరిన ప్రాక్టికాలిటీయే ఈ కధని అర్ధాంతరంగా ముగించేసిందని ఇప్పుడు అనిపిస్తుంది!

     ఇంతకీ తనని చూడటం యెట్లా?మనల్ని హాస్టలుకి పోనివ్వరు!పొద్దున్నే స్టెల్లా కాలేజి మెయిన్ గేటు దగ్గిర బీటు వేద్దామా అంటే డే స్కాలర్ అమ్మాయిల్ని లోపలికి పంపిస్తారు గానీ హాస్టల్ అమ్మాయిల్ని బయటికి రానివ్వరు గదా!ఆదివారం చర్చికి క్రిస్టియన్ అమ్మాయిలు తప్పకుండా వస్తారు, తను క్రిస్టియన్ కాకపోయినా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో రావచ్చు కదా!అప్పటికే నేను అరివీరభయంకరనాస్తికుణ్ణి అయినప్పటికీ రెండు ఆదివారాలు చర్చికి వెళ్ళాను.చర్చి దగ్గిరే, ఆ చర్చి పక్కనుంచి వెళ్తేనే నిర్మలాకాన్వెంటు వస్తుంది.

     మొదటిసారి వెళ్ళినప్పుడు లోపల బెంచీలు ఫుల్ అయ్యేసరికి డోర్ దగ్గిరే ఆగిపోయాం.నాతో పాటు వచ్చినవాళ్ళందరూ వెయ్యటంతో నేనూ మోకాటితండా వేశాను.కానీ కొంచెం సేపయ్యాక కొంతమంది నిలుచునే ఉండటం చూసి లేచి నుంచున్నాను.రెండో ఆదివారం కూడా డోర్ దగ్గిరే ఆగిపోయాం, అసలు మోకాటితండా వెయ్యలేదు.కుర్రాళ్ళు కామిడీలు చెయ్యటానికి చర్చినీ వాద్ల్లేదు.అమ్మాయిలు బాయ్టికి రావడం మొదలవగానే దోసిట్లో ఒక కర్చీఫుని పరిచేసి "అమ్మా!ఒక బాల్‌పెన్ను ఉంటే దానం చెయ్యండమ్మా!" అని అరవటమూ "వూర్కే సరదాగానే,బైటికి వెళ్ళగానే ఇచ్చేస్తాం!" అని మెల్లగా గొణుగుతూనూ హడావిడి చేసేవాళ్ళు - ఇందులో యేం క్రియేటివిటీ ఉందని అడిగితే ఫ్రాన్సిస్ క్రియేటివిటీయా పాడా దురద అన్నాడుఈ కాలక్షేపాల మధ్యన ఎంత నిశితమైన చూపుతో వెతికినా తన జాడ మాత్రం లేదు.నాస్తికత్వం లాంటి గంభీరమైన నమ్మకాన్ని కూడా వదులుకుని రెండు వారాలు చర్చికి వెళ్ళినా ఫలితం కనబడకపోవటంతో ఇక మూడో వారం నుంచీ వెళ్ళడం మానుకున్నాను.ఒకసారి హెర్బేరియం షీట్ల మీద అంటించుకోవడానికి మొక్కల కోసం వెతుకుతూ దాదాపు చర్చి వరకూ వెళ్ళాను ఇంకో ఇద్దరితో కలిసి.అదీ ఆదివారమే,టైము కూడా దాదాపు ప్రార్ధనలు అయ్యాక చర్చినుంచి బైటికి వచ్చే,టైమే.మావాళ్ళలో ఒకడు వెళ్దామా అన్నాడు గానీ పనిగట్టుకుని రెండు వారాలు తిరిగినా కనిపించనిది ఇప్పుడు హఠాత్తుగా వెళ్తే కనిపిస్తుందని గ్యారెంటీ ఏమిటనిపించింది - వెళ్ళలేదు.


     నా నీరసపు ప్రాక్టికాలిటీని బట్టి ఇది కూడా శుభం బోర్డు వెయ్యాల్సిన సన్నివేశమే,కానీ  ఒకానొక శుభోదయాన చిత్రమైన సన్నివేశంలో మా శీనుగాడికి కనపడింది!ఇదివరకు జరిగిన హైకింగ్ లాంటి సైక్లింగ్ ప్రోగ్రాము పెట్టుకున్నారు - నా ఖర్మ కొద్దీ ఆ రాత్రి నాకు జ్వరం తగిలింది!జ్వరం అంటే మరీ ఘోరమైనది కాదు,మొదట హుషారు కొద్దీ బైల్దేరినా వాళ్లు మళ్ళీ మళ్ళీ వొద్దనడంతో వెనక్కి తగ్గాను.అయితే, మరుసటి ఉదయానికల్లా శీనుగాడు రావడం రావడమే "ఒరేయి హరిగా, నీ బాబీ కనబడిందిరా!" అని అరుచుకుంటూ వస్తుంటే కవులు వర్ణించిన గుండె గొంతుకలోకి వచ్చి కొట్లాడటం అనే వర్ణన యెట్లా ఉంటుందో అనుభవంలోకి వచ్చింది!వీళ్ళు తిరిగి వచ్చేటప్పుడు రోడ్దు మీద ఎదురు వచ్చిందంట!అసలైన ట్రాజెడీ యేంటంటే, వీడు ఆ యాంగ్జైటీలో ఒళ్ళు మర్చిపోయి  "ఒరేయి,హరిగాడి బాబీరా!" అని అరిచేశాడంట, ఆ అమ్మాయి గిరుక్కున వెనక్కి తిరిగి వీణ్ణి చూసి నవ్విందంట!

     ఇంక నా పరిస్థితి చూడాలి!మొదటి నిశ్చయం "హరిగాడి బాబీ అనే మాటలకి అర్ధం తెలియకుండా అలా నవ్వదు కదా - అంటే తెలుగమ్మాయే!" అని.రెండో నిశ్చయం "తెలుగమ్మాయి అయినా కాకపోయినా హరి,బాబీ అనే రెండు మాటల్ని బట్టి అలా రియాక్టయిందంటే ఆ రెండు మాటలకీ మధ్య ఉన్న సంబంధం తెలిసే ఉండాలి! నా పేరు హరిబాబు అనీ నేను తనకి బాబీ అని పేరు పెట్టుకున్నాననీ తెలియకుండా ఆ నవ్వు సాధ్యం కాదు!" అనేది.

     నా బుద్ధి చురుగ్గా ఉండిఉంటే మొదటిసారి ఫ్రాన్సిస్ కిషోరు ద్వారా తన పేరు తెలిసినప్పుడు రావాల్సిన అనుమానాలన్నీ ఇప్పుడు దాడి చేశాయి."అసలు ఫ్రాన్సిస్ కిషోరుకి వాళ్ళ్ అచెల్లెలు తన పేరు ఎలా చెప్పింది?ఆ రోజు వీడు మాతో రాలేదు.వీడు ఆ ఫ్యాన్సీ ఫీట్ గురించీ బజ్జీల స్టాలు గురించీ అక్కడున్న డింపుల్ కపాడియా లాంటి అందమైన అమ్మాయి గురించీ ప్రస్తావించకుండా తనంతట తను చెప్పే అవకాశం తక్కువ!అలాంటి ఆరాలు తీస్తే ఏ చెల్లెలయినా నీకెందుకురా అంటుందే తప్ప అడిగిన వెంటనే చెప్ప్పెయ్యదు. వీడు నాకోసం కాదులే హరిబాబని మావాడొకడు లైనేద్దామనుకుంటున్నాడని చెప్పినా ఇంకో ఆమ్మాయి వివరాలు ఆ అమ్మాయి పర్మిషన్ తీసుకోకుండా చెప్పేస్తుందా/అసలు కిషోరు వాళ్ళ చెల్లెలుకి తనతో ముందే పరిచయం ఉంటే తెలుగమ్మాయా కాదా అనే కన్‌ఫ్యూజన్ అసలు ఉండేది కాదు. గదా!అసలు నేను అప్పుడే ఫ్రాన్సిస్ కిషోరుని తన పేరు నీకెట్లా తెలిసిందని ఆరా తీస్తే చర్చికి వెళ్ళకుండానే .డైరెక్ట్ కాంటాక్ట్ దొరికేది.ఇప్పటికి కధ చాలా దూరం ముందుకెళ్ళి ఉండేది - ఎంత టైమ్ వేస్ట్ చేశాను?" - మయసభలో దుర్యోధనుడి మోనోలాగులా చాలానే ఆలోచించి ఉంటాను, ఇది ఇప్పటికి గుర్తున్న అబ్రిడ్జిడ్ వెర్షన్!ఔరా, నిస్సీ, కటకటా లాంటి మాటలు వాడితే నిజంగా అలాగే ఉండేది.

     ఒక అందమైన కుర్రాడు తెలివైన పంచ్ విసిరితే నవ్విన మొదటి నవ్వులో లేని ప్రత్యేకత నా పేరూ తన పేరూ కలిసిన ప్రస్తావనకి శ్రీనుగాడి మీదకి విసిరిన రెండో నవ్వులో ఉందని తెలిసింది గానీ నాలోనే ఉన్న ప్రాక్టికాలిటీలో తలపండిన భీష్మాచార్యుడూ శంకాలమారి శకుని మామా నిద్ర లేచారు - "వారనా వీరనా అమ్మాయిల మనోభావములు మనము తెలుసుకోగలిగినవి కావు.ఆ దారిన వెళ్ళవలెనన్న ఫ్రాన్సిస్ కిషోరు మీద మితిమీరి ఆధారపడవలెను!వాడు శ్రీనుగాడి వల్ల పరిచయమైన దూరపు స్నేహితుడు, ఇతరుల ప్రేమకు మధ్యవర్తిత్వము నెరపవలెనన్న గొప్ప సాహసము కావలెను.అది వాడికి ఉన్నదా?రేపటి రోజున పెద్దలకు నచ్చక కలహములూ అపహరణములూ వంటివాటికి తెగబడునప్పుడు నిలబడగల దమ్ము వాడికి లేనట్టు తోచుచున్నది.మొదటి నవ్వుకు పిదప చేసిన యత్నములు వ్యర్ధములైనట్లు మరల నిప్పుడు చేయునవియునూ వ్యర్ధములు కావని గ్యారెంటీ యేమున్నది?ఇంత కాలము గడిచిన పిదప ఇప్పుడు కధ మొదలెట్టవలెనన్న కిషోరు మీద పెత్తనము చేయుటయో కిషోరును బుజ్జగించుటయో చేయవలెను,అది నా స్వాబిమానమునకు సరిపడదే!ఇప్పటికినీ రాజమార్గము కాక డొంకదారియే కనబడుచున్నది గనక వెనుకకు తగ్గుటయే ఉత్తమము" అనుకుని ఆగిపోయాను- ఈ ప్రాక్టికాలిటీ కన్న మాధవి మీద నాకున్న సిన్సియారిటీయే నేను వెనక్కి తగ్గడానికి అసలు కారణం అని చెప్పక తప్పదు.


కొసమెరుపు:ఈ మధ్యనే ఒకరొజు మాధవి "నీకు నేను తప్ప ఇంకే అమ్మాయీ నచ్చలేదా?చదువుకునే రోజుల్లో ఎవరికీ లైనెయ్యలేదా!" అని గుచ్చిగుచ్చి అడిగి కధంతా చెప్పాక "తన అదృష్టం బాగుండి నిన్ను తప్పించుకు పోయింది!దురదృష్టం వల్ల నేను ఇరుక్కుపోయాను!" అని నవ్వింది - ఔరా, ఎంత క్రూరత్వం!

Tuesday, 12 June 2018

మా చావు పుట్టుక లెల్ల నీ ఆట గదరా చిదంబరేశ!మా నవ్వు ఏడ్పు లెల్ల పాట గదరా నీకు గోవిందరాజ!

చిదంబరం అద్భుత శక్తి క్షేత్రం. దీనికి అయస్కాంతశక్తి ఉందనీ భూమధ్యరేఖలోని బిందువు, ఈ నటరాజ విగ్రహంలోని కాలిబొటనవేలుని సూచిస్తుందనీ చెబుతారు. ఆకాశలింగం(చిదంబరం), వాయులింగం (కాళహస్తి), భూలింగం(కాంచీపురం), అగ్నిలింగం(తిరువణైక్కవల్‌), జలలింగం (తిరువణ్ణామలై) అనే పంచభూతలింగాల్లో 1, 2, 3 దేవాలయాలను ఒకే సరళరేఖలో 79 డిగ్రీల 41నిమిషాల తూర్పు అక్షాంశంమీద నిర్మించారు. అందుకే దీన్ని ఓ ఖగోళ, భౌగోళిక అద్భుతంగా చెబుతారు.

