Tuesday, 9 October 2018

భీష్ముడు కూడా శ్రీమహావిష్ణువు అవతారమేనా?ఎందుకు కాకూడదు - స్వఛ్చంద మరణమూ అవతార పరిసమాప్తీ ఒకటే కదా!

ప్రథమ స్కంధము : ఉపోద్ఘాతము
1-1-శా.
శ్రీ కైవల్య పదంబుఁ జేరుటకునై చింతించెదన్ లోక ర
క్షైకారంభకు, భక్త పాలన కళా సంరంభకున్, దానవో
ద్రేకస్తంభకుఁ, గేళి లోల విలసద్దృగ్జాల సంభూత నా
నా కంజాత భవాండ కుంభకు, మహానందాంగనాడింభకున్.

భావము:
సర్వలోకాలను సంరక్షించేవాడిని, భక్తజనులను కాపాడుటలో మహానేర్పరి తనం గలవాడిని, రాక్షసుల ఉద్రేకాలను అణచేవాడిని, విలాసంగా చూసే చూపుతోటే నానా బ్రహ్మాండాలు సృజించే వాడిని, మహాత్ము డైన నందుని అంగన యొక్క కుమారుని (మహానందం దేహంగా గల ఆత్మీయుని) మోక్ష సంపదను అపేక్షించి సదా స్మరిస్తూ ఉంటాను. 

హరివాక్యం:
ఇది తెలుగు చేయబడిన భాగవత గ్రంధ ప్రారంభ పద్యం - భాగవతానికే కాదు, తెలుగు సాహితీ విశ్వానికే మకుటాయమానమైన పద్యం. ఇష్టదేవతా స్తుతీ, వస్తు నిర్దేశమూ కల ఈ మనోజ్ఞవృత్తం మహాభాగవతంలోని ఇతివృత్తాని కంతా అద్దం పడుతుంది. శార్దూలవిక్రీడిత వృత్తం ఎన్నుకోడంలో విషయ గాంభీర్యత సూచింపబడుతోంది. స్తుతి, నిర్దేశాలను పలికించే పద విన్యాసం బహుళార్థ సాధకత, దీర్ఘకాల రమ్యత సాధిస్తున్న సూచన కావచ్చు. (అ) శ్రీ కైవల్య పదఁబు జేరుటకునై చింతించెదన్ (ఆ) లోకరక్షైకారంభకున్ (ఇ) భక్తపాలన కళా సంరంభకున్ (ఈ) దానవోద్రేక స్తంభకున్ (ఉ) కేళిలోల విలసద్దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకున్ (ఊ) మహానందాంగనా డింభకున్ అనే ఆరు అద్భుత ప్రయుక్తాలు భగవంతుని ప్రధాన గుణాలైన సర్వేశ్వరత్వ, ధర్మ సంస్థాపకత్వ, శిష్టరక్షణ పరాయణత్వ, దుష్ట శిక్షణ చణత్వ, విశ్వకర్తృత్వ, ఆనందమయత్వాలు అనే ఆరింటికి ప్రతీకలు. 

పోతన గారి గురించి మనకి చాలా కల్పిత కధలు ఉన్నాయి.ఆయనొక బీదరైతు అనుకుంటూ ఉంటారు చాలామంది ఆ కధల్ని బట్టి.కానీ తన తాత తండ్రులైన భీమన సోమనలకు చేర్చిన మంత్రి అనే పదం వాళ్ళు రాజసభలో మంత్రిగా ఉందేవాళ్ళని సూచిస్తున్నది - ఇప్పటి ప్రభుత్వోద్యోగులకి ఉండే ఇలాంటి బిరుదుల్ని ఆ హోదా లేనివాళ్ళు పెట్టుకోకూడదు కదా!ఇతనికి మాత్రం ఆ పొడ గిట్టక స్వతంత్రజీవనం గడిపాడని అనుకోవచ్చు."మనుజేశ్వరాధములు" అనే మాట ఛందస్సు కోసం వాడినట్టు కాక మనస్సులో ఉన్న కసిని బయటపెట్టుకుంటున్నట్టు పద్యం మొత్తం మీద ఖంగున మోగుతుంది!

ఇప్పుడు మనమనుకుంటున్నట్టు ఏదో మారుమూలాన నాలుగైదెకరాల మడక దున్నుకుంటూ బీదరికం అనుభవించే దుర్గతిలో లేడనీ లౌక్యం తెలిసిన పెద్ద రైతు అనీ అనుకోవాలి.అదీగాక,ఆనాడు కూడా కవిత్వం రాయాలంటే తను రాయడానికి తాళపత్రాలు సిద్ధం చేసుకోవడం దగ్గిర్నుంచీ ప్రచారం కోసం ప్రతులు తీయించడం వరకూ ఇవ్వాళ్టి లాగానే చాలా శ్రమా వ్యయమూ కలిసిన వ్యవహారం - అందుకే అప్పుడూ ఇప్పుడూ కవులకీ కళాకారులకీ రాజాశ్రయం తప్పదు!ఇతనికి తగినంత ధనం ఉన్నది గనక రాజాశ్రయం అవసరం లేకపోయింది,అవసరం లేదు గనక తిట్టగలిగాడు!

మధురాధి పతే రఖిలం మధురం అన్నట్టు పోతన గారి కవిత్వంలో రమ్యం కాని భాగం ఏదీ లేదు!ప్రస్తుతానికి భీష్మ పితామహుడు అవతార పరిసమాప్తి ముందు సాక్షాత్తూ శ్రీకృష్ణుణ్ణి చూస్తూ స్తుతిస్తూ చెప్పిన పద్యాలను గురించి చెప్పాలనుకుంటున్నాను.గతంలో గరికపాటి వారు "హయరింఖాముఖ,కుప్పించి యెగసిన" పద్యాలను గురించి చెప్పటం విన్నాను.చాలా బాగా చెప్పారు.అయితే,ఇప్పుడు నేను వాటిని చదువుతున్నప్పుడు కొన్ని కొత్త ఆలోచనలు పుట్టాయి.వాటిని మీతో పంచుకుంటాను.

ప్రథమ స్కంధము : భీష్మనిర్యాణంబు


హరివాక్యం:
అవతార పురుషులైన శ్రీరాముడూ శ్రీకృష్ణుడూ తమ కార్యం పూర్తి కాగానే తమ పార్ధివ దేహాల్ని విడిచిపెట్టి నిజస్థానం చేరిన విధంగానే అర్జున  శస్త్రాలకి ఖిలమై నీరసించిన ప్రాణజ్యోతిని దేహధర్మానుసారం అప్పుడే పోనివ్వకుండా నిలిపి ఉంచి తను కోరుకున్న సుముహూర్తంలోనే విడువగలిగిన భీష్ముడి నిర్యాణం ఆ ఇద్దరి అవతార పరిసమాప్తికి సమానమైనదే!


ఇతని జననం కూడా విశిష్టమైనదే - శివపత్ని అయిన గంగ ఇతని కోసం మానవదేహం దాల్చి శంతనపత్ని కావలసి వచ్చింది!ఇతను తొలిసారి తన తండ్రికి దాదాపు పన్నెండేళ్ళ వయస్సులో కనిపిస్తాడు.అక్కడ సంవత్సరం చెప్పినట్టు చూడలేదు నేను,కానీ పూర్తి యవ్వనంలో ఉన్నట్టూ చెప్పలేదు, మరీ పసిబాలుడిలా ఉన్నట్టుగానూ చెప్పలేదు - కాబట్టి ఉజ్జాయింపు అంచనా వేశాను.శ్రీకృష్ణుడి జనన కధనం ప్రకారం తను బొడ్డు తాడు తెంచుకుని పుట్టలేదు - మొదట పన్నెండేళ్ళ బాలుడిలా కనబడి నేను మీకు పుత్రుడినౌతున్నానని చెప్పి మరుక్షణం దేవకి ఒడిలో శిశువులా చిరునవ్వులు చిందిస్తూ కనబడతాడు. బౌద్ధమతానికి ప్రారంభకర్త అయిన గౌతమ బుద్ధుడు కాక విష్ణువు అవతారమైన సుగత బుద్ధుడు పెంపుడు తండ్రి ముందు కనబడినప్పటి వయస్సు పన్నెండేళ్ళు అని చాలా స్పష్టంగా ఉంటుంది!

అసలు రహస్యం ఏమిటో తెలియడం లేదు గానీ బాల వటువుగా బలిని సందర్శించే వామన మూర్తి కూడా దాదాపు పన్నెండేళ్ళ వయస్సులో ఉండటమూ కపిలముని తన తల్లికి జ్ఞానబోధ చేసినప్పటి వయస్సు కూడా ఇదే స్నిగ్ధయవ్వనం కావడమూ నేను గమనించాను.అన్నింటి మధ్యన బలమైన కారణం ఉంటే పెద్దలు చెప్పాలి - అది నా ప్రస్తుత జ్ఞానానికి అతీతమైన విషయమే!బహుశా వేదాధ్యయనం మొదలుపెట్టడానికి నిర్దేశించిన వయస్సు కావచ్చునని నేను వూహిస్తున్నాను.

అలా జనన మరణ విశేషాలు రెండింటిలో వాసుదేవసముడైన శ్రీ భీష్మ పరంధాముడు కట్టెదుట నిల్చిన శ్రీ కృష్ణ పరంధాముణ్ణి చూసి ధన్యుడై సాటి మానవులు తరించడం కోసం కొన్ని దివ్యమణుల్ని వెదజల్లుతున్నాడు!

1-219-మ.
"త్రిజగన్మోహన నీలకాంతిఁ దను వుద్దీపింపఁ బ్రాభాత నీ
రజబంధుప్రభమైన చేలము పయిన్ రంజిల్ల నీలాలక
వ్రజ సంయుక్త ముఖారవింద మతిసేవ్యంబై విజృంభింప మా
విజయుం జేరెడు వన్నెలాఁడు మది నావేశించు నెల్లప్పుడున్.
భావము:
“ముల్లోకాలకు సమ్మోహనమైన నీలవర్ణ కాంతులతో నిగనిగలాడే మనోహరమైన దేహం గలవాడు; పొద్దుపొడుపు వేళ వెలుగులు చిమ్ముతున్న బాలభానుని ప్రభలతో మెరిసిపోతున్న బంగారు వస్త్రం ధరించువాడు; నల్లని ముంగురులు కదలాడుతుండే వాడు; ముద్దులు మూటగట్టుతున్న ముఖపద్మం కలవాడు; మా అర్జునుణ్ణి విజయుణ్ణి చేస్తు చేరి ఉండే అందగాడు; అయిన మా శ్రీకృష్ణ భగవానుడు నా మదిలో నిరంతరం నిలిచిపోవాలి.

