Saturday, 6 April 2019

అప్పుని ఎవరు తీరుస్తున్నారు?అప్పుని ఎలా తీరుస్తున్నారు?అప్పుని తీర్చడానికి డబ్బుని ఎలా ఉపయోగించుకుంటున్నారు?అప్పుని లేకుండా చెయ్యలేరా!

     2019లో భారతదేశపు మొత్తం ఆదాయం కేవలం 167 లక్షల కోట్లు,కానీ అంతర్జాతీయ ద్రవ్యనిధికి చెల్లించాల్సిన సాలుసరి వడ్డీ ₹4,551,323,407,985 - మొత్తం అప్పు ఎప్పటికి తీరుతుంది?ఇంగ్లీషువాళ్ళు రాకముందు హిందూ ముస్లిం ప్రభువులు ఎవ్వరూ తమ రాజ్యాలని పోషించటానికి బయటివాళ్ళ దగిర అప్పు చెయ్యలేదు - అప్పుడూ ఒక స్థాయిలో వేరే రూపంలో బ్యాంకింగ్ సిస్టం ఉండేది, కానీ రాజులు  తమ సొంత ఆస్తుల్ని తనఖా పెట్టి గానీ మరుసటి ఏడాది రాబడి నుంచి తీర్చే ఒప్పందంతో గానీ రాజ్యం లోపలి ధనవంతుల నుంచే అప్పులు చేసేవాళ్ళు, అప్పు చేసేది నిర్మాణాత్మకమైన అభివృద్ధి పనుల కోసం కాబట్టి ఆదాయం రాగానే తీర్చేసేవాళ్ళు!

          కానీ ఇంగ్లీషువాళ్ళు మాత్రం ఈ దేశప్రజల పట్ల ఎలాంటి బాధ్యతా లేని పక్కా వ్యాపారస్తులు కాబట్టి ఎప్పటి కప్పుడు వాళ్ళ పాత అప్పుల్ని కొత్తగా స్వాధీనం చేసుకున్న రాజ్యపు ఖజానా నుంచి కిట్టించేసుకునేవాళ్ళు.సాక్ష్యం ఏమిటంటే 1765లో East India Company బెంగాలుని పట్టుకునేసరికే వాళ్ళు ఫ్రెంచివాళ్ళతో చేసిన యుద్ధాల వల్ల అప్పుల్లో ఉంది.ఆ అప్పుల్ని బెంగాలు ఆదాయం నుంచి నొల్లుకుని చెల్లు చేసుకోవటంతో మొదలుపెట్టి అప్పటినుంచి మన దేశంలోనూ మన దేశానికి బయటా వాళ్లు చేసిన ప్రతి యుద్ధానికీ ఖర్చయిన ప్రతి రూపాయీ మన ప్రజల కష్టార్జితమే - ఆఖరికి ప్రధమ స్వాతంత్య్ర పోరాటం అని ఆప్యాయంగా పిలుచుకునే సిపాయిల తిరుగుబాటుని అణిచివెయ్యటానికి వాళ్ళు చేసిన ఖర్చు కూడా మన కష్టార్జితమే!

          భారతదేశం బ్రిటిష్ రాణికి పూర్తి స్థాయి వలస రాజ్యం కాబొయే ముందరి 1834లో East India Company యొక్క అప్పు సుమారు Rs. 36.9 కోట్లు. British Parliament  కూడా వాళ్ళ చుట్టమే కాబట్టి ఈ అప్పుని భారతీయుల ఖాతాలోకి వేసేసింది - లేకపోతే కంపెనీ తన  పెత్తనాన్ని ప్రభుత్వానికి స్వాధీనం చెయ్యదు మరి!

        1834 నాటి Charter Act వల్ల భారతదేశంలో ఏర్పడిన Government మక్కీకి మక్కీ లండనులోని British Government యొక్క ప్రతిరూపమే - It was the Indian Goverment formed by the British, of the British, and for the British!

    1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటుని అణిచివెయ్యటానికి అయిన ఖర్చును కూడా కలిపితే 1860 నాటికి భారతదేశం యొక్క అప్పు Rs. 693 కోట్లకి పెరిగింది.యుద్ధాల ఖర్చుకి తోడు మన దేశంలో జరిగిన ఉత్తుత్తి అభివృద్ధి కోసం ఖర్చుపెట్టిన Home Charges కూడా మననుంచి అప్పు తీసుకుని ఖర్చు పెట్టిన ఉదారులు వాళ్ళు!