ఈ దేవాలయానికి 9 ద్వారాలు ఉన్నాయి. ఈ తొమ్మిదిలో 4 పెద్ద గాలి గోపురాలు ( తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ దిక్కులలో). ఈ నాలుగు గాలి గోపురాలు చాల పురాతనమైనవి. తూర్పు గాలి గోపురము మీద 108 ముద్రలతో భరత నాట్యం చేస్తున్న శిల్పాలు చెక్కబడ్డాయి. ఆలయ సముదాయం 40 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ ఆలయ సముదాయములోనే ఒక పెద్ద తటాకము (శివ గంగ) మరియు చిన్న ఇళ్ళు ఉన్నాయి. ఇవి కాక ఐదు సభలు లేదా వేదికలు ఉన్నాయి. అవి - గర్భగుడిగా వెలుగొందుతున్న చిత్సబై, చిత్సబైకి ఎదురుగానే ఉన్న నిత్యపూజలు జరిగే కనకసబై, గర్భగుడికి ఎదురుగానే శివుడు 'కాళి' తో నాట్యమాడినట్లుగా చెప్పబడుతున్న నృత్యసబై లేదా నాట్యసబై - ఇది శక్తి స్వరూపం, భగవంతుడి ఆధిపత్యాన్ని చాటి చెప్పిన ప్రాంతం, రాజ్యసబై లేదా 1000 స్తంభాల మంటపం (నిజానికి ఉన్నది 999 స్తంభాలే, భగవంతుడు దర్శనమిచ్చినప్పుడు ఆయనే 1000వ స్తంభం) మరియు పంచమూర్తులు కొలువైన దేవసబై (పంచ - ఐదు, మూర్తులు - భగవంతుడి విగ్రహాలు. ఆ ఐదు ఏవంటే గణేశుడు - విఘ్నాలు తొలగించే స్వామి, తన భార్య 'శివానందనాయకి'తో కూడి కూర్చున్న భంగిమలో దర్శనమిచ్చే సోమస్కందర్ స్వామి, మురుగా స్వామి మరియు భక్తముఖ్యుడు, ప్రధాన భక్తుడు ఐన చండికేశ్వరర్).

ఇవి కాక పతంజలి, వ్యాఘ్రపాదర్ పూజించిన తిరుమూలతనేశ్వరర్ మరియు ఆయన దేవేరి ఉమయ్య పార్వతి ఆలయం, 63 ప్రధాన భక్తులు లేదా అరుబత్తుమూవర్ ల ఆలయాలు, 'జ్ఞాన శక్తి'కి నిలయమైన శివగామి ఆలయం, విఘ్నాలు పోగొట్టే గణేశాలయం, మూడు విధాలైన శక్తులు - ఇచ్ఛై లేదా కోరిక అవతారమైన భార్య వల్లి, క్రియకు ప్రతిరూపమైన భార్య దేవయాని, అజ్ఞానాన్ని నాశనం చేసేందుకు స్వామి వాడే జ్ఞానానికి ప్రతిరూపమైన బల్లెం - వీటిని కలిగిన మురుగా లేక పాండియనాయకం ఆలయం కూడా ఉన్నాయి.

ఆలయ ప్రాంగణంలో గోవిందరాజ పెరుమాళ్, ఆయన దేవేరి పుండరీగవల్లి తాయర్ దేవాలయం కూడా ఉంది. ఈ దేవాలయాన్ని తిల్లై తిరుచిత్రకూడమ్ అంటారు. ఇది 108 వైష్ణవ దివ్యదేశాలులో ఒకటి. దివ్యదేశాలంటే ప్రముఖ భక్తులైన ఆళ్వార్లు మంత్రాలు (నాలయిర దివ్యప్రబంధం) చదివి శుద్ధి (మంగళాశాసనం) చేసిన విష్ణ్వాలయాలు.

పురాణాల ప్రకారం శివుడు తన దివ్యమైన 'ఆనంద తాండ'వాన్ని నటరాజు రూపంలో ఇద్దరు సాధువులకు తమిళుల 'తాయ్' (జనవరి-ఫిబ్రవరి) నెలలో పూసమ్ నక్షత్రపు తేదీన చూపాడు. ఇతిహాసం ప్రకారం పరమశివుడు ఒకనాడు తిల్లాయ్ వనవిహారానికి వెళ్ళాడు.ఈ వనంలో ఉన్న ఋషులు తమ మంత్రాలతో దేవతలను ఆవాహనం చేయగల్గినవారు. శివుడు ఆ ఋషులు పఠిస్తున్న మంత్రాలతో లొంగి పీతాంబరధారి అయి ఉసిరి కాయలు తింటున్నాడు. శివుని భార్య పార్వతి కూడా శివుని వెంబడించింది.ఋషులు, ఋషి పత్నులు ఆ పీతాంబర వాసిని అనేక రకాలుగా స్తోత్రాలు చేశారు. తమ భార్యలూ, ఇతర స్త్రీజనం మోహితులై ఉండటం చూసిన మునులు కోపోద్రిక్తులై తమ మంత్ర ప్రభావంతో ఎన్నో పాములను ఆవాహన చేశారు. భిక్షువు రూపంలో ఉన్న భగవంతుడు ఆ పాములను ఎత్తి జడలు కట్టిన జుత్తు చుట్టూ, మెడలో మరి నడుము చుట్టూ ఆభరణాల్లా వేసుకున్నాడు. ఆవేశం పట్టలేని ఋషులు ఒక భయంకరమైన పులిని ఆవాహన చేశారు. భగవంతుడు దాని చర్మం వలిచి నడుముకి బట్టగా కట్టుకున్నాడు. పూర్తిగా విసుగెత్తిన ఋషులు వారి ఆధ్యాత్మిక శక్తిని మొత్తం ఉపయోగించి 'ముయలకన్' అనే శక్తిమంతమైన మరియు అహంభావియైన రాక్షసిని ఆవాహన చేశారు. చిరు మందహాసం చిందిస్తూ భగవంతుడు ఆ రక్కసి వీపుపై కాలు మోపి దాన్ని నిశ్చలనం చేసి దివ్యమైన ఆనంద తాండవం చేసి తన అసలు రూపాన్ని చూపాడు. ఋషులు భగవంతుడిని గుర్తెరిగి, తమ మంత్ర తంత్రాలు పని చేయవని తెలుసుకొని ఆయనకు దాసోహమన్నారు.

ఇక్కడ తిల్లైవనంలో పరమశివుడు చేస్తున్న తాండవాన్ని చూస్తూ కరణోదకసాగరంలో సేదదీరుతున్న శ్రీమహావిష్ణువు  మైమరచిపోయి చిరునవ్వు నవ్వుతుంటే ఆదిశేషుడు ఎన్నడూ ఎరగని ఈ ప్రత్యేకమైన చిరునవ్వుకు కారణం అడిగాడట.అప్పుడు అవ్యక్తంలో నిరంతరం మారుమోగుతున్న తన ఢమరు నినాదంతో సృష్టిస్థితిలయాలని శాసిస్తున్న ఆదినర్తననాయకమణి సాకారుడై తిల్లైవనంలో చేస్తున్న లీలావినోదాన్ని గమనించి సంతోషం పట్టలేక నవ్వుతున్నట్లు చెప్పాడట. ద్వంద్వాతీతుదైన శ్రీమహావిష్ణువునే మోహింపజేసిన ఆ నృత్యాన్ని చూసే భాగ్యం తనకు కూడా ప్రసాదించమని అడిగిన ఆదిశేషునికి భూమిపైన పతంజలిగా అవతరించి నటరాజు చేసే ఆనంద తాండవాన్ని చూసి తరించమని ఆశీర్వదించాడట.పతంజలి వ్యాఘ్రపాదర్ / పులికాల్ముని (వ్యాఘ్ర / పులి, పాదర్ - పాదములు కలవాడు - ఈయన తేనెటీగలు రాకమునుపే పూవులు కోయటానికి చెట్లెక్కేందుకు వీలుగా పులి కాళ్ళు, చూపు కోరి సంపాదించుకున్నాడు) తో కలిసి తిల్లాయ్ అడవిలోనికి వెళ్ళి భగవంతుణ్ణి శివలింగ రూపంలో పూజించారు. ఆ దేవుణ్ణి ఈ నాటికీ 'తిరుమూలతనేశ్వర్' (తిరు - శ్రీ, మూలతనం - మూలమైన, ఈశ్వరర్ - ఈశ్వరుడు)గా పూజిస్తున్నారు.

చిదంబరం ఆలయపు అసలు మూలాలు తెలియవు. పురాణాల (ముందు మౌఖికంగా, తర్వాతి కాలంలో వ్రాతపూర్వకంగా అందించబడిన చరిత్ర) ప్రకారం పులికాల్మునివర్ స్వామి సిమ్మవర్మన్ ద్వారా పవిత్రమైన ఆలయ పనుల్లో సింహ భాగాన్ని జరిపించినట్లు తెలుస్తోంది.పల్లవ రాజుల్లో సిమ్మవర్మన్ పేరుగల రాజూలు ముగ్గురున్నారు. భక్త కవి ఐన తిరునావుక్కరసర్ (ఈయన జీవన కాలం కాస్త అటు ఇటుగా సరిగ్గానే లెక్కించబడింది) సమయానికే ఆలయం ప్రశస్తి పొందినందువల్ల సిమ్మవర్మన్ దాదాపు క్రీ.శ. 430-458 మధ్య కాలంలో జీవించి ఉండాలి. కొట్రావన్ కుడి లోని 'పట్టాయం' లేదా రాగిరేకులతో చేసిన శాసనం ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తుంది. కానీ తండన్ తొట్ట పట్టాయం ఇంకా ఇతర పల్లవ కాలపు పట్టాయాలలో ఈయన ప్రసక్తి లేదు. అందువల్ల ఆయన తన హక్కులను త్యజించి చిదంబరానికి వచ్చి జీవించి ఉండవచ్చని నమ్మకం. పులికాల్మునివర్, సిమ్మవర్మన్ సమకాలికులని తెలుస్తుండడం వల్ల ఆలయం ఆ సమయంలో ఉనికిని పొందిందని భావిస్తారు. కానీ భక్త కవి మాణిక్కవసాగర్ భక్త కవి తిరునావుక్కరసర్ కన్నా ఎంతో ముందే చిదంబరంలో జీవించి ముక్తిని పొందినట్లు తెలుస్తుండడం వల్ల, అంతే కాక నటరాజ స్వామి విగ్రహం, దాని భంగిమ, దాని స్వరూపం అదే కాలపు ఇతర పల్లవ శిల్పరీతులతో సరిపోలనందువల్ల ఈ ఆలయం సిమ్మవర్మన్ కన్నా చాలాకాలం ముందు నుంచే ఉనికిలో ఉండేదని విశ్వసిస్తున్నారు.

బంగారు పలకలతో తాపడం చేయబడిన చిత్సబై పైకప్పు చోళ రాజు పరంథక I చేయించినట్లు చెప్పబడుతోంది. పరంథక II, రాజరాజ చోళ I, కులోత్తుంగ చోళ I కూడా ఆలయానికి విలువైన దానాలు ఇచ్చినట్లు చెప్పబడుతోంది. రాజరాజ చోళుని కుమార్తె కుందవై సైతం బంగారు ఇతర ఆస్తులు ఇచ్చినట్లు చెప్పబడుతోంది. ఆ తరువాతి కాలపు చోళ రాజు విక్రమ చోళ (క్రీ.శ 1117-1136) కూడా నిత్య పూజలకు గాను నివేదనలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఆలయానికి పుదుకొట్టై మహారాజా, శ్రీ సేతుపతి (పచ్చరాయి ఆభరణం నేటికీ స్వామిని అలంకరిస్తోంది), పరి రాజు, టిప్పు సుల్తాను వంటి అనేకమంది రాజులు, పాలకులు, దాతలు బంగారునూ, ఆభరణాలను ఇచ్చారు. దీక్షితార్లు ఆలయంపై టిప్పు సుల్తాను దాడి చేసి దోచుకుంటాడని భయపడినట్లు కొన్ని ప్రస్తావనలు ఉన్నాయి (ఇవి దీక్షితార్లలో ఒక తరం నుంచి మరొక తరానికి మౌఖికంగా వచ్చినవి). ఎందరో దీక్షితార్లు తమ పవిత్రమైన, ప్రీతిపాత్రమైన దేవాలయం టిప్పు చేతుల్లో నాశనమవడం చూడటం కన్నా మృత్యువే మేలని ఎత్తైన పగోడాల పై నుంచి దూకి ప్రాణత్యాగం చేశారంటారు. ఇంకొందరు దీక్షితార్లు ఆలయానికి తాళం వేసి విగ్రహాలను ఎంతో భద్రంగా కేరళ లోని అళపుజకు తీసుకు వెళ్ళారంటారు. ఆక్రమణ భయం తగ్గిన తర్వాతనే వారు తిరిగి వచ్చారట.

ఈ దేవాలయపు భక్తుల్లో మొదటివారుగా పరిగణింపబడుతున్నవారు ఆలయ నిర్వహణ చూసే తిల్లై వాళ్ అంధనార్ (తిల్లైలో ఉండే పూజారులు అని అర్థం) అని పిలవబడే పూజారులు. నలుగురు భక్త కవులు ఈ దేవాలయాన్ని ఈ స్వామిని అజరామరం చేశారు. వాళ్ళెవరంటే తిరుజ్ఞాన సంబంథర్, తిరునావుక్కరసర్, సుందరమూర్తి నయనార్ మరియు మాణిక్కవసాగర్ . మొదటి ముగ్గురి రచనలు దేవరములుగా ఖ్యాతి పొందాయి. తిరుజ్ఞాన సంబంథర్ చిదంబరం స్వామి పైన రెండు దేవరములు, తిరునావుక్కరసర్ నటరాజ స్వామి పైన ఎనిమిది దేవరములు మరియు సుందరమూర్తి నయనార్ నటరాజ స్వామి పైన ఒక్క దేవరము రచించి స్వరపరిచారు. మాణిక్కవసాగర్ రెండు రచనలు చేశారు. మొదటిది చిదంబరంలో ఎక్కువగా పాడబడే తిరువాసకం (పవిత్ర వచనాలు) మరియు రెండవది పూర్తిగా చిదంబరంలోనే పాడబడే తిరుచిత్రాంబలక్కోవైయార్ (లేదా తిరుకోవైయార్). మాణిక్కవసాగర్ చిదంబరంలోనే ఆధ్యాత్మిక ఆనందం, ముక్తి పొందారని చెప్పబడుతుంది.

