Sunday, 19 August 2018

నాలాంటి ఒక సామాన్యుడు ఇప్పటికిప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి కాగలడా?


మిత్రులారా!

నేను బ్లాగులకి మాత్రమే పరిమితం కాకుండా క్రియాశీల రాజకీయాల్లోకి వెళ్ళాలని అనుకుంటున్నానని మీకూ తెలిసే ఉండొచ్చు.మా అమ్మాయి పెళ్ళి కావడం అనే లిమిట్ పెట్టుకున్నట్టు కూడా చెప్పి ఉన్నాను గాబట్టి అదీ తెలిసే ఉండొచ్చు.బహుశా,2019 జూన్ నుంచి డిసెంబర్ లోపు మా అమ్మాయి పెళ్ళి జరిగే అవకాశం ఉంది.కానీ కొద్ది రోజుల క్రితం కొత్త ఆలోచన ఒకటి వచ్చి దాని పూర్వాపరాలను అంచనా వేసుకున్నాను.పెళ్ళికీ దీనికీ ముడి పెట్టకుండా పొలిటికల్ యాక్టివిటీ మొదలుపెట్టడమే మంచిది అనే వూహ వచ్చింది.

నిజానికి నేను "శ్రీ రాఘవం!శ్రీ మాధవం!" పుస్తకం రెండు ఉద్దేశాలతో పుస్తకరూపంలో తీసుకొచ్చాను.ఒకటి,ఇంతముకుముందు e-publishing లేదు కాబట్టి విశ్వనాధ,శ్రీశ్రీ లాంటివాళ్ల రచనలు అచ్చులో సాక్ష్యం ఉన్నాయి వాళ్ళు రచయితలు అనేటందుకు.ఆ ఒరవడిలో నా పేరుతోనూఒ ప్రింటులో ఒక పుస్తకం ఉండాలి అనుకున్నాను.ఆ లక్ష్యం నెరవేరింది గానీ రెండవదైన నేను ఆశించిన ఫోకస్ రాలేదు.పబ్లిష్ చేసిన జ్యోతి వలబోజు గారు కూడా చెప్తూనే ఉన్నారు ఇప్పుడు ప్రజల్లో పుస్తకపఠనం పట్ల ఆసక్తి తగ్గిందని.అయినా,మరీ పరిస్థితి ఇంత దారుణంగా ఉంటుందని అనుకోలేదు.

ఇప్పుడు నా కొత్త ఐడియా ఏమిటంటే "తొక్కలో కమ్యునిజాన్ని చితక్కొట్టేద్దాం, రండి!" పేరుతో ముప్పాళ రంగనాయకమ్మ హిందూమతం మీద చేసిన దాడి గురించీ కమ్యునిష్టు సిద్ధాంతం గురించీ నేను వేసిన పోష్టుల్నీ కలిపి ఒక  కొత్త పుస్తకం తయారు చేశాను.మొదటి పుస్తకం ద్వారా వచ్చిన నష్టం కన్న రాని పాప్యులారిటీ గురించిన బెంగే ఎక్కువ!కాబట్టి దీని మీద డబ్బు ఆశించకుండా కేవలం భావాల ప్రచారం కోసం ప్రయత్నం చేద్దామని ఉంది.అయితే,నా ఉద్యోగ రీత్యా ఒక్క రోజు కూడ చెన్నై దాటి కదల్లేని పరిస్థితి ఉంది. అదీగాక నాకు పరిచయాలు కూడా తక్కువే!

జరిపించాల్సిన కార్యక్రమం గురించి నా ప్లాను యేమిటంటే, డాక్యుమెంట్ పంపిస్తాను.దాన్ని కమ్యునిష్టు పార్టీ/సిద్ధాంత వ్యతిరేకుల ముందు పెట్టాలి.వాళ్ళకి ప్రచురణ పట్ల సొంత బాధ్యత తీసుకునే ఉత్సాహం పుడితే వాళ్ళకీ ధర పెట్టి అమ్మితే లాభం వస్తుందనిపిస్తే నాకూ హుషారుగా ఉంటుంది.అదేమీ లేకపోయినప్పటికీ సొంత బాధ్యత తీసుకుని ప్రింట్లు తీసి ఉచితంగానే కేవలం భావాలకి ప్రచారమూ నాకు క్రియాశీల రాజకీయాల్లోకి వెళ్ళడానికి తగిన ఫోకస్ రప్పించగలిగితే మన హిందూమతానికి గౌరవం పెరుగుతుంది!

