Friday, 15 February 2019

అసలు రామాలయం కడతామని చెప్పి అధికారంలోకి వచ్చాక రామాలయం గురించి మర్చిపోయిన బీజేపీని హిందువులు ఎందుకు తిరిగి అధికారంలోకి తీసుకురావాలి?

సుమారు గంటసేపు మధ్యలో దుబాసీల కోసం ఆగుతూ ఇంకొంచెం గొంతు పెంచితే కంఠనాళాలు తెగిపోతాయేమో అన్నంత గాఠ్ఠిగా అరుస్తూ మోదీ చేసిన ప్రసంగంలో ప్రధానమంత్రి పదవిలో ఉన్నవ్యక్తి నుంచి ప్రజలు ఆశించే హుందాతనం ఎక్కడయినా ఉందా?ఆ స్థాయి వ్యక్తి నుంచి ప్రజలు హుందాతనాన్ని ఆశిస్తారని మోదీకి తెలియదా, లేక మోదీ వ్యక్తిత్వంలోనే హుందాతనం లేదా! ప్రధాని అనే స్థానం కూడా ముఖ్యం కాదు ఇక్కడ - అక్కినేని నాగేశ్వర రావు లాంటి సినిమా నటుడు కావచ్చు, శ్రీశ్రీ వంటి రచయిత కావచ్చు,ఒక పారిశ్రామిక వేత్త కావచ్చు, బహిరంగ వేదిక మీద నుంచి విశాల ప్రజానీకాన్ని ఉద్దేశించి చేసే ప్రసంగం హుందాగా ఉండాలన్న గమనిక కూడా మోదీకి లేదా?

"నేను ఇక్కడికి నా పార్టీ ఖర్చులతో వచ్చాను!చంద్రబాబు ప్రభుత్వ సొమ్ముతో ఫొటో సెషన్ కోసం వెళ్ళాడు!" అని అంటున్న వ్యక్తికి కనీసం కామన్ సెన్సు అయినా ఉందా?ప్రధాన మంత్రి అయ్యేటప్పుడే కాదు, లోక్ సభ సభ్యుడిగా రాజ్యాంగం మీద ప్రమాణం చేశాడు కదా!ఏమని చేశాడు?అయిదేళ్ళ పాటు ప్రజలకి అంకితమౌతానని చేశాడా,మధ్యలో లీవు పెట్టి స్వంతపనులు చూసుకుంటూ ఉంటానని చేశాడా?ఇప్పుడు ఆంధ్రాకి తను లీవులో వచ్చాడా!అయిదేళ్ళ పాటు ప్రజలకి అనుక్షణం రక్షణగా ఉంటానని ప్రమాణం చేసినవాడికి స్వతఃపరః భేదం ఉండటమే తప్పు. అలాంటిది దాన్ని గొప్పగా చెప్పుకుంటున్నాడు చూడండి! తన బుర్రనుంచి పుట్టిందో వేరేవాడు రాసిస్తే పంచ్ బాగుందని వాడుకున్నాడో గానీ ఇంత తెలివితక్కువ మాటతో తెలివైన ఆంధ్రా వోటర్లని ఢమాల్న బుట్టలో పడెయ్యగలనని ఎట్లా అనుకున్నాడు?దేశప్రజలకి బాధ్యత వహించాల్సిన ప్రధానమంత్రి ఒక రాజకీయ పార్టీ యొక్క ప్రైవేటు సొమ్ముని వాడుకోఅవటం అనైతికతయే అవుతుంది.తనకి సిగ్గూ శరమూ ఉంటే ఆ తప్పుడు పని చేసినందుకు దేశప్రజలకి క్షమాపణ చెప్పాలి!

"తల్లిని చంపి పిల్లని పుట్టించారు!" అని ఎన్నికల ముందు జాలిని కురిపించి ఆ తల్లి గృహప్రవేశానికి పిలిస్తే వెళ్ళి ప్రత్యేకహోదా గురించి గట్టి  హామీ ఇచ్చి సంతోషపెట్టాల్సిన సందర్భంలో కుండెడు మట్టీ బిందెడు నీళ్ళూ ఇచ్చి సరిపెట్టేసి ఉసూరుమనిపించినవాడు మనిషా పశువా రాక్షసుడా!అంటే, ఆంధ్రాకి ప్రత్యేక హోదా ఇవ్వకూడదనే నిర్ణయం అప్పటికే జరిగిపోయిందని తెలియడం లేదూ!"అసలు ఆంధ్రాకి ఇంకేదైనా ఇస్తాం గానీ ప్రత్యేక హోదా మాత్రం ఇవ్వం అని భీష్మించుకోవడానికి కారణం ఏమిటి?" - ఈ ఒక్క ప్రశ్నకి జవాబు చెప్పగలిగితే చాలు మోదీ ప్రజలకి మేలు చెయ్యడం కోసమే రాజకీయాల్లోకి వచ్చాడనీ బీజేపీ హిందువుల్ని ఉద్ధరించడానికి కంకణం కట్టుకున్న పార్టీ అనీ మనం నమ్మవచ్చును.

