Monday, 26 June 2017

బ్రాహ్మణుడికి ప్రాధాన్యత లేని హిందూమతం నిలబడుతుందా?హిందూమతానంతర భారతదేశం ఎప్పటికైనా ఆవిర్భవిస్తుందా!

     పశువధ నియంత్రణకి సంబంధించిన వివాదాలలో ఒక కేసుకు తీర్పునిస్తూ న్యాయమూర్తి ఆవు కార్బన్ డై ఆక్సైడ్ పీల్చుకుని ఆక్సిజన్ వదులుతుందని చెప్పారు.ఆంధ్రాలో బ్రాహ్మణ కార్పొరేషన్ అనే సంస్థలో ప్రభుత్వం నియమించిన అధికారి సొంత పెత్తనం చేస్తూ పదవి వూడగొట్టుకుని రాజకీయాలు మాట్లాడుతూ మొండికేస్తున్నాడే తప్ప చేస్తున్నది తప్పు అనుకోవడం లేదు.ఆ న్యాయమూర్తి బ్రాహ్మణుడో కాదో తెలియదు గానీ బ్రాహ్మణ కార్పొరేషన్ అనే సంస్థకి అటాచ్ చెయ్యడం ఇతరుల్ని చెయరు గాబట్టి ఇతను బ్రాహ్మణుడే అయి ఉంటాడు!

     దేశంలో భాజపా బలపడుతున్న కొద్దీ పుట్టు బ్రాహ్మణులకి మళ్ళీ కొవ్వు పెరుగుతున్నదా?హిందువులు రాజకీయంగా కొంత ఐక్యం కాగానే దాన్ని తమ తపశ్శక్తికి అంటుగట్టేసుకుని ఒకనాటి ఔద్ధత్యాన్ని మళ్ళీ చూపించడానికి వాళ్ళలోని బ్రహ్మరాక్షసత్వం జడలు విప్పుకుంటున్నదా?ఎందుకంటే, యే మనిషికైనా మనం ఏం మాట్లాడినా ఏం చేసినా అడిగేవాడు ఉండడనే ధీమా ఉన్నప్పుడే అంత దూకుడుగా ప్రవర్తిస్తాడు.బయటపడి కనపడుతున్న వీళ్ళిద్దరికీ బయటపకుండా అవకాశం కోసం ఎదురుచూస్తున్న మిగతావాళ్ళకీ మోదీ గెలుపు అంటే బ్రాహ్మణుల గెలుపు అన్నట్టు అర్ధం అవుతున్నది కాబోలు!

     గతంలో ఇట్లా ప్రవర్తించి కొన్ని తరాల పాటు చీ కొట్టించుకున్నది వీళ్ళకి అప్పుడే పరగడుపైనట్టుంది.గతంలో బ్రాహ్మణాధిక్యత అనేది ఉన్నది - అది అమానుషమైనది కూడా!వ్యతిరేకత పెరిగి ఇతర కులాల వాళ్ళు రాజకీయ ఉద్యమాలు నడిపి వీళ్ళని అధికా పీఠానికీ రాజవైభవాలకీ దూరం చెయ్యడం కూడా చారిత్రక సత్యమే!ఇప్పుడిప్పుడే, కొన్ని తరాల నుంచి ఆలయాల్లో పూజారులు గానో ఇళ్ళల్లో కర్మకాంలు జరిపించే పురోహితులుగానో కనబడటం వల్ల ఇతర కులాల్లోనివారిలో బ్రాహ్మణద్వేషం నుంచి పుట్టిన వ్యతిరేకత తగ్గి ప్రభుత్వాలు కూడా వారికి ప్రోత్సాహకాలు ఇస్తున్నప్పుడు ఎవ్వరూ తప్పు పట్టడం లేదు.కానీ ఇలాంటి పుట్టు బ్రాహ్మణూల సంఖ్య పెరిగితే మాత్రం పరిస్థితి మళ్ళీ మొదటి కొస్తుంది - చరిత్ర వెనక్కి నడుస్తుంది.

     మిగతా కులాలలో ఆ కులసంస్కృతి అందరికీ సమానంగానే ఉంటుంది.కానీ బ్రాహ్మణ కులంలో వైదికులు,నియోగులు అనే రెండు శాఖల వారు ఉన్నారు.స్వభావంలో గానీ వ్యవహారశైలిలో గానీ ఒకరికొకరికి ఏమాత్రం పోలిక ఉండదు - అయినా బైటినుంచి చూసేవారికి అందరూ ఒకరకం బ్రాహ్మణులే అనిపిస్తారు!వైదికులు ప్రాచీన కాలం నుంచీ అధ్యయనానికీ, నిష్ఠకీ, సంప్రదాయాలకీ అంకితమైపోయారు.ఋగ్వేదం 2వ మండలం,3వ సూక్తం,6వ ఋక్కు:బట్టలు నేయు విద్య,ఋగ్వేదం 3వ మండలం,53వ సూక్తం,19వ ఋక్కు:బండ్లు,రధములు మరియు లోహపు పనులు చేయుట,ఋగ్వేదం 1వ మండలం,140వ సూక్తం,10వ ఋక్కు:బంగారు పని చేయుట,ఋగ్వేదం 2వ మండలం,34వ సూక్తం,6వ ఋక్కు:బంగారమును త్రవ్వి యెత్తెడి విధానం,ఋగ్వేదం 4వ మండలం,57వ సూక్తం,1 మరియు 8వ ఋక్కులు:కృషి విద్య,ఋగ్వేదం 10వ మండలం,101వ సూక్తం,3 మరియు 7వ ఋక్కులు:బావులను త్రవ్వి నగలిని చేసి విత్తులు చల్లదం వంటి విషయాలు,ఋగ్వేదం 10వ మండలం,93వ సూక్తం,13వ ఋక్కు:బావుల నుండి నీరు తోడి పైరులకు పారించు విధానం,ఋగ్వేదం 1వ మండలం,23వ సూక్తం,2వ ఋక్కు:సముద్రంపైన ఓడలు నడిపే విధానం - ఇవన్నీ బ్రాహ్మణేతరుల కులవృత్తులకి సంబంధించిన విషయాలే కదా!బ్రహ్మణులు చెప్పకుండా ఈ విద్యలు కులవృతుల వాళ్ళకి ఎలా తెలిశాయి?

     పోనీ వాళ్ళ దగ్గిరే పెట్టుకున్నారు,నేర్పటం మాత్రమే చేశారు, మమ్మల్ని పైకి ఎదగనివ్వలేదు అని అనటానికీ వీల్లేదు.ఎందుకంటే, క్రీ.శ 1000వ సంవత్సరంలోని కురవాడ శాసనంలో "అనే చ్చిమూరువాస్తవ్యో దేవార్యో దేవసన్నిభః భ్రద్వాజాన్వయః కమ్మకులజఆహ్ కులవర్ధనః తస్యాం భవత్సూత్ శ్రీమాన్ గోవిందో గురునందనః శ్రౌతస్మారత్క్రియాధార స్సత్తమ స్సద్విజోత్తమః" అని స్పష్టంగా ఉంది.ఈ శాసనం వేయించినది రెండవ అమ్మరాజ విజయాదిత్యుడు.ఇలాంటి అనేక శాసనాలను పరిశోధించిన చిలుకూరి వీరభద్రరావు గారు విశ్లేషించి చెప్పిన దాని ప్రకారం కమ్మకులజుడైన దేవనయ్య వేదం నేర్చుకుని శుద్ధవైదికబ్రాహ్మణుడిగా జీచించినట్టు స్పష్టంగా తెలుస్తున్నది.అబ్బెబ్బే, వీళ్ళు పెద్ద కులాల వాళ్ళు, బాగా డబ్బు సంపాదించి కొనుక్కున్నారు, మా కులాలకి మాత్రం ఆ చాన్సు రాలేదు అనటానికి వీల్లేకుండా ఎపిగ్రాఫికా ఇండికా సం.6 పే.236 ప్రకారం క్రీ.శ 973లో కమ్మకులస్థుల్లో షట్కర్మ నిరతులు ఉండేవారనీ, కౌండిన్య గోత్రులైన వంగ్ర బోయ,కొళ్ళిపుర బోయ,కురియెద బోయ అను బోయ కులాల నుండి కూడా వేదం నేర్చుకుని బ్రాహ్మణులుగా జీవించినవారు ఉన్నారని దృష్టాంతాలు ఉన్నాయి.నేను పైన చెప్పిన ఋగ్వేదంలోని విషయాలు 17వ శతాబ్దానికి చెందిన ఒక బ్రాహ్మణేతరుడు రాసిన వేదార్ధ ప్రకాశిక అనే గ్రంధం లోనివి.మరి, బ్రాహ్మణులు ఇతర కులాల వాళ్ళని వేదం చదవనివ్వకుండా చేసి దాచుకుని దోచుకున్నది ఎక్కద?మెకాలే విద్యావిధానం ఈ దేశంలోకి రాకముందు ఉన్న ఓరియెంటల్ ఎడ్యుకేషన్ సిస్టం ఉన్నప్పుడు కూడా స్టూడెంట్లుగా బ్రహ్మణేతరులే ఎక్కువగా ఉండేవాళ్ళు - కట్టుకధలు కాదు ఖచ్చితమైన లెక్కలే ఉన్నాయి వీటికి!

     భారతీయ సమాజంలో విప్లవాత్మకమైన సంస్కరణలకు తెరయెత్తినవారిలో జ్యోతిబా పూలే ప్రధముడు కాదు గదా, అంతకుముందు ప్రాణహానికి కూడా వెరవకుండా సంస్కరణల కోసం పోరాడిన బ్రాహ్మణోత్తములూ ఉన్నారు!ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ఇలాంటివి తెలిస్తే ఈర్ష్యతో కూడిన నిష్కారణ బ్రాహ్మణద్వేషం పోయినప్పుడు మాత్రమే అసలైన బ్రాహణాధిక్యత యొక్క స్వరూపం అర్ధమవుతుంది!కరణాలు, మంత్రులు, సైన్యాధ్యక్షులు, రాజులుగా ప్రభుత్వాలను నడిపిన వారు తమ ఆధిక్యతని సాగించుకోవటానికి ఎక్కువ బ్రాహ్మణాధిక్యతని ప్రదర్శించారు.వీరు చేసిన సూత్రీకరణల్ని గ్రంధస్థం చెయ్యడానికి కొందరు వైదికులు చేతివాటపు సహాయాలు చేసినది కూడా వాస్తవమే!

     బ్రాహ్మణాధిక్యతకి సంబంధించిన ప్రముఖమైన సాక్ష్యం పరశురాముడు 21 సార్లు అప్పటి క్షత్రియ ప్రభువుల్ని సంహరించి తను జయించిన భూమి నంతట్నీ బ్రాహ్మణులకి దానం చేశాడని చెప్పే కధ. దీనిలోని కొసమెరుపు బూతు యేమియేమిటంటే,ఆ బ్రాహ్మణులకీ విధవలయిన రాజపత్నులకీ పుట్టిన సంకరజాతి రాజవంశాలే కలియుగంలోని రాజవంశాలు అనేది!నిజానికి భారతదేశంలో రాజ్యం అనేది ఏర్పడిన తొలిదశలో బ్రాహ్మణులే రాజులు,తర్వాతి కాలంలో బ్రాహ్మణేతరులు కూడా ప్రభువు లయ్యారు.పరశురాముడు ఈ రాజవంశనిర్మూలన ఎప్పుడు చేశాడు?రామాయణ కాలానికి ముందు అయితే దశరధుడూ జనకుడూ సంకరులు కావాలి,రామాయణ కాలానికి తర్వాతా మహాభారత కాలానికి ముందూ అయితే కురువంశం సంకరమైనది కావాలి - యుద్ధం జరిగిన కొద్ది కాలానికే కలియుగం వచ్చేసింది కదా!ఈ కధని కల్పించి మధ్యలో ఇరికించిన వాళ్లలో ఉన్నది మామూలు స్థాయి అహంకారం కాదు కలియుగంలోని రాజులంతా మేము వాళ్ళ పూర్వీకుల భార్యలకి కడుపు చేస్తే పుటినవాళ్లే అని చెప్పుకునే పైత్యకారిబూతుతెలివి కూడా ఉంది!తన ఆశ్రమంలో చేసిన భీబత్సానికి ఆగ్రహించిన పరశురాముడు కార్తవీర్యార్జునుడితో యుద్ధం చెయ్యటం వరకూ ఆ కధ ఎన్ని పురాణాల్లో చెప్పినా వైరుధ్యాలు ఉండటం లేదు. కానీ ఏ రాజవంశం యొక్క రాజవంశావళిలోనూ ఫలానా రాజు కాలంలో పరశురాముడు ఈ వంశపు రాజుని చంపేశాడు అనే సాక్ష్యం కనబడటం లేదు - ప్రతి రాజవంశం సూర్యుడి నుంచో చంద్రుడి నుంచో అగ్ని నుంచో పుట్టి అవిచ్చిన్నంగా సాగి వచ్చినట్టే ఉంటుంది!


సీ.పరశురాముండు భీకరనిజకోపాగ్ని
      నుగ్రుఁడై యిరువదియొక్కమాఱు
ధాత్రీతలం బపక్షత్రంబు సేసినఁ
      దత్క్షత్రసతులు సంతానకాంక్ష
నెలయంగ ఋతుకాలముల మహావిప్రుల
      దయఁజేసి ధర్మువు తప్పకుండఁ
బడసిరి పలువురఁ గొడుకులఁ గూఁతుల
      నిప్పాటఁ దత్క్షత్ర మెసగి యుర్వి
తే.గీ.బర్వి రాజధర్మపధనీతి విడువక 
        జారచోరదుష్టజనుల బాధఁ
        బొరయకుండ నిఖిలభూ ప్రజాపాలనఁ
        జేయుచుండె శిష్టసేవ్య మగుచు.

     కలియుగంలో సుక్షత్రియులు లేరు అని చెప్తున్న పద్యం ఉన్న భారతాన్ని అనువదించిన నన్నయభట్టు కృతిపతి వంశావళిని చెప్తూ రాజరాజనరేంద్రుణ్ణీ సుక్షత్రియుడని సంబోధిస్తాడు - వారి వంశంలోని ఏ రాజూ పరశురాముని చేతిలో హతుడైన  సాక్ష్యం కనపడదు!అంకితం పుచ్చుకున్న రాజరాజుకు తెలియదా అని అడగవచ్చు,కానీ ఇవ్వాళ్టి ప్రచురణకర్తలలో మాత్రం పుస్తకం మొత్తం చదివి సారం చూసి పబ్లిష్ చేసేవాళ్ళు ఎంతమంది?కొన్ని ప్రిడిక్షన్లు,కొన్ని మొహమాటాలు,కొన్ని అవసరాలు - ఇవే అప్పుడూ ఇప్పుడూ పుస్తకం గొప్పదనానికి ప్రచురణకర్తల గీటురాళ్ళు, యే సాహిత్యరూపం ఎక్కువ అమ్ముడుపోతుందని అనిపిస్తుందో దాన్ని చూసీ చూడకుండా తోసెయ్యడమే - ఆ హడావిడిలో ఇలాంటి ప్రమాదకరమైన విషయాల్ని అసలువాడి దృష్టికి రాకుండా దాచేస్తారు.

శ్లో.బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యాః శూద్రావర్ణాస్త్రయోద్విజాః
    యుగేయుగే స్థితా స్సర్వే కలా నాద్యంతయో స్థితాః

     ఇది శూద్రకమలాకరం అనే గ్రంధంలోని శ్లోకం.ఇది రాసింది బ్రాహ్మణుడు.అంకితం పుచ్చుకున్నది విజయనగరం సంస్థానానికి చెందిన ప్రభువు.ప్రతి యుగంలోనూ బ్రాహ్మణక్షత్రియవైశ్యశూద్రులు ఉంటారు,కానీ కలియుగంలో క్షత్రియులూ వైశ్యులూ ఉండరు, ఉన్నా సంకరులే అని బల్లగుద్ది చెప్పేశాడు రచయిత.దీన్ని తీసుకెళ్ళి ఒక రాజుగారి ముందర పెట్టాడు.ఆయన మెచ్చుకుని ప్రచారంలోకి తెస్తానన్నాడు.దాంతో కవిగారు తన పుస్తకాన్ని రాజుగారికే అంకితమిచ్చి ఆయన వంశనామావళిని వర్ణించి ఆ రాజుగార్ని సుక్షత్రియుడని పొగిడేశాడు.అంకితం ఇచ్చినవాడి ధైర్యం గొప్పదా?అంకితం పుచ్చుకున్నవాడి అజ్ఞానం గొప్పదా!

     ఇవన్నీ ఒక్కచోట చేర్చి రాస్తే మొదట్లోనే వీళ్ళ దుర్మార్గం మిగతావాళ్ళకీ తెలిసేది అప్పుడే వీళ్ళని ఉతికి ఆరెసి చిలక్కొయకి తగిలించేవాళ్ళు - అందుకే అక్కడక్కడా ఇరికించారు!ఒక తొమ్మిది కడుచక్కని సుభాషితాలు రాసి పదోదిగా దీన్ని ఇరికించేవాళ్ళు.దీన్ని విడమర్చి చెప్పే పౌరాణికులూ వ్యాఖ్యాతలూ ప్రేక్షకుల్ని బట్టి దీన్ని వదిలేసి మిగతావి చెప్పేవాళ్ళు - అంతా ఒక తానులో ముక్కలే కదా.

శ్లోకం:తంహి స్వయంభూ స్స్వా దాస్యత్తపస్తప్త్వాధితోసృజత్
          హవ్యక న్యాభినాహ్యాయ సర్వ స్యాస్య గుప్తయే.
మనుస్మృతి 1వ అధ్యాయం 94వ శ్లోకం
భావం:ఈ బ్రాహ్మణుని బ్రహ్మ తపంబొనర్చి తన ముఖము నుండి హవ్యకవ్యములను నడుపుటకు మరియు నీ సకల జగత్తు యొక్క రక్షణ కొరకు ముందుగ సృజించెను.
శ్లోకం:బ్రాహ్మణో జాయమానోహి పృధివ్యా మధిజాయతే
          ఈశ్వర స్సర్వభూతానాం ధర్మకోశస్య గుప్తయే.
మనుస్మృతి 1వ అధ్యాయం 99వ శ్లోకం.
భావం:సర్వభూతముల యొక్క ధర్మమను ధనరాశిని రక్షించుటకు భూమియందు బ్రాహ్మణుడై ఈశ్వరుడు జన్మించుచున్నాడు
శ్లోకం:సర్చస్వం బ్రాహ్మనస్యేదం యతింవ్జి జ్జగతీగతం
          శ్రేష్ఠ్య నాభిజనే వేదం సర్వం వై బ్రాహ్మణోర్హతి.
మనుస్మృతి 1వ అధ్యాయం 10వ శ్లోకం.
భావం:భూమి యందేమి ధనము గలదో అది యంతయు బ్రాహ్మణూనికి స్వయమని చెప్పబడినది.
శ్లోకం:తాడయిత్వా తృణేనాపి సంఅరంభా న్మతిపూర్వకం
          ఏకవింశతి మాజాతీః పాపయోనిషు జాయతే.
మనుస్మృతి 4వ అధ్యాయం 166వ శ్లోకం:
భావం:గడ్డిపరక చేతనైన బుద్ధిపూర్వకముగ బ్రాహ్మణుని గొట్టిన యెదల యిరువదియొక్క జన్మమూల దనుక శునకాది పాపయోనుల యందు బుట్టును.

     ఇంత నొక్కి చెప్తున్నది సత్త్వగుణం చేత బ్రాహ్మణులైన వారి గురించి కదా,అందులో తప్పేమిటి అని అనుకోవడానికి వీల్లేదు.గుణాన్ని బట్టి గౌరవించడానికి ఇంత నొక్కి చెప్పాల్సిన అవసరం లేదు కదా - కంటి ముందు కనిపించే శిఖాయజ్ఞోపవీతసమన్వితులైన బ్రాహ్మణులకు అవసరమైనదాని కన్న ఎక్కువ గౌరవాల్ని కట్టబెట్టడానికే ఇవన్నీ చెప్పినది!అసలు కులసాంకర్యం విషయానికి వస్తే జరిగినది వీరు చెప్తున్న దానికి భిన్నంగా జరిగింది.ఇవ్వాళ మనం బ్రాహ్మణులు అని ఎవరిని అంటున్నామో ఆ కులం మిగతా అన్ని కులాలూ ఏర్పడిన తర్వాత అన్ని కులాల నుంచీ సాత్వికులు ఆధ్యాత్మికంగా ఎదిగి బ్రాహ్మణులై సకలజనసాంకర్యం చేత ఏర్పడినదే!

వచనం:గరూశుండను మానవునివలనఁ గొందఱు గారూశులను క్షత్రియులు గల్గి  ధర్మము తోడి ప్రియంబున బ్రాహ్మణులై  యుత్తరాపధమునకు రక్షకు లయిరి.దృష్టుని వలన దార్ష్ట్యం బను వంశంబు గల్గి భూతలంబున బ్రహ్మభావంబు నొంది నెగడె......దేవదత్తుఁ డా పండితునకు నగ్నివేశుండు సుతుఁడై జనించి యా యగ్నివేశుండు గానీనుండన నెడి జాతకర్ణుండను మహర్షియై వెలసె,అతని వలన నాగ్నివేశ్యా యనంబడు బ్రహ్మకులంబు గలిగె
భాగవతము 9వ స్కంధము
వచనం:....శినికి గార్గ్యుఁడు గలిగె,నాతని నుండి బ్రాహ్మణ కులంబయ్యె,మహావీర్యునకు సురుక్షయుండును,సురుక్షయునకు ద్రయ్యారుణియు,గవియు,బుష్కరారుణియు నను మువ్వురు సంభవించిరి.వారును బ్రాహ్మణులై చనిరి....అండజామీరుని వంశంబునఁ బ్రియమేధాదులు పుట్టి బ్రాహ్మణూలై చనిరి.
భాగవతము 9వ స్కంధము,రంతిదేవుని చరిత్ర

     దీనికి భిన్నంగా మిగిలిన కులాలు వృత్తులకు అనుబంధమైనవి కాబట్టి సాంకర్యానికి ఆస్కారమే లేదు!పాండిత్యం చేతనో,యోధత్వం చేతనో,సంస్కారం చేతనో మేము ఇతరుల కన్న గొప్పవాళ్ళం అని అనుకోవడం వరకు సహించవచ్చును - నిలదీసి అడిగినప్పుడు సాక్ష్యం చూపించితే వెనక్కి తగ్గడానికి ఎవరికీ అభ్యంతరం ఉండదు!కానీ,మేము మాత్రమే అనంతకాలం నుంచీ కులసాంకర్యం లేకుండా స్వచ్చంగా ఉన్నాము,ఇతర కులాలు అన్నీ సంకరమైపోయినాయి అని చెప్పడాన్ని కూడా ఇతర కులాల వారు సహించుతారని వీరెట్లా అనుకున్నారు?అదీగాక దాదాపు ప్రతి కులమూ బ్రాహ్మణ పురుషుడి ద్వారానో బ్రాహ్మణ స్రీ ద్వారానో పుట్టింది అని తీర్మానించడం దేన్ని సూచిస్తుంది?

