Sunday, 27 June 2021

త్వరలో ఆంధ్ర తెలంగాణలో విలీనం అయిపోతుందా?ఈ అసమర్ధపు పరిపాలనలో అవమానాల పాలు కావడం కన్న ఆంధ్రకి అదే మంచిది!

ఔరా,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అందరికీ ఎంత చులకనైపోయింది!

రాయల సీమ ఎత్తిపోతల పధకాన్ని కొనసాగిస్తే ఏపీ సీయస్ జైలుకి వెళ్ళటం ఖాయం అని యన్జీటీ వార్నింగ్ ఇవ్వటం ఏంటి?అంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారి తండ్రిని పొరుగు రాష్ట్రం వాళ్ళు రాక్షసుడని తిట్టటం ఏంటి?కేవలం మాస్కుల గురించి అల్లరి చేసినందుకు ఒక డాక్టర్నీ కేవలం తనకి మంచి సలహాలు ఇస్తున్న ఒక యంపీనీ పోలీసు కుక్కల చేత కరిపించేటంత శౌర్య ప్రతాపాలు గల పౌరుషవంతుడైన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వినీ విననట్టు నటిస్తూ  మంత్రుల చేత చచ్చుపుచ్చు కబుర్లు చెప్పించటం ఏంటి!

ఇప్పటికీ పాస్పోర్టుల్ని అమ్ముకున్న కేసు నెత్తిమీద వేలాడుతున్న కేసీయారు లాంటి నేలబారువెధవని నెత్తి మీద మోస్తున్న తెలంగాణ వాళ్ళకి ఇంకొకళ్ళని తప్పుపట్టే అర్హత ఉందా?అంత సుదీర్ఘకాలం పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ప్రభుత్వంలో గులాబి కండువాలు వేసుకున్న మంత్రులలో నాలుగింట మూడోవంతు మంది రామారావు, చంద్రబాబు మంత్రివర్గాల్లో పచ్చకండువాలు వేసుకుని తిరిగిన వాళ్ళే ఉండటం అంటే ఏంటి?

అసలు వాళ్ళు గర్వంగా చెప్పుకుంటున్న తెలంగాన ఉద్యమం యొక్క నిజస్వరూపం ఇది:"ఒక వోటు, రెండు రాష్ట్రాలు!" అనే నినాదంతో అనుకుంటాను 1997లో మొదట BJP రాష్ట్ర శాఖ తెలంగాణ ఏర్పాటు కోసం తీర్మానం చేసింది.2000 సంవత్సరంలో తెలంగాణ ప్రాంతపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు Telangana Congress Legislators Forum అనే సంస్థను స్థాపించి దాని తరపున తమ పార్టీ అధ్యక్షురాలైన శ్రీమతి సోనియా గాంధీకి ఒక విజ్ఞాపన పత్రం సమర్పించారు.2001 ఏప్రిల్ 27 Kalvakuntla Chandrashekar Rao (KCR) గారు Deputy Speaker స్థానానికీ తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికీ రాజీనామా చేసి Telangana Rashtra Samithi (TRS) అనే సంస్థని స్థాపించారు.

అయితే, స్వతంత్ర తెలంగాణ ఆవిర్భావం తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు 1997లో మొదట తెలంగాణ ఏర్పాటు కోసం తీర్మానం చేసిన BJPకి చెవుల్లో పువ్వులు పెట్టి 2000 సంవత్సరంలో తెలంగాణ కోసం సంకల్పించిన కాంగ్రెసుకు సుంతీ చేసి 2001 మొదలు 2014 వరకు అంత భీకరమైన పోరాటం చేసిన TRSకి అత్తెసరు మెజార్టీ ఇవ్వడం వెనక ఉన్న రహస్యం ఏమిటి?2014లో కూడా లాభసాటి కాని దాని కోసం ఒకరు 1997లోనూ ఇంకొకరు 2000లోనూ మరొకరు 2001లోనూ ఎందుకు ప్రయత్నం చేశారు?తెలంగాణ ప్రజలలో ఉన్న న్యాయమైన అభివృద్ధి ఆకాంక్షలను నెరవేర్చటానికే అసమర్ధులైన వీళ్ళు తెలంగాణ ప్రజలలో లేని ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చటానికి అంత సమర్ధత ఎట్లా చూపించగలిగారు?