అప్పుడు వాళ్ళు చెప్పిన  "ప్రత్యేక హోదా వల్ల వచ్చే 10 కోసం పట్టుపట్టకపోతే ప్యాకేజీ పేరుతో 20 ఇస్తాం" అన్న ముక్కలో ఉన్న లాజిక్కు నాకు ఇప్పటికీ అర్ధం కావడం లేదు.ఆ పేరుతో కాకపోతే 20 ఇవ్వడానికి సిద్దపడినవాళ్ళకి ఆ పేరుతో 10 ఇవ్వడానికి చేతులు రాకపోవటం ఏంటి?మొదట ప్రత్యేక ప్యాకేజీ ప్రతిపాదన చేసిందీ వాళ్ళే, అది కూడా ప్రత్యేక హోదా అడక్కపోతేనే అన్న మెలిక పెట్టిందీ వాళ్ళే, మరో ఆప్షన్ లేని స్థితిలో బాబుని నిలబెట్టిందీ వాళ్ళే, ఇస్తామన్నది కూడా బిచ్చం వేసినట్టు కాస్త కాస్త విదిలిస్తూ ఇచ్చినవాటికి లెక్కలు అడిగి విసిగించినదీ వాళ్ళే, పొమ్మనకుండా పొగబెట్టినట్టు ప్రవర్తించి ఎన్నికల్లో గెలవడానికి మమ్మల్ని వదిలేశాడని బ్లేం చేస్తున్నదీ వాళ్ళే - అన్ని సందర్భాల్లోనూ బాబుని బలిపెట్టి తప్పుకోవటానికి చూశారు తప్ప ప్రత్యేక హోదా ఇచ్చి ఆంధ్రప్రజల్ని సంతోషపెడదామనే సద్బుద్ధిని మాత్రం ప్రదర్శించ లేదు భారతీయ జనతా పార్టీ నాయకులు.పిచ్చోడా!నిన్నటి వరకు నీ మంత్రివర్గంలో భాగస్వామిగా ఉన్నవాడు సరిగ్గా ఎన్నికల ముందు నీతో కలిసుంటే ఎన్నికల్లో గెలవనని అనుకోబట్టే కదా నీతో తెగదెంపులు చేసుకున్నది - అది నీకు గర్వకారణమా?

భాజపా వ్యూహకర్తలు తమ మేధావిత్వాన్ని గురించి అతిగా వూహించుకుంటూ ఇలా ప్రవర్తిస్తున్నారేమో గానీ "ఆంధ్రాకి హోదా ఇవ్వకుండానే మనం ఆంధ్రాలో ప్రయోజనం పొందాలి!" అనే మూర్ఖత్వాన్ని వదులుకుని ఆలోచించాలి. హోదా ఇచ్చినా ఆంధ్రాలో ఇప్పటికిప్పుడు అధికారంలోకి రాగలిగిన స్థాయిలో భాజపా లేదు, అవునా?అలాంటప్పుడు బాబు అనే బొమ్మని వీక్ చేసి జగన్ అనే బొమ్మని స్ట్రాంగ్ చెయ్యటం ఇగోని చల్లార్చవచ్చు గానీ భాజపాకి వచ్చే నికర లాభం ఏమిటి?

నేను జగన్ ముఖ్యమంత్రి కావటాన్ని వ్యతిరేకించేది అతను అవినీతిపరుడని కాదు, అసమర్ధుడని మాత్రమే!సమర్ధుడైన చంద్రబాబుని శత్రువుని చేసుకుని అసమర్ధుడైన జగన్ని మిత్రుణ్ణి చేసుకుని వీళ్ళేమి సాధించగలరో నాకు అర్ధం కావటం లేదు!ఒక రాజకీయ నాయకుడు అధికారంలోకి వస్తే సమర్ధంగా పరిపాలించగలడా లేదా అనేది అధికారంలో లేనప్పటి అతని ప్రవర్తనని బట్టే తెలుసుకోగలం.ఆ లెక్కన చూస్తే చంద్రబాబు రాజశేఖర రెడ్డి అంతటివాణ్ణే తట్టుకుని నెగ్గుకు రాగలిగాడు - రాజశేఖర రెడ్డి నచ్చినవాళ్ళని అందలమెక్కించటం నచ్చనివాళ్ళని తొక్కెయ్యటం ఏమాత్రం నదురూ బెదురూ లేకుండా చేశాడనేది గుర్తుంచుకుంటే స్వపక్షం వాళ్ళే బెదిరిపోయిన కాలంలో ప్రతిపక్షంలో ఉండి అతన్ని తట్టుకోవటం ఎంత కష్టమో అర్ధం అవుతుంది!జగన్ అంత సమర్ధుదే అయితే శాసనసభలో అడుగుపెట్టకుండా బయట బయట ఎందుకు తిరుగుతాడు! నేను తల్చుకుంటే ఒక గంటలో ఈ ప్రభుత్వం కూలిపోతుంది అని గొప్పకి పోయి సాయంకాలానికల్లా రివర్సు గేరులో చంద్రబాబు కొట్టిన దెబ్బకి బిక్కమొగం వేసిన జగన్  భాజపాజీ తెలంగాణ తొట్టిగ్యాంగుకీ గొప్ప సమర్ధుడిలా కనపడుతున్నాడా?

