Sunday, 22 September 2019

భారత దేశపు రాజ్యాంగమే ఎందుకు కులాన్ని అంత తప్పనిసరి చేసింది?

ఒక మనిషి యొక్క అస్తిత్వాన్ని నిర్వచించి నిర్ధారించే అంశాలను వరసగా పేరిస్తే ఇలా ఉంటుంది - పేరు, లైంగికత, వృత్తి, భాష, ప్రాంతం, కుటుంబం, మతం, జాతీయత అనేవాటి తర్వాతే కులం అనేది వస్తుంది! చాలామంది దృష్టికి రాని ఒక వింత ఏమిటంటే భారత రాజ్యాంగం పౌరులలో ప్రతి ఒక్కడికీ ఈ అస్తిత్వాలలో దేనినైనా తన సొంత నిర్ణయంతో సొంత బాధ్యతతో మార్చుకునే అవకాశం కల్పించింది - అనుమతి పొంది మీ పేరును మీరు మార్చుకోవచ్చు, వైద్యప్రక్రియ ద్వారా లైంగికతని కూడా మార్చుకోవచ్చు, మీ ఇష్టమైనన్ని వృత్తుల్ని చేపట్టవచ్చు, ఏ భాషనైనా నేర్చుకుని జనాభా లెక్కల్లో మాతృభాషగా నమోదు చేసుకోవచ్చు, దేశం లోపల గానీ దేశం బయట గానీ ఏ ప్రాంతంలోనైనా స్థిరపడవచ్చు, విడాకులు తీసుకుని కుటుంబాన్ని మార్చుకోవచ్చు, నీ ఇష్టాన్ని బట్టి  తాత తండ్రుల నుంచి సంక్రమించే వారసత్వాన్ని కూడా మార్చుకోవచ్చు!
కానీ  మీ కులాన్ని మార్చుకుంటాంటే రాజ్యాంగం ఒప్పుకోదు!బ్రాహ్మడిగా పుడితే బ్రాహ్మడే, రెడ్డిగా పుడితే రెడ్డే - ఒక కులంలో పుట్టాక ఎంత గింజుకున్నా కులాన్ని మార్చుకోలేరు.మతం మారినా ఒప్పుకుంటుంది గానీ రాజ్యాంగం మీ కులాన్ని మార్చటానికి ఒప్పుకోదు!కులాంతర వివాహం చేసుకున్నా భార్య భర్త కులంలోకి వెళ్ళడమే జరిగేది, అది మామూలుగా జరుగుతున్నదే కదా. ఇలాంటి ఎడ్జెస్టుమెంట్లు లేకుండా సరాసరి ఒక వ్యక్తి తన పేరును మార్చుకున్నట్టు కులాన్ని మార్చుకోవటానికి అనుమతి ఇస్తుందా? రిజర్వేషన్లు కులాన్ని బట్టి ఇస్తారు కాబట్టి ఆ సౌకర్యం కల్పించడంలో సాంకేతికపరమైన సమస్యలు వస్తాయని రాజ్యాంగం కులాన్ని అంత గట్టిగా పట్టించుకుంటుందా!నాకయితే అది పెద్ద అవరోధం అని అనిపించడం లేదు, రిజర్వేషన్ల గురించి మంచి పరిశోధన చేసిన అధికారికమైన పాండిత్యం ఉన్నవారు చెప్పాలి.
ఇంకొక విచిత్రం ఏమిటంటే ప్రగతిశీల పురోగామి వామపక్ష దళిత సిద్ధాంతకర్తలు ఏ కాలంలో బ్రాహ్మణ మతం కులాన్ని స్థిరం చేసిందని చెప్తున్నారో ఆ ఇప్పటి రాజ్యాంగం అమలులో లేని వెనకటి కాలంలో మనుషులు తమ కులాల్ని మార్చుకోగలిగేవారు!ఇప్పటివాళ్ళు నమ్మలేరు గానీ బ్రాహ్మణేతర కులంలో పుట్టి వేదం నేర్చుకుని బ్రాహ్మణులైన వాళ్ళు కూడా ఉన్నారు - ఒకటీ రెండూ అరుదుగా జరగటం కాదు, ఎక్కువ సంఖ్యలోనే జరిగాయి. దీనికి శాసనాల సాక్ష్యం ఉంది!ఆధునికత వెల్లి విరియాల్సిన 19వ శతాబ్దపు రాజ్యాంగం పనిగట్టుకుని కులాల్ని శిలాసదృశం చేస్తే దీన్ని వ్యతిరేకించే దమ్ము లేనివాళ్ళు ఎవడికిష్టం వచ్చిన కులంలోకి వాడు మారిపోతూ బతికిన 01వ శతాబ్దపు మనుషుల్ని ఇవాల్టి దుస్థితికి కారణం అని తిట్టడం ఎంత నీచమైన పని!
రాజ్యాంగమే కులాన్ని తమ పౌరుల అస్తిత్వానికి మౌలికమైనదిగా భావించినప్పుడు అస్తితం పునాదుల మీద పదవులను సాధించాలని అనుకునేవాళ్ళు మిగిలిన అస్తిత్వాలను వాడుకున్నట్టే కులాన్ని వాడుకోవడంలో తప్పు లేదని న ఆభిప్రాయం. అసలు అస్తిత్వాల మీద రాజకీయం నడపడాన్ని తిట్టకుండా కేవలం కులాన్ని వాడుకున్నందుకు వాళ్ళని తిట్టాల్సిన పని లేదు.రాజ్యాంగం భాషని మార్చుకోవచ్చునని వెసులుబాటు ఇచ్చినప్పటికీ స్వయాన మన తెలుగువాళ్ళమే భాష పేరుతో రాష్ట్రం కోసం పోరాడి సాధించుకున్నాం! రాజ్యాంగం ప్రాంతాన్ని మార్చుకోవచ్చునని వెసులుబాటు ఇచ్చినప్పటికీ తెలంగాణ్యులు ప్రాంతం పేరుతో రాష్ట్రం కోసం పోరాడి సాధించుకున్నారు!మరి, రాజ్యాంగం అప్రధానం చేసిన అస్తిత్వాలనే ప్రధానం అనుకుని ప్రజలు వాళ్ళకీ వీళ్ళకీ అధికారం ఇవ్వటానికి అంతలా పిచ్చెత్తిపోతూ ఉంటే సాక్షాత్తూ రాజ్యాంగమే ప్రధానం అని చెప్పిన కులం అనే అస్తిత్వం తమకు అధికారం రాబట్టుకోవటానికి పనికొస్తుందని అనుకున్నప్పుడు కులాన్ని వాడుకోవటంలో తప్పేమిటి? మిగిలిన అన్ని రకాల అస్తిత్వ ఉద్యమాలూ న్యాయమైనవి అయినప్పుడు ఏ కులం గొప్ప కోసం ఆ కులం వాళ్ళు ఏకమై ఉద్యమం చెయ్యడాన్ని అన్యాయం అనడమే అసలైన అన్యాయం!
అసలు కులనిర్మూలనే తన జీవిత లక్ష్యం అని ప్రకటించి దానికోసం పోరాడిన అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఇలా ఎందుకు తయారు చేశాడు?అస్పృశ్యతని తను అనుభవించింది కులాన్ని పుట్టుకకి అతికించడం వల్లనే అని వాదించి గాంధీ కూడా అస్పృశ్యతని నిర్మూలించడం కోసం నిజాయితీగా ప్రయత్నించటంలేదని ఎన్నోసార్లు విమర్శించినవాడు తను ప్రవేశపెట్టిన రాజ్యాంగంలో కులాన్ని పుట్టుకకి అతికించితే ఎందుకు వ్యతిరేకించలేదు!
ఈ ముడి విడాలంటే అంబేద్కర్ పేరును ఒకసారి నిశితదృష్టితో పరిశీలించాలి - తండ్రి పేరు Ramji Maloji Sakpal అయితే ఇతని పేరు Bhimrao Ramji Sakpal అని ఉండాలి కదా!ఉత్తర దేశంలో అధికంగా వినపడే SavarKAR, GolwalKAR, TendulKAR, DhabolKAR వంటి బ్రాహ్మణుల ఇంటిపేరు అస్పృశుడైన ఇతనికి ఎలా వచ్చింది?నోరు తెరిస్తే "జై భీం!" అని గర్జిస్తూ బ్రాహ్మణుల మీద నోరు పారేసుకునేవాళ్ళు అమాయకులూ కాదు అణిచివేతకు గురైన అసహాయులూ కాదు కులనిర్మూలన కోసం అహరహం తపించేవాళ్ళూ కాదు - వీళ్ళే ఇవ్వాళ నిలువెల్లా కులపిచ్చితో దహించుకుపోయే కాలాంతక నరాంతక దేవాంతకులైన దేశ విఛ్ఛిన్నం కోసం కంకణం కట్టుకున్న అసత్యవాదులు!ఇంటిపేరు బ్రాహణులది అయినప్పుడు ముక్కూ మొహం తెలియని వాడు Bhimrao Ramji అనే వ్యక్తి దళితుడని తెలుసుకోగలగడం సాధ్యమేనా?అదీ ఆ వ్యక్తి "నా పేరు Bhimrao Ramji Ambedkar!" అని చెప్తున్నప్పుడు, అతని స్కూల్ సర్టిఫికెట్లలో కూడా అలాగే ఉన్నప్పుడు!
ద్వితీయ స్వాతంత్ర సంగ్రామం అని మనం ఇవ్వాళ స్కూల్ పుస్తకాల్లో చదువుకున్న చరిత్రలో చాలా అబద్ధాలు ఉన్నాయి - అందులో అంబేద్కర్ అనుభవించిన అస్పృశ్యత కూడా ఒకటి!నిజానికి ఇతన్ని స్కూల్లో చేర్చేటప్పుడు తండ్రి తమ ఇంటిపేరైన Sakpal ఇవ్వకుండా మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాకు చెందిన Mandangad తాలూకాలో ఉన్న  Ambadawe గ్రామం నుంచి వచ్చినవాళ్ళమని చెప్పి Ambadawekar ఆనె ఇంటిపేరును ఇస్తే Krishnaji Keshav AmbedKAR అనే బ్రాహ్మణ ఉపాధ్యాయుడు అదంత సబబుగా లేదని తన ఇంటిపేరు ఇచ్చి Bhimrao Ramji Sakpalని Bhimrao Ramji Ambedkarగా మార్చి నమోదు చేశాడు. ఒక బ్రాహ్మణుడు అతను అస్పృశ్యుడని తెలిసే ఏమాత్రం అసహ్యం చూపించకుండా తన ఇంటిపేరునే ఇచ్చి ఆదరించడం దేన్ని సూచిస్తుంది?ఇప్పటివరకు ఈ విషయం జై భీం గాళ్ళు ఎందుకు చెప్పలేదు, నిజాన్ని దాచిపెట్టడం కూడా అబద్ధం చెప్పటమే కదా!
Krishnaji Keshav AmbedKAR అనే బ్రాహ్మణ ఉపాధ్యాయుడు అదంత సబబుగా లేదని తన ఇంటిపేరు ఇచ్చి నమోదు చేసి Bhimrao Ramji Sakpalని Bhimrao Ramji Ambedkarగా మార్చడం వరకు తెలిసినందుకే ఇంత ఆశ్చర్యం కలుగుతుంటే Balaram Ramji Ambedkar (brother), GangabaiLakgawadeKAR (sister), Ramabai MalvanaKAR(sister), Anandrao Ramji Ambedkar (brother), Manjulabai Yesu PandirKAR (sister), TulsabaiDharma KanteKAR (sister)ల పేర్లు మార్చడం మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే, Bhimrao Ramji Sakpal తన తండ్రి సంతానంలో 14వ వాడు! Bhimrao Ramji Sakpal కన్న పెద్దవాళ్ళైన అన్నలకూ అక్కలకూ అతన్ని స్కూల్లో చేర్చకముందే పేర్లు మారి ఉంటే అది ప్రపంచంలో మిస్టరీలు అని చెప్తున్న అన్ని మిస్టరీలనీ మించిన పెద్ద మిస్టరీ అవుతుంది!Bhimrao Ramji Sakpal కన్న పెద్దవాళ్ళైన అన్నలకూ అక్కలకూ అతన్ని స్కూల్లో చేర్చిన తర్వాత పేర్లు మారి ఉంటే అలాంటివి రెండు మిస్టరీలు రంగంలో ఉంటాయి - "Krishnaji Keshav AmbedKAR అనే బ్రాహ్మణ ఉపాధ్యాయుడు అదంత సబబుగా లేదని తన ఇంటిపేరు ఇచ్చి నమోదు చేసి Bhimrao Ramji Sakpalని Bhimrao Ramji Ambedkarగా మార్చడం!", "Balaram Ramji Ambedkar (brother), GangabaiLakgawadeKAR (sister), Ramabai MalvanaKAR(sister), Anandrao Ramji Ambedkar (brother), Manjulabai Yesu PandirKAR (sister), TulsabaiDharma KanteKAR (sister)ల పేర్లు మార్చడం!" అనేవి.