శోకం:నిషాదో మార్గవం సూతే దాసం నౌకర్మజీవనం
కైవర్తమితి యం ప్రాహు రార్యావర్తనివాసినః
మనుధర్మశాస్త్రం 4వ శ్లోకం
భావం:బ్రాహ్మణునకు శూద్రభార్య యందు బుటినవాడైన నిషాదుఁ డాయోగవస్త్రీయందు నావ నడుపుటయే వృత్తిగా గలిగిన మార్గవుని గలుగఁజేయుచున్నాడు.వాని నార్యావర్త దేశవాసులు కైవర్తుడు(బెస్తవాడు) అని పిలుచుచున్నారు.
శ్కోకం:క్షత్రియా ద్విప్రకన్యాయాం సూతో భవతి జాతితః
వైశ్యా న్మాగధ వైదేహౌ రాజవిప్రాంగనాసుతౌ.
భావం:క్షత్రియునకు బ్రాహ్మణస్త్రీయందుఁ బుటినవాడు సూతుఁడనియు,వైశ్యునకు క్షత్రియ స్త్రీయందుఁ బుట్టినవాడు మాగధుఁడనియు,వానికే బ్రాహ్మణస్త్రీయందుఁ బుట్టినవాడు వైదేహుఁడనియు జెప్పబడును.

     చారిత్రకంగా ప్రతి కులానికీ ఒక వృత్తి మూలమై ఉండటమూ ఆ వృత్తికి ఉన్న ప్రాధాన్యతని బట్టి కొన్ని తరాల పాటు ఆ వృత్తిని ఆదాయమార్గంగా చేసుకోవడం ద్వారానే స్థిరమై నిలిచాయనేది కళ్ళకి కట్టినట్టు గోచరిస్తుంటే ఇట్లా X అనే బ్రాహ్మణుడు Y అనే కులానికి చెందిన Z అనే స్త్రీకి కడుపు చేస్తే A అనే కులం పుట్టిందని రాయడం ఎంత నీచత్వం?లేదని బుకాయిమంచడానికి వీల్లేకుండా బ్రాహ్మణాధిక్యత అనేది ఉన్నదని స్పష్టంగా తెలుస్తున్నది కదా!ఇది తెలియాల్సిన వాళ్ళకి తెలియడంతో బ్రాహ్మణ వ్యతిరేకతా ఉద్యమం పుట్టింది.ఈ పేరు చెప్పగానే తమిళనాడులోని పెరియార్ గుర్తుకు రావటం సహజం,కానీ ఈయన 19వ శతాబ్దం వాడు, ఆంధ్ర ప్రాంతంలో వీరేశలింగం పంతులు కన్నా ముందుగానే తెలుగునాట ఒక చిచ్చరపిడుగు పుట్టాడు - అతని పేరు స్వామినేని ముద్దునరసింహం(జననం:క్రీ.శ.1792, మరణం:క్రీ.శ.1856)!ఈ చిచ్చరపిడుగు లాగే ఆ చిచ్చరపిడుగు కూడా వెలమవాడే - చిచ్చరపిడుగు లంతా వెలమకులంలోనే పుడుతున్నారు, హార్నీ!అతను పేల్చిన బాంబు పేరు హితసూచని అనే గ్రంధరాజం!తర్వాత కాలంలో ఆత్మూరి నరసింహం(1845-1901), కందుకూరి వీరేశలింగం(1848-1919), గురజాడ అప్పారావు(1862-1915) లాంటివాళ్ళు ఎత్తుకున్న పరస్పర విభిన్నమైన సంస్కరణా ప్రణాళిక లన్నిటికీ programmatic background ఇచ్చింది హితసూచనియే - పేలింది ఆటంబాంబు కాబట్టి దానివల్ల జరగాల్సిన పని కూడా చాలా నిక్కచ్చిగా జరిగింది!

     హితసూచనిలో ముద్దునరసింహం ఇచ్చిన కార్యక్రమం తెలుగునాట 20వ శతాబ్దం ప్రారంభానికే ఒక స్పష్టమైన రూపు తీసుకున్నది.కుల సంఘాలు ఏర్పడి తమ కులాన్ని అభివృద్ధి చెసుకోవడానికి కార్యక్రమాలు మొదలుపెట్టాయి.క్రీ.శ.1903లో పుట్టిన విశ్వబ్రాహ్మణ కుల సంఘం నుండి క్రీ.శ.1926లో పుటిన క్షత్రియ కుల సంఘం వరకు అందరిదీ ఒకటే ప్రణాళిక:1).స్వకుల విద్యాభివృద్ధిని గుర్తించి వారి కులానికి చెందిన విద్యార్ధుల కొరకు ప్రత్యేక హాస్టళ్లను నిర్మించడం,వీలయితే బీద విద్యార్ధులకు ధనసహాయం చేసి విదేశాలకు పంపించడం.2).విద్య,ఉద్యోగ,ఉపాధి రంగాలలో తమ స్థానం కోసం పోరాడటం.3).బాల్యవివాహాలను వ్యతిరేకించడం,వితంతు పునర్వివాహం లాంటివాటిని ప్రోత్సహించడం - ఇదంతా హితసూచని వేసిన రాజమార్గమే!

     మద్రాసు ప్రెసిడెన్సీలో క్రీ.శ.1916 డిసెంబరులో బ్రాహ్మణేతర ఉద్యమ ప్రణాళిక ప్రకటించే నాటికి ముందుగానే ఆంధ్ర ప్రాంతంలో కృష్ణా,గుంటూరు జిల్లాలు కేంద్రంగా బ్రాహ్మణేతర ఉద్యమం ఒక స్పష్టమైన రూపాన్ని తీసుకున్నది. స్మృతి, పురాణ, ఇతిహాసాలను హేతువాద దృష్టితో అధయయనం చెయ్యడం తెలుగునాట త్రిపురనేని రామస్వామి చౌదరి(క్రీ.శ,1887-క్రీ.శ.1943)తో ఉధృతమైంది. ఆయన సూతాశ్రమాన్ని స్థాపించి చాలామంది శిష్యులను తయారు చేసుకున్నాడు.కమ్మ, కాపు, వెలమ, రెడ్డి, బలిజ తదితర వ్యవసాయ శూద్ర కులాలు క్షత్రియులేననీ వారు వేదవిద్యార్హులేననీ వాదిస్తూ నాటి గుంటూరు జిల్లాలోని ఒంగోలు తాలూకాకు చెందిన కొప్పోలు గ్రామ నివాసి సింగమనేని రామయ్య తాను స్వయంగా యజ్ఞయాగాలు నిర్వహించడం ద్వారా రామయాజి ఆనె పేరు తెచ్చుకోవడమే కాకుండా క్రీ.శ.1908 నాటికే తన వాదనను నిరూపిస్తూ మహేంద్రోపన్యాసమనే గ్రంధాన్ని రాశారు.అయితే, వీరందరూ వ్యక్తిగత స్థాయి కార్యక్రమాలలో మంచిపేరు తెచ్చుకున్నప్పటికీ విస్తృత పరిధిలో ప్రజలను ఐక్యం చెయ్యగలిగిన ఒక తాత్విక బూమిక, కలిసిన ప్రజలను ఏకోన్ముఖంగా నడిపించే రాజకీయ కార్యాచరణ ప్రణాళిక(political ideology) లేదు. ఆ లోటును తీర్చినవాడు సూర్యదేవర రాఘవయ్య చౌదరి(జననం:?,మరణం:1937) అనే ఒక సామాన్య వ్యక్తి, కేవలం formal educationతో సరిపెట్టుకున్న వాడు, తను అతి సామాన్యుడననీ తనను మించిన పెద్దలు ఎందరో ఉన్నారని తెలిసినా  హిందూమతం యొక్క అభ్యున్నతి కోసమే తను చొరవ తీసుకోవలసి వచ్చిందనీ తన గురించి చెప్పుకున్నాడు.

     ముద్దునరసింహం నుంచి రాఘవయ్య చౌదరి వరకు గల బ్రాహ్మణేతర మేధావులలో ఎవ్వరికీ హిందూమతద్వేషం లేదు - కేవలం కల్పిత విప్రాధిక్యత వల్ల తేజస్సు కోల్పోయిన సనాతన ధర్మాన్ని పూర్వరూపంలో నిలబెట్టడానికి వారు చేసిన కృషిలో నిజాయితీ ఉంది,కనుకనే సత్యానికి కటుబడిన బ్రాహ్మణులు కూడా వీరిని అనుసరించారు!అయితే,తిరిగి సనాతన ధర్మాన్ని పూర్వరూపంలో నిలబెట్టడం అసాధ్యం అని వీరు తెలుసుకోలేకపోయారు.అందుకే ఉద్యమం చల్లబడిపోయింది.మాయమైపోయింది.కాలానికి ఒక చిత్రమైన లక్షణం ఉంది - ఎంతమంది ఎంత మొండికి తిరిగి ఎన్ని రకాలుగా ప్రయత్నించినా అది పొరపాటున కూడా వెనక్కి నడవదు, ఎప్పుడూ ముందుకే నడుస్తుంది!తిరిగి సాధించలేని చేజారిన గతం,ఎప్పటికీ చేరుకోలేక వూరించే భావి - ఈ రెంటి మధ్యన అర్ధం చేసుకోవడానికీ ఆలోచించడానికీ దిశను మార్చుకోవడానికీ చాలినంత సమయం ఇవ్వకుండా హఠాత్తుగా మనమీదకి దూకే అత్యంత కీలకమైన ఈ వర్తమానం అనే బిందువు యొక్క పరిమాణం ఎంత?సంవత్సరమా, ఆయనమా, మాసమా, వారమా, దినమా, క్షణమా - బ్రాహ్మణులు తమకు లేని గొప్పను ఆపాదించుకుని ఇతర కులాల్ని అణిచివెయ్యడం అనేది నిజంగా జరిగిందా!జరిగితే ఎప్పుడు మొదలైంది?

     సూర్యదేవర రాఘవయ్య చౌదరి గారి పరిశీలన ప్రకారం క్రీ.శ 1000వ సంవత్సరంలోని కురవాడ శాసనంలో "అనే చ్చిమూరువాస్తవ్యో దేవార్యో దేవసన్నిభః భ్రద్వాజాన్వయః కమ్మకులజః కులవర్ధనః తస్యాం భవత్సూత్ శ్రీమాన్ గోవిందో గురునందనః శ్రౌతస్మారత్క్రియాధార స్సత్తమ స్సద్విజోత్తమః" అని స్పష్టంగా ఉంది.ఈ శాసనం వేయించినది రెండవ అమ్మరాజ విజయాదిత్యుడు.ఇలాంటి అనేక శాసనాలను పరిశోధించిన చిలుకూరి వీరభద్రరావు గారు విశ్లేషించి చెప్పిన దాని ప్రకారం కమ్మకులజుడైన దేవనయ్య వేదం నేర్చుకుని శుద్ధవైదికబ్రాహ్మణుడిగా జీచించినట్టు స్పష్టంగా తెలుస్తున్నది.అబ్బెబ్బే,వీళ్ళు పెద్ద్ద కులాల వాళ్ళు,బాగా డబ్బు సంపాదించి కొనుక్కున్నారు,మా కులాలకి మాత్రం ఆ చాన్సు రాలేదు అనటానికి వీల్లేకుండా ఎపిగ్రాఫికా ఇండికా సం.6 పే.236 ప్రకారం క్రీ.శ 973లో కమ్మకులస్థుల్లో షట్కర్మ నిరతులు ఉండేవారనీ, కౌండిన్య గోత్రులైన వంగ్ర బోయ,కొళ్ళిపుర బోయ,కురియెద బోయ అను బోయ కులాల నుండి కూడా వేదం నేర్చుకుని బ్రాహ్మణులుగా జీవించినవారు ఉన్నారని దృష్టాంతాలు ఉన్నాయి.కాబట్టి కల్పిత విప్రాధిక్యం, బ్రాహ్మణేతర కులసాంకర్యం లాంటివి ప్రతిపాదించబడటం, గ్రంధస్థం కావడం, ఆమోదించబడటం 1వ శతాబ్దం తర్వాతి కాలంలో జరిగి ఉండవచ్చును.ఇది ఈ కాలంలోనే జరిగిందనటానికి నాకు కూడా ఒక ఆధారం దొరుకుతున్నది.దేశంలోని ఇతర ప్రాంతాల సంగతి నాకు తెలియదు గానీ క్రీ.శ 1వ శతాబ్దం అంటే ఆంధ్రప్రాంతానికి సంబంధించి శాతవాహనులు పరిపాలించిన కాలం అని తెలుసు.ఇప్పుడు కమ్యూనిష్టు భావజాలం ఉన్నవాళ్ళు విమర్శించే నిచ్చెనమెట్ల సాంఘిక నిర్మాణం వీరి పరిపాలనలోనే ఏర్పడింది.

     క్రీ.పూ 1వ శతాబ్దిలో ఉత్తర దక్షిణ భారతాలను రెంటినీ యేకం చేసి పరిపాలించిన మౌర్యసామ్రాజ్యం కాలవశాన బలహీన పడగా స్వతంత్రించి రాజ్యాలను యేర్పరచుకున్న వారిలో "యేకరాట్" అనే బిరుదునామం కలిగిన శ్రీముఖుడి ద్వారా స్థాపించబడిన శాతవాహన సామ్రాజ్యంలో ఇప్పటి నవ్యాంధ్ర తెలంగాణా రాష్ట్రాలకు చెందిన ప్రాంతాలను హృదయస్థానంలో వుంచుకుని అమరావతి ఒక రాజధానిగా తొలి తెలుగు సామ్రాజ్యం అవతరించింది!తొలి శాతవాహనుల్లో శ్రీముఖ శాతకర్ణి రాజ్యాన్ని స్థాపించి నిలబెట్టినా 1వ శాతకర్ణి మహా బలంతో పరాక్రమించి అన్నివైపులకీ వ్యాపించి "దక్షిణాపధపతి" అనే గొప్ప బిరుదు సంపాదించాడు.ఖారవేలుణ్ణి జయించి మగధ వరకూ వ్యాపించాడు!తూర్పున నర్మద వరకూ వ్యాపించి శకుల నుంచీ గ్రీకుల నుంచీ జరుగుతున్న దండయాత్రల్ని నిరోధించి దేశాన్ని శాంతియుతంగా నిలబెట్టాడు.రెండు అశ్వమేధాలూ ఒక రాజసూయం చేసిన ఘనుడు!మలి శాతవాహనుల్లో తన పూర్వీకులు పోగొట్టుకున్న భూభాగాల్ని శకుల నించి మళ్ళీ సాధించి నిలబెట్టిన క్రీ.శ 1వ శతాబ్ది నాటి గౌతమీపుత్ర శాతకర్ణి ప్రముఖుడు. బౌధ్ధులకి చెప్పుకోదగిన రీతిలో దానాలు చేసినా తను బ్రాహ్మణుడు కావటం వల్లనో యేమో "యేక బ్రాహ్మణ" అనే బిరుదును సాధించాడు!దొరికిన ఆధారాలను బట్టి శాతవాహనుల కాలం నాటి సమాజం ఇలా ఉండేది:రాజు దైవాంశ సంభూతుడనే మూఢనమ్మకాలు లేకుండా ధర్మశాస్త్రాల కనుగుణంగా సామాజిక సాంప్రదాయాలకు విలువనిచ్చి కడుచక్కని పరిపాలన సాగించారు శాతవాహన ప్రభువులు.రాజుకు సలహాలు ఇవ్వడానికి మంత్రిమండలి ఉండేది,రాజ్యం పెద్దది కావడంతో భాగాలుగా విభజించి ప్రాంతాలకు "రాజ", "మహాబోజ", "మహారధి" నామాలతో అధిపతుల్ని నియమించారు.సమాజం లోని ప్రజానీకం నాలుగు తరగతులుగా వర్గీకరించబడి ఉంది - పైన చెప్పుకున్న అదిపతులు పైస్థాయిలోని ప్రభు వర్గం,దానికి కింది అంతరువుగా అమాత్యులూ మహామాత్రులూ వంటి ఉద్యోగశ్రేణులూ తమ వ్యాపారకౌశలంతో రాజ్యపు సంపద పెంచే ప్రజ్ఞ వుండి సమాజంలో మంచి పరపతి గల్గిన వణిక్ప్రముఖులూ,మూడవ అంతరువులో ఇప్పటి మధ్యతరగతి కుటుంబాలతో పోల్చదగిన వైద్యులూ కవిగాయక శిఖామణులూ రైతులూ కుమ్మర్లూ కమ్మర్లూ,అన్నిటికన్నా కింది అంతరువుల్లో ప్రధాన వృత్తులకి అనుబంధమైన వృత్తి పనివాళ్ళయిన వడ్రంగులూ జాలర్లూ వంటివాళ్ళు వుండేవాళ్ళు. గ్రామస్థాయిలో ప్రతి కులానికీ ఒక కులపెద్ద ఉండేవాడు,అన్ని గ్రామాలలోని కులపెద్దలూ కలిసి ప్రభుత్వానికీ తమ తమ కులసమూహాకీ వారధులుగా ఉండేవాళ్ళు. తొలిదశలోని ఈ యేర్పాటుని ఏ కులం వారూ వ్యతిరేకించలేదు - వారి ఉత్పత్తుల మీద వారికి ఎకనమిక్ మోనోపలీని తెచ్చిపెట్టింది కదా!

     చరిత్రను ఎంత నిశితంగా పరిశీలించినా ఈనాడు కొందరు అక్కసు వెళ్ళగక్కుతున్నట్టు కులవ్యవస్థ బ్రాహ్మణులు పైనుంచి రుద్దడం వల్ల ఏర్పడలేదు - అది కూడా ఆర్యద్రవిడసిద్ధాంతం లాగే కమ్యునిష్టులు కల్పించిన ఆబద్ధం!మిగిలిన కులాలు రాజ్యానికి కావలసిన ఉత్పత్తికి సంబంధించిన లౌకికపరమైన ఏర్పాటు వల్ల పుట్టినవి కాగా ఇవ్వాళ మనం చూస్తున్న బ్రాహ్మణకులం అన్ని కులాలకు సంబంధించిన ఆధ్యాత్మిక అవసరాల కోసం చేసుకున్న ఏర్పాటు!బ్రాహ్మణకులం కూడా కులవ్యవస్థలోని ఒక భాగమే - చాతుర్వర్ణంలోని బ్రాహ్మణ పదం వీరి కులానికి పర్యాయం కావడం వల్ల ఈ అబద్ధపు వాదన నిజమేనని అందరూ భ్రమపడటం జరిగింది.బ్రాహ్మణులలోని కొందరు తమ పాండిత్యం యొక్క ఔద్ధత్యాన్ని చూపిస్తూ వ్యాస మహర్షి వంటి గొప్పవారి కావ్యాలలో కూడా వారి ఆదర్సవంతమైన భావాలకు విరుద్ధమైన ప్రక్షిప్తాలను చేర్చి కల్పిత విప్రాధిక్యతని ప్రచారం చేశారు.అది కమ్యునిష్టులకి బ్రాహ్మణులే కులవ్యవస్థని పైనుంచి రుద్దారనే సూత్రీకరణ చెయ్యడానికి దారి చూపించింది.వ్యాసప్రోక్తాలుగా నిర్ధారించబడిన బాగాల్లో కనిపించే శరీధర్మశాస్త్రం, యోగశాస్త్రం, ఖగోళశాస్త్రం, భూగోళశాస్త్రం మొదలైన విషయాలను పరిశీలిస్తే  అతడు సత్యానికి కట్టుబడిన నిజమైన జ్ఞాని అని తెలుస్తుంది.అటువంటి వాడు సమజాన్ని సంస్కరించాలనే సదుద్దేశంతో  రచన చేస్తూ మళ్ళీ తద్విరుద్ధమైన ప్రస్తావనల్ని ఎందుకు చేస్తాడు?కల్పితమైన ఆధిక్యత కోసం పాకులాడిన పండిత ప్రకాండులు తమకి ఏ విషయం గురించి ఎలాంటి సమర్ధన అవసరం అవుతుందో దాని ప్రకారం  వ్యాసుడి శైలిలో ఒక ఉపాఖ్యానం రాసేసి ఇరికించేసే వాళ్ళు!

     ఆంధ్రసత్యార్ధప్రకాశము అనే గ్రంధంలో ఉదహరించబడిన ప్రకారం భోజరాజు రాజ్యంలో ఎవరో వ్యాసుడి పేరుతో మార్కండేయ శివపురాణాల్ని రాసేశారు.ఈ  విషయం రాజుకు తెలిసి వాళ్ళని కఠినంగా శిక్షించి "ఇక మీదట ఎవరైనా కావ్యాది గ్రంధములను రచించినట్లయితే సొంతపేర్లతో వెలయించవలెను తప్ప తమ రచనలను ప్రాచీన ఋషుల పేరిట వ్యక్తం చేయకూడదు" అని శాసనం చేశాడు.ఈ విషయం భోజరాజకృతమైన "సంజీవని" అనే గ్రంధంలో ఉంది.ఈ గ్రంధం గ్వాలియర్ రాజ్యంలోని ఖాంద్ నగరవాసియైన ఒక తివాడీ బ్రాహ్మణుని ఇంటిలో ఉన్నట్టు లఘునోరావు సాహెబు గారునూ వారి లేకరియైన రామదయాళ్ కౌబేగారునూ చూసినట్లు గట్టి సాక్ష్యం ఉంది.దీనిలో వ్యాసమహర్షి యొక్క మహాభారతం గురించి ఆయన నాలుగు వేల నాలుగు వందల శ్లోకాలూ ఆయన శిష్యులు అయిదు వేల ఆరు వందల శ్లోకాలూ రాసినట్టు లెక్క కూడా చెప్పారు.విక్రమాదిత్యుని కాలానికి ఇరవై వేల శ్లోకాలు అయినట్టు చెప్పడాన్ని బట్టి ఇప్పటి లక్షశ్లోకవిస్తారం తర్వాతి పండితుల చేతివాటం వల్ల దక్కిన ఖ్యాతి అన్నమాట!

     ఈ కల్పితవిప్రాధిక్యత మొత్తం ఉదరపోషణ నిమిత్తమే జరిగిందనేది వాస్తవం.కానీ సాహిత్యంలో ఇంత విస్తారంగా ఉన్నప్పటికీ సమాజంలో ఈ కల్పితవిప్రాధిక్యత పని చేసిందని చెప్పడానికి దాఖలాలు లేవు.ఇవ్వాళ తమ ఇళ్ళలో దైవకార్యం,పితృకార్యం నిర్వహించిన బ్రాహ్మణులకి సంభావన ఇచ్చేటపుడు మనుస్మృతిలో చెప్పారని ఇవ్వడం లేదు కదా!ఏనాడూ మనుస్మృతి చదవని వాళ్ళని అసలు తెలియనే తెలియని విషయం ఎట్లా ప్రభావితం చేస్తుంది?ఎక్కువ అడిగితే ఇవ్వను పొమ్మని గృహస్థు అంటే సరిపెట్టుకుని వెళ్ళేవాళ్లని పట్టుకుని వాళ్ళు వీళ్ళ మీద పెత్తనం చేస్తున్నారని ఆరోపించడం అన్యాయమే!ఈ బ్రాహ్మణేతర ఉద్యమం వల్ల బ్రాహ్మణులు రాజకీయరంగంలో కనపడకపోయినా విద్యార్జనలోని చురుకుదనం ద్వారా ప్రభుత్వాధికారులలో చాలామంది బ్రాహ్మణులే ఎప్పటినుంచో ఉన్నారు, ఇప్పటికీ ఉంటున్నారు, ఇకముందు కూడా ఉంటారు!మరి, బ్రాహ్మణేతర ఉద్యమం సాధించినది ఏమిటి?కొన్ని బ్రాహ్మణేతర కులాలు రాజకీయపు రంకు నేర్వడం తప్ప సాధించింది ఏమీ లేదు!బ్రాహ్మణకులాన్ని బజారు కీడ్వడం తప్ప సమాజంలో జరిగిన మంచి మార్పు ఏమీ లేదు!ఇవ్వాళ నందమూరి తారక రామారావు అనే ఒక నటుడి చుట్టూ జరుగుతున్న ప్రచారం చూడండి, అతని కుటుంబంలోని ఇతర నటులు "చరిత్ర సృష్టించినా తీరగరాసినా మేమే, మేమే, మేమే!" అని గొప్పలు చెప్పుకుంటూ తొడలు గొట్టడం మీద పేటెంటు తీసుకున్న వికృతత్వం చూడండి,అన్ని కులాల వాళ్ళూ అతనిలోని కళను మెచ్చి అతనికి ఆ స్థానాన్ని కల్పిస్తే అతని కులంవాళ్ళు అతన్ని తమ కులానికి అంటుగట్టుకుని పులకించిపోవటం చూడండి!అప్పుడు బ్రాహ్మణులు కల్పిత విప్రాధిక్యతతో రెచ్చిపోతే ఇప్పుడు కల్పిత కమ్మకులాధిక్యతతో కమ్మ కులస్థులూ కల్పిత కాపుకులాధిక్యతతో కాపు కులస్థులూ రెచ్చిపోతున్నారు - దేన్ని ఆపగలం?ఎడంచెయ్యి తీసి పుర్రచెయ్యి పెట్టినట్టు ఒక కులాన్ని కుర్చీ నుంచి లాగిపారేసి మరొక కులాన్ని కుర్చీ మీదకి ఎక్కించటం పరిష్కారం కాదు, అవునా!