మీరు ఇచ్చినవాటికి లెక్కలు అడిగితే బాబు మేము కట్టిన పన్నుల లెక్క అడుగుతున్నాడు - ఇంటి పక్క కోమటి కొట్టులో గుమాస్తా మాట్లాడినట్టు మాట్లాడకండి, జాతీయ స్థాయి నాయకులు వీధి గూండాల స్థాయిలో మాట్లాడితే మీకు లేకపోయినా చూసేవాళ్ళకి సిగ్గేస్తుంది - మీకు వోట్లేసి గెలిపించి మిమల్ని అక్కడికి పంపించినవాళ్ళ మీద జాలేస్తుంది!విజయ్ మాల్యని దొడ్డిదారిన దేశం దాటించిన గొప్ప చౌకీదారువి నువ్వు అవినీతి గురించి మాట్లాడితే నవ్వొస్తుంది గానీ ఓట్లు పడవు.మీరిచ్చిన నిధుల్ని సద్వినియోగం చెయ్యలేదని చంద్రబాబుని అసమర్ధుడని అంటున్నావే, వంద రోజుల్లో అవినీతిపరులు స్విస్ బ్యాంకులో దాచుకున్న డబ్బునంతా తెస్తానని  తేలేకపోయిన నీ అసమర్దత సంగతేంటి?

"చంద్రబాబు ఒకసారి గెలిస్తే రెండోసారి ఓడిపోతాడు!ఎవరో ఒకరితో కలిసి తప్ప ఒంటరిగా గెలవలేడు!" అనే మూఢనమ్మకాల్ని కూడా వాడుకుంటున్నారు గానీ అతను ప్రతిపక్షంలో కూడా సమర్ధంగానే వ్యవహరించి పార్టీని కాపాడుకుని మళ్ళీ అధికారంలోకి రాగలిగాడనేది మరిచిపోతున్నారు. ఒకటి మాత్రం నిజం - కేసీయార్, జగన్, మోదీ ఏదో ఓక సందర్భంలో బాబుని వ్యక్తిగతమైన విషయాలను ప్రస్తావించి దిగజారుడు భాషతో అవమానించినప్పటికీ జవాబు చెప్పటమే తప్ప తనుగా ఎవ్వర్నీ వ్యక్తిగతమైన ఆరోపణల్తో దెబ్బతియ్యాలని చూడలేదు చంద్రబాబు!

అక్కడా ఇక్కడా ఉన్న భాజపా వాళ్ళు "మేము మహా మేధావులం, వ్యూహరచనలో చాణక్యుణ్ణి మించినవాళ్ళం - మా వ్యూహం సత్ఫలితాలనే ఇస్తుంది"  అని అనుకుంటూ ఉన్నారేమో గానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రత్యేక హోదా ఇవ్వకుండా తప్పించుకోవడానికి వాళ్ళు పడుతున్న పాట్లూ వేస్తున్న వెధవ్వేషాలూ ఆంధ్రాలో అతి సామాన్యుడికి కూడా తెలుసు!నేను బీజేపీ మేలు కోరి వాళ్ళకి ఇస్తున్న సలహా ఏమిటంటే, మేము జాతీఅయ్ పార్టీ సభ్యులం, బాబుది ప్రాతీయ స్థాయి అనే అహంకారాని వదుకుకుని మీరు ఎంత తెలివైన్వాళ్ళమని అనుకున్నా మీరు చేస్తున్న పనులన్నీ మీరు కావాలనే ఆంధ్రా మీద పగబట్టి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదనే భావం ఆంధ్రా వోటర్లలో ఉన్నదనేది గమనించండి!అక్కడ వేరే పార్టీవాడు అధికారంలో ఉంటే ఇవ్వకపోవడమూ తమ పార్టీకి వోటు వేస్తేనే ఇవ్వడమూ లాంటి చెత్తపనులు చేసి కాంగ్రెస్ ఏమి సాధించింది?ఆ పార్టీని ఆ స్థితికి నెట్టిన ఘనకార్యం మీరు చెయ్యలేదు - అది దుర్మార్గం అని తెలిసిన ప్రజలు చేశారు!

