Tuesday, 6 June 2017

రెండు తెలుగు రాష్ట్రాల్లో భాజపా దూకుడు పెంచింది - అంత దూకుడు అవసరమా?

          దేశానికి స్వతంత్రం వచ్చేనాటికి కొంత భాగం మద్రాసు రాష్ట్రంలో ఉండి కొంత భాగం నిజాం నుంచి విడిపోయిన సంధికాలంలో ఒక్కటిగా కలిసి ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ 2014లో విడిపోయి రెండు రాష్ట్రాలు ఏర్పడి వెంటనే జరిగిన ఎన్నికల్లో కొత్త ప్రబుత్వాల్ని ఏర్పాటు చేశాయి.అదే ఎన్నికల్లో అప్పటికి పదేళ్ళుగా అవినీతి గబ్బుతో మకిలపట్టి ఇంక చెప్పుకోవడానికి ఏమీ లేక తెలంగాణ ఐచ్చిన మంచిపేరుతో అధికారంలోకి వచ్చెయ్యగలనని కలలు గన్న భారత జాతీయ కాంగ్రెస్ నామమాత్రావశిష్ఠంగా నిలిచి బిక్కమొగమెయ్యటం దిక్కుమాలిన విభజనతో కుంగిపోయిన ఆంధ్రులకి అపరిమితమైన సంతోషాన్ని కలిగించింది!మూడోసారి అధికారం ఆశించిన కాంగ్రెస్ స్థానంలో మోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ రెండవసారి తిరుగులేని బిజయంతో అధికారంలోకి వచ్చింది.

          కేంద్రంలో భాజపా,ఆంధ్రలో తెదెపా,తెలంగాణలో తెరాసా ఒకేసారి అధికారంలోకి వచ్చి మూడేళ్ళు గడిచాయి.భాజపా అంత మెజారిటీ సాధించినా వారికి అనుకూలంగా ఉత్తర భారతీయులు స్పందించినంతగా దక్షిణ భారతీయులు స్పందించలేదు. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచీ ఆ చేదునిజం వారికి మింగుడు పడటం లేదు.అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ ఉపయోఎగించుకుంటున్నారు.ప్రతి అవకాశమూ వ్యతిరేక ఫలితాన్నే ఇచ్చింది.అయినా పట్టు వదలని విజ్రమార్కుడిలా పరిశ్రమిస్తూనే ఉన్నారు.ఈ ప్రయత్నాల్లో భాగంగానే అమిత్ షా తెలంగాణలో ఒకటీ ఆంధ్రలో ఒకటీ అన్నట్టు రెండు బహిరంగ సభల్ని అత్యంత సంరంభ భరితంగా నిర్వహించటం జరిగింది!మరో రెండేళ్ళకు గానీ ఈ మూడు చట్టసభల టెర్మ్ అయిపోదు గదా, సహజంగా రాజకీయ పార్టీలు చివరి సంవత్సరంలో గానీ ప్రచార సభల ఆర్భాటం మొదలు పెట్టవు - మరి, భాజపా ఇప్పుడే ఇంత దూకుడు చూపించటం దేనికి?

          ఎందుకంటే, మోదీ నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ తిరుగులేని మెజార్టీ సాధించి అధికారంలోకి వచ్చింది గానీ ఓట్లను బట్టీ సీట్లని బట్టీ లెక్కవేస్తే ఉత్తర భారతం ఆదరించినంతగా దక్షిణ భారతం ఆదరించలేదని తెలుస్తున్నది. దేశంలో సగభాగం నుంచి అంత గట్టి వ్యతిరేకత ఉన్నప్పుడు ఇప్పుడు దక్కిన అధికారం ఎప్పటికీ నిలబడుతుందనే గ్యారెంటీ ఉండదు. అదీ గాక, ఉత్తర భారత దేశంలో కూడా పార్లమెంటు ఎన్నికల్లో పడిన వోట్లు హఠాత్తుగా కాంగ్రెస్ వ్యతిరేకత వల్ల పడినయ్యో లేక స్థిరమయిన వోటుబ్యాంక్ తయారయ్యిందో లేదో తెలియని పరిస్థితి! ఏ పొలిటికల్ పార్టీకైనా స్థిరమయిన వోటుబ్యాంక్ ఏర్పడితేనే ప్రశాంతంగా ఉండగలుగుతుంది,లేని పక్షంలో ప్రతి యెన్నికకీ ఆందోళన తప్పదు.అయితే, ఈ మధ్యన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సీట్ల పరంగానూ ఓట్ల పరంగానూ మంచి హుషారు నిచ్చాయి.అవే కాదు స్థానిక సంస్థల ఫలితాలు కూడా ప్రజలు తాత్కాలిక నినాదాలకూ క్షణికమైన ప్రతికూలతలకూ జావకారిపోకుండా చిరకాలం పాటు అధికారంలో ఉండేలా భాజపాని ఆశీర్వదించుతున్నారనిని అర్ధమైపోయింది!ఉత్తరాదిలో ఈ విధమైన ధీమా రావడం వల్ల ఇక దక్షిణాది మీద పూర్తి కాలం పని చెయ్యడానికి వీలు కుదిరింది.ముఖ్యంగా 2014లో బీజేపీకి అంత మెజార్టీ రావడం హఠాత్తుగా ఎగసిపడిన ఒక తరంగం కాదనీ గత డెబ్భయ్యేళ్ళుగా ఈ దేశంలో జరుగుతున్న సమస్తమయిన అన్యాయాలకీ హిందువులని దోషులుగా నిలబెట్టడం వల్ల వారిలో నిద్రాణమై ఉన్న క్రోధమే భాజపాను బ్యతిరేకించే పార్టీలన్నీ కలిసికట్టుగా ప్రయత్నించినా ప్రజలు మళ్ళీ మళ్ళీ భాజపాకే వోటు వెయ్యడానికి కారణమనేది అందరూ తెలుసుకోవాలి!