ఆలయ నిర్వహణ బాధ్యతలను ఆనువంశికంగా వైదిక బ్రాహ్మణుల్లో ఒక శాఖ ఐన చిదంబరం దీక్షితార్లు చూసుకుంటున్నారు. పురాణాల ప్రకారం వీరిని కైలాస పర్వతాల నుంచి పతంజలి ఋషి ప్రధానంగా దైనందిన పూజాదికాలు జరపడానికీ, చిదంబరం ఆలయ నిర్వహణకూ తీసుకు వచ్చారు. దీక్షితార్లను శివుడిని నటరాజుగా కొలవటానికి నియోగించిన పతంజలి ఆలయ పూజా విధానాలను వేదాల నుంచి సేకరించి ఏర్పరిచారు.

అలా తిల్లై మూవాయిరమర్ అని పిలవబడే 3000 మంది దీక్షితార్లు (2999 మరియు భగవంతుడు) వచ్చారని ప్రతీతి. ఇప్పుడు మొత్తంగా దాదాపు 360 మంది ఉన్నారు. వీళ్ళు శివపూజకు ఆగమ పద్ధతులు పాటించే శివాచారియర్లు లేదా ఆదిశైవర్ల వలె కాక వైదిక పద్ధతులు పాటిస్తారు.

సాధారణంగా వంతుల వారీ ప్రధాన పూజారి పదవి, ఆలయ ఆదాయంలో వంతు ప్రతీ వివాహితుడైన దీక్షితారుకూ లభిస్తుంది. ఆలయాన్ని ఎంతో మంది పాలకులు సేవించుకున్నందువల్ల సుక్షేత్రమైన 5000 ఎకరాల మాన్యం ఉన్నట్టు తెలుస్తున్నా వర్తమానంలో ఇది పూర్తిగా ప్రైవేటు విరాళాలతోనే నడుస్తోంది.

అవాళ్టి ప్రధాన పూజారి తనను తాను శుద్ధి చేసుకునే మంత్రాదికాలు పూర్తి చేసి శివోహంభవ రూపు దాల్చడంతో దినచర్య ప్రారంభమౌతుంది. పిమ్మట పూజారి ఆలయ ప్రవేశం చేస్తారు. స్వామివారి పాదుకలను ఉదయం 7 గంటల వేళ పాలియారై లేదా పవళింపు గది నుంచి గర్భగుడికి భక్తుల మేళ తాళాలు, డమరుక ధ్వనుల మధ్య పల్లకీలో తీసుకురావడంతో పూజాదికాలు ఆరంభమౌతాయి. పూజారి అప్పుడు భగవంతుణ్ణి అడ్డంకులను తొలగించమని వేడుకుంటూ నైవేద్యం పెట్టి ఒక ఆవు, దూడ జంటను పూజిస్తారు.

పూజ రోజుకు 6 సార్లు జరుగుతుంది. పూజ చెయ్యడానికి ముందు ప్రతిసారీ స్వామి అసంపూర్ణ రూపమైన స్ఫటిక లింగానికి నెయ్యి, పాలు, పెరుగు, అన్నం, చందనం, విబూదితో లేపనం చేస్తారు. పిమ్మట స్వామికి అప్పుడే తయారు చేసిన తిండి పదార్థాలు, తీపి నైవేద్యం పెట్టి సంస్కృతంలో వేదాలు, పంచపురాణం (పన్నీరు తిరుమురై అని పిలువబడే 12 తమిళ రచనల నుండి ఎన్నిక చేసుకున్న 5 కవితలు) చదువుతూ అందంగా, వివిధ రకాలుగా అలంకరించిన దీపాలతో దీపారాధన చేస్తారు. పూజారి గర్భగుడి తెరను తొలగించి చిదంబర రహస్యాన్ని చూపడంతో పూజ ముగుస్తుంది.

రెండవ సారి పూజకు ముందు మామూలుగా స్ఫటిక లింగానికి చేసే సేవలతో పాటు ఒక రత్న నటరాజు విగ్రహం (రత్న సభాపతి) కూడా సేవలందుకుంటుంది. మూడవ పూజ మధ్యాహ్నం 12:00 గంటల సమయంలో జరుగుతుంది. తర్వాత ఆలయం మూసివేసి మళ్ళీ సాయంత్రం 4:30 గంటలకు తెరుస్తారు. నాల్గవ పూజ సాయంత్రం 6:00 గంటలకు, ఐదవది రాత్రి 8:00 గంటలకు, చివరి పూజ రాత్రి పది గంటలకు జరుగుతాయి. దీని తర్వాత స్వామివారి పాదుకలను ఆయన విశ్రమించడానికి వీలుగా ఊరేగింపుగా తీసుకువెళ్తారు. ఐదవ పూజకు ముందు పూజారి చిదంబర రహస్యానికి ప్రత్యేక పూజలు చేసి యంత్రానికి సుగంధ ద్రవ్యాలతో లేపనం చేస్తారు.

అర్ధజాము పూజ అని పిలువబడే చివరి పూజను చిదంబరంలో ప్రత్యేకమైన ఉత్సాహంతో చేస్తారు. స్వామివారు రాత్రి విశ్రమించేటప్పుడు విశ్వంలోని దైవిక శక్తి అంతా ఆయనలో విశ్రమిస్తుందని భక్త జనుల నమ్మకం.మానవుల ఒక్క సంవత్సరం దేవుళ్ళకు ఒక్క రోజని ప్రతీతి. రోజుకు ఆరు సార్లు పూజలు చేసినట్లే ప్రధాన దైవమైన నటరాజ స్వామికి సంవత్సరంలో ఆరు ప్రత్యేక పూజలు చేస్తారు. అవి - మొదటి పూజను సూచించే మార్ఘాళి తిరువాధిరై (డిసెంబరు - జనవరి), రెండవ పూజకు సూచనగా మాసి (ఫిబ్రవరి-మార్చి) నెలలో పౌర్ణిమ తర్వాత వచ్చే 14 వ రోజు (చతుర్దశి), మూడవ పూజ లేదా ఉచ్చి కాలం సూచించే చిత్తిరై తిరువోణం (ఏప్రిల్ - మే), సాయంత్రాన్ని లేదా నాల్గవ పూజను సూచించే ఆణి ఉత్తరం (జూన్ - జూలై) లేదా ఆణి తిరుమంజనం, ఐదవ పూజను సూచించే ఆవణి (ఆగస్టు - సెప్టెంబరు) చతుర్దశి మరియు ఆరవ పూజ లేదా అర్ధజాము పూజను సూచించే పురతసి (అక్టోబరు - నవంబరు) చతుర్దశి.

వీటిలో మార్ఘాళి తిరువాధిరై (డిసెంబరు - జనవరి), ఆణి తిరుమంజనం (జూన్ - జూలై) అత్యంత ప్రధానమైనవి. ఈ పండుగల సందర్భంగా ప్రధాన దైవాన్ని గర్భగుడి బయటకు ఊరేగింపుగా తెచ్చి, రథోత్సవం జరిపి పెద్ద ప్రత్యేక పూజ చేస్తారు. కొన్ని లక్షల మంది జనం ఈ ప్రత్యేక పూజనూ, గర్భగుడిలోనికి తిరిగి వెళ్ళిపోయేటప్పుడు జరిగే స్వామివారి ఆచారపూర్వకమైన నృత్యాన్నీ చూడటానికి బారులు తీరుతారు.

ఆలయపు రూపకల్పనలోనూ, స్థాపత్యంలోనూ (స్థాపత్యం - ఆర్కిటెక్చర్) వేదాంతార్థాలు కోకొల్లలు. చిదంబరం ఆలయానికి మన శరీరంలోని నవ రంధ్రాల మాదిరిగానే 9 ద్వారాలు ఉన్నాయి. ఈ దేవాలయంలోని ఓ గోపురాన్ని 21,600 బంగారు రేకులతో కప్పారు. ఇది ఒకరోజుకి మనిషి శ్వాసలోని ఉచ్ఛ్వాస, నిశ్వాసాల సంఖ్యతో సమానం. ఆ రేకుల్ని తాపడం చేయడానికి ఉపయోగించిన బంగారు మేకుల సంఖ్య 72 వేలు. యోగశాస్త్ర ప్రకారం మనిషి శరీరంలోని నాడుల సంఖ్యా అంతే. మన శరీరంలో ఎడమవైపు గుండె ఉండే ప్రదేశంలానే ఇక్కడ అమ్మవారి విగ్రహం ఎడమచేతి వైపునకు తిరిగి ఉంటుంది. దీనికి పక్కనే ఉన్న నాలుగు స్తంభాల మండపం నాలుగు వేదాలకూ ప్రతీక. శివపూజలో జరిగే 28 కైంకర్యాలని సూచిస్తూ శివకామసుందరి అమ్మవారి ప్రాంగణంలో 28 స్తంభాలు ఉంటాయి. వీటిమీద 64 కళలకూ గుర్తుగా 64 బీములు ఉంటాయి. బంగారు తాపడం కలిగిన గోపురంమీద ఉన్న నవ కలశాలూ నవశక్తులకి సంకేతాలు. అర్ధమండపానికి ఆనుకుని ఉన్న మండపంలోని 18 స్తంభాలు అష్టాదశ పురాణాలకు ప్రతీక.అంతేకాదు అడ్డు దూలాలు రక్తప్రసరణ నాళాలు. 9 కలశాలు 9 రకాల శక్తికి ప్రతీకలు. అర్ధ మంటపంలోని 6 స్తంభాలూ 6 శాస్త్రాలకు ప్రతీకలు. ప‌క్కన ఉన్న మంటపంలోని 18 స్తంభాలూ 18 పురాణాలకి ప్రతీకలు.

పరమశివుడు ఆనంద తాండవం చేసిన స్థలంలో - 'తిరుమూలతనేశ్వర్' ఆలయానికి దక్షిణంగా - ఇప్పుడు శివుడు నృత్య భంగిమలో కనిపించే పొన్నాంబళం/పోర్ సబై ('పొన్'అంటే బంగారం 'సబై' అంటే సభ లేదా వేదిక) ఉంది. ఇక్కడి దేవుణ్ణి 'సభానాయకర్' - అంటే వేదికపై కొలువైన దేవుడు - అని కూడా పిలుస్తారు.ఈ బంగారు తాపడం చేసిన వేదిక చిదంబరం ఆలయపు గర్భగుడి. ఇందులో స్వామి క్రింద తెలిపిన మూడు రూపాల్లో దర్శనమిస్తారు:

1) సంపూర్ణ రూపం - నటరాజు రూపంలోని స్వామి 2) అసంపూర్ణ రూపం - స్ఫటిక రూపంలోని చంద్ర మౌళీశ్వరర్ 3) నిరాకారం - పంచ భూతాల్లో ఒకటైన ఆకాశానికి ప్రతీకగా గర్భ గుడిలోని ఖాళీ స్థలం.

చిదంబర రహస్యం! 
ఈ ఆలయంలో స్వామి నటరాజ రూపం, ఇదీ అని చెప్పలేని చంద్రమౌళీశ్వర స్ఫటికలింగ రూపం, ఏ రూపమూలేని దైవసాన్నిధ్యం అనే మూడు స్వరూపాల్లో దర్శనమిస్తాడు. మూడో రూపమే చిదంబర రహస్యం.. గర్భాలయంలోని వెనకగోడమీద ఓ చక్రం గీసి ఉంటుందట. దానిముందు బంగారు బిల్వ ఆకులు వేలాడుతుంటాయి. అవేమీ కనిపించకుండా తెర కట్టి ఉంటుంది. అర్చకులు ఆ తెరను నామమాత్రంగా తొలగించి చూపిస్తారు. ఆ ప్రదేశాన్నే శివోహంభవ అంటారు. అక్కడ మనకు ఏమి కనిపించితే అదే శివతత్వం - మనకి ఏమి కనిపించిందో ఇతరులకి చెప్పకూడదు,ఇతరుల్ని మీకేమి కనిపించిందని అడగకూడదు! శివ అంటే దైవం, అహం అంటే మనం. భవ అంటే మనసు ఆ దైవంలో మనసు ఐక్యం అయ్యే ప్రదేశం. అంటే అక్కడ ఏ రూపం లేకుండానే అజ్ఞానాన్ని తొలగించుకుంటూ ఆ దైవ సాన్నిథ్యాన్ని అనుభూతించడమే ఈ క్షేత్ర ప్రాశస్త్యం - అదే చిదంబర రహస్యం.ఈ ఆలయం'విరాట్ హృదయ పద్మ స్థలం' అంటే కమలం వంటి విశ్వపు గుండెలో ఉన్నదని ప్రతీతి.

పరమశివుడు నృత్యం చేసినట్లుగా చెప్పబడే ఐదు స్థలాల్లో చిదంబరం కూడా ఒకటి. ఈ స్థలాలు అన్నింటిలోనూ వేదిక/సభైలు కనిపించడం విశేషం. చిదంబరం కాక మిగిలిన ప్రాంతాలు తిరువాలంగడు లోని రత్తినసబై (రత్తినం - రత్నం), కౌర్తాళ్ళం లోని చిత్రసబై (చిత్ర - చిత్రకళకు ప్రతీక), మదురై లోని మీనాక్షి దేవాలయంలోని రజతసబై (రజత - వెండి) మరియు తిరునెల్వేలి లోని నెల్లైఅప్పర్ దేవాలయంలోని తామిరసబై (తామిరం - రాగి).