ఇవన్నీ నిజాయితీ గల చరిత్రకారులు పరిశోధించి నిగ్గు తేల్చాల్సిన వివాదాస్పదమైన విషయాలు కాబట్టి ఇక్కడ ముందుకు వెళ్ళిపోదాం.అంబేద్కర్ పుట్టుక వల్ల మాత్రమే అస్పృశ్యుడు.అతని ఇంటిపేరులో బ్రాహ్మణత్వం ఉంది.స్కూల్లో చేరినప్పుడు ఇంటిపేరును ఇచ్చిన Krishnaji Keshav AmbedKAR మాత్రమే కాదు, హైస్కూలు దశలోనూ ఎంతోమంది బ్రాహ్మణ గురువులు చురుకైన ఈ కుర్రాణ్ణి అభిమానించి అక్కున జేర్చుకున్నారు. ఉన్నతవిద్యకు స్కాలర్షిప్పు ఇవ్వడమే కాకుండా వ్యక్తిగత శ్రద్ధ తీసుకుని ప్రోత్సహంచినది మహారాజులూ సంస్థానాధీశులూ, బ్రిటిష్ ప్రభుత్వానికి అత్యంత స్నేహపాత్రుడైన ప్రముఖ న్యాయవాది, లండనులో రాజప్రసాదాన్ని బోలిన నివాస భవనం("We will require Rs 40 crore to purchase the house and later annual maintenance of Rs 61 lakh. We can recover some of the maintenance amount from rent as we will give four rooms to four Dalit students, who come to London on scholarship to pursue higher studies. Similarly, one bedroom will be for professor on official visit." - IndiaToday.in, Mumbai February 3, 2015) - బీదరికమూ అస్పృశ్యతా రెండూ ఇతని పట్ల అబద్ధాలే!
అతని అభిమానులు నిజాలు చెప్పకుండా దాచెయ్యడం వల్ల మనకి తెలియకపోబట్టి రాజకీయ, సామాజిక, ఆర్ధిక విషయాలపట్ల ఇతని నమ్మకాలు కూడా మనం నమ్మలేనివిగా ఉంటాయి.దేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళ తర్వాత కూడా ఒక అధికారికమైన జాతీయభాషను ఏర్పాటు చేసుకోలేక హిందీని చెయ్యాలని కొందరూ చెయ్యవద్దని కొందరూ తన్నుకు చస్తున్నారు గానీ అంబేద్కర్ ఆనాడే జైభీం గాళ్ళు కూడా దడుసుకు చచ్చేటట్టు సంస్కృతాన్ని జాతీయబాషగా చెయ్యమన్నాడు!
మొదట్లో హిందువుల ఆలయాలతో పాటు ఇతర మతస్థుల పవిత్ర స్థలాలు కూడా పూర్తి ప్రభుత్వాధీనంలో ఉండేవి.అప్పటి కలక్టరుకి తన అధీనంలో ఉన్న ప్రాంతంలో ఇప్పటి దేశ పధానమంత్రికి ఉన్నట్టు పోలీసుల్నీ సైన్యాన్నీ నడిపించే అధికారాలు కూడా ఉండేవి.హిందువుల మతపరమైన వేడుకల సమయంలో కలక్టరు బంగళాలో తుపాకుల్ని పేల్చడం లాంటివి కూడా చేసేవాళ్ళు.అయితే పాస్టర్లు మందలా వచ్చేసి ఈ క్రైస్తవ కలక్టర్లు అవిశ్వాసులని ప్రోత్సహించడం నచ్చక గొడవ చెయ్యడంతో హిందువుల ఆలయాల్ని హిందువులకి పూర్తిగా అప్పజెప్పేశారు.సరిగ్గా ఇదే సమయంలో యూరోపియన్ రాజకీయ భావజాలంలో "మతాన్నీ రాజకీయాన్నీ వేరు చెయ్యటం" అనే సెక్యులరిస్టు పైత్యం పుట్టి మన దేశంలోకి కూడా వచ్చిపడి సోషలిష్టు కమ్యునిష్టు రేషనలిస్టు లెఫ్టిస్టు రైటిస్టు రాయిస్టు రప్పిస్టు మేధావులకి పిచ్చెక్కించింది!ఆటలో అరటిపండు లాంటి హాస్యరసగుళిక యేంటంటే వీటన్నిటికీ పిచ్చెక్కిపోయినవాళ్ళలో నూటికి తొంభై శాతం మంది హిందువులే.అంతకన్న విచిత్రం యేమిటంటే అంతకుముందు దూరం పెట్టేసిన  మతసంస్థల్ని వాటి ఆదాయాన్ని నొల్లుకోవచ్చుననే లాభం కనపడి ప్రభుత్వం వశం చేసుకుందామని చట్టం చేస్తున్నప్పుడు ఈ సోషలిష్టు కమ్యునిష్టు రేషనలిస్టు లెఫ్టిస్టు రైటిస్టు రాయిస్టు రప్పిస్టు మేధావులు లేని ఇతర మతాల వాళ్ళు కుదరదని తెగేసి చెప్పడంతో వాటిని ప్రభుత్వాధీనంలోకి తెచ్చే సాహసం అప్పటి బ్రిటిషు ప్రభుత్వం చెయ్యలేకపోయింది.
అయితే, తర్వాత అదే ఆలయనిర్వహణ గురించి మనవాళ్ళు చట్టాలు చేస్తున్న సందర్భంలో అంబేద్కర్ చాలా న్యాయంగా మాట్లాడాడు గానీ కాంగ్రెసోళ్ళూ కమ్యునిష్టోళ్ళూ అని లేకుండా అన్ని పార్టీలలోనూ ఉన్న హిందూ నాయకులు ఆలయాల్ని ప్రభుత్వం నుంచి తప్పించి అంతకు ముందున్న ధర్మకర్తల వ్యవస్థను పునరుద్ధరించటానికి అంబేద్కర్ న్యాయమైన సూచనల్ని తిరస్కరించి మిగిలిన అన్ని మతాల వారికీ వారి ప్రార్ధనా స్థలాల మీద ఉన్న హక్కుల్ని హిందువులకి తమ ప్రార్ధనా స్థలాల మీద లేకుండా చేశారు!
అన్ని విషయాల్లోనూ అంత న్యాయమైన అభిప్రాయలను కుండబద్దలు కొట్టి చెప్పిన అంబేద్కర్ ప్రధానమంత్రి అయి వుంటే మన దేశం యాభై యేళ్ళలోనే దేశ విదేశ మార్కెట్లని కొల్లగొట్టి ప్రపంచ రాజకీయాల్లో అత్యంత ప్రబావశీలమైన స్థానం చేరుకునేది - ఇతర స్వాతంత్య్ర నాయకులతో ఉన్న వ్యక్తిగత విభేదాల వల్లా బ్రిటిషు వాళ్ళతో స్నేహమూ మొహమాటమూ ఉండటం వల్లా స్వాతంత్య్ర పోరాటంలో చురుకైన పాత్ర వహించకపోవడం అతన్నీ దేశాన్నీ ఎక్కువ స్థాయిలోనే దెబ్బతీసింది! "ఇంగ్లీషువాళ్ళ పరిపాలన న్యాయంగానే ఉంది, వాళ్ళ మీద పోరాడటం అనవసరం" అనడం అప్పుడు తను ఒక్కడే కాదు, గురజాడ లాంటివాళ్ళు కూడా అన్నారు గానీ కాంగ్రెసు దాన్ని అంబేద్కరుని తొక్కెయ్యడానికి ఉపయోగించుకునేసింది - వ్యూహాత్మకతలో అంబేద్కరు కూడా గట్టివాడే గానీ ఇక్కడ తడబడి వెనక్కి తగ్గాడు.
ఇక ఆర్ధిక విషయాల్లోనూ రాజకీయ భావజాలం విషయంలోనూ తన స్నేహితులైన బ్రిటిష్ మేధావులతో అతను మమేకమైపోయాడు.Masonic outfit ఉన్న Israel పట్ల విపరీతమైన ఆప్యాయతని ప్రదర్శించాడు. Rothschilds యొక్క ఆర్ధిక విధానమైన credit based economicsను సమర్ధించాడు.Reserve Bank of India (RBI) ఏర్పాటులో అంబేద్కర్ ప్రమేయం చాలా తక్కువ, బ్రిటిషువాళ్ళు వలస రాజ్యాలు తమ చేతి నుంచి జారిపోకుండా చూసుకోవడం కోసం ఆచరణాత్మకమైన సలాహాలూ సూచనలూ ఇవ్వమని పురమాయించిన Hilton Young Commission అనే సంస్థ భారతదేశపు ఆర్ధికచట్రం ఎలా వుంటే తమకు లాభమో అలా తీర్చి దిద్దిన గ్రంధాన్ని చట్టసభ ముందు ఉంచి ఆర్ధిక విషయాల్లో కనీసపు అవగాహన కూడా లేని ఇతరులతో ఒప్పించడం మాత్రమే ఆయన చేసినది.ఒకటి మాత్రం నిజం - RBI యొక్క నిర్మితిలోని ప్రతి అంశమూ Rothschilds యొక్క ప్రపంచాధిపత్యపు ప్రణాళిక ప్రకారమే Bank of Englandకు నకలుగా రూపు దిద్దుకున్నదనే విషయం అంబేద్కరుకు స్పష్టంగా తెలుసు, అయినా ఎక్కడా నోరు జారకుండా జాగ్రత్త పడ్డాడు!భారత రాజ్యాంగం కూడా దేశదేశాలూ తిరిగి ఉత్తమోత్తమ రాజ్యాంగాలను చదివి అనేకమైన ఉన్నత భావాలను పుణికి పుచ్చుకున్న అత్యుత్తమ గ్రంధం కానే కాదు.
ఈస్టిండియా కంపెనీ రాణి చేతి కిందకి వెళ్ళినప్పుడు వాళ్ళు తమ పరిపాలనా సౌలభ్యం కోసం లండనులో అప్పటికే ఉన్న డాక్యుమెంట్లను ఇక్కడికి తెచ్చి వాడుకున్నారు. Government of India Act 1935 కొంత పెంచింది. ముస్లిం నాయకులకి పాకిస్తాన్ పంచి ఇవ్వటం కోసం 1936-37 నాడు జరిగిన Provincial elections సామాన్య ముస్లిములు ఎటూ పాకిస్తాన్ కోసం అంగలార్చిపోతున్నారన్న ధీమాతో ఇంగ్లీషువాళ్ళు ఇప్పటిలా ఎన్నికల అక్రమాలు చెయ్యకుండా న్యాయంగా జరిపించేసరికి అనూహ్యమైన ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకున్న కాంగ్రెసు ఆనాడు పరిపాలించింది దీని ఆధారంగానే!రాజ్యాంగ సభ చేసింది ఇంకొన్ని ఆకర్షణీయమైన అంశాల్ని చేర్చటమే తప్ప పాతవాటిని, అదీ స్వదేశీ భావన లేని విడేశీ దుర్మార్గం అనిపించే వాటిని కూడా తీసెయ్యలేదు!
ఒక రకంగా చూస్తే అతివాదులని పేరు పడిన తిలక్ నాయకత్వంలో ప్రజలూ ఉద్యమాలూ నడిచిన కాలంలోనే జాతీయత, స్వాభిమానం, ప్రజాశ్రేయస్సు వంటి వాటి కోసం నిజమైన పోరాటం అని చెప్పదగిన వ్యవహారం నడిచింది, మితవాదుల గ్రూపుకి చెందిన గాంధీ రంగం లోకి దిగాక జరిగిన ఉద్యమాలూ ప్రయత్నాలూ సమావేశాలూ అన్నీ శాంతియుతమైన అధికార మార్పిడి కోసం తప్ప ప్రభుత్వ నిర్వహణలో గానీ ఆర్ధిక చట్రంలో గానీ ఇంగ్లీషువాళ్ళకి భిన్నమైన అంశాల్ని ప్రతిపాదించాలని గానీ అనుసరించాలని గానీ ఎవరూ అనుకోలేదు - అది వాళ్ళు తెలిసి చేసిన తప్పు కాదు, ఆ రకమైన పాండిత్యమే వాళ్ళకి లేదు!
ఈ శాంతియుతమైన అధికార మార్పిడి అనేది బ్రిటిష్ రాజరికపు సమూహం నుంచీ భారతీయ రాజరికపు సమూహం మధ్య జరిగిన వ్యాపార ఒప్పందం లాంటిది, ప్రజలకు దీనిలో ప్రమేయం గానీ భాగం గానీ లాభం గానీ లేవు.ఇంగ్లీషువాళ్ళకీ కాంగ్రెసువాళ్ళకీ ప్రజలు కేవలం విధేయులుగా ఉండటమే కావాలి. ఆ విధేయత తెచ్చుకోవటం అంత ఈజీ కాదు, ప్రజల్ని కులాన్ని బట్టి చీల్చి ప్రతి కులాన్నీ ఒంటరి ఒంటెని చెయ్యడం చాలా అవసరం.వాళ్ళకి అవసరం గనక వాళ్ళంతట వాళ్ళు తొలగించరు - ఇక ప్రజలు చూస్తే మన ఉద్యోగాలు ఆంధ్రావాళ్ళు లాక్కున్నారని లక్ష ఉదోగాలు అక్షరాలా లెక్క చూపించి రెండు విడతలు ఎన్నికైన తర్వాత కూడా గొర్రెల్ని కాసుకోమని క్రూరమైన జోకు వేసినా కోపం తెచ్చుకోకుండా ఒక్క గట్టి నోటిఫికేషను కూడా ఇవ్వని కేసీయారు లాంటి వాళ్ళని అవతార పురుషుల కింద కొలిచే అజ్ఞానంలో ఉన్నారు.
ఇప్పటికీ ఈ వ్యాసం చదువుతున్న మీకు బోధపడలేదని నాకు గ్యారెంటీగా తెలిసిన విషయం ఏమిటో చెప్తాను వినండి, ఆర్ధిక చట్రంలో Rothschilds Bank of Indiaని ఉంచటానికీ రాజ్యాంగంలో కులాన్ని పుట్టుకకి అతికించటానికీ వెనక ఉన్న ఉద్దేశం ఒకటే - ఇది లేకుండా అది ఉండలేని అది లేకుండా ఇది ఉండలేని అదీ ఇదీ లేకుండా మనం ఉండలేని ఏకేశ్వర ఏకస్వామ్య ఏకమేకమే దోపిడీ పూరిత మహామోహ మాయాజాలం!ఈ జంట దరిద్రాలకి పరిష్కారం బోయి భీమన్న గారి "గుడిసెలు కాలిపోతున్నాయి!" కవిత చివరి రెండు మూడు పంక్తుల్లో దొరుకుతుంది.
*గుడిసెలు కాలిపోతున్నై*
*ఓహో కాలిపోతున్నై*

