Saturday 3 December 2022

ప్రస్తుతం రామానుజ మతానికి మూలస్తంభం అయి వాళ్ళ దృష్టిలో సృష్టికర్తకు సరిసమానుడైన రామానుజుడు ఆ మత స్థాపన చెయ్యలేదు.

ప్రస్తుతం రామానుజ మతానికి మూలస్తంభం అయి వాళ్ళ దృష్టిలో సృష్టికర్తకు సరిసమానుడైన రామానుజుడు మత స్థాపన చెయ్యలేదు.సా. 9 శతాబ్దపు నాదమునియే మొదటిసారి మత సాహిత్యాన్ని బయటికి తీశాడు.అంతకు ముందు తమిళ నాట అయ్యంగార్ అనే శాఖ లేదు.

నాదముని చరిత్ర ఎప్పుడు పుట్టాడో ఎంత కాలం బతికాడో ఎక్కడెక్కడ తిరిగాడో ఎప్పుడు చచ్చిపోయాడో ఒక్క నికరమైన సాక్ష్యం కూడా లేని మైరావణ చరిత్రయే!అసలు పేరు Aranganathan(ఆరంగనాథన్) అట.కొందరు born in 823 CE and to have died in 951 CE అని నమ్మి చెప్తార్ట,కొందరు born in 582 CE and died in 922 CE అని నమ్మి చెప్తార్ట - ఇంకొందరు born at Viranarayana Puram sometime shortly after 907 CE and flourished in the 10th century అని కూడా నమ్ముతారు - !

నాదముని చరిత్రలో ఉన్నాడంటున్న  సా.శ.9వ శతాబ్ది నాటికి  కల్యాదిన పుట్టిన నమ్మాళ్వార్ మొదలు గల సమస్తమైన ఆళ్వారుల దివ్య ప్రబంధాలు అన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి - !పది పాసురాలు మాత్రమే మిగిలాయ - ! అప్పటికి.తండ్రి అయిన ఈశ్వర భట్టర్ పురాణం అంతా చెప్పి నారాయణుడి దయ లేనిది మళ్ళీ దొరకడం కష్టం అనేసరికి తను సాధిద్దామని తీర్ధయాత్రకి బయల్దేరాట్ట.కుంభకోణం సారంగపాణి ఆలయం దగ్గిర పూజారుల నోట నమ్మాళ్వార్ వ్రాసిన పాశురాల్ని విని ఆనంద కన్నీరు కార్చి మరిన్ని వివరాల కోసం క్రొశ్నించితే వాళ్ళూ పది పాశురాలు తప్ప మాకూ నమ్మాళ్వార్ వ్రాసిన 1292 పాశురాల గురించి అస్సలు తెలియదనేశార్ట.

నమ్మాళ్వార్ చరిత్ర కూడా ఎప్పుడు పుట్టాడో ఎంత కాలం బతికాడో ఎక్కడెక్కడ తిరిగాడో ఎప్పుడు చచ్చిపోయాడో ఒక్క నికరమైన సాక్ష్యం కూడా లేని మైరావణ చరిత్రయే!Modern biographical and historical research trying to get at what it would call the facts of Nammalvar's life stands baulked. Time has swallowed the factual details and what is now presented is the idealised account given in Divya Suri Charitam and Guru Parampara Prabhavam. This account, though it may not satisfy seekers of Boswellian documentation, is true to the inward life అని ముందుగానే కుండబద్దలు కొట్టేశారు "చరిత్రడక్కు,చెప్పిందిను!" అంటూ రావు గోపాల్రావు టైపులో!

మళ్ళీ నాదముని పట్టువదలని విక్రమార్కుడల్లే మధురకవిగళ్ గారి సొంతవూరుకి ఆయన వారసుల్ని క్రొశ్నించితే వాళ్ళు కూడా పది పాశురాలు తప్ప మాకూ నమ్మాళ్వార్ వ్రాసిన 1292 పాశురాల గురించి అస్సలు తెలియదనేశార్ట - చెవులు రిక్కించుకుని వింటున్నారా ఆకుకీ పోకకీ అందని పిట్టకధల్ని!