అప్పటికే మీరు ఆంధ్రాకి ప్రత్యేక హోదా ఇవ్వకూడదని నిర్ణయించుకోవడం వల్లనే ఆ రోజున కుండెడు మట్టీ చెంబెడు నీళ్ళతో సరిపెట్టేశారనే క్లూ తోచడానికి నాలాంటి మేధావికి కూడా ఇంతకాలం పట్టింది, అమాయకుడైన చంద్రబాబుకి ఎలా తెలుస్తుంది పాపం!ప్రజల్ని మోసం చెయ్యగలగడంలో మీ టక్కరితనాన్ని మెచ్చుకుని తీరాల్సిందే!కానీ ఇప్పుడు నాకు తెలిసిపోయిన సంగతి నేడో రేపో ఆంధ్రాలోని ప్రతి ఓటరుకీ తెలిసిపోతుంది, అప్పుడు మీ పరిస్థితి యేంటి?

13 comments:

  1. You may say thousand things against Jagan or CBN or Modi. People are really interested in CBN but for his alignment with congress. No body bothered even he is opposing Modi...got the point?

    ReplyDelete
    Replies
    1. పొరపాటు పడుతున్నారు మీరు.భాజపా అనే ఒక నీచ్ కమీన్ కుత్తే పార్టీ చంద్రబాబుకి కాంగ్రెసుతో దోస్తీ చెయ్యక తప్పని పరిస్థితిని కల్పించింది!

      తెదెపా వాళ్ళకి మిత్రపక్షం అన్నారు.ఆ పార్టీ వాళ్ళని కేంద్రమంత్రివర్గంలో చేర్చుకున్నారు.అయినా హోదా విషయంలోనూ ప్యాకేజీ విషయంలోనూ ఎట్లా ప్రవర్తించారో చూశాక కూడా మీరు ఈ చాదస్తపు కబుర్లు చెప్తున్నారంటే ఆశ్చర్యంగా ఉంది.ఏనాటి NTR, ఏనాటి కాంగ్రెసు ద్వేషం? ఆనాడు కాంగ్రెసు మీద NTR కూడా ఒంటరి పోరు చెయ్యలేదు, గమనించారా?అప్పుడు కాంగ్రెసు మీద పో0రాడటానికి అప్పటి కాంగ్రెసేతర పార్టీలని కలుపుకున్నట్టే ఇప్పుడు BJPని ఎదుర్కోవటానికి భాజపాయేతర పక్షాలని కలుపుకోవాలి, తప్పదు!

      రాజకీయాల్లో శాశ్వత మిత్రులూ శాశ్వత శత్రువులూ ఉండరనేది ఎంతమంది ఎన్నిసార్లు రుజువు చెయ్యలేదు!మోదీ ప్రసంగం చూసిన వెంటనే ఆ పార్టీ మీద నాకున్న అసహ్యం పది రెట్లు పెరిగింది.ఇక్కడ తెలంగాణ తొట్టిగ్యాంగు తోపు కామెంటుని చూశాక ఆంధ్రాకి బాబు అవసరం ఎంత ఉందో మరింత క్లారిటీ వచ్చింది!

      ANDHRA NEEDS BABU!CENTRE NEEDS CONGRESS!

      Delete
  2. చాగంటి విజయ్ భాస్కర్ గారు టీడీపీ & బాబు వీరాభిమాని. ఈ విషయం వారి ట్విట్టర్ చూస్తే స్పష్టంగా తెలుస్తుంది.

    https://twitter.com/vijaybchaganti?lang=en

    ఆయన ప్రత్యేక ప్రతిపత్తి విషయంలో 2016 చంద్రబాబు-జైట్లీ ఫార్ములాను వివరిస్తూ (& సమర్థిస్తూ) రాసిన బ్లాగు చదవండి. ఆయన విషయాన్ని సామాన్యులకు కూడా అర్ధమయ్యే సరసమయిన భాషలో చక్కగా వివరించారు.

    https://vijaybhaskarchaganti.blogspot.com/2016/09/blog-post_10.html

    అప్పటికి ఇప్పటికీ బీజేపీ ఇదే ఫార్ములాకు కట్టుబడి ఉంది. చంద్రబాబు (వేరే ఒత్తిళ్ల దృష్ట్యా?) యూ-టర్న్ తీసుకున్నారు.