          అయితే దక్షిణాదిన అన్ని రాష్ట్రాలు ఉండగా మంచి ఆరంభం కోసం రెండు తెలుగు రాష్ట్రాలనే ఎంచుకోవడానికి కారణమేమిటి?నిన్న గాక మొన్న విడిపోయి బలమైన నేతలు తమకు అనుకూలమైన ప్రాంతీయత పునాది మీద ఏర్పడిన సొంత పార్టీలతో నిలదొక్కుకుని ఉన్న చోట ఆరంభం అదిరిపోతుందని వారెలా  అనుకున్నారు?వీటన్నిటికీ జవాబులు తెలియాలంటే రాజకీయంగా బలపడే విషయంలో కాంగ్రెసుకీ భాజపాకీ ఉన్న లక్ష్యాలలోని తేడా తెలియాలి.స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న చరిత్ర ఉండటం వల్ల సహజంగానే ఏర్పడిన గుడ్విల్ ఫ్యాక్టర్ని అనుకూలంగా వుపయోగించుకుంటూనే కాంగ్రెస్ ఆదినుంచీ అధికారాన్ని లోపాయికారీగా ఇతర పార్టీలని బుజ్జయించి పదవుల్లో,లాభాల్లో,కాంట్రాక్టుల్లో వాటాలు పంచడం ద్వారా అధికారానికి అంటిపెట్టుకుని ఉండగలిగేది- ఇప్పటికీ ఆ పార్టీ అదే ధోరణిలో ఉంది, ఇకముందు కూడా అలాగే తట్టాయి బుట్టాయి గాళ్ళతో కలిస్తేనే తప్ప సొంతంగా అధికారంలోకి రాలేదు - గమనించండి!భాజపా ఇందుకు పూర్తి విరుద్ధంగా ఇతరుల నుంచి వీసమెత్తు సాయం కూడా తీసుకోవాల్సిన పని లేకుండా పరిపాలించడానికి అవసరమయిన పూర్తి స్థాయి బలాన్ని కోరుకుంటున్నది - 2 సీట్లతో ఉన్న కాలం నుచీ భాజపా ఈ పద్ధతిని అనుసరిస్తూనే ఇక్కడిబరకూ వచ్చిందనేది కూడా గమనించాలి!ఇప్పుడు భాజపాలో పైస్థాయిలో నాయకులుగా కనపడుతున్నవారందరూ రాష్ట్రీయ స్వయంసేవక సంఘం నుంచి వచ్చినవారే,అక్కడ ఉన్న వాతావరణాన్నే ఇక్కడ కూడా సృష్టిసంచుకుంటున్నారు - ఆ మనస్తత్వం ఇతరులతో నిర్నిబంధంగా సర్దుకుపోనివ్వదు! 

          దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాలలో భాజపా ఇప్పటికే చాలా ప్రయోగాలు చేసింది - కొన్ని చోట్ల మొదట ఆత్యంత ఉత్సాహాన్ని ఇచ్చి అంతలోనే ఉసూరుమనిపించింది.కొన్నిచోట్ల పూర్తి వ్యతిరేకత వచ్చి మళ్ళీ వేలు పట్టడానికి వీల్లేని పరిస్థితి ఉంది.ఏ ప్రయోగాలూ చెయ్యకుండా,ఏ విధమయిన అంచనాలకూ దొరకకుండా వూరిస్తూ వేధిస్తూ గందరగోళంలో నిలబెడుతున్నవి ఈ రెండు రాష్ట్రాలే!ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ అనుకూల మీడియాతో డప్పు కొట్టుకుంటున్నా నిజానిజాలను నిశితంగా పరిశీలిస్తే సమస్యల్ని పరిష్కరించడంలో విఫలమబుతున్నారని తెలుస్తున్నది.కొన్ని సమస్యలు ఈ మధ్యనే జరిగిన అర్ధాంతరపు విభజన ఇంకా పూర్తి కాకపోవడం వల్ల అయితే కొన్ని సమస్యలు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల వ్యక్తీగత ధోరణుల వల్ల వస్తున్నాయి.ఇవన్నీ సొంతంగా ఎదగడానికి పనికొచ్చే ఆయుధాలే గనక అన్ని లెక్కలూ వేసుకుని మంచి ముహూర్తం చూసుకుని ఒక్కోసారి ఒక్కో రాష్ట్రంలో అని కాకుండా రెండు రాష్ట్రాల్లోనే ఒకేసారి అనే వ్యూహం వేసింది భాజపా.మొదట తెలంగాణలో అధికారంలో ఉన్నది మిత్రపక్షం కాకపోవడంతో సభ బ్రహ్మాండంగానే జరిగినా ముఖ్యమంత్రి లక్షకోట్ల సాయానికి లెక్కలడుగుతూ చేసిన ఎదురుదాడికి కంగారు పడటంతో ఫలితం కొంచెం నిరాశనే మిగిల్చింది!ఆంధ్రలో ఆ పొరపాటు చెయ్యకుండా తమ గురించి మాత్రమే చెప్పుకుంటూ జాగర్త పడటంతో సభ జరిగిన తీరూ బాగుంది, పార్టీ శ్రేణులకీ హుషారు పెంచింది!