నాదముని గారు షెర్లాక్ హోంసు మాదిరి చేసిన అద్భుతమైన పరిశోధనలో ఆఖరి సన్నివేశం దగ్గిర వీళ్ళిక్కడ చెప్పిన కొత్త క్లూ యేంటంటే "ఎవడైతే పది పాశురములను కనుల నిండు భక్తితో 12000 మార్లు పఠించిన వెంఠనే నమ్మాళ్వార్ గారు ఠపీమని దర్శనం ఇచ్చుతారు" - చెవులు రిక్కించుకుని వింటున్నారా ఆకుకీ పోకకీ అందని పిట్టకధల్ని!

ఇంతకీ అంత గొప్ప క్లూ నాదమునికి ఇచ్చిన మధురకవిగళ్ గారి వారసులు అంత కాలం పాటు యెందుకు నమ్మాళ్వార్ సాహిత్యాన్ని బయటికి తీసుకు రాలేదో తెలుసా! పది పాశురాల్ని 12000 సార్లు చదివేటప్పుడు లెక్కపెట్టడం తెలీకనట - చెవులు రిక్కించుకుని వింటున్నారా ఆకుకీ పోకకీ అందని పిట్టకధల్ని!

12000 సార్లు చదవటానికి లెక్క తెలీక మానుకున్న మధురకవిగళ్ గారి వారసులు "how will he know the count" అని క్రొశ్నించితే మహా మేధావీ అకుంఠిత దీక్షాపరుడూ అయిన నాదముని గారు "once I finish singing these 10 pasurams 12,000 times, Nammalvar himself will come and I need not bother about the count" అని చెవిలో పువ్వులు పెట్టుకుని కధను వింటున్న పిచ్చోళ్ళకి నమ్మాళ్వార్ పాశురాల్ని మళ్ళీ వెలుగులోకి తీసుకు రావడంలో తన ప్రత్యేకతని చాటి చెప్పి మళ్ళీ నమ్మాళ్వార్ గారి సొంత వూరైన Alvarthirunagariకి ఆగమేఘాల మీద పరుగులు పెట్టాడు.

నాలుగు వేల యేళ్ళ క్రితం నమ్మాళ్వార్ కూర్చున్న చింతచెట్టు కిందనే కూర్చుని భక్త్యావేశంతో పది పాశురాల్ని మళ్ళీ మళ్ళీ చదవడం మొదలెట్టాడు లెక్కా దొక్కా చూసుకోకుండా.నాదమునిగారు నమ్మినట్టుగానే 12,000 సార్లు పది పాశురాలు పాడటం పూర్తి కాగానే ఠపీమని నమ్మాళ్వార్ వచ్చేసి ఆయన స్వయాన వ్రాసిన 1200 మాత్రమే గాక అందరు ఆళ్వారులూ వ్రాసిన మొత్తం 4000 పాశురాల్నీ ఇచ్చేశాట్ట.

హేతువుకీ కల్పనకీ తేడా తెలిసిన కామన్ సెన్సు ఉంటే చాలు ఇవన్నీ వాస్తవ చరిత్రలోకి కల్పిత పాత్రల్ని దూర్చడానికి చేసిన విఫల ప్రయత్నం అని తెలుస్తుంది.కానీ,"చరిత్రడక్కు,చెప్పిందిను!" అంటూ రావు గోపాల్రావు టైపులో ఎవడు అబద్ధం చెప్పినా నమ్మడానికి రెడీగా ఉన్నవాళ్ళకి మాత్రం ఇవి అబధ్ధాలు అని నమ్మడానికి ధైర్యం చాలదు.పోనివ్వండి,నేనిదంతా చెప్తున్నది హేతువుకీ కల్పనకీ తేడా తెలిసిన కామన్ సెన్సు ఉన్నవాళ్ళకి - మీకు.

వీళ్ళు కాలంలో ప్రాంతంలో ఉన్నారని సాక్ష్యం లేని జీవిత కధల్ని చరిత్ర పేరున బల్లగుద్ది చెప్తున్నారో కాలంలో ప్రాంతంలో "వాళ్ళు కాలంలో ప్రాంతంలో ఉన్నారనిసాక్ష్యం ఉన్న మహానుభావులు ఎందరో పుట్టారు, బతికారు, పోయారు.వాళ్ళందరికీ దొరుకుతున్న సాక్ష్యాలు వీళ్ళకి మాత్రమే దొరక్కపోవడానికి కారణం యేమిటి?