*ఎవరీ గుడిసెలో పాపం*
*మాల మాదిగలవే అయివుంటై*
*గుడిసెలు మరివరికుంటై*

*ధర్మ సంస్థాపనార్ధం*
*ఈ గుడిసెలు*
*మళ్ళీ మళ్ళీ అవతరిస్తుంటే*
*పోతుంటై పుట్టుకొస్తుంటై* అని ప్రతి అక్షరంలోనూ అనంత వ్యంగ్యాన్ని కూరిన కవితని మీ అంతట మీరు చదివితేనే తత్వం బోధపడుతుంది గనక ఇక్కడ నేను ఇవ్వటం లేదు - ఎవడి జిజ్ఞాస వాడిదే!

Wednesday, 18 September 2019

ఒక చంద్రుడూ ఒక తారా శృంగారం చేస్తే పుట్టిన బుధుడనే గుండ్రని గోళం శుక్రుడికీ చంద్రుడికీ కూడా కొడుకెట్లా అయ్యాడు చెప్మా!

మహాభారతం మరియు ఇతర పౌరాణిక కధలు 27 నక్షత్రాలను దక్ష ప్రజాపతి కుమార్తెలనీ చంద్రుని భార్యలనీ చెబుతాయి.ఇక్కడ కదులుతున్న చంద్రగ్రహాన్ని పురుషతత్వంతోనూ స్థిరమై ఉండి వేటినైతే చలిస్తున్న చంద్రగ్రహం స్పృశిస్తుందో వాటిని స్త్రీతత్వంతోనూ పోల్చారు.అయితే, యజుర్వేదంలోని తైత్తిరీయ సంహిత(Taittiriya Samhita II.3.5.1) ప్రజాపతికి ముప్పైముగ్గురు కుమార్తెలని పేర్కొంటున్నది.ఇక్కడ కూడా చంద్రుడు వీరిలో రోహిణిని ఎక్కువ ప్రేమించాడని చెప్పటం వల్ల ఈ కధలో కూడా చెప్పదల్చుకున్న ప్రధాన విషయం ఒకటే అని తెలుస్తున్నది - కానీ 27 కాస్తా 33 ఎట్లా అయ్యింది?ఉన్న 27 నక్షత్రరాశులకీ చంద్రగమనానికీ చాంద్రమాసాలకీ లెక్క సరిపోతుంటే వీటిని నక్షత్రరాశులని అనుకుంటే కాలానికి సంబంధించిన అన్ని లెక్కల్నీ తిరగరాయాలి! పోనీ, వైదిక సాహిత్యంలో ఉద్ఘాటించిన 8 మంది వసువులూ 11 మంది రుద్రులూ 12 మంది ఆదిత్యులూ ఇద్దరు అశ్వినీ దేవతలూ అయిన 33 అనుకుంటే సరిపోతుందా!వసువులూ రుద్రులూ భూమికీ ప్రకృతికీ సంబంధించినవాళ్ళు - ఖగోళ గణితానికి చంద్రుడి భార్యలుగా అంటుకట్టటం కుదరదే?ఇంకొక వైపున ఋగ్వేదం(VII.86.1;X.88.13) సూర్యుడిని కూడా నక్షత్రం అని చెప్పి విశ్వంలో ఉన్న 34 కాంతుల్లో సూర్యుడు అత్యంత ప్రముఖమైన కాంతిస్వరూపం అని చెప్తున్నది.ఇప్పుడు ఈ 34 నుంచి 27 నక్షరాలనూ సూర్యుడినీ చంద్రుడినీ విడదీస్తే మిగిలిన అయిదూ బుధుడు, శుక్రుడు, వరుణుడు/అంగారకుడు, గురుడు, శని అనే గ్రహాలకి లెక్క సరిపోతున్నది!
34లో చంద్రుణ్ణి చలనాధిపతి అనుకుంటే సూర్యుడు కూడా నక్షత్రం అవుతున్నాడు గాబట్టి చంద్రుడికి ముప్పైముగ్గురు భార్యలనే లెక్క కూడా సరిపోతుంది.ఇంతకు ముందరే నేను చంద్రవరుడికీ సూర్యవధువుకీ జరిగిన, జరుగుతున్న, జరగబోయే, జరిగే కళ్యాణ మహోత్సవం కధ చెప్పాను కదా - చదివారా?కధ బాగుంటుంది, చదవండి!ఈ కధలన్నిట్లో చంద్రుణ్ణే ఎందుకు పురుషుణ్ణి చేశారు?సూర్యుడికేం తక్కువ?ఎందుకంటే, అందర్లోకీ చురుకైన వాడు కాబట్టి!ఋగ్వేదం(I.105.10) స్వర్గంలో ఉన్న అయిదు ఎద్దుల్ని గురించి చెప్తున్నది - ఇవి అయిదు గ్రహాలే అయ్యే అవకాశం ఉంది! సూర్యుడికి చెప్తున్న ఏడు గుర్రాలు సూర్యగ్రహం, చంద్రగ్రహం, బుధగ్రహం(Mercury), శుక్రగ్రహం(Venus), వరుణ/అంగారకగ్రహం(Mars), గురుగ్రహం(Jupiter), శనిగ్రహం(Saturn) అయ్యే అవకాశం కూడా ఉంది!
Jupiter అని పిలవబడే గురుగ్రహం ఒక్కటే క్రమం తప్పని చలనాన్ని నమోదు చేస్తున్నది,మిగిలిన వాటి చలనాల్లో స్థిరత్వం తక్కువ, కాంతివంతమైనది - కాబట్టి cosmic law మీద అధిపత్గ్యం ఉన్న దేవగురువు స్థానం ఇచ్చారు వైదిక సాహిత్యపు ఖగోళ నియమాల్లోనూ పామరులకి విజ్ఞానశాస్త్రాన్ని అందించే పురాణ కధల్లోనూ!
నక్షత్రాలకీ గ్రహాలకీ వైదిక ఋషులతో సంబంధం ఉంటుందనే విషయంలో ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే, Big Dipper అని ఇతర్లు పిలిచే సప్తర్షి మండలం లోని ఋషుల  గురించి తెల్సుకుంటే చాలు అన్ని సందేహాలూ తీరుతాయి.వ్యక్తులుగా నక్షత్రాలతో సంబంధం స్పష్టం కాకపోయినా కొన్ని ఋషిగణాలకి సామూహికంగా నక్షత్రాలతో ఉన్న సంబంధం వల్ల ఆయా ఋషిగణాలకు సంబంధించిన వ్యక్తులకి కూడా ఆయా నక్షత్రాలతో సంబధం ఉన్నట్టే లెక్క.ఆ విధంగా చూస్తే బృహస్పతి అంగిరస గోత్రీకుడు కాగా మిగిలిన ముగ్గురూ భృగు గోత్రీకులు. సప్తర్షులను ఎలుగుబంటిని గుర్తు చేస్తూ Rukshas/ఋక్షజులు అని కూడా అంటారు!బృహస్పతిని గురుడు అని మనం పిలుస్తూ ఇతర్లు Jupiter అని గుర్తించితే శుక్రతారని Venus అని ఇతర్లు గుర్తించారు.చూశారా, ఇప్పటికి దేవతల రాజగురువు బృహస్పతి అయితే శుక్రుడు రాక్షస గురువు ఎందుకయ్యాడో తెలుస్తున్నది! గబుక్కున తెలియకపొతే నేను చెప్తాను చదివి తెలుసుకోండి.ఫలిత జ్యోతిషంలో గురుగ్రహం జాతకుల జీవితాల మీద ధనాత్మక ప్రభావం చూపిస్తే శుక్రగ్రహం ఋణాత్మక ప్రభావం చూపిస్తుంది - ఒక మనిషి తన జీవితకాలంలోనే వైభవాన్ని చూస్తున్నప్పుడు స్వర్గంలో ఉన్నట్టూ దరిద్రాన్ని అనుభవిస్తున్నపుడు నరకంలో ఉన్నట్టూ భావిస్తాడు కదా!
గురుగ్రహం ఒకసారి కక్ష్యని పూర్తి చెయ్యడానికి 12 సంవత్సరాలు పడుతుందనే విషయాన్ని బట్టియే 5X12=60 సంవత్సరాల కాలచక్రాన్ని ప్రతిపాదించారు.చైనీయుల 60 సంవత్సరాలకీ 28 నక్షత్రాల క్యాలెండరుకీ వైదిక సాహిత్యంలోని ఖగోళ శాస్త్రమే పునాది.ఇది బాబిలోనియన్ ఖగోళశాస్త్రంలో కనిపించని ప్రత్యేకత - కాబట్టి గ్రీకులు చెప్పేవరకు మన ప్రాచీనులకు గ్రహాల గురించి తెలియదనటం అశాస్త్రీయం.సంప్రదాయ హిందూ ఖగోళశాస్త్రంలో ప్రతి నక్షత్రానికీ/గ్రహానికీ ఒక ఋషిపరంపర అనుసంధానించబడినట్టే ఒక ప్రధానదైవతం కూడా అనుసంధానించబడి ఉంటుంది!Jupiterకి వైదిక సాహిత్యంలో అత్యంత శక్తివంతుడైన ఇంద్రుణ్ణి అధిపతిగా చెప్పారు.ఇది రోమన్లు కూడా జూపిటర్ వర్షాలు కురిపించే దేవుడని చెప్తున్నదానితో సరిపోతుంది. అయితే, ప్రాచీనులు గ్రహాలను దేవతల పేర్లతో సూచించారు తప్ప రెంటికీ అభేదం చెప్పలేదు.
వైదిక దేవతలని గ్రహాలకి మాత్రమే పరిమితం చెయ్యకూడదు, అట్లాగే గ్రీకో రోమన్ దేవతలకి గ్రహాల్తో సంబంధం ఉందని అనుకోకూడదు.ఇవన్నీ కొన్ని వివరాలు కలుస్తూ కొన్ని వివరాలు వేరౌతూ ఉన్న జ్ఞాన శకలాలు - పొలికలను చూసి అన్నీ ఒకటే అనుకోవడమూ తప్పే, తేడాలను చూసి అసలు సంబంధం లేదనుకోవడమూ తప్పే!మన ప్రాచీనులు నక్షత్రాల చుట్టూ అల్లిన పురాణ కధలకు అర్ధం మన పూర్వ ఋషులకు మాత్రమే సాధ్యమైన అద్భుతం - వీటికి చెప్పాల్సిన హేతుబంద్ధమైన వ్యాఖ్యానం కోసం వీటికి సంబంధం లేని చోట్ల వెదకడం వల్లనే కొన్ని కధలు అర్ధం లేనివి గానూ కొన్ని కధలు అసభ్యమైనవి గానూ అనిపిస్తున్నాయి!
 హిందూ పురాణాలు గ్రహాలకీ దేవతలకీ కలిపిన సంబంధం ఇట్లా ఉంటుంది:Vishnu - Mercury, Brhspati - Jupiter - indra, Skanda(Son of Shiva) - Mars, Sukra - Venus, Yama - Saturn, అంటే ఒక కధలో Mercury యొక్క చలనాన్ని గానీ విశేషాన్ని గానీ స్వభావాన్ని గానీ సూచిస్తూ ఉండే పాత్రలో విష్ణువుని ప్రవేశపెట్టి కధ నడిపిస్తారు. భృగువులు దైత్యులకీ అంగిరసులు దివ్యులకీ గురుత్వం వహించి నడిపిస్తారని ఇదివరకు చెప్పాను కదా, వీళ్ళిద్దరికీ మొదట్లో ఒకరినొకరు గెలవాలనే స్థాయిలో విరోధం ఉండేది కాదు."తారా శశాంకం", "శశాంక విజయం" అనే శృంగార కలహం జరిగాక దేవదానవుల మధ్యన పరస్పరారోహణావరోహణ పర్వం మొదలయ్యింది!చంద్రుడు, బృహస్పతి, తార - ముగ్గురూ దేవతలే!వాళ్ళ మధ్య జరిగినది నిషిద్ధ శృంగారం!ఇప్పటి పొలిటీషియన్ల మాదిరి శుక్రుడు చంద్రుడి పక్షం వహించడంతో అది కాస్తా దేవతలకీ దానవులకీ పీటముడి అయి కూర్చుంది!
పాతవీ కొత్తవీ కలుపుకుని ఒక పదహారు వెర్షన్లు ఉంటాయేమో ఈ కధకి. విశృంఖలత్వాన్ని విమర్శించే నీతిఖద వెర్షన్ ఉంది, తారని తిరుగుబాటు తత్వానికి ప్రతీకను చేసిన ఫెమినిస్టు వెర్షన్ ఉంది, ముసలి బృహస్పతీ పడుచు తారా అంటూ బాల్యవివాహ వెర్షన్ కూడా ఉంది, ఆధునిక కాలపు హిందూద్వేషులకి కావ్యరచనాశక్తి ఉండి ఉంటే హిండూ గిబ్రమామిక్ కిచిడీ వెర్షన్ కూడా వచ్చి ఉండేది!ఇంతకీ మూలకధ చాలా చిన్నది - బృహస్పతి(Jupiter) యొక్క భార్య(the star)ను సోముడు(moon) ఎత్తుకెళ్ళి దాచేశాడు, రాక్షస గురువైన శుక్రుడు(Venus) చంద్రుడి పక్షం వహిస్తే దేవతల్లో ముఖ్యుడైన రుద్రుడు/స్కందుడు(Mars) గురుడి పక్షం వహించారు.తారకి బుధుడు(Mercury) అనే కొడుకు పుట్టాడు.అసలు పుట్టడం చంద్రుడికే అయినప్పటికీ ఈ బుధుడికి గురుడూ చంద్రుడూ కూడా తండ్రులే అయ్యారు. ఆకాశంలో The Jupiter, The Moon, The Venus, The Mars, The Mercury, The Stars ఎప్పుడెప్పుడు ఎలాగెలాగ కనిపిస్తాయో చూస్తే అసలు చిక్కుముడి విడిపోతుంది, చూద్దామా!Jupiter అత్యంత స్థిరమై నభోమండలాన్నీ నక్షత్రలోకాన్నీ/తారాసమూహాన్నీ పరిపాలించే స్వర్గదైవతం!కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతిని వెదజల్లుతూ చంద్రుడు ప్రకాశించడం వల్ల నక్షత్రాలు కాంతి తగ్గి మసకబారిపోతున్నాయి - అంటే చంద్రుడు తారను తీసుకెళ్ళి దాచేశాడు.Venus ఎప్పుడూ సూర్యుడికి దగ్గిరగానే ఉంటూ ఉదయసంధ్యలోనూ సాయంసంధ్యలోనూ మాత్రమే కనిపిస్తుంది - అంటే శుక్రుడు దేవతల్లో చంద్రుడి పక్షానికి రావడం.Mars రాత్రుళ్ళు మాత్రమే కనిపించడం అంటే గురుడి పక్షాన చేరడం.Mars కాంతిలో venus కన్న కొంచెం తగ్గి ఉండి చంద్రగ్రహానికీ శుక్రగ్రహానికీ దగ్గిర్లో తచ్చాడుతూ ఉంటుంది!
ముప్పాళ రంగనాయకమ్మలా "అబ్బెబ్బే, ఇది కాదు జరిగింది. అసలు చరిత్రలో జరిగిన కధ వేరే ఉంది!హరిబాబు మార్చి రాశాడు/బ్రాహ్మణులు తప్పు చెప్తున్నారు" అని అనదల్చుకున్నవాళ్ళు ఆ బృహస్పతీ, చంద్రుడూ, తారా ఏ ప్రాంతంలో ఏ కాలంలో పుట్టారో శాసనాలు గానీ అవశేషాలు గానీ చూపించి కార్బన్ డేటింగుల్నీ డీయన్యే టెస్టుల్నీ ఉపయోగించుకుని  నిరూపించాల్సి ఉంటుంది - అంత దమ్మెవరికి ఉంది?