దీని ప్రచారం పట్ల ఉత్సాహం ఉన్నవారు మీ మెయిల్ ఐడిని ఇస్తూ కామెంటు పెడితే మెయిల్ బాక్సు నుంచి అటాచ్మెంటుగా రిప్లై ద్వారా పంపిస్తాను.మోడరేషన్ ఉంది కాబట్టి నాకు మీ మెయిల్ ఐడిని అందిస్తున్న కామెంటును పబ్లిష్ చెయ్యను. 

నేను రాజకీయాల్లోకి వెళ్ళడానికి కొన్ని తాత్కాలిక లక్ష్యాలూ కొన్ని దీర్ఘకాలిక లక్ష్యాలూ ఉన్నాయి.తాత్కాలిక లక్ష్యాలలో అయోధ్య,కాశీ.మధుర ఆలయాలని వీలున్నంతవరకు సామరస్యంగానే ముస్లిముల నుంచి విడిపించుకుని కొత్త ఆలయాల్ని నిర్మించడం వంటివి ఉన్నాయి.

దీర్ఘకాలిక లక్ష్యాలు:
1. మెకాలే తరహా విద్యావిధానాన్ని కూకటివేళ్లతో సహా పెకలించి నూతన విద్యావిధానంతో మన కుర్రాళ్ళని ఎక్కడికెళ్ళినా శిఖరాగ్రంలోనే ఉండేలా తీర్చిదిద్దాలి.
2. వ్యవసాయాన్ని లాభసాటి చేసి పరిశ్రమలకి దీటుగా నిలబెట్టాలి.
3. మొత్తం ఆర్ధికరంగాన్ని ఒకప్పుడు 1700 సంవత్సరాల పాటు ప్రపంచపు సంపదలో మూడోవంతును సృష్టించగలిగిన స్థాయికి పెంచి చూపించాలి.

ఇవన్నీ గాలికబుర్లు కావు,నా బ్లాగు పోస్టులకి నేను చేస్తున్న రీసెర్చి యే స్థాయిలో ఉంటుందో మీకు తెలుసు.ఇప్పటికే కొంత క్లారిటీ ఉంది యెలా చెయ్యాలో.వస్తే కొండ, పోతే దారం అన్నట్టు తమిళనాడు ముఖ్యమంత్రి పీఠానికే గురి పెడుతున్నాను గానీ కనీసం సభలో చెప్పుకోదగిన స్థాయిలో ప్రాతినిధ్యం ఉన్నా చాలు - వీటిని కార్యరూపంలోకి తీసుకు రాగలను.

నా చూపు లొక్ సత్తా మీద ఉంది. ఎందుకంటే ఇలాంటి R&D మిగతా పార్టీల్లో చెయ్యడం కుదరదు.ఒకవేళ నేను హిందూత్వం గురించి పనిచెయ్యడం పట్ల అక్కడివాళ్ళకి వ్యతిరేకత వస్తే బీజేపీ నా ఫైనల్ చాయిస్ అవుతుంది.ఇప్పుడు భాజపా పాటిస్తున్న హిందూత్వ రాజకీయాలతో నాకు విభేదాలు ఉన్నప్పటికీ ఏ పార్టీలో ఉన్నా సరే హిందూత్వం పట్ల నిబద్ధతని మాత్రం వొదులుకోను.

నేను తెలుగువాణ్ణి కదా, తమిళనాడులో ఎందుకు?తెలుగు రాష్ట్రాల్లో ప్రయత్నించవచ్చు కద! ఆని మీకు సందేహం రావచ్చు.కొందరు మిత్రులు దాన్ని ప్రస్తావించారు కూడాను.నా రేషన్ కార్డూ వోటర్ కార్డూ తమిళనాడులోనే ఉన్నాయి.ఒకసారి వోటు కూడా వేశాను.నేను అనామకుడి స్థాయి నుంచి కనీసం ఈ స్థాయికి  రావడం తమిళనాడులో జరిగింది అనే కృతజ్ఞత ఒకటి ఉంది.అదీ గాక ఇక్కడి ద్రవిడ రాజకీయాలు తమిళనాడుని మిగిలిన భారతదేశపు వైదిక సంస్కృతిలో కలవనివ్వకుండా చేస్తున్నాయి.ఒ ఆంధ్రా తమిళనాడు నుంచి విడిపోకముందు తెలుగువాళ్ళు ఇక్కడి రాజకీయాల్లో గొప్పగా వెలిగారు.విడిపోయాక ద్రవిడ జాత్యహంకారులు తెలుగువాళ్లని తొక్కేస్తున్నారు.తమిళుల్లో కూడా అందరూ ద్రవిడ రేసిస్టులు కారు,మనది వైదిక సంస్కృతి అనుకునేవాళ్ళు కూడా ఉన్నారు.