అయ్యర్లు రామానుజుడి శవాన్ని సృష్టికర్తని చేసి పూజలు చెయ్యటానికి ఒప్పుకోలేదు గనకనే అయ్యంగార్లు అనే ఒక కొత్త శాఖని ఏర్పాటు చేశారు - అయ్యర్లకీ అయ్యంగార్లకీ ఉన్న తేడాలు సున్నీలకీ షియాలకీ ప్రొటెస్టెంట్లకీ క్యాధలిక్కులకీ ఉన్న తేడాల మాదిరి ఉండటమే ఇది అబ్రహామిక్ మాతాల కాపీ అని చెప్పటానికి గట్టి సాక్ష్యం!అయ్యర్లు శృతికీ అయ్యంగార్లు ఆళ్వారులకీ సున్నీలు సున్నతుకీ షియాలు ఇమాములకీ ప్రొటెశ్టెంట్లు ఆచారాలకీ క్యాధలిక్కులు ప్రవక్తలకీ బానిసలు.

అయ్యంగార్లు వైష్ణవాన్ని ఫాలో అవుతారు గాబట్టి అయ్యర్లు అందరూ శైవులు అనుకోవడం కూడా తప్పే - అయ్యర్లు శివ,విష్ణు,శక్తి,సూర్య,గనేశ పంచాయతనం పేరున వైదిక సంస్కృతికి కట్టుబడి ఉంటారు.ఎక్కువ మంది శంకరుల అద్వైతం వైపుకి మొగ్గు చూపుతారు.పొరపాటున సైతం ద్వైతాన్ని సమర్ధించరు.స్మార్తులు అనేది వీళ్ళనే!

అయ్యంగార్లు కఠోరమైన శ్రీవైష్ణవాన్ని పాటించే విశిష్టాద్వైతులు.అయ్యర్లు తరించడానికి జ్ఞానం ముఖ్యం అంటే అయ్యంగార్లు తరించడానికి భక్తి ముఖ్యం అంటారు.అయ్యంగార్లు వేదం మా శాస్త్రం అంటారు గానీ రెండు పంచ లోహాల విగ్రహాల్ని రోజూ చింతపండేసి తోమితే మోక్షం వస్తుందని వేదం చెప్పింది వీళ్ళకి?

Jon Paul Sydnor అనే ప్రిన్స్టన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధక రచయిత తన Ramanuja and Schleiermacher - Toward a Constructive Comparative Theology అనే గ్రంధంలో Indeed, when Ramanuja uses the term “Veda,” he is most often referring to the upanisads. అని బల్లగుద్ది చెప్తున్నాడు.అంటే, వీళ్ళ మతసారం కొన్ని ఉపనిషత్తులకు కలుస్తుందే తప్ప సమ్హితా పాఠం వీళ్ళ చింతపండు తోముడు పిచ్చని సమర్ధించడం లేదు.ఉపనిషత్తులు కూడా వైదిక సాహిత్యమే కదా అనుకుని మోసపోతున్న అమాయక హిందువులు వైదిక సాహిత్యపు విభజన గురించి తెలుసుకోవాలి.

ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వ వేదం అనే వాటిని శృతి అంటే Revealed లేక Perceived అనీ మిగిలినవాటిని స్మృతి అంటే Memorizes లేక Created అనీ అంటారు.ఋగ్వేదం అనేది ఒక Collection of Prayers లాంటిది.యజుర్వేదం అంటే యజ్ఞాలకు సంబంధించిన Sacrificial Manual వలె ఉంటుంది.సామవేదం అనేది Rigvedic hymns in musical form అనేటట్లు ఉంటుంది.ఇక అధర్వవేదంలో మానవుల దైనందిన జీవితానికి ఉపయుక్తమైన Magical Charms ఉంటాయి.

