Tuesday 19 May 2020

మోషేగారు ఇజ్రాయేలీల చేత చేయించిన మహావలస ఒక కట్టుకధ!

EXODUS అనేదానికి ఒక వంద సంవత్సరాల సుదీర్ఘ పరిశోధనల ఆనంతరం కూడా ఒక చిన్నపాటి గట్టి సాక్ష్యం దొరకలేదు!అది నేను చెప్పటం కాదు, 2001 ఏప్రిల్ 8 ఆదివారం ప్రార్ధనా సమావేశంలో Rabbi David Wolpe గారు కుండబద్దలు కొట్టేశారు.నేను తెలుగులోకి మారిస్తే Raja Ravi Prasad Moka లాంటి వెర్రి క్రైస్తవ గొర్రె "ఇవి కూడా ఏవో పుస్తకాల్లోంచే సేకరిస్తావ్. ! ఇవి నమ్మేస్తావ్, బైబిల్ నమ్మవు. ఎందుకంటే బైబిల్ నమ్మకూడదని ముందే ప్రిపేర్ అయి ఉన్నావు. బైబిల్ కు వ్యతిరేకం గా ఏదైనా ఉంటే ( ఆధారాలు అవసరం లేదు) నమ్మడానికి సిద్దపడి ఉన్నావ్. కనుక నువ్వు సత్యం గ్రహించే స్థితిలో లేవు, నువ్వేది నమ్మాలని అనుకుంటావో దాన్నే నమ్ముతావు.నిన్ను నువ్వే మోసం చేసుకుంటూ." అనే ప్రమాదం ఉంది కాబట్టి ఆయన మాటల్నే ఇక్కడ చూపిస్తాను - "The truth is that virtually every modern archeologist who has investigated the story of the Exodus, with very few exceptions, agrees that the way the Bible describes the Exodus is not the way it happened, if it happened at all."
వార్తకే ఉసూరు మంటే, William Dever అనే University of Arizonaకి చెందిన Near Eastern archeology, anthropology వంటి వైజ్ఞానిక శాఖలలో professor హోదా వున్న వ్యక్తి “Scholars have known these things for a long time, but we’ve broken the news very gently.” అని మహావలస యొక్క యదార్ధత గురించి సందేహాలు లేకుండా ఉండేటందుకు గానూ "మోషే గారి అధ్వర్యంలో మహావలస నిజంగా జరిగింది!" అనే అబద్ధపు శవపేటికకి ఆఖరి మేకు ఠపీమని దించేశాడు.అయితే, Bryant Wood లాంటి పరిశోధకులు మాత్రం కధని 1450 BC నాటికి వెనక్కి జరిప్తే గనక కొంత వరకు నిజం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు - ఏం ఖర్మరా ద్యాముడా!ఈయన పాపం Raja Ravi Prasad Moka లాంటి వెర్రి క్రైస్తవ గొర్రె మాదిరే బైబిలుని చిన్నబుచ్చడం ఇష్టం లేక భక్తితోనే అయినప్పటికీ తేదీని ఎనక్కి జరిపితే.. అని నసగడంలోనే బైబిలు EXODUS విషయంలో అబద్ధం చెప్పిందని ఒప్పుకోవటమే కదా - పాపం పాపం!
అసలు బైబిలు చరిత్ర కాకపోయినా సరే, అది అబద్ధాల పుట్ట అయినా సరే మేము నమ్ముతాం మీకేంటి నెప్పి అంటూ ఒక్క దెబ్బతో వాదనలకి తెర దించెయ్యొచ్చును కదా - అబ్బే, అలా కాదండి! Raja Ravi Prasad Moka అనే వెర్రి క్రైస్తవ గొర్రెనే తీసుకోండి - "నేను బయటి రీసెర్చ్ నమ్మనంటాను ఎందుకంటే బైబిల్ నమ్మకపోడానికి మీకెలాంటి రీజనింగ్ ఉందో రీసెర్చ్ నమ్మక పోడానికి నాకూ అలాంటి రీజనే ఉంటుంది" అని చరిత్రా రీసెర్చీ సైన్సూ నాకక్కర్లేదనీ అంటాడు, మళ్ళీ అదే నోటితో "బైబిలే హిస్టరీ బుక్. హిస్టరీ అంటే నీపేరూ నాపేరూ అన్ని కలిపి రాసెయ్యరు.ఆ కాలంలో ప్రఖ్యాతి గాంచిన వారు అది కూడా వారి దృస్ఝ్టికి , వారి పేర్లను ఎక్కిస్తారు." అంటూ బైబిలే ఒక చరిత్ర అని కూడా అంటాడు.నరం లేని నాలుకా సిగ్గొదిలేసిన లంజా సత్యం పట్ల నిష్ఠ లేనివాడూ ఎలా అయినా మాట్లాడతారు.
ఎంత ధైర్యంగా అన్నాడో చూడండి - "హిస్టరీ అంటే నిపేరూ నాపేరూ అన్ని కలిపి రాసెయ్యరు.ఆకాలంలో ప్రఖ్యాతి గాంచిన వారు అది కూడా వారి దృస్ఝ్టికి , వారి పేర్లను ఎక్కిస్తారు." అని! బుజ్జినాయనకి తెలియనిది ఏమిటంటే వీళ్ళు మోషే గారూ, మోషేని అడ్డుకున్న ఫారో ప్రభువూ,సరిగ్గా వలసకి ముందు చనిపోయిన యువరాజూ బతికి ఉండి మహావలస జరిగందని చెప్తున్న కాలపు చరిత్రకి ఇక్కడ ఈజిప్టులోనూ అక్కడ కనానులోనూ పక్కా రికార్డులు ఉన్నాయి, వాటిలోనే మోషేని అడ్డుకున్న ఫారో ప్రభువూ వలసకి ముందు చనిపోయిన యువరాజూ కనబడుతున్నారు గానీ - మోషే గారు మాత్రమే కనబడుట లేదు!వెతికి తెచ్చి అప్పగించిన వారికి గొప్ప బహుమానము కలదు.