సనాతన ధర్మం చెప్పే అమరాసుర సమరంలో ఉన్న విశేషం యేమిటో తెలుసా!ఒక ప్రాంతంలో ఒక సమాజంలో కొందరు సమాజాన్ని ఒక వైపుకి పట్టి లాగుతుంటే దాన్ని మళ్ళీ బ్యాలెన్సు చెయ్యాలంటే మిగిలినవాళ్ళు రెండోవైపుకి రెట్టించిన బలంతో లాగాలి.నాకు ఇప్పుడు ఆ అవసరం/అవకాశం తమిళనాడులో కనిపిస్తున్నది.ఒకసారి మినిమం ఫోకస్ వచ్చాక తమిళనాడులోని తెలుగువాళ్లనీ ద్రవిడ రేసిస్టు వ్యతిరేకుల్నీ నేను గుప్పిట్లో పెట్టుకోగలిగితే తమిళనాడు రాజకీయాల్ని నా చుట్టూ తిప్పుకోవచ్చు.ఆంధ్రాలోనూ తెలంగాణలోనూ నాకు ఈ అనుకూలత లేదు.ఇక్కడ నా ప్లాను సక్సెస్ అయితే నాకు పైన పెత్తనం చేసేవాడు ఎవడూ ఉండడు.అదే మిగతా చోట్ల అయితే రెండో వరసలో సర్దుకోవాలి.

ఆటస్థలం సిద్ధమయ్యింది.ఆటగాడు మంచి వూపు మీదున్నాడు.పిస్టల్ మోగడం ఆలస్యం ఉరకడం మొదలుపెడతాడు.పిస్టల్ పేల్చాల్సింది మీలాంటి మిత్రులు!

రచ్చబండ దగ్గిర చర్చ ఇప్పుడే ముగించాను.అసలు పని మొదలైంది.నా ప్లాను ఏమిటో చదివి క్షేత్రస్థాయిలో జనం గురించి తెలిసిన అవగాహనతో అసలు ప్లాను వర్కవుట్ అవుతుందా లేదా అనేది చెప్పాలి.ఒకవేళ స్థూలంగా ప్లాను బాగానే ఉండి కొన్ని తప్పులు ఉంటే సరి చెయ్యాలి.నేను తమిళనాడు నుంచే ఎందుకు పైకి రావాలనుకుంటున్నానో చెప్పిన దాంట్లో మీకేమైనా అభ్యంతరాలు ఉన్నాయా?

నిన్నటివరకు ముసలాడి చావుతో సానుభూతి వస్తుంది,స్టాలిన్ అదృష్టమనుకున్నది కాస్తా అళగిరి దెబ్బకి తారుమారయింది చూశారా?జయలలిత చావు సానుభూతిని AIDMK వాళ్ళు వాళ్ళలో వాళ్లు తన్నుకుని పోగొట్టుకున్నారు.ఇక్కడ ఇలా ఉంది.అందుకే నేను ఇక్కడ రంగంలోకి దిగాలని అనుకున్నది.తమిళనాడు సీట్లు 235లో మొదటి అడుగులోనే ఫుల్ మెజారిటీ తెచ్చుకుని ఒకే వూపులో ముఖ్యమంత్రి అయిపోలేను.కానీ నా వాగ్ధాటితో చరిష్మాతో 10 నుంచి 50 మందిని అసెంబ్లీకి పంపగలిగితే చాలు - "ఎవడ్రా వీడు!" అనే ఫోకస్ వస్తుంది.

