Saturday, 23 April 2016

ఒరేయి,మనిషీ!నన్ను చంపకురా నువ్వు చస్తావు!?

ఒరేయి,మనిషీ!

నీ కడుపు నింపే కూడును నేను!
నీకు నీడనిచ్చే గూడును నేను!
నువ్వు కట్టుకునే బట్టను నేను!

నువ్వు మోసే కాడెను నేను!
నిన్ను మోసె పాడెను నేను!
నిన్ను కాల్చే కట్టెను కూడా నేనేరా ఇడియట్!

నేనురా తరువుని నీ బతుకుతెరువుని,
కన్ను తెరిచి చూడరా నన్ను బతక నివ్వరా!

ఒక్క చెట్టునైనా పెంచు,
నన్ను నరుకుతూ నిన్ను నువ్వు నరుక్కుంటూ
డైనోసార్ల మాదిరి చావకు!

నేను మాయమైపోతే నువ్వూ మాయమైపోతావ్ - ఖబడ్దార్!!

3 comments:

  1. Replies
    1. thanks!
      పూర్తిగా సొంతం కాదు - వాట్సప్ మెసేజి,కొంచెం ఫోర్సు పెంచితే బాగుంటుందనిపించింది,చేశాను!

      Delete
  2. Excellent poem sir

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

"వేదాలు చదివిన వారు యజ్ఞయాగాదు లందు పశువులను వధిస్తారు" - ఇది నిజమా?

hari.S.babu: గురువు గారూ ! మహాభారతంలో ధర్మవ్యాధుని కధ వస్తుంది కదా . అక్కడ ధర్మవ్యాధుడు కౌశికుడికి ధర్మబోధ చేస్తూ ఒకచోట ," ...