"Moses తనయొక్క ప్రఖ్యాతమైన ముద్దుపేరును Palestine చేరుకున్న తర్వాత నుంచే వాడుకున్నాడు, అంతకు ముందరి అతని పేరు Osarsiph (Aauserre-Apopi)" అని 300 BCE నాటి Manetho అనే EGYPTIAN PRIEST AND HISTORIAN తేల్చి చెప్తున్నది ఎత్తి చూపించాక కూడా "మోజెస్ అని ఎవరూ హిస్టరీలో ఎవరూ లేరు అని అంటూనే లేని మోజెస్ ఇశ్రాయేలీయులకి అబద్దాలు చెప్పాడనీ ఐగుప్తీయుల నగలు దోపిడీ చేయించాడని ఎలా చెప్తున్నారు." అనీ "ఇది రీసెర్చా? డిస్టార్షన్ కాదా? స్పష్టంగా కనిపించే అసూయా ద్వేషాలు వక్రీకరణా కళ్ళముందే పెట్టి మళ్ళీ డీస్తోర్షన్ చేసానా అని అడుగుతున్నారు? మళ్ళ పెద్దమనీషి. అబద్దాలు నిస్సంకోచంగా ఆడొచ్చా? మోషే పేరు ఐగుప్తు రాణి పెట్టింది. ఆవిషయం కూడా బైబిల్ లో ఉంది." అనీ "ఇంకో ఆమె ఉంది, ఎస్తేరో ఏదొ పేరు మీ బ్రాహ్మలేలే. హిస్టరీలో కనబడలేదు అందుకే ఏసు లేడు అంటుంది. ఏం వాదనయ్యాది" అనీ అంటున్న Raja Ravi Prasad Moka అనే వెఱ్ఱి క్రైస్తవ గొఱ్ఱెని ఎవడు మేధావి అని లెక్కించి గౌరవిస్తాడు, మీరు చెప్పండి!
అసలు ఇక్కడ కులం గురించి ఎందుకు ఎత్తాడండీ వీడు?నేను వాణ్ణి తన కులం గురించి అడిగానా?తన కులాన్ని దూషించానా!ఏదో రొమ్ములు చరుచుకుంటున్నాడుగా నేను నీతిమంతుణ్ణి అని.ఏంటిది, ఆఁ!ఇతర్లని కులాల పేర్లు ఎత్తి అవమానించి పాపం చేసి "వేదం చదివినా బైబిల్ చదివినా ఖురాను చదివినా ఇంకే ధార్మిక గ్రంధం చదివినా యధార్థ హృదయంతో భక్తి విశ్వాసాలతో చదవాలి. అప్పుడు సత్య బోధ పడుతుంది, దైవ దర్శనం కలుగుతుంది. మీరేమో వేదాల్లో సైన్స్ ఉందనుకుని చదువుతారు.ఉంటుంది ఆమాత్రం అన్ని గ్రంధాల్లోనూ ఉంది. కాని ప్రధానంగా ఉన్నది దేవుని ప్రత్యక్షత. మన ఋషౌలు దేవుని గుర్తించడానికి తగిన ఆనవాళ్ళనూ ఆధారాలను రికార్డ్ చేసి మనకి ఇచ్చిన, భూలోకం నుంచి స్వర్గ లోకానికి దారి చూపే మేప్ అది. కానీ నేరుగా కాదు, పరమ పితను కనుగొనడానికి కాదు పరమ పుత్రుని దగ్గరకు దారి చూపిస్తుంది. పరమ పుత్రుడు మనల్ని పరమ పిత దగ్గరకు తీసుకు వెళ్తాడు." అని సొల్లు చెప్తే చాలు పాపప్రక్షాళన జరిగిపోయి నీతివంతుడు అయిపోతాడు కాబోలు. "అయినా నేను నీకోసం ప్రార్ధన చేస్తున్నాను. ఏదొక రోజు నీలో పరివర్తన కలగాలని, అప్పుడు నీ వేదం చదివి గ్రహైంచి ప్రభువైన యేసు నందు విశ్వాసముంచునట్లు మార్పు కలగాలని." అనే క్షమాగుణపు ప్రదర్శనకీ "( మీరు మమ్మల్ని దోచుకున్నట్టు, ఇప్పుడు మేము రిజర్వేషన్లు పొందేది కూడా దేవుని ప్రణాళిక , మీ తాతలు మాతాతల్ని దోచుకున్నారు, మేం రికవరీ చేస్తున్నాం)" అనే ప్రతీకార ప్రగల్భాలకీ పొంతన ఉందా? ఇతరుల క్రూరత్వానికి మా దేవుడు తనే బలి అయ్యాడు తప్ప మా దేవుడు ఇతర్లని చంపలేదు, మా దేవుడు కరుణామయుడు అని డప్పు కొట్టుకునేవాడు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి?వీళ్ళ ద్యాముడు అంత కరుణామయుడైతే ఇశ్రాయేలీలు కదిల్తే మెదిల్తే జంతుబలులు ఎందుకిచ్చారు?యెహ్వహే ద్యాముడే నాకు జంతుబలి కావాలని అడిగి ఇప్పించుకున్నాడేం!
నీతిమంతుడిలా పోజు కొడుతూ కులాల గురించి నోటికొచ్చినట్టు పేల్తున్నాడు.ఒళ్ళు దగ్గిర పెట్టుకోమంటే అంత కోపం వచ్చింది, కామెంటు వొళ్ళు దగ్గిరుంచుకునే రాశాడా? కామెంటుకు ముందు నేనెక్కడన్నా ఒక్క అమర్యాదకరమైన మాట వాడానా! వీడు నోటికొచ్చింది నువ్వు మాట్లాడినా నేను భరిస్తేనే వీడి దృష్టిలో మంచోణ్ణి అవుతానా?ఆరు వేల యేళ్ళకి వెనక ఎప్పటినుంచో ఉన్న వేదం మూడు వేల యేళ్ళ క్రితం రాసిన తోరా నుంచి కాపీ కొట్టినదని కూస్తూ నేను వేదాన్ని అవమానించడం లేదని అంటే సరిపోద్దా!వేదంలో మేఘవాహన అని వుంటే చాలు మా ఏసు మేఘాల మీద ఎక్కి రావడాన్ని చెప్తుంది మీ వేదం అనటం వక్రీకరణ కాదూ! మన వేదం గురంచి మనకి పాటాలు చెప్పడానికి వీడెవడండీ!వీడు మన వేదాన్ని వక్రీకరిస్తే మనము ఏమీ అనకూడదా?నేను వాళ్ళ బైబిలు గురించి చరిత్రలో ఉన్న నిజం చెబితే వక్రీకరణ అంటాడా - ఇది కాదూ కొవ్వెక్కిన వాగుడు!నాది వెలమ కులం.మరి, నేను బ్రాహ్మణ్ణని అంటున్నాడు - ఎట్లా తెలిసింది వీడికి? అసలు మా కులాల గురించి ఎందుకు ప్రస్తావించాడండీ!