అవినీతిని కవర్ చేసుకోవడానికి వాడుకుంటున్న ద్రవిడ ముసుగుని నేను తెలుగు అస్తిత్వం పేరుతో నిలదియ్యాలని అనుకుంటున్నాను.నిజానికి ఉమ్మడి మద్రాసు రాష్ట్రం విడిపోకముందు ముఖ్యమంత్రుల లిస్టు చూస్తే అప్పటి తమిళనాడు రాజకీయాల్లో తెలుగువాళ్ళే ఎకువ చురుగ్గా ఉన్నారని తెలుస్తుంది.కానీ రాష్ట్రం విడిపోగానే తెలుగువాళ్ళు హఠాత్తుగా సైలెంట్ ఎందుకయ్యారో,వయ్యాపురం గోపాలకృష్ణ వైగో అని పేరు మార్చుకుంటే తప్ప పనికిరాని దుస్థితి ఎందుకొచ్చిందో అర్ధం చేసుకోచాలి - అప్పుడే నా అవగాహన సరైనదేనని తెలుస్తుంది!

రాష్ట్రం విడిపోకముందు ఏమాత్రం నదురూ బెదురూ లేకుండా ముఖ్యమంత్రులే కాగలిగిన తెలుగువాళ్ళు విడిపోయాక సొంత ఉనికినే మర్చిపోయి తమిళీకరించుకోవాల్సిన అవసరం ఏమిటి?అటువైపు నుంచి వచ్చిన ఒత్తిడి కన్న తెలుగువాళ్ళలోని లొంగుబాటే ఎక్కువ అని నా అనుమానం.పై స్థాయిలోనివాళ్ళు లాభాల కోసం దిగజారితే దిగజారవచ్చు గానీ క్షేత్రస్థాయిలో అలా లేదు.కొన్ని ప్రాంతాలు జిల్లాలకి జిల్లాలూ వూళ్ళకి వూళ్ళూ తెలుగువాళ్ళు బలంగా ఉండి లోకల్ ఎన్నికల్లో తెలుగు అస్తిత్వాన్ని పోగొట్టుకోకుండానే ఎన్నికల్లో గెలుస్తున్నారు.అప్పుడప్పుడు చూస్తున్న వింటున్న ఎన్నికల వార్తల్లోనే ఇది తెలుస్తున్నది!

అంటే, అసెంబ్లీ స్థాయిలో టిక్కెట్లిచ్చే పార్టీ పెద్దలు కండిషన్లు పెట్టి జనానికి తెలుగువాళ్ళని దూరం చెయ్యడం వల్లనే వయ్యాపురం గోపాలకృష్ణ వైగో అని పేరు మార్చుకోవాల్సిన దుస్థితి దాపరించిందని తెలియడం లేదూ!ఈ మిధ్యని బద్దలు కొట్టాల్సిన అవసరం ఉందని మీకు అనిపించడం లేదూ!

తమిళనాడులోని తెలుగు పొలిటీషియన్లు లోకల్ రేంజితో సరిపెట్టుకుంటున్నారు గానీ అసెంబ్లీ స్థాయికీ లోక్ సభ స్థాయికీ ఎదగాలని అనుకోవడం లేదు.నేను అక్కడ మోటివేట్ చెయ్యాలని అనుకుంటున్నాను.నాకు తమిళం రాకపోవడం మైనస్ పాయింటే గానీ దాని మూలంగా ఈ ప్లాను వెయ్యటం లేదు.తప్పనిసరైతే తమిళం నేర్చుకోవడానికి అభ్యంతరం ఏమీ లేదు.కానీ 2006 నాటి ఎడ్యుకేషన్ బిల్లు లాంటి దుర్మార్గాల్ని అడ్డుకోవాలంటే తెలుగువాళ్ళు కొంతమేర తెలుగు అస్తిత్వాన్ని నిలబెట్టుకోవాలి.

ఇది ప్రజల్ని చీల్చేటట్టు కాకుండా తెలుగువాళ్ళకి మరింత ఎక్కువ పొలిటికల్ రిప్రజెంటేషన్ కావాలి అనే విధంగా తెలుగు వాళ్ళని మోటివేట్ చెయ్యడమే నా ప్లాను.అయితే ఒక బలమైన గ్రూపు తయారైన వెంటనే మిగతావాళ్ళు గుర్తుపట్టడం ఖాయం.వాళ్ళు గుర్తు పట్టకుండా ఎంతకాలం మ్యానేజి చెయ్యగలను అనేది నా తెలివికి నిదర్శనం అవుతుంది.ఒకవేళ వాళ్లు గుర్తు పడితే ఆ ఫోకస్ ఎటూ ఉపయోగపడుతుంది కాబట్టి దాన్ని ఇక వదిలేసి తమిళుల్ని కూడా కలుపుకుని పోవడానికి కూడా రెడీయే!