     స్వార్ధపరులైన కొందరు బ్రాహ్మణ పండితుల వల్ల కల్పిత విప్రాధిక్యత ఉదరపోషణార్ధం జరిగితే ఎంతో గంబీరంగా మొదలైన బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం చివరి దశకి వచ్చేసరికి గందరగోళానికి గురై స్వసంఘ పౌరోహిత్యం లాంటి ప్రతిపాదనలతో కర్మకాందలకి జరిగే ఖర్చును తగ్గించే పిసినారి వ్యవహారం స్థాయికి దిగజారిపోయింది.దీనికి తోడు అక్కడి పెరియార్ ఉద్యమంలోనూ ఇక్కడి ఆంధ్రుల ఉద్యమంలోనూ ఉన్న ఒక మూర్ఖత్వం వల్ల బ్రాహ్మణుల్ని రాజకీయ పదవులకు దూరం చేసి కొన్ని శూద్రకులాల ప్రముఖులకి రాజకీయ వైభవాలు కట్టబెట్టడం వరకు మాత్రమే తన లక్ష్యాన్ని సాధించి సగంలోనే అంతర్ధానం అయిపోయింది.బ్రాహ్మణేతరోద్యమం అతి తక్కువ కాలంలోనే అంతరించిపోవడానికి ఆ సిద్ధాంతంలోని అంతర్గత వైరుధ్యాలకి తోడు ముఖ్యమైన లోపం తన చుట్టూ ఉవ్వెత్తున ఎగసిపడుతున్న స్వాతంత్ర సమరాన్ని వ్యతిరేకించడం - ముందు సంస్కరణ తర్వాత స్వతంత్రం అనే వీరి మొండివాదన వల్ల దేశభక్తిలేనివారు అనే ముద్రపడి అభాసుపాలై ఉద్యమం పలచబడిపోయింది.

     ఉద్యమం పలచబడిపోవటం వల్ల మరుగున పడినప్పటికీ వారు సంద్గించిన ప్రశ్నలు మాత్రం బ్రాహ్మణులు తప్పనిసరిగా జవాబు చెప్పి తీరాల్సినవే.ఇవ్వాళ కమ్మ, కాపు, రెడ్డి, వెలమ కులాల వారు ప్రదర్శిస్తున్న కులాధిక్యతకి తొలినాటి కల్పిత విప్రాధిక్యతయే కారణం గనుక దీనిని రూపుమాపే బాధ్యతని వారే తీసుకోఎవాలి!మొదట సనాతన ధార్మిక సాహిత్యం నుంచి కల్పిత విప్రాధిక్యతకి సంబంధించిన ఆనవాళ్లని వారు చెరిపివేయాలి.దీనివల్ల వారు బ్రాహ్మణేతరుల విశ్వాసాన్ని పొందగలుగుతారు.తర్వాత బ్రాహ్మణేతరులకి కూడా పుట్టుకని బట్టి గాక ఆసక్తిని బట్టి వేదం మీద అధికారాన్ని ఇవ్వాలి.దీనివల్ల సనాతన ధర్మం కేవలం బ్రాహ్మణులకే సొంతం అనే అపప్రధ పోతుంది.కల్పిత విప్రాధిక్యత వల్ల వారికి జరిగిన మేలూ లేదు, దేవనయ్య వారి లాంటి వల్ల వారికి జరిగిన కీడూ లేదు.మెకాలే విద్యావిధానం వల్ల  తమకు కొత్తగా వచ్చిపడిన సామాజిక స్థాయి నుంచి పుట్టిన అహంకారాన్ని వదులుకుని బ్రాహ్మణేతరులు కూడా చరిత్రని నిష్పాక్షిక దృష్టితో చూసి వాస్తవాల్ని తెలుసుకోవాలి.పొట్టకూటి కోసం తప్పుడుపనులు చేసి అపఖ్యాతి పాలైన కొద్దిమంది పుట్టు బ్రాహ్మణులను మినహాయిస్తే వ్యాసుని వంటి సాత్వికులైన బుద్ధి బ్రాహ్మణులు సృష్టించిన జ్ఞానసంపద చాలా గొప్పది.

     హిందూ మతానికి చెందిన పురాణకధలలో స్థల దేవతలు.జలదేవతలు అంటూ ఇచ్చిన వర్ణనల ఆధారంతో క్రీ.శ.1801లో లెఫ్టినెంట్ ఫ్రాన్సిస్ గిల్బర్ట్ అనే వ్యక్తి ఒక దేశపటాన్ని తయారుచేసి, "హిందువుల ప్రాచీన గ్రంధాల నుంచి కాలీ లేక నైలు నది పక్కనే ఉన్న ఈజిప్టు తదితర దేశాలను గురించిన సమాచారం" అనే వ్యాసం రాస్తే దానికి 60 యేళ్ళ తర్వాత జె.హెచ్.స్పెకే అనే పరిశోధకుడు ఆ వివరాల సాయంతో నైలునది పుట్టుకను గుర్తించాడు!ఇతరులకు తమ ప్రక్కన ఉన్నవాటి గురించే తెలియని కాలంలోనే ప్రపంచం మొత్తాన్ని చుట్టివచ్చి అందర్నీ మెప్పించిన గొప్ప వారసత్వాన్ని సృష్టించడం ద్వారా కలిగిన మంచికీ అంతర్గతంగా కులాధిక్యతలకు కారణం కావడం ద్వారా కలిగిన చెడుకీ - ఈ దేశానికి సంబంధించి చరిత్ర మనకి చూపిస్తున్న విభిన్న కోణాలు రెంటికీ బ్రాహ్మణులే కారణం అయ్యారు అనేది నిజమే. మంచికి మాత్రమే బాధ్యత తీసుకుని చెడుకి బాధ్యత వహించడంలో బ్రాహ్మణులు తప్పుకోకూడదు.అలాగే, చెడుని మాత్రమే చూసి దూషిస్తూ బ్రాహ్మణుల వల్ల జరిగిన మంచిని బ్రాహ్మణేతరులు తక్కువ చేసి మాట్లాడకూడదు.ఇవ్వాళ నడుస్తున్న ఆధ్యాత్మికతతో పనిలేని లౌకిక జీవితంలో బ్రాహ్మణులకి ప్రాధాన్యత లేదు కాబట్టి బ్రాహణులకి ప్రాధాన్యత లేకపోయినా హిందూమతం కొనసాగుతుందని కొందరికి అనిపించవచ్చు, కానీ ఆధ్యాత్మికత లేని హిందువుల జీవనవిధానం ఎట్లా ఉంటుంది?వూహించటం కూడా కష్తమే!కాబట్టి గత డెబ్భయ్యేళ్ళుగా క్రైస్తవ, ముస్లిం, కమ్యునిస్ట్ భావజాలాల తాకిడికి పెరిగిన అంతరాల్ని తగ్గించుకుని బ్రాహ్మణులూ బ్రాహ్మణతరులూ కలిసికట్టుగా నిలబడితేనే హిందూమతం ఉనికిలో ఉంటుంది.లేని పక్షంలో క్రీ.శ 2050 నాటికి హిందూమతానంతర భారతదేశం ఆవిర్భవించడం తధ్యం!

     క్రీ.శ 7వ శతాబ్దిలో మక్కా మదీనాల వద్ద మక్కావాసుల తిరస్కారం, వెలివేత, బహిష్కారం, హత్యాయత్నం, అణచివేత, ఓటమి, ప్రతీకారం, క్రూరత్వం వంటి ప్రతికూలతానుకూలతల మధ్య నిలబడిన ఒక మొండిమనిషి కీచుగొంతు నుండి వెలువడిన "అల్లా హో అక్బర్!" అనే చిరుకేక గత 1400 సంవత్సరాలలో పెరిగి పెరిగి సుమారు 0.7 బిలియను(700,000,000)ల నుండి 1.9 బిలియను{1,900,000,000}ల మందిని,అంటే ప్రపంచ జనాభాలో 25% మందిని సమ్మోహితుల్ని చేసి పెనుకేకగా మారింది!పదుగురాడు మాట పాడియై ధరజెల్లు నన్నట్టు అంతమందిని ఆకర్షించిన భావజాలం ఎంత గొప్పదై ఉండాలి?తమను అజ్ఞానం నుంచి విజ్ఞానం వైపుకి నడిపించి స్వేచాసమానత్వాల కాంతిపధం వైపుకి నడిపించే స్వభావం లేకపోతే అంతమంది ఆ భావజాలాన్ని ఎందుకు ఆదరిస్తారు?గంబీరమైన భావపరంపరతో అద్భుతమైన చారిత్రక విశ్లేషణలతో వర్గరహితసమాజమనే మరో ప్రపంచాన్ని కళ్లకు కట్టినట్టు చూపించి ప్రపంచ మేధావులని ఉర్రూత లూగించిన కమ్యూనిష్టు సిద్ధాంతమే పూర్తిగా శతాబ్దం కూడా గడవకముందే హతశేషమైపోయింది - అంతకన్న గొప్పదనం ఇస్లాములో ఏమి ఉంది?

     According to the Carnegie Endowment for International Peace, the World Christian Database as of 2007 estimated the six fastest-growing religions of the world to be Islam (1.8%), the Bahá'í Faith (1.7%), Sikhism (1.6%), Jainism (1.6%), Hinduism (1.5%), and Christianity (1.3%). High birth rates were cited as the reason for the growth. However, according to others, including the Guinness World Records, Islam is the world's fastest-growing religion by number of conversions each year. Islam is the fastest-growing religion in India. Growth rate of Muslims has been consistently higher than the growth rate of Hindus, even since the census data of independent India has been available. For example, during the 1991-2001 decade, Muslim growth rate was 29.52% (vs 19.92% for Hindus) However, Muslims population growth rate declined to 24.6% during 2001-2011 decade, in keeping with the similar decline in most religious groups of India.if the current trend continued, by the end of the 21st century India's Muslim population would reach about 340 million people (19% or 20% of India's total projected population), despite the fact that Hindus would still remain the predominant religious community of the country. Islam is the second-largest religion in India, making up 14.9% of the country's population with about 180 million adherents (2011 census).AS the propagating nethod of islam irrespective of their location 25% of muslims will fight openly for islamic state,while another 25% of remaining peace loving muslims will unconditionally give full support for jehadis,and other 25% of muslims wil give a cover for their activities with their well articulated condemnation of islamic terorist for pacifying the anger in non-muslims who were majority in numbers at that location until muslims wil get majority over the location.

     తిరిగి సాధించలేని చేజారిన గతం,ఎప్పటికీ చేరుకోలేక వూరించే భావి - ఈ రెంటి మధ్యన అర్ధం చేసుకోవడానికీ ఆలోచించడానికీ దిశను మార్చుకోవడానికీ చాలినంత సమయం ఇవ్వకుండా హఠాత్తుగా మనమీదకి దూకే అత్యంత కీలకమైన ఈ వర్తమానం అనే బిందువు యొక్క పరిమాణం ఎంత?శతాబ్దమా, దశాబ్దమా, సంవత్సరమా, ఆయనమా, మాసమా, వారమా, దినమా, క్షణమా - సనాతన ధర్మం తన పూర్వవైభవాన్ని సంతరించుకోవడానికి పట్టే సమయం ఎంత?కులబ్రాహ్మణుల సంఖ్య తగ్గి నిజబ్రాహ్మణుల సంఖ్య పెరగడం వల్లనే సనాతన ధర్మం నిలబడుతుందనేది ఒక అందమైన కలలాంటి స్వాప్నికసత్యం.యేది సత్యమైనదో అదే శివమైనదీ అవుతుంది.యేది శివమైనదో అదే సుందరమైనదీ అవుతుంది.


సత్యం శివం సుందరం!!! 
--------------------------------------------------------------------------------------------------------
1     2     3     4     5     6     7     8     9     10    11    12    13    14    15    16    17    18

Tuesday, 20 June 2017

నేను,మా అమ్మాయి - మేము పేల్చిన జోకులు!

నేను ఇంటర్ మొదటి సంవత్సరం నూజివీడు ధర్మ అప్పారావు కాలేజిలోనూ రెండవ సంవత్సరం కల్లూరు రంజని జూనియర్ కాలేజిలోనూ చదివాను.కల్లూరు కాలేజి ఒకే బిల్దింగులో ఒకే రోజు హైస్కూలు, కాలేజి షిఫ్టులుగా నడుస్తూ ఉండేది.ఇక్కడ నాకున్న ఇద్దరు గట్టి ఫ్రెండ్సులో రాజేశ్వర శాస్త్రి ఒకడు.లెక్చరర్లలో చాలామంది వీడికి బంధువులే.ఒకసారి వీడు బోటనీ క్లాసులో సెక్షన్లు తరగడానికి వాడిన బ్లేడు మరీ మొద్దుగా ఉంటే,"ఏం బ్లేడురా ఇది?" అని గట్టిగానూ,"అందుకు కూడా పనికిరాదు!" అని సన్నగానూ విసుక్కున్నాట్ట లెక్చరరు గారు - బైటికొచ్చాక మావాడు ఇకిలిస్తూ చెప్పాడు! 

మావాడి అన్నగారు ఇంగ్లీషు లెక్చరర్.అన్ని సబ్జక్టుల వాళ్ళూ ఆయన ట్యూషనుకి వస్తారు.ఒకసారి మధ్యాన్నం పూట నేనూ ఇంకో అతనూ మాత్రమే ఉన్నాము.తను పాలిటిక్సులో తిరుగుతూ ట్యూషనుకి రెగ్యులరుగా రావటం లేదు. దానిమీద "నువ్వు రెగ్యులర్లీ ఇర్రెగ్యులరా ఇర్రెగ్యులర్లీ రెగ్యులరా అనేది తేల్చుకోవడం చాలా కష్టంగా ఉందయ్యా!" అని మొదలుపెట్టారు.ఆ పదాల్ని మెలితిప్పి వాడిన కాంబినేషనుకే అందులో ఉన్న సెటైరంతా అర్ధమైపోయి నాకు కడుపులో నవ్వు తన్నుకొచ్చి చస్తుంటే మళ్ళీ విడివిడిగా వ్యాఖ్యానాలు కూడాను.వరసగా ఒక పదిరోజులు వచ్చి వరసగా నాల్రోజులు మానేస్తూ ఉంటే అది ఇర్రెగ్యులర్లీ రెగ్యులరు - ట!ఒక రోజొచ్చి నాల్రోజులు మానేసి మళ్లీ ఒక ఐదు రోజులొచ్చి మళ్లీ ఒక పది రోజులు మానేస్తూ ఉంటే రెగ్యులర్లీ ఇర్రెగ్యులరు - ట!

పాలిటిక్సులో తిరిగేవాడు కదా మామూలు కన్నా ఎక్కువ రోషం వచ్చేసింది.మొహం కందగడ్డ చేసుకుని "ఇకనుంచీ రెగ్యులరుగా వస్తాన్సార్!" అన్నాడు.వింటున్న నాకు మళ్ళీ "రెగ్యులర్లీ ఇర్రెగ్యులరు గానా?ఇర్రెగ్యులర్లీ రెగ్యులరు గానా?" అని పొడుస్తారేమో అని అనిపించింది గానీ ఆ పోటు మాత్రం పొడవలా!ఈ కుర్రాడు ఆ ప్రామిస్సు ఆయనతో ఇప్పటికెన్నిసార్లు చేసుంటాడో తెలీదు గానీ దానిమీద కహానీ మొదలెట్టారు మాస్టరు గారు.అది నిజంగా జరిగిన కధే, బ్రాహ్మలు చరిత్రని పురాణం కింద ఎలా మారుస్తారో అర్ధమయ్యే కధ:"మా ఇంట్లో ఒక కుక్క ఉండేదయ్యా!దొంగతిండికి అలవాటు పడిపోయింది.ఎప్పుడూ వంటగది గుమ్మం దగ్గిరే తారట్లాడుతూ ఉండేది.మేము ఇంగువా కొత్తిమీరా లాంటి ముక్కుపుటాలు బద్దలయ్యే దినుసులు వాడతాం గదా - కుక్కలకేమో ఘ్రాణశక్తి ఎక్కువ, వాసన తగిలిన క్షణం నుంచి అక్కడే కాసుకునేది. తలుపు ఏమాత్రం ఓరవాకిలిగా తెరిచున్నా దూరిపోయి మూతి పెడుతుండేది. మావాళ్ళు మాత్రం తక్కువా?దొరికినప్పుడల్లా నడ్డి విరగ్గొడుతూనే ఉండేవాళ్ళు!దెబ్బలు తిన్నప్పుడు మాత్రం,చీ!వీళ్ళు దుర్మార్గులు,వాళ్ళ పొట్ట వాళ్ళు నింపుకోవడమే తప్ప నా మనోభావాల్ని గౌరవించట్లేదు - ఇంకెప్పుడూ వీళ్ళ ఇంట్లో తినగూడదు అనుకునేది!ఏం లాభం?మళ్ళీ తెల్లారి ఇంగువ వాసన తగలంగానే ఇవ్వాళ నిన్నట్లా జరగదు లెమ్మని చెప్పేసుకుని తోకూపుకుంటూ వంటగది తలుపు దగ్గిర తయారు." 

ఇక్కడివరకూ వచ్చేసరికి "అంటే,నేను కుక్కనంటారా సార్?" అని నిలదీశాడు ఆ చురుకైన విద్యార్ధి. అంత ఘాటుజోకు ధాటికి దెబ్బతిన్న కుర్రాడు సూటిగా నిలదీసేసరికి గురువుగారు ప్లేటు ఫిరాయించేసి,"ఛ, ఛ!నిన్ను కుక్కవని నేనెందుకంటానయ్యా!ఒకానొకప్పుడు మా ఇంట్లో ఉన్న ఒక కుక్కగారి గురించి చెప్తున్నాను. ఆ కుక్కకీ నీకూ ఎటువంటి సంబంధమూ లేదు.చెట్టంత మనిషివి, బుద్ధిమంతుడైన కుర్రాడివి - నిన్ను నేను కుక్కతో ఎందుకు పోలుస్తానూ." అని బ్రాహ్మణులకి మాత్రమే నేర్వాల్సిన పనిలేకుండా వచ్చే ఉచ్చారణా పరమైన ప్రత్యేకతతో వొత్తులూ,దీర్ఘాలూ,గుణింతాల్ని ఎక్కడెక్కడ విరవాలో అక్కడక్కడ విరిచేసి ఎక్కడెక్కడ సాగదియ్యాలో అక్కడక్కడ సాగదీసి వొదుల్తుంటే నా స్సామిరంగా నా పొట్టలో హాస్యపర్వతం బద్దలైపోయింది!

నోటితో చెప్పడం కూడా కుదరక చిటికినేలు చూపించేసి బైటికి పరిగెత్తాను.ఎంత గట్టిగా నవ్వినా ఇక్కడికి వినపడనంత దూరం పరిగెత్తి ఆగాను.అక్కడ నిలబడి అట్టా డొక్కలెగరేస్తూ పకపకా నవ్వుతుంటే దారినపోయే జనం వింతగా చూస్తున్నా పట్టించుకోలేదు,వాళ్ళు వింతగా చూస్తున్నారని నవ్వకపోతే ఇక్కడ నేను చస్తాను - ప్రాణభయం ముందు సిగ్గూ ఎగ్గ్గూ జాంతానై!ఆఖరికి ఇంక మొహంలో నవ్వు కనపడకుండా కంట్రోల్ చేసుకోగలనన్న గ్యారెంటీ వచ్చాకనే లోపలికొచ్చి కూర్చున్నాను.పుస్తకంలో తల దూర్చాననే గానీ ఆపూటకి ఒక్క ముక్క బుర్రలోకి ఎక్కితే ఒట్టు!ఔరా, బ్రాహ్మణు లెంతటి శాడిస్టులు?కత్తులతోనూ కంటిచూపులతోనూ కాదు, కేవలం వాళ్ల భాషతోనూ వ్యంగ్యంతోనూ పడ్డవాణ్ణి ఏడ్పించీ పక్కవాణ్ణి నవ్వించీ చంపగలరు - ఒక్క జోకుతో రెండు మర్దర్లు చెయ్యగలరు వీళ్ళు!

కొసమెరుపు యేంటంటే, రాత్రి ట్యూషన్లో మళ్ళీ ఈ కధంతా వినిపించి పాపం హరిబాబు నవ్వాపుకోలేక ననుకుంటాను  చిటికినేలు చూపించి బైటికి పరిగెత్తాడు అని నన్ను కూడా బలి తీసుకున్నారు మా మేష్టరు గారు. ఔరా,  బ్రాహ్మణు లెంతటి...

*****

ఒకసారి తెలుగు మాస్టారు ఒక తమాషా ప్రశ్న ఇచ్చి అందర్నీ వెధవల్ని చేశారు నన్ను తప్ప!తెలుగులో ప్రశ్నలు చాలామటుకు గ్రామరే కదా!అందులోనూ చందస్సూ అలంకారాలూ తప్ప ఏముంటాయి?అలంకారానికి సంబంధించి మామూలుగా ఒక పద్యం ఇచ్చి అందులో ఉన్న అలంకారం ఏమిటో చెప్పమని అడుగుతారు కదా,ఇచ్చిన పద్యంలో వృత్యనుప్రాస స్పష్టంగా కనబడుతున్నది.మొదట నేనూ హడావిడిగా జవాబు రాసేసి తీరిగ్గా సరిచూసుకుంటుంటే ప్రశ్నలో కొంచెం కిరికిరి ఉన్నట్టు అనిపించింది.ప్రశ్నలో "లక్ష్యలక్షణ సమన్వితముగా" అని అదనపు మాట కనబడింది.శబ్దాలంకారాలకి అక్షరరమ్యత మాత్రమే ఉంటుంది.కానీ అర్ధాలంకారాలకి దేన్ని పోలుస్తున్నామో ఆ వస్తువు,దేనితో పోలుస్తున్నామో ఆ పోలిక,ఈ రెంటి మధ్యనా ఉన్న సంబంధమూ కలిసి లక్ష్యలక్షణసమన్వితం అవుతుంది.అలా చూస్తే అక్కడ ఉన్నది ఉపమాలంకారం.

వెంఠనే నేను క్లూ తెలిసిన డిటెక్టివ్ షెర్లాక్ హోమ్స్ లాగ మురుస్తూ పాత జవాబు కొట్టేసి కొత్త జవాబు రాస్తుంటే నా పక్కవాడు కంగారు పడుతున్నాడు,"ఏయ్, ఎందుకు కొట్టేస్తున్నావు?వృత్యనుప్రాస కరెక్టేగా!" అని - చిన్నగానే లెండి!నేను చికూడా న్నగా నవ్వేసి వూరుకున్నా అప్పటికి. బయటికొచ్చాక కూడా వాడు వదలకుందా "ఎందుకంత పిచ్చిపని చేశావు?ఆ ప్రశ్నకి నీకు జీరో ఖాయం!" అని నా గురించి ఆందోళనా వెక్కిరింతా కలిపి వడ్డిస్తుంటే మెల్లగా పాయింటు చెప్పాను గానీ ఆ బట్టీ విక్రమార్కుడికి ఎక్కలేదు.