          చంద్రబాబు నాయుడి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీకి ప్రజలు సుస్థిరమయిన మెజార్టీనే ఇచ్చారు.ప్రతిపక్షనాయకుడి అనుభవరాహిత్యం ఆ పార్టీకి ప్రతిపక్షం నుంచి వచ్చే వ్యతిరేకతని లెక్క చెయ్యనంత ధీమాని పెంచింది.వారానికోసారి అమరావతి బొమ్మల్ని చూపిస్తూ ముఖ్యమంత్రి ఎంతకాలం గడుపుదామనుకుంటున్నాడు?ప్రజలు ప్రపంచంలోనే త్యద్భుతమైన రాజధానిని చూసుకుని మురుసుకోవాలంటే మొత్తం ప్లాను పూర్తయ్యేసరికి ఎన్నేళ్ళు పడుతుబ్దో తెలియదు. ఈలొపు అది నిజంగా ఉపయోగపడేది ఇంజనీర్లకీ కాంట్రాక్తర్లకే కదా!వెర్షన్లు వెర్షన్లుగా ప్లానులు గీస్తూ మారుస్తూ విదేశీ కంపెనీలు బాగుపడుతున్నాయి.ఎంతసేపూ పోలవారం,అమరావతి అంటూ రాగాలు తియ్యడమే తప్ప ఇతర విషయాల మీద దృష్టి పెడుతున్నట్టు లేదు!పరిపాలన చూస్తే సమస్తం అవినీతి మయం అని స్పష్టంగా తెలిసిపోతున్నది - ఎప్పుడు సమావేశాలు జరిగినా అధికారుల్నీ,మంత్రుల్నీ సరిగ్గా పనిచెయ్యడం లేదని విసుక్కునే వార్తలే పత్రీకల్లో కనిపిస్తున్నాయి.ఆ వార్తల ద్వారా ముఖ్యమంత్రిగా పర్ఫెక్షన్ కోసం తపనపడుతున్న గుడ్విల్ వస్తుందనుకుంటున్నాడేమో గానీ, అధికారులూ.మంత్రులూ అనుకున్నంత సమర్ధవతంగా పనిచెయ్యకపోవడానికి వాళ్ళు అవినీతిలో మునిగితేలడం తప్ప మరొకటి కారణం కాదు. అవినీతి కారణం కాకపోతే దాని బాబు లాంటి అలసత్వమే తప్ప మరే కారణం వల్లనూ ప్రభుత్వనిర్వహణ అధినేతకు అంత స్థాయిలో అసంతృప్తి కలించేటనంత మందకొడిగా జరగటం అనేది వూహకు అందని విషయం. మూడవసారి విసుక్కుంటున్నాడంటే మొదటి రెండు సార్ల తిట్లనీ వాళ్ళు పటించుకోవటం లేదనే కదా అర్ధం!ప్రజాస్వామ్యంలో ఎంత మంచి పార్టీకయినా అప్రతిహతమయిన అధికారం దక్కకూడదు,కానీ "రేపో మాపో జైలుకెళ్ళేవాడు!" అనె మాటతో కొట్టిపారెయ్యటం తెదెపా శ్రేణులకి వూతపదంగా మారిపోయింది!ప్రతిపక్షం బలహీనంగా ఉందటం వల్ల పనిచెయ్యకపోయినా అవినీతిలో మునిగిపోయినా ముంచుకుపోయేది యేమీ లేదులే అన్న ధీమా వల్లనే వాళ్ళు ముఖ్యమంత్రి తిట్లని లెక్క చెయ్యటం లేదు.సాంకేతికంగా చూస్తే చంద్రబాబు ఇదివరకు చేసిన తప్పుల్నే కొత్తగా చేస్తున్నట్టు నాకు అనుమానంగా ఉంది - అభివృద్ధిని మొత్తం రాజధానికోనే పోగేసి చూపించటం,నేను నిద్ర పోను మిమ్మల్ని నిద్ర పోనివ్వనని ఉద్యోగుల మీద విసుక్కోవటం గుర్తున్నాయా?తెలంగాణ ఉద్యమంలో అభివృద్ధి ఫలాలు మాకు అందలేదు అనే వాదనకి ముఖ్యమైన కారణం అవినీతి అయితే,వాళ్ళు హైదరాబాదుని వదలకుండా గట్టిగా పట్టుకోవటానికి అక్కడ తను పోగేసిన్ అభివృద్ధియే కారణం - మళ్ళీ అదే తప్పులు చేస్తే మళ్ళీ రాష్ట్రం విడిపోవటం ఖాయం!

          ఒక రాజకీయ పార్టీగా భాజపాకి ఈ పరిస్థితిని ఉపయోగించుకుని రాజకీయంగ ఎదిగే హక్కు నూటికి నూరు శాతం ఉంది.మిత్రపక్షంగా ఎన్నికల సర్దుబాటులో భాగంగా వచ్చిన సీట్లను గెలుచుకోవడానికయినా అంధ్రలో భాజపా దూకుడు పెంచితే మంచి ఫలితమే ఉంటుంది.అయితే,బాబు గ్రాఫ్ పడిపోయిందని సొల్లు కబుర్లు చెప్పే కాంగ్రెసు నుంచి వచ్చిన పాత కాంగ్రెస్ వాళ్ళ మాటల్ని నమ్మీ కార్డులు చూపించిన కొద్దిమంది కార్యకర్తల వీరావేశాన్ని చూసి అతిగా ఆవేశపడితే మొత్తానికి సున్నమవుతుంది. రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగేలా ఈ ప్రాంతం మీద పగబట్తి చేసినట్టు కనిపించే విభజన దుర్నాటకంలో 50% భాజపా పార్టీకీ ఉందనేది ఆంధ్రప్రజలకు స్పష్తంగా తెలుసు!వీరొకందుకు అడిగారు వారొకందుకు ఇచ్చారు అన్నట్టు దేశపు రాజకీయ ముఖచిత్రం మీద బలంగా ఉన్న ఉత్తరాది లాబీ ఈ రెండు జాతీయ పార్టీలలోని నాయకుల్నీ ప్రభావితం చెయ్యటం వల్లనే ఆంధ్రప్రదేశ్ విభజన ఈ విధంగా జరిందనేది వాస్తవం!అదీగాక తెదెపా నుంచి తెగదెంపులు చేసుకుని సొంతంగా అధికారంలోకి రాగలిగిన పరిస్థితి  ఇప్పటికిపుడు లేదు కదా!లాభం లేకుండా వేరుపడటం తెలివితక్కువ - కాబట్టి మొన్నటి సభ ద్వారా  పార్టీలో వచ్చిన హుషారుని తమకు బలమయిన నియోజకవర్గాలను ఎంచుకుని క్షేత్రస్థాయిలో నెమ్మదిగా ఎదగడమే బీజేపీకి ఉభయతారకమయిన పద్ధతి. అధికారంలోకి రావాలంటే మటుకు ముఖ్యమంత్రిగా జనం ముందు నిలబెడితే నమ్మించగలిగిన సమర్ధుడు చాలా అవసరం - అటువంటి వ్యక్తి ఆంధ్రలో కనబడే వరకు భాజపా తెదెపాతో ఆచి తూచి వ్యవహరించక తప్పదు!