Thursday, 12 September 2019

ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి గురించి పడాల రామారావు గారి కధనం ఏమి చెబుతున్నది?

1956 నుంచీ పడాల రామారావు గారు స్వాతంత్య్ర వీరుల చరిత్ర మొత్తాన్ని ఒక చోటకి చేర్చాలని అనుకుని 1990 నాటికి ఒక రూపం తీసుకు వచ్చి ఉపోద్ఘాతంలో "విప్లవ మహాయుగం" అని పేరు పెట్టుకున్నప్పటికీ కవర్ మీద "భారత స్వాతంత్య్ర సాయుధ సమర చరిత్ర 1757 - 1947" అని ఉన్న పుస్తకంలో నరసింహా రెడ్డి 17వ వాడిగా వస్తాడు.మన రాజులంటేనే అవగుణాల పుట్టలని అక్కసు వెళ్ళగక్కే కమ్యునిష్టు సహజ ధోరణికి విరుద్ధమైన శైలిని కనబరచారు పడాల రామారావు గారు.అయితే, లేని గొప్పల్ని కూడా కల్పించి చెప్పే భాజపా హిందూత్వ శైలిని కూడా ప్రదర్శించలేదు - జరిగిన సంఘటనలను మార్చకుండానూ ఇంతదాన్ని అంత చేసి ఉత్ప్రేక్షల్ని వాడకుండానూ తులనాత్మకతను చక్కగా పోషించారు!మొదట ఒక్క అక్షరం పొల్లు పోకుండా ఆయన రాసినది రాసినట్టు ఎత్తి రాస్తాను. చివరలో నా విశ్లేషణ ఉంటుంది.
రాయలేలిన కాలంలో రతనాల సీమగా ప్రసిద్ధి పొంది బ్రిటిషు దొరల హయాంలో రాళ్ళసీమగా మారిన ఆంధ్రదేశపు రాయల సీమను స్వాతంత్య్ర సమరాంగణంలోని మొదటిపేజీలో నిలబెట్టిన ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి సాహసోపేతమైన పోరాటాన్ని తలుచుకున్న చాలు - రోమాంచితం కాని భారతీయుడే ఉండడు!
తల వంచని వీరుడిగా నరసింహా రెడ్డిని నేటికీ రాయలసీమలోని పల్లెపట్టులన్నీ "అడుగో, వచ్చెరా నరసింహా రెడ్డి!ఇడుగో, వెళ్ళెరా నరసింహా రెడ్డి!" అని ఆనాటి అతని వేగాన్ని స్మరించుకుంటూ పదాలు పాడుతూ ఉంటాయి.(నిజమే, ఇతని వేగం ఉప్పెన లాంటిదే - July 1846న మొదలై February 1847న అంతమై పోయింది, కానీ ఇతను ఇంగ్లీషువాళ్ళ గుండెల్లో పుట్టించిన దడ తుఫాను భీబత్సమే!)
1850కి పూర్వం రేనాడు సంస్థానానికి పరువం గల ప్రభువు నరసింహా రెడ్డి.ఇతని పూర్వీకులు కడప, కర్నూలు, బళ్ళారి, అనంతపురం జిల్లాలలోని 66 గ్రామాలను పరిపాలించారు.నరసింహారెడ్డి తాత చెంచుమళ్ళ జయరామి రెడ్డి, తండ్రి పెద్ది రెడ్డి.
జయరామిరెడ్డి కడప జిల్లాలోని ఉప్పులూరు సంస్థానానికి ప్రభువు.నరసింహారెడ్డి రూపనగుడి గ్రామంలో పుట్టినా పెరిగింది గొల్లదుర్తి, ఉయ్యాలవాడ  ప్రాంతాల్లో - స్థిరపడింది ఉయ్యాలవాడ గ్రామంలో, అందుకే ఈయన్ని ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి అని పిలిచేవారు!
వర్తక నెపంతో తెలుగుదేశంలో అడుగుపెట్టిన ఇంగ్లీషు దొరలు రాజ్యదాహం పెరిగి 1800 ప్రాంతంలో జయరామి రెడ్డి సంస్థానాన్నిబలవంతంగా లాక్కొని పింఛను రూపంలో నెలకు 11 రూపాయల పదణాల ఎనిమిది పైసలు భిక్షగానికి పారేసినట్టు ఇవ్వసాగారు.ఆయన అనంతరం వారసుడైన నరసింహా రెడ్డికి ఆ పింఛను ముడుతుండేది.యీ ముష్టి డబ్బును కూడా ఇచ్చుట నిలిపేసినట్టు 1845లో ఈస్టిండియా కంపెనీ ఒక ఉత్తర్వును జారీ చేసింది.ఆ సంగతి నరసింహా రెడ్డికి తెలీదు.ఈ పింఛను డబ్బుకై కోయిలకుంట్లలో ఉన్న తాసీల్దారు వద్దకు తన మనిషిని పంపాడు.
దురహంకార పూరితుడైన తాశీల్దారు ఆ మనిషి ముందు నరసింహా రెడ్డిని తూలనాడాడు - "వాడొక దాసరైతే వాడికి నువ్వో దాసరివా?ఆ నరసింహ దాసరినే రమ్మను!" అని.ఆ మాట వినగానే నరసింహా రెడ్డి భగ్గున మండిపోయాడు.అతడి నరనరాలు అవమాన వాక్కులకు ఉద్రిక్తమయ్యాయి.తమ సంస్థానాన్ని లాక్కోవడమే గాక, ఇస్తున్న పింఛను ఆపుచేసింది చాలక, దుర్భాషలకు దిగిన తాశీల్దారుపై ప్రతీకార జ్వాల అతడి శరీరమల్లా అలముకొంది.తాశీల్దారుకు కబురు పంపాడు - "ఆ నరసింహ దాసరి రేపే నిన్ను కలుస్తాడు!" అని.
మరునాడు...
పట్టపగలు!
500 మంది బోయసైనికులను సమకూర్చుకొని తాశీల్దారు కచ్చేరిపై దండయాత్ర చేశాడు.తనను అవమాన పర్చిన తాశీల్దారు తల నరికివేశాడు, ట్రెజరీ కొత్వాల్ శిరస్సును కూడా ఖండించాడు, ట్రెజరీని కొల్లగొట్టి కచ్చేరీకి నిప్పంటించాడు!ఆ విధంగా అతడి క్రోధారుణ జ్వాలలకు తాలుకా కచ్చేరీ ఆఫీసు భస్మీపటలమైపోయింది.అక్కడ తెగిన శిరస్సులను ఉప్పుకుండలలో భద్రపరిచి నాయనప్ప కొండగుహలో దాచిపెట్టాడు.
ఇక చెలరేగింది అలజడి!జిల్లా కేంద్రమైన కడపలో ఉన్న పోలీసులలోనూ కలక్టరులోనూ భయబ్రాంతులు చెలరేగాయి!ఎవరింత సాహసం చేసింది?బుర్రలకు పదును పెట్టారు.గాలినైనా పేనగల గూఢచారులు ఆచూకీ తీయడానికి పడరాని పాట్లు పడ్డారు.ప్రజలు నరసింహా రెడ్డి పక్షాన ఉన్నారు గనక ఏ ఒక్కరి నోటా పల్లెత్తు మాట పెకలి రాలేదు. కానీ నాయనప్ప కొండగుహలో దాచిన ఆ త్రుంచిన శిరస్సులు గల కుండలు వారి కళ్ళబడ్డాయి.ఆ తలల్ని చూడగానే వాళ్ళ గుండెల్లో రైళ్ళు పరిగెత్తాయి.అదే సమయంలో గూఢచారుల చెవుల్లో నరసింహా రెడ్డి ఆంతరంగికులైన గోసాయి వెంకన్న, ఒడ్డే ఓబన్నల మాటలు పడ్డాయి.ఇక నరసింహా రెడ్డి కోసం గాలించడం మొదలుపెట్టారు.రెండుసార్లు - ఒకసారి గిద్దలూరులో ఒకసారి ముండ్లపాడులో ముఖాముఖి పోరు జరిగింది,రెండు సార్లూ ఇంగ్లీషువాళ్ళు ఓడిపోయి కాళ్ళకు బుద్ధి చెప్పారు.
పిమ్మట రాయలసీమ నేలపై లెఫ్టినెంట్ వాట్సన్, కెప్టెన్ నాట్ అనేవాళ్ళ నాయకత్వాన పెద్ద యెత్తున బ్రిటిష్ సైన్యం దిగింది.ఫిరంగి గుండ్లతో వాళ్ళు నరసింహా రెడ్డిపై దాడి చేశారు.తమ కంఠాల్లో కొన ఊపిరున్ననతవరకు మన స్వాతంత్య్ర వీరులు పోరు సల్పారు.కానీ దొరల చేతికి నరసింహా రెడ్డి చిక్కలేదు.దొరలు పోరాడుతూనే ఉన్నారు, నరసింహా రెడ్డి అదృశ్యమై పోయాడు!
ఎక్కడికి?
నల్లమల అడవుల్లోకి!
ఈ అడవుల్లోకీ ప్రవేశించారు తెల్లదొరలు.
ఏడీ?ఎక్కడ నరసింహా రెడ్డి!
అదిగో!ఎర్రమల అడవుల్లో తిరుగుతున్నాడు.
ఆ అడవుల్లోకీ ప్రవేశించారు తెల్లదొరలు.
కడకు నరసింహా రెడ్డి తెల్ల దొరల కళ్ళల్లో దుమ్ముకొట్టి బనగానపల్లె వద్ద జగన్నాధ పురం కొండమీద ప్రత్యక్షమయ్యాడు!దినాలు, వారాలు, నెలలు గడిచి పోతున్నాయి.ఎట్టకేలకు వారికి నారసింహా రెడ్డి వంటమనిషి దొరికింది.ఆమెకు లంచమిచ్చి బుట్టలో వేసుకున్నారు.నరసింహా రెడ్డి చుట్టూ ఉచ్చులు బిగుస్తున్నాయి - రెడ్డికి ఈ గమనిక లేదు.ఒకనాడు వంటమనిషి నరసింహా రెడ్డిని బాగా తాగించింది.ఆ మత్తులో అతడుండగా తుపాకిలోని తూటాలను తీసి దాచేసింది!అట్లా నరసింహా రెడ్డి నిస్సహాయుడై పోయాడు.అదే అస్మయాన్ని అదను చేసుకొని దొరలు కొండను చుట్టుముట్టి నరసింహా రెడ్డిని తమ కబంధ హస్తాలతో నొక్కి వేశారు.
అతన్ని కోయిలకుంట్లకు తెచ్చి జుర్రేరుగట్టుపై ఉరికొయ్యలు నాటి ఉరి తీసేశారు.రాయలసీమ వీరకుమారు డట్లా అస్తమించిపోయాడు!మద్రాసు ప్రెసిడెన్సీ పరిపాలనా నివేదికలో కోయిలకుంటలో ఉరికొయ్యకు వ్రేలాదదీసిన ఆతది శిరస్సును 30 యేళ్ళు, అంటే 1877 వరకు అట్లానే ఉంచినట్లు చెప్పబడింది.ఆ దారుణ దృశ్యాన్ని గాంచి బ్రిటిషు ప్రభుత్వంపై తిరుగబడటానికి ఎవడూ సాహసించడని దొరల భ్రమ!ఈస్టిండియా కంపెనీ పరిపాలనా నివేదికలలో కూడా ఒక నగ్నసత్యాన్ని బయట పెట్టారు - నరసింహా రెడ్డి సాగించిన పోరాటం సామాన్యమైనది కాదని. ఈ విధంగా ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి భారత స్వతంత్య్ర సమరేతిహాసంలో తన రక్తాన్ని ధారవోసి తెలుగు యోధులు స్వాతంత్య్ర పోరాటంలో ఎవ్వరికీ తీసిపోరని ప్రపంచానికి చాటిచెప్పి ఆరాధనీయుడయ్యాడు.
ఇంగ్లీషువాళ్ళ మీద తిరగబడిన ప్రతి ఒక్కరికీ దేశభక్తిని అంటగట్టటం కూడా చరిత్రకు అన్యాయం చెయ్యడమేనని నా అభిప్రాయం!చరిత్రను రాసేటప్పుడూ చరిత్రను వ్యాఖ్యానించేటప్పుడూ తమ ఎజెండాను చొప్పించడం వల్లనే కమ్యూనిష్టులు ఇవ్వాళ తిట్లు తింటున్నప్పుడు కమ్యునిష్టులు చేసిన తప్పు మనం కూడా చెయ్యడం సరైనదేనా?చరిత్రను రాసేటప్పుడు మన అభిమాన దురభిమానాలనూ రాగద్వేషాల్నీ  కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.అయితే, వ్యాఖ్యానం అనేది ఆ చరిత్రను మనం ఎలా అర్ధం చేసుకుంటున్నామో చెప్పేది కాబట్టి అందులో రాగద్వేషాలు వస్తాయి, రావాలి కూడాను.ముస్లిం పాలకులు మన దేవాలయాలను కూలగొట్టటం అనేది తీసుకుంటే చదువుతున్న హిందువుకి వ్యాఖ్యానాలు చెప్పకపోయినా ఖచ్చితంగా బాధ కలుగుతుంది!అయితే సిరాజుద్దౌలా, మాలిక్ ఇబ్రహీం, తానీషా వంటివారిని కూడా మర్చిపోయేలా బాబర్, షాజహాన్, ఔరంగజేబుల్ని మాత్రమే భూతద్దంలో పెట్టి చూపిస్తూ మొత్తం ముస్లిం సమూహాన్నే ద్వేషించేలా హిందువుల్ని తయారు చెయ్యటం తప్పా కాదా!
ఉయ్యాలవాడ తిరుగుబాటు వెనక పింఛను ఇవ్వకుండా తనని అవమానించటం తప్ప అతను మొత్తం దేశం గురించి ఆలోచించిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా?అప్పటికి భారతదేశం అనే వూహయే లేదు కదా!జంబూద్వీపే భరతవర్షే అని చెప్పేది ఆధ్యాత్మికతకు సంబధించిన విషయం.సాంస్కృతికంగా ఒకటి కావచ్చు గానీ రాజకీయ పరిధిలో అనేకమంది రాజులతో కూడిన అప్పటి కాలంలో ఏ ఒక్క ప్రాంతం పట్ల ఇది మాన్ మాతృభూమి అనిపించే స్థాయిలో అందరికీ ఆప్యాయతలు ఉన్నాయి?మనవాళ్ళు తరచు మన హిందూ రాజులు అసలు యుద్ధాలే చెయ్యని ఇతర ప్రాంతాలను ఆక్రమించని శాంతికాముకులు అని చెప్తారు. మళ్ళీ అదే నోటితో ప్రపంచం సరిహద్దుల వరకు విస్తరించిన మహోన్నత మౌర్య సామ్రాజ్యం అని గొప్పలు చెప్తారు - యుద్ధాలు చెయ్యకుండానూ హింస లేకుండానూ ఆ విస్తరణలు జరిగాయా?లేదే!మతం పేరున చెయ్యలేదు, మత మార్పిడులు చెయ్యలేదు,కిరాతకాలు చెయ్యలేదు,ఓడిపోయినవాళ్ళని కూడా మర్యాదగా చూశారు - ఇంతవరకే వాస్తవం.మనవాళ్ళు కూడా యుద్ధాలు చేశారు,ఇతర ప్రాంతాలని ఆక్రమించారు, గెల్చిన చోట మన సంస్కృతిని వ్యాపింపజేశారు - అది సహజమే!ఒక సంస్కృతి వల్ల ప్రభావితమై ఉత్సాహపడి పాండిత్యంలో గానీ వ్యాపారంలో గానీ క్రీడలలో గానీ యుద్ధాలలో గానీ వ్యక్తులు గెలవడం జరిగితే తమను ఆవేశపరచిన అంశాలు గొప్పవని గెలిచినవాళ్ళు అనుకోవడమూ తమను ఆవేశపరచిన అంశాలు చెత్తవని ఓడినవాళ్ళు అనుకోవడమూ అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ జరగుతూనే ఉంటాయి - తమ తమ సంస్కృతుల తరపున పోరాడి విజయం సాధించినవారికి ప్రశంసలు దక్కేదీ తమ తమ సంస్కృతుల తరపున పోరాడి అపజయం పాలైనవారికి ఛీత్కారాలు దక్కేదీ అందుకే!
ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి ఒక పాళెగాడు!తనకు అవమానం జరిగిందని తిరగబడ్డాడు!ఒక సంవత్సరం పాటు ఇంగ్లీషువాళ్ళకి నిద్ర పట్టకుండా చేశాడు!వీరుడే, స్వాభిమానియే, క్షాత్రం పోగొట్టుకుని ప్రాణాల కోసం ఆశ పడలేదు - కానీ ఇందులో దేశభక్తి ఎక్కడుంది?"ఇది మన దేశం, దీన్ని ఇంగ్లీషువాళ్ళు ఆక్రమించారుప్రజల్ని దోచుకుంటున్నారుఇంగ్లీషువాళ్ళని మన దేశం నుంచి తరిమికొట్టాలి, ప్రజల్ని ధర్మబద్ధమైన పరిపాలనతో సంతోషపెట్టాలి!" అని ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి అనుకున్నట్టు సాక్ష్యం ఉందా?ఇవ్వాళ ఇంగ్లీషువాళ్ళు దుర్మార్గులని తెలిసింది కాబట్టి వాళ్ళ మీద వ్యక్తిగతమైన కారణాల్తో పోట్లాడినా సువిశాల భారత ప్రజానీకం కోసం పోరాడినట్టు భావించాలా?చరిత్రలో ఒక వ్యక్తి యొక్క స్థానం గురించి అంచనా వేసేటప్పుడు ఉన్న గొప్పల్ని దాచెయ్యటమే కాదు లేని గొప్పల్ని అతికించటం  కూడా తప్పే - నిన్నటి రోజున మొదటి తప్పు చేసినందుకు కమ్యునిష్టుల్ని తిడుతూ ఇప్పటి రోజున మనం చేస్తున్నది ఏమిటి?
చరిత్ర విషయంలో రాగద్వేషాలకు అతీతమైన తులనాత్మకత అసాధ్యమా!

Tuesday, 3 September 2019

చందమామకు సూర్యుడు పిల్లనిచ్చిన మామ అవుతాడా?అవునని ఋగ్వేదమే బల్లగుద్ది చెప్తుందహో!