      అలా 1913 నాటికి భారతీయుల అప్పు Rs. 411 కోట్లకి చేరింది.1914లో వచ్చిన మొదటి ప్రపంచయుద్ధం నాడు భారత ఉపఖండపు ప్రజలు  బ్రిటిష్ ప్రభుత్వానికి Rs. 150 కోట్ల యుద్ధనిధిని కానుక ఇచ్చారు - మన మహాత్ముడి సెంటిమెంటుతో కూడిన ప్రసంగాలకి కరిగిపోయి సామాన్య స్త్రీలు తమ ఒంటిమీద బంగారాన్ని కూడా ఒలిచి ఇచ్చారు!ఇంగ్లీషువాళ్ళకి మనం ఇచ్చిన కానుక వల్ల ఆ తర్వాత ఆరు సంవత్సరాల పాటు వందేసి కోట్ల లోటు బడ్జెట్ కష్టాల్ని అనుభవించిన ఉదారులం మనం!

          మొదటి ప్రపంచయుద్ధం తర్వాత ప్రపంచ రాజకీయాల్లో జరిగిన ప్రముఖమైన సంఘటన పాలస్తీనా ఏర్పాటు వెనక ఉన్న మెలిక ఏమిటో తెలుసా!ఆ యుద్ధం తొలి దశలో ఇంగ్లీషువాళ్ళకీ జర్మన్లకీ మధ్య దీర్ఘకాలిక కలహంలా ఉండేది.జర్మన్ల దగ్గిర U-boat అనే శక్తివంతమైన జలాంతర్గామి ఉండటంతో దాదాపు అన్ని దాడుల్లోనూ వాళ్ళదే పైచేయి అవుతూ ఉండేది.కానీ పూర్తి గెలుపు కూడా సాధ్యపడేది కాదు.ఎందుకో,  జర్మన్లకే విసుగు పుట్టి యుద్ధం మొదలు కాక ముందరి స్థితికి ఇద్దరూ వెళ్ళి కుదురుకునే అద్భుతమైన శాంతి ప్రతిపాదన చేశారు!బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఒప్పేసుకుందామనుకునే సమయానికి జియోనిస్టు యూదులు రంగప్రవేశం చేశారు - "అబ్బెబ్బే!మీరు లొంగిపోవటం ఏంటి?పరువు తక్కువ!అమెరికా గనక మీ తరపున సాయం వస్తే మీరే గెలుస్తారు - అమెరికాని యుద్ధంలోకి లాక్కొచ్చే పూచీ మాది" అని వూదర గొట్టారు.అయితే, యుద్ధంలో గెలిచాక తమకు పాలస్తీనా పేరుతో ప్రత్యేక దేశం ఏర్పాటు చెయ్యాలని మెలిక పెట్టారు.

         అటువైపు అమెరికా పరిస్థితి ఎట్లా ఉందో తెలుసా!వీళ్ళ మధ్య జగడం మొదలైన మొదటి రోజుల్లోనే అప్పటి అమెరికా అధ్యక్షుడు ఈ యుద్ధంలో కలగజేసుకోనని ప్రకటన చేసి ఉన్నాడు.ఈ పీటముడిని విప్పటానికి అప్పటినుంచే జర్మనీకి జాత్యహంకారపు ముద్ర వెయ్యటం మొదలైంది - మీడియా వాళ్ళ అధీనంలోనే ఉంది కదా!అలా దుర్మార్గమైన జర్మనీని అణిచివేసే మహదాశయంతో అమెరికాని  బ్రిటిష్ ప్రభుత్వం వైపున పోరాడటానికి రంగం సిద్ధం చేసిన జియోనిస్టు  యూదులు మన మహాత్ముడిలా అంతటి సత్యసంధులు మాట తప్పరని యుద్ధం అయిపోయే వరకు తెల్లమొహం వేసుకుని కూర్చోలేదు - యుద్ధం నడుస్తూ ఉండగానే ఒప్పందపత్రాలు రాసుకుని యుద్ధం పూర్తి కాగానే సర్వస్వతంత్ర యూదు రాజ్యాన్ని సాధించుకున్నారు.ఇక్కడ మన దేశంలో మాత్రం యుద్దనిధినీ సైనికుల్నీ అందించి సాయం చేస్తే బ్రిటిష్ ప్రభుత్వం యుద్ధం కాగానే మనకి స్వతంత్రం ఇచ్చేస్తుందని నమ్మబలికిన మోహన దాసు గాంధీ యుద్ధం పూర్తయ్యాక తను తెల్లమొహం వేసి మనని వుసూరు మనిపించాడు.ఇంకా విచిత్రం ఏమిటంటే, కొన్నేళ్ళ తర్వాత జరిగిన రెండో ప్రపంచ యుద్ధం నాడు కూడా మోహన దాసు అధ్వర్యంలో ఇదే నాటకం నడిచింది.