ఇది స్థూలమైన ప్లాను.ఇంక సూక్ష్మ స్థాయి ప్లాను యేంటంటే నా మూడు లక్ష్యాలు 1.వ్యవసాయాన్ని లాభసాటి చెయ్యడం,2.విద్యావ్యవస్థని ఇప్పటి కాలానికి కనెక్ట్ చెయ్యడం,3.మొత్తం తమిళనాడు ఆర్ధిక వ్యవస్థని సా.శ 1వ శతాబ్దం నుంచి సా.శ 17వ శతాబ్దం వరకు ప్రపంచ అసంపదలో నాలుగోవంతు నుంచి మూడోవంతు వరకు ఆక్రమించిన భారతదేశపు ఆర్ధికవ్యవస్థలా నిలబెట్టడం.వాటికి పెద్ద యెత్తున పరిశోధన అవసరం.అది నేను ఒక్కణ్ణే చెయ్యడం కుదిరే పని కాదు.

యెటూ నా మొదటి ప్రిఫరెన్స్ లోక్ సత్తా కాబట్టి అక్కడ ఇప్పటికే చాలా పని పూర్తయి ఉండాలి.అది చాలదు అనిపిస్తే  మనం ఎన్నుకున్న నియోజకవర్గాలకి ఎన్నికల్లో నిలబెట్టి గెలిపించాలనుకున్నవాళ్ళకే ఆ పని అప్పగించాలి.మిగతా పార్టీల్లో లాగా ఎన్నికలప్పుడే అభ్యర్ధుల్ని ప్రకటించడంలా కాకుండా ముందుగానే "ఈ నియోజకవర్గం నీది.దీనికి సంబంధించి నువ్వు సమాచారం సేకరించు.ఈ ప్రాంతంలో ఉన్న ఆర్ధిక వనరులు ఏమిటి?మొత్తం ఏరియాలో ప్రతి అడుగునీ ఉపయోగించుకోగలిగితే మొత్తం ఎంత సంపదని సృష్టించవచ్చు!" అనే డాటా కలక్ట్ చేసుకు రమ్మని చెప్పాలి.అన్ని నియోజక వర్గాల సమాచారాన్నీ నేను కలక్ట్ చేసి దగ్గిర పెట్టుకుంటే మీడియా ముందూ ప్రజల ముందూ మాట్లాడి నెగ్గుకురావటం సులువు కదా!

ఇదంతా ఎందుకంటే లోక్ సత్తాకి ఒక చిత్రమైన పరిస్థితి ఉంది.నా పాత పోష్టు "చిత్రమైన గొప్పవాళ్ళు!" చదివారా?చదువుకున్నవాళ్ళు కూడా "లోక్ సత్తా మంచిదే కానీ గెలిచే పార్టీ కాదుగా!" అంటున్నారు.అంటే, పత్రికల్లోనూ మీడియాలోనూ పాల్గొనే చర్చలతోనూ రాస్తున్న వ్యాసాలతోనూ మేధావులనే ముద్ర పడుతున్నది గానీ మేము గెలిచి ప్రభుత్వంలోకి వస్తే తప్పకుండా మీ జీవితాల్ని బాగు చేస్తాము అని అందరికీ అర్ధమయ్యే భాషలో చెప్పే వాగ్ధాటి వాళ్ళలో తక్కువ.నాకది ఉంది గానీ చెప్పడానికి మ్యాటర్ లేందే నాకు గొంతు పెగలదు!

పోష్టులు రాయడానికి ముందు మ్యాటర్ పోగేసుకుని నానా తిప్పలూ పడి దాన్ని హైలైట్ చెయ్యగలుగుతున్నట్టే అక్కడా చెయ్యగలిగితే లోక్ సత్తాని మెయిన్ స్ట్రీం డయాస్ మీదకి తీసుకు రావచ్చు.నాకయితే ఈ ప్లానులో అందమైన కలలు కన్నట్టు కాకుండా సాధ్యమైనంతవరకు ప్రాక్టికల్  వేలోనే వెళ్ళానని అనుకుంటున్నాను.మీ అభిప్రాయం చెప్పాలి.