సోముడికీ సూర్యకళకీ జరిగిన, జరుగుతున్న, జరగబోయే వివాహ శుభ యాత్రని వర్ణించే RV (X.85) భాగం మొత్తం ఋగ్వేదంలోనే కవిత్వం ధగద్ధగాయమానమై వెల్లివిరిసే కమనీయ సౌందర్య సంభరితమైన సంతత శారదాంఘ్రి నతమస్తక సరసజనైక మనోవేద్యం!
"ఇంకేముంది,హరిబాబు మళ్ళీ పిట్టకధలు చెప్పేస్తున్నాడు!చీల్చేద్దాం, చెండాడి గెల్చేద్దాం!" అని పరుగున పరుగున పాఱొచ్చే ఛీరంజీవి వై లాంటి ఎదవలకి ఉసూరుమనిపించినా సరే - నిజం చెప్పేస్తున్నాను, ఇది చంద్రగ్రహణం ఏర్పడేటప్పుడు భూమి మీద నుంచి చూస్తే మనకి కనిపించే దృశ్యానికి వెనక జరిగే తతంగం లోని దశల్ని వర్ణించే శాస్త్రసాంకేతిక సంబంధమైన వ్యవహారం. వైదిక సాహిత్యం గంభీరమైన సాంకేతిక విషయాల్ని చెప్పటానికి "ౘందమామకి సన్నజాజికి పెళ్ళి కుదిరింది..." తరహా కవిత్వాన్ని వేదం ఎందుకు వాడుకున్నదో అర్ధం చేసుకోలేని గాడిదలకి "సూర్యగోళం చంద్రగోళానికి పిల్లనివ్వడం యేంటి?చెప్పేవాడికి లేకపోతే వినేవాళ్ళకి సిగ్గు లేదా!" అని అనిపిస్తుంది - గాడిద కేమి తెలుసు గంధపు చెక్కల వాసన?
ఈ సూక్తంలో మొత్తం 47 మంత్రాలు ఉన్నాయి గానీ అన్నీ మనకి అనవసరం.ముఖ్యమైన భావాన్ని చెప్పే మంత్రాల అర్ధం తెలుసుకుంటే చాలు.Earth is held by truth(భూమికి సత్యం ఆధారం) and the heaven is upheld by Sun(ఆకాశానికి సూర్యుడు ఆధారం). Ādityas depend on the cosmic order(ఆదిత్యులకు విశ్వలయ ఆధారం), while Moon is stationed in the sky(చంద్రుడు వాయురాకాశాల మధ్యన స్థిరుడై ఉన్నాడు).
(1)  సోముడనే పేరుగల చంద్రుడు తారకల సమీపంలో ఉన్నాడు.
 (2)  చంద్రుడు సోమలతను చూర్ణం చేసిన ఆసవాన్ని నిరంతరం గ్రోలుతూ ఉంటాడని సర్వులూ భావిస్తారు. కానీ జ్ఞానులకి మాత్రమే అందులోని రహస్యమూ చంద్రుని నిజస్వభావమూ తెలుస్తుంది.
(3)  సోమా! నీవు ఏడు వరసల రక్షణ వలయాల్ని దుస్తుల మాదిరి ధరించి ఉన్నావు. మానవులు నిన్ను యధాతధం స్వీకరించలేరు, వారికి నీవు సులభ పానయోగ్యుడవు కావు.
(4)  సోమా! దేవతలు నిన్ను పానం చేసే కొద్దీ అంతమనేది లేక మరింత వృద్ధినే పొందుతావు. వాయువు నిన్ను రక్షిస్తాడు, ఇలా దేవతల చేత త్రాగబడుతూ సంవత్సరాలకు కారణమై చంద్రుడు కాలస్వరూపుడై ఉన్నాడు.
పైన చెప్పిన మంత్రాలు ఈ సూక్తం యొక్క అధిదేవతను కీర్తించే పరిచయ సూచకమైనవి. వీటి తర్వాత వచ్చే ఏడు మంత్రాలూ (v.6-12) సూర్యభవ అయిన వధువు సూర్యకళ తన ప్రియభర్త అయిన సోముణ్ణి చేరుకోవడానికి చేస్తున్న కళ్యాణవధూగమనయాత్ర ఉపమాఉపమేయరభేదమై అది అన్వయమా ఉత్ప్రేక్షయా ప్రతీపమా ఉల్లేఖమా దీపకమా రూపకమా సందేహమా సహోక్తియా విశేషోక్తియా అన్యోన్యమా వికల్పమా కావ్యలింగమా మీలితమా ఉన్మీలితమా గూఢోక్తియా తద్గుణమా ఉదాత్తమా అని తెలుసుకోలేనంత నిగూఢమైన వర్ణన!సామగానమే ఆమెకు డ్రేపమానం!మానసమే ఆమెకు వాహనం!అంబరమే ఆమెకు ముఖంబరం!శుక్రతారాద్వయమే ఆమెకు రధచోదక వృషభద్వయం! తర్వాత వచ్చే (v.35) మంత్రంలో అశ్వినీ కవలలు దృశ్యంలోకి వచ్చి ఆమె దుస్తులను వర్ణసంశోభితం చెయ్యకపోతే అసలు ఆమె అసూర్యంపశ్యయే!
samānām samvatsarāṇām māsa ākṛtiḥ |
somo rūpaviśeṣairoṣadhiścandramā vā||      Nirukta (11.4-5)
ఈ కవలల్ని సహాయకులని చెప్పడం వల్ల అసలు సన్నివేశం జరిగే స్థలాన్ని సూచిస్తున్నాడు కవి. అంతకు మించిన ప్రయోజనం ఉంటే గింటే ఖగోళ శాస్త్రంలో నిష్ణాతులైనవాళ్ళకి తెలుస్తుంది గానీ ప్రస్తుతం మనలాంటివాళ్ళకి అది అప్రస్తుత ప్రసంగమే!.
sūryāyā vahatuḥ prāgāt savitā yam avāsṛjat|
aghāsu hanyante gāvo’rjunyoḥ paryuhyate ||  (X.85.13)
ఈ మంత్రానికి సంప్రదాయకమైన అర్ధం ఏమిటంటే,పెళ్ళి కానుకలతో సహా పెళ్ళికూతురును మోసుకెళ్తున్న ఎడ్లబండి మఖానక్షత్రసమూహంచే ఉత్సాహపరచబడి అర్జునీ నక్షత్రసమూహంలో కొలువై ఉన్న ఆమె భర్త వైపుకు నడుస్తున్నది అని.
సాయన భాష్యం కూడా దీనిని సమర్ధిస్తున్నది. అయితే ఇక్కడి పదాల్ని ఆకాశంలో జరిగేవాటికి ఆరోపించితే gāvaḥ అనే ధాతువు మంత్రాధిష్ఠాన దైవానికి సంబంధించిన కాంతి కిరణాలనే అర్ధం వస్తుంది.ఇప్పుడు మనం చాలా సూటిగాచంద్రకాంతి యేమో మఘ రాశి వైపుకు ప్రయాణిస్తుంటే సూర్యకళ యేమో అర్జునీ రాశిలో ఉన్న చంద్రుని వైపుకి ప్రయాణిస్తున్నది.” అని అర్ధం చేసుకోవచ్చును - వారెవ్వా, లెక్క ప్రకారం చెప్పిన కవిత్వం కదూ!
కవిత్వం అతి అయితే కపిత్వం అవుతుంది, అది మరీ ఎక్కువైతే పైత్యం ప్రకోపించి హరిత్వం అయ్యే ప్రమాదం కూడా ఉంది కాబట్టి చంద్రుని నీడ Regulus అనే అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రం ఒక భాగమైన ఆరు నక్షత్రాల మఘ సమూహం నుంచి మొదలై పూర్వ-ఫల్గుని అనే అర్జునీ సమూహం వైపుకి సాగుతుంది అని తెలుసుకుంటే ఓ పనైపోతుంది - ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే ఈ గ్రహణం అనే తతంగం జరిగేది Leonis constellation దగ్గిర. హమ్మయ్య, ఓ పనైపోయింది బాబూ! 
తర్వాతిదైన (v.14) మంత్రం అశ్వినీ కవలలు సూర్యకళను తమకు సమర్పించమని అడగినప్పుడు విశ్వదేవసమూహం వారిని సమర్ధించినట్లు చేసిన ప్రస్తావనలోని అంతరార్ధం యేమిటో తెలియడం లేదు.బహుశా, ఈ గ్రహణఛాయ సాగుతున్న నీడ వల్ల కనబడకుండా పోయే మరో రెండు నక్షత్రాలకు ఇది సూచన కాబోలు!అయితే, మనం తెలుసుకోవలసిన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, viśvedevāḥ అని ప్రస్తావించబడిన విశ్వశక్తులకు సంబంధించిన 3339 అనే సంఖ్య గురించి - ఇది ఏమిటో చెప్పకుండా ఇక్కడితో పని ముగించేస్తే పెరుగన్నం వడ్డించని పెళ్ళి భోజనంలా ఉంటుంది నా వ్యాసం!
తర్వాత వచ్చే (v.20) నుంచి (v.35) వరకు మన పెళ్ళిళ్ళని వర్ణిస్తున్నట్టే ఉంటాయి.పెళ్ళి కూతురు మేలిముసుగు రాగి రంగులో ఉండటం భూమి మీదనుంచి చూసినప్పుడు మధ్యలో ఉన్న చంద్రగ్రహం నలనిదై చుట్టూ వ్యాపించిన సూర్యకాంతి వలయానికి ప్రతీక, పోలిక అదిరింది కదా!ఇవన్నీ ఎవరికి వాళ్ళు చదివి ఆనందించాల్సినవి కాబట్టి ఇక్కడ అవన్నీ యెత్తేసి సూటిగా విషయంలోకి వెళ్ళిపోతున్నాను.
ఒక చోట విశ్వదేవతాసమూహం కళ్యాణ వేదిక మీద అగ్నిని వ్రేల్చుతారని ఇన్నది.మరొక చోట ఈ సూర్యకళ సోముడి నుంచి ఒక గంధర్వుడి చేత స్వీకరించబడి ఆ గంధర్వుడి చేత అగ్నికి సమర్పించబడినట్లు ఉన్నది.ఇవన్నీ గ్రహణ సమయపు నభోమండలపు వర్ణనలే తప్ప పెళ్ళి కూతుర్ని వంతులు వేసుకుని అనుభవిస్తున్నట్టు పాషండ మతాల వారు వూహించుకుని పులకించిపోయే భావదారిద్య్రపు అఘాయిత్యాలు ఇక్కడ లేవు!