         మన దేశభక్తులుంగార్లు వాళ్ళ పాటికి వాళ్ళు బ్రిటిషుమిత్రుడు గారి అధ్వర్యంలో కాలక్షేపం బఠానీ ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు, భారతీయుల అప్పు బ్రిటిష్ వాళ్ళ పాపంలా పెరిగి పోతూనే ఉన్నది - డిల్లీ నగర నిర్మాణానికి అయిన Rs 13 కోట్ల పైచిలుకు ఖర్చును కూడా కలుపుకుని బ్రిటిష్ ఇండియా అప్పు 1924 నాటికి Rs. 918 కోట్లకి ఉబ్బిపోయింది.

       మొదటి ప్రపంచయుద్ధం మనకి చేసిన మహోపకారం రోడ్లు వేసీ రైళ్ళని తిప్పీ ఇంగ్లీషు నేర్పీ ఇంగ్లీషువాళ్ళు మనల్ని బాగు చేశారని రుజువు చెయ్యటానికి వాళ్ళూ వాళ్ళ తైనాతీలూ  మన మార్కెట్ చాలా చిన్నది గనక దాన్ని వాళ్ళు విస్తరించకపోతే కూపస్థ మండూకాల మాదిరి ఉండిపోయేవాళ్ళమని చెప్తున్న అబద్ధాల్ని పటాపంచలు చెయ్యటమే - 1917లో Rs. 53 కోట్లూ 1918లో Rs. 57 కోట్లూ చాలా ఈజీగా నొక్కేశారు!1922 నుంచి అయిదేళ్ళ పాటు రైల్వేస్ మీద Rs. 150 కోట్లు ఖర్చు పెట్టినందుకు గాను Rs. 300 కోట్ల అప్పు పెరిగింది - బాగు చెయ్యటం అంటే అప్పులు పెంచటమా!

        మూలిగే నక్క మీద తాటిపండు పడినట్టు రెండో ప్రపంచ యుద్ధపు ఖర్చు కూడా మన నెత్తినే పడింది"The Government was able to raise huge loans as can be seen from the fact that the interest-bearing obligations of the Government rose from Rs. 1204 crores in 1939-40 to Rs. 2308 crores in 1945-46." అని ఒక ఆర్ధిక విశ్లేషకుడు అంటున్నాడంటే ఇంగ్లీషువాళ్ళు అంత పిండేసిన తర్వాత కూడా ఈ భూమిలో పోషణనీ సంపదనీ ఇవ్వగల తత్వమూ ఈ దేశప్రజలలో కష్టించే తత్వమూ సంపదని సృష్టించగల సామర్ధ్యమూ ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధం చేసుకోండి!

         అన్ని ప్రతికూలతల మధ్యన ఆస్థాయిలో వార్షిక ఆదాయాన్నీ ఆ స్థాయిలో వృద్ధి రేటునీ ఆ స్థాయిలో మార్కెట్ విస్తృతినీ చూపించిన దేశం ప్రపంచ చరిత్రలోనే ఎక్కడా లేదు!మోహన దాసు నుంచి మదన మోహను వరకు అంతా శ్రీవైష్ణవులే అయితే మరి బుట్టెడు చేపలూ ఏమైనాయి అన్నట్టు 1925ల నాడు కూడా ఇంగ్లీషువాళ్ళ ప్రభుత్వం మన అదృష్టం కొద్దీ వచ్చిందని పులకించి పోతూ జరిపిన ద్వితీయ స్వాతంత్య్ర సంగ్రామం ఫలించిన 1947 మార్చి నాటికి మన అప్పు Rs. 2331.98 కోట్ల దగ్గిర నిలబడింది!

