Tuesday, 8 April 2014

జన్మాంతర సౌహృదాలు పల్కరించిన వేళ

సీ||      జన్మాంతరపు సౌహృదము లేవొ పల్కరిం
           చిన యట్లు తోచెను చిన్ని మాధ

           విని చూడగానె, విచ్చిన పారిజాతమ

           ల్లె కనబడింది పాలు మరవని ప

           సి తనపు నిద్రలో, ఇది వీడ్కి పెండ్లాము

           అవుతుందనో ఏమొ అమ్మ లక్క

           లందరు మేలమాడంగ -  పైనున్న త

           ధాస్తు దేవతలు తధాస్తు చెప్పు

తే||       నట్టు అప్పుడే తొలిముద్దు నిచ్చి వేస్తి!

            కామ మెరుగని వయసులో కాంక్ష విత్తు
            మొలిచి పాతికేండ్లకు నేడు మొక్క లాగ
            మారి ఒకగూటి పక్షుల మైతి మిపుడు!!
(08/04/2014)

బంగారం, నువ్వంటే నాకెంతో ఇష్టం రా! ఇంత ఇష్టపడి చేసుకున్నా నా అసమర్ధత వల్ల నిన్ను సుఖపేట్ట లేకపోతున్నా నెందుకో?


యేదీ కలిసి రావడం లేదు. కొందరికి మట్టి ముట్టుకుంటే బంగార మవుతుంది. నేను బంగారం ముట్టుకున్నా మట్తై పిగిలి పోతుంది! 


ఆ కలిసొచ్చే రోజు వస్తే నిన్ను మహారాణి లాగ చూసుకుంటా, నన్ను నమ్ము. అంతవరకు:


రవి గాంచని కవి గాంచని సుకుమారపు సౌందర్యమా, నా జన్మాంతర సౌహృదాలను మేళవించుకున్న స్వరరాగ సంరంభమా -  నన్ను క్షమించు!!!

7 comments:

  1. మీ ఆశక్తతలోని నిజాయితీ ఆవిడకు
    తప్పక అవగతమౌతుంది...

    ఆపై మిక్కిలి ప్రేమౌతుంది...
    మక్కువ మొలకౌతుంది...
    చక్కని చుక్కౌతుంది...
    చక్కెర అందిస్తుంది...

    చక్కగ బాగుంది...

    ReplyDelete
    Replies
    1. కృతజ్ఞతలు.ఈ మధ్యనే పరిస్తితి కొంచెం ఆశావహంగా కనిపిస్తున్నది - మీ మాట ఫలం మా భావి సుఖం!

      Delete
  2. పేజ్ క్రింది భాగంలో వ్యాఖ్యాతలకి మీరు ఇచ్చిన సూచనల రెండో లైన్లో "వ్యాఖ్య" బదులు "వ్యాళ్య" అని ముద్రా రాక్షసం (ఇప్పటి పరిభాషలో "టైపో" అంటారనుకుంటాను) పడింది గమనించారా?

    ReplyDelete
    Replies
    1. విన్నకోట వారికి వందనాలు!సరి చేశాను. కృతజ్ఞుడ్ని.కానీ ఒక నివేదన, కిందెక్కడో ఉన్న తప్పుని సరి చేసారు గానీ పైన ఉన్న విషయం గురించి యేమీ చెప్పలేదు?

      Delete
    2. పోస్ట్ విషయం గురించి వ్యాఖ్య వ్రాద్దామనే క్రిందనున్న కామెంట్ బాక్స్ దగ్గరికి వచ్చింది. అక్కడ మీరు జారీ చేసిన హెచ్చరికలు కంటపడ్డాయి. అవి చదువుతున్న క్రమంలో ఆ ముద్రా రాక్షసం కనిపించింది. వ్రాతలో తప్పులు కనిపిస్తే నా చేతులకి కొంచెం దురద పుడుతుందిలెండి. వెంటనే సరి చెయ్యటమో / సరి చెయ్యమని సలహా ఇవ్వటమో చేస్తుంటాను.

      ఈ పోస్ట్ విషయానికి వస్తే - పద్యం సున్నితమైన భావాలతో నిండి బాగుంది. ఇక పద్యం తర్వాత వ్రాసిన వాక్యాల్లో కనిపించే guilt feeling చాలా మంది మగవాళ్ళకి ఎప్పుడో ఒకప్పుడు కలిగే తీరుతుంది. (వ్రాసింది బాగుంది కాని self-pity లోకి వెళ్ళకండి - మీరు వ్రాసినదంతా స్వీయానుభవం గనక అయితే.)

      మీ బ్లాగ్లో పోస్టులు, ఇతరుల బ్లాగుల్లో మీ వ్యాఖ్యలు తరచు చూస్తూనే ఉంటాను. analytical mind ఉన్న వ్యక్తి అనే అభిప్రాయం కలుగుతుంది. Keep it up.

      Delete
    3. This comment has been removed by the author.

      Delete
    4. విజిటర్ అభిప్రాయం తెలుసుకోవాలనే బ్లాగరు ముచ్చట, అంతే. నచ్చినందుకు థాంక్స్! guilt feelingస్వీయానుభవమే.మరీ self-pity యేం లేదు లెండి.

      Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...