Thursday, 28 April 2016

జై తమిళాంధ్ర!జై జై తమిళాంధ్ర!!జై జై జై తమిళాంధ్ర!!!

          రష్యా ఒకప్పుడు పోలెండ్‌పై ఆధిపత్యం ఏర్పరచుకొని అక్కడి విద్యాసంస్థల్లో పోలిష్‌ భాషలో విద్యాబోధనను నిషేధించింది; రష్యన భాషలోనే విద్యా బోధన జరగాలని శాసించింది. అదే రీతిలో, ఇంగ్లండ్‌ కూడా తన ఆధీనంలో ఉండిన స్కాటిష్‌ హైలాండ్స్‌లోని జనాల్ని తమ గాలిక్‌ భాషలో మాట్లాడనివ్వలేదు; అటు ఐర్లాండ్‌లోనూ ఇంగ్లీషునే ప్రోత్సహించింది. బిస్మార్క్‌ కాలపు జర్మనీ కూడా తన ఆధీనంలో ఉండిన పోలెండ్‌ దేశీయుల్ని పోలిష్‌ భాష బదులు జర్మనీ భాషనే వాడాలని ఆదేశించింది; సెల్స్‌విగ్‌ ప్రాంతపు డేనిష్‌ (డెన్మార్క్‌) వారిని డేనిష్‌ భాష బదులు జర్మన్‌ భాషనే వాడాలని శాసించింది. అంతేగాక, ఆ ప్రాంతాల వారిని జర్మన్‌ జాతీయులుగా మార్చడానికి తీవ్రంగా ప్రయత్నించింది.

          ఇదే రీతిలో, మన పొరుగు రాష్ట్రం తమిళనాడు కూడా అక్కడి తెలుగువారి తెలుగు భాష విషయంలో అలాంటి ప్రయత్నాన్నే నేడు చేస్తోంది. తెలుగు భాష మాట్లాడడానికి, రాయడానికి, చదువుకోవడానికి, ఉద్యోగం పొందడానికి, కడకు అంగళ్ల వద్ద తెలుగులో బోర్డులు పెట్టుకోవడానికి కూడా వీలులేని పరిస్థితులు తమిళనాడులో సృష్టిస్తున్నారు. నేటి తమిళ రాజకీయ నాయకుల ఓట్ల రాజకీయంతో తమిళ భాషా రాజకీయం కలపడంతో ఏర్పడిన తమిళభాషా ఉద్రేక రాజకీయాల వలన, తమిళుల ఆధిపత్య ధోరణి వలన, తమిళుల దాడులు వలన, తమిళనాడు లోని తెలుగువారు స్వతంత్రతను, భాషను, సంస్కృతిని, కడకు ఉనికిని కూడా కోల్పోతున్నారు. ఇక్కడి తెలుగువారు తమిళులుగా మారిపోక తప్పడం లేదు. అంటే, తమిళనాడులో తెలుగు భాషాసంస్కృతులు శిథిల దశకు చేరువవుతున్నాయి. కనీసం రెండవ అధికార భాషగానైనా తెలుగు ఏర్పడితే తప్ప అక్కడి తెలుగు ఎక్కువ కాలం బతకదు.

           ఇందుకు దేశంలోని తెలుగువారు, ముఖ్యంగా రెండు తెలుగు రాష్ర్టాల ప్రభుత్వాలు, పార్టీలు, భాషా సంస్థలు, భాషాభిమానులు, మొత్తంగా తెలుగు జనాలు తమిళనాడులోని తెలుగువారికి అండగా నిలవాల్సిన అత్యవసర పరిస్థితి ఏర్పడింది; ముఖ్యంగా తెలుగు భాషా ఉద్యమకారులు స.వెం.రమేశ్‌ వంటి వారికి అండదండలు చేకూర్చాల్సిన అవసరం ఉంది. ఇది రాజకీయాలకు అతీతంగా జరగాలి.ఇక్కడ గుర్తించాల్సిన ముఖ్య విషయమేమంటే, తమిళాంధ్రగా, దక్షణాంధ్రగా పిలువదగిన నేటి తమిళనాడులో క్రీస్తుశకం ఒకటి-మూడు శతాబ్దుల మధ్య నాటి ప్రాచీన తమిళ సంగం యుగ కాలం నుంచి నేటి వరకు తెలుగువారే మెజారిటీ జనాభాగా, తమిళులు మైనారిటీ జనాభాగా నేటి తమిళనాడులో జీవిస్తున్నప్పటికీ మెజారిటీ జనాలైన తెలుగు వారి భాష అణచివేతకు గురవుతోంది. అసలు, సంగం యుగ కాలానికి కావేరీ నది పరిసర ప్రాంతాలకు, వాటికి పశ్చిమాన ఉన్న నేటి కేరళలోని అరేబియా సముద్రం అంచువరకు మాత్రమే తమిళం ప్రాబల్యం కలిగి ఉండేది (అప్పటికి కేరళలో మాళయాళ భాషలేదు);