          ఆంధ్రప్రదేశ్ రాజకీయరంగం ఉన్నంత స్పష్టంగా తెలంగాణ రాజకీయరంగం లేదు - యద్భావం తద్భవతి అన్నట్టు యెవరే విధంగా చూస్తే ఆ విధంగా కనబడి ప్రతి పార్టీకీ జంకూ తెంపూ రెంటినీ కలిగిస్తున్నది!తాను నిర్వహించిన సర్వేలో కాంగ్రెసుకి ర్తెండే సీట్లు వస్తాయనీ భాజపోకి అసలు ఒక సీటు కూడా రాదనీ తెరాసాకు 111 సీట్లు వస్తాయనీ ముఖ్యమంత్రి గారు చెప్పుకున్నారు.పైకి  సొంత సర్వేలు అన్నీ బూటకాలు అని కొటి పారేసినా కాంగెసు వాళ్ళు దిగాలు పడిపోయినా భాజపా సభ తర్వాత జరిగిన రాహుల్ సభ జరిగిన తెరు కాంగెసువాళ్లని గుడి కన్నా మెల్ల నయం అని సంబరపడిపోయేలా చేసింది.అయితే,ఉతర ప్రదేశ్ ఎన్నికల ఫలితాల తర్వాత భాజపా కూడా సర్వే చెయించిందనీ,వారి సర్వేలో కూడా కేసీయార్ హవా తెలంగాణలో బలంగానే ఉందనీ తెలిశాకనే భాజపా ఈ సభకు ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలుస్తున్నది!లక్షకోట్ల సాయానికి కేసీయార్ వేసిన మెలికని పెద్దగా పట్టించుకోకుండా దూకుడు పెంచి ముందుకువెళ్ళడం వల్ల భాజపాకి ఈ ఎన్నికలలో మంచి ఫలితమే రావచ్చు - అన్నీ కలిసొస్తే అధికారం కూడా ప్రాప్తించవచ్చును. ఎందుకంటే 2014లో తర్వాత కాలంలో వాళ్ళనీ వీళ్ళనీ లాక్కుంటే తప్ప నిలబడలేని బొటాబొటీ మెజార్టీకి కారణమైన నిజాయితీ పరులు యెవ్వరూ ఇవ్వాళ అతని పక్కన లేరు.ఎవ్వరి సహాయమూ లేకుండా అతనొక్కడే అందరిపెట్టు అనిపించే మాయాజాలం యెన్నికల్లో పనిచేస్తుందనుకోవటం భ్రమ - అవతార పురుషుల వేషాలు వేసి అకళంకమైన రాజకీయ చరిత్ర కల్గిన నందమూరి తారక రామారావుకే ఒంటెత్తు పోకడ ధోరణి తట్టుకోలేనంత తీవ్రమైన అపజయాన్ని మిగిల్చింది - ఇతడెంత!ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అవినీతి బయటికి కనబడుతూ పదుగురికీ తెలుస్తుంటే తెలంగాణలో పైనించి కిందకు ఎవరి వాటాలు వారు దక్కించుకుంటూ రహస్యంగా నడిచిపోతున్నది.లోపాయకారీగా తెలియవచ్చిన విషయం ఇవ్వాళ తెలంగాణలోని రాజకీయ నాయకుల రోజుకూలీ 2 లేక 3 లక్షలట!వ్యతిరేకతే లేకపోవటమే సుస్థిరతకు గానీ ప్రశాంతతకు గానీ గల ఒకే ఒక్క  కారణం కాదు - ఇటువంటి సానుకూలత కూడా వాస్తవాన్ని చూడనివ్వని మైకాన్ని కలిగిస్తుంది, బహుపరాక్!

          రాష్ట్రం ఏర్పడిన మొదటి సంబురాల నాడు కనిపించిన ఉద్వేగం,ఉత్సాహం మూడవ యేడాది సంబురాలలో కనిపించలేదు - కారణం ఏమిటి?రాజకీయ చాతుర్యంతో అధికారం నిలబెట్టుకోవటం ఆర్జనకు పనికి వస్తుంది కానీ ప్రజాభిమానాన్ని పెంచుకుకోవటానికి పనికిరాదు!నోటికొచ్చింది మాట్లాడి సంచలనాలతో ఫోకస్ తెచ్చుకుంటూ గయ్యాళి సమర్ధనలతో లోపాల్ని కప్పి పుచ్చుకోవటం అభిమానుల్ని అలరిస్తుందే తప్ప విశాల ప్రజానీకపు ఆమోదాన్ని తీసుకురాదు!ప్రజలలో అసంతృప్తి ఉంది గనకనే పరిస్థితి అనుమానాస్పదంగా తయారైంది కాబట్టి భాజపా దూకుడును పెంచటమే శ్రేయస్కరం!మిత్రపక్షం అనే మొహమాటం లేదు కాబట్టీ,అతడు కూడా భోజనాల గురించి కూడా నీచమయిన విమర్శలతో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు గాబట్టీ భాజపా ప్రశాంతంగా ఉందటం వల్లనే నష్టం యెక్కువగా ఉంటుంది!పాతబస్తీలో కొలువున్న కాసిం రజ్వీ వారసుల్ని అదుపు చెయ్యాల్సిన అవసరం చాలా వుంది!అదేంటో,ఉద్యమ సమయంలో నక్సలిజం గురించి యెత్తితే "మా పోరగాళ్ళంతా భుజాల మీద తుపాకులు పెట్టుకుని పుడుతున్నట్టు మమ్మల్ని అగుమానిస్తున్నారు!" అని ఆవేశపడిపోయాడు!మరి, అధికారంలోకి వచ్చాక యెంత హడావిడి చెయ్యాల్సి వచ్చింది?ఒక ఆడమనిషి విదేశాల్లో చదుకోవడానికి వెళ్ళి,ర్యాంకు రాకనో యేమో ఉద్యోగం సద్యోగం లేకుండా పెళ్ళి చేసుకుని వచ్చి,ఆ పెళ్ళీ పెటాకులై సోమరి బుర్ర దెయ్యాల పర్ర అన్నటు 50 మంది టెర్రరిస్టుల్ని తయారు చేసింది - ఆఖరి నిమిషాల్లో తను పట్టుబడింది గానీ ఈ ఉగ్రనారి వల్ల తయారైన మిగతా వాళ్ళ సంగతేంటి?చవగ్గా చిన్నపిల్లల్ని పెళ్ళాడాలనుకునే అరబు షేకులకి పెళ్ళాల మార్కెట్టుగా హైదరాబాదు ఎప్పుడో మారిపోయిందన్నది అబద్ధమా!ఆ లత్తుకోరు దళారీ వ్యాపారం చేసేవాళ్ళలో చాలామంది పాతబస్తీ మోతుబరి కుటుంబం పడగనీడలో కేళీవిలాసంగా బతుకుతున్నవాళ్ళు కాదా!పాతబస్తీలోని కూసిన్ని వోట్ల కోసం తెలంగాణ రాష్ట్రమే గాక దేశానికి కూడా ప్రమాదం తెచ్చిపెడుతున్న వాళ్ళతో స్నేహమా!యజ్ఞయాగాలు చేస్తూ స్వాముల్ని పక్కన కూర్చోబెట్టుకుంటేనూ, బ్యాపనోళ్ళకి గుడిమాన్యాలు ఇస్తేనూ హిందువులు యెర్రిపప్పల్లా నాకే వోట్లు వేస్తారు అతను అనుకుంటే అది భాజపా యొక్క చేతగాని తంబానికి గుర్తు!ఇటీవల ఉత్తరాది యెన్నికల్లో తలాఖ్ విషయాల ప్రస్తావన రావడం వల్ల ముస్లిం ఆడవాళ్ళు భాజపాకి వోటు వేసిన విషయం గుర్తుంచుకుంటే భాజపాకి తెలంగాణలో ఉన్న అనుకూలత యేమిటో తెలుస్తుంది!కేసీయార్ ఇప్పుడు తన రాజకీయ చతురత అబుకున్నవే వచ్చే ఎన్నికల నాటికి అతనికి గుదిబండగా మారే అవకాశం ఉంది!2014లో ఆ మెజార్టీని తెచ్చిపెట్టిన ఉద్యమవీరులు ఇవ్వాళ శత్రుస్థానంలో ఉన్నారు!నిజాయితీగా తెలంగాణ వస్తే అవినీతి లేని ప్రభుత్వం ఏర్పడి తమకి మంచి జరుగుతుందని ఆశించి పనిచేసినవాళ్లని వ్యూహప్రకారమే దరిదాపులకి కూడా రానివకుండా గెంటివేసి ఉద్యమకాలంలో తమకి అన్యాయం జరిగిందని ఆరోపించిన కాలం నాటి ప్రభుత్వాలలో మంత్రులుగా ఉన్నవాళ్ళకే ఇప్పుడు పచ్చకండువా కప్పి మంత్రుల్ని చేశాడు!మన వుద్యోగాలు లాక్కున్నారని చెప్పినవాడు ఉద్యోగాల నోటిఫికేషన్లని వాయిదా వేస్తున్నాడు!ధనిక రాష్ట్రం అని చెప్పుకున్నవాడు ఆంధ్ర విద్యుత్ బకాయిల్ని చెల్లించలేదు!ఈసారి మేము బహుజాగ్రత్తగా కూర్చాము అని చెప్పుకున్న ఆదేశాల్ని కూడా కోర్టులు చివాట్లు పెడుతూ కొట్టిపారేస్తునాయి - ఇన్ని ప్రతికూలతల్ని ముడ్డి కింద పెట్టుకుని మిషన్ దగారధం,మిషన్ చేతివాటం,మిషన్ రెండు చాపల ఇళ్ళు లాంటి పధకాల గురించి చెప్పుకుంటే ఎన్ని వోట్లు పడతాయి?తెలివిగా ఆడితే తెలంగాణలో భాజపాకి ఎంత ఆడుకుంటే అంత లాభం!ఆట మానేసి కూర్చుంటే ఆటస్థలం మరొకరి వైపుకు పారిపోయే అపాయం ఉన్నప్పుడు ఆడితే నష్టమేమిటి?ఆడేది గట్టిగానే ఆడాలి.