         ఇప్పుడు మనం ఆర్ధిక విషయాలని మర్చిపోయి కొంచెం వెనక్కి వెళ్ళి  1922 నాటి ఖిలాఫత్ ఉద్యమ కాలంలో ఆగుదాం. ఖిలాఫత్-చౌరీచౌరా-మోప్లా అనే త్రిత్వం గురించి first hand information తెలుసుకుంటే మన దేశం తీర్చలేనంత అప్పుతో స్వతంత్రం తెచ్చుకోవడానికీ స్వదేశీ శ్రేయోరాజ్యం ఏర్పడిన తర్వాత కూడా ఎడతెగని కుల కక్షలకీ మతహింసకీ ఆలవాలమై ఇప్పటికీ సమస్యలతోనే కొట్టుమిట్టాడుతూ ఉండటానికి ముఖ్యమైన కారణం ఇంగ్లీషువాళ్ళ విభజించి పాలించే కూటనీతి కన్న హిందువుల అమాయకత్వమూ పయోముఖ విషకుంభం లాంటి మోహన్ దాస్ కరంచంద్ గాంధీని నెత్తిన పెట్టుకుని అతను ఆడించినట్టు ఆడటమే అని బోధపడుతుంది - మన మీద మనకే రోత పుడుతుంది!

         కేవలం గాంధీకి ముస్లిం నాయకుల్ని బుట్టలో వేసుకోగలనన్న పిచ్చి నమ్మకం తప్పిస్తే ఖిలాఫత్ ఉద్యమాన్ని కాంగ్రెసు యొక్క సత్యాగ్రహ ఉద్యమంతో కలపటం ఆయన ప్రియశిష్యుడైన  నెహ్రూతో సహా ఎవరికీ ఇష్టం లేదు.చౌరీ చౌరా సంఘటన ఫిబ్రవరి 5, 1922 నాడు జరిగింది.అక్కడ ఉన్నది ఖిలాఫత్ ఉద్యమకారులు. ఒక రోజు ముందర  సత్యాగ్రహులూ ఖిలాఫత్ ఉద్యమకారులూ కలిసి 2500 మంది ఒక కల్లు కొట్టు దగ్గిర పికెటింగ్ చేస్తుంటే పోలీసులు కొందరు నాయకుల్ని అరెస్టు చేశారు, ఉద్యమకారులు తమ నాయకుల్ని విడిపించుకోవటం కోసం పోలీసు స్టేషను దగ్గిర గుమిగూడి నినాదాలతో ఆందోళన చెయ్యటం మొదలుపెట్టారు.వాళ్ళని చెదరగొట్టటానికి పోలీసులు కాల్పులు జరిపితే ముగ్గురు అక్కడికక్కడే చచ్చిపోయారు, చాలామంది గాయపడ్డారు.దీనితో ఉద్యమకారులకి మరినత్ కోపమొచ్చి కాల్పులను కూడా లెక్కచెయ్యకుండా ముందుకి దూకుతూ ఉండటంతో ఇప్పుడు పోలీసులు వాళ్ళ మొండిధైర్యానికి భయపడి స్టేషను లోపలికి వెళ్ళిపోయి తలుపులు వేసుకుని కూర్చున్నారు.ఇంక ఉద్యమకారులకి పిచ్చెత్తిపోయి పోలీసు స్టేషనుకి నిప్పంటించారు - మొత్తం 23 మంది పోలీసులు మలమల మాడిపోయారు, వాళ్ళు కూడా భారతీయులే!

       ఈ వార్త తెలియగానే మహాత్మ గాంధీ గారు విలవిలలాడిపోయారు.తనే వాళ్ళని చంపేసినంత దుఃఖంతో రగిలిపోయి ముందు అలవాటు చొప్పున 5 రోజుల నిరశనవ్రతం పాటించేశారు. తర్వాత తీరిగ్గా విచారించి విచారించి క్షోభపడి క్షోభపడి పశ్చాత్తాపం చెంది తను సత్యాగ్రహుల్ని సరైన రీతిలో నడిపించలేకపోయాననీ భారతీయులు బ్రిటిషువాళ్ళమీద అహింసాయుతపోరాటం చెయ్యటానికి పూర్తి స్థాయి చైతన్యం సంతరించుకోలేదనీ భావించి ఫిబ్రవరి 12న అన్ని సహాయ నిరాకరణ మరియు శాసనోల్లంఘన కార్యక్రమాల్నీ ఆపెయ్యమని ఆదేశించారు.అయినప్పటికీ బ్రిటిష్  ప్రభుత్వం గాంధీకి ఆరు సంవత్సరాల కారాగార వాసపు శిక్ష విధించింది.అయితే అనారోగ్య కారణాల వల్ల 1924లోనే విడిచిపెట్టింది లెండి - లేదంటే, అప్పుడు అతను బయటికి వచ్చి వాళ్ళకి చేసిపెట్టలసిన ఘనకార్యం ఏదో తగలడి ఉంటుంది!

