Monday, 25 February 2019

ఎందుకో ఇంత దుఃఖం!ఎందుకో ఇంత నైరాశ్యం?

కరిగిపోయే మంచు వంటి కాలమా,
మరచిపోలేని కన్నీటి కధలను సృష్టించే జాలమా!

ఒకనాడు అతిలోక వైభవాలను చవిచూసిన వారికి
మరునాడు మితిలేని వైఫల్యపు తాకిడిని రుచి చూపిస్తావు!

ఒకనాడు పూలదారులలో నడిచి హసించిన వారిని
మరునాడు ముళ్ళదారులలో నడిపించి కన్నీరు కురిపిస్తావు!

ఒకనాడు ప్రేమం విరిసిన హృదయాలు గలవారిని
మరునాడు ద్వేషం నిండిన శత్రువుల వలె మారుస్తావు!

ఒకనాడు హంసతూలికపై శయనించిన వారిని
మరునాడు పూరిగుడిసెకు చేర్చి ఈతాకుచాప వేస్తావు!

ఒకనాడు కీర్తి శిఖరాల నెక్కిన వారిని
మరునాడు అపకీర్తి పాతాళానికి తొక్కి వేస్తావు!

ఒకనాదు ఆనంద తాండవం చేసి మురిసినన వారిని
మరునాడు నరాల పట్లు సడలించి కొయ్యబొమ్మలను చేస్తావు!

ఒకనాడు కన్నుల వెలుగుల రవ్వలు చిమ్మిన వారిని
మరునాడు చిమ్మచీకట్ల చేతిసాయపు నీడల వెనక్కి పంపిస్తావు!

మరిగిపోయే గుండె ఉన్న మానవా,
తిరిగిరాని పన్నీటి కధలను స్మరించే భావమా!

(hari.Sa.babu)
25/02/2019
11:00 PM

Tuesday, 19 February 2019

ఎప్పుడో ఆదాము నిషిద్ధ ఫలం తిన్నందుకు ఇప్పటికీ పుట్టిన ప్రతి శిశువునీ జన్మపాపం అంటించి శిక్షించటం న్యాయమా?

నేను ఈ మధ్య వరకు క్రైస్తవులు జన్మపాపం అంటున్నది దేవుని ఆజ్ఞను ధిక్కరించడమో లేకపోతే సెక్సు గురించి తెలుసుకుని సిగ్గు పడటమో అనుకునే వాణ్ణి!ఎందుకంటే, మనకి తెలిసిన కధ ప్రకారం సాతాను జియ్యరు పండును తినిపించాక యెహోవా దేవుడు వాళ్ళని చూట్టానికి వచ్చినప్పుడు ఆదామూ హవ్వా సిగ్గుతో మొలల్ని కప్పుకుని కనపడ్డారనీ దాన్ని బట్టే యెహోవా దేవుడు వాళ్ళు నిషిద్ధఫలాన్ని తిన్నారని తెలుసుకుని విపరీతమైన కోపంతో మండిపడి ఈడెన్ తోట నుంచి వెళ్ళగొట్టేస్తాడని ఉంటుంది కదా!తర్వాత తరాల్లో దావీదు ఉచ్చనీచాలు మరిచి నిస్వార్ధంగా రాజ్యం తరపున యుద్ధం చేస్తున్న సైనికుడి భార్య మత్సిబాతో లైఫ్‌టైం ఎంజాయిమెంటుకి తన మొగుణ్ణి చంపించడం, లోతు కూతుళ్ళు తండ్రితో సంగమించడం లాంటివే రక్షకుడి వంశం నిండా పరుచుకుని ఉంటాయి, వాటికి శిక్షలూ పడతాయి.బహుశః దానికి సిగ్గుపడి రక్షకుడికి కూడా దాన్ని తగిలించడానికి ఇబ్బందిపడి జీససు దైవపుత్రుడని కల్పించి ఉంటారని నా అనుమానం!సహజంగానే ఈ పోలికల వల్ల ఆదాముని ఈడెన్ తోట నుంచి గెంటెయ్యడంలో తప్పు లేదనిపిస్తుంది.కానీ క్రైస్తవ్యంలో ఇవ్వాళ మనుషులందరూ పుట్టుకతోనే మోస్తున్న పాపం "ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోవడం " అట!

ఇదెక్కడి విడ్డూరం?మర్దరో మానభంగమో దోపిడీయో వ్యభిచారం చెయ్యటమో అక్రమసంబంధం పెట్టుకోవటమో పాపం అంటే ఒక మాదిరి, దేవుడి ఆజ్ఞను ధిక్కరించటం అన్నది కూడా బలమైన కారణమే - అసలు ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకున్నందుకే యెహోవా దేవుడు ఆదామునీ హవ్వనీ అన్ని చావు తిట్లు తిట్టి మెడ పట్టి ఈడెన్ తోట నుంచి గెంటేశాడా!

నమ్మట్లేదా?సాక్ష్యం చూపించాలా!తప్పదా?చూపించందే వూరుకోరా?సరే!నాకేం భయం?

"యెహోవా యుద్ధనీతి vs శ్రీరాముని యుద్ద నీతి పార్ట్ -1 " అనే ఒక క్రైస్తవ మతప్రచారకుడు పెట్టిన వీడియో దగిర"Neelam Sundar Vijaya Kumar 2 weeks ago వినాయకుడి గొంతు కోయడానికి కారణం శివుడి సెక్స్ కోరిక. ...సాంబశివ రావు బ్రదర్ కు మరొక్క సారి వందనాలు" అంటూ మొదలవుతున్న కామెంటుని ఫాలో అవ్వండి!

సారుకి బైబిలు కన్న హిందూ గ్రంధాల మీదనే మంచి పట్టు ఉన్నది.దానికి తోడు "కనీసం వినే హిందూ సోదర సోదరీలు గ్రహిస్తే చాలు." అనే హమదాశయంతో ఉన్నారు.వారి జిజ్ఞాసకీ హిందువులని ఉద్ధరించాలనే ప్రేమకీ చాలా ముచ్చటేసింది! కానీ ఒక హిందువు "4.54 బిలియన్ ఇయర్స్ క్రితం స్రృష్టి జరిగితే 6000సం"క్రితం వచ్చి నేను స్రృష్టి చేశాను అంటాడా భాష కొక పేరగల ఆ బేవర్స్ ఎలోహిం, యాహ్వే, జెహోవా,యహోవ గాడ్డ్." అని రెచ్చిపోతుంటే సారు "6000 సం క్రింద సృష్టి ఆవిర్భావం జరిగింది అని ఎక్కడుందో కాస్త చెప్పురా." అని మళ్ళీ మళ్ళీ నిలదీస్తుంటే పాపం హిందూ గ్రంధాల్ని చదవడంలో మునిగిపోయి బైబిలు చదవడం తగ్గించి ఉంటారని జాలిపడి "బైబిల్ ప్రకారం భూమి వయసు 6000 కాదు బాబోయ్ అని మీరు నెత్తి నోరు కొట్టుకుంటే సరిపోతుందా! బైబిల్ పూర్తిగా చదివిన ఎవరికైనా 6000 అని సులభంగా తెలిసిపోతుంది. మీ దేవుడు యహోవా 6 రోజుల్లో సృష్టి పూర్తి చేసి 6 వ రోజు మీ ఆదామును సృష్టించాడు. ఆదాము పుట్టిన 130 సం. రాలకు సేతు పుట్టాడు. సేతు 912 సం. రాలకు చనిపోయాడు అప్పటికి సృష్టి వయసు 130+912+6=1048. తర్వాత నోవా 14 సం. రాలకు పుట్టాడు అప్పటికి 1062 అయింది. ఆదిమకాండం 7:6 ప్రకారం ప్రళయం వచ్చే సమయానికి నోవా వయసు 600 సం. అంటే క్రీ.పూ. 1662 లో ఒక మహా ప్రళయం వచ్చి జీవరాశి చాలా అంతరించిపోయింది. ఆ తర్వాత అబ్రహం క్రీ. పూ. 2300-2500 సం. రాలకు పుట్టాడు. కాబట్టి 2018(ఈ సం)+1662(ప్రళయ సమయానికి సృష్టి వయసు)+2400=6080 సం. ఇది మాకు అర్థం అయిన లెక్క. కాదు అని మీరు చెబితే మేము ఎలా ఒప్పుకునేది. అదీకాక బైబిల్ ప్రకారం భూమి ముందు పుట్టి సూర్యుడు నక్షత్రాలు తర్వాత పుట్టాయి. అంటే సూర్యుని వయసు నక్షత్రాల వయసు ఇంకా తక్కువ. ఇక కాదు బాబోయ్ అని మీరు చెబుతున్నారు కదా మీ లెక్క మాకు చూపండి."  అనే కామెంటు వేసి  నేను  సాయం చేశాను.

దానికి సారు "ఆదికాండము 5: 3. ఆదాము నూట ముప్పది యేండ్లు బ్రదికి తన పోలికెగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అను పేరు పెట్టెను. ఆదాము పుట్టిన తరువాత అని బైబుల్ లో లేదు. అది బహుశః మీ కరుణాకర్ వెర్షన్ అయి ఉండవచ్చు. ఆ 130 సంవత్సరాలు అనేది ఆదాము తోటలో నుంచి బయటకు వచ్చిన తరువాత. ఆదాముకు తినవద్దన్న పండు తినేంతవరకు చావు అన్న శాపం లేదు. కాబట్టి ఆదాము ఏదేను తోటలో ఎన్ని సంవత్సరాలు జీవించాడు అనేది తెలియదు. లక్షలు కావొచ్చు కోట్ల సంవత్సరాలు కావొచ్చు. ఆదికాండము 2: 16. మరియు దేవుడైన యెహోవాఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును; 17. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు; నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని కాజ్ఞాపించెను. బైబుల్ ప్రకారం సృష్టి మొదలై 6000 సంవత్సరాలు అనేది మూర్ఖుల మూర్ఖత్వం మాత్రమే." అని జవాబిచ్చి మొత్తానికి హిందూ గ్రంధాల అధ్యయనంలో పడి బైబిలుని మర్చిపోలేదని నిరూపించారు, శభాష్!

ఇక్కడే నాకు మొదటి షాక్ తగిలింది -  "17. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు; నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని కాజ్ఞాపించెను." అనేది చదవగానే మొదట తల దిమ్మెక్కిపోయింది,తర్వాత ఒళ్ళు జలదరించింది, తర్వాత రోమాలు నిక్కబొడుచుకున్నాయి, ఆఖర్న చక్కిలిగింతలు పెట్టినంత నవ్వొచ్చింది.అనుకోకుండానే "వార్నీ!మంచీ చెడూ తెలియడమే పాపమా? ఇదెక్కడి దరిద్రం!మరి, తెలియకపోవడం మంచి అనీ తెలియడం చెడు అనీ అనుకుంటే అది తెలిసేటట్టు చేసే పండుని అక్కడ ఉంచడం దేనికి?" అనిపించింది - అదే అక్కడ ఉంచాను.

ఆయన పదిమందితో ఒక్కసారి పోరాడగలిగిన అసహాయ శూరుడు కదా, ఇతర్ల దాడితో కొంతసేపు దారి తప్పారు, మళ్ళీ ఈ లైను దగ్గిరకి రావడానికి కొంత టైము పట్టింది.ఆ సైడ్ ట్రాక్ దగ్గిర కూడా నేనే ఉన్నాను.సారు హిందూ పౌరాణిక పాండిత్యం వెలార్చిన మొదటి కామెంటులోని "శివుడు దేవుడే అని అంటారు గానీ జ్ఞానం లేని దేవుడు. ఎందుకంటే భూత వర్తమాన భవిష్యత్తు తెలియని దేవుడు." అనే ముక్కకి "mee devudiki bhavushyattu telisae siluva meeda neeligi chschchaadaa? Chastaanani mundae telistae tappinchukovalani enduku choosaadu! Oe tandree, naa tandree ani gukkapatti aedchaadugaa :-()" అని కొంచెం ఘాటు రిటార్టు ఇచ్చాను.దానికి సారు కూడా "యేసుక్రీస్తు చనిపోక ముందే తాను చనిపోయి 3వ రోజున తిరిగి లేస్తాను అని చెప్పారు. ఆయన దేవుడు మరియు మనుష్యుడు కాబట్టి ఆయనలో మనిషి ఆ బాధను బట్టి అలా వేడుకున్నారు కాని ఏమన్నారు నీ చిత్తమే సిద్దించునుగాక అన్నారు. లూకా సువార్త 22: 43. తండ్రీ, యీ గిన్నె నా యొద్దనుండి (తొలగించుటకు) నీ చితమైతే తొలగించుము; అయినను నా యిష్టముకాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించెను. మత్తయి సువార్త 20: 18. ఇదిగో యెరూష లేమునకు వెళ్లుచున్నాము; అక్కడ మనుష్యకుమారుడు ప్రధానయాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును; వారాయనకు మరణశిక్ష విధించి 19. ఆయనను అపహసించు టకును కొరడాలతో కొట్టుటకును సిలువవేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు; మూడవ దినమున ఆయన మరల లేచును." అని దీటుగానే స్పందించారు.

నిజానికి  బైబిలులోని ఈ భాగాన్ని ఓకసారైనా చదివి ఉంటే కొంత అర్ధమై మౌనంగా ఉండిపోయేవాణ్ణేమో! కానీ, ఆయన అంత వివరమైన జవాబు చెప్పేసరికి దాన్ని చదవగానే చాలా డౌ వచ్చాయి.
"why all that unnecessary crucifixion and resurrection drama?

The king just asked prove yourself as Messiah! If he was real Messiah with great knowledge and 
efficient to do miracles like walking on water to save others can definitely win in the court of law and be a winner! 

The king ordered crucifixion because Jesus could not prove himself in the court of law before the king, is it not?"
అంత పాండిత్యం గల మనిషి కూడా ఎందుకో ఇంత సూటి ప్రశ్నలకి జవాబు చెప్పడం మానేసి "మీ కరుణాకర్ లేకపోతే ఇంకో కటారి కాకపోతే మీనాక్షిల 6000 సం థియరీ గురించి నీ రెస్పాన్స్ ఏంటి? ఒక్కొక్కటిగా నరుక్కుంటూ వొద్దాం." అని వాదనని వూహించని కొత్త మలుపు తిప్పాలని ప్రయత్నించారు.

దానికి మెయిన్ పాయింటు మీద కుతూహలం ఎక్కువ ఉండటం వల్ల "First we complete this topic of Sin of Adam is descending to all the human beings like a hereditary disease concept.

I really got shock just by seeing that numbered statement which declares that knowing what is good and bad is the main cause to threw the couple from Eden, and that was the sin according to yahova,bible and christianity!Upto now I thought it is related to sexual flirting because of little knowledge about it. The main reason god knew about their crime is covering their genitals.

But now it is clear from the text you pasted here from the Bible itself is really absurd! If knowing good and bad is the real sin, It is meaningless to declare that the sin is congenital - why because, we are learning what is good and what is bad from our parents!