చిదంబరంలో ఉన్న నటరాజ విగ్రహం కాలి బొటన వేలు, భూమి అయస్కాంత క్షేత్రానికి మధ్య బిందువు అని 8 సంవత్సరాల పరిశోధన అనంతరం శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. ఈ విషయాన్ని తన గ్రంధం "తిరుమందిరం"లో ప్రసిద్ధ తమిళ స్కాలర్ తిరుమూలర్ వివ‌రించారు. నటరాజు నృత్యాన్ని పాశ్చాత్య సైంటిస్టులు కాస్మిక్ డాన్సు అని వర్ణించారు. 

Gary A David
“I am the Author of “The Orion Zone” and four more books on Archaeo-Astronomy, concentrating on the southwestern area of the United States. I have also have been featured on international radio interviews and on U.S. television programs.

Since 1997, I have studied Orion and various man-made structures and Rock Art that represent this Constellation. All over the globe, Orion- pattern in the sky is frequently reproduced by certain megalithic constructions on the ground. (Mega- means “large” and lithic means “stone.”) In essence, the earth structures mirror the pattern in the sky.

In addition, the rising and setting of Orion- stars are sometimes lined up with certain astronomical markers. Various cultural sites in Peru, Mesoamerica, North America, Great Britain, Ireland, Europe, Africa, and Egypt, along with other locations across the world, concentrate on this particular constellation with an archetypal intensity.

Now we have a solid proof of the “Orion archetype” found in the pictographs (rock paintings) of Narthamalai, Tamil Nadu, dated to 1500 BC or earlier. Painted in white, a human figure is seen with the typical upraised right arm as well as the left arm holding either a shield or club or spear. Associated with this figure is a representation of two triangles with their apexes touching.

This type of figure is also found in Rock Art of the Americas and Africa. In North America it signifies warfare between Native American tribes. For the Igbo tribe of Nigeria it signifies the Great Mother Goddess called Mbari. In India this double-triangle may represent the Female- Male complex. It may also represent the ‘hurglass drum’or ‘dumroo’,a two-headedsacred drum of Lord Shiva.

ఒక చేతిలో సమస్తాన్నీ దహించివేసే అగ్నినీ ఒక చేతిలో సమస్తాన్నీ కంపింపజేసే ఢమరువునీ ధరించి విశృంఖలుడైన దైత్యుని అణిచివేస్తూ చేసే ఈ ఆనంద తాండవం మన దేహానికి బయట విశ్వంలోనే కాదు మన అంతరంగంలో కూడా నిరంతరం జరుగుతూనే ఉన్నది - మనం అనుభవించే  ఆనంద విషాదాలు ఆ చిరుమువ్వల మరుసవ్వడులే!  ప్రాచ్యదేశాలలో ఎక్కువమంది పాటిస్తున్న Judaeo-Christian-Islamic మతసాహిత్యానికి భిన్నమైన సనాతన ధార్మిక సాహిత్యం ఈనాడు ద్రవ్యం-శక్తి అనే ద్వంద్వాల గురించి కనుగొనబడుతున్న ఆధునిక భౌతికశాస్త్రవిషయాలని ఏనాడో అర్ధం చేసుకుని అర్చామూర్తులలో నిక్షేపించి పాటించేవారికి విశ్వంతోనూ దైవంతొనూ ఎట్లాంటి అనుబంధాన్ని పెంచుకుని నిజమైన ఆనందాన్ని పొందాలో అత్యంత సులువుగా దాన్ని పొందడానికి వీలుగా సూచించగలగడం ఎంత అద్భుతం!

ఈ నటరాజ భంగిమను శాస్త్రవేత్తలు పరిశీలించి క్రీ.శ 1054లో జరిగిన Crab super Nova Explosion ఫలితమైన orion constellation యొక్క రూపచిత్రణమే ఇక్కడి నటరాజ మూర్తిలో నిక్షిప్తమై ఉన్నదని తేల్చి చెప్పారు!ప్రస్తుతం orion constellation యొక్క రూపచిత్రణ ఒక వేటగాడు ముందుకు సాచిన చేతితో బల్లెం(shield) పట్టుకుని రెండవ చేతితో ఒక ఖడ్గాన్ని పైకి ఎత్తి పట్టుకున్న మానవమూర్తిని పోలి ఉన్నదని భావించి The Hunter అని పిలుస్తున్నారు.శివుణ్ణి కిరాత నామధేయంతో కూడా పిలుస్తారనేది ప్రతి హిందువుకీ తెలిసిన విషయమే కదా!దీనికి దగ్గరలోనే ఉన్న Canis Minor అనే వేటకుక్కను బోలిన మరొక నక్షత్ర సమూహం శివుడి మరొక రూపమైన భైరవమూర్తిని సూచిస్తున్నది.ప్రపంచంలోని అన్ని ప్రముఖమైన ప్రాచీన నాగరికతలలోనూ ఏదో ఒక రూపంలో శివతత్వం ఆరాధనీయమై కనబడుతున్నది.
Main Stars in the Orion Constellation

Ø  Betelgeuse
A red supergiant star around 640 light years from Earth, Betelgeuse, also known as Alpha Orionis, has a radius 1,000 times larger than the sun and is expected to explode as a supernova in the next million years.

Ø  Meissa
A blue giant star with surface temperatures around 5 times hotter than our sun, Meissa is actually a pair of binary stars, its companion is similar in size and mass to the sun.

Ø  Bellatrix
A blue giant star around 250 light years from Earth, Bellatrix is 6 times larger than our sun and 8 times more massive, the star is also known as Gamma Orionis.

Ø  Alnitak
Alnitak is a triple star system around 736 light years from Earth, the primary star is a blue supergiant star with a radius around 20 times larger than the sun, Alnitak is also known as Zeta Orionis.

Ø  Alnilam
A blue supergiant star around 1,400 light years from Earth, Alnilam is 24 times larger than the sun and more than 250,000 times as luminous, the star is also known as Epsilon Orionis.

Ø  Mintaka
Also known as Delta Orionis, Mintaka is actually a pair of blue giant stars with the largest having 16 times the radius of the sun, both stars are around 100,000 times more luminous than the sun.

Ø  Saiph
A blue supergiant star around 650 light years from Earth, Saiph is 16 times more massive and around 22 times larger in diameter than the sun.

Ø  Rigel
Also known as Beta Orionis, Rigel is around 800 light years from Earth and is the brightest star in the constellation, once again like most of the others it is a blue supergiant around 75 times larger in diameter than the sun and around 40,000 times brighter.
Ø  M42

Perhaps the most interesting component of the Orion constellation, M42 is not a star but is in fact the Orion nebula, a vast star forming region some 1,500 light years from Earth, the nebula makes up the sword of Orion along with two other stars. The Orion nebula has an apparent magnitude of 4.0, making it easily visible with the naked eye apart from those living in an around the center of large cities.

వీటినే అవి కలిసి ఏర్పరుస్తున్న సరళరేఖల్ని గీసుకుని దిశల్ని సూచించే బాణం గుర్తులతో సూచిస్తే మరికొంత విశేషమైన రూపం కనిపిస్తుంది.అప్పుడు నర్తిస్తున్న నటరాజు యొక్క ఉదరమూ నడుమూ పిరుదులూ గోచరిస్తూ ఇప్పటి నటరాజమూర్తి రేఖామాత్రమై కనబడుతుంది. 
Orion Constellation నుంచి చిదంబరం నటరాజ మూర్తిని దర్శించదంలో ఇది మొదటి మలుపు.దీని తర్వాత జరిగిన పరిశ్రమ అర్ధం కావాలంటే ప్రాచీన భారతీయ ఖగోళ శాస్త్రవిజ్ఞానం రేఖామాత్రంగానైనా తెలియాలి.భూమి తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరగడం గురించి తెలిసినప్పటికీ గ్రహతారకాదుల మధ్య దూరాల యొక్క సాపేక్షమైన స్థిరత్వాన్ని గమనించి గణితశాస్త్రం యొక్క పరిధిని దృష్టిలో ఉంచుకుని భూమిని స్థిరంగా విశ్వానికి కేంద్రంగా ఉంచి మనకు భూమిపైనుంచి కనిపిస్తున్న ఆకాశాన్ని 360 డిగ్రీల వృత్తం కింద తీసుకుని దాన్ని 27 భాగాలు చేశారు.ఒక్కొక్క భాగం 13.30 డిగ్రీల కోణం ఉంటుంది.ఈ పళ్ళెం విధాత తనమీద గీసిన నక్షత్రరాశుల రంగవల్లికలను మోసుకుని భూమి నడిమధ్యనుంచి వెళ్తున్న విశ్వం యొక్క నిలువు అక్షం చుట్టూ తిరుగుతున్నది.ఈ తిరుగుడు కొండాట్టంలో పౌర్ణమినాడు చంద్రునికి దగ్గిరగా ఏ నక్షత్రం వస్తుందో చూసి ఆ నక్షత్రం పేరున ఆ పౌర్ణమికి ముందువెనకల కాలాన్ని అమావాస్య వరకు కలిపి మాసాన్ని నిర్దేశించారు - చిత్రా నక్షత్రం పేరున చైత్ర మాసం అవుతుంది,విశాఖ నక్షత్రం పేరున వైశాఖం అవుతుంది.చంద్రగమనాన్ని ఆధారం చేసుకుని మాసావధిని నిర్ణయించడం పండితుల ప్రజ్ఞయే గానీ ఋతువులు మాత్రం వారు నిర్దేశించినవి కావు.ఋతువులు,ఆయనాలు,సంవత్సరం సూర్యగమనం వల్ల ఏర్పడినాయి. అయితే,ఈ మొత్తం చిక్కురొక్కురు విషయాలని అర్ధం చేసుకుని సరైన పద్ధతిలో లెక్కలు కట్టడం వల్ల ఈ అనంత కాలగమనంలో ఏ రోజున ఏ అమరిక ఖగోళంలో కనబడుతుందో మన ఖగోళ శాస్త్రజ్ఞులు చెప్పగలుగుతున్నారు!

ఈ రకమైన లెక్కలతో ప్రోగ్రాములు రాఇ తయారు చేసిన astronomical software ఉపయోగించి Dr. Raghavan అనే మేధావి క్రీ.శ 1054 జులై 11న చంద్రుడు ఉత్తరా నక్షత్రంలో ప్రవేశిస్తాడని నిర్ధారించారు.ఇది చైనీయులు crab supernova explosion జరిగినదని కనుక్కున్న జులై 4వ తేదీకి చాలా దగ్గిరగా ఉన్నది కదా! ఇది సంక్లిష్టమైన ఖగోళ సంబంధ విషయాల్ని తాము అర్ధం చేసుకుని సరిపెట్టుకోకుందా ఇతరులకు అర్ధమయ్యే రీతిలో చెప్పగలిగిన మనవారి ప్రజ్ఞకు ఒక చిన్న ఉదాహరణ.


రాజ దీక్షితార్ అనే ఒక పండితుడు రచించిన తమిళగ్రంధంలో orion constellation యొక్క నక్షత్రాల అమరికలో నటరాజమూర్తి ఎలా కనిపిస్తుందో సూచించే ఒక చిత్రపటం ఉన్నది.దానితో ఉత్సాహం తెచ్చుకున్న Dr. Raghavan వంటి మేధావులు archaeometallurgical fingerprinting ప్రక్రియని ఉపయోగించి ప్రాచీనతను నిర్ధారించుకున్న తొలినాటి నటరాజ ప్రతిమను సేకరించి దానికి transparent print తీసి ఇటువైపునుంచి 1054 july 11నాటి నక్షత్రమండలపు అమరికని కూడా transparent print తీసుకుని ఒకదానిపైన మరొకదాన్ని ఉంచి సరిపోల్చారు - Kankoduvanitham నుంచి సేకరించిన 11వ శతాబ్ది నాటి నటరాజ మూర్తి యొక్క భంగిమ క్రీ.శ 1054 జులై 11వ తేదీనాటి నభోమండలపు orion contellation మధ్యన ఇమిడిపోయింది!ఆనాటి crab supernova explosion చంద్రమౌళీశ్వరుని శిరస్సు పైని నెలవంకకు సమీపంలో జరిగి 23 రోజుల పాటు కనబడిందని చైనీయులు చెబుతున్నారు.
రేఖాగణితంలో త్రికోణానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు.అందుకే నిగూఢమైన తాంత్రిక పూజలలో కూడా త్రికోణం ఎక్కువ కనిపిస్తుంది.ముఖ్యంగా యంత్రాలన్నింటిలో ఉన్నతస్థానం సాధించుకున్నశ్రీచక్రం ఒక బిందువు చుట్టూ పరచిన త్రికోణాల సమాహారం - లోపలి వరుసలో ఉన్న రెండు త్రికోణాలూ శివ శక్తుల ప్రతిరూపాలు.నటరాజ భంగిమ కూడా ఈ షట్కోణ మండలంలోనే ఉంటుంది!

నటరాజు చుట్టూ వలయాకారంలో ఉన్న అగ్నిశిఖల వలయం విశ్వంలోని అనేకానేకమైన గ్రహతారకల నుంచి పీపీలికాదుల వరకు గల సమస్తమైన జీవ నిర్జీవ భూతజాలంలోనూ కనిపించే పునరపి జననం పునరపి మరణం అనే నిరంతరాయతకు చిహ్నం! ఈ అగ్నివలయం అపస్మారపురుషభూతానికి అటుపక్కనా ఇటుపక్కనా కనిపించీ కనిపించకుండా ఉన్న ఒక మకరం నోటినుంచి వస్తూ మరొక మకరం నోటిలోకి వెళ్తున్నట్టు ఉంటుంది.అగ్ని సూర్యుడికి ప్రతీక అయితే మకరం చంద్రుడికి ప్రతీక.జీవం నిలవాలంటే అగ్ని,జలం రెండూ అవసరమే అన్న అంతరార్ధం కూడా ఇందులో ఉంది.