ప్రతి వేదం మళ్ళీ నాలుగు ఉపవిభాగాల కింద ఏర్పరచబడి ఉంది:1).మంత్రసంహిత->ప్రధానమైన భాగం.ఋగ్వేదంలోని మంత్రాలను ఋక్కులు అంటారు. యజుర్వేదంలోని మంత్రాలను యజుస్సులు అంటారు.సామవేదంలోని మంత్రాలను సామలు అంటారు.అధర్వవేదంలోని మంత్రాలను అధర్వలు అంటారు - వీటిని అందరూ అధ్యయనం చెయ్యవచ్చు. ప్రస్తుతం మన తెలుగువాళ్ళకి సంస్కృతం కన్న తెలుగు కన్న ఇంగ్లీషు ఎక్కువ అర్ధం అవుతుంది గనక ఇంగ్లీషులో “A compilation of all realized hymns: This section should be the best focus for who is in Brahmacharya-ashrama, that is during the stage of education” అని చెప్తున్నాను. 2).బ్రాహ్మణములు->సంహితలలోని విషయానికి వ్యాఖ్యానములతోనూ కర్మకాండలకు సంబంధించిన వివరాలతోనూ కూడుకున్న వచనభాగం.ఇంగ్లీషులో “Explanations of how to put them to practical use: This section should be the best focus for who is in Grihastha-ashrama, that is during the stage of householder” అని చెప్తున్నాను.వీటిని సంహితను అధ్యయనం చేసిన తర్వాత మరింత తెలుసుకోవాలనే ఆసక్తి గలవారికి బోధిస్తారు.3).అరణ్యకములు->ప్రతి వేదమంత్రానికీ సామాన్య అర్ధం,సాంకేతిక విశేషం,ఆధ్యాత్మిక సంబంధం అనే పాఠాంతరాలు ఉంటాయి గనుక వాటిమధ్యన సమన్వయం ఎలా చెప్పుకోవాలో సూచించే వచనం.ఇంగ్లీషులో “Various internal observations to follow: This section should be the best focus for who is in Vaanaprastha-ashrama, that is during the stage of renounceation” అని చెప్తున్నాను.నాగరికులకూ లౌకికులకూ ఇవి అనవసరం గనక ఆచార్యత్వాన్ని  ఇష్టపడినవారికి బోధిస్తారు.4).ఉపనిషత్తులు-> ఇంగ్లీషులో “Footnotes which capture the essence of the entire veda: This section should be the best focus for who is in Sanyaasa-ashrama, that is during the final stage of before seeking/attaining moksha” అని చెప్తున్నాను.

సృష్టికర్త స్వయాన ద్రష్టలకు వ్యక్తం చేసినది సంహిత మాత్రమే కాబట్టి హిందువులకి అది ఒక్కటే పరమ ప్రమాణం అవుతుంది.ఉపనిషత్తులు మనుషులు సంకలించినవి.వాటికి వేదంతో సానుకూలత ఉందో లేదో తెలుసుకుని వేదంతో విభేదించని వాటిని మాత్రమే ప్రమాణం కింద తీసుకోవాలి.వీటికి వేద ప్రమాణం ఉందా లేదా అనేది తేల్చుకోవాలని అనుకున్న వాళ్ళు మొదట వేదం చదవాలి.

కానీ, రామానుజ మత సమర్ధకులు అలా చెప్పడం లేదు."మీరు  ద్వైత,విశిష్టాద్వైత మతాలు వేదాలకు అనుబంధంగా లేదని ఎలా చెబుతారు? వ్యాసుడి కన్నా భిన్నంగా మీరు కొత్తగా చెబుతూ,.ఆయనెవరికో చాలా knowledge ఉందని మీరు conclusion చేసుకున్నారు.పైగా రామానుజుల వారే తప్పుగా అర్ధంచేసుకుని ,(ఉపనిషత్తులను వేదంగా)వేదాపర్ధం చెప్పారని అభ్యంతరకరంగా చెప్పారు.వేదార్ధ సంగ్రహఅం రామానుజులు వేదం నుండే తీసుకుని వ్రాశారు.మీ దృష్టిలో ఉపనిషత్తుల స్థానమేమిటో?తెలియదు గానీ, వ్యాసుడూ,మరియూ ఇతర మహర్షులూ ,వాటిని వేదాలకు అర్ధం సరిగా చెప్పే వ్యాఖ్యానాలు గానే చెప్పి వాటిని ప్రమాణంగా చూపారు.ఇక మీరు బ్రహ్మసూత్రాలనూ,పురాణేతిహాసాలనూ, ఉపబృంహణాలనూ,సగ్ంహితలనూ.వేద వాజ్ఞ్మయంలో భాగంగా అంగీకరించరు కనుక, రామానుజులే అపార్ధం చెప్పినట్లు ,అనిపించటం సహజమే అయినా, దానిని వైదికులు మెచ్చఅరూ,అంగీకరించరు.ఇది ఎన్నటికీ తెగదు." అని మూర్ఖపు వాదనలను చేస్తున్నారు.