Moreover I am not having any relation with karunakar. You also answered in a way that those times starts from the point coming out of Eden and you are not discarding the time scales yourself, and you are unable to give a number for the time spent by the first couple in Eden! I am very thankful if you could tell me about it, because I knew very little about bible.

The questions I am asking from the text what you pasted from bible here only.I am not interested in that.All my curiosity about that janmapaapam aroused just now, after seeing the statement made by you. 

So, I request you to enlighten me about the sin of Adam." అని మళ్ళీ మెయిన్ ట్రాక్ మీదకి తీసుకొచ్చాను.

దానితో సారు నా జిజ్ఞాసకు ముచ్చటపడి "బ్రదర్ చాలా అయోమయంలో ఉన్నట్లుంది మీరు. దేవుడు తన రూపంలో సృజించారు ఆడమును. అంటే అప్పుడు ఆడముకు చెడు తెలీదు ఒట్టి మంచి మాత్రమే తెలుసు. ఆడం చెడు తెలుసుకోడం దేవుడికి ఇష్టం లేదు. అందుకే ఆ పండు తిన్న దినాన చేస్తావు అని హెచ్చరించారు. ఇక్కడ చావు అంటే శరీరం నుండి ప్రాణం బయటకు పోడం కాదు. ఆత్మ నిరంతరం చావడం. ఈ విషయం హిందూ ధర్మంలో తెలియదు. దేవుడు చెప్పినట్లే జరిగింది. ఆదికాండము 3: 19 నీవు నేలకు తిరిగి చేరువరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు; ఏలయనగా నేలనుండి నీవు తీయబడితివి; నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పెను. హిందూ ధర్మంలో మానవుడి సృష్టి మట్టి నుండి అని తెలియదు. అసలు ఎలా సృజించబడ్డాడు అనడానికి ఒక్కో పురాణంలో ఒక్కో రకంగా చెప్పబడింది. అలాగే దేవుళ్ళు కూడా సృష్టించబడ్డారు." అని ఆదాము వృత్తాంతాన్ని మరింత విశదం చేశారు.

కొన్ని సెకండరీ డౌట్స్ తీరాయి గానీ మెయిన్ డౌట్ అలాగే ఉండి పోయింది,అదీ గాక సారు నాకు ఆయన చెప్పినది అర్ధం కావడం లేదని పొరపాటు పడుతున్నారని భావించి "No, I am not interested about comparing bible and Hindu scriptures. What you told about Adam that he is pure when he was created by Yahova is very clear to me. You confirmed that Yahova did not want man to become a sinner and that also was very clear to me. 

My question is why then yahova put that fruit there? If there is no such fruit in that garden that corrupts the man - where is the chance of man becoming a sinner?

Why he put that fruit in the first place if he don't want man to become a sinner? Why he warned unneccessarily after putting it there? And,the first pair lived very innocently over very long period before Satan seducing them, is it not?

They did not commited the sin readily! From the first day to the last day before the temptation came from Satan, they lived obedient life. So, my question is why yahoma created Satan and tempted the first couple?

If Satan is also created by yahova, the real criminal that seduced Adam is YAHOVA himself, is it not?" అని నిలదీశాను.

ఆయన వైపు నుంచి కొంత విరామం రావడంతో కామెంట్లని చదువుతుంటే ముక్కల ముక్కల యవ్వారం మొత్తాన్ని ఒకచోట చేర్చి అడిగితే క్లారిటీ వస్తుందనిపించి: "బ్రదర్, నేను గందరగోళంలో ఉండటం నా అజ్ఞానం వల్ల కాదు.మీరు పైన ఉటంకించిన "17."వ ఆదికాండం 2 వల్ల కలిగినది.తమాషా ఏమిటంటే నా గందరగోళాన్ని గుర్తించి మీరు జవాబు ఇచ్చాక రెండు గందరగోళాలు తయారయ్యాయి.

నా మొదటి గందరగోళం ఏమిటో చెప్తాను వినండి:నేను హిందువుని అని తెలియడం వల్లనో ఏమో మీరు "హిందూధర్మంలో మానవుడి సృష్టి మట్టి నుండి అని తెలియదు." అని అంటున్నారు.కానీ మట్టి నుంచి మనిషి వచ్చాడనే కాదు, ఆ మట్టి అక్కడికి ఎలా వచ్చిందనేది కూడా హిందూధర్మంలో ఉంది."ఈశ్వరు డధిష్ఠించిన ప్రకృతి అంశంతో మహత్తత్త్వం పుడుతుంది. మహత్తత్త్వం అంశంతో అహంకారం పుడుతుంది. అహంకారం అంశంతో శబ్దతన్మాత్ర పుడుతుంది. శబ్దతన్మాత్ర అంశంతో 1.ఆకాశం పుడుతుంది. ఆకాశం అంశంతో స్పర్శ తన్మాత్ర పుడుతుంది. స్పర్శతన్మాత్ర అంశంతో 2.వాయువు పుడుతుంది. వాయువు అంశంతో రూపతన్మాత్ర పుడుతుంది. రూపతన్మాత్ర అంశనుండి 3.అగ్ని పుడుతుంది. అగ్ని అంశంతో రసతన్మాత్ర పుడుతుంది. రసతన్మాత్ర అంశనుడి 4.జలం పుడుతుంది.జలాంశం నుండి గంధ తన్మాత్ర పుడుతుంది. గంధ తన్మాత్ర అంశతో 5.పృథ్వి పుడుతుంది. వీటన్నిటి కలయిన వల్ల పదునాల్గు భువనాల స్వరూపమైన విరాడ్రూపం ఉద్భవిస్తుంది." - ఇంత వివరణ బైబిలులో ఉందా?అదీకాక బైబిల్ ప్రకారం భూమి ముందు పుట్టి సూర్యుడు నక్షత్రాలు తర్వాత పుట్టాయి.ఇక్కడి విషయానికీ దానికీ సంబంధం లేదు గనక దాని గురించి తర్వాత మాట్లాడదాం.

విషయానికి వస్తే నాకు బైబిలు పరిజ్ఞానం తక్కువ.అయితే తక్కువ తెలియడం విముఖత వల్ల మాత్రం కాదు.ఆ కొంచెం తెలియడం కూడా ఆసక్తి వల్లనే.నేను ఇదివరకు అనుకున్నది యేమిటంటే బైబిలు పాపం అంటున్నది "లైంగిక విశృంఖలత!" అని.ఎందుకంటే, ప్రధమ జంట యహోహా కనబడగానే తమ మొలల్ని ఆకులతో కప్పుకున్నారనీ దానివల్లనే దేవుడు వాళ్ళు నిషిద్ధఫలం తిన్నట్టు గుర్తుపట్టాడనీ  ఈడెను నుంచి ఆ కామాతురత గురించే వెళ్ళగొట్టాడని నేను అనుకున్నాను.అందులో తప్పేమీ లేదు కదా!

కానీ మీరు ఇక్కడ చూపించిన వాక్యం ఏమి చెబుతున్నది?"మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష  ఫలములను" తినడమే YAHOVA అంత కోపం తెచ్చుకుని ఈడెన్ అనే ఒక అత్యద్భుతమైన తోట నుంచి మనిషిని వెళ్ళగొట్టటానికి కారణం అని ఉంది, అవునా?"ఇక్కడ చావు అంటే శరీరం నుండి ప్రాణం పోడం కాదు.ఆత్మ నిరంతరం చావడం." అని మీరు చెప్తున్న చావు కానీ "నీవు నేలకు తిరిగి చేరువరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు." అని చెప్తున్న బతుకు కానీ ఆ పండు తిన్నాక ఏది మంచి ఏది చెడు అనేది తెలియడం వల్ల వచ్చి పడినవే కదా!

"దేవుడు తన రూపంలో సృజించారు ఆడమును. అంటే అప్పుడు ఆడముకు చెడు తెలీదు ఒట్టి మంచి మాత్రమే తెలుసు. ఆడం చెడు తెలుసుకోడం దేవుడికి ఇష్టం లేదు. అందుకే ఆ పండు తిన్న దినాన చేస్తావు అని హెచ్చరించారు." అని మీరు బల్లగుద్ది చెప్పడంతో నా గందరగోళం పదింతలు పెరిగింది!

వార్నీ!మంచీ చెడూ తెలియడమే పాపమా? ఇదెక్కడి దరిద్రం!మరి,తీలియకపోవడం మంచి అనీ తెలియడం చెడు అనీ అనుకుంటే అది తెలిసేటట్టు చేసే పండుని అక్కడ ఉంచడం దేనికి?

What you told about Adam that he is pure when he was created by yahova is vey clear to me.

You confirmed that Yahova did not want man to become a sinner and that also was very clear to me.

My question is why then Yahova put that fruit there?If there is no such fruit in the garden which corrupts man - where is the chance of man becoming a sinner?

Why he put that fruit in the first place if he don't want man to become a sinner?Why he warned unneccessarily after puting it there?

They did not commited the sin readily! From the first day to the last day before the temptation came from Satan, they lived obedient life.

So, my question is why yahova created satan  and tempted the first couple?

If Satan is also created by yahova, the real criminal that seduced Adam is YAHOVA himself, is it not?

ఇది ఈడెను తోటలో జరిగిందని బైబిల్ చెప్తున్న కధ మీద నాకు ఏర్పడిన మొదటి గందరగోళం.ఇంక రెండవ గందరగోళం మనిషి ఈడెన్ తోట నుంచి నెట్టివేయబడ్డాక మానవజాతి మీదకి ఆదాము చేసిన పాపం జన్యుపరమయిన రోగంలా సంక్రమించడం గురించి.

ఆదాముకి పండు తిన్నాక కదా మంచీ చెదూ తెలియడం జరిగింది, అది పాపం గనక శిక్ష వేశాడు - బాగనే ఉంది!మనకి పెరిగి పెద్దయ్యాక కదా మంచీ చెడూ తెలుస్తున్నది! 

యహోవా మంచి చెడులను తెలియజెప్పే పండును తిని ఘోరమయిన నేరం చేసిన ఆదాముకి మంచి చెడులు తెలిశాక శిక్ష వేసి ఆ నేరం చెయ్యని తర్వాత తరాల మనుష్యులకి  మాత్రం మంచి చెడులు తెలియక ముందే ఆ పాపాన్ని అంటించి శిక్షించడం న్యాయమా?

If knowing good and bad is sin, You simply do not teach your kids about it and make them as pure as Adam before eating that Fruit - then that kid definitely wins death! 

YOU GOT MY POINT?"అని కొంచెం సుదీర్ఘమైన కామెంటు వేశాను.

అబ్బ!మొత్తానికి నా మితిమీరిన అజ్ఞానానికి విసుక్కుని ఆగిపోకుండా కొంచెం కాలాతీతం అయినా, "I got your point and I will try to clear your doubts. You too should receive it with clear mind without any hindrance.
మొట్టమొదటగా మీ ఓపికకు నా జోహార్లు.

మట్టి ఎలా సృష్టించబడింది అనడానికి చాలా దీర్ఘమైన వివరణ ఇచ్చారు. చాలా సంతోషం. నేను చెప్పింది మట్టి ఎలా తయారయ్యింది ఎక్కడెక్కడ ఉంది అన్నది కాదు. మానవ సృష్టి దేని చేత చేయబడింది అని.

సనాతన ధర్మం ప్రకారం ఋగ్వేదం 10-90-12 మరియు మనుస్మృతి 1-31 ప్రకారం బ్రహ్మ ముఖం నుంచి బ్రాహ్మణులు, భుజముల నుండి క్షత్రియులు, ఊరువుల నుండి వైస్యులు, పాదముల నుండి సూద్రులు సృష్టించబడ్డారు. 

దీన్లో మట్టి నుండి మానవుడు సృష్టించబడ్డాడు అన్న ప్రస్తావన ఎక్కడా కనపడలేదు. చాలా విషయాలు గోల్ గోల్ గుమాయించి చెప్పడం వల్ల అసత్యం ఎప్పటికీ సత్యం కాదు కానేరదు అన్న విషయం ప్రజలు తెలుసుకోవాలి.

సైతాను దేవుడి చేత సృష్టించబడడం ఏంటి? హిందూ మతంలో శని అంటే సైతాను కూడా ఒక దేవుడే. శని మా జోలికి రావద్దని మనుష్యులే కాదు దేవుళ్ళు కూడా పూజ చేస్తారు. కానీ క్రైస్తవ్యంలో శని/ సైతాను మానవుడికి దేవుడికి కూడా శత్రువు.

సైతాను ఆవిర్భావం గురించి చెప్తాను: దేవుడు సైతాను ను సృజించలేదు. ఏవో కొన్ని లక్షల్లో లేక కోట్ల కోట్ల సంవత్సరాల లేక (ఇంకా ముందు అనేది తెలియదు) క్రిందట దేవుడు దేవదూతలను సృజించారు. వారిలో ప్రధాన దూత పేరు లూసిఫార్. ఈ లూసిఫార్ దేవుడ్ని ఎల్లప్పుడూ స్తుతిస్తుండే వాడు. కానీ ఒకసారి మనసులో ఒక దుర్భుద్ధి కలిగింది. దేవుడికే ఇంత ఘనత,నేను కొంచెం మాత్రమే తక్కువ కదా దేవుని కంటే ఎక్కువ ఎందుకు కాకూడదు అనుకున్నాడు. 

దేవుడు సర్వజ్ఞాని కదా. ఈ లూసిఫార్ మదిలో పుట్టిన ఆలోచన బట్టి పాతాళమునకు త్రోయబడ్డాడు.

యెషయా 14: 12
తేజోనక్షత్రమా, వేకువచుక్కా, నీవెట్లు ఆకాశమునుండి పడితివి? జనములను పడగొట్టిన నీవు నేలమట్టమువరకు ఎట్లు నరకబడితివి?
యెషయా 14: 13
నేను ఆకాశమున కెక్కిపోయెదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును ఉత్తరదిక్కుననున్న సభాపర్వతముమీద కూర్చుందును
యెషయా 14: 14
మేఘమండలముమీది కెక్కుదును మహోన్నతునితో నన్ను సమానునిగా చేసికొందును అని నీవు మనస్సులో అనుకొంటివిగదా?
యెషయా 14: 15
నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే.

ఇది సింపుల్ గా సైతాను కథ. ఆ దేవదూత సైతాను గా మారి దేవుడికి విరోధి అయ్యాడు.

మిగతా విషయాలు మళ్ళీ." అని సవిస్తరమైన తొలి జవాబు ఇచ్చారు.

అదేంటో! ఇంత విస్తారమైన జవాబుతో పాత డౌట్లలో ఒకటి కూడా తీరలేదు, కొత్త డౌట్లు పుట్టుకొచ్చాయి.ఇప్పుడు చెప్పిన దాంట్లో ఇదివరకటి కంటే కంగారు పడాల్సిన విషయాలు చాలా కనపడ్డాయి.అసలు చివరి రోజు వరకు అంత విధేయత చూపించిన ప్రధమజంటని  తను పాతాళానికి తొక్కేసినా తప్పించుకుని ఈడెను తోటలోకి వచ్చి అంత కుట్ర చేసి ప్రధమజంటని చెడగొట్టిన సైతానుని పల్లెత్తు మాట అనకుండాఆ త్రాష్టుడి మీద చూపించాల్సిన కోపాన్ని అమాయకంగా వాడి మాయకబుర్లకి లొంగిపోయిన ప్రధమజంట మీద చూపించాడేమిటి YAHOVA GOD?తప్పు ఒకరిదీ, శిక్ష ఒకరికా - ఇదెక్కడి న్యాయం?బహుశా, ఈ సైతానును ఏమీ చెయ్యలేక పిచ్చెక్కిపోయి ఆ పిచ్చిలో ప్రధమజంటని శిక్షించాడా అనిపించింది!వెంటనే అక్కడ అదే కామెంటు వేశాను "so Satan is more powerful than yahova?" అని.