ఉద్యమ వీరులైన ఆందరి చరిత్రలూ ఒక్కలానే అఘోరించాయి, మచ్చుకు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి రాజకీయ ప్రయాణం కాంగ్రెసులోనే మొదలైంది. మెదక్కు శాఖలో చేరారు. ఎప్పుడు చేరారో కూడా తెలియడం లేదు.కాంగ్రెసులో ఉండి 1983 వరకు ఏమి గోగునార కట్టలు పీకినారో తెలియడం లేదు గానీ 1983లో రామారావు పెట్టిన తెలుగుదేశం పార్టీలో చేరి అనంతుల మదన్ మోహన్ మీద పోటీ చేసి ఓడిపోయారు.అయితే, తర్వాత కొంచెం కష్టపడి పార్టీలో ముందుకెళ్ళి 1987 మొదలు 1988 వరకు రామారావు మంత్రివర్గంలో Drought & Relief శాఖతో మంత్రి అయ్యారు.1990లో Medak, Nizamabad, Adilabad జిల్లాలకు తెలుగుదేశం పార్టీకి కన్వీనర్ అయ్యారు.1996లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో Transport minister అయ్యారు.2000 మొదలు 2001 వరకు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకి deputy speaker అయ్యారు.2001 April 27 Deputy Speaker స్థానానికీ తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికీ రాజీనామా చేసి Telangana Rashtra Samithi (TRS) అనే సంస్థని స్థాపించారు.

మహా ఘనత వహించిన కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి అధ్వర్యంలో నడిచిన తెలంగాణ ఉద్యమపు నీచత్వాన్ని తెలుసుకోవటానికి కొంచెం చరిత్ర చాలదూ!తను మంత్రిత్వం వెలగబెట్టిన కాలం నాడు జరిగిన అన్యాయం మీద తనే తిరగబడటం ఏమిటో అందులోని మోసం ఏమిటో ఇప్పటికీ తెలుసుకోలేని తెలంగాణ ప్రాంతపు మేధావుల అజ్ఞానం మీద నాకు జాలి వేస్తుంది.వాళ్ళ ఆజ్ఞానంతో ఇన్నేళ్ళూ వాళ్ళని వాళ్ళు సర్వనాశనం చేసుకున్నది చాలక వాళ్ళకన్న పదింతలు తెలివైనవాళ్ళైన ఆంధ్ర ప్రాంతపు ప్రజల్ని కూడా సర్వనాశనం చేశారు!

అసలు ఆంధ్రా నాయకులు తెలంగాణ వాళ్ళని దోచుకోవడం ఎలా కుదురుతుంది?దేశం మొత్తం మీద ఎలా ఎన్నికలు జరుగుతాయో తెలంగాణలోనూ ఆంధ్రాలోనూ అలాగే జరుగుతాయి కదా!తెలంగాణ ప్రాంతపు శాసనసభ్యుల్ని తెలంగాణ వోటర్లే ఎన్నుకుంటారు కదా!ఆంధ్రా ప్రాంతపు శాసనసభ్యుల్ని ఆంధ్రా వోటర్లే ఎన్నుకుంటారు కదా!తెలంగాణ ప్రాంతపు శాసనసభ్యులు ఆంధ్ర ప్రాంతపు అభివృద్ధి కోసం పనిచెయ్యరు కదా!ఆంధ్రా ప్రాంతపు శాసనసభ్యులు తెలంగాణ ప్రాంతపు అభివృద్ధి కోసం పనిచెయ్యరు కదా!తెలంగాణ ప్రాంతపు శాసనసభ్యులు ఆంధ్ర ప్రాంతపు అభివృద్ధిని అడ్డుకోలేరు కదా!ఆంధ్రా ప్రాంతపు శాసనసభ్యులు తెలంగాణ ప్రాంతపు అభివృద్ధిని అడ్డుకోలేరు కదా!