    ReplyDelete
    Replies
    1. Mr.Jai,
      How an educated person and with very balanced approach on all the other things like you can behave in such a mean way towards andhra people?

      Do you become an athiest to cover up your guilt being a sinner?
      ----------
      మరి మనసంగతి ఏమిటి ?మన హామీ సంగతి ఏమిటి?అంటే దానికి అసలు ప్రత్యేక హోదా అనేదే లేనప్పుడు మేము మీకు హోదా ఎలా ఇస్తాం అని కేంద్రం అంటున్నది .
      అలాంటప్పుడు, CASP లో 30% అదనంగా ఇవ్వమని మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అడిగారు దానికి కేంద్రం మీకు అల ఇవ్వడం కుదరదు. అల మీకుఇస్తే అన్ని రాష్ట్రలు అడుగుతాయి. అంతే కాక బడ్జెట్ లో కకూడా ప్రొవిజన్ లేదు. అలా ఇస్తే ప్రత్యేక హోదా తీసి వేయడం నిష్ప్రయోజనం అవుతది అన్నది .
      ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక సార్లు ఢిల్లీ చుట్టూ తిరిగారు. అనేక వందల గంటలు సమాలోచనలు జరిపారు. అనేక ఫార్ములాలు తయారుచేయించి ఆర్ధక మంత్రి తో చర్చించారు .
      ఇలా రెండేళ్లు గడిచిపోయింది .
      చివరకు ఒకమార్గం కనుగొన్నారు. CASP లో ఎక్కువ ఇవ్వమంటే కదా మీకుఇబ్బంది, ఇతర రాష్ట్రాలు అడ్డం పడుతాయి అని అంటున్నారు. కాబట్టి మాకు CASPలో ఇచ్చే 30% నిధులను EAP లో ఇవ్వండి అని.
      CASP అనేది అన్ని రాష్ట్రాలకు ఒకే విధం గా ఉంటది అదే EAP అయితే ఏ రాష్ట్రం అవసరనికి అనుగుణం గా ఆ రాష్ట్రానికి ఉంటది, దానిఇతర రాష్ట్రాలు అభ్యంతర పెట్టలేవు

      బాబు ప్రతిపాదనకు కాదు కుదరదు అని చెప్పలేని స్థితి కేంద్రనిది. చివరకు ఈ ప్రతిపాదనకు ఒప్పుకున్నారు .
      ---------
      ఈ భాగం చదివాక కూడా మొదట బాబు గారే యూ టర్న్ తీసుకున్నాడని వాదించగలుగుతున్నావంటే నువ్వసలు మనిషివేనా?

      గృహప్రవేశానికి వచ్చేటప్పటికే ప్రత్యక హోదా ఇవ్వకూడదనే నిర్ణయం తీసుకోబట్టే కదా ఆ కధంతా నడిచింది!నువ్వు చెప్తున్న 2016 చంద్రబాబు-జైట్లీ ఫార్ములా వాళ్ళు ఉదారంగా ఇచ్చినది కాదు.అప్పటికే హోదా ఇవ్వడం కుదరదని చెప్పేశాక బాబు తన సొంత తెలివితో ఆలోచించి వాళ్ళు తప్పించుకోలేని ప్రతిపాదన చేస్తే ఏడుపుగొట్టు మొహంతో ఒప్పుకున్నారని చంద్రబాబు లాంటి సమర్ధుడు అధికారంలో లేకపోతే మేము చంకనాకిపోవడం చూసి తరించాలన్న పైశాచికపు ఈర్ష్యతో ఉన్న నీకు అర్ధం కాలేదు గానీ ఆ భాగం ఒక్కసారి చదవగానే నాకు అర్ధమైంది!

      నిన్ను ఇదివరకే అడిగాను వాళ్ళు హోదా ఇవ్వలేమని చెతులెత్తేశాక ప్యాకేజీ కోరుకుంటే బాబుని బ్లేం చెయ్యడం ఎట్లా కుదురుతుందని, గుర్తుందా?అయినా అది నీకు ఎక్కలేదన్నమాట!ఈ సంభాషణ ఎదురెదురు జరిగి ఉంటే నీ రెండు చెంపలమీదా నా ఎడంకాలి చెప్పుతో ఎడాపెడా వాయించి ఉండేవాణ్ణి!