నేను ఇక్కడ చెప్తున్నది క్రైస్తవమతం మొత్తం దుర్మార్గం అని కాదే!2001 ఏప్రిల్ 8 ఆదివారం ప్రార్ధనా సమావేశంలో Rabbi David Wolpe గారు కుండబద్దలు కొట్టేశారు అని చెప్పిన బ్లాగు పోష్టులోనే "Whatever the facts of the story, those core values have endured and inspired the world for more than three millenniums--and that, many say, is the point." అనేది కూడా ఉంది.నేనూ దాన్ని కాదనటం లేదు.అసలు బైబిలు చరిత్ర కాకపోయినా సరే, అది అబద్ధాల పుట్ట అయినా సరే మేము నమ్ముతాం మీకేంటి నెప్పి అంటూ ఒక్క దెబ్బతో వాదనలకి తెర దించెయ్యొచ్చును కదా అని చెప్పాను కదా, ఇంక ఇతనికి నెప్పి దేనికి?"The story of liberation from bondage into a promised land has inspired the haunting spirituals of African American slaves, the emancipation and civil rights movements, Latin America’s liberation theology, peasant revolts in Germany, nationalist struggles in South Africa, the American Revolution, even Leninist politics, according to Michael Walzer in the book 'Exodus and Revolution.'" అనేది కూడా నిజమేనని ఒప్పుకుంటున్నాను.అయితే, నిజానికీ అబద్ధానికీ తేడా తెలుసుకుని తీరాలి - 2001 ఏప్రిల్ 8 ఆదివారం ప్రార్ధనా సమావేశంలో Rabbi David Wolpe గారు “You do not serve God if you do not seek truth.” అనే మాట కూడా చెప్పారు.
నేను పోష్టులు రాస్తున్నది హిందువుల కోసం మాత్రమే!అతను నన్ను గురించి "నీ బ్రతుక్కి గ్రంధం చదవ్వూ, చదివింది అర్ధం చేసుకోవూ. నీదో బ్రతుకు." అంటున్నది సగం నిజమే!వీడి లాంటి వాళ్ళు బుర్రలోకి సారం ఎక్కకపోయినా భట్టీయం వేసయినా సరే నాలుగు పుస్తకాలు చదివి అక్కడో ముక్కా ఇక్కడో ముక్కా అయినా సరే ఎత్తుకొచ్చి చూపిస్తూ "వేదం చదివినా బైబిల్ చదివినా ఖురాను చదివినా ఇంకే ధార్మిక గ్రంధం చదివినా యధార్థ హృదయంతో భక్తి విశ్వాసాలతో చదవాలి……దైవ దర్శనం కలుగుతుంది.…….భూలోకం నుంచి స్వర్గ లోకానికి దారి చూపే మేప్ అది. కానీ నేరుగా కాదు…..పరమ పుత్రుడు మనల్ని పరమ పిత దగ్గరకు తీసుకు వెళ్తాడు." తరహాలో తనకే సగం అర్ధమయ్యీ సగం అర్ధం కాని సొల్లు అయినా సరే తడుముకోకుండా చెప్పగలుగుతున్నారు.మనం కొంచెం కూడా చెయ్యటం లేదు.మనలో చాలామంది బ్రాహ్మణులకే వేదంలో ఏముందో తెలియదు.పరశురాముడు 21 సార్లు పరవళ్ళు చుట్టి సమస్త భూమండలాన్నీ నిక్షత్రం చేసిన కధలోని తప్పుని ఇంతవరకు పండితుడూ గ్రహించలేకపోయాడంటే ఆశ్చర్యంగా వుంది నాకు!
బద్ధకాన్ని వదిలించడానికే నేను పోష్టుల్ని వేస్తున్నాను. మొదట నేను వేసుకున్న ప్లాను ప్రకారం పది పోష్టులూ పూర్తి చేసే తీరతాను.ఫేస్ బుక్ దగ్గిరకి నేను మధ్యనే వచ్చాను.నా హరికాలం బ్లాగు 2014 నుంచీ నడుస్తున్నది.అక్కడ చాలా కాలం క్రితం నుంచే హిందూమతం, క్రైస్తవమతం, మహమ్మదీయ మతం అనే మూడు మతాలను గురించీ ఎన్నో పోష్టులు వేశాను -  "ప్రియం బ్రూయాత్ సత్యం బ్రూయాత్, బ్రూయాత్ సత్యమప్రియం, ప్రియం నానృతం బ్రూయాత్ - ఏష ధర్మః సనాతనః" అనే సత్యవాక్యాన్ని ప్రతి పోష్టులోనూ పాటిస్తున్నాను.సంస్కార హీనులైన Raja Ravi Prasad Moka లాంటి వెర్రి క్రైస్తవ గొర్రెలు "అసలు బైబిలు చరిత్ర కాకపోయినా సరే, అది అబద్ధాల పుట్ట అయినా సరే మేము నమ్ముతాం" అని చెప్పేసుకుని మౌనంగా ఉండిపోతే మంచిది - ఉండక చెయ్యలిగిందీ లేదు. ఇంతవరకు హిందూమతద్వేషులతో వాదించిన హిందువుల కన్న నేను విభిన్నమైనవాణ్ణి!లాజిక్ ప్రకారం పాయింటు పడితే పంబ రేగిపోవాల్సిందే, ఎదటివాడు మళ్ళీ నోరెత్తడానికి వీల్లేదు - నావైపునుంచి నేను మర్యాదగానే ఉంటాను, అలాగే మీవైపునుంచి మాట తేడా వస్తే మాత్రం మీకు పదింతల రౌడీ భాష మాట్లాడతాను తప్ప వాళ్ళ పాపాన వాళ్ళే పోతారులే అని వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు.