నృత్యభంగిమలో వంచిన రెండు పాదాలూ చలనానికీ వేగానికీ సంకేతం.తల వెనక విసనకర్ర వలె పరుచుకున్న జటలు నృత్యంలోని వేగానికీ సంలీనతకీ సంకేతం.కుడివైపున జటలలో ఇరుక్కుని కనబడుతున్న గంగారూపం ఉత్తుంగతరంగాలతో భయపెట్టే నదులను అడ్డుకట్టలు వేసి ప్రశాంతమైన పరీవాహకతను సాధించడం వల్లనే జీవులకి రక్షణ దొరికి వృద్ధి సాధ్యమనే విషయానికి సంకేతం.

పైవైపు కుడిచేతిలో ఢమరుకం ఉంటుంది.నాట్యశాస్త్రంలో కూడా ఈ విధమైన హస్తముద్రని ఢమరుముద్ర అని పిలుస్తారు,ఇది జీవితంలో మనం సాధించాల్సిన లయను సూచిస్తుంది.పుస్తకపఠనం, సంగీతశ్రవణం, సౌందర్యదర్శనం - మానవులు ఆనందం కోసం ఏ సాధన చేసినప్పటికీ అందులోని లయ మాత్రమే ఆనందకారకం కదా! 

పైవైపు ఎడమచేతిలో అగ్ని వెలుగుతూ ఉంటుంది.ఇది సృష్టిలో కలిసిపోయి ఉన్న ద్వంద్వాలని వేరు చేసి చూడమని సూచిస్తుంది.జననం - మరణం,విజయం - అపజయం,సౌందర్యం - వికారం,సృష్టి - అంతం అనేవి కొన్ని మాత్రమే గానీ ప్రతిచోటా ఈ ద్వంద్వాలు కనబడుతూనే ఉంటాయి.జన్మ మాత్రమే ఉన్నది అనుకోవదం అవ్ల్లనే మృత్యువుకు భయపడుతున్నాం.విజయం మాత్రమే ఉన్నది అనుకోవడం వల్లనే అపజయానికి కుంగిపోతున్నాం - కానీ రెండూ ఉంటాయని తెలిస్తే అంత బాధ కలగదు.నటరాజ బంగిమలో ఈ జ్వాల కొట్టొచ్చినట్టు కనబడటంలో మన పూర్వాచార్యులకి బోధనలో ఉండాల్సిన సాంకేతికపరమైన విషయాల ప్రాధాన్యతాక్రమాన్ని సూచించడం పట్ల నిష్ఠని సూచిస్తుంది!

కిందివైపు కుడి చేతి మణికట్టునుండి ఒక సర్పం వేలాడుతున్నట్టు కనిపిస్తుంది,కానీ హస్తం మాత్రం అభయముద్రలో ఉంటుంది.అంటే నీ ధర్మాన్ని నువ్వు నెరవేరుస్తూ స్వామిని ఆశ్రయించుకుని ఉంటే ప్రమాదం,దుర్మార్గం,విద్రోహం అజ్ఞానం వంటివాటికి భయపడాల్సిన పనిలేదనే సూచన ఉంది.


కిందివైపు ఎడమచేయి పైకెత్తిన తన పాదాన్ని చూపిస్తూ ఉంటుంది. భక్తులనీ ఆశ్రితులనీ జీవన నృత్యాన్ని ఆపకుండా చివరివరకు కొనసాగించమని సూచించడమే దీని ముఖ్యమైన ఉద్దేశం.చిన్న చిన్న కష్టాలకే కుంగి కొందరు ఆత్మహత్యలు చేసుకుని జీవితాల్ని ముగించేసుకుంటుంటే పెద్ద పెద్ద కష్టాలని కూడా చిరునవ్వుతో భరించగలిగినవాళ్లు విజయాలని సాధిస్తున్నారు - నటరాజు కటాక్షం సహనశీలురకే ప్రాప్తిస్తుంది సుమా!

రెండు విచ్చుకున్నవీ ఒకటి నుదిటి మీద ఉండి విచ్చుకోనిదీ అయిన మూడు నేత్రాలు చూసినదాన్ని చూసినట్టు మాత్రమే కాకుండా లోనారసి చూడగలిగిన జ్ఞానం యొక్క అవసరాన్ని సూచిస్తున్నాయి.ఇంకా ఇవి సత్వరజస్తమస్సులనే త్రిగుణాలని కూడా సూచిస్తాయి.ఈ మూడంటిలోనూ సత్వగుణాన్ని సాధించడం చాలా కష్టం - అది ఇంకా తెరుచుకోని మూడవకన్ను అవుతుంది!

కింద అణిచివేయబడుతున్న భూతాన్ని తమిళంలో ముయలకన్ అనీ సంస్కృతంలో అపస్మార భూతం అంటారు.అజ్ఞానం,అహంకారం,తామసం అనే నకారాత్మక భావాలకి సంకేతం.వీటిని అణిచివెయ్యటానికే ఈ తాండవం మొదలైంది,అది పూర్తయ్యేవరకు నర్తన జరుగుతూ ఉంటుంది విశ్వంలో, జరుగుతూనే ఉండాలి హృదయంలో!

పెదాలు విడివడీ విడివడకుందా ఉన్న ముఖంలోని లాస్యం ఎంత కోలాహల నృత్యకేళిలోనూ ఉద్విగ్నతకి లోనుకాని స్థితప్రజ్ఞత వల్ల వచ్చే ప్రశాంతచిత్తతని సూచిస్తుంది.అంతటి గహనమైన నృత్యాన్ని చేస్తూ కూడా పరమశివుడు ఏమాత్రం ఉద్విగ్నతకి లోనుకాకుండా ఉంటే చిన్న చిన్న విజయాలకి మనం పొంగిపోవదం దేనికి?

ఎంతోమంది పండితులు దర్శించి,పరవశించి,శోధించి తెలుసుకున్న నటరాజ భంగిమ యొక్క అంతరార్ధం ఇది.అర్ధం తెలియకపోయినా చూడగానే పరవశింపజేసే ఆ సౌందర్యం గురించి ఎంత తెలుసుకున్నా తనివి తీరదు.అయినా తెలియక ముందుకన్న తెలిశాక మరింత ఆనందం కలుగుతుంది కదా!

French sculptor August Rodin brought global attention to a Chola Nataraja bronze from Government Museum, Chennai, with 'La Danse de Siva' (1913), describing it as 'une chose divinement reglée' (a divinely ordered thing). The geologist-turned-art historian Ananda Coomaraswamy, wrote of Nataraja as representing 'poetry, but nonetheless science' in The Dance of Siva (1924). Interestingly, they almost poetically echo the lover-beloved sentiment of the devotional Tamil Bhakti hymns: Rodin compares the grace of Nataraja to the Medici Venus, Coomaraswamy to the 'dancing Eros Protogonos of Lucian.

ప్రాచీన భారతీయ విజ్ఞానశాస్త్రం యొక్క విస్తృతిని దశదిశలకు వ్యాపింపజేసిన ఈ ఆలయానికి ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే నటరాజస్వామిని దర్శించి బయటకు వచ్చి వెనుతిరిగిచూస్తే ఆలయ గోపురం మన వెనుకనే అనుసరించి వస్తున్న అనుభూతి కలుగుతుంది.

శివోహం భవ శివోహం!!

Wednesday, 6 June 2018

కుతుబ్ మీనార్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవ్వరు?కూలీల లిస్టు సరేనయ్యా, కట్టిన కాంట్రాక్టరుకి యెంత కిట్టింది!

          గతితార్కికచారిత్రకభౌతికవాదం అని సిద్ధాంతం పేరులోనే చరిత్రని పెట్టుకుని చరిత్రని సరయిన పద్ధతిలో అర్ధం చేసుకుని సరయిన దిశవైపు ప్రజలని నడిపించటమే మా లక్ష్యం అని చెప్పుకుంటూనే భారతీయ మార్క్సిస్టు చరిత్రకారులు ఈ దేశచరిత్రకి ఎక్కించిన అబద్ధాల్ని చూస్తుంటే కోపం కన్న ఆసహ్యమే ఎక్కువ వస్తుంది నాకు!స్వతంత్రం రాకముందు చరిత్రని రాసిన ఇంగ్లీషువాళ్ళు ఈ దేశచరిత్రని అబద్ధాలు చెప్పి బ్రష్టు పట్టించడాన్ని సులువుగానే అర్ధం చేసుకోవచ్చు - ఇది వాళ్ళకి స్వదేశం కాదు గాబట్టి తెలియక కొంత అమాయకత్వంతొనూ తెలిసి కొంత నిర్లక్ష్యంతోనూ తప్పులు రాయడం సహజమే! వాళ్ళ స్వదేశపు చరిత్రని వాళ్ళు నిక్కచ్చిగానే రాసుకున్నారు.కానీ ఈ దేశస్థులైన రొమిల్లా ధాపర్ లాంటివాళ్ళు తమ స్వదేశపు చరిత్రని భ్రష్టు పట్టించడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి?

          క్రిస్టియన్లు దేవుడి రాజ్యం పేరుతో తమని తాము దేవుని యొక్క బిడ్డడు పెంచిన గొర్రెల బుట్టలో వేసేసుకుని తమకు భిన్నమైనవాళ్లని పాపుల కింద తీర్మానించి వాళ్ళని ఉద్ధరించే బాధ్యతని భుజాల మీద వేసుకున్నట్టుగానూ ముస్లిములు ప్రవక్త రాజ్యం పేరుతో తమని తాము అల్లాహ్ పంపిన ఆఖరి ప్రవక్త యొక్క వారసుల ఖాతాలో వేసేసుకుని తమకు భిన్నమైనవాళ్ళని కాఫిర్ల కింద తీర్మానించి వాళ్ళని నిర్మూలించే కర్తవ్యాన్ని భుజాల మీద వేసుకున్నట్టుగానూ హిందువులని కమ్యునిష్టేతరుల కింద తీర్మానించేసి ఇంగ్లీషువాళ్ళని అనుకరిస్తూ వీళ్ళ చరిత్రని భ్రష్టు పట్టించడం వల్లనే మన సిద్ధాంతాన్ని వీళ్ళకి ఎక్కించగలం అనుకుని తెలిసే చేశారు తప్ప వీళ్ళలో ఎవరూ తాము ఏం చేస్తున్నామో తెలియక చేసిన అమాయకులు ఎవరూ లేరు.ప్రజలకి మేలు చెయ్యడం కోసం ప్రజల మీద న్యాయమైన అధికారం కోరుకున్నవాడు ఎవ్వడూ యే ప్రజలకి తాము మేలు చెయ్యాలనుకున్నాడో ఆ ప్రజలకే అబద్ధాలు చెప్పడు!మరి,కాంగ్రెసు ప్రోత్సాహంతో కమ్యునిష్టు చరిత్రకారులు తమ మాతృదేశపు చరిత్ర విషయంలోనే అన్ని అబద్ధాలు ఎందుకు చెప్పారు?

          అసలు నాకు ఒకటే ఆశ్చర్యం - "ఈరోజు మనం చెబుతున్నవి రేపు అబద్ధాలు అని రుజువైతే ఏం చెయ్యాలి?మనం చెప్పినవి అబద్ధాలని తెలిసాక మనతో పాటు మనం గొప్పదని చెప్పుకుంటున్న సిద్ధాంతం పరువు కూడా పోతుందేమో!"  అనే అనుమానం గానేఎ భయం గానీ లేకుండా ఇన్ని దశాబ్దాల పాటు ఎట్లా బతకగలిగారు వీళ్ళు!వాళ్ళు ఎవరి చరిత్ర గురించి అబద్ధాలు చెప్తున్నారో వాళ్ళ గురించి "ఈ వెర్రివెధవలు మనం ఇవ్వాళ చెప్తున్న అబద్ధాల్ని ఎప్పటికీ తెలుసుకోలేరు!వాళ్ళకి నిజం తెలిసేటప్పటికి మనం ఇక్కడ వర్గరహితసమాజం/తైనాతీప్రభుత్వం స్థాపించేస్తాం కద!" అన్న ధీమా ఉంటే తప్ప అన్ని అబద్ధాలు చెప్పగలరా?

          కుతుబ్ మినార్ అనే ఒక హిందూ ఆలయ సమూహాన్ని దాని నిర్మాణంతో ఏ సంబంధమూ లేని కుతుబుద్దీన్ అనే ముస్లిముకి అంటుగట్టడానికి అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెసువాళ్ళూ విశ్వవిద్యాలయాల చరిత్ర విభాగాలలో పాతుకుపోయిన కమ్యూనిష్టులూ ఎన్ని తలతిక్క పనులు చేశారో తల్చుకుంటే వాళ్ళ మీద జాలి కూడా వేస్తున్నది నాకు!ఎందుకంటే, ఒంటిమీదకి  అరవై డెబ్భయ్యేళ్ళ వయస్సును తెచ్చుకుని యూనివర్సిటీ హిస్టరీ ప్రొఫెసర్ల హోదాలో వీళ్ళు చెప్పిన అబద్ధాల్ని కనిపెట్టటానికి మనం ప్రత్యేకించి ఏ పరిశోధనలూ చెయ్యాల్సిన పని లేదు - ఒక టీనేజరుకి ఉండే కామన్సెన్సు చాలు! 