ప్రత్యేకంగా అడక్కపోయినా మీరు మొహమాటం లేకుండానే చెప్తారనుకోండి,అయినా నావైపు నుంచి నేనూ జోకులేయించుకోవడానికి రెడీగానే ఉన్నాను.మరీ తల వాచే చివాట్లలానూ కుళ్లి చచ్చే వెక్కిరింతల్లానూ కాకుండా చెప్తే నేనూ సరదాగానే తీసుకుంటాను:-)

ఇట్లు 
భవదీయుడు
హరి.S.బాబు

16 comments:

  1. Time required for a full length comment.

    ReplyDelete
  2. మీరు రాజకీయాల్లో రాణించలేరు . PLAN వేసుకొని , ఇల్లు చక్కబెట్టుకొని వస్తే మీరు రాజకీయాల్లోకి రావాలనుకోవడం చాలా నవ్వు వస్తుంది .రాజికియ్యలోకి వచ్చేవారు అవకాశం సృష్టించు కొని వస్తారు.ఐన మీరు ఎందుకు రావలనుకొంట్టున్నారు . మీకు పేరు ప్రతిష్టలకొరక లేక ప్రజల సేవ కొరకా ? ప్రజలను ఉద్దరించడానికి కాదన్నట్లు ఉంది.

    ReplyDelete
  3. ఏంది బయ్యా. నువ్వు రాజకీయాల్లోకి వస్తావా. ఈ మధ్య జిలేబీ పైకూలు బాగా చదివి మైండ్ బ్లాకేనట్టుంది నీకు.

    ReplyDelete
  4. రాజకీయాల్లోకి రావాలనుకునే వారికి ....
    1.పాప్యులారిటీ ఉండాలి/తెచ్చుకోవాలి.
    2.వయసు నిబంధనేమీ లేదు.
    3.విభజించు పాలించు.
    4.ఎంతసేపూ మమ్మల్ని వృద్ధిలోకి రానివ్వకుండా కుట్రలు చేస్తున్నారు అని బూతులు బాగా తిట్టాలి.
    5.అన్నీ ఉచితంగా చేస్తామని చెప్పాలి.
    6.భాషపై పట్టు ఉండాలి.
    7.మంచి వాగ్ధాటి ఉండాలి.
    8.సమస్యలపై అవగాహన ఉండాలి.
    9.సమస్యలకు పరిష్కారాలు తెలిసి ఉండాలి.
    10.అంతర్జాతీయ రాజకీయాలపై అవగాహన ఉండాలి.
    11.మీరు ఉంటున్న ప్రాంతంలో మీకు మంచిపేరు ప్రతిష్టలు ఉండాలి.
    12.ఏ ప్రాంతంలో ఏ అభ్యర్దిని నిలపాలో తెలిసి ఉండాలి.
    13.చేసే పనిలో నిజాయితీ,రెండు నాలుకల ధోరణి లేకపోవడం, సరి అయిన ప్రణాలిక,వ్యూహ రచన మెండుగా ఉండాలి.
    14 రిజర్వేషన్ పై ఖచ్చితమైన అవగాహన తప్పనిసరి.
    15.లౌకికవాదం అనుసరణీయం.
    ఇప్పటికి ఇవే.... మరికొన్ని తర్వాతెపుడైనా చెపుతాను.

    ReplyDelete
    Replies
    1. 16) లోకే"ష్" వంటి పుత్ర వజ్రం ఉంటే అదో అదనపు అర్హత.

      Delete

  5. అబ్బాయా

    ఎన్ని కోట్లుండాయి నీ కాడ ?


    జిలేబి

    ReplyDelete
  6. శుభపరిణామం

    మరి ఆర్థికవనరులు ఏలా సార్ ?

    ReplyDelete
  7. "నా వాగ్ధాటితో చరిష్మాతో 10 నుంచి 50 మందిని అసెంబ్లీకి పంపగలిగితే చాలు"

    Sir, కుదిరితే కర్ణాటక తరహా ఫలితం పునరావృతమవ్వాలి !

    ReplyDelete
  8. హరిబాబు గారూ, మీకు శివసేన సరిపోతుందేమో? వారికి తమిళ నాడులో ప్రవేశం లేదు. మదరాసులో పార్టీ శాఖ పెడతానని వారిని అడిగి చూడండి. ఒప్పుకుంటే నిధుల కొరత రాదు, అధిష్టాన పెత్తనం పెద్దగా ఉండదు.

