గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ చావుదెబ్బ తినడంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కళ్ళు పత్తికాయల్లా చేసుకున్న వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపించింది, ఇన్నాళ్లకి వాళ్ళ కళ్ళలో ఆనందం వెల్లివిరిసింది - కొంచెం మామూలు స్థితికి వచ్చినాయి!అయితే,కొంచెం కళ్ళు నులుముకుని చూస్తే ఇవ్వాళ తెరాసలో మంత్రులుగానూ ఇంకా వీళ్ళకి తెలంగాణ పునర్నిర్మాణం అనే బృహత్కార్యాన్ని భుజాల మీద వేసుకుని తెలంగాణ భూఖండాన్ని ఉద్ధరించే మహాత్ములుగానూ అక్కడ కొలువుదీరి కనబడుతున్నవాళ్ళంతా ఒకప్పుడు టీడెపీ వాళ్ళే:-)
అసలు ముఖ్యమంత్రి గారే నందమూరి తారకరామారవుకి భక్తుడు!చంద్రబాబుకి రహస్యమిత్రుడు కూడాను - ఇప్పటికీ!ఒక్క చంద్రబాబు తప్పిస్తే తెలంగాణ నుంచి దుష్ట దుర్మార్గ తెలంగాణ విధ్వంసక ప్రజాశత్రువు చంద్రబాబు ద్వారా ఎన్నికైన తెదెపా వాళ్ళంతా, వాళ్ళొక్కళ్ళేనా అన్ని పార్టీల్లోనూ ఉండి ఇప్పటివరకు ఉద్యమపార్టీని వ్యతిరేకించిన వాళ్ళంతా ఇప్పుడు తెరాస లోనే ఉన్నారు.మరి!యాభయ్యేళ్ళ నాటి పాతకధని మర్చిపోయి ఈ కొత్త కధలో పన్నెండేళ్ళుగా వీళ్ళు ఎవరినైతే బాబు పచ్చ పార్టీలో ఉండి తెలంగాణకి అన్యాయం చేశారని శాపనార్ధాలు పెట్టారో వాళ్ళంతా కండువా మార్చగానే మంచివాళ్ళు అయిపోతారా?కండువా రంగు మార్చటం కోసమా వీళ్ళు ఇంత గోల చేసింది?
పోనీ ప్రాంతీయాభిమానం లెక్కల ప్రకారం సంస్కృతి గురించి గొప్పగా చెబుదాం అనుకుంటే బతుకమ్మని కులాలవారీగా చీల్చి భ్రష్టు పట్టించారు!బతుకమ్మ పరువు తియ్యటం పూర్తయ్యాక ఇప్పుడు సమ్మక్క మీద పడ్డారు.కొత్తగా నెత్తి కెత్తుకుంటున్న సమ్మక్క,సారక్కల గోలేంటో అర్ధం కాదు.వీళ్ళు కాకతీయ సామ్రాజ్ఞి రుద్రమదేవి మా ప్రాంతానికి కీర్తిని తెచ్చిపెట్టిన మహారాణి అంటారు.తెలంగాణ భాషలో కాకుండా సంస్కృత పదాలతో నిండిపోయిన గ్రాంధికపు రాష్ట్రగీతంలో రుద్రమదేవిని పొగిడితే వీళ్ళు ఆంధ్రోళ్ళని తిట్టిన దానికన్నా పదింతలు తిట్టిన సమ్మక్క,సారక్కల భక్తులకి అది నచ్చటం లేదు.అందుకని, కొత్త కధల్లో ప్రతాపరుద్రుడికి పశ్చాత్తాపం అనే ముసుగు తగిలిస్తున్నారు.వాళ్ళు ఎక్కడెక్కడివాళ్ళూ పోగయి మా సంప్రదాయాల్లో వేళ్ళు పెడుతున్నారు,మ మా కధల్ని గూడా మార్చేస్తున్నారు అని కోప్పడుతున్నారు.కొంచెం వైభవంగా బతికిన ఈ మధ్యకాలపు ధర్మప్రభువు గదాని నిజాముని పొగుడుదామంటే అక్కడ బలంగా ఉన్న నక్సలైట్లు ఒంటికాలిమీద లేస్తారు.నక్సలైట్లని తన్ని తగిలేద్దామంటే గిరిజనులు వాళ్ళు మా అన్నలంటారు - ఇదెక్కడి గోల!