తీరా క్లాసులో దిద్దిన పేపర్సుని ఇచ్చేటప్పుడు రివర్సులో జరిగంది - నాకు ఫుల్ మార్క్సూ మిగతావాళ్ళకి జీరోలూ!పనిగట్టుకుని మాస్టారు నన్ను నిలబెట్టి "వీడొక్కడే కరెక్టుగా రాశాడు,మిగతా అందరికీ గుండుసున్నాలే!" అని డిక్లేర్ చేసి మళ్ళీ నన్ను "మొదట ఎందుకు తప్పు రాశావురా?నువ్వూ అదే రాసి కొట్టేశావు గదా!" అని అడిగారు.చెప్పాను - మొదట నేనూ తొందర్లో పొరపాటు పడటం,తర్వాత తీరిగ్గా చదువుతున్నప్పుడు లైటు వెలగటం,ఆ లాజిక్కు అంతా!లాజిక్ కరెక్టే గాబట్టి తలూపి మెచ్చుకుని కూర్చోమన్నారు.ఇంతలో ఒకమ్మాయి లేచి "అక్కడ శబ్దాలంకారం కూడా ఉంది కదా,అది కూడా అలంకారమే కదా,ఉన్నది రాస్తే ఎందుకు తప్పవుతుంది?" అని లాపాయింటు లాగింది.దానికాయన "మీ జూవాలజీ సారు యాంఫీబియా గురించి రాయమంటే నువ్వు రెప్టీలియా గురించి రాస్తే మార్కులు వేస్తారా?ఇదీ అంతే, ప్రశ్న చదివి అర్ధం చేసుకుని జవాబు రాసే తెలివి లేదు గానీ ఈ తెలివి మాత్రం బాగానే ఉంది!" అని ఝాడించేసరికి కిక్కురుమనకుండా కూర్చుంది.

*****


కల్లూరులో ఉండగానే ఒకరోజు మాధవికి హిందీ నోట్సు రాసిపెట్టాను.నా ప్రేమ వయస్సూ మాధవి వయస్సూ ఒకటే!ఎందుకంటే, నేను తనని రోజుల పాపగా ఉన్నప్పుడే తొలిముద్దు పెట్టేసి పెద్దయ్యాక ఈపిల్లనే పెళ్ళి చేసుకోవాలని గట్టి నిర్ణయం తీసేసుకున్నాను.


అప్పటికే మంత్రసానుల కాలం పోయి హాస్పటల్సు వచ్చేశాయి గదా,మా అత్తయ్య డెలివరీ తర్వాత హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాక మా అమ్మ చూట్టానికి వెళ్తుంటే ఆవు వెంట దూడలా నేనూ వెళ్ళాను.అప్పటికి నాకు యేడేళ్ళు - సరిగ్గా బుడుగు వయస్సే,అవునా?ఏమైనా కుంచెం కుంచెం పెద్దోణ్ణే,కదా!మాధవి అప్పుడు నిద్రలో అమాయకంగా కనబడి ముద్దొచ్చి ముద్దు పెట్టుకున్నాను - చెంప మీదే లెండి!ఎట్లాగూ వరస కలిసింది గదా అని కాబోలు అక్కడ కూర్చున్న ఆడవాళ్ళలో ఎవరో "వీడు పెద్దయ్యాక దీన్నే చేసుకునేట్టు ఉన్నాడు?!" అనేశారు హాస్యానికి.ఆ ముక్క నా మైండులో మొక్కై నాటుకుంది,పైన ఉండి చూస్తున్న తధాస్తు దేవతలకి కూడా ఉషారు పుట్టి మామూలు కన్నా రెట్టింపు గట్టిగా "తధాస్తు!" అనేసి ఉంటారు.

మా మామయ్య మొదట్లో గారాబంగా పెరిగి ఉద్యోగం చెయ్యడానికి ఇష్టపడకపోయినా పెళ్ళయ్యాక బాధ్యత తెలిసి డాక్టర్ మామయ్య పలుకుబడితో ఖమ్మం జిల్లాలో స్కూల్ టీచరుగా చేరారు.అందరూ వేసవి శేలవులకి మా తాతగారు వాస్తువిరుద్ధంగా కట్టిన తాటాకుల భవంతికి వస్తూ ఉండేవాళ్ళు. మా అమ్మా నేనూ కూడా వెళ్ళేవాళ్ళం. మా తాతయ్య కంకి కమ్యునిష్టు.ఇందిరాగాంధీ విధించిన నిషేధం అప్పుడు కొంపల్లి అడవుల్లో దాక్కుని ప్రాణాలు కాపాడుకున్న వీరాధివీరుల్లో ఒకడు!అంత వాస్తు విరుద్ధంగా కట్టినా అందులో ఒక తమాషా ఉంది - నలుగురు కొడుకులూ ఆ ఇంట్లో ఉన్నంతకాలం దరిద్రంలో ఉన్నా ఆనందంగా ఉండగలగటం, బైటికి వెళ్ళిన వెంఠనే ఆర్ధికంగా కూడా బాగుపడటం జరిగింది. మూర్ఖంగా కట్టినా అది కూడా ఎట్టాగో శాస్త్రప్రకారం సర్దుకుపోయినట్టు ఆయన కట్టిన భవంతి యొక్క తింగరి వాస్తు ప్రభావం కాబోలు!

మధ్యాన్నం పూట మగవాళ్ళు పొద్దున ఎండ పెరక్కముందు మామిడితోటల్లోకి వెళ్ళి ఎండ తగ్గాక తిరిగొచ్చి సాయంకాలం ఫ్రెష్షుగా స్నానాలూ భోయనాలూ కానిచ్చి కబుర్లు మొదలు పెట్టేవాళ్ళు!మా పెద్ద మామయ్య సుత్తి కమ్యూనిష్టు,మా రెండో మామయ్య కాంగ్రెసు+కమ్యూనిష్టు పార్టీలకి క్రూరమైన వ్యతిరేకి,మా మూడో మామయ్యా పక్కింటి సత్యం మామయ్యా కాంగ్రెసు - ఇంక చూస్కోండి నాస్సామిరంగా! రంగరంగా! లింగలింగా!దేశంలో ఆరోజు జరిగిన ఏ వ్యవహారానికైనా ఇక్కడ ప్రతిధ్వనులు వినబడేవి - చర్చలా అవి!ఇంకొక క్షణం ఉంటే తన్నుకుంటారేమో అనిపించేది, మళ్ళీ నిద్ర వేళ మొదలయ్యాక పక్కలు వెదుక్కునేటప్పుడు అంత ఆవేశమూ ఎక్కడికి పోతుందో ఇతర్లకి దుప్పట్లూ దిళ్ళూ సర్దటం లాంటి ఆప్యాయతలు!అట్లాంటి వాతావరణం చిన్నప్పుడే చూశాను గాబట్టి ఇవ్వాళ ఎజెండాల పేరుతో మానవత్వం లేకుండా పిచ్చెకిపోయి వ్యక్తిగత ద్వేషాలుగా మార్చుకుని రెచ్చిపోతున్న వాళ్ళని చూసినప్పుడల్లా వింతగా అనిపిస్తుంటుంది!

మధ్యాన్నం పూట ఆడవాళ్ళు అందరూ నీడపట్టున ఏదో ఒక మూల చేరి చాపలూ దుప్పట్లూ పరుచుకుని కబుర్లకి దిగేవాళ్ళు.ఇక మా పిల్లవెధవల్ని పట్టించుకునే వాళ్ళు లేరు - మా ఇష్టం!వేసవి కదా అని ఎండ తగుల్తుందేమో అనుకునే భయమే లేదు, ఎదురింట్లో ఒక మామిడి చెట్టూ,దానికింద కొంచెం పొడీతడీగా ఉన్న ఇసకమేట ఉండేది. వడదెబ్బలు తగలటం, పిల్లలు కందిపోవటం లాంటి ప్రమాదాలు లేవు గాబట్టి దేనికీ నిషేధాలు లేవు - ఇంటి వసారా మరియూ మామిడి చెట్టూ మా క్రీడాక్షేత్రాలు.

మా మొదటి ఫ్యావరెట్ ఆట - గాజుకప్పు!మిగతా చోట్ల కూడా ఆడతారో లేదో తెలీదు,పేరు కూదా ఇదే ఉంటుందా అనేది కూడా తెలియదు గానీ ఆట ఇలా ఉంటుంది.మొదట దొంగ అయిన అబ్బాయి గానీ అమ్మాయి గానీ ఒక గోడకి ఆనుకుని చేతుల్ని ముఖంలో దాచుకుని "గాజు కప్పు,గాజు కప్పు" అంటూ ఉండాలి.ఆ గోడ నుంచి దూరంగా ఉన్న మరో గోడ దగ్గిర మిగతావాళ్ళు లైనుగా నిలబడాలి.దొంగ "గాజు కప్పు,గాజు కప్పు" అంటునప్పుడు అందరూ ఒక్కో అడుగూ కదులుతూ దొంగ కూత ఆపి వెనక్కి తిరిగి చూసేలోపు ఆగిపోవాలి.దొంగ వెనక్కి తిరిగి చూసే క్షణంలో ఎవరయినా కదులుతూ కనబడితే పాత దొంగ దొర అయిపోయి కొత్త దొంగ గోడకి ఆనుకుని చేతుల్ని ముఖంలో దాచుకుని "గాజు కప్పు,గాజు కప్పు" అనటం మొదలు పెట్టాలి, మిగిలిన వాళ్ళందరూ మళ్ళీ వెనక లైనుకి వెళ్ళి అక్కణించి మళ్ళీ ఆట మొదలు.రెండవ ముఖ్యమైన ఆట మామిడి చెట్టు కింద పిచ్చుకగూళ్ళు కట్టటం.ఇందులో నేను అందర్లోకి పెద్దవాణ్ణి గదా దబాయంపు సెక్షనుతో అసలు విషయం తెలియకుండా రకరకాల మాయమాటల్తో మోళీ చేసి ఎప్పుడూ మాధవి నా యెదురుగా వచ్చేటట్టు చేసి నిదానంగా కడుతూ వీలయినంత ఎక్కువసేపు తన ముఖాన్ని చూస్తూ ఉండేవాణ్ణి!మూడోదీ అసలైన మజా ఉడాయుంచేదీ దొంగాట - ఇందులో మూడుసార్లు వరసగా దొంగ అయితే అబ్బాయి పెళ్ళాం పేరూ అమ్మాయి మొగుడి పేరూ చెప్పాలి!

నేను వూరుకూరికే మూడుసార్లు కావాలనే ఔటయిపోయి  మొహమంతా పెట్రోమాక్సు లైటులా చేసుకుని "మాధవి!" అని అరిచి చేప్పేవాణ్ణి. తర్వాత అందరం కలిసి ప్లాను వేసుకుని మూడుసార్లు మాధవిని ఔట్ చేసేవాళ్ళం.కానీ మా సిగ్గులమొగ్గ అన్ని సంవత్సరాల్లో ఆన్ని నెలల్లో అన్ని రోజుల్లో ఒక్కసారి కూడా నాపేరు చెప్పలేదు - ఒక్కసారి అందరివంకా నేను చెప్పను,ఏం చేసుకుంటారో చేసుకోండి అని మహారాణి ధీమాతో చూసి వెళ్ళిపోయేది - అలా వెళ్ళిపోతుంటే కన్నార్పకుండా నవ్వుమొహంతో చూస్తూ ఉండిపోయేవాణ్ణి తప్ప ఏనాడూ చెప్పి తీరాల్సిందేనని నిలదియ్యలేదు!మిగతావాళ్ళు అడ్డం తిరిగి నిలదియ్యబోతే నేను సైగలతోనే వొద్దని వాళ్లని ఆపేవాణ్ణి - తనంతట తను చెప్పాలి తప్ప మాధవిని బలవంత పెట్టి చెప్పించడం అంటే నాకు క్రూరంగా అనిపించేది. నేను ఎప్పుడైనా అలసటగా పడుకుని ఉండి ఆదమరుపుగా ఉంటే గభాల్న ఒకటి చరిచి పారిపోవటం మాధవికీ మిగతా మరదళ్ళకీ ఒక సరదా.నేను వెంట పరిగెత్తి పట్టుకుని గట్టిగా కావిలించుకుని చెంప మీద ముద్దు పెట్టేస్తున్నంత దగ్గిర వరకూ నా మొహం తీసుకెళ్ళి తను బాగా యేడుపుమొహం పెట్టాక వొదిలేసేవాణ్ణి - ఒక్క మాధవిని తప్ప! అన్ని యేళ్ళలోనూ నాధవిని తప్ప ఇంకెవర్నీ ముద్దు పెట్టుకోలేదు, అంత నిక్కచ్చితనం నాది.

ఈ ఆటపాటల మధ్యలోనే ప్రపంచంలోని ఏ ప్రేమజంట మధ్యనా నడవని నాటకీయత నిండిన ఒక అద్భుతమైన సన్నివేశం మాధవికీ నాకూ మధ్య నడిచింది - అది ఉషారు!అంత గొప్ప సన్నివేశం తర్వాత హఠాత్తుగా మా ఇద్దరి మధ్యనా కొంతకాలం పాటు ఎడబాటు నిశ్శబ్దం తాండవించింది - అది ఉసూరు!

నేనూ మాధవి మాత్రమే బైటి వరండాలో ఉన్నాం. మాధవి ఎందుకో లోపలికి వెళ్ళింది - వాళ్ళ పోర్షన్లోకి! నాకు ఒక మెరుపులాంటి ఆలోచన వచ్చి మెయిన్ డోర్ పక్కన ఉన్న చెక్కబల్ల మీద కూర్చ్గున్నా - "మాధవి గనక ఇప్పుడు బైటికి వస్తే నా వొళ్ళో కూర్చుంటుంది!" అని అనిపించింది.కూర్చుంటుందా,లేదా అని అనుమానమే రాలేదు - కూర్చుంటుంది అని నమ్మకంగా ఉన్నాను!కొద్దిసేపు వెయిట్ చెయ్యగానే వచ్చింది,మొదట అట్లా కూర్చున్న నన్ను ఆశ్చర్యంగా చూసింది,తర్వాత గిరుక్కున వెనక్కి తిరిగి పక్కవాటంగా వొచ్చి నిజంగానే నా వొళ్ళో కూర్చునేసింది!కూర్చునీ కూర్చోంగానే తన చేతులు నా మెడ వెనక్కి చాపి అక్కడ వేళ్ళలో వేళ్ళు కలిపేసి ధీమాగా వెనక్కి వాలిపోవటం మొదలుపెట్టింది - నాకు టెరర్!అట్లా నిర్లక్ష్యంగా వాలితే తల బల్లకి కొట్టుకుంటుంది గదా,వెంటనే ఎడంచెయ్యిని తన మెడ వెనకనుంచి పోనిచ్చి అటువైపు భుజాన్ని గట్టిగా పట్టుకున్నాను, నా కాళ్ళ మీదనుంచి తను కిందకి జారిపోకుండా కుడి చేత్తో తన కాళ్ళని పట్టుకున్నాను,ఎడంకాలుని ఎత్తి నా కుడి మోకాలి మీదకి చేర్చి తనకి కుర్చీలా అమర్చాను - ఇదంతా ఒక వైణికుడు వీణని పట్టుకున్నంత సుతారంగా జరిగిపోయింది!ఆ భంగిమలో మొహం కొంచెం ఎత్తి పైకి చూస్తే తన గడ్డం భలే ముద్దొస్తూ కనిపించింది.ఆ చిరుగడ్డాన్ని ముద్దు పెట్టుకోవడానికి ముఖాన్ని వంచుతుంటే అలికిడి వినిపించి తల పైకెత్తి చూస్తే వాళ నాన్న తోటలోనుంచి వస్తూ కనిపించారు!అప్పటికే అరుగు ఎక్కేసి మేమున్న భంగిమ ఆయనకి ఇబ్బందిగా అనిపించి,"ఆ సూరానేనోడితో మనకి ఆటలేంటమ్మా?!" అనేసి ఆగకుండా మమ్మల్ని దాటుకుని తమ భాగం వైపుకి వెళ్ళిపోయారు.ఆ మాటతో మాధవి కలలోంచి జారిపడి ఇలలోకి వచ్చి మెల్లగా  నా చేతుల్ని విడిపించుకుని తనూ ఆయన వెనకే వెళ్ళిపోయింది.నేను మాత్రం తను వెళ్ళడం గురించి కాకుండా అక్కడ జరిగిన సన్నివేశం సామాన్యమైనది కాదనీ అది జన్మాంతర సౌహృదాలు పెనవేసుకున్న వారిమధ్య ఏకశృతిలో రవళించే రెండు హృదయవీణలు చేసిన అద్భుతం అని తెలుసుకోగలిగిన ఆనందంతో మత్తుగా అనిపించి చాలాసేపటి వరకూ కదలకుండా నవ్వుమొహంతో అలాగే ఉండిపోయాను!ఇప్పటికీ గుర్తొచ్చినప్పుదల్లా ఆశ్చర్యమే - నన్నలా చూడగానే తను ఏం చేస్తుందనుకున్నానో తను అదే చేసింది!తను వచ్చేటప్పటికి నేను ఏం చేస్తాననుకుందో నేను అదే చేశాను - అందుకే తనూ నన్ను ఆశ్చర్యంగా చూసింది!ఇంతకన్నా అద్భుతంగా మనసులు ఒకటవటం ఇంకెక్కడయినా జరుగుతుందా?

ఆ తర్వాత సంవత్సరం నుంచి, మా మామయ్యలకి ప్రతి సంవత్సరం ఈదర రావడం బోరు కొట్టేసిందో ఏమో - వేసవి కాలం ప్రయాణాలు ఆగిపోయాయి.బహుశా పిల్లల జీవితాల్లో మంచి ఆటలు మాయమైపోయి వేసవిలో కూడా పిల్లలకి చదువు బరువు పెరగటం అన్నిచోట్లా అప్పటినుంచే మొదలై ఉండొచ్చు,నేనూ టెంత్ పూర్తి చెయ్యడం,ఇంటరు నూజివాడులో చదవడం,ఇలా కల్లూరు రావడం చాలా తొందరగా జరిగిపోయింది.కల్లూరులో నేను మా దాక్టర్ మామయ్య ఇంట్లో ఉంటున్నాను.కల్లూరు వచ్చేటప్పటికే మా మామయ్య సీతానగరంలో పని చేస్తున్నారని తెలుసు.ఇక్కడికి చాలా దగ్గిర, పక్కవూరులాగే ఉంటుంది.అంతకాలం చూడకుండా ఉండి ఇప్పుడింత దగ్గిరకి రావటం ధ్రిల్లింగుగానూ ఉంది, ఇంత దగ్గిరగా ఉండి చూడలేకపోవటం టార్చరుగానూ ఉంది. ఎటూ వరసే గాబట్టి ఆటల్లో చెప్పినంత ధైర్యంగా మాటల్లో పెద్దవాళ్లముందు చెబితే పోయేది గదా ఇంత టార్చరెందుకు అనిపిస్తుంది గానీ ఆర్ధికానికి సంబంధించి కుటుంబ రాజకీయాలు కూడా ప్రపంచ రాజకీయాలకి తీసిపోవు.మా దాక్టర్ మామయ్య "అయితే నాకో లేకపోతే కిష్టిగాడికో తప్ప వీణ్ణీ బయటికి వొదిలే ప్రసక్తి లేదు!" అని డిక్లేర్ చేసేసి "పెద్దయ్యాక హరిబాబు ఎవర్ని ఇష్టపడినా సరే!" అని చాయిస్ నాకే ఇచ్చేశారు!.కానీ ఆ ఇద్దరిలో త్రాసు ఆయన వైపుకే మొగ్గు చూపుతుందని నాకు తెలుసు.మా వాళ్ళకి మా డాక్టర్ మామయ్య అంటేనే మోజు.అప్పట్లోనే నా ఇష్టం గురించి చెప్పి ఉంటే అది జరగనివ్వకుండా చేసే పనిలో మొదట ఉండేది వాళ్ళే!

అందుకే నేనూ బయటపడకుండా సరైన టైము వచ్చేదాక నా పొలిటికల్ బ్రెయినుతో అవకాశం కోసం ఎదురు చూస్తున్నా.మా మామయ్యలు అందర్లోకీ అదృట్టమంతుదైన మా డాక్టర్ మామయ్యకి ఇక్కడ గెజిటెడ్ ఆఫీసరు హోదా ఉంది.ఒకసారి మా మామయ్య "హరిబాబూ!మా నాన్నగారు నాలుగు గోళీలు విసిరాడు భూమ్మీదకి,ఒకటి మాత్రం మొదటి రౌండులోనే పండిపోయి కంచా నుంచి దూకేసింది గానీ మిగతా మూడూ మాత్రం ఇంకా గింగరాలు తిరుగుతూనే ఉన్నాయి" అని చాలా క్యామెడీగా చెప్పారు!గెజిటెడ్ ఆఫీసరు హోదాలో మిగతా వూళ్ళలో ఉన్న హాస్పటల్సుకి చెక్కింగుకి వెళ్తూ ఉంటారు.ఒకసారి నన్నూ వాళ్ళబ్బాయినీ కూడా పిలిచారు. రూటు కూడా సీతానగరం మీదుగానే. ఆయనే "మధ్యలో కాసేపు సీతానగరంలో ఆగొచ్చును" అని కూడా చెప్పారు - "లల్లలాం లల్లలాం లక్కీ చాన్సులే:-)" అన్నట్టు తయారైంది నా పరిస్థితి. అప్పటికి నాకు మిడ్ టర్మ్ టెస్టులు ధియరీ మొత్తం అయిపోయి ప్రాక్టికల్స్ మాత్రమే ఉన్నాయి.వాటికి చదివి ఉద్దరించేది ఏమీ లేదు - అక్కడ ఇచ్చిన జంతువుల్ని కొయ్యడమే!నేను వైవాకి పనికొచ్చే ఒక పుస్తకం మాత్రం తీసుకున్నా, వాళ్ళబ్బాయికి ఆ గోల కూడా లేదు.హాస్పటల్ వ్యాన్లు ఎలా ఉంటాయో తెలుసుగా - అంబులెన్సుకి ఎక్కువా ఫైరింజనుకి తక్కువా అన్నట్టు ఉంటాయి!ఆయన ముందు కూర్చుని పక్కనున్న స్టాఫుతో కబుర్లు చెప్పుకుంటుంటే నేను వాళ్ళబ్బాయి శీనుకి పొడి వేశాను, "మనం సీతానగరంలోనే ఉండిపోదాం!ఆ స్పిరిట్ వాసనా పేషెంట్ల మూలుగులూ మనకేం టైంపాస్?" అని.