1-220-మ.
హయరింఖాముఖ ధూళి ధూసర పరిన్యస్తాలకోపేతమై
రయజాతశ్రమ తోయబిందుయుతమై రాజిల్లు నెమ్మోముతో
జయముం బార్థున కిచ్చువేడ్క నని నాశస్త్రాహతిం జాల నొ
చ్చియుఁ బోరించు మహానుభావు మదిలోఁ జింతింతు నశ్రాంతమున్.
భావము:
గుఱ్ఱాల కాలిగిట్టల వల్ల రేగిన ధూళితో దుమ్ముకొట్టుకుపోతున్నా; ముంగురులు చెదిరి పోతున్నా; అధికమైన రథ వేగానికి అలసట చెంది ఒళ్ళంతా చెమట్లు కారుతున్నా; ముచ్చటైన ముఖమంతా ఎఱ్ఱగా అవుతున్నా; నా శస్త్రాస్త్రాలు తగిలి ఎంత నొప్పెడుతున్నా లెక్క చెయ్యకుండా అర్జునుడికి విజయాన్ని చేకూర్చాలనే ఉత్సాహంతో అతనిని ప్రోత్సహిస్తు యుద్ధం చేయిస్తున్న మహానుభావుడు శ్రీకృష్ణపరమాత్మని నా మనస్సులో నిరంతరం ధ్యానిస్తుంటాను.

హరివాక్యం:
గుఱ్ఱాల్నీ,వాటి కాలి గిట్టల్నీ,వాటినుంచి రేగిన  ధూళిని కూడా వర్ణించాలా?అవేం అందమైన అమ్మాయిల కళ్ళా,చెంపలా,పెదవులా,వక్షోజాలా,నడుమా,పిరుదులా,తొడలా,పాదాలా - అబ్బో!ఆనాటి ప్రబంధ కవుల నుంచీ ఈనాటి సినిమా కవుల వరకూ పోల్చని పోలిక లేదు.అయినా తనివి తీరడం లేదు.ఈయనేమిటండీ,గుర్రాల మీదా వాటి కాలిగిట్టల మీదా వాటినుంచి పైకి లేస్తున్న దుమ్ము మీదా ఇంత అందమైన పద్యం చెప్పాడు!

కుసింత వెరైటీ కోసం చెప్పాడా!కాదండి!ఆ గుర్రాల్ని పొగడాల్సిందే!వాటి అదృష్టమే అదృష్టం!ఏ క్షణాన సారధిత్వానికి ఒప్పుకున్నాడో ఆ క్షణం నుంచీ వాటికి ఆయన చేసిన సేవలు ఎలాంటివో చూడండి!మేత పెట్టటం,నీళ్ళు తాపించడం,ఒళ్ళు కడిగి శుభ్రం చేయడం,మెత్తని శయ్యలు అమర్చడం,వాత్సల్యంతో ఒళ్ళంతా నిమురుతూ కబుర్లు చెప్పడం - యశోదానందులకి చేశాడా దేవకీ వసుదేవులకి చేశాడా రుక్మిణీ సత్యభామలకి చేశాడా ఇవన్నీ!

పెద్దలు ఏమిటో చెప్తారు, కొందరు దేవతలూ ఋషులూ  శ్రీమహావిష్ణువు శ్రీరాముడిగా అవతరిస్తున్నాడని తెలియగానే కోతులై పుట్టారనీ శ్రీకృష్ణుడిగా అవతరిస్తున్నాడని తెలియగానే గోపికలై పుట్టారని.ఈ లింకులు కలిపే పిచ్చి ఎంతవరకు వెళ్ళిందంటే శ్రీకృష్ణుడి బొటనవేలికి గాయం చేసినవాడు రామాయణ కావ్యంలోని వాలి అనేవరకు వెళ్ళింది! వాలి పగ తీర్చుకోవటం కోసం వరం పొంది మళ్ళీ పుట్టటం అంటే వాణ్ణి చంపటం అన్యాయం అంటున్నట్టు కాదూ!మూడు కాలాలనీ ముడి వేసి చూడగలిగిన వాడూ యోగశక్తితోనే తనువు చాలించగలిగినవాడూ గాంధారి శాపాన్ని మన్నించడం కోసం ఒక మిషని కల్పించుకోవడానికి మామూలు బోయవాడు చాలడా?రామాయణ కాలం నాటి వాలి మళ్ళీ జన్మ యెత్తి రావాలా!పౌరాణికులు ఇలాంటి అతి చేష్టల్ని తగ్గించుకోవాలి.ఇంతకీ అంతటి మేధావులు శ్రీకృష్ణుడు గోపికలతో ఆడుకుంటాడని తెలిసి ఆడుకోవడంతోనే సరిపెట్టుకున్నారు గానీ ఈ గుర్రాలై పుట్టాలని ఎవరూ అనుకోలేదేమిటో - ఇంత చిన్న లాజిక్ ఎట్లా మిస్సయ్యారు?



ఇలాంటివి అదృష్టంతో రావండి!అర్హత ఉండాలి.మానవజాతిలో అపుడప్పుడూ కొందరు జాతవేదులు ప్రభవిస్తారు - కాలానికి అవసరమై పుట్టిన ముహూర్తం వల్లనో, పుట్టి పెరిగిన కుటుంబ వాతావరణం వల్లనో,మిత్రబాంధవ సంపర్కం వల్లనో కొందరికి ప్రత్యేకించి గురువులెవరూ లేకపోయినా తమ జన్మకారణం తెలుస్తుంది.ఆ జాతవేదులనే ఈ అశ్వాల రూపంలో భావించితే అర్ధం అద్భుతః అనిపిస్తుంది - దైవకార్యం నెరవేర్చే జాతవేదులకి కూడా భగవంతుడు ఇవే సేవల్ని చేస్తాడు!మహాకవి పోతన ఇక్కడ స్మరిస్తున్నది అలాంటి జాతవేదులనే!

1-221-మ.
నరుమాటల్ విని నవ్వుతో నుభయసేనామధ్యమక్షోణిలో
బరు లీక్షింప రథంబు నిల్పి పరభూపాలావళిం జూపుచుం
బరభూపాయువు లెల్లఁ జూపులన శుంభత్కేళి వంచించు నీ
పరమేశుండు వెలుంగుచుండెడును హృత్పద్మాసనాసీనుఁడై.
భావము:
ఏ లోకేశ్వరుడు అర్జునుడు అడిగాడని చిరునవ్వు చిందిస్తూ రథాన్ని తీసుకు వెళ్ళి ఉభయ సేనలకు మధ్యప్రదేశంలో నిలబెట్టాడో, కౌరవపక్ష రాజు లందరిని పేరుపేరునా చూపిస్తూ ఆ చూపులతోనే వాళ్ళ ఆయువులన్నీ చిదిమేసాడో -  ఆ శ్రీకృష్ణపరమాత్మ నా హృదయపద్మంలో పద్మాసనం వేసుకొని స్థిరంగా వసించుగాక.

1-222-క.
తనవారిఁ జంపఁజాలక
వెనుకకుఁ బో నిచ్చగించు విజయుని శంకన్
ఘన యోగవిద్యఁ బాపిన
మునివంద్యుని పాదభక్తి మొనయున్ నాకున్.
భావము:
రణరంగంలో తన బంధుమిత్రుల ప్రాణాలు తీయడానికి ఇష్టపడక వెనుదీస్తున్న ధనుంజయునికి మహా మహిమాన్వితమైన గీతోపదేశం చేసి, సందేహాలు పోగొట్టి, యుద్ధంలో ముందంజ వేయించిన వాని; మునులచే స్తుతింపబడు పరముని పాదభక్తి నాలో పరిఢవిల్లుగాక.

1-223-సీ.
కుప్పించి యెగసినఁ గుండలంబుల కాంతి; 
గగనభాగం బెల్లఁ గప్పికొనఁగ; 

నుఱికిన నోర్వక యుదరంబులో నున్న; 
జగముల వ్రేఁగున జగతి గదలఁ; 

జక్రంబుఁ జేపట్టి చనుదెంచు రయమునఁ; 
బైనున్న పచ్చనిపటము జాఱ; 

"నమ్మితి నాలావు నగుఁబాటు సేయక; 
మన్నింపు" మని క్రీడి మరలఁ దిగువఁ;

1-223.1-తే.
గరికి లంఘించు సింహంబుకరణి మెఱసి 
"నేఁడు భీష్మునిఁ జంపుదు నిన్నుఁ గాతు
విడువు మర్జున" యనుచు మద్విశిఖ వృష్టిఁ
దెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు.
భావము:
ఆ నాడు యుద్ధభూమిలో నా బాణవర్షాన్ని భరించలేక నా మీదికి దుమికే నా స్వామి వీరగంభీర స్వరూపం ఇప్పటికీ నాకు కళ్ళకు కట్టినట్లే కన్పిస్తున్నది; కుప్పించి పై కెగిరినప్పుడు కుండలాల కాంతులు గగనమండలం నిండా వ్యాపించాయి; ముందుకు దూకినప్పుడు బొజ్జలోని ముజ్జగాల బరువు భరించలేక భూమండలం కంపించిపోయింది; చేతిలో చక్రాన్ని ధరించి అరుదెంచే వేగానికి పైనున్న బంగారుచేలం జారిపోయింది; “నమ్ముకొన్న నన్ను నలుగురిలో నవ్వులపాలు చేయవ ” ద్దని మాటిమాటికి కిరీటి వెనక్కు లాగుతున్నా లెక్కచేయకుండ “అర్జునా! నన్ను వదులు. ఈ నాడు భీష్ముని సంహరించి నిన్ను కాపాడుతాను” అంటూ కరిపైకి లంఘించే కంఠీరవం లాగా నా పైకి దూకే గోపాల దేవుడే నాకు రక్ష.