అసలు, మహావలస గురించిన పరిశోధనలు కూడా చాలా లేటుగా మధ్యనే మొదలయ్యాయి.సుమారు యాభయ్యేళ్ళ క్రితం లేక ముప్పయ్యేళ్ళ క్రితం ఒక Christian seminary student వలస యొక్క యదార్ధతను గురించి ఒక పరిశోధనాపత్రం సమర్పించి A గ్రేడు సాధించే అవకాశం ఉండేది, కానీ ఈరోజు మాత్రం అఖండమేధావులైన రాక్షసపంతం గల పరిశోధకులకి కూడా అది సాధ్యం కాదు.Bryant Wood లాంటి పరిశోధకులు కూడా తమ వద్ద మహావలస జరిగిందనడానికి సాక్ష్యాలు ఉన్నాయని అనటమే తప్ప వాటితో సిద్ధాంత గ్రంధం ప్రచురించే సాహసం చెయ్యటం లేదు!
క్యామెడీ ఏంటంటే, Raja Ravi Prasad Moka అనబడు వెర్రి క్రైస్తవ గొర్రె "బైబిలు చదివితే సత్యం బోధపడుతుంది, రోగం నయమవుతుంది, బాగవుతావు!" అని నాకు ఉచితబోడిసలహాలు ఇస్తున్నాడు గానీ పరిశోధకులు రంగంలోకి దిగింది కూడా బైబిలు చదవడం వల్లనే!బైబిలు చదివారు, అనుమానాలు వచ్చాయి, పరిశోధించారు - బైబిలు మొత్తం బొంకుల దిబ్బ ఆని తేలిపోయింది. ఇప్పుడు వాళ్ళూ నేనూ బైబిలు చదవకుండా ఉండింటే ఎంత బావుండేది అని ఏడవాలి Raja Ravi Prasad Moka అనబడు వెర్రి క్రైస్తవ గొర్రె!
2001 సంవత్సరంలో Tel Aviv Universityకి సంబంధించిన Israel Finklestein అనే Israeli archeologist మరియు Neil Asher Silberman అనే archeological journalist కలిసి రచించిన “The Bible Unearthed,” గ్రంధంలో 1250 BCE నాడు జరిగిందని భావిస్తున్న మహావలస అనే మహత్తర కాల్పనికపౌరాణికచారిత్రకసాంఘీకజానపద కధనాన్ని సుమారు ఆరువందల సంవత్సరాల తర్వాత 7th century BC నాటి King Josia of Judah గారి కాలమున వారి పనుపున వండివార్చి పంచగ్రంధి వంటకమునందు ఇరికించుట జరిగినదేమోనని ఒక డౌటుబాంబు పేల్చారు!Herzog, Finklestein మాత్రమే గాక ఇతర పరిశోధకులు కూడా faulty logic దగ్గిర్నుంచి political agenda వరకు గల సమస్తాన్నీ బయటికి లాగి ఉతికి ఆరేశారు.
అతి చేస్తే గతి చెడుతుందని మన పెద్దలు వూరికే అనలేదు - బైబిలు వచనం చెప్పినట్టు వలస వెళ్ళిన జనసంఖ్యయే మొదటిసారి కొంచెం కామన్ సెన్సు వున్నవాళ్ళకి "ఛా!ఇది నిజమా?" అనిపించి భౌతిక సాక్ష్యాల కోసం వెతికేటట్టు చేసింది.”According to Numbers 1:46 the numbers of males capable of bearing arms was 603,550, meaning that, with their wives and children, the Israelites would have numbered over two million people.” హర్రె, ఇంతమంది నలభయ్యేళ్ళు అలోపొలో అంటూ రోడ్ల మీద నడిచిపోతుంటే ఒక్క వూరి వాళ్ళు కూడా బుగ్గలు నొక్కుకోకపోయినప్పటికీ కనీసం వాళ్ళలో వాళ్ళు విచిత్రంకింద కాకపోయినా మామూలు వార్తగా అయినా చెప్పుకోలేదా! సందేహం తీర్చుకోవడానికి వెతికిన పరిశోధకులకి “Yet, this huge number of people—who would have overwhelmed the Egyptians in Egypt by sheer weight of numbers—left no trace of their passage through the Sinai Desert.” అనే భయంకరమైన నిజం తెల్సింది!
ఇక రాజకీయ కోణం గురించి పరిశోధించినవాళ్ళలో Dever అనే మేధావికి ఈ వలసకాండ కధనం యొక్క రూపకల్పనకి to give an origin and history to a people and distinguish them from others by claiming a divine destiny అనే కుట్ర కనబడింది.ఆనాటి వలసకాండ కధనం ప్రపంచ చరిత్రలో ఎక్కడెక్కడ ఎన్నెన్నిసార్లు ఎలా పనిచేసిందో అర్ధం కావాలంటే ప్రాచీన శిలాయుగం నుంచీ భాష ప్రాతిపదికన ఏకమై ఉన్న తెలుగువాళ్ళని కేవలం రెండు దశాబ్దాలు గడిచేసరికి ఒకళ్ళనొకళ్ళు బూతులు తిట్టుకుంటూ విడిపోయేలా చెయ్యడానికి తెలంగాణ ప్రాంతీయాభిమానం ఎలా పనిచేసిందో అర్ధం చేసుకోవాలి.జనసంఖ్య గురించి అనుమానించి పరిశోధనలు మొదలుపెట్టిన ప్రతి పరిశోధకుడికీ తొలి దశలోనే వలసకి ముఖ్యకారణం అని బైబిలు చెప్తున్న ఇజ్రాయేలీయులకి అక్కణ్ణించి తప్పించుకుని స్వతంత్రజీవనం గడపటం కోసం అంగలార్చవలసిన స్థాయిలో ఈజిప్షియన్ల క్రూరత్వం లేదని రుజువు చేసే సాక్ష్యాలు దొరికాయి.మోషే గారు తన చేతికర్రని అటూ ఇటూ తిప్పీ పైకీ కిందకీ ఆడించీ రప్పించాడని చెప్తున్న ప్లేగులూ ఎర్రసముద్రం రెండుగా విచ్చుకున్న కాలిదారీ ఫారోసైన్యాన్ని చంపేసిన అగ్నిజ్వాలలూ  కూడా Raja Ravi Prasad Moka లాంటి శాడిస్టులు నమ్మి పులకించడానికి పనికొచ్చే కట్టుకధలే తప్ప వాస్తవాలు కావు.