పోనీ పరిపాలన సమర్ధవంతంగా ఉంది అనుకుని సంతోషపడదామంటే సాక్షాత్తూ రాజధాని నడిబొడ్డునే ఉగ్రవవ్ద సంస్థలకి శాఖలు లేస్తుంటే వాటిని మూయించే దమ్ము లేదు.ముఖ్యమంత్రి గారు ఆర్భాటంగా మొదలెట్టిన గతకాలపు సాహసోపేత నిర్ణయాలన్నీ కొన్ని కోర్టు మొట్టికాయలతో కొన్ని జనాల చివాట్లతో అటకెక్కేసినాయి - అవి మళ్ళీ కిందకి దిగొచ్చే సూచనలు కూడా లేవు.కోర్టుల్ని ఆంధ్రా కోర్టులు గాబట్టి వాటిని కొట్టేసినాయి అని చెప్పుకుని కొంచెం పరువు నిలబెట్టుకున్నారు.కానీ పోలీస్ కమిషనరేట్ అని పోలీసుశాఖకి గాలి కొట్టబొతే ఎయిర్పోర్తు అధారిటీస్ గాలి తీసేసింది.అంతకిముందు జరిగిన వాటికి ఆంధ్రోళ్ళ మీద నెట్టేశారు,మరి ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి స్వయంకృత నిర్ణయాలని కూడా ఆంధ్రోళ్ళ మీద నెట్టెయ్యరు కదా:-(
ఈ రెండేళ్ళలో చెప్పుకోదగిన గొప్పపని ఆయుత చండీయాగం తప్ప ఇనకేమీ కనబడ్డం లేదు.దాని మూలంగా కూడా అప్పటి వరకు పచ్చమీడియా పేరుతో ఏదో చేద్ద్దామని అంతు చూదబోయి ఏమీ చేయలేనని తెలిసి రాధాకృష్నతో కత్తు కలిపెయ్యడం ఒక్కటే గట్టి లాభం!మిగిలినవన్నీ మబ్బుల్లో నీళ్ళే.అయినా ఎందుకు వీళ్ళింత హ్యాపీగా ఫీలవుతున్నారు?ఆంధ్రప్రదేశ్ విభజనకి ముందు కూడా ఇలాగే తెలంగాణా ఇవ్వకుండా ఆంధ్రా వారు అడ్డుపడుతున్నారనీ కావూరి లగడపాటి లాంటివాళ్ళని దోషులుగా చిత్రీకరించి ఆంధ్రా వారినందరినీ తిట్టేవాళ్ళు. సాధారణంగా డబ్బున్న వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యేవాళ్ళు తక్కువ అసూయ చెందేవాళ్ళు ఎక్కువ కనుక సోనియా కూడా తెలంగాణా వారి మాటలనే నమ్మి అంత పెద్ద బడా పారిశ్రామిక వేత్తలను కూడా కాదని పార్లమెంట్ లో 23 నిమిషాలు తలుపులు మూసి మూజువాణి ఓటుతో విభజన చేసారు. .విభజన కావాలా వద్దా అన్నది ప్రజల అభీష్టం ప్రకారం జరగాలి, కానీ వీళ్ళు అట్లాంటి రాజమార్గం ద్వారా కాకుండా వక్రమార్గం దవరా తెచ్చుకున్నారు,అది వాళ్ళకి కూడా స్పష్టంగా తెలుసు.ఈ రకమైన జరిగిన విభజన మొత్తం ఒక పక్కా ప్రణాళికతో నడిపించారు కొందరు వ్యూహకర్తలు - మొదటి వాదన,విడిపోతే రెండు ప్రభుత్వాలు,మరిన్ని పదవులు,మరిన్ని కాంట్రాక్టులు,మరిన్ని తాయిలాలు వస్తాయి అనేది.దానివల్ల ఎక్కువ నష్టం తనకే అని తెలిసిన చంద్రబాబు వ్యతిరేకించాడు - బాబుకి మాత్రం ప్రజలమీద ఏమంత ప్రేమ ఉంది గనక!కానీ చూడండి ఈయన్ని ఆయన అమరావతికీ ఆయన్ని ఈయన చండీయాగానికీ ఎంత ఆత్మీయంగా పిల్చుకున్నారో - తోడుదొంగలు!
ఇక్కడ కూర్చుని "అండి" కన్నా "రి" ప్రశస్తం అని వాగేవాళ్ళకి మేళ్ళు చెయ్యటంకోసమో ,"చెప్పాలె" అనే గొప్ప ప్రయోగానికి బదులుగా ఇన్నాళ్లూ "చెప్పాలి" అనే తప్పుడు ప్రయోగం ఒప్పుగా చెలామణీ అయిందని అఘోరించే కుపండితులకి గందపెండేరాలు తొడగటం కోసమో కాదు విబజన జరిగింది.పైస్థాయిలో వాళ్లు ఆదాయాల్ని పంచుకోవడానికి సులువుగా ఉంటుందని!వీళ్ళకి దక్కేదల్లా మ్యాపులో విడిగా కొత్త రాష్ట్రంగా కనబడ్డమే.చంద్రబాబు మాటిమాటికీ తెలుగువాళ్ళని కలుపుతానని వాగుతున్నప్పుడల్లా వీళ్లకి ఇప్పటికీ తుమ్మితే వూడిపోయే ముక్కులా ఉన్న తెలంగాణ గురించి అంటున్నట్టు ఉలిక్కిపడేవాళ్ళు.ఇప్పుడా భయం పోయింది,అదీ వీళ్ళ ధీమా!వీళ్ళ దృష్టిలో ఎన్నికల్లో తెరాసా గెలుస్తూ ఉంటే చాలు తెలంగాణా బాగున్నట్టే.
గులాబి రంగు జిందాబాద్!పసుపు రంగు ముర్దాబాద్?
దీన్ని గురించి ఎంత తక్కువ మట్లాడుకుంటె అంత మంచిది సార్.
ReplyDeleteనిజమే,ఒక పెద్ద పోష్టు తయారు చేస్తూ సడెన్ అయిడియా వొచ్చి వేశాను.పోష్టులో స్మైలీలు పెట్టలేదు గానీ సరదాగానే రాశాను:-)
ReplyDelete