1968 నాటి చెన్నారెడ్డి గారూ 2001 నాటి కేసీయార్ గారూ ఒకేలాంటి కబుర్లు చెప్పారు, రెండుసార్లూ తెలంగాణ ప్రజలూ మేధావులూ ఒకే రకం పిచ్చితనాన్ని ప్రదర్శించారు,పైన ఆంధ్ర ప్రాంతపు నాయకుల్ని దొంగలనీ దోపిడీదార్లనీ తిడుతున్నారు.

మర్రి చెన్నారెడ్డి మంత్రిత్వం వెలగబెట్టిన కాలం నాడు జరిగిన అన్యాయం మీద మర్రి చెన్నారెడ్డియే తిరగబడటం ఏమిటో, కల్వకుంట్ల చంద్రశేఖర రావు అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణకి జరిగిన ఘోరమైన అన్యాయాన్ని సరిదిద్దాలంటూ సమయంలో ప్రభుత్వంలోనే ఉండి అదీ అత్యంత కీలకమైన శాఖలను నిర్వహిస్తూ అన్యాయంలో భాగస్వామియైన కల్వకుంట్ల చంద్రశేఖర రావుయే ఉద్యమించడం ఏమిటో - అలాంటి డొంకతిరుగుడు బెదిరింపు తతంగాన్ని పట్టుకుని ఇవ్వాళ కొందరు తెలంగాణ ప్రజలూ మేధావులూ మాది 1968 నాటి నుంచి రగులుతున్న స్వాతంత్య్ర కాంక్ష అని బట్టలు చింపుకోవడం ఏమిటో - అస్సలు కామన్ సెన్సు కూడా ఉండదా!

ఇందులో నేను కల్పించి చెప్తున్న అబద్ధాలు ఏమున్నాయి? విధమైన సొంత పులుముడులూ లేని నిష్పక్షపాత బుద్ధితో చూపించిన నిజమైన చరిత్రలో తెలంగాణ ఉద్యమనేతలు గర్వించదగిన అంశాలు ఏమున్నాయి?

"లంకలో పుట్టినోళ్ళు అంతా రాక్షసులే, ఆంధ్రాలో పుట్టినోళ్ళు అందరూ దొంగలే" అని ఒక ప్రాంత ప్రజల మీద విషం కక్కిన మీరు అసలైన తెలంగాణ ద్రోహులు - ప్రపంచంలో కల్లా అత్యంత నీచాతినీచమైన నికృష్టపు రాజకీయం మీది!తెలంగాణ తెచ్చుకున్న తదాది అవినీతికి లాకులెత్తేసి అందిన కాడికి దోచుకోవటమూ అదేమని అడిగినవాడికి తెలంగాణ ద్రోహీ ఆంధ్రా దోపిడీదారుల తొత్తు అని ముద్ర వెయ్యటమూ తప్ప మీరు చేస్తున్న నిజమైన అభివృద్ధి ఏంటి?మమ్మల్ని దోచుకున్నారు,మా నీళ్ళు దోచుకున్నారు అని సాక్ష్యాలు లేని చిల్లర వాగుడు పన్న్నెండేళ్ళ పాటు వాగి ప్రత్యేక రాష్ట్రం ఏదో తెచ్చుకుని అఘోరించిన పదేళ్ళ తర్వాత కూడా మీ ముండమోపి నిర్వాకాలకి మీ జనం మిమ్మల్ని నిలదీస్తుంటే మళ్ళీ మా ప్రాంతం మీదా మా నాయకుల మీదా పడి యేడవటానికి తయారయ్యారు - ఛీ, వెధవ సంతని వెధవ సంత!

ఇవ్వాళ్టికీ తెలంగాణలో ఉన్న చంద్రబాబుని పొగిడిన ప్రతి ఒక్కడినీ పచ్చ బానిస పేరు పెట్టి తిడుతూ తెలంగాణ ద్రోహి కింద లెక్కగట్టి రెచ్చిపోయేవాళ్ళు చంద్రబాబు తెలంగాణ ప్రాంతానికి చేసిన అన్యాయం ఏమిటో చెప్పగలరా?

