Tuesday, 26 May 2020

వలసకాండలో జరిగినది జంతుబలియా!నరబలియా?

"అర్ధరాత్రి పూట యహోవా విజృంభించి ఐగుప్తీయుల ప్రతి ఇంటి పెద్ద కొడుకునీ చంపేశాడు - ఫారో పెద్ద కొడుకు దగ్గిర్నుంచీ సామాన్య ఐగుప్తీయుల వరకు ప్రతి ఇంటి పెద్ద కొడుకునీ ఒక్కణ్ణి కూడా వదలలేదు, వాళ్ళ పశువుల మొదటి చూలు దూడలకీ చావు మూడింది!అంత భీబత్సం చూశాక కూడా నిబ్బరం చూపించగలిగిన మానవత్వం గల మనిషి ఎవడూ ఉండడు కదా - ఫారో అన్నదమ్ముల్ని పిలిచి “Up! Leave my people, you and the Israelites! Go, worship the Lord as you have requested. Take your flocks and herds, as you have said, and go. And also bless me.” అని చేతులెత్తేశాడు, పాపం!" అని క్రిందటి భాగంలో చెప్పినది అంత తక్కువ సమయంలొ ముగిసిపోలేదు. కల్పిత కధా సాహిత్యంలోని ఒక సన్నివేశమైన అక్కడ బైబిలు రచయితలు తమకు ధర్మశాస్త్రం ఇచ్చిన మోషే మరియు వారి ప్రధాన దైవమమైన ఊహోవా కలిసి జరిపించారని అంటున్న భీబత్సమూ దుర్మారమూ వాస్తవ ప్రపంచ చరిత్రలో కూడా నియంతా కనీసం వూహించను కూడా వూహించలేదేమో అనిపిస్తుంది!
Exodus 12 - New International Version (NIV) ప్రకారం వాళ్ళ ద్యాముడు ఇక తాను తన మహిమను చూపించి వాళ్ళకి ప్రసాదించబోయే శుభసందర్భాన్ని పురస్కరించుకుని ఒక ఉత్సవం చేసుకోమన్నాడు - అంతే కాదు, ప్రతి సంవత్సరం రోజును ఇలాగే జరుపుకోమని నొక్కి చెప్పాడు.అది ఇది:"This month is to be for you the first month, the first month of your year. Tell the whole community of Israel that on the tenth day of this month each man is to take a lamb[a] for his family, one for each household. If any household is too small for a whole lamb, they must share one with their nearest neighbor, having taken into account the number of people there are. You are to determine the amount of lamb needed in accordance with what each person will eat. The animals you choose must be year-old males without defect, and you may take them from the sheep or the goats. Take care of them until the fourteenth day of the month, when all the members of the community of Israel must slaughter them at twilight. Then they are to take some of the blood and put it on the sides and tops of the doorframes of the houses where they eat the lambs. That same night they are to eat the meat roasted over the fire, along with bitter herbs, and bread made without yeast. Do not eat the meat raw or boiled in water, but roast it over a fire—with the head, legs and internal organs. Do not leave any of it till morning; if some is left till morning, you must burn it. This is how you are to eat it: with your cloak tucked into your belt, your sandals on your feet and your staff in your hand. Eat it in haste; it is the Lord’s Passover." - ఎంకి పెళ్ళి సుబ్బి చావుకి వచ్చింది అంటే ఇది కాదూ!బానిసత్వం నుంచి స్వతంత్రతకు ప్రయాణించడం అనే వీళ్ళ ఆనందం కోసం జంతువులు హృదయవిదారకంగా ఏడుస్తూ గిలగిల తన్నుకుని చావడమా?
మనిషికి ఆకలి వేసినప్పుడు మాంసం తినడం తప్పు కాదు, కానీ సకలలోకసృష్టికర్త తన సృష్టి అయిన మనిషికి తన సృష్టి అయిన జంతువుల్ని చంపి తిని ఆనందించమని చెప్పడమే కాక తప్పనిసరి తంతును చేసి ప్రోత్సహించడం ఎంత ఘోరం!
తర్వాత తరాలు శుభదినాన్ని గుర్తుంచుకోవడానికి విందును మాత్రమే చేస్తున్నారు గానీ రోజున రోము నగరంలో రక్తం కార్చే విందును ఏర్పాటు చేసింది కేవలం ఆనందానికి కాదు.దానికి ఉన్న అసలైన ప్రయోజనం యహోవా-మోషే ద్వయం ఈజిప్షియనుల మీద చీకటి మాటున సాగించాలనుకున్న మారణకాండకి స్వజనం బలి కాకుండా జాగ్రత్తలు తీసుకోవటం.Exodus 12 - New International Version (NIV) ప్రకారం మోషే ఇశ్రాయేలీయులలో పెద్దల్ని ఒకచోట చేర్చి "“Go at once and select the animals for your families and slaughter the Passover lamb. Take a bunch of hyssop, dip it into the blood in the basin and put some of the blood on the top and on both sides of the doorframe. None of you shall go out of the door of your house until morning. When the Lord goes through the land to strike down the Egyptians, he will see the blood on the top and sides of the doorframe and will pass over that doorway, and he will not permit the destroyer to enter your houses and strike you down." అని చెప్పాడు.దీని అర్ధం ఏమిటో మీకు తెలుస్తున్నది కదూ! రాత్రి అక్కడ ఈజిప్షియన్ల ప్రధమ సంతానాల్ని చంపింది యహోవా కాదు, మోషేయే తన మనుషులతో కలిసి చీకటి మాటున వూచకోత కోసేశాడు! భీబత్సం చేసేదీ చేస్తున్నదీ చేసిందీ యహోవా అని చెప్పడం పచ్చి మోసం - గుర్తులు మనుషులైన మోషే అనుచరులకి గుర్తులు అవసరం గానీ సకలలోకసృష్టికర్త యహోవాకి అవసరమా!ఎవరు ఈజిప్షియన్లో ఎవరు ఇశ్రాయేలీలో పోల్చుకోలేనంత అజ్ఞానియా యహోవా?
అంత భీబత్సం చూశాక కూడా నిబ్బరం చూపించగలిగిన మానవత్వం గల మనిషి ఎవడూ ఉండడు కదా - ఫారో అన్నదమ్ముల్ని పిలిచి “Up! Leave my people, you and the Israelites! Go, worship the Lord as you have requested. Take your flocks and herds, as you have said, and go. And also bless me.” అని చేతులెత్తేశాడు, పాపం! మొగుణ్ణి కొట్టి మొగసాలకు యెక్కినట్టు ఉన్న సన్నివేశం చరిత్రలో చాలాసార్లు జరిగింది - మచ్చుకు చూడాలంటే 1946, ఆగస్టు 14 కలకత్తాలో జరిగిన Direct Action Day నాటి హిందువుల వూచకోతని గుర్తుకు చేసుకోండి.ప్రత్యేకించి తెలుగువాళ్ళకి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉండనే ఉంది.
అన్ని సార్లూ ఆయా భీబత్సాలకి ముందు వలసకాండ జగన్నాటకం మొత్తం అవే రకం పాత్రలతో అదే రకం దృశ్యాలతో నడిచింది - అయినా క్లైమాక్సును ఎవరూ ఆపలేకపోయారు, నరబలిని గానీ ఘోరకలిని గానీ తప్పించలేకపోయారు:
పేరిందేవి!