ఇక్కడ 3339 గురించిన వ్యాఖ్యానం గానీ నిరూపణ గానీ విశ్లేషణ గానీ ఇవ్వకపోవడం వల్ల పండితులలో కూడా కొంతకాలం రకరకాల వూహలూ పోహలూ చెలరేగి కొంత గందరగోళం ఏర్పడింది.  సాయణుల వారు తైత్తిరీయ బ్రాహ్మణం(II.7.12.2)  మీద నమ్మకం పెట్టేసుకుని 33 ఋగ్వేద దేవతలకి మిమంచిన సంఖ్య ఏదైనా కొసరు కింద చేప్పేసుకుంటే సరిపోతుందని తప్పుకునేశారు.Shama Shastry లాంటి ఆధునిక కాలపు పరిశోధక పండితులు 33 సంవత్సరాల కాలచక్రం అయ్యుంటుందని చెప్పి వదిలేశారు.
ఆయనేమో 30 సంవత్సరాలలో 371 చాంద్రామాసాలు వస్తాయని లెక్క చెప్పారు.Kak అనే మరొక పండితుడు ఒక సంవత్సర కాలంలో అగ్ని రూపాన్ని ధరించే దేవతల సంఖ్య 3339 అయ్యి ఉండవచ్చని అనుమానించాడు. ఆయన ఈ సంఖ్యని 9, 371ల గుణకాల(factorials) కింద విడగొట్టి మళ్ళీ వాటిని తిధులూ వాటి భ్రంశాలూ కింద పరిగణించి ఆఖరికి సూర్యమాన సంవత్సరపు తిధుల పేర్న సర్దేసి లెక్కని మడిచేసి తన బరువును దించేసుకున్నాడు. మనపాటికి ఇది బాగానే ఉంది కదా అనిపించి case closed! అని చెప్పెయ్యొచ్చు, కానీ జ్ఞానులు ఉన్నారే - వీళ్ళు తలుపు తెరిచే ఉన్నప్పటికీ సొరంగాలు తవ్వి మాత్రమే తప్పించుకోవాలనుకునే టామ్ సాయర్ లాంటి అల్లరి బుడుగులు. ఇది అసలు సమాధానం కాదూ, ఇంకా ఏదో మిస్సయ్యిందీ అని సణగడం ఆపలేదు!మధ్యలో ఇండాలజిస్టులు దూరి, "అబ్బే!అప్పుడేదో 33 సంఖ్యని చెప్పి ఇప్పుడీలా దాన్ని పెంచి చెప్పి ఉంటారు, ఛందస్సు కోసం చేసిన ఎడ్జస్టుమింటు ఏమో,అంతే అయ్యుంటుంది " అని దఫదఫాలుగా రకరకాలుగా పక్కతాళం వెయ్యడం మొదలుపెట్టారు.
వేదాన్ని ఉన్నది ఉన్నట్టు చదివేసి మనకి ఠక్కున ఏది తోస్తే అదే అక్కడ ఉన్నట్టు అహంకారం చూపించి మన తిండియావని బట్టి మాంసభక్షణనీ సెక్సుయావని బట్టి వ్యభిచారమునూ త్రాగుడు కక్కుర్తిని బట్టి వెన్నెల్లో కల్లునూ వెతుక్కుని మరీ కనుక్కుంటే వేదాన్ని చెప్పిన దేవుడిదా తప్పు? Rothschilds ఇక్కడ దించిన కొందరు మర్మద్విజులు విష్ణువు అవతారమైన పరశురాముడు క్రైస్తవిక క్రూసేడ్లనూ ఇస్లామికీ జెహాదుల్నీ పోలిన నిష్కారణ హింస చేశాడని రాసి ఇరికించిన కొత్త కధల చెత్తని తీసేస్తే మొత్తం 108 అని చెప్పబడే ఉపనిషత్తుల్లోనూ అనేక పురాణాల్లో ప్రముఖమైన అష్టాదశ పురాణాల్లోనూ ఏకసూత్రత ఉంటుంది.ఒకచోట క్లుప్తం అనిపించిన విషయం మరొకచోట విస్తరించి ఉంటుంది. కొందరు ఓపిక తక్కువ వాళ్ళూ తప్పులే పట్టాలనుకున్నవాళ్ళూ "ఇక్కడ ఒకలా ఉంది, అక్కడ ఒకలా ఉంది, అసలిది వేదంలో ఎక్కడా లేదు - కాబట్టి ఇవి వైరుధ్యాలు! వైరుధ్యాలు కాబట్టి అసత్యాలు!" అని కొట్టి పారేసి కాలరేగరేస్తారు గానీ General pathologyలో Cardiologyని ఎందుకు కలిపెయ్యలేదు?Cardiology అనేది General pathology పునాదుల మీద నిర్మించబడిన specialization కాబట్టి Cardiologyలో కనిపించే విషయాలు General pathologyలో కనిపించకపోవచ్చు!అంత మాత్రాన Cardiologyకీ General pathologyకీ సంబంధం లేదంటే ఎట్లా?అలా ఇక్కడ ప్రస్తావించబడిన 3339 సంఖ్యకి సంబంధించిన అన్ని వివరాలనూ మనం బ్రహ్మాండ పురాణంలో చూస్తాము.
అన్నీ వేరు వేరు విషయాలను ప్రతిపాదించే స్వతంత్ర గ్రంధాల వలె కనిపించినప్పటికీ అన్నీ ఒకే సత్యాన్ని ప్రతిపాదిస్తూ వైవిధ్యాన్ని ప్రదర్శిస్తాయే తప్ప 18 పెద్దవీ 18 చిన్నవీ అయిన పురాణాలు ఒకదానితో ఒకటి విభేదించుకోవు!అన్ని ప్రముఖమైన పురాణాలలోనూ ఖగోళ సంబంధమైన విషయాలను గురించి చెప్పేటప్పుడు ధృవనక్షత్రంతో ముడిపడిన మహామేరునిర్మితినే అనుసరించారు పూర్వఋషులు. ప్రస్తుతం అత్యంత ప్రాచీనమైన బ్రహ్మాండ పురాణం చంద్రుడి వృద్ధి క్షయాలనీ దేవతల సోమపానాన్నీ ముడిపెట్టి కాలస్వరూపం యొక్క అసలు రహస్యాన్ని ఎలా కళ్ళకు కట్టినట్టు బోధపరుస్తున్నదో చూడండి!
āpūrayan suṣumṇena bhāgam bhāgamahaḥ kramāt |
suṣumṇā āpyāyamānasya śuklā vardhanti vai kalāḥ ||        BP. I. ( 23.61)
శుక్లపక్షంలో సూర్యుడు తన సుషుమ్నా కిరణాలతో తాకుతూ ఉండటం వల్ల చంద్రుడిలోని కాంతివంతమైన అంశాల సంఖ్య పెరుగుతూ ఉంటుంది.
Bhakṣārtham amṛtam somaḥ pourṇamāsyām upāsate |
ekām rātrīm suraiḥ sarvaiḥ pitṛbhiḥ sarṣibhiḥ saha ||
somasya kṛṣṇapakṣādau bhāskarābhimukhasya tu |
prakṣīyante pitṛdevaiḥ pīyamānāḥ kalākramāt ||
trayaśca trimśataścaiva trayaḥtrimśat tathaiva ca |
trayaśca trisahasrāśca devāḥ somam pibanti vai ||
ityetaiḥ pīyamānasya kṛṣṇā vardhanti vai kalāḥ |
kayanti tasmāt śuklāśca kṛṣṇā āpyāyayanti ca ||       BP.I. (23.66-69)
దేవతలు చంద్రుణ్ణి సమీపిస్తున్నారు.దివ్యఋషులు కూడా మిక్కిలి కాంతివంతమైన పౌర్ణమి నాటి రాత్రివేళ కురుస్తున్న అమృతం కోసం తహతహ లాడుతూ వస్తున్నారు.సోముడి నుంచి స్రవించే రుచిరసోమరుచి వారిలోని అగ్నిని సమాధాన పరుస్తున్నది.అలా రోజుకు మూడువందలముగ్గురు,ముప్పైముగ్గురు,మూడువేలముగ్గురు చంద్రుని నుంచి సోమరసాన్ని స్వీకరించి తేజస్వంతులు అవుతుంటే చంద్రుడు వారు స్వీకరించిన లెక్క ప్రకారం క్షీణిస్తున్నాడు.దానివల్ల చంద్రునిలో కాంతివంతమైన అంశలు తగ్గి కాంతిహీనమైన అంశలు పెరుగుతున్నాయి.అయ్యా, లెక్కల్లో పూరయినవాళ్ళు క్యాలికులేటర్లు తీసుకుని 3003+303+33= అని నొక్కితే 3,339 అని జవాబు వస్తుంది!
మనం అందరం లెక్కల్లో పూర్ అని మన్లో ప్రతి ఒక్కరికీ తెలుసు కాబట్టి మొహమాటపడకండి. నేనేదో మిమల్ని వెక్కిరిస్తున్నాననీ అనుకోనక్కర్లేదు, నేను కూడా సేమ్ టు సేమ్, నో షేమ్!ఇంతకీ చంద్రుడి నుంచి వెన్నెలని, అదేనండీ హిందూద్వేషులు మన దేవతలు తాగి ఛస్తున్నారని కుళ్ళుకు చచ్చే సోమరసాన్ని రోజుక్కొంచెం జుర్రేస్తున్న 3339 మందీ ఎవరో తెలుసా!కృష్ణపక్షంలో వచ్చే తిధులు బాబూ అవి, శుక్లపక్షంలో కూడా అన్నే ఉంటాయి - వెరసి నెలకి 6678 తిధులు!
"అయ్యబాబోయ్!ఎంత గొప్ప విషయం తెలిసిపోయింది?" అని మొహం పెట్రోమాక్సు లైటులా పెట్టకండి, హిందూమతం అనే ముదనష్టపు ముద్దుపేరున్న సనాతనధార్మిక సంప్రదాయం ప్రకారం కాలమే దైవం, దైవమే కాలస్వరూపం - "విశ్వతః పరమాన్నిత్యం విశ్వం నారాయణం హరిం, విశ్వమేవేదం పురుషః తద్విశ్వ ముపజీవతి!" అన్న దాని ప్రకారం మనకి విశ్వం,కాలం,దైవం ఒక్కటే.కాబట్టి All to All దైవాన్ని చూడాలనుకున్న జ్ఞాని వీలయినంత ఎక్కువ కాలం విశ్వనిర్మితిని గురించి తెలుసుకోవటంలో గడపాలి!అంత సత్వం లేనివాళ్ళు వీలయినంత ఎక్కువ కాలం పరోపకారం చేస్తూ జీవిస్తే One to One రూపంలో దేవుడు వాళ్ళ దగ్గిరకే వస్తాడు!