          చాలాకాలం క్రితం నేను ఇవ్వాళ బ్యూటన్ లాంటివాళ్ళు కనుక్కున్న విషయాలు మనవాళ్ళు యెప్పుడో కనుక్కున్నారు,అయినా మనవాళ్ళకి గుర్తింపు లేదు అని చెప్తూ ఒక పోష్టు వేస్రే కొందరు తాయిగండ వెధవలకి అది నేను వాళ్ళనో వాళ్ల ఆత్మబంధువుల్నో తిట్టినంత రోషం పొడుచుకొచ్చింది!వాళ్ళ కామెంట్ల నిండా అక్కసుతో కూడుకున్న బూతులే,ఎన్నిసార్లు నేను న్యూటన్ మహాశయుణి గానీ మరొకరిని గానీ అవమానించినట్టు నా పోష్టు మొత్తంలో యెక్కడ వుంది అని నిలదీసినా సరే సూటిగా అడిగిన ప్రశ్నలకి జవాబులు చెప్పకుండా ఏమిటేమిటో వాగేశారు.ఆ వాగుడులో "ద్రౌపదిని దుశ్శాసనుడు రేప్ చేస్తుంటే పాండవులు గుడ్లప్పగించుకుని చూశారు" అనే మాటని చూసి అది ఆ ఒక్కడి సొంత పైత్యం కొద్దీ వాగే చెత్తనుకుని పటించుకోలేదు!అయితే,ఈ మధ్యనే అది ఆ ఒక్కడి సొంత తెలివి కాదనీ గతితార్కికభౌతికశాస్త్రవేత్తలు గానీ దళితవాదవీరకిశోరాలు గానీ పనిగట్టుకుని చేసిన సుదీర్ఘమయిన వ్యాఖ్యానంలో నుంచి కొట్టుకొచ్చి అతను అక్కడ వూశాడనీ తెలిసినప్పుడు గానీ నాకు దేశంలో హిందూ సంస్కృతి మీద జరుగుతున్న నీచమయిన దాడి యెంత విస్తృతంగా ఉందో తెలిసిరాలేదు!సకల దేవతలకూ మాతృస్వరూపిణి అయిన ఆదిశక్తిని సెక్స్ వర్కర్ అనడం దగ్గిర్నుంచీ పంచ మహా పతివ్రతల్లో ఒకరై అగ్నిసంభవ అని ప్రత్యేకంగా కీర్తించబడుతున్న ద్రౌపదిని రేప్ సీనులో ఇరికించడం వరకు ఎంత నీచానికి పాల్పడి అయినా సరే హిందువులని అవమానించాలి,మానసికంగా హింసించాలి,వాళ్ళని మాత్రమే కాదు వాళ్ళు గౌరవించే ప్రతి అంశాన్నీ అవమానించాలి,వాళ్ళు సిగ్గుపడి తల దించుకుంటే చూసి సంతోషించాలి అనే ధోరణి అంత బలంగా  ఉన్నవాళ్ళు మనం యెంత వొపిక చేసుకుని ఎన్ని ఆధారాలు చూపించి వాదించినా వొప్పుకుని దాడిని ఆపుతారని గ్యారేంటీ యేముంది?ఇవన్నీ అధికారం ఇలాగే వస్తుందని చెబుతున్న రాజకీయ సిద్ధాంతం ప్రకారం చేస్తున్న వ్యవహారాలు అయినప్పుడు వీళ్ళ దాడి నుంచి రక్షించుకోవటానికి హిందువులకి ఉన్న మార్గం యేమిటి - బీజేపీకి వోటు వెయ్యటం తప్ప!