          మహానుభావుడు, జైలుకి వెళ్ళే ముందు ఖిలాఫత్ అనే ఒక వెరిమొర్రి ఉద్యమాన్ని ఎందుకు సమర్ధించాడో దానివల్ల రాబోయే కాలంలో సాధించగలననుకున్న హిందూ ముస్లిం ఐక్యత గురించి ఎన్ని కలలు కన్నాడో ఉద్యమాన్ని ఆపెయ్యటం వల్ల తను జైలునుంచి బైటికి వచ్చేసరికి చరిత్ర దానికి వ్యతిరేక దిశలోకి  తిరిగి వెనక్కి మళ్ళించటానికి వీలు లేనంత దూరం వెళ్ళిపోయింది - హిందూ ముస్లిం ఐక్యత భగ్నమైపోయింది!ఉద్యమం ఆపెయ్యటం అందరికన్న ఎక్కువ ముస్లిముల్ని దెబ్బ తీసింది.ఎందుకంటే, చౌరీచౌరా సంఘటనలో పాల్గొన్నది వాళ్ళే గనక వాళ్ళని తప్పు పట్టినట్టు భావించారు..గాంధీకి అత్యంత సన్నిహితుడైన రాజాజీ కూడా డైరీలో "...Despite my close relationship with my mentor Gandhi, I fail to understand the reason why he called off the movement." అని రాసుకున్నాడంటే అప్పటి సంక్షోభాన్ని అర్ధం చేసుకోవచ్చు.

         తమ ఖిలాఫత్ ఉద్యమాన్ని ప్రోత్సహిస్తున్నాడన్న ఒకే ఒక స్వార్ధపూరితమైన ఆకాంక్ష తప్పిస్తే గాంధీ పట్ల గానీ కాంగ్రెసు పట్ల గానీ హిందువుల పట్ల గానీ ఏమాత్రం ఆపేక్ష లేని ముస్లిం నాయకులు ఖిలాఫత్ ఉద్యమం తమకు తెచ్చిపెట్టిన కొత్త పాప్యులారిటీతో కేరళలోని మోప్లాలో చేసిన భీబత్సానికి అప్పటికే లోలోపల ముస్లిములంటే భయంతో ఉన్న హిందువులు పాకిస్తాన్ ఏర్పాటుని స్వాగతించే మనస్తత్వంలోకి వెళ్ళిపోయారు.

         For six months from August 1921, the rebellion extended over 2,000 square miles (5,200 km2) – some 40% of the South Malabar region of the Madras Presidency. An estimated 10,000 people lost their lives, although official figures put the numbers at 2337 rebels killed, 1652 injured and 45,404 imprisoned. Unofficial estimates put the number imprisoned at almost 50,000 of whom 20,000 were deported, mainly to the penal colony in the Andaman Islands, while around 10,000 went missing. The most prominent leaders of the rebellion were Variankunnath Kunjahammad Haji, Sithi Koya Thangal and Ali Musliyar. Estimates of the number of forced religious conversions range from 180 to 2500; 678 of the 50,000 rebels were charged with this crime.

        Citing narratives available to him regarding the actions of the Mappilas during the rebellion, C. Sankaran Nair  wrote:"The horrid tragedy continued for months. Thousands of Mahomedans killed, and wounded by troops, thousands of Hindus butchered, women subjected to shameful indignities, thousands forcibly converted, persons flayed alive, entire families burnt alive, women it is said hundreds throwing themselves into wells to avoid dishonour, violence and terrorism threatening death standing in the way of reversion to their own religion. This is what Malabar in particular owes to the Khilafat agitation, to Gandhi and his Hindu friends."