హరివాక్యం:
ఈ జంట పద్యాలలోని సీస పద్యపు ఒక్కొక్క పాదంలో ఒక్కొక్క విచిత్రమైన వైరుధ్యం ఉంది.వీటన్నిటికీ తేటగీతి చివరి రెండు పాదాల్లో జవాబు దొరుకుతుంది!మొదటి పాదంలోని వైరుధ్యం:భూమి మీద ఎక్కడో కురుక్షేత్రం అనేచోట మెరిసిన ఈయన కుండలాల తళుకులు ప్రపంచం మొత్తాన్ని ఎట్లా వెలిగిస్తాయి?దీనికి గరికిపాటి వారు చెప్పినది బాగుంది గనక దాన్నే ఖాయం చేద్దాం.అదేమిటంటే, లలితాసాహస్రంలో కనత్కనకతాటంకయుగళే అని ఉంటుంది.ఈయనా ఆవిడా ఒకరే అని అనుకుంటే అది విచిత్రం అనిపించదు.


రెండవ పాదంలోని వైరుధ్యం:పధ్నాలుగు లోకాల ఈ బ్రహ్మాండాన్ని ఉదరంలో మోస్తున్నవాడు తన ఉదరంలో ఉన్న ఈ విశ్వంలోకి రావడమే ఒక వింత, మళ్ళీ ఇక్కడున్న ఒక చిన్న రధం మీద నుంచి నేల మీదకి దూకితే తనతో సహా తన ఉదరంలో ఉన్న ఈ విశ్వం కదిలిపోవాలి గదా - చిన్న అదురుతో ఆగిపోయిందేమిటి?దీనికి గరికిపాటి వారు చెప్పినది బాగానే ఉంది కానీ నేను మరో వైపు నుంచి చూద్దామనుకుంటున్నాను.

మనం ఉన్న విశ్వం యొక్క పరిమాణం ఎంత?తెలియదు!కానీ కొలవడానికి తీసుకున్న కొలత మన దేహమే,అవునా?మన దేహం తప్పించి మిగిలిన వాటిని మనకన్న ఎంత పెద్దది, మనకన్న ఎంత చిన్నది అని సాపేక్షంగా కొలుస్తున్నాం.అయితే, అనంతకోటి విశ్వాలలో అన్నీ ఇదే పరిమాణంలో ఉండాల్సిన పని లేదు - మరొక విశ్వం మన బొటనవేలి పరిమాణంలోనే ఉండవచ్చు!ఆ చిన్న పరిమాణంలో ఉన్న విశ్వం కూడా మన విశ్వంలో ఉన్న ఆన్నింటినీ కలిగి ఉండవచ్చు.ఇలా ఉన్న విశ్వాల అమరికలో మనం ఉన్న విశ్వంలో భగవానుడు దూకినది ఒక చిన్న రధం మీద నుంచి నేల మీదకి గాబట్టి మిగిలిన విశ్వం కదలదు.కానీ ఆయన ఉదరంలో ఉన్నవి మొత్తంగా కదులుతాయి గాబట్టి ఆ విశ్వాల లోపల ఉన్నవాళ్ళకి ఈ కదలిక తెలియదు.

మూడవ పాదంలోని వైరుధ్యం:చక్రం గిరగిరా తిప్పేస్తూ కోపంతో భీష్ముడి మీదకి ఉరుకుతుంటే పైనున్న ఊత్తరీయం జారిపోయిందట!ఇందులో విచిత్రం ఏముంది అనిపించవచ్చు అధాట్న చూడగానే!కానీ, అలవాటులో పొరపాటు అన్నట్టు ఇక్కడ ఒక అనౌచిత్యం ఉంది. యుద్ధరంగంలో రధికుడితో పాటు సారధి కూడా కవచాలూ శిరస్త్రాణాలతో కూడిన దుస్తులు ధరించాలి కదా - కొంచెం వేగంగా కదిలితేనే జారిపోయే పచ్చని పటము ఇక్కడ తొడగటం ఉచితమా!

సినిమా రాముళ్ళని చూసీ చూసీ మాయపొర కమ్మకుండా బుర్ర చురుగ్గా పనిచేస్తున్న ఒకాయన ఉషశ్రీ గారిని ఒక ప్రశ్న అడిగారు, "వయసొచ్చిన ప్రతి మగాడికీ గడ్డాలూ మీసాలూ పెరగటం సహజం కదా!అదీ ఒకసారి క్షురకర్మ మొదలెట్టాక మధ్యలో ఆపేస్తే రెట్టింపు వేగంతో పెరుగుతాయి కదా!మరి,పధ్నాలుగేళ్ళు అడివిలో గడిపినా రామలక్ష్మణుల మొహాలు నున్నగా ఉన్నాయేమిటీ?"  అని.ఉషశ్రీ గారు సినిమా వాళ్ళ మీద కాస్త విసుక్కుని నందిగ్రామం దగ్గిర భరతుణ్ణి కలిశాక తల మీదా ముఖం మీదా చంకల్లోనూ పెరిగిన వెంట్రుకల్ని తీసేసి తలంటు పోసుకుని కొత్త బట్టలు తొడుక్కుని అయోధ్యానగర ప్రవేశం చేసినట్టు వాల్మీకం నుంచే శ్లోకాలు ఉదహరించి చెప్పారు.

మనం చూస్తున్న దేవుళ్ళ పటాలన్నీ రవివర్మ లాంటి చిత్రకారులు గీసినవి.వాళ్ళకి ఆ మొహాల్లో పవిత్రత కనపడ్డానికి పసితనాన్ని సూచించే మీసాలు లేని మొహం గుర్తు అని ఒక మూఢనమ్మకం ఏర్పడిపోయింది.ఆ మూఢనమ్మకాల్నే సినిమా వాళ్ళూ కొనసాగించారు,తమ సొంత మానసిక రోగాల్ని కూడా వాటికి కలిపారు.యన్.టి. రామారావు చూడండి, రావణుడి వేషంలో కైలాసం వెళ్ళినా దుర్యోధనుడి వేషంలో సభకి వెళ్ళినా భుజం మీద గద ఉండాల్సిందే!సైకాలజీలో మనకి ఇష్టమైన వస్తువుల్ని ప్రతి చోటుకీ దేహానికి అతికించుకున్నట్టు వెంట తీసుకుపోవడాన్ని ఫెటిషిజం అంటారు.

అసలు దుర్యోధనుడు అలా గదని మోసుకుంటూ తిరగనూ లేదు.అసలు కృష్ణుడు కవచ శిరస్త్రాణాలు తొడక్కుండా యుద్ధరంగంలోకి వెళ్ళనూ లేడు.అయితే, పోతన గారు కూడా శ్రీకృష్ణుడికి సంబంధించినంతవరకు ఆయనకున్న భక్త్యావేశంతో ఒక రూపానికి అతుక్కుపోయాడు.అది అసహజమే గానీ రాసిన పోతన గారు భక్తుడు,చూస్తున్న భీష్ముడు భక్తుడు,చదువుతున్న మనమూ భక్తులమే - ఒక దణ్ణం పెట్టుకుని వదిలెయ్యడమే!

నాల్గవ పాదంలోని వైరుధ్యం:"బాబ్బాబు!నా పరువు తియ్యకు, వెనక్కిరా" అని బతిమిలాడుకోవడంలో వైరుధ్యం ఏముంది అని మీకు సందేహం రావచ్చు!కానీ కృష్ణుడు అంత ఆవేశం ఎందుకు తెచ్చుకున్నాడు?అర్జునుడు ఆపకపోతే నిజంగానే భీష్ముణ్ణి చంపేసేవాడేనా?లేదు,ఆ సంరంభం ఆర్జునుడికి చురుకు పుట్టించి భీష్ముడి కధని ముగించడానికి చేసిన నటన!అర్జునుడు తాతగారి మీద మమకారంతో యుద్ధంలో చూపించాల్సిన ధాటి చూపించకపోవడం వల్లనే కదా ఇంత గొడవ జరిగినది - ఒకసారి విషాదం అనుభవించి గీతాసారం విన్నాక మళ్ళీ బెంగ పుట్టుకు రావటం అసహజం కాదూ!నేను గతంలో చెప్పి ఉన్నాను,ఇవ్వాళ చూస్తున్న లక్ష శ్లోక విస్తారమైన భారతం అంతా వ్యాస విరచితం కాదు,అందరూ తలా ఒక చెయ్యి వేసి పెంచి ఇంత పెద్దది చేశారని - దానికి ఇది సాక్ష్యం!

అసలు వ్యాసుడు రాసినవి 4000 అయితే శిష్యులు 6000 రాసినవి కలిపిన మొదటి రూపం 10,000 శ్లోకాలు మాత్రమే అని అంటారు.ఈ మధ్యనే ఆ మూలకధని మాత్రమే తీసుకుని జయం పేరుతోనే ఒకరు నవల వ్రాసినట్టు చదివాను.

అయితే,చేర్పుల వల్లనే ఆ కావ్యం మోనాలిసా నవ్వులా ధర్మతత్వజ్ఞులకు ధార్మిక గ్రంధంలా ఆధ్యాత్మిక వేత్తలకు మోక్షసాధనంలా కనబడుతూ అనితర సాధ్యమైన విశిష్టతని దక్కించుకున్నది!గీతకి ఇవ్వాళ ఉన్న విశ్వవ్యాప్తమైన ప్రాచుర్యం అక్కడ అమరిపోవడం వల్లనే కదా!కిం కర్తవ్యతా విమూఢుడైన ప్రతివాడూ తనని తను విషాద యోగంలో ఉన్న అర్జునుడితో పోల్చుకోవడమూ గీతాబోధ సమస్తమూ తనకే జరుగుతున్నట్టు భావించడమూ గీతని ఆ కధనుంచి విడదీస్తే జరగదు!మూలకధకీ నేటి కధకీ మార్పులు ఎలా జరిగాయో తెలుసుకోవడం వరకు మంచిదే గానీ ప్రస్తుతం మనకి తెలిసిన కధని మర్చిపోవడం అనవసరం - మర్చిపోలేం కూడా!

1-225-క.
పలుకుల నగవుల నడపుల
నలుకల నవలోకనముల నాభీరవధూ
కులముల మనముల తాలిమి
కొలుకులు వదలించు ఘనునిఁ గొలిచెద మదిలోన్.
భావము:
తియ్యని మాటలతో మందహాసాలతో, ప్రవర్తనలతో, ప్రణయకోపాలతో, వాల్చూపులతో వ్రజవధూమణుల వలపులు దోచుకొనే వాసుదేవుడిని మనస్సులో మరీ మరీ సేవిస్తాను.