          క్రీ.శ 1961లో విహారయాత్రకి వచ్చిన కాలేజి కుర్రాళ్ళు కొందరు ఒక అధికారికమైన దర్శకవ్యాఖ్యాత(Guide)ని మాట్లాడుకున్నారు - ఆయన ప్రభుత్వం వారు అచ్చోసి వదిలిన గైడే!పైన, ఆయనకి హిస్టరీలో ఎమ్మే డిగీ ఉంది కూడాను!అయితే ఆ కుర్రాళ్ళు అడిగిన బుల్లి బుల్లి ప్రశ్నలకి అతను చెప్పిన అతికీ అతకని జవాబులు వింటే బాపు గారి కార్టూనుల పుస్తకం చదివిన దానికన్న ఎక్కువ నవ్వుతారు.కాకపోతే ఒకటే తేదా,బాపు గారి పుస్తకం మీరు ఏకబిగిన చదవలేరు - మీకూ కామన్సెన్సు ఉందండోయ్, నేనెందుకిలా అంటున్నానో  మీకు తెలిసిపోయిందని నాకూ తెలిసిపోయిందోచ్! :-

Q. What was the purpose of building this ‘MINAR’ ?

A. Victory Tower.

Q. Whose victory over whom ?

A. Md. Ghori’s victory over Rai Pithaura (Prithvi Raj)

Q. Where ?

A. At Tarain near Panipat.

Q. Why is the Victory Tower at Delhi ?

A. Do not know.

          ఇంతటితో ఈ ఎమ్మే హిస్టరీ గైడు గారితో పాటూ ఇలాంటివాళ్ళని తయారు చేస్తున్న యూనివర్సిటీలకీ వాటిని అంత భీబత్సంగా నడుపుతున్న భారత ప్రభుత్వానికీ కూడా పరువు పోతుందని పసికట్టిన సందర్శకులలో ఉన్న ఒక విశ్వవిద్యాలయపు చరిత్రబోధకుడికి కంగారు పుట్టి ఆయన కల్పించుకుని జవాబు చెప్పాడు:
The Victory Tower was commenced by Ghori because Delhi became his capital.

Q. Objection, Sir! Ghori never had his capital at Delhi. His capital was at Ghazni. What logic is there in building the Victory Tower in Delhi ?

A. Silence.

Q. Even if the Minar was commenced by Ghori, its name ought to have been ‘GHORI MINAR’ and not ‘QUTB MINAR’. Why is it called ‘Qutb Minar’ ?

A. It was probably Qutubuddin Aibak, slave of Ghori, who laid the foundation of the minar for his master.

Q. If this is true, what made him choose Delhi as the site for the Victory Tower?

A. Delhi was the capital of Qutbuddin Aibak.

Q. It is said that the building of the Minar was commenced during the life time of Ghori. When Ghori was alive, the question of his slave’s capital being at Delhi does not arise. After the death of Ghori, Qutbuddin was crowned at Sultan at Lahore. He ruled from Lahore and not Delhi and ultimately died at Lahore. His capital was at Lahore! Why did he build the Victory Tower at Delhi ?

A. Silence.

Somebody from the audience asserted that the Minar was not a victory tower but a ‘Mazina’ (Muezzin’s Tower in mosque) attached to ‘Quwwat-ul-Islam Mosque’.

Q. The word ‘Quwwat-ul-Islam Mosque’ is unknown to contemporary history of India. This word was coined by Sir Saiyid Ahmad Khan in the first part of the nineteeth century. Do not be surprised to know that the name ‘QUTB MINAR’ too, is not known to Indian History. It is also a recent fabrication. If, for the sake of argument, we take it for granted that the minar is a muezzin’s tower, the mosque assumes primary importance and the tower secondary, but unfortunately the mosque, as you see it, is in complete ruins. How do you account for the mosque of primary importance to be in ruins and the muezzin’s tower, a building of no consequence, to be standing in full majesty ?

A. No Answer.


          అయ్యా, అదండీ మన చరిత్రకారుల కాకమ్మ కధల బండారం!తమ కళ్లముందు కనబడుతున్న భవనాలు తమకి చూపిస్తున్న సాక్ష్యాలని కూడా అర్ధం చేసుకోలేని వీళ్ళు రాముడి మూడో పెళ్ళాంతో లక్ష్మణుడు చేసిన రంకు గురించి మాత్రం గొప్ప గొప్ప విశ్లేషణలు చేస్తారు!వేంకటేశ్వర సుప్రభాతంలోనూ లలితాసహస్రనామాల్లోనూ ఉన్న బూతుని కనుక్కోగలిగినవాళ్ళకీ మహిషాసురమర్దినిని సెక్స్ వర్కర్ అనగలిగినవాళ్ళకీ కుతుబ్ మినార్ గురించిన నిజాలు చెప్పమంటే మాత్రం నోరు పెగలదు - చీ వీళ్ళ బతుకులు తగలెయ్య!

          కుతుబ్ మినార్ చూడటానికి పోయినసారి వెళ్ళినవాళ్ళు శ్రద్ధగా చూడక వదిలేస్తే మళ్ళీ వెళ్ళినప్పుడు శ్రద్ధగా చూడండి,కొత్తగా వెళ్ళబోయేవాళ్ళు అన్నిట్నీ పరిశీలనగా చూడండి - శిధిల స్తంభాల మీద జంతువుల బొమ్మలు కనిపిస్తాయి,అన్ని హిందూ ఆలయాలలఓనూ కనిపిస్తూ ఖురాను చిత్రించకూడదని నిషేధించిన జంతువుల బొమ్మలు అక్కడ ఎందుకు ఉన్నాయో ఆలోచించండి!

          ముస్లిం ప్రభువులు భవననిర్మాణంలో అరబిక్ శైలిని పరిచయం చేశారు,కొత్తదనాన్ని చూపించారు అని పొగిదే  బుడ్డిమంతులు అక్కద అరేబియాలో వీళ్ళు ఏ అపురూపమైన భవంతులు కట్టారో చెప్పరేమి?బాబరు గారు ఈ దిక్కుమాలిన హిండియాకి రాకమునుపు కట్టి వదలి వచ్చిన అపురూపమైన నిజనివాసం ఏది?జాడలు కనిపెట్టి పునర్నిర్మించి చూపించమనండి!ఎడారుల్లో గుడారాలు వేసుకుని ఒంటెల మీద దేశదిమ్మరుల్లా తిరిగినవాళ్ళు ఇక్కడికొచ్చేసరికి ఒక్కసారి ఇంతింత గొప్ప భవనాలు నిర్మించగలగడం సాధ్యమా?అక్కడినుంచి ఎంతమంది శిల్పుల్ని తమవెంట తెచ్చుకున్నారు?ఎప్పుడు ఇక్కడి శిల్పుల్ని అక్కడికి పంపించి మెళకువలు నేర్పించారు?

          కొత్త నిర్మాణం చెయ్యాలంటే తెలివీ ఓపికా కావాలి, వాళ్ళకి ఆ రెండింటిలో యేదీ లేదు.ప్లాను గియ్యడం,సామగ్రిని సిద్ధం చేసుకోవడం,రాళ్ళని తొలచడం,నునుపు కోసం నగిషీల కోసం బోల్డుమంది మనుషులూ బోల్డంత సమయమూ ఖర్చు చెయ్యడం ఆవసరమా హిందువుల పుణ్యాన అన్నీ తేరగా దొరుకుతుంటే?ఉన్నదాన్ని కూల్చేసి ఆ స్తంభాలతోనూ ఇటుకల్తోనూ పాత రూపం మాత్రం కనపడకుండా కట్టమంటే మన  శిల్పులు కట్టినవే తప్ప కుతుబ్ మినార్ సముదాయంలో ముస్లిముల పూర్తి సొంత నిర్మాణం ఒక్కటి కూడా లేదు!

          కుతుబుద్దీన్ ఐబక్ కుతుబ్ మినార్ కట్టాడనటం దేశంలోని అన్ని నగరాల్లోనూ మహత్మా గాంధీ రోడ్ అని  పేర్లు పెట్టీనవన్నీ మోహన్ దాస్ కరంచంద్ గాంధీ కట్టాడనటం లాంటిదే!అసలు వీళ్ళంతా ఏవరికి నిర్మాణబాధ్యతని అంటగట్టారో వాడికే ఇది నేను కట్టానని చెప్పుకోవటానికి ముఖం చెల్లలేదు - ఆ యావ కూడా చూపిచ్చలేదు!అసలు జరిగింది యేంటయ్యా అంటే, అప్పటివరకు బతికిన బతుక్కి దీన్ని చూసి నోరెళ్ళబెట్తి పక్కోణ్ని యేంట్రా ఇది అని అడిగాడు. వాడు మిడిమిడి గ్నానంతో గ్రహవేధశాలకి హిందీలో ఉన్నదాన్ని అరబిక్కు లోకి తర్జుమా చేసి చెబితే అది "Qutub Minar" అయ్యింది.హిందీ నుంచి అరబిక్ లోకీ మళ్ళీ అరబిక్ నుంచి ఉర్దూ లోకీ మార్చగా మార్చగా ఆ పదం ఖర్మ అట్లా కాలింది!మరీ ఇసిత్రం, మొత్తం భవనాలని పునాదులతో నిర్మించిన ఖ్యాతిని ఎవడికి కట్టబెట్టారో ఆ ఘనుదే ఈ మినారు చుట్టూ ఉన్న 27 ఆలయాల్ని కూల్చేశానని చెప్పుకున్నాడు గానీ ఒక్క దాన్ని కూడా కట్టానని చెప్పుకోలేదు!అసలు మనిషి మాటల్ని కూడా పట్టించుకోకుండా ముస్లిములు కూల్చిపారేసిన ఒక హిందూ దేవాలయ సముదాయాన్ని ముస్లిం ప్రభువుల నూతన నిర్మాణం కింద ముస్లింలు కూడా ఒప్పుకోలేనంత బలంగా రుద్దేసిన మన చరిత్రకారుల్నీ వాళ్లు రాసిన అబద్ధాల్ని పిల్లలకి ఈ దేశపు నిజమైన చరిత్ర కింద చెప్పిన ప్రభుత్వాధికారుల్నీ వాళ్ళని అలా చెయ్యమని పురమాయించిన శాసనాధికారం గలిగిన రాజకీయనాయకుల్నీ ఎన్నిసార్లు ఉరి తీస్తే సరిపోతుంది?

          క్రీ.1852లో ఈ కుతుబ్ మినార్ అనేది  ఎట్టి పరిస్థితుల్లోనూ ముస్లిం కట్టినది కావడానికి వీల్లేదనీ హిందూ కట్టడమేననీ Syed Ahmed Khan అనే Muslim archeologist తేల్చి చెప్పాడు.చూసీ చూడగానే ఖురాను సూక్తులతో నిండిన ఈ కట్టడం ముస్లిముల నిర్మాణం అని భ్రమ గొల్పుతుంది గానీ పట్టి పట్టి చూస్తే హిందువులు భవనాల నిర్మాణంలో ఉపయోగించే అలంకారాలు ఎన్నో కనిపిస్తాయి.వీటిలో కొన్ని ఈ ముస్లిములు ఎక్కడినుంచి వచ్చారో అక్కడి నిర్మాణాలలో కనపడనివీ కొన్ని ఇస్లాం నిషేధించినవీ ఉన్నాయి.వాళ్ళు శిధిలం చేసినవీ శిధిలం చెయ్యలేక రూపం మార్చినవీ అయిన అన్ని భవనాల గోడల మీద గంటలు కనపడుతున్నాయి.పోనీ ఈ డిజైను నచ్చేసి స్థానిక పనివాళ్ళని పురమాయించారని అనుకోవడానికి వీల్లేదు - సాక్షాత్తూ వీళ్ళ కాపీ/పేస్ట్/జంబుల్/రీనేమ్ కళాప్రవీణుడైన ముహమ్మద ప్రవక్త గారే The bell is one of the musical instruments of Satan. అనేశాడు,ఇంక ఏ ముస్లిం గంటల డిజైను చెక్కించే ధైర్యం చేస్తాడు?

          ఇక హిందువులు ఆలయాలలోనే కాదు ఇళ్ళలో కూడా చిరుగంటల్ని అలంకరించుకుని వాటి శబ్దాల్ని వినడానికి ఇష్టపడతారు!పనిగట్టుకుని హిందువులని వెర్రివెధవల్ని చేస్తూ ముస్లిములకి భుజకీర్తులు తొడుగుతూ ఆనందించాలనే శాడిస్టు మనస్తత్వం ఉంటే తప్ప నిష్పాక్షిక దృష్టితో పరిశీలించిన ప్రతి ఒక్కడికీ హిందువుల నిర్మాణంలో ఇస్లామిక్ చిహ్నాల్ని ఇరికించిన బలవంతపు రుద్దుడు కార్యక్రమం ఫలితమే కుతుబ్ మినార్ అని తెలుస్తుంది.అరబిక్ భాషలో మంచి పట్టున్న సయ్యద్ మహాశయుదే అక్కడ కనిపిస్తున్న అరబిక్ అక్షరాల కూర్పు అర్ధం పర్ధం లేనిదని చెబుతున్నాడు-అంటే, లొడలొడబుడబుడగుడగుడ తెలుగు లాంటి అరబిక్ అది - ఇది ముస్లిముల కట్టదం అని చెప్పటానికి అరబిక్ అక్షరాల్ని పేర్చారు, అంతే!.