ఆయన కూడా మేము ఇక్కడే ఉంటాం అంటే పెద్దగా అబ్జెక్ట్ చెయ్యలేదు.తిరుగుటపాలో పికప్ చేసుకుంటానని చెప్పి వెళ్ళారు.దాంతో నా వైవాకి చదవాల్సింది గబగబా చదివేసి బుక్కు మూసేసి అప్పటికే కబుర్లకి దిగిన వాళ్ళతో నేనూ కలిశాను.4X2=8 గురించి చెప్పానుగా, మా మామయ్యకీ ఇద్దరు కూతుళ్ళు!వీళ్ళిద్దరి గురించీ మామయ్య ఫ్రెండ్ ఒకరు "మాధవి ఏమో గలగల పారే సెలయేరు!అనిత ఏమో ఎగురుతు దూకే జలపాతం!" అని గొప్ప కవిత్వం చెప్పారు.వాళ్ళిద్దరూ కబుర్లు చెప్తూనే చదువుకుంటూ ఉన్నారు,మేమిద్దరం ఖాళీగా కూర్చుని మాట్లాడుతున్నాం.ఆ మాటల్లో తను హిందీ నోట్సు ఒకటి ఎక్కువగా ఉంది అనేసరికి "నేను రాసిపెట్టనా?" అంటే మొదట ఇబ్బందిగా "ఎందుకు లెండి!" అనేసింది గానీ "ఏం?నా రైటింగ్ బాగుండదనా!మీ టీచరుతో తిట్టించేలా రాయన్లే" అని ఇంకొంచెం చొరవగా అడిగేసరికి ఇంక తప్పక పుస్తకాలూ పెన్నూ ఇచ్చింది. హిందీలో మనం గబగబా రాసి చెడగొట్టేది ఏముంది?ఒక మాట రాయాలంటే మైండులో లెంగ్తు లెక్కేసుకుని పైన ఒక గీత గియ్యడం, మళ్ళీ స్పేస్ సరిచూసుకుంటూ దానికి అక్షరాల్ని వేళ్ళాడదియ్యటం - నాలాంటి బద్ధకస్తుడికి పెద్ద శిక్షే!

నేను అది పూర్తి చేసేసరికి వాళ్ళ స్టడీస్ కూడా ఒక కొలిక్కి రావడంతో ఇంక నా గిట్టుబాటు కార్యక్రమం మొదలుపెట్టాను - అంత గ్యాప్ తర్వాత కలిసినందుకు హీరోయిజం చూపించి ఇంప్రెస్ చెయ్యొద్దూ!?ఒక వేస్ట్ పేపర్ తీసుకుని సర్రున ఒక లైను గీశాను,దానిమీద పర్రున ఒక సర్కిల్ గీశాను,పెన్నుని బర్రున లాగేసి లైనుల్ని ఓవర్లాప్ చెయ్యకుండా పేపరు మీదనుంచి ఎత్తకుండా అదే షేపుని మీరు రప్పించగలరా అని చిన్న చాలెంజి చేశాను.ముగ్గురూ తెల్లమొహాలు వేశారు.చెయ్యొచ్చు,లైనులు క్రాస్ కాకూడనే గానీ గ్యాపులు ఉండకూడదని కాదుగా చాలెంజి - కొంచెం గ్యాపు ఇచ్చి రాసి చూపించా!"వావ్!" రెస్పాన్స్:-)దాంతో ఉషారొచ్చి లైను, సర్కిల్ గీశాక సర్కిల్ మధ్యన ఒక స్క్వేర్ గీసి మళ్ళీ చాలెంజి చేశా - లెవెల్ పెరుగుతుందనే గానీ సొల్యూషన్ అదే!అయినా, మళ్ళీ తెల్ల మొహాలు వేశారు.అది కూడా రాసి చూపించా - మళ్ళీ "వావ్!" రెస్పాన్స్.ఈలోపు మా అత్తయ్య వాళ్ళని రెండు మూడు సార్లు పడుకోవటానికి పిలవటం జరిగింది - అయినా వెళ్ళకుండా ఉండేలా ఇంప్రెస్ చేశాను!దానితో తర్వాత కొన్నేళ్ళపాటు రెగ్యులరుగా చూడకపోయినా అంత బెంగగా అనిపించలేదు.

*****


నేనిప్పుడు లయోలా కాలేజిలో క్యాంటీన్ నుంచి మెయిన్ బిల్దింగుకి వెళ్ళే కాలిదారికి పక్కన గేటులా అమర్చిన మనిషెత్తు సిమెంటు స్తంభానికి ఒక కాలు మడిచి పోటీ పెట్టుకుని నించున్నా.పక్కనే వెంకటప్పయ్య ఉన్నాడు.ఒక తరం ముందువరకు మావి దివాణాలు కదా!ఆ దివాణం అనే వెలమవాళ్ళ ఇళ్ళలో పనివాళ్ళు పనివాళ్ళలా ఉండరు - కుటుంబసభ్యుల్లాగే కలిసిపోతారు!ఆ కాలంలో ఇతను దివాణంలో చేరి ఇతను ముసలాడయ్యేసరికి మా దివాణాల ధీమా తగ్గి ఆ గొప్పలు పోయాక బోరు కొట్టకుండా మా నాలుగు ఇళ్ళలోనూ కాలక్షేపం కబుర్లు చెప్తూ కాలం గడిపేస్తున్నాడు - పనిదొంగ, కబుర్ల పోగు!ఇప్పుడు ఈ పల్లెటూరి ముసలోడు నాకూడా సిటీకి వచ్చి ఇక్కడ ఎందుకు ఉన్నాడో తెలుసా!

నూజివీడులో చదువు పూర్తయ్యే కాలం నాటికే నేను నాస్తికుణ్ణి ఆయిపోయాను.ఒకసారి కల్లూరులో మా డాక్తరు మామయ్య నన్ను మళ్ళీ భక్తుడిగా మారుద్దామని "ఒరేయ్, హరీ!ఇవన్నీ మనోళ్ళు తెలువితక్కువగా పెట్టలేదురా.ఒకప్పుడు మశూచికం,పోలేరమ్మ రోగాలకి భయపడి వాటిని దేవతల్ని చేసుకుని ధైర్యం తెచ్చుకునేవాళ్ళు..." అని లెక్చరు మొదలుపెడితే నేను మధ్యలోనే అందుకుని "మరి, ఇప్పుడు ఆ రోగాలకి కారణం బాక్టీరియా అని తెలిశాక బాక్టీరియా బొమ్మలకే దణ్ణం పెడితే సరిపోతుందా!" అని కవుంటర్ ఇచ్చేసరికి ఆయనకి తల దిమ్మెక్కిపోయింది!ఏం చెయ్యాలో తెలీక నవ్వుతూ నన్ను "పోరా!" అని విసుక్కుని ఆయన బతికిపోయాడు - మళ్ళీ ఎప్పుడూ నన్ను కెలికే ధైర్యం చెయ్యలా!కల్లూరులో చదువుకున్న వాతావరణం బావుండి మార్కుల్లో ఇరగదీశాను.ముఖ్యంగా మా ఐంగ్లీషు టీచరు గారి ప్రైవేట్ పుణ్యాన ఇంగ్లీషులో 90 దాటినాయి.లయోలా కాలేజిని నడిపే ఫాదర్లకేమో స్టాండర్డూ, డిసిప్లినూ లాంటి చాదస్తాలతో ఫిల్టర్ చేసి స్టూడెంట్లని చేర్చుకుంటూ ఉండటంతో రానురానూ సంఖ్య తగ్గిపోయి యూజీసీ వారినుంచి "ఇంత తక్కువ సంఖ్యలో విద్యార్ధులు ఉంటానికి కారణమేమిటి?మీ కాలెజికి గ్రాణ్ట్లు ఇవ్వడం వల్ల యేమి ప్రయోజనం?" అని శ్రీముఖాలు మొదలయ్యాయనీ దానితో ఇంగ్లీషులో మంచి మార్కులు వచ్చినవాళ్ళకి సీటు ఖాయం చెయ్యాలనే నిర్ణయం తీసుకున్నారనీ అలాంటి సాంకేతిక వివరాలని పట్టించుకోని నాకు కూడా రూఢిగా తెలిసింది.

నాకు సబ్జెక్టుల్లో ఎక్కువ మార్కులే వచ్చినా మామూలు లెక్క ప్రకారం అయితే లయోలా కాలేజిలో సీటు రావడం అనేది జరగని పని.దానితో మా అమ్మ తను దేవుడికి ధాంక్స్ చెప్పడమే కాకుండా నన్ను కూడా ఈ ఒక్కసారికీ మొండితనం తగ్గించుకుని మొదటిరోజు క్లాసుకు వెళ్ళబోయేముందు గుడికి వెళమని పురమాయించింది.మొదట మొరాయించాను గానీ తర్వాత వెళ్తాను లెమ్మని ఒపుకున్నాను ఈవిడగారు అక్కడికొచ్చి చూడబోయిందా ఏమిటి వెళ్ళానని చెప్తే సరిపోదా అనిపించి.నా బుర్రలోకి దూరి నా ఐడియా కనిపెట్టేసినట్టు  ఈ నక్షత్రకుణ్ణి నాకు అంగట్టింది!ఇక్కడ రూము చూసిపెట్టి అందులో దిగబెట్టే పని కూడా తీసుకున్నాడు - సొల్లు కబుర్లు చెప్పేవాళ్లకి పరిచయాలు ఎక్కువ కదా, గుణదల పంచాయితీ ఆఫీసుకి ఎదురుగా మావూరి కమ్మవాళ్ళు ఎవరో ఉంటున్నారనీ నాలాంటి చదువుకునే కుర్రాళ్ళకి వాళ్ళు రూములు అద్దెకిస్తారనీ తెలుసుకున్నాడు. పొద్దున్నే అక్కడ సామాను దించాకనే ఇలా నావెంట వచ్చాడు నన్ను గుడికి తీసుకెళ్ళే పని కూడా పూర్తి చేసుకుందామని. 

నా కిలాడితనం గురించి మీకూ తెలుసుగా, అడ్డం తిరిగి  కుదరదనేశాను."మరి ఇంటి దగ్గిర సరేనన్నావు: అంటే నేను "అవును, అన్నాను.అంటే మాట నిలబెట్టుకోవాలని రూలేమైనా ఉందా!ఇప్పుడు మనసు మార్చుకున్నాను" అని జవాబు చెప్పడం, "తోడుగా నేను రావటానికీ ఒప్పుకున్నావు. ఇంటికెళ్ళీ ఏం చెప్పను?" అంటే "నిన్ను రావద్దంటే ఆవిడ నాన్నగార్ని తోడిచ్చి పంపిస్తుంది!అప్పుడు తప్పుకోవడానికి వీల్లేకుండా ఇరుక్కుపోతాను గాబట్టి నువ్వు రావడానికి ఒపుకున్నాను.నువ్వెప్పుడూ అబద్ధాలు చెప్పలేదా?హరిబాబు గుడికెళ్ళాడని చెప్పెయ్." అనడం,ఈ మధ్యలో ఓ కుర్రాడు "క్యాంటీన్ ఎక్కడండి!" అని అమాయకంగా అడుగుతుంటే క్యాంటీన్ వైపు చూపించి "అదే!" అనడం పూర్తయ్యేసరికి వెంకటప్పయ్య తెల్లమొహం వేసేశాడు.ఇంక నన్ను గుడికి తీసుకెళ్ళి దణ్ణం పెట్టించటం కుదిరే పని కాదని అర్ధమైపోయి మాట్లాడకుండా వెళ్ళిపోయాడు.మా గొడవలో నేనుండి మాట్లాడిన ఒక్క ముక్కా కొంచెం దూకుడుగా వచ్చేసరికి నన్ను క్యాంటీను గురించి అడిగిన కుర్రాడికి నేను రౌడీలా కనిపించానంట - క్లోజ్ ఫ్రెండయ్యాక చెప్పాడు.

*****

డిగ్రీలో మా ఫ్రెండ్సులో ఒకతనికి స్టైలుగా ఉండటం ఇష్టం.రోజుకో గెటప్ వెయ్యాలని సరదా - కమలాగాసన్ ఫ్యాన్!ఒకసారి మీసం తీసేసి వచ్చాడు,చూట్టానికి బాగానే ఉన్నాడు గానీ వెంకటేష్ అనే ఫ్రెండు దానికీ మగతనానికీ లింకు పెట్టి జోకులేస్తున్నాడు అతనిమీద.

నేనేదో పుస్తకం చదువుకుంటూ వీళ్ళ గోలకి డిస్టర్బ్ అయ్యి కల్పించుకుని "అది లేకపోతే తప్ప మీసం లేనంతమాత్రాన మగవాడు కాకుండా పోతాడా?" అని రిటార్ట్ ఇచ్చాను.దానికి మీసం తీసేసిన ఫ్రెండు ఖుషీ అయ్యాడు గానీ వీడు మాత్రం "అది అంటే ఏమిటి?చెప్పు!" అని జిడ్డులా తగులుకున్నాడు.

ఆ చెప్పగూడని మాట నాతో చెప్పించాలని వాడి ప్లాను,నేను దొరుకుతానా!"అది నీకు ఉండి ఉంటే నువ్వు నన్ను అడిగేవాడివి కాదు - ఇప్పటికే తెలిసిపోయేది.అది నీకు లేనప్పుడు నేను ఎన్నిరకాలుగా వర్ణించి చెప్పినా నీకు అర్ధం కాదు - కాబట్టి పదే పదే అడిగి ఉపయోగం లేదు!" అనేశాను. దెబ్బకి నవ్వుతూ నాకో షేక్ హ్యాండిచ్చి నోరుమూశాడు - స్పోర్టివ్ గై!

*****

నేనూ వెంకటేషూ సినిమా చూస్తున్నాం - న్యాయం కావాలి.నడివేసవి మిట్టమధ్ధ్యానం!బహుశా అలంకార్ ధియేటర్ అనుకుంటాను  - నాన్ ఏసీ,గోడలో ఖాళీలు ఉన్నాయి,గాలికోసం వాటి పక్కనే కూర్చుంటే వేడిగాలి.చాలాసేపు ఆ నరకం భరించి ఇంక ఉండబట్టలేక,"వెంకటేషూ!మనం వొచ్చింది న్యాయం కావాలి సినిమాకో చెమట కావాలి సినిమాకో అర్ధం కావట్లేదయ్యా!" అనేసరికి మావాడి గఫ్ఫాకి తోడు వెనక వరసలో కూర్చున్న అమ్మాయిల కిలకిలలు కూడా కలిశాయి.

*****

డిగ్రీ సెకండియర్ మధ్యలో కెమిస్ట్రీ సబ్జెక్టుకి సిరాజ్ అనే లెక్చరర్ని కొత్తగా రిక్రూట్ చేసుకున్నారు.బోటనీ వాళ్లకీ జూవాలజీ వాళ్లకి కామన్ సబ్జెక్ట్ కాబట్టి డెమో లెక్చర్ రోజున అందర్నీ కలిపేసి కూర్చోబెట్టి మహా అర్భాటంగా రంగప్రవేశం చేయించారు.అతను కూడా డెమో ఇరగదీసెయ్యటంతో లెక్చరర్లని అంతగా మెచ్చుకోని అజయ్ గాడు కూడా మురిసి ముక్కలైపోయి ఆయనగారి విడిదివసతికి వెళ్ళి చెయ్యి ఝాడించి "మీలాంటి లెక్చరర్ రావటం నిజంగా మా అదృష్టం" అని డైలాగులు కూడా పేల్చాడు.కానీ తరవాత రోజునుంచి నరసింహ ఆరోరూపం లాంటి అసలురూపం చూపించటం మొదలుపెట్టాడు - బోరు,మహా బోరు,పరమ బోరు!

ఆ దుర్మార్గుడి యొక్క మేధోపరమైన అణచివేతని ఎక్కువకాలం భరించలేక విప్లవపతాకం ఎగరెయ్యాలని తీర్మానించేశాం - ముగ్గురు మరాఠీలు సిద్ధమయ్యారు.మొదటివాడి పేరు రవివర్మ.పొట్టి యన్టీఅర్ అని వీడికి ముద్దుపేరు.ఒక్క పొడుగు తప్పిస్తే చిరుబొజ్జ,ముద్దొచ్చే గుండ్రటి మొహం,తెలుపు రంగు,నవ్వొచ్చే రౌడీతనం - అన్నీ సరిపోతాయి.రెండోవాడు స్టౌటు ప్రసాద్ - ఆ ముద్దుపేరు పెట్టింది మా ట్యూషన్ మాస్టారు.మొదటిసారి తనని ఆయనలా రిఫర్ చేశారని ఫ్రెండ్సు ద్వారా విన్నప్పుడు "ఆయనేదో అమితాబ్బచ్చన్లా సన్నగా ఉన్నట్టు?!" అని గింజుకున్నాడు గానీ యెటూ తను భారీగా ఉండటం నిజమే గాబట్టి అందరూ అలానే పిలుస్తున్నా సర్దుకు పోయాడు.మూడోవాడు మీ ముందున్న చిచ్చరపిడుగు - హరిబాబు!ముగ్గురం లెక్క ప్రకారం మా క్లాసురూం డోరుకి కొంచెం దూరంగా తను వచ్చే దారిలో విలాసంగా కాళ్ళు మడతలేసుకుని పిట్టగోడకి ఆనుకుని నుంచున్నాం.అటూ ఇటూ ఒక పొట్టి బుడంకాయ్ మధ్యలో ఒక భారీకాయ్ - చూట్టానికి రెండు గుళ్ళీచెంబుల మధ్యన ఒక గంగాళాన్ని నిలబెట్టినట్టు చూడముచ్చటైన దృశ్యం!

ఆరోజు మాకు ఈవెనింగ్ ప్రాక్టికల్స్ లేవు - లాస్టు పీరియడ్ తనదే.మిగతా క్లాసులవాళ్లదీ అదే పరిస్థితి అయ్యుండాలి - మా క్లాసు తప్ప దరిదాపుల్లో ఏ క్లాసూ నడవటం లేదు - నిజంగానే సూది కిందపడినా గణగణమని మోగుతుందేమో అనిపించేటంత నీరవ నిశ్శబ్దం!రావలసినవాడు మా కళ్ళ ముందు నుంచే వెళ్ళాడు,మేము నవ్వుతూ విష్షులు చేశాం,తనూ చిర్నవ్వుతో అందుకున్నాడు. గర్వంగా క్లాసురూములో అడుగుపెట్టిన తదాది అప్పటివరకూ లోపల ఏం చేశాడో తెలియదు గానీ కన్నుమూసి తెరిచేలోపు చెంగున తలుపు బయటికి దూకి "హేయ్!" అని మమ్మల్ని చప్పట్లు కొట్టి పిలుస్తున్నాడు.ఈ భూప్రపంచం మొత్తంలో ఏ లెక్చరరుకీ స్టూడెంట్లు అంతకన్నా భయానకదృశ్యాన్ని చూపించి ఉండరు - రూమంతా ఖాళీ!ఇక ఆయన పిలుపుకి ముగ్గురు మరాఠీలు వరసగా ఇచ్చిన రిటార్టులు:ముద్దుపేరుని సార్ధకం చేసుకుంటూ మా రవివర్మ ముందు కదిలి "ఎవరూ రారు!" అనే యాంగ్రీ డైలాగుని గట్టిగా అరిచి చెప్పి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు.స్టౌటు ప్రసాదు త్యాగరాయ భాగవతారులా "నననాన నననా నానా" అని రకరకాల శృతులలో ఆలాపనలు ఆలపిస్తూ అదే దారిన పోయాడు.ఇక మిగిలింది నేను!చాలా ధైర్యంగా అక్కడే స్థిరంగా నిలబడి తనవైపుకే తిరిగి సూటిగా కళ్లల్లోకి చూస్తూ "మొదటిరోజు చెప్పినట్టు అన్నిరోజులూ చెప్తే మీ సొమ్మేం పోయింది?" అని అడిగేసి నేనూ గిరుక్కున వెనక్కి తిరిగి వొచ్చేశాను.

ఆ తర్వాత రోజున క్లాసులో ఆయన దుఃఖం చూసి అంత ఘోరం ఎందుకు చేశామా అని బోల్డు రిపెంట్ అయ్యాం.ఎందుకంటే "సమస్య ఏమిటో చెప్పండి,నా తప్పును దిద్దుకుంటాను." అని మళ్ళీ మొదటికొచ్చాడు మరి!బహుశా ఆయన షాకులో ఉండి వినిపించుకోలేదో నేను రవిగాడిలా అరిచి చెప్పకనో ఏమో ఆయనకి విషయం ఎక్కలేదు.అక్కడికీ ఒక సహనశీలి లేచి ఓపిగ్గా వివరిస్తే సిటీలైట్స్ ఆఖరి సీనులో చార్లీ చాప్లిన్ పెట్టినంత అమాయకంగా మొహం పెట్టి "బాగానే చెబుతున్నాగా!ఎందుకు ఆర్ధం కావట్లేదు?" అని అడిగేశాడు,ఇంకేం చెప్తాం - ఆ తరవాత ఇక సంవత్సరమంతా ఆయన పాటికాయన చెప్పుకున్నాడు మేం మాత్రం ఆయన చెప్తున్నది చెవుల్లో దూర్చుకోకుండా మమ్మల్ని మేం రక్షించుకున్నాం!

కొంచెమన్నా ఫలితం ఇవ్వకుండా పూర్తిగా ఫెయిలయిన మా బుల్లి విప్లవం మా జూనియర్ల పీకల మీదకి తెచ్చింది - జూనియర్లని ఆయన గురించి కూపీ లాగితే "అమ్మో సిరాజా?ఇరగదీస్తన్నాడు సార్!" అనేశారు.మా ఫెయిలయిన బుల్లి విప్లవమే కాదు,మహాహా సామ్యవాద విప్లవాలు కూడా అంతే - తెచ్చిన మొదటితరం చంకలెగరేస్తారు, తర్వాతి తరాల వీపుల మీద రాండోళ్ళు మోగుతై!

*****

లయోలా కాలేజి హాస్టళ్ళు బావుంటాయి.మిగతావాటిల్లోకి మేమెప్పుడూ తొంగి చూడలేదు గానీ మా హాస్టలు మెస్సు భోజనం మాత్రం సూపర్!ఆదివారం మ్యాట్నీకి చెక్కెయ్యాలనుకున్న కుర్రాడు ఎవడూ లంచిలో సాంబారు ముట్టుకోడు - నిద్ర ముంచుకొస్తుంది గనక!

ఆ హాస్టలు యొక్క శాస్త్రీయనామం రాఘవేంద్ర హాస్టలు అనుకుంటాను, కానీ అన్నిట్లోకి కొత్తది కాబట్టి న్యూహాస్టల్ అనే పిలిచేవాళ్ళు.ఒక ఆదివారం నేనూ, అజయ్, రవీ సాంబారు తాగలేదు! సినిమాకి వెళ్ళడమూ కుదరలేదు. నిద్ర పట్టడమూ లేదు - క్యాంపసులోనే బలాదూర్ తిరుగుతూ కబుర్లు చెప్పుకుందామనుకున్నాం, తిరుగుతున్నాం.హఠాత్తుగా అజయ్ గాడికి రవిగాణ్ణి రూముకి పంపించేసి మేమిద్దరమే కబుర్లు చెప్పుకుంటూ గడపాలనే దుర్మార్గపు ఆలోచన వచ్చింది.ముగ్గురం దాదాపు అతుక్కుని నడుస్తున్నాం, అయినా, వాడు కనుసైగ చెయ్యడంతోనే మా ఇద్దరి మధ్యనా ఉన్న కెమిస్ట్రీ మూలాన నాకూ విషయం అర్ధమై ఒక మెరుపులాంటి ఐడియాతో ఇట్లా మొదలుపెట్టాను,"ఆండాళ్ళూ!ఇవ్వాళ ఒక సైన్సు పాఠం చెప్తానేం?..తుపు, తుపు..నిజానికి నాలాంటి మేధావి దగ్గిర చదువుకోవడం అన్నది...తుపు, తుపు...నిజంగా నీ అదృష్టం అని చెప్పాలి.ఏదీ ముందు నువ్వొక సూత్రం చెప్పు" అని మళ్ళీ నేనే "అలాగే మాస్టారూ!భూమి సూర్యుడి చుట్టూ గుండ్రముగా తిరుగును.చంద్రుడు భూమి చుట్టూ గుండ్రముగా తిరుగును" అని అజయ్ వైపు చూశాను.