            కావేరికి ఉత్తరాన ఉండిన ప్రాంతాల్లో చాలావరకు వడుగర్‌ అనబడిన తెలుగు మాట్లాడే జనం ఉండేవారు (క్రీస్తుపూర్వం నుండే మాట్లాడే-తెలుగు ఉంది). 1911లో తిరుచినాపల్లిలో ఉమ్మడి మద్రాసు (తమిళాంధ్ర) తమిళ నాయకులు ప్రత్యేక రాష్ట్రంకై జరిపిన సమావేశంలో కావేరీ పరిసరాల నుంచి కన్యాకుమారి వరకు ఉన్న ప్రాంతాలతో కూడిన ప్రత్యేక తమిళ రాష్ట్రం ఏర్పరచాలని కోరడంబట్టి కావేరీ పరిసర దక్షణ ప్రాంతాల్లోనే తమిళం మాట్లాడే జనం ఎక్కువగా కేంద్రీకృతమై ఉండేవారని తెలుస్తోంది; ఉత్తర ప్రాంతాల్లో తెలుగు మాట్లాడే జనం అధికంగా ఉండేవారని కూడా తెలుస్తోంది. కడకు, 1953లో ఆంధ్రరాష్ట్రం, తమిళరాష్ట్రం ఏర్పాటుకు ముందు కాలంనాటికి కూడా పాండిచ్చేరి, కోయంబత్తూరు, సేలం, బాలాఘాట్‌, డెంకెన్‌కోట, హోసూరు, కి?ష్టగిరి, హంపి వంటి ప్రాంతాల వరకు తెలుగు మాట్లాడేవారు అత్యధికంగా ఉండేవారు. డెంకెన్‌కోటలో పదిశాతం కూడా తమిళులు లేరు. ఇప్పుడు కూడా తమిళనాడులో తెలుగు వారు నలభైరెండు శాతం మందిపైగా ఉన్నారు, తమిళులు ముప్పై ఆరు శాతం మంది ఉన్నారు, ఇతర భాషీయులు ఇరవై శాతం వరకు ఉన్నారు.

             అసలు, తమిళనాడులోని మొత్తం ముప్పయ్‌ జిల్లాలలో తెలుగు లేని జిల్లా లేదు. మొత్తం 165 తాలూకాలలో తెలుగు పల్లెలు లేని తాలూకా లేదు. అక్కడి 332 కూలాలలో 150కి పైగా తెలుగు కులాలు ఉండగా 73 మాత్రమే తమిళ కులాలు ఉన్నాయి. సేలం జిల్లాలో వందేండ్ల క్రితం కూడా ఆస్తి పత్రాలు తెలుగులో రిజిస్టర్‌ అయ్యేవి. ధర్మపురిలో 1880 నాటికే తెలుగు బడి ఏర్పాటు చేశారు. 1658లో డచ్చివారికి నాగపట్నం ఓడరేవులో వ్యాపారం చేసుకోవడానికి తంజావూరు రాజు విజయరాఘవ నాయకుడు ఇచ్చిన అనుమతి పత్రం, ఒప్పంద పత్రాలు తెలుగులోనే ఉన్నాయి. అనగా, తమిళనాడులో ప్రాచీన కాలం నుండి నేటివరకు తెలుగువారే మెజారిటీగా ఉన్నాగాని, తెలుగువారే అత్యధిక కాలం అక్కడ పరిపాలన సాగించినాగాని తెలుగు భాష అణచివేతకు గురవుతోంది.
  