ఆయనెవరికో చాలా knowledge ఉందని మీరు conclusion చేసుకున్నారుఅనేది నేను Jon Paul Sydnor చేసిన రీసెర్చిని గురించి చేసిన ప్రస్తావన మీద వేసిన వ్యంగ్యం.జియ్యర్ స్వామి గారు రష్యా వెళ్ళి రష్యన్ భాషలో ఒక పాట పాడిన వీడియో చూశాను - మరి వేరే దేశం ఆయనెందుకు వెళ్ళాడు?మన దేశంలో యూనివర్సిటీలు పెట్టటానికి కొన్ని చట్టాలు ఉన్నాయి.నాగార్జున,ఆంధ్ర,కాకతీయ యూనివర్సితీలు చట్టబద్ధమైన గుర్తింపు ఉన్నవే కదా.ప్రిన్స్టన్ యూనివర్సిటీ కూడా ఇలాంటి చట్టాల ప్రకారం ఏర్పడిన యూనివర్సిటీయే.ఓక్ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ప్రొఫెసరు యూనివర్సిటీ తరపున చేసిన రీసెర్చికి విలువ ఇవ్వకపోవడం వాళ్ళ డొల్లతనాన్ని చూపిస్తుంది.

అదే Jon Paul Sydnor మరొక రీసెర్చి స్కాలర్ From Hagiographies to Biographies: Rāmānuja in Tradition and History అనే తలకట్టుతో పబ్లిష్ చేసిన పుస్తకానికి పరిచయం వ్రాస్తూ So who is the real Rāmānuja? Or is there even a real Rāmānuja whom historians can access with any reliability? అని అనకు ప్రశ్నలు వేస్తున్నాడు.2014 నాడు Oxford University Press నుంచి విడుదల అయిన పుస్తకానికి వ్రాస్తున్న ముందుమాటలో “Just as Westerners argue about JEPDH and Moses, the Jesus of history and the Christ of faith, so Indians may one day argue about the Rāmānuja of history and the Śrīrāmānujācārya of faith. Experience suggests this will be a passionate debate, and may even get ugly. Some religious communities do not appreciate challenges to their inherited certainty.” అని అనటం వల్ల శ్రీ వైష్ణవులు భగవంతుడి స్థాయి ఇచ్చిన శ్రీ రామానుజుల వారు యదార్ధ చరిత్ర లోని వాస్తవ వ్యక్తి అనడానికి గట్టి సాక్ష్యం లేదని తెలుస్తున్నది.

శివపరమైన దక్షిణామూర్తి స్తోత్రం చదవడానికి అహం అడ్డొచ్చి హయగ్రీవ స్తోత్రం అనేదాన్ని పుట్టించడమూ శివుడు విష్ణువుకి పాకీపనులు చేశాడని చెప్తున్న కధల్ని ప్రచారం చెయ్యడమూ వేదసమ్మతం ఎలా అవుతుంది?మొన్నటి సమతామూర్తి ఆవిష్కరణ విష్వక్సేన పూజతో మొదలవటం కాకతాళీయం కాదు.వాళ్ళ మాసపత్రికలో ఒక రచయిత ప్రస్తావన చెయ్యడం నేను చదివాను.ఒక కురాడు నాకు మెయిల్లో "మా తాతయ్యతో పెద్ద చావుగా ఉంది.శివాలయానికి వెళ్ళొస్తే శ్మశానానికి వెళ్ళొచ్చినట్టు మైలస్నానం చేసి గానీ ఇంట్లోకి రానివ్వడు!" అని తన బాధ చెప్పుకున్నాడు.