1-226-ఆ.
మునులు నృపులుఁ జూడ మును ధర్మజుని సభా
మందిరమున యాగమండపమునఁ
జిత్రమహిమతోడఁ జెలువొందు జగదాది
దేవుఁ డమరు నాదు దృష్టియందు
భావము:
మునీంద్రులు, నరేంద్రులు చూస్తూ ఉండగా యింతకు మునుపు ధర్మరాజు సభామందిరంలోని యజ్ఞ మండపంలో చిత్ర విచిత్ర ప్రభావాలతో ప్రకాశించే విశ్వనాథుడు నా చూపుల్లో స్థిరంగా యున్నాడు..

1-227-మ.
ఒక సూర్యుండు సమస్తజీవులకుఁ దా నొక్కొక్కఁడై తోఁచు పో
లిక నే దేవుఁడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జ
న్య కదంబంబుల హృత్సరోరుహములన్ నానావిధానూన రూ
పకుఁడై యొప్పుచునుండు నట్టి హరి నేఁ బ్రార్థిం
తు శుద్ధుండనై."
భావము:
ఉన్న ఒకే ఒక్క సూర్యుడు సకల జీవరాసులకు ఒక్కొక్కడుగా కానవస్తాడు కదా. ఆ విధంగానే తాను సృష్టించిన నానావిధ ప్రాణి సమూహాల హృదయ కమలాలలో నానా విధాల రూపాలతో సర్వకాల సర్వావస్థల యందు తన లీలా విలాసంతో తనరారే నారాయణుని పవిత్రహృదయంతో ప్రార్థిస్తున్నాను."

హరివాక్యం:
ఇక్కడ పోతన గారు హైందవద్వేషులు సదా విమర్శించే హైందవధర్మంలోని మూర్త్యారాధన మరియు బహుళ దేవతా ప్రశస్తి అనే రెండు ముఖ్యమైన విషయాలకీ తిరుగులేని సమర్ధన ఇచ్చేస్తున్నాడు!ఇక్కడే కాదు, సనాతన ధార్మికులు సృష్టించిన ఆధ్యాత్మిక సాహిత్యంలో ఉన్న విశిష్టత ఏమిటంటే సాహిత్యానికి సంబంధించిన రమ్యత,గాఢత కూడా ఉండి గుర్తుంచుకోవడం తేలిక అవుతుంది. విదేశీయులూ వేరే మతస్థులు కూడా సనాతన ధర్మానికి ఆకర్షితులు కావడానికి వాటిలోని వస్తుగతమైన తార్కికతతో పాటు శైలిపరమైన సౌందర్యం కూడా ఒక కారణమే!

ఏం చెప్తున్నాం అన్నదానితోపాటు ఎలా చెప్తున్నాం అనేది కూడా ముఖ్యమే - అన్నప్రాశన నాడే ఆవకాయ పెట్టేస్తే పిల్లాడు అల్లాడిపోతాడు!ఎంతటి పండితుడికైనా నిర్గుణ పరబ్రహ్మ మీద మనస్సు లగ్నం చెయ్యడం దాదాపు అసాధ్యమే - అసలు ఆ పదాన్ని పరిచయం చేసినవారికే దాని పూర్తి అర్ధం తెలియదు పాపం!నేనయితే నిర్గుణోపాసనని తిరస్కరిస్తాను కూడా.ఎందుకంటే,జ్ఞానం కోసం జ్ఞానం,కళ కోసం కళ వంటి పనికిమాలిన లక్ష్యాలు పెట్టుకుంటే ఇహానికీ పరానికీ పనికిరాకుండా పోతాం.మన దేహాలు తయారైన పృధివ్యాపస్తేజోవాయురాకాశాల మూలతత్వం మహదహంకారం - అది కూడా భగవత్స్వరూపమే!మనల్ని మోహానికి గురి చేసి పతనం చేస్తున్నదని అనుకుంటున్న మాయ కూడా భగవంతుడి కన్న వేరు కాదు, అవునా?మరి, రూపధారులమైన మనం భావనామరూప సంకీర్తనం చెయ్యడానికి భయపడటం గానీ సంకోచపడటం గానీ అవసరమా?"మేం విగ్రహారాధనని వ్యతిరేకిస్తున్నాం!" అని అంటున్నవాళ్ళే అలవాటులో పొరపాటుగా కాకుండా బరితెగించి విగ్రహారాధన చేసేస్తూ ఉంటే హిందువులు సిగ్గుపడటం దేనికి?అయితే, ఒకటి గుర్తుంచుకోవాలి మూర్తిపూజ అంటే ఆలయాల్లో ప్రతిష్ఠించిన విగ్రహాలకి చేసే అభిషేకాదులు మాత్రమే కాదు, అక్కడినుంచి మొదలుపెట్టి దృశ్యమాన ప్రపంచంలోని అన్ని రూపాలలోనూ భగవంతుణ్ణి చూడగలిగే స్థాయికి ఎదగాలి!

హిందూమతప్రచారకులు ముఖ్యంగా నోటిని అదుపులో పెట్టుకోవాలి,ఆసక్తిని కలిగంచడం కోసం హాస్యప్రసంగాలు చెయ్యడం మంచిదే గానీ హాస్యం అపహాస్యం స్థాయికి దిగజారకూడదు.గరికిపాటి నరసింహారావు లాంటి అనుభవజ్ఞులు కూడా ఒక్కోసారి ఆవేశం వల్లనో అనాలోచితంగానో చెప్పకూడని విషయాలు చెబుతున్నారు,అనకూడని మాటలు అంటున్నారు.ఈ మధ్యనే వారు గణేశ్ నిమజ్జం పేరుతో వ్యాపారమూ పోటీ ఎక్కువయ్యాయనీ అవన్నీ అక్కర్లేదనీ వాటిలో భక్తి ఉండదనీ ఎవరింట్లో వాళ్ళు కూర్చుని ఒంటరిగా చేసే పూజల్లోనే భక్తి ఉంటుందనీ మాట్లాడారు - అది నాకు నచ్చలేదు.ఒంటరి పూజని పెద్దలు అప్పటికే సర్వం త్యజించిన యోగులకి ప్రాణోత్క్రమణ సమీపించిందని తెలిసినప్పుడు మనిషి కనిపిస్తే చాలు "నాకు నెప్పిగా ఉందిరో!వైద్యం చెయించరో!నన్ను బతికించరో!" అని వ్యామోహం పెరక్కుండా ఉండటానికి చెప్పారు.గృహస్థు అయిన ప్రతి ఒక్కరికీ తన పాటికి తను వైదిక విధుల ప్రకారం బతకడంతో పాటు ధర్మప్రచారం కూడా ఒక ముఖ్యమైన విధి.

సత్యనారాయణవ్రతం కుటుంబసభ్యులు మాత్రమే చేసుకోవాలని చెప్పారా?అసలు ఆలయాలు ఉన్నదే సామూహిక ప్రార్ధన కోసం - అలాంటప్పుడు ఈయన అవన్నీ అక్కర్లేదు,మీ ఇంట్లో మీరు పూజలు చేసుకుంటే చాలు అంటారేమిటి!ఈయనే ఇలా చెప్తున్నప్పుడు ప్రబోధానంద లాంటివాళ్ళని మనం తట్టుకోగలమా?ప్రపంచ స్థాయిలోనే ఏకం కావలసిన సమయంలో హిందువులు ఒంటరిపక్షులు కాకూడదు - తస్మాత్ జాగ్రత్త!


కలిసి ఉంటే కలదు సుఖం!కలిసి నడిస్తే కలదు జయం!కలిసి బతికితే కలదు వైభవం!!

29 comments:

  1. మోడరేషన్ ఇంటే వాడు మ్మెమ్మెమ్మె బ్బెబ్బెబ్బె - అది వాడికీ తెలుసు!

    ఒకసారి చ్జర్చలోకి దిగాక నా కామెంటు పబ్లిష్ చేసి అందులో నేను అడిగినదానికి తను సరైన జవాబు చెప్పకపోతే చౌద్రీ భాయిని ఇరికిస్తా!అపుడు ఇప్పటిలా బూతులు మాట్లాడినా కూడా చౌఫ్రీభాయికే పడుద్ది దెబ్బ!అంత ఓపిగ్గా జవాబు కోసం అడుగుతుంటే పాయింటుకి రాకుండా తప్పించుకుంటుంటే ఏమీ చెయ్యలేననుకున్నాడు - ఎదటివాళ్ళు వూహించని వైపు నుచి కొట్టటమే నా స్టైల్!DJ సినిమాలో "సార్ పేరేంటో చెప్పండయ్యా!" ఫైట్ సీన్లో కొసమెరుపు యేంటో తెలుసా!"నేను అన్నిసార్లు అడిగినప్పుడు చెప్పలేదు!తీరా నువు చెప్పిన టైం నీ బ్యాడ్ టైం!" అని.

    ముందే చెప్పాను MY COMBATING STYLE IS DIFFERENT అని.కంటికి కనపడకుండా మాటలు వినపడకుండా రాస్తున్న కామెంట్లతోనే చదరంగం ఆడటం తెలిసినవాడు హరిబాబు.

    ReplyDelete
  2. భరద్వాజ గారూ!
    మీరు ఒక బ్లాగుని నిషేధించటానికి కామెంట్లలో వ్యక్తిగత నింద ఉండటం కూడ ఒకటి కదా!మరినన్ను "బూతుబాబు" అనీ సైకో అనీ అంటున్న కామెంట్ల విషయంలో నేను అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాను.వాటిని కూడా పరిగణనలొకి తీసుకోవాల్సిందే!నన్ను ఉద్దేశించిన కామెంట్లకి నేను అభ్యంతరం చెప్తున్న తర్వాత కూడా మీరు పత్రిగణనలోకి తీసుకోకపోఏ ఎట్లా?

    నేను వేసినవే అయినప్పటికీ ఆ బూతు కామెంట్లని తీసెయ్యకపోవడాన్ని కూడా లెక్కలోకి తీసులోవాలి కదా,అవి అక్కడ ఉన్నప్పటికీ బ్లాక్ చెయ్యకుండా ఎందుకు వదిలేశారు?ఆకామెంట్లని అక్కడే కొనసాగిస్తున్నప్పుడు మీరు తీసుకోవాల్సిన చర్య ఏమిటి?ఇప్పటికీ చిరంజీవికి ఇబ్బంది కలిగేవాట్ని అడక్కపోయినా తీసేసి సారీలు చెప్తూ నన్ను సైకో అంటున్నాడు. నన్ను బ్లేం చెయ్యడానికి పనికొచ్చేవాట్ని తీసెయ్యడం లేదు.మీరూ ఇతర యాగ్రిగేటర్లూ పెట్టిన కండిషన్ ఏమిటి?అతను దాన్ని ఉల్లంఘించాక కూడా ఎందుకు ఉపేక్షిస్తున్నారు?