అటు బైబిలు మీద గానీ ఇటు హిందూ గ్రంధాల మీద గానీ ఏదో ఒకదాని మీద శ్రధ్ధ చూపించకుండా రెంటినీ కలిపి మింగడం వల్ల మతి చలించినటుంది!లేకపోతే మట్టీ గిట్టీ, చెట్టూ చేమా అన్నీ పుట్టిన five basic elements గురించి చెప్పాక కూడా ఇంకా నేను మట్టి ఎట్లా వచ్చిందని అడగలేదు మనిషి ఎట్లా వచ్చాడని అడుగుతున్నానని అంటాడేమిటీ? దానికోటి తగిలించాను, "when I explained how five elements came and I confirmed that all this universe was made up of all those elements,still you are unable to understand the Concept and again talking the same meaningless talk that Hindu scriptures did not say anything about how man came.

You are unable to clear a very simple and basic doubt about the main concept of janmapaapam, and you are trying to misinterpret hindu scriptures! 

First concentrate on that point and complete that task as early as possible. You are not aware about one thing, if you try to answer me with genuine and rational way your christian belief system might crumble down into dust!" అని.


మాటిమాటికీ ఇలా పక్కదార్లు డేకుండా పాయింటు మీదనే ఉంచాలని, "you are thinking that I am a layman about Christianity! When I am asking questions about your Bible, why you dragged hindu scriptures here? I already hinted you that we will see it later. Please do not go out of the topic and stick to give a rational answer about the "Sin of Adam was carried by generations of generations like a congenital disease" concept only." అనే కామెంటు ఒకటి వేశాను.

అప్పుడు, తీరిగ్గా అసలైన ఫినిస్షింగ్ టచ్ ఇచ్చాను:"మీరు ఈ జవాబు పూర్తి స్పృహలోనే ఉండి రాశారా?ఎందుకంటే, ఏదో ఒక 500 పదాలతో కూడిన పెద్ద వ్యాసంలో వస్తే పోనీలే అనుకోవచ్చు గానీ ఇంత చిన్న జవాబులోనే మీరు పరస్పర విరుధ్ధమైన విషయాలని గుదిగుచ్చారు, గమనించండి:
"1.సైతాను దేవుడి చేత సృష్టించబడడం ఏంటి?
2. హిందూ మతంలో శని అంటే సైతాను కూడా ఒక దేవుడే. 
3.శని మా జోలికి రావద్దని మనుష్యులే కాదు దేవుళ్ళు కూడా పూజ చేస్తారు. 
4.కానీ క్రైస్తవ్యంలో శని/ సైతాను మానవుడికి దేవుడికి కూడా శత్రువు.
5.సైతాను ఆవిర్భావం గురించి చెప్తాను: దేవుడు సైతాను ను సృజించలేదు. 
6.ఏవో కొన్ని లక్షల్లో లేక కోట్ల కోట్ల సంవత్సరాల లేక (ఇంకా ముందు అనేది తెలియదు) క్రిందట దేవుడు దేవదూతలను సృజించారు. 
7.వారిలో ప్రధాన దూత పేరు లూసిఫార్. 
8.ఈ లూసిఫార్ దేవుడ్ని ఎల్లప్పుడూ స్తుతిస్తుండే వాడు. 
9.కానీ ఒకసారి మనసులో ఒక దుర్భుద్ధి కలిగింది. 
10.దేవుడికే ఇంత ఘనత,
11.నేను కొంచెం మాత్రమే తక్కువ కదా, దేవుని కంటే ఎక్కువ ఎందుకు కాకూడదు అనుకున్నాడు. 
12.దేవుడు సర్వజ్ఞాని కదా. 
13.ఈ లూసిఫార్ మదిలో పుట్టిన ఆలోచన బట్టి పాతాళమునకు త్రోయబడ్డాడు."

కేవలం 13 వాక్యాలలోనే మీరు ఎన్నిసార్లు కప్పగంతులు వేశారో చూడండి!

"1.సైతాను దేవుడి చేత సృష్టించబడడం ఏంటి?", "5.సైతాను ఆవిర్భావం గురించి చెప్తాను: దేవుడు సైతాను ను సృజించలేదు.","6.ఏవో కొన్ని లక్షల్లో లేక కోట్ల కోట్ల సంవత్సరాల లేక (ఇంకా ముందు అనేది తెలియదు) క్రిందట దేవుడు దేవదూతలను సృజించారు." - దీన్ని ఎలా అర్ధం చేసుకోవాలి?ఇది చాలదన్నట్టు "2. హిందూ మతంలో శని అంటే సైతాను కూడా ఒక దేవుడే. " అని హిందూమతం నుంచి పోలికలు తీసుకొస్తున్నారు.అసలు మానవుడు ఎలా వచ్చాడో చెప్పలేకపోయాయనీ "చాలా విషయాలు గోల్ గోల్ గుమాయించి చెప్పడం వల్ల అసత్యం ఎప్పటికీ సత్యం కాదు కానేరదు అన్న విషయం ప్రజలు తెలుసుకోవాలి." అనీ  మీరు అసత్యం అంటున్న హిందూమతగ్రంధాలనే దీనికి సాక్ష్యం తేవడం ఏంటి?బైబిలు కూడా అసత్యమే అని మీరు చెప్పదల్చుకున్నారా?

"4.కానీ క్రైస్తవ్యంలో శని/ సైతాను మానవుడికి దేవుడికి కూడా శత్రువు." ఇది మరో బాంబు!YAHIVA దేవుడు సర్వశక్తిమంతుడని మీరే అంటున్నారు,మళ్ళీ YAHIVA దేవుడికి ఒక శత్రువు వున్నాడంటున్నారు,అప్పుడు మనసులోని ఆలొచన గ్రహించగలిగిన దేవుడు ఈడేను తోటలో ఆదాము హవ్వల్ని మోసం చేస్తున్నప్పుడు ఎందుకు ఆపలేకపోయాడు?పాతాళంలో ఉండాల్సిన సైతాను ఈడేను తోటలోకి ఎలా రాగలిగాడు?YAHIVA దేవుడి జైలునుంచి కూడా తప్పించుకు రాగలిగినంత సమర్ధుడా సైతాను?

బాబూ!మొదట మీ బైబిలు విషయం పూర్తిగా తేల్చాక మా గ్రంధాల సంగతి చూద్దాం, సరేనా?" అని.

మళ్ళీ కొత్త డౌట్లు వచ్చేలా ఇంకో కామెంటు వేస్తే నేను కూడా దారి తప్పడం బోరు కొట్టేసి అన్ని సందేహాల్నీ గుదిగుచ్చి ఒక కామెంటు వేశాను.
----
అటు బైబిలు మీద గానీ ఇటు హిందూ గ్రంధాల మీద గానీ ఏదో ఒకదాని మీద శ్రధ్ధ చూపించకుండా రెంటినీ కలిపి మింగడం వల్ల మతి చలించినట్టుంది!లేకపోతే మట్టీ గిట్టీ, చెట్టూ చేమా అన్నీ పుట్టిన five basic elements గురించి చెప్పాక కూడా ఇంకా నేను మట్టి ఎట్లా వచ్చిందని అడగలేదు మనిషి ఎట్లా వచ్చాడని అడుగుతున్నానని అంటారేమిటీ?

అదేంటో! ఇంత విస్తారమైన జవాబుతో పాత డౌట్లలో ఒకటి కూడా తీరలేదు, కొత్త డౌట్లు పుట్టుకొచ్చాయి.ఇప్పుడు చెప్పిన దాంట్లో ఇదివరకటి కంటే కంగారు పడాల్సిన విషయాలు చాలా కనపడ్డాయి.అసలు చివరి రోజు వరకు అంత విధేయత చూపించిన ప్రధమజంటని  తను పాతాళానికి తొక్కేసినా తప్పించుకుని ఈడెను తోటలోకి వచ్చి అంత కుట్ర చేసి ప్రధమజంటని చెడగొట్టిన సైతానుని పల్లెత్తు మాట అనకుండాఆ త్రాష్టుడి మీద చూపించాల్సిన కోపాన్ని అమాయకంగా వాడి మాయకబుర్లకి లొంగిపోయిన ప్రధమజంట మీద చూపించాడేమిటి YAHOVA GOD?తప్పు ఒకరిదీ, శిక్ష ఒకరికా - ఇదెక్కడి న్యాయం?బహుశా, సైతానును ఏమీ చెయ్యలేక పిచ్చెక్కిపోయి ఆ పిచ్చిలో ప్రధమజంటని శిక్షించాడా అనిపించింది!

"మంచీ చెడూ తెలియడమే పాపమా? ఇదెక్కడి దరిద్రం!మరి,తెలియకపోవడం మంచి అనీ తెలియడం చెడు అనీ అనుకుంటే అది తెలిసేటట్టు చేసే పండుని అక్కడ ఉంచడం దేనికి?" అనే నా మొదటి సందేహానికి మీరు సమాధానం చెప్పడం లేదు,కొంచెం దానిమీద దృష్టిని పెట్టండి.

"దేవుడు తన రూపంలో సృజించారు ఆడమును. అంటే అప్పుడు ఆడముకు చెడు తెలీదు ఒట్టి మంచి మాత్రమే తెలుసు. ఆడం చెడు తెలుసుకోడం దేవుడికి ఇష్టం లేదు. అందుకే ఆ పండు తిన్న దినాన చేస్తావు అని హెచ్చరించారు." అని మీరు చెప్పిన తర్వాత కూడా "My question is why then Yahova put that fruit there?If there is no such fruit in the garden which corrupts man - where is the chance of man becoming a sinner?" అని మళ్ళీ అడిగాను, చూశారా?

"They did not commited the sin readily! From the first day to the last day before the temptation came from Satan, they lived obedient life.

So, my question is why yahova created satan  and tempted the first couple?

If Satan is also created by yahova, the real criminal that seduced Adam is YAHOVA himself, is it not?" అని అంత సూటైన ప్రశ్నలు వేసినా మీరు నా సందేహం తీర్చకుండా ఏమిటేమిటో కొత్త డౌట్లు వచ్చే కామెంట్లని వేసుకుంటూ పోతున్నారు, ఇది మీకు భావ్యమా?

ఆదాముకి పండు తిన్నాక కదా మంచీ చెదూ తెలియడం జరిగింది, అది పాపం గనక శిక్ష వేశాడు - బాగనే ఉంది!మనకి పెరిగి పెద్దయ్యాక కదా మంచీ చెడూ తెలుస్తున్నది!

మరి, YAHOVA GOD మంచి చెడులను తెలియజెప్పే పండును తిని ఘోరమయిన నేరం చేసిన ఆదాముకి మంచి చెడులు తెలిశాక శిక్ష వేసి, ఆ నేరం చెయ్యని తర్వాత తరాల మనుష్యులకి  మాత్రం మంచి చెడులు తెలియక ముందే ఆ పాపాన్ని అంటించి శిక్షించడం న్యాయమా?" అనేది అత్యంత కీలకమైన సందేహం!దీన్ని కూడా మీరు పట్టించుకోవడం లేదు.
----
ఇంక నీలం సుందర గొఱ్ఱె మళ్ళీ వచ్చి చర్చని కొనసాగించే అవకాశం లేదు - వస్తే గనక నాకు పండగే!ఇప్పటికే అవతలివాడు గందరగోళంలో ఉండి ప్రశ్నలు వేస్తున్న అమాయకుడు కాదు,మన పుస్తకంలోని తప్పుల్ని మనచేతనే చెప్పిస్తున్న తెలివైనవాడు అని తెలిసిపోయిందని నా అనుమానం!

అజ్ఞానంతో అమాయకత్వం కలిస్తే జాలిపడి వదిలేసేవాణ్ణి,కానీ మైండుకి ఎంత కొవ్వు పడితే శివుణ్ణి గురించి అంత నీచమైన మాటలు వాడటానికి సాహసిస్తాడు! Bathshebaని David లొంగదీసుకోవటంతో మొదలై David కొడుకు తండ్రి అనుభవించిన ఆడవాళ్ళతో బహిరంగ శృంగారం చెయ్యటం నుంచి మామా కోడళ్ళ సరసాల వరకు House of David పేరు చెప్పి ఏ కుటుంబానికి చెందినవాడి పాదాలని వీళ్ళు ముద్దులు పెట్టుకుని ఇతర్ల చేత కూడా ముద్దులు పెట్టించాలని చూస్తున్నారో ఆ ఇల్లొక వ్యభిచార కూపం అని మనకి తెలియదని వాళ్ళ ధైర్యం!నాతో సహా వీళ్ళతో పోట్లాడుతున్న ప్రతి ఒక్కరికీ తెలిసి కూడా వాటిని ప్రస్తావించటానికే సంస్కారం అడ్డొచ్చి ఆగిపోతున్నందుకు మనం లోకువవుతున్నట్టుంది చూస్తుంటే!

Bathshebaని seduce చేసిన వెంటనే David వేసిన మొదటి ఎత్తుగడ Uriah యుద్ధంలో చచ్చేలా చూడమని ఇతర్లకి కబురు పెట్టటం కాదు - Uriahని ఇంటికొచ్చెయ్యమని కబురు పెట్టాడు, ఎందుకుట?ఎందుకంటే, Uriah గనక ఇంటికొచ్చేసి ఒక్క రాత్రి గడిపితే చాలు Bathshebaకి David చేసిన గర్భానికి అతన్ని కారకుణ్ణి చెయ్యటానికట!కానీ సైనికుడు యుద్ధ సమయంలో ఇంటి ముఖం చూడకూడదనే వీరధర్మానికి కట్టుబడి Uriah రాజాజ్ఞని కూడా  ధిక్కరించి రణరంగంలోనే ఉండిపోయాడు.ఒకసారి కాదు, చాలాసార్లు అదే తంతు నడిచాక గతి లేక Joabకి కబురు పెట్టి Uriahని చంపించాడు.అత్యున్నత నైతిక సంప్రదాయానికి కట్టుబడిన Uriah వీళ్ళ దృష్టిలోనూ YAHOVA GOD దృష్టిలోనూ అనామకుడైపోయాడు,అత్యంత నీచమైన పాపకార్యం చేసిన David వీళ్ళకీ YAHOVA GODకీ ప్రీతిపాత్రుడయ్యాడు.