           అసలు, క్రీస్తుశకం ఒకటవ శతాబ్దికి పూర్వం నుండే తమిళనాడులోని తెలుగువారు దాదాపు పూర్తిగా అక్కడి స్థానికులే. అక్కడి మట్టిలో పుట్టి, అక్కడే పెరిగినవారు. అక్కడి పొలాల్ని దున్ని, వ్యాపారాల్ని చేసి అక్కడి సంపద పెంచిన వారు. అక్కడి సంస్కృతిని, తమిళాన్ని వికసింపజేసి, పలు రకాల కళల్ని అభివృద్ధి పరచిన వారే. అందుకే, తమిళ సంగంయుగపు కవులు, ఆతరువాతి కాలపు ఆళ్వారులు వంటి వారిలో అత్యధికులు తెలుగు వారైనప్పటికీ తమిళంలోనే తమ రచనల్ని చేసారు. తమిళాంధ్రలో, ప్రధానంగా నేటి తమిళనాడు ప్రాంతంలో వ్రాత తమిళానికే రాజపోషణ ఉండడం, వ్రాత తెలుగుకు రాజపోషణ లేకపోవడం, నేటి తెలుగు ప్రాంతాల్లోనూ వ్రాత తెలుగుకు క్రీస్తుశకం ఆరవశతాబ్దివరకు రాజపోషణ లేక పోవడం, తెలుగు ప్రాంతాల్లో, తమిళాంధ్ర ఉత్తర ప్రాంతాల్లో వ్రాత ప్రాకృతం, వ్రాత సంస్కృతంలకు రాజపోషణ ఉండడంతో నేటి తమిళనాడులోని ఒకప్పటి తెలుగు వారు కూడా తమిళంలోనే రచనలు చేయడం జరిగింది (సంగం కవులు, ఆళ్వారులు వలె).

           మరోవైపు, తమిళాంధ్రను పాలించిన తమిళ పాలకులు చోళులు, పాండ్యులు గాని, తెలుగు పాలకులు పల్లవులు, విజయనగర పాలకులు, నాయక రాజులు వంటివారు గాని, ఆధునిక కాలపు పాలకులైన ముఖ్యమంత్రులు పదహారు మందిలో పన్నెండు మంది (1920-2016 మధ్య) తెలుగు మూలాలు గలవారు గాని తమిళ భాషాభివృద్ధికి కృషి చేశారే గాని తెలుగు భాషాభివృద్ధికి కృషిచేయలేదు; ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. వీటన్నింటికి తోడు 1953లో ఒరిస్సా గంజాంలోని మల్నాడ్‌కు ఒంగోలు దగ్గరి చినగంజాంకు మధ్య ఉండిన ‘‘ఉత్తరసర్కార్ల’’ నాయకులు ఉమ్మడి మద్రాసు రాష్ర్టాన్ని (తమిళాంధ్రను) విడగొట్టించి ఆంధ్రరాష్ర్టాన్ని ఏర్పాటు చేయించడంతో నేటి రెండు తెలుగు రాష్ర్టాల్లో ఉన్న జనాభాకు దాదాపు సమాన సంఖ్యలో నేటి తమిళనాడు ప్రాంతంలో ఉండిన తెలుగు వారు భాషాపరంగా దిక్కులేని వారయ్యారు;

             ఇప్పటికీ తెలుగును కాపాడుకోవడానికి ఎదురీత ఈదుతున్నారు. అంటే, క్రీస్తు పూర్వం నుంచి నేటి వరకు తమిళనాడులో నివసిస్తున్న జనంలో అత్యధికులు తెలుగు వారే. మద్రాసు మొదటి మేయర్‌ పిట్టి త్యాగరాయ శెట్టి తెలుగు వాడే. 1920-2016 మధ్యనాటి తమిళనాడు ముఖ్యమంత్రులు పదహారు మందిలో పన్నెండుమంది తెలుగువారే. ప్రతిపక్ష నాయకులూ చాలావరకు తెలుగువారే. కానీ తమిళనాడులో తెలుగు భాష దారుణంగా అణచివేతకు గురవుతోంది. దీనిని ఆపడానికి తమిళాంధ్ర పార్టీ ఉద్భవించాల్సిన అవసరం ఉంది.
        