ఎలా వుంది నా లెక్క?

Sunday, 1 September 2019

కౌసల్య దశరధుడు చేసిన అశ్వమేధ యజ్ఞంలో ఒక రాత్రి గుర్రం పక్కన గడిపిందా?

చాలా కాలం నుంచీ హైందవేతరులు రామాయణంలో దశరధుడు చేసిన అశ్వమేధ యాగంలో కౌసల్య గుర్రం పక్కన పడుకున్నట్టు ఉందని ప్రచారం చేస్తున్నారు.ఇక్కడ నేను రామాయ్ణంలో ఆ పర్స్తావ్నకు సంబంధించిన శ్లోకాలు అన్నీ చూపిస్తున్నాను. అసలైన కొసమెరుపు చివర్లో చెప్తాను.మొదట శ్లోకాలని చూడండి!
Slokam 01:
अथ संवत्सरे पूर्णे तस्मिन् प्राप्ते तुरंगमे |
सरय्वाश्चोत्तरे तीरे राज्ञो यज्ञोऽभ्यवर्तत || १-१४-१

valmikiramayan.net:
atha samvatsare puurNe = then, on completion of one year; tasmin praapte turangame = that, on regaining, ritual horse; sarayvaaH uttare tiire = on northern banks of Sarayu river; raaj~naH yaj~naH abhyavartata = emperor commenced ritual.
Then after completion of one year and on regaining the ritual horse, the Emperor Dasharatha commenced his Vedic Ritual on the northern banks of River Sarayu. [1-14-1]
In ashwamedha-yaga , a well-decorated horse will be let out with an insignia on its forehead challenging any king to capture it and face the wrath of releasing king. If any one captures the horse, he shall be strong enough to incite a war. Otherwise, the valour and invincibility of releasing king are well established and he may proceed with the ritual proper. Now that the ritual horse released during last year by King Dasharatha has come back without being captured by anyone, thus establishing the invincibility of King Dasharatha, as such he can commence the ritual proper.

valmiki.iitk.ac.in:
अथ after that, संवत्सरे when one year's time, पूर्णे (सति) was completed, तस्मिन् when that, तुरङ्गमे sacrificial horse, प्राप्ते (सति) had returned, सरय्वा: of river Sarayu, उत्तरे तीरे on the northern bank, राज्ञ: यज्ञश्च sacrifice by the king, अभ्यवर्तत commenced.
After completion of one year when the sacrificial horse had returned, the sacrifice by the king (Dasaratha) commenced on the northern bank of river Sarayu

Slokam 02:
ऋष्यशृङ्गं पुरस्कृत्य कर्म चक्रुर्द्विजर्षभाः |
अश्वमेधे महायज्ञे राज्ञोऽस्य सुमहात्मनः || १-१४-२(1-14-2)

valmikiramayan.net:
sumahaatmanaH = of that well noble-souled king; ashwamedhe mahaayaj~ne raajnaH asya = in great Horse ritual of king; R^iSyashR^ingam puraskR^itya = keeping Rishyasringa at helm of affairs; karma chakruH dvijarSabhaaH = eminent Brahmans commenced works.
Keeping Rishyasringa at the helm of affairs those eminent Brahmans commenced, ashva-medha , the Horse-ritual of that noble-souled Dasharatha. [1-14-2]

valmiki.iitk.ac.in:
सुमहात्मन: of the exceedingly magnanimous, अस्य राज्ञ: this king's, अश्वमेधे महायज्ञे Aswamedha sacrifice, द्विजर्षभा: best among brahmins, ऋष्यशृङ्गम् Rsyasringa, पुरस्कृत्य led by, कर्म चक्रु: performed the rituals.
The best of brahmins led by Rsyasringa performed the rituals of aswamedha organised by the exceedingly magnanimous king.

Slokam 03:
कर्म कुर्वन्ति विधिवद्याजका वेदपारगाः |
यथाविधि यथान्यायं परिक्रामन्ति शास्त्रतः || १-१४-३

valmikiramayan.net:
 yaajakaaH vedapaaragaaH = ritual conductors, well versed in Vedas; karma kurvanti vidhivat = works, performed, customarily; yathaavidhi yathaanyaayam = as per canon, as per rules; parikraamanti shaastrataH = conducted, as per scriptures.
Those well-versed conductors of Vedic rituals called ritviks , have started to perform works relating to ritual as per canon and rules, and conducted them scripturally and customarily. [1-14-3]

valmiki.iitk.ac.in:
वेदपारगा: scholars who mastered vedas fully, याजका: chief priests, विधिवत् in consonance with tradition and scriptures, कर्म tasks, कुर्वन्ति carried out, यथाविधि in conformity with duties laid down in vedas, यथान्यायम् according to law, शास्त्रत: as laid down in scriptures, परिक्रामन्ति move about (officiated).
The chief priests, masters of the Vedas, conducted the rituals in consonance with traditions and scriptures. They officiated in conformity with duties laid down in the Vedas and according to law.

Slokam 04:
प्रवर्ग्यं शास्त्रतः कृत्वा तथैवोपसदं द्विजाः |
चक्रुश्च विधिवत्सर्वमधिकं कर्म शास्त्रतः || १-१४-४

valmikiramayan.net:
dvijaaH = Brahmans; pravargyam shaastrataH kR^itvaa = on performing pravargya ritual as per scriptures; tathaa eva upasadam = like that, upasada ritual; cha vidhivat = also, customarily on performing; adhikam sarvam karma shaastrataH = many more, all, rituals too, as per scriptures; chakruH = they performed.
On performing pravargya ritual as per scriptures, like that upasada ritual too, those Brahmans have customarily performed all of those other rituals incidental to the main one scripturally. [1-14-4]

valmiki.iitk.ac.in:
द्विजा: brahmins, प्रवर्ग्यम् Pravargya (a particular part of the sacrifice), शास्त्रत: according to scriptures, कृत्वा having done, तथैव and, उपसदम् Upasada (another part of the sacrifice), विधिवत् as per tradition, अधिकम् still other, सर्वं कर्म ceremonies, शास्त्रत: according to ordinance, चक्रु: performed.
Brahmins performed pravargya and upasada and other ceremonies as per the scriptures and traditions.

Slokam 05:
अभिपूज्य तदा हृष्टाः सर्वे चक्रुर्यथाविधि |
प्रातःसवनपूर्वाणि कर्माणि मुनिपुंगवाः || १-१४-५

valmikiramayan.net:
tadaa =                then; munipungavaaH = distinguished sages; sarve hR^iSTaaH = all of them, are contented with; abhipuujya = worshipping those and those gods; praataH savanapuurvaani karmaani = early morning, savana rituals and its ancillary; yathaavidhi chakruH = performed as enjoined.
Then all of those distinguished sages are contended with what they have performed by worshipping gods already summoned, they also conducted early morning savana ritual and its ancillaries as enjoined. [1-14-5]

valmiki.iitk.ac.in:
तत: thereafter, मुनिपुङ्गवा: eminent ascetics, हृष्टा: rejoiced in their hearts, अभिपूज्य worshipping those celestial beings, प्रातस्सवनपूर्वाणि starting with Pratah savanadi (morning ablutions etc), कर्माणि rituals, यथाविधि as prescribed, चक्रु: performed.
Thereafter the eminent ascetics, rejoicing in their hearts performed the worship (of celestial beings) and conducted the prescribed rituals starting with morning ablutions etc.