వలస జరిగిందని అంటున్న బైబిలు కధనం నిజమా కాదా అనేది రుజువు చెయ్యడానికి ఉన్న ఒకే ఒక శాస్త్రీయమైన పద్ధతి బైబిలు కధనాలకి ఆర్కియాలజీ నుంచి భౌతికమైన సాక్ష్యాలూ సమకాలీనమైన ఇతరేతర సాహిత్య రూపాల నుంచి ప్రస్తావనలూ వెతకటం తప్ప మరోదారి లేదు. దారిలో వెళ్ళదలుచుకుంటే మోషే నాయకత్వంలో ఈజిప్టు నుంచి కనానుకు ఇజ్రాయేలీయులు వలస వెళ్ళటం అనేది జరగలేదు, జరగలేదు, జరగలేదు - అందులో ఎలాంటి అనుమానం లేదు!
ఇక Raja Ravi Prasad Moka లాంటి వెర్రి క్రైస్తవ గొర్రె "ఇవన్నీ బైబిల్ చదివి పరిశోధిస్తే తెలిసాయా? లేక బైబిల్ గురించి వేరొకళు వ్రాసిన వ్రతలు చదివితే తెలిశాయా?" అనీ "నువ్వింకా తెలివయిన వాడివనుకుని తెగ భయపడి చచ్చాను సుమా ! ఇంగ్లీషులో తెగ వాయించేస్తుంటే, ఇప్పుడు తెలుగులోకొచ్చేసరికి పాండిత్యం బయట పడింది. ఇది కదా కావలసింది." అనీ "తెలుగు బైబిల్ చదువు. తెలుగు సరిగ్గా అర్ధమై చావదనుకుంటే, ఇంగ్లీషు బైబిలైనా చదువు గాని ఏవోవో పుస్తకాలు చదివి టెక్స్ట్ లు పట్టుకొచ్చి పోస్టులు పెట్టకు. నువ్వే నవ్వులపాలవుతావు." అనీ రెచ్చగొట్టినందుకు ఇప్పుడు "The International Bible Society" వాళ్ళు New International Version (NIV) పేరున చూపిస్తున్న అధికారికమైన బైబిలు వచనాల నుంచే ఎత్తుకుని విశ్లేషిస్తాను."వరుస క్రమం లేదా, ఉందయ్యా సావీ, నీకర్ధం.కాలేదంతే! నీ అంత చదువు నాకు లేక పోయినా నీకంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు బైబిల్ నమ్ముతున్నారు. బైబిల్ లో ఆదికాండం అధ్యాయాలూ అన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి." అంటున్న అతని మాటలు అబద్ధమనీ అక్కడ ఏదీ కరెక్టుగా లేదనీ రుజువు చేస్తాను.
వలసకాండ Jacob తన కుటుంబంతో ఈజిప్టులో స్థిరపడిన ప్రస్తావనతో మొదలవుతుంది.కధా కాలానికి అతను గతించి కొన్ని తరాలు గడుస్తాయి.”7 but the Israelites were exceedingly fruitful; they multiplied greatly, increased in numbers and became so numerous that the land was filled with them.” అన్న వచనం వాళ్ళు రాజ్యంలో తామరతంపరై వృద్ధి చెందారని చెప్తుంది.కానీ, వాస్తవ చరిత్ర మాత్రం ఈజిప్టులో ఉండటం నిజమే గానీ అంత ఎక్కువ సంఖ్యలో ఉండటం అబద్ధమే అంటున్నది.కధా కాలం నాటికి ప్రభువైన ఫారో ఇజ్రాయేలీయులు సంఖ్యలో ఎక్కువ పెరిగారనీ వాళ్ళతో కఠినంగా వ్యవహరించి అణిచివెయ్యకపోతే వాళ్ళ సంఖ్య ఇంకా పెరిగి యుద్ధం వస్తే శత్రువుల పక్షాన చేరడమో మనకు వ్యతిరేకమై పోరాడటమో దేశం వదిలి  పోవడమో చేస్తారు అని అనుకున్నాడట.దాంతో వాళ్ళని అణిచివేసి వెట్టి చాకిరీ చేయించుకోవడానికి వాళ్ళ మీదకి slave masters అనే వర్గాన్ని ప్రయోగించాడట.కానీ వీళ్ళు అణిచేస్తున్న కొద్దీ వాళ్ళు మరింత ఎదిగిపోతున్నారట - ఇజ్రాయేలీయులు తారూ ఇటుకల మధ్యనా పొలాల్లోనూ వాళ్ళని వాళ్ళు మరింత కష్టపెట్టేసుకుంటున్నారట.
దాంతో ఫారోకి తిక్క రేగి పోయి Shiphrah, Puah అనే పేర్లు గల Hebrew midwives ముందు ఒక క్రూరమైన లక్ష్యం పెట్టాడట - delivery stool దగ్గిర పుట్టింది మగపిల్లవాడైతే చంపెయ్యమన్నాడట!కానీ దైవభీతి గల మంత్రసానులు మగపిల్లల్ని చంపలేదట! మంత్రసానుల మంచితనం వల్ల ఇజ్రాయేలీలు ఇంకా ఇంకా పెరిగిపోతూనే ఉన్నార్ట!తనకు భయపడి ఇజ్రాయేలీల్ని రక్షించినందుకు ద్యాముడు కూడా మంత్రసానుల్ని దయగా  చూశాడట!Why have you done this? Why have you let the boys live?” అని ఫారో మంత్రసానుల్ని అడిగితే వాళ్ళు “Hebrew women are not like Egyptian women; they are vigorous and give birth before the midwives arrive.” అని చెప్పారట!మగపిల్లలు పురిట్లోనే చావకపోవడం వల్ల ఫారో మరింత వుగ్రుడై “Every Hebrew boy that is born you must throw into the Nile, but let every girl live.” అని కొత్త శాసనం చేశాడంట!