      నీలాంటి నీచుడికి ఏకవచనం వాడినందుకు శ్యామలీయం నన్ను తప్పు పట్టాడు.ఏం చదివావురా నువ్వు?సంస్కారం లేని చదువు దేనికిరా తగలెయ్యటానికి కాక?నిన్నటి వరకు నీ ప్రాంతానికి అన్యాయం జరిగిందని అలమటించినవాడివి ఇవ్వాళ మా ప్రాంతానికి అన్యాయం జరగాలని కోరుకోవడం ఏంట్రా!ఇదే తెలంగాణ సంస్కృతి అయితే అంతకన్న దరిద్రమైన సంస్కృతి ఇంకోటి ఉండదు - నిన్ను చూసి తేలంగాణ వాసులు సిగ్గుపడాలి!ఇంకెప్పుడూ నా బ్లాగులో కామెంట్లు వెయ్యొద్దు.వేస్తే తీసెయ్యొచ్చు. కానీ ఎడ్మిన్ సెక్షన్లో నీ పాపిష్ఠి పేరుని చూడాలంటేనే అసహ్యంగా ఉంది. ఓకేనా?

      P.S:అసలు ఆంధ్ర ఆలో బి జే పి ఉనికి ఎంతా?
      దాని సత్తా ఎంతా
      ఎపుదన్న అధికారం లో ఉందా
      ఆ పార్టీకి పోయేది ఏముంది ఏమి లేదు
      కాని నష్టపోయేది ఎవరన్న ఉన్నారు అంటే అది ఖచితంగా మన రాష్ట్రమే అంటే మనమే మన భావి తరాలే
      చంద్రబాబు లాంటి సమర్ధుడు ఉంటేనే పరిస్థితి ఇలా ఉంది అదే ఇంకొకరేవరన్నా ఉంటె మన భవిష్యత్తు ఏమిటి ?

      Delete
    2. Well said. This Jai deserves every word of it. విషం నింపుకున్న మనిషి కదా మరి.

      ఎంత విషం కాకపోతే వర్మ తీసిన ఎన్.టి.ఆర్ సినిమా ట్రైలర్ చూసాడట, కామెడీగా అనిపించిందట. ఆంధ్రులు, ఆంధ్రప్రదేశ్ అంటేనే ఈయనకు విద్వేషంతో బాటు ఇప్పుడు కామెడీ కూడా అన్నమాట. తెలంగాణాలో "మల్లేశం" అనే బయోపిక్ - ఈయన భాషలో భయోపిక్ - తీస్తున్నారని తనే చెప్పాడుగా. అదెంత కామెడీగా ఉంటుందో చూడకపోతామా?

      Delete
  3. I like these lines sir!!

    అప్పటికే మీరు ఆంధ్రాకి ప్రత్యేక హోదా ఇవ్వకూడదని నిర్ణయించుకోవడం వల్లనే ఆ రోజున కుండెడు మట్టీ చెంబెడు నీళ్ళతో సరిపెట్టేశారనే క్లూ తోచడానికి నాలాంటి మేధావికి కూడా ఇంతకాలం పటింది, అమాయకుడైన చంద్రబాబుకి ఎలా తెలుస్తుంది పాపం!

    They may say many reasons like CBN wanted special package etc. but CBN always/ever wanted Vizag Railway Zone and Kadapa Steel Plant ??
    What explanation can BJP leaders can give??

    These so called local leaders also claiming, then CBN welcomed/accepted package and you listened and respected him, why not now ? Now, CBN is asking for special status, why dont you respect ??

    On top of these things, The Special Status Category is not an agreement between BJP/MODI and TDP/CBN, it was between Indian PM and people of AP.. (Who are these guys to miss the promise)

    ReplyDelete
  4. ఈ జై అనే గొట్టాం గాడికి సిగ్గూ శరం కూడా లేవా?

    ఎడ్మిన్ సెక్షన్లో నీ పేరు చూట్టమే అసహ్యం నాకు అని ముఖాన వుమ్మేసినట్టు చెప్పినా ఇంకా కామెంట్లు వేస్తున్నాడు!

    "సరే," అన్న మొదటి ముక్క మాత్రం చూశాను.అంటే నువ్విచ్చిన లింకులోనే భాజపా చెంబుడు నీళ్ళు ఇచ్చేటప్పుడే హోదా ఇవ్వకుండా తప్పించికోవటానికి చూడటమూ వాళ్ళిచ్చిన కొంచెం కూడా బాబు వెంటపడి సాధించుకోవడమూ వంటివాటికి సాక్ష్యాలు కనబడేసరికి "అది సరే, మరి ఇదేమిటి?" అనే మరో ముండమోపి లాజిక్కు ఎత్తుకున్నట్టు ఉన్న్నాడు!

    నీకు సిగ్గూ శరమూ లేదని తెలిసిపోయింది గానీ మూసుకు పో.