          మరీ ముఖ్యమైనది,ఒకచోట ముస్లిముల గుమ్మటాన్ని సగం చెక్కి వదిలేసినట్టున్న ఈ నిర్మాణాన్ని చూడండి!పైన కనపడుతున్న గుమ్మటం చూడగానే ఇది ముస్లిములు కట్టినదే అనిపిస్తుంది,కానీ స్తంభాలు మాత్రం హిందువుల ఆలయాలలో కనబడే స్తంభాల మాదిరి ఉన్నాయి!
          అసలు మొత్తం నిర్మాణాన్ని కూల్చి కట్టడానికి తగిన సహనం,సమయం అప్పటివారికి లేకపోవడం వల్లనే ఇప్పటివారికి ఇన్ని సాక్ష్యాలు దొరుకుతున్నాయి.ఇదే భవన సముదాయంలో వారు కట్టారని చెబుతున్న దేశంలోకల్లా తొలి మసీదుకీ రూపమార్పిడి అనే పునర్నిర్మాణం చెయ్యకుండా వదిలేసిన కట్టడానికీ ఉన్న పోలికల్ని చూడాలంటే వాటిని పక్కపక్కన పెట్టి చూస్తే చాలు!
          కుడివైపున ఉన్నదానిని కూడా గుమ్మటం పూర్తి చేసి స్తంభాల్ని చెక్కేసి ప్రతిమలని ముక్కులూ చేతులూ కాళ్ళూ పగలగొట్టి వికారం చేస్తే ఇది కూడా ఇస్లామిక్ కట్టడం అయ్యి ఉండేది కాదూ!ఈ శిధిలాలయపు కుడ్యం పైన గణపతి విగ్రహం తొలచబడి ఉంది - ఉస్లిముల ఆధ్యాత్మిక సాహిత్యంలోకి గణపతి ఎప్పుడు వెళ్ళాడు?అంతకన్న దారుణం, గొడల మీద రామాయణ విశేషాలు చెక్కి ఉన్నాయి - దైవం,ఋషులు,మానవమూర్తుల్ని శిల్పాల రూపంలో చెక్కడం ఇస్లాములో పరమ ఘోరమైన నీచకార్యం కదా!ఇక ఇప్పుడు తొలి మసీదు అనుకుంటున్న భవనం లోపలికి వెళ్ళి పైకి చూస్తే హిందూ ఆలయాల పైకప్పులో కనిపించే వృత్తాలూ త్రికోణాలూ పుష్పదళాలూ కనిపిస్తాయి!

          సయ్యద్ మహాశయుడు నొక్కి వక్కాణించినదాన్ని బట్టీ మన కళ్ళతో చూసి అర్ధం చేసుకున్నదాన్ని బట్టీ ఈ మినార్ చుట్టూ ఉన్న ఏ ఒక్క నిర్మానమూ కుతుబుద్దీన్ ఐబక్ కట్టినవి కాదనీ అంతకు పూర్వం ఉన్న హిందూ కట్టడాలనే తక్కువ ఖర్చుతో తక్కువ కాలంలో రూపమార్పిడి చేసిన వికృత మనస్తత్వమే తప్ప వీటిలో ముస్లిములు రూపుదిద్దిన అరబిక్ శైలి యొక్క సృజనాత్మకత యేమీ లేదని తెలుస్తున్నది కద!


          అసలు ఈ భవన సముదాయానికీ ముస్లిములకీ ఏ సంబంధమూ లేదని చెప్పడానికి ఆవరణ లోని ప్రతి శిధిలమూ సాక్ష్యం చెబుతున్నప్పటికీ ప్రముఖమైన రెండు సాక్ష్యాలు ఈ స్తంభమూ దీనికి దగ్గిరలోనే ఉన్న తుప్పు పట్టని ఇనుప స్తంభమూ - ఇవి రెండూ ఇక్కడ ఎందుకు ఉన్నాయి అనే ప్రశ్నకి ఇది ముస్లిముల నిర్మాణం అని వాదిస్తున్నవారిలో ఎవరూ సరయిన జవాబు చెప్పలేకపోతున్నారు.ఆ గంభీరమైన విశ్లేషణలోకి వెళ్ళబోయేముందు దీనిని ముస్లిములకి దఖలు పర్చడానికి చెప్పిన కొన్ని హాస్యరసగుళికల్ని తెలుసుకుని నవ్వుకుని తరించుదాం!
          ఒక మేధావి"అసలీ మినారు ఎందుక్కట్టారంటేనండీ!ముస్లిముల్ని నమాజుకి పిల్వడానికి మువజ్జిను గారు యెక్కడానికి కట్టారండీ!" అని తను యెక్కి చూసి పిలిచి తెలుసుకున్నట్టు వాగాడు.నిజంగా రోజుకి 5 సార్లు ఈ స్తంభం పైవరకు యెక్కి దిగాలంటే రోజుకో మువజ్జిను కరుసౌతాడు:-)పైకి ఎక్కడానికీ దిగడానికీ అక్షరాల 45 నిముషాలు పడుతుంది మరి!మరో మేధావి "అబ్బే!ఇది మా కుతుబుద్దీన్ గారు ఒక్కడే కట్టించాడని మేమూ అనలేము.కాపోతే ఆయన మొదటి అంతస్థు కడితే ఒక్కో తరంలో ఒక్కోటి కట్టుకుంటూ పూర్తి చేసి ఉండొచ్చు!" అని మధ్యేమార్గపు ప్రతిపాదన చేశాడు.ఇది మరీ భవననిర్మాణం గురించి ఓ అంటే ఢం తెలియని వాడు మాత్రమే కుయ్యగలిగిన పోరంబోకు మాట!ఎందుకంటే, మొదటి తరంలో కట్టడం మొదలుపెట్టినవాడికి మొత్తం కట్టాలనే ఉద్దేశం లేకపోతే మొత్తం నిర్మాణాన్ని భరించడానికి తగిన పునాది వెయ్యడు!అతను ఒక్క అంతష్థుకి మాత్రమే పునాది వేసి ఉంటే తర్వాత వాళ్ళు దానిమీద కడుతూ పోతే అది కుంగిపోతుందే తప్ప ఇన్ని శతాబ్దాల పాటు నిలబడదు!ఈ కుతుబ్ మీనారు ఏ వ్యక్తి యొక్క విజయచిహ్నం అని చెబుతున్నారో ఆవ్యక్తియే అంత మామూలు కట్టడమైన  మసీదును ఏర్పరచినట్టు ఫలకం చెక్కించుకుని ఇంత అద్భుతమైన కట్టడాన్ని నిర్మించిన ఖ్యాతిని దక్కించుకోవడానికి ఒక్క ఆధారమూ ఎందుకు చూపించుకోలేదు?మరీ వింత వాదన యేమిటంటే, మిగిలినవి హిందువులు నిర్మించిన ఆలయాలు అయి ఉండవచ్చును గానీ ఈ స్తంభం మాత్రం కుతుబుద్దీన్ కట్టించాడని!అంటే ఏమిటి?ఎప్పుడో ఈ ఆలయ సముదాయాన్ని నిర్మించిన హిందువులు ముందెప్పుడో కుతుబుద్దీన్ ఐబక్ వచ్చి ఒక విజయస్తంభం కట్టుకునే ఖాళీని మాత్రం ఉంచి కట్టారా?ఏం తెలివి!ఏం తెలివి!

          అసలు దీనిని Qutb-Minar అని పిలవడమే క్రీ.శ 1800 తర్వాత నుంచే మొదలైంది,అంతకు ముందర జరిగిన యే చారిత్రక సాహిత్యంలోనూ ఈ పేరు కనబడటం లేదు. అరబిక్ భాషలో 'Qutub' అంటే ‘axis’/‘pivot’/‘pole’ అని అర్ధం!మొదట ఈ పేరుని సుల్తానుకు చెప్పినవాళ్ళు సరిగ్గానే చెప్పారు astronomical Tower అని, అప్పటి అధికారికమైన ఉత్తర ప్రత్యుత్తరాలలో కూడా అదే అర్ధంతో వాడారు.తర్వాత దీనికీ కుతుబుద్దీనుకీ సంబంధం కలపాల్సిన అవసరం కోసం ఆధునిక కాలంలోని అధికార వ్యామోహ పీడితులైన ప్రభుత్వాధినేతలూ హిందూవ్యతిరేక భావజాలపు చరిత్రకారులూ ఈ నామసారూప్యాన్ని తమ వాదనకు అనుకూలంగా వాడేసుకున్నారు - అదీ సంగతి, ఎవరూ పుట్టించకుండా చరిత్ర ఎట్లా పుడుతుందిస్మీ!

          కుతుబ్ మినార్ అసలు పేరు ధృవస్తంభం,ధృవుడికి ధృవత్వాన్ని ప్రసాదించిన విషువు కీర్తిని వ్యాపింపజేసేది కాబట్టి విష్ణుధ్వజం అని కూడా పిలుస్తారు.ఈ స్తంబమూ భవన సముదాయమూ ఉన్న ప్రాంతం పేరు మెహ్రౌలి - అది మిహిరవలి అనే సంస్కృత పదానికి ప్రాకృత రూపం.క్రీ.శ 5వ శతాబ్దికి చెందిన చంద్రగుప్త విక్రమాదిత్యుని ఆస్థానంలోని నవరత్నాలలో ఒకడైన వరాహ మిహిరాచార్యుడు ఖగోళ పరిశోధనల కోసం ఇక్కడ నివసించడం వల్ల ఈ ప్రాంతానికి  ఆ పేరు వచ్చింది!
          కుతుబుద్దీన్ తను 27  హిందూ ఆలయాల్ని కూలగొట్టానని మాత్రమే చెప్పుకున్నాడు గానీ దేన్నీ కట్టానని చెప్పుకోలేదు.ఆ 27 అనేది ఆర్యరుషులు కాలగణనం కోసం సిద్ధాంతీకరించిన 27 నక్సత్ర మండలాలకు సంకేతం.ఒక్కొక్క నక్షత్రరాశికి ఒక్కొక్క ఆలయాన్ని వాటి అధిదేవతామూర్తులతో సహా సపేక్షమైన స్థానలను నిర్దేశించుకుని నిర్మించి ఉంటారు.ఈ ధృవస్తంభం పైనుంచి చూస్తే 24 దళాల విప్పారిన పద్మంలా కనిపిస్తుంది.

          ఒక్కొక్క దళమూ ఒక్కొక్క గంటకు సూచన.స్తంభం ఏడు అంతస్థులూ వారానికి ఉన్న ఏడు రోజులకి సంకేతం.ఇప్పుడు ఆరవ ఆంతస్థు స్తంభం మీద లేదు - ఈ ఆవరణలోనే మరొక చోట నిలబడి ఉంది బోన్సాయ్ చెట్టులా!కుతుబుద్దీన్ ఐబక్ తను కట్టిన విజయస్తంభంలో ఆరవ అంతస్థుని తనే కూల్చుకున్నాడు కాబోలు!ఏడవ భాగంలో చతుర్ముఖ బ్రహ్మ విగ్రహం ఉంది - ముస్లిములు కట్టిన కట్టడంలోకి హిందువుల బ్రహ్మదేవుడు ఎట్లా వచ్చాడు?

          ఎటువైపు నుంచి ఎటువైపుకి తిప్పి చూసినా ఈ స్తంభమూ ఆలయ సముదాయమూ ముందొకటీ తర్వాతొకటీ కట్టినవి కావనీ  మొదట కట్టేనాడు గీసుకున్న ప్లానులో అన్నీ ఉన్నాయని తెలుస్తున్నది.అసలు వీటితో ఏ సంబంధమూ లేదనిపించే తుప్పు పట్టని ఇనుప స్తంభం ఈ ధృవస్తంభం గురించి చాలా విషయాలు చెప్తూ తన గురించి మాత్రం చెప్పుకోలేదు - ఎందుకనో!బ్రాహ్మీ లిపిలో సంస్కృత భాషలో రచించబడిన అక్కడున్న శాసనఫలకం మీద గల వివరాల ప్రకారం విష్ణుపాదగిరి అనే పర్వతం మీద శయనభంగిమలో ఉన్న శ్రీమహావిష్ణువు యొక్క ప్రధాన ఆలయం గురించి చెబుతున్నది గానీ 27 మంటపాల్తో కూడిన గ్రహవేధశాల  గురించి చెప్పడం లేదు.ప్రస్తుతం శయన భంగిమలో విష్ణువు కౌలువు దీరిన ఆలయాలు అన్నీ దక్షిణాదిలోనే ఉన్నాయి.ఇది ఇది క్షేమంగా ఉండి ఉంటే ఉత్తర భారతపు శ్రీరంగం వలె ఖ్యాతిని గడించేది!

          స్తంభాలు నిలబెట్టడం భవనాలని నిర్మించదం ఇటుకలూ రాళ్ళూ సున్నమూ గిన్నమూ డబ్బూ దన్నూ శిల్పులూ పనివాళ్ళూ ఉంటే ఎవరయినా చెయ్యవచ్చు గనక మిగిలిన వాటిని ముస్లిములకి దఖలు పర్చేశారు గానీ ఈ తుప్పు పట్టని ఇనుప స్తంభాన్ని ఎట్లా అంటు కట్టగలరు?కాపీ/పేస్టు/జంబుల్/రీనేమ్ కళాప్రవీణుడైన ముహమ్మద్ ప్రవక్త గారు తల్లి గర్భంలో రెండేళ్ళు ముసుగుదన్ని పడుక్కోవటం లాంటి అసంగతాలని సుసంగతాలు చెయ్యడానికి పనికొచ్చిన ఇస్లామిక్ సైన్సులో ఇలాంటివి లేవేమిటి!కానీ ప్రాచీన భారతీయుల లోహవిజ్ఞానశాస్త్రంలో వజ్రసంఘాత అనే మిశ్రలోహాన్ని తయారు చేసే ఒక ప్రక్రియ గ్రురించిన ప్రస్తావన  ఉన్నది - ఆ ప్రక్రియని గురించి పరిశోధించి ఆ విధానం పాటించితే ఇప్పుడు కూడా తుప్పు పట్టని ఇనుప స్తంభాన్ని నిర్మించవచ్చును!