వేదం మీద భక్తి ఉన్నవాడు వేదం గురించి అబద్ధం చెప్పడు గద.రాజభటులు గురువు కోసం వస్తే గురువు గారిలా శిష్యుడు రాజసభలో శిక్షకి గురై చచ్చిపోతే వాళ్ళటు వెళ్ళగానే గురువు గారు పడవెక్కి అదివిలోకి పారిపోవటం అనే కూరనాధుడి ఖద లాంటి ఖదని నిన్న  గాక మొన్న కరుణాకార్ సుగ్గున చెప్తున్న బైబిలు పాఠాల్లో విన్నాను.రామానుజుడి వరకు అక్కర్లేదు, వీళ్ళు రామానుజుల మీద పగబటి వేధించాడని అమ్రిష్ పురిలా చిత్రించి వదిలిన క్రిమికంఠ చోళుదు అనే విష్ణుదేషి యైన శివభక్తుడు చరిత్రలో ఉన్నాడని నిరూపిస్తే చాలు - లక్ష డాలర్ల బహిమతి సిద్ధంగా ఉంది.

మనవాళ్లకి చరిత్ర తెలియదు,రాయలేదు,అందుకే సాక్ష్యాలు దొరక లేదు అని పిచ్చి మాటలు చెప్పకండి.జనమేజయుడికి శాసనాల సాక్ష్యం ఉంది.పరీక్షిత్తుకీ శాసనాల సాక్ష్యం ఉంది.కేవలం నాలుగూళ్ళనీ పదహారు వూళ్ళనీ పరిపాలించిన చిన్న చిన్న రాజులు సైతం తమ గురించి చెప్పుకుంటూ శాసనాలు వేయించుకున్నారు.మార్షల్ అండ్ విలియంస్ వచ్చి మనకి చరిత్ర అంటే ఏంటో నేర్పి బయటికి తీసేవరకు మనకి చరిత్రని నమోదు చెయ్యటం తెలియదని కమ్యూనిష్టు చరిత్రకారులు చెప్పారు - నమ్మినవాళ్ళు నమ్మారు.నమ్మని వాళ్ళు వెతికితే జనమేజయుడి శాసనాలూ దొరుకుతున్నాయి.ఇవ్వాళ మనం హైస్కూల్ పాఠాల్లో చదువుతున్న శాతవాహన రాజుల రాజుల పేర్లు పురాణాల నుంచి తీసుకుని శాసనాల సాక్ష్యం దొరికాకనే చరిత్రలోకి ఎక్కించారు.అబద్ధాలు చెప్పి మీలాంటివాళ్ళని నమ్మించగలరు గానీ మాలాంటివాళ్ళని నమ్మించడం మాత్రం అంత తేలిక కాదు.

వేదం చెప్పిన సత్యం ఒక్కటే హిందువులకి అనుసరణీయం.వేదం మీద శ్రద్ధ మాత్రమే హిందువుల్ని రక్షిస్తుంది.నేను హిందువుని అని గర్వించాలని అనుకున్న ఒక్కడూ వేదనింద చేస్తున్న రామానుజ మతాన్ని అనుసరించకూడదు, అభిమానించకూడదు, సమర్ధించకూడదనేది వ్యాసపరాశరాది చతుర్యుగపర్యంతం వ్యాపించిన ఆచార్యపరంపర పాదాల మీద ప్రమాణం చేసి మూడు కాలాలను ముడివేసి చూడగలిగిన నేను చెప్తున్న పరమసత్యం!ఏది సత్యమైనదో అదే శివమైనదీ అవుతుంది!ఏది శివమైనదో అదే సుందరమైనదీ అవుతుంది!

సత్యం శివం సుందరం!!!

No comments:

Post a Comment

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

శ్రమ దోపిడీ గురించి ముప్పాళ రంగనాయకమ్మ గారి లోతైన పరిశీలన బెత్తెడు లోతు కూడా లేదేంటీ!

ఎలక్టొరల్   బాండ్స్   గురించి   మార్చి  31 న  " సుప్రీం   కోర్టు   తీర్పు   సంస్కరణేనా ?" అని   లోక్   సత్తా   జయప్రకాశ్   ఒక   వ్...