Saturday, 11 August 2018

ఎన్ని వేల వెన్నెలలీ పుడమిని కాశాయో?ఎన్ని వేల వలపులీ పుడమిని తాకాయో!

పల్లవి:
ఎన్ని వేల వెన్నెలలీ పుడమిని కాశాయో?
ఎన్ని వేల వలపులీ పుడమిని తాకాయో!

చరణం:
అందరికీ నచ్చిన వాడు అయోధ్యానగరవాసీ
ఎందరికో నచ్చిన జాణ మిధిలానగరి తనయా
పండుగలా కలిసిన యిగయుగాల శుభరాత్రిలో
చంద్రుడూ తారకలూ ఎంత ఎంత మురిశారో!

చరణం:
అంతటా నిండినవాడు ఎందుకో మనిషైన లీలావినోదీ
ఎంతకీ చిక్కనివాణ్ణి తనకే దక్కించుకున్న రాధారమణీ
రతిసుఖసారే యమునాతీరే సంభవామి మధురాత్రిలో
చుక్కలన్నీ మిన్నునువీడి గోపికలై బృందావని చేరాయా!

చరణం:
ఎందుకో, వెన్నెలకీ వన్నెలకీ ఈ బంధమేమిటో?
కలిసిన జంటకు వీచే గాలి సైతం రసోద్దీపనమా?
కలవని జంటకు వీచే గాలి సైతం బడబానలమా?
అదే రాత్రి, అదే జాబిలి, అదే గాలి - భేదమేమిటో?

చరణం:
వసంతం వస్తుందని ముందుగా గండుకోయిలకే ఎలా తెలుసో!
మరందం నిండిందని భ్రమరానికే పిలుపులు ఏలా చేరాయో!
ప్రభాతానికీ భూపాలానికీ సంబంధం కనిపెట్టిన రసికు లెవరో!
అన్ని మధురమైన వూహలూ హరిబాబుకే ఎందుకు వస్తాయో!

చరణం:
వసంతమూ నిండుజాబిలీ పండువెన్నెలా ఇప్పుడేమైపోయాయో?
చిత్తడి చిరుజల్లుల మట్టివాసన ముక్కుల కెపుడు గుబాళిస్తుందో?
మనుషు లందరూ సొగసునవ్వుల హరిబాబులా ఎప్పుడుంటారో!
విరహాల క్రీనీడ లేని నిండుపున్నమివెన్నెల లెప్పుడు కాస్తాయో!

3 comments:

  1. చాలా బాగుంది సార్

    ReplyDelete

  2. ఎందుకో, వెన్నెలకీ వన్నెలకీ ఈ బంధం ఏమిటో?

    ఇవన్నీ తెలియకుండానే సోమచ్ అయి పోయే :)


    జిలేబి

    ReplyDelete
  3. భావుకత కొంచెం రసికత, బాగుంది సార్.

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

"వేదాలు చదివిన వారు యజ్ఞయాగాదు లందు పశువులను వధిస్తారు" - ఇది నిజమా?

hari.S.babu: గురువు గారూ ! మహాభారతంలో ధర్మవ్యాధుని కధ వస్తుంది కదా . అక్కడ ధర్మవ్యాధుడు కౌశికుడికి ధర్మబోధ చేస్తూ ఒకచోట ," ...