          ఆనాడే కొంతమంది గాంధీ అసలు రూపాన్ని గుర్తించినప్పటికీ దానిని సామాన్య ప్రజలకి తెలియనివ్వకుండా దాచేశారు.దానితో పాటు దాచేసిన విషయాలు చాలా ఉన్నాయి.వాటిలో ఒకటి ముస్లిములు పాకిస్తాను కోసం ఔరంగజేబు చచ్చిపోయి మొఘల్ సామ్రాజ్యం  బలహీనపడిన తర్వాత మరాఠాలు మొఘల్ సామ్రాజ్యాన్ని ధ్వంసం చెయ్యటం మొదలు పెట్టి అప్పటి మొఘల్ పాదుషాని దాదాపు తమ సామంతుడి స్థాయికి దిగజార్చి ఎర్రకోట మీద రెండు జండాలు ఎగరేసినప్పటినుంచీ "ఔరంగజేబు తరహా ముస్లిం సామ్రాజ్యం" కోసం తపించిపోతున్నారనేది కూడా చాలామందికి తెలియనివ్వలేదు.


   ఇంగ్లీషువాళ్ళు కూదా చాలా ముందుగానే ముస్లిములకి పాకిస్తాను ఇవ్వటానికి వొప్పుకున్నారనేది కూడా మనకి తెలియనివ్వకుండా దాచేశారు.ఖిలాఫత్ ఉద్యమం నాటినుంచి దేశ విభజన వరకు జరిగిన ప్రతి చరిత్రాత్మకమైన సన్నివేశమూ పధకం ప్రకారం గాంధీ సహకారంతో పాకిస్తాన్ ఏర్పాటుకి సామాన్య ప్రజల్ని సంసిద్ధులను చెయ్యటం కోసమే నడిచింది!సైకో ఎనలిస్టులు ఎవరైనా గాంధీ మనస్తత్వాన్ని విశ్లేషించారో లేదో తెలియదు గానీ నాకున్న కొద్దిపాటి  పాండిత్యానికే అతను ఇతరుల్ని హింసించి ఆనందించే శాడిస్టు మనస్తత్వం గల సైకోలా కనిపిస్తున్నాడు! గాంధీని చరిత్ర చెత్తబుట్టలోకి విసిరెయ్యందే మనం ముందుకు వెళ్ళలేం అనిపిస్తుంది నాకు!ఇది నేను వ్యక్తిగత రాగద్వేషాలతో చెప్తున్న మాట కాదు.అసలు నాకు అతని మీద వ్యక్తిగత కోపం దేనికి?నేను పుట్టేటప్పటికే తను చచ్చిపోయాడు - నా ఆస్తిని దోచుకునే చాన్సు గానీ నా పెళ్ళానికి లైనేసే చాన్సు గానీ తనకి లేదు గదా!

         మీరు నిదానంగా ఆలోచించండి, కేవలం నలుగురు సభ్యులున్న కుటుంభానికి యజమాని బాధ్యత లేకుండా ప్రవర్తించి కుటుంబాన్ని అప్పులపాలు చేస్తే ఎంత పీకి పాకం పెడతారు?అలాంటిది, సామాన్య ప్రజల బాగు కోసమే స్వదేశీ పాలన తెస్తున్నామని చెప్పి ఎవరి కొంపలో వాళ్ళు కడుపులో చల్ల కదలకుండా కూర్చున్నవాళ్ళని వీధుల్లోకి లాక్కొచ్చి రాట్నం వడికించీ బట్టల్ని తగలబెట్టించీ లాఠీదెబ్బలకి గురిచేసీ జైళ్ళకి పంపించీ ముస్లిములు మమ్మల్ని పాడు చేశారు ఏం చెయ్యమంటావని అడిగితే నాలుకలు కోసుకుని చావండని చెప్పినా కిక్కురుమనకుండా తన వెంట నడిచిన లక్షల కోట్ల అమాయక జనాలకి దేశబిభజన సమయంలో ఇంగ్లీషువాళ్ళు మిగిల్చిన అప్పులో పాకిస్తాను వాటాకి కేవలం 300 కోట్లు మాత్రం వేసి అది కూడా సాలుసరి వాయిదాల్లో 50 యేళ్ళు డేకించవచ్చునని వెసులుబాటు ఇచ్చి ఇక మిగిలిన మొత్తం అప్పుని అంటగట్టిన తల మాసిన వెధవ ఏ రకం తండ్రి?