    P.S:బాబు గెలిస్తే నువ్వు ఏడ్చి చచ్చేటట్టు బాబు వోడిపోతే నేను ఏడవను!నాకేంటి?నేను పాలిటిక్సులోకి వస్తే చేరేది ఆ పార్టీలో కాదు కదా!అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ నాకు బీజేపీ,తెదెపా,తెరాసా, కాంగ్రెస్, వైకాపా అన్నీ వేరే పార్టీలే!ఆంధ్రావాళ్ళు సృష్ట్యాది నుంచీ బాబు వల్లనే బతికారా?ఆ బాబు పోతే ఈ బాబు వస్తాడు!ఈ బాబు పోతే ఇంకో బాబు వస్తాడు!

    ReplyDelete
  5. ఏవిటండీ ఈ (రాం)బాబు గోల ? బాబులు తప్ప వేరే దిక్కు లేదా ? మళ్ళీ తిట్టడం మొదలుపెట్టారా ? జిలేబీ మీ వెనుక ఉంది అని ధైర్యమా ? కాస్త సంయమనంగా వ్రాయకూడదా ?

    ReplyDelete
    Replies
    1. సంయమనం ఆ మనిషి విషయంలో సాధ్యం కాదు మేడం!ఎందుకంటే, అక్కడ తన వాదనని సపోర్టు చేసే అంశం ఉన్నట్టు అంత ధీమాగా చూడండి, చూసి మీ పొరపాటు తెల్సుకోండని అంటున్న వ్యాసంలో వ్యాసకర్త చెప్పింది ఏమిటి?

      భాజపా వాళ్ళు మొదటి నుంచీ ఒక్క పాయింటు మీదనే నిలబడ్డారు అని ఈ గొట్టాం చెప్తున్న స్టాండు ఏమిటి?మేము ఆంధ్రాకి ప్రత్యేక హోదా ఇవ్వలేము అనే కదా!

      ప్తాకేజీ కూడా అయ్యో,ఆంధ్రాకి ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతున్నామే అని బాధపడి వాళ్ళకి వాళ్ళు మన(బాబు)కి చేసిన ప్రపోజల్ కాదు!బాబు వెంటపడి వేధించి ఇతరుల నుంచి లిటిగేషన్లు రాని సేఫ్ మెధడ్ తనే కనుక్కుని చెప్తే వేరే దారి లేక ఒప్పుకున్నారు!

      ఇందులో కూడా చంద్రబాబుకి యూ టర్న్ అంటగట్టటం అంటే ఏమిటి?చంద్రబాబు అయితే ఆంధ్రాకి ఇస్తామన్న ప్రత్యేక హోదా తీసుకోవాలి, లేకపోతే ప్యాకేజీ కోసమో మరొక దానికోసమో ఆల్టర్నేటివ్ చూసుకోకుండాఅంధ్రాని చంక నాకించాలి అని కాదా ఈ తొట్టిముక్కల ఉద్దేశం?



      అసలు ఆంధ్రాకి ప్రత్యేక హోదా ఇవ్వడం వల్ల మోదీకి గానీ ఆంధ్రా బీజేపీ వాళ్ళకి గానీ జై గొట్టిముక్కలకి గానీ భాజపా అనే పొలిటికల్ పార్టీకి గానీ కేంద్ర ప్రభుత్వానికి గానీ భారతదేశ ప్రజలకి గానీ వచ్చి పడే నష్టం గానీ ప్రమాదం గానీ ఏమిటి?

      ఎందుకీ ఏడుపుగొట్టు వేషాలు వేస్తున్నారు?

      Delete
  6. భాజపా చంద్రబాబుకి కాంగ్రెసుతో దోస్తీ చెయ్యక తప్పని పరిస్థితిని కల్పించింది! This is true.

    ReplyDelete
  7. కేసీయార్, జగన్, మోదీ ఏదో ఓక సందర్భంలో బాబుని వ్యక్తిగతమైన విషయాలను ప్రస్తావించి దిగజారుడు భాషతో అవమానించినప్పటికీ జవాబు చెప్పటమే తప్ప తనుగా ఎవ్వర్నీ వ్యక్తిగతమైన ఆరోపణల్తో దెబ్బతియ్యాలని చూడలేదు చంద్రబాబు!
    Sensible !

    ReplyDelete
  8. గుంటూరు సభలో అన్నింటి కంటే దరిద్రం ఏమిటంటే, తెలుగు రాని వాడి తెలుగు అనువాదం వినవలసి రావడం. అదీ మన తెలుగువాళ్ళ దురదృష్టం! అంత పెద్ద పార్టీలో హిందీ, తెలుగు వచ్చినవాళ్ళే లేరా? నేనైతే అనువాదం వినలేక mute చేసాను.

    ReplyDelete
  9. ఈసారి చంద్రబాబుని ఎలాగైనా ఓడించాలని చూసేవాళ్ళు అందుకోసం ఎన్నుకున్న వ్యూహాల్ని చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది!