తమ మతంలో ఉన్న బొక్కల్ని పూడ్చుకోవటం కుదిరే పని కాదని తెలిసి ఇసక తక్కెడ-పేడ తక్కెడ పద్ధతిలో దొందూ దొందే కదా, ఏ రాయైతేనేం పళ్ళూడగొట్టుకోవటానికి అని చెప్పి పబ్బం గడుపుకోవాలనే బిజినెస్ ప్లానుతో మన పురాణ కధలకి కూడా బొక్కలు పెట్టటానికి తయారయ్యారు.వీళ్ళ తుక్కు రేగ్గొట్టటానికి మిగిలిన కట్టుకధల కన్న ఈడెను తోట పిట్టకధ మనకి బ్రహ్మాస్త్రం లాంటి ఆయుధాన్ని ఇస్తుంది!

ఇంతకీ ఈడెను తోటలో జరిగింది ఏమిట్ట!నా సొంత మాటల్తో చెబితే మార్చి రాశాడని వాళ్ళూ వీళ్ళూ ఏడ్చి చావకుండా ఈ గొఱ్ఱె మనముందు పరిచిన అధికారికమైన వచనం ఉంది కదా!

"ఆదికాండము 2: 16. మరియు దేవుడైన యెహోవాఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును; 17. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు; నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని కాజ్ఞాపించెను.

దేవుడు తన రూపంలో సృజించారు ఆడమును. అంటే అప్పుడు ఆడముకు చెడు తెలీదు ఒట్టి మంచి మాత్రమే తెలుసు. ఆడం చెడు తెలుసుకోడం దేవుడికి ఇష్టం లేదు. అందుకే ఆ పండు తిన్న దినాన చేస్తావు అని హెచ్చరించారు.

 క్రైస్తవ్యంలో మానవుడికి దేవుడికి కూడా శత్రువు సైతాను ఆవిర్భావం గురించి: ఏవో కొన్ని లక్షల్లో లేక కోట్ల కోట్ల సంవత్సరాల లేక (ఇంకా ముందు అనేది తెలియదు) క్రిందట దేవుడు దేవదూతలను సృజించారు.వారిలో ప్రధాన దూత పేరు లూసిఫార్.ఈ లూసిఫార్ దేవుడ్ని ఎల్లప్పుడూ స్తుతిస్తుండే వాడు.కానీ ఒకసారి మనసులో ఒక దుర్భుద్ధి కలిగింది.దేవుడికే ఇంత ఘనత,నేను కొంచెం మాత్రమే తక్కువ కదా, దేవుని కంటే ఎక్కువ ఎందుకు కాకూడదు అనుకున్నాడు.దేవుడు సర్వజ్ఞాని కదా.ఈ లూసిఫార్ మదిలో పుట్టిన ఆలోచన బట్టి పాతాళమునకు త్రోయబడ్డాడు.

దేవుడు చెప్పినట్లే జరిగింది. ఆదికాండము 3: 19 నీవు నేలకు తిరిగి చేరువరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు; ఏలయనగా నేలనుండి నీవు తీయబడితివి; నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పెను.

ఆదికాండము 5: 3. ఆదాము నూట ముప్పది యేండ్లు బ్రదికి తన పోలికెగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అను పేరు పెట్టెను."

మనం పట్టిన బొక్కని కప్పుకోవటానికి ఆ నీలం సుందర గొఱ్ఱె "ఆదాము ఏదేను తోటలో ఎన్ని సంవత్సరాలు జీవించాడు అనేది తెలియదు. లక్షలు కావొచ్చు కోట్ల సంవత్సరాలు కావొచ్చు" అని చెప్పింది నిజం కాదు.ఈ సమర్ధన లోని అసలైన క్యామిడీ ఏమిటంటే, మానవజాతిని తామరతంపరగా పెంచడానికి ఆదామునీ హవ్వనీ సృష్టించి పాపం తెలియకుండా ఉండటానికి ఈడెను తోటలో ఉంచితే ఆ తోటలో ఉన్నంతకాలం వాళ్ళకి సంతానమే కలగలేదు!

Genesis 5:5 states clearly that “all the days that Adam lived were 930 years.” We know, of course, that “days” and “years” already were being counted by the time of Adam’s creation because in Genesis 1:14 (day four of the Creation week) God mentioned both in His discussion of their relationship to the heavenly bodies. Therefore, however long Adam and Eve may have been in the garden, one thing is certain: they were not there for any time period that exceeded Adam’s life span of 930 years. But there is additional information that must be considered as well. Genesis 4:25 explains that Seth was born after Cain slew Abel. Since the biblical account makes it clear that Seth was born outside the garden, and since Genesis 5:3 informs us that Adam was 130 years old when Seth was born, it is obvious that Adam and Eve could not have been in the Garden of Eden any longer than 130 years!

ఆ పండు తిని అక్కడినుంచి వెళ్ళగొట్టించుకుని రాకపోయి ఉంటే నీలం గొఱ్ఱె విశ్లేషణ ప్రకారం ఇప్పటికీ ఆ తోటలో వాళ్ళిద్దరే లింగులింగుమంటూ తిరుగుతూ ఉండేవాళ్ళు కాబోలు!మరి, పండు తినడం మంచికి జరిగిందా, చెడుకి జరిగిందా?

బైబిలు మొత్తం ఒకే భాగం కాదు, Book of Creation, Book of Exodus, Book of Psalms అని ఉన్నవాటిలో అతి ముఖ్యమైన ఆదికాండలోనే ఇన్ని బొక్కలు ఉంటే ఈ బొక్కల కొనసాగింపు లయిన మిగిలిన బుక్కుల్లో ఇంకెన్ని బొక్కలు ఉన్నాయో! కామన్ సెన్సు ఉన్న తొమ్మిదేళ్ళ కుర్రాడు కూడా నమ్మడే, ఎద్దుల్లా పెరిగిన వీళ్ళు ఎట్లా నమ్ముతున్నారు?

1."వార్నీ!మంచీ చెడూ తెలియడమే పాపమా? ఇదెక్కడి దరిద్రం!మరి, తెలియకపోవడం మంచి అనీ తెలియడం చెడు అనీ అనుకుంటే అది తెలిసేటట్టు చేసే పండుని అక్కడ ఉంచడం దేనికి?"

2."అసలు చివరి రోజు వరకు అంత విధేయత చూపించిన ప్రధమజంటని  తను పాతాళానికి తొక్కేసినా తప్పించుకుని ఈడెను తోటలోకి వచ్చి అంత కుట్ర చేసి ప్రధమజంటని చెడగొట్టిన సైతానుని పల్లెత్తు మాట అనకుండాఆ త్రాష్టుడి మీద చూపించాల్సిన కోపాన్ని అమాయకంగా వాడి మాయకబుర్లకి లొంగిపోయిన ప్రధమజంట మీద చూపించాడేమిటి YAHOVA GOD?తప్పు ఒకరిదీ, శిక్ష ఒకరికా - ఇదెక్కడి న్యాయం?"

3."YAHIVA దేవుడు సర్వశక్తిమంతుడని మీరే అంటున్నారు,మళ్ళీ YAHIVA దేవుడికి ఒక శత్రువు వున్నాడంటున్నారు,అప్పుడు మనసులోని ఆలొచన గ్రహించగలిగిన దేవుడు ఈడేను తోటలో ఆదాము హవ్వల్ని మోసం చేస్తున్నప్పుడు ఎందుకు ఆపలేకపోయాడు?పాతాళంలో ఉండాల్సిన సైతాను ఈడేను తోటలోకి ఎలా రాగలిగాడు?YAHIVA దేవుడి జైలునుంచి కూడా తప్పించుకు రాగలిగినంత సమర్ధుడా సైతాను?"

ఇంత ముఖ్యమైన ప్రశ్నలు ఇన్ని శతాబ్దాల నుంచి ఏ ఒక్క గొఱ్ఱెకీ రాలేదంటే ఆశ్చర్యమే!విచిత్రం ఏమిటంటే మళ్ళీ వెర్షను మారిస్తే తప్ప ఇప్పటి వెర్షను ప్రకారం ఈ ప్రశ్నలకి జవాబు చెప్పటం అసాధ్యం.మతమార్పిడి చెయ్యాలని వచ్చినవాళ్ళ ముందు ఈ ప్రశ్నల్ని ఉంచి వీటికి జవాబులు చెప్పమంటే చాలు - మనం అరిచి గోల చెయ్యనక్కర్లేదు, పాస్టర్లు పరుగో పరుగు!

"ఆదాముకి పండు తిన్నాక కదా మంచీ చెదూ తెలియడం జరిగింది, అది పాపం గనక శిక్ష వేశాడు - బాగనే ఉంది!మనకి పెరిగి పెద్దయ్యాక కదా మంచీ చెడూ తెలుస్తున్నది!మరి, YAHOVA GOD మంచి చెడులను తెలియజెప్పే పండును తిని ఘోరమయిన నేరం చేసిన ఆదాముకి మంచి చెడులు తెలిశాక శిక్ష వేసి, ఆ నేరం చెయ్యని తర్వాత తరాల మనుష్యులకి  మాత్రం మంచి చెడులు తెలియక ముందే ఆ పాపాన్ని అంటించి శిక్షించడం న్యాయమా?" అనేది అత్యంత కీలకమైన సందేహం!


కధ కంచికి మనం ఇంటికి!చర్చ చిదంబరానికి క్రైస్తవం ఇక కంచికి!!

Friday, 15 February 2019

అసలు రామాలయం కడతామని చెప్పి అధికారంలోకి వచ్చాక రామాలయం గురించి మర్చిపోయిన బీజేపీని హిందువులు ఎందుకు తిరిగి అధికారంలోకి తీసుకురావాలి?

సుమారు గంటసేపు మధ్యలో దుబాసీల కోసం ఆగుతూ ఇంకొంచెం గొంతు పెంచితే కంఠనాళాలు తెగిపోతాయేమో అన్నంత గాఠ్ఠిగా అరుస్తూ మోదీ చేసిన ప్రసంగంలో ప్రధానమంత్రి పదవిలో ఉన్నవ్యక్తి నుంచి ప్రజలు ఆశించే హుందాతనం ఎక్కడయినా ఉందా?ఆ స్థాయి వ్యక్తి నుంచి ప్రజలు హుందాతనాన్ని ఆశిస్తారని మోదీకి తెలియదా, లేక మోదీ వ్యక్తిత్వంలోనే హుందాతనం లేదా! ప్రధాని అనే స్థానం కూడా ముఖ్యం కాదు ఇక్కడ - అక్కినేని నాగేశ్వర రావు లాంటి సినిమా నటుడు కావచ్చు, శ్రీశ్రీ వంటి రచయిత కావచ్చు,ఒక పారిశ్రామిక వేత్త కావచ్చు, బహిరంగ వేదిక మీద నుంచి విశాల ప్రజానీకాన్ని ఉద్దేశించి చేసే ప్రసంగం హుందాగా ఉండాలన్న గమనిక కూడా మోదీకి లేదా?

"నేను ఇక్కడికి నా పార్టీ ఖర్చులతో వచ్చాను!చంద్రబాబు ప్రభుత్వ సొమ్ముతో ఫొటో సెషన్ కోసం వెళ్ళాడు!" అని అంటున్న వ్యక్తికి కనీసం కామన్ సెన్సు అయినా ఉందా?ప్రధాన మంత్రి అయ్యేటప్పుడే కాదు, లోక్ సభ సభ్యుడిగా రాజ్యాంగం మీద ప్రమాణం చేశాడు కదా!ఏమని చేశాడు?అయిదేళ్ళ పాటు ప్రజలకి అంకితమౌతానని చేశాడా,మధ్యలో లీవు పెట్టి స్వంతపనులు చూసుకుంటూ ఉంటానని చేశాడా?ఇప్పుడు ఆంధ్రాకి తను లీవులో వచ్చాడా!అయిదేళ్ళ పాటు ప్రజలకి అనుక్షణం రక్షణగా ఉంటానని ప్రమాణం చేసినవాడికి స్వతఃపరః భేదం ఉండటమే తప్పు. అలాంటిది దాన్ని గొప్పగా చెప్పుకుంటున్నాడు చూడండి! తన బుర్రనుంచి పుట్టిందో వేరేవాడు రాసిస్తే పంచ్ బాగుందని వాడుకున్నాడో గానీ ఇంత తెలివితక్కువ మాటతో తెలివైన ఆంధ్రా వోటర్లని ఢమాల్న బుట్టలో పడెయ్యగలనని ఎట్లా అనుకున్నాడు?దేశప్రజలకి బాధ్యత వహించాల్సిన ప్రధానమంత్రి ఒక రాజకీయ పార్టీ యొక్క ప్రైవేటు సొమ్ముని వాడుకోఅవటం అనైతికతయే అవుతుంది.తనకి సిగ్గూ శరమూ ఉంటే ఆ తప్పుడు పని చేసినందుకు దేశప్రజలకి క్షమాపణ చెప్పాలి!

"తల్లిని చంపి పిల్లని పుట్టించారు!" అని ఎన్నికల ముందు జాలిని కురిపించి ఆ తల్లి గృహప్రవేశానికి పిలిస్తే వెళ్ళి ప్రత్యేకహోదా గురించి గట్టి  హామీ ఇచ్చి సంతోషపెట్టాల్సిన సందర్భంలో కుండెడు మట్టీ బిందెడు నీళ్ళూ ఇచ్చి సరిపెట్టేసి ఉసూరుమనిపించినవాడు మనిషా పశువా రాక్షసుడా!అంటే, ఆంధ్రాకి ప్రత్యేక హోదా ఇవ్వకూడదనే నిర్ణయం అప్పటికే జరిగిపోయిందని తెలియడం లేదూ!"అసలు ఆంధ్రాకి ఇంకేదైనా ఇస్తాం గానీ ప్రత్యేక హోదా మాత్రం ఇవ్వం అని భీష్మించుకోవడానికి కారణం ఏమిటి?" - ఈ ఒక్క ప్రశ్నకి జవాబు చెప్పగలిగితే చాలు మోదీ ప్రజలకి మేలు చెయ్యడం కోసమే రాజకీయాల్లోకి వచ్చాడనీ బీజేపీ హిందువుల్ని ఉద్ధరించడానికి కంకణం కట్టుకున్న పార్టీ అనీ మనం నమ్మవచ్చును.

అప్పుడు వాళ్ళు చెప్పిన  "ప్రత్యేక హోదా వల్ల వచ్చే 10 కోసం పట్టుపట్టకపోతే ప్యాకేజీ పేరుతో 20 ఇస్తాం" అన్న ముక్కలో ఉన్న లాజిక్కు నాకు ఇప్పటికీ అర్ధం కావడం లేదు.ఆ పేరుతో కాకపోతే 20 ఇవ్వడానికి సిద్దపడినవాళ్ళకి ఆ పేరుతో 10 ఇవ్వడానికి చేతులు రాకపోవటం ఏంటి?మొదట ప్రత్యేక ప్యాకేజీ ప్రతిపాదన చేసిందీ వాళ్ళే, అది కూడా ప్రత్యేక హోదా అడక్కపోతేనే అన్న మెలిక పెట్టిందీ వాళ్ళే, మరో ఆప్షన్ లేని స్థితిలో బాబుని నిలబెట్టిందీ వాళ్ళే, ఇస్తామన్నది కూడా బిచ్చం వేసినట్టు కాస్త కాస్త విదిలిస్తూ ఇచ్చినవాటికి లెక్కలు అడిగి విసిగించినదీ వాళ్ళే, పొమ్మనకుండా పొగబెట్టినట్టు ప్రవర్తించి ఎన్నికల్లో గెలవడానికి మమ్మల్ని వదిలేశాడని బ్లేం చేస్తున్నదీ వాళ్ళే - అన్ని సందర్భాల్లోనూ బాబుని బలిపెట్టి తప్పుకోవటానికి చూశారు తప్ప ప్రత్యేక హోదా ఇచ్చి ఆంధ్రప్రజల్ని సంతోషపెడదామనే సద్బుద్ధిని మాత్రం ప్రదర్శించ లేదు భారతీయ జనతా పార్టీ నాయకులు.పిచ్చోడా!నిన్నటి వరకు నీ మంత్రివర్గంలో భాగస్వామిగా ఉన్నవాడు సరిగ్గా ఎన్నికల ముందు నీతో కలిసుంటే ఎన్నికల్లో గెలవనని అనుకోబట్టే కదా నీతో తెగదెంపులు చేసుకున్నది - అది నీకు గర్వకారణమా?