ఇప్పుడు మోషే గారి జననం దగ్గిరకి వచ్చింది కధ.ఒక Levi జాతి పురుషుడూ ఒక Levi మహిళా దంపతులయ్యారు. మహిళ గర్భం ధరించి ప్రసవం అయ్యాక పుట్టిన మగ శిశువు అందమైనది కావటంతో మూడు నెలలు అష్ట కష్టాలు పడి అక్కడ దాచి ఇక్కడ దాచి ఆఖరికి భయం గల కోడి నడి బజారున గుడ్డు పెట్టినట్టు ఒక భూర్జపత్రపు బుట్టలో పెట్టి నైలునదిలో వదిలేసింది - ట!కన్నతల్లి పెట్టెని వదిలేసి ఇంటికి వెళ్ళిపోయింది గానీ శిశువు యొక్క అక్క మాత్రం శిశువు గతి ఏమవుతుందో తెలుసుకోవడానికి సస్పెన్స్ ధ్రిల్లర్ సినిమా చూస్తున్నట్టు కొంత దూరంలో నిలబడి ఉంది – ట!ఫారో ప్రభువు కూతురు నదీ స్నానానికి గట్టు మీద నడిచి వస్తూ రెల్లుపొదల మధ్యన వూగుతూ ఉన్న పెట్టెను తీసుకురమ్మని పరిచారికల్ని ఆదేశించింది – ట!పెట్టెని తెరిచి ఏడుస్తున్న శిశువును చూసి “This is one of the Hebrew babies,” అని జాలి పడింది – ట!వెంఠనే శిశువు యొక్క అక్క ఛెంగున ఫారో ప్రభువు కూతురు ముందుకు దూకి “Shall I go and get one of the Hebrew women to nurse the baby for you?” అని అరిచేసరికి ఫారో గారి కూతురు ఉలిక్కిపడి “Yes, go,” అనేసింది – ట!ఆ పిల్ల పోయి శిశువు యొక్క కన్నతల్లినే తీసుకొచ్చి యువరాణి ముందు దాదిగా నిలబెట్టింది - హబ్బబ్బ, ఏమి సెంటిమెంటు సార్?గుండెలు పిండేస్తున్నట్టు లేదూ - Raja Ravi Prasad Moka లాంటి వెర్రి క్రైస్తవ గొర్రె అయితే గ్యాలను కన్నీరు కార్చి వుంటాడు!ఫారో గారి కూతురు బిడ్డకి పాలిచ్చి పెంచితే డబ్బులిస్తానని వాగుదానం చేస్సేసింది - వార్నీ!పాలు మరిచిన వయస్సు వచ్చాక కన్నతల్లి ఉరఫ్ దాది తన బిడ్డని ఫారో కూతురు దగ్గిరకి తీసుకొచ్చింది  - “I drew him out of the water.” అని చెప్పి Moses అన్న పేరుతో దత్తప్త్రుడిగా స్వీకరించింది ఫారో యువరాణి.
మనోళ్ళు తల్లికి బిడ్డ బరువా అంటారు గానీ ఇక్కడ ఒక కన్నతల్లి తన బిడ్డకి పాలివ్వటానికి దాది వేషం కట్టి డబ్బు తీసుకుని పాలిచ్చి సాకి కాస్త ఆవసరమూ తీరగానే తల బరువును దించేసుకున్నట్టు దత్తు తీసుకున్న యువరాణికి అప్పగించేసి చేతులు దులుపుకునేసింది!నిజజీవితంలో జరిగితే హీనం కల్పితకధలో రచయిత సృష్టిస్తే నీచం అయిన ఇలాంటి విషయాల్ని నాలుగు మతాల వాళ్ళూ గొప్ప సన్నివేశం అన్నట్టు మురుసుకోవడం చూస్తుంటే వీళ్ళ మీద జాలియో అసహ్యమో కోపమో రావడం లేదు, ఇలాంటివాళ్ళతో కలిసి బతుకుతున్నందుకు భయంగా ఉంది నాకు!వాళ్ళ వల్ల నాకేదో హాని జరుగుతుందని కాదు, వాళ్ళు నా పక్కన తిరుగుతుంటే సహిస్తూ భరిస్తూ క్షమిస్తూ సహిస్తూ భరిస్తూ క్షమిస్తూ సహిస్తూ భరిస్తూ క్షమిస్తూ ఉంటే క్రమేణ క్షమాగుణం నుంచి వీళ్ళని ప్రేమించే వైపుకు అడుగులు పడుతూ ఒక రోజుకి నేనూ వాళ్ళలా మారిపోతానేమోనని నా భయం!
ఎందుకంటే, బైబిలు వచనం కొత్త రాజు యొక్క పాడుబుద్ధి కింద ఉటంకించిన “the Israelites have become far too numerous for us. 10 Come, we must deal shrewdly with them or they will become even more numerous and, if war breaks out, will join our enemies, fight against us and leave the country.” అనే చెత్త ఆలోచన మహామేధావీ నిరంకుశుడూ అయిన నరరూప రాక్షసుడికే కాదు, పరమ తెలివితక్కువ రాజు అని మనం బల్లగుద్ది చెప్పగలిగినవాడికి కూడా రావడానికి వీల్లేనిది. "ఇజ్రాయేలీయులు తారూ ఇటుకల మధ్యనా పొలాల్లోనూ వాళ్ళని వాళ్ళు మరింత కష్టపెట్టేసుకుంటున్నార"ని బైబిలే చెప్తుంటే అంత పిచ్చి ముండా కొడుకుల్ని అణిచెయ్యటానికి అంత హడావిడి అవసరమా, మీరే చెప్పండి!
వాస్తవ చరిత్రలో నియంతల జీవితాల్ని చూడండి, ప్రజలు తిరగబడ్డాకనే అణిచేశారు గానీ ముందెప్పుడో తిరగబడతారని చెప్పి వాళ్ళు రేపటి రోజున తిరగబడకుండా ఉండాలంటే మనం ఇవ్వేళ్టి రోజున అణిచెయ్యాలని పిచ్చ లాజిక్కులు చెప్తూ రెచ్చిపోయిన వాడు ఒక్కడూ లేడు!ప్రజల తిరుగుబాటుకు గురై నశించిపోయిన నియంతలు కూడా ముందునుంచే వాళ్ళలో ప్రజలు తిరగబడితే అణిచెయ్యాలనే ధోరణి ఉంటుంది గానీ వాళ్ళు తిరగబడకముందే అణిచెయ్యాలని అనుకున్న పిచ్చి ముండా కొడుకు మాత్రం ప్రపంచ చరిత్రలో ఒక్కడు కూడా లేడు, లేడు, లేడు - ఇది సత్యం!అదీ గాక రాజు మగపిల్లల్ని చంపమని పురమాయించినది ఈజిప్షియన్లకీ ఇజ్రాయేలీలకి అని తేడా లేకుండా అందరికీ పురుళ్ళు పోసే మంత్రసానులకి కాదు, వాళ్ళు Hebrew midwives అని బైబిలు వచనమే చెప్తున్నది.అప్పటి జనాభా నిష్పత్తిని గురించి కూడా బైబిలు వచనమే "they multiplied greatly, increased in numbers and became so numerous that the land was filled with them." అని చెప్తున్నప్పుడు తమ సాటి ఆడవాళ్ళకి అన్యాయం చేసిన తర్వాత వాళ్ళిద్దరూ బతికి బట్టకట్టగలిగిన పరిస్థితి ఉంటుందా?ఒకసారి మంత్రసానులు రాజు చెప్పాడని అలాంటి నీచమైన పని చేశాక సాటి ఇజ్రాయేలీయులు క్షమిస్తారా - కుక్కని కొట్టినట్టు తరిమి తరిమి కొట్టరూ! నిజంగా జరగడం కాదు, అలా జరిగందని గానీ మంత్రసానులు ఫారో రాజు మాట చెప్పినప్పుడు అదేమిటని అడగలేదనీ మారు మాట్లాడకుండా సమ్మతించారనీ కధలు చెప్పడం కూడా సమస్త ఇజ్రాయేలు జాతీయుల్నీ అవమానించడం కాదూ - బుద్ధీ జ్ఞానం ఉందా వీళ్ళకి అసలు! అదీ అక్కడొకడూ ఇక్కడొకడూ సంఖ్యకి తక్కువ ఉన్నప్పుడు కాదు, రాజ్యమంతటా వాళ్ళే నిండిపోయినంత ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు అలా ప్రవర్తించారంటే ఏమిటి దాని అర్ధం?