            ఇక, ఉమ్మడి మద్రాస్‌ (తమిళాంధ్ర) ముఖ్యమంత్రుల విషయానికి వస్తే, తొలి ముఖ్యమంత్రిగా అగరం సుబ్బరాయలు రెడ్డి (1920-21), ఆతరువాత వరుసగా కాళహస్తి-పానుగల్లు రాజా రాజారామారాయణిం (1921-26), డాక్టర్‌ పి. సుబ్బరాయన్‌ (1926-30), బొల్లిని మునస్వామి నాయుడు (1930-32), బొబ్బిలి రాజా (1932-37), కూర్మా వెంకటరెడ్డి (1937), టంగుటూరిప్రకాశం (1946-47), ఓమందూరు రామస్వామిరెడ్డి (1947-49), పి.ఎస్‌. కుమారస్వామి రాజా(1949-52), సి. రాజగోపాలాచారి (1952-54) ముఖ్యమంత్రులయ్యారు. వీరిలో సుబ్బరాయన్‌ మాత్రమే తమిళుడు మిగిలిన వారంతా తెలుగువారే. వీరి తరువాత తమిళనాడుకు ముఖ్యమంత్రులుగా ఉండినవారు కామరాజనాడర్‌(1954-63), ఎం. భక్తవత్సలం (1963-67), అన్నాదొరై (1967-69), కరుణానిధి(1969-76, 1989-91, 1996-2001), ఎం.జి. రామచంద్రన్‌(1977-87), జయలలిత(1991-96, 2001 నుంచి...). వీరిలో కామరాజ్‌, భక్తవత్సలం మాత్రమే తమిళులు. ఎం.జి.రామచంద్రన్‌ మళయాళి, జయలలిత కన్నడిగ (ఈమె తల్లి నెల్లూరు కావున ఈమెను కూడా తెలుగు వ్యక్తిగా భావించవచ్చు). అన్నాదొరై, కరుణానిధి తెలుగు వారు. ఇక, పెరియార్‌ రామస్వామి నాయకర్‌, స్టాలిన్‌, వై.గోపాలస్వామి, విజయకాంత్‌ కూడా తెలుగు ప్రముఖులే. అంటే, 1920-2016 మధ్యనాటి పదహారు మంది ముఖ్యమంత్రుల్లో పన్నెండుమంది తెలుగు వారే, ప్రతిపక్షనాయకులూ తెలుగు వారే.

        ఈ వివరాలు తమిళనాడులో తెలుగువారే జనాభాలోనూ, ఇతరత్రానూ అధిక్యంలో ఉన్నారని తెలియజేస్తున్నాయి. అయితే, తెలుగు భాష విషయంలో ఉనికిని కోల్పోతున్నారు. దీనిని ఆపడానికి తమిళాంధ్ర పార్టీని స్థాపించి, రాజకీయ అధికారాన్ని చేపట్టడమే మార్గంగా తోస్తోంది. 
------- డాక్టర్‌ దేవిరెడ్డి సుబ్రమణ్యం రెడ్డి
గతమెంతొ ఘనకీర్తి గలవోడ!చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడ!!దూసుకెళ్ళు సత్తువ గలవోడ!!!

13 comments:

  1. హరిబాబు గారూ ఎవరండీ ఈ దేవిరెడ్డి సుబ్రమణ్యం రెడ్డి గారు?

    ReplyDelete
  2. దేవిరెడ్డి సుబ్రమణ్యం రెడ్డి గారు రిటైర్డ్‌ ప్రొఫెసర్‌, చరిత్ర శాఖ, ఎస్వీ యూనివర్శిటీ

    ReplyDelete
    Replies
    1. I saw that. My curiosity is about the following:

      - His expertise or knowledge on the present subject
      - His bandwidth or capability in running తమిళాంధ్ర పార్టీ

      ఆయన రాసినవి (వాదన కోసం మాత్రమే సుమండీ) నిజం అనుకున్నా ఆయన సూచించిన మార్గం (రాజ్యాధికారం సాదించడం) అత్యంత దుర్లభం. తమిళ నాడు తెలుగు వారి నుండి ఎన్టీఆర్ లేదా వైఎస్ లాంటి మహానాయకులు ఎవరయినా వస్తే తప్ప ఇది సాధ్యం కాదు.

      Delete
    2. హైదరాబాదు రోడ్లు బోసి పోతాయని, ఖాళీ అయిన కూడళ్ళలో ప్రభాకర్ మందార, మీరు, నేను ఇతర తెలంగాణావాది బ్లాగర్లు క్రికెట్ ఆడుకోవాల్సి వస్తుందని ఎందరో "మిత్రులు" జోస్యం చెప్పిన మాట మీదు విదితమే.

      ఎక్కడ మాచ్ ఆడుదామండీ?