భాజపా వ్యూహకర్తలు తమ మేధావిత్వాన్ని గురించి అతిగా వూహించుకుంటూ ఇలా ప్రవర్తిస్తున్నారేమో గానీ "ఆంధ్రాకి హోదా ఇవ్వకుండానే మనం ఆంధ్రాలో ప్రయోజనం పొందాలి!" అనే మూర్ఖత్వాన్ని వదులుకుని ఆలోచించాలి. హోదా ఇచ్చినా ఆంధ్రాలో ఇప్పటికిప్పుడు అధికారంలోకి రాగలిగిన స్థాయిలో భాజపా లేదు, అవునా?అలాంటప్పుడు బాబు అనే బొమ్మని వీక్ చేసి జగన్ అనే బొమ్మని స్ట్రాంగ్ చెయ్యటం ఇగోని చల్లార్చవచ్చు గానీ భాజపాకి వచ్చే నికర లాభం ఏమిటి?

నేను జగన్ ముఖ్యమంత్రి కావటాన్ని వ్యతిరేకించేది అతను అవినీతిపరుడని కాదు, అసమర్ధుడని మాత్రమే!సమర్ధుడైన చంద్రబాబుని శత్రువుని చేసుకుని అసమర్ధుడైన జగన్ని మిత్రుణ్ణి చేసుకుని వీళ్ళేమి సాధించగలరో నాకు అర్ధం కావటం లేదు!ఒక రాజకీయ నాయకుడు అధికారంలోకి వస్తే సమర్ధంగా పరిపాలించగలడా లేదా అనేది అధికారంలో లేనప్పటి అతని ప్రవర్తనని బట్టే తెలుసుకోగలం.ఆ లెక్కన చూస్తే చంద్రబాబు రాజశేఖర రెడ్డి అంతటివాణ్ణే తట్టుకుని నెగ్గుకు రాగలిగాడు - రాజశేఖర రెడ్డి నచ్చినవాళ్ళని అందలమెక్కించటం నచ్చనివాళ్ళని తొక్కెయ్యటం ఏమాత్రం నదురూ బెదురూ లేకుండా చేశాడనేది గుర్తుంచుకుంటే స్వపక్షం వాళ్ళే బెదిరిపోయిన కాలంలో ప్రతిపక్షంలో ఉండి అతన్ని తట్టుకోవటం ఎంత కష్టమో అర్ధం అవుతుంది!జగన్ అంత సమర్ధుదే అయితే శాసనసభలో అడుగుపెట్టకుండా బయట బయట ఎందుకు తిరుగుతాడు! నేను తల్చుకుంటే ఒక గంటలో ఈ ప్రభుత్వం కూలిపోతుంది అని గొప్పకి పోయి సాయంకాలానికల్లా రివర్సు గేరులో చంద్రబాబు కొట్టిన దెబ్బకి బిక్కమొగం వేసిన జగన్  భాజపాజీ తెలంగాణ తొట్టిగ్యాంగుకీ గొప్ప సమర్ధుడిలా కనపడుతున్నాడా?

మీరు ఇచ్చినవాటికి లెక్కలు అడిగితే బాబు మేము కట్టిన పన్నుల లెక్క అడుగుతున్నాడు - ఇంటి పక్క కోమటి కొట్టులో గుమాస్తా మాట్లాడినట్టు మాట్లాడకండి, జాతీయ స్థాయి నాయకులు వీధి గూండాల స్థాయిలో మాట్లాడితే మీకు లేకపోయినా చూసేవాళ్ళకి సిగ్గేస్తుంది - మీకు వోట్లేసి గెలిపించి మిమల్ని అక్కడికి పంపించినవాళ్ళ మీద జాలేస్తుంది!విజయ్ మాల్యని దొడ్డిదారిన దేశం దాటించిన గొప్ప చౌకీదారువి నువ్వు అవినీతి గురించి మాట్లాడితే నవ్వొస్తుంది గానీ ఓట్లు పడవు.మీరిచ్చిన నిధుల్ని సద్వినియోగం చెయ్యలేదని చంద్రబాబుని అసమర్ధుడని అంటున్నావే, వంద రోజుల్లో అవినీతిపరులు స్విస్ బ్యాంకులో దాచుకున్న డబ్బునంతా తెస్తానని  తేలేకపోయిన నీ అసమర్దత సంగతేంటి?

"చంద్రబాబు ఒకసారి గెలిస్తే రెండోసారి ఓడిపోతాడు!ఎవరో ఒకరితో కలిసి తప్ప ఒంటరిగా గెలవలేడు!" అనే మూఢనమ్మకాల్ని కూడా వాడుకుంటున్నారు గానీ అతను ప్రతిపక్షంలో కూడా సమర్ధంగానే వ్యవహరించి పార్టీని కాపాడుకుని మళ్ళీ అధికారంలోకి రాగలిగాడనేది మరిచిపోతున్నారు. ఒకటి మాత్రం నిజం - కేసీయార్, జగన్, మోదీ ఏదో ఓక సందర్భంలో బాబుని వ్యక్తిగతమైన విషయాలను ప్రస్తావించి దిగజారుడు భాషతో అవమానించినప్పటికీ జవాబు చెప్పటమే తప్ప తనుగా ఎవ్వర్నీ వ్యక్తిగతమైన ఆరోపణల్తో దెబ్బతియ్యాలని చూడలేదు చంద్రబాబు!

అక్కడా ఇక్కడా ఉన్న భాజపా వాళ్ళు "మేము మహా మేధావులం, వ్యూహరచనలో చాణక్యుణ్ణి మించినవాళ్ళం - మా వ్యూహం సత్ఫలితాలనే ఇస్తుంది"  అని అనుకుంటూ ఉన్నారేమో గానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రత్యేక హోదా ఇవ్వకుండా తప్పించుకోవడానికి వాళ్ళు పడుతున్న పాట్లూ వేస్తున్న వెధవ్వేషాలూ ఆంధ్రాలో అతి సామాన్యుడికి కూడా తెలుసు!నేను బీజేపీ మేలు కోరి వాళ్ళకి ఇస్తున్న సలహా ఏమిటంటే, మేము జాతీఅయ్ పార్టీ సభ్యులం, బాబుది ప్రాతీయ స్థాయి అనే అహంకారాని వదుకుకుని మీరు ఎంత తెలివైన్వాళ్ళమని అనుకున్నా మీరు చేస్తున్న పనులన్నీ మీరు కావాలనే ఆంధ్రా మీద పగబట్టి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదనే భావం ఆంధ్రా వోటర్లలో ఉన్నదనేది గమనించండి!అక్కడ వేరే పార్టీవాడు అధికారంలో ఉంటే ఇవ్వకపోవడమూ తమ పార్టీకి వోటు వేస్తేనే ఇవ్వడమూ లాంటి చెత్తపనులు చేసి కాంగ్రెస్ ఏమి సాధించింది?ఆ పార్టీని ఆ స్థితికి నెట్టిన ఘనకార్యం మీరు చెయ్యలేదు - అది దుర్మార్గం అని తెలిసిన ప్రజలు చేశారు!

అప్పటికే మీరు ఆంధ్రాకి ప్రత్యేక హోదా ఇవ్వకూడదని నిర్ణయించుకోవడం వల్లనే ఆ రోజున కుండెడు మట్టీ చెంబెడు నీళ్ళతో సరిపెట్టేశారనే క్లూ తోచడానికి నాలాంటి మేధావికి కూడా ఇంతకాలం పట్టింది, అమాయకుడైన చంద్రబాబుకి ఎలా తెలుస్తుంది పాపం!ప్రజల్ని మోసం చెయ్యగలగడంలో మీ టక్కరితనాన్ని మెచ్చుకుని తీరాల్సిందే!కానీ ఇప్పుడు నాకు తెలిసిపోయిన సంగతి నేడో రేపో ఆంధ్రాలోని ప్రతి ఓటరుకీ తెలిసిపోతుంది, అప్పుడు మీ పరిస్థితి యేంటి?

Monday, 11 February 2019

వేదాల్లో సైన్సు లేదా?మోడరన్ సైన్సు వేదాల్లో తప్పులున్నాయని నిరూపించగలదా?

"గాడిదకు గాంధర్వం పలుకునా?","పందికి పన్నీటి సౌరభం తెలియునా?","కొయ్యబొమ్మల మెచ్చు కళ్ళకు కోమలుల సౌరెక్కునా!" అనేవి పాత కాలం కవులు వాళ్ళు ఎంతో కష్టపడి రాసిన గొప్ప కవిత్వాన్ని మెచ్చుకోని అరసికుల్ని కడుపు మండి తిట్టిన తిట్లు!ఆ తిట్లు. ఇవ్వాళ మనకి తెలుస్తున్నాయంటే కారణం వాళ్ళు మొత్తానికి పేరు తెచ్చేసుకున్నారనే గదా అర్ధం!తమ కవిత్వం గొప్ప  స్థాయిలో ఉన్నదనే ఆత్మవిశ్వాసం ఉండబట్టే తమని చిన్న చూపు చూస్తున్న ఇతర్లని తిట్టటానికైనా వెనకాడలేదు - అవునా?అసలు వాళ్ళ సాహిత్యంలో పస లేకుండా అలా తిడితే వాళ్ళ కవిత్వాన్ని పరిశీలించిన విమర్శకులు రివర్సులో వీళ్ళనే చావుతిట్లు తిట్టి ఉండేవాళ్ళు, అసలు వాళ్ళ గురించి ఎవరికీ తెలిసేది కాదు - అవునా?

"జుట్టున్న కొమ్మ ఏ కొప్పు ముడిచినా అందమే!" అంటారు.ఎటొచ్చీ జానా బెత్తెడు జడతో వయ్యారాలు పోతుంటేనే తింగరి బుచ్చి అనేది!"అన్నీ ఉన్న విస్తరి అణిగి మణిగి ఉంటుంది.ఏమీ లేని విస్తరి ఎగిరెగిరి పడుతుంది!" అన్నట్టు  అన్ని విధాల శాస్త్రీయమైన వైదిక సనాతన ధర్మం వినయంతో ఒదిగిపోయి వసుధైవ కుటుంబమే మానవాళి సంక్షేమానికి శ్రేయస్కరం అని తన ఔన్నత్యాన్ని చాటుకుంటుంటే అసలు శాస్త్రీయత అంటే ఏమిటో తెలియని వాళ్ళు కూడా "వేదాల్లో సైన్సు లేదు!", "సంస్కృతం అపెండిక్సు లాంటిది!", "హిందువులకి రాళ్ళూ రప్పలకి మొక్కటం తప్ప సైన్సు గురించి తెలీదు - మూఢనమ్మకాల పుట్టలు!" అని నోటికొచ్చింది కూసేసి వాళ్ళ అజ్ఞానాన్ని చూసుకుని వాళ్ళే పగలబడి నవ్వుకుంటున్నారు.

వీళ్ళు అంత నెత్తిన మోస్తున్న మోడర్న్ సైన్సు మొత్తం వ్యాపారస్తులకి లాభాలు తెచ్చిపెట్టే వస్తువుల్ని తయారు చెయ్యటానికీ మనుషుల్ని చంపటానికి పనికొచ్చే మారణాయుధాల్ని తయారు చెయ్యటానికీ తప్ప ఇంకెందుకూ ఉపయోగపడటం లేదు.వాటిని తయారు చెయ్యగలిగిన సైంటిస్టుల్లో గానీ వాళ్ళకి నిధుల్నీ సౌకర్యాల్నీ సమకూర్చి ప్రోత్సహిస్తున్నవాళ్ళలో గానీ మానవాళి క్షేమం పట్ల నిబద్ధత గలవాళ్ళు చాలా చాలా చాలా తక్కువమంది!

అత్యంత ప్రతిభావంతుడైన నికొలస్ టెస్లా కూడా తన ఆవిష్కరణల్ని ఫ్రీగా జనానికి పంచి పెట్టలేదు - వాటిని ఉపయోగించుకుని డబ్బు సంపాదించటానికే ప్రయత్నించాడు.కాంతిని గురించీ విద్యుత్తును గురించీ జ్ఞానం పెరిగాక దాన్ని వీళ్ళు ఉపయోగించుకున్నారు, సరే!తొలినాళ్ళలో కాంతిని గురించీ విద్యుత్తును గురించీ జ్ఞానం పోగు చేసిన వాళ్ళకి ఆ జ్ఞానం బల్బులు తయారు చెయ్యటానికి పనికివస్తుందని తెలిసి చేశారా?

లేదే!ఆ జ్ఞానం డబ్బు మీద ఆశ ఉన్నవాళ్ళకి ఎప్పటికీ రాదు - విశ్వం  గురించి నిరపేక్షమైన చింతన చెయ్యగలిగిన వాళ్ళకి మాత్రమే సత్యం ద్యోతక మౌతుంది. ఏ సత్యం ద్యోతకం కాబోయే ఒక్క క్షణం ముందు కూడా అది ఏ వ్యక్తికి ద్యోతకం అవుతుందో ఆ వ్యక్తికి ఒక క్షణం తర్వాత తనకొక గొప్ప సత్యం ద్యోతకం కాబోతున్నదని తెలియదో అలాంటి సత్యాల్ని తనకి ఎలా ద్యోతకమయితే అలా చెప్పినదే వేదం!