18 వాక్యంలో “Why have you done this? Why have you let the boys live?” అని మంత్రసానుల్ని గద్దించిన వాడూ 19 వాక్యంలో “Hebrew women are not like Egyptian women; they are vigorous and give birth before the midwives arrive.” అని మంత్రసానులు చెప్తే 22 వాక్యంలో “Every Hebrew boy that is born you must throw into the Nile, but let every girl live.” అని ఆజ్ఞలు జారీ చేసి Hebrew పట్ల మరింత క్రూరంగా ప్రవర్తించినవాడూ Hebrew మంత్రసానులకి మాత్రం హానీ చెయ్యకుండా వదిలేశాడట - అది వీళ్ళ ద్యాముడి మహత్యమట! మంత్రసానుల్ని వదిలేసే మంచి బుద్ది ఉన్నవాడు అసలు మగపిల్లల్ని పురిటి బల్ల దగ్గిర చంపమని చెప్పడు, మగపిల్లల్ని పురిటి బల్ల దగ్గిర చంపమని చెప్పిన చెడ్డ బుద్ది ఉన్నవాడు మంత్రసానుల్ని అలా వదిలెయ్యడు - ఈపాటి కామన్ సెన్సు కూడా లేనివాళ్ళు మాత్రమే బైబిలు కధనం యదార్ధమని నమ్ముతారు.
ఇక మోషే గారి పుట్టుకా దత్తతా గురించి చూస్తే మరింత నవ్వొస్తుంది - తండ్రి ఇంత క్రూరమైన వాడు అయితే కూతురు అంత సుకుమారమైనది కావటం సాధ్యమా? కొత్త రాజుకి  పాడుబుద్ధి వీళ్ళ మోషేగారికి లాగ మండుతున్న చెట్టు రూపంలో వాళ్ళ ద్యాముడు పుట్టించిన కొత్త మతంలా వచనం దగ్గిర మాత్రమే వీళ్ళు నాటకీయత కోసం పుట్టించిన బుద్ధియా?కాదూ కాకూడదే!వాస్తవ జీవితంలో వంశపారంపర్యమైన అధికారం సంక్రమింపజేసుకునే రాజవంశీయులకి చిన్నతనం నుంచీ  రాజనీతి, సభా సంప్రదాయం,పరిపాలనా శైలి, ఆర్ధిక నియంత్రణ వంటివాటిలో శిక్షణ ఇస్తారు. తండ్రి చదివిన గ్రంధాలే చదివి తండ్రి పాటించే రాజనీతినే వంటబట్టించుకున్న కూతురు తండ్రి “Every Hebrew boy that is born you must throw into the Nile, but let every girl live.” అని ఆజ్ఞలు జారీ చేశాడని తెలిశాక కూడా “This is one of the Hebrew babies,” అని గుర్తుపట్టేసిన తర్వాత బిడ్డని తను దత్తత తీసుకోవడం అంటే తండ్రిని ధిక్కరించే సాహసం చెయ్యడం - ఇలాంటివి కలలో తప్ప ఇలలో సాధ్యమా!
ఇక్కడ పేరు చెప్పకుండా Now a man of the tribe of Levi married a Levite woman అని చెప్పినప్పటికీ, మహిళకి పేరు ఉంది."Jochebed was a daughter of Levi and mother of Aaron, Miriam and Moses. She was the wife of Amram, as well as his aunt." అని బైబిలు ఉటంకించిన దాని ప్రకారం మోషే గారి తలిదండ్రులు కూడా incest అనబడు ఛండాలపు సంబంధముతో తరియించినట్లు తెలుస్తుంది!
నిజానికి ఈజిప్షియన్ రాజ కుటుంబాలలో ఆడవాళ్ళు కూడా శక్తివంతులూ ప్రాభవం గలవాళ్ళూ కావటం వల్ల రాజు చేతుల్లో చావాల్సిన ఇశ్రాయేలీ శిశువు ఫారోల యువాణి దత్తపుత్రుడు కావటం వల్ల  భావి కాలంలో రాజు కావటానికి కూడా అర్హత సంపాదించుకున్నాడు.ఆమె కూడా బిడ్డను తన తండ్రికి పరిచయం చేసి తన వారసుడి హోదాని ఇమ్మని అడిగినప్పుడు రాజు కూడా ఒప్పుకున్నాడు.అలా 40 సంవత్సరాల వయసు వచ్చేవరకు రాజకుటుంబంలోని సకల సౌఖ్యాలనూ అనుభవిస్తూనే అధికార దర్పాన్ని ప్రదర్శిస్తూనే son of the daughter of Pharaoh అని పిలిపించుకోవటాన్ని మాత్రం అసహ్యించుకునేవాడు!