          బహుశా ఈ ఇనుప స్తంభాన్ని వర్షాకాలంలో అంత ఎత్తున ఉన్న ధృవస్తంభం మీద ఉండి పరిశోధనలు చేస్తున్నప్పుడు విద్యుదాఘాతానికి లోను కాకుండా నిర్మించి ఉండాలి - అంతకు మించి ఈ ఇనుప స్తంభం ఇక్కడ ఉండటానికి మరొక కారణం నాకు కనపడటం లేదు!అన్నట్టు కుతుబ్ మినార్ పేరు ధృవస్తంభం అయితే దీని పేరు గరుడస్తంభం - ఈ పేరు కూడా దీని ప్రయోజనమైన రక్షణ గురించి తెలియజేస్తున్నది.

          ఈ గరుడస్తంభం దగ్గిర ఉన్న శాసనం కట్టిన కాలం గురించి మనం చెపుకుంటున్నట్టు క్రీ.శ 312 అని గానీ క్రీ,పూ 312 అని గానీ చెప్పడం లేదు.దీనిని నిర్మిణిన ప్రబువు పేరుని చంద్ర అని మాత్రమే వ్యవహరిస్తున్నది.అయితే,అతని రాజ్యవిస్తృతిని గురించి ఇప్పటి భారతదేశం మొత్తాన్నీ జయించటంతో పాటు దక్షిణ తీరపు సముద్రాన్ని కూడా జయించాడని చెప్తున్నది.ఆధునిక చరిత్రకారులు వాస్తవవ్యక్తులని ఒప్పుకున్న ఇద్దరు చంద్రులకీ ఈ వర్ణన సరిపోవటం లేదు.ఎందుకంటే, Chandra Gupta Vikramaditya (State period 380-414 AD)  గానీ   Chandragupta Maurya (reign: 321–297 BCE) గానీ దేశపు కొసని తాకనే లేదు - ఒక రాజు తను జయించని ప్రాంతాన్ని జయించినట్టు ప్రకటించుకుని బహిరంగ ప్రకటన చేస్తే సమకాలికులు అభ్యంతరం వ్యక్తం చెయ్యకుండా ఉండలేరు కదా!

          శాసనంలో పేర్కొనబడిన చంద్ర నామధేయుడైన ప్రభువును గురించిన మరొక ముఖ్యమైన విషయాన్ని అసలు పట్టించుకోనే లేదు. ఆ భాగం ఇది:"He(Chandra) as if wearied, has abondoned this world, and restored in actual form to the other world - a place won by the merit of his deeds - (and thought) he ha departed,he remains on earth through the memory of the fame(keerti)."కాల్పనిక వ్యక్తి కాదు,వాస్తవ వ్యక్తియే అని గనక ఒప్పుకుంటే ఈ మొత్తం వివరాలు త్రేతాయుగం నాడు అయోధ్యను పరిపాలించిన శ్రీరామచంద్రునికి మాత్రమే సరిపోతాయి - బూమి మీద అన్ని ప్రాంతాలనీ ఇక్ష్వాకులు జయించారు,శ్రీరాముడు సమౌద్రం దాటి శ్రీలంకని జయించాడు,పిండోదకాలు స్వీకరించే మర్త్యులకు సహజమైన మృత్యువుని అనుభవించకుండా సశరీరుడై కైవల్యం చేరాడు - వాల్మీకి సరయూ నదీ ప్రవేశం ద్వారా వైకుంఠం చేరాడని చెబితే పద్మపురాణం దివ్యవిమానం ఎక్కి పరలోకాన్ని చేరుకున్నట్టు చెబుతున్నది!

extended kingdom of chandragupta maurya 
extended kindom of chandragupta vikrama

          మెహ్రౌలి పేరు వల్ల వరాహమిహిరుడు అక్కడ నివాసం ఏర్పరచుకుని పరిశోధనలు చేసినట్టు తెలుస్తున్నది గానీ అప్పటి చంద్రగుప్తుడు నిర్మించిన వివరాలు కనపడటం లేదు - శాసనంలోని వివరాలు అతనికి సరిపోవటమే లేదు. బైబిలులో సృష్టి జరిగిందని చెబుతున్న కాలానికి ముందరి వ్యక్తులని చారిత్రక వ్యక్తులుగా గుర్తించని అహంకారం ఆంగ్లేయులది అయితే మరి వాళ్ళు రాసిన చరిత్రనే పరమసత్యం అని నమ్మి ఇతర్లకి చెబుతున్న భారతీయ మేధావులది బానిసత్వం కాదూ!


          ఆర్కియాలజిస్టులూ హిస్టోరియన్లూ ఇక్కడ ఈ స్తంభం ఎందుకు కట్టారో తెలియక అడిగితే తడుముకోకుండా "వూరికే అలంకరణ కోసం అలా నిలబెట్టారు, అంతే!" అని తేల్చి చెప్పేశారు గానీ ఏ కాలంలో కట్టినప్పటికీ కారణం లేని కట్టడాల్ని కట్టడానికి అంత దబ్బు ఎవడూ తగలెయ్యడు గదా!మీదుమిక్కిలి ప్రాచీన కాలపు ప్రతి నిర్మాణంలోనూ ఒక ప్రణాళికాబద్ధమైన నిర్మితీ ప్రతి చిన్న శిల్పం వెనకనూ ఎంతో అంతరార్ధమూ ఉండటం గమనించవచ్చునే!అడిగిన వాడికి సరైన జవాబు చెప్పాలంటే మొదట చరిత్రకారుడు తనకు తనే సరైన ప్రశ్న వేసుకోవాలి,జవాబు సరైనదని తేల్చుకెవటానికి తన పార్టీకి సంబంధించిన ఎజెండాని జనం మీద రుద్దాలనే కక్కుర్తి కాక సత్యం పట్ల నిబద్ధత కావాలి - ఆ రెండూ లేనివాళ్లు చరిత్ర రచన చెయ్యడం వల్లనే దోపిడీ దారులు ధర్మప్రభువులుగా చలామణీ అవుతున్నారు!

          ఇక్కడున్న సంపదను కొల్లగొట్టటానికి వచ్చినవాళ్ళకి ఇక్కడి సంస్కృతి మీద గౌరవం లేకపోవటం సహజమే,తమ మతాన్ని అంగీకరించనివాళ్ళకి కాఫిర్లని పేరుపెట్తి వాళ్లతోర్ యుద్ధం చేసి చంపెయ్యమనీ ఒక ప్రాంతం ముస్లిముల అధీనం లోకి వచ్చాక అంతకు ముందు సాతాను మాయలో పడినవాళ్లు కట్టిన కట్టడాల్ని నిర్మూఇంచమనీ ఆ మతగ్రంధంలోనే ఉంది గాబట్టి కుతుబుద్దీన్ చేసిన దానిని కూడా మతనిష్ఠ కింద సమర్ధించవచ్చు, కానీ ఒక ముస్లిం మేధావియే అన్ని సాక్ష్యాధారాలను చూపించి ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ముస్లిం కట్టడం కావడానికి వీల్లేదని తేల్చి చెప్పిన తర్వాత కూడా ఒక హిందూ ఆలయ సముదాయాన్ని కూల్చినవాళకి దానిని విజయస్తంభం పేరున దఖలు పర్చటానికి నడుం బిగించి ఇన్ని అబద్ధాలతో చరిత్రని నిర్మించినవాళ్లని ఎలా సమర్ధించాలి?ఇవ్వాళ కుతుబుద్దీన్ తను కట్టానని ప్రకటించుకున్న Quwwat-ul-Islam యొక్క entrance Minaret తూర్పు వైపుకు బదులు ఉత్తరం వైపుకు ఎందుకు ఉన్నది?మెడమీద తలకాయ ఉన్న ముస్లిం ఎవడూ ప్లాను గీసి మసీదు కట్టాలనుకుంటే అలా కట్టడు - అది అంతకు ముందు ఉన్న హిందూ నిర్మాణానికి గుమ్మటం అతికించీ స్తంభాల్ని బోడి చేసీ గోడల మీద బొమ్మల్ని పీకి అరబిక్ అక్షరాలు ఇరికించీ పిచ్చిజనం ముఖాన పడేసిన మసీదు అది!విదేశీయుల మీద పోరాడి స్వతంత్రం తెచ్చిన దేశభక్తాగ్రేసరులు ఈ దేశపు చరిత్రకి విదేశీయుల కన్న ఎక్కువ ద్రోహం ఎందుకు చేశారు?

          240 అడుగుల ఎత్తు ఉండి ఎక్కటానికీ దిగటానికీ 45 నిమిషాలు పట్టే స్తంభాన్ని ఆ పని రోజుకు 5 సార్లు చెయ్యాల్సిన మువజ్జిను టవరు అని చెప్పినవాడు చరిత్రకారుడా?అంత పెద్ద స్తంభాన్ని నిర్మించటానికి పునాదులు తవ్వడం గురించిన పరిజ్ఞానం కూదా లేకుండా ఒక్కొక్కడూ ఒక్కో తరంలో ఒక్కో అంతస్థు కట్టాడని తీర్మానించినవాడు ఆర్కియాలజిస్టా?"ఏది నిజం?ఏది అబద్ధం?" అని అడుగుతున్నవాళ్ళని "హిందూమతత్వవాదులు" అని ముద్ర వేస్తున్న సెక్యులరిష్టు మేధావులు నోటికి తింటున్నది అన్నమా?గడ్డియా?అశుద్ధమా?ఇవన్నీ అబద్ధాలని ప్రకటించి కుతుబ్ మినారుకి ధృవస్తంభం పేరుని ఖాయం చేసి నిజమైన చరిత్రని పాఠ్యపుస్తకాల్లోకి యెక్కించటానికి ఎంత సమయం కావాలి మీకు - సంవత్సరమా?దశాబ్దమా?శతాబ్దమా?సహస్రాబ్దమా?

          ఇనుప స్తంభం తుప్పు పట్టకపోవటానికి కారణమైన వజ్రసంఘాత గురించి చదవగానే నాకు ఎంత సంతోషం అనిపించిందో - ఆ ప్రక్రియని ఉపయోగించి ఇప్పుడు ప్రజలకి ఎంత మేలు చెయ్యవచ్చు!ఉక్కు కన్న ఇనుము చాలా చవక, కానీ ఎక్కువ కాలం మన్నదు.టెక్నాలజీని అందిపుచ్చుకోవటంలో మనకన్న ముందున్న చైనాలోనే ఎంతో ఘనంగా కట్టిన ఒక ఇనపవంతెన 80 యేళ్ళు గడవకముందే పనికిరాకుండా పోయింది!కానీ హిందువుల కట్టడాల్ని ముస్లిములకి దఖలు పర్చటానికి ఇంత కక్కుర్తిని చూపించేవాళ్ళకి అంత మంచి ఆలోచనలు వస్తాయా - మన పిచ్చి గానీ! 

          Every Hindu must Demand to know the real History of this country and It's culture!Every Hindus must reclaim all temples and monuments that were plundered, demolished, distorted and destroyed by foreign invaders.Indian Government must remove all forms of glorification of emperors, rulers, and invaders who were involved in rape, barbaric murder, brutality, perversion and merciless killings.All textbooks and official records must be re-edited and published to include the Hindu indigenous history, culture, tradition, claims and evidence over these ancient monuments.Government notices, plaques, guidebooks and maps must be amended to include Hindu evidence over these monuments, including those at tourist spots across India as well.

          హిందువులు మొదటిసారి శ్రీరాముడు నిర్మించిన విష్ణుపాదగిరి క్షేత్రాన్ని ధ్వంసం చేసి Quwwat-ul-Islam మసీదును కట్టిన విదేశీయుడైన కుతుబుద్దీన్ మోసానికి గురయ్యారు, రెండవసారి దేశపు సంపదని దోచుకుని హిందూ ఆలయాల్ని కూల్చినవాళ్లని విజేతలుగా కీర్తించిన స్వదేశీయులైన కాంగ్రెసువాళ్ళ మోసానికి గురయ్యారు, మూడవసారి రామాలయం కడతామని చెప్పి అధికారంలోకి వచ్చాక ఆ వూసే యెత్తని భాజపా వాళ్ళ చేతుల్లో కూడా మోసపోతున్నారు - ఇన్నిసార్లు మోసపోయేవాళ్ళని రక్షించడానికి ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే అని చెప్పిన గీతాచార్యుడికి కూడా మనస్కరించదనేది జాతుల ఉత్ధాన పతనాల్ని పరిశీలించిన వారికి తెలిసే కనీసపు నిష్ఠుర సత్యం!ఏది సత్యమో అదే శివమైనదీ అవుతుంది!ఏది శివమో అదే సుందరమైనదీ అవుతుంది!



సత్యం శివం సుందరం!!!

"వేదాలు చదివిన వారు యజ్ఞయాగాదు లందు పశువులను వధిస్తారు" - ఇది నిజమా?

hari.S.babu: గురువు గారూ ! మహాభారతంలో ధర్మవ్యాధుని కధ వస్తుంది కదా . అక్కడ ధర్మవ్యాధుడు కౌశికుడికి ధర్మబోధ చేస్తూ ఒకచోట ," ...