    నేను అదంతా చేసినది అక్కడ మోడరేషన్ పెట్టించాలనే.ఎందుకంటే,చిరబ్జెవి మొదటినుంచీ అక్కడ మోడరేషన్ లేని సైట్లలఓ బూతులు మాట్లాడటం తప్ప నా సీరియస్ ప్రశ్నలకి సీరియస్ జవాబులు చెప్పటం లేదు.తను జవాబు చెప్పాలంటే కామెంటు వైజ్ రెప్లై బటన్ ఉండాలట,నా బ్లాగులో మోడరేషన్ ఎత్తెయ్యాలట - విషయం ఉన్నవాడికి ఇవన్నీ అవసరమా?అక్కడ అదే బ్లాగులో "పాత రాతియుగం గురించి నీకేం తెలిసు?" అనే ఒక్క ప్రశ్నకి జవాబు చెప్పకుండా తిరిగి నన్నే డ్రస్ కోడ్ అడుగుతున్నాడు!

    చౌదరి ఇప్పుడు నా 60మ్యేళ్ళ వయస్సుని గుర్తు చేస్తున్నాడు - మరి, తన వయస్సు ఎంత?నన్ను చిరంజీవి "ఆవునొరేయ్!" అంటున్నప్పుడు తనకి నా వయస్సూ చిరంజీవి వయస్సూ గుర్తుకు రాలేదా?ఒక ప్రశ్న అడగటానికి ఎదటివాణ్ణి "అవునొరేయ్!" అనాలా?అలా అన్నవాడు తనకి మేధావీ సంస్కారవంతుడూ అయ్యాడా?నేను సైకోనా?

    వాడు బూతులు రాయటం తప్ప విషయం గురించి ఒక్క కామెంటు వెయ్యకుండా నన్ను "బూతుబాబు" అంటున్నాడు.వీడేమైన ఆకాశం నుంచి దిగి వచ్చాడా?

    ఇప్పుడు కూడా చౌదరి ప్రవర్తన గమనించండి - మొదటిసారి నేను వ్యూహాత్మక బూతుకామెంట్లు వేసినప్పుడు నిషేధం ప్రమాదాన్ని శంకించి మోడరేషన్ పెట్టాడు.మళ్ళీ ఎందుకు తీసేశాడు?మోడ్రేషన్ ఉంటే నేను ఎట్లా ఇరికిస్తానో తెలిసి కాదా?మళ్ళీ మోడరేషన్ పెట్టటానికి ఇంత సమయం ఎందుకు తీసుకున్నట్టు?

    పైన ఇదే మొదటిసారి కాదు అనుకోకుండా పొరపాటు జరిగిందనుకోవటానికి - ఇది రెండవ ఆరోపణ!కాబట్టి సంజాయిషీలు అడగటం,వెసులుబాట్లు కల్పించటం లాంటి మొహమాటాలకి పోకుండా రచ్చబండ బ్లాగునీ సాక్ష్యం బ్లాగునీ మాలిక నుంచి తొలగిస్తే మంచిదని అనుకుంటున్నాను.మిగిలిన యాగ్రిగేటర్లతో కూడా సంప్రదించగలరు - ఒక బ్లాగర్ని టార్గెట్ చేసుకుని వెకిలి రాతలు రాసే చిరబ్జీవిని తెలిసి తెలిసీ ప్రోత్సహిస్తున్న బ్లాగుల్ని ప్రోత్సహించి సభ్య సమాజానికి ఏమి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు మీరు -
    అధ్యక్షా!

    ReplyDelete
    Replies
    1. హరిబాబుగారూ!

      ముందుగా మేము బ్లాగుల్ని నిషేధించం. అది గూగుల్ వాళ్ళ పని. మాలికలో చూపించేదీ లేనిదీ .. అంతవరకే మా గోల. వ్యక్తిగత గొడవలూ, నిందలతో మాకు పనిలేదు. బ్లాగుల్లో, కామెంట్లలో ఉన్నాయా లేవా అనేదే మా పాయింటు. ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు, ఎప్పుడు పెట్టారు అనేది సాధారణంగా పట్టించుకోం. (ట్రాలింగ్ చెయ్యడానికయితే మాత్రం మా రూల్స్ వేరేగా ఉంటాయి)

      చిరంజీవి వ్రాసినదాన్లో గానీ, వరుణ్ వ్రాసిన దాన్లో గానీ బూతులుంటే లింకు ఇవ్వండి. తప్పకుండా పరిశిలిస్తాం. నాకయితే పరుషమైన పదాలు, తిట్లూ కనబడ్డాయిగానీ బూతులెక్కడా కనబడలేదు.

      Delete
    2. @Bhardwaj Velamakanni9 October 2018 at 20:27

      ముందుగా మేము బ్లాగుల్ని నిషేధించం. అది గూగుల్ వాళ్ళ పని. మాలికలో చూపించేదీ లేనిదీ .. అంతవరకే మా గోల.

      hari.S.babu
      నేను కూడా నిషేధించమని అడగటం లేదు.యాగ్రిగేటరు నుంచి తొలగించమనే అడుగుతున్నాను.నేను "చిరంజీవి గారూ" అని సంబోధించి మాట్లాడుతుంటే "అవునొరేయ్!" అని అనడం ఏమిటి?బూతు అంటే సెక్సుకి సంబంధించినవీ ఇంకా` తల్లినో అక్కనో కలిపి తిడితేనే బూతులా?

      నన్ను "బూతుబాబు" అనటానికి ఆధారాలు ఏమిటి?ఇప్పుడు అవన్నీ అనవసరం.మోడరేషన్ ఉంటే ఆ మాట వచ్చిన వెంటనే చౌదరిని నిలదీసి ఉండేవాణ్ణి.మోడరేషన్ లేకుండా ఆటోమ్యాటిగ్గా యాగ్రిగేటర్ వ్యాఖ్యల సెక్షన్లోకి వెళ్ళిపోయి చాలా కాలం అయ్యాక చేసేదేముందని వూరుకున్నాను.

      ఇప్పుడు నా కొత్త ఆరోపణ ఇది:తనతో మెయిల్లో మాట్లాడినవాళ్ళు నన్ను చీడపురుగు అన్నట్టు చెబుతున్నాడు.మీరు అన్నారా?అలా అన్నది ఎవరో నాకు తెలియాలి.ఇది నా ప్రతిష్ఠకి సంబంధించిన విషయం.దాని సంగతి తేల్చండి!ఎవరూ ఆ మాట నలేదనె అతను అబద్ధం చెప్తున్నాడనీ తెలిస్తే అతన్ని శిక్షించండి!ఇదే మొదటిసారి కానప్పుడు ఎన్నిసార్లు నేను భరించాలి?మీరు అతను అబద్ధం చెప్తున్నాడని తెలిసి కూడా శిక్షించలేనప్పుడు నేను యాగ్రిగేటర్ల నుంచి తప్పుకోవడం తప్ప మరో దారి లేదు నాకు.

      ఇది ఆ పోష్టు.చివరి కామెంటు చూడండి.అదే పోష్టులో చిరంజీవి గాడి మొదటి కామెంటు చూడండి:Chiranjeevi YOctober 5, 2018 at 11:03 PM

      1.నీ ఉడతలు పట్టే ఉచ్చు
      2.ఒరే పిచ్చా మాలోకం..
      3.ఒరే కుక్కమూతి పిందెగా.
      4.ఒరే బూతుబాబూ!
      ఇవి బూతులు కావా?ఇవన్నీ విషయం లేకుండా వాగుతున్న వాడిని నిలదీసినందుకు నను తిడుతున్న తిట్లు.మీ క్రైటేరియాకి ఇవి సరిపోవా?ఇంకో పది పోష్టుల్లో పది తిట్లు తిట్టించుకున్నాక పట్టించుకుంటారా?వాడు,ఆ చినంజీవి గాడు చెన్నైలో నా కూతురి ఫీడ్బ్యాక్ గురించి కామెంటు వేస్తే చౌదరి తీసేసి వాడికి సారీ చెప్పాడు..

      వూరూపేరూ తెలియని చిరంజీవి అనే గొట్టాంగాడు నా దృష్టిలో నథింగ్!నా కామెంట్లలోని బూతులకి నన్ను వయస్సు గుర్తు చేసి దెప్పి పొడుస్తున్న చౌదరినే నేను యాగ్రిగేటర్ల నుంచి తీసెయ్యమని డిమాండ్ చేస్తున్నాను.ఈ ఆధారాలు చాలవని అంటే కొత్త ఆధారాల్ని వెతికిపట్టడానికి వాడి చెత్తబ్లాగుకేసి మరోసారి వెళ్ళే ఉద్దేశం నాకు లేదు.

      "మరి,ఇదివరకు ఎందుకు వెళ్ళావు?వాడికి నువ్వంటే ద్వేషం ఉందని తెలిసీ ఎందుకు వెళ్ళావు.వెళ్ళకపోతే ఈ గొడవ వచ్చేది కాదుగా!" అని నాకు ఉబోస ఇవ్వొద్దు.వాడొక చర్చకి టాపిక్ పెడితే వెళ్ళడం తప్పా!ఒక బ్లాగరుగా అందరు విజిటర్ల మర్యాదని కాపాడాల్సిన బాధ్యత చౌదరి అనే బ్లాగరుకి ఉండొద్దా?తను చీడపురుగులా పర్వర్తిస్తూ నన్ను చీడపురుగు అంటాడా?పైగా ఆ మాటని ఎవరో తనతో అన్నారని యాగ్రిగేటర్ నిర్వాహకుల్నీ ఇతర బ్లాగర్లనీ ఇరికిస్తాడా?

      అప్పుడు బ్లాగిల్లు శ్రీనివాస్ గారు నాతో మెయిల్ ద్వారా కాంటాక్ట్ అయినప్పుడు ఆయనకి ఒక మాట చెప్పాను,అదే ఇప్పుడూ చెబుతున్నాను - "వాడు మిమల్ని వెధవల్ని చేస్తున్నాడు!"

      PLEASE CHECK THE EXTENDED TIME LIMIT!

      Delete
  3. నన్ను చీడపురుగని కొందరు యాగ్రిగేటర్లు సూచించారని తన బ్లాగులో chaudari కామెంటు పెట్టాడు. ఇది నిజమేనని తెలితె నా బ్లాగును నేనే అన్ని యాగ్రిగేటర్ల నుంచి తీసి వేస్తాను.