          ఇవ్వాళ దేశం మొత్తం మీద అంత నిబద్ధంగా భాజపాకి పడుతున్న వోట్లన్నీ ఇలాంటి ఆలోచనలతో సతమతమవుతున్న హిందువులవే అయితే అలాంటివాళ్ళు తెలంగాణలో లేరని భాజపా అనుకుంటున్నదా!అయితే, గోరక్షణ దళాలు చేస్తున్న రౌడీ పనులు మాత్రం భాజపాకి వ్యతిరేక ఫలితాని ఇచ్చే ప్రమాదం ఉంది.ఇప్పటికే దేశమంతటా ఉద్యమాలు మొదలయినాయి.అసలు కబేళాలకి వెళుతున్న ఆవుల్ని ఎవరు అమ్ముతున్నారు?అసలు వ్యవసాయ దారుడు కానివాడు ఒక్కడయినా కనీసం సరదాకయినా ఆవుల్ని పెంచుతున్నాడా ఇవ్వాళ?వ్యవసాయంలో కూడా పావు ఎకరం దుక్కికి కూడా చవగ్గా ట్రాక్తర్లని వాడుతుంటే ఎద్దుల్ని పెంచడం లాభమా?ఉపయోగపడే జంతువుని రైతు మాత్రం ఎందుకు అమ్ముతాడు?పెంచలేని దుస్థితిలో అమ్ముకునే రైతుల్ని ఈ బలవంతపు గోరక్షణ ఏ విధంగా ఉద్ధరిస్తుంది?ఇది గాక ఈ గోరక్షణ సెంటిమెంటు బలంగా ఎక్కిపోయిన ఒకాయన ఆవులు కార్బన్ డయాక్సయిడును పీల్చుకుని ఆక్సిజన్ వదలటం గురించి సైన్సు పాఠాలు చెప్తున్నాడు - ఒక అయిదేళ్ళ క్రితం మనం ఇలాంటి సనివేశాన్ని చూడగలమా?ఆయనే ఆడ నేమలి మగ నెమలి యొక్క కన్నీటినో చెమటనో తాగి గుడ్లు పెడుతుందని బల్ల గుద్ది చెప్తున్నాడు,ఏమిటి ఇది?ఇప్పుడు అధికారంలో ఉన్నది అమన ఆర్టీ గాబట్టి మనం ఏమి మాట్లాడినా చెల్లిపోతుందనే అహంభావం వల్ల ఇలాంటివి జరుగుతాయి - ఈ రకం జనాల్ని అదుపు చెయ్యకపోతే ఓకప్పుడు భారత్ అంటే పాముల్నీ కోతుల్నీ ఆడించుకుంటూ చెట్లకీ పుట్లకీ దణ్ణాలు పెడుతూ అజ్ఞానంలో గడిపే  వాళ్ళ దేశం అని అవహేళనలు చెయ్యటం కరెక్టేననే విషయాని ప్రపంచం నలుమూలలకీ తెలిసిపోయి దేశం పరువు పోతుంది.ఇలాంటివాటిని కట్టడి చేసి వస్తుగతమైన వృద్ధి మీద మరింత దృష్టి పెట్టకపోతే వ్యతిరేకతలు మరింత పెరిగి భాజపా ప్రజల్ని ప్రాచీన కాలానికి నడిపించే మూర్ఖుల కూటమిగా మారిపోతుంది - తస్మాత్ జాగ్రత్త!

          ఆంధ్రలో లాగే తెలంగాణలో కూడా ముఖ్యమంత్రి అర్హతలు ఉన్న వ్యక్తిని జనం ముందు నిలబెట్టకుండా అధికారం దక్కదు - క్లారిటీ ఇవ్వకుండా జనం ష్యూరిటీ ఇవ్వరు.అక్కడా ఇక్కడా అనే కాదు బిన్ లాడెన్ నుంచి డోనాల్డ్ ట్రంప్ వరకూ చూస్తే తను ఏం చెయ్యాలనుకుంటున్నాడో ఇచ్చిన క్లారిటీయే లీడర్షిప్ క్వాలిటీలలోకల్లా బెస్ట్ క్వాలిటీ అని తెలుస్తున్నది!ట్రంప్ వరకూ ఎందుకు మోదీ గెలుపుకి కారణం కూడా అదే కదా - ఇంకెందుకు ఆలశ్యం?


యతో ధర్మం తతో జయం!

6 comments:

  1. BJP will reach same lows as Congress if it continues current arrogance. For Andhra, BJP is even worse because they were together with Congress at the time of bifurcation but after coming to power, they are not able to fulfill assurances in the act itself. So Congress did injustice. BJP is continuing to do more injustice to Andhra. If not for weak CM, BJP should have been thrown out of Andhra by now

    ReplyDelete
  2. అవసరమా అంటారా? నిష్ప్రయోజనం అంటాను!

    ReplyDelete
  3. రాజకీయంలో శాశ్వత మిత్రులు,శాశ్వత శత్రులు ఉండరు. ఎవరి గుడారం వారిదే! ఎవరి ప్రయత్నం వారిదే!!

    ReplyDelete
  4. హరిబాబు గారు, ఆంధ్రాలో ఆవులు,గేదలు పశు సంపద మునుపటితో పోలిస్తే ఇప్పుడు ఎంతో తగ్గిపోయిందనిపిస్తుంది. పట్టణాలలో అన్నా అవి కనిపిస్తున్నాయేమోగాని పల్లెల లో అంతగా లేవనిపిస్తుంది. సుమారు 90 కిమి కోస్తాతీరం వెంబడి పల్లెటూర్ల లో తిరిగితే ఒక్క పశువు కూడా రోడ్డు పైన కనపడలేదు. కారణం మీరు చెప్పిందే. వ్యవసాయానికి అందరు ట్రాక్టర్ ని వాడుతున్నారు,కోతలు మెషిన్ లతో చేస్తున్నారు. మేషినలతో కట్ చేసిన గడ్డిని పశువులు తినవంటా! క్షేత్ర స్థాయి పరిస్థితి అలావుంటే, సోషల్ మీడియాలో ఐలయ్య్య అనుచరుల గోల వేరే విధంగా తారాస్థాయిలో ఉంట్టుంది. సోషల్ మీడీయాలో కొంతమంది బీఫ్ ఫెస్తివల్ చేసుకొందామా! దోస్తులు అని,పదిరోజులపైగా గంటగంటకి పోస్ట్ వేశారు. రెండు రోజులనుంచి కొంత తగ్గింది. ఆపోస్ట్లు చూస్తూంటే హిందువులకి చికాకు వేస్తుంది. ఉదయం నుంచి రాత్రి 11వరకు బీఫ్ తినటం పైనేనా ఆలోచన. నిజంగా ప్రజలు బీఫ్ ని అంత ఎగబడితింట్టున్నారా? బీఫ్ బిర్యని ఆంధ్రాపెసరట్టంత పోని గుత్తొంకాయ కూరంత ఫేమసా? అనే ప్రశ్నలు మనసులో మెదలుతాయి.