40 సంవత్సరం మోజేసు జీవితంలో ఒక మలుపును తెచ్చ్గింది - "Now when the time of his 40th year was being fulfilled, it came into his heart to make an inspection of his brothers, the sons of Israel (Ac 7:23). Now it came about in those days, as Moses was becoming strong, that he went out to his brothers that he might look at the burdens they were bearing; and he caught sight of a certain Egyptian striking a certain Hebrew of his brothers. So he turned this way and that and saw there was nobody in sight. Then he struck the Egyptian down and hid him in the sand (...) Moses now got afraid and said: Surely the thing has become known! Subsequently Pharaoh got to hear of this thing, and he attempted to kill Moses; but Moses ran away from Pharaoh that he might dwell in the land of Madian; and he took a seat by a well (Ex 2:11, 15)" అలా శ్రీమంతుడైన సంబరాల రాంబాబు మళ్ళీ పాత బతుక్కి వచ్చేశాడు - మర్డరు చేసి పారిపోయిన బఠానీ మరో 40 యేళ్ళు ఎక్కడ గడిపాడో తెలియదు గానీ (1533-1493) BCE మధ్య కాలం అని చరిత్రకారులు గుర్తించిన జీవిత చరమాంకపు 40 యేళ్ళలోనే  అబ్రహామిక మతాల వారు ప్రపంచ చరిత్రలోనే అత్యంత ప్రభావశీలమైన సంఘటన కింద చెప్పుకుని వెర్రెక్కి పోతున్న EXODUS కధ నడిచింది!
బైబిలు వచనాల్లో వైరుధ్యాలు లేవనీ అంతా సరిగ్గానే ఉందనీ Raja Ravi Prasad Moka లాంటి వెర్రి క్రైస్తవ గొర్రె నొక్కి వక్కాణిస్తున్నప్పటికీ biblical chronology విషయంలో సాక్షాత్తూ వాటికన్ కూడా కప్పగంతులు వేస్తున్నది -  the Vatican's biblical scholars made Abraham enter into Canaan in 2138 BCE (Vigouroux: 1899, 737), while nowadays they say 1850 BCE (De Vaux:1986, 1805), హ్హహ్హహ్హహ్హ హ్హిహ్హిహ్హిహ్హి! అబ్రహాము గారు ఇప్పటికే కనాను 2138 BCEలో ఒకసారీ 1850 BCEలో ఒకసారీ రెండు సార్లు వెళ్ళాడట, మునుముందు ఇంకెన్ని సార్లు వెళ్తాడో ఏ క్రైస్తవుడు నిర్ధారించి చెప్పగలడు?సాల్లే వూరుకొండి సారూ -  మీరు మరీనూ, బహుశా వాళ్ళ సకలలోక సృష్టికర్త అయిన యెహ్వెహే ద్యాముడికే తెలియదు కాబోలు!
ఇక మహా ఘనత వహించిన అద్భుత సన్నివేశం గురించి అయితే 2100BC, 650BC మధ్యన ఎప్పుడు జరిగినట్టు నిర్ధారిస్తే అతికినట్టు ఉంటుందో తెలియక మల్లాగుల్లాలు పడుతున్నారు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన బైబ్లికల్ స్కాలర్సు అందరూ!అయితే, ఎర్ర సముద్రం దగ్గిర మోషే గారు వూపిన వంకర టింకర కొంకికర్ర నుంచి దూసుకొచ్చిన అగ్నిజ్వాలల్లో తగలబడిపోయాడని అనుకుంటున్న Seqenenre Taa అను వాస్తవ నామధేయం గల ఫారో ప్రభువు May 10, 1533 BCE మరణించినట్లు నిర్ధారణ అయ్యింది.ఆయన గారి శవం ఇప్పటికీ Cairo Museum సేకరించిన The Royal Mummies మధ్యన  CG 61051 నంబరు వేయించుకుని పడుక్కుని ఉంది.అయితే మోషే వూరు దాటుతున్నప్పుడు చూస్తూ వూరుకుని తీరిగ్గా వెంటాడి వేధించి ఎర్ర సముద్రం దగ్గిర కాలిపోయాడని చెప్పటానికి సాక్ష్యంగా ఈయన దేహం మీద కాలిన గాయాలు లేవు గానీ ఎవరో చితక్కొట్టి చంపేసినట్టు తీవ్రమైన గాయాల ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి!మోషేగారు వూరు దాటకముందే ఫారో ప్రభువు చూస్తూ వుండగానే నిలువునా కూలి చనిపోయాడని బైబిలు చెప్తున్న  Ahmose Sapaïr అనే Crown Prince సైతం May 10, 1533 BCE మరణించినట్లు నిర్ధారణ అయ్యింది.
మన పరిమిత జ్ఞానానికి అర్ధం కాని ప్రతిదీ నిరర్ధకం అనుకోవడమే అజ్ఞానంతో కూడీన అహంకారానికి మొదటి గుర్తు.ఇవ్వాళ అర్ధం కానిది జ్ఞానం పెంచుకుంటే రేపు అర్ధం కావచ్చు - కానీ నాకు ఇప్పటికి తెలిసిందే సమస్తం, ఇంతకు మించి ఏదీ లేదు, ఉందంటే నువ్వు ఛాందసుడివీ మతోన్మాదివీ అనేవాళ్ళు అత్యంత ప్రమాదకారులు.
నిజం చీర సింగారించే లోపు అబద్ధం వూరంతా చుట్టి వస్తుందన్నట్టు చెలరేగి పోతున్న ఈ బొంకుల దిబ్బలు వైదిక ధర్మం తన జడత్వాన్ని వదిలించుకుని ఒకే ఒక్క సారి పాంచజన్యం పూరించితే చాలు కకావికలై పారిపోతాయనేది సత్యధర్మన్యాయప్రతిష్ఠితమైన ఆచార్య పరంపర నుండి సంక్రమించిన మూడు కాలాలనూ ముడి వేసి చూడగలిగే జ్ఞానదృష్టితో నేను చెప్తున్న పరమ సత్యం!ఏది సత్యమైనదో అదే శివమైనదీ అవుతుంది!ఏది శివమైనదో అదే సుందరమైనదీ అవుతుంది!
సత్యం శివం సుందరం!!!

No comments:

Post a Comment

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

శ్రమ దోపిడీ గురించి ముప్పాళ రంగనాయకమ్మ గారి లోతైన పరిశీలన బెత్తెడు లోతు కూడా లేదేంటీ!

ఎలక్టొరల్   బాండ్స్   గురించి   మార్చి  31 న  " సుప్రీం   కోర్టు   తీర్పు   సంస్కరణేనా ?" అని   లోక్   సత్తా   జయప్రకాశ్   ఒక   వ్...