    విషయం తెలియడానికి 24 గంటల సమయం సరిపోతుందని అనుకుంటున్నాను. ఈ కామెంటు పబ్లిష్ అయిన టైమ్ నుంచి 24 గంటల లోపు ఆ వార్త నిజమో కాదో తెలియకపోయినా ఎవరూ స్పందించకపోయినా నా బ్లాగు అన్ని యాగ్రిగేటర్ల నుంచి తీసెయ్యడం ఖాయం.

    ఈ తొక్కలో బ్లాగు నడపకపోతే నాకు లోటేమీ లేదు.

    ReplyDelete
    Replies


    1. మీ బ్లాగు చీడ పురుగు కాదండి. ఢంకా భజాయించి చెబ్తామండి.

      జిలేబి

      Delete
    2. మీరొక మౌలికమైన పొరపాటు చేసారని నా అభిప్రాయం.

      ఏకారణం వలన ఐతేనేమి కొందరు తమతమ వ్యాఖ్యలలో కుసంస్కారంతో కూడిన భావజాలమూ భాషా వాడుతున్నారన్న అభిప్రాయంలో ఉన్నట్లు కనిపిస్తున్నారు మీరు.

      ఆ ధోరణిని దీటుగా ఎదురుకోవాలన్న మీ ఆలోచనలో తప్పుపట్టవలసినది ఏమీ లేదు. అంతవరకూ బాగుంది.

      కాని మీరు ఎన్నుకొన్న విధానం మీకు శోభను చేకూర్చేది కాదని మీరు గ్రహించటం లేదు. ఆ విధానంలోనే ఉంది మౌలికమైన లోపం.

      మీరు ఏధోరణిని నిరసించుతున్నానని అంటున్నారో అదే ధోరణిలో మాట్లాడటం ద్వారా దాన్ని ఎదుర్కోవాలని యత్నిస్తున్నారు. పొరపాటు!

      అప్పుడు మీకూ ఆ యితరులకూ ఏమిటీ తేడా?

      రెండుపక్షాలూ అభ్యంతరం చెప్పవలసిన స్థాయి భావజాలాలనూ భాషనూ ప్రయోగిస్తుంటే, జనం దొందూ దొందే అని చిరాకుపడతారు. కాని మీకు ఎక్కడినుండి సానుభూతి కాని సహకారం కాని లభిస్తుంది చెప్పండి?

      పెద్దలు చెప్పిన మాట వినటానికి ఒక అవ్యక్తుడైన వాడో తెలియని పిల్లవాడో అడ్డ్దదిడ్డంగా ప్రవర్తిస్తూ నిరాకరిస్తుంటే మీరూ పెద్దలుగా అంతే అడ్డదిడ్డంగా వ్యవహరిస్తూ నచ్చచెప్పుతారు టండీ?

      బొమ్మ కొనివ్వలేదనో, తనమాట తప్పన్నారనో చిన్నపిల్లవాడు తప్పుడు మాటలు పలికితేనో వస్తువులు విరగ్గొడితేనో మనం కూడా అలాగే తప్పుడు మాటలూ చేతలతో సమాధానం చెప్పి ఒప్పించాలని యత్నిస్తామా? ఆలోచించండి.

      ఇతరులు హుందాగా వ్యవహరించకపోతే అది వారి సమస్య. అందరూ అర్థం చేసుకుంటారు. నేడు కాకపోతే రేపైనా నిలకడపై అందరకూ ఎవరెవరో తెలుస్తుంది. మనం సంయమనమూ హుందాతనమూ కోలుపోవటం భావ్యం కాదు.

      మీరు మంచిమంచి విషయాలతో టపాలు వ్రాయండి. ఎవరు మెచ్చితేనేమి? మెచ్చకుంటేనేమీ? మీకు రావలసిన గుర్తింపు ఉంటే వస్తుంది. ఒక్కోసారి శతాబ్దం ఆలస్యంగా ఐనా వస్తుంది. మీరు తప్పుదారిని ఆలోచించినా ప్రవర్తించినా చెడ్డపేరు మాత్రం మీకు తక్షణం వస్తుంది. అదే తేడా.

      కాస్త ప్రశాంతంగా కొంచెం బ్రేక్ తీసుకొని రిఫ్రెష్ ఐన పిదప మీరు ఎప్పటిలాగే అద్భుతమైన టపాలు వ్రాస్తారని ఎదురుచూస్తున్నాను.

      Delete
    3. ఏంటి, భీష్ముడి టపా లో భీష్మ ప్రతిజ్ణ? నిజమో కాదో మహమ్మదు చౌదరి కి మాత్రమే ఎరుక గానీ ఆ విషయం అగ్రిగేటరు వారికి కూడా తెలిసుండదు. మీరు ఇప్పుడు కావాలంటే అప్పుడు మీ బ్లాగుని అగ్రిగేటరు లోంచి పీక్కోవచ్చు, అలాగే మన మహమ్మదు చౌదరి కూడా అలాగే సవాలుచెయ్యవచ్చు. కానీ ఆయనకి మీ అంతదమ్ము ఉందా అనేదే మాకున్న సందేహం. కామెంట్ల కోసం కాసులకోసం కక్కుర్తి పడే వాళ్ళుకి అంత సీనుండదు.
      "నేను ఎంతగానో ఇష్టపడే అగ్రిగేటరు, ఎంతగానో ఇష్టపడే ఛిజీవి, బ్లా..బ్లా....బ్లా..." :) ఇలాంటి వాటినే తెలుగులో నంగి నంగి వేషాలు అంటారేమో!!

      కుక్కకాటుకి చెప్పుదెబ్బలు తగలాలి, అప్పుడే దుష్టచతుష్టయానికి బుద్ధి వచ్చుద్ది.

      Delete
    4. "ఏంటి, భీష్ముడి టపా లో భీష్మ ప్రతిజ్ణ?

      Me too support Syamaliyam Sir !

      Delete
  4. తన బ్లాగులో వేరేచాళ్ళు కామెంటు వేస్తుంటే చూస్తూ వూరుకోవటం కాదు,నేను ఒక లేడీ బ్లాగర్ని మె అడ్రస్ చెప్పు మీ ఆయన లేనప్పుడు ఇంటికొస్తానన్న కామెంటు వేసింది చౌదరే!ఇప్పుడు చేస్తున్నది మొదటి తప్పిదం కాదు.బ్లాగిల్లు శ్రీనివాసు గారితో గొడవలో తన బుద్ధినీ బతుకునూ తనే బయట పెట్టుకున్నాడు - అందులో నా ప్రమేయం తక్కువయినా నా మీదనే పడి యేడ్చాడు.ఈ మధ్యనే ఈ అసభ్య కామెంట్ల విషయంలోనే బహర్ద్వాజ గారు బ్లాక్ చేసి మళ్ళీ మెయిల్ ద్వారా సంజాయిషీ ఇచ్చుకున్నాక తిరిగి ఓపెన్ చెయ్యటం జరిగింది.ఇప్పుడు తన కామెంటులో ఇరికించినది యాగ్రిగేటర్లనీ బ్లాగర్లనీ.కామెంటులో "మాలిక యాజమాన్యం భరద్వాజ గారి సూచన మేరకు రచ్చబండకు మోడరేషన్ పెట్టడం జరిగింది. ఆయనతో మెయిల్ సంప్రదింపులు చేసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కొంతమంది బ్లాగర్లు కూడా కొన్నాళ్లపాటు రచ్చబండకు మోడరేషన్ పెట్టమని మెయిల్ కూడా చేశారు. హరి బాబు లాంటి చీడ పురుగు బ్లాగు లోకానికి ప్రమాదకరమని సూచించారు." అని అన్నాడు.తను అనడం లేదు.తనతో మెయిల్స్ ద్వారా సంభాషించిన యాగ్రిగేటర్లలోనో బ్లాగర్లలోనో ఒకరో ఇద్దరో ఎందరో తనకి ఆ మాటని చెప్పారని అంటున్నాడు.

    యాగ్రిగేటర్ల నిర్వాహకులకే నామీద అలాంటి అభిప్రాయం ఉంటే అతన్ని యాగ్రిగేటర్ల నుంచి తొలగించమని అడగవచ్చునో లేదో తెలియక నేను యాగ్రిగేటర్ల నుంచి తప్పుకోవడం మంచిది కద ఆనుకున్నాను.

    ఇది అతను నడుపుతున్న ఏ ఒక బ్లాగు కంటెంటుకో సంబంధించిన విషయం కాదు,అతని సంస్కారమే అధమ స్థాయిలో ఉంది.కాబట్టి నిజనిర్ధారణలూ,ముందస్తు నోటీసులూ,క్షమాపణ పత్రాలూ,కొనసాగింపులూ అనే తతంగాలు లేకుండా అన్ని యాగ్రిగేటర్ల నుంచీ అతని పేరున ఉన్న అన్ని బ్లాగుల్నీ తొలగించాని కోరుకుంటున్నాను.ఇక స్పందించాల్సినది యాగ్రిగేటర్ల నిర్వాహకులే - వారి పనుల ఒత్తిడి తెలియదు గనక స్పందన కోసం ఎదురు చూసే సమయాన్ని పొడిగుస్తున్నాను.12/10/2018 శుక్రవారం ఉదయం 10:00 లోపు యాగ్రిగేటర్ నిర్వాహ్క్ల నిర్ణయం నాకు తెలియాలి.

    సాక్ష్యం దగ్గిర తను చేసిన నిర్వాకం ఏమిటో తనకి తెలియదా?నా వయసు సరే, తన వయస్సు ఎంత?చిన్నపిల్లాడు కాదే!జకీర్ నాయక్ మాదిరిగానే మూడు మతాల్నీ పోలుస్తున్నాను,కలిపేసి శాంతిని స్థాపించాల్నుకుంటున్నాను అని చెప్పి "యేసు వారు పునరిత్ధానుడా?" అని చాల సుకుమారమైన టైటిలు పెట్టి "అబ్బెబ్బే అదంతా అబద్ధమండీ!" అని తేల్చెయ్యడమూ హిందూమతంలో మొదటినుంచీ విగ్రహారాధన లేదు(అట్లా ఉంటే ఇస్లమిలోకి తొందరగా కలిపెయ్యటం ఈజీగా ఉంటుందని కాబోలు!) అని కుయ్యడం రహస్యంగా జరుగుతున్న వ్యవహారమా?