    ఇదే కాక ఒకప్పుడు ప్రజలదగ్గర కొనుగోలు శక్తిలేని రోజులో బీఫ్ ని తినేవారు ఎక్కువ ఉండవచ్చేమో! నేడు కిలొ రెండు రూపాయల బియ్యం, ఇతర స్కీములు ఎన్నో ఉన్నాయి కదా! మునుపటిలా ఎమిదొరకనట్లు తెలుగు రాష్ట్రాలలో పేద ప్రజలు బీఫ్ దొరకకపోతే కుటుంబాన్ని పోషించుకొనే/బ్రతికే పరిస్థితులేరా?

    ReplyDelete
  5. నాకు whatsapp లో వచ్చినది. రచయిత తెలియదు
    గుడ్డు, పాలు శాకాహారామా? మాంసాహారమా?
    ముందుగా మనం శాకాహారం అంటే ఏమిటి? మాంసాహారం అంటే ఏమిటి? అనే విషయం పై పండితులు చెప్పిన వివరణ పరిశీలిద్దాం.
    భగవంతుని ప్రేరణ చేత ఈ భూమి పై చరాచర సృష్టి (పుట్టుక) అనేది నాలుగురకాలుగా విభజించి అర్ధంచేసుకోబడింది. వీటిని జరాయుజములు, అండజములు, స్వేదజములు, ఉద్భిజములు అని పిలుస్తారు.
    1. జరాయుజములు:- గర్భంలోని పిండమునావరించియుడు మాయవలన పుట్టునవి. మనుష్యులు పశువులు.
    2. అండజములు:- గ్రుడ్డు నుండి పుట్టు పక్షులు, పాములు మొదలగునవి.
    3. స్వేదజములు:- చెమటవలన పుట్టు దోమలు, నల్లులు మొదలగునవి.
    4. ఉద్భిజములు :- విత్తనము పగలదీసి జన్మించు వృక్షలతాదులు
    ఇక ఇందులో రెండురకాలు ’చర సృష్టి’, ’అచర సృష్టి’…. జరాయుజములు, అండజములు, స్వేదజములను ’చర సృష్టి’ అనియు, ఉద్భిజములనుమాత్రం ’అచర’ సృష్టి అనియు చర అంటే కదిలేవి. మనుషులు, పశువులు, పక్షులు, పాములు, దోమలు, నల్లులు ఇటువంటివి కదలిక కలిగి ఉంటాయి. ఇవి ముఖ్యంగా తమ కదలికను తమను తాము కాపాడుకునే పనిలోనూ తమ ఆహారప్రయత్నంలోనూ వాడతాయి. ఇవి రజోగుణ, తమోగుణ స్వభావులు; అందువల్ల ఇవిధరించే శరీరాలను దోషభూయిష్టమైనవిగా, అంతర్గతంగా దుర్గంధాన్ని ఆవరించి యుండేవిగా భావించి వీటిని ’నీచమనీ’, ’మాంసమనీ’, మాంసాహారమనీ పూర్వీకులు చెప్పారు. ఈ నీచము అనేమాటనుండే నీచు అనే అర్థం మాంసానికి వచ్చింది. ఈ చరసృష్టి అంతా తల కిందకు దించి తమ ఆహారాన్ని స్వీకరించ ప్రయత్నంచేస్తాయి. పశువులు మేతమేసినా, మానవులు ఆహారంతింటున్నా తలను నీచానికి చూస్తారు కాబట్టి నీచం అనే పదం వాడారు కాబట్టి వేరేవిధంగా అర్ధం చేసుకోగూడదు.
    ఇకపోతే ఉద్భిజములు – విత్తనమునుండి వచ్చేవి. వీటిని ఉచ్చములు అని పిలిచారు. ఇవి వీలైనంతవరకూ సూర్యుడిని అందుకోవడానికి ఆకాశంవైపు సాగుతాయి. ఇవి అత్యధికశాతం సత్వగుణపూరితములు. అందువల్ల వీటిని ’శాకాహారమని’ పిలిచారు.