Slokam 30:
नियुक्तास्तत्र पशवस्तत्तदुद्दिश्य दैवतम् |
उरगाः पक्षिणश्चैव यथाशास्त्रं प्रचोदिताः || १-१४-३०

valmikiramayan.net:
tatra = in that ritual; yathaashaastram prachoditaaH = as per the scriptural, directives; pashavaH uragaaH pakShiNaH cha eva = animals, serpents, birds, also, thus; tat tat daivatam uddishya = designated to that and that deity; niyuktaaH = are readied.
In that ritual animals, serpents and birds designated to such and such deities are readied according to the scriptural directives. [1-14-30]

valmiki.iitk.ac.in:
पशूनां त्रिशतं तत्र यूपेषु नियतं तदा।

अश्वरत्नोत्तमं तस्य राज्ञो दशरथस्य च ।।1.14.30।।
तदा then, तत्र there, पशूनाम् of animals, त्रिशतम् three hundred, तस्य राज्ञ: that king's, अश्वरत्नोत्तमम् the excellent of the horses from the stables, यूपेषु to the sacrificial posts, नियतम् was bound.
Three hundred animals and the jewel of the horses (from the stables) belonging to king Dasaratha were bound to the sacrificial posts.

ఇక్కడ 1-14-30 అనే శ్లోకం రెండు రకాలుగా ఎందుకు కనబడుతున్నది?

Slokam 31:
शामित्रे तु हयस्तत्र तथा जलचराश्च ये |
ऋषिभिः सर्वमेवैतन्नियुक्तं शास्त्रतस्तदा || १-१४-३१

valmikiramayan.net:
shaamitre tu = in animal sacrifices, but; tatra = there; hayaH tathaa ye jalacharaaH = horse, like that, those, water animals [are to be there, them]; sarvam eva etat = all, of them; tadaa = then; R^iSibhiH niyuktam shaastrataH = arranged by sages, as per scriptures.
The sages have arranged those animals that are to be there in animal sacrifices, like horse and other aquatic animals, in that ritual according to scriptures. [1-14-31]
Many animals are sacrificed in Horse ritual. But they will be segregated as forest animals and village animals. In them many of the forest animals will be let off by taking them round the fire on to their right in salutation to fire, agnipradakShiNa-namaskaara. The animals pertaining to village will be sacrificed in ritual. Hence it is up to the priests to decide which is to be retained or let off.

valmiki.iitk.ac.in:
कौसल्या तं हयं तत्र परिचर्य समन्तत:।

कृपाणैर्विशशासैनं त्रिभि: परमया मुदा ।।1.14.31।।
तत्र there, कौशल्या Kausalya, तम् that, हयम् horse, समन्तत: from all sides, परिचर्य having worshipped worship, परमया with immense, मुदा glee, त्रिभि: by three strokes of, कृपाणै: scimitar, एनम् this, विशशास severed.
Kausalya, with immense glee having gone round and worshipped that horse, severed it with three strokes of scimitar.

ఇక్కడ 1-14-31 అనే శ్లోకం రెండు రకాలుగా ఎందుకు కనబడుతున్నది?

Slokam 32:
पशूनां त्रिशतं तत्र यूपेषु नियतं तदा |
अश्वरत्नोत्तमं तस्य राज्ञो दशरथस्य च || १-१४-३२

valmikiramayan.net:
tadaa = then; tatra = in that ritual; trishatam pashuunaam = three hundred, animals; tasya raaj~naH ashwaratnottamam = that, king Dasharatha's, gemlike best horse; yuupeSu niyatam = arranged [tied] to wooden posts.
Three hundred animals are tied to the ritual posts, along with the gemlike best ritual horse of that King Dasharatha. [1-14-32]

valmiki.iitk.ac.in:
पतत्रिणा तदा सार्धं सुस्थितेन च चेतसा।
अवसद्रजनीमेकां कौशल्या धर्मकाम्यया।।1.14.32।।
तदा then, कौशल्या Kausalya, सुस्थितेन चेतसा with a stable mind, धर्मकाम्यया with devotion to duty, पतत्रिणा सार्थम् near that horse, एकाम् one, रजनीम् night, अवसत् spent.
Kausalya, in her devotion to duty and with a happy state of mind, passed one night near that horse.

ఇక్కడ 1-14-32 శ్లోకం రెండు రకాలుగా ఎందుకు కనబడుతున్నది?

Slokam 33:
कौसल्या तं हयं तत्र परिचर्य समंततः |
कृपाणैर्विशशासैनं त्रिभिः परमया मुदा || १-१४-३३

valmikiramayan.net:
tatra = in that ritual; kausalyaa = Queen Kausalya; tam hayam = that, horse; samantataH paricharya = on making circumambulations all around; paramayaa mudaa = with great, delight; tribhiH kR^ipaaNaiH = with three, knives; vishashaasa enam = killed, that one - the horse.
With great delight coming on her Queen Kausalya reverently made circumambulations to the horse, and symbolically killed the horse with three knives. [1-14-33]
Here Kausalya did not butcher the horse as queens do not butcher animals in rituals, but the horse is already sacrificed. It is a symbolical act of queens to pierce with three golden knives like needles. The scripture says that all the eligible wives of the performer of ritual have to pierce that way. sauvarNiibhi suuciibhiH patnayaH ashvasya asipathaan kalayanti - shruti / scripture. So all the three queens have performed that symbolic act by piercing that horse, which is already dead, with golden needle-like knives. Govindaraja.

valmiki.iitk.ac.in:
होताऽध्वर्युस्तथोद्गाता हस्तेन समयोजयन्।
महिष्या परिवृत्त्या च वावातां च तथापराम्।।1.14.33।।
होता Hota, अध्वर्यु: Adhvaryu, तथा and, उद्गाता Udgata, महिष्या with Mahishi (principal queen at the time of coronation), परिवृत्त्या च (overlooked wife) Parivritti, वावाताम् (a courtesan) Vavaata, अपराम् (attender on the king) other woman (known as Palakali), हस्तेन with hand, समयोजयन् touched.
Hota, Adhvaryu and Udgata arranged Mahishi, Parivritti, Vavaata and another woman known as Palakali to touch (keep the company of) the sacrificial horse.

ఇక్కడ 1-14-33 శ్లోకం రెండు రకాలుగా ఎందుకు కనబడుతున్నది?

Slokam 34:
पतत्रिणा तदा सार्धं सुस्थितेन च चेतसा |
अवसद्रजनीमेकां कौसल्या धर्मकाम्यया || १-१४-३४

valmikiramayan.net:
kausalyaa = Queen Kausalya; susthitena cha chetasaa = with composed heart - impassively; dharmakaamaayaa = dharma, desiring for achieving results; patatriNaa saardham = with horse, for results; [where patatri = also means a bird, one that swiftly flew away like a bird; the sacrificed ritual horse is equated with the Divine Eagle garuDa - that conducts the oblations;] ekaam rajaniim avasat = one, night, she resided with that horse that flew away.
Queen Kausalya desiring the results of ritual disconcertedly resided one night with that horse that flew away like a bird. [1-14-34]

valmiki.iitk.ac.in:
पतत्रिणस्तस्य वपा मुद्धृत्य नियतेन्द्रिय:।
ऋत्विक्परमसम्पन्न: श्रपयामास शास्त्रत:।।1.14.34।।
नियतेन्द्रिय: a man of restrained senses, परमसम्पन्न: very rich in the knowledge of scriptures, ऋत्विक् official priest, तस्य that, पतत्रिण: horse's, वपाम् marrow, उद्धृत्य having removed, शास्त्रत: according to tradition, श्रपयामास cooked.
The official priest, highly knowledgeable in scriptures and having restrained senses, removed the marrow from the horse and cooked it according to tradition.

ఇక్కడ 1-14-34 శ్లోకం రెండు రకాలుగా ఎందుకు కనబడుతున్నది?

Slokam 35:
होताध्वर्युस्तथोद्गाता हस्तेन समयोजयन् |
महिष्या परिवृत्त्या च वावातामपरां तथा || १-१४-३५

valmikiramayan.net:
[tatha = then;] hotaadhvaryuH tathaa udgaataa = hotaa, adhwaryu, thus, udgaataa, [the three officiating priests of the ritual]; mahiSyaa parivR^ittyaa = crowned queen, neglected wife of king; vaavaataam cha = concubine of king, also; aparaam tathaa = next, thus; hastena samayojayan = took by hand.
Thus, the officiating priests of the ritual, namely hotaa adhwaryu and udgaataa have received in their hand the Crowned Queen, the neglected wife, and a concubine of the king, next as a symbolic donation in the ritual by the performer, the king. [1-14-35]
There will be four officiating priests for these Vedic rituals. 1. brahmaa , 2. hotaa , 3. adhvaryu , 4. udgaataa , to whom the king has to donate his inner core properties like wives, lands etc. By practice a king has to marry four wives. The four women of the king are 1. mahiSi = Queen, 2. parivR^itti = neglected women, 3. vaavaata = concubine, 4. paalaakali = goblet-maid. The order of donation is that the Queen to brahmaa , concubine to hotaa , neglected woman to udgaataa , and the goblet-maid to the adhwaryu . Here, though the brahma ritvik is not cited along with paalaakali, goblet-maid, they are implied. The donation is symbolic and later bartering with some valuable items that is redeemed. Govindaraja. There is another way of translating this. For the wording, hastena samayojayan the priests took these wives by hand to bring them in contact with the dead horse.

valmiki.iitk.ac.in:
धूमगन्धं वपायास्तु जिघ्रति स्म नराधिप:।
यथाकालं यथान्यायं निर्णुदन्पापमात्मन:।।1.14.35।।
नराधिप: king Dasaratha, यथाकालम् in an appropriate time, यथान्यायम् in agreement with the scriptures, आत्मन: his own, पापम् sins, निर्णुदन् while getting rid of, वपाया: of the marrow, धूमगन्धम् good odour of the smoke, जिघ्रति स्म inhaled.
The king at appropriate time and in agreement with the scriptures inhaled the odour of the smoke (from the burnt marrow) and absolved himself of his sins.

ఇక్కడ 1-14-35 శ్లోకం రెండు రకాలుగా ఎందుకు కనబడుతున్నది?

అసలు "By practice a king has to marry four wives. The four women of the king are 1. mahiSi = Queen, 2. parivR^itti = neglected women, 3. vaavaata = concubine, 4. paalaakali = goblet-maid." అనేది ఎంత తెలివితక్కువ వాదన!concubine అంటే ఉంపుడు కత్తె లేక వేశ్య అని అర్ధం - అలాంటివాళ్ళని రాజు పెళ్ళి  చేసుకోవడమా?పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేకనే ఉంపుడుకత్తె స్థానం ఇస్తారనేది కామన్ సెన్సుతో ఆలోచించినా తెలిసే అతి మామూలు విషయం!అలాంటి వాళ్ళతో హోతకీ అధ్వర్యుడికీ రాజు దానం ఇవ్వడమా?ఇది హిందూమతానికి ఒక ఆదర్శపురుషుణ్ణి పరిచయం చెయ్యాలని రామాయణ కావ్యాన్ని రాస్తున్న వాల్మీకి రాశాడంటే నమ్మాలా!

valmikiramayan.net:
हयस्य यानि चांगानि तानि सर्वाणि ब्राह्मणाः |
अग्नौ प्रास्यन्ति विधिवत् समस्ताः षोडशर्त्विजः || १-१४-३८
hayasya yaani angaani = which body-parts of horse are there; taani sarvaaNi = they, all of them; samastaaH braahmanaaH = all, Brahmans; ShodashartwijaH = sixteen priests; vidhivat agnou praasyanti = procedurally, oblated in fire.
Those remaining body parts that horse are there, the sixteen officiating priests have procedurally oblated all of them into fire. [1-14-38]

valmiki.iitk.ac.in:
हयस्य यानि चाङ्गानि तानि सर्वाणि ब्राह्मणा:।
अग्नौ प्रास्यन्ति विधिवत्समन्त्राष्षोडशर्त्विज:।।1.14.36।।
हयस्य horse's, यानि अङ्गानि those limbs, तानि सर्वाणि all of them, समन्त्रा: with prayers, षोडश ऋत्विज: sixteen officiating priests, ब्राह्मणा: brahmins, विधिवत् as per the customs, अग्नौ in the fire, प्रास्यन्ति offered.
The sixteen officiating priests (brahmins) offered all the horse's limbs with prayers as per the customs.
ఒక చోట 1.14.36 అయిన శ్లోకం ఒక చోట 1-14-38 అయినది - ఏమిటి దీని అర్ధం?ఉత్సాహం ఎక్కువైనవాళ్ళు మరింత సొంత పాండిత్యం చూపించారని తెలియడం లేదా!అదీ గాక, దశరధుడి అవసరం పిల్లలు పుట్టటం - దానికి చెయ్యాల్సింది పుత్రకామేష్ఠి!మరి ఇక్కడ అశ్వమేధం ఎందుకు చేయించారు?ప్రతి యజ్ఞానికీ ప్రయోజనం,విధివిధానం,ఉపాంగ విధానం, ఫలితం ఇచ్చే దేవత అన్నీ ప్రత్యేకం అయినప్పుడు ఓక్ దానికి మరొక దాన్ని చేయించటానికి దశరధుడి పురోహితులు Rothschilds అనుచరులా?దశరధుడు తనకు అవసరమైన పుత్రకామేష్ఠి తప్ప రాజసూయం గానీ అశ్వమేధం గానీ చెయ్యనే చెయ్యలేదు - అయ్యా, అదీ నా కొసమెరుపు!

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...