       హిందువుల్ని భయంకరమైన దుర్మార్గుల కింద చిత్రించి వీళ్ళ కింద మేం బతకలేమని చెప్పినవాళ్ళు, రక్తపిశాచుల మాదిరి వాళ్ళు చేసిన భీబత్సాలని కూడా హిందువుల అణచివేత మీద చేసిన తిరుగుబాటు కింద చెప్పేసుకున్న పవిత్రభూమి కోసం అలమటించిన ముస్లిములు ఆ అప్పులో ఒక్క రూపాయి కూడా చెల్లించకపోతే ముక్కు పిండి వసూలు చేసుకోలేనివాళ్ళు దేశానికి ఎందుకు స్వతంత్రం తెచ్చారు?వాళ్ళు దేశభక్తులా!

     కాపరం చేసే కళ కాలు తొక్కేనాడే తెలుస్తుందని అంటారు కదా - స్వతంత్రం తీసుకురావడమే ఇంత లక్షణంగా చేసినవాళ్ళు స్వతంత్రం వచ్చాక మాత్రం ప్రజల గురించి ఎందుకు పట్టించుకుంటారు?అస్సలు పట్టించుజోలేదు - స్టాంపు పేపరు మీద రాసిస్తాను!

         Top IMF official has said as he cautioned that the global debt has reached a new record high of USD 182 trillion in 2017. As on 31 December 2018, India's external debt stock totaled US$ 521.2 billion, a quarter-over-quarter increase of 2.1%.External Debt in India decreased to 510428 USD Million in the third quarter of 2018 from 514442 USD Million in the second quarter of 2018.

         ఇవ్వాళ, అంటే 2019 నాడు 167 లక్షల కోట్ల ఆదాయంలో ప్రభుత్వోద్యోగుల జీతభత్యాలు, రక్షణ శాఖకి కావాల్సిన ఆయుధాల కొనుగోళ్ళు, టెలికమ్యూనికేషన్ వంటి common expenditures తీసేస్తే వడ్డీయే పూర్తిగా కట్టలేని స్థితిలో ఉంది దేశం - ఇంత అప్పు నెత్తి మీద వేలాడుతున్నప్పుదు "మన ఎదుగుదల అమోఘం!ఇంకేముంది, ఒక్క అడుగు వేస్తే అగ్రరాజ్యం హోదా వచ్చేస్తుంది" అని నమ్మబలుకుతున్న మాటల్లో నిజం లేదు.

     అసలు స్వతంత్రం తెచ్చుకునేటప్పుడే "మీరు చేసిన అప్పులతో మాకు సంబంధం లేదు,మాకు ఋణం లేని దేశం కావాలి" అని మెలిక పెడితే ఎట్లా వుండేది?పోనీ ఇవ్వాళ ఈ అప్పుని ఇంగ్లీషువాళ్ళనే తీర్చమని అడగవచ్చునా!ఆ విషయాలన్నీ తర్వాతి పోష్టులో చర్చిస్తాను.


(this is the fourth part of a series on macro economy!)

6 comments:

  1. ఒక వారం క్రితం ఆంధ్రా వెళ్ళి నిన్ననే తిరిగి చెన్నై చేరుకున్నాను.నా వరస పోష్టుల్లో మిగిలిన విషయం బాగా తగ్గించి 5తో సరిపెట్టడమా, లేక మొదట అనుకున్నట్టు 7 వరకు లాగించడమా అనే డైలమాలో ఉన్నాను.

    ఇంతకీ వ్యాసాలు ఎలా వున్నాయి అన్నదానికి ఇంతవరకు ఎవరూ జవాబు చెప్పలేదు, కారణం ఏమిటి?ఎక్కువ శాతం అంకెలు చెప్పడం, తక్కువ శాతం విశ్లేషణ ఉందటం వల్ల అర్ధం కావడం లేదా?మొదటి పోష్టులోనే చాలా వివరంగా అడిగాను అబిప్రాయాలు చెప్పమని - అయినా ఇంత నిశ్శబ్దం ఎందుకో అర్ధం కావటం లేదు.