విభుని కూడనైన కూడకయే విధవ యయ్యె!!
తనవారి రాజ్యకాంక్షకు తన మాంగల్యమే బలియయ్యె!!!
వయసుకు చిన్నదైనా ఒక్క కన్నీటిబొట్టు రాల్చలేదు.
పినతండ్రిని వరుసతో పిల్చి మరీ తిట్టింది,
చీరెసారె లివ్వాల్సిన చేతితోనే ముండకోకనూ ఇవ్వమని ఆడిగింది!
అంతటి నలగాముడూ సిగ్గుపడి మొగం దించుకుని నిలుచుండేటట్లు చేసింది.

"నువు విధవ్వి, దీపాలార్పడమే తెల్సు నీకు!
దీపమెట్టేవేళ బిడ్డలు గల తల్లులు నిన్ను తలవరు - నన్ను తలుస్తారు,
నా ఉసురు తగిలి నీపేర్న నాల్గుమణుగుల నల్లపూసలు తెగుతాయి చూడు!"మన్న
బాలికావధువు శాపానికి నల్ల నాగులేరు గజగజలాడింది!
"నాయుడూ నీమూతికి మీసముంటే నా ముంజేతికి మీసముంది"
అని రోషం చూపించిన నాయకురాలు నాగమ్మ కూడా బిత్తరపోయంది,
సిగ్గుపడి సంధి కొడంబడింది
చిన్నారి పేరిందేవి ధాటిగల మాటలకు జడిసి!

అనపోతు చావువార్త విన్న బాలచంద్రునికి వెర్రిపుట్టి
సంధి చెడింది,నాల్గుమణుగుల నల్లపూసలు తెగినవి,
నల్ల నాగులేటి నీరెర్రబారింది!
   