    తను తిన్నగా ఉంటే సరిపోయేదానికి "నేనిట్లాగే వంకరపన్లు చేస్తాను.అడ్డమొచ్చినవాళ్ళని నేనే బూతులు తిట్టి విసిగించి ఆగిపోయేటట్టు చేస్తాను తప్ప నా పద్ధతి మార్చుకోను - చావనైనా చస్తాను గానీ మంచిపన్లు మాత్రం చెయ్యను!"అని బరితెగించడం దేనికి?సాక్ష్యం దగ్గిర నేనొక్కణ్ణే కాదు,అక్కడ ప్రతిస్పందించిన హిందువులు ఎన్నిసార్లు చెప్పారు?"సత్యనారాయణ చౌదరి" అనే పేరు ఏ మతానికి సంబంధించినది?కామెంట్లు ఎక్కువ తెచ్చుకుని యాడ్స్ ద్వారా వచ్చే కూస్తంత డబ్బు కోసం ఇంత నీచస్థాయికి దిగజారాలా?

    వాడు మనిషే అయితే ఇన్నిసార్లు అంతమంది సామరస్యం చూపించినప్పుడే అర్ధం చేసునేవాడు!నాకు పౌరుషం ఎక్కువ - చాలా ఎక్కువ!అది కూడా లెక్క ప్రకారమే ఉంటుంది.మంచివాళ్లని ఎవర్నీ అవమానించను.మంచివాళ్ళని ఇతర్లు అవమానించినా సహించను.నాతో అనునిత్యం పోట్లాదే నీహారిక తనకి సంబంధించి తీర్పు కోసం నన్ను అడిగింది - ఎప్పుడూ పోట్లాదే నన్నే ఎందుకు అడిగుంది?శత్రువుకైనా సరే నేను అన్యాయపు తీర్పు చెప్పనని తెలియడం వల్ల కాదా!

    ఎవడి తప్పులు వాణ్నే కాల్చేస్తాయి!నేను మీలో తప్పులు పటి తిడుతున్నానంటే ఆ తప్పుల్ని మళ్ళీ మళ్ళీ చెయ్యనివ్వకుండా మీకు మేలు చేస్తున్నాను!ఇప్పటికైనా తెలుసుకోండి!తెలియకపోతే దిక్కులేని కుక్కచావు చస్తారు - ఖబడ్దార్!

    ReplyDelete
    Replies
    1. Beware! Some parties are very active in blogs in view of the forth coming elections in 2019.

      Delete
  5. మిత్రులకు నమస్కారం!

    రేపు అనగా 12/10/2018 శుక్రవారం ఉదయం 10:00 లోపు యాగ్రిగేటర్ల నిర్వాహకుల నుండి నా అబ్యర్ధనకు అనుకూలమైన నిర్ణయం రాకపోయినా అసలు ఎటువంటి ప్రతిస్పందనా రాకపోయినా నా అంతట నేనే యాగ్రిగేటర్లకు దూరం అవుతాను.

    నా బ్లాగు మాత్రం సజీవంగానే ఉంటుంది.అప్పుడు మీరు నా బ్లాగుకు రావాలంటే బ్రౌజర్ను ఉపయోగించటం తప్ప మరో దారి లేదు.నా బ్లాగు యొక్క వెబ్ లింక్ దిగువన ఇస్తున్నాను:
    http://harikaalam.blogspot.com/ or harikaalam.blogspot.in

    భవదీయుడు
    హరి.S.బాబు

    ReplyDelete
    Replies
    1. >>>యాగ్రిగేటర్ల నిర్వాహకుల నుండి నా అబ్యర్ధనకు అనుకూలమైన నిర్ణయం రాకపోయినా అసలు ఎటువంటి ప్రతిస్పందనా రాకపోయినా నా అంతట నేనే యాగ్రిగేటర్లకు దూరం అవుతాను.>>>

      ఏం అభ్యర్ధించారు ? మీకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని కోరడం ఏమిటి ?
      బ్లాగర్లకి అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలి కానీ ఒకరిద్దరు కోరారని నిర్ణయం ఎలా తీసుకుంటారు ? మీరు నాకేమి న్యాయం చేసారు ? సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వగానే సరిపోతుందా ? పార్లమెంట్ ఆమోదించాలి కదా ?

      ఇక్కడ బ్లాగర్లే పార్లమెంట్ అని మీరు నిన్న మాట్లాడి ఈ రోజు ఆగ్రిగ్రేటర్ లను ఎందుకు ప్రశ్నిస్తున్నారు ? అసలు మీకేమి కావాలో స్పష్టత ఉందా ?

      Delete
    2. నిజమే,నాకు క్లారిటీ లేదు!

      తను నేను అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పటానికి కామెంటు వైజు రిప్లై బటన్ కావాలనే చెత్త వెధవకి తన తప్పుని ఎత్తి చూపితేనే మొదటి కామెంటు నుంచే నేను చివర్లో నంబర్లు వేసి భరద్వాజ గారికి చూపించిన బూతులు రాస్తే(అసలు బ్లాగులో రాయలా ఈ బూతులు - అది వీడి అక్క రంకుమొగుడి బ్లాగు కాదుగా!) భరద్వాజ గారికి మాత్రం పరుష పదజాలమే తప్ప బూతులు కనబడలేదట!

      భరద్వాజ్ గారు "వాళ్ళు పరుష పదాలు మాత్రమే వాడారు,బూతులు మాట్లాడినట్టు అనిపించలేదు" అనటాన్ని బట్టి తీర్పు నాకు వ్యతిరేకం కావచ్చుననే అనిపిస్తున్నది.నాకేమీ దిగులు లేదు.పాప్యులారిటీ రేంజి పెరిగే కొత్త దారి కనపడింది.యూట్యూబ్ వీడియోల్లో దర్శనం ఇచ్చే అవకాశం ఉంది!

      భరద్వాజ గారికి నా కొత్త అభ్యర్ధన చెప్పానుగా!ఆ చిరంజీవ్ వై అనే గొట్టాం గాడికి మల్లే పదిసార్లు చెప్పినా అర్ధం కాని మెంటల్ మందలా తయారయ్యారా అందరూ!!అలవాటుగానో పొరపాటుగానో కాకుండా ఉద్దేశ పూర్వకంగానే నేను అడిగే ప్రశ్నలకి జవాబులు చెప్పే పాండిత్యమూ బాధ్యతా లేని గాడిద కొడుకుని నామీదకి ఉసి గొలిపిన పోరంబోకు కే.యస్.చౌదరి పేరుతో ఉన్న బ్లాగులు అన్ని యాగ్రిగేటర్ల నుంచి తీసెయ్యాలి!

      ఇప్పుడు తనకి మెయిల్లో యాగ్రిగేటర్లలోనో బ్లాగర్లలోనో నన్ను చీడపురుగు అన్నదెవరో నాకు తెలియాలి.అలా ఎవరో ఒకరు గానీ ఎంతమంది నా గురించి ఆ మాట చెప్పినా నేను యాగ్రిగేటర్లలో ఉండటం అనవసరం.అది అబద్ధం అని వాడికీ తెలుసు!అబద్ధమని తేలితే ఆ అబద్ధాల కోరు యాగ్రిగేటర్ల నుంచి దూరం కావాలి.

      ఈ కోరిక న్యాయమే కదా!

      Delete
    3. Seriously? If somebody told you that a third person called you names, you should ask the person who interacted with you, for proof. You can’t blackmail the third person.


      I ‘d really appreciate if you people could resolves your issues in your own and not pull me into this.

      Delete
    4. నాకు మాత్రం క్లారిటీ వచ్చింది. ఎవడో వచ్చి మీ బ్లాగ్ తీసేసేకంటే మీకు మీరే బ్లాగ్ తీసేయదల్చుకున్నారని అర్ధం అయింది. ఇలాగైనా చౌదరిగారిని గెలిపిస్తున్నారన్నమాట!

      గాంధీ గారన్నట్లు కంటికి కన్ను విధానం వల్ల ఒరిగేదేమీ లేదు, ప్రపంచం మొత్తం అంధకారం లోకి వెళ్ళడం తప్ప ! మీ బ్లాగు మీ ఇష్టం !

      Delete
  6. కంటెంట్ ఉన్నోడి బ్లాగ్ చాలు అంటారు. కంటెంట్ ఉన్నపుడు ఏ అగ్రిగేటర్ ఎం అనుకుంటే మీరెందుకు తికమకపడుతున్నారు? ఈ మధ్య మీరు చాలా సార్లు బ్లాగు మూసేస్తా అనో గ్రూపు లోంచి బయటికి వెళ్తాననో అల్టిమేటం మీద అల్టిమేటం జారీ చేస్తున్నారు. మీ మానసిక పరిస్థితి మీద అనుమానంగా ఉంది.గుంటూరు బ్రాడిపేట వెళ్లి రారాదూ?

    ReplyDelete
  7. హరిబాబు గారు, మీ కోరిక న్యాయమైనదే! అందరిని తిట్టటం మించి అక్కడ వాళ్ళ బ్లాగులో రాసిన నాలుగు మంచి విషయాలు ఎమీలేవు.

    మీరొక్కరే క్రమం తప్పకుండ మంచి టపాలు రాస్తున్నారు. మీరు అగ్రిగేటర్ ల నుంచి తప్పుకొంటే అది వాళ్లకే నష్టం. మీకు పోయేది ఎమీ లేదు. మిమ్మల్ని ఫాలో అయ్యె వాళ్ళు అందరు ఫాలో అవుతారు.

    ఈ విషయం పై అగ్రిగేటర్లందరికి మైల్ పెట్టండి!

    ReplyDelete
  8. Things are spiraling a lil out of control and we are putting a temporary hold on the comments. Could you please clean up your comments.

    Maalika's definition of filth is different from yours. So there will be a difference of opinion. Thanks for understanding.

    ReplyDelete
  9. మీరు చెప్పేది బానే ఉంది అలాగే మీరడిన దానిలోనూ న్యాయముంది గానీ ఆ అగ్రిగేటర్లలో ని ఎవడో ఒకడు ఆ నీచుడితో బిజినెస్ చేస్తాఉంటే, మీకు న్యాయమెక్కడ దొరుకుతుంది? నిజానికి మీరడిగింది చాలా సింపుల్, ఆ ఊరపంది దాని బ్లాగులో వాగింది కరక్టేనా అని, దానికి సమాధానం లేకుండా ఈ నసుగుడేంటో!