వేదంలోని ప్రతి సూక్తానికీ ఒక ఋషి ఉంటాడు.అయితే ఆ ఋషికి ఆ సూక్తం యొక్క రచయిత హోదాని ఇవ్వరు - ద్రష్ట అని అంటారు, తను చేసిన తపస్సు ఫలించి సర్వేశ్వరుడి కృప చేత ఆ సత్యాన్ని దర్శించి ఇతర్లకి చెప్పగలిగిన అనువాదకుడు మాత్రమే.ప్రతి సూక్తానికీ మొదట వినియోగ గద్య ఉంటుంది.ఇందులో ఆ సూక్తంలోని విషయం దేనికి సంబంధించినది,ద్రష్ట ఎవరు,ఆ సూక్తం యొక ఉపయోగం ఏమిటి అనే విషయాలు ఉంటాయి."జపే వినియోగః" అని ఉంటే అవి దైవ స్తుతులు,వాటిని నిత్య పూజలో వాడుకోవచ్చు.శాస్త్ర సంబంధమైన సూక్తులకి ఈ వినియోగం వేరుగా ఉంటుంది.వేదంలోని ఏఒక్క మంత్రమూ చెప్పదల్చుకున్న విషయం గురించి విస్తరించి చెప్పదు. బీజ రూపంలో చెబుతుంది.ఒక చెట్టుని పుట్టించగలిగిన విత్తనాల్ని ఓ గుప్పెడు అలాగే తినేస్తే ఆ విత్తనం యొక్క ప్రయోజనం ముగిసిపోతుంది.కానీ వాట్ని నేలలో నాటి నీటినీ ఆహారాన్నీ ఇచ్చి పోషించితే ఒక్కో విత్తనం పెరిగి పెద్దదై ఎంతోమంది ఆకలిని తీరుస్తుంది.సృష్టి ప్రారంభం నుంచీ రెండు వందల ఏళ్ళ క్రితం వరకు సమస్త మానవాళికీ జీవనభృతుల్నీ నాగరికతలనీ వైభవాలనీ ఇచ్చిన వేదశాస్త్రాలు ఇవ్వాళ ఎందుకు కొరగాని వౌతాయి?అవి పనికిరానివని అనుకోవడమే అజ్ఞానం!

కొందరు నాలుగేళ్ళ నుంచీ నా బ్లాగు దగ్గిరే తచ్చాడుతూ నా చావును కోరుకుంటూ నాకు బ్యాడ్ న్యూ యియర్ చెప్పే మనస్తత్వంలో ఉన్నారు - పైన దాన్ని వీరత్వం కింద జబ్బలు చరుచుకుంటున్నారు."నిన్నటి రోజున శబరిమల దగ్గిర జరిగిన, ఈరోజు తిరుమల దగ్గిర జరుగుతున్న భీబత్సం రేపు శ్రీశైలం దగ్గిర జరగవచ్చు, ఎల్లుండి కాశీలో కూడా జరగవచ్చు - తిరువళ్ళువార్ బైబిలు చదివి తిరుక్కురల్ రాశాడని కూసిన మత మాఫియా మంద బలం పుంజుకుంటున్నది!" పోష్టులో నేనొక తమాషా చేశాను.ఆ పోష్టు మొత్తం నా స్వంతం కాదు,కొన్ని యూట్యూబ్ చానల్స్ దగ్గిర కొందరు రాసిన కామెంట్లని మక్కీకి మక్కీ దించేశాను - ఎందుకలా చేశానో తెలుసా?నేనొక్కణ్ణే కాదు, నాలాంటివాళ్ళు చాలామంది ఉన్నారని ఈ కూపస్థ మండూకాలకి తెలియజెప్పటానికి - ఒక్క ఎలకని కూడా పట్టలేని ఈ పిల్లులు పెట్టే శాపాలకి ఎన్ని ఉట్లు తెగుతాయో చూపించటానికే అలా చేశాను!బైబిలు చదవకుండా విమర్శించడం అనే ద్రోహాన్ని అంటగట్టి నన్ను బెదరగొట్టాలనుకున్నవాళ్ళు కరుణాకర్ సుగ్గున గురించి తెలుసుకుంటే బాగుంటుంది.క్రైస్తవ కుటుంబంలో పుట్టి రోజూ బైబిలు చదుతూ పెరిగినవాడే - పెరిగి పెద్దయ్యాక అందులోనుంచి  బయటికొచ్చి శివశక్తి పేరుతో అదరగొడుతున్నాడు!అక్కడ జరిగే చర్చల్లో కూడా నేను నా ప్రతిభని చూపిస్తూనే ఉన్నాను.ఈ మధ్యనే ottoman empire గురించి చెప్తున్న యూట్యూబ్ వీడియో దగ్గిర ఒక ముస్లిం మతాభిమానికీ ఒక క్రైస్తవ మతాభిమానికీ మధ్య ఆసక్తికరమైన చర్చ నన్ను ఆకర్షించింది:

-----------------
Ali Uzay Peker
It is funny that people who blame the Turks of past atrocities do not make an issue in comfortably living in Western countries whose welfare is totally based on colonialism, imperialism and genocide. You hypocrites!!!

Business Confidential
All the Arab Muslims remember how "wonderful" their Turkish colonial masters were. They are not Westerners. Yet they hate the Turks because they know how evil and corrupt the Ottomans were. It is you who is the hypocrite because the Germans admitted genocide in WW2, but you Turks never admit that you did anything wrong. But God is watching and you are being punished.

Arberor
Ali Uzay Peker: you seriously are stupid. Firstly just like the west turkey committed a genocide against Armenian Greeks Assyrians etc and also colonized Anatolia and the Balkans .

The reason the west is far ahead of turkey in terms of economic prosperity is cause the west had innovated in technology, the industrial revolution occurred in the uk Germany and Belgium. 

Cars, trains, steal ships, modern medicine, telephones etc was all invented by westerners.

Turks invented kebabs and hookahs lol basically Turks invented nothing for 5 centuries with all that power and wealth .

You talk about welfare? The U.K. Has the 5th heighest employment rate in the world. 75.3% of British citizens are working and not claiming welfare. In turkey employment rate is just about 50% lol practically every European country performs better than Turkey in that aspect too.

Turkish nationalist are the dumbest people you can meet.

Ali Uzay Peker
Arberor, thank you for your reply and providing a very good example! You are simply a hypocrite, who tries to find reasons for the crimes committed!!! The devil looks after his own!!! You can fool yourself, but not the people of good sense!

Arberor
Ali Uzay Peker :Did you even read my comment? 

Do you even know what a hypocrite is?

The Mongols committed crimes killing 90% of Persias population, half of China's population and killing 60% of Europe's population through catapulting corpse infected with the plague into European cities.

The Muslim Arabs had their own slave trade which was around 2x longer than the European slave trade. Additionally it only became outlawed in nations like Saudi after western pressures to do so.


The Japanese empire killed over 14 million Chinese civilians and tested thousands as Chinese/Korean people as experiments for biological warfare against the USA .


The ottomans committed numerous genocides. 1.5 million Armenians, 800,000 Greeks, 400,000 Assyrians, tens of thousands of Bulgarians etc.


Basically every nations that was able to conquer and enslave did. When Europeans did the same you Muslims and blacks cry about it. 

And as it stated before the reason for the economic prosperity of the west is NOT from mainly colonization. Nations like Germany had practically no colonies yet they became the richest nation in Europe! Spain had very large empire and Italy didn't yet Italy is more economically superior. Portugal had a very large empire yet they are one of the poorest countries in the EU. 

Nations like the uk France Germany holland are nations which were the first to industrialize they innovated built roads trains boats etc.

Turks only built mosques and nothing relevant.

Ali Uzay Peker
You need to check your understanding of "progress". When Europeans were hunting wild boars with neoliths, people in Mesopotamia and Anatolia were building great ziggurats and towns. When Arabs and Turks creating legendary towns like Merv, Hiva, Bukhara, Herat, Samarkand, Isfahan, Damascus, Konya in Central Asia and Middle East in 7th-13th centuries feudal lords in Central and Northern Europe were living in small castles. Your definition of "technological advance" is a signal of illetaracy. I suggest you to read history to learn about culture and civilisation.  Your stereotypical chauvinist discourse can really only deceive idiots!

DawnOfTheDead991
Ali Uzay Pecker, you do have the intellect to realize that everything you are using to tell us decadent westerners what scum we are was invented by us? And the Turks were east Asian barbarians who conquered the Muslim Arab caliphate. Also, you inbred creep, ever heard of the Roman then Greek empires.

Arberor
Ali Uzay Peker :Greek civilization is the most influential civilization. During the golden age of Greece understanding of science philosophy maths literature were established.

The Greek script dates back to the 8th century BC, the Latin script dates back to the 7th century BC. Turks never had their own writing script, instead they used the Arabic writing script which dates back to 4th century AD (making the Greek and Latin script more than 1000 years older).  Greek is the oldest continuously used writing script in the world. 

The Roman Empire built aqueduct systems, established laws and order. Built roads, infrastructure etc Italy today has more UNESCO world heritage sites than any country in the world .


lol then you talk about the golden age of Islam which ended in the 13th century AD, Turks didn't contribute to that. 

Islamic civilization is from Greeks. Islamic philosophy existed only because they translated Greek work from Aristotle. Islamic architecture is based off Greek and Roman architecture. Greek Byzantine medicine influenced Islamic medicine as well as fostering the Western rebirth of medicine during the Renaissance.

The Hagia Sofia was built in the year 537 AD, ottoman Turks were shocked in amazement after witnessing the large church. They admired it to the point where they based their mosques architecture off the Hagia Sofia .

The very moment the Turks invaded and took the city Constantinople, Greek scholars left and moved to Italy after that Italian and Greek scholars sparked the renaissance and after Constantinople fell no notable achievement came out from that city just kebabs and hookahs.

The architect behind the blue mosque was a Albanian, and his teacher was Greek/Armenian .The person that wrote the Turkish national anthem was a Albanian and the founder of modern day turkey was a Slav/Albanian .

After the Balkan was liberated it gave the world people like Nikola tesla (this person is the reason you have access to electricity).

Modern medicine was achieved in Europe and the USA. Russia was the First Nation in the world to reach space and the First Nation to have a satilight sent to space .

The Muslims Arab had attempted to take Constantinople for over 400 years only to fail. Cities like Izmir were also Greek. Ancient Greek and Roman monuments are found all over turkey but Turks were not known for their civilization  Today Turks use the Latin script lol A European script  Even the Slavs had their own writing scripture.

Ottoman sultans admired Ancient Greek history and as did the entire world. The ottomans came and claim to be the 3rd Roman Empire. Turks admired European civilization and culture, Internet cars train plans phones tv etc all western inventions.

Ali Uzay Peker
You are a helpless chauvinist! But it is not your fault! Your Orientalist minded teachers thought you that Europe (with Greek-Roman roots) is the source of civilisation! On the contrary Europe appropriated civilisation from East! But unfortunately you could not adapt civilisation with its spiritual essence but only with material properties as it is evident in your West-centered racist outlook! Your mentality destroys the world in creating conflicts and wars everywhere! Try to understand instead of discriminating! You have a very long path before you to go through and be a Human! But I am afraid you will never complete it since your enmity to humanity is very profound!

Arberor
Ali Uzay Peker :
Concepts like democracy were introduced by Greeks, mathematical concepts like Pythagorus theory was introduced by Greeks. Coinage was first developed in Greece independently. Philosophy and ideas was developed by ancient Greeks .The Olympics was invented by Greeks. Just because Egypt influenced Greeks doesn't hold any merit. Greek achievements are not Egyptian achievement.

Additionally ancient Egypt has nothing to do with Arabs and Turks. Greeks and even Romans lived and built cities in North Africa long before Arabs invaded and occupied North Africa in the 7th century AD. Cities like Alexandria are founded by Greeks not Egyptian and defiantly not Arabs or Turks.

England Germany and the USA invented the tv phones cars etc but as their civilization came from Greece does that mean Greeks are responsible for the invention of tvs cars plans etc? No they are not!

You were the one that first criticized the west for their colonial past but the ottomans and the islamic empire did the exact same thing before the Spanish and English . And the Turks also committed a gencoide, I said the uk Germany etc economic prosperity is thanks to industrializing first. Spain and Portugal both had very large empires but they didn't industrialize only later and they are far behind the uk France Germany holland Sweden etc and j mentioned technological advancement as a contributor to the uk Germany France etc economic growth then you were the one that bought up ancient/medieval civilization and then when I respond you go for a different approach and talk about eurocentrism.

You seriously are a Idiot.Christianity came from the Middle East but it was Europeans that developed Christian philosophy, Christian art, Christian music, Christian literature, Christian empires etc .

The most notable Christian churches where built by the Byzantine, Spanish Italian etc .Egyptian architecture is not the same as Ancient Greek architecture. The Greek style rods and the Parthenon are evident of Greek architecture not middle eastern.

Michal Prelovsky
@Arberor He is dumb, he didn't realize ottoman empire starts 1299...when they came all the cake was done, just eat it.
-----------------

ఇందులో Arberor అనే అతను సామ్రాజ్యవాదంతో పెరిగారని అనుకుంటున్న పాశ్చాతుల్ని సమర్ధించుకున్న తీరు నచ్చింది - అతని వాదనలో కొంత నిజముంది,ఎప్పుడైతే ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ప్రజల్ని కొట్టుకొచ్చిన సంపదతో పోషించడం మొదలుపెడతారో ప్రజల్లో కష్టించి పనిచేసి దేశసంపదని పెంచే తత్వం మాయమైపోతుంది!క్రైస్తవం,ఇస్లాం తొలిదశలో కొన్ని మహోన్నతమైన ఆదర్శాల్ని పాటించటమూ నిజమే,అవి ఆయా లక్ష్యాలకి కట్టుబడిన కాలంలో సామాన్యుల్నీ సత్యాన్వేషుల్నీ ఉర్రూత లూగించడమూ నిజమే!

విచిత్రమేమిటంటే అక్కడ వాదించుకున్న Ali Uzay Peker,Arberor అనే ఇద్దరూ ఎదటివాళ్ళ సంస్కృతులకి ప్రాచ్య దేశాల నుంచి నేర్చుకున్న భావజాలం వల్లనే ఆ ప్రాభవం వచ్చిందని సాక్ష్యాలు చూపిస్తూ రెచ్చిపోవడం - అది సనాతన ధర్మం యొక్క గొప్పతనం!వాళ్ళిద్దరూ గొప్ప మేధావులు కాకపోవచ్చు, కానీ వాదనలకి మేధావుల నుంచీ చరిత్రకారుల నుంచీ సాక్ష్యాలు తెచ్చుకున్నారన్నది స్పష్టం.

Number System from Vedas
......we should say clearly that the "huge debt"  is the beautiful number system invented by Indians on which much of mathematical development has rested. Laplace, put this with graet clarity:THe ingenious method of expressing every possible number using a set of ten symbols(each symbol, has a place value and an absolute value) emerged in India. Its simplicity lies in the way it facilitated calculation and placed arithmatic foremost amongst useful inventions.అంటే, మోడర్న్ సైన్సు చేస్తున్న అన్ని పరిశోధనల లోనూ ఉపయోగపడుతున్నవి వేదంలోని గణిత నియమాలే!

అధర్వ వేదం 13వ కాండం 4వ సూక్తం
16.మం:న ద్వితీయో న తృతీయశ్చతుర్ధో నాప్యుచ్యతే,య ఏతం దేవమేకవృతం దేవం
17.మం:న పంచమో న షష్ఠః సప్తమో నాప్యుచ్యతే,య ఏతం దేవమేకవృతం దేవం
18.మం:నాష్ఠమో న నవమో దశమో నాప్యుచ్యతే,య ఏతం దేవమేకవృతం దేవం

ఈ వేదమంత్రాలు వాటికి గల మూడు లక్షణాల్నీ ఎలా ప్రదర్శిస్తున్నాయో చూడండి.