      బుద్దామురళి రోజు ఆడుతున్నాడు క్రికేట్. ఆయనకి చంద్రబాబు పై ద్వేషం, చంద్ర శేఖర్ రావు పై ప్రేమ. ప్రతి నెలా ఒకటపా రాస్తూ తెలంగాణ గానం ఆరున్నొక్క రాగం లో వినిపిస్తూ చేసే చెక్క భజన ప్రపంచ ఖ్యాతి నొందింది. వేసవి శేలవులు, ఆంధ్రాలో ఏండల వలన హైదరాబాద్ లో జనం కనిపించినంత మాత్రాన తెలంగాణ అభివృద్ది అయిపోయిందంటే ఎలా?

      Delete
    3. జయలలిత, కరుణానిధి తరువాత తమిళుల కు ఉన్న నాయకులు ఎవరు? పెరియార్ బాచ్ నక్క జిత్తులలో నంబర్ వన్. త్యాగలాలో ఆఖరు.

      కట్ట బొమ్మన్న మొదలుకొని అందరు తెలుగువాళ్ళే స్వాతంత్రపోరాటం లో వీరొచితంగా పోరాడింది. తమిళులు పిరికి వాళ్ళు. యుద్దం చేయాల్సిన చోట ఆత్మహత్యలు చేసుకొంట్టారు. తమిళనాడులో తెలుగు సెంతిమెంట్ రేపటం లొ ఉంది కిటుకు. తమిళ బ్రాహ్మణులు అడ్డుపడకుండా హాండిల్ చేయగలిగితే చాలు నాయకత్వం సెకండరి. ఈ ముసలి నాయకుల అనంతరం ఒక్కసారి దానిని రేపితే చాలా ఫలితం ఉంట్టుంది.

      Delete
    4. ఆ తెలుగోడికి గడ్డం వుందా? ఆడు మా తెలగాన వాడే అంట కదా?

      Delete
  3. all telugu stupid sons only killing telugu. NTR or nobody, telugu govt saving telugu. In direct telugu states also stupid govts, stupid people. actually telugu man only should have the ability to rule india, but due to this wickedness towards mother language only put them as locals for ever. these people definately go to hell only

    ReplyDelete
    Replies
    1. Yes Sir!
      "actually telugu man only should have the ability to rule india, but due to this wickedness towards mother language only put them as locals for ever."

      This is true,Because satavahanas ruled northern india also!But they are refered as suthern local kings!Lot of political barriers there in all aspects.They are not random.a well planned pattern.

      Delete
    2. This comment has been removed by the author.

      Delete
  4. This comment has been removed by the author.

    ReplyDelete
  5. స్వభాషాభిమానం ఉందటం తప్పు కాదు,కానీ తమిళ భాఅ కోసం ఇతర భాషల్ని నొక్కెయ్యాలనుకోవటం మాత్రం దారుణమే!అదీ సాటి భార్తేఎయ భాషల్ని తొక్కేసి అయితే తమిళం లేకుంటే ఇంగ్లీషు అనె ధోరణి మరీ విచిత్రం!

    అంకెకి తక్కువున్న జనాలు కూడా మైనారిటీ పేరుతో హడావిడి చేస్తుంటే అంతమంది జనం ఎందుకు వంగి ఉండాలి?మన రాజులూ,మన ఆళ్వారులూ వాళ్ళ భాషని ఎంకరేజి చేసిన కృతజ్ఞతయినా లేదు వాళ్ళకి,మంచితనానికి రోజులు కానట్టున్నాయి.

    ReplyDelete
  6. హరిబాబు గారు,
    ఆళ్వారులు తెలుగు వారా?

    ReplyDelete
    Replies
    1. నాకు పూర్తిగా తెలియదు,ఆయన రాసిన వ్యాసం మక్కీకి మక్కీ ఇక్కడ వేశాను.ఆయన పరిశోధన చేసే ఉంటారు,"ఆళ్వారులు వంటి వారిలో అత్యధికులు తెలుగు వారైనప్పటికీ తమిళంలోనే తమ రచనల్ని చేసారు" అని చెప్తున్నారుగా!

      Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

"వేదాలు చదివిన వారు యజ్ఞయాగాదు లందు పశువులను వధిస్తారు" - ఇది నిజమా?

hari.S.babu: గురువు గారూ ! మహాభారతంలో ధర్మవ్యాధుని కధ వస్తుంది కదా . అక్కడ ధర్మవ్యాధుడు కౌశికుడికి ధర్మబోధ చేస్తూ ఒకచోట ," ...