తర్వాత జోకుని ఎట్లా తిప్పాలో అజయ్ అర్ధం చేసుకుని,"ఆపెయ్,ఆపెయ్!బుర్రలోంచి బూజు దులిపెయ్!పూర్వం ఎప్పుడో జనం సైకిళ్ళ మీదా బస్సుల్లోనూ రైళ్ళల్లోనూ తిరిగేటప్పటి పాఠం అది. ఇప్పుడు?జెట్లు, జాకెట్లు, రాకెట్లు, మూన్వాక్కులు - అన్నీ వచ్చేశాయా!ఈ విషయంలో నేను కొత్తకొత్త ప్రయోగాలు చాలా చేశాను.అసలీ పాఠం ఎలా చెప్పాలంటే - రవివర్మ అజయ్ హరిబాబుల చుట్టూ తిరుగును." అని సాగదీశాడో లేదో రవిగాడు గిరుక్కున వెనక్కి తిరిగి "నాకు నిద్రొస్తుందిరా,రూముకి పోతాను"అనేసి వెళ్ళిపోయాడు.ఒక extempore జోకును అంత గొప్పగా పేల్చినందుకు హ్యాపీగానే ఉన్నా రవిగాడి మీద జాలేసి "పాపం కదరా,వాడు చాలా ఫీలయ్యాడు!" అంటే "వాడి మొహం వాడేం ఫీలవ్వడ్లే, వెళ్ళాక చూద్దువుగానిగా వాడి రెస్పాన్స్" అనేసి వాళ్ళిద్దరి హిస్టరీ చెప్పాడు.రవిగాడి ఫాదర్ C.I కావడంతో పోలీసుల దగ్గిర గారాబాలు కుడిచిన యువరాజు రవివర్మ.అయితే,వాడిలో సరదాగా ఉండే రౌడీతనం తీసేస్తే అమాయకుడు గనక వాళ్ళ ఫాదరే వాణ్ణి అజయ్ రక్షణలో ఉంచారు - ట.

సాయంకాలం మా కబుర్లు అయ్యాక హాస్టల్లో ఎదురవగానే వీడు మరీ వెంకటేష్ అంత స్పోర్టివ్ గై కాదు గాబట్టి, "బాగా కబుర్లు _గించుకున్నారా!" అని వాడి కసిని వాడు చూపించాడు!ఆ వయసులో అలాంటి భాష మామూలే గదా, అందులోనూ ఫ్రెండ్సు మధ్యన - నవ్వేశాం.

*****

ఒకసారి అజయ్ నాస్తికకేంద్రం లైబ్రరీనుంచి చదువు నవల తెచ్చాడు.వాడు చదివాక నేను తీసుకున్నాను.నేను ఇంకా పూర్తి చెయ్యకముందే ఇవ్వాళ రెన్యువల్ చెయ్యకపోతే ఫైన్ పడుతుందని వొచ్చి కూర్చున్నాడు.ఏవో ఎగ్జాంస్ ముందర అనుకుంటాను నేను నా కుర్చీలో కూర్చుని క్లాస్ బుక్స్ చదువుతూ ఉన్నాను.పూర్తిగా చదవలేదురా అంటే, నా వెనకాల ఉన్న మంచం మీద కూర్చున్న వాడు  "ఎంతవరకూ చదివావో చూద్దాం - అక్కడక్కడా కొన్ని వాక్యాలు పైకి చదువుతాను,అది నువ్వు చదివినట్టు అనిపిస్తే తల నిలువుగా వూపు, లేకపోతే అడ్డంగా వూపు" అని instructions అన్నీ ఇచ్చి మొదలుపెట్టాడు:

"సీతమ్మ మహాసముద్రం..."
"రాఘవయ్య గోలీలు బెచ్చాలు..."
"రోళ్ళు పగిలే రొహిణి..."
"వూరి బయట డేరాలో బయస్కోపు..."
"ఇవన్నీ చూసి సుందరం కాస్త దడుచుకున్నాడు."

వాడు రిఫరెన్సులుగా నామీదకి వరసపెట్టి వదుల్తున్న సగంలో ఆపేసిన వాక్యాలు అడ్డదిడ్డంగా కలిసిపోయి ఒక బూతు సినీమాని కళ్ళముందు చూపించేస్తుంటే ఇక్కడివరకూ వచ్చేసరికి నేను నిజంగానే దడుచుకున్నాను - ఇంకా ముందుకెళ్తే ఏమి వినాల్సి వస్తుందోనని! అప్పటికే తల వూపడానికి బదులు డోసులు డోసులుగా పెరుగుతున్న నవ్వాపుకోవడానికి అన్ని రకాల అవస్థలూ పడుతున్నవాణ్ని ఇంక టార్చరు భరించలేక వాడి చేత్తులోంచి పుస్తకం లాగిపారేసి "బాబూ, నీకో దణ్ణం!రెన్యువల్ కాదు మళ్ళీ పుస్తకం తీసుకురానక్కర్లేదు, పో!నీ రన్నింగ్ కామెంట్రీ తగలెయ్య!!" అని రూములోంచి తరిమేశాను.

మళ్ళీ చదువు పుస్తకం చదవాలంటే భయం!చదువుతుండగా ఆ పాత సన్నివేశం గుర్తొచ్చి నవ్వుతున్నప్పుడు ఎవరన్నా చూస్తే అంత సీరియస్ పుస్తకంలో ఇంత పగలబడి నవ్వాల్సిన విషయం ఏముంది, వీడికేమన్నా లూజా అనుకుంటారు గదా - పనిగట్టుకుని ఇన్సల్ట్ అవడం దేనికి?అట్లా ఒకానొక సీరియస్ క్లాసిక్ మాలాంటి కేతిగాళ్ళ చేతుల్లో పడి క్యామెడీ ధ్రిల్లర్ అయిపోయింది, పాపం!

*****

డిగ్రీలో మాకు పాఠాలు చెప్పిన విజయవాడ లయోలా కాలేజి లెక్చర్లలో అత్యంత అమాయక చక్రవర్తి P.మాధవరావు గారు.ఆయన వ్యవహారశైలిని బట్టి ఆయన ఖచ్చితంగా బ్రాహ్మడే అని నా నమ్మకం.అనుభవజ్ఞుడే,పాండిత్యం గలవాడే, తిన్నగా పాఠాలు చెప్పి ఉంటే మమ్మల్ని మెప్పించి ఉండేవాడేమో - ఏదీ, మేము చెప్పనిస్తే గదా!

ఆయన మాంచి ఏకాగ్రతతో పాఠం చెప్పడంలో లీనమవుతున్నాడని తెలియగానే క్లాసులో ఏదో ఒక మూలనుంచి తుమ్మెదల ఝుంకారం మొదలవుతుంది.ఈయనకేమో మన దేశపు న్యాయమూర్తుల మాదిరి ఎవడు తప్పు చేస్తే వాణ్ణి మాత్రమే శిక్షించాలి తప్ప పొరపాటున సైతం ఒక్క అమాయకుణ్ణి కూడా శిక్షించరాదు అనే పట్టుదల ఒకటి తగలడినట్టుంది,దానికి తోడు తను కన్నంలో దొంగని కన్నంలోనే పట్టుకోగలననే ధీమా కూడా ఉన్నట్టుంది - పాఠం ఆపేసి చరచరా ఆవైపుకి వెళ్ళి షెర్లాక్ హోమ్స్ మాదిరి వాళ్ల ముఖాల్ని నిశితంగా పరిశీలిస్తూ బెంచీల మధ్యనున్న ఖాళీలో అటూఇటూ బిరబిరా తిరిగేస్తూ ఉండేవాడు.అబ్బే,ముఖంలో ఏమాత్రం అనవాలు తెలియకుండా స్వరాన్ని నాభినుంచి రప్పించగలిగిన ఘనాపాఠీలం మేము దొరుకుతామా?అదీగాక, ఆయన ఎప్పుడైతే ఒకవైపుకి దూసుకుపోతున్నాడో ఆ వైపున ఆగిపోయేది.ఆయన అట్లా వాళ్ల ముఖాల్ని నిశితంగా పరిశీలిస్తూ అటూఇటూ తిరుగుతుండగా మరో మూలనుంచి ఝుంకారం మొదలయ్యేది.మళ్ళీ ఈ షెర్లాక్ హోమ్స్ గారు ఆమూలకి పరిగెత్తి మళ్ళీ బెంచీల మధ్యనున్న ఖాళీలో అటూఇటూ బిరబిరా తిరిగేస్తూ అదే హడావిడి చేసేవాడు - చూస్తేనే నవ్వొచ్చే దృశ్యం, మూడేళ్ళపాటు పండగే పండగ!

అంతటి అమాయకుడికీ ఒకడు విలన్లా దొరికిపోయాడు,ఈయన వాడిమీద క్రూరంగా పగ సాధించాడు - ఈ ఝంకార్ బీట్ విషయంలో కాదులెండి!తెరమీద కమలహసన్ పాత్రని వేరే పాత్ర పిలిచిందనుకోండి, తలని ఎలా తిప్పుతాడు?గొప్ప శాస్త్రీయమైన నటుడు కదా - ఆ ఇద్దరు నటులూ నిలబడ్డ స్థలాల మధ్యనున్న కోణాన్ని మూడుతో విభాగించి ఒక్కోసారి ఒక్కోవంతు చొప్పున మూడు దశల్లో తన తలని అటు తిప్పడం అనే సుదీర్ఘమైన ప్రక్రియని పూర్తి చేస్తాడు, అవునా!సార్ క్వెశ్చెన్ అడిగితే జవాబు చెప్పటానికి లేవాలి గదా,మావాడు కూడా అది మూడు దశల్లో చేసేవాడు.వాడి పేరు గుర్తు లేదు,రిజిస్టరులో నెంబరు 10 కాబట్టి దస్ నంబరీ అనేవాళ్ళం.చెప్పులు విప్పేసి కూర్చోవడం అలవాటు కాబట్టి ముందుగా కాళ్ళని చెప్పుల్లో దూర్చాలి,కాయం స్థూలం గనక దానంతటది ఈజీగా లేవదు కాబట్టి టేబుల్ అంచును గట్టిగా పట్టుకుని హుమ్మని వూపు తెచ్చుకుని పైకి లేవాలి,టేబులుకీ కుర్చీకీ మధ్యన ఖాళీ తక్కువ గనక నుంచున్నాక పొట్ట నొక్కుకుపోకుండా ఉండాలంటే కొంచెం ముందుకి వొంగాలి - ఈ కృత్యాద్యవస్థలన్నీ చూసి మాకు నవ్వాగక చవితి చంద్రుళ్ళలా నువ్వుతుంటే ఆయనకి అది అర్ధంగాక వాడు ఏదో తనని ఇన్సల్టు చేస్తున్నట్టు అపార్ధం చేసుకుని వాణ్ణి కుట్రదారులా నిర్ధారించేశారు.

వాడు కూడా అమాయకుడేం కాదు,ఒకసారి ఆయన వీడికి గెటౌట్ చెప్పేసి తెలుగు మీడియం నుంచి వచ్చినవాళ్ళ కోసం అచ్చతెలుగులో "ఈ మొక్క కాండంలో మృదుకణజాలం ఎక్కువగా ఉంటుంది." అని పాఠం కొనసాగిస్తుంటే పోయేవాడు పోకుండా కిటికీలోనుంచి తల లోపలికి పెట్టి "అయితే పడిపోదా సార్?!" అని అమాయకంగా అడిగి ఒక జోకుబాంబు పేల్చాడు.అంతటి స్థూలకాయుడి తల కిటికీలో ఎలా పట్టిందా అని మీకు అనుమానం రావచ్చు,మా లయోలా కాలేజి కిటికీలు కూడా దాదాపు దర్వాజా తలుపు సైజులో ఉంటాయి - తలుపుల్ని ముయ్యడానికి మధ్యలో ఉండే నిలువుబద్ద తప్పించి అడ్డంగా ఏమీ ఉండవు.దానికాయన "ఫస్ట్ యూ గెటౌట్" అని దాని బాబులాంటి మరో జోకుబాంబు వేశాడు!నవ్వినా చావే,వూర్కున్నా చావే - నవ్వాపుకోవడానికి నిజంగానే కుక్కచావు చచ్చాం ఆరోజు.

ఆఖరికి బోటనీ హెడ్డు భగత్ సింగ్ సహాయంతో వాణ్ణి మరో కాలేజికి పంపించి వాణ్ణొక్కణ్ణి విజయవంతంగా శిక్షించగలిగాడు.ఆఖరి సంవత్సరంలో లయోలా కాలేజి నుంచి సర్టిఫికెట్ల కోసం వచ్చినప్పుడు మీరు నాకు చాలా అన్యాయం చేశార్రా,పరమ దరిద్రంగా ఉంది ఈ కాలేజి అని మమ్మల్ని బ్లేం చెయ్యబోతే నువ్వు మాత్రం అయితే పడిపోదా సార్ అని కుళ్ళు జోకులెయ్యలేదా అని తప్పించుకున్నాం గానీ ఉత్తపుణ్యానికి మంచి కాలేజి నుంచి చెత్త కాలేజికి మారినందుకు వాడిమీద మాకూ జాలేసింది - పూర్ ఫెలో!


*****

నా మొత్తం స్టూడెంటు దశలో నన్ను విపరీతంగా అభిమానించిన లెక్చరర్ E.S.N. మూర్తి గారు.ఆయన క్లాసులో ఒకసారి నేను extempore seminar ఇచ్చి ఆయనతో చప్పట్లు కొట్టించుకున్నాను. మేము లయోలా కాలేజిలో చేరిన మొదట్లోనే ఆయన నేను ట్యూషన్ చెప్తున్నాను,చేరదల్చుకున్నవాళ్ళు చేరవచ్చు అని చెప్తే చేరిన కొద్దిమందిలో నేనూ ఒకణ్ణి. మొదటి సంవత్సరం జాయినింగ్ టైములోనే హాస్టల్ కోసం అప్లికేషనులో టిక్ పెట్టాలని తెలియక డే స్కాలరు లైఫ్ గడిపాను.రెండవ సంవత్సరం ముందుగానే మేలుకుని సమయానికి నోటిఫికేషన్ ఇచ్చి హాస్టలుకి వచ్చి పడ్డాను.రెండవ సంవత్సరం వరకు పొలిటికల్ యాజిటేషన్లతో అట్టుడికిపోయి ఆ వేసవి శెలవల్లో ఫాదర్లు బుర్రకి పని చెప్పి గొడవలు చేసే వాళ్లని ఫిల్టర్ చేసి వాళ్ళ పేరెంట్సుతో రహస్య ఒప్పందాలు కుదుర్చుకుని గుట్టు చప్పుడు కాకుండా టీసీలు ఏర్పాటు చేసి సర్దెయ్యటంతో మూడో సంవత్సరంలో ఆ హడావిడిని ఇష్తపడిన కుర్రాళ్ళకి కాలేజిలో అడుగు పెట్టేసరికి క్లైమాక్సులో హీరో విలన్ చేతిలో ఓడిపోయి దిక్కుమాలిన కుక్కచావు చచ్చి విలన్ విజృంభించి వికటాట్టహాసాలతో రేప్ చేస్తే శీలం పోగొటుకున్న హీరోయిన్ వెక్కి వెక్కి ఏడుస్తుండగా భశుం కార్డు పడిన కంగాళీ అవకతవకల గందరగోళపు మళయాళీ సినిమాలా కనపడింది - పాపం!ఆ గొడవల్లో ఎక్కువగా తిరిగిన కస్పారెడ్డి హాస్టల్లో నా పక్క రూము కావడంతో ఇనుముతో కలిసిన అగ్నిలా నాకూ హాస్టలు యోగం పోయింది - మళ్ళీ గుణదలకే వచ్చి పడ్డాను.


*****

బాగా డబ్బున్నవాడు ఎటూ నవ్వలేడు - వాడి భయాలు వాడివి!ఏమీ లేనివాడికి అసలు నవ్వురాదు - వాడి కష్టాలు వాడివి!ఎటొచ్చీ అప్పటికే రాబడి పోబడి లెక్కలు తలిసిపోయి ఇక వచ్చేదీ పొయ్యేదీ లేదని తెలిసిన మధ్యతరగతి వాళ్ళు మాత్రమే కడుపుబ్బ నవ్వగలరు. అలాంటి హాస్యరసికుల్లో హరిబాబు మరీ ముదురుకేసు, కదూ!

నవ్వడం ఒక భోగం!నవ్వించడం ఒక వైభోగం!!నవ్వండి,నవ్వించండి!!!

Friday, 16 June 2017

హిందూ ధర్మ ప్రహేళికలు - ద్రౌపది మానభంగ పర్వం!

          "ఒరులేయవి యొనరించిన నరవర! అప్రియము తన మనంబున కగుఁదా నొరులకు నది సేయకునికి పరాయణము పరమ ధర్మపథములకెల్లన్" – (ఇతరులు మనపట్ల ఏ పని చేస్తే మనకిష్టం వుండదో ఆ పని ఇతరులకు చేయకపోవడం ఉత్తమ ధర్మం). ఈ ఒక్క ముక్కని విన్నవాళ్ళకి మళ్ళీ సందేహాలు రాకుండా యెక్కించడానికే వేదవ్యాసుడు "జయ" అనే పేరుతో ఒక ఇతిహసం రాశాడు.కవిత్రయం దాన్ని తెలుగులోకి అనువదించారు,అదే "శ్రీ మదాంధ్ర మహాభారతం" అనే పేరుతో కీర్తిని గడించింది.ఆ కధలోని సార్వజనీనత వల్ల విన్న ప్రతి ఒక్కరూ ఆ కధను సొంతం చేసుకున్నారు.మొత్తం కధ పెద్దది కాబట్టి కొంచెం రచనాశక్తి ఉన్న ప్రతివాడూ ముఖ్యకధలోని ఒక సనివేశాన్ని ఆధారం చేసుకుని గానీ అందులో ఉన్న అనేకానేకమైన ఉపకధల్లో ఏదో ఒకదాన్ని తీసుకుని గానీ తమ పాండిత్యానికి గుర్తింపు తెచ్చుకునే దురద లాంటి సరదాని చూపించాడు.

          "రామాయణ మహాభారతాలు నిజంగా జరిగాయా?వీటిలోని యదార్ధత ఎంత?ఆ కధలలో వర్ణించబడిన వారు చారిత్రక వ్యక్తులా?అయితే వారు జీవించిన కాలం యేది?" అనే ప్రశ్నలు అర్ధం లేనివి!ఎందుకంటే,జరిగిన కధనే కావ్యరూపంలో చెప్పినప్పటికీ నూటికి నూరుశాతం వాస్తవాలను చెప్పడం సాధ్యం కాదు - ఇది నేను మనసా వాచా కర్మణా నమ్మి చెప్తున్నది!జరిగిన కధనే తీసుకున్నాడా కల్పించి రాశాడా అన్నదానితో సంబంధం లేకుండా కావ్యంలో చెప్పింది నచ్చితే పాటించడం,నచ్చకపోతే వొదిలెయ్యడం అత్యుత్తమమైన పని!అది గాక ఇంకే పనికి దిగినప్పటికీ ఆ పనిలో ఎన్ని సంవత్సరాలు అకుంఠిత దీక్షతో గడిపినప్పటికీ అదంతా పనిలేని మంగలి పిల్లితల గొరిగినట్టే!

          వాటి మీద మితిమీరిన భక్తితో అవి యదార్ధాలని నిరూపించాలని తపనపడేవాళ్ళు కూడా ఆ కధల్లోని నాయక పాత్రలకి బ్రాహ్మణాధిక్యతని అంటగట్టి ఆయా రచయితలకి కులదోపిడీని శాశ్వతం చెయ్యాలనుకున్న ఎజెండాని రుద్దుతున్న వాళ్లలాగే పరమ మూర్ఖులు - సందేహం లేదు!ఎందుకంటే అది చరిత్ర అని నిరూపించటంతో పని లేకుండానే వాటిలోని విషయంతోనే అవి ఒక కులాన్ని అణిచేసి ఇంకో కులాన్ని పైకెత్తే ఎజెండాతో రాసినవి కావని నిరూపించవచ్చు - గోటితో పోయేదానికి గొడ్డలెందుకు?

శ్లో.శృణు యక్ష!కులం తాత!న స్వాధ్యాయో నచ శ్రుతం
కారణం వా ద్విజత్వేన వృత్తమేవ న సంశయః

          "ఓ యక్షుడా!కులమును గురించి చెబుతాను విను.ఓఎ తండ్రీ!బ్రాహ్మనత్వమున కర్ధమున కధ్యయనము కారణము కాదు.ధర్మమును స్మరించుత కానే కాదు.ప్రవర్తనయే ముఖ్యము.సందేహము లేదు!" - ఇది అరణ్యపర్వంలో యక్షప్రశ్నలకి జవాబులు చెప్తున్న సందర్భంలో ఉంది.ఇంకా గట్టిగా "ఏదో ఒక మూల ఒక మంచి మాట ఇరికించారు.వాస్తవంలో మాత్రం ఆ కధ కింద కులాల్ని అణిచేసి బ్రాహ్మణులు మాత్రమే గొప్పవాళ్ళని ప్రచారం చెయ్యటానికే ఉపయోగించుకున్నారు - అది ఖాయం" అని మొండిగా వాదించేవాళ్ళకి ఇంకొక సాక్ష్యం చూపించి వాళ్ళ విచక్షణకి వాళ్ళని వదిలేస్తాను.

శ్లో.న కులేన న జాత్యవా క్రియయా బ్రాహ్మణో భవేత్
చండాలోపి హి వృత్తస్థో బ్రాహ్మనస్య యుధిష్ఠిర!
ఏక వర్ణమిదం పూర్ణం విశ్వమాసీ ద్యుధిష్ఠిర!
కర్మక్రీఅవిశేషేణ చాతుర్వర్ణం ప్రతిష్ఠితం
సర్వేవై యోనిజా మర్త్యా స్సర్వే మొత్రపురీషేణః
ఏకేంద్రియేంద్రియార్ధశ్చ తస్మా చ్చీలగుణై ర్ద్విజః
శోద్రోపి శెలసంపన్నో గుణవాన్ బ్రాహ్మణో భవేత్
బ్రాహ్మణోపి క్రియాహీనః శూద్రాత్ప్రవరో భవేత్
న జాతి ర్దృశ్యతే రాజన్ గుణాః కల్యాణకారకాః
జీవితం యస్య దర్మార్ధం పరార్ధే యస్య జీవితం.

          "ఓ యుధిష్ఠిర!కులముచేతను పుట్టుకచేతను ఒకడు బ్రాహ్మణుడు కాడు.కార్యము చేతనే ఒకడు బ్రాహ్మణుడు కాగలడు.జన్మచేత చండాలుడైనను సద్వర్తన చేత బ్రాహ్మణుడు కాగలడు.మొదట ప్రపంచమంతయును ఏకవర్ణమే, కర్మక్రియావిశేషము చేతనే చాతుర్వర్ణము ప్రతిష్ఠింపబడినది.సర్వులూ ఒక్కలాగున యోనిమార్గము నుండియే జన్మించుచున్నారు.ఇంద్రియములను ఏకం చేసి ఇంద్రియార్ధాలను కోరేవారు మాత్రమే బ్రాహ్మణులు.జన్మతః శూద్రుడు కూడ సదాచారముతో వృద్ధి పొంది క్రమేణ బ్రాహ్మణుడు కాగలడు.సదాచారమును విడిచి శూద్రకర్మ చేసినట్లయితే పుట్టుకచేత బ్రాహ్మణుడైనను శూద్రుడే యగుచున్నాడు.కావున ఓ రాజా!పుట్టుకతో పని లేదు గుణమే ప్రధానము.ఎవరు తమ జెవితమును ధర్మార్ధమును పరార్ధము నియోగించెదరో వారిదే అసలైన జీవితము. ఇది సత్యం!"