    నాపాటికి నేను రాసుకుంటూ వెళ్ళిపోవడం బోరు కదా!అందువల్లనే 5కి కుదించి సరిపెడదామనే ఆలోచన వస్తున్నది.ఒకటి మాత్రం నిజం, నాకు పరిస్థితి అర్ధమైంది నేను గెలవాల్సిన శత్రువు ఉప్పటికే ప్రపంచాధిపత్యం సాధించేశాడు,నేను కూడా ఆ శత్రువు యొక్క పరిపాలనలోనే ఉన్నాను.ఈ ప్రపంచ స్థాయి దుర్మార్గం మొత్తం "అప్పులు చెయ్యడం/తీర్చడం" మీద ఆధారపడి ఉంది.

    ఖర్మ!ఒపీనియన్ చెప్పించుకోవడానికి కూడా బతిమిలాడుకోవలసి వచ్చింది, వస్తున్నది - ఇక బ్లాగుల్లో హరిబాబు శకం ముగిసిపోయిందా?పోతున్నదా?


    P.S:నేను పోరాడుతున్న శత్రువు హిందువులనే కాదు, భారతదేశంలోని క్రైస్తవులనీ మహ్మ్మదీయులనీ హేతువాదులనీ కూడా అణిచివేస్తున్నాడు.కానీ, నిజానికి కట్టుబడి అబద్ధాలు చెప్తున్న హిందువుల్ని కూడా ఖండిస్తున్నప్పటికీ కొందరు వాళ్ళ అబద్ధాల్ని ఖండిస్తే చెన్నై వరకు వచ్చి తంతామని బెదిరిస్తున్నారు - ఆ శౌర్యం ఉమ్మడి శత్రువు మీద చూపించగలరా~!వాళ్ళు చూపించలేరు, నాకు తెలుసు.నేను కూడా వీళ్ళకీ శత్రువుకీ కూడా భయపడటం లేదు.సత్యమే నా ఆయుధం, సత్యమే నా కవచం - వెన్ను చూపేది లేదు, ముందుకే వెళ్తాను!

    ReplyDelete
  2. complicated subject boss

    ReplyDelete
    Replies
    1. agreed!

      But, it is the solution providing source for our problems.All these political differences between TDP, BJP,TRS, YCP were also manipulated by the economics of debt.

      Even AP state bifurcation also manipulated and sponsored by the forces who rule us from outside the country!

      why such disinterest on very important topic?I am unable to catch whether you are able to accept these thoughts or rejecting them as meaningless.For my own understanding there is full clarity!As I mention again and again I am getting answers for my own curious questions and then publishing it in a way that you may also have the same doubts.

      Remember, to change the system that corrupts us, we need to understand the structure of the system!

      agreed?

      Delete
  3. ఇంగ్లీషువాళ్ళకి యుద్ధనిధిని సమకూర్చి మనవాళ్ళని యుద్ధంలో చేరడానికి ప్రోత్సహించిన గాంధీ "యుద్ధంలో మనం వాళ్ళకి సహాయం చేస్తే యుద్ధం తర్వాత వాళ్ళు మనకి స్వతంత్రం ఇస్తారు!" అనే ప్రకటన స్వయంగా చేశాడా?లేక అతని పేరుతో ఇతరులు ప్రచారం చేశారా!ఒకవేళ గాంధీయే స్వయంగా చేసి ఉంటే అది ప్రజలకి అబద్ధం చెప్పినట్టు కాదా?

    దీనికి కాంగ్రెసు పార్టీలో చేరి active plotical career కొనసాగిస్తానన్న విశ్వవీక్షణం గారు ఏమి చెబుతారు?వ్యక్తిగతమైన స్పర్దతోనూ నా పాండిత్యం ప్రదర్శించుకోవడానికీ కాదు, ఒక కాంగ్రెసు అభిమాని స్పందన ఎలా ఉంటుందో తెలుసుకోవాలని అడుగుతున్నాను, చెప్పగలరా?

    Anybody, who think my version is wrong and baseless can answer with historical documentary evidences.

    ReplyDelete
  4. మాటల్లేవు!! ఆశ్వాదించడమే !! అంతే :)
    Reading, understanding, analyzing and responding, each step needs a week to us Sir as we are weak :)

    ReplyDelete
  5. maalika ప్రశాంతంగా ఉందేమిటబ్బా అనుకున్నా తమర్ని పీకేసినందులకా?

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...