    ReplyDelete
    Replies
    1. చరసృష్టిని ఆహారముకొరకు వాడగూడదు అని యాజ్ఞవల్క్యస్మృతి చెబుతోంది. ఒక లేడి యొక్క ఒక కాలు మనం కత్తిరిస్తే అది జీవితాంతం కుంటుతుంది. అంతేగానీ వేరొకకాలు మొలిపించుకోలేదు. అలాగే తనకు ఒకచోట బృతిదొరకలేదుగదా అని వేరొకచోటకు వెళ్లగలిగిన రజోగుణం లేడి, మానవుడు, పాము, నల్లి వంటి చరసృష్టికలిగిన జంతువులలో ఉంటుంది.
      కానీ అచరసృష్టి దీనికి భిన్నం. ఒక చెట్టుయొక్క ఒక కొమ్మని నరికితే అది వేరొక కొమ్మను మళ్లీ మొలిపించుకుంటుంది. చెట్టు తన ఆకులను సమృద్ధిగా రాల్చేస్తుంది. చెట్టు తన పండ్లను రాల్చేస్తుంది. అలాగే వరి వంటి మొక్కల ధాన్యాన్ని మనం ఆ మొక్క ప్రకృతిసిద్ధంగా చనిపోయిన తర్వాతే పంటను కోసి విత్తనాలను ఇంటికి తెచ్చుకుంటాము. ఈ అచరసృష్టి తమకు ఒకచోట ఆహారం దొరకలేదుగదా అని వేరొకచోటికి కదలవు వీటిలో సత్వగుణం (సత్వం సుఖే సంజయతి). అందువల్ల అరటి, మామిడి, గోధుమలు, యవలు, తిలలు, వంటి వాటిని భుజిస్తే సత్వగుణవృద్ధి జరిగి ఆలోచనలో క్రూరత్వం నశించి మనిషి ఆరోగ్యపూరితమైన జీవనాన్ని సాగిస్తాడు కాబట్టి శాకాహారము (అచర చేతనా సృష్టి) ని భుజించి మానవుడు సుఖించి కైవల్యాన్ని పొందవచ్చని సాధనాగ్రంధములలో ఋషులు బోధించారు.
      ఇకపోతే ఈ శాకాహార మాంసాహారచర్చ అనేది ’జరాయుజములలో’నే సాధ్యం! మానవులు మావినుండి పుడతారు. తల్లి పాలు తాగి పెరుగుతారు. అలాగే తోటి జరాయుజములైన ఆవులు, లేడులు, గుర్రముల వంటి వాటి పాలు వీరు తాగవచ్చు అని చెప్పారు. ఈ పాలు అనేవి తమ బిడ్డతాగేదానికంటే రెండింతల ఎక్కువగానే జరాయుజములు ఉత్పత్తిచేస్తాయి. కాబట్టి దూడ తాగిన తర్వాత మిగిలిన పాలను ఈ జరాయుజములు సహజంగానే విసర్జించేస్తాయి. అంటే మీరు పితకకపోతే ఎక్కువైనపాలను ఏ చెట్టుకో పొదుగును అదిమిపెట్టి కార్చేస్తాయి. కాబట్టి ఇలాంటి పాలు సేకరించడంవల్ల జరాయుజముల ప్రాణనష్టాన్ని కలిగించడం జరగడంలేదు! కాబట్టి పాలు ఖచ్చితంగా శాకాహారమే! అయితే దీనికి ఒక నియమం చెప్పారు. ఉద్భిజములను’ తిని బ్రతికే ’జరాయుజముల’ పాలుమాత్రమే శాకాహారం – అంటే గడ్డితిని పాలిచ్చే ఆవుపాలు శాకాహారం. కానీ మిగిలినవాటిని తిని పాలిచ్చే జరాయుజముల పాలు ’మాంసాహారం – అంటే ఆవును తిని పాలిచ్చే పులిపాలు మాంసాహారమే!. మానవులు స్వతస్సిద్ధంగా ఉద్భిజములను’ తిని బ్రతికే ’జరాయుజములు’.
      గుడ్డు అనేది ఖచ్చితంగా మాంసాహారమే! Sterile Egg అనేదాన్ని కొన్ని రసాయనాలనుపయోగించి పెరగకుండా దానిలోని జీవాన్ని మాతృగర్భంలో ఉండగానే చంపేస్తారు. అందుకే అది పుట్టిన తర్వాతగూడా పెరగకుండా గుడ్డులాగా మిగిలిపోతుంది. ఆ గుడ్డులోనుండి పిల్ల బైటికిరాకుండా రసాయనాలువాడి, పైగా పిల్లరాదుగదా అది శాకాహారమే అని చెప్పడం అర్ధంలేని వాదం.
      కాబట్టి సూక్షంగా ఏది కదులుతుందో, ఏది కదిలి తన ప్రాణాలను కాపాడుకో ప్రయత్నిస్తుందో, ఏది కదలిక కలిగే తనవంటి ప్రతిరూపానికి జన్మనిస్తుందో – దానిని తినడం మాంసాహారం. గుడ్డు ఖచ్చితంగా మాంసమే! కానీ పాలు శాకాహారం.
      ఏది కదలదో, ఏది తన కొమ్మలను మరింతగా, ఆకులను మరింతగా మొలిపించుకోగలుగుతుందో అది శాకాహారం.
      చేపలు ‘అండజముల‘ క్రిందకే వస్తాయి. అంటే గుడ్లనుండి పుట్టేవి. కదలిక కలిగినటువంటివి. కాబట్టి చేపలవంటివిగూడా మాంసాహారంక్రిందకే పరిగణించబడుతుంది. ప్రతి జీవికి తన స్వతస్సిద్ధమైన తిండి ఉంటుంది. లేడులు, ఆవులు, గుర్రములు స్వతస్సిద్ధంగా పచ్చికమేస్తాయి. పులులు, సింహములు, దుమ్ములగొండులు, గద్దలు స్వతస్సిద్ధంగ మాంసమును తింటాయి. మానవులు స్వతస్సిద్ధంగా పండ్లు, కూరగాయలు, కొన్నిరకముల గడ్డి (లేతవెదురు) మరియు గడ్డిగింజలు (వరి, గోధుమ మొదలగునవి) తింటారు. మనుషుల శరీర నిర్మాణాకృతి అంతర్గతమైన జీర్ణావయవములు ఈ విషయాన్నే నిర్ధారిస్తాయి. మానవుల ప్రేగులు దాదాపు ఏడు మీటర్ల పొడవుంటాయి. ఇవి మిగిలిన శాకాహార జరాయుజములైన దుప్పి,లేడి, ఆవులను పోలిన నిర్మాణం. కానీ పులి, దుమ్ములగొండి, సింహము వంటి సహజసిద్ధమైన మాంసాహార జరాయుజముల పొట్టలోని ప్రేగులు మీటరు పొడవుగూడా ఉండవు. ఎందుకంటే ఇవి మాంసం తింటాయి, మాంసము అంటే అప్పటికే ఒక జంతువు తిని అరిగించుకుని బలంగా మార్చుకున్న పదార్థం. అందువల్ల తిరిగి మాంసాన్ని అరిగించుకోవాల్సిన అవసరం వీటి ప్రేగులకు ఉండదు, వీటి ప్రేగులపై అంత భారమూ పడదు. అందుకని స్వతస్సిద్ధంగా మాంసం తినే జంతువుల ప్రేగులు చాలా చిన్నవిగా ఉంటాయి. కాబట్టి మానవులు స్వతస్సిద్ధంగా శాకాహరజీవులు.

      Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

"వేదాలు చదివిన వారు యజ్ఞయాగాదు లందు పశువులను వధిస్తారు" - ఇది నిజమా?

hari.S.babu: గురువు గారూ ! మహాభారతంలో ధర్మవ్యాధుని కధ వస్తుంది కదా . అక్కడ ధర్మవ్యాధుడు కౌశికుడికి ధర్మబోధ చేస్తూ ఒకచోట ," ...