    ReplyDelete
  9. రాజకీయాలలోకి వస్తావో, రావో కానీ నువ్వు విమర్శించాలనుకుంటున్న రచయిత్రి గురించి నీకే తెలిసినట్టు లేదు. ఆ రచయిత్రి వదిలేసిన మొదటి భర్త ఇంటి పేరుని ఆవిడకి ఇప్పుడు కూడా ఏట్రిబ్యూట్ చేస్తున్నావు.

    ReplyDelete
    Replies
    1. అదంత ముఖ్యమని నేననుకోలేదు సార్!ఇప్పుడు ఆమె వాడుతున్న ఇంటిపేరు ఏమిటి సార్?అది ఎన్నవభర్తది?ఈసారి రెఫర్ చేసేటప్పుడు వాడటానికి పనికొస్తుంది - ప్లీజ్ చెబుదురూ!

      అవసరం అనుకుంటే అందరు భర్తాల్ పేర్లు వారి వారి వైవాహిక జీవిత కాలపు వివరాలు కూడా ఇవ్వొచ్చు - మీకు తెలిస్తే, ముఖ్యం అనిపిస్తే వారితో ఎన్నిసార్లు శృంగారంలో పాల్గొన్నారు ఆ మహానుభావురాలు అనే రకమయిన వివరాలు కూడా ఇవ్వొచ్చు,నాకేం అభ్యంతరం లేదు!

      Delete
    2. నాకు అర్ధం కానిది యేమిటంటే,
      నేను నా ఇంటిపేరుని వాడుకోదల్చుకోలేదు అని ప్రకటించే స్వేచ్చా ప్రతి ఒక్కరికీ ఉంది.కానీ సాంకేతికంగా ఆమెకి ఆధార్ లాంటి గుర్తింపు కూడా అక్కార్లేదా?ప్రస్తుతం చట్టాలకి సంబంధించి ప్రతి వ్యక్తీ ప్రభుత్వానికి తమ వివరాలను ఇచ్చి పౌరసత్వం/సభ్యత్వం రిజిస్టర్ చేసుకోవాలి.ఆ వివరాల్లో మతం అనేదానికి వారే ఎంచుకునే/తిరస్కరించే స్వేచ్చని ఇస్తారు.కానీ ఇంటిపేరు అనేది సర్వులకూ తప్పనిసరి కదా,అక్కద వదిలెయ్యటం అంటే అర్ధం లేని మాట,అవునా?రేప్పొదున ఆమె ఏ అసాంఘిక కార్యకలాపాలలోనూ పాల్గొనటంలేదు అనేది చెక్ చేసుకోవడానికైనా అమెగారు తన వివరాల్ని అందించాలి.

      మరి,అంత ముఖ్యమైన అతి మామూలు వివరం అయిన ఇంటిపేరుని వదులుకోవడం, దానిని వాడటమే మహాపాపంగా పరిగణించడం, దాచేసుకోవడం ఎంతవరకు శాస్త్రీయమైన ఆలోచనా ధోరణి?ఇంటిపేరును రిఫర్ డా కేవలం "రంగనాయకమ్మ"అని నేను అంటే అది యెవరిని పిలిచినట్టు? ఈ లోకంలో "రంగనాయకమ్మ" పేరుతో వైజాగులో పాల వ్యాపారం చేసే మనిషి ఉండొచ్చు,కరీమ్నగర్ జిల్లాలో ఆ పేరుతో మొత్తం 90 మంది ఉండొచ్చు,ఆదిలాబాద్ జిల్లాలో ఒక 200 మంది ఉండొచ్చు,ఈవిడ ఇంటిపేరు వదిలేసుకునది గాబట్టి ఎవరైనా"రంగనాయకమ్మ"ని తిడితే వీళ్ళందరూ రియాక్ట్ అయితే వాళ్ళందరికీ నేను తిట్టింది మిమల్ని కాదు అని పేరుపేరునా చెప్పుకోవడం మీలాంటి బుర్రతక్కువసన్నాసులకి మేధావిత్వంలా కనబడుతుందేమో గానీ మాలాంటివాళ్ళకి చవకబారు వ్యవహారంలా కనిపిస్తుంది:-)

      బుర్రతక్కువ వాగుడంటే ఇదే!పైన అదే మేధావిత్వం అనే డబ్బా ఒకటి!

      Delete
  10. http://rajasulochanam.blogspot.com/2018/08/blog-post_19.html?m=1

    ReplyDelete
  11. ఆల్ ద బెస్ట్ మేస్టారు. ప్రయత్నించడం లో తప్పేమీ లేదు.

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...