1.అపౌరుషేయం:-మొదటి మంత్రానికి అర్ధం "రెండవ దైవం మూడవ దైవం నాల్గవ దైవం ఎవరూ లేరు,ఉన్నది నేను ఒక్కణ్ణే!" అని.రెండవ మంత్రానికి అర్ధం "ఐదవ దైవం ఆరవ దైవం ఏడవ దైవం ఎవరూ లేరు,ఉన్నది నేను ఒక్కణ్ణే!" అని.మూడవ మంత్రానికి అర్ధం "ఎనిమిదవ దైవం తొమ్మిదవ దైవం పదవ దైవం ఎవరూ లేరు,ఉన్నది నేను ఒక్కణ్ణే!" అని.ఇక్కడ నేను అని అంటున్నది ఋషి కాదు,ఆ ఋషికి దేవుడు చెప్తున్నాడు!ఋషులే ఆధిక్యత కోసం తమ బుద్ధికి తోచినదాన్ని దేవుడికి అంటగట్టి ఉంటారు కదా అని అనిపించవచ్చు,కానీ ఏ ఋషి ఏ సూక్తం చెప్పినా ఇతర ఋషుల ఆమోదం తర్వాతనే వేదంలో ఓక భాగం అవుతుంది.ఏ ఒక ఋషి మోసం చెయ్యాలని చూసినా ప్రతి ఒక్కరికీ తెలుస్తుంది - వైదిక సాహిత్యంలోని ఏ మంత్రమూ మరే మంత్రంతో వ్యతిరేకించదు. అంతటి విస్తారమైన సాహిత్యంలోనూ ఆశ్చర్యపరిచే ఏకరూపత ఉండటమే వేదం గురించి తెలుసుకున్న  ప్రపంచ స్థాయి మేధావుల్ని ఇవి నిజమైన అపౌరుషేయాలని నమ్మేలా చేస్తున్నది.

2.నిగూఢత/మార్మికత:-నిజానికి ఈ సూక్తం యొక్క ప్రయోజనం గణిత శాస్త్రానికి పునాది వెయ్యటం, కానీ దాన్ని సూటిగా చెప్పకుండా సృష్టికి కర్త ఒక్కడే అన్నదాన్ని నిరూపించటం కోసం చెప్పినట్టు మనకి అనిపిస్తుంది.ప్రతి వేదమంత్రాన్నీ మూడు స్థాయిలలో విశ్లేషించితే మూడు రకాల అర్ధాలు వస్తాయి.ఒకటి మామూలు తాత్పర్యం, అంటే మంత్రంలోని ప్రతి పదానికీ నిరుక్తం ప్రకారం అర్ధం తెలుసుకుని వాటిని కలిపితే వచ్చే భావం.దీనికి పైన దైవసంబంధమైన అర్ధం.ప్రతి వేదమంత్రం యొక్క ప్రయోజనం జీవాత్మను పరమాత్మతో అనుసంధానించటం కాబట్టి ఆధ్యాత్మికమైన భావం కూడా ఆ మంత్రంలోనే ఉంటుంది.ఈ రెండిటికి పైన శాస్త్రపరమైనమైన అర్ధం ఉంటుంది.నిరుక్తం మీద పట్టు ఉండటం,అన్వయాలు సరిచూసుకుంటూ చదవగలగటం,వైరుధ్యాలని అనిపించే పాఠాంతరాల్ని గుర్తించడం  లాంటి ప్రజ్ఞలు వేదాధ్యయనానికి ముఖ్యమైన అర్హతలు - వీటిని సాధించడం గురువు వల్లనే సాధ్యం! అలా తెలుసుకున్న శాస్త్ర సంబంధమైన విషయాలు ఏవీ ఆధునిక విజ్ఞానశాస్త్రంతో విభేదించడం లేదు!ఇది ఎట్లా సాధ్యం?యూరోపులో జరిగిన ఆధునిక విజ్ఞానశాస్త్రపు ఆవిష్కరణలకు కూడా వేదశాస్త్రాలే ఆధారం కాబట్టి!

3.క్లుప్తత:-ఈ లక్షణమే బద్ధకస్తులకీ సహనం లేనివాళ్ళకీ గందరగోళాన్నీ చిరాకునీ కలిగిస్తున్నది.ఆధునిక విజ్ఞానులు ఒక  సిద్ధాంతాన్ని నిర్మించదల్చుకుంటే చాలా కసరత్తు చేస్తారు.ప్రతిదానికీ డాక్యుమెంటేషన్ ఇస్తారు.అందులో తమకు తెలిసిన ప్రతి విషయాన్నీ ఉటంకిస్తారు.చదివేవాళ్ళకి వాళ్ళు వివరంగా చెప్పినట్టు ఉంటుంది.కానీ ఆ డాక్యుమెంట్ నుంచి ప్రధాన సూత్రాన్ని విడదీసి చూపిస్తే అది కూడా అర్ధం కానట్టే ఉంటుంది.వేదం అర్ధం కాకపోవడానికి కారణం కూడా అదే - మనం కష్టపడి అర్ధం చేసుకుని మన కార్యాచరణని జోడిస్తే ప్రయోజనాన్ని ఇచ్చే వైజ్ఞానిక సత్యాల్ని సూత్రప్రాయమైన క్లుప్తతతో చెబుతుంది వేదం!

సృష్టికర్త ఒక్కడే అని చెబుతున్న ఈ మంత్రాల పక్కనే శ్రీ సూక్తం,నారాయణ సూక్తం ఉన్నాయి.అగ్ని,వాయువు వంటి ప్రాకృతిక శక్తులను దేవతలని పేర్కొంటున్న మంత్రాలు ఉన్నాయి.ఇవి హిందూమతానుయాయులకి కూడా  ఒక పట్టాన అర్ధం కాక హిందూమతద్వేషులు వీటిని ఎత్తి చూపిస్తూ హడావిడి చేస్తున్నప్పుడు సమర్ధించుకోలేక తడబడుతున్నారు.

నిజానికి ఇవి వైరుధ్యాలు కావు.అవ్యక్తుడైన సృష్టికర్త తనకు తానే సృజించుకున్న స్వప్నసదృశమైన ఈ బృహత్తర విశ్వం యొక్క మహత్తత్వాన్ని ఒక్క పట్టున అర్ధం చేసుకోలేని నిస్సహాయత వల్ల మొదట విడి అంశాల్ని గురించి తెలుసుకుని తర్వాత వీటిని సమన్వయించుకుని ఒకే ఒక పరమ సత్యాన్ని స్థాపించే క్రమంలో కొన్ని విడి అంశాలకు సంబంధించిన సాపేక్ష సత్యాలు పరమసత్యంతో విభేదిస్తున్నట్టు కనిపించే అవకాశం ఉంది - అప్పుడు మన జ్ఞానవిస్తృతిని బట్టి ఆ సమన్వయ లోపాన్ని సరిచేసుకోవటానికి వేదమే కొన్ని సూత్రీకరణల్ని చేసింది.వాటిమీద ఆధారపడినవే తర్కం,మీమాంస.సత్యనిరూపణకు తర్కం చాలా అవసరం.హేతుబద్ధమైన తర్కానికి అందని దేన్నయినా సరే అసత్యం కింద తేల్చేసి తిరస్కరించడం వేదసమ్మతమైన విధానమే.వేదం అసత్యాన్ని సహించదు, వేదంలో వైరుధ్యాలు లేవు - ఇది ముమ్మాటికీ నిజం!

వాయువు గురించి వేదం, పౌరాణిక సాహిత్యం చెప్తున్న మొత్తం సారం ఒక చోటికి చేర్చి చూస్తే అవన్నీ వాయువును ఒక పదార్ధ తత్వంగానే చూసి దాని లక్షణాల్ని అలంకారిక పరిభాషలో వర్ణిస్తున్నట్టు అర్ధం అవుతుంది - వాయుదేవుడు అని సంబోధించినప్పటికీ అక్కడి వర్ణనలు మానుష దేహానికి సరిపోనందువల్ల అక్కడ వేదం మానుష దేహాన్ని కాక ఒక శక్తి స్వరూపాన్ని వర్ణిస్తున్నట్టు తెలిసిపోతూనే ఉంటుంది.

వాయవాయాహి దర్శతే మే సోమా అరంకృతాః తేషాం పాహి శ్రుధీ హవం
(ఋగ్వేదం 1వ మండలం 2వ సూక్తం 1వ మంత్రం)

ఇక్కడ వేదం వాయువును దేవతలలో ప్రధమాగామి అని సంబోధిస్తున్నది.అంటే, ఈశ్వర విభూతులైన పాంచభౌతిక జన్యమైన దృశ్యమాన ప్రపంచంలో వాయువు అనే ప్రాకృతిక శక్తికి అత్యంత ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తున్నది.నిరుక్తం కూడా వాయు అనే పదానికి "గతికర్మణః గత్యర్ధక వాతేః వాగతి" అని నిర్వచిస్తున్నది.

వాయు పురాణం వాయువు గురించి మరికొంత విస్తరించి చెబుతుంది."ఆవహ, ప్రవహ, సంవహ, ఉద్వహ, నివహ, పరివహ, పరావహ అనే ఏడు స్కంధములందు వాయుదేవుడు సదా సంచరించుచండును. సప్త మరుద్గణములు ఆయన అధీనమున ఉండును." అని చెప్పటంలో వాయువు యొక్క మానుష దేహాన్ని కాక ఏడు రకాల వాయు చలనాలను సూచించటమే ముఖ్యం, కదా!మన దేశపు మెకాలేయులకు అర్ధం కావాలంటే ఇక్కడ చెప్పినవి వాయువు అనే పదార్ధ తత్వం విశ్వంలో చూపించే ప్రభావాల యొక్క combinations and permutations అని చెబితే చాలు.

"అగ్ని, జల, పృధ్వి అనే మూడు భూతములచే రచించబడిన ప్రాణుల శరీరమునకు ప్రాణము పోసి, ఆహారమును జీర్ణము చేయుటలో అగ్నికి సహకరించుచు ప్రాణులను ధరించుచున్నాడు" అని చెప్తున్న దాని ప్రకారం జీవులకీ నిర్జీవులకీ భేదాన్ని చాలా స్పష్టమైన రీతిలో గుర్తించవచ్చు.పరిమాణం పెరగడం తరగడం కొన్ని కారణాల వల్ల నిర్జీవులలోనూ సంభవమే, కానీ శ్వాస మాత్రం ఉండదు.వాయువు జీర్ణక్రియకు సహాయం చెయ్యడం అంటే ఆహారం కణస్థాయిలో ఆమ్లజనితో కలిసి మండడం - మోడర్న్ సైన్సు దీన్ని ఖండిస్తుందా?

ఆధునిక విజ్ఞాన శాస్త్రం కనిపెట్టి చెబుతున్న ఎలెక్ట్రాన్ ఈ వాయువు యొక్క అన్ని లక్షణాల్నీ ప్రదర్శిస్తున్నది.గాలి వీచడం దగ్గిర్నుంచీ పిడుగులు పడటం వరకు ప్రకృతిలో కలిగే ప్రతి చలనం వెనక ఎలెక్ట్రాన్ ప్రమేయం ఉంటుందని ఆధునిక విజ్ఞాన శాస్త్రం చెబుతున్నది.అన్నింటికన్న ముఖ్యం ఎలెక్ట్రాన్ ఏడు శక్తిస్థాయుల(orbitals)లోనే సంచరించడం వేదం యొక్క ఖచ్చితత్వాన్ని తెలియజేస్తుంది!మీరు చిన్నప్పుడు చదువుకున్న సైన్సును ఒకసారి గుర్తు చేసుకోండి:

1s2
2s2 2p6
3s2 3p6 3d10
4s2 4p6 4d10 4f14
5s2 5p6 5d10 5f14
6s2 6p6 6d10 6f14
7s2 7p6 7d10 7f14

పదార్ధవిజ్ఞానశాస్త్రం ఎప్పుడు చెప్పింది?వేదవిజ్ఞానశాస్త్రం ఎప్పుడు చెప్పింది?ఒక్క వాయువు గురించి ఇక్కడ చెప్పినది వేదంలో ప్రస్తావించబడిన ఇతర విషయాలకు కూడా వర్తిస్తుంది.వైదిక విజ్ఞానం, ఆధునిక విజ్ఞానం రెండింటిలోనూ సామాన్యుల సుఖజీవనానికి ఉపయోగపడే వస్తువులను తయారుచేసేది సాంకేతిక పరిజ్ఞానం - కానీ సూత్రాలు,విశ్లేషణ వంటివాటితో కూడిన శాస్త్రం  పునాదిగా ఉండి తీరాలి!వైదిక సాహిత్యం మొత్తం శాస్త్రం,దాన్ని as it is ఉపయోగించుకోలేకపోవటంలో వింత ఏముంది?

చలనానికి కారణమైన వాయువును ఎక్కడ చూసినా వాయుదేవుడు అని పిల్చారే తప్ప వాయుదేవత అని పిలవలేదు, ఎందుకని?సంపదకు కారణమైన లక్షిని దేవి అని పిల్చారే గానీ దేవుడు అని పిలవలేదు, ఎందుకని?మొదటిది dynamic energy రెండోది static energy కాబట్టి!లక్ష్మీ నారాయణుల్నే ఒక జంటను చెయ్యడం దేనికి? static lattice energy, dynamic combussion enerrgy విశ్వం యొక్క స్థిరత్వం అనే అంశానికి చెందిన రెండు పార్శ్వాలు కాబట్టి!బ్రహ్మ-సరస్వతి, శివుడు-పార్వతి, ఇంద్రుడు - శచి వంటి జంటల వెనక ఉన్నది కూడా అదే - ఇది తెలియని వాళ్ళు వాళ్ళకి మానుష దేహాలకి సంబంధించిన శృంగార వ్యభిచారాదులని అంటగడుతున్నారు.కధా రూపంలో ఉండే పౌరాణిక సాహిత్యం కొన్ని పాత్రల్ని ఇవే పేర్లతో సృష్టించటానికి ఉన్న కారణాల్ని తెలుసుకోవాలి తప్ప ఆ పాత్రలనే ఈ దేవతలని భావించి అవేశపడ రాదు - అందువల్ల ఎలాంటి ఉపయోగం లేదు!

ఎందుకంటే, నిన్నటి వరకు నేను అలెగ్జాండరు పురుషోత్తముణ్ణి ఓడించాడని నమ్మాను.ఇప్పుడు నాకు నిజం తెలిసింది.నా ముందు ఇతరులు పాత కధని వల్లె వేసినప్పుడు వాళ్ళని సరిదిద్దటానికి ప్రయత్నిస్తాను. అయితే, ఇంకో పదేళ్ళ తర్వాత కూడా అలెగ్జాండరు పురుసోత్తముణ్ణి ఓడించాడని నమ్మేవాళ్ళు ఉంటారు.మన నమ్మకాల్ని బట్టి చరిత్ర మారుతుందా?ఇప్పుడు నాకు తెలిసినదే నిజం అయితే పురుషోత్తముడి ఘనతకు ఏ లోపమూ ఉండదు - ఆ యుద్ధంలో గెలిచిన ఆనందాన్ని ఆయన అనుభవించేశాడు కదా!