    ప్రస్తుతం అధికారంలో ఉన్నవాళ్ళని పదవి నుంచి దించేసి ఆ స్థానంలోకి రావాలనుకున్నవాళ్ళు ఈ అయిదేళ్ళ పాటు ప్రజలకి నష్టం జరిగేలా పరిపాలించడం గురించి విమర్శించితే సందర్భోచితంగా ఉంటుంది గానీ పాతికేళ్ళ క్రితం జరిగి చిన్నపిల్లాడికి కూడా తెలిసిన విషయాల్ని ఇప్పుడు వాళ్ళు కొత్తగా కనుక్కుని బయటపెడుతున్నట్టు హడావిడి చేస్తున్నారు.

    దృశ్యరూపంలో చూడటం కొత్త కావచ్చునేమో గానీఇన్నేళ్ళలో ఆ విషయాలు తెలియని వాళ్ళు ఎవరు?

    సానుభూతి ఎప్పుడూ ఆడవాళ్ళ మీదనే ఎందుకు కురిపిస్తారో కొందరు మగవారు!బహుశా నైతిక సాపేక్షతా సిద్ధాంతంతో కూడిన లైంగిక ప్రచోదనల వల్లనా?

    తన పాటికి తను బతికేస్తున్న వీరగంధం సుబ్బారావుని తనని పెళ్ళి చేసుకోకపోతే చచ్చిపోతాననే డ్రామాలు నడిపిన చీప్ లెవెల్ బిహేవియర్ ఉన్న నెరజాణకి ఇంత గౌరవం ఇవ్వడం అవసరమా?అంత దేబిరించి పెళ్ళి చేసుకుని అన్నేళ్ళు సంసారం చేసి శృంగారం వెలగబెట్టి ముది వయసులో మరొకణ్ణి తగులుకున్న బహుపతివ్రతని సమర్ధించడం సంస్కారవంతులకి తగునా?

    లక్ష్మీస్ NTR సినిమా లోని పాత్రలూ ఆ సినిమా వల్ల ప్రభావితం అయ్యే వ్యక్తులూ అందరూ రాజకీయ నాయకులే కదా!వర్మ కాపు కుల గజ్జి+sensational voyerism కొద్దీ చంద్రబాబుని ఇరుకున పెట్టడానికి తీసిన సినిమా అని నేను అనుకుంటున్నాను.

    ఇప్పుడు నేను వీరగంధం చెప్తున్న సంగతుల్ని స్వయంగా వినేవరకు తనే చొరవ చూపించి లక్ష్మీ పార్వతిని పెళ్ళి చేసుకుని తర్వాత తనకన్న గొప్ప స్థాయిలో ఉన్న వాణ్ణి చేసుకుంటే అసంతృప్తి పడిన మామూలు మనిషి అనుకున్నాను.కానీ వీడియో చూశాక ఆయన సంస్కారం నన్ను ముగ్ధుణ్ణి చేసింది - మిగిలిన ఇద్దరూ ఆయన కాలిగోటికి కూడా సరిపోరు!

    N.T.R కూడా అవసరం కొద్దీ చేసుకోవటం తప్ప ఆ పెళ్ళిలో విధవా పునర్వివాహ సంస్కరణ లాంటి గొప్ప ఆదర్శం గానీ జన్మాంతర సౌహృదాలు పలకరించిన అద్భుతం గానీ ఏముంది?

    NTR దురుద్దేశాలకి లొంగే ఘటం కాదు గానీ ఎవరు ఏది చెప్పినా నమ్మే తత్వం ఉందని అందరికీ తెలుసు.వీరగంధం దగ్గిర ప్లే చేసిన LPనే ఇక్కడా ప్లే చేసేసరికి ఢమాల్న పడిపోయి ఉంటాడు!

    తనకి రాజకీయ లక్ష్యాలు లేని వినయమే ఉంటే ఆడపెత్తనం లాంటి వార్తలు వస్తున్నప్పుడు పాదపూజలకే పరిమితమై ఒదిగి పోయి ఉండేది.29 మంది ఎమ్మెల్యేల్ని తనూ కూడగట్టి ఎత్తులు వెయ్యడానికి తగులుకుని చంద్రబాబు ముందు నిలబడలేక వెనక్కి తగ్గడం కూడా అమాయకత్వమేనా?

    పాతికేళ్ళ నాడు జరిగిన కధలు ఇవ్వాళ చూట్టానికి బాగుంటాయి గానీ తలకి ఎక్కించుకుంటే కష్టం!ముందుకి చూడాల్సిన కాలంలో వెనక్కి చూడటం దేనికి?

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...