    ReplyDelete
  10. విరాట పర్వం గురుంచి గరికపాటి చేసిన వో వ్యాఖ్య -ఆ విరాటపర్వం వింటే వానలు కురుస్తాయా ?అంతా ఉత్హిధే అని.కానీ 20 15 లో నేను అదే గరికపాటి వారి విరాటపర్వం ప్రవచనాఆలను జస్ట్ యు ట్యూబ్ లో విన్నా.మద్రాసు వరద ముంపు గురైంది.మీరన్నట్టు గరికపాటి వారికి చెప్పే విష్యం మీద పట్టున్నది కాని సదరు విషయాలపైన కాదని తెలిసింది..

    ReplyDelete
  11. Sincerely speaking....

    Leave the aggrigators. Very valuable time is being wasted by these petty feuds. They cannot produce a single good word. People interested in you will follow you.

    ReplyDelete
  12. @Malakpet Rowdy11
    1).Seriously? If somebody told you that a third person called you names,... You can’t blackmail the third person.
    I ‘d really appreciate if you people could resolves your issues in your own and not pull me into this.

    2).Maalika's definition of filth is different from yours. So there will be a difference of opinion. Thanks for understanding.

    hari.S.babu
    అయ్యా భరద్వాజ గారూ!
    చిరంజీవి వై అనే గొట్టాంగాడు నన్ను తిట్టిన బూతులను గురించి నేను అస్సలు వర్రీ కావటం లేదు - వాడికి నా ప్రశ్నలకి జవాబు చెప్పగలిగిన పాండిత్యం గానీ చెప్పాలన్న బాధ్యత గానీ లేకపోవటం వల్లనే తన స్థాయిని చూపిస్తూ బూతులకి దిగాడు.నా స్థాయి ఇదే అని అన్నిసార్లు చెప్పుకున్న అంట్లవెధవతో మళ్ళీ మాట్లాడాలనే దురద నాకు లేదు.అప్పుడు అక్కడ మోడరేషన్ ఉంటే చౌదరిని నిలదీసి ఉండేవాణ్ణి అని చెప్పాను కదా. దానిమీద నాకు ఇసుమంత ఆసక్తి కూడా లేదు!

    ఆ ఇద్దరు గొట్టాంగాళ్ళలో ఎవడితోనూ సంభాషించి ఏదీ తేల్చుకోవాల్సిన అవసరం నాకు లేదు.నేను ఇప్పుడు పట్టించుకున్నది "నన్ను చీడపురుగు అని చౌదరికి సూచించిన యాగ్రీగేటరు/బ్లాగరు ఎవరు?" అన్నది.

    అన్నది వ్యాఖ్యాత కాదు.మూడు నాలుగు బ్లాగుని యాగ్రిగేటరుకు అనుసంధానించి మీ నుంచి ఆ సౌకర్యాన్ని పొందుతున్న ఒక బ్లాగరు!అన్నది ఎవరిని? మీ యాగ్రిగేటర్ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటూన్న ఒక బ్లాగర్ని - నన్ను!పైన తను దొరికిపోకుండా వేరెవరో నాకు సూచించారు అంటున్నాడు - అర్ధం కావడం లేదా?అసలు మాట తను అనలేదని ముందే జాగ్రత్తపడినవాణ్ణి నేను ఎలా నిలదియ్యగలను?అది మీకే సాధ్యం!

    అతనితో మెయిల్ ద్వారా అతనికి సూచించే అవకాశం యాగ్రిగేటరు నిర్వాహకులకే కదా ఉంది!నేను అడుగుతున్నది మిమ్మల్నే - మీరు నేను చీడపురుగునని అతనితో అన్నారా?

    వూరికే మీరు కాదు అని అతను చెబితే చాలదు.ఎవరు అతంతో అలా అన్నారో పేరు చ్ర్బితేఅనే అన్నది మీరు కాద్ని రూఢి అవుతుంది - నిలదీసి తేల్చుకుని నాకు జవాబు చెప్పండి.

    మీ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటున్న ఇద్దరు బ్లాగర్లలో ఒక బ్లాగరు మరొక బ్లాగరు గురించి అబద్ధాలతో చెలారెగిపోతుంటే కంట్రోల్ చెయ్యలేనప్పుడు మీరు ఈ సౌకర్యం బ్లాగర్లకి ఎందుకు కల్పించారు?

    మీరు నాకు న్యాయం చెయ్యగలరా?చెయ్యగలిగితేనే నేను యాగ్రిగేటర్లలో కొనసాగుతాను.లేని పక్షంలో ననెను యాగ్రిగేటర్లలో కొనసాగడం అనవసరం.నాకు మర్యాద లేని చోట నేను ఉండను.నాకు మర్యాదాదాభంగం కలిగంది ఆ గొట్టాంగాళ్ళ బూతుల వల్ల కాదు.అదే కారణం అయితే నేను మీకు సూచించిన చౌదరి కామెంట్ వెయ్యకముందే యాగ్రిగేటర్ల నుంచి తప్పుకోవాలనే నిర్ణయం తీసుకునేవాణ్ణి.
    =================
    @K.S.ChowdaryOctober 9, 2018 at 1:34 AM
    మాలిక యాజమాన్యం భరద్వాజ గారి సూచన మేరకు రచ్చబండకు మోడరేషన్ పెట్టడం జరిగింది. ఆయనతో మెయిల్ సంప్రదింపులు చేసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కొంతమంది బ్లాగర్లు కూడా కొన్నాళ్లపాటు రచ్చబండకు మోడరేషన్ పెట్టమని మెయిల్ కూడా చేశారు. హరి బాబు లాంటి చీడ పురుగు బ్లాగు లోకానికి ప్రమాదకరమని సూచించారు.

    @Haribabu Suraneni 9 October 2018 at 08:04
    నన్ను చీడపురుగని కొందరు యాగ్రిగేటర్లు సూచించారని తన బ్లాగులో chaudari కామెంటు పెట్టాడు. ఇది నిజమేనని తెలితె నా బ్లాగును నేనే అన్ని యాగ్రిగేటర్ల నుంచి తీసి వేస్తాను.

    విషయం తెలియడానికి 24 గంటల సమయం సరిపోతుందని అనుకుంటున్నాను. ఈ కామెంటు పబ్లిష్ అయిన టైమ్ నుంచి 24 గంటల లోపు ఆ వార్త నిజమో కాదో తెలియకపోయినా ఎవరూ స్పందించకపోయినా నా బ్లాగు అన్ని యాగ్రిగేటర్ల నుంచి తీసెయ్యడం ఖాయం.

    ఈ తొక్కలో బ్లాగు నడపకపోతే నాకు లోటేమీ లేదు.
    =================
    అసలంటూ ప్రతిస్పందించారు,సంతోషం.కానీ నేను అడుగుతున్నది యేమిటో మీకు క్లారిటీ లేదనిపిస్తున్నది గనక యాగ్రిగేటర్ల నుంచి తప్పుకోవడానికి కొంత సమయం పొడిగిస్తున్నాను.

    కొందరు యాగ్రిగేటర్ల నిర్వాహకులకే అతనితో వ్యాపారసంబంధాలు ఉండటం వల్ల అతన్ని యాగ్రిగేటర్ల నుంచి తొలగించడం సాధ్యం కాదకాదని నాకు తెలుదు.అందువల్లనే ఈ రిక్వెస్టులూ డిమాండ్లూ గట్రా ఎట్సెట్రా ఏమీ లేకుండా నాకుగా నేనే యాగ్రిగేటర్ల నుంచి తప్పుకోవడానికి నిర్ణయించేసుకున్నాను.చౌదరి తను సొంతంగా అంకుండా ఎవరో తనకి మెయిల్లో సూచించారు అనడం వల్ల మిమ్మల్ని ఇరికించినట్టు భావించి మీరు చొరవ తీసుకుని అతన్ని యాగ్రిగేటర్ల నుంచి తొలగించాలిగితేనే నేను కొనసాగుతాను,

    మీ తదుపరి జవాబు కోసం వేచి ఉంటాను.విషయం అర్ధం అయింది కదా - My request/demand is not related to filth in comments, He is spreading lies against me!That too he is involving others whether they were aggigators or bloggers.Neehaarika misunderstood my claim - I am not forcing to get judgement in my favour.

    I WILL WAIT UPTO ONE MORE DAY - 13/10/2018 Saturday 10:00 AM

    ReplyDelete
    Replies
    1. మ్మ్. బేక్ గ్రౌండ్ లో ఇంత జరిగిందా. ఈ లెక్కన చౌదరి తను చెప్పింది అబద్ధం అని అయినా ఒప్పుకోవాలి లేదా మీగురించి తప్పుగా ఎవరు చెప్పారో వెల్లడించాలి.

      Delete
  13. ఒక బ్లాగరు తన బ్లాగులో తన ఉంచుకున్నదాని తమ్ముడి లాంటి వ్యాఖ్యాతని ఉసిగొలిపి నన్ను బూతులు తిట్టించినా, అదే బ్లాగరు తనతో ఎవరో అన్నట్టు నను చీడపురుగు అన్నా, అదే సమయంలో అతనితో యాగ్రిగేటరు నిర్వాహకులు కూడ సంభాషించినందువల్ల నేను నిజానిజాలు తేల్చుకోవడం కోసం నిలదీసినా ఇక్కడ నాతో కమ్యూనికేట్ అయిన భరద్వాజ గారు కూడా మౌనంగా ఉండిపోవటం వల్ల ఇక నేను ఈ యాగ్రిగేటర్లలో ఉండి ప్రయోజనం లేదని భావిస్తున్నాను.నేను నా టెంప్లేట్ ద్వారా నావైపునుంచి యాగ్రిగేటర్లతో నాకున్న సంబంధాన్ని తెంచేసుకున్నాను.

    ఇక నా బ్లాగును బ్రౌజరు ద్వారా మాత్రమే చూడగలరు.
    http://harikaalam.blogspot.in అని గానీ http://harikaalam.blogspot.com/ అని గానీ టైప్ చేస్తే నా బ్లాగు హోం పేజి వస్తుంది.

    ReplyDelete
    Replies
    1. తెగిపోయేటపుడే దారం బలం తెలుస్తుంది. విడిపోయేటపుడే బంధం విలువ తెలుస్తుంది.
      శుభం.

      Delete
    2. I will share your posts in FB groups

      Delete
  14. Well done!

    You are available by simple search 'harikalam'
    Now write good posts.

    ReplyDelete
    Replies
    1. Yes.I can write anything I want now without fear of some aggigator will warn me _ I never publish sub standard work!

      Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...