1996 ఫిబ్రవరిలో మొదలు పెట్టిన "జన్మభూమి" మంచి కార్యక్రమమే.ఇందులో స్థానిక పరిపాలనకు సంబంధించిన అంశాలలో ప్రజలని ఇన్వాల్వ్ చెయ్యడం చక్కటి ఆలోచన.1997 సంవత్సరంలో మొదలు పెట్టిన "పచ్చదనం-పరిశుభ్రత" కూడా మంచి కార్యక్రమమే.ముఖ్యమైన అన్ని ఉత్పత్తి రంగాలకీ "self help groups(SHG)" ఏర్పాటు చేసి ప్రోత్సహించడం కూడా బాగుంది.రైతు బజారు, డ్వాక్రా అనేవి కూడా మంచి ఐడియాలే.

1995-1996 నాడు మూసివేతకి దగ్గరైన సింగరేణి కాలరీస్ సంస్థని లాభాల బాట పట్టించి దాని పరువు నిలబెట్టాడు!స్వర్ణాంధ్ర ప్రదేశ్ అన్నాడు!మొట్ట మొదటి సారి తన స్వంత ప్రజ్ఞని మాత్రమే చూపించి కేంద్రం పూచీకత్తు లేని Rs 2,200 Cr ఋణాన్ని World Bank నుంచి తెచ్చాడు!

1992-1994 నాటికి నష్టాల్లోనూ లోటులోనూ ప్రావీణ్యాత్లోనూ అధమ స్థాయికి చేరి కునారిల్లుతున్న Andhra Pradesh State Electricity Board (APSEB) సంస్థని కేవలం అయిదేళ్ళు గడిచేసరికి cost and quality విషయాల్లో world class స్థాయికి చేర్చాడు!

1998 నవంబర్ నాడు అటల్ బిహారీ వాజపేయి చేతుల మీద HITEC Cityకి అంకురార్పణ చేసి పెంచి పెద్ద చేసి ఇప్పటికీ హైదరాబాద్ నగరానికి సాటిలేని landmark కింద నిలబెట్టాడు!

1999లో హైదరాబాదు నగరానికి Pharma City/Genome Valley అనే మరొక అద్భుతాన్ని అందించాడు!2001లో "ఈసేవ-మీసేవ" అన్నాడు!2003లో అప్పటి వరకు విడి విడి రవాణా వ్యవస్థలైన రైళ్ళనీ బస్సుల్నీ కలుపుతూ హైదరాబాదు నగరానికి multi-modal transport system (MMTS) విధానం ఏర్పాటు చేశాడు.

సా. 2000 నాడు Bill Clinton, Tony Blair చంద్రబాబును కలవడానికి హైదరాబాదు వచ్చారు - ప్రపంచ స్థాయి సర్క్యులేషన్ ఉన్న Time పత్రిక "In just five years, he has turned an impoverished, rural backwater place into India's new information-technology hub" అని మెచ్చుకుని South Asian of the Year అని ప్రశంసించింది.

అదివరకు దేశంలో టూరిజం అంటే పాత కాలంలో గుడి గోపురాలు తిరగటానికి చేసే తీర్ధయాత్రల లాంటి యవ్వారం అనుకునేవాళ్ళు తప్ప అందులో సంపాదన ఏముంటుందీ అనుకునే స్థితి నుంచి దేశంలోకి వచ్చే విదేశీ యాత్రికుల్లో 24 శాతం మంది ఆంధ్రాకి వచ్చేలా చేశాడు.అలాంటివి నేను గానీ ఈల గానీ వేస్తే అన్నట్టు సొల్లు కబుర్లు చెప్పే జగనూ కేసీయారూ మోదీ చెయ్యలేరు, చెయ్యరు, చెయ్యాలని అనుకోరు కూడా!

ఈలలు వేస్తే రావడానికి ఫారిన్ టూరిస్టులూ అమెరికన్ ప్రెసిడెంటూ బ్రిటన్ ప్రధానీ పిచ్చోళ్ళా - విమాన ప్రయాణం దగ్గిర్నుంచి బస్సు ప్రయాణం వరకు గల అన్ని సౌకర్యాల్నీ మెరుగు పర్చాకనే అది సాధ్యపడింది!2002 నాటికి ఆంధ్రా వైపుకి వచ్చేవీ ఆంధ్రా నుంచి వెళ్ళేవీ అయిన విమాన సర్వీసుల్లో 100% ఆక్యుపెన్సీ నమోదైంది.హోటళ్ళూ తదితర సౌకర్యాలతో కలుపుకున్న ఇండైరెక్ట్ మరియు డైరెక్ట్ ఎంప్లాయిమెంటు యొక్క రేంజి 37.7 లక్షలు.అప్పుడు వచ్చిన best tourism performing state అవార్డు ఇప్పుడు తెలంగాణ అధీనంలోనే ఉండి ఉండాలి!

అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ టూరిజం అనేది మెయిన్ స్ట్రీం పరిశ్రమ కాదు.టూరిజం అనేదాంట్లో ఇంత హడావిడి పెరగటానికి ముందే అన్ని మెయిన్ స్ట్రీం వ్యాపార పారిశ్రామిక రంగాల్లో పెరుగుదల కనిపించాకనే వేరేవాళ్ళు ఇటువైపుకు రావటం మొదలై టూరిజం పెరుగుతుంది అనేది తెలిస్తే చాలు చంద్రబాబు తెలంగాణకి ద్రోహం చేశాడు అనేది అబద్ధం అని తెలుస్తుంది.

తెలంగాణ శాసనసభ సాక్షిగానూ మీడియా ముందూ ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల తెలంగాణ అభివృద్ధి సూచికలు పెరగడం గురించి పగలబడి నవ్వుకుంటున్న కేసీయారుకి కనీసపు మానవత్వం ఉందా? నవ్వులకి వంత పాడుతున్న తెలంగాణ ప్రాంతపు కళాకారులకీ మేధావులకీ సిగ్గూ లజ్జా ఉన్నాయా?ఇవ్వాళ మీరు పగలబడి నవ్వుతున్నది ఎవరి మీద?ఒకనాడు తెలుగుదేశం పార్టీలో ఉండి మంత్రులైి కన్నబిడ్డల మాదిరి పరిపాలిస్తామని ప్రమాణం చేసిన 24 జిల్లాల ప్రజలలో ఒక పదమూడు జిల్లాల వాళ్ళు అన్యాయమై పోతుంటే అది మీరు సాధించిన ఘనకార్యం అని విరగబడి నవ్వటం రకమైన సంస్కారంరా పరనిందార్భక లుంఠాతిలుంఠలూ!పదిహేనేళ్ళ క్రితం వేసిన పచ్చ కండువా చింపేసి నిన్నగాక మొన్న గులాబి కండువా వెయ్యగానే ఆనాడు సమైక్యాంధ్ర మంత్రివరగంలో ఉండి తెలంగాణకి ద్రోహం చేసిన మీరే కండువా రంగు మార్చగానే తెలంగాణ ఉద్ధర్తలు అయిపోయారా!

ఇప్పటి ఆంధ్ర రాష్ట్రపు వాస్తవ పరిస్థితి ఏంటంటే, తెలంగాణని మాంధాత చక్రవర్తిలా ఏలుతున్న కేసీయారుకి తెలంగాణ నుంచి చేసిన అతని తెరవెనక చాణక్యపు సాయంతో ఆంధ్రాలో 151/175 సీట్లు గెల్చుకున్న జగన్మోహన రెడ్డి  సామంత రాజు అయిపోయాడు.(మన రాష్ట్రం పరువుకి సంబంధించిన విషయం కాబట్టి అలా గ్రాంధికం వాడి చెప్పాను గానీ అచ్చ తెలుగులో చెప్పాలనుకున్న మనసులోని మాట ఏంటో తెలుసా - "చెప్పులు నాకుతున్న పెంపుడు కుక్క",అవును!)

చంద్రబాబు హయాంలో ఆంధ్రకు వచ్చి సెటిలయిన కంపెనీలు జగన్మోహన రెడ్డి హయాంలో తెలంగాణ వైపుకి తరలిపోవడం ఏంటి?త్వరలో ఆంధ్ర తెలంగాణలో విలీనం అయిపోతుందా? అసమర్ధపు పరిపాలనలో అవమానాల పాలు కావడం కన్న ఆంధ్రకి అదే మంచిది.

జై శ్రీ రాం!

No comments:

Post a Comment

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...