          ఇది కూడా మహాభారతం అరణ్యపర్వం లోనిదే!విమర్శించే వారిలోనూ సమర్ధించే వారిలోనూ ఒక్కరు కూడా అసలు కధ చదవలేదు - అదే అసలైన దరిద్రం!మరి, కధలో యెక్కడా యే పాత్రా కూడా బ్రాహ్మణ కులాధిక్యతని సమర్ధించనప్పుడు దీనిని బ్రాహ్మణ కులాన్ని  పొగట్టానికీ ఇతర కులాల్ని చిన్నచూపు చూట్టానికే వ్యాసుడు ఈ కధని రాశాడని యెందుకు అంటున్నారు?అప్పటి సమాజంలో బ్రాహ్మణాధిక్యత లేదని యేవరూ అనట్లేదు.అసలు ఉనికిలోనే లేకపోతే కధలో ప్రస్తావించటమే సాధ్యపడదు కదా!అసలెక్కడా కనబడని దానికోసం అంత బుర్ర బద్దలు కొట్టుకునే వాడెవడు, బుర్రతక్కువసన్నాసులు తప్ప!రచయిత  యెక్కడ చాన్సు దొరికితే అక్కడల్లా అది తప్పనే చెబుతున్నాడు, అయినా అతనికి దుర్మార్గం అంటగడుతున్నారు - ఇది యే రకం సాహిత్యవిశ్లేషణ కిందకి వస్తుంది?

          ఆ కధలు వాస్తవం అనుకోవడానికి ఉన్న ఒకే ఒక కారణం రచయిత యొక్క ప్రతిభయే - పాత్రలు చాలా సహజంగా ప్రవర్తించటం, ప్రాంతాల వర్ణన వాస్తవికంగా ఉండటం, కధలో జరిగినట్టు చెప్తున్న సన్నివేశాలలో ఉన్న కార్యకారణసంబంధానికీ ఈనాడు మన కళ్ళముందు జరుగుతున్న సంఘటనలలో ఉన్న కార్యకారణసంబంధానికీ పోలికలు ఉండటం!దేవుళ్ళూ మనుషులూ కలిసి మెలిసి  తిరగడం లాంటివాటిని  అభూతకల్పనలని కొట్టిపారెయ్యొచ్చు గానీ ముఖ్యమైన కధని మాత్రం అసలెక్కడా జరగటానికి వీల్లేదని కొటిపారెయ్యలేము గదా!పత్రికల్లో అక్కడక్కడా జరుగుతున్నవిగా వస్తున్న నేరాలకు సంబంధించిన వార్తలలో మనుషులు ధృతరాష్ట్రుడిలానో, దుర్యోధనుడిలానో,శ కునిలానో, కర్ణుడిలానో, భీముడిలానో ప్రవర్తిస్తూ ఆశ్చర్యం కలిగించడం లేదా?ఒక పెళ్ళయిన ఆడది తనకి నచ్చని మరో పెళ్ళైన ఆడదాన్ని అవమానించడానికి తన భర్తని రెచ్చగొట్టి అతన్ని తనకి నచ్చని స్త్రీ చీరని లాగమని పురికొల్పింది = ఇందులో ఉన్నది యేమిటి?అంటే, నీకు నచ్చని వ్యక్తి మగాడయితే తన్నాలనిపిస్తుంది. నీకు నచ్చని వ్యక్తి ఆడదయితే కొంగుపట్టి లాగాలనిపిస్తుంది - అవునా?అక్కడ కురుసభాభవనంలో ద్రౌపదికి జరిగిందీ అలాంటీ అవమానమే అయితే హిందూద్వేషులు మాత్రం అక్కడ వాస్తవంగా జరిగింది మానభంగమనీ రచయితా పౌరాణికులూ అలా చెప్పడానికి సిగ్గుపడి వస్త్రాపహరణం అని ముసుగు తొడిగారనీ యెందుకు అంటున్నారు?

          చిత్రమయిన విషయం ఏమిటంటే,మొదట మహాభారతం వాస్తవమని ఇటువైపు వారు వాదిస్తుంటే ఆధారాలు ఏమాత్రం దొరకనంతవరకు అది కల్పితమనీ అది యదార్ధమని నమ్ముతున్నవాళ్ళు పిచ్చిపుల్లయ్యలనీ అవహేళన చేశారు,ఇప్పుడు ద్వారక లాంటి సాక్ష్యాలు కనబడటంతో అది గనక నిజమయితే తమ పరువు పోతుంది గాబట్టి అడ్డం తిరిగి ఇలాంటి అడ్డగోలు వాదనలని ముందుకు తెస్తున్నారు - ఎంత నీచమయిన మనస్తత్వం!ఆ కధ అబద్ధం అని అరిచేదీ వాళ్ళే!నిజమయితే మీ హీరోయిన్ని విలన్ రేప్ చేశాడు,మీ హెరోలు గుడ్లప్పగించుకుని చూశారు అని అరిచేదీ వాళ్ళే!దీనివల్ల వాళ్ళు సాధించేది యేమిటి?పెద్దగా సాధించేది యేమీ ఉండదు, హిందువుల్లో అందరూ యెర్రిపప్పలు ఉండరు - అక్కడక్కడా హరిబాబు లాంటి చిచ్చరపిడుగులు కూడా ఉంటారు. అసలు నిజాన్ని సాక్ష్యాధారాలతో సహా చూపించి బుర్ర రామకీర్తన పాడిస్తారు. అది జరిగేలోపు మనం చూడు హిందువుల్ని యెట్లా నిలువుడ్లేసుకుని చూసేలా చేశామో అని కొంతకాలం చంకలు గుద్దుకోవటానికి పనికొచ్చే శునకానందపు స్వయంతృప్తితో నిండిన మితిమీరిన ఆత్మవిశ్వాసం - అంతే!

          మహాభారత యుద్ధానికి ఆఖరి కారణం ద్రౌపదికి కురుసభలో జరిగిన పరాభవం అయితే మొదటి కారణాన్ని వెతుక్కుంటూ కధలో వెనక్కి వెనక్కి వెళీతే చాలా చిత్రమైన సంగతులు కనబడతాయి.యెంత చిత్రమైన సంగతులు అంటే అది నిజంగా ఒక రచయిత కల్పించిన కధే అయితే గనక అంతటి సంవిధానం ఇమడ్చగలిగిన ప్రతిభకి ఆశ్చర్యపోకుండా ఉండటం అసాధ్యం!తండ్రికి సంతోషం కలిగించడం కోసం దేవవ్రతుడు తన రాజ్యార్హతని,వివాహాన్నీ వదులుకుంటూ భీషణ ప్రతిజ్ఞ చేసినప్పుడే కురుక్షేత్ర సమరానికి విత్తనం పడింది!దాశరాజు పెట్టిన మడతపేచీకి ఒప్పుకుని కొడుకుకు అన్యాయం చెయ్యలేక అప్పటికి వెనక్కి తిరిగి వచ్చినా వ్యామోహాన్ని జయించలేక కుంగిపోవడం వల్లనే గదా గాంగేయుడు శపధం పట్టి భీష్మ నామధేయుడు అయ్యింది!భీష్ముడి చేతా ప్రియుడి చేతా తిరస్కరించబడిన అంబ తపస్సు చేసి శిఖండి జన్మ యెత్తడంతో సమరానికి కారణం మరింత బలపడింది!మునిసేవ చేసి తరించాల్సిన సమయంలో దేహభ్రాంతిలో పడి ధర్మాన్ని మరిచి కళ్ళు మూసుకున్న తల్లి వలన ధృతరాష్టుడికి అంధత్వం ప్రాప్తించి శంతనుడిలోని స్త్రీవ్యామోహం ధృతరాష్ట్రుడిలో పుత్రవ్యామోహం రూపంలో మరింత ప్రస్ఫుటమై సకలసద్గుణవంతుడైన సుయోధనుణ్ణి చెడగొట్టి దుర్యోధనుడనే చెడ్డపేరు తెచ్చిపెట్టి కుక్కచావు చచ్చేలా చేసింది!

          చిన్ననాడు ఆప్తమిత్రులై పరిస్థితుల ప్రభావం వల్ల గర్భశత్రువులైన  ద్రోణుడు - ద్రుపదుడు అనే మిత్రద్వయం కూడా కధ తప్పనిసరిగా జురుక్షేత్ర సమరం వైపుకే నడవటానికి దోహదం చేశారు!పాండవమధ్యముడైన అర్జునుణ్ణి ఇష్టపడటం,ఆ మొహమాటం వల్ల సందర్భం వచ్చినప్పుడు పాండవుల్ని సమర్ధించడం తప్ప విడిస్తే ద్రోణుడిలో ఐశ్వర్యం పట్ల ప్రీతి, అహంభావం, మితిమీరిన క్రౌర్యం లాంటి చెడు లక్షణాలే ఎక్కువ - అర్జునుడి లాంటి యువకులే దివ్యాస్త్రాలను సామాన్యుల పైన వెయ్యకుండా నిగ్రహించుకుంటే ద్రోణుడు మాత్రం తన సేనాధిపత్యంలో జరిగిన యుద్ధంలో దానిని కొన్నిసార్లు అతిక్రమించాడు.పద్మవూహంలో అభిమన్యుడి పతనానికి కారణమయిన యుద్ధ నియమాల అతిక్రమణలు ఇతని ఆదేశం మేరకే జరిగాయి!అలా యుద్ధనియమాల అతిక్రమణ జరగకపోతే అభిమన్యుడు పద్మవ్యూహం నుంచి విజయవంతంగా బయటపడటానికి అవకాశం ఉంది.ఏకలవ్యుడిని బొటనవేలు అడగటం కూడా ఇతనిలోని అహంకారం/క్రౌర్యం వల్లనే జరిగింది.ఇక్కడ విశేషం యేమిటంటే ఏకలవ్యుడు నిమ్నజాతి/బలహీన జాతి అనుకుని పొరపాటు పడిన హిందూద్వేషులు కులాధిపత్యాన్ని తీసుకొచ్చారు గానీ అతను తల్లికి చెల్లెలి కొడుకుగా శ్రెకృష్ణునికి సోదరుడు అవుతాడు!కేవలం గొల్లపల్లెలో కొన్నేళ్ళు పెరగడమే తప్ప వాసుదేవుడైన శ్రీకృష్ణుడు క్షత్రియుడే కదా!ఏకలవ్యుడి తండ్రి హిరణ్యధన్వుడు నిషాద జాతికి చ్గెందినవాడు. తల్లి సులేఖ శ్రీకృష్ణుని తల్లి దేవకికి చెల్లెలు అవుతుంది.హిరణ్యధన్వుడు జరాసంధుడి రాజ్యంలోని నిషాదులకు నాయకుడు.ఇప్పటి హిందూద్వేషులు అనుకుంటున్నట్టు అణచివేఅతకు గురయి కుమిలే దుస్థితి అతనికీ ఏకలవ్యుడికీ లేదు.జరాసంధుడు చేసిన అనెకానేక యుద్ధాలలో ఒక యుద్ధంలో అతడు చనిపోయినప్పుడు ఏకలవుడు నిషాదులకు రాజయ్యాడు.వస్తుతః తన రాజ్యంలోని క్రూరమృగాల బారినపడి చనిపోతున్న సాధుజంతువులని రక్షించడం కోసం విలువిద్య నేర్వాలనుకున్న భూతదయాపరుడు.కానీ తన ఏకాగ్రతని భగ్నం చేసిన కుక్క మీదకి శబ్దవేధిని ప్రయోగించే సమయంలో అంత కర్కశంగా ఎందుకు ప్రవర్తించాడో!

          ద్రోణుడు బొటనవేలును అడగటంతో ఇతని కధ ముగిసిపోలేదు, రెట్టించిన పట్టుదలతో పరిశ్రమించి బొటనవేలు లేకుండానే మహాధానుష్కుడై జరాసంధుడి సైన్యంలో కీలకస్థానం సంపాదించి రాజభోగాలు అనుభవిస్తూ ఉండేవాడు.శ్రీకృష్ణుడు రుక్మిణిని పరిగ్రహించిన సందర్భంలో రుక్మికి సాయంగా వచ్చినవాళ్ళలో ఏకలవ్యుడూ ఉన్నాడు,అక్కడ శ్రీకృష్ణుని చేతిలో హతమయ్యాడు.అయితే, అతని విశిష్టమైన పరాక్రమాన్నీ అతనికి జరిగిన అన్యాయాన్నీ అతనితో తన బంధుత్వాన్నీ అతడు గనక కౌరవ పక్షంలో ఉంటే కురుక్క్షేత్ర సమరంలో జరగాల్సిన అసుర సంహారం మరింత కష్టసాధ్యమయ్యే పరిస్థితినీ లెక్కలు వేసుకుని అప్పుడు శ్రీకృష్ణుడు ఇచ్చిన వరం వల్ల ధృష్టద్యుమ్నుడిగా ద్రుపదుడి ఇంట జన్మించాడు.మహాభారత కధలోని ప్రతి పాత్రలోనూ ఏదో ఒక లోపం ఉండి ఆ లోపం వల్లనే అతనికి ఒక గాయం తగిలి తన లోపాన్ని తెలుసుకుని చల్లబడటానికి బదులు తనకి అన్యాయం చేసిన వ్యక్తి మీద ప్రతీకారంతో దహించుకుపోతూ అతన్ని కురుక్షేత్ర సమరమనే రణయజ్ఞానికి సమిధగా నిలబెడుతుండటం చూస్తే ఆ సంవిధానం ప్రపంచ సాహితీ చరిత్రలోని మరే కావ్యంలోనూ లేకపోవటం కూడా గమనిస్తే అలాంటి గొప్ప కావ్యం మన దేశపు సాహితీ క్షేత్రంలో వికసించినందుకు ప్రతి భారతీయుడూ గర్వించాలి!ధృష్టద్యుమ్నుడి కోసం యజ్ఞం చేసేటప్పుడు ద్రోణవధ లక్ష్యం అయితే ద్రౌపది కోసం యజ్ఞం చేసేటప్పుడు అర్జునుడిని పెళ్ళాడే కూతురుని కోరుకున్న ద్రుపదుడు యుద్ధానికి పడుతున్న పీటముడిలో మరొక బలమైన ముడిని వేశాడు.గర్భవాసాన జన్మించనిది ద్రౌపది!బాల్యం ఎరుగనిది ద్రౌపది!తనకి అన్యాయం జరిగితే ధిక్కరించడమే తప్ప నిస్సహాయతతో విచారించడం తెలియని శక్తిస్వరూపిణి ద్రౌపది!

          మామూలు లెక్క ప్రకారం ఒకసారి ద్రోణుణ్ణి చంపటం కోసం యజ్ఞం చేసి ధృష్టద్యుమ్నుణ్ణి పొందాక రెండోసారి యజ్ఞం చెయ్యాలనే ఆలోచన ఎవరికీ రాదు,కానీ ద్రుపదుడికి ఎందుకు వచ్చింది?మరోసారి యజ్ఞం చేసి అర్జునుడికి భార్యగా ఒక కూతురుని ఎందుకు ఆశించాడు?అధికస్య అధికం ఫలం అన్నట్టు ఉబలాటంతో చెయ్యలేదు,బలమైన కారణమే ఉంది.మహభారతంలోని ప్రతి పాత్రలోనూ రాజనీతిలోని యేదో ఒక కోణం ఆవిష్కరించబడి ఉంటుంది!అప్పటికే దుర్తోధనుడికి పాండవుల పట్ల పుట్టిన మత్సరం విషయం ద్రుపదుడికి తెలుసు, అది యెటూ యుద్ధానికి దారి తీస్తుందని కూడా తెలుసు, యుద్ధం అంటూ వస్తే ద్రోణుడు దుర్యోధనుడి వల్ల పొందుతున్న ఉద్యోగపదవీవైభవాల్ని వదులుకుని పాండవుల వైపుకి రాడని కూడా తెలుసు, తనకి పాండవులతో వియ్యం కలిస్తేనే ద్రోణుడు రణంలో ప్రతికక్షి అవుతాడు - ఇది ద్రుపదుడి లోని దూరదృష్టి!

          అందరూ అనుకుంటున్నట్టు ద్రౌపది క్రిందటి జన్మలో శివుడి కోసం తపస్సు చేసినప్పుడు యెకాయెకిన నాకు ఐదుగురు భర్తలు కావాలని అడగటం గానీ తత్తరపాటుతో నాకు భర్త కావాలి అనే మాటని అయిదుసార్లు ఉచ్చరించడం గానీ జరగలేదు.పూర్తి స్పృహలో ఉండి ముందునుంచీ తపస్సుకు సంకల్పంగా ఉంచుకున్న కోరికనే చాలా స్పష్టంగా అడిగుంది.వారనీ వీరనీ లేకుండా స్త్రీలు కోరుకున్నట్టు ఒక్క భర్తనే కోరుకుంది - అయితే తను ఆశించిన 14 లక్షణాలు ఒకే పురుషుడిలో ఉండటం అసాధ్యం గనక పరమశివుడే ఒక్కొక్క పురుషుడిలో వాటిలో కొన్ని లక్షణాలు ఉన్న ఆయిదుగురు ఆమెకు భర్తలు కావడం ద్వారానే ఆమె కోరిక తీరుతుందని సర్ధి చెప్పాడు!ద్రౌపది అడిగిన లక్షణాలలో ముఖ్యమైనవి ధర్మం,బలం,కౌశలం,సౌందర్యం,సహనం - వీటిలో ధర్మానికి యుధిష్ఠిరుడు,బలానికి భీముడు,కౌశలానికి అర్జునుడు,సౌందర్యానికి నకులుడు,సహనానికి సహదేవుడు ప్రతీకలుగా నిలిచారు.మామూలుగా ఒక స్త్రీ ఒక పురుషుడికి భార్యగా ఉండాలని కోరుకోవడం అంటే ఆ స్త్రీ ఆ పురుషుడికి విధేయతని ప్రదర్శించడం అని భావిస్తారు.కానీ ద్రౌపది మత్స్యయంత్రాన్ని కొట్టి అర్జునుడు తనని గెలుచుకునప్పటికీ ధర్మరాజుతో సహా పంచపాండవులకీ భార్య అయినప్పటికీ ఆమె యేనాడూ దాసత్వాన్ని ప్రదర్శించలేదు సరిగదా వారిమీద తనే ఆధిక్యతని ప్రదర్శించింది - యే అనుమానమూ అఖ్ఖరలేదు, నిజం!పంచ మహాపతివ్రతలలోనూ ఆమెదొక చిత్రమైన పాతివ్రత్యం.

          అసలు అంతరార్ధం ప్రకారం రామాయణం లాగే మహాభారతం కూడా భగవంతుణ్ణి చేరుకోవటానికి యోగసాధకుడు చేసే ఆధ్యాత్మిక ప్రయాణం అయితే పాండవులు మానవదేహంలోని అయిదు ప్రధానమైన చక్రాలకు ప్రతిరూపం.ద్రౌపదిని కులకుండలిని అని వ్యవహరించడం ఆమె మానవదేహంలో మూలాధారం దగ్గిర ప్రభవించి సహస్రారం చేరుకునే శక్తిస్వరూపం అనేది తెలియజెప్పటానికే!ఆమెకున్న పేర్లలో ఉన్న మహాభారతి అనేది ఈ మహాభారత కధ మొత్తం ఆమెకి సంబంధించినదే అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది.పెళ్ళికి ముందు ద్రౌపది తన పాంవపత్ని స్థానాన్ని మరెవరితోనూ పంచుకోననీ మరే ఆడదాన్నీ తనతో కలిసి జీవించడానికి తీసుకురాకూడదనీ షరతు పెట్టింది!ఆ నియమానికి కట్టుబడటం వల్లనే అర్జునుడు ఎంతమందిని పెళ్ళి చేసుకున్నా ఎక్కడివాళ్ళని అక్కడే ఉంచి వచ్చాడు తప్ప ఇంద్రప్రస్థానికి తీసుకురాలేదు - ఒక్క సుభద్ర మాత్రం మినహాయింపు!సుభద్రని అనుమతించడం అనేది శ్రీకృష్ణుడి సూచన వల్ల జరిగింది.శ్రీకృష్ణుడికీ ద్రౌపదికీ ఉన్న అనుబంధం చాలా నిగూఢమైనది.వారు ఇద్దరూ అయోనిజులు కాబట్టి మిగిలిన వారికి వలె దేహధారుల బాంధవ్యాలు వారికి లేకపోయినా ఒకరితో మరొకరు సోదర-సోదరి భావంతో ప్రవర్తించడం కనిపిస్తుంది.ఇద్దరినీ కృష్ణ నామధేయంతో వ్యవహరిస్తారు.సోదర భావం ఉన్నప్పుడు ద్రౌపది "సోదరా!" అని కృష్ణుణ్ణి పిలుస్తుందనీ కృష్ణుడు "సోదరీ!" అని ద్రౌపదిని పిలుస్తాడనీ అనుకోవడం సహజం,కానీ కృష్ణుడు ద్రౌపదిని "సఖీ!" అని పిలిస్తే ద్రౌపది కృష్ణుణ్ణి "సఖా!" అని పిలవడం గమనించాలి!అది ఎందుకంటే,అసురసంహారం కోసం ప్రభవించిన వారిద్దరూ సరి సమానులే - ద్రౌపది స్త్రీరూపంలోని కృష్ణుడు,కృష్ణుడు పురుషరూపంలోని ద్రౌపది!

          పంచ మహా పతివ్రతలలో మిగిలిన నలుగురూ  తమకు జరిగిన అన్యాయానికో లేదా పరీక్షా సమయపు దుస్సహమైన బాధకో కించపడటమో సర్దుకుపోవడమో చేశారు గానీ ద్రౌపది మాత్రం అన్యాయానికి తల వంచలేదు, మౌనంగా దుఃఖించి మూల కూర్చోలేదు, తిరగబడింది, నిప్పులు గక్కింది, కొమ్ములు తిరిగిన మగవాళ్లని సైతం దుమ్ము దులిపేసింది - ముఖ్యంగా ప్రతీకారం తీర్చుకున్నాక గానీ శాంతించలేదు!ద్రౌపదిగా ధృతరాష్ట్రుణ్ణి గానీ సైరంధ్రిగా వీరటుణ్ణి గానీ ఆమె తనకి జరిగిన అవమానానికి న్యాయం చెయమని అడిగి వూరుకోలేదు,నన్ను రక్షించలేని మీ పరాక్రమం,సింహాసనం,ప్రాభవం అన్నీ దండగ అని కుంబద్దలు కొట్టిచెబుతుంటే ఒక్క మగాడు నోరెత్తి జవాబు చెప్పలేకపోయాడు - స్వాభిమానంతో అగ్నిశిఖలా జ్వలించే ద్రౌపదికి నిజంగా అక్కడ బలాత్కారసంభోగమానభంగసమే జరిగి ఉంటే దుశ్శాసనసంహారం 14 సంవత్సరాలు వాయిదా పడివుండేది కాదు,డాసత్వానికి కట్టుబడ్డారు గాబట్టి పాండవులు చెయ్యలేకపోయినా శ్రీకృష్ణుడే ప్రతీకారం తీర్చుకునేవాడు!అక్కడ జరిగింది యేదీ ఈ వెధవల స్వయంతృప్తి కోసం జరగలేదు - దుర్యోధన దుశ్శాసనులు కూడా ధర్మం తెలిసినవాళ్ళే,పాండవుల పట్ల మత్సరం అనే ఒక చెడు లక్షణం తప్ప దుర్యోధనుడిలో మరొక చెడు లక్షణం లేదు.లాక్షాగృహదహనం నుంచి మాయాద్యూతం వరకు చేసిన చెడుపనులు అన్నీ ఇవి నేను నా శత్రువులైన పాండవుల పట్ల చేస్తున్నాను గాబట్టి సరైనవే అనే సమర్ధన తెచ్చుకుని చేసినవే!ఈ హిందూ మతతత్వవాదులు బ్రాహ్మణాధిక్యతతో గబ్బుపట్టిపోయి అయిందానికీ కానిదానికీ దుర్మార్గులైన బ్రాహ్మలకి పొర్లుదణ్ణాలు పెట్టిన సోషలిష్టు మార్క్సిష్టు దళితిష్టు వ్యతిరేక పాండవుల్ని మంచివాళ్ళని పొగుడుతున్నారు గాబట్టి క్నాదు క్నాదు, మేం చచ్చినా ఒప్పుకోం, కౌరవులే మంచివాళ్ళు అని రెచ్చిపోతూనే మళ్ళీ వాళ్ళు ద్రౌపదిని రేప్ చేశారని చెప్పడం అంటే తాము మంచివాళ్ళని అంటున్నవాళ్ళకి రేపిస్టు ముద్ర వెయ్యటం అని కూడా తెలుసుకోలేని బుర్రతక్కువతనం వ్యాసుడికి లేదు!