అలెగ్జాండరు పురుషోత్తముడి చేతిలో ఓడిపోయి వెనక్కి పోయిన పూ.సా. 326 నాటికే మన రాజులూ రాణులూ నవరత్నాలు పొదిగిన ఆభరణాలు ధరించేవాళ్ళు."తొక్కలే!ఉంగరాలూ గొలుసులూ ముక్కుపుడకలూ చెయ్యటం గొప్పా, ఏంటి?" అనుకున్నారంటే పప్పులో కాలేసినట్టే - దానికి critical angles, refractive index, total internal reflection వంటి చాలా విషయాలు తెలియాలి.opticsకి సంబంధించిన ఇలాంటి విషయాలతో కూడిన "రత్న పరీక్ష" అనే గ్రంధం 5000 యేళ్ళ నాటిది!ఇప్పటికీ ప్రపంచ స్థాయిలో అమ్ముడవుతున్న వాటిలో 90% వజ్రాలు భారతీయ నిపుణుల పనితనం నుంచే పుడుతున్నాయి - laser cutting technology కూడా మనవాళ్ళ precision ముందు ఓడిపోతున్నది.

అలెగ్జాండరు పేరు గుర్తుకు రాగానే  రత్నపరీక్ష గుర్తుకొచ్చింది, రత్నకాంతి గుర్తుకు రాగానే సూర్యకాంతి గుర్తుకొచ్చింది, సూర్యకాంతితో ఇంకేది గుర్తుకొస్తుందో - ఈ పోష్టు దేంతో పూర్తవుతుందో, అసలు పూర్తవుతుందో లేదో! సూర్యగోళమూ చంద్రగ్రహమూ వేరు వేరు సైజుల్లో ఉండి కూడా భూమి మీద నుంచి చూస్తే ఒకే సైజులో ఉన్నట్టు ఎందుకు కనపడుతున్నాయో తెలుసా!భాగవత పురాణం సూర్యగోళం 10,000 యోజనాల విస్తారం(Diameter)తోనూ చంద్రగ్రహం 25 యోజనాల విస్తారం(Diameter)తోనూ ఉన్నాయని వర్ణించింది.అక్కడ చెప్పబడిన 1 యోజనం ఆధునిక కాలంలోని linear distance లెక్కల ప్రకారం 140 kms అవుతుంది.

భూగోళం యొక్క కైవారం 12798 kms.
చంద్రగ్రహం యొక్క కైవారం 3499 kms.
సూర్యగోళం యొక్క కైవారం 1390 000 kms.
సూర్యగోళం వ్యాసం భూగోళం వ్యాసం కన్న 108 రెట్లు.
(12798X108=1,382,184)
భూగోళానికీ చంద్రగ్రహానికీ మధ్య దూరం 381 000 kms
(3499X108=377,892)
భూగోళానికీ సూర్యగోళానికీ మధ్య దూరం 149 900 000 kms
(1390 000X108=150,120,000)

ఇలా రెండింటికీ సైజులకీ దూరానికీ ఉన్న నిష్పత్తి ఒకలాగే ఉండటానికి కారణం ఏమిటి?అవ్యక్తుడైన పరమాత్మ(Absolute Creator) నుంచి దృశ్యమాన ప్రపంచం(Created Universe) వ్యక్తమౌతున్నప్పటి ఆది ప్రణవ నాదం యొక్క స్థిరాంకమే ఈ 108 సంఖ్య!ఆయుర్వేదం జీవుల దేహాల్లో 108 మర్మస్థానాలు ఉన్నాయని చెప్తున్నది - ఈ స్థానాల వద్ద పరమ పురుషుడు(Consious Mind) వసించి దేహప్రకృతి(Static Node)ని శాసిస్తూ ఉంటాడు.

సృష్టికర్త యొక్క మేధస్సుని నిక్షేపించుకున్న యంత్రరాజం శ్రీచక్రం 5 కిందకీ 4 పైకీ చూస్తున్న త్రికోణాలు ఖండించుకుంటున్నట్టు కనిపిస్తుంది.9కీ కేతువుకూ సంబంధం ఉంది.కేతువు మోక్షకారకుడు.సంఖ్యాశాస్త్రంలో 9 చాలా విశిష్టమైన సంఖ్య.

9 x 1 = 9
9 x 2 = 18, 1 + 8 = 9
9 x 3 = 27, 2 + 7 = 9
9 x 4 = 36, 3 + 6 = 9
9 x 5 = 45, 4 + 5 = 9
9 x 6 = 54, 5 + 4 = 9
9 x 7 = 63, 6 + 3 = 9
9 x 8 = 72, 7 + 2 = 9
9 x 9 = 81, 8 + 1 = 9
9 x 10=90, 9 + 0 = 9
9 x 11=99, 9 + 9 = 18, 1 + 8 = 9
9 x 12 = 108

శ్రీచక్రంలోని 9 త్రికోణాలూ ఒకదానినొకటి 108 చోట్ల ఖండించుకుంటున్నాయి.సృష్టిలోని దైవతత్వాన్ని మనలోకి తెచ్చుకోవాలంటే pineal gland ( soul ), pituitary gland ( body ) ఏకశృతిలో స్పందించాలి - దానికి ముందు క్షీర సాగర మధనం జరగాలి!

మత విశ్వాసాలతో సంబంధం లేకుండా తాంత్రిక శక్తులను ఉపాసించే వారిలో pineal gland నుంచి స్రవించే Pinoline, ( 6-methoxy-tetra-dydro-beta carboline, or 6-MeO-THBC ) ఎక్కువ ఉండటం పరిశోధకులు గమనించారు.భూమి మీద ఉత్పన్నమయ్యే 7.83, 14, 20, 26, 33, 39, 45 Hertz తరంగదైర్ఘ్యాల ధ్వనుల్లో 7.83 hzని భూమి యొక్క హృదయ స్పందన అంటారు. ఈ Schumann frequency ఎంత ముఖ్యమైనదంటే, Astronauts తమ అంతరిక్ష నౌకల్లో 7.83 field generatorని అమర్చుకుంటారు.ఇది మన దేహంలో ప్రతిధ్వనించి pineal glandని ఉద్రిక్తం చేసి Pinoline స్రవించాలంటే ఓంకారాన్ని ఉచ్చరించాలి - Pinoline యొక్క resonance frequency కూడా 7.83 hz. ఓంకారం కలవని యోగాసనాలూ మంత్రం లపకని సూర్యనమస్కారాలూ ఎలాంటి ప్రయోజనాన్నీ ఇవ్వవు - క్రికెట్ బంతితో బేస్ బాల్ ఆడినట్టు అఘోరిస్తుంది! 

మొదట ఓంకార సాధన వల్ల కుండలిని కదిలి మూలాధారం అనే కూర్మపృష్టం మీద నిలబడిన spinal chord లోపల వ్యాపించిన మేరు శిఖరం మీద పైకి ఎగబాకటం మొదలు పెడుతుంది.దీనికి సురాసుర విభూతుల సంఘర్షణ నుంచి పుట్టి సత్వ గుణం వల్ల సాధువులైన మనోయోగశక్తులు సహాయం చేస్తాయి.సాధకుడు తనలో జరుగుతున్న క్షీర సాగర మధనాన్ని వ్యగ్రతకి గురి కాకుండా కొనసాగించితే కొంత కాలం తర్వాత ఫలితాన్ని సాధిస్తాడు - విశ్వలయలో  దేహలయని లీనం చెయ్యడమే యోగం, అది స్థిరపడితే మోక్షం!

Quantum physics has showed the ancient Indian Yogis were NOT mere dreamers of cosmic consciousness, where our bodies, our brain and its mind, as inextricably joined with other matter and the mega dipole of universe .

దేవుడు, భక్తి, పూజలు, యోగం, మోక్షం వంటి విషయాలు చెప్పాల్సిన చోట భూమికీ చంద్రుడికీ మధ్య ఉన్న దూరం గురించి చెప్పాల్సిన అవసరం ఏమిటి? ఒకచోట చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్న గోళం అనీ ఒకచోట లక్ష్మికి సోదరుడనీ చెప్పటం వైరుధ్యం కాక ఏమిటి?అసలు క్షీరసాగరమధనం ఎప్పుడు జరిగింది?అంతకుముందు ఆకాశంలో చంద్రుడు లేడా?ఇలాంటి ప్రశ్నలన్నిటికీ మళ్ళీ మళ్ళీ నేను చెప్పే జవాబు ఒకటే:డాన్ బ్రౌన్ తన కధల్లో ప్రొఫెసర్ లాంగ్డన్ అనే పాత్రని సృష్టించాడు.ఇప్పటి story telling technique ప్రకారం అతనికో ఉద్యోగం ఉంది, అడ్రసు ఉంది.అంత మాత్రాన ప్రొఫెసర్ లాంగ్డన్ వాస్తవవ్యక్తి అయిపోతాడా?పోనీ సింబాలజీని ఎక్కువ వాడుకున్నాడు గాబట్టి డాన్ బ్రౌన్ సింబాలజీ ప్రొఫెసర్ అని నిర్ధారించితే ఎట్లా ఉంటుంది?చాలా చెత్తగా ఉంటుంది, కదా?రాసలీలలోని పరమాణు విజ్ఞానశాస్త్రం గురించి తెలుసుకోకుండా కృష్ణుడు womanizer అనటమూ ఇంద్రుడు మునుల తపస్సుని భగ్నం చెయ్యటానికి prostitutesని పంపించాడు గాబట్టి అతను pimp అని అనటమూ కూడా అంతే.

రాముడు శూర్పణఖని చూడగానే మత్తెకిపోయాడనీ రావణుణ్ణి చూడగానే సీతకి పులకరం పుట్టిందనీ తన మొగలిపొదని తెరిచి చూపించిన ముప్పాళ రంగనాయకమ్మ సాధించింది ఏమిటి?బహుజన్ సమాజ్ పార్టీ సభ్యుడైన కదిరి కృష్ణ పెళ్ళి మంత్రాల్ని వెక్కిరించి చాగంటి కోటేశ్వర్రావుని తిట్టి తన పార్టీకి ఎన్ని వోట్లని పెంచాడు?వీళ్ళు గౌరవం కానీ అధికారం కానీ ఎవరినుంచి ఆశిస్తున్నారు?హిందువుల నుంచే కదా!హిందువుల నుంచి గౌరవాభిమానాలని ఆశించేవాడు ఎవ్వడూ హిందువుల్ని అవమానించడు - తన వీరత్వం చూపించి సాటివాళ్ళ మెప్పు పొందడానికి కూడా బలాబలాల లెక్కలు చూసుకోకపోతే ప్రమాదమే తప్ప ప్రయోజనం లేదు.

నేను హిందువులకి పదే పదే చెబుతున్నది కూడా  ఒకటే:హిందూత్వం గురించి నాలుగు సొల్లు కబుర్లు చెప్పగానే నమ్మేసి భాజపాకి వోట్లు వేస్తే చాలు హిందూమతం బాగుపడిపోతుందనే భ్రమలనుంచి బైటికి రండి!మోదీ ఫ్యాన్లలో ఎవరైనా  సరే మోదీ ప్రభుత్వం హిందూమతానికి ప్రత్యేకించి చేసిన మేలు ఏమిటో చెప్పగలరా?విజయ్ మాల్యా మంచివాడా, చెడ్డవాడా?అమిత్ షా మంచివాడా, చెడ్డవాడా?అవినీతిపరుల్ని శిక్షించడానికి చేతులు రాని హిందూత్వం మనకి అవసరమా?

ఎవడో గొట్టాంగాడు ఏదో తప్పు పట్టగానే అప్పుడు హడావిడి పడి వెతుక్కోవటం తప్ప మనలో ఎంతమందికి పౌరాణిక సాహిత్యం మీద పట్టు ఉంది?గబ్బర్ సింగ్ దయలాగులు కూడా హిందీలో కన్న సంస్కృతంలో అదిరిపోతుంటే అది మృతభాష ఎట్లా అయ్యింది?మనం నేర్చుకోవాలి, ఇతర్లకి నేర్పాలి - అప్పుడే కదా అందరికీ దాని గొప్పతనం తెలిసేది!మనం పూనుకుని చెయ్యాల్సినది ఎంతో ఉంది, అది వదిలేసి మోదీకి చిడతలు వాయిస్తే ఉపయోగం ఏమిటి?మూతబడిన వేద పాఠశాలల్ని తెరిపించి ప్రోత్సహిస్తే కదా వేదవిజ్ఞానం పదిమందికీ అదుబాటులోకి వచ్చేది!ఉపాధి హామీ లేకుండా వూరికే తెరిచి ప్రయోజనం కూడా ఉండదు - ఒకప్పుడు మూతబడినది మెకాలె సంస్కృతానికీ ఉపాధికీ ఉన్న లింకు తెగ్గొట్టటం వల్లనే కదా!

సంస్కృత పఠనాన్నీ వేదాధ్యయనాన్నీ వ్యవస్థీకృతం చెయ్యాల్సింది ప్రభుత్వమే - మరి మోదీ వీటిని ఎందుకు ప్రోత్సహించటం లేదు?మగనెమలి కంటినుంచి కారే కన్నీటిచుక్కల్ని తాగి ఆడనెమలి గుడ్డు పెడుతుందనే చెత్త కబుర్లు చెప్పేవాళ్ళని పండితుల పేర్న ఆంబోతుల్లా జనం మీదకి వదలడమా వైదిక విజ్ఞానాన్ని ప్రోత్సహించడం అంటే!

ప్రభుత్వం మనది కాదు గాబట్టి  ప్రస్తుతం వేదాధ్యయనానికి వ్యక్తిగతమైన ఆసక్తి తప్ప మరో దారి లేదు. అలా అధ్యయనం చేసిన ప్రవీణ్ మోహన్ అనే అతను ఈనాటి మేధావి వోల్టా చెప్పిన పద్ధతిలో కాకుండా పాత కాలంనాటి అగస్త్య సంహిత చెప్పిన దాన్ని ఫాలో అయి మట్టి కుండలతోనూ రంపం పొట్టుతోనూ electricityని పుట్టించి బల్బుని వెలిగించాడు, యంత్రాన్ని నడిపించాడు. వేదం పనికిరావటం పనికిరాకపోవటం మన ప్రయోజకత్వాన్ని బట్టి ఉంటుందనేది వ్యాసపరాశరాదిషిర్డిసాయినాధపర్యంతం ఉన్న నా గురుపరంపర పాదాల మీద ప్రమాణం చేసి చెబుతున్న పరమ సత్యం!ఏది సత్యమైనదో అదే శివమైనదీ అవుతుంది!ఏది శివమైనదో అదే సుందరమైనదీ అవుతుంది!


సత్యం శివం సుందరం!!!

"వేదాలు చదివిన వారు యజ్ఞయాగాదు లందు పశువులను వధిస్తారు" - ఇది నిజమా?

hari.S.babu: గురువు గారూ ! మహాభారతంలో ధర్మవ్యాధుని కధ వస్తుంది కదా . అక్కడ ధర్మవ్యాధుడు కౌశికుడికి ధర్మబోధ చేస్తూ ఒకచోట ," ...