కళ్ళుమూసుకుని తలిస్తే చాలు
కాటికి కాళ్ళు చాపుకున్నవాడికయినా కండల్ని పొంగించగలిగిన వీరాధివీరులు
తమను తామే చంపుకున్న తీరును చూసి భూతరాట్కంబమొకటే పకపక నవ్వింది!

నాపసాని ఏడుగడియల మంత్రిత్వం ఇంత చేసింది!
ఆపలేని బ్రహ్మనాయుని మంత్రాంగం యాడబోయింది?
నాయుడూ నాగాంబా సన్నాసులై బిలముల జొచ్చినారు.
కోటపేటలు అన్నీ మంటిగలిసి,,
అన్నదమ్ములు కూడ మింటికరిగి
రాజొక్కడు ఒంటిగ మిగిలినాడు!

అంతేరా, నాయనా!
ఆది జంగమదేవర ఢమరుకం మోగించినాక
నువ్వెంత?నీ తెలివెంత?నీ హజమెంత?
నీ వైభవాల మైకం,నీ స్థగిణీల మాంగల్యం,నీ కోటపేటల గట్టిదనం -
ఏదీ మిగలదు,అంతా భస్మమే!!

శివోహం!శివోహం!శివోహం!
Raja Ravi Prasad Moka "నువ్వింకా తెలివయిన వాడివనుకుని తెగ భయపడి చచ్చాను సుమా.....ఇది కదా కావలసింది.1. దేవుడు అడిగిన బలి ఇవ్వబడింది. అది నిజమే , అయినా ఫరో కు అన్నీ వివరం చెప్పాల్సిన అవసరమేం లేదు. మళ్ళీ వెనక్కి రాము అని చెప్పాల్సిన అవసరం లేదు కానీ, మళ్ళీ వెనక్కి వస్తాము అని కూడా చెప్పలేదు.2. మూడు రోజుల పర్మిషన్ అడగలేదు,మూడురోజుల ప్రయాణమంత దూరం వెళ్ళి బలి ఇవ్వాలి అని చెప్పారు. పోనివ్వ లేదు గనక అక్కడే ఇచ్చేసారు." అంటున్నప్పుడు అతని దృష్టిలో బలి వుంది?పండగ కోసం చంపిన గొర్రెల బలి అయితే జంతుబలి, కానీ అక్కడ అదొకటే జరగలేదు, ఈజిప్షియన్ల ప్రతి కుటుంబ్మలోని పెద్ద కొడుకూ చచ్చిపోవడం కూడా జరిగింది కాబట్టి అది నరబలి. కడుపులో ఇంత క్రూరత్వం పెట్టుకున్న వాళ్ళు మా దేవుడు కరుణామయుడు, మా అంత సున్నిత హృదయులు లేరు, మమ్మల్ని తిట్టే వాళ్ళకోసం కూడా ప్రార్ధించే జాలిగండె మాది అని డప్పు కొట్టుకోవటం చూస్తుంటే మీకు అసహ్యం వెయ్యడం లేదూ!
మన పరిమిత జ్ఞానానికి అర్ధం కాని ప్రతిదీ నిరర్ధకం అనుకోవడమే అజ్ఞానంతో కూడీన అహంకారానికి మొదటి గుర్తు.ఇవ్వాళ అర్ధం కానిది జ్ఞానం పెంచుకుంటే రేపు అర్ధం కావచ్చు - కానీ నాకు ఇప్పటికి తెలిసిందే సమస్తం, ఇంతకు మించి ఏదీ లేదు, ఉందంటే నువ్వు ఛాందసుడివీ మతోన్మాదివీ అనేవాళ్ళు అత్యంత ప్రమాదకారులు.
నిజం చీర సింగారించే లోపు అబద్ధం వూరంతా చుట్టి వస్తుందన్నట్టు చెలరేగి పోతున్న ఈ బొంకుల దిబ్బలు వైదిక ధర్మం తన జడత్వాన్ని వదిలించుకుని ఒకే ఒక్క సారి పాంచజన్యం పూరించితే చాలు కకావికలై పారిపోతాయనేది సత్యధర్మన్యాయప్రతిష్ఠితమైన ఆచార్య పరంపర నుండి సంక్రమించిన మూడు కాలాలనూ ముడి వేసి చూడగలిగే జ్ఞానదృష్టితో నేను చెప్తున్న పరమ సత్యం!ఏది సత్యమైనదో అదే శివమైనదీ అవుతుంది!ఏది శివమైనదో అదే సుందరమైనదీ అవుతుంది!
సత్యం శివం సుందరం!!!

No comments:

Post a Comment

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...