          వాదన చేస్తున్నది బుర్రతక్కువవాళ్ళు అయినప్పటికీ వాళ్ళ వాదనలో కొన్ని బలమయిన పాయింట్లు కూడా ఉన్నాయి, అందుకే ఏకలవ్యుడి దగ్గిర్నుంచీ దుర్యోధనుడి వరకూ ప్రతి పాత్ర గురించీ పరిశోధించి రాస్తున్నది. లేని పక్షంలో పైన చెప్పిన పాయింటు ఒక్కటి చాలు గదా!వారి విశ్లేషణలలో కూడా ఇదే రూపంలో కాకపోయినా మూలకధ ఎక్కడో ఒకచోట జరిగి ఉంటుందనే అనుకుంటున్నారు.అయితే, ప్రధాన రచయితలైన వ్యాసుడూ, శుకుడూ, వైశంపాయనుడూ అప్పటి కాలమాన పరిస్థితుల వల్ల కధను ఉన్నది ఉన్నట్టు చెప్పకుండా కొన్ని వాస్తవవిరుద్ధమైన కల్పనలు చేశారనీ, తర్వాత కాలంలోని రచయితలు మళ్ళీ మళ్ళీ ఆ కధల్ని తిరిగి చెప్తున్నప్పుడు మరికొన్ని కల్పనల్ని చేర్చారనీ కాబట్టి ఇప్పుడు కధలో భాగమై కనబడుతున్న సన్నివేశాలు అప్పటి సనివేశాల యదార్ధతను ప్రతిబింబించటం లేదనీ వారి వాడన!కానీ వేదవ్యాసుడు కధలో యే పాత్ర అయినా క్రూరమైన హత్య గానీ నీచమైన మానభంగం గానీ చేసి ఉంటే తడుముకోకుండా చెప్పేశాడు - ప్రతి పాత్రనూ తన స్వకపోలకల్పితమైన పాత్రగా భావించి రాగద్వేషాలు ప్రదర్శించకుండా తన చుట్టూ ఉన్న ప్రపంచంలో జవజీవాలతో తిరుగాడుతున్న ఒక యదార్ధమైన వ్యక్తిగా తను చూసి ఒక సన్నివేశంలో మంచిపని చేస్తే మంచిగానూ ఒక సన్నివేశంలో చెడుపని చేస్తే చెడుగానూ అరమరికలు లేకుండా చూపించి అతడు మంచివాడా చెడ్డవాడా అనేది మననే తేల్చుకోమనడం వేదవ్యాసుడి రచనా శిల్ప వైశిష్ట్యం!ఉదాహరణకి తన శపధాన్ని మరలించుకుని వంశాన్ని నిలబెట్టమని అడిగిన సత్యవతికి అలాంటి అతిక్రమణల వల్ల ఉపయోగం ఉండదని భీష్ముడు చెప్పే దీర్ఘతమసుడి కధలో దేవగురువు బృహస్పతి తన పెద్దన్న ఉతధ్యుడి భార్య మమతను బలాత్కరించటానికి ప్రయత్నిస్తాడు!అంతటితో ఆగకుండా దురుద్దేశంతో కూడిన తన ప్రయత్నాన్ని మమత గర్భంలో ఉండి తన తల్లిని రక్షించుకునే సదుద్దేశంతో తీవ్రంగా వ్యతిరేకించిన శిశువుని యేమాత్రం పశ్చాత్తాపం లేకుండా శపిస్తాడు - బృహస్పతి విషయంలోనే మొహమాట పడనివాడు దుశ్శాసనుడి విషయంలో దేనికి సంకోచిస్తాడు?ఆదిపర్వంలో "द्रौपदी च सुभद्रा च वासांस्याभरणानि च।  प्रायच्छन्त महाराज स्त्रीणां ताः स्म मदोत्कटाः" అనే భాగం ఏమి చెప్తుందో తెలుసా!ద్రౌపదీ సుభద్రా ఓక ఉత్సవంలో మధుపానంతో మత్తెక్కిపోయి ఒంటిమీదున్న నగల్నీ వస్త్రాల్నీ కూడా విప్పి ఇతరస్త్రీలకి ఇచ్చెయ్యడం మనల్ని కంగారు పెడుతున్నది గానీ వేదవ్యాసుడు రాయటానికి సంకోచించలేదు, ఎందుకని?

          ధర్మరాజు కౌరవులతో రెండుసార్లు జూదం ఆడాడు.మొదటిసారి వోడిపోయినప్పుడే ద్రౌపదికి అవమానం జరిగింది.వస్త్రదానం అనేది మహిమగా శ్రీకృష్ణుడి ప్రమేయంతో జరిగిందని చెప్పబడుతున్నప్పటికీ సభలోని కలకలం ద్వారా ధృతరాష్ట్రుడు జరిగినది తెలుసుకుని చాలా బాధపడి ద్రౌపదిని మూడు వరాలు కోరుకోమంటాడు.మొదటి వరంగా తనకూ తన భర్తలకూ దాస్యవిముక్తిని కోరుకుని రెండవ వరంగా జూదం ద్వారా తన భర్త కోల్పోయిన సమస్త సంపదల్నీ తిరిగి ఇవ్వమని కోరుకుని మూడవ వరాన్ని వొదిలేసింది.దీనితో పాండవులు మునుపటి వైభవాన్ని పొందటమే కాకుండా ఇప్పుడు దుర్యోధనుడి పని కుడితిలో పడ్డ ఎలకలా తయారైంది!పగతో రగిలిపోతున్న వాళ్ళని కూడదీసుకోవటానికి కూడా సమయం ఇవ్వకుండా వెంటనే మళ్ళీ జూదానికి పిల్చి ఈసారి 12 యేళ్ళు అరణ్యవాసం 1 యేడు ఆజ్ఞాతవాసం అని మెలిక పెట్టారు.అజ్ఞాతవాసంలో ఉన్న సమయంలో కనుక్కుని బయటపెడితే మళ్ళీ 12 యేళ్ళ అరణ్యవాసం 1 యేడు అజ్ఞాతవాసం చెయ్యాలి.ఒకసారి వోడిపోయిన ధర్మరాజు మళ్ళీ ఎందుకు వెళ్ళడం అంటే మానహాని ఒకటే కారణం - ఆట తెలిసినవాడు మరో ఆటగాడు పిలిచినప్పుడు వెళ్ళకపోతే పిరికితనం అంటగడతారు గనక వెళ్ళాడు.దుర్యోధనాదులకు లక్ష్యం పాండవులని రాజ్యభ్రష్టుల్ని చెయ్యడమే తప్ప ద్రౌపది మీద పగ గానీ వాంచ గానీ లేదు.సంజయుడు ధృతరాష్టుడు "ఎలాగూ అన్నేళ్ళు ముష్టెతుకుని బతకటానికి అలవాటు పడి ఉంటావు,అలాగే సర్దుకుపోరాదా రాజ్యం కోసం గొడవ చెయ్యకుండా?" అని ధర్మరాజుకి తను చెప్పి పంపిన సందేశం వినిపించటానికి ధర్మరాజును కలిసినప్పుడు ధర్మరాజు కుశలం అడుగుతూ మేము అక్కడ ఉన్నప్పుడు బ్రాహ్మణులకు చేసిన దానాల్ని ఎవరూ అపహరించలేదు గదా అని అడిగితే మీమీద మత్సరమే తప్ప మరే నీచగుణమూ లేని దుర్యోధనుడు బ్రాహ్మణద్రవ్యాన్ని అపహరించడు గదా అని సంజయుడు అంటాడు.దాన్ని బట్టే అక్కడ దుర్యోధన దుశ్శాసనులు చేసినవి కొప్పు పట్టుకుని ఈడ్చుకు రావటం,కొంగు పట్టుకుని లాగటం లాంటి పొగరుతో కూడిన దుడుకు చేష్టలేనని తెలుసుకోవచ్చు.

          ద్రౌపది "నేను ధర్మవిజితనా?అధర్మవిజితనా?" అని అడగటం,"నన్నోడి తన్నోడెనా?తన్నోడి నన్నోడెనా?" అని అదగటం గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి గానీ నిజానికి ద్రౌపది వేసిన చిక్కుప్రశ్న అది కాదు.భర్త దాసుడయితే భార్య దాసి కాకుండా యెలా వుంటుంది?ఈ ధర్మసూత్రం ద్రౌపదికి తెలియదా!అప్పుడు పాటిస్తున్న ధర్మం ప్రకారం ద్రౌపది మారు మాట్లాడకుండా సభలోకి వచ్చి తన భర్తల పక్కన తల వంచుకుని నిలబడాలి - అయితే, దాసి అయినప్పటికీ యేకవస్త్రయైన తను నిండుసభలోకి రాకూడదనే స్వతంత్ర నిర్ణయం తీసుకున్నది.యే నేరమూ చేయని ఒక వ్యక్తిని అతని ఆత్మగౌరవానికి భంగం కలిగించేలా ఉన్నది ధర్మం యెట్లా అవుతుంది?ఆ ధర్మం పేరుతో జరుగుతున్న అధర్మాన్నే ద్రౌపది ధిక్కరించింది. అప్పటివరకు ధర్మం అంటే నియమపాలన మాత్రమే, మానవీయత లేదు - ద్రౌపది తనకోసమే అడిగినా ధర్మసూత్రాలని మానవతా కోణం నుంచి చూసి వాటిని తిరగ రాయమని సూచించింది!శ్రీకృష్ణుడికి తప్ప ద్రౌపది వాదన ఇతరులకి అర్ధం కాలేదు - అందుకే,భీష్మద్రోణాదులతో సహా మంచివాళ్ళు కూడా ద్రౌపదీ మానసంరక్షణ కోసం ఆమె సఖుడైన భగవాన్ శ్రీకృష్ణుడు కురుక్షేత్ర సమరంలో విధించిన శిక్షకు పాత్రులు కాక తప్పలేదు.ధర్మాధర్మాలకి సంబంధించిన పండిత చర్చలు కూడా చెయ్యగలిగిన ద్రౌపది యొక్క వ్యక్తిత్వాన్ని ఇంత గొప్పగా నిలబెడుతున్న సనివేశాన్ని రేప్ సీనులా చూసినవాళ్ళ వివేకం ఏ స్థాయిలో ఉన్నట్టు?

          దుర్యోధనుడు ద్రౌపదికి తొడని చూపించిన సన్నివేశం మూలభారతంలో ఉన్నట్టు లేదు,మయసభలో ద్రౌపది నవ్విన సన్నివేశం అయితే మాత్రం లేదు - ఇవ్వాళ మనకి తెలిసిన కధ పురాణ ప్రస్తావనలూ,జానపదుల కల్పనలూ కలిసిపోయిన గుభేల్ దస్త్రం.వ్యాసుడి రచనకే ఉత్తర భారతపు వెర్షన్,దక్షిణ భారతపు వెర్షన్ అని రెండు రకాల వెర్షన్లు ఉన్నట్టు తెలుస్తున్నది.మూలభారతం ప్రకారం దుర్యోధనుడికీ దుశ్శాసనుడికీ కూడా ఆమెని దాసత్వానికి అంగెకరింపజేసి తమ ఆధిక్యతని చాటుకోవటమే తప్ప లైంగిక దాడి చెయ్యాలనే ఉద్దేశం లేదు.ద్రౌపది సుశ్శాసనుడికి చెప్పినది తను సరైన స్థితిలో లేనని,అతడి వాదన "నీ వస్త్రధారణతో మాకు సంబంధం లేదు,నువ్వు మా దాసివి,సభకు రమ్మని శాసించాం,నువు రావాల్సిందే!" అని.సభలో నీచమైన ప్రస్తావన వచ్చింది కర్ణుడి నుంచి - "ఆమె ఇప్పుడు ఉమ్మడి సొత్తు గనక యేకవస్త్ర అయినా ఫరవాలేదు,నగ్నంగా ఉన్నా ఫరవాలేదు" అనేశాడు!అంతే కాదు,పాండవులని నగ్బంగా నిలబడమని ఆదేశించాడు,వారు శిరసావహించారు - దాసులు కదా!పాండవులు పాటించిన తర్వాత కూడా ద్రౌపది తిరస్కరించడం వల్లనే దుశ్శాసనుడు ఆమెని వివస్త్రని చెయ్యాలని ప్రయత్నించాడు.ద్రౌపది వ్యతిరేకించినది దీనినే - తన ఆత్మగౌరవానికి భంగం కలిగించే ధర్మాన్ని ధిక్కరించింది!ఇలాంటి స్త్రీ పాత్రలలో బానిసత్వం ఉందని అశోకాలు పెడుతున్న వోల్గా లాంటి స్త్రీవాదులకి నిజంగా స్త్రీత్వం అంటే ఏమిటో తెలుసా?

          పాండవులను అభిమానించే భీష్ముడు,ద్రోణుడు,విదురుడు పాండవుల భార్యకి జరుగుతున్న అవమానాన్ని కళ్ళప్పగించి చూస్తూ యెందుకు నిలబడ్డారనేది తెలుసుకుంటే తప్ప ద్రౌపది అప్పుడు నిలబడిన దయనీయమైన స్థితీ తిరుగబటంలో ద్రౌపదికి మాత్రమే సాధ్యమైన వైదుష్యం అర్ధం కాదు!పాండవుల దాసత్వానికి కారణమైనది ద్యూతక్రీడ.దీనినే అక్షవిద్య అని కూడా అంటారు.దీనివలన కష్టాల పాలైన నలుడి కధ అప్పటికే ప్రచారంలో ఉన్నది.కురు పాంవుల మధ్యన రెండుసార్లు జరిగింది - విదురుడూ శ్రీకృష్ణుడూ మాత్రమే వ్యతిరేకించారు,అందులో ధర్మాధర్మవిచక్షణని కోల్పోయి మత్తెక్కించేలా చేసే లక్షణం ఉంది గనక వూహించరాని విపరీతాలు జరగవచ్చును అనే భావంతో!కానీ మిగులిన వారికి మాత్రం అట్లా అనిపించలేదు - కేవలం క్రీడయే కదా అని కొట్టిపారేశారు.అదీగాక అప్పటి కాలంలో ద్యూతార్జితం కూడా రాజులకు యుద్ధార్జితం లాంటిదే.మనం ఇవ్వాళ సినిమాల్లోనూ నాటకాల్లోనూ చూస్తున్నటు నాలుగు పాచికలతో ఆడే తేలికపాటి ఆట కాదు - పాచికలు,గవ్వలు,శంఖాలు వంటివాటిని ఉపయోగించి ఆటగాడి గణితశాస్త్ర పాండిత్యానికి ప్రాధాన్యత ఉన్న సంక్లిష్టమైన ఆట.అది - తేలికపాటి ఆట అయితే చతురంగ బలాలను సమకూర్చుకుని చేసే యుధానికి సమానం యెట్లా అవుతుంది?

          కురుసభలో పెద్దలు చూసిన దృశ్యం ఇది:ద్యూతక్రీడ రాజులకు ధర్మమే, ధర్మరాజు ఓడిపోయాడు, ద్రౌపది కూడా దాసియే, ఆమె దుర్యోధనాదుల ఆజ్ఞల్ని పాటించాల్సిందే, పాండవులు పాటించారు కదా!అక్కడ రచయిత శకుని మాయాద్యూతం వల్ల ఓడిపోయాడని చెప్తున్నాడు గానీ ధర్మరాజు మాత్రం దానిని ఇతరులకు చెప్పలేని నిస్సహాయతలో ఉండిపోయాడు - యుద్ధానికి పడిన ముడుల్లో అతి ముఖ్యమైనది ధర్మరాజు యొక్క ద్యూతక్రీడావ్యామోహం!సాంకేతికంగా ధర్మరాజు ఆటలో మోసం జరిగిందని గొడవ చేసినా దానివల్ల ప్రయోజనం లేదు, ఉండదు.అక్కడి వారందరికీ తల దిమ్మెక్కిపోయే విచిత్రం దుశ్శాసనుడు ద్రౌపదిని వివస్త్రను చెయ్యడానికి ప్రయత్నించడం కాదు, ద్రౌపది దుర్యోధనాదుల ఆజ్ఞను తిరస్కరించి వారందరూ ధర్మం అనుకున్న దానిని ప్రతిఘటించడమే! ఎందుకంటే, వారికి ధర్మం అంటే నియమపాలన అని మాత్రమే తెలుసు. ద్రౌపది తన స్వాభిమానం కోసం పోరాడుతున్నది.తన స్వాభిమానానికి విరుద్ధమైన దాన్ని అధర్మం అని ప్రకటించి కొత్త దారిని వెయ్యమంటున్నది - ఇవ్వాళ దీనినే హక్కుల కోసం పోరాటం అంటున్నాము.

          అంతమంది అన్ని విధాల పావులు కదుపుకుంటూ వస్తున్నప్పటికీ యుద్ధాన్ని ఆపగలిగినవాళ్ళు ఇద్దరే ఇద్దరు ఉన్నారు!తల్లి చేసిన పొరపాటు వలన అన్యాయానికి గురయ్యానని బుడిబుడి ఏడుపు ఏడుస్తూ తన కొడుకు కోసం తమ్ముడి కొడుకులకి అన్యాయం చెయ్యడానికి సిద్ధపడిన ధృతరాష్టుడు "ఎలాగూ అన్నేళ్ళు ముష్టెతుకుని బతకటానికి అలవాటు పడి ఉంటావు,అలాగే సర్దుకుపోరాదా రాజ్యం కోసం గొడవ చెయ్యకుండా?" అని ధర్మరాజుకి తను చెప్పి పంపిన దిక్కుమాలిన సొల్లు కబుర్లు అక్కడ చెల్లలేదని తిరిగొచ్చిన సంజయుడు చెబుతూ అటువైపున యుద్ధానికి సిద్ధపడి ఉన్న యోధులను గురించి చెప్పాక గుండెలు జారిపోయి కనీసం కొడుకు ప్రాణాలను రక్షించుకోవడానికయినా రాజీకి సిద్ధపడ్డాడు!కానీ, అప్పటివరకు లాక్షాగృహంలో తమ్ముడి కొడుకుల్ని నిలువునా చంపేస్తున్నారని తెలిసి కూడా నువు రాజువు కావడానికి ఏం చేసినా నాకిష్టమేనని గాలి కొట్టి వదిలినందుకు దుర్యోధనుడు అప్పటికే తొండ ముదిరి వూసరవెల్లి అయినట్టు చెట్టెక్కి కూర్చున్నాడు. సాక్షాత్తూ గాంధారి "వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చేస్తే మిగిలినది నీ వైభవాలకి చాలదా?స్నేహంగా ఉంటే ధర్మరాజు నీకోసం కొత్త రాజ్యాల్ని సాధించి ఇస్తాడురా నాయనా!నీ క్షేమం కోసమే చెబుతున్నాను వినరా బాబూ!అక్కడ కృష్ణుడు ఉండగా నీకు విజయం దక్కదు - నా మాట వినరా!" అని బతిమిలాడి చెప్పినప్పుడు దుర్యోధనుడు విని ఉంటే యుద్ధం జరిగేది కాదు.ఒక మనిష్ వ్యక్తిగత జీవితంలో గానీ ఒక జాతి సామాజిక జీవితంలో గానీ పునాదులు కదిలిపోయి తిరిగి కోలుకోలేనంతటి భీబత్సం ఎదురయ్యే సంఘటనలు ఎనిసార్లు జరిగినా అన్నిసార్లూ ఇష్టానికీ ధర్మానికీ మధ్య నిలబడి ఎటో ఒకవైపుకి జరగాల్సి వచ్చినప్పుడు ఇష్టం వైపుకు జరిగడమే కారణం అనేది ఆ తండ్రీకొడుకుల దురవస్థ నుచి తెలివైనవాళ్ళు నేర్చుకోవలసిన పాఠం!

          బలరాముడు గొడవ చేసినట్టు పనిగట్టుకుని దొంగదెబ్బనే వేశాడో,కృష్ణుడు సమర్ధించినట్టు దుర్యోధనుడు గాలిలోకి పైకెగిరితే అలవాటులో పొరపాటుగానే తగిలిందో గానీ భీముడు కొట్టిన దెబ్బకి తొడలు విరిగి కూలిన దుర్యోధనుడు "ధర్మయుద్ధం చేస్తే నేనే గెల్చేవాణ్ణి,మీరు కూడా అధర్మమే చేశారుగా - నేను అధర్మం చేశానంటే యెట్లా?అయితే గియితే దొందూ దొందే అవుతాం గానీ!" అని తనకి నెప్పి పుట్టినప్పుడు పాండవుల్ని దెప్పిపొడవటానికి ఉపయోగించిన తెలివిని తను భీముడికి విషం పెట్టినపుడు, లక్కయింట్లో మొత్తం పాండవుల్ని పదతల్లితో సహా చంపాలనుకున్నప్పుడు, మాయాద్యూతంతో పాండవుల రాజ్యాన్ని లాక్కోవాలనుకున్నప్పుడు చూపిస్తే ఈ నెప్పితో కూడిన కుక్కచావు తప్పేది కదా!"నాకేంటి?బతికినంత కాలం వైభవంగా బతికాను!పాండవులే పిచ్చోళ్ళలా యవ్వనమంతా కారడవుల్లో తిరిగారు గానీ!" అని విర్రవీగినవాడు తను చచ్చాక తల్లి గుండెలు బాదుకుని యేడవటం చూసి ఉంటే ఎలా వుండేవాడు?

          దుర్యోధనాదుల్ని మందలించి ఆపగలిగిన వారు కూడా తలలు వంచి కూర్చోవడమే తప్ప కలగజేసుకుని ఆపకపోవటానికి దాసులు ప్రభువుల ఆజ్ఞల్ని పాటించటం వారి దృష్టిలో ధర్మం గనకనే - దాన్ని తిరస్కరించిన ద్రౌపదీ ఆమె స్వాభిమానాన్ని కాపాడిన కృష్ణుడూ నడిపించిన నిగూఢమైన రాజనీతి సౌందర్యమే మహాభారత కధని కాలాలు దాటించి దేశాలు దాటించి సజ్జనులకు నీతిబోధలా కనిపిస్తూ దుర్జనులకు శిరోవేదన కలిగుస్తున్నది. హిందువులు మంచివాళ్ళని పొగిడినవాళ్ళనల్లా చెడ్డవాళ్ళని గొడవచేసి హిందువుల్ని చీకాకు పరిచి వాళ్ళని మానసికంగా బలహీనపరచడం ద్వారానే మనకు అధికారం సంఫ్రాప్తిస్తుందనే తెలివితక్కువ ఎజెండాతో స్వీయలోపాల్ని తెలుసుకోకుండా పాండవుల మీద పడి యేడ్చిన దుర్యోధనాదుల్ని మంచివాళ్ళని పొగుడుతున్న స్వైరిణులూ ముళ్ళకంచెలూ ఇంకా ద్రౌపది రేప్ సీనుని తల్చుకుని పులకరించి కలవరించుతున్న ఈనాటి హిందూమతద్వేషులు కూడా నాటి కౌరవాధముల వలె హతమారిపోయి పాండవులను వరించిన విజయశ్రీ నేటి హిందూధార్మికయోధులను వరించటం తధ్యం!

రసపట్టులో తర్కం కూడనట్టే ధార్మికచర్చలో ఎజెండాల పైత్